You are on page 1of 1

అంతర్యామి

బిజినెస్‌(https://www.eenadu.net/business)
క్రీడలు (https://www.eenadu.net/sports)
సినిమా (https://www.eenadu.net/cinema)
ఫీచర్ పేజీలు
ఫొటోలు (https://www.eenadu.net/photos/gallery)
వీడియోలు (https://www.eenadu.net/videos/gallery)
ఎన్ఆర్ఐ (https://www.eenadu.net/nri)
ఇంకా..
(https://twitter.com/intent/tw
(https://api.whatsapp.c
(https://telegram
(https://w
ARCHIVES (//www.eenadu.net/archives/home)
E PAPER (https://epaper.eenadu.net/)
SITARA
ప్రకృతితో మమేకం url=https://www.eenadu.net/
text= url=https%3A%
-
https%3A%2F%2Fw

ఈ ఆధునిక యాంత్రిక జీవితంలో మానవుడు ఆనందం అనే మాటే మరిచిపోయాడు. ప్రకృతికి బహుదూరంగా పరుగులు పెడుతున్నాడు. అసలు తాను ఈ అనంతమైన ప్రకృతిలో
భాగం అనే విషయం మరిచిపోయాడు. ప్రకృతితో మమేకమైతే అంతులేని ఆనందం తన సొంతమని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందరో కేవలం సుఖాలకే ప్రాధాన్యం
ఇస్తున్నారు.  ప్రకృతి ఇచ్చిన భవబంధాలకు, రక్తసంబంధాలకు సైౖతం దూరమైపోతున్నారు. తమ సుఖసంతోషాల కోసం సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నారు. ఒక విధంగా
చెప్పాలంటే వాటికి బానిసలు అయిపోతున్నారు.
ఆకాశంలో నిండు చంద్రుణ్ని, మెరిసే తారలను  చూసి ఎంతకాలమైందని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా చంద్రుణ్ని చూస్తూ ఉంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. అమావాస్య
నాటి ఆకాశంలో మెరిసే తారలను చూస్తే- ఆ సంతోషం చెప్పలేనిది. నింగి వీక్షణం ఉత్సాహపరచడమే కాక, మన కళ్లకెంతో ఆరోగ్యకరమని వైద్యశాస్త్రం చెబుతుంది. ఆకాశంలో
ఇంద్రధనస్సు చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. నల్లని మేఘాలు అదోరకమైన అందంతో ఉంటే, మెరిసే తెల్లమేఘాలు కంటికి ఇంపుగా ఉంటాయి. నల్లని మబ్బుల
అంచులు వెండిరంగులో మెరిసిపోతుంటే- ఆ దృశ్యం చూసే కన్నులదే అదృష్టం. అలాంటి సుందర దృశ్యాలను చూసినప్పుడు మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
మెరిసే మంచుకొండలు, అగాధాలు, లోయలు,  హొయలు ఒలుకుతూ జాలువారే  జలపాతాలు చూసిన మనిషి ఆనందంతో  ఉప్పొంగిపోవడం ఖాయం. తెలతెలవారగానే పక్షుల
కిలకిలారావాలు- ఉదయాన్నే  నిద్రనుంచి లేచేవారికి మధురానుభవమే.
ఇప్పటి తరానికి గ్రామాలు, అక్కడి ప్రకృతి అందచందాల గురించి ఏ మాత్రం పరిచయం లేకపోవడం శోచనీయం. ఆంగ్ల భాషా చదువులు, అందలం  ఎక్కిస్తామన్న శుష్క వాగ్దానాలు
చేసే విద్యాసంస్థలు... నేటిరీతి. తల్లిదండ్రులూ  పిల్లలకు ప్రకృతిని పరిచయం చెయ్యకపోగా- ఆవుకు బర్రెకు తేడా తెలియకుండా వారిని పెంచుతున్నారు.  మనం తాగే పాలు పాకెట్‌
నుంచి మాత్రమే వస్తాయని, వాటి జన్మస్థానం పాలిచ్చే జంతువులని తెలియని తరం, తద్వారా రాబోయే తరాలు ఎంత ప్రమాదంలో పడిపోతాయో!?
ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి పరదేశాలకు పరిగెత్తనక్కర్లేదు. మన ఇంటిలోంచే ప్రకృతి అందాలను తిలకించవచ్చు. తాదాత్మ్యం పొందవచ్చు. అందమైన పక్షులు, సీతాకోక చిలుకలు,
అద్భుతమైన పువ్వులు పూచే మొక్కలు మన ఆవరణలోనే ఉంటాయి. వాటి అందాలను మనం ఎందుకు చూడటం లేదు? ఎందుకంటే- అవే అందాలను కృత్రిమంగా చూడటానికి
అలవాటు పడిపోయాం. ఈ రోజునుంచే పిల్లలకు ప్రకృతిని  పరిచయం చేద్దాం అనే నిర్ణయం ప్రతి తల్లి, తండ్రి, ప్రతి విద్యాబోధకుడు తీసుకోవాలి. వారికి ప్రకృతితో మమేకం కావడం
అలవాటుగా మార్చాలి. కేవలం పిల్లలే కాక పెద్దవారూ చెట్లతో, చేమలతో అనుబంధం  ఏర్పరచుకోవాలి.
ప్రకృతిలో తిరగడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానవ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక ప్రేరణతో మానసిక ఉద్రేకాలు
చల్లారతాయి. భవిష్యత్తులో మంచి సమాజం ఏర్పడుతుంది.
- ఎం.వి.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌

You might also like