You are on page 1of 39

హరిః ఓం

పరమేశ్వర స్వరూపమయిన సభకు నమస్కారము

చైతః
్ర శ్రీమానయం మాసః పుణ్యః పుష్పితకాననః, యౌవరాజ్యాయ రామస్య
సర్వమేవోపకల్ప్యతామ్. ఇది చైతమ
్ర ాసము కనుక పుష్యమీ నక్షత్రము ఉండగా నేను
రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టా భిషేకము చేస్తా ను అని సంకల్పము చేసాడు. సరే దానికి
తగినట్టు వశిష్టా ది మహర్షు లు అందరూ కూడా కావలసిన సంభారములు అన్నీ సేకరించి సిద్ధము
చేసారు. రాచనగరు ఎక్కడ చూసినాకూడా పుష్యమీ నక్షత్రములో అభిషేకము జరుగుతుందని
తెలియగానే ఇంక కోసలదేశములో అయోధ్యా పట్ట ణములో ఉన్నటువంటి పౌరుల యొక్క
ఆనందానికి అంతులేదు. ఎందుకని సకల సుగుణాభిరాముడయినటువంటి రాముడు యువరాజుగా
వస్తు న్నాడు, వాళ్ళ కోరిక తీరుతోంది. అందుకని ఎక్కడ చూసినా కళాపి చల్లా రుట, రాత్రి
యవ్వరాజ్య పట్టా భిషేకము పూర్తి అయ్యేసరికి ఆలస్యము అవుతుందని దీపాల యొక్క
స్వరూపముతో చెట్లను అలంకారము చేసారుట. అంటే ఆ రహదారులకు ఇరువైపులా కూడా చెట్ల
స్వరూపముతో దీపాలు వెలిగేటట్టు అమరిక చేసారు, రహదారులన్నీ చాలా కాంతివంతముగా
ఉండాలని. ఎక్కడచూసినా సరే నటులు, గాయక సంఘముల వాళ్ళు పాటలు పాడుతూ నాట్యాలు
చేస్తూ పరమ సంతోషముగా ఉన్నారు. ప్రజలందరూ చాలా మంచి బట్ట లు అలంకారము
చేసుకున్నారు.

ఇంక ఎక్కడ చూసినా అయోధ్యాపట్ట ణములో ఆనందమే ఆనందము, అంత ఆనందముగా


సంబరాలు చేసుకుంటున్నారు. అసలు కౌసల్య ఆనందానికి అవధులు లేవు, బ్రా హ్మణులని
పిలిచింది, పేదలను పిలిచింది, కనపడ్డ వాళ్ల ందరికి భూరి దానాలు చేస్తో ంది. శ్రీమహావిష్ణు వుని
ఆరాధన చేస్తో ంది. ముందు రోజు రాత్రి రామచంద్రమూర్తి ఉపవసించినటువంటి వారయి, భార్యతో
కలిసి ఆ పూజామందిరములో దర్భశయనము మీద ఆ ధర్భాలతో చెయ్యబడినటువంటి చాపను
పరుచుకుని దానిమీద విశ్రా ంతి తీసుకున్నారు. మరునాడు ఉదయము లేచి స్నానాదులు పూర్తి
చేసుకుని, సంధ్యావందనము చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. రామచంద్రమూర్తి
అంతఃపురము ఒక్కదాంట్లో నే ఆ రోజున ఆయన యువ్వరాజ్య పట్టా భిషేకము చేసుకోవడానికి
బయటకు వస్తు న్నప్పుడు రధము ఎక్కుతున్నప్పుడు చూడాలని నిలబడినటువంటి కేవల
జానపదుల సంఖ్య అంత తక్కువ సమయములో వచ్చినటువంటివాళ్ళు అయోధ్యకు ఎంతమందో
తెలుసాండీ పదిహేను పక్కన పదిహేను సున్నలు పెడత
ి ే ఎంతో అంతమంది, జానపదులు
అంతమంది వచ్చారుట. ఇంక అక్కడ అయోధ్యా పట్ట ణ వాసులు ఎంతమంది వచ్చి ఉంటారో మీరు
ఊహించుకోవచ్చు.

అలా రామచంద్రమూర్తి అంతఃపురము చుట్టూ జనమేట, వశిష్టు డు అయితే వచ్చి


ఉపవాసము ఎలా చేయాలో చెప్పినతరువాత రహదారి మీదకు వచ్చి చూసి ఆశ్చర్యపో యాడు ఆ
ప్రజలు వాళ్ళ ఆనందము చూసి. ఏదో తరంగాల తరంగాలగా నీరు వస్తు ంటే దాని మద్యలోంచి ఒక
పడవ వెళ్ళిపో యిందనుకోండి, ఆ పడవ నీటిని చీలుస్తు న్నట్టు గా వెళ్లి పో తుంది, ఆ వెనకాతల ఇలా
నీరంతా రెండు పాయలుగా విడిపో తుంది. అలా వశిష్టు డి రధము మధ్యలోంచి వెళ్లి ందిట, జనము
ఏమో కెరటాలు తప్పుకుంటున్నట్టు తప్పుకుంటున్నారుట.

అంత ఆనందసంరంభములో ఉంది అయోధ్యా పట్ట ణము అంతా. ఒకటి జ్ఞా పకము
పెట్టు కోండి, ఆ సమయములో అప్పుడేమిటి ఇప్పుడు అయోధ్య దుర్భేద్యము, దానిని ఎవరూ
పడగొట్ట లేరు. అందునా దశరధమహారాజుగారు అతిరధుడు, గోప్ప బలవంతుడు, దేవేంద్రు డి
అంతటివాడికి సాయము చేసినవాడు. ఇక రామచంద్రమూర్తో ప్రపంచ ప్రఖ్యాతమయినటువంటి
అతిరధుడు. ఆయనకు తెలియనటువంటి శస్త్రా స్త ్ర సంపద లేదు. అటువంటివాడు రామచంద్రమూర్తి
సర్వకాలములయందు తండ్రిని రక్షిస్తు ండగా, ఎవ్వరిచేతా కూడా చూడరానిబడదయి,
దుర్నిరీక్షమయి, శత్రు వులకి అభేద్యమయి, ఆ ఇక్ష్వాకు వంశీయుడయినటువంటి దశరధమహా
రాజుగారి చేత పరిపాలింపబడుతూ, సర్వాలంకార శోభితముగా ఆనంద తరంగాలలో తేలియాడుతోంది
అయోధ్య.

అయితే ఎంత గోప్ప విషయాన్ని వాల్మీకిమహర్షి ప్రతిపాదిస్తా రో చూడండి , ఎంత కళకళ


లాడుతుండనివ్వండి, ఎంత అందముగా ఉండనివ్వండి, ఎంత ఆనందముగా ఉండనివ్వండి, చెప్పుడు
మాటలు అసూయతో చెప్పేటటువంటివారిని పక్కన చేర్చుకుని అసూయతో మాట్లా డేటటువంటి వారు
మాట్లా డుతున్నప్పుడు, వారి మాటలను మధ్యలో త్రు ంచి బయటకు పంపకుండా వారిని పో న్లే అని
ఉపేక్షిస్తే వచ్చేటటువంటి ప్రమాదము ఎంత భయంకరముగా ఉంటుందో మనకి మందర యొక్క
శీలాన్ని చూపిస్తా రు.
మీకు రామాయణములో ఒక ఆశ్చర్యకరమయిన విశేషము ఒకటుంది. రామాయణము
ఎప్పుడెప్పుడు అయిపో తుందనుకుంటే అప్పుడొ క స్త్రీ పాత్ర వస్తు ంది, ఆ స్త్రీ పాత్ర వల్ల రామాయణము
పొ డిగింపబడుతుంది. మీకు సీతారాముల యొక్క వివాహము అయిపో యిన తరువాత
యదార్ధ మునకు అయోధ్యా పట్ట ణానికి వస్తే సంతోషముగా కాలము గడుపుతున్నప్పుడు
రామాయణము అయిపో యింది. కానీ మందర ప్రవేశించింది, ప్రవేశించడము చేత రాముడు
అరణ్యములకు వెళ్ళాడు. రాముడు అరణ్యవాసమునకు వెళ్ళిపో యిన తరువాత పద్నాలుగు ఏళ్లు
పూర్తిచేసుకుని వెనక్కు వచ్చేసును. కానీ అనుకోకుండా అక్కడకు శూర్పణఖ వచ్చింది, రావడము
వల్ల రావణాసురుడు సీతను అపహరించాడు, మళ్ళీ కధ పొ దిగంి పబడింది. సీతమ్మతల్లిని
అపహరిస్తే అపహరించాడు, ఒకానొకనాడు రావణాసురుడికి అపారమయిన క్రో ధము వచ్చి సీతమ్మ
తల్లిని సంహరిస్తా నని ఖడ్గ ము తీసుకుని ఆవిడ మీదకు వెళ్ళాడు, కానీ ఆరోజున రావణాసురుడో
సీతమ్మో తేలిపో ను, ధాన్యమాలిని అడ్డు పడింది, రామాయణము మళ్ళీ పొ దిగంి పబడింది.
సీతమ్మతల్లి తానే ఉరివేసుకుని మరణిస్తా నని శింశుపావృక్షానికి తన కేశపాశాన్ని కట్టు కుంది,
కట్టు కుని ఉరిపో సుకుంటున్న సమయములో త్రిజట లేచి తన స్వప్నాన్ని చెప్పింది, చెప్పి మళ్ళీ
బాహ్య స్థితిని కల్పించింది, ఆనందాన్ని కల్పించింది ఆ ఉరివస
ే ుకోవడానికి ముందు, అందుచేత మళ్ళీ
రామాయణము పొ డిగింపబడింది.

ఐతే రామాయణములో ఉన్న గమ్మత్తు ఏమిటంటే ఎక్కడెక్కడ రామాయణము


అయిపో తుందనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర ప్రవశి
ే స్తు ంది. ఆ పాత్ర చాలా సేపు ఉండాలని
నియమము ఏమీలేదు. ఒక్కసారి కనిపించొచ్చు కానీ, ఆ పాత్ర తాలూకు ప్రభావము ఆసాంతము
రామాయణము మీద కనపడుతుంటుంది. అంత గమ్మత్త యన పాత్రను ఒకదానిని ప్రవేశపెట్టా రు. ఆ
పాత్రకు ఎక్కడా పరిచయము లేదు రామాయణములో, ఆ పాత్ర ఎవరితో మాట్లా డిందో ఏం
మాట్లా డిందో , ఎవరిదగ్గ ర ఏం సన్మానాలు పొ ందిందో , ఎవరిచేత అవమానములు పొ ందిందో ఎవ్వరికీ
తెలియదు.

అటువంటి పాత్రను ప్రవేశపెడుతూ పరమాద్భుతమయినటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తా రు


వాల్మీకిమహర్షి. అందులో అంటారు అయోధ్యా పట్ట ణము అంతా పరమ సంతోషముగా ఉంది,
అలాంటి సమయములో ఆ మంధర ఒక్కసారి ఆ రాజప్రా సాదము యొక్క పైకి ఎక్కింది . పైకి ఎక్కి
జ్ఞా తిదాసీ యతో జాతా కైకేయ్యాస్తు సహో షితా, ఫ్రా సాదం చంద్రసంకాశమ్ ఆరూరోహ యాదృచ్చయా.
చంద్రబింబము ఎలా ఉంటుందో అంత అందముగా ఉన్నటువంటి ప్రా సాదము పైకి ఎక్కింది. ఆవిడ
కుబ్జ , కుబ్జ అంటే గూని ఉన్నటువంటి స్త్రీ, అందుచేత సహజముగా చాలా అందవికారమయిన
వనిత. ఆవిడ ప్రా సాదము పైకి ఎక్కింది, ఎందుకు ఎక్కింది, దానికేమి కారణము లేదు, ప్రా సాదము
పైకి ఎక్కింది. ఎవారావిడ మంధర అసలు అంటే వాల్మీకిమహర్షి అన్నారు కైకేయ్యాస్తు సహో షితా,
ఎప్పుడు పుట్టిందో అప్పటినుంచి కైకేయితో ఉంటోంది అన్నారు.

కాబట్టి ఆవిడ అయోధ్యాపట్ట ణానికి సంభందించినది కాదు, దశరధమహారాజుగారి


పరిపాలనలో అంత దుష్ట బుద్ధి కలిగినటువంటి పాత్ర ఒకటి అయోధ్యలో ఉండడానికి వీలులేదు.
కాబట్టి ఎక్కడనుంచి వచ్చింది, ఎక్కడ కైకేయి ఉన్నదో , ఆ కైకేయి దగ్గ ర పుట్టినప్పటినుంచి కైకేయితో
ఉంది. అరణపు దాసీగా కైకేయితో బాటుగా, కైకేయి అత్త వారింటికి వచ్చినప్పుడు ఆవిడా వచ్చింది.
కానీ ఇంతకాలము బహుశః ఆవిడకు మాట్లా డడానికి అవకాశము రాలేదు. ప్రధమప్రయత్నముగా
మాట్లా డడానికి అవకాశము వచ్చి ఉండిఉండవచ్చు. ఆవిడ ఆ రాజప్రా సాదము మీంచి చూసింది.
చూసేసరికి ఎక్కడ చూసినా బ్రహ్మాండమయిన ఉత్సవవేడుకతో ఉంది, పౌరులందరూ చాలా
సంతోషముగా ఉన్నారు. ఇంతమంది సంతోషముగా ఉంటే ఆ సంతోషాన్ని ఆవిడ
భరించలేకపో యింది. అంటే ఆ హృదయము ఎంత గొప్ప హృదయమో ఆలోచించండి.

ఒకరి సంతోషము ఇంకొకరికి ఖేదము అయితే అది కూడా పొ రబాటే, కొన్ని వేలమంది
సంతోషము ఒక్కడికి దుఖఃదాయకము కావడము చాలా ఆశ్చర్యకరమయినటువంటి విషయము,
అది కుసంస్కారము. అందుచేత అంతమంది ఆనందిస్తు ంటే ఆవిడ ఆశ్చర్యపో యింది, అదే
సమయములో కౌసల్య దగ్గ ర దాసిగా ఉన్నటువంటి వనిత అటువైపుగా వెడుతోంది
పరమసంతోషముతో. ఆవిడ్ని పిలిచింది, పిలిచి ఆ ప్రజలందరినీ చూపించింది, వాళ్ళ సంతోషాన్ని
చూపించింది, ఒక మాట అడిగింది. ఈ ప్రజలందరూ ఎందుకు ఇంత సంతోషముగా ఉన్నారు అని
అడిగింది అనుకోండి ఆ తీరు వేరు, ఆవిడ ఎంత గమ్మత్తు గా అడిగిందో చూడండి ప్రశ్న. అందుకే
మీకోక మాట విజ్ఞా పన చేసి ఉన్నాను. అది ఆది కావ్యము, కావ్యభాష చాలా గమ్మత్తు గా ఉంటుంది,
మీరు తరచు చూడాలి. ఆవిడ అంటుంది ఉత్త మేనాభిసంయుక్తా హర్షేనార్థ పరా సతీ, రామమాతా
ధనం కిన్ను జనేభ్యః సంప్రయచ్చతి.
ఆవిడ కౌసల్య అనదు, ఎందుకు అనదు, ఎప్పుడయినా కౌసల్య ఆవిడ్ని నిందించిందా,
ఏమో రామాయణములో మహర్షి చెప్పలేదు. కౌసల్య అటువంటి శీలము ఉన్నది కాదు. కానీ తను
కైకేయి దగ్గ ర పనిచేస్తో ంది కాబట్టి ఆవిడ కౌసల్య అన్నమాట కూడా అనదు మంధర. ఏమంది
రామమాత, రాముడి తల్లి అని పిలిచింది. రాముడి తల్లి ఎటువంటిదిట, హర్షేనార్థ పరా సతీ డబ్బులు
దాచుకునేటటువంటి లోభి, ఎన్నడూ ఒకరికి ఒక పైస పెట్టనిది, కౌసల్య అటువంటిది అని
రామాయణములో చెప్పలేదు. నిత్యము యజ్ఞ యాగాములు చేసుకుంటూ, అఘ్నిహో త్రము
చేసుకుంటూ, మహాతల్లి బ్రా హ్మణులకు దానము చేస్తూ , అనేక వ్రతములు చేసన
ి టువంటి
సౌశీల్యవతిగా చెప్పబడింది.

అటువంటి తల్లి గురించి మంధర మాట్లా డుతోంది. ఆవిడ ఎప్పుడూ డబ్బు


దాచుకోవడములో సంతోషపడేమనిషి, ఏమిటి ఇవాళ భూరి దానాలు చేస్తో ంది అందరికీ, ఏమిటి
దీనికి కారణము అని అడిగింది. అడిగితే ఆ వచ్చినటువంటి వనిత, ఈవిడకు ఉన్న సంస్కారము
ఆవిడకు లేదు, అందుకని ఆవిడ పరమసంతోషముతో ఒక మాట చెప్పింది. నీకు తెలియదా,
దశరధమహారాజుగారి జ్యేష్ట పుత్రు డు, మా కౌసల్యాదేవి యొక్క కుమారుడు, సకల
గుణాభిరాముడు, అందరినీ రమింపచేయువాడు, అందరూ రమించడానికి స్థా నమయినవాడు
అటువంటి రాముడికి పుష్యమీ నక్షత్రములో యవ్వరాజ్య పట్టా భిషేకము జరుగుతోంది, అందుచేత
కోసల దేశప్రజలందరూ ఉత్సవాలు చేసుకుంటున్నారు, ఎంత సంతోషముగా ఉన్నారో చూసావా
అంది.

ఈ మాట వింది, ఆ పరిచారిక వెళ్ళిపో యింది, ఈవిడ గబగబా ప్రా సాదము మీంచి దిగి కిందకు
వచ్చింది. కిందకు వచ్చేటప్పటికి కైకమ్మకు అప్పటికి తెలియదు, కైకమ్మ పరమ సంతోషముగా ఒక
హంసతూలికాతల్పము మీద పడుకుని ఉంది. ఆవిడ దగ్గ రకు వెళ్ళింది. అక్షయ్యం సుమహద్దేవి
ప్రవృత్త ం త్వద్వినాశనమ్, రామం దశరధో రాజా యౌవరాజ్యే2 భిషేక్ష్యతి. నీకు నాశనము
ప్రా రంభము అయ్యింది కైకా అంది వెళ్ళి. అంటే ఆవిడ ఆశ్చర్యపో యింది, ఎంత పడుకున్నదయినా
నీకు నాశనము ప్రా రంభము అయ్యింది అంటే ఏమిటీ ఈ అల్ల రి అనుకోదా, నీకు నాశనము
ప్రా రంభము అయ్యింది, రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టా భిషేకము జరుగుతోంది అంది. నాకు
అలవాటయిపో యి రామచంద్రమూర్తి అంటాను కానీ అలా ఏమీ మంధర అనదు.
రాముడికి యవ్వరాజ్య పట్టా భిషేకము జరుగుతోంది, అందుకని నీ నాశనము ప్రా రంభము
అయ్యింది అంది. కైక ఆశ్చర్యపో యింది, అదేమిటి రాముడికి యవ్వరాజ్య పట్టా భిషేకము ఏమిటి,
నాకు నాశనము ప్రా రంభము అవ్వడము ఏమిటి. అసలు ఆ మాట అనగానే కైకమ్మ నోర్ముయ్ ఏం
మాట్టా డుతున్నావు, నీ పరిమితి నువ్వు జ్ఞా పకము పెట్టు కో, పో బయటకు అని ఓ మాట అని ఉండి
ఉంటే, రామాయణము వేరొకలా ఉండి ఉండేది. ఆ మాట కైక అనలేదు, ఆ మాట కైక అనదు కాబట్టే
మంధరను కైక దగ్గ రకు పంపించారు దేవతలు.

ఎందుకు పంపించాలి కైక దగ్గ రకే ఏం కౌసల్యను వాడుకోకూడదా, సుమిత్రను


వాడుకోకూడదా, వాడరు. ఎందుకు వాడరంటే కౌసల్య, సుమిత్ర ఇద్ద రూ సాత్వికమయినటువంటి
ప్రవృత్తి కలిగినటువంటి వారు. ఎవరు సాత్వికమయిన ప్రవృత్తి కలిగి ఉంటారో, అటువంటి వారి ద్వారా
నాశనము జరిగేటటువంటి కార్యక్రమాలకి దేవతలు చేయించరు. ఎందుచేత అంటే దానివల్ల అపకీర్తి
వస్తు ంది. సత్వగుణప్రవృత్తి కలిగినవారు కాబట్టి వారి యందు ఆవేశము జరగదు. ఎవరి యందు
జరుగుతుంది, నేను చాలా అందగత్తెను అని, నేను చాలా ఐశ్వర్యవంతురాలిని అని, నేను భర్త ను
కట్టిపడేసుకున్నాను అని ఇలా లేనిపో ని అతిశయాలు ఎవరియందు ఉన్నాయో అటువంటి వాళ్ళ
యందు దేవతల యొక్క ప్రచ ోదనము ఉంటుంది. అందుకని ఇవ్వాళ రాముని యొక్క
అరణ్యవాసము చేయించడానికి కైకను ఎంచుకున్నారు దేవతలు.

అందుకని మంధర కైక దగ్గ రకు వెళ్ళింది ఈ మాట చెప్పడానికి . అందుకే ఒక మాట
చెప్పారు. అసలు మంధర రాజ్య ప్రా సాదము ఎందుకు ఎక్కింది అంటే యాధృచ్చికము అన్నారు,
అది దైవ సంఘటన, దానికో కారణము లేదు. పైన కైక ఒడియాలు ఆరపెట్టా ను తీసుకురా అనేమీ
చెప్పలేదు. ఎందుకు ఎక్కుతుంది కుబ్జ , గూనిది ఎక్కడము కష్ట ము, ఎక్కింది, ఎందుకు ఎక్కింది
దైవఘటన, పైకి ఎక్కింది. అందుకని ఈ మాట చెప్పింది. కైకమ్మ ఆశ్చర్యపో యింది, ఆవిడ అంది
మీరు అవకాశము ఇస్తే చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క పరిధి ఎలా ఉంటుందో
ఆలోచించండి. ఆవిడ అంది పిచ్చిదానా, ఎంత భ్రష్టత్వాన్ని పొ ందుతున్నావే, చూసావా
కొద్దికాలములో కౌసల్య రాజమాత అవుతోంది, నువ్వో నాశనము కావలిసినటువంటి సమయము
నీకు ఆసన్నమవుతోంది, నీ భర్త బహుచతురుడు, ద్రో హి.
ఎందుచేత చాలా తెలివితేటలుగా మెత్తగా, నయవంచనతో మాట్లా డుతూ వృద్ధా ప్యములో
ఉన్నవాడు యవ్వనములో ఉన్న నిన్ను కట్టు కుని తనకి కావలిసినటువంటి భోగాలన్నిటినీ నీ దగ్గ ర
అనుభవిస్తూ , ఏమీ తెలియనివాడిలా, తేనె పూసిన కత్తి లా నీ దగ్గ ర ప్రవర్తిస్తూ నీకు ఎంత
మాహాపకారము చెయ్యాలో అటువంటి అపకారము చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుచేత నీ
కుమారుడు అయిన భరతుడు ఉండగా, భరతుడికి పట్టా భిషేకము చెయ్యడము మాని, కౌసల్య
కుమారుడు అయినటువంటి రామచంద్రమూర్తికి పట్టా భిషేకము చెయ్యడానికి నిర్ణ యము చేసాడు.
గమనించావా కైకా అంది, అప్పటికి కూడా పాపము కైకమ్మలో మార్పు లేదు.

ఆవిడంది లేచి, భరతాదేవ రామస్య రాజ్యసాధారణాద్భయమ్, అయ్యో అలా అంటావేమిటి,


నాకు సంభందించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు ఇద్ద రూ సమానము. అందుచేత
నువ్వు తెచ్చినటువంటి ఈ వార్త విని నేను పొ ంగిపో తున్నాను. గుణములచేత సకలగుణాభి
రాముడు రాముడు, రాముడు కౌసల్యను ఎలా సేవిస్తా డో మమ్మల్ని అలా సేవిస్తా డు. కైకమ్మకు ఒక
గుణముంది, రామాయణాన్ని బట్టి ఆదికావ్యము కనుక కావ్యభాషలో ఉన్న రామాయణము
చదివితే ఒక విషయము అర్ధ మవుతుంది. ఇద్ద రూ సవతులు కనుక కౌసల్య యందు కైకమ్మకు
అంత ప్రీతి లేకపో వచ్చు, కానీ రామచంద్రమూర్తి యందు రెండవ అభిప్రా యము కైకమ్మకు లేదు.

కైకమ్మకు రాముడంటే ప్రా ణముతో సమానము. భరతుడిని కూడా అంత ప్రేమించిందో లేదో
కూడా మనకు తెలియదు అంత ప్రేమ రాముడంటే. ఆవిడంది, రాముడు కౌసల్యను తల్లిగా మిగిలిన
వారిని పినతల్లు లుగా ఎన్నడూ చూడలేదు. కౌసల్యను ఎలా సేవిస్తా డో మమ్మల్ని అలా సేవించాడు.
అటువంటి రాముడు యవ్వరాజ్య పట్టా భిషేకము పొ ందడము అంటే ఇంకింత కన్నా గొప్ప వార్త
ఎక్కడుంటుంది. ఓ కుబ్జా ఎటువంటి శుభవార్త తెచ్చావే నువ్వు, రా ఈ బహుమానము తీసుకో అని
ఒక బహుమతిని ఇచ్చింది. ఇస్తే ఆ కుబ్జ కు ఉన్న తెగింపు చూడండి, మాట్లా డడానికి అవకాశము
ఇవ్వడము పొ రపాటు అందునా తన భర్త పరమ ధర్మాత్ముడయిన దశరధమహారాజుగారి గురించి
మాట్టా డుతుంటే ఖచ్చితముగా ఒక పరిచారిక తన అవధి మీరినట్టే.

రామాయణము ఎంత హెచ్చరించిందో చూడండి, అందుకే మనవాళ్లు ఎప్పుడూ ఒక మాట


చెపుతారు, భార్యాభర్త ల తగవు భార్యాభర్త ల మధ్యే. దానియందు మూడవవాడికి ప్రవేశము లేదు.
అందునా ఆ స్థా యి లేనటువంటి వారు, ఇంటిలో సేవ చేసి జీవితాన్ని గడుపుకునేటటువంటి
వారిదగ్గ ర తన భర్త మీద చాడీలు ఎన్నడూ వినకూడదు. అసలు ఎవరి దగ్గ రా వినకూడదు భర్త మీద
చాడీలు. అలాగే భార్యమీద భర్త ఎప్పుడూ వినకూడదు. వాళ్ళిద్ద రూ రెండు కాదు శరీరముల చేత
రెండు మనస్సు చేత ఒకటి అలా ఉండాలి.

కానీ దురదృష్ట ము ఏమిటంటే కైకమ్మ విషయములో ఒక చిన్న పరాకు సంభవించింది.


మంధర మాట్టా డానికి అవకాశము ఇచ్చింది, ఇచ్చి బహుమానము ఇస్తే బహుమానాన్ని
విసిరేసంి ది. విసిరేసి ఆవిడ అంది అయ్యయో మూర్ఖు రాలా ఆ మాట అనడమే కైకమ్మను,
మూర్ఖు రాలా కైకా నేను చెప్పినటువంటి విషయము నీకు అర్ధ ము అవ్వడము లేదు, అందుచేత
పామును కౌగలించుకుని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు దశరధమహారాజు నీకు
చేసేటటువంటివి అన్నీ ప్రీతి కరమయినటువంటి పనులు చేస్తా డు అనుకుంటున్నావు, వాళ్ళ
మనస్సులో ఉన్న దుష్ట భావాన్ని ఎదుటి వారియందు ప్రవేశ పెట్టడానికి ఎంత అందమయినటువంటి
అల్లిక అల్లిందో చూడండి. అసలు నిజానికి ఈ భావన కోసలరాజ్యము మొత్త ము మీద ఎవ్వరికీ లేదు,
అలా ఊహించడానికి మంధరకు ఆధారాలు లేవు. కానీ ఎలా ఊహించిందో చూడండి, ఎంత
చమత్కారముగా మాట్లా డిందో చూడండి, నీకు జరుగుతున్న అపకారాన్ని నువ్వు ఎందుకు
గుర్తించలేకపో తున్నావో నాకు అర్ధ ము కావడము లేదు.

భరతాదేవ రామస్య రాజ్యసాధారణాద్భయమ్, తద్విచింత్య విషణ్ణా స్మి భయం భీతాద్ధి జాయతే


రాముడుతో పాటు పట్టా భిషేకానికి యోగ్యత కలిగినవాడెవరు, భరుతుడు ఒక్కడే, అందుకని
రాముడికెప్పుడు భరతుడు అంటే భయము, అందుకే భరతుడు దగ్గ ర లేకుండా రాముడు
చూసుకుంటాడు. అందుకే యవ్వరాజ్య పట్టా భిషేకము భరతుడు లేకుండా రాముడు
చేసుకుంటున్నాడు, చూసావా కైకా అంది. అంటే ఆవిడ అంది అప్పుడు కూడా కైకమ్మ చేసుకోనీ
ఏమిటి నష్ట ము, రాముడు రాజ్యము పరిపాలించిన తరువాత భరతుడు పరిపాలిస్తా డు, దానికొచ్చిన
ఇబ్బంది ఏముందంది. అంటే ఆవిడ అంది, ఓసి పిచ్చిదానా, నీకు అర్ధ ము కావడములేదు, రాజుల
యొక్క తంత్రా ంగము వేరుగా ఉంటుంది ఒక్కసారి రాముడికి దశరధమహారాజుగారు యవ్వరాజ్య
పట్టా భిషేకము చేసాకా ఇంక జన్మలో భరతుడు రాజు అవ్వడు. ఎందుకని రాముడు రాజుగా ఉంది
కొన్ని వేల సంవత్సరములు పరిపాలిస్తా డు, తదనంతరము రాముని యొక్క పుత్రు లు పరిపాలిస్తా రు,
నీ కొడుకెందుకు రాజవుతాడు, ఒక్కనాటికి రాజవ్వడు.
కానీ ఒక్కటి జ్ఞా పకము పెట్టు కో సుమిత్రకు ఇద్ద రు కుమారులు ఉన్నారు లక్ష్మణుడు,
శతృఘ్నుడు ఇద్ద రి కుమారులలో ఒక కుమారుడయిన లక్ష్మణుడు సర్వకాలముల యందు
రాముడితో ఉంటాడు. అందుకని లక్ష్మణుడిని రాముడు తన దగ్గ ర ఉంచుకున్నాడు యవ్వరాజ్య
పట్టా భిషేకానికి. శతృఘ్నుడు భరతుడితో ఉంటాడు, అందుకే శతృఘ్నుడిని ఉంచలేదు అదే సుమిత్ర
కొదుకైనా. ఎక్కడ పట్టు కుందో ఈ పాయింట్ నిజంగా, ఎంత అందముగా లాగిందో చూడండి, అవతల
వారికి అపకారము చెయ్యాలనుకున్న వాళ్ళ బుర్రలోకి ఎంతెంత గొప్ప ఆలోచనలు వస్తా యో
చూడండి, సుమిత్రకు ఇద్ద రు కుమారులయితే లక్ష్మణుడిని తన దగ్గ ర ఉంచుకుంటాడు, శతృఘ్నుడు
భరతుడితో ఉంటాడు అని ఒక గొప్ప ఉపమానము చెప్పింది. ఒక పేద్ద చెట్టు ని నరకవలసి
వచ్చిందనుకో ఆ చెట్టు చుట్టూ రక్షణగా కొన్ని పో దలు ఉన్నాయనుకో, ముందు దేనిని తీసేయాలి
చెట్టు ని నరకడానికి, పొ దల్ని తీసేయ్యాలి. అందుకని ఇప్పుడు భరతుడిని తీసేయ్యాలి అంటే ఎవర్ని
తీసేయ్యాలి శతృఘ్నుడిని కూడా తీసేయ్యాలి, అందుకని ఏం చేసాడు, భరతుడూ లేకుండా చేసాడు
శతృఘ్నుడూ లేకుండా చేసాడు, అందుకే అవసరము ఉన్నా లేకపో యినా శతృఘ్నుడిని భరతుడితో
పంపించేసాడు, వాళ్ళిద్ద రూ లేరు.

ఎవరికీ తెలియకుండా అకస్మాత్తు గా యవ్వరాజ్య పట్టా భిషేకాన్ని తండ్రికి చెప్పి


నిర్ణ యింపచేసాడు. రాముడు ఈ విషయములో చాలా తెలివయినవాడు, ప్రజలందరి యొక్క
మద్ద తు కూడకట్టు కున్నాడు, కూడగట్టు కోవడములో సకల గుణాభిరాముడు అని పేరు
తెచ్చుకున్నాడు. ప్రజలందరి చేత ఒక ముద్ర వేయించుకున్నాడు రాముడు రాజుగా కావాలి అని
రాజుగా కావాలి అని, కొంత కీర్తి సంపాదించుకున్నాడు కనుక పట్టా భిషేకము చేసుకుంటాడు.
చేసుకున్నాక లక్ష్మణుడి విషయములో అరమరకిగా ప్రవర్తించడు, ఎందుకంటే లక్ష్మణుడు తనతో
ఉంటాడు. కానీ ఎప్పటికయినా ఒక ఒరలో రెండు కత్తు లు ఇమడవు, తన రాజ్యానికి మళ్ళీ జ్ఞా తి
వైరము వచ్చేది భరతుడితో వస్తు ంది, అందుకని భరతుడిని అసలు కోసల దేశానికి కానీ అయోధ్యకు
కానీ రానివ్వడు. నీ తమ్ముడయినటువంటి యుధాజిత్తు దగ్గ రనుంచి వస్తు ండగానే నీ కొడుకుని
మట్టు పెట్టేస్తా డు, అందుకని కైకా చెపుతున్నాను నా మాట విను నీ కొడుకుని అయోధ్యకు
రానివ్వకు, అటునించి అటు అరణ్యములు పట్టి పారిపొ మ్మని చెప్పు అంది.

ఈ మాట అనగానే ఉలిక్కిపడింది. ఎందుకని ఒకటి రాముని యొక్క ఔన్నత్యమునకు


ఆవిడ బెంగ పెట్టు కోలేదు, తన కొడుకికి జరగబో యే భంగపాటుకి బెంగపడింది. బెంగపెట్టు కుని ఒక
బలవత్త రమయిన కారణము కనపడుతోంది. శతృఘ్నుడిని పంపాడు రాముడు అంటోంది,
అందుచేత నీ కొడుకుని అటునుంచి అటే అరణ్యములకు పొ మ్మను, నీ భర్త ఎంత తేలివయిన వాడో
తెలుసా, రాజా తంత్రంగాము అంతా మంత్రా ంగము అంతా నిన్ను సంప్రదంి చి చేసినట్టు కనపడతాడు,
యవ్వరాజ్య పట్టా భిషేక విషయము నీకు తెలియదు, నిశ్శభ్ద ముగా ఈ ఏర్పాట్లు పూర్తి చేసాడు.
ఎందుచేత ఈ విషయములో దశరధమహారాజుగారు ఎంత కుట్ర పన్నేడో నువ్వు అంత పెద్ద పొ రబాటు
చేసావు.

ఏమిటి నువ్వు చేసిన పొ రపాటు, అంటే బాల ఏవ హి మాతుల్యం భరతో నాయిత స్త ్వయా,
సన్నికర్షా చ్చ సౌహార్ద ం జాయతే స్థా వరేష్వసి. ఆ భరతుడు ఇక్కడే ఉంటే అయోధ్యాపట్ట ణములో
దశరధమహారాజుగారు ప్రతీరోజు భరతుడి వంక చూస్తా డు. చూసినప్పుడు భరతుడు దుర్మార్గు డు
కాడు కదా, రాముడు ఎంత గుణవంతుడో భరతుడూ అంతే గుణవంతుడు. రోజూ భరతుడి వంక
చూడ్డ ములో భరతుడి మీద ప్రేమ ఉంటుంది. మనము ఒక మాట అంటాము ఔట్ ఆఫ్ సైట్, ఔట్
ఆఫ్ మైండ్ అంటాము. దగ్గ ర లేకపో తే ప్రేమ తగ్గిపో తుంది అంటాము, అందుచేత నువ్వు
ప్రయత్నపూర్వకముగా భరతుడిని తీసుకువెళ్లి మేనమామగారి ఇంట్లో దిగపెట్టేసావు. ఇప్పుడు
ఏమయిపో యింది, రోజూ రాముడు పితృ సేవ పితృ సేవ పితృ సేవ అని తండ్రిదగ్గ ర తిరుగుతున్నాడు.

భరతుడు కూడా అంత యోగ్యుడే, పాపము దూరముగా ఉండిపో యాడు, ఎవరిదీ పొ రపాటు,
నువ్వు చేసిన పొ రపాటు. నువ్వు చేసిన పొ రపాటు వలన ఇవ్వాళ ఫలితము ఎవరు
అనుభవిస్తు న్నారు నీ కొడుకు అనుభవిస్తు న్నాడు. ఇప్పుడు ఏమవుతుంది కైకమ్మ హృదయములో,
నేను పొ రపాటు చేసాను, నేను రక్షించాలి నా కొడుకుని అన్న భావన వచ్చేస్తు ంది. ఆ భావన
తీసుకువస్తో ంది అందుచేత చూసావా, ఇప్పుడు భరతుడు లేడు పో నీ ఇప్పుడు తీసుకురాగలవా,
తీసుకురాలేవు. ఎందుకని తీసుకువస్తే రాముడు సంహరించేస్తా డు, అందుకని ఇక రాలేడు.
ఇప్పుడు ఇంక ఉన్న అవకాశము ఏమిటి అడవులు పట్టి పారిపో వడమే నీ కొడుకు బతకాలంటే .
నువ్వేం చేస్తా వు గోప్ప స్థితిని పొ ందుతావు రేపటినుంచి ఏమిటి నీ పరిస్థితి, రామచంద్రమూర్తి
సహజముగా గొప్ప గుణములు కలిగినవాడు కనుక, యవ్వరాజ్య పట్టా భిషేకము జరగగానే
ప్రజలందరి మద్ద తు ద్విగుణీకృతము అయిపో తుంది. బాగా వెళ్ళూంచుకుంటాడు,
ఊంచుకోవడములో ఇంక తనకి శత్రు వర్గ ము అన్నది చేసస
ే ుకుంటాడు రాజ్యమంతా. చేసేసుకున్న
తరువాత కౌసల్య ఇన్నాళ్లు పెద్దభార్య అయినా అందగత్తేనన్న అతిశయముతో భర్త ను కొంగుకి
ముడేసుకున్నానన్న అతిశయముతో ప్రవర్తించావు, ఇప్పుడు నీకు పాఠము కౌసల్య చెప్పడము
మొదలుపెడుతుంది.

ఎందుకని ప్రా ప్తా ం సుమహతీ౦ ప్రీతి౦ ప్రతీతాం తాం హతద్విషమ్, ఉపస్థా స్యసి కౌసల్యా౦
దాసీవత్ త్వం కృతాంజలిః. కౌసల్య రామచంద్రమూర్తి యొక్క తల్లి, రాజమాత. నువ్వెవరు
ఏమీకాదు, అడవులు పట్టి పారిపో యిన కొడుకికి తల్లివి. కాబట్టి దినసరి బత్తేనికి తినడానికి నువ్వేం
చెయ్యాలి, కౌసల్య దగ్గ రకు వెళ్ళి ఇలా నమస్కారము పెడుతూ నిలబడి కౌసల్యకు దాసిగా బతకాలి.
దశరధమహారాజుగారి భార్యగా కాదు, రాముడు యవ్వరాజ్య పట్టా భిషిక్తు డు అవుతున్నాడు, ఎంత
ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నావో చూసావా, ఇంత ప్రమాదము వచ్చింది కైకా నీకు అంది.
అనేటప్పటికి ఇప్పటివరకు లేనటువంటి దుర్భుద్ది కైక యందు ప్రవశి
ే ంచింది. ఎందువల్ల
మాట్లా డడానికి అవకాశము ఇచ్చింది కైకమ్మ మంధరకి అంతే పాడుచేసెసంి ది హృదయాన్ని. ఇక
ఎవ్వరూ తియ్యలేరు ఆ అనుమానాన్ని అటువంటి అనుమానము లోపల పెరిగప
ి ో యింది.
పెరిగిపో యి అయితే ఇప్పుడు ఈ ఉపద్రవము తప్పాలంటే మంధరా నా కొడుకు రక్షింపబడాలంటే
నేనేమి చెయ్యాలి అని అడిగింది. అంటే ఆవిడంది, దీనికి ఒక్కటే పరిష్కారము ఉంది.

ఏం చేయాలో తెలుసా నువ్వు అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థా పయామ్యాహమ్,


యౌవరాజ్యే చ భరతం క్షీప్రమేవాభిషేచయే. ఏ రాముడు గుణముల చేత పితృవాఖ్య పరిపాలన చేత
తండ్రిని సేవించడము చేత రాజ్యాన్ని పొ ందుతున్నాడో , ఆ రాముడిని పద్నాలుగు సంవత్సరములు
ఝటలు కట్టు కుని, కృష్ణా జినము కట్టు కుని, పాదుకలు లేకుండా దండకారణ్యానికి వెళ్లి పొ మ్మని
పంపించేయాలి. నీ కొడుకుని ఆదేముహూర్తా నికి పట్టా భిషేకము చేసేయ్యాలి, పద్నాలుగేళ్లు
రాముడు దండకారణ్యానికి వెళ్లి పో తాడు, వెళ్లి పో వడము వల్ల నీ కొడుకు సింహాసనము మీద
కూర్చుని ప్రజలందరిలోనూ మంచి మద్ద తు తెచ్చుకుంటాడు. నీ కొడుకు బాగా పాతుకుంటాడు
వేళ్లు , పాతుకున్న తరువాత రాముడు తిరిగి వచ్చినా ఇంక రాజ్యము అడగడానికి అవకాశము
ఉండదు.

ఎందుకని, శత్రు దుర్భేద్యముగా నిర్మాణము చేసేసుకుంటాడు, తనకి ఎదురు రాకుండా


రాముడ్ని తప్పిస్తా డు. అందుచేత రాముడు పద్నాలుగేళ్లు వెళ్లి పో వడము కూడా అవసరము నీ
కొడుకుకి పట్టా భిషేకము జరిగప
ి ో తే సరిపో దు, రాముడు ఉండగా ప్రజలు ఒప్పుకోరు, రాముడు
అటువంటి ప్రణాళిక నిర్మించి ఉన్నాడు. అందుకని రాముడ్ని దూరంగా పంపాలి. అందుకని
రాముడిని పద్నాలుగేళ్లు అడవికి పంపించు. మీరొక్క విషయము గుర్తు పెట్టు కోవాలి, మంధర
మాట్లా డినప్పుడు చతుర్ద శ హి వర్షా ణి చతుర్ద శ హి వర్షా ణి అని పద్నాలుగేళ్లు పద్నాలుగేళ్లు అని
అంటుంది. ఆవిడ కర్మేమిటో కైకమ్మ దశరధుడిని వరమడిగినప్పుడు నవపంచమ వర్షా ణి అని
అంటుంది తొమ్మిది అయిదు అంటుంది. ఎందుకు ఆ తేడా అన్నది అప్పుడు చెపుతాను. అందుకని
పద్నాలుగేళ్లు రాముడు అడవులకి వెళ్లి పో వాలి, నీ కొడుక్కి యవ్వరాజ్య పట్టా భిషేకము జరగాలి. ఈ
రెండు వరాలు అడుగు అంది.

ఈ రెండు జరిగితే తప్పకుండా నీ కోరిక తీరుతుంది, మళ్ళీ నువ్వు నీ కొడుకు


రక్షింపపడతారు. ఎప్పుడయితే బుద్ధి వైక్లభ్యాన్ని పొ ందేసిందో , కంగారు పుట్టేసిందో తనకి ప్రమాదము
వచ్చేసింది అన్న పరిస్థితి వచ్చేసిందో వీరిని నేను సలహా అడగడమా అన్న యుక్తా యుక్త విచక్షణ
కూడా నశించిపో తుంది. కైకమ్మలో ఆ విచక్షణ పో యింది, పో యి మంధరను అడిగంి ది. మంధరా నా
కొడుక్కి యవ్వరాజ్య పట్టా భిషేకము, రాముడికి దండకారణ్య ప్రా ప్తి ఎలా కలుగుతుందే అని అడిగంి ది.
ఆ నీకు తెలియదా నీకు తెలుసు నా నోటితో చెప్పించాలని చెప్పిస్తు న్నావు నీకు అవకాశము ఉంది
ఇప్పటికీ చెయ్యడానికి.

ఎందుకని తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిః పతిః, ఆగచ్చత్ త్వాముపాదాయ


దేవరాజస్య సాహ్యకృత్, డిశమాస్ధా య వై దేవి దక్షిణాం దండకాన్ ప్రతి, వైజయంతమితి ఖ్యాతం
పురం యత్ర తిమిధ్వజః, స శంబర ఇతి ఖ్యాతః శతమాయో మహాసురః, దదౌ శక్రస్య సంగ్రా మం
దేవసంఘైరనిర్జితః. ఒకానొకప్పుడు ఇంద్రు డికి వైజయంతనగరము అనేటటువంటి నగరములో దక్షిణ
దిక్కున ఉండేటటువంటి తిమిధ్వజుడు అనబడేటటువంటి రాక్షసుడితో ఘోరమయిన యుద్ధ ము
సంభవించింది, ఆ తిమిధ్వజుడికి శంబరాసురుడు అనే పేరుంది, ఆయన మహా మాయావి, ఆ
యుద్ధ ములో దేవేంద్రు డు ఒక్కడే గెలవలేక దశరధమహారాజుగారిని సహాయము అడిగాడు. అడిగితే
దశరధమహారాజుగారు యుద్ధా నికి వెడుతూ వెడుతూ అన్ని విద్యలూ తెలుసున్న కాంతా అని
కైకమ్మను కూడా తీసుకువెళ్ళారు.

యుద్ధ ము జరుగుతుండగా ముక్కలు ముక్కలుగా కొట్టా డు దశరధమహారాజుగారి శరీరాన్ని


శంబరాసురుడు. కొడితే రాక్షసులు అందరూ మీద పడుతుంటే తన భర్త ను రక్షించుకోవడము
కోసమని సారధ్యము చేస్తు న్న కైకమ్మ రాక్షసులకు దొ రక్కుండా దశరధుడిని తప్పించి దూరంగా
తీసుకువెళ్లి పో యింది. అక్కడ దశరధుడు సేద తీరుతుండగా మళ్ళీ రాక్షసులు వచ్చి పడ్డా రు. మళ్ళీ
వాళ్ళ మద్యలోంచి రధాన్ని తప్పించి మళ్ళీ తీసుకెళ్లి ంది వేరొకచోటుకి. అలా రెండుసార్లు
దశరాధమహారాజుగారిని రక్షించడము వలన దశరధుడు రెండు వరాలు ఇచ్చాడు. రెండు మార్లు
నువ్వు రక్షించబట్టి నేను బతికాను, రెండు మార్లు నువ్వు నన్ను రక్షించావు కనుక నీకు రెండు
వరాలు ఇస్తు న్నాను కోరుకో అన్నాడు.

ఒకప్పుడు కైకమ్మ యొక్క హృదయము ఏమిటో మీరు ఆలోచించండి. అడగడానికి ఏమీ


లేదు కైకమ్మకు, ఏమిటి భార్యకు అన్నిటికన్నా కోరుకోవలసింది ఏముంటుంది జీవితములో, భర్త
ప్రేమ తప్ప మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి, భర్త ప్రేమ లోపించినప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా
గుడిబండలే. భర్త ప్రేమ ఉందనుకోండి ఏదిలేకపో యినా స్త్రీకి ఆనందమే. అది పరిపూర్ణ ముగా ఉంది
కైకమ్మకు, అందుకని ఇప్పుడె౦దుకులెండి ఎప్పుడయినా అవసరమయినప్పుడు తీసుకుంటాను
అంది. ఆ మాట మర్చిపో యింది, ఎవరికి చెప్పింది, అంతఃపురానికి వచ్చినప్పుడు కుబ్జ అయిన
మందరను పిలిచి సంతోషాన్ని చెప్పుకుంది. రెండు సార్లు దశరధుడిని రక్షించానే కుబ్జా యుద్ధ ములో
రెండు వరాలు ఇచ్చాడు, ఏమడుగుతాను అడగడానికి అందుకని ఎప్పుడయినా అవసరము వస్తే
అడుగుతాన్లెండి అని వదిలేసాను అంది.

నువ్వు మరిచిపో యావేమో నువ్వే నాకు చెప్పావు, దశరధమహారాజుగారు నాకు రెండు


వరాలు ఇచ్చాడని, ఎప్పుడయినా అడుగుతానని దాచావుగా ఇప్పుడడుగు ఆ రెండు వరాలు.
అడిగితే దశరధుడు ధర్మమునకు కట్టు బడతాడు, సూర్యవంశములో పుట్టా డు కాబట్టి. అందుకని
రాముడ్ని అరణ్యానికి పంపిస్తా డు, నీకొడుక్కి పట్టా భిషేకము చేస్తా డు అంది. ఈ మాట విందిట
కైకమ్మ మంచము మీంచి పరమ సంతోషముగా లేచి౦ది, ఆ కుబ్జ ఎలా ఉంటుందో తెలుసాండీ,
పరమ భయంకరముగా వికృతాకారముతో పేద్ద గూనితో ఇలా ఒంగి ముఖము తిప్పి
మాట్లా డుతుంటుంది

అటువంటి కుబ్జ ను చూసి కైకమ్మ అంటుంది మనస్సు పరవసించిపో యినదనుకోండి


వాళ్ళలో ఎంత అందము కనపడుతుందో , కైకమ్మ అంది నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, సంతి
దుస్సంస్థితాః కుబ్జా వక్రా ః పరమదారుణాః, త్వం పద్మమివ వాతేన సన్నతా ప్రియదర్శనా. కుబ్జ లు
చాలా అసహ్యముగా ఉంటారు, ఇలా ఒంగిపో యి పెద్ద గూనితో ఉంటారు, కానీ నీ అసాధ్యము కూలా
ఓ మంధరా నువ్వు ఇలా గూనితో ఒంగి ఇలా ఇలా తల కదుపుతూ మాట్టా డుతుంటే గాలికి
కదులుతున్న తామరపువ్వులా ఉన్నావే అంది. ఎందుకని ఇటువంటి గొప్ప ఆలోచన చెప్పింది
కదా, అంటే ఎంత ప్రీతి చెందిందో కైకమ్మ చూడండి మీరు. ఎందుకీ మాట వెయ్యడము
వాల్మీకిమహర్షి కావ్యభాష తలకెక్కింది సుమా అని చెప్పడము.

ఇక్ష్వాకు వంశములో పెద్ద తుఫాను ప్రా రంభము అవ్వడానికి గాలికి ఊగుతున్న పద్మముతో
చెప్పేసారు మహర్షి. పైగా అంది ఓ కుబ్జా భరతుడికి పట్టా భిషేకము అవ్వగానే నేనేమి చేస్తా నో తెలుసా
నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తా నే, నీకు బంగారముతో బొ ట్టు పెట్టిస్తా నే, నీ గూనికి పట్టు బట్ట లు
కప్పుతానే అది గూనా, అమ్మబాబో య్ రాజుల బుర్రలలో ఎన్ని తంత్రా లు ఉంటాయో ఎన్ని
మాయలు ఉంటాయో ఎన్ని ఆలోచనలు ఉంటాయో నీ గూనిలో అన్ని ఉన్నాయే కుబ్జా అంది.
అదెంత సంతోషపడిపో యిందో ఆ కుబ్జ , ఆవిడంది, నాతో మాట్లా డము కాదమ్మా ఆ పట్టు బట్ట
విప్పేయి, పెట్టు కున్న ఆభరణములు కొన్ని కోట్ల విలువయిన ఆభరణములు కైకమ్మ పెట్టు కున్నవి.
సరే అందుచేత నువ్వు ఈ విలువైన పట్టు బట్ట లు తీసి పక్కన పారెయ్యి, వేసుకున్నటువంటి
హారములన్నీ పక్కన పారెయ్యి, పక్కన పారేసి ఒక కోపముతో ఉన్నటువంటి వనితా ఏ రకముగా
అయితే చాలా ముతకగా ఉన్న వస్త మ
్ర ు కట్టు కోవాలో అటువంటి వస్త మ
్ర ు కట్టు కో. పూర్వము
కోపగృహము అని ఒకటుండేది, రాజులు మళ్ళీ కోపముగా ఉందో ప్రసన్నముగా ఉందో
తెలుసుకోక్కరలేదు. అక్కడ ఉందనుకోండి ఆవిడ కోపముగా ఉందని గుర్తు అన్నమాట, అందుకని
కోపానికి ఒక గది కట్టించేవారు.

అందుకని కోపగృహములోకి వెళ్లి పో , వెళ్ళిపో యి నేలమీద పడుండు, హంసతూలికా


తల్పము మీద పడుకుని ఉంటావు నువ్వు నేల మీద పడుండు, రాజు వస్తా డు, ముత్యములను
ఇస్తా నంటాడు, రత్నములను ఇస్తా నంటాడు, వజ్రములు వైఢూర్యాములు ఎన్నయినా ఇస్తా నంటాడు
దశరధుడు, మహటక్కరి దశరధమహారాజుగారి మాటలకు లొంగిపో కు, మంకుపట్టు పట్టు రెండు
వరాలు ఇస్తా వా చస్తా వా అని నిలతియ్యి, రెండు వరాలు పుచ్చుకో, పుచ్చుకునేవరకు మాత్రము
విడిచిపెట్టకు అంది. అంటే కైకమ్మ అంది మంధరా నువ్వు రెండే చూస్తా వు దశరధుడు దగ్గ ర వరాలు
పుచ్చుకుని రాముడ్ని దండకారణ్యమునకు పంపించి భరతుడిని పట్టా భిషేకము చేయగలిగిన
కైకమ్మనో కోపగృహము నుంచి బయటకు వచ్చేస్తు న్న కైకమ్మ యొక్క ప్రేతాన్నో అంటే
భౌతికమయిన కాయాన్నో రెండే. నా కోరిక తీరకుండా ఇంక కోపగృహము లోంచి బయటకు
రావడము అన్నది కుదరదు కుబ్జా అంత భయంకరముగా మంకుపట్టు పడతాను
దశరధమహారాజుగారి దగ్గ ర చూడు నా ప్రతాపము అంది . వెళ్ళింది అలంకారాలన్నీ తీసేసింది,
పారేసింది, లోపలకు వెళ్ళి కోపగృహములో పడుకుంది.

రామచంద్రమూర్తితో మాట్లా డి పంపించేసారు, వశిష్ట మహర్షితో మాట్లా డారు అన్ని ఏర్పాట్లు


పూర్త య్యాయి, తనకి అత్యంత ప్రియురాలు కైకమ్మ వేరొకరు వెళ్ళి కైకమ్మకు చెప్పకముందే తాను
వెళ్ళి చెప్పాలనుకున్నాట్ట దశరధమహారాజుగారు. అనుకుని పరమవృద్ధు డు పాపము అరవైవేల
సంవత్సరములు కామముతో తడబడుతూ లోపలకు వచ్చాడు. వచ్చి అంతకుముందు ఎన్నడూ
కైకమ్మ మందిరాన్ని అలా చూడలేదు. ఎక్కడ చూసినా నెమళ్లు , హంసలు వాటి కలకూజితములు
ఆ ధ్వనులు, ఎక్కడచూసినా సంగీత ధ్వనులు, ఎక్కడ చూసినా పాటలు పాడేవాళ్లు , చక్కటి
సరోవరాలు, హంసతూలికా తల్పాలు, ముత్యాలతో కట్టినటువంటి పరదాలు ఎంత రామణీయముగా
ఉంటుందో అందునా మహారాజుగారు ఎక్కువగా వచ్చేటటువంటి పత్నీగృహము కదా అది, అందుచేత
అంత అలంకార శోభితమయి ఉంటుంది. ఎప్పుడువచ్చినా పరమ అనురాగముతో ఎదురేగి
సత్కరించి స్వాగతించేటటువంటి కైక మందిరములో ఎక్కడా కనపడలేదు. దశరధమహారాజుగారి
మనస్సు కలుక్కుమందిట. అని అక్కడున్న దాసిని అడిగారు కైక ఏది అని, కైకమ్మ ఎందుచేతనో
తెలియదు కోపగృహములో నేలమీద పడుంది అన్నారు. అనేటప్పటికి పాపము
దశరధమహారాజుగారు మహాభయముతో గడగడ లాడుతూ అయ్యో ఏం ఇవాళ కైకమ్మకు ఇంత
కోపము వచ్చింది, నేను శుభవార్త చెపుదామని వస్తే ఇంత కోపముతో ఉందేమిటి అని గబగబా
కోపగృహములోకి వెళ్ళాడు.

వెళ్ళేటప్పటికి నేలమీద పడుంది, చూసి తట్టు కోలేకపో యాడు. ప్రభువులకు ఒక


నియమము ఉంటుంది. ప్రభువులు ఎన్నడూ కూడా కటికనేలమీద కూర్చోకూడదు. అందుకని
వాళ్ళు కటికనేలమీద కూర్చోరు. ఈవిడ నేలమీద పడుంది, పడుంటే ఒక కింజరి పడిపో యిఉంటే
ఎలాఉంటుందో అలా పడుంది. ఆయన చూసాడు, చూసి చాలా భాదపడ్డా డు, ఏమి ఇలా కైకమ్మ
నేలమీద పడిపో యిదనుకున్నాడు, అనుకుని ఒక మాట అడిగాడు. కైకా నీకేమయినా శరీరములో
వ్యాధి ప్రభలిందా, అనారోగ్యముతో ఉన్నావా, ఎందరో గొప్పగొప్ప వైధ్యులు మన రాజ్యములో
ఉన్నారు, నీకేదాయినా అనారోగ్యముతో ఉంటే చెప్పు వైధ్యులను పిలుస్తా ను, వెంటనే నీకు
కలిగినటువంటి పీడను నివృత్తి చేస్తా ను, ఏదో మహాభూతము పట్టు కున్నటువంటి వ్యక్తి నేలమీద
పడిపో యినట్టు ఇలా నేలమీద పడుకున్నావేమిటి నువ్వు అలా పడుకుంటే నా హృదయము చాలా
తల్ల డిల్లి పో తోంది, నేను తట్టు కోలేకపో తున్నాను, నీ మనస్సులో ఏదయినా కోరిక ఉందా కైకా ఉంటే
చెప్పు.

అవధ్యో వధ్యతాం కో వా వధ్యో విముచ్యతామ్, దరిదః్ర కో భావత్వాఢ్యో ద్రవ్యవాన్


వాప్యకించనః ఒకవేళ చంపవలసినటువంటి వ్యక్తి ఎవరయినా వాడిమీద నీకు ప్రీతి కలిగితే నువ్వు
ప్రసన్నరాలువు అయితే చెప్పు వదిలిపెట్టేస్తా ను. చంపవలిసన అవసరము లేని వ్యక్తిమీద నీకు
కోపము వస్తే చెప్పు వాడిని చంపేస్తా ను. దరిద్రు డు ఎవరిమీదనయినా ప్రసన్నత కలిగితే చెప్పు
వాడిని ధనవంతుడిని చేసస
ే ్తా ను. ఎవరయినా ధనవంతుడి మీద నీకు కోపము వస్తే చెప్పు వాడిని
క్షణములో దరిద్రు డిని చేస్తా ను. నేను, నా రాజ్యము, నా భార్యలు, నా పరివారము అందరము నీ
ఆధీనము కైకా, నువ్వు శాసకురాలివి.

అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగాః, న తే కించిదభిప్రా యం వ్యాహంతుమ్


అహముత్యహే నేను నా రాజ్యము నా సంపత్తి నా సేవకులు నా సైన్యము నా భార్యలు అందరూ నీకు
వసులయి ఉండగా నువ్విలా నేలమీద పడుండడము నాకేమీ సంతోషముగా లేదు కైకా నీకే కోరిక
ఉందో చెప్పు నీకు కావలిసినటువంటి కోరికను తప్పకుండా తీరుస్తా ను అన్నాడు. అనగానే ఆవిడ
అంది నువ్వు అలా చెప్తే నేను ఊరుకోను అయ్యా నాకు నిజంగా మనస్సులో కోరిక ఉంది, ఆ కోరిక
నిన్ను అడుగుతాను అడిగినతరువాత ఇటువంటి కోరికా అడుగుతావు అని చెప్పి ఆ కోరిక
తీర్చడములో వైక్లభ్యమును పొ ంది నువ్వు తప్పుకోకూడదు. ప్రమాణము చెయ్యి నేను నీ కోరిక
తీరుస్తా ను అని నువ్వు ప్రమాణము చేస్తే నా కోరికేమిటో నీకు చెపుతాను అంది . ఆయన అన్నాడు
నేను ఒట్టు పెట్టి చెపుతున్నాను ఎవరిని ఒక్కక్షణము చూడకపో తే నా శరీరములు ప్రా ణములు
నిలబడక గాలిలో లేచిపో యి నా శరీరము కింద పడిపో తుందో ఎవరిని విడిచి ఒక్కక్షణము ఉండలేనో
ఎవడిమాట నా చెవిన పడకపో తే నా ప్రా ణాలు నిలబడవో అటువంటి నాకత్యంత ప్రియసతుడు
అయినటువంటి రామచంద్రమూర్తి మీద ఒట్టు పెట్టి చెపుతున్నాను కైకా నువ్వు అడిగిన కోరికలు
తీరుస్తా ను అన్నాడు.
ఈ మాట అనగానే ఆవిడ లేచి కూర్చుని అంది చంద్రా దిత్యౌ నభశ్చైవ గ్రహా రాత్ర్యహాని దిశ ః,
జగచ్చ పృధివీచేయం సగంధర్వా సరాక్షసాః, నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః, యాని
చాన్యాని భూతాని జానీయుః భాషితం తవ. రాజు చెప్పినమాట మీరు వింటున్నారు కదా ఓ
రాత్రిదేవతలారా, పగటిదేవతలారా, గృహదేవతలారా, సూర్యుడా, చంద్రు డా, సమస్త దేవతలారా,
భూమి అష్ట దిక్పాలకులారా, మీరందరూ నా తరుపన సాక్షి. కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు
దాటకుండా ఇస్తా నని మాట ఇచ్చాడు, రాజా జ్ఞా పకము తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడి మీదకు
యుద్ధా నికి వెళ్లా ము, వెళ్ళినప్పుడు నిన్ను రెండు మార్లు నిన్ను రక్షించి బ్రతికించాను, అప్పుడు
నువ్వు నాకు రెండు వరాలు ఇచ్చావు, ఆ రెండు వరాల్ని ఇప్పుడు నేను అడుగుతున్నాను.

అభిషేకసమారంభో రాఘవస్యోపకల్పితః, అనేనైవాభిషేకేణ భరతో మే2 భిషిచ్యతామ్, నవ


పంచ చ వర్షా ణి దండకారణ్యమాశ్రితః, చీరాజినాజటాధారీ రామో భవతు తాపసః ఏ
రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టా భిషేకము చెయ్యడము కొసమని నువ్వు సమస్త సంబారాలు
తెప్పించి సిద్ధము చేసావో, అదే ముహూర్త మునకు భరతుడికి పట్టా భిషేకము చెయ్యాలి.
పట్టా భిషేకము చేసుకోవలసి నటువంటి రాముడు తొమ్మిది ఐదు సంవత్సరములు మొత్త ము
పద్నాలుగు కావచ్చు కానీ తొమ్మిది ఐదు నవ పంచ చ వర్షా ణి దండకారణ్యమాశ్రితః
దండకారణ్యమునకు వెళ్లి పో వాలి, ఎలా పట్టు బట్ట లు కట్టు కుని రధము ఎక్కి వేదతానంటే కుదరదు,
చీరాజినాజటాధారీ నారచీర కట్టు కోవాలి, అజినము అంటే చర్మము కట్టు కోవాలి, జడలు కట్టేసుకోవాలి
తల కేశసంస్కారము చేసుకోకూడదు, జిల్లేడిపాలు పో సుకుని జటలు కట్టేసుకోవాలి.
చీరాజినాజటాధారీ రామో భవతు తాపసః మాంసాహారము తినకూడదు, తపస్వి ఎలా బ్రతుకుతాడో
అలా తేన తాగాలి దుంపలు తినాలి ఆకులు తినాలి అలమలు తినాలి, అరణ్యములో బ్రతకాలి
పద్నాలుగేళ్లు అలా రాముడ్ని దండకారణ్యానికి పంపించెయ్యి, భరతుడికి పట్టా భిషేకము చేసేయ్యి.

మహారాజు ఈ మాట చాలా సంతోషముతో మాట్లా డుతున్నాడు కైకమ్మతో, ఏవో రెండు


కోరికలు పిచ్చిది ఏమిటో ఈ సాక్ష్యాలు అంటుంది అవంటుంది ఈవంటుంది. ఏవో అడుగుతుంది
ఎవయినా ఇచ్చేస్తా ను తరువాత రామపట్టా భిషేకము చెపుతాను కైకకు, అనుకుంటున్నాడు. ఈ
ఆనందములో ఉన్నటువంటి వాడిమీద పిడుగు పడ్డ ట్టు పడ్డా యి ఈ రెండు మాటలు. పడగానే ఆ
ఉత్త మమయిన ఆసనములో కూర్చున్న వాడు కూర్చున్నట్టు డుళ్ళి ఆసనములో పడిపో యాడు.
పడిపో యి సృహతప్పిపో యాడు, ఆశ్చర్యము కైకమ్మ లేవతియ్యలేదు, ఆ ఆసనములో
పడిపో యున్నవాడు అక్కడనుంచి నేలమీద పడిపో యాడు. కైక నేలమీద పడుకునుంది, నేలమీద
పడ్డా డు, ఎన్నడూ అలా నేలమీద కూర్చోడము అలవాటు లేని దశరధమహారాజు చేతకాని
దశరధమహారాజు అరవైవేల సంవత్సరముల వృద్ధు డు ఈ భూమండలాన్నంతటిని శాసించినవాడు,
ధర్మమూర్తి, వశిష్టు డు పౌరోహిత్యుడుగా ఉన్నవాడు, అటువంటివాడు కొరములు తీసేసి మన
మంత్రముల చేత బంధించినటువంటి పాము నేలను పడి కొట్టు కున్నట్టు ఉన్మాధిలా పిచ్చెక్కిన
వాడిలా రోగిలా ఆకలిగొన్నవాడిలా మాటలు రాక తడబడి తబ్బిబయి తలబాదుకుని ఏడుస్తూ
మాట్లా డుతున్నాడు.

బెంగతో నోటమాట రాక తడబడిపో యి మూర్ఛపో యాడు రాముడిని పంపించమనేసరికి.


ఇంత మాట నా జీవితములో వింటానని నేననుకోలేదు, అంత భాధపడిపో యాడు నోటవ
ి ెంట మాట
రాలేదు. ఇప్పటివరకు ఎంత సంతోషముగా ఉన్నాడో . కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖదుఃఖయో,
నరాణా౦ పర తంత్రా ణా౦ పుణ్య పాపాను యోగతః పుణ్య పాపాన్ని అనుభవించాలి, పాప ఫలితాన్ని
అనుభవించాలి ఎప్పటికి కాలము ఎలా మారుస్తా డో పరమాత్మ. తతః శ్రు త్వా మహారాజః కైకేయ్యా
దారుణం వచః, చింతామ్ అభిసామాపేదే ముహూర్త ం ప్రతతాప చ ఒక్కసారి సృహతప్పినవాడయ్యి
పడిపో యాడుట. ఒక్కసారి ఆ శ్లో కాల్ని ముందు మీరు వినండి చాలా తేలికగా ఉంటుంది
వాల్మీకిమహర్షి సంస్కృతం. దశరధమహారాజుగారి మాటలలో ఉన్నటువంటి ఆక్రో శము వినండి ఎంత
అందముగా ఎంత భాధతో మాట్లా డుతాడో మహానుభావుడు.

నృశంసే దుష్ట చారిత్రే కులస్యాస్య వినాశని, కిం కృతం తవ రామేణ పాపం పాపే మాయాపి వా,
కౌసల్యా౦ వా సుమిత్రా ం వా త్యజేయమపి వా శ్రీయమ్, జీవితం వాత్మనో రామం న త్వేవ
పితృవత్సలమ్, యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవ చ, భార్యావద్భగినీవచ్చ
మాతృవచ్చోపతిష్ఠ తీ, సతతం ప్రియకామా మే ప్రియపుత్త్రా ప్రియంవదా, న మయా సత్కృతా దేవీ
సత్కారార్హా కృతే తవ, వైదేహీ బత మే ప్రా ణాన్ శోచంతీ క్షపయిష్యతి, హీనా హిమవతః పార్శ్వే
కిన్నరేణేవ కిన్నరీ, సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః, గురూన్ శుశ్రూ షయా వీరో
ధనుషా యుధి శాత్రవాన్, మమ వృద్ధ స్య కైకేయి గతా౦తస్య తపస్వినః, దీనం లాలప్యమానస్య
కారుణ్యం కర్తు మర్హసి, సా నూన౦ విధవా రాజ్యం సపుత్త్రా కారయిష్యసి, న హి ప్రవ్రా జితే రామే దేవీ
జీవితుముత్సహే, అనార్య ఇతి మామార్యః పుత్త వి
్ర క్రా యికం ధృవం, ధిక్కరిష్యంతి రథ్యాసు సురాప౦
బ్రా హ్మణం యధా, యది మే రాఘవః కుర్యాత్ వనం గఛ్ఛేతి చోదితః, ప్రతికూలం ప్రియం మే స్యాత్
నతు వత్సః కరిష్యతి, కౌసల్యాం మాం రామం చ పుత్త్రో పుత్త్రౌ చ యది హాస్యతి, దుఃఖాన్యసహతీ
దేవీ మామేవానుమరిష్యతి, ప్రియంచేద్భరతస్యైతత్ రామప్రవ్రా జనం భవేత్, మా స్మ మే భరతః
కార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః, స భూమిపాలో విలపన్ననాధవత్, స్త్రీయా గృహీతో
హృదయే2 తిమాత్రయా, పపాత దేవ్యాశ్చరనౌ ప్రసారితౌ, ఉభావ సంస్పృశ్య యధాతురస్త ధా.

ఎంత అందముగా అంటే కొన్ని శ్లో కాలు మాత్రమే నేనింకా ఇందులో చెప్పాను
ప్రధానమయినవి. దశరధుడు అంటాడు ఎంత భయంకరమయిన మాట మాట్లా డేవు కైకా, ఇటువంటి
మాట వినవలిసివస్తు ంది జీవితములో అని నేనెన్నడూ అనుకోలేదు, ఆ రాముడు నీకేమి
అపకారము చేసాడు, ఎన్నడూ మా అమ్మ కౌసల్యా అని కౌసల్య సేవ మాత్రమే చేసన
ి వాడు రాముడు
కాడే, నీకు సేవ చేసాడు, సుమిత్రకు సేవ చేసాడు కౌసల్యకు ఎలా సేవ చేసాడో మిమ్మల్ని అలా
సేవించాడు. ఒక్కనాడు మాట తప్పినవాడు కాడే, రాముడి గురించి వ్యతిరేకముగా మాట్లా డిన
వాళ్ళు ఈ కోసలరాజ్యము మొత్త ము మీద ఒక్కళ్లు లేరు. నీ దగ్గ రకు వచ్చి ఎప్పుడు మాట్లా డినా
యవ్వరాజ్య పట్టా భిషేకము చేస్తే రాముడికే చెయ్యాలండి, రాముడికి భరతుడికి తేడా లేదు అని
చెప్పేదానివి, అటువంటిదానివి కైకా ఇవ్వాళ నువ్వు ఎవ్వరి చెప్పుడు మాటలు విన్నావు, నీకు
ఎందుకు కలిగింది ఈ అభిప్రా యము, ఎందుకు రాముడిని పద్నాలుగు సంవత్సరములు
దండకారణ్యమునకు పంపించేద్దా మనుకుంటున్నావు.

నా రాముడు ఇంతకాలము వ్రతాలు చేసాడు, గురువుల దగ్గ ర శుశ్రూ ష చేసాడు, నిన్న కాక
మొన్న వివాహము అయ్యింది, హంసతూలికా తల్పము మీద పడుకొని భోగములను
అనుభవించవలసినటువంటి వాడు, మంచి యవ్వనములో ఉన్నటువంటి వాడు, వంట బ్రా హ్మణులు
కుండలములు పెట్టు కున్నటువంటి వారు రాముడికి వంట చేసి మేము పెడతామంటే మేము
పెడతామని సంతోషపడిపో తూంటారు. అటువంటి రాముడు దండకారణ్యములోకి ముతకవస్త మ
్ర ు
కట్టు కుని పాదములకు పాదుకలు లేకుండా, ముళ్లు కాళ్ళలో గుచ్చుకుని నెత్తు రు కారుతుంటే
జిల్లేడిపాలు తలమీద పో సుకుని జటలు కట్టేసినటువంటి తలతో ఆకలేస్తే ఉత్త మమయిన
మాంసాహారము తినడానికి అవకాశము లేక ఆ చెట్టు ని ఆ చెట్టు ని తేనె పట్టు ని కొట్టు కుని తేనె తాగి
కందమూలాలు తిని ఒక చెట్లకింద రాముడు పడుకోవడమా, అది ఊహించి నేను బతకగలనా, పైగా
నీకొక్క మాట చెపుతున్నాను చూడు, నేను వృద్ధా ప్యములో ఉన్నాను, జీవితానికి చిట్ట చివరి దశకు
వచ్చేశాను ఇంక బ్రతికినంతకాలము బతకను, కైకా రాముడిని విడిచిపెట్టి నేనుండలేను, కైకా నువ్వు
నన్ను అడుగు కౌసల్యను విడిచిపెట్టేసెయ్యి అను వదిలిపెట్టేస్తా ను సుమిత్రను వదిలెయ్యి అను,
వదిలిపెట్టేస్తా ను, దశరధా నీ ప్రా ణాలు విడిచిపెట్టేయి అను నీ పాదాల దగ్గ ర విడిచిపెట్టేస్తా ను, రాజ్య
బ్రష్టు డివి అయిపో సింహాసనము దిగప
ి ో అను దిగిపో తాను, ఒక్క కోరిక నీ పాదములు పట్టి
ప్రా ర్ధిస్తు న్నాను కైకా, రాముడిని పద్నాలుగేళ్లు పంపించేయమని అడక్కు.

రాముడిని వదిలి నేనుండలేను, బ్రతకలేను రాముడే వెళ్లి పో యాడా రాముడిని


దండకారణ్యానికి పంపించేస్తే సీత ఏడుస్తూ వచ్చి నేను ఆసనము మీద కూర్చునుంటే నా పాదాల
దగ్గ ర కూర్చుని నా వంక చూసి మావగారూ నా భర్త ఏ తప్పు చేసాడని పద్నాలుగేళ్లు
దండకారణ్యానికి పంపించారని సీతమ్మ ఏడుస్తూ నన్నడిగితే నేనేమని చెప్పను. రాముడు నాకు
కనపడకుండా దండకారణ్యము చెయ్యడానికి వెళ్లి పో తున్నటువంటి రోజున నా ప్రా ణములు
నిలబడవు, నేను వెంటనే ప్రా ణములు పో యినవాడినయి శవమై కిందపడిపో తాను, నువ్వు
వైధవ్యాన్ని పొ ందుతావు దిక్కులేనిదానివి అయిపో తావు కైకా నేను సత్యము చెపుతున్నాను.
రాముడిని చూడకుండా ఒక్క క్షణము బ్రతకలేను, నన్ను బ్రతికించుకో, నీ పసుపు కుంకుమలు
నిలబెట్టు కో నాకేం అక్కరలేదు రాముడు భరతుని యందు అప్రీతి కలిగినవాడు కాదు. భరతుడిని ఏ
అపకారము చెయ్యడు, నిన్ను కన్నతల్లిని ఎలా చూస్తా డో అలా చూస్తా డు, నీకు ఎవరో లేనిపో ని
విషయాలు నూరిపో సారు, నేను రాముడిని దండకారణ్యానికి పంపించేసాను అని తెలిసినరోజున, ఏ
తప్పు చెయ్యని రాముడిని దండకారణ్యానికి ఎందుకు పంపించావు నీలాంటి వాడిని ఎలా
నమ్ముతాను అని సుమిత్ర అడుగుతుంది, నేను ఏ జవాబు చెప్పను.

అరవైవేల సంవత్సరములు రాజ్యము చేసినటువంటి నేను బయటకు వెడుతుంటే


సూరాపానము చేసినటువంటి బ్రా హ్మణుడు నా పక్కన పట్ట పగలు వెడుతూ యవ్వనములో ఉన్న
భార్య మాట వినడము కొసమని ధర్మాత్ముడయిన కొడుకుని అడవికి పంపించు ఈ మాను
దశరధమహారాజు అని దెప్పిపొ డుస్తా డు. ఆ నాడు నేను బ్రతికి చచ్చిపో యినవాడిని కైకా నాకా
అప్రతిష్ట తేకు, నాకా అపకీర్తి తేకు, నన్ను క్షమించు నేను ఇల్లా లివని భార్యవని తాళి కట్టి నిన్ను
తెచ్చి ఇంట్లో పెట్టి పో షించి నీ యందు ప్రేమతో అనురాగముతో నన్ను ఒక తల్లి బిడ్డ డిని ఎలా
చూస్తు ందో అలా చూసింది కౌసల్య. ఒక అప్పచెల్లెలు అన్నదమ్ముడిని ఎలా చూస్తు ందో అలా
చూసింది కౌసల్య, ఒక సేవకురాలు ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య.
అపారమయినటువంటి గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తికి తల్లి అయ్యింది
కౌసల్య, ఒక్కనాడు కౌసల్యను సత్కరించలేదు. ఎందుకు సత్కరించలేదో తెలుసా, నీకు కోపము
వస్తు ందని సత్కరించడము మానేసాను. నేను ఎన్నడూ వారి గృహాలకు వెళ్లలేదు, నీ యందు ప్రీతి
పెట్టు కుని బ్రతికాను, నువ్వు ఇటువంటిదానివని తెలియక పాముపిల్లకు పాలు పో సి పెంచి పెద్దచేసి
ఒడిలో పెట్టు కుని సంతోషపడినటువంటి ధౌర్భాగ్యుడిలా నిన్ను పెట్టు కున్నాను. మెడకు ఊరి
బిగిసిపో తుంటే కౌగలించుకుంటోందని మురిసిపో యిన వెర్రివాడిలా నిన్ను కౌగలించుకున్నాను. నా
జీవితము అస్త మయానికి వచ్చేసింది ఎంతోకాలము ఉండను, దుర్నిమిత్త ములు కనపడడము వలన
రాముడికి యవ్వరాజ్య పట్టా భిషేకము చెయ్యడానికి ఒప్పుకున్నాను. పైగా ఆ రాముడే
దండకారణ్యమునకు వెళ్ళిపో యిననాడు నేను మరణిస్తా ను, నేను మరణిస్తే నాతోబాటుగా కౌసల్య
మరణిస్తు ంది. దశరధుడు కౌసల్య మరణించిన నాడు ఈ రాజ్యములో ఎవ్వరూ సంతోషముగా
ఉండరు.

నువ్వనుకుంటున్నావు భరతుడు రాజ్యము తీసుకుంటాడని, భరతుడు రాజ్యము


తీసుకుంటాడని నేననుకోవడము లేదు, చిట్ట చివరకు అందరిచేత అపవాదు పొ ందినదానివయి
దిక్కులేనిదానివయి, అనాధవయి నీ భాధ చెప్పుకోవడానికి భర్త లేక విధవయి మిగిలిపో తావు కైకా
నీకెవరు ఎక్కించారో ఈ మాటలు నాకు అర్ధ ము కావడము లేదు. నా మాట విని నీ పట్టు దల
మానేసెయ్యి, మానకపో తే ప్రమాదము వస్తు ంది, నా కుమారుడు రాజ్యము విడిచిపెట్టి దూరము
వెళ్ళగానే నేను మరణిస్తా ను. మరణించి ఈ శరీరము విడిచిపెట్టే స్వర్గా నికి వెళ్లి పో తుంటే దేవతలు
ఎదురొచ్చి నీ ప్రియపుత్రు డు అయిన రాముడు ఎక్కడున్నాడు అని చెపితే అప్పుడు కూడా నేను
జవాబు చెప్పలేను. సత్బ్రాహ్మణులు, ఋషులు అయోధ్యకు వచ్చి రాముడేడి అని అడిగితే
కాముకుడనయి యవ్వనములో ఉన్నటువంటి భార్యకు ఇచ్చిన మాటకు సత్పుత్రు డుని దూరంగా
పంపించుకున్నానని చెప్పుకోనా కైకా, ఏ కోపము ఉందని ఏ తాపము ఉందని, ఏ కారణము
ఉందని, ఏ ఆరోపణ ఉందని రాముడిని పంపించుకోను.

అందుకని నా మాట విను, నాకొక్కటే కోరిక, రాముడు నేను నీకు రాజ్యము ఇవ్వను అంటే
నువెవ్వడివిరా రాజ్యము ఇవ్వడానికి అని నా మీద తిరగబడి నాన్నా నూవ్వెందుకు ఇస్తా వు
రాజ్యము నేను పుచ్చుకుంటాను అని నను ఖైదులో పెట్టేస్తే నేను సంతోషపడిపో దును, కానీ
రాముడు అలా చెయ్యడు, నాన్నా నువ్వు చెప్పావు నేను అరణ్యానికి వెళ్లి పో తాను నాన్నా అంటాడు.
అది నేను తట్టు కోలేను కైకా నాతో ఆ మాట అనిపించద్దు వెర్రిరాముడు, రాముడికి పితృవాఖ్య
పరిపాలన తప్ప వేరొకటి తెలియదు. ఎంత పిచ్చి ప్రేమో నేనంటే, నాన్నా ఇప్పుడు
సంతోషించవలసిన వయస్సురా, భోగాలు అనుభవించరా అని చెప్పవలిసినవాడిని తెల్లటి గొడుగు
కింద కొడుకు కూర్చుంటే చూడవలసిన వాడిని నేను నా చేజేతులారా అడవిలో రాముడు
తిరుగుతుంటే, నేను పరమాన్నాలు తిని అంతఃపురములో బ్రతకనా, నేను అలా బ్రతకగలనని
అనుకుంటున్నావా, అలా నేనుండలేను. రాముడు నన్ను నిగ్రహించి నా మాటకు ఎదురు తిరిగే
వాడు కాదు అందుకు నేను బాధపడుతున్నాను కైకా నా మాట విను, నేను బ్రతకను మరణిస్తా ను
నువ్వు వైధవ్యము పొ ందుతావు.

అన్నిటినిమించి ఒక మాట చెపుతున్నాను నిజముగా రాముడు దండకారణ్యమునకు


వెళ్ళిపో యిన తరువాత రాజ్యము పొ ందడము భరతుని యొక్క కోరికే అయితే నా శరీరము
పడిపో యిన తరువాత నా శవాన్ని కూడా భరతుడు ముట్టు కోకూడదు. నాకు అంత్యేష్టిసంస్కారము
చెయ్యకూడదు, నాకు ఉదకక్రియ చెయ్యకూడదు, నాకు తర్పణ విడిచిపెట్టకూడదు నువ్వు నా
శవాన్ని ముట్ట కూడదు. అందుచేత ఇంత తీవ్రమయిన ప్రతిజ్ఞ చేస్తు న్నాను నా మాట విను,
ఇప్పటికయినా నీ మనస్సు మార్చుకో, మార్చుకుని ఆ రెండు వరాలు ఉపసంహరించుకో. నేను
చెప్పననికాదు, పరమ ముసిలివాడు వయస్సు అయిపో యింది వృద్ధు డు అని నా యందు
అనుగ్రహించు దీనుడు, చేతకానివాడు నా పాదములమీద పడి వేడుకుంటున్నాడని నాకు నువ్వు
బిక్షపెట్టు . రాముడిని చూస్తూ చచ్చిపో యే అదృష్టా న్ని నాకియ్యి, కైకా ఆ ఒక్క అదృష్టా న్ని తీసెయ్యకు
నేను బ్రతకలేను ఇంక ఏ శిక్ష అయినా నీ ఇష్ట ము నాకు విధించు, సంతోషముగా భరిస్తా ను ఒక్క
రాముడిని చూడకుండా ఉండమంటే ఉండలేను కైకా నీ పాదములమీద పడిపో తున్నాను అని
నేలమీద కూర్చున్నవాడు లేచి కైకమ్మ పాదములమీద పడ్డా డు.

పడితే తన పాదముల మీద పడుతున్నాడని దూరము జరిగంి ది. శిరస్సు నేలకు తగిలి
మహానుభావుడు పక్కకు దుళ్ళి సృహతప్పి పడిపో యాడు. పడిపో తే లేపలేదు, లేపకపో తే అలాగే
సృహతప్పి పలవరిస్తూ పడిపో యి ఉండిపో యాడు. ఎంత దారుణమయిన స్థితికి వెళ్లి పో యాడో
చూడండి, ఒక్క చెప్పుడు మాటలు వినడము చేత ఒక మహాపురుషుడు దశరధుడు నేనింకా కొన్ని
శ్లో కాలు ఆపాను ఎందుకు ఆపానంటే యధార్ధ మునకు నేనే చెప్పలేను, నేను చెప్తే ఉపన్యాసానికి
వచ్చి నేనేడస
ి ్తే అసహ్యముగా ఉంటుందని నేను చెప్పలేదు.
ఇది అంత భయంకరముగా ఉంటుంది దశరధుడి పరివేదన, ఎంత భాధ పడ్డా డో
మహానుభావుడు. ఇన్ని చెప్పి పడిపో తే కూడా కాళ్ళు దూరముగా లాగేస్తే కైకమ్మ, పాదములు
దూరముగా తీసేసుకుంటే మూర్ఛవచ్చి పడిపో తే, పడిపో యినతరువాత అప్పుడు ఒక్కసారి మళ్ళీ
కొంతసేపటికి తెలివొచ్చింది. తెలివొచ్చినతరువాత ఆవిడ అంటుంది ఏమయ్యా, ఇక్ష్వాకు వంశములో
పుట్టా నంటావు సత్యధర్మములు పాటిస్తు న్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, రెండు వరాలు
అడిగేటప్పటికి నీకు ఇంత కష్ట ము వచ్చిందా, ఎందుకు ఇంత కష్ట ము వచ్చింది. ఏం ఎవరయినా
వచ్చి రాముడు ఎక్కడికి వెళ్లా డని అడిగితే దండకారణ్యానికి పంపించాను అని చెప్పలేను కైకా
అంటున్నావు కదా.

మరి ఎవరయినా వచ్చి యస్యాః ప్రసాదే జీవామి యా చ మామభ్యపాలయత్, తస్యాః కృతం


మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి. ఆ నాడు కైక నీకు రెండు సార్లు ప్రా ణబిక్ష పెడితే
బతికినటువంటివాడా, చేతకానివాడా, నీకు బతుకు పెట్టిన కైకేయికి రెండు వరాలు ఇవ్వడము
మానేసి అమాయకురాలిని చేసి వంచించి బతుకుతున్నవాడా అని లోకము పిలవదా, ఏం వరాలు
ఇవ్వడానికి వచ్చేటప్పటికి మాత్రము వెనుకంజ వేస్తు న్నావా, ఏం ఎందుకివ్వవు వరాలు. అసలే
తెలివితప్పి కొరడాలచేత కొట్ట బడిన గుర్రంపిల్లలా పరివేదన చెందుతున్నాడు నేలమీద పడి.
అటువంటి మహానుభావుడికి గుక్కెడు నీళ్ళు ఇవ్వడము మానేసి ఆ రోజున ఎంత గొప్ప మాటలు
అడిగిందో చూడండి ఆవిడ.

శైబ్యః శ్యేనకపో తీయే స్వమాంసం పక్షిణే దదౌ, అలర్కః చక్షుషీ దత్వా జాగామ
గతిముత్త మామ్. పో రా ఉత్త మగతులకి ఎలా వెళ్లా రు నీ వంశములో వాళ్ళు, ఆనాడు ఒక
డేగరూపములో ఇంద్రు డు, పావురము రూపములో అఘ్ని వచ్చారు మహానుభావుడు ఆ
సింహాసనము మీద కూర్చుని ఉన్నాడు ఆ సమయములో రాజు. కూర్చుని ఉండగా ఆ
వచ్చినటువంటి డేగ పావురాన్ని తరుముతూ వస్తే ఆ పావురము వచ్చి రాజు కాళ్ల మీద పడింది.
పడితే నీకు శరణు ఇచ్చాను అన్నాడు. ఆ పావురానికి శరణు ఇచ్చావు మరి నాకు ఆహారము
ఎక్కడనుంచి వస్తు ంది అని అడిగాడు ఆయన ధర్మనిష్ట కనిపెట్టడానికి డేగరూపములో ఉన్న
ఇంద్రు డు. నీకు పావురము ఎత్త ంత మాంసము కావాలి కనుక నేనిస్తా ను మాంసము అని
పావురాన్ని తక్కిటలో ఒక పక్కన పెట్టి, తన శరీరములోంచి అంత బరువున్న మాంసాన్ని కోసి
అక్కడ పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినటువంటివాడు నీ వంశములో పూర్వములో పుట్టినటువంటి
శిబిచక్రవర్తి.

అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గ రకు ఇంద్రు డు బ్రా హ్మణరూపములో వచ్చి నిలబడితే
నీకేమికావాలో కోరుకోమన్నాడు. నీ కళ్ల ను ఇచ్చేస్తా వా అన్నాడు బ్రా హ్మణుడు. ఇస్తా నన్నాడు
కాబట్టి అలర్కుడు తన రెండు కళ్ళు తీసి ఇచ్చేసాడు. అటువంటివారి వంశములో పుట్టి రెండు
వరాలు భార్యకు ఇస్తా నని ఇవ్వకుండా తప్పించుకోవడానికి నీకు సిగ్గు గా లేదా అని అడిగింది. అడిగి
భర్త ని ఏమని పిలిచిందో తెలుసాండీ కైకమ్మ ఆ రోజున దేవతలు ఆవహించారు, బహుశా ఏ భార్యా ఏ
భర్త ను అలా పిలవకూడదు దుర్మతే బుద్ధిహీనుడా, దుష్ట బుద్ధి కలిగినవాడా నీ పన్నాగము ఏమిటో
నాకు తెలీదు అనుకుంటున్నావా.

సత్యం ధర్మం పరీత్యజ్య రామం రాజ్యెభిషిచ్యచ, సహ కౌసల్యయ నిత్యం రంతుమిఛ్ఛసి


దుర్మతే. ధర్మాన్ని వదిలేసి రాముడిని తీసుకువచ్చి పట్టా భిషేకము చేసేసి నువెళ్ళి కౌసల్యతో
కులుకుదామనుకుంటున్నావా, నాకు తెలీదు అనుకుంటున్నావా నీ బ్రతుకు దుర్మతీ ఎక్కడకు
పో తావు, నాకు రెండు వరాలు ఇచ్చి తీరవలసిందే. నువ్వు రాముడికి పట్టా భిషేకము చేస్తే కౌసల్య
రాజమాత అయితే నేనెళ్ళి కౌసల్యకు నమస్కారము చేస్తా ననుకుంటున్నావా, ఒక్కనాటికి అది
జరగదు. ఎందుకు ఈ మాటలు వస్తు న్నాయి నోటివంె ట, అంత ఎక్కించింది మంధర, నువ్వు కౌసల్య
దగ్గ ర నిలబడి నమస్కారము చెయ్యాల్సి వస్తు ంది అంది మంధర.

అహం హి విషమధ్వైవ పీత్వా బహు తవాగ్రతః, పశ్యతస్తే మరిష్యామి రామో


యద్యభిషిచ్యతే. కౌసల్యకు నమస్కరిస్తూ ఒక్కరోజు నిలబడవలసివచ్చినా అంతకన్నా ప్రా ణాలు
విడిచిపెట్టి చనిపో తాను తప్ప కౌసల్యకు మాత్రము నేను నమస్కారము చెయ్యను. ఎందుకు
చెయ్యకూడదు నమస్కారము, అక్కగారు జ్యేష్ట మహిషి, ఆవిడకు నమస్కారము చేస్తే దో షము
వచ్చిందా. మనస్సులో ఎంత వ్యగ్రత పొ ందిందో చూడండి ఆ రోజున. పొ ంది ఈ వరాల్ని ఇస్తే తప్ప
వీలుకాదు అంది.

అంటే ఆయన అన్నాడు ఒకవేళ ఇదే నీ పట్టు దల అయితే కైకా నేను చెప్పినటువంటి
మాటలు కూడా నువ్వొక్కసారి జ్ఞా పకము పెట్టు కో అని ఆయన అంటాడు ప్రతామ్య వా ప్రజ్వల వా
ప్రణస్య వా, సహస్రా సో వా స్ఫుటితా మహీం వ్రజ, న తే కరిష్యామి వచస్సుదారుణమ్, మమాహితం
కేకయ రాజపాంసని. కైకా నువ్వు నిలువునా మండిపో , నేలమీద పడిపో యి ముక్కలయిపో ,
నువ్వు సర్వనాశనము అయిపో , లేదా దుఃఖించి దుఃఖించి చెడప
ి ో నీ కోరిక మాత్రము నేను తీర్చను.
ఎందుకంటే నువ్వు ధర్మాభద్ద మయిన కోరిక కోరలేదు, లోకమంతా ఎవరిని రాజుగా ఉండాలని
కోరుకుంటోందో , ఎవరు యవ్వరాజ్య పట్టా భిషేకము పొ ందాలని కోరుకుంటోందో , ఎవరిగురించి లోకము
అంతా ఒక్క అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఏ అపవాదు లేకుండా, ఏ ఆరోపణా
లేకుండా పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి పంపమంటున్నావు. ఇది నేను చెయ్యను, నువ్వు
నాశనము అయిపో యినా సరే నేను మాత్రము నీ కోరిక తీర్చను అన్నాడు.

అంటే ఆవిడంది ఆ మాటకు నిలబడగలడా, ధర్మపాశాలు ఇచ్చి లాగేస్తు న్నాయి రెండు


వరాలు ఇచ్చాడు ఏంచేస్తా డు, పైకెక్కి కనీసము ఆసనము మీద కూడా కూర్చోలేకపో యాడు.
కిందపడిపో యి నేలమీద పడి మాట్లా డుతున్నాడు, కన్నుల వెంట కాల్వలకింద కారిపో తున్నాయి
నీళ్ళు, ఏడవడము తెలియనటువంటివాడు ఏడ్చి ఏడ్చి ఏడ్చి అప్పటికి పదిహేనుమార్లు
స్పృహతప్పాడు. బుగ్గ లన్నీ అట్ట లు కట్టేసాయి, అట్ట లు కట్టేసి ఏడుస్తూ అంటాడు నువ్వు రాముడికి
ఎంత కష్ట ము వస్తు ందో , రాముడు దండకారణ్యవాసానికి వెడత
ి ే ప్రజలందరూ ఎంత తల్ల డిల్లి పో తారో,
ఎన్ని ఛీత్కారములు చేస్తా రో నువ్వు ఊహించలేకపో తున్నావు. నేనొక్కటే కోరుకుంటున్నాను,
నేనిప్పటివరకు ఏం చెప్పాను, రాముడు దండకారణ్యమునకు వెళ్లి పో తున్నప్పుడు నేను మరణిస్తా ను
అని చెపుతున్నాను. కానీ ఇప్పుడు చెపుతున్నాను నేను అదృష్ట వంతుడను అయితే, వేరొక్కమాట
మాట్లా డవలసిన అవసరము లేకుండా అసలు రాముడు దండకారణ్యానికి వెళ్ళు అన్నమాట నేను
తండ్రిగా అనవలసిన అవసరము రాకుండా ఇప్పుడే మరణము వచ్చి ఇప్పుడే చచ్చిపో వాలని
కోరుకుంటున్నాను కైకా.

ఈ ప్రయత్నము నుంచి తప్పించడము నీ చేతిలో ఉంది మరొక్కసారి నీ పాదాలు


పట్టు కుంటున్నాను అని ఇంకొకసారి కాళ్ల మీద పడ్డా డు. పడిపో తే ఇంకొకసారి తప్పుకుంది,
తప్పుకుని ఆవిడ అంటుంది త్వం కత్థ సే మహారాజ సత్యవాదీ దృఢవ్రతః, మమ చేమం వరం
కస్మాత్ విధారయి తుమిఛ్ఛసి. సత్యం అంటావు ధర్మము అంటావు నేను సత్యమునకు
కట్టు బడ్డా నంటావు, ధర్మమునకు కట్టు బడ్డా నంటావు, ఇక్ష్వాకు వంశీయుడను అంటావు, అరవైవేలు
రాజ్యాన్ని పాలించానంటావు, కాకుస్థు డను అంటావు ఇన్ని ప్రగల్భాలు చెపుతావు రోజూవచ్చి. ఏది
రెండు వరాలు నేనడిగితే ఇవ్వడానికి ఇంత తబ్బిబయిపో తున్నావా. ఏమయ్యా నువ్వు కాదూ మాట
తప్పుతున్నది అని అడిగింది. అడిగితే ఈ చర్చ జరుగుతూండగా మూర్ఛలో పడి మూర్ఛలోంచి
లేచి కైకను ఎన్నిమాట్లు బతిమాలుకోవాలో అంత బతిమాలాడు.

నీకేమి కావాలో చెప్పు, ఈ రాజ్యములో ఉన్న ఐశ్వర్యము కావాలా ఇచ్చేస్తా ను, నీకు
ధనము కావాలా ఇచ్చేస్తా ను, నీకేది కావాలంటే అది చేస్తా ను నేను కోరుకునేది ఒక్కటే రాముడిని
చూడకుండా ఉండి రామా రామా రామా అంటూ ఏడుస్తూ చచ్చిపో యే దురదృష్ట ము నాకివ్వకు, నా
ఒక్క కోరిక రాముడిని చూస్తూ చచ్చిపో తాను కైకా ఎలాగూ చివరికి వచ్చేసాను, ఇంక నేను బతకను
ఎక్కువకాలము వృద్ధు డను అయిపో యాను. రాముడ్ని చూస్తూ చచ్చిపో యే అదృష్టా న్ని కైకమ్మ
ఇచ్చింది అన్న వరము ఇయ్యి, ఆ వరముతో నేను చచ్చిపో యేటట్టు గా నన్ను అనుగ్రహించు. ఆ
ఒక్క అవకాశాన్ని నాకు దూరము చెయ్యకు అని మాట్లా డుతున్నాడు రాత్రి గడిచిపో తోంది. కైకమ్మ
అంగీకరించడము లేదు. ఒక్కొక్కసారికి ఒక్కొక్కసారికి పరుషముగా మాట్లా డుతోంది, మాట్లా డుతుంటే
ఆయన అంటాడు దిక్కులేక ఎంతబాధ పడిపో యాడో చూడండి దశరధమహారాజుగారు.

కిటికీలోంచి రాత్రివంక చూసాడు, రాత్రి గడిచిపో వడానికి సిద్ధము అయిపో తోంది, ఈ కైక
నామాట వినదు, పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా జుట్టు అంతా విరబో సేసుకున్నాడు ఏడ్చి ఏడ్చి
ఎన్నడూ తెలియనటువంటివాడు పరమవృద్ధు డేమో కళ్ళన్నీ వాచిపో యి ఎర్రగా అయిపో యాయి.
నీరసపడిపో యాడు, అప్పటికి ఎన్నిమార్లు స్పృహతప్పేడో , ఎన్నిమార్లు మూర్ఛపో యాడో . నేల
పడుతున్నాడు లేస్తు న్నాడు, చంపలనిండా కారిపో యినటువంటి కన్నీళ్ళు అట్ట లు కట్టేసి ఉన్నాయి.
స్పృహ వస్తే పిచ్చివాడయిపో తున్నాడు, ఏదో రోగము వచ్చినవాడిలా, అపత్యము తిన్నవాడిలా,
ఉన్మాధిలా తెల్లవారిపో తుందేమో అని బెంగపెట్టేసుకున్నవాడిలా అయిపో తున్నాడు.

తెల్లవారితే రాముడు వస్తా డు, ఏం చెప్తా డు అంత బాధ తట్టు కోలేకపో తున్నాడు. అందుకని
కైక నా మాట వినదు అని నిషాకాంతా అనిపిలుస్తా డు రాత్రిని. పిలిచి అంటాడు న ప్రభాతం
త్వయేఛ్ఛామి నిశే నక్షత్రభూషణే, క్రియతాం మే దయా భద్రే మయా2 యం రచితోంజలిః. ఈ కైక
నామాట వినదు రాముడిని చూస్తూ చచ్చిపో యే ఒక్క వరాన్ని నాకివ్వదు, ఓ రాత్రీ
నక్షత్రములనేటటువంటి ఆభరణములు పెట్టు కున్నటువంటి రాత్రి అనబడేటటువంటి ఓ కాంతా
నువ్వు నాకు ఒక్క వరము ఇయ్యి ఈ రాత్రి తెల్లవారకూడదు, ఇలాగే ఉండిపో . ఎందుకనంటే
తెల్లవారిపో తే రాముడు వస్తా డు పట్టా భిషేకము చేసుకుందామని, సకలసుగుణాభిరాముడు.

నా రాముడివంక చూస్తే నాకన్నులు నీళ్ళు చిప్పిల్లు తుంది, చిప్పిల్లితే వచ్చి నా


పాదములకు నమస్కారము చేస్తా డు, తండ్రీ మీ ఆజ్ఞ అంటాడు, నాన్నా నీకు యవ్వరాజ్య
పతాభిషేకము చెయ్యట్లేదురా దండకారణ్యానికి వెళ్లి పో రా అంటే, ఎందుకెళ్లా లి అని అడగడు,
తప్పకుండా వెళ్లి పో తాను నాన్నగారూ అంటాడు. అలా అని వెళ్లి పో తున్న రాముడిని నేను
చూడలేను, అందుకని వద్దు తెల్లా రద్దు నువ్వన్నా కటాక్షించు నన్ను. లోకములో స్త్రీలు ద్రో హులు,
పరమ పాతకులు, ఛీ నేనీమాట అనకూడదు. కౌసల్య లేదూ మహో న్నతమయిన స్త్రీ, తెలిసి తెలిసీ
అటువంటి భార్య ఉండగా విడిచిపెట్టి ఈ కైకమ్మను అక్కున చేర్చుకున్నాను. లోకములో స్త్రీలు
ద్రో హులు అనడానికి వీలు లేదు, కైక ద్రో హి, కైక అన్న మాట అనడానికి ఇష్ట పడలేదు
దశరధమహారాజుగారు. భరతమాత, ఈ భరతమాత పరమద్రో హి అందుకని నిన్నొక్కటే
వేడుకుంటున్నాను నువ్వు తెల్లవారకు అన్నాడు.

అని ఇటు చూసాడు, అక్కడే కూర్చుని వెర్రినవ్వు నవ్వుతూ ఉంది కైకమ్మ, చూసి మళ్ళీ
చీకటివంక చూసాడు, చూసి అంటాడు ఎంత వెర్రెక్కిపో యి ఉన్నాడో చూడండి, ఎంత భ్రా ంతిలో
ఉన్నాడో చూడండి దశరధమహారాజుగారు. కావ్యభాష వాల్మీకి మాట్లా డతారు ఆయన అంటారు
అధవా గమ్యతా౦ శీఘ్రం నాహమిఛ్ఛామి నిర్ఘృణామ్, నృశంసామ్ కైకయీం ద్రష్టు ౦ యత్కృతే వ్యసనం
మహత్. ఓ రాత్రీ నన్ననుగ్రహించు, నువ్వయినా నా మాటవిను తొందరగా వెళ్లి పో , తెల్లవారపో నీ.
ఎందుకోతెలుసా, నువ్వలా ఉండిపో తే నేనిక్కడ ఉండిపో వాలి. చీకట్లో రాత్రివేళ రాజు నడిచి వెడత
ి ే
బాగుండదు. అందుకని నువ్వలా ఉండిపో తే నేనీగదిలో ఉండిపో వాలి, నా ఎదురుగుండా కైక
ఉంటుంది, ఆ కైకను చూస్తూ ఒక్క క్షణము కూడా ఇక్కడ ఉండలేను తొందరగా తెల్లవారితే నేను
వెళ్లి పో తాను ఇక్కడనుంచి, అందుకని తెల్లవారిపో నీ. కనీసము నా మాట అదయినా విను ఓ
నిషాకాంతా చీకటి అనబడేటటువంటి ఓ స్త్రీ స్వరూపమా తొందరగా నువ్వెళ్లిపో . అంటే ఇంక ఎవరితో
మాట్లా డుతున్నాడో , ఏది మాట్లా డుతున్నాడో కూడా తెలియని ఉన్మాధావాస్త ను పొ ందాడు. పొ ంది
ఇంతగా భాధ పడుతున్నాడు, తెల్లవారిపో తోంది, బ్రా హ్మీముహూర్త ము ఆసనమ్మవుతోంది,
దూరముగా వేదపఠనము చెవినపడుతోంది.
అక్కడ రామచంద్రమూర్తి ఉపవాసము చేసారు, సంధ్యావందనాది క్రతువులు పూర్తి
చేసుకున్నారు, ఇంక యవ్వరాజ్య పట్టా భిషేకము చేస్తా డు తండ్రి సూర్యోదయము కాగానే అని మంచి
కాంతివంతమయినటువంటి స్వరూపముతో బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అయోధ్య
పట్ట ణము అంతా ఎక్కడ చూసినా జేజేలు పలుకుతున్నారు. అంతఃపురములో రాజు యొక్క పరిస్థితి
ఇంత దౌర్భాగ్యముగా ఉంది. ఆవిడ అంటుంది కైకమ్మ తెల్లవారడానికి సిద్ధమవుతోంది నువ్వు
సూర్యవంశ ప్రభువివి, ఇప్పటివరకు నీ బుద్ధి గడ్డితింది, కనీసము సూర్యవంశప్రభువువి కనుక
సూర్యదర్శనము చేసయినా బుద్ధి తెచ్చుకోవయ్యా. సత్యానికి ధర్మానికి కట్టు బడడము నేర్చుకో, అని
ఆవిడ అంది. తెల్లవారింది కాబట్టి రాముడు వస్తా డు, రాముడిని చూసినతరువాత
పుత్రవ్యామోహముతో మాట మార్చినా, భరతుడికి రాజ్యాభిషేకము ఇవ్వకపో యినా, రాముడిని
దండకారణ్యానికి పంపకపో యినా ఒక్క విషయము జ్ఞా పకము పెట్టు కో.

సమయం చ మమాద్యేమ౦ యది త్వం న కరిష్యసి, అగ్రతస్తే పరిత్యక్తా పరిత్యక్ష్యామి


జీవితమ్. నన్ను నువ్వు విడిచిపెట్టినట్టు గా భావించి నాకు రెండు వరములు ఇయ్యలేదు కనుక
విషము తాగి ఇదే గదిలో నేను చనిపో తాను, నువ్వు యవ్వరాజ్య పట్టా భిషేకము ఎలా చేస్తా వో
చూస్తా ను. తెల్లవారేటప్పటికి ప్రపంచము అంతా తెలుస్తు ంది, యుద్ధ ములో తన భార్యవలన రెండు
మార్లు బ్రతికి రెండు వరాలు ఇచ్చి అడిగితే పుత్రవ్యామోహముతో దాటవేసి భార్యకనుగప్పి కొడుక్కి
పట్టా భిషేకము చెయ్యడానికి వస్తే భార్య విషము తాగి మరణించిందని లోకము చెప్పుకుంటుంది.
మర్యాదగా నా వరాలకి లొంగి భరతుడికి పట్టా భిషేకము చేసి రాముడిని దండకారణ్యమునకు
పంపిస్తా వో నా మరణాన్ని చూస్తా వో దశరధా నీ ఇష్ట ము అంది.

ఆరోజున దశరధమహారాజుగారి పరిస్థితి ఉందిటండీ నిగ్రహించగలడా భార్యని, ఏమి


చెయ్యగలడు, ఆయన పరిస్థితి ఉందిట కాడికి కట్టినటువంటి ఎద్దు అటు కాడికి వెనక చక్రా నికి
మధ్యలో నలిగిపో తే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఒక పక్క తెల్లవారిపో తోంది, జయజయ
ధ్వానాలు వినబడుతున్నాయి, వచ్చి వాళ్ళందరూ స్తో త్రము చేస్తా రు వందిమాగదులు రాముడు
వస్తా డు, రామా దండకారణ్యానికి వెళ్ళు అన్నాడా అపనిందకు గురయిపో తాడు, రామా
పట్టా భిషేకము చేసుకో అన్నాడా కైక మరణిస్తు ంది, మళ్ళీ అపనిందకు గురయిపో తాడు. ఏది
చెయ్యాలి, సత్యధర్మముల మధ్యపడి నలిగిపో తున్నాడు. ఆఖరికి ఇంత వేడుకున్నా ఇంత
బ్రతిమాలినా ఇంత కర్కశముగా మాట్లా డావు కనుక నీ కోరిక తీరుతోంది కనుక కైకా నీకు
చెపుతున్నాను.

యస్తే మంత్రకృతః పాణిః అగ్నౌ పాపే మయా దృతః, తం త్యజామి స్వజ౦ చైవ తవ పుత్త ౦
్ర
త్వయా సహ. ఈ మాట మార్చడానికి రామచంద్రమూర్తి యుద్ధ కాండలో అడగవలిసివచ్చింది
దశరధమహారాజుగారు వస్తే, నువ్వు నన్ను ఇంత భాద పెట్టా వు కనుక ఏ రాముడ్ని చూస్తూ
చనిపో తానని అడిగితే నాకు ఆపాటివరము కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకముగా ఏ
అఘ్నిసమక్షములో నీ పాణిగ్రహణము చేసానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తు న్నాను. ఇక
నువ్వు నాకు భార్యవు కావు, నా మరణము తధ్యము, నేను మరణించి తీరుతాను నువ్వు విధవవు
అవుతావు, విధవారాజ్యాన్ని నిర్వహించుకో, నువ్వు నీ కొడుకు కలిసి విధవ విధవ కొడుకు కలిపి
రాజ్యము ఏలుకోండి, ప్రజలందరూ ఛీ కొడతారు. నా మృతదేహము అంతఃపురములోంచి బయటకు
వెళ్లి పో తుంటే నీ కొడుక్కి పట్టా భిషేకము చేసుకుని మురిసిపో కైకా.

ఏ కుమారుడి కోసమని నువ్వింత దారుణానికి వడిగట్టా వో ఆ కుమారుడిని కూడా


విడిచిపెట్టేస్తు న్నాను. భరతుడు నా యొక్క శరీరాన్ని ముట్టు కోకూడదు, రాముడి అరణ్యవాసమే
భరతుడికి ఇష్ట మయితే భరతుడు నా శవాన్ని తాకకూడదు, నాకు ఉదకము ఇవ్వకూడదు, నా
అంత్యేష్టి సంస్కారము చెయ్యకూడదు మీ ఇద్ద రనీ
ి విడిచిపెట్టేసాను అని చెప్పాడు. ఈ మాట
చెప్పాడు, తెల్లవారింది, అవతల అభిషేకానికి కావలిసినటువంటి సమస్త సంభారములు
సిద్ధమయిపో యాయి, వశిష్ట మహర్షి వచ్చేస్తు న్నారు ఒక పక్కనుంచి బ్రా హ్మణుడు ఎక్కవలిసిన
రధము ఎక్కి సుమంత్రు డు పాపం సంతోషముగా వచ్చేసాడు. వచ్చి బయట నిలబడి లోపలకి వస్తూ
ఎవరు పడితే వాళ్ళు లోపలకు రావడానికి వీలు౦డదు. మొట్ట మొదటినుంచి వాత్సల్యము
ఉన్నవాడు కనుక దశరధమహారాజుగారి మంత్రి కనుక, ఆయన హృదయము తెలిసున్నవాడు
కనుక వందిమాగధులు వచ్చి స్తో త్రము చెయ్యబో యారు. చ్ఛీ నా మర్మస్థా నాల్ని వేదస
ి ్తో ంది ఆపండి
స్తో త్రము అన్నాడు దశరధుడు, ఏం ఇవ్వాళ ఇలా ఉన్నాడు దశరధుడు అని ఆశ్చర్యపో యి
వందిమాగధులు స్తో త్రము ఆపారు.

సుమంత్రు డు లోపలకు వెడుతున్నాడు, సూర్యోదయము అయిపో తోంది, యవ్వరాజ్య


పట్టా భిషేకానికి ముహూర్త ము సిద్ధము అయిపో యింది. భద్రపీఠము సిద్ధము చెసేసారు, ఒక
పక్కనుంచి ఏనుగుని తీసుకువచ్చేసారు, రెండవ కక్ష్యలో పౌరుల్ని నిలబెట్టా రు, ఆవేశ్యలు అందరూ
వచ్చేసారు, నటులు వచ్చేసారు, గాయకులు వచ్చేసారు, బ్రా హ్మణులు వచ్చేసారు, ఆ పేలాలు
మొదలయినటువంటివి, పెరుగు మొదలయినటువంటివి, నెయ్యి మొదలయినటువంటివి,
యజ్ఞ మునకు సంభందించినటువంటి అఘ్నికార్యమునకు సంభందించి సమస్త సంభారములు
సిద్ధము చేయబడ్డా యి. ప్రభువు బయటకు రాడు, సామంతరాజులు అందరూ బయట నిలబడి
ఉన్నారు. సుమంత్రు డిని అడిగారు, సూర్యోదయము అవుతోంది, రాజు బయటకు రాలేదు ఎందుచేత,
అంటే సుమంత్రు డు లోపలకు వస్తూ స్తో త్రము చేసాడు.

మహానుభావా మాతలి ప్రతీరోజూ ఉదయమే వెళ్ళి దేవేంద్రు డికి జయజయ ధ్వానాలు


చెపుతూ ఎలా నిద్రలేపుతాడో అలా నేను నిన్ను నిద్రలేపుతున్నాను, మహారాజా బయటకురా,
ఏవిధముగా అయితే ఈ సమస్త చరాచర ప్రపంచమును సృష్టి చేసన
ి టువంటి చతుర్ముఖ బ్రహ్మను
వేదము తన యొక్క అంగములతో కలిసి స్తో త్రము చేస్తు ందో అలా నిన్ను స్తో త్రము చేస్తు న్నాను,
దశరధమహారాజా లేచి పైకి రా, సూర్యుడు తన అనంతమయిన కిరణములతో భూమి మీద ఉన్న
సమస్త భూతములను ఎలా నిద్ర లేపుతాడో అలా నేను నిన్ను నిద్రలేపుతున్నాను మహారాజా లేచి
బయటకురా అన్నాడు. అంటే ఇక నువ్వు మాట్లా డకయ్యా ఆ మాటలు నేను వినలేకపో తున్నాను
అన్నాడు సుమంత్రు డు. అంటే గబగబా వచ్చాడు వచ్చి మహారాజా మీ ఆజ్ఞ , యవ్వరాజ్య
పట్టా భిషేకము కోసము అందరూ బయట వేచియున్నారు, ఏమి చెయ్యమంటారు అని అడిగాడు.
అడిగితే మాట్లా డలేక కంటివెంట నీటిధారలు పడిపో తుండగా వేరొకసారి స్పృహతప్పి తాను
కూర్చున్న ఆసనము మీద ఒరిగిపో యాడు ప్రభువు అలా ఉన్నారేం అని అడిగాడు.

అడిగితే కైకమ్మ అంది ఆరోజున సుమంత్ర రాజా రాజనీం రామహర్షసముత్సుకః,


ప్రజాగరపరిశ్రా ంతో నిద్రయా వసమేయివాన్. రాత్రల్లా ఎంత సంతోషముగా ఉన్నాడనుకుంటున్నావు,
పడుకోండి రాజా అంటే తెల్లవారితే మా అబ్బాయికి పట్టా భిషేకము రాముడికి పట్టా భిషేకము
రాముడికి పట్టా భిషేకము అని ఆ సంతోషములో నిద్ర పో లేదు. పెద్దవాడు కదా తెల్లవారినతరువాత
ఇప్పుడు కునుకు పట్టింది, అందుకని ఇప్పుడు నిద్ర పో తున్నాడు. నువ్వు గబగబా వెళ్ళి నా ఆజ్ఞ కి
దశరధాజ్ఞ కి తేడా ఏమి లేదు వెళ్ళి రాజు పిలుస్తు న్నాడని చెప్పి రాముడిని తీసుకురా అంది.
పాపము సుమంత్రు డు బయలుదేరాడు, బయలుదేరితే బయట ఉన్నటువంటి రాజులన్నారు
రాముడిని తీసుకువచ్చేయమన్నారు అంటే యవ్వరాజ్య పట్టా భిషేకము సిద్ధము అయిపో తోంది
రాముడు వచ్చేలోపల రాజు బయటకు వచ్చి మాకు దర్శనము ఇవ్వాలి కదా. మేమందరము
దశరధమహారాజుగారికి అభివాదము చేసి నమస్కారము చెయ్యాలి కదా, రాజేడీ బయటకు వచ్చి
దర్శనము ఇవ్వడు, ఒక్కసారి వచ్చి రాజు ఎందుకు దర్శనము ఇవ్వటములేదు, సూర్యోదయము
అయిపో యింది అని అడిగారు, వశిష్టు డు అడిగాడు. సూర్యోదయము అయిపో గానే పుష్యమీ
నక్షత్రములో అబిషేకము జరగాలి, దగ్గ ర ఉండి జరిపించవలసినవాడు దశరధమహారాజు.
లోపలనుంచి శయనాగారములోంచి బయటకు రాడేమీ అన్నాడు. అంటే మళ్ళీ కనుక్కొస్తా ను అని
మళ్ళీ వెనక్కు వెళ్ళాడు సుమంత్రు డు. వెళ్ళి పాపము లోపలకు వెళ్ళి స్తో త్రము చెయ్యబో యాడు,
చెయ్యబో తే దశరధమహారాజుగారి కంఠము ఘాధ్గిదమయిపో యింది, ఏం మాట్లా డుతాడు.
చెప్పానుకదా రాముడిని తీసుకురమ్మని తీసుకురా అన్నాడు అంతే. పాపము ఆ మాట విని
సుమంత్రు డు పైకి వచ్చాడు రధము ఎక్కాడు రాముని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు.

అది పాలసముద్రములోంచి బయటకువచ్చినటువంటి ప్రా కారములా ఉందిట. ముత్యాలతో,


బంగారముతో, వెండితో తాపడము చెయ్యబడి ఎక్కడ చూసినా హంసతూలికా తల్పాలు నెమళ్లు
ఎంత సంతోషముగానో ఎక్కడ చూసినా సరోవరాలు రాముడి స్నేహితులు, మిత్రు లు, బ్రా హ్మణులు,
ఋషులు, పదిహేను పక్కన పదిహేను సున్నలు పెడత
ి ే ఎంత సంఖ్య వస్తు ందో అంత మంది
జానపదులు, అయోధ్యానగర వాసులు, శూరులు వీళ్ల ందరూ నిలబడి ఎక్కడ చూసినా
సంతోషములో జయరామ, జయరామ, జయజయరామ అంటూ రాముడి యవ్వరాజ్య
పట్టా భిషేకము చేసుకుంటున్నాడు ఇంకాసేపట్లో మనము భద్రగజము మీద కూర్చుని తెల్లటి గొడుగు
కింద ఊరెరుగుతూవస్తు న్న రామచంద్రమూర్తి యొక్క దర్శనము చెయ్యబో తున్నాము,
ఏమానందము ఏమానందము అని వాళ్ళందరూ మురిసిపో యి మాట్లా డుకుంటున్నారు. మాంచి
పట్టు వస్త మ
్ర ులను ధరించి సీతమ్మతల్లి చేత అలంకృతుడయి రామచంద్రమూర్తి ఎంతో సంతోషముగా
ఉన్నాడుట. అటువంటి సమయములో సుమంత్రు డు రధము దిగి ఆ రామంచంద్రమూర్తి యొక్క
అంతఃపురములోకి వెళ్ళి ఆ అంతఃపుర వైభవాన్ని చూసి మురిసిపో యారు.

మురిసిపో యి లోపలకి వెళ్ళి రామదర్శనము చేసి కూర్చుని ఉన్నాడు రామచంద్రమూర్తి,


రామా నీకు జయమగుగాక అన్నారు. చాలా సంతోషించాడు, ఏమి ప్రభువు దగ్గ రనుంచి వచ్చావు
కదా సుమంత్రా ఏమి ఆజ్ఞ అని అడిగారు. నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు, యవ్వరాజ్య
పట్టా భిషేకానికే వెడుతున్నానని అనుకున్నాడు రాముడు. కానీ ఒక ధర్మము ఉంది, ఒక
మంగళకరమయిన పనిమీద, ఒక శుభప్రదమయిన పనిమీద భర్త వెడుతున్నప్పుడు భార్య
రాజద్వారాన్ని దాటి వచ్చి సాగనంపకూడదు. అలా సాగనంపితే భర్త కు పనులవ్వవు, ఇవ్వాళ రేపు
చాలా మంది తమ ఎదురే గొప్పదనుకుని భర్త వెడుతుంటే వీళ్లే ముందు బయటకు వెళ్ళి
ఎదురొస్తా రు, అలా వస్తే భర్త కు అది అమంగళకరమయినటువంటి చర్య, భార్య ఎప్పుడూ అలా
ఎదురు రాకూడదు భర్త కు. భార్య రాజద్వారపు గడపవరకు వచ్చి వెనక నిలబడాలి, భర్త గడప దాటి
బయటకు వెళ్లా లి.

అందుకని ధర్మము తెలుసున్నటువంటి తల్లి కనుక సీతమ్మ తల్లి గడపవెనక ఉండిపో యింది
రామచంద్రమూర్తి గడప దాటి బయటకు వచ్చి సీతమ్మతల్లి ఆయనకు మంగళాశాసనము చేసింది,
మీకు విజయము కలగాలి, యవ్వరాజ్య పట్టా భిషేకము జరగాలని ఎంతో సంతోషముగా మాట్లా డింది.
మహానుభావుడు బయలుదేరాడు, రధము ఎక్కాడు, సుమంత్రు డితో కలిసి వెళ్ళాడు, వెనకాతలే
లక్ష్మణుడు ఉంటాడు, ఆ శ్వేతఃచత్రా న్ని పట్టు కున్నాడు. అందరూ రాముడి రధము వెనకాతల
పరుగులు తీస్తు న్నారు, దశరధమహారాజుగారి అంతఃపురము దగ్గ రకు వెళ్లా రు, రధము దిగాడు,
రెండవ కక్ష్యనుంచి నడక ప్రా రంభించాడు. మిగిలిన స్నేహితులను వారిని అందరినీ ఆపేసాడు, తన
తండ్రిని చూడ్డా నికి వెడుతున్నాడు కాబట్టి ఒక్క లక్ష్మణుడితో కలిసి లోపలకు వెళ్ళాడు. లోపల
అంతఃపురములో దశరధమహారాజుగారు కైకమ్మతో కలిసి ఆ శయనాగారములో ఉన్నారు.

రాముడు తిన్నగా తీసుకుని పరదా తీసి లోపలకు వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి


దశరధమహారాజు వంక చూసారు, దశరధుడు ఎన్నడూ దశరధుడిని రాముడు ఎన్నడూ అలా
చూడలేదు. ఎందుకని ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా ధీర్గమయినటువంటి ఆ కేశములన్నీ
జల్లు కుపో యి ఇలా పిచ్చివాడిలా పడిపో యి ఉంటే ఎర్రటి చింతనిప్పుల్లా ంటి కళ్ళతో, ఇంతి౦త
వాచిపో యిన కనుగుడ్ల తో ముఖము అంతా నీటిచారికలతో అప్పటికి పదిపదిహేనుమాట్లు స్పృహ
తప్పిపో వడము వలన జీవచ్చవములా నీరసపడిపో యి రాముడిని చూసేటప్పటికి సంతోషముతో
చూసి రామారా అనే అలవాటు ఉన్నటువంటి దశరధుడు, హమ్మో ఇంక నా కొడుకు వెళ్లి పో తాడు
అని బెంగ పెట్టు కుని చూడలేక చూడలేక ఇలా రాముడివంక చూసి, చూస్తూ నే వేరొకసారి
స్పృహతప్పి ఆ తల్పము మీద పడిపో యాడు.
పడిపో తే రాముడు లోపలకు వచ్చి చూసి అంటాడు తదపూర్వం నరపతేః దృష్ట్వా రూపం
భయావహమ్, రామో2 పి భయమాసన్నః సదా స్పృష్ట్వేవ పన్నగమ్. ఎంత గొప్పమాట వేసారో
చూడండి వాల్మీకిమహర్షి. అలా చాలా సంతోషముగా వెళ్లి పో తున్నవాడు కాలుకింద ఏదో మెత్తగా
ఉందేమిటి అని చూసేటప్పటికి ఒక భయానకరమయిన త్రా చుపాము కనపడితే ఎలా ఉలిక్కిపడతాడో
దశరధమహారాజుగారిని ఆలాచూసి పుట్టిబుద్ధెరిగి తానెన్నడూ అలా ఎరగడు, పైగా ఎంత కోపములో
ఉన్నా దశరధమహారాజుగారు రాముడు కనపడేటప్పటికి ప్రసన్నడయిపో తాడు, రామా రా అని దగ్గ ర
కూర్చోపెట్టు కుంటాడు అటువంటి తండ్రి ఇవ్వాళ పిచ్చి చూపు చూస్తూ ఉన్మాదిలా, వెర్రివాడిలా ఇలా
ఒక వంకర చూపు చూసి వెంటనే స్పృహతప్పిపో తే భయపడిపో యాడుట.

అమ్మా నేను ఎప్పుడూ చూడలేదు నాన్నగారిని ఇలాగ, ఎందుకమ్మా నాన్నగారు ఇలా


ఉన్నారు అన్నాడు. ఎంత ప్రేమో చూడండి మహానుభావుడికి అని ఆయన అంటాడు అమ్మా నా వల్ల
ఏదయినా అపరాధము జరిగిందా అమ్మా, నా వల్ల పొ రబాటు జరిగిందా అమ్మా, నేనిలా నాన్నగారిని
చూస్తా ను అని అనుకోలేదు, ఇలా ఉండి పిలిపించారేమిటమ్మా నాన్నగారు కచ్చిన్మయా నాపరాద్ధ మ్
ఆజ్ఞా నాద్యేన మే పితా. అమ్మా నా వలన ఏదయినా పొ రబాటు జరిగుంటే చెప్పమ్మా దిద్దు కుంటాను,
నేనెప్పుడూ ఇలా చూడలేదు ఏంటమ్మా నాన్నగారు అలా ఉన్నారు అన్నాడు.

అని అతోషయన్మహారాజమ్ అకుర్వన్ వా పితుర్వచః, ముహూర్త మపి నేచ్ఛేయ౦ జీవితుం


కుపితే నృపే. అమ్మా నా వల్ల నాన్నగారు ఒక్కనిముషము దుఖఃపడినా సరే అటువంటి జీవితము
నాకు అక్కరలేదమ్మా, నాన్నగారు నా వల్ల జీవితాంతము సంతోషాన్ని పొ ందాలి. ఒక్కనిముషము
రాముడి వల్ల ఈ దుఖాఃన్ని పొ ందానని నాన్నగారు దుఖఃపడినా ఆ జీవితము నాకక్కరలేదమ్మా,
ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు, నాకు నిజము చెప్పవా, ఏదయినా దుర్వార్త విన్నారా.
సుమిత్రకు కానీ కౌసల్యకు కానీ ఏమయినా అనారోగ్యము చేసంి దా, తండ్రిగారికి సుస్తీ చేసంి దా
ఎందుకమ్మా ఇలా ఉన్నారు నాకు సత్యము చెప్పు తల్లీ అని అడిగారు.

అడిగితే ఆవిడ అంది కైకమ్మ ఎలా మాట్లా డిందో చూడండి నోట మాట మాట్లా డలేక స్పృహ
వచ్చి కొడుకువంక ఇలా చూడలేక దశరధమహారాజుగారు తల ఇలా వంచేసుకుని కంటివంె ట
భాష్పధారలు ఇలా ఒళ్ళో పడిపో తుంటే కట్టు కున్నటువంటి ఆ వస్త మ
్ర ంతా తడిసప
ి ో తుంటే
చేతులమీంచి ఇలా నీళ్ళు కారిపో తుంటే ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు దశరధుడు. ఆవిడ అంది
చెపుతానయ్యా మీ నాన్నగారు ఎందుకు ఏడుస్తు న్నాడో యది తద్వక్ష్యతే రాజా శుభం వా యది వా
శుభమ్, కరిష్యసి తతస్సర్వం ఆఖ్యాస్యామి పునస్త ్వహం. నీకు చెపుతాను రామా కానీ ఏం చేస్తే
మీనాన్నకు ఈ శోఖము చేస్తేకూడా ఉపశమిస్తు ందో కూడా చెపుతాను, కానీ చెప్పాక అమ్మా ఇది
నాకు అంత సుఖము కాదే అమ్మా లేకపో తే ఇది అంత కష్ట మే అని నువ్వు అనకూడదు, అది నీకు
కష్ట మే అవ్వనీ శుభమే అవ్వనీ ఏదయినాకూడా నువ్వు ఆ పని కానీ చేసావా మళ్ళీ మీ నాన్న
సంతోషముగా ఉంటాడు, అలా నువ్వు మాట ఇయ్యి రామా నీకు చెపుతాను అంది.

ఈ మాట రాముడితో మాట్టా డుతూ ఉంటే అక్కడున్న దశరధమహారాజుగారు కైక వంక చూసి
చ్ఛీ అని ఒక్కసారి తలవొంచేసుకున్నాడుట. ఇంకేం అంటాడు అంతకన్నా పాపము, ఎంత
ఆక్రో శములో ఉన్నాడో చూడండి మహానుభావుడు. అంటే ఆయన అన్నాడు రామచంద్రమూర్తి
ఏమిటమ్మా చాలా గమ్మత్తు గా మాట్లా డుతున్నావు, తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో
యదభికా౦క్షితమ్, కరిష్యే ప్రతిజానే చ రామో ద్విర్నాభిభాషతే. అమ్మా రాముడికి రెండు మాటలు
చేతకావమ్మా నీకు తెలీదా, రాముడు అంటే ఒక్కటే మాట, రాముడు కష్ట మా సుఖమా ఇవి
చూడ్డ మ్మా నువ్వు అడుగు అది ఏదయినా కానీ చేసస
ే ్తా ను. దానివల్ల నాన్నగారు సంతోషముగా
మళ్ళీ కూర్చుంటే అంతకన్నా నాకింకేమీ అక్కరలేదమ్మా, అది నాకు ఎంత కష్ట ము అవ్వనీ అఘ్నిలో
దూకెయ్యి రామా అని నాన్నగారంటే నేను దూకేస్తా నమ్మా, కానీ నాన్నగారు సంతోషముగా
కూర్చోవాలి. రామా నిష్కారణముగా నువ్వు సముద్రములో దూకి మునిగిపో అంటే ఎందుకని
అడగనమ్మా నేను దూకేసి మునిగిపో తాను కానీ నాన్నగారు సంతోషముగా కూర్చోవాలమ్మా నాకు
అది చాలు. రామా నువ్వు అరణ్యములు పట్టి వెళ్లి పో , వెళ్లి పో తానమ్మా నాకక్కరలేదు కానీ మా
నాన్నగారు సంతోషముగా కూర్చోవాలి.

అందుకని నువ్వు బెంగ పెట్టు కోకమ్మా నేనేమి చెయ్యాలి చెప్పు చేసస


ే ్తా ను అంటే ఆవిడ
అంది నేను నిన్నరాత్రి మీ నాన్న సత్యసంధుడు కదా అని పూర్వములో రెండు వరాలు ఇచ్చాడు
కదా అని రెండు వరాలు అడిగానయ్యా పద్నాలుగు సంవత్సరాలు నువ్వు నార చీరలు కట్టు కుని
పాదుకలు లేకుండా జటలు కట్టు కున్నటువంటి తలతో పద్నాలుగు సంవత్సరములు కేవలము ఒక
తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యములలో దండకారణ్యవాసము చెయ్యాలి అని వరము
అడిగాను, అదే ముహూర్తా నికి భరతుడికి పట్టా భిషేకము చెయ్యాలని అడిగాను. అప్పటినుంచి
మొదలు నరికిన చెట్టు లా ఇలా పడిపో యున్నాడు.
అందుకని రామా ఈ రెండు కోరికలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తా డు, మీ నాన్న
ఎందుకు అలా ఉన్నాడో తెలుసా నువ్వు తీరుస్తా వో తీర్చవో అని బెంగ పెట్టు కున్నాడయ్యా అంది.
అంటే ఆయన అన్నాడు అమ్మా ఎంత మాట అన్నావమ్మా నాన్నగారు అడగడము నేను
కాదనడమా, తప్పకుండా చేసేస్తా నమ్మా పద్నాలుగేళ్లు అడివికి వెళ్ళడానికి నాన్నగారింత బెంగ
పెట్టు కోవాలా, భరతుడికి పట్టా భిషేకము చెయ్యడానికి నాకు తెలియలేదమ్మా ఈ విషయము,
నిజముగా భరతుడు రాజ్యము చేద్దా ము అని అనుకుంటున్నాడు అని నాకు ఇంత పిసరు తెలిసుంటే
రాజ్యము ఏమిటమ్మా అహం హి సీతా౦ రాజ్యం చ ప్రా ణానిష్టా న్ ధనాని చ, హృష్టో భ్రా త్రే స్వయం
దద్యా౦ భారతాయాప్రచ ోదితః.

భరతుడికన్నా నాకు ప్రపంచములో ఎవరెక్కువమ్మా సీతను అడిగితే ఇచ్చేస్తా ను, రామా నీ


ప్రా ణాలు కావాలంటే భరతుడి ముందు ప్రా ణాలు విడిచిపెట్టి పడిపో తాను, అన్నయ్యా నాకు రాజ్యము
కావాలన్నయ్యా అంటే సంతోషముగా రాజ్యము ఇచ్చేస్తా ను, ధనము అంతా ఇచ్చేయ్యన్నయ్యా అంటే
ఇచ్చేస్తా ను, ఇది అడగడానికి నాకు తెలియలేదమ్మా భరతుడికి ఆ కోరిక ఉందని, తెలియక నేను
యవ్వరాజ్య పట్టా భిషేకము చేసుంటానని అన్నానమ్మా, ఎంత సంతోషమమ్మా తమ్ముడు
పట్టా భిషేకము చేసుకుంటే ఏమడిగాడమ్మా నన్ను ఏమయినా పెద్ద కోరిక అడిగాడా, రాజ్యము
చేస్తా ను అంటున్నాడు అంతేకదా. తప్పకుండా తమ్ముడికి యవ్వరాజ్య పట్టా భిషేకము చేసెయ్యండి,
కానీ అమ్మా నేను ఎందుకు భాధ పడుతున్నానో తెలుసామ్మా.

ఒకే ఒక్క విషయానికి భాధ పడుతున్నానమ్మా అళీక౦ మానసం త్వేక౦ హృదయం


దహతీవ మే, స్వయం యన్నాహ మాం రాజా భారతస్యాభిషేచనమ్. నాన్నగారు నన్ను పిలిచి
రామా భరతుడికి యవ్వరాజ్య పట్టా భిషేకము చేస్తు న్నాము నాన్నా అని నాన్నగారు చెప్తే నేను ఎంత
సంతోషపడిపో దునమ్మా అది నా గుండెను కాల్చేస్తో ందమ్మా అన్నాడు. ఎందుకని నాన్నగారు
నిన్నరాత్రి పిలిచి నీకు పట్టా భిషేకము చేస్తా ను అన్నాడు కదా ఇవ్వాళ భరతుడికి పట్టా భిషేకము
చేసస
ే ్తా ను అంటే నేనేమయినా అనుకుంటాను అనుకున్నారామ్మా నాన్నగారు. నాన్నగారు చెపితే
చెయ్యకపో వడము ఉంటుందా అమ్మా, నాన్నగారు చెపితే అఘ్నిలో దూకేస్తా నమ్మా నేను, అలా
కాకుండా ఇంత భాధపడిపో వడము ఏమిటమ్మా నాన్నగారు, దీనికి నా గుండె కాలిపో తోంది, ఆయన
అంత భాధపడిపో వడము ఎందుకమ్మా, పిలిచి రామా భరతుడికి పట్టా భిషేకము చేసేస్తా ను అంటే
ఎంత సంతోషముగా జరుగునమ్మా పట్టా భిషేకము, ఎందుకమ్మా నాన్నగారు అంత భాధపడతారు.
నాకు అన్నిటికన్నా ఇంకొక ఆశ్చర్యము ఏమిటో తెలుసామ్మా యావత్ త్వం న వనం
యాతః పురాదస్మాద్ అని ఒకమాట అంటే ఆవిడంది, అమ్మా నాన్నగారంత భాధపడుతూ
ముఖప్రక్షాలనము చేసుకున్నట్టు లేరు, అలా కూర్చున్నారెందుకమ్మా నాన్నగారు, ఆయన కోరిక
నేను తీరుస్తా నమ్మా తొందరగా వేగము కలిగినటువంటి గుర్రా లమీద కబురు చెయ్యండి భరతుడికి,
భరతుడిని పిలిపించండి, పిలిపించి భరతుడికి పట్టా భిషేకము చేసెయ్యండి నేను ఇప్పుడే బయలుదేరి
అమ్మా దండకారణ్యానికి వెళ్లి పో తానమ్మా, నాన్నగారిని మాత్రము సుఖముగా సంతోషముగా
కూర్చోమనండమ్మా.

ఆయన అలా కూర్చుంటే నేను చూడలేనమ్మా అంటూంటే ఆవిడంది ఏమీలేదయ్యా యావత్


త్వం న వనం యాతః పురాదస్మాదభిత్వరన్, పితా తావన్న తే రామ స్నాస్యతే భోక్ష్యతే2 పి వా. మీ
నాన్న ఒక శపధము చేసాడయ్యా, ఏమో రాముడు వెడతాడో వెళ్లడో దండకారణ్యానికి అని
అనుమానపడుతున్నాడు నువ్వు దండకారణ్యానికి వెళ్లి పో యేవరకు ఈ ఆయోధ్యానగరము
దాటిపో యేవరకు స్నానము చెయ్యను, భోజనము చెయ్యను అని ప్రతిజ్ఞ చేసాడు. అందుకని మీ
నాన్న స్నానము చేసి అన్నము తిని సుఖముగా కూర్చోవాలంటే నువ్వు తొందరగా వెళ్లి పో వాలి
రామా అంది. అంటే కొరడా పెట్టి కొట్టిన గుర్రము పిల్ల చూసినట్టు చూసాడుట, చూసి అయ్యో అయ్యో
అమ్మా నేను ఉంటే రాజ్యము తీసుకుంటాను అనుకుంటున్నారా.

నాహమర్ధ పరో దేవి లోకమావస్తు ముత్సహే, విద్ధి మామ్ ఋషిభిస్తు ల్యం కేవలం
ధర్మమాస్థితమ్. అమ్మా రాముడు రాజ్యము కోసము, ధనము కోసము, ఐశ్వర్యము కోసము
ప్రా కులాడేవాడు కాదమ్మా, నాకన్నవాళ్ళకి నే చెప్పుకోనా నా గురించి మీకు తెలీదామ్మా,
నాహమర్ధ పరో దేవి లోకమావస్తు ముత్సహే, విద్ధి మామ్ ఋషిభి నేను ఋషి లాంటి వాడినమ్మా,
నాకు పితృవాఖ్య పరిపాలనము తప్ప ఇంక ఏదీ అక్కరలేదమ్మా, నాన్నగారు చెప్పినమాట
కొడుకుగా నేను ఆచరించాను నాకు చాలు, నేను వెళ్లి పో తాను. పరమసంతోషముగా వెళ్లి పో తాను,
దానికెందుకమ్మా అంత స్నానము చెయ్యను భోజనము చెయ్యను ఎందుకమ్మా నాన్నగారు అంత
పట్టు బట్టా రు. అయ్యయ్యో పిచ్చినాన్నగారు నేను వెళ్లనని బెంగపెట్టు కున్నారా, ఇప్పుడే
వెళ్లి పో తున్నాడమ్మా రాముడు, మీరు బెంగపెట్టు కోకండి.
అమ్మా నాకు ఒక్కటే అర్ధ ము కావడము లేదు, న నూనం మయి కైకేయి కించిదాశంససే
గుణమ్, యద్రా జాన మావోచస్త ్వ౦ మమేశ్వరతరా సతీ. అమ్మా రాత్రి దశరాధమహారాజుగారిని నువ్వు
రెండు వరాలు అడిగాను నేను వెళ్లి పో వాలని, భరతుడికి పట్టా భిషేకము చెయ్యాలని
అడిగానంటున్నావు అమ్మా నీకయినా తెలియదా నాగురించి. రాముడు ఒకటి భరతుడు
ఒకటీనామ్మా నీకు, నీకు రామభరతులు ఇద్ద రూ ఒక్కటేనమ్మా, నీకు ఎప్పుడూ ఇద్ద రు కుమారుల
తల్లివే నువ్వు. నువ్వు నన్ను పిలిచి రామా నువ్వు అరణ్యవాసానికి వెళ్లి పో , భరతుడు
పట్టా భిషేకము చేసుకుంటాడు అంటే నేను సంతోషముగా వెళ్లి పో నా అమ్మా, దానికి రెండు వరాలు
అడిగావా. అయ్యో అమ్మా నా గుణాలు నీకు ఇవా అర్ధ మయ్యాయి, ఎంత అమాయాకురాలవమ్మా,
ఇప్పుడే వెళ్లి పో తున్నాను, కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకు నీ పాదాలకు నమస్కారము చేసి
వెళ్లి పో వచ్చామ్మా అని అడిగాడు. ఎందుకని వెళ్లి పో తే తప్ప స్నానము చెయ్యడు అన్నము తినడు
అందని తొందరగా నమస్కారము చేసి వెళ్లి పో రామా అంది ఆవిడ.

అంటే ఈ మాటలు విని నాహమర్ధ పరో దేవి లోకమావస్తు ముత్సహే, విద్ధి మామ్
ఋషిభిస్తు ల్యం కేవలం ధర్మమాస్థితమ్. అమ్మా నాన్నగారు సంతోషిస్తే అఘ్నిలో దూకేస్తా నమ్మా
అని అమాయకముగా రాముడు ధర్మప్రతిజ్ఞ కు కట్టు బడినవాడయి, తండ్రి యందు అంత ప్రేమతో
మాట్లా డుతుంటే తట్టు కోలేక నా మాట కాదనే కొడుకు పుట్ట నందుకు ఇప్పుడు ఏడుస్తు న్నాను, నా
మాట వినే కొడుకు పుట్టా లి నా మాట వినే కొడుకు పుట్టా లి తండ్రిమాట కొడుకు వినాలని ఇన్నాళ్లు
అనుకున్నాను, నా మాట వినే కొడుకు పుట్ట డము నాకెంత శాపము అని ఇప్పుడు ఏడుస్తు న్నాను
కైకా, ఈ రాముడు నన్ను ఎదిరించడు, ఇది నా దుఃఖానికి కారణమయినది, నా మరణానికి
కారణమవుతోందని ఆ భాధ చేత స్పృహ తప్పి మరొకసారి ఒరిగిపో యాడుట దశరధమహారాజు.

మూర్ఛలో పడిపో యుంటే తల ఇలా పైకత్తి


ె నీళ్ళు పొ య్యలే కైక, దేవతలు అంత
ఆవహించారు ఆవిడను. అలా స్పృహ తప్పి పడిపో యున్న తండ్రికి కొద్దిగా నీళ్ళు పడదామంటే
నువ్వు వెడితేతప్ప నీళ్ళు తాగడు అన్నము తినడు అంది, అందుకని నేను వెళ్లి పో తే నాన్నగారు
నీళ్ళు తాగుతారు, చాలు స్పృహలోకి వస్తా రని కన్నులవెంట నీరు కారుస్తూ తండ్రి పాదములు గట్టిగా
పట్టు కుని నాన్నగారండీ ఇలా పట్టి నమస్కారము చేసినప్పుడు రామవర్మా అహంభో అభివాదయే
అని నమస్కరిస్తు ంటే రామ అని లేచి కౌగలించుకునేవారు. అటువంటి నాన్నగారు ఇవ్వాళ నేను
వెడితే తప్ప అన్నము తిననని శపధము చేసారని గట్టిగా పాదములు పట్టి నమస్కరించి, కైకమ్మ
పాదములు పట్టి నమస్కరించి రాముడు వెళ్లి పో తున్నాడుట.

వెనకనున్న లక్ష్మణుడికి వచ్చింది కడుపులోంచి మంట, కన్నులవెంట నీరు కారిపో తూ,


వదిరిపో తూ, పెదవులు అదిరిపో తూ, ముక్కుపుటాలు ఎగరేస్తూ ధనుస్సు గట్టిగా పట్టు కుని రాముడి
వెనకాతల తోక తొక్కిన నల్ల త్రా చు ఎలా వెడుతుందో పుట్ట లోకి ఎలా వెడుతుందో అలా
వెడుతున్నాడుట రాముడితో కలిసి. ఇద్ద రూ కలిసి బయటకు వచ్చారు, అక్కడ పట్టా భిషేకానికి
కావలిసినటువంటి సంభారాలు ఉన్నాయి, దానికి ప్రదక్షిణము చేసాడు, తనకి జరగకపో వచ్చు,
భరతుడికి పట్టా భిషేకము చెయ్యడానికి ఉన్న సామాగ్రి, ఇది ఒకరిని రాజును చెయ్యబో తోంది,
పరమపవిత్రము అని నమస్కారము చేసాడుట.

కాంతి తరగలేదు, మనస్సులో వికారములేదు, కళ్ళలో బాధలేదు, కంటివెంట ఏడ్పులేదు,


రాజ్యము పో యిందని బెంగలేదు, తండ్రి తొందరగా అన్నము తిని స్వస్థ తగా కూర్చుంటే చాలు
అనుకున్నాడుట, అనుకుని గబగబా బయలుదేరి అమ్మ అనుజ్ఞ తీసుకుని ఆశీర్వచనము తీసుకుని
బయలుదేరదామని గబగబా లక్ష్మణుడితో కలిసి కౌసల్య ఉన్న గృహములోకి వెళ్ళాడు. ఒక్కొక్క
కక్ష్య దాటుతుంటే వృద్ధు లయినటువంటి వారు కొంతమంది బయట ఉన్నారు, ఆ తరువాత
కొంతమంది వృద్ధ బ్రా హ్మణులు ఉన్నారు, ఆ తరువాత కొంతమంది బాలురు ఉన్నారు, స్త్రీలు
ఉన్నారు, సేవచేసేటటువంటి వారున్నారు.

వీరందరినీ దాటి మహానుభావుడు రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళి చూసేసరికి


పూజాగృహములో మౌనము వహించి, తన కుమారుడికి ఇంక కొంచము సేపట్లో యవ్వరాజ్య
పట్టా భిషేకము జరుగుతోందని పరమ సంతోషముతో రాత్రంతా శ్రీమహావిష్ణు విని పూజ చేసినదయి
మౌనముతో కళ్లు మూసుకుని ఆ అఘ్నివేది ముందు కూర్చుని నమస్కరిస్తు న్నటువంటి కాంతితో
కూడినటువంటి నిత్యము వ్రతములు చేసి చేసి చేసి సుస్ఖించపో యినదయి హమ్మయ్య కొడుక్కి
పట్టా భిషేకము జరుగుతోంది చాలు జీవితములో అని పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు ఈవిడ్ని
కట్టు కున్నా బిడ్డ లు పుట్ట లేదని తన కళ్ళముందే ఇంకొక భార్యను కట్టు కుంటే అవును నాకు బిడ్డ లు
లేరు కాబట్టి భర్త వేరొకరిని పెళ్లి చేసుకున్నాడని మనసు సరిపెట్టు కున్నది, ఆవిడకు కూడా పిల్లలు
లేరని వేరొకరిని కట్టు కుంటే అవును మాకిద్దరికీ లేరని వేరొకరిని కట్టు కుంటాడని మనసు
సరిపెట్టు కున్నది పెద్దభార్య అయినా ఎన్నడూ తన అంతఃపురమునకు రాకపో యినా అవును నా
దగ్గ రకు వచ్చి ప్రయోజనము ఏమిటి ఏమిటి అని మనస్సు సరిపట
ె ్టు కుంటే, ఇవ్వాళ వ్రతములు చేసి
దైవానుగ్రహముతో నాకొక బిడ్డ డు పుట్టి సకలగుణాభిరాముడయి తండ్రిని అపారముగా మురిమింప
చేసి నేటికి యవ్వరాజ్య పట్టా భిషేకము పొ ంది రాజమాత కౌసల్య అనేటటువంటి కీర్తిని
నాకివ్వబో తున్నాడు నా కొడుకు, నా జీవితము ధన్యత పొ ందినరోజని పరమసంతోషముతో
శ్రీమహావిష్ణు వుని ప్రా ర్ధ న చేస్తు న్న కౌసల్యామాతను చూసి తడబడుతున్న అడుగులతో
కూడినవాడయి లోపలకు వెళ్లా డుట రామచంద్రమూర్తి.

సర్వం శ్రీ ఉమామహేశ్వర పరఃబ్రహ్మార్పణమస్థు


స్వస్తి

You might also like