You are on page 1of 6

4 మార్కుల ప్రశ్నలు- జవాబులు

1. కిరణజన్య సంయోగక్రి యకు అవసరమై న ముడి పదార్థా ల గురించి రాయండి? (AS-1)


జ. కిరణజన్య సంయోగక్రి యకు కావలసిన ముడి పదార్థా లు రెండు రకాలు అవి..
1. బాహ్య కారకాలు: కాంతి, కార్బన్ డై ఆక్సైడ్, నీరు
2. అంతర కారకాలు:పత్రహరితం
1. బాహ్య కారకాలు:1.కాంతి: కాంతి సూర్యుని నుండి లభించే శక్తి వనరు. ఇది విద్యుదయస్కాంత వికిరణం. మనకు కనబడే దృశ్యకాంతి
400 నుండి 700nm ల తరంగదై ర్ఘ్యం మధ్య ఉంటుంది. వీటిలో ఎరుపు, నీలివర్ణా లు ఉంటాయి. సూర్యకాంతిలోని ఈ వర్ణా లు ఆకులోని
హరిత రేణువులలో ఉండే థై లకాయిడ్ పొర మీద ఉన్న పత్రహరిత అణువులు కాంతి శక్తి ని శోషించి కిరణజన్య సంయోగక్రి య చర్యలను
ప్రా రంభిస్తా యి.
2.నీరు:మొక్కలు భూగర్భంలోని వేరు వ్యవస్థ మట్టి రేణువులతో కూడిన నీటిని పీల్చుకొని మొక్కలోని ప్రతిభాగానికి అందజేస్తా యి.
3. కార్బన్ డై ఆక్సైడ్(CO2): కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోని, నీటిలో కరిగి ఉండే అకర్బనిక ముడి పదార్థం. ఇది సహజ
వాతావరణంలో 0.03 శాతంగా ఉంటుంది. ఇది పత్ర రంధ్రా ల ద్వారా కణాలలోకి విసరణం చెందుతుంది. పత్రరంధ్రా లు ఆకు అడుగు
భాగాన అధికంగా ఉంటాయి.
అంతర కారకాలు: 
4. పత్రహరితం:కిరణజన్య సంయోగక్రి యకు పత్రా లు ముఖ్య స్థా వరం. పత్రా లు ఆకుపచ్చగా ఉండటానికి కారణమై న పత్రహరితం హరిత
రేణువులలో ఒక భాగం. ఆకుపచ్చ మొక్కలన్నింటిలోనూ త్వచంతో కూడిన హరితరేణువులు ఉంటాయి. పత్రా లలోని పత్రా ంతర
కణాలలో ముఖ్యంగా హరిత రేణువులు ఉంటాయి.
ఇతర కారకాలు: ఉష్ణో గ్రత, ఎంజై ములు మొదలై న కారకాలు కూడా కిరణజన్య సంయోగక్రి య జరుగుటలో సహకరిస్తా యి.

2.పోషకాహార లోపం వల్ల వచ్చే న్యూనతా వ్యాధులపై అవగాహన పెంచుకోవాలంటే డాక్టరు గారిని ఏఏ ప్రశ్నలు అడుగుతావు?
(AS - 2)
జ.పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులపై సమాచారం కొరకు కింది ప్రశ్నలు అడుగుతాను.
1. పోషకాహార లోపం ఏ వయస్సు వారికి ఎక్కువ నష్టం కలిగిస్తు ంది?
2. పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులకు ఏదై నా ప్రత్యేక చికిత్స ఉన్నదా?
3. గ్రా మీణుల్లో సహజంగా పోషకాహార లోపాలు ఏర్పడటానికి కారణం ఏమిటి?
4. ఆహారంలో ముఖ్యమై న పోషక విలువలు ఏవి?
5. పోషకాహార లోపాలను సరిదిద్దడానికి ఏవై నా సులభమై న చిట్కాలు చెప్పండి?
6. పోషకాహార లోపాల సవరణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది?
3. హరిత రేణువును పటం సహాయంతో వివరించండి? (AS-1)

 
జ. 1. హరిత రేణువులు మొక్క కణంలోని ప్రత్యేక కణాంగాలలో ఉంటాయి. ఇవి త్వచంతో కూడిన కణాంగాలు. ఇందులో మూడు
త్వచాలు ఉంటాయి.
2. మూడో త్వచంలో దొంతరల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ థై లకాయిడ్ దొంతరలను ‘గ్రా నా’ అంటారు. గ్రా నాలోనే కాంతిశక్తి
గ్రహించబడుతుంది.
3. దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. దీనిని స్ట్రోమా అంటారు. స్ట్రోమాలో జరిగే ఎంజై ముల చర్యల వలన గ్లూ కోజ్
సంశ్లే షించబడుతుంది.
4. హరిత రేణువుల్లో ని కాంతిని శోషించే పదార్థా లను ’కిరణజన్య సంయోగక్రి యా వర్ణదాలు‘ అంటారు.
5. హరితరేణువుల్లో ని థై లకాయిడ్ దొంతరలో రెండు ప్రధానమై న పత్రహరిత వర్ణదాలు ఉంటాయి. అవి1. క్లో రోఫిల్ ’ఎ’ (నీలి-ఆకుపచ్చ
వర్ణదం) ,2. క్లో రోఫిల్ ’బి’(పసుపు- ఆకుపచ్చ)గా ఉంటుంది.
6. హరితరేణువులోని గ్రా నాలో కాంతిచర్య, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది.

4. జీవ ప్రపంచమంతా ఆహారం కోసం మొక్కల మీదనే ఆధారపడటం అనివార్యమై ంది. మొక్కల ఆహారం తయారుచేసే విధానాన్ని
నీవు ఎలా అభినందిస్తా వు? or 5. "సజీవ ప్రమాణానికి" కిరణజన్య సంయోగక్రి య ఒక్కటే శక్తి మూలాధారమని ఎలా
చెప్పగలవు? 
జ. జీవ ప్రపంచమంతా ఆహారం కోసం మొక్కల మీదనే ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఆధారపడుతోంది. కారణం ఆహారం తయారుచేసే
ప్రక్రి య అనగా కిరణజన్య సంయోగక్రి య కేవలం మొక్కల్లో నే జరుగుతుంది. మొక్కల్లో ఈ ప్రక్రి య జరిగే ప్రధానభాగం ఆకు. అందుకే
ఆకును ‘ఆహార కర్మాగారం’ అంటారు. ఆకు ముఖ్యంగా పత్రహరితమును కలిగి ఉండి సౌరశక్తి ని గ్రహించి రసాయనిక శక్తి గా మార్చడంలో
ఒక అద్భుతమై న, సహజమై న యంత్రంగా పరిగణించవచ్చు. 
ఇలా సౌరశక్తి ని ఉపయోగించి ఆకువంటి మరోయంత్రా న్ని మానవుడు తనకున్న శాస్త్రీయ విజ్ఞా నంతోనూ, సాంకేతిక నిపుణతతోనూ,
నేటివరకు తయారు చేయలేకపోయాడు. ఈ ప్రక్రి య వలననే భూమిమీద ఉండే జీవ రాసులన్నింటికి ఆహారాన్ని అందించడంతో పాటు
మానవునికి కలప, ఔషధాలు, ఇంధనం వంటి నిత్యావసరాలను కూడా తీర్చుతుంది. అలాగే ప్రా ణవాయువు వంటి ఆక్సిజన్‌ను
సమకూర్చుతుంది. ఇంత‌టి గొప్ప యంత్రా ంగాన్ని ప్రకృతి మనకు కానుకగా అందించడం అభినందనీయమే.

6. పోషకాహార లోపం అంటే ఏమిటి? దీనివల్ల కలిగే 2 న్యూనతా వ్యాదుల గురించి రాయండి? (AS-1)
జ. మనం తీసుకొనే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థా లు తగిన పరిమాణంలో లేకపోవడాన్ని పోషకాహార లోపంగా
పేర్కొంటారు.
1. క్వాషియార్కర్: 
1. ఇది ప్రొ టీన్‌‌స లోపం వలన కలిగే వ్యాధి
2. శరీరంలోని కణాంతరాలలో నీరు చేరి శరీరం ఉబ్బినట్లు గా కనిపిస్తు ంది.
3. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది.
4. కాళ్ళు, చేతులు, ముఖం ఉబ్బి ఉంటాయి
5. పొడిబారిన చర్మం విరేచనాలతో బాధపడుతూ ఉంటారు.
2.మెరాస్మస్:
1. ఈ వ్యాధి ప్రొ టీన్‌లు, కెలోరీల లోపం వల్ల కలుగుతుంది.
2. సాధారణంగా తల్లి మొదటికాన్పు, రెండవ కాన్పుకు మధ్య తక్కువ వ్యత్యాసంతో పుట్టే పిల్లల్లో సంభవిస్తు ంది.
3. ఈ వ్యాధిగ్రస్తు ల పిల్లలు నీరసంగా బలహీనంగా, ఎముకలు తేలిన శరీరంతో కనిపిస్తా రు.
4. కండరాలలో పెరుగుట లోపం, కీళ్ళవాపుతో బాధపడతారు
5. పొడిబారిన చర్మం, విరేచనాలు మొదలై న లక్షణాలు ఉంటాయి.
7. కిరణజన్య సంయోగక్రి యలో కార్బన్ డై ఆక్సైడ్ ఆవశ్యకతను ప్రయోగపూర్వకంగా రాయండి?(AS - 3)

ఉద్దే శ్యం:కిరణజన్య సంయోగ క్రి యలో కార్బన్ డై ఆక్సైడ్ ఆవశ్యకతను నిరూపించుట


పరికరములు: కుండీ మొక్క, వెడల్పుమూతి గల గాజుసీసా, రబ్బర్ కార్‌‌క, KOH అయొడిన్ (రసాయన పదార్థా లు) 
ప్రయోగ విధానం: 
1) ఒక వెడల్పు గల గాజు సీసాను తీసుకొనవలెను. 
2) అందులో KOH ద్రా వణాన్ని తీసుకొనవలెను. KOH కు CO2 ను పీల్చే గుణం ఉంది.
3) నిలువుగా చీల్చబడిన ఒక బెండు బిరడాను తీసుకొని గాజుసీసా మూతికి బిగించవలెను.
4) మొక్కలో ఎంపికచేసుకున్న ఆకును సగభాగం సీసాలోనికి, సగభాగం బయటకి ఉండేవిధంగా అమర్చవలెను.
5) ఈ ప్రయోగ అమరికను సూర్యరశ్మిలో ఉంచవలెను.
6) కొన్ని గం॥తర్వాత సీసాలో అమర్చిన ఆకును, మొక్కలో మరోఆకును తీసుకొని అయొడిన్ ద్రా వణంతో పరీక్షి ంచవలెను.
ఫలితం:
1. గాలి, వెలుతురు సోకిన ఆకును అయొడిన్ పరీక్ష చేయగా నీలి-నలుపు రంగులోకి మారినది.
2. సీసాలోపల ఉన్న ఆకును పరీక్షి ంచగా అది నీలి నలుపురంగులోకి మారలేదు. కారణం సీసాలోని KOH ద్రా వణం CO2 ను పీల్చివేసింది.
కావున కిరణజన్య సంయోగ క్రి య జరగలేదు.
నిర్ధా రణ:ఈ ప్రయోగం - కిరణజన్య సంయోగక్రి యకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని తెలుస్తు ంది.
గమనిక:పిండి పదార్థం తొలగించబడిన మొక్క ఈ ప్రయోగానికి అవసరం. కనుక కనీసం ఒక వారంరోజులు ఆ మొక్కను చీకటిలో
ఉంచాలి. ఆకులో ఇదివరకే ఉన్న పిండిపదార్థం తొలగించబడుతుంది.

8.కిరణజన్య సంయోగక్రి యకు కాంతి అవసరమని ఎలా నిరూపిస్తా వు?(AS - 3)

జ.ఉద్దే శ్యం:కిరణజన్య సంయోగక్రి యకు కాంతి అవసరమని నిరూపించుట 


పరికరాలు:కుండీలో మొక్క, లై ట్ స్క్రీన్, అయోడిన్
పయోగ విధానం: 
1. కుండీలో ఉన్న ఆరోగ్యమై న మొక్కను తీసుకొని, 2 రోజులు దానిని చీకటిలో ఉంచాలి. దీనివల్ల ఆకులోని పిండిపదార్ధం పూర్తి గా
అదృశ్యమవుతుంది.
2. ఒక ఆకును కాంతి సోకకుండా లై ట్‌స్క్రీన్ అమర్చాలి.
3. లై ట్ స్క్రీన్ మీద ఆకారపు నమూనా ఉంటుంది.
4. మొక్కకు తగినంత నీరుపోసి 4-5 గం॥ఎండలో ఉంచాలి. మూతమీద చెక్కిన ఆకారపు నమూనా ద్వారామాత్రమే ఆకుపై
కాంతి ప్రసరిస్తు ంది.
5. మొక్కనుండి ఆకును వేరుచేసి, లై ట్ స్క్రీన్‌ను కూడా ఆకు నుండి తీసివేయాలి.
6. ఆకులో పిండి పదార్థం తెలుసుకొనుటకు అయొడిన్ పరీక్ష చేయాలి.
7. ఆకు కాంతి గ్రహించిన చోటు మాత్రమే నీలంగా మారుతుంది. నీలంరంగు కలిగిన నమూనాలో కిరణజన్య సంయోగక్రి య
జరిగినది.
8. కాంతి గ్రహించని నమూనా చుట్టు నీలంగా మారలేదు. అంటే ఆ భాగంలో కిరణజన్య సంయోగక్రి య జరగలేదు.
నిర్ధా రణ:దీనినిబట్టి కిరణజన్య సంయోగక్రి యకు కాంతి అవసరమని ఋజువు చేయబడినది.
9. కాంతిచర్యలు, నిష్కాంతి చర్యల మధ్య తేడాలు రాయండి?
కాంతి చర్య నిష్కాంతి చర్య
1. కిరణజన్య సంయోగక్రి యలో మొదటి దశ 1. కిరణజన్య సంయోగక్రి యలో రెండవదశ
2. హరితరేణువులోని థై లకాయిడ్(గ్రా నా)లో జరుగుతుంది. 2. హరితరేణువులోని అవర్ణి క (స్ట్రోమా)లో జరుగుతుంది.
3. కాంతిశక్తి ని ఉపయోగించుకొని రసాయనిక కర్బన 3. కాంతి శక్తి ప్రమేయం లేకున్నా రసాయనిక శక్తి ని ఉపయోగించుకొని
పదార్థా లు ఏర్పడతాయి. శక్తి గా మార్చబడుతుంది.
4. ATP,NADPH2 ను అంత్య ఉత్పన్నాలు 4. పిండిపదార్థా లు (గ్లూ కోజు) అంత్య ఉత్పన్నాలు
5. శక్తి గ్రా హకాలు ఏర్పడతాయి. 5. శక్తి గ్రా హకాలు వినియోగించబడతాయి
6. దీనిలో ప్రధానంగా ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి 6. దీనిలో క్షయకరణ చర్యలు జరగుతాయి
7. దీనిలో నీటికాంతి విశ్లే షణ- జరుగుతుంది. 7. దీనిలో కార్బన్ స్థా పన జరుగుతుంది.
8. ఆక్సిజన్ వాయువు విడుదలగును 8. ఆక్సిజన్ విడుదల కాదు.
2 మార్కుల ప్రశ్నలు- జవాబులు
1. కిరణజన్య సంయోగ క్రి య అంటే ఏమిటి? సమీకరణం సూచించండి?
జ.పత్రహరితం కలిగిన మొక్కలు సూర్యకాంతిలో కార్బన్ డై ఆక్సైడ్, నీటిని ఉపయోగించుకొని కార్బోహై డ్రే ట్స్ (పిండి పదార్థా లు)ను
తయారుచేసుకొనే ప్రక్రి యను ‘కిరణజన్య సంయోగక్రి య‘ అంటారు. ఇది సరళపదార్థా లను సంక్లి ష్ట పదార్థా లుగా తయారుచేసే కాంతి
రసాయన చర్య. ఈ క్రి యలో గ్లూ కోజు, నీరు, ఆక్సిజన్ అంత్య పదార్థా లుగా ఏర్పడతాయి.
సమీకరణం:

 
2. ఆహారనాళంలో వివిధ అవయవాల ద్వారా ఆహారం ప్రయాణించే మార్గా న్ని ప్లో చార్టు ద్వారా తెలపండి?
జ. నోరు ఆహార వాహిక్ధజీర్ణా శయం్ధచిన్న ప్రే గ్ధు పెద్ద ప్రే గు పాయువుుుపురీషనాళం 
3. విటమినులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జ. విటమినులను రెండు రకాలుగా వర్గీ కరించవచ్చు. 
అవి 1. నీటిలో కరిగేవి: B - కాంప్లె క్స్, విటమిన్ - C
2. కొవ్వులో కరిగేవి: A,D,E,K విటమినులు
4. ఆరోగ్యవంతునికి అజీర్తి కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (AS - 1)
జ.ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అజీర్తి కలగకుండా కింది జాగ్రత్తలు పాటించాలి.
1) మెత్తటి సమతుల ఆహారం తీసుకోవడం
2) నెమ్మదిగా ప్రశాంతంగా తినడం 
3) ఆహారాన్ని బాగా నమిలి తినడం
4) ద్రవరూప ఆహారం తీసుకుంటే మంచిది
5) తిన్నవెంటనే శరీరం కాస్త చలనస్థి తిలో ఉండాలి.కాని వ్యాయామం వంటి పనులు చేయకూడదు.
5. ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రి యా ఎంజై ముల పాత్ర గురించి రాయండి? (AS - 1)
జ.సంక్లి ష్టమై న కార్బొహై డ్రే ట్‌లు, ప్రొ టీన్‌లు, లిపిడ్‌‌స, సరళ అణువులుగా ఎంజై మ్‌ల సహాయంతో విడగొట్టబడతాయి. విడగొట్టబడిన
ఆహారం చిన్నప్రే గులో శోషించబడి సూక్ష్మ చూషకాల ద్వారా రక్తంలో కలుస్తు ంది. అక్కడినుండి ప్రతి కణానికి అందించబడుతుంది. ఈ
ఎంజై ములు నీటిలోని లాలాజల గ్రంథులు, జీర్ణా శయంలో జఠరరస గ్రంథులు, క్లో మ గ్రంథులు, పేగులోని గ్రంథుల నుండి ఉత్పత్తి
అవుతాయి.
6. పోషకాహార లోపం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలుగా ఉంది? (AS - 1)
జ.మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థా లు లోపించడాన్ని పోషకాహార లోపం అంటారు. పోషకాహార లోపం
3 రకాలుగా విభజించవచ్చు.
1. కెలోరీల పరమై న పోషకాహార లోపం
2. ప్రొ టీన్‌ల సంబంధిత పోషకాహార లోపం
3. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం
7.పోషణ పాఠం చదివిన తర్వాత నీ ఆహారపు అలవాట్లలో ఏఏ మార్పులు చేసుకుంటావు? (AS - 6)
జ.1. అన్ని పోషక విలువలు కలిగిన సంతులిత ఆహారం తీసుకుంటాను.
2. ప్రతిరోజు నిర్ది ష్ట సమయాలలో ఆహారం తీసుకుంటాను
3. నేను తీసుకొనే ఆహారంలో పీచుపదార్థా లు ఉండేలా జాగ్రత్త తీసుకుంటాను. దీనివలన మలబద్ధకం నివారించవచ్చు.
4. ప్రతిరోజూ 4-5 లీటర్ల నీటిని త్రా గుతాను. జీర్ణా శయంలో ఆమ్లత్వం పెరగదు.
5. తాజా ఆకుకూరలు లేదా కూరగాయలు, పాలు గుడ్లు ప్రధానంగా ఉండేలా రోజువారీ ఆహారంతో జాగ్రత్త పడతాను.
8. రోగికి గ్లూ కోజు ఎక్కించినపుడు అది శక్తి ని ఎలా అందిస్తు ంది? (AS - 1)
జ.రోగి పూర్తి గా నీరసించినపుడు తప్పనిసరిగా గ్లూ కోజు సిరల ద్వారా ఎక్కించాల్సిన అవసరం ఉంది. గ్లూ కోజు అనేది శక్తి నిచ్చే సరళ
పదార్థం. ఇది త్వరగా రక్తంలో కలిసిపోయి కణాలకు శక్తి ని అందిస్తు ది. దీనివలన అలసట, నీరసం, త్వరగా తగ్గి జీవక్రి యా స్థా యి
మెరుగుపడుతుంది.
9. తగినన్ని నీళ్ళు తాగడం మంచిదని సూచిస్తా రు. ఎందుకు? (AS - 2)
జ.నీరు విశ్వద్రా వణి. నీరు అనేక జీవరసాయనిక చర్యలకు మాధ్యమం. జీర్ణమై న ఆహార పదార్థా లు, హార్మోనులు, విసర్జక పదార్థా లు
శరీరంలో ఒక చోటనుండి మరొక చోటుకు నీటిద్వారా రవాణా జరుగుతుంది. నీరు శరీర ఉష్ణో గ్రతను క్రమబద్ధం చేయటంలో
తోడ్పడుతుంది. రోజూ తగినంత నీటిని తాగడం వల్ల జీర్ణా శయంలో ఆమ్లత్వం ఏర్పడదు.
10.పోషకాహార లోపం ఏర్పడటానికి కారణం ఏమిటి? (AS - 1)
జ.పోషకాహార లోపం ఏర్పడటానికి సహజంగా కింది కారణాలు ఉంటాయి.
1. నిరక్షరాస్యత లేదా పోషక విలువలపై సరై న అవగాహన లేకపోవడం 
2. తరచుగా ఉపవాసాలు, ఆనారోగ్యానికి గురి కావడం. 
3. వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురికావడం
4. ఆహారపు అలవాట్లలో తప్పుడు అభిప్రా యాలు - మూఢనమ్మకాలు 
5. పేదరికం, పరిశుద్ధమై న నీరు లభించకపోవడం.
11. కస్కూట మొక్క పరాన్నజీవి అని ఎలా చెప్పగలవు? (AS - 1)
జ.కస్కూట ప్రజాతికి చెందిన బంగారుతీగ లేదా డాడర్ మొక్కల్లో పత్రహరితం ఉండదు. కస్కూటా రిప్లె క్సాలో కొద్ది మొత్తంలోనే
పత్రహరితం ఉంటుంది. పత్రా లు సన్నని పొలుసుల మాదిరిగా క్షీ ణించి ఉంటాయి. బంగారు తీగ కాండం సన్నగా, పొడవుగా ఉండి తీగవలె
ఆతిధేయి మొక్కచుట్టు పెనవేసుకుంటుంది. దానిపక్కనున్న మరొక మొక్కపై కూడా వల మాదిరిగా ఆక్రమిస్తు ంది. ఇది
హిస్టో రియా(చూషకాల) ద్వారా ఆహారంసేకరిస్తు ంది. హిస్టో రియాలు వేళ్ళమాదిరిగి ఉండి అతిధేయి కణజాలంలోకి చొచ్చుకొని పోతాయి.
ఒక్కొక్కసారి అతిధేయిని కూడా చంపివేస్తా యి.
12.గర్భవతులకు ఫోలిక్ ఆసిడ్ ఉండే మాత్రలను, ఆకుకూరలను బాగా తీసుకోవాలంటారు. ఎందుకు? (AS - 2)
జ. గర్భందాల్చిన వారి గర్భాశయంలో పెరుగుతున్న భ్రూ ణానికి పోషక పదార్థా లను రక్తం ద్వారా అందించాలి. కాబట్టి గర్భిణి
ఎర్రరక్తకణాలలో హిమోగ్లో బిన్ శాతం తగిన మోతాదులో (12 శాతం) పై న ఉండాలి. సాధారణ పోషకాలతో పాటు ఫోలిక్ ఆసిడ్ మాత్రలను
తీసుకుంటే ఐరన్ మూలకం అదనంగా లభిస్తు ంది. తద్వారా ఎనీమియా (రక్తహీనత) కు గురయ్యే పరిస్థి తి ఉండదు. అలాగే తాజా
ఆకుకూరలు తీసుకోవడం వల్ల విటమిన్ - ఎతో పాటు ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తా యి.
ఆకుకూరలు సులభమై న జీర్ణక్రి యకు కూడా తోడ్పడుతాయి.

1 మార్కుల ప్రశ్నలు- జవాబులు


1. కిరణజన్య సంయోగక్రి యకు అవసరమయ్యే కారకాలు ఏవి?
జ. సూర్యకాంతి, కార్బన్ డై ఆక్సైడ్, నీరు, పత్రహరితం.
2. కిరణజన్య సంయోగక్రయను సూచించే సమీకరణం రాయండి?

 
3. NADP ను విస్తరించుము.
జ.నికోటినమై డ్ ఎడినై న్ డై ఫాస్ఫేట్
4. కిరణజన్య సంయోగక్రి యకు అవసరమై న కాంతి తరంగ దై ర్యం ఎంత?
జ. 400-700nm మధ్య ఉంటుంది. ఇందులో అరుణ, నీలి కాంతులు కిరణజన్య సంయోగక్రి యకు అవసరం.
5. కాంతిచర్యలో ఏర్పడే అంత్య పదార్థా లు ఏవి?
జ. NADPH, ATP లు ఏర్పడతాయి. వీటిని శక్తి గ్రా హకాలు అని కూడా అంటారు. 
6.పత్రహరిత వర్ణద్రవ్యాలు ఎక్కడ ఉంటాయి? అవి ఏవి?
జ. హరితరేణువుల్లో ని థై లకాయిడ్ దొంతరలలో రెండు పత్రహరిత వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. అవి 
1. క్లో రోఫిల్ -ఎ (నీలి - ఆకుపచ్చ) ,2) క్లో రోఫిల్ - బి (పసుపు- ఆకుపచ్చ)
7. ఎమల్సీకరణం అంటే ఏమిటి?
జ.కాలేయం ద్వారా విడుదలయ్యే పై త్యరసం కొవ్వు పదార్థా లను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుస్తు ంది. ఈ విధానాన్ని
ఎమల్సీకరణం అంటారు.
8. అమీబాలో పోషణ ఎలా జరుగుతుంది?
జ.అమీబాలో పోషణ అనేది వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. మిధ్యాపాదాల ద్వారా ఆహారాన్ని పట్టు కొని ఆహార రిక్తి కలోకి పంపి, సరళ
పదార్ధా లుగా విడగొట్టి వ్యాపనం చెందుతుంది.
9. స్థూ లకాయత్వం వల్ల వచ్చే వ్యాధులు ఏవి?
జ.డయాబెటిస్ (మధుమేహం) గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు 
10, శస్త్ర చికిత్స సమయంలో వై ద్యుడు రోగికి ఇచ్చే విటమిన్ ఇంజక్షన్ ఏది?
జ.విటమిన్ -కె. ఇది రక్తస్రా వాన్ని నిరోధిస్తు ంది.
11. కై మ్ ఆనగానేమి?
జ. ఆహారంలో ఉండే ప్రొ టీన్లు మరియు కార్బొహై డ్రే ట్స్ అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి చిక్కటి రూపంలోకి
మారుతుంది. దీనినే కై మ్ అంటారు.
12. విటమినులు లభించే మార్గా లు ఏవి?
జ. విటమినులు లభించే మార్గా లు రెండు అవి 
1. మనం తినే ఆహారం ద్వారా
2. జీర్ణవ్యవస్థలె ఉండే బ్యాక్టీ రియాలు సంశ్లే షణం చేయుట ద్వారా శరీరానికి అందజేయబడతాయి.
13.ఎనీమియా దేని లోపం వల్ల సంభవిస్తు ంది?
జ. ఎనీమియా అనగా రక్తహీనత. ఇది పిరిడాక్సిన్ (B6), ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల సంభవిస్తు ంది.
14. రికెట్సు వ్యాధి లక్షణాలు ఏమిటి?
జ. రికెట్సు వ్యాధి ’డి’ విటమిన్ లోపం. దీనివల్ల ఎముకలు సరిగా పెరుగుదల చూపకపోవడం, పెళుసు బారడం,
ముంజేతివాపు,దొడ్డి కాళ్ళు ఏర్పడటం, దంత సమస్యలు.
15.వాంతి జరగడానికి కారణం ఏమిటి?
జ.మనం తీసుకొనే ఆహారంలో కొవ్వుశాతం ఎక్కువై నపుడు, జీర్ణంకానపుడు లేదా విషతుల్యమై న ఆహారం తీసుకున్నపుడు వాంతి
కావడం సహజం.
16.కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి?
జ.హరిత రేణువులోని గ్రా నాలో కాంతి చర్యలు, స్ట్రోమాలో నిష్కాంతి చర్యలు జరుగుతాయి.

You might also like