You are on page 1of 3

________________

వృషాధిప శతకము
వృషాధిప శతకము - పాలకురికి సోమనాథ కవి మొదటి భాగము
ఉ. శ్రీగురులింగమూర్తి సువిశేషమఘోజ్వల కీర్తి సత్రియో ద్యోగకళాప్రపూర్తి యవధూతపు నర్భవాజార్తి పాలితా
భాగ్యతసంశ్రితార్థికవిపండి తగాయకచక్రవర్తి దే వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
చ. ప్రమథవిలోల భక్తపరిపాల దురంధరశీల సంతతా ప్తమిత సమస్తదేహగుణజాల! సుఖప్రదలీలలింగజం
గమమహిమానుపాలగతకాలసమంచితనాదమూల దే వ మముభరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
ఉ. అప్రతిమప్రతాప సముదంచిత నాదకళాకలాప దీ ప్రప్రథమస్వరూప శివభక్తగణాత్మగత ప్రదీప ధూ తప్రబలేక్షుచాప విగత ప్రకటాఖిలపాప
లింగత త్వప్రద నీవే దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
ఉ. భక్తిరసాభిషిక్త భవపాశవితానవిముక్త జంగమా సక్త దయానుషక్త తనుసంగతసౌఖ్యవిరక్త సంతతో ద్యుక్త గుణానురక్త పరితోషితభక్త
శివైక్యయుక్త ప్ర వ్యక్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
5.
ఉ. శత్రు లతాలవిత్ర గుణజైత్ర భవాబ్దివహిత్ర జంగమ క్షేత్రవిచిత్రసూత్ర బుధగీతచరిత్ర శిలాదపుత్ర స త్పాత్ర విశుద్ధగాత్ర శివభక్తికళత్ర శరణ
మయ్య భా స్వత్తిజగత్పవిత్ర బసవా! బసవా! బసవా! వృషాధిపా.
ఉ. త్ర్యా క్ష సదృక్ష సంచితదయాక్ష శివాత్మకదీక్ష సత్ర్పసా దాక్ష ప్రతాపశిక్షితమహా ప్రతిపక్ష మసూక్ష భూరిక ర్మక్షయదక్ష
జంగమసమక్షమభక్తిపరోక్ష లింగ త త్వక్షమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page________________

ఉ. అక్షయభక్తిపక్ష బసవాక్షర*పాఠక కల్పవృక్ష రు ద్రాక్షవిభూతివక్ష ఫలితార్థముముక్ష శివప్రయుక్త ఫా లాక్ష కృపాసముంచితకటాక్ష


శుభాశుభపాశమోక్ష త త్వక్షమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా. (* సాధక యని పాఠంతరము)
ఉ. ఆర్యవితానవర్య భువనాధికశౌర్య యుదాత్తసత్పదా చార్య యవార్యవీర్య బుధసన్నురచర్య విశేషభక్తితా త్పర్య వివేకధుర్య పరిపాలితతుర్య
శరణ్యమార్యదు ర్వార్యయనూనధైర్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
ఉ. తజ్ఞజితప్రతిజ్ఞ యుచిత ప్రమథానుగతజ్ఞనమదై వజ్ఞకళావిధిజ్ఞ బలవచ్చివభక్తిమనోజ్ఞ ధూతశా స్త్రజ్ఞసునాదపురితరసజ్ఞతృణీకృతపంచయజ్ఞస
ర్వ శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
10.
ఉ. క్షీణజనప్రమాణ యసికృత్తకుయంత్రక ఘోణ జంగమ ప్రాణ వినిర్జితప్రసవబాణ సముంచితభక్తి యోగసం త్రాణ కళాప్రవీణ
శివధర్మరహశ్యధురీణ దత్తని ర్వాణ శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
11.
ఉ. గానరసప్రవీణ గతకాలవితాన సమస్తభక్త స న్మాన మహాకులీన యసమానచరాచరరూప భేదసం ధాన జితభిమాన తనుధర్మవిహీన
మహాప్రధాన దే వా ననుఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
12
లింగమయాంతరంగ గురులింగ పదాబుజభృంగ సత్ర్పసా దాంగ కృపాపరిస్ఫురదపాంగ విముక్త భుజంగ జంగమో త్తుంగ జితాభిషంగ గత
దుష్కృతభంగ మదీయలింగనీ వంగడమేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
13.
ఉ. ఉత్తమభక్తివృత్త భజనోత్సుకచిత్త యుదాత్తచిత్సుఖా యుత్త క్రియాప్రమత్త బిఖిలాగమవేత్త గుణాపయుక్త స ద్వృత్తప్రసాదభోగసముదీర్ఘ
విశేషసుఖప్రమత్త భా స్వత్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా. 14. ఉ. దేహజవైరివాహ శివదీపితదేహ సుఖ ప్రవాహ ని
ర్మోహ వినమ్రసంయమిసమూహ లసద్గుణ గేహ సంతతో త్సాహ నిరీహ జంగమవితానదయావిహితావగాహని

<OCRpageNumber>2</OCRpageNumber>
End of current page________________

ర్వాహమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.


15.
ఉ. న్యాసఫలానివాస దరహాసముఖ ప్రతిభాస దత్త కై లాస విశేషజంగమవిలాస శివైక్యసమాస నిర్జితా యాస సమస్తభక్తహృదయాంబుజనిత్య
నివాస ధిక్కృత వ్యాస శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 16.
ఉ. రాగపరోపభోగ గతరాగ విధూతభవాది రోగ ని ర్యాగ మహానురాగ బహిరంతర నిష్ఠితయోగ సత్రియో ద్యో యకర్మయోగ శివయోగ
సమగ్ర సుఖాతి భోగదే . వా గతినీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా. 17.
ఉ. శీతలతాలవాలయ. శిష్ట.. ప్రతికూలలాలితో త్తా ల గుణానుకూల శివధర్మప్రతిపాల నిత్యస
ల్లీల యశోవిశాల చరలింగసుఖోదయకాల జియ్యదే వా లలిఁబ్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 18.
కామిత భక్తిభామ గతకామ మహాగణ సార్వభౌమ ని స్సీమ యశోభిరామ సవిశేషవిముక్తిలలామ సద్గుణ స్తోమ శివైక్యధామ సుఖదుఃఖవిరామ
ప్రమోదసీమ దే వా మముఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 19.
సాధితజన్మబాధ గతసర్వని షేధ *హతాపరాధ దు ర్బోధకళావిరోధ పరిపోషితశాంభవవేధ వర్జిత
క్రోధ నిరాకృతాఖిలవిరోధ శివైక్యసుబోధ యీభవ వ్యాధికి నీవె మందు బసవా! బసవా! బసవా! వృషాధిపా. (*జితన్యగాధ యని
పాఠాంతరము)
20.
శ్రీవిలసత్ర్ప భావ *ప్రవిశిష్టపరాజితసర్వదేవ స ద్భావయుతస్వభావ శివతత్వవిశిష్టమహానుభావ యం
హవనదావ పాలితమహోద్ధతశైవ విభుండ వీవ దే వా వరదానశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా. (* వ్రత యని పాఠంతరము)
ఉ. ఆద్య సమర్పితాఖిలపురాతన భక్తగణానువేద్య సం పాద్యగుణాబవద్య యనుభావశివాంకిత గద్యపద్య ని ర్భేద్య గణై కవేద్య
యురరీకృతవాద్య భవాది రోగస ద్వైద్య శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
22.

<OCRpageNumber>3</OCRpageNumber>
End of current page________________

ఉ. నాదకళావినోద యభినందిత వేద హృతాపవాద సం పాదితభక్తిమోద బుధవందితపాద చిరప్రమోదయా స్వాదితసుప్రసాద యవిషాద


శిలాదసుతావిభేద దే వా దయఁ జూడు మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
23.
ఉ. కాయగుణావిధేయ జితకాయ వినమ్రజగన్నికాయ, మ్నాయవచో ప్రమేయయసమాన సముంచితగేయ భక్తిధౌ రేయ
సదానపాయసుచరిత్రసహాయ జితాంతకాయ దే వా యొడయుండ వీవ బసవా! బసవా! బసవా! వృషాధిపా.
24.
ఉ. స్వీకృతభక్తలోక యవశీకృతకర్కశవావదూక యూ రీకృతసద్వివేక యురరీకృతజంగమభక్తి శూక దూ రీకృత దుష్టపాక యధరీకృత
వేదవిరుద్ధ బౌద్ధచా ర్వక శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
25.
ఉ. నిత్య యుదాత్తసత్య యతినిశ్చలజంగమభృత్య సజ్జన స్తు త్య కృపాకటాక్ష పరిశోభితచైత్య మహేశభక్తి సం గత్యభిరామసత్య
గురుకార్యపరాయణకృత్య వర్జిత వ్రాత్య శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
26.
ఉ. ధన్య మహావదాన్య గతదైన్య విధూతజఘన్య భక్తిచై తన్య గుణై కమాన్య హతదర్పక సైన్య నిరస్తమాతృకా స్త్న్య జితారిఘోరభవజన్య
శరణ్యము చిత్సుఖాత్మభా వాన్య శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 27. చర్విరశృంగిగర్వి గుణసంపదఖర్వ
యపూర్వగీతగాం ధర్వ దిగంతపూర్ణ సముదాత్తయశఃకృత కర్ణపర్వయం తర్వినివిష్టశర్వవిదితస్పుర *దర్వకావుమో పర్వఘనప్రసాద బసవా!
బసవా! బసవా! వృషాధిపా. (దర్పకోటమా పర్వఘనప్రసాద, సర్వఘనమ్రపాద అను పాఠాంతరములు)
28.
ఉ. ఖ్యాత దయాభిజాత విపదంబుధిపోత యజాతతత్వని ర్ణేత వినీత భక్తిపరిణేత మనోరథదాత జంగమ స్తోతముముక్షుగీత పరిశోభిత
నీతిసమేత సద్గుణ వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
29.
ఉ. మారముదాపహార సుకుమారశరీర గణ ప్రసాదవి స్తా ర వృషావతార సముదారవిహార నమద్దయాపరి ష్కార శుభప్రకార యవికార
మహాజగదేకవీర దు

<OCRpageNumber>4</OCRpageNumber>
End of current page________________

ర్వార శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. (* సముద్దయా అని పాఠాంతరము)


30.
ఉ. దేశికజన్మదేశ యవిదేశ యనావృతపాశ సంహృత శమహాప్రకాశ కృతకిల్బిషనాశ దయానివేశనం దీశనికాశ జంగమసమీహితకారిగుణావకాశ
దే వా శరణియ్యవయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
31.
ఉ. ఉద్ధతభక్తవృద్ధ వినుతోత్తమసిద్ధ పరీతజంగమ శ్రద్ధ సదాత్మశుద్ధ గుణరాజిసమృద్ధ విముక్తపాశస న్నద్ధ మహాప్రసిద్ధ యగుణత్రయబద్ధ
శరణ్యనయ్య భా స్వద్ధతచిత్ర్పబుద్ధ బసవా! బసవా! బసవా! వృషాధిపా.
32.
ఉ. నందితభక్తబృందయవినాశిరదాంశుముఖారవింద సా నంద వినీతికంద కరుణామకరంద రసోపలాలిత స్కంద యుదాత్త భక్తితరుకంద
యశోజితకుంద నాకరా డ్వందిత నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా. (*యానందవిలీయమానకరుణా యని
పాఠాంతరము)
33.
ఉ. లౌల్యపరాయణాత్మగుణలౌల్యయమూల్య సదోపయుక్తని ర్మాల్య వినీతికల్య యసమానదయారసకుల్య నిత్య నై ర్మల్యయమూల్య
దుష్టజనమానసశల్య పదాబ్దలబ్దికై వల్య శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
34.
గురుపదపద్మసద్మ యవికుంఠిత జంగమశీలఖేల సు స్థిరమృదుపాదమోద సమిదీర్ఘవిశేషమహత్వతత్త్వని ర్బరభుజశౌర్యధుర్యపరిరంభిత భక్తికళత్ర
గోత్రమ ద్వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 35.
చ. భువనహితార్ధతీర్థ భవభూరుహశాతకుఠారధార గౌ రవసముదాత్తవేత్త యనురాగరసామృతసారపూర శాం భవమయవేదబోధ
శివభక్తహృదబవికాసభాస దే వ వరద కావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
36.
చ. వినుతనవీనగాన గుణవిశ్రు తభక్తవిధేయ కాయయ త్యనుపమగణ్యపుణ్య నయనాంచల*దూరభవోపతాప స ద్వినయవికాసభాస
సముదీర్ఘశివైకసుఖైకపాక దే వ నను భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. (*మారమదోపతాప ...
భావసముదీర్ఘవిశాలశివైక్యపాల)

<OCRpageNumber>5</OCRpageNumber>
End of current page________________

37. ఉ. అంచితభక్తియుక్త యసహాయవిశృంఖలవీరపూర ని శ్చంచలశైవభావ శ్రితజంగమపాదకిరీటకూట హృ త్సంచితసత్త్వతత్త్వ


దురితవ్రజశైలకదంబశంబ ని ర్వంచక నీ వెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
38.
నిర్గతధర్మకర్మ యవినీతపునర్భవయంత్రతంత్ర దుర్మార్గవిహీనయాన గుణమాన్య మహావృష*సామ్య సౌమ్యష డ్వర్గవిరక్తసక్త మదడంబర
వర్ణితవేషభూష నీ వర్గము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. (* సైన్యధన్య)
39.
చ. సరసవచస్క నిర్మలయశస్క శివైక్యమనస్క భక్తహృ త్సరసిజగేహ క్లు ప్తభవదాహ దయాపరివాహ చిత్సుఖా త్తరనిజశిల్ప భక్తపరతల్ప
మహావృషకల్ప మన్మనో వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 40.
చ. హరసమసౌఖ్య యాదివృషభాఖ్య పురాతన ముఖ్య తత్వవి త్పరిషదుపాస్య వీతగుణదాస్య త్రిలోకనమస్య తార్కికో త్కరజయశౌండ
దీర్ఘభుజదండ మహాగుణషండ మన్మనో వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
41.
చ. వరగుణదీప్ర భక్తజనవప్ర తృణీకృతవిప్రతాత్త్వికాం కురపదపద్మ భక్తిరసగుంభ నిరాకృత దంభ సద్గుణ స్పురితవిశిష్ట శాంతగుణపుష్ట
నిరస్తనికృష్ట మన్మనో వరద శరణ్య మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
42.
ఉ. లింగనిరూఢ సంచితవిలీడ పరాక్రమగాఢ మానసా సంగివృషాంక నిర్గళితశంక నిరస్తకళంక సంతతా భంగురపుణ్య
శీలమణిపణ్యత్రిలోకవరేణ్య దేవ నీ వంగడమేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 43. చ. ఉరుతరభాగ్య సన్మహిత యోగ్య
జగత్రయమృగ్య పాపసం హరణసమర్ధ నమ్రచరితార్థ లసదుణసార్ధభావభా స్వరనయసాంద్రకీర్తి జితచంద్ర వివర్జితతంద్ర మన్మనో వరద శరణ్య
మయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 44.

<OCRpageNumber>6</OCRpageNumber>
End of current page________________

చ. విరచిత శుద్ధసాళగన వీనమృదుస్వరమంద్రమధ్యతా రరుచిరదేశిమార్గ మధురస్వరగీతా సుధాతరంగిణీ తరలతరంగజాలసముదంచిత


కేళివిలోల సంగమే శ్వర గతినీవెనాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
45.
చ. అసమవదాన్యమాన్య ప్రణుతార్యయవార్యరసజ్ఞతజ్ఞదు ర్వ్యసనవిదూర శూర గణవంద్యయనింద్య యమాడ్యయాధ్యభ కిసుఖసమృద్ధ వృద్ధ
చిరదీప్తి పవిత్రచరిత్ర పాత్ర నా వసిఁ గని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 46.
అసమశిలీముఖస్పురదహంకృతికర్తన కర్మకర్మ ఠా భ్యసనధురీణవిభ్రమ గణాధిపపాదసరోజసంతత ప్రసృమరసౌరభోరుమకరందకసిక్తవనక్రియాకళా
వ్యసన శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా. 47.
చ. అసదృశవిస్పురద్దు ణదృగంచల కల్పితసృష్టిపాలన గ్రసరకళాకలాప ఘనకౌశలఖేలన లింగమూర్తి మా నసకలనావశీకరణ నైపుణ తత్పరశీల
జంగమ శ్వసన శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
48.
చ. ప్రమథగణాధినాథ సముపాసనభాసురపార్వతీ మనో రమరమణీయహృత్కమలరాజితనవ్యపతంగ సౌరభ
భ్రమరవిలోలతా మధుకరాయిదితదివ్యశరీర సత్ర్పభా వమహిత నీవెదిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా. 49.
కందళితాత్మయంత్రితవికర్తనశీల మరీచిమన్మనో మందవిహార విస్ఫురితమధ్యమయాన చిదంబరేందుని ష్యందసుధారసానుభవ సంతతదివ్యశరీర
యోగిరా డ్వందిత నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా.
50.
ఖ్యాతయశఃప్రపూరిత జగత్రితయాయ నమో నమో మహా పాతకసూతకఘ్న పదపద్మయుగాయ నమోనమో సము ధ్యోతవృషయతే యనుచు
నుత్సుకతన్ బ్రణుతింతు సంయమి వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా.
శతకములు శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి
శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము |
రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార
శతకము | కుమారీ

<OCRpageNumber>7</OCRpageNumber>
End of current page________________

శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము |
ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము
"https://te.wikisource.org/w/index.php?title=వృషాధిప శతకము&oldid=61304" నుండి
వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 25 అక్టోబరు 2014 న 07:11 కు జరిగింది. పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు
క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.

<OCRpageNumber>8</OCRpageNumber>
End of current page

You might also like