You are on page 1of 1

________________

వేమన పద్యాలు హ
విషయ సూచిక
హంగుమీరఁ దాను యతులజన్మంబుల హంస మానసోద మంటక తిరిగిన హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు హీనజాతివాని
నిలుఁజేర నిచ్చెనా హీనజాతివానికెచ్చువైష్ణమిచ్చి హీననరులతోడ నింతులతోడను హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన హేమ నగము చేత
నెప్పుడు గలవాడు హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల హరికి దొరికెనందురా సిరి యప్పుడే హరివిధిసురిమునులాదిని
హృదయమందునున్నయీశుని దెలియక హృదయము పదిలంబైనను
హంగుమీరఁ దాను యతులజన్మంబుల హంగుమీరఁ దాను యతులజన్మంబుల నరసి చెప్పు నెంతవారికైన ఆడకాడ కనువు నతిశయమై
వచ్చు విశ్వదాభిరామ వినర వేమ!
హంస మానసోద మంటక తిరిగిన హంస మానసోద మంటక తిరిగిన యట్టు కర్మచయము నంటకుండ యోగి తిరుగు
సకలభోగంబుతోడను విశ్వదాభిరామ వినర వేమ!
హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు
ఆనక హింసచేసి రవనిసురులు చావుపశువుఁ దినెడు చండాలుఁడే మేలు విశ్వదాభిరామ వినర వేమ!
హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page________________

హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా హాని వచ్చు నెంతవాని కైన ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినర వేమ!
హీనజాతివానికెచ్చువైష్ణమిచ్చి హీనజాతివానికెచ్చువైష్ణమిచ్చి ద్విజునికన్న దొడ్డతీరటండ్రు కల్లు కడవ కడిగి గంగ నించిన రీతి విశ్వదాభిరామ
వినురవేమ!
హీననరులతోడ నింతులతోడను హీననరులతోడ నింతులతోడను పడుచువాండ్రతోడ ప్రభువుతోడ ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మఘ్న జనులతో వైపు
దెలిసి పలుకవలయు వేమ!
హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన హీనుఁ డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుఁడు గాఁడు హీనజనుఁడె కాని పరిమళమ్ము గర్దభము
మోయ ఘనమౌనె విశ్వదాభిరామ వినర వేమ!
హేమ నగము చేత నెప్పుడు గలవాడు హేమ నగము చేత నెప్పుడు గలవాడు వెండికొండపైన వెలయువాడు యెత్తవలెనె బిచ్చ మేమన
వచ్చురా? విశ్వదాభిరామ వినురవేమ!
హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల వెతలఁ బడనియట్లు విద్య చేతఁ దత్వమెఱుఁగు వెనుక తనకుఁ జింతేలరా
విశ్వదాభిరామ వినర వేమ!
హరికి దొరికెనందురా సిరి యప్పుడే హరికి దొరికెనందురా సిరి యప్పుడే దొరికె కాదె విషము హరున కరయ
నెవని కెట్టు లగునొ యెవ్వరెఱుగుదురు విశ్వదాభిరామ వినురవేమ!
హరివిధిసురిమునులాదిని హరివిధిసురిమును లాదిని
మెరసియు జన్మించి పిదప మేలులకెడగా జరయందు మరణమందును

<OCRpageNumber>2</OCRpageNumber>
End of current page________________

వరుస న్వర్తిలిరి మాయవాసన వేమా!


హృదయమందు నున్నయీశుని దెలియక హృదయమందు నున్నయీశుని దెలియక శిలలనెల్ల మ్రొక్కు జీవులార శిలల నేమియుండు
జీవులందే కాక విశ్వదాభిరామ వినర వేమ!
హృదయము పదిలంబైనను హృదయము పదిలంబైనను గుదికొను సన్యాసమునకుఁ గొమ్మలు గలవా యిదియెఱుఁగరు చదువరులటు మది
ముక్తికి నాస్పదంబు మహిలో వేమా!
వేమన పద్యాలు అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క
| ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఇ | ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
"https://te.wikisource.org/w/index.php?title వేమన పద్యా
లు హ&oldid=14415' నుండి వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 18 ఆగస్టు 2007 న 05:22 కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక
నియమాలను చూడండి.

<OCRpageNumber>3</OCRpageNumber>
End of current page

You might also like