You are on page 1of 2

________________

వేమన పద్యాలు ధ
విషయ సూచిక ధనమే మూలము జగతికి ధనమెచ్చిన మదమెచ్చును ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక ధనము లేకయున్న ధైర్యంబు
నిలువదు ధనము లేమి యనెడు దావానలం బది ధనములేమి కులము తక్కువ పడవచ్చు ధనములేమి సుతులు తప్పుల నిడుదురు
ధనవిహీనుఁడైన తండ్రి గర్భంబున
ధ్యానివలెనె యుండు మౌనివలనె యుండు ధర గిరులు జలధు లన్నియు
ధర, గ్రహములు రాశి చరియించుచుండిన
ధారదత్తమైన తామ్రపుఁబలకను
ధర్మకంటకుండు ధనముచే గర్వించి
ధార్మికునకుఁ గాని ధర్మంబుఁ గనరాదు ధర్మమన్న వినరు తము నమ్మి భూనరుల్ ధర్మమరసి పూని ధర్మరాజాదులు ధర్మమునకుఁ గీడు
తలఁచినవాఁడు తా ధర్మసత్యములను దప్పకచేయని
ధైర్యయుతుని కితరధనమైన నదురేమి ధూమాదుల నావృతమై
ధనమే మూలము జగతికి ధనమే మూలము జగతికి ధనమే మూలంబు సకలధర్మంబులకు గొనమే మూలము సిరులకు మనమే
మూలంబు ముక్తి మహిమకు వేమా!
ధనమెచ్చిన మదమెచ్చును ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు ధనముడిగిన మదముడుగును

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page________________

మదముడిగిన దుర్గుణంబు మానును వేమా!


ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక తాను దినకలెస్స దాచుగాఁక తేనె నీఁగె కూర్చి తెరువర్ల
కియ్యదా విశ్వదాభిరామ వినర వేమ!
ధనము లేకయున్న ధైర్వంబు నిలువదు ధనము లేకయున్న ధైర్యంబు నిలువదు
ధైర్య మొదవలేని ధనము లేదు ధనము ధైర్య మరయ ధర భూమిపతులకు విశ్వదాభిరామ వినర వేమ!
ధనము లేమి యనెడు దావానలం బది ధనము లేమి యనెడు దావానలం బది తన్నుఁ జెఱచును దరిదాపుఁ జెఱచు ధనములేమి
చూడఁదలఁచగా పాపంబు విశ్వదాభిరామ వినర వేమ!
ధనములేమి కులము తక్కువపడవచ్చు ధనములేమి కులము తక్కువపడవచ్చు ధనములేమి కీర్తి దలఁగిపోవు ధనములేమి శుచిని
దగఁబుట్టనియ్యదు ధనములేమి ఘనత తప్పు వేమ!
ధనములేమి సుతులు తప్పుల నిడుదురు ధనములేమి సుతులు తప్పుల నిడుదురు ధనములేమి పత్నిఁ దాకరాదు ధనములే మెవరికి
తాళిక యుండదు విశ్వదాభిరామ వినర వేమ!
ధనవిహీనుఁడైన తండ్రి గర్భంబున ధనవిహీనుఁడైన తండ్రి గర్భంబున
భాగ్యపురుషుఁ డొకఁడు పరఁగఁబుట్టి బహుళధనము గూర్చి భద్రమార్గంబున పరుల కుపకరించి పరఁగు వేమ!
ధ్యానివలెనె యుండు మౌనివలనె యుండు ధ్యానివలెనె యుండు మౌనివలనె యుండు భోగివలెనె యుండు రోగివలెనె సకలము
దెలిసినను సర్వజ్ఞుఁడై యుండు బరమయోగివలెనె పరగ వేమా!

<OCRpageNumber>2</OCRpageNumber>
End of current page________________

ధర గిరులు జలధు లన్నియు ధర గిరులు జలధు లన్నియు పరికింపగఁ బ్రయమునను భస్మావృతులౌ సురలును మునులును జనఁగా
నెరయోగులు నుండఁగలరె నేర్పున వేమా!
ధర, గ్రహములు రాశి చరియించుచుండిన ధర, గ్రహములు రాశి చరియించుచుండిన మంచిచెడుగు కానిపించుచున్న
పురుషయత్నమనుచు పొంగుదురేలరా విశ్వదాభిరామ వినురవేమ!
ధారదత్తమైన తామ్రపుఁబలకను ధారదత్తమైన తామ్రపుఁబలకను లావుటుంగరమున లంకెజేసి యరయ మీఁదముద్ర యమరియుండంగను
నదియ శాసనంబు నవని వేమ!
ధర్మకంటకుండు ధనముచే గర్వించి ధర్మకంటకుండు ధనముచే గర్వించి సకలసంపదలను జాలఁ బొరసి కడకు తాను మేలు గానక
చెడిపోవు విశ్వదాభిరామ వినర వేమ!
ధార్మికునకుఁ గాని ధర్మంబుఁ గనరాదు ధార్మికునకుఁ గాని ధర్మంబుఁ గనరాదు కష్టజీవి కెట్లు కానఁబడును నీరుచొరకలోతు నిజముగాఁ
దెలియదు విశ్వదాభిరామ వినర వేమ!
ధర్మమన్న వినరు తము నమ్మి భూనరుల్ ధర్మమన్న వినరు తము నమ్మి భూనరుల్ యమునివారు వచ్చి యడలు నించి చొచ్చి
కట్టఁదారు చొరఁబరఁ గలరొకో విశ్వదాభిరామ వినర వేమ!
ధర్మమరసి పూని ధర్మరాజాదులు ధర్మమరసి పూని ధర్మరాజాదులు నిర్మలంపు ప్రౌఢి నిలుపుకొనిరి ధర్మమే నృపులకు తారకయోగంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ధర్మమునకుఁ గీడు తలఁచినవాఁడు తా

<OCRpageNumber>3</OCRpageNumber>
End of current page________________

ధర్మమునకుఁ గీడు తలఁచినవాఁడు తా దుష్ట మార్గుఁ డవును ద్రోవ చెడును గురువుపత్నిగవయఁగోరెడువాఁడు తా మొదలెచెడును ముప్పు
మొనసి వేమ!
ధర్మసత్యములను దప్పకచేయని ధర్మసత్యములను దప్పకచేయని కర్మజీవి మేలుఁ గానఁలేఁడు నిర్మలహృదయుండు నీరూపమున నుండు
విశ్వదాభిరామ వినర వేమ!
ధైర్యయుతుని కితరధనమైన నదురేమి ధైర్యయుతుని కితరధనమైన నదురేమి దాన మిచ్చునపుడె తనకుఁదక్కె
నెలమి మించుపనికినెవ రేమిసేయుదు రడుగుదప్ప తప్పు పిడుగు వేమ!
ధూమాదుల నావృతమై ధూమాదుల నావృతమై వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో
శ్రీమించు శివుని జేరును గామాదుల గలియడతడు ఘనముగ వేమా !
వేమన పద్యాలు అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క
| ఖ | గ | ఘ | జ | చ | ఛ | జ | ఝ | ఇ | ట | ఠ | డ | ఢ | ణ |
త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
"https://te.wikisource.org/w/index.php?title వేమన పద్యా
లు ధ&oldid=14236' నుండి వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 16 ఆగస్టు 2007 న 04:27 కు జరిగింది.
పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక
నియమాలను చూడండి.

<OCRpageNumber>4</OCRpageNumber>
End of current page

You might also like