Ramanuja

You might also like

You are on page 1of 23

సమతామూర్తిగా...

స్ఫూర్తిపద
్ర ాతగా

సహస్రా బ్ది ధారావాహిక – 23

మేల్కోటేలో రామానుజులు తన కులాతీత సమానతా సిద్ధా ంతాన్ని సమగ్రంగా ఆచరణ ద్వారా నిరూపించి నిర్ధా రించారు.

తిరునారాయణుడిని పుట్ట లోంచి బయటకు తీసి పునఃప్రతిష్ఠ చేయడానికి సహకరించిన గిరిజనులకు, హరిజనులకు

ఆలయ ప్రవేశం, దర్శనార్హత కలిగించి సమతను చాటారు. దళితులనే తక్కువ చూపు లేకుండా కొందరిని తన

శిష్యులుగా చేర్చుకున్న రామానుజులు భగవత్సేవలో దళితులందరికీ స్థా నం ఉండాలని వారికి తిరుక్కులత్తా ర్‌అనే

గౌరవప్రదమైన పేరును పెట్టి, నియమనిష్ట లను ఏర్పాటు చేసి, పంచసంస్కారాలు గావించి, భగవత్సేవలో కాహళి ఊదే

కైంకర్యాన్ని కల్పించి సముచిత స్థా నం ఇచ్చారు. సుల్తా ను కూతురు శెల్వప్పిళ్లై విగ్రహాన్ని ప్రేమించి తిరునారాయణపురం

వస్తే ఆమెకు గోదాదేవితో సమానమైన స్థా నాన్ని కల్పించి, రొట్టెల నైవేద్యంతో ఆమెను ఆరాధించే పద్ధ తిని ప్రా రంభించారు.

తొండనూరులో అన్ని కులాలవారికి సాగుజలం, తాగుజలం అందేలా ఒక ఆనకట్ట ను, జలాశయాన్ని ఏర్పాటు చేశారు.

తన శిష్యులలో పట్టినిప్పెరుమాళ్‌శూద్రకులజుడు. శ్రీరంగంలోని శివార్ల లో ఉండేవాడు. కావేరీలో స్నానం చేసి

రామానుజుడు పట్టినిప్పెరుమాళ్‌గుడిసెకు వెళ్లే వారు. అతను పరవశంతో పాడిన పాశురాలను కాస్సేపు వినేవారు.

దాశరథి విధేయత

రామానుజునికి అత్యంత ప్రియమైన శిష్యుడు దాశరథి. తిరుగోష్టియూర్‌వెళ్లి నప్పుడు ఒంటరిగా రమ్మంటే కూరేశుడిని,

దాశరథిని ఎందుకు వెంటతీసుకొచ్చావని అడిగారు. దాశరథి తనకు దండం వంటి వాడనీ ఎప్పటికీ వదలలేనని అంటారు

రామానుజులు. స్నానానికి వెళ్లే ముందు ఆయన భుజంపైన చేయివేసి నడిచేవాడు. రామానుజుని ఆచార్యులలో ఒకరైన

పెరియనంబి కుమార్తె ఆతుల్యలక్ష్మికి వంటపని రాదని వారి అత్త గారు కోపించి పుట్టింటికి పంపించి వేశారు. మళ్లీ వస్తే

వంటవాడితో రమ్మని చెప్పిందామె. పెరియనంబి ఏంచేయాలో తోచక రామానుజుడి దగ్గ రికి పంపారు. అంతా విన్న

రామానుజుడు, ‘‘దాశరథీ ఈ అమ్మాయి వెంట వెళ్లి వారికి వంట చేసి పెట్టు నాయనా’’ అని పంపించారు. ఆయన

మారుమాటాడకుండా వెళ్లి పో యాడు. రోజూ మంచి రుచికరమైన వంటలు చేస్తూ ఉన్నాడు. అత్త గారు శాంతించారు. ఓరోజు

ఆతుల్యలక్ష్మి మామగారు ఇంటికి వచ్చిన పండితుడితో శాస్త చ


్ర ర్చ చేస్తు న్నారు. ఓ సూత్రా నికి వారు చెప్పిన అర్థం

దాశరథికి వినబడింది. వెంటనే వంట ఇంటి నుంచి బయటికి వచ్చి ‘‘అయ్యా ఆ సూత్రం అర్థం అది కాదు. సమంజసమైన

అన్వయం ఇది...’’ అని వివరించి మళ్లీ గరిటె పట్టు కున్నాడు. ఆ ఇద్ద రూ ఆశ్చర్యపో యారు. వంటవాడేనా ఈయన.
ఏమిటీయన జ్ఞా నం. ఇంత జ్ఞా ని, పండితుడు, ఘంటం పట్టు కుని పుస్త కాలు వ్రా యాల్సిన వాడు తన ఇంట గరిటె

పట్టు కుని వంట చేస్తు న్నాడా.

‘నాయనా నీవెవరివి?’ అని అడిగాడు మామగారు. ఆతుల్యలక్ష్మి జోక్యం చేసుకుని ‘‘ఆయన రామానుజుని ప్రపథ
్ర మ

శిష్యులు దాశరథి’’ అని చెప్పగానే వారు ఇరువురూ ఆయన పాదాలపై పడి క్షమించమని కోరారు. తమ ఇంట ఈ వంట

పని మానేయమని కోరుకున్నారు. దాశరథి ‘‘నేను రామానుజులవారి ఆజ్ఞ ను శిరసావహించవలసిందే. ఆచార్యుడు

ఘంటం పట్ట మంటే పడతాను. గంటె తీసుకొమ్మంటే అదే తీసుకుంటాను’’ అన్నాడు. అంతా కలసి దాశరథితో

రామానుజుని దగ్గ రకు వెళ్లా రు. ఆయనకు దాశరథిని అప్పగించి ‘‘మీ శిష్యుడు అపారమైన శాస్త ్ర జ్ఞా ని. ఆయనచేత వంట

చేయించుకోవడం మాకు మహాపాపమే. ఆతుల్యలక్ష్మిని పుట్టింటికి పంపించి వేసన


ి ందుకు క్షమించండి. అయ్యా మా

కోడలికి మేం వంట నేర్పుకుంటాం, ఇంకేదైనా చేస్తా ం, కాని మీరు దయచేసి దాశరథిని మీ ఆశ్రమంలో మీతోనే

ఉండనీయండి’’ అని వేడుకున్నారు.

కర్షకుడు మాఱనేఱి నంబి

యామునాచార్యులు ఓసారి ఊరువెళ్లి వస్తూ ఒక కర్షకుడు బురదనీటిని తాగడం చూసి ఏమిటిదని అడిగారు. కర్షకుడు

‘‘నా భార్య అన్నం తేవడంలో ఆలస్యమైంది. ఆకలి ఈ శరీరమనే మన్నుకే కదా అందుకే ఆ మన్నుకు ఈ మన్నునే

తినిపిస్తు న్నాను’’ అన్నాడు. ఆ రైతు దేహాభిమానరాహిత్యం చూసి ఆశ్చర్యపో యారు. ఆ జిజ్ఞా సికి పంచసంస్కార కర్మలు

అనుగ్రహించి, మాఱనేఱి నంబి అని పేరు పెట్టి తన శిష్యులలో చేర్చుకున్నారు. మాఱనేఱి నంబి శ్రీరంగంలో ఆచార్యుల

వారి శుశ్రూ ష చేస్తూ న్న సమయంలో యామునాచార్యుల వారికి రాచవ్రణం లేచింది. ఆ బాధ వల్ల అనుష్టా నంలో

ఏకాగ్రత కుదరడం లేదు. ఆ బాధను తనకు ఇచ్చేయమని మాఱనేఱి నంబి ప్రా ర్థించాడు. యామునాచార్యులు ఆ

భాధను, త్రిదండాన్ని రోజూ మాఱనేఱి నంబికి ఇచ్చి అనుష్టా నం తరువాత మళ్లీ తీసుకునే వారు. మొత్త ం ఆ బాధను

తనకే ఇమ్మని అది మహాప్రసాదంగా తాను అనుభవిస్తా నని పదే పదే ప్రా ర్థించాడు. ఆయన మన్నించారు. యామునులు

అవతారం చాలించిన తరువాత మాఱనేఱి నంబి ఆ బాధను అనుభవిస్తూ నే ఉన్నారు. తన వార్ధక్యంలో మాఱనేఱి నంబి

రాచపుండుతో బాధపడడం చూసి రామానుజుడు తట్టు కోలేక శ్రీరంగనాథుని ప్రా ర్థించి ఆ బాధను తొలగింప చేశారు.

సంగతి తెలుసుకున్న మాఱనేఱి నంబి ‘‘రామానుజా ఏమిటీ పని. నా గురువు నాకు ఫలం రూపంలో ఇచ్చిన బాధను

అనుభవించకుండా నీవు అడ్డు రాకూడదు. నా బాధను నాకిప్పించు నాయనా’’ అన్నారు. ‘‘నమ్మాళ్వార్‌శ్రీ సూక్తిలో ఒక
దశకాన్ని స్తు తించి మీ బాధను నివృత్తి చేయాలని ప్రయత్నించాను స్వామీ, నన్ను క్షమించండి’’ అన్నారు

రామానుజులు.

‘‘అయితే మళ్లీ ప్రా ర్థించు. నాబాధ నాకు ఇప్పించు’’ అని ఆదేశించారు గురువుగారు. మళ్లీ ప్రా ర్థన చేసి విచారంతోనే మళ్లీ

ఆ వ్రణాన్ని రప్పించారు రామానుజులు. ఆ బాధతోనే ఆయన పరమపదించారు. పెఱియనంబి వారికి బ్రహ్మమే«ధా

సంస్కారం జరిపించారు. ఒక శూద్రు డికి బ్రహ్మమేధా సంస్కారం చేయిస్తా రా అని జాతి బ్రా హ్మణులు ఆగ్రహించి

పెఱియనంబికి ఆలయ సేవల నుంచి బహిష్కారం విధించారు. శ్రీరంగని సేవించకపో వడం కన్న శిక్ష ఏముందని

పెరియనంబి కుటుంబం కృంగి పో యింది. శ్రీరంగని ఊరేగింపు ఇంటిముందు నుంచి సాగుతున్న సమయంలో ఆయన

పుత్రిక అత్తు ళాయమ్మ రంగనాథుడిని చూసి ‘‘స్వామీ నా తండ్రి నీకేం అపకారం చేసినాడని ఈ బహిష్కారం, ఇదేనా నీ

న్యాయం. ముందు సమాధానం చెప్పిన తరువాతనే నీవు ఇక్కడ నుంచి కదలాలి’’ అని కనుల నీరు కారుతుండగా

మనసులో అనుకున్నది. అంతే! రథం ఎంత లాగినా కదలడం లేదు. అందరూ శ్రీరంగని ప్రా ర్థించినా ప్రయోజనం

లేకపో యింది. ‘‘స్వామీ ఏమైంద’’ ని అడిగారు అందరూ. అర్చకునికి సమాధానం స్ఫురింపచేశారు రంగడు. ‘‘ఏ

పాపమూ ఎఱుగని పెరియనంబిని బహిష్కరించడం రంగనాథునికి కోపం తెప్పించింది, భక్తు డికి, ఆచార్యానుగ్రహం

పొ ందిన శిష్యుడికి బ్రహ్మమేధా సంస్కారం చేయడంలో తప్పేమిటి? యామునాచార్యుల బో ధలు విన్నవారు

చేయవలసిన పనేనా ఇది అని శ్రీరంగడు ఆగ్రహించాడు’’ అని అర్చకుడు వివరించారు. వారంతా లోపలికి వెళ్లి

పెరియనంబిని క్షమాపణ కోరి ఆయనను తీసుకువచ్చి రథం ఎక్కించిన తరువాత గాని రథం కదలలేదు.

రెండో ప్రతిజ్ఞ : వ్యాస, పరాశర

తన ఐశ్వర్యాన్నంతా త్యజించి రామనుజుని శిష్యుడై నిత్యం అభిగమన, ఉపాదాన, ఇజ్య, స్వాధ్యాయ యోగాలను చేస్తూ

ఊంఛ వృత్తి (బిక్షాటన)తో జీవిస్తు న్న నిరాడంబరుడు నిర్వికారుడు, నిరహంకారుడు, దేహాభిమానం పూర్తిగా

వదులుకున్నవాడు కూరేశుడు (ఆళ్వాన్, శ్రీవత్సాంక అనే పేర్లూ ఈయనవే). విపరీతమైన వర్షం వల్ల ఆరోజు భిక్షాటనకు

వెళ్లలేదు. ఊంఛవృత్తి లో రేపటికోసం దాచుకోవడం ఉండదు. నారాయణ స్వరూపమైన సాలగ్రా మానికి ఒక ఫలాన్ని

నివేదించి, ఆ సాలగ్రా మ అభిషేక తీర్థా న్ని సేవించి దివ్యప్రబంధం పఠించి పడుకున్నారాయన. భార్య ఆండాళమ్మను తన

భర్త ఉపవాసం బాధిస్తు న్నది. ఆ సమయంలో శ్రీరంగని రాత్రి ఆరగింపు గంట వినిపించింది. ‘‘నీ భక్తు డు తిండి లేక

నకనకలాడుతుంటే నీవు షడ్రసో పేత భోజనం చేస్తు న్నావా హు’’ అని నవ్వుకున్నది. కాస్సేపటికి మేళతాళాల ధ్వనులు
వినిపించాయి. స్వామి ఊరేగింపు వస్తు న్నదనుకుని కూరేశులు ఆండాళ్‌బయటకు వచ్చారు. శ్రీరంగడి ఉత్సవ మూర్తి

రావడం లేదు. ఆలయ అధికారి ఉత్త మనంబి నెత్తి న ఒక మూటతో వస్తు న్నారు. ఇదేమిటని అడిగాడు కూరేశుడు.

శ్రీరంగని ప్రసాదం అన్నాడు. ‘‘వితరణ చేయడమో విక్రయించడమో చేయవలసిన శ్రీరంగ ప్రసాదం నాకెందుకు

ఇస్తు న్నార’’ని కురేశుడు అడిగాడు. ‘‘ఇది శ్రీరంగనాథుని ఆజ్ఞ . నాకు కలలో కనిపించి, నా మిత్రు డు నిరాహారంగా

పడుకున్నాడు. నీవు శిరస్సున ప్రసాదం ఉంచుకుని సగౌరవంగా తీసుకువెళ్లి ఇవ్వమని ఆదేశించారు. మీ కోసం

శ్రీరంగడు నాకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. మీవల్లే నాకీ భాగ్యం కలిగింది. మీకు నా ధన్యవాదాలు, అభివందనములు

స్వామీ’ అన్నారాయన.

మౌనంగా ప్రసాదం స్వీకరించినా, ఎవరో బలీయంగా అడగకపో తే శ్రీరంగడెందుకు ప్రసాదం పంపిస్తా డని ఆలోచించి భార్యతో

‘‘శ్రీరంగని నీవేమైనా అడిగావా’’ అని ప్రశ్నించాడు. ‘‘నా స్వామి పస్తు లుంటే నీవు హాయిగా భుజిస్తు న్నావా అని

మనసులో అనుకున్నాను’’ అన్నదామె. ‘‘ఎంత పనిచేశావు ఆండాళ్‌. నా స్వామిని గురించి అంత మాట అంటావా.

ఆయన ఎంత నొచ్చుకుని ఉంటాడు’’ అని హెచ్చరించాడు.‘‘నేనేమన్నాను.. మీరు మీస్వామి గురించి ఆలోచించారు. అదే

విధంగా నేనూ నా స్వామి గురించి ఆలోచించకూడదా? అది నా ధర్మం’’. సరే ఇదేదో దైవసంకల్పమే కావచ్చు అనుకుని

ఇద్ద రూ రెండు ముద్ద లు ప్రసాదాన్ని భక్తితో ఆరగించి నిద్రించారు. శ్రీరంగని ప్రసాదంగా ఆ దంపతులకు శుభకృత్‌నామ

సంవత్సరం వైశాఖ మాసం పూర్ణిమ నాడు అనూరాధా నక్షత్రా న కవలలు జన్మించారు. జాతసూతకం ముగిసిన

తరువాత రామానుజులు స్వయంగా కూరేశుని ఇంటికి వెళ్లి రక్ష చెప్పి ప్రేమతో పిల్లలను ఎత్తు కున్నారు. ‘‘గోవిందా ...

ఏమిటిది ఈ శిశువుల నుంచి ద్వయమంత్ర సుగంధం వస్తు న్నది?’’ అనడిగారు. ‘‘లోపలి నుంచి తీసుకువస్తూ రక్ష

కోసం ద్వయమంత్రా నుసంధానం చేశాను స్వామీ’’ అని గోవిందుడు జవాబిచ్చాడు. ‘‘సరే అయితే నీవే ఈ కవలలకు

ఆచార్యుడివై నడిపించు’’. ఆ పసివారికి పంచాయుధ ఆభరణాలు ఇచ్చి దీవించారు. ఆ బాలురకు వ్యాస భట్ట ర్‌అనీ

పరాశర భట్ట ర్‌ఇద్ద రికీ నామకరణం చేశారు. కూరేశుడు పిల్లలను పట్టించుకునే వారే కారు. శ్రీరంగనాథుడు వీరిని నేను

దత్త త తీసుకుంటున్నాను. వారు నా పుత్రు లే సుమా అని కూరేశుడితో అన్నారని ప్రతీతి.

కాలక్రమంలో గోవిందుని బో ధనలతో ఏకసంథాగ్రా హులైన ఇద్ద రు బాలురు శాస్త్రా ధ్యాయనాలలో అగ్రగాములుగా

నిలిచారు. యుక్త వయసులో వారికి ఉపనయన పంచసంస్కారాలు జరిపించారు. కుశాగ్రబుద్ధు లైన ఈ కవలలు ఓ రోజు

వీధిలో ఆడుకుంటూ ఉంటే ‘‘సర్వజ్ఞ భట్ట రు వస్తు న్నారు బహుపరాక్‌’’ అంటూ అరుపులు వినిపించాయి. మేళ తాళాలతో

పల్ల కిలో వస్తు న్న పెద్దమనిషిని చూసి అందరూ పారిపో యారు కాని వ్యాసపరాశర భట్ట రులు అక్కడే ఉండి ‘‘ఎవరో
సర్వజ్ఞు డని తనకు తానే చాటించుకుంటూ పల్ల కీలో ఊరేగుతున్నారు’’ అని ఒకరికొకరు చెప్పుకొని నవ్వుకున్నారు.

అక్కడి ఇసుకను రెండు చేతుల్లో పట్టు కుని వ్యాస భట్ట రు, ‘‘నా చేతుల్లో ఎంత ఇసుక ఉందో చెప్పండి సర్వజ్ఞు లవారూ’’

అని అడిగాడు. ఆయన ఏమీ చెప్పలేకపో యారు. మళ్లీ మౌనమే సమాధానమయింది సర్వజ్ఞు డికి. ఒక పిడికలి
ి ఇసుక

పారవేసి, ‘‘ఇప్పుడెంత ఉందో చెప్పండి’’ అన్నాడా బాలుడు. ‘‘మీరేమి సర్వజ్ఞు లు స్వామీ, రెండు గుప్పిళ్ల లో దో సెడు, ఒక్క

పిడికిలిలో గుప్పెడు ఇసుక ఉన్నదని తెలియదా’’ అన్నారు. ‘ఈ బాలురతోనే వాదించలేని నేను వీరి తండ్రు లతో ఏమి

వాదిస్తా ను’ అనుకుని ఆయన ఇద్ద రు పిల్లలను పల్ల కీ ఎక్కించుకుని కూరేశుని ఇంటివద్ద దింపి, సర్వజ్ఞ నినాదాలు

మానేసి వెళ్లి పో యారు.

తరుణ వయస్కులు కాగానే వివాహం చేయాలని సంకల్పించినా కొన్నేళ్లు గా కంచీపురాన్ని వదిలి, శ్రీరంగని సేవలో

ఉన్న కూరేశుడికి సంబంధాల గురించి తెలియదు. ఆండాళ్‌‘‘పిల్లల పెళ్లి గురించి పట్టించుకోరేమి?’’ అని అడిగితే

’’శ్రీరంగనాథుడు, మన స్వామి రామానుజులు ఉండగా మనకేమి దిగులు’’ అని వదిలేశారాయన. ‘‘రంగనాథా! పిల్లల

పెళ్లి గురించి నన్నడుగుతారేమిటి, నీవుండగా, అదేదో నీవే చూసుకో’’ అని ఆ రాత్రి ఏకాంత సేవ తరువాత చెప్పి

వచ్చేశారు.

సంబంధాలు వెతుకుతూ రామానుజుడు ఇద్ద రు కన్యలున్న బ్రహ్మజ్ఞా ని మహాపూర్ణు డి బంధువు ఒకాయన ఉన్నాడని

గమనించాడు. వారిని అడుగుదామన్నారు రామానుజులు. కన్యాదాత ఎందుకో నిరాకరించారు. కూరేశుడు స్మార్త

బ్రా హ్మణ కులం వడమ శాఖకు చెందిన వాడు. మహాపూర్ణు డు బృహచ్చరణ వర్గా నికి చెందిన పురశ్శిఖా బ్రా హ్మణుడు.

ఈ కులాంతర భేదం వల్ల నిరాకరించి ఉంటారని ఒక అభిప్రా యం. కాని ఆశ్చర్యకరంగా ఓరోజు ఆయనే ముందుకు వచ్చి

ఈ యువకులకు కన్యాదానం చేస్తా నన్నారు. ‘‘శ్రీరంగనాథుడు నా కలలో కనిపించి’’ నా దత్త పుత్రు లకు కన్యలను

ఎందుకు ఇవ్వవు అని అడిగారు. ఇంతకన్న నాకు కావలసిందేముంది. నన్ను క్షమించి అంగీకరించండి’’ అని

వేడుకున్నారు. మణ్ణి, అక్కచ్చిలను వారికిచ్చి వివాహం చేశాడాయన. గురుకృప, భగవదనుగ్రహం ఉన్న వ్యాస

పరాశరులు ఆ మహర్షు ల గౌరవాన్ని నిలబెట్టే రచనలు చేసి రామానుజుని ప్రియశిష్యులై భాసిల్లా రు. పరాశర భట్ట ర్‌శ్రీ

లక్ష్మీదేవిని స్తు తిస్తూ శ్రీ గుణరత్న కోశం, రంగనాథ వైభవాన్ని వివరించే శ్రీరంగరాజస్త వం, పూర్వోత్త ర శతకాలు, త్రిమంత్ర

సారాంశమైన అష్ట శ్లో కి, శ్రీరంగనాథ స్తో త్రం, విష్ణు సహస్రనామస్తో త్రా నికి సవివర వ్యాఖ్యానమైన శ్రీ భగవద్గు ణ దర్పణం,

కైశిక పురాణానికి చేసిన మణిపవ


్ర ాళ వ్యాఖ్యానం, అత్యంత మధురంగా ముక్త శ్లో కాలను రచించారు. పరాశరభట్ట ర్‌

అసాధారణ పాండిత్య వైభవాన్ని ప్రకటించే ఈ రచనలు విశిష్టా ద్వైత సిద్ధా ంతాన్ని ప్రజానీకానికి చేరువ చేశాయి.

వీరిరువురి రచనలు విష్ణు పురాణంలోని విశ్వతత్వాన్ని, జీవతత్త్వాన్ని, పరమాత్మతత్వాన్ని సులభగ్రా హ్యరీతిలో


నిర్ధా రించాయి. వ్యాసుడు, పరాశరుడు రచించిన పురాణాల మూలతత్వాన్ని, తత్వత్రయమును ఆ పేర్లు గలిగిన ఇద్ద రు

మహాభక్తు ల ద్వారా వ్యాఖ్యానింపచేయడం రామానుజుని సమర్థత. తద్వారా వ్యాస పరాశర మునుల పేర్లు చిరస్థా యిగా

నిలిచిపో యేట్టు చేసి యామునులకు ఇచ్చిన రెండో వాగ్దా నం రామానుజులు నెరవేర్చారు.

- ఆచార్య మాడభూషి శ్రీధర్‌

తిరుమలాధీశుడు విష్ణు వే!

సహస్రా బ్ది ధారావాహిక – 25

రామానుజ మార్గ ంలో మరో చరిత్రా త్మక ఘట్ట ం.. తిరుమలాధీశుడు శివుడు కాడని, మహావిష్ణు వని నిర్ధా రించిన ప్రక్రియ.

పండిత వాదనా పటిమ. తిరుమల తిరుపతి తమిళ పేర్లు . తిరుపతి అంటే శ్రీపతి, తిరుమల అంటే శ్రీకొండ లేదా శ్రీశైలం. శ్రీ

వేంకటాచలానికి తమిళ పేరు తిరువేంగడం. అక్కడ వైఖానసులు ఆలయ నిర్వహణ విధుల్లో విఫలమైనారని ఆనాటి

నారాయణవనం రాజు యాదవుడు వారికి శిక్ష విధించగా వారు ఆలయం వదలి వెళ్లి పో యారు. సరిగ్గా ఆ సమయంలో

కొందరు శైవులు ఆ మూలమూర్తి శివుడనీ, విష్ణు వు కాదని, శైవ ఆగమ విధానాల ప్రకారం పూజలు జరగకపో తే

రాజ్యానికి అరిష్టమని రాజు చెవిని ఇల్లు కట్టు కుని పో రు పెట్టా రు. యాదవరాజు ఈ అంశాన్ని పరిశీలించాలని

అనుకున్నారు. అందుకొక విస్తా రమైన చర్చావేదికను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తిరుమలేశుడు శివుడో కేశవుడో

ప్రమాణాలతో నిరూపించాలని చాటింపు వేయించాడు. తమ మాటను నమ్మి శైవక్షేత్రంగా మార్చుతాడేమో అనుకుంటే

రాజు చర్చాగోష్టి పెడతాడని శైవపండితులు ఊహించలేదు. శైవ క్షేత్రమని రుజువు చేయడానికి పురాణాల్లో ప్రమాణాలు

వెతకనారంభించారు. రామానుజులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. తమ వాదాన్ని కూడా

వినాలని యాదవరాజును కోరారు. ఆయన సరేనన్నారు. మరునాడు శైవులు వాదన ప్రా రంభించారు. ఇక్కడ పుష్కరిణి

పేరు స్వామి పుష్కరిణి, కనుక దానికి దక్షిణాన నెలకొన్న స్వామి సుబ్రహ్మణ్యస్వామి అని వాదించారు. స్వామి అనే

పేరు కుమారస్వామికి గాక మరెవరికీ లేదన్నారు. వామన పురాణంలో వేంకటాచలం విశేషాలను వివరించారని ప్రమాణం

చూపారు. స్కందుడు తారకాసురుడిని చంపిన పాపాన్ని పో గొట్టు కోవడానికి తపస్సు చేయడానికి ఏది అనువైన

ప్రదేశమని అడిగితే విష్ణు క్షేత్రా లలోకెల్లా పవిత్రమైన తిరుమలకు వెళ్లమని సూచించాడు. స్కందుడు అక్కడికి వెళ్లే

సమయానికే వాయుదేవుడు తపస్సు చేస్తు న్నాడు. తపో భంగిమ కనుక స్కందుని చేతులలో యుద్ధ కాలపు వీరుడికి

ఉండే ఆయుధాలేవీలేవు. ఆయన కురులు జడలుకట్టి ఉన్నాయి. విష్ణు వే అయితే ఆయన చేతిలో శంఖ చక్రా లు

మొదలైన విష్ణు లక్షణాలైన ఆయుధాలు ఉండాలి అవేవీ లేవు. రెండు భుజాలమీద నాగాభరణాలు ఉన్నాయి.
విష్ణు వుకు నాగాభరణాలు ఎప్పుడూ లేవు. బిల్వదళాలతో పూజలు అందుకుంటున్నాడు. విష్ణు వుకు తులసీ దళాలే

కాని బిల్వదళాలు శివుడికీ శివపరివారానికనీ, కనుక తిరుమలలో విష్ణు వు కాదని, స్కందుడని వాదించారు.

విష్ణు వు కోసమే స్కందుడు తపస్సు

రామానుజుడి వాదన: శైవ పండితులు ప్రస్తా వించిన వామన పురాణాన్నే రామానుజుడు ఉటంకిస్తూ అందులోని 14 వ

అధ్యాయం ప్రకారం వేంకటాచలం విష్ణు క్షేత్రా ల్లో కెల్లా పవిత్ర క్షేత్రమని ఉంది. స్వామి పుష్కరిణక
ి ి దక్షిణాన ఉన్నది వరాహ

రూపంలో ఉన్న విష్ణు దేవాలయమే. వరాహపురాణంలోనే వేంకటాచలం వరాహ వాసుదేవ దివ్యధామమని కూడా ఉంది.

వేంకటాచల మహత్మ్యంలో ధరణి వరాహస్వామి మధ్య సంభాషణ రూపంలో ఈ ప్రస్తా వన ఉంది. పద్మపురాణంలో

24.1 వ అధ్యాయంలో కూడా ఈ విషయమే వివరించారు. గరుడపురాణంలో 63 వ అధ్యాయంలో అరుంధతీ వశిష్టు ల

సంభాషణలో, బ్రహ్మాండపురాణంలోని భృగు నారదుల మధ్య సంభాషణలో విష్ణు క్షేత్రమని స్పష్ట ంగా ఉంది. ఇన్ని

పురాణాలు ధ్రు వీకరించిన సత్యం ఇది. శ్రీనివాసునికి, వరాహమూర్తికి మధ్య జరిగిన సంభాషణ భవిష్యోత్త రపురాణంలో

ఉంది. ఈ కల్పాంతం వరకు హరి శ్రీనివాసుని రూపంలో ఈ వేంకటాచలంపైన ఉంటారని, కుమారస్వామి చేత పూజలను

అందుకుంటారని, శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతిని వివాహం చేసుకున్నారని, ఆ వివాహమహో త్సవానికి

వరాహ స్వామిని, భూదేవిని ఆహ్వానించారని కూడా ఉంది. స్కందుడికి ముందుగా ఒక ముఖమే ఉందని తరువాత

కృత్తి కల పో షణలో ఆయన షణ్ముఖుడై పన్నెండు భుజాలను సంపాదించాడని ఉంది. ఇక్కడ ఒకే ముఖం నాలుగు

భుజాలు ఉన్న మూర్తి స్కందుడని ఎలా చెప్పగలరని రామానుజుడు ప్రశ్నించాడు. తపస్సు కోసం వెళ్లి నాడు కనుక

స్కందుడు ఆయుధాలు వదిలేశారని శైవ పండితులవాదం కాని వనవాసానికి వెళ్లి న రామలక్ష్మణులు గానీ, పాండవులు

గానీ ఆయుధాలు వదిలినట్టు ఎక్కడా లేదు కదా. అదీగాక వామన పురాణం 22, 23 వ అధ్యాయాలలో స్కందుడు

తపస్సు చేయడానికి వెళ్తూ వెంట తన అన్ని ఆయుధాలు తీసుకువెళ్లి నట్టు స్పష్ట ంగా ఉంది. బిల్వదళాలతో పూజించడం

వల్ల స్కందుడనే వాదం కూడా చెల్లదు. శ్రీ సూక్త ంలో లక్ష్మీదేవిని బిల్వదళాలతో అర్చించే స్తు తి కూడా ఉంది, తులసి వలె

బిల్వం కూడా విష్ణు ఆలయాలలో పూజలకు వినియోగిస్తా రని రామానుజులు వివరించారు. వరాహ పురాణం మొదటి

భాగం, అధ్యాయం 45, విభాగం 13 లో వేంకటాచలానికి దశరథుడు వచ్చి శ్రీనివాసుని దర్శించారని, ఆ సమయానికి

రుషులెందరో విష్ణు వు గురించి తపస్సు చేస్తూ బిల్వదళాలతో అర్చించినట్టు పేర్కొన్నారు.


ఇక జడలు కట్టిన కేశాలు శివుడికి మాత్రమే పరిమితమైన లక్షణం కాదు. విష్ణు వుకు అనేక అవతారాల్లో జడలు కట్టిన

విస్తా రమైన శిరోజాలు ఉన్నాయని చెప్పారు. వేంకటాచలానికి వచ్చేనాటికి విష్ణు వుకు కురులు జడలు కట్టా యని ఆ

పురాణంలో ఉంది. పద్మపురాణం అధ్యాయం 26 మూడో భాగంలో నాగాభరణాలు చిత్రించిన వస్త్రా లను ధరించినట్టు

ఉంది. అందులోనే అధ్యాయం 27 నాలుగో భాగంలో జడలు కట్టినకేశాలతో ఆయన ఉన్నట్టు , తరువాత 33 వ అధ్యాయం

10 వ భాగంలో అవన్నీ త్యజించి సౌమ్యరూపానికి మారినట్టు కూడా ఉంది. భవిష్యోత్త రపురాణంలో శ్రీనివాసుని వివాహ

సందర్భంలో ఆకాశరాజు అల్లు డికి నాగాభరణాలను బహూకరించినట్టు ఉంది. బ్రహ్మాండపురాణం రెండో అధ్యాయంలో

ఆదిశేషుడు సందర్భాన్ని బట్టి పడకగా, ఛత్రంగా, ఆసనంగా, ఆభరణంగా మారతాడని ఉంది. భవిష్యోత్త ర పురాణంలో

అనేక శ్లో కాలు శ్రీనివాసుడు నాగాభరణాలు ధరించిన సందర్భాలను వివరించాయి. స్వామి వక్షస్థ లం మీద శ్రీవత్సం

ఉంది. హృదయంపై లక్ష్మీదేవి ఉంది. కనుక నారాయణుడు కాక మరెవరూ కాదని రామానుజులు వివరించారు. ప్రస్తు త

శ్రీనివాసుని భంగిమలోనే నారాయణుడి రూపం ఉండేదని వామనపురాణంలోని 24 వ అధ్యాయం పేర్కొన్నది. ఈ

వేంకటాచలం ఒకనాడు వైకుంఠంలోని క్రీడాపర్వతం. గరుడుడే దీన్ని మోసుకుని వచ్చాడు. కనుక ఇది గరుడాచలమనీ

వైకుంఠ గిరీ అని అన్నారు. శృతి స్మృతులలో కూడా విష్ణు క్షేత్రమనే నిర్ధా రించారు. రుగ్వేదం ఎనిమిదో అష్ట కం ఎనిమిదో

అధ్యాయం 13 వ విభాగంలో కూడా ఈ విషయమే స్పష్ట ంగా ఉంది. ఇన్ని ప్రమాణాలతో రామానుజుడు

నారాయణతత్వాన్ని నిర్ధా రించిన తరువాత యాదవరాజుకు ఇంకేం మిగలలేదు.

‘‘యాదవరాజా మరొక అంశం. ఇది శైవక్షేత్రమని వాదించడానికి శైవపండితులు పుష్కరిణి పేరును ప్రస్తా వించారు. అది

స్వామిపుష్కరిణి కనుక అది కుమారస్వామిదే అన్నారు. పుష్కరిణక


ి ి స్వామి అని పేరు రావడానికి దాని పక్కన

కుమార స్వామి తపస్సు చేసినందుకే అయి ఉండవచ్చు. స్వామి అంటే యజమాని, పెద్దవాడు అని కూడా అర్థం,

పుష్కరిణులలో కెల్లా గొప్పది అయినందున స్వామి పుష్కరిణి అని కూడా అని ఉండవచ్చు. స్వామి అన్న పదానికి

సంస్కృతంలో ఉన్న అర్థా లు సరిపో యేది శ్రీమన్నారాయణుడికే. ఎందుకంటే ఈ సకల విశ్వాన్ని సృష్టించి, పో షించే

స్వామిత్వం ఆయనకే ఉంది కనుక. పుష్కరిణి తీరాన బ్రహ్మరుద్ర ఇంద్రా ది దేవతలు తపస్సు చేశారని

వామనపురాణంలో ఉందని చెప్పారు. కుమారస్వామి కూడా అక్కడే తారకాసుర సంహారం వల్ల కలిగిన పాపాన్ని

ప్రక్షాళన చేయడానికి తండ్రి శివుడి సూచన మేరకు తపస్సు చేసారనీ శైవ పండితులే చెప్పారు. తిరుమల క్షేత్రంలో

ఉన్నది స్కందుడైతే కుమారస్వామి తన గురించి తనే తపస్సు చేశాడనా? కుమారస్వామి విష్ణు వు గురించి తపస్సు

చేశారనడం అన్ని విధాలా సమంజసం కదా’’ అని రామానుజుడు వివరించారు.


ఇంక వాదించడానికి ఏమీ లేదని యాదవరాజుకు అర్థమైపో యింది. ‘‘రామానుజముని లేవనెత్తి న ఈ అంశాలకు మీ

దగ్గ ర ఏదయినా ప్రతివాదన ఉందా’’ అని యాదవరాజు అడిగారు.

దానికి శైవులు.. ‘‘రామానుజాచార్యులవారు తిరుమలలో నెలకొన్నది స్కందుడు కాదని శివుడు కాదని చెప్పారు. కాని

విష్ణు వనడానికి రుజువులేమిటి? ఈ భంగిమలో ఎక్కడైనా విష్ణు వు నిలబడినట్టు ఉందా? చేతిలో ఆయుధాలు లేవు.

భుజాలమీద నాగాభరణాలు ఉన్నాయి. చతుర్భుజుడే. పైనున్న రెండు హస్తా లు ఖాళీగా ఉన్నాయి. ఒక హస్త ం

పాదాలను చూపిస్తూ ఉంటే మరొక హస్త ం నడుము మీద వేసి ఉంది. ఇది విష్ణు లక్షణమని ఏ విధంగా చెప్పగలరు?

స్కందుడు, శివుడు కాకపో తే హరిహరుడవుతాడేమో గాని విష్ణు వు కాడు. ఎందుకంటే ఇద్ద రి లక్షణాలు పాక్షికంగా

ఉన్నాయి కనుక..’’ అని కొత్త వాదాన్ని ఆవిష్కరించారు.

‘హరిహరుడో కాదో తేల్చవలసింది రామానుజులవారే’ అని యాదవరాజు అన్నారు.‘ప్రపంచంలోని ప్రతి అంశంలోనూ

విష్ణు అంశం కొంత ఉంటుందని భగవద్గీత పదో అధ్యాయంలో ఉందని, కనుక స్కందునిలో మహదేవునిలో కూడా విష్ణు

అంశ ఉంటుంది. స్కందుడు రోజూ మూడు సార్లు పుష్కరిణిలో స్నానం చేసి, వాయు సమక్షంలో నారాయణుని గూర్చి

తపస్సు చేసేవాడని స్పష్ట ంగా వామనపురాణం 21 వ అధ్యాయం రెండో భాగంలో ఉంది. శ్రీనివాసుని ఆరాధించడానికి

కుమార ధారిక నుంచి స్కందుడు (సుబ్రహ్మణ్యస్వామి) వచ్చేవాడని నిర్ధా రించిన పురాణాల్లో నే తొండమాన్‌చక్రవర్తి

తిరుమలలో విష్ణు మూర్తికి ఆలయం నిర్మించాడని కూడా ప్రస్తా వించారు. బ్రహ్మ, ఇంద్రా ది దేవతలు రుషులు పుష్కరిణి

దక్షిణాన యజ్ఞా లు, తపస్సులు చేశారని, వారిని కరుణించి విష్ణు వు ప్రత్యక్షమైనాడని శృతులలో ఉంది. స్కందుడు

రాకముందే శివుడు తిరుమలకు దిగువన కొలువైనాడని, నారాయణుని గూర్చి కొండపైన తపస్సు చేయాలని

స్కందుడికి శివుడే చెప్పినట్టు శైవ పండితులే పురాణాలను ఉటంకించారని, వరాహ పురాణం 29 వ అధ్యాయంలో

శ్రీనివాస అష్టో త్త ర శతనామ స్తో త్రంలో ‘తిరుమల కొండ దిగువన శివుడు తలపులలో తపస్సులో ఉన్న నారాయణా’ అని

కూడా ఉందని, కనుక తిరుమలేశుడు శ్రీనివాసుడైన నారాయణుడు కాక హరుడు కాని హరిహరుడు కాని మరోదైవం

కానీ అయ్యే అవకాశమే లేదన్నారు.

‘శైవపండితులు ఇంకేమయినా వాదించదలచుకున్నారా’ అని యాదవరాజు అడిగారు.సాధికారికంగా ఇన్ని పురాణాలను

ఉటంకిస్తూ రామానుజముని వాదించిన తరువాత, తర్కబద్ధ ంగా లక్షణాలను వివరించిన పిదప ఇంక మేమేం చెప్పగలం.

అయితే రామానుజుని వాదాన్ని మేము అంగీకరించినా ఆ తిరుమలదైవం అంగీకరించాడని చెప్పగలిగితే మేం పూర్తిగా
సంతుష్టు లమవుతాం అని మరో ముడి వేశారు. వాదో పవాదాలలో పూర్తిగా పరాజయం పొ ందిన తరువాత ఇంకా తగాదా

కొనసాగించాలని చూడటం సమంజసం కాదని యాదవరాజు కొంత కోపాన్ని ప్రదర్శించారు. రామానుజుడు మాత్రం ఈ

శైవుల వాదాన్ని మరింత ఖండితంగా తొలగించి శాశ్వతంగా ఈ వివాదాన్ని నివారించాలని అనుకున్నారు. ‘సరే మనం

శ్రీవారి ఆలయంలో శివ విష్ణు మూర్తు లకు సంబంధించిన ఆయుధాలను ఉంచి తలుపులు వేద్దా ం. మరునాడు స్వామి ఏ

ఆయుధాలను స్వీకరిస్తా రో చూద్దా ం’ అన్నారు. యాదవరాజు శైవ వైష్ణవ పండితుల సమక్షంలో విష్ణ్వాయుధాలయిన

శంఖ చక్రా లను, శంకరుడి హస్త భూషణాలైన త్రిశూల డమరుకాలను ఆనందనిలయంలో ఉంచారు. మరునాడు

వారందరూ రాజుతో కలిసి వచ్చి ద్వారాలు తెరవగానే శ్రీనివాసుడు శంఖ చక్రా లు ధరించి దర్శనమిచ్చారు. రాజు

ప్రణమిల్లినాడు. రామానుజుని శిష్యుడైనాడు. యాదవరాజు తీర్పును శాసనంగా ప్రచురించమని కోరారు. గర్భాలయ

విమానమైన ఆనందనిలయాన్ని పునరుద్ధ రించి, వైఖానస ఆగమ విధానాల ప్రకారం వైష్ణవారాధనా విధాన క్రమాలను

స్థిరక
ీ రించారు. (రామానుజుని శిష్యుడు ఈ వాదో పవాదాల సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన అనంతాళ్వాన్‌రచించిన

శ్రీవేంకటాచల ఇతిహాసమాల ఆధారంగా)

- రామానుజ మార్గ ం

తిరుపతి నగర నిర్మాత రామానుజుడు

సహస్రా బ్ది ధారావాహిక – 26

రామానుజ మార్గ ం

చోళరాజ్యానికి తమిళనాడులోని పుణ్యక్షేత్రం చిదంబరం రాజధాని. రాజు కులోత్తు ంగ చోళుడు వీరశైవ భక్తు డు. అతనికెంత

శివ భక్తి ఉందో అంతకుమించిన విష్ణు ద్వేషం ఉంది. చిదంబరం గొప్ప హరిహర క్షేత్రం. పరమ శివుడి ఆలయంతోపాటు

పరమాత్ముడైన హరి రూపం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం కూడా పక్కనే ఉంది. విష్ణు వును గొప్పవాడుగా జనం

నమ్మకుండా ఉండాలంటే విష్ణు విగ్రహాన్ని తొలగించాలనే మూర్ఖత్వంతో, విపరీతమైన విష్ణు ద్వేషంతో కులోత్తు ంగ

చోళుడు ఆలయాన్ని ధ్వంసం చేసి, గోవిందరాజస్వామి మూల విగ్రహాన్ని పెరక


ి ించి సముద్రం పాలు చేశాడు.

రామానుజులకు ఈ విషయాలన్నీ తెలుస్తూ నే ఉన్నాయి. అంతటి దివ్యక్షేత్రా న్ని ధ్వంసం చేసినందుకు ఆయన చాలా

బాధ పడ్డా రు. రాజే ఇంత అన్యాయం చేస్తు ంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అందుకని రామానుజుడు గోవిందరాజుకు
మరొకచోట భవ్యమైన ఆలయం నిర్మించాలని తిరుపతిని ఎంచుకున్నారు. సుధామూర్తిగా (సుద్ద మన్నుతో) గోవిందరాజు

విగ్రహాన్ని తయారు చేయించి శయనమూర్తిగా హరిని ప్రతిష్టింపజేశారు. భూదేవి రూపమైన గోదాదేవిని స్వామికి

దక్షిణాన పట్ట మహిషిగా ప్రతిష్ఠించారు. పవిత్రమైన తిరుమల కొండను కాళ్ల తో తొక్కబో మని కిందనుంచే నమస్కరించిన

ఆళ్వార్ల విగ్రహాలను తిరుమల చూస్తు న్నట్టు గా ప్రతిష్టింపజేశారు. నాలుగు మాడ వీధులను నిర్ణయించి, అర్చక, పాచక,

అధికార, సేవక తదితర వర్గా లకు గృహసముదాయాలను నిర్ణయించి, జల వనరులను, వర్త క సౌకర్యాల వ్యవస్థ ను

ఏర్పాటు చేశారు. రామానుజుని ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా యాదవరాజు ఎత్త యిన గోపురాలు, విశాలమైన

వీధులు, ప్రా కారాలతో తిరుపతి నగరాన్ని నిర్మించారు. దానికి శ్రీమద్రా మానుజ పురం అని నామకరణం చేశారు.

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడు, తిరుపతిలో గోవిందరాజు తోడుగా ఉండి భక్తు లను రక్షిస్తా రని రామానుజులు ఏర్పాట్లు

చేసారు. వ్యాసుడు రచించిన వరాహ పురాణంలో వేంకటేశ్వర అష్టో త్త ర శతనామ స్తో త్రంలో ‘‘గోవిందాయ నమో నిత్యం

శ్రీనివాసాయతే నమః’’ అనే నామాన్ని సార్థకం చేస్తూ వారిరువురూ సో దర సమానులని నిర్ధా రణ చేశారు.

విష్ణు ద్వేషి అయిన చోళరాజు దుష్ట పు చూపు శ్రీరంగం పైన కూడా పడింది. అయితే ఆస్థా న నర్త కి, అద్భుత సౌందర్యరాశి,

విష్ణు భక్తు రాలు అయిన తిల్ల , రాజు దృష్టిని కొంతకాలం మరోవైపు మళ్లించడంలో సఫలీకృతురాలైంది. అదే సమయం లో

ఉత్సవ విగ్రహాలను తిరుపతికి తరలించి వైష్ణవులు రాజు దుర్మార్గ ం నుంచి రక్షించారు. అందుకే అక్కడ ప్రతిష్టించిన

గోవిందరాజమూర్తికి తిల్లై గోవిందరాజు అని నామకరణం చేశారు. ప్రా ణాలకు తెగించి కాపాడిన భక్తు రాలి పేరును

భగవంతుడికి పెట్టడం రామానుజుడికే చెల్లి ంది. ఈ నగర నిర్మాణానికి గాను రామానుజుడు సుదీర్ఘకాలం తిరుపతిలోనే

ఉండవలసి వచ్చింది. అక్కడే శ్రీ భాష్య రచనకు ఆయన ఉపక్రమించారు. కొంత భాగం రచిస్తూ ఉండగా కొన్ని

మౌలికమైన సందేహాలు తలెత్తా యట. సమాధానాల కోసం కురేశులను గోష్టీపూర్ణు లవద్ద కు పంపించి వారి వివరణలతో

శ్రీభాష్య రచన తిరుపతిలో కొనసాగింది. మిగిలిన భాగం శ్రీరంగంలో పూర్తి చేశారు. యామునాచార్యుల ఆశయాలను

నెరవేర్చుతూ తిరుమల తిరుపతి, శ్రీరంగం దివ్యదేశాలలో సక్రమమైన వైష్ణవారాధనా వ్యవస్థ లను స్థిరక
ీ రించి కట్టు దిట్టం

చేశారు రామానుజులు. ఈ విషయాలన్నీ తెలిసి కులోత్తు ంగచోళ రాజు రగిలిపో యాడు. తాను నాశనం చేసిన చిదంబరం

విష్ణు ఆలయాన్ని తిరుపతిలో అంతకన్నా భవ్యంగా నిర్మించాడని తెలుసుకున్న ఆ రాజు కోపం మిన్నంటింది.

శ్రీమద్రా మానుజుల మీద ఎందుకో కోపం కలిగిన ఒక దుష్ట వైష్ణవుడు నాలూరాన్‌చోళరాజు ద్వారా రామానుజుల మీద

పగ తీర్చుకోవాలనుకున్నాడు ‘‘విగ్రహాన్ని సముద్రంలో పారవేయిస్తే వైష్ణవం అంతరించదు రాజా, వైష్ణవాన్ని శరవేగంగా

దేశమంతటా వ్యాప్తిచేస్తు న్న రామానుజుడిని అరికడ్తేనే అది సాధ్యం’’ అన్న నాలూరాన్‌దుర్బోధ చెవికెక్కింది.

శాస్త వ
్ర ాదానికి రమ్మంటే వస్తా డని రామానుజుడిని రాజధానికి రప్పించాలని కొందరు సైనికులను శ్రీరంగానికి పంపిస్తూ ,
రానంటే బంధించి తీసుకు రమ్మని రాజు ఆదేశించాడు. సైనికులు వచ్చి ‘శాస్త ్ర వాదానికి రామాజునులు రావాలని రాజాజ్ఞ ,

రమ్మని చెప్పండి’ అన్నారు. రామానుజులు అనుష్టా నానికి లోపలి గదిలో ఉన్నారు. రాబో యే అనర్థం ఏమిటో

కూరేశుడికి అర్థమైంది. చోళ రాజు దౌర్జన్యం నుంచి ఏదో విధంగా రామానుజుడిని దక్కించుకోవాలి. ఆ సైనికాధికారులకు

రామానుజుడెవరో తెలియదు. కనుక కాషాయ దండ కమండలాలు ధరించి తానే రామానుజుడినని పరిచయం చేసుకుని

వారి వెంట బయలు దేరాడు. ఒంటరిగా కూరేశుడిని వెళ్లనివ్వడం ప్రమాదమని తెలిసి మహాపూర్ణు లు తోడుగా

బయలుదేరారు.వృద్ధు డైన తండ్రికి సాయంగా ఉండడం కోసం అత్తు ళాయమ్మ కూడా నడిచింది. వెళ్లే ముందు

ముదలియాండాన్‌(దాశరథి)కి ధనుర్దా సుకు రామానుజుల వారిని జాగ్రత్తగా పశ్చిమాన ఉన్న చోళ రాజుతో వైరం ఉన్న

హో యసల రాజుల సామంతులైన కళ్యాణ చాణుక్యుల పాలనలోని కర్ణా టక తొండనూరు రాజ్యానికి తరలించి రక్షించమని

రహస్యంగా చెప్పారు.

చోళరాజు క్రూ రచర్య

కులోత్తు ంగచోళుని రాజసభలో శాస్త మ


్ర ూ లేదూ చర్చా లేదు. మూర్ఖంగా అతని నిర్ణయాలను ఒప్పుకోవలసిందే, లేకపో తే

శిక్షిస్తా డు. వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు కూరేశులు. శృతి స్మృతి పురాణాలనుంచి కూరేశులు ఎన్ని

ప్రమాణాలు చూపినా వినకుండా, కులోత్తు ంగ చోళుడు కూరేశులు, మహాపూర్ణు ల నేత్రా లు పెరికించమని ఆదేశించాడు.

‘ఓరీ దుర్మార్గు డా నీవంటి పాపాత్ముడిని చూసిన కళ్ల తో నేను నా ఆచార్యుడిని, శ్రీరంగని చూడలేను. నీవు పీకేదేమి, నేనే

నా కళ్లు పెరుక్కుంటాను’ అని చెప్పి కళ్లు పెరుక్కున్నారు. మహాపూర్ణు లు 105 సంవత్సరాల వృద్ధు లని కూడా

చూడకుండా కళ్లు పొ డిపించి, అతి క్రూ రంగా వారిని సభనుంచి తరిమివేశారు. అంధులై కళ్ల నుంచి నెత్తు రోడుతున్న ఆ

ఇద్ద రిని వెంట తీసుకుని అత్తు ళాయమ్మ శ్రీరంగం వైపు నడిచింది. కూరేశులు ఆ బాధను తట్టు కోగలిగినా వార్థక్యంతో

కనులు పీకిన బాధ భరించలేక మహాపూర్ణు లు ‘‘కూరేశా ఇక నాకు సమయం తీరింది నాయనా,’’ అని శిరసు ఆయన

ఒడిలో ఉంచి, అత్తు లై ఒడిలో కాలు పెట్టు కుని (1102 లో) తుది శ్వాస విడిచారు. ఇతర వైష్ణవమిత్రు ల సాయంతో

ఆచార్యులవారికి సంస్కారం చేశారు కూరేశులు. రామానుజుని రక్షించుకోవడానికీ జీవితాన్నే ఫణంగా పెట్టి మూర్ఖు డైన

శత్రు రాజు ఎదుట నిలబడడం అపూర్వమైన త్యాగం కూరేశులదైతే ప్రా ణమే అర్పించిన మహాపూర్ణు లది మహా త్యాగమే.

ఆ తరువాత కూరేశుడు శ్రీ రంగనాథుడి ఆలయానికి వెళ్లా లనుకున్నారు. కాని భటులు అడ్డ గించి రామానుజుని

అనుచరులెవరూ రంగనాథుడి ఆలయంలోకి వెళ్లరాదని నిషేధ శాసనం విధించారని చెప్పారు. రామానుజుడు నా

గురువు కాదని చెప్పండి లోనికి అనుమతిస్తా ం అన్నారు వారు. ఎంచుకోవలసింది రామానుజుడినో రంగనాథుడినో

అయితే నేను రామానుజుడినే ఎంచుకుంటాను ఏం చేసుకొంటారో చేసుకోండి అని కూరేశుడు వెళ్లి పో యారు. రంగని
చూడలేక, ఆలయంలోకి వెళ్లలేక రామానుజుని వదులుకోలేక కూరేశుడు శ్రీరంగాన్నే వదులుకున్నాడు. భార్య

ఆండాళమ్మను కొడుకులను, కోడళ్ల ను తీసుకుని తిరుమాలిరుంశోలైకి వెళ్లి పో యారు.

కర్ణా టకలో రామానుజులు

అప్పడికే రామానుజుడు కాషాయం వదలి శ్వేతవస్త ం్ర ధరించి కర్ణా టకకు రహస్యంగా తరలిపో యారని తెలుసుకుని

కూరేశులు సంతోషించారు. తనకు చెప్పకుండా కూరేశులు, మహాపూర్ణు లు మృత్యు కుహరంలోకి వెళ్లా రే అని

రామానుజుడు బాధపడుతూ కీకారణ్యాలు దాటుతున్నారు. నీలగిరి పర్వతాలను చేరుకున్నారు. విపరీతమైన వర్షం

కురవడంతో రామానుజులు, ఆయన శిష్యులు విడిపో యినారు. ఒకరినొకరు వెతుకుతూ ఉన్న దశలో శిష్యులకు

కొందరు గిరిజనులు కనిపించారు. ‘‘మీరెవరు ఎక్కడినుంచి వస్తు న్నార’’ని అడిగారు. ‘శ్రీరంగంనుంచి’ అని చెప్పగానే

‘రామానుజులు క్షేమమేనా’ అని అడిగారు. రామానుజులు అడవిలో దారితప్పారని చెప్పగానే వారు కూడా వెతకడం

మొదలుపెట్టా రు. ఆరురోజులు వెదికినా ప్రయోజనం లేకపో యింది. ఓ రాత్రి చలిమంటలు రగిల్చి కూచున్నారు. అక్కడికి

ఒక శ్వేతవస్త ధ
్ర ారి వచ్చి ‘‘ఇక్కడ జనావాసమేమయినా ఉందా’’ అని అడిగారు. చలికి ఆకలికి బాధపడుతున్న ఆ

వైష్ణవుడిని ముందు చలిమంటల చెంత కూర్చోబెట్టా రు. ఆయన శ్రీరంగం నుంచి వచ్చారని తెలుసుకుని

‘రామానుజులెక్కడున్నార’ని అడిగారు. ‘మీకు రామానుజులు ఏ విధంగా తెలుసున’ని ప్రశ్నిస్తే నల్లా న్‌చక్రవర్తి

శిష్యులమనీ భగవద్రా మానుజులే తమకు మోక్షమార్గ మని చెప్పారని వివరించారు. కూరేశుని వస్త్రా లలో ఉన్న వీరే

రామానుజులని శిష్యుడు తెలిపారు. సాష్టా ంగ దండాలు పెట్టి, కొర్రలను పిండిగా కొట్టి తేనెతో ఆరగించమని పెట్టా రు.

చెక్కతో పాదుకలు చేసి సమర్పించారు. ఆ అడవిలోనే రామానుజులను కట్టెలు కొట్టే వారి యజమాని ఇంటిలో దించారు.

ఆ యజమాని భార్య కొంగిల్‌పిరాట్టి (చేలాచలాంబ) ఒకసారి కరువు వల్ల శ్రీరంగానికి వలసబో యినప్పుడు

రామానుజుడు ఏడిళ్లలో భిక్షాటన చేయడం, వందలాది శిష్యులు ఆయనను అనుసరించడం చూసి, ఇంతమంది మీవెంట

రావడానికి కారణమేమిటి అని ఆయన్నే అడిగింది. ‘‘నేను వీరికి నారాయణ మంత్రం బో ధించానమ్మా. సంసారం

తరించడానికి అదే మార్గ ం. వీరంతా అందుకే నా శిష్యులుగా ఉన్నారు’’.

‘‘స్వామీ అయితే నాకూ ఆ మంత్రం బో ధించండి’’ అని అడిగిందామె. నీకు శ్రద్ధ ఉంటే చాలు తల్లీ అని మంత్రో పదేశం

చేశారు. మిమ్మల్ని ఆరాధించడానికి నాకు ఏదైనా అనుగ్రహించండి అని ఆమె ప్రా ర్థించింది. రామానుజులు ఆమెకు

పాదుకలను ఇచ్చారు. వర్షా లు కురిసాయని తెలిసి ఆ తరువాత ఆమె మళ్లీ నీలగిరి కొండప్రా ంతాలకు వచ్చింది.

అప్పడినుంచి రామానుజుని దర్శనమే కాలేదు. వచ్చింది రామానుజుడని తెలుసుకుని ఆమె ప్రసాదం వండి రోజుటి
వలెనే పాదుకలకు నైవేద్యం చేసి స్వామిని సాపాటుకు రమ్మని కోరింది. ‘‘అమ్మా శ్రీహరికి నివేదించని ఆహారాన్ని నేను

తీసుకోకూడదు. అది నా వ్రతం. నీవు ప్రసాదాన్ని నా పాదుకలకు నివేదించావు కదా’’ అన్నారు. కొంగిల్‌బయటకు వెళ్లి

పాలు పండ్లూ తెచ్చి ఇచ్చింది. గురుపాదాలకు నివేదించిన విందును శిష్యులంతా స్వీకరించారు. కొంగిల్‌పిరాట్టి ప్రేరణతో

కోయవారు, కట్టెలు కొట్టు కునే వారంతా రామానుజుని శిష్యులైనారు.

రామానుజులు అక్కడినుంచి వహ్ని పుష్కరంమనే రామనాథపురానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఆగి అక్కడినుంచి

మిథిలా సాలిగ్రా మం (మిర్లే సాలగ్రా మం) చేరుకున్నారు. అక్కడ వడుగనంబి (ఆంధ్రపూర్ణు లు) రామానుజుyì ని ఆశ్రయించి

ఆయన ప్రియమైన శిష్యుడిగా ఎదిగాడు. ఆంధ్రపూర్ణు లు ఒక్కరోజు కూడా శ్రీఆచార్య పాద తీర్థం లేకుండా ఉండలేనంత

సన్నిహితులైనారు. రామానుజులు అక్కడినుంచి బయలుదేరి వెళ్తు న్నట్టు చెప్పారు. మీ పాద తీర్థం లేకుండా రోజు ఎలా

గడుస్తు ంది ఆచార్యా అన్నారు. అక్కడున్న కొలనులో తన పాదం ఉంచి ఇదే నీ గురు పాద తీర్థం సరేనా అన్నారు

రామానుజులు. ఈ సంఘటన వల్ల నే ఆ గ్రా మానికి సాలగ్రా మమని పేరు వచ్చింది.

అక్కడినుంచి తొండనూరు చేరుకున్నారు యతిరాజు. తొండనూరు విఠల దేవరాయని పాలనలో ఉంది. విఠల

దేవరాయుడు జైనమతాన్ని ప్రో త్సహించేవాడు. ఆ రాజుకు రెండు సమస్యలు న్నాయి. రాజ్యం దుర్భిక్ష పీడత
ి మైతే

రాజకుమారి గ్రహపీడితురాలై ఉన్నది. పరిష్కారాన్ని ఆశించి జైనమత గురువులను తన ఇంటి విందుకు పిలిచాడు.

‘‘రాజా! యుద్ధ ంలో వేలు పో గొట్టు కున్న నీవు అంగవిహీనుడివి, విఠల దేవరాయనివి కాదు ఉట్టి భిట్టి దేవుడవు. నీవంటి

అంగవిహీనుని ఇంట భోజనం చేయడం మతవిరుద్ధ ం. నీ మీద మా మంత్రా లు కూడా పారవు’’ అని చెప్పి విందుకు

రాలేదు. రాజు చాలా దుఃఖించారు. రాణి ఆయనను ఓదార్చి, ‘‘శ్రీరంగం నుంచి యతిరాజు రామానుజులు వచ్చి

తొండనూరులో ఉన్నారట. ఆయన ఇదివరకు ఒక రాజకుమారికి పట్టిన బ్రహ్మరాక్షసిని విడిపించిన మహిమాన్వితుడు.

ఆ పవిత్రమూర్తి కాలిడిన చోట వర్షా లు పడతాయి, నేల సస్యశ్యామలమవుతుందంటారు. ఆ మహానుభావుడిని

ఆహ్వానించండి. ఆపైన మన అదృష్ట ం’’. అప్పటికి రాజుకు మరో మార్గ ం కనిపించలేదు. యతిరాజును పిలిచారు.

రామానుజులు శిష్యసమేతంగా రాజభవనానికి వెళ్లి రాకుమారిని సమక్షంలోకి తీసుకురమ్మని చెప్పారు. ఆమె వచ్చింది.

పరిశీలించారు. గ్రహపీడ తొలగాలని ప్రా ర్థిస్తూ రామానుజాచార్య మంత్రపూరిత తీర్థా న్ని ఆమెపైన చిలకరించారు. ఆమెను

పట్టిన బ్రహ్మరాక్షసి వదిలిపో యింది. ప్రశాంతమైన రాకుమారి సిగ్గు పడి లోనికి వెళ్లి ంది. రాజు ఆనంద భరితుడై ‘‘నేనూ నా

రాజ్యం పరివారం జనం మీ అధీనం స్వామీ’’ అని రాజు శరణువేడాడు. రాజ దంపతులు జైనాన్ని వదిలి వైష్ణవాన్ని
స్వీకరించి రామానుజుని శిష్యులైనారు. విఠల దేవరాయుడికి విష్ణు వర్ధన రాయలని నామకరణం చేశారు. రాజే శిష్యుడు

కాగానే ఆయన పరివారం చాలామంది జనులు కూడా అదే దారిలో నడిచారు. తొండనూరులో వెల్లి విరిసిన వైష్ణవం

సహస్రా బ్ది ధారావాహిక – 27

రామానుజ మార్గ ం

బ్రహ్మరాక్షసిని పారద్రో లి రాజును ఆకర్షించి అందరి మతం మార్చాడని జైనులకు రామానుజుని మీద విపరీతమైన కోపం

వచ్చింది. జైన గురువులు రామానుజుడు నరసింహాలయంలో ఉన్నారని తెలిసి అక్కడికి దండెత్తి వెళ్లా రు. ఒకేసారి

పన్నెండు వేలమంది రామానుజుడిని శాస్త ్ర చర్చకు రమ్మన్నారు. ముందు తమను జయించాలని, ఆ తరువాతే రాజుతో

మాట్లా డాలని సవాలు చేశారు. ఓడిపో తే తమ మార్గా న్ని, మతాన్ని అనుసరించాలన్నారు. రామానుజులు వారి

సవాల్‌ను స్వీకరించారు. ‘మేమంతా ఒకేసారి ప్రశ్నిస్తా ం. అన్నింటికీ సమాధానాలు చెప్పాల’ని వారు నిబంధన

విధించారు. వచ్చిన జైనులలో దిగంబరులూ ఉన్నారు. శ్వేతాంబరులూ ఉన్నారు. రామానుజ యతీంద్రు డికి ఒక

కట్టు బాటు ఉంది. దిగంబరులను చూడరు, మాట్లా డరు. కనుక ‘‘నా చుట్టూ తెర కట్ట ండి, మీరు చుట్టూ చేరి ప్రశ్నలు

అడగండి. నా నుంచి సమాధానాలు వినిపిస్తా యి వినండి. నా తెరలోకి తొంగి చూస్తే మీకే నష్ట ం జాగ్రత్త’’ అన్నారు.

రామానుజులు కనిపించకుండా తెర కట్టా రు. చర్చ మొదలైంది. వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. వేలాది గొంతులు

వినిపిస్తు న్నాయి. ఒక్కో జైనుడికి ఒక్కో గొంతుక వినిపిస్తు న్నది. సూటిగా ఒక్కో ప్రశ్న వేసిన వ్యక్తికే వినిపించే

సమాధానం దూసుకుని వస్తు న్నది. జైన మునులు ఆశ్చర్యపో తున్నారు. ఏం జరుగుతున్నదో తెలియడం లేదు.

ప్రశ్నించడమో ప్రతిపాదించడమో జరిగిందో లేదో , సమాధానాలు శరాల్లా వస్తు న్నాయి. శరవేగంగా ప్రతివాదాలు, ఖండన

మండనలు వెలువడుతున్నాయి. శాస్త ,్ర పురాణ ప్రమాణాలు, బ్రహ్మసూత్రా లు, ఉపనిషత్తు ల వాక్యాలు, ఈటెల్లా

వస్తు న్నాయి. రాను రాను జైనుల ప్రశ్నాస్త్రా లు వడిసిపో తున్నాయి. నిరస్త మ


్ర ై నిస్తేజమై పడిపో తున్నాయి.

అడగడానికేమీలేక జైనుల నోళ్లు మూతబడుతున్నాయి. కొందరికి అనుమానం వచ్చింది. తెరలోపల ఏం

జరుగుతున్నది? ఒక్కవ్యక్తి ఇన్ని గొంతులతో ఏవిధంగా మాట్లా డుతున్నారు? ఇది వాస్త వమా లేక కనికట్టా ? అని

తెరతీసి చూశారు. చూసిన వారు వెంటనే మతిభ్రమించినట్టు పడిపో యారు. పిచ్చిబట్టినట్టు పరుగెత్తి పో యారు.
‘‘ఏమైంది.. ఏం కనిపించింది..’’ అని వారిని అడిగితే ‘‘అక్కడ రామానుజ వీర వైష్ణవ తేజం ప్రజ్వరిల్లు తున్నది. వేలాది

పడగల ఆదిశష
ే ుడై రామానుజుడు విజృంభించి వాదనా కదన రంగంలో వీరవిహారం చేస్తు న్నాడు. ఆ భయానక దృశ్యం

చూడగానే మాకు మతిపో యింది. నాతోపాటు చూసిన వారు, తెరతీయడానికి భయపడేవారు, తెరతీసి భయపడి

పారిపో యినారు. వేలాది ప్రశ్నల వేగాన్ని బట్టి సమాధాన సహస్రా లు మహాగ్ని జ్వాలలై వచ్చాయి’’ అని

చెప్పుకున్నారట. న్యాయనిర్ణేతగా ఉన్న రాజు వాద ప్రతివాదాలు వినడానికి ప్రయత్నం చేస్తు న్నాడు. ప్రశ్నలూ

ప్రతిపాదనలూ ముగియగానే తెరవెనుక ఆదిశేషుని అవతారమైన యతిరాజు ప్రత్యక్షమైనాడు. తెరతొలగగానే దివిలో

జ్ఞా న సూర్య సహస్ర కాంతులతో రామానుజుడు దుర్నిరీక్షుడై కనిపించాడు. కాసేపటి తరువాత జైన శాస్త వ
్ర త
ే ్త లు,

పండితులు, తర్కశాస్త జ్ఞు


్ర లు మౌనం పాటించారు. ఆ మౌనం పరాజయానికి ప్రతీక కనుక జైనులు పరాజితులని రాజు

ప్రకటించారు. తొండనూరులో జైనుల ఆధిక్యం సమసిపో యి వైష్ణవం వెల్లి విరిసింది.

జలాశయ నిర్మాణ నిపుణ రామానుజ

ఆ ప్రా ంతంలో అనావృష్టిని నివారించడానికి యోగ్యమైన స్థ లంలో కరకట్ట నిర్మించి జలాశయాన్ని ఏర్పాటు చేయాలని

రామానుజులు సంకల్పించారు. సహజమైన పరిసరాల్లో తటాకానికి అనుకూలమైన స్థ లాన్ని ఎంపిక చేశారు. అటూ

ఇటూ సహజంగా ఉన్న కొండలు కొన్ని బండరాళ్లు పేర్చితే ఆనకట్ట సులువుగా తయారవుతుందని, అందుకు

సాంకేతికంగా ఏం చేయాలో కూడా రామానుజుడు వివరించారు. రాజు విష్ణు వర్ధనుడు ఆశ్చర్యపో యారు. యతిరాజులు

గొప్ప సాంకేతిజ్ఞు లు కూడా అని అర్థమైంది. రామానుజుడు ఆ తటాకానికి తిరుమల రాయ సాగరం అని నామకరణం

చేశారు. ఆ ప్రా ంతంలో ఈ చెరువు ద్వారా ఏ మేరకు పంట పొ లాలకు నీరు చేరుతుందో రామానుజులు అంచనాను

వివరించారు. ఆనకట్ట నిర్మాణమై జలాశయంలో నీరు నిండిన తరువాత ఆశయం నెరవేరి ఆ ప్రా ంతమంతా సుభిక్షమైంది.

తిరునారాయణుని పునఃప్రతిష్ఠ

ఓరోజు ఉదయాన్నే రామానుజులు అనుష్టా నం కోసం ఊర్థ్వ పుండ్రా లను దిద్దు కోవడానికి తిరుమణి పెట్టె తెరిస్తే తిరు

(శ్రీ)మణి (మన్ను) నిండుకుంది. ఎలా అని చింతిస్తు న్న రామానుజులకు తిరునారాయణుడి మాట వినిపించింది....

‘‘నేను ఓ పదిమైళ్ల దూరంలో ఉన్నాను. నా సన్నిధి మూతబడిపో యి ఉంది. నన్ను బయటకు తీసి నిలబెట్టవయ్యా

యతిరాజా’’ అని. వెంటనే బయలుదేరి ఆ కీకారణ్యంలో చెట్లను కొట్టిస్తూ దారి చేసుకుంటూ వెళ్తు న్నారు. ఆ

సమయంలోనే అటూ ఇటూ కొమ్మలు గీరుకుపో యి శరీరమంతా నెత్తు టి గాయాల రేఖలు ఏర్పడ్డా యి. (ఈనాటికీ
శ్రీరామానుజుని ఉత్సవ విగ్రహానికి చారలు గీతల మచ్చలు, అభిషేక తిరుమంజనాల సమయంలో కనిపిస్తా యంటారు.)

స్వామికోసం వెతుకుతూనే ఉన్నారు. ఎంతకూ కనిపించడం లేదు. ‘‘ఇక్కడే ఓ పుట్ట లోపల సరిగా చూడు అక్కడ

ఉన్నాను’’ అని మళ్లీ అశరీర వాణి వినిపించింది. సంపెంగ చెట్టు , దానికి ఉత్త రాన కొన్ని అడుగులదూరంలో బదరీ

వృక్షము (రేగు చెట్టు ) దానికి పడమరలో పుట్ట కనిపించింది. పుట్ట ను గునపాలతో కొడితే పాములకు దెబ్బ

తగులుతుందన్న భయంతో పాలు పెరుగు తెప్పించి పుట్ట పై పో యించారాయన. మన్ను కరిగి తిరునారాయణుడి

దివ్యమంగళ విగ్రహం బయటపడింది. ఆ ప్రా ంతంలో ‘మేలుకోట’ (ఈనాటి మేల్కోటే, కర్ణా టక) అనదగిన స్థ లంలో

భవ్యమైన ఆలయాన్ని రామానుజుని ఆలోచనలకు అనుగుణంగా శాస్త బ


్ర ద్ధ ంగా రాజు నిర్మింపజేశాడు.

తిరునారాయణమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. రాజుగారు తన కోశాగారంలో ఉన్న ఒక ప్రా చీన వజ్రకిరీటం ఆ మూర్తికి

అలంకరించాలనుకున్నారు. కాని శ్రీవారి శిరస్సుకు సరిపో లేదు.

అయితే ఆ కిరీటానికి తగిన విగ్రహం ఒకటి ఉండి ఉండాల్సిందే అని రామానుజులు అన్నారు. ప్రా చీనాలయాలు

విధ్వంసం చేసి శత్రు వులు కొందరు విగ్రహాల్ని ఎత్తు కుపో యి ఉంటారని కాలక్రమంలో చేతులు మారి ఆ విగ్రహం ఉత్త రాన

దెహలీ (దిల్లీ ) సుల్తా నుల చేతికి చిక్కిందని జనం చెప్పుకుంటున్న విషయం రామానుజులకు తెలిసింది. విగ్రహ రహస్యం

ఛేదించడానికి రామానుజులు ప్రా ర్థన చేశారు. ఏకాగ్ర చిత్త ంతో సాగిన ధ్యానంలో ఆయన చతుర్భుజుడై శంఖ చక్రధారియన

శ్రీరామపిళ్లై మూర్తి అనీ రామానుజులకు స్ఫురించింది. శ్రీరామపిళ్లై ని తిరిగి రప్పించడానికి రామానుజులు కొందరు

శిష్యులతో దిల్లీ నగరానికి బయలుదేరారు. పాదుషాను కలిశారు. తాము నిత్యమూ ఆరాధించే భగవంతుని మూర్తి

సుల్తా న్‌కోశాగారంలో ఉందని, దానికి తమకు తిరిగి ఇప్పించాలని కోరారు. ‘మా దగ్గ రే ఉన్నట్టు మీకే విధంగా తెలిసింది?’

అని అడిగారు. తిరునారాయణ మూలమూర్తి పుట్ట లోంచి ఆవిష్కారమైన విషయం, తనకు ధ్యానంలో శ్రీరామపిళ్లై

కనిపించిన సంగతి వివరంగా సుల్తా న్‌కు చెప్పారు ఆచార్యులు. రామానుజుని తేజస్సుకు సుల్తా ను అబ్బురపడ్డా రు.

విగ్రహం కోసం తన భాండాగారాన్ని రామానుజులకు చూపమన్నారు. కాని అందులో ఈ విగ్రహం కనిపించలేదు.

రామానుజాచార్యులు మరోసారి మహాధ్యానంలోకి వెళ్లి పో యారు. స్వామీ ఎక్కడున్నారు అని పరితపించారు. మనసులో

సాక్షాత్కరించారు. పాదుషా కూతురితో ఆడుకుంటున్నానని చెప్పారు స్వామి. మరునాడు ఆ విషయం పాదుషాకు

తెలిపారు.

‘‘ఇక్కడే మీ దేవుడు ఉన్నట్టు మీకు ఏవిధంగా తెలిసింది?’’ అని అడిగారు.


‘‘మాకు ధ్యానంలో స్ఫురించింది’’ అన్నారు. ‘‘ధ్యానంలో దైవం స్ఫురించిన మాట నిజమే అయితే మీరే పిలుచుకోండి.

మేం అంతఃపురానికి వెళ్లం, మిమ్మల్ని వెళ్లనివ్వం. మీ దేవుడు కదా వస్తా డేమో చూద్దా ం’’ అని నవ్వాడు సుల్తా న్‌. ‘‘వస్తే

మాతో పంపిస్తా రు కదా’’ అని రామానుజులు అడిగారు. నడిచి రావడం జరగనే జరగదనే నమ్మకంతో నిశ్చింతగా సుల్తా న్‌

‘‘తప్పకుండా’’ అని హామీ ఇచ్చారు. సుల్తా న్‌దర్బారులో పద్మాసనం వేసుకుని రామానుజుడు తదేక ధ్యానం చేశారు.

శ్రీరామపిళ్లై ని ప్రా ర్థించారు. ‘శ్రీరామపిళ్లై రా నాయనా’ అని మనసారా పిలిచారు. శ్రీకృష్ణు ని యశోద ఆప్యాయత నిండిన

స్వరంతో ‘‘వరుగ వరుగ విజ్ఞేవామననమ్బీ వరుగ విజ్ఞే’’ అని రామానుజుడు భక్తితో పిలిచినాడు. అంతఃపురంలో ఉన్న ఆ

రమణీయ విగ్రహం తనంత తానే ఛెంగు ఛెంగున వచ్చి రామానుజుని ఒడిలో చేరింది. సుల్తా న్‌ఆశ్చర్యంలో

మునిగిపో యాడు. రామానుజుల కన్నులు ఆర్ద్రతతో జలమయమైపో యాయి. సరిగ్గా అదే సమయానికి అంతఃపురంలో

విగ్రహం మాయం కావడం కలకలం రేపింది. యువరాణి ఆడుకునే ప్రియమైన విగ్రహం అదృశ్యమైందని ఫిర్యాదు

అందింది. ఆయనకు అర్థమైపో యింది– రామానుజులు ఒడిచర


ే ిన అత్యంత సుందరమైన ఆ విగ్రహం తన కూతురు

మనసు హరించిందని ఇన్నాళ్లూ ఆడుకున్నదని. రాణికి ఆ విషయం చెప్పి, ఒక యతికి ఇచ్చిన విగ్రహం మళ్లీ వాపస్‌

తీసుకోవడం జరగదని, మాట తప్పలేనని కనుక దాని గురించి మరిచిపొ మ్మని ఆదేశించాడు సుల్తా న్‌.

సుల్తా న్‌యంత్రా ంగం చేసిన సాయంవల్ల శ్రీరామపిళ్లై తో రామానుజ పరివారం మళ్లీ దక్షిణానికి తిరుగు ప్రయాణం

ప్రా రంభించింది. మేల్కోట చేరుకున్నారు. సంపత్‌కుమారుడని, శెల్వపిళ్లై (గారాబు తనయుడు) అని నామకరణం

చేశారు. దివ్యసుందర చెలువ నారాయణ (తిరునారాయణ) ఆలయంలో ఒక ప్రత్యేక సన్నిధానాన్ని సంపత్‌కుమారుడి

కోసం నిర్మింపజేశారు రామానుజులు. తన ధ్యానంలో రామానుజాచార్యుల వారికి సజ్జెహట్టి బావిలో శ్రీదేవి భూదేవి

(ఉభయ నాచ్చియార్లు ) విగ్రహాలు, సంపెంగ చెట్టు కింద యదుగిరి అమ్మవారు కనిపించారు, వారిని రప్పించారు.

నరసింహుని కొండలో పాండవ గుహలో విష్ణు వర్ధనునికి దొ రికిన పురాతనమైన వజ్రకర


ి ీటం (వైరముడి) తెప్పించారు. ఆ

కిరీటం శ్రీరామపిళ్లై కి సరిగ్గా సరిపో యింది. (ఆ విధంగా వజ్రకిరీటధారణ చేసన


ి ఆ రోజున ఇప్పడికీ వైరముడి ఉత్సవం

ఏటేటా చాలా వైభవంగా నిర్వహిస్తు న్నారు.) సుదర్శనచక్రా న్ని పదిమంది ఆళ్వార్ల ను, తిరుక్కచ్చినంబి (కాంచీ

పూర్ణు లు), శ్రీమన్నాథమునులు, శ్రీ ఆళవందార్‌(యామునాచార్యుల) విగ్రహాలను ప్రతిష్టించి తిరునారాయణపురం

ఆలయాన్ని అత్యంత ప్రా మాణికమైన నారాయణ క్షేత్రంగా నిలబెట్టా రు రామానుజులు. మూలవరులు

తిరునారాయణుడని, ఉత్సవమూర్తి శెల్వనారాయణుడని, తిరుమంజన బేరం (మూర్తి) నకువణ్‌పుగళ్‌నారాయణన్‌

అని, బలిబేరానికి వాళ్‌పుగళ్‌నారాయణన్‌అనీ, శయనబేరానికి ననేఱళిల్‌నారాయణన్‌అని నమ్మాళ్వార్ల పాశురాల్లో

ఉన్న నామాలను నిర్ధా రించారు. తను చిన్నతనం నుంచి చాలా ఇష్ట పడిన శెల్వపిళ్లై ని విడిచి తానుండలేనని చెప్పింది
యువరాణి. భోజనం చేయక మంచినీళ్లు తాగక నిరశన వ్రతం పట్టింది. ఓ విగ్రహం మీద ఇంత ప్రేమ ఏమిటని పాదుషా

ఎంత చెప్పినా వినలేదు. యతిరాజును ప్రా ర్థించి ఆ విగ్రహం తిరిగి తెచ్చుకుంటానని యువరాణి పట్టు బట్టింది. ఏమీ

చేయలేక పాదుషా పల్ల కీలో అమ్మాయిని భద్రతాదళంతో పంపించాడు. తిరునారాయణ పురం చేరేనాటికి శెల్వపిళ్లై ప్రతిష్ఠ ,

వారికి వజ్రకర
ి ీట ధారణ జరగడం, అత్యంత వైభవంగా దైనందిన తిరువారాధనలతో మంగళ తూర్యరావాలతో,

తిరువాయిమొళి తదితర ప్రబంధ పాశురాల అనుసంధానంతో శెల్వప్పిళ్లై అలరారుతున్న విషయం గమనించింది.

శాస్త ప
్ర క
్ర ారం ప్రా ణ ప్రతిష్ఠ చేసి నిత్యసేవలు అందుకున్న స్వామిని దరిచర
ే డం తీసుకుపో వడం సాధ్యం కాదని యువరాణికి

అర్థమైంది. ఆ స్వామి విరహాన్ని తట్టు కోలేక ఆమె అక్కడే అసువులు బాసింది.

రామానుజులు ఆమెలో విగ్రహం పట్ల ఉన్న అపరిమితమైన ఆర్తిని, ప్రగాఢ ప్రేమను గమనించి, ఆమె సామాన్యురాలు

కాదని, గోదాదేవి అంతటి భక్తు రాలని నిర్ధా రించి, ఆమెకు లక్ష్మీదేవితో సమాన స్థా నం కల్పించి బీబీ నాంచియార్‌అనీ

తులుక్కనాచ్చియార్‌అని నామకరణం చేసి మేల్కోటే నిత్యపూజలలో ఆమె ప్రతిరూపాన్ని నిలబెట్టా రు. ఆమెకు రొట్టెల

నైవేద్యంతో ఆరాధనా వ్యవస్థ ను కూడా ఏర్పాటు చేసినారు రామానుజులు. అక్కడే తిరునారాయణుడి

నిత్యారాధనోత్సవాలలో పాల్గొ ంటూ రామానుజులు నిత్యారాధనలో పాల్గొ ంటూ, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ,

మాసో త్సవ, రుతోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, కళ్యాణోత్సవ, అభిషేకోత్సవ, పఞ్చపర్వతోత్సవ, బ్రహ్మోత్సవ,

పవిత్రో త్సవ, తిరునక్షత్రో త్సవాలను జరిపిస్తూ 12 సంవత్సరాలు గడిపారు

విగ్రహంగా ఘనీభవించిన రామానుజులు

సహస్రా బ్ది ధారావాహిక – 28

శ్రీరంగం వైపు నడుస్తు న్నంత సేపు రామానుజులకు కూరేశుల గురించి ఆలోచనే.మహాపూర్ణు ల గురించి తపనే. ఏ

సమాచారమూ లేదు. వారికేమయింది. ఏ విధంగా ఉన్నారు. శ్రీరంగం చేరుకునే సమయంలోనే కూరేశులు శ్రీరంగాన్ని

విడిచిపో వలసి వచ్చిందని తెలిసింది. గోష్ఠీ పూర్ణు లవారు కూడా పరమ పదించారని, వారి తనయుడు తెర్కాళ్వార్‌

సంస్కారాలు నిర్వహించారని తెలిసింది.


కళ్యాణి పుష్కరంలో స్నానం చేసి, మంటపంలో తిరుమణి కాపుచేసుకుని, తిరునారాయణుని ధ్యానిస్తూ కూర్చున్న

రామానుజుడికి ఇద్ద రు వైష్ణవులు శ్రీరంగం నుంచి వచ్చారని చెప్పగానే ఆయన కళ్లు తెరచి
ి చూసాడు. ఎన్నాళ్ల యింది

శ్రీరంగానికి దూరమై, అని కళ్లు చెమర్చాయి.‘స్వామీ అడియేన్‌’ అని పాదాలపై బడి ‘కులోత్తు ంగ చోళుడి కంఠంలో

క్రిములు పుట్టి ఏమీ భుజించలేని పరిస్థితుల్లో నానాటికి క్షీణించి చివరకు అంతరించాడు. శ్రీవైష్ణవులకు ఉపద్రవం కూడా

అంతరించింది ఆచార్యవర్యా’ అని చెప్పారు. ‘ఓహో కళ్యాణి పుష్కరిణి కళ్యాణిదాన్‌అయింది’ (అంటే శుభం

కలిగింపజేసిందని) అని రామానుజులు సంతోషించారు. శెల్వనారాయణుని అనుమతి గ్రహించి శ్రీరంగానికి రామానుజుడు

బయలుదేరాడు. ‘మీరు వెళ్లి పో తే మేమంతా ఏం కావాలి? మేమూ వస్తా ం’ అని శిష్యులంతా కన్నీటి పర్యంతం అయ్యారు.

‘మీరంతా వస్తే ఇక్కడి ఆచార ఆరాధనా విధులు ఎవరు చేస్తా రు నాయనా’ అని రామానుజులు అంటే ‘ఏమో మేము

మాత్రం మీ నుంచి దూరం కాలేము స్వామీ’ అన్నారు వారు.రామానుజుడు తన విగ్రహాన్ని ఒకటి రూపొ ందింపజేసి తన

తపో శక్తితో అందులో తన జీవశక్తిని కొంత నిక్షిప్త ం చేసి, ‘ఇదిగో ఈ విగ్రహమే నేను, నన్ను ప్రేమతో పిలిచిన వారికి నేను

బదులు పలుకుతాను. ఇక నన్ను శ్రీరంగని సన్నిధానానికి వెళ్లనివ్వండి’ అని వారిని ఒప్పించారు. ఈ విగ్రహానికి తమర్‌

ఉగన్ద తిరుమేని (శిష్యులు ప్రేమతో ఆదరించిన శ్రీ విగ్రహం) అని పేరు.

తిరునారాయణపురంలో సర్వవిధ సేవలు సక్రమంగా జరిగేందుకు కట్టు దిట్టం చేశారు. 52 కుటుంబీకులను పిలిచి

ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. శెల్వపిళ్లై ని బావిగట్టు మీద ఉన్న బిడ్డ ను తల్లి చూసుకునేంత

జాగ్రత్తగా ప్రేమతో, ఆప్యాయతతో చూచుకోవాలని ఉపదేశించారు. బావిగట్టు మీద ఏ శిశువునూ తల్లి కూర్చోబెట్టదు. కానీ

వాడు మారాం చేస్తే గట్టు మీద నుంచి బావిని చూపించి నవ్విస్తు ంది. పాలుపడుతుంది. గోరుముద్ద లు పెడుతుంది.

పడిపో కుండా గట్టిగా పట్టు కుంటుంది. సనత్‌కుమారులు తిరునారాయణ పెరుమాళ్ల ను ప్రతిష్టించడం వలన ఇది

తిరునారాయణ పురమై భాసిల్లి ంది. ఈ నారాయణ క్షేత్రం కొండపై ఉంది కనుక నారాయణాద్రి అయింది. త్రేతాయుగంలో

దత్తా త్రేయ మహర్షి వేదపఠనంతో పుష్కరిణి ఏర్పడినందున వేదాద్రి అయింది. శ్రీ సీతారాములు వనవాస కాలంలో

ఇక్కడ కొన్నాళ్లు ండటం వలన సీతారామ క్షేత్రమయింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ బలరాములు ఉత్సవమూర్తిని

ప్రతిష్టించడం వలన యాదవాద్రి అయింది. రామానుజులు తిరిగి ప్రతిష్టించినందున యతిశైలమైంది. దీని చుట్టూ మేలైన

కోటను కట్టించడం వల్ల మేల్కోట అయింది.

శ్రీరంగం వైపు నడుస్తు న్నంత సేపు రామానుజులకు కూరేశుల గురించి ఆలోచనే. మహాపూర్ణు ల గురించి తపనే. ఏ

సమాచారమూ లేదు. వారికేమయింది. ఏ విధంగా ఉన్నారు. శ్రీరంగం చేరుకునే సమయంలోనే కూరేశులు శ్రీరంగాన్ని
విడిచిపో వలసి వచ్చిందని తెలిసింది. గోష్ఠీ పూర్ణు లవారు కూడా పరమపదించారని, వారి తనయుడు తెర్కాళ్వార్‌

సంస్కారాలు నిర్వహించారని తెలిసింది. దాదాపు అదే కాలంలో తిరుమలై అండన్, తిరువరంగప్పెరుమాళ్‌అఱైయార్,

శ్రీశైల పూర్ణు లు, కాంచీపూర్ణు లు కూడా పరమపదం చేరారని తెలిసింది. ఆర్ద్రమైన మనస్సుతో తన గురువులందరికీ

రామానుజులు అంజలి ఘటించారు. తనను నడిపిన అపురూప ఆచార్య సంపద తనకు దక్కినందుకు జన్మ

ధన్యమైందని భావించారు. ఆ గురువులు పెట్టిన అక్షయ అక్షర సంపదే తన జీవితమని అది వారికే అంకితమని

అంతరంగభావన చేశారు.

శ్రీరంగం చేరకముందే కూరేశుని ఇంటికి వెళ్లా రు రామానుజులు. పాదాలపై బడిన కూరేశుని ఆదరించి ‘నాకోసం కళ్లు

పెరుక్కున్నావా కూరేశా! అయ్యో ఎంత పని జరిగింది’ అని పరితపించారు. గాఢ పరిష్వంగంతో ఓదార్చారు. ‘నేను ఒక

వైష్ణవుడు ధరించిన నామాలు వంకరగా ఉన్నాయని విమర్శించాను స్వామీ! అందుకే నాకీ శిక్ష కాబో లు!’’ అని

కూరేశుడు అన్నారు. ‘‘కూరేశా రా ముందుగా కాంచీపురం వెళ్దా ం. అక్కడ వరదుడిని ప్రా ర్థించు’’ అని అక్కడికి

తీసుకువెళ్లా రు. కూరేశుడు వరదరాజస్త వం అనే అద్భుత స్తో త్రా న్ని చేశారు. వరదుడు ప్రత్యక్షమైతే నాలూరన్‌ను

అనుగ్రహించాలని కోరారు. ‘ఒక్క నాలూరన్‌ఏమిటి కూరేశా, నీతో సంబంధం ఉన్న వారందరికీ నా దగ్గ ర శాశ్వత

నివాసాన్ని, మోక్షాన్ని ఇస్తు న్నాను’ అని వరదుడు అన్నాడు. అది విని రామానుజులు ‘తిరుగోష్ఠియూర్‌నంబి

ఆదేశాన్ని ఉల్ల ంఘించినందుకు నాకు నరకమే కలుగుతుంది. కాని నీ వల్ల నీతో సంబంధం ఉన్న వారందరికీ వరదుడు

మోక్షం ఇవ్వడం వల్ల నాకు కూడా మోక్షం లభిస్తు న్నది’ అని సంతోషించారు. తనకు నేత్రా లను మాత్రం కూరేశులు

కోరుకోలేదు. కూరేశునికి చూపును ప్రసాదించమని రామానుజులు వరదుని ప్రా ర్థించారు. ఆచార్యుని సేవించుటకు

మాత్రం సర్పదృష్టిని కూరేశుడికి ఇస్తు న్నానని వరదుడు వరమిచ్చాడు. అందరూ శ్రీరంగానికి బయలుదేరారు.

ఓరోజు కూరేశుడు శ్రీరంగని ముందు నిలిచి తనకు భవబంధముల నుంచి విముక్తిని ప్రసాదించి తనలో చేర్చమని

కోరుకున్నారు. ‘‘నాకన్నా ముందే వెళ్ళిపో దామనుకుంటున్నావా నాయనా’’ అని రామానుజులు అడిగారు. ‘‘మీకు

వైకుంఠంలో నేనే స్వాగతం చెప్పాలి గురువర్యా. అక్కడ మీ ఆచార్యత్వాన్ని చాటాలి కదా’’ అన్నాడాయన.‘‘వైకుంఠంలో

ఈ బంధాలేవి ఉండవు. కాని నీవు అక్కడ కూడా ఈ అనుబంధాన్ని ఆశిస్తు న్నావంటే నీదెంత విశాల హృదయం

కూరేశా, అయినా నిన్ను వదిలి నేనుండగలనా?’’ అన్నారు రామానుజులు. ‘‘ క్షమించండి స్వామీ ఆ విషయం

మరిచా’’నని కన్నీట ఆచార్యుని పాదాలు కడిగారు కూరేశులు. ఆయన పాదాలను శిరసున ధరించారు. వారి శ్రీపాద

తీర్థా న్ని స్వీకరించారు. యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహితస్త దితరాణి తృణాయమేనే


అస్మద్గు రోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే నిత్యం అచ్యుతుని పాదాలను సేవిస్తూ

ఇతరములన్నీ గడ్డితో సమానమని తృణీకరించే మా గురువు రామానుజుని పాదములే నాకు శరణు అని ప్రా ర్థించారు

కూరేశులు. కొద్దిరోజుల తరువాత కూరేశులు కుమారులైన వ్యాస పరాశర భట్టు లను పిలిచి ‘అమ్మ జాగ్రత్త నాయనా ఇక

మీ తల్లిదండ్రు లు రంగనాయకి రంగనాథులే’అని శిరస్సును శ్రీరంగని వైపు, పుత్రు ల ఒడిలో ఉంచి పాదములను భార్య

ఆండాళ్‌ఒడిలో ఉంచి నిర్విచారంగా, రామానుజునే మనసునిండా స్మరిస్తూ తుది శ్వాస విడిచారు. రామానుజులు వారికి

స్వయంగా అంత్యేష్టి నిర్వహించారు. పుత్రు లను ఓదార్చారు. మఠాధిపత్యాన్ని కూరేశుడి పుత్రు డు పరాశరుడికి

అప్పగించారు.

దాశరథి పుత్రు డు కందాడై అండన్‌‘అయ్యా! మీ విగ్రహాన్ని భూతపురి (శ్రీ పెరుంబుదూర్‌)లో ప్రతిష్టించుకునేందుకు

అనుమతించాల’ని రామానుజుని కోరుకున్నారు. ఒక విగ్రహాన్ని తయారుచేయించి, దాన్ని ఆలింగనం చేసుకుని శక్తిని

ప్రవేశపెట్టి కొంత బలహీనులైనారు. ఆండన్‌ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లి రామానుజుని జన్మస్థ లంలోని ఆదికేశవ

పెరుమాళ్‌ఆలయంలో ప్రతిష్టింపజేసారు. అక్కడ తన విగ్రహ అభిషేక నేత్రో న్మీలన సమయంలో ఇక్కడ రామానుజులకు

కళ్లు కదలిపో యాయి. ఆ ప్రతిష్ట జరిగినన్ని రోజులు రామానుజులు అస్వస్థ త చెందారు. రెండో సారి షష్టిపూర్తి జరిగి 120

నిండుతున్నదని గమనించారు. ఆండన్‌ను, ఇతర శిష్యులను పిలిపించారు. ఎన్నెన్నో బో ధనలు చేస్తు న్నారు. ఎందుకో

శిష్యులకు అర్థం కావడం లేదు. ‘భగవంతుడికి అనుకూలంగా ఉండండి, పాముకు దూరంగా ఉన్నట్టు నాస్తికులకు

దూరంగా ఉండండి. సంసారులలో ఆసక్తి ఉన్నవారికి శాస్త జ


్ర ్ఞా నం బో ధించండి. ఆసక్తి లేకపో యినా వారి పట్ల

దయచూపండి. వైష్ణవుల పట్ల అపరాధం చేయకండి. శ్రీభాష్యం చదవండి. బో ధించండి. వీలు కాకపో తే తిరువాయ్‌మొళి

చదవండి చదివించండి. ఏదైనా పుణ్యక్షేత్రంలో గుడిసె కట్టు కుని సేవించండి. లేదా ఆలయాలకు వెళ్లి సేవ చేయండి. అదీ

కాకపో తే ద్వయమంత్రం పఠించండి. మంత్ర భావాన్ని తెలుసుకొండి. అశక్తు లైతే వైష్ణవులను సేవించండి. ఇక నాకు

సెలవివ్వండి. నేను ఈ దేహాన్ని విసర్జించవలసిన సమయం ఆసన్నమైంది’ అనగానే శిష్యులు నిర్ఘా ంతపో యారు.

‘దుఃఖించకండి నాయనా. నారాయణుని పూజించినట్టు వైష్ణవులను పూజించండి. అర్చామూర్తిని బొ మ్మ అనుకోకండి,

గురువు సామాన్యమానవుడనుకోకండి.’ అని బో ధించారు.

శిరస్సును గోవిందుని ఒడిలో ఉంచి పాదములను వడుగనంబి ఒడిలో పెట్టి శిష్యులందరికీ తోచిన బో ధనలు చేస్తూ

కన్నుమూసారు. నిన్ను వదులుకోను అని రంగనాథుడు అన్నట్టు రామానుజుని చరమశ్రీ శరీరం (తిరుమేని)కి

శ్రీరంగనాథుడి ఆజ్ఞ మేరకు తన ఆలయ సముదాయంలోని వసంత మండపంలో ఆలయం నిర్మింపజేసారు. నేటికీ
తానాన తిరుమేనిగా శ్రీమద్రంభగవద్రా మా నుజులు కూర్చున్నభంగిమలో విగ్రహంగా ఘనీభవించిన ఆయన శ్రీశరీరాన్ని

ఇప్పటికీ శ్రీరంగంలో అందరూ దర్శించుకోవచ్చు. 1017 లో ప్రా రంభమైన రామానుజ జీవనం 1137 పింగళనామ

సంవత్సరం మాఘమాసం దశమీ తిథిరోజున ముగిసింది. 120 సంవత్సరాల రామానుజ మార్గ ం శాశ్వతంగా

ప్రతిష్టితమైంది. రామానుజులు తీర్చిదిద్దిన క్షేత్రా లు శ్రీరంగం, కాంచీపురం, తిరుమల, తిరునారాయణ పురం. అందుకే..

శ్రీరంగమంగళ మణిం కరుణా నివాసంశ్రీ వేంకటాద్రి శిఖరాలయ కాలమేఘమ్‌శ్రీ హస్తిశైల శిఖరోజ్జ ్వల పారిజాతమ్‌శ్రీశం

నమామి శిరసా యదుశైల దీపమ్‌ఆదిశేషుడై, సేనాని విష్వక్సేనుడై, చివరకు శ్రియఃపతియై ఈ లోకానికి వచ్చిన

మహాజ్ఞా నియా ఈ రామానుజుడు అని మనకు అనిపించేంత మహానుభావుడు. వేయేళ్ల కిందట అవతరించిన మహా

ప్రా జ్ఞు డు. శేషో వాసైన్యనాథో వా శ్రీపతిర్వేతిస్వాత్త్వికైఃవితర్క్యాయ మహా ప్రా జ్ఞైర్భాష్యకారాయ మంగళమ్‌రామానుజార్య

దివ్యాజ్ఞా వర్థతాం అభివర్థతాం (ఆయన దివ్యోపదేశాలు నిత్యం అభివర్థనం చెందుగాక).సమాప్త ం.

‘రామానుజ మార్గ ం’ రచయిత ఆచార్య మాడభూషి శ్రీధర్‌

You might also like