You are on page 1of 13

రామానుజాచార్యుడు

రామానుజాచార్యుడు

శ్రీరంగంలోని, శ్రీ రంగనాథస్వామి దేవాలయంలోని రామానుజుని


విగ్రహం

జననం లక్ష్మణ, ఇలయ పెరుమాళ్ గా


కూడా పిలువబడుతారు.
1017 CE
శ్రీపెరంబదూర్, (ప్రస్తు తం
తమిళనాడు) -భారత దేశ

నిర్యాణము 1137 CE
శ్రీరంగం, ప్రస్తు తం తమిళనాడు)
-భారత దేశం

బిరుదులు/గౌరవాలు ఎంబెరుమార్, ఉదయవార్,


యత్రిరాజ, వైష్ణవ మత గురువు.

గురువు యమునాచార్య

తత్వం విశిష్తా ద్వైతం

సాహిత్య రచనలు వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా


భాష్యం, వేదాంత దీపం, వేదాంత
సారం, శరణాగతి గద్యం, శ్రీరంగ
గద్యం, శ్రీ వైకుంఠ గద్యం, నిత్య
గ్రంథం.

రామానుజాచార్య లేదా రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టా ద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి.


రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన
నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.

ముఖ్య ఉద్దేశాలు[మార్చు]

ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన (సాధించిన) ముఖ్య ఉద్దేశాలు:


 మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తు న్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ
మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
 రెండవది విశిష్టా ద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.
 ప్రస్థా న త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.
 విశిష్టా ద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి. ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో
జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం, శాలివాహన శకం
ప్రకారం 930 సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి, కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు : పింగళ నామ సంవత్సరం, చైత్ర
మాసం. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం.
ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా , కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస
కాలంలోనే ఆయనలోని విశిష్టా ద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టా ద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న
ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టా ద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి
విశిష్టా ద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న
విశిష్టా ద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టా ద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టా ద్వైత మత
ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని అంటారు. రామానుజుడు విశిష్టా ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ, కొన్ని సంప్రదాయాలను
ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్‌
నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్‌ నంబి
యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి
కలుగుతుందనీ నంబి చెపితే ‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి, అందరికీ ముక్తి కలుగుతుంది గదా!’’ అనే ఉదార భావనతో ఆయన
గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు. రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ
సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టా ద్వైతాన్ని ప్రచారం చేయడానికి
పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తా ద వైష్ణవులూ, అమ్మం గార్లూ శ్రీ వైష్ణవ దాసులు కైంకర్యం
చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టా రు. తన జీవితం
ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం
నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టా ద్వైతం ‘‘ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు
ఏర్పడ్డా యి’’ అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం ప్రచురించిన ‘‘భార్గవ పురాణం’’ గ్రంథానికి పరిష్కర్తగా రచించిన ‘‘ఆళ్వారాచార్యుల చరిత్ర
తత్త్వం’’ వ్యాసంలో వ్రాశారు. (‘‘విశిష్టా ద్వైతం’’ వివరణలో మరికొన్ని సైద్ధాంతిక విశేషాలు.)

ఆయన సందేశాలు[మార్చు]

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:

 ప్రస్తు తం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డు రాక మునుపే వాటిని గుర్తించి
సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథమ కర్తవ్యం.
 దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు.
దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
 మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో
నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.
 ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం
లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

దేశకాల పరిస్థితులు[మార్చు]

రామానుజుల జన్మసమయానికి దక్షిణభారత దేశాన ఉన్న రాజవంశాలు, వారి మతసంబంధిత రాజకీయాలను ఈ క్రింది విధంగా సంక్షిప్త పరచవచ్చు:
 చోళులు - చోళులు వైదికమత విధివిధానాలను పాటించేవారు. చోళరాజ ప్రముఖులలో ఒకడైన రాజరాజ నరేంద్ర చోళుడే వైదికమతకర్మలను,
వర్ణాశ్రమాలనూ, ప్రోత్సహించి, పలు యజ్ఞయాగాదులు చేయించాడు. ఒకటవ కుళోత్తుంగ చోళుడు కూడా ఎందరో వైదిక బ్రాహ్మణులను ఆదరించి,
దానధర్మాలు చేశాడని చరిత్రలో ఋజువులు ఉన్నాయి.[1]
 చాళుక్యులు - చాళుక్యులు మొదట శైవులైనప్పటికీ, రానురాను జైనమతాన్ని ఆదరించారని చరిత్ర చెబుతోంది. తూర్పు, పశ్చిమ చాళుక్య
రాణులు అనేకమంది జైనమత ప్రభావానికి లోనై తమ రాజులను ఆ మతాన్ని ఆదరించేటట్లు గా మార్చి ఉన్నారని శిలాశాసనాలద్వారా తెలుస్తోంది.
వేంగీ ( ఏలూరు) ప్రాంతాధిక్యతకై చోళ చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధా లలో అనేక మార్లు చోళులు చాళుక్య జైన ఆరామాలను, మందిరాలను
ధ్వంసం చేశారని ఋజువులు ఉన్నాయి.[2]
 హోయసళ రాజులు - నేటి ఉత్తర కర్ణాటక ప్రాంతాలైన బేలూరు, బాదామిలను రాజధానులుగా చేసికొని, కర్నాటక ప్రాంతాన్ని పరిపాలించిన
హోయసళ రాజులు జైన, వీరశైవ మతాలను ఆదరించారు. బిత్తిదేవన్ లేక బిత్తిగ లేక విష్ణు అను పేరున్న హోయసళ రాజును రామానుజాచార్యుడు
జైనమతానుసరణ నుంచి వైష్ణవానికి మరల్చినట్టు గా చారిత్రక ఆధారాలున్నాయి.[3]

ఇవియే కాక, ఈ క్రింది మతసంబంధిత విషయాలను కూడా మనసులో ఉంచుకోవటం వల్ల, రామానుజాచార్యుని జీవితాన్ని, ఆయన చేసిన సేవను మరింత
హర్షించవచ్చు.

 రామానుజుల కాలానికి మౌర్యరాజులు (ముఖ్యంగా అశోకుడు) ఆదరించిన బౌధ్ధమతం క్షీణదశలో ఉండినది. దీనికి ఆదిశంకరులవారి అద్వైత
వేదాంతము కూడా కొంత కారణమై ఉండవచ్చు.
 రాజాదరణ పొంది, ప్రాబల్యాన్ని పుంజుకొన్న జైన, శైవ మతాలు, స్థా నిక ఆచారవ్యవహారాలతో కలసి అనేక శాఖలుగా విభజితమైనవి [4]. ఈ
వేర్వేరు శాఖలు, వేర్వేరు సిధ్ధాంతాలను ప్రతిపాదిస్తూ, తమ తమ శాఖలే గొప్పవని ఉటంకిస్తూ, మూల ఉపనిషత్సారాన్ని ప్రజలకు అందించలేక
పోయాయి.[5]
 ఈ కాలంలో భక్తిమార్గానికి చాలా ప్రాబల్యం ఉండినది. భక్తిమార్గానికీ, విగ్రహారాధనకూ ఉన్న సంబంధం వలన పైన పేర్కొన్న రాజులందరూ, ఎన్నో
దేవాలయాలు నిర్మించి, ఆ మార్గాన్ని ప్రోత్సహించటం జరిగింది. రాముడు, కృష్ణుడు, శివుడు (వేర్వేరు రూపాలలో) దేవుళ్ళుగా ఆరాధనలను
అందుకోవటం ఈ కాలం యొక్క విశిష్టమైన మతసంబంధితమైన మార్పుగా చెప్పుకోవచ్చు.[6]

జీవితకాల నిర్ణయం[మార్చు]

సాంప్రదాయక జీవితచరిత్రకారుల ప్రకారం, రామానుజాచార్యులు క్రీ.శ. 1017 - 1137 సంవత్సరాల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడు. వీరి ప్రకారం
ఆచార్యుల జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.) సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ 'పింగళ' సంవత్సరంలో
జన్మించి, మరో 'పింగళ' సంవత్సరంలో పరమపదించారు.[7] తమిళ కాలమానం ప్రకారం ఒకే పేరుగల సంవత్సరం మళ్ళీ రావటానికి అరవై సంవత్సరాల కాలం
పడుతుంది. దీన్ని బట్టి మనం రామానుజాచార్యుల జీవితం అరవై లేక నూట ఇరవై సంవత్సరాలు ఉండవచ్చని భావించవచ్చు.[citation needed]

క్రీ.శ. 1917 లో టి.ఏ. గోపీనాథ్‌, సాంప్రదాయక మూలాల ఆధారంగా, రామానుజాచార్యులను శైవమతాధిక్యతను ఒప్పుకొనేందుకు బలవంతం చేసిన
రాజును, ఒకటవ కుళోత్తుంగ చోళునిగా గుర్తించి, ఆచార్యుల మేలుకోట ప్రవాసం క్రీ.శ. 1079 - 1126 ప్రాంతంలో జరిగినట్టు గా అనుమానించారు. ప్రవాస
కాలం నలభై ఏడు సంవత్సరాలు కావటం, ఒకటవ కుళోత్తుంగ చోళుడు వైష్ణవమత ద్వేషి కాకపోగా వైదికమత ఆదరణలో భాగంగా ఎన్నో దానాలను
చేసినట్టు గా చారిత్రక ఆధారాలుండటం, ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపాలని చెప్పుకోవచ్చు.

టి.యన్. సుబ్రమణియన్ అనే మద్రాసు ప్రభుత్వ ఉద్యోగి, 'రామానుజాచార్య దివ్య చరితై' అనే తమిళ సాంప్రదాయక జీవితచరిత్రలో ఉల్లేఖించిన శ్రీభాష్య
రచనా సమాప్తి కాలం (క్రీ.శ. 1155-1156) ప్రకారం, రామానుజుల జీవితకాలం క్రీ.శ. 1077 - 1157 మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఈ
జీవితకాలం 80 సంవత్సరాలు కావటం, వైష్ణవ ద్వేషి ఐన రెండవ కుళోత్తుంగ చోళుడు ఇదే సమయంలో రాజ్యమేలటం, ఈ అంచనా సరియైనదేననటానికి
ఋజువులుగా చెప్పుకోవచ్చు. 'విష్ణువర్ధనుడు' అనే పేరు గల హోయసళ రాజు (హోయసళ రాజులు) ఇదే సమయంలో కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించటం
కూడా గమనించదగ్గ విషయం (ఇతడే పైన చెప్పుకొన్న భిత్తిగ దేవుడు అయి ఉండవచ్చు). ఐతే దేవాలయ శిలాశాసనాలు, రామానుజాచార్యుడు, అతని
శిష్యులు మేలుకోటలో క్రీ.శ. 1137 కు ముందే నివాసమున్నట్లు తెలుపుతుండటం ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపంగా చెప్పుకోవచ్చు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన విశిష్టా ద్వైత మతోద్ధా రకుఁడు. ఈయన 800 సంవత్సరములకు ముందు అవతరించినట్టు తెలియవచ్చెడి. ఈయన తండ్రి ఆసూరి
కేశవాచార్యులు. తల్లి కాంతిమతి. జన్మస్థా నము చెన్నపురికి సమీపమున 26 మయిళ్ల దూరమున ఉండు శ్రీ పెరుంబూదూరు (భూతపురము).
విద్యాభ్యాసము చేసినచోటు కాంచీపురము. సకల శాస్త్రములను యాదవ ప్రకాశులు అను అద్వైత మతావలంబి అగు సన్యాసివద్ద చదివి, వానికెల్ల
విశిష్టా ద్వైత పరముగా అర్థము సాధించి ఆమతమును స్థా పించి పిమ్మట త్రిదండసన్యాసి అయి యతిరాజు అనుపేరు పొంది, మేలుకోట
(తిరునారాయణపురము) శ్రీరంగము తిరుపతి మొదలగు అనేక దివ్యస్థలములయందు మఠములను ఏర్పఱచి అచ్చటచ్చట వైష్ణవ మతమును
స్థా పించెను. వెండియు ఈయన బహుదేశాటనము చేసి పలుమతముల వారిని జయించి శిష్య సంఘమును సంపాదించి తమ మతమును
వృద్ధిపొందించెను. ఈయన వ్యాససూత్ర భాష్యము, గీతాభాష్యము, తర్కభాష్యము, వేదార్థసంగ్రహము, న్యాయామృతము, వేదాంత ప్రదీపము, వేదాంత
తత్త్వసారము, నారదీయ పాంచరాత్రాగమము, రంగనాథస్తవము, గద్యత్రయము, మఱియు పెక్కు స్వరూప గ్రంథములను రచియించెను. కనుక
ఈయనకు భాష్యకార్లు అనియు ఎంబెరు మానారు అనియు నామధేయములు కలిగెను. ఈ రామానుజాచార్యులు శేషాంశసంభూతుఁడు.

జన్మ స్థలం, నక్షత్రం , ఇతర వివరాలు[మార్చు]

మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూరులో శ్రీమాన్ ఆసూరి 'సర్వక్రతు' కేశవ సోమయాజి దీక్షితార్, కాంతిమతి అను పుణ్య దంపతులు
ఉండేవారు. వేదాలలో చెప్పబడిన అన్ని యజ్ఞాలనూ పూర్తిచేసి 'సర్వక్రతు' బిరుదును పొందిన కేశవ సోమయాజి, ఎంతకాలానికీ తమకు సంతానం కలుగక
పోవటంతో, భార్య కాంతిమతితో కలసి, తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్) ఒడ్డు న ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి
సంతానం పొందే ఉద్దేశంతో శ్రీపెరుంబుదూరును వదిలి వెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరిరువురికి ఒక సంవత్సరం అనంతరం జన్మించిన శిశువు
రామానుజాచార్యుడు.[8] 'శ్రీ వైష్ణవ ఆచార్య పరంపర' అను సాంప్రదాయక గ్రంథం ప్రకారం, ఈ పుణ్యదినం కలియుగ సంవత్సరం 4118, పింగళ వర్షం,
చైత్ర మాసం, తిరువాదిరై రాశి (ఆరుద్ర నక్షత్రం), శుక్లపక్ష పంచమి, శుక్రవారం. ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ తేదీ క్రీ.శ. 1017, ఏప్రిల్ 13.[9].

నామకరణం[మార్చు]

శిశువు యొక్క జనన మాసం,, రాశి దశరథ పుత్రు లైన లక్ష్మణ శత్రు ఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ అయిన పెరియ
తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, "ఇళయ పెరుమాళ్" అనే నామధేయాన్ని నిర్ధా రిస్తా డు.[10][11] శిశువు
శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తు లను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన 'తిరువోయ్‌మోళ్ళి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ
సంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.[10]

బాల్యం, వివాహం, విద్యాభ్యాసం[మార్చు]

కంచిపూర్ణుడు[మార్చు]

ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో 'కంచిపూర్ణుడు' అనే భక్తు డు రోజూ కాంజీవరం (నేటి కంచి) నుంచి శ్రీపెరుంబుదూరు మీదుగా 'పూణమ్మెల్లె' అను
గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకై వెళ్ళేవాడు. అతడి శ్రధ్ధా భక్తు లు చిన్ని ఇళయ పెరుమాళ్‌ను ఎంతగానో ఆకర్షించాయి. ఒకరోజు పూజ పూర్తి చేసుకుని
తిరిగి వెడుతున్న కంచిపూర్ణుడిని ఇళయ పెరుమాళ్‌ తన ఇంటికి సాదరంగా అహ్వానించి, అతడి భోజనానంతరం అతడి కాళ్ళుపట్టడానికి ఉద్యుక్తు డైనాడు.
కానీ, నిమ్నకులానికి చెందిన కంచిపూర్ణుడు తత్తరపాటుతో వెనక్కు తగ్గి, ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించిన ఇళయ పెరుమాళ్ సేవను నిరాకరించాడు.
భగవంతునిపైనున్న అతడి భక్తిశ్రధ్ధలు కేవలం అలంకారప్రాయమైన జంధ్యానికంటే ఉన్నతమైనవని, అందుచేత 'కంచిపూర్ణుడు' తనకు గురుసమానుడని
వాదించి, ఇళయ పెరుమాళ్ అతడిని ఆకట్టు కున్నాడు. ఆనాటి నుంచి వారిద్దరిమధ్య పరస్పర గౌరవమర్యాదలు, ప్రేమ ఏర్పడ్డా యి. భక్తిలోని మొదటి
పాఠాలు ఇళయ పెరుమాళ్ కంచిపూర్ణుడి వద్దనే అభ్యసించాడని చెప్పుకోవచ్చు.[10][12]

యాదవప్రకాశుడు[మార్చు]

ఇళయ పెరుమాళ్‌కు పదహారవ ఏట రక్షమాంబ లేక తంజమ్మాళ్‌తో వివాహం జరిగింది. వివాహానంతరం తండ్రి కేశవ సోమయాజి పరమపదించటంతో,
కుటుంబ సమేతంగా, ఇళయ పెరుమాళ్ కాంచీ నగరానికి తరలివెళ్ళాడు. నాటికి కంచిలో పేరుపొందిన 'యాదవప్రకాశ' ఆచార్యుని వద్ద విద్యాభ్యాసం
చేయసాగాడు. యాదవప్రకాశుడు అద్వైతం లోనూ భేదాభేద వేదాంతం లోనూ పాండిత్యాన్ని గడించి, అనేకమంది శిష్యులనాకర్షించి, వారికి
విద్యనొసగుతుండినాడు. ఇళయ పెరుమాళ్‌ వంటి అసామాన్య ప్రతిభగల శిష్యుడు దొరికినందుకు పరమానందభరితుడైన యాదవప్రకాశుడు అనతి
కాలంలోనే ఇళయ పెరుమాళ్‌ యొక్క 'భక్తి' పరమైన ఆలోచనావిధానాన్ని గమనించాడు. యాదవప్రకాశుని ఉపనిషద్వ్యాఖ్యలు అకర్మికము,
అనాస్తికములుగా ఉండటం ఇళయ పెరుమాళ్‌ను బాధించేది.[13] తత్కారణంగా అతడు తన గురువుతో తరచుగా వాగ్వాదానికి దిగేవాడు.

ఒకనాడు 'ఛాందోగ్యోపనిషత్తు ' పై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని ఆదిశంకరుడు 'ఎర్రనైన కోతి పిరుదులను
పోలిన (కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని అనువదించినట్లు గా యాదవప్రకాశుడు తన శిష్యులకు చెప్పాడు.[citation needed] అదివిన్న ఇళయ
పెరుమాళ్ కన్నులలో ధారగా నీరుకారసాగింది. యాదవప్రకాశుడు కారణమడుగగా అది సరైన వ్యాఖ్య కాదని బదులిచ్చాడు ఇళయ పెరుమాళ్.
ఆగ్రహించిన యాదవప్రకాశుడు వేరొక వ్యాఖ్యను చేయమని హేళన చేయగా 'కప్యాసం' అనే పదానికి 'కం జలం పిబతి ఇతి కపిః' (నీటిని గ్రహించువాడు,
అనగా సూర్యుడు) అని నూతనార్థా న్ని చెప్పి 'కప్యాసం పుణ్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని 'నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పించిన (కప్యాసం)
కమలాలవంటి కన్నులుగలవాడు' అని భావాధిక్యతనూ, ఆస్తికత్వమునూ ఉటంకించే అర్థా న్ని చెప్పాడు. మరొకమారు 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అనే
మహావాక్యంపై జరుగుతున్న వాదంలో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మయొక్క గుణాలనీ, అవే బ్రహ్మ కాదనీ యాదవప్రకాశునితో వాదించాడు.[14]

ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్‌ యొక్క పాండిత్యం, ఆస్తికత్వంతో కూడిన ఆ ర్ద్రతాభావం,, భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవప్రకాశుడికి
కంటగింపు కాసాగింది. అహంకారపూరితమైన మనస్సుతో, ఈర్ష్యతో, అతడు ఇళయ పెరుమాళ్‌ను హతమార్చటానికి పన్నాగం పన్నాడు. గోవిందుడనే
శిష్యుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొన్న ఇళయ పెరుమాళ్ సమయానికి తప్పించుకోగలిగాడు. సాంప్రదాయక గ్రంథాల ప్రకారం, ఈ తరుణంలో
కంచిలో వెలసిన 'వరదరాజ స్వామి' దంపతులు మారువేషంలో వచ్చి ఇళయ పెరుమాళ్‌కు కంచి దారి చూపించి అతడిని రక్షించారని తెలుస్తుంది. తరువాత
కొంత కాలానికి ఇళయ పెరుమాళ్‌వాదనలను అంగీకరించలేని యాదవప్రకాశుడు, అతడిని తన శిష్యరికం నుంచి విముక్తు ణ్ణి చేస్తా డు.

ఏది ఏమైనప్పటికి, బ్రహ్మసూత్రాలనూ, ఉపనిషత్తు లనూ, పురాణగ్రంథాలను, ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తు న్నారో తెలుసుకోవటానికి యాదవప్రకాశుడి శిష్యరికం
ఎంతగానో దోహదపడిందనటంలో అతిశయోక్తి లేదు. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకోవటానికి, ఇళయ
పెరుమాళ్‌కు యాదవప్రకాశుడి శిష్యరికం సహకరించింది.

యమునాచార్యుడు[మార్చు]

'ఆళవందార్‌' అను నామధేయముతో ప్రసిద్ధు డైన యమునాచార్యుడు, వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఈయన తిరుచిరాపల్లి (నేటి తిరుచ్చి)
జిల్లా లో ఉన్న శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి దేవస్థా నంలో తన సేవలనందించేవారు. యాదవప్రకాశుని శిష్యరికంలో ఉన్న ఇళయ పెరుమాళ్ యొక్క
గొప్పతనాన్ని, తెలివి తేటలను, భక్తి పరమైన వ్యాఖ్యలను చూసి, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయంగా ఇళయ
పెరుమాళ్‌ను కలుసుకోవాలని ఈయన కాంచీపురాన్ని సందర్శించాడు కూడా. కానీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్‌ను కలవలేక, నిరాశతో
వెనుదిరిగాడు. యాదవప్రకాశుడు తన శిష్యగణం నుంచి ఇళయ పెరుమాళ్‌ను తొలగించిన విషయం తెలియగానే, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలనే
ఉద్దేశ్యాన్ని 'మహాపూర్ణుడు' అనే శిష్యుని ద్వారా తెలియచేశాడు.

మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్‌ను కలుసుకొని శ్రీరంగం తీసుకువెళ్ళే లోపల యమునాచార్యుడు తన ఆఖరిశ్వాసను విడిచాడు. ఇళయ పెరుమాళ్,
మహాపూర్ణుడు వచ్చే సమయానికి యమునాచార్యుల భౌతిక కాయం అంత్యక్రియలకు సిధ్ధపరచబడి ఉంటుంది. కాని ఆయన కుడి చేతి మూడు వేళ్ళు
ముడుచుకొని ఉండటం ఇళయ పెరుమాళ్ గమనిస్తా డు. ఆ మూడు వేళ్ళూ తను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ
పెరుమాళ్ ఈ క్రింది మూడు శపథాలను చేస్తా డు.

 వైష్ణవ సంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ బోధన, శరణాగతితో కూడిన మత ప్రతిపాదన, ప్రచారం,


అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
 వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాలకు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.
 భాగవత, విష్ణుపురాణాలను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను
ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించటం.

గోష్టిపూర్ణుడు[మార్చు]

ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టా క్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి, అందరికీ ఉపదేశిస్తా డు. గురువు
'నీవు నరకానికి వెడతావేమో' నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తా డు.[15]

కార్యకలాపాలు[మార్చు]

రామానుజులు తన జీవితకాలంలో విశిష్టా ద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం, పలు ఆలయాల్లో మూర్తు లను విష్ణు సంబంధమైన విగ్రహాలుగా
నిరూపించడం, ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలు, పరిపాలన పద్ధతులు ఏర్పరచడం వంటి కార్యకలాపాలు నిర్వహించారు. ఆ క్రమంలో
విస్తృత పర్యటనలు, వాద ప్రతివాదాలు చేశారు.

తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు[మార్చు]

తిరుమలలోని మూలవిరాట్టు (ధ్రు వబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది.
తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తు న్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు
ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు
వెళ్ళి వాదించారు. శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపి ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని
కోరారనీ, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ
ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టు దిట్టా ల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రు వబేరానికి
శంఖ చక్రా లు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తా నికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధా రించడంతో తిరుమలపై
వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.
అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి
వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే.
ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా
రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి
అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తు న్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను,
పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. అంటరాని వారికి గుడిలో ప్రవేశం కల్పించడమే కాకుండా వారిని కైంకర్య
సేవకు నియమించారు శ్రీ వైష్ణవ దాసులు (మాదిగమాలదాసులు), తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూపనిర్ధా రణలో, ఆగమ
పద్ధతుల్లో తిరుమల-తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.[16]

రామానుజుని ప్రతిజ్ఞ[మార్చు]

తనగురువు తనకు చెప్పిన తిరుమంత్రాన్ని ప్రజలందరికి తెలియజెప్పి తనమతంలో తరతమాలు లేవని నిరూపించినవాడు రామానుజుడు.తను నమ్మిన
సిద్ధాంతాన్ని ప్రచారం చేయుటకు పూనుకొని ఆసిద్దాంతాన్ని వ్యతిరేకించినవారిని సయితము చిరునగవుతో లాలించి గౌరవించేవాడు. తనను గౌరవింపమని
తన మతాన్ని పెంపొందింపమని ఏరాజును అర్ధించలేదు. వైష్ణవాన్ని బలవంతంగా ఎవరికి ఇప్పించలేదు. ఆనాడు కులోత్తుంగ చోళుడు తనకున్న
అధికారగర్వంతో సామ్రాజ్యాలను కబళించాడు. ఆ రాజు శైవుడు. అందుచేతనే తన దేశంలో వైష్ణవుడు ఉండటానికి వీల్లేదని హింసలు పెట్టా డు. ఇట్టి
పరిస్థితులు దేశంలో ఉన్నప్పటికి రామానుజుడు తన మతాన్ని ప్రచారం చేయుట ఆపలేదు. దేశంలో అందరు రామానుజుని ప్రతిభను గుర్తించారు.
రామానుజుని ప్రతిభ కులోత్తుంగుని హృదయాన్ని మానని గాయం చేసింది. రామానుజుని వర్గం ఒక వైపున వైష్ణవ మత ప్రచారం చేస్తు న్నది. మరొకవైపున
కులోత్తుంగుడు దానిని నాశనం చేయుటకు పూనుకున్నాడు. కులోత్తుంగ ప్రధాని త్రిపురాంతకుడు ప్రేరణ వలన కులోత్తుంగుడు రామానుజుని పైన ద్వేషం
ఏర్పరచుకొన్నాడు. రాజు, రామానుజుని బంధించాలని ప్రయత్నించాడుకాని సాధింపలేకపోయాడు. చివరకు కులోత్తుంగుడు తానుచేసిన తప్పిందాన్ని
గ్రహించి, అటుపై జీవతంలో ఎదురైన సమస్యలకు తాళలేక సిగ్గుపడి దుఃఖపడి ప్రజలకు మతస్వాతంత్ర్యం ప్రదానం చేసాడు. ప్రదానం చేసిన తరువాత ప్రజల
పరిస్థితులు తెలుసుకొనకనే కులోత్తుంగుడు కన్నుమూసాడు. శైవ వైష్ణవ మతాలమధ్య జరిగిన ఉద్యమంలో రామానుజుడే చివరకు జయిస్తా డు.

ఈయనకు పూర్వం విశిష్టా ద్వైతము ప్రతిపాదించిన వారు[మార్చు]

ఈయనకుముందు విశిష్టా ద్వైతమును ప్రతిపాదించినవారు కొందఱు కలరు. వారిలో ముఖ్యులు పన్నిద్దఱు.

1. సరోయోగి (పొయ్‌గై యాళ్వారు) : ఈయన కంచియందలి పొయ్‌హై అను పుష్కరిణియందు ఒక బంగారు తామరపువ్వులో


ద్వాపరయుగాంతమునందు పాంచజన్యాంశమున అయోనిజుఁడై జనించెను.
2. భూతయోగి (పూదత్తా ళ్వారు) : ఈయన సరోయోగి అవతరించిన మఱునాడు మల్లా పురి (తిరుక్కడల్‌మల్లై) అను గ్రామమునందు ఒక సరస్సు
లోని నల్ల కలువపూవునందు గణాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
3. మహాయోగి (పేయాళ్వారు) : ఈయన భూతయోగి అవతరించిన మఱునాడు మాయారము (మామైలైనగరు) అను ఊరి యందు ఒక
సరస్సునంది యెఱ్ఱకలువ పూవునందు నందకాంశమున అయోనిజుఁడు అయి అవతరించెను.
4. భక్తిసారుఁడు (తిరుమళిశైయాళ్వారు) : ఈయన మీఁదచెప్పిన మూవురును అవతరించిన మూడునెలలకు మహీసారక్షేత్రము (తుముపి)
అనుచోట తపస్సు చేయుచున్న భృగు మహర్షికి ఇంద్రు నిచే ప్రేరేపింపఁబడి ఆఋషిని మోహింపఁజేసిన అప్సరస వలన చక్రాంశ సంభూతుఁడు
అయి జనించెను. భగవద్భక్తుఁడును బిడ్డలు లేనివాఁడును అగు ఒక మేదరవాఁడు వెదుళ్లకై అచ్చటికి వచ్చి ఆశిశువును తన యింటికి
ఎత్తు కొనిపోయి పెంచెను.
5. శఠారి (నమ్మాళ్‌వారు) : ఈయన *** కురుకాపరి. (తిరుక్కు*** గ్రామమునందు కారి అను పేరుగల సచ్ఛూద్రు నికి ఉడయనంగై అను
భార్యయందు విష్వక్సేనాంశమున జనించెను. అట్లు అవతరించి ఎల్ల శిశువులవలె స్తన్యపానము చేయక అభివృద్ధి పొందెను.
6. పరాంకుశదాసుఁడు (మధురకవి ఆళ్వారు) : ఈయన ద్వాపరయుగాంతమున పాండ్యదేశము లోని తిరుక్కోళూరు అను గ్రామమునందు ఒక
పురశ్చూడుఁడు (ముందరి జుట్టు వాఁడు) అగు బ్రాహ్మణునికి కుముదాంశమున జనించి సామవేదాధ్యాపకుఁడు అయి దివ్యదేశ
యాత్రచేయుచు అయోధ్యకు పోయి ఉండెను. అప్పుడు ఇచ్చట దక్షిణ దేశమునందు నమ్మాళ్వారు అవతరించి ఆతేజస్సు తనకు కనఁబడఁగా
అందుండి వచ్చి నమ్మాళ్వారువల్ల తత్వవిషయమును గ్రహించెను.
7. కులశేఖరాళ్వారు : ఈయన కలియుగాదియందు దృఢవ్రతుఁడు అను రాజునకు పుత్రుఁడు అయి కౌస్తు భాంశమున అవతరించి
ధనుర్వేదాదివిద్యలు నేర్చి పరమజ్ఞానసంపన్నుఁడై భగవత్కటాక్షమును పొందెను.
8. విష్ణుచిత్తుఁడు (పెరియాళ్వారు) : ఈయన కలియుగాదియందు శ్రీవిల్లిపుత్తూరు అను గ్రామమునందు ఒక పురశ్చూడుఁడు అగు వైష్ణవునకు
గరుడాంశమున పుత్రుఁడై అవతరించి వేదవేదాంగములెల్ల అభ్యసించి అచ్చటి వటపత్రశాయి అను విష్ణుమూర్తికి తులసి కైంకర్యము చేయుచు
ఉండి పాండ్యదేశపు రాజునొద్ద పరతత్వ నిర్ణయము చేసి బహుమతి పడసి పిదప లక్ష్మీపతి అగు శ్రీమన్నారాయుణుని ప్రత్యక్షము చేసికొని
తులసివనమునందు అయోనిజయై జనించి తన కొమార్తే అయిన ఆముక్తమాల్యదను (చూడికొడుత్త నాంచారును) ఆ దేవునికి భార్యగా
సమర్పించి కృతార్థుఁడు అయ్యెను.
9. గోదాదేవి (చూడికొడుత్తా ళ్‌) : ఈమె కలియుగాదిని శ్రీవిల్లిపుత్తూరి యందు విష్ణుచిత్తు నియొక్క తులసివనమునందు అయోనిజయై
భూమ్యంశమున జనించి ఆపెరియాళ్వారుచే పెంపఁబడి ఆయన పెరుమాళ్లకు కట్టికొని పోయెడు తులసిమాలలు తాను ముందు ధరించి
పిమ్మట పూలబుట్టలో పెట్టు చువచ్చి కడపట ఆపెరుమాళ్లకు భార్య అయ్యెను. కనుక ఈమె ఆఁడుది అయినను తక్కిన ఆళ్వారులలో చేర్చి
ఎన్నఁబడెను.
10. భక్తాంఘ్రిరేణువు (తొండరడిప్పొడి యాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన ఇన్నూఱేండ్లకు పిమ్మట చోళదేశమునందు మండంగుడి అను
గ్రామములో ఒక పురశ్చూడ వైష్ణవునకు పుత్రుఁడై వనమాలాంశమున జనియించి విప్రనారాయణుఁడు అనుపేరు వహించి భగవత్కైంకర్యపరుఁడై
కాలము గడపెను.
11. మునివాహనుఁడు (తిరుప్పాణాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన మున్నూఱు ఏండ్లకు పిమ్మట చోళదేశము లోని నిచుళాపురము
(ఉరయూరు) అను గ్రామములో విడవలి గంటలలో అయోనిజుఁడు అయి శ్రీవత్సాంశమునందు జనియించి బిడ్డలులేనివారైన చండాల
దంపతులచే పెంపఁబడి వీణాగానమునందు నిపుణుఁడై భగవన్నామస్మరణచేసి కృతార్థుఁడు అయ్యెను.
12. పరకాలుఁడు (తిరుమంగై యాళ్వారు) : ఈయన కలియుగము పుట్టిన నన్నూఱు సంవత్సరములకాలమున తిరువాలిత్తిరునగరు అను
గ్రామమునందు నీలుఁడు అను ఒక శూద్రు నికి పుత్రుఁడు అయి అవతరించి ధనుర్విద్య మొదలు అగు విద్యలనేర్చి చోళరాజునొద్ద కొంచెపాటి
అధికారము ఒకటి సంపాదించుకొని తనకు తగిన నలుగురు మంత్రు లను చేర్చుకొని మెలఁగుచు అయోనిజయై జనించిన కుముదవల్లి అను
కన్యకను వివాహము అగుటకొఱకు దొంగిలించియు మోసపుచ్చియు ధనమును ఆర్జించి శ్రీరంగపు రంగనాథుని దేవాలయగోపుర
ప్రాకారాదులను కట్టించి ఆమెను పెండ్లా డి పరమ భాగవత భక్తుఁడు అయి ముక్తుఁడు అయ్యెను. ఈచెప్పఁబడిన వారే పన్నిద్ద ఱాళ్వార్లు
అనఁబడుదురు

విశిష్టా ద్వైతం

రామానుజాచార్యులు (1017–1137 CE),
విశిష్టా ద్వైతం అనేది 11 వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు
అని ఈ తత్వము ప్రతిపాదించింది. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును
శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.

బ్రాహ్మణులు విభాగాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

 శ్రీవైష్ణవులు - శ్రీవెంకటేశ్వర, విష్ణుమూర్తి ఆలయాల్లో పనిచేసే వారు


 చాత్తా ద శ్రీవైష్ణవులు - శ్రీరామానుజాచార్యులనే ఆద్యులుగా స్వీకరించిన తెంగలై శాఖీయ శ్రీవైష్ణవులు(మాల దాసులు మాదిగ దాసులు సైతం
భాగము)
 శైవులు -శివ, కేశవ ఆలయాల్లో పూజారులు
 స్మార్తు లు - శివ, కేశవ ఆలయాల్లో పూజారులు
 కరణాలు (నియోగులు) - గ్రామాల్లో రెవెన్యూ పాలనలో ఉన్నవారు

జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టా ద్వైతము అంగీకరిస్తు న్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను
కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల
సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తు లై,
మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.

విశిష్టా ద్వైతం వైదిక మతంలోని త్రివిధ విశ్వాసాలలో ఒకటి. మిగిలినవి అద్వైతం, ద్వైతం. విశిష్టా ద్వైతం రామానుజుడికి పూర్వం నుంచి ఉంది. ఐతే,
రామానుజుడు విశిష్టా ద్వైతాన్ని బహుళ వ్యాప్తిలోకి తెచ్చాడు. తిరుమల - తిరుపతి దేవస్థా నం 1985 లో ప్రచురించిన ‘‘హిందూమత ప్రవేశిక’’ గ్రంథంలో
డాక్టర్‌ కె.సేతురామేశ్వర దత్త విశిష్టా ద్వైతం గురించి ఇలా వ్రాశారు : ‘‘విశిష్టా ద్వైత మతంలో చిత్తు , అచిత్తు , ఈశ్వరుడు ఈ మువ్వురూ నిత్యులు. చిత్తు ,
అచిత్తు ఈశ్వరుని ప్రత్యేక గుణాలు (ధర్మాలు). ఈశ్వరునికి - ఈ ప్రకారాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు ‘ప్రకారి’ ఆని పేరు. దేని సహాయం వల్ల దాని
ఆధారం తెలుస్తుందో దానికి ‘ప్రకారం’ అని పేరు. ప్రకారి లేకుండా ప్రకారం ఉండదు. కాబట్టి చిదచిత్‌ విశిష్టు డైన బ్రహ్మం ఒకడే. ప్రకారం ప్రకారి సహజంగా
భిన్నమైనవి. కాబట్టి వాటి స్వభావంలో భేదం ఉంది. అచిత్తు శుద్ధ సత్త్వం, మిశ్రసత్త్వం, సత్త్వశూన్యమని మూడు విధాలు. శుద్ధ సత్త్వం స్వయం
ప్రకాశమైనది. దీనికి పరమపదమని పేరు. కాలం సత్త్వ శూన్యం, కాని ఆకాశం వలె నిత్యం. మిశ్ర సత్త్వం సత్త్వ, రజస్‌, తమో గుణాలకు లోనై, ప్రకృతి,
మహాత్‌, అహంకారం, పంచ తన్మాత్రలు, ఇంద్రియాలు మొదలైన 24 తత్త్వాలుగా రూపొందుతుంది. జీవుల పురాతన కర్మను అనుసరించి అది జీవుల
శరీరం, అహంకారం అవుతుంది. మమకార అజ్ఞానాల చేత దేహధారణ చేసిన జీవుల జనన మరణ పరంపరలకే సంసారమని పేరు. అవిద్య, కర్మల
వలయంలో ఉన్న కొందరి పాపాలు వారి పుణ్యాల వల్ల నశిస్తా యి. వారు అప్పుడప్పుడు ముక్తికొరకు ఈశ్వరుని ప్రార్ధిస్తా రు. ఈశ్వరానుగ్రహంతో లభించిన
గురువు బోధనలతో శాస్త్రా లలోని సమ్యక్‌ జ్ఞానాన్ని పొందుతారు. నిత్య నైమిత్తిక కర్మలను- తమ దశను, స్థితిని అనుసరించి యథావిధిగా ఆచరిస్తూ శమం,
దమం, తపస్సు, శౌచం, క్షమ, ఆర్జవం, భయం, అభయం, స్థా నం, వివేకం, అహింస, దయ మొదలైన ఆధ్యాత్మిక గుణాలను సంపాదిస్తా రు. ఈశ్వరుని
శరణు పొంది భక్తి చేత శాస్త్రా న్ని మననం చేసికొంటూ, ఈశ్వర గుణాలను ధ్యానం చేస్తూ ఈశ్వర కృపతో అజ్ఞానాన్ని పోగొట్టు కొంటారు. వారు భక్తి
యోగాన్ని అభ్యసించి దేహత్యాగ సమయంలో ప్రపత్తి వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల ముక్తిని పొందుతారు. కైవల్యం, ఈశ్వర ప్రాప్తి అని ముక్తి రెండు విధాలు.
కైవల్యం అంటే ఆత్మ సాక్షాత్కారం వల్ల కలిగే ఆనందానుభవం. పరమ పదంలో ఈశ్వరుని చేరి ఈశ్వర స్వరూపాన్ని, శాశ్వతానందాన్ని అనుభవించడం
మరొకవిధమైన ముక్తి. ఈశ్వరుడు పరమ పదంలో ప్రత్యేకమైన దివ్యమంగళ స్వరూపాన్ని కలిగి ఉంటాడు. ఆయన తన కృపకు పాత్రు లైన తన
ప్రియురాండ్రు శ్రీదేవి, భూదేవి, నీలాదేవుల తోనూ, నిత్య ముక్తు లైన అనంత, గరుడ, విష్వక్సేనాది సూరులతోనూ, ముక్త జీవులతోనూ కలసి ఉంటాడు.
ఇతర జీవులను కూడా కర్మవిముక్తు లుగా చేసి వారిని తనతో సామ్యం కలవారినిగా చేస్తా డు. విశిష్టా ద్వైత మతంలో విష్ణువు లేక నారాయణుడు లేక
వాసుదేవుడు లేక వేంకటేశ్వరుడు పరబ్రహ్మ...’’ వావిళ్ళ సంస్థ 1931 లో ప్రచురించిన శ్రీభగవద్గీతా మాహాత్మ్యం పీఠికలో శ్రీవావిళ్ళ వేంక టేశ్వరులు
విశిష్టా ద్వైతాన్ని ఇలా వివరించారు (ఆయన మాటల్లోనే) : ‘‘బ్రహ్మం నామరూప విభాగం చేయ శక్యంగాని సూక్ష్మచిదచిద్విశిష్ట చైతన్య రూపమైయుండి పిదప
నామరూపవిభాగం గల స్థూల చిదచిద్విశిష్ట చైతన్యరూప మగుచున్నది. ఇట్లు సూక్ష్మ చిదచిద్వి శిష్టమునకును, స్థూల చిదచిద్వి శిష్టమునకును నైక్యము
సిద్ధాంతిత మగుటచే దీనికి విశిష్టా ద్వైతం అను పేరు, అన్వర్థ మగుచున్నది... ... శ్రీమన్నారాయణుడే పర తత్త్వం, అతడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు,
సర్వాంతర్యామి, ఆది మధ్యాంతరహితుడు. మాయ అనెడి ప్రకృతిని మూలంగాగొని జగత్తు ను ఇచ్ఛామాత్రమున సృజించువాడు. ఇట్టి నారాయణుడు
తప్ప అన్య దేవతలను వైష్ణవుడారాధింపరాదు.’’

త్రిమతాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డా యి. వాటిని త్రిమతాలు అంటారు.
ఇవన్నీ హిందూమతంలోని తాత్విక భేదాలు సూచించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.

 అద్వైతం లేదా స్మార్తం
 విశిష్టా ద్వైతం లేదా వైష్ణవం
 ద్వైతం లేదా మధ్వం

వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తర మీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, బ్రహ్మసూత్రములనీ అంటారు. ఇది వేదముల


చివరి భాగమైన ఉపనిషత్తు ల నుండి ఉద్భవించింది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస
మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము,
విశిష్టా ద్వైతము, ద్వైతము - అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తు లనూ, బ్రహ్మసూత్రాలనూ
ప్రమాణంగా అంగీకరిస్తా యి. మూడు తత్వములకూ ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీసంప్రదాయము, దృఢమైన ఆచారములు
ఉన్నాయి. పెక్కు అనుయాయులు ఉన్నారు.

రామానుజాచార్యుడు[మూలపాఠ్యాన్ని సవరించు]

ప్రధాన వ్యాసం:  రామానుజాచార్యుడు

విశిష్టా ద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017 లో జన్మించాడు. 1049 లో సన్యాసం స్వీకరించాడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన
ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిరాని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ
ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన (సాధించిన) ముఖ్య ఉద్దేశాలు రెండు:

 మొదటిది, ప్రబలంగా కొనాసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తు న్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ
మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
 రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టా ద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు:

 సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి పురోగతికి అడ్డు రాక మునుపే వాటిని గుర్తించి వాటిని మానటమో
మార్చటమో చేయటం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం.
 దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత
తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
 మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది సరో తప్పో
నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యం చేయవలసిన పనిలేదు.
 ఒక పని వల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగా మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన
అవసరం లేదు.

రామానుజాచార్యుడు 1137 వ సంవత్సరంలో విష్ణుసాయుజ్యం పొందాడని కథనం. అనగా 120 సంవత్సరాల జీన కాలం. ఈ సంవత్సరంపై కొన్ని
సందేహాలున్నాయి.

ప్రధాన సిద్ధాంతం[మూలపాఠ్యాన్ని సవరించు]

విశిష్టా ద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని


అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రు డు. జీవి, ప్రకృతి పరతంత్రు లు. పరమాత్మ
నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా
కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా
లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.[1].
నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టు డుగా ఉన్న
పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టు డు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ,
ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తు లపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తు లుగా గోచరిస్తా డు. అవి

1. అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు


2. విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
3. వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
4. సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
5. అంతర్యామి - సకల జీవనాయకుడు.

భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తు లు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు.

1. అభిగమనము
2. ఉపాదానము
3. ఇజ్యము
4. స్వాధ్యాయము
5. యోగము

ముఖ్య విషయాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

త్రిమతములలో ఒకటి. ఈ మతమునందు చిత్తు , అచిత్తు , ఈశ్వరుఁడు అని పదార్థములు మూఁడు.

 అందు చిత్తు అనఁగా ఆత్మ. ఆ ఆత్మ జ్ఞానేంద్రియ మనోబుద్ధి విలక్షణమై అజడమై ఆనందరూపమై నిత్యమై అణువై నిరవయమై నిర్వికారమై
జ్ఞానాశ్రయమై ఈశ్వరునికి శేషమై ఉండునది. అజడము అనఁగా స్వయంప్రకాశము జ్ఞానాంతరాపేక్ష లేక తనకు తానే ప్రకాశించునది. అణువు అనఁగా
అత్యల్ప పరిమాణము కలది. అట్టి పరిమాణము కలిగి ఒక్కచోట ఉన్నను శరీరము నందంతట సుఖదుఃఖానుభవము కలుగుట, దీపము ఒక్కచోటు
ఉన్నను దానిప్రభ అంతట వ్యాపించునట్లు వ్యాపించునట్టి జ్ఞానముచే కలుగుచు ఉంది. శేషము అనఁగా లోపడినది. జ్ఞానాశ్రయము అనఁగా
జ్ఞానమునకు ఆశ్రయమైనది. ఈజ్ఞానము ధర్మభూతము అని చెప్పఁబడును. ఇది సుషుప్తి మూర్ఛాదులయందు ప్రసరణము లేనందున ప్రకాశింపదు.
 ఆత్మబద్ధుఁడు, ముక్తుఁడు, నిత్యుఁడు అని మూడుభేదములు కలవాఁడు. బద్ధుఁడు అనఁగా జననమరణాదిరూపసంసారమును అనుభవించెడి
మన యాత్మ. ముక్తుఁడు అనఁగా భగవద్భక్తిచే సంసారము వదిలి మోక్షమును పొందిన యాత్మ. నిత్యుఁడు అనఁగా ఒకప్పుడును సంసార
సంబంధములేని అనంత గరుడ విష్వక్సేనాదుల యాత్మ. ఈ ముత్తెఱంగులు కల ఆత్మలు ప్రత్యేకములు.
 అచిత్తు అనఁగా జ్ఞానశూన్యమై వికారాస్పదమై ఉండునది. జలమునకు అగ్ని సంబంధముచేత వేడిమి కలుగునట్లు ఈ బద్ధా త్మకు
అచిత్సంబంధముచేత అవిద్యాకర్మవాసనారుచులు కలుగుచు ఉన్నాయి. అవిద్య అనఁగా అహంకార మమకారములు. కర్మము పుణ్యపాపములు.
వాసన కర్మములచేత కలిగెడు సంస్కారము. రుచి విషయములయందు ఇచ్ఛ. ఆత్మకు విషయభోగములును తత్సాధన ప్రవృత్తు లును
అచిత్సంసర్గముచేత కలుగుచు ఉన్నాయి. ఈశ్వరారాధన ప్రవృత్తియు తద్గుణానుభవములును తజ్జన్యపరమానందమును స్వాభావికములు.ఈ
అచిత్తు శుద్ధసత్వము, మిశ్రసత్వము, సత్వశూన్యము అని మూఁడు విధములుకలది. అందు రజస్తమస్సులు కలియని కేవల సత్వగుణము కలది
శుద్ధసత్వము. అది నిత్యమై జ్ఞానానందప్రకాశమై కేవల భగవదిచ్ఛ చేత గోపుర ప్రాకారాదిరూపముగా పరిణమించి అధోదేశమున ఎల్ల కలిగి
ఊర్ధ్వభాగమునందును ప్రక్కలయందును ఎల్ల లేనిదిగా ఉండును. ఇది నిత్యవిభూతి అని పరమపదము అని చెప్పఁబడుచున్నది. మిశ్రసత్వము
సత్వాదిగుణములు మూఁడును కలది. ఇది బద్ధు ల జ్ఞానానందములచే కప్పుచు విపరీతజ్ఞానమును పుట్టించుచు, నిత్యమై మహదాది వికారముల
పుట్టించునదియై ఈశ్వరునకు క్రీడాసాధనముగా ఉంది.
 మఱియును ఈ అచిత్తు ప్రకృతి అని, అవిద్య అని, మాయ అని చెప్పఁబడుచు ఉంది. ఇది చతుర్వింశతి తత్వమయముగా ఉంది. అందు
మొదటి తత్వము ప్రకృతి. దీనికి సత్వరజస్తమస్సులు గుణములు. ఇవి ప్రకృతికి సహజములై ప్రకృతిత్వావస్థయందు అప్రకాశములై కడమ
అవస్థలయందు ప్రకాశములై ఉండును. సత్వము జ్ఞానసుఖములను వానియందు ఇచ్ఛను పుట్టించుచున్నది. రజస్సు రాగతృష్ణలయందు
సంగమును పుట్టించుచున్నది. తమస్సు విపరీతజ్ఞానమును నిద్రాలస్యాదులను పుట్టించుచున్నది. ఈగుణములు ప్రకృతియందు సమములై
ఉండినను ఈశ్వరునకు జగముల సృజియింప వలయునని ఇచ్ఛ కలుగఁగా వైషమ్యము పొందును. ఆవల ఆప్రకృతి నుండి మహత్తు అను తత్వము
కలుచుచున్నది. అది సాత్వికము, రాజసము, తామసము అని మూఁడువిధములు కలది. అందుండి వైకారికము, తైజసము, భూతాది అని మూడు
అహంకార తత్వములు కలుగుచున్నవి. వైకారికము అను సాత్వికాహంకారమువలన జ్ఞానకర్మేంద్రియములును, అంతరింద్రియమైన మనస్సును
పుట్టు చున్నవి. భూతాది అనెడు తామసాహంకారమువలన శబ్దతన్మాత్ర పుట్టు చున్నది. అందుండి ఆకాశమును స్పర్శతన్మాత్రయును పుట్టు చున్నవి.
ఆతన్మాత్రనుండి వాయువును రూపతన్మాత్రయు పుట్టు చున్నవి. ఆతన్మాత్రనుండి తేజమును రసతన్మాత్రయు పుట్టు చున్నవి. ఆతన్మాత్రనుండి అప్పును
గంధతన్మాత్రయు పుట్టు చున్నవి. అతన్మాత్రనుండి పృథివి పుట్టు చున్నది. తన్మాత్రలు అనఁగా భూతముల సూక్ష్మావస్థలు. తైజసము అనెడి
రాజసాహంకారము కడమ రెండు అహంకారములు కార్యముల పుట్టించుచున్నప్పుడు తోడుపడి ఉండును.
 సత్వశూన్యము కాలము. ఇది ప్రకృతి పరిణామములకు ఎల్లహేతువై క్షణదినాది రూపముగా పరిణమించుచు నిత్యమై ఈశ్వరునకు
క్రీడాపరికరమై శరీరభూతమై ఉండును. ఇది సర్వవ్యాపకము.
 ఈశ్వరుడు నిఖిలహేయ ప్రత్యనీకుడై అనంతుడై జ్ఞానానందైక స్వరూపుఁడై జ్ఞానశక్త్యాదికల్యాణగుణ పరిపూర్ణుడై సకలజగముల
సృష్టిస్థితిలయములకు కర్తయై చతుర్విధపురుషార్థప్రదుడై విలక్షణ విగ్రహముక్తుఁడై శ్రీ భూమి నీళానాయకుడై ఉండును. నిఖిలహేయప్రత్యనీకుఁడు
అనగా అంధకారమునకు తేజమువలె వికారాది దోషములకు విరోధిగా ఉండువాఁడు. విలక్షణ విగ్రహమూర్తుఁడు అనఁగా అప్రాకృత దివ్యశరీరము
కలవాఁడు. ఇతనికి సృష్ట్యాది వ్యాపారములకు ప్రయోజనము కేవలలీల.
 ఈశ్వరుఁడు విచిత్రరూపముగా పరిణమించునట్టి ప్రకృతిని అధిష్ఠించి ఉండుటఁజేసి జగములకు ఉపాదానకారణము అని చెప్పబడును. అతనికి
చిత్తు ను, అచిత్తు ను శరీరములు అని వేదములు చెప్పుచున్నవి. మన దేహములను ఆత్మ అధిష్ఠించి ఉండునట్లు , ఈశ్వరుఁడు ఆత్మలను శరీరాదులను
అధిష్ఠించి ఉన్నాఁడు. ఆత్మకు ఆత్మ ఐనందున పరమాత్మ అని చెప్పబడుచున్నాడు.
 ఈమతమునందు (మృత్తు ఘటాదిరూపముగ పరిణమింపఁగా ఆమృద్ఘటములకు నామభేదములు కాక వేరుభేదము లేనియట్లు ) ఒక బ్రహ్మమే
కార్యకారణాలను అధిష్ఠించి ఉండుటవలన కారణవిశిష్టబ్రహ్మమునకును కార్యవిశిష్ట బ్రహ్మముకును భేదములేదు. ఇదియే విశిష్టా ద్వైతము
అనఁబడుచున్నది. విశిష్టము అనఁగా కూడినది.
 ఈశ్వరునకు పరవ్యూహవిభవాంతర్యామ్యర్చలు అని అయిదురూపములు ఉన్నాయి. పరము అన నిత్యవిభూతియందు శుద్ధసత్వమయమై
ఉండునట్టి దివ్యమంగళవిగ్రహము. వ్యూహము అన సృష్టిస్థితిసంహారాద్యర్థమై ప్రతిగ్రహించిన సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ రూపములు. విభవము
రామకృష్ణాద్యవతారములు. అంతర్యామి అన జీవులలో ప్రవేశించి ఉండునదియు శుభాశ్రయమైన విగ్రహముతోడ వారికి ధ్యానముచేయతగి వారి
హృదయకమలములయందు వాసము చేయునదియును అయిన రూపము. అర్చ అన ఆశ్రితులకు అభిమతములు అయిన ద్రవ్యములయందు
మంత్రమూలముగా ఆవిర్భవించి ఉండునట్టి ఉనికి.
 ఈమతమునందు సర్వపదార్థములును సత్యములు. కలలో కన్న అర్థములు సత్యములు. ఈశ్వరుఁడు ప్రాణుల యదృష్టా నురూపముగా
అస్థిరములైన పదార్థములను సృజించుచున్నాఁడు అని శ్రు తులు చెప్పుచున్నవి. సర్వజ్ఞానములును యధార్థములు.
 బద్ధజీవుడు విషయవైరాగ్యాదుల చేత మోక్షేచ్ఛ కలిగి సదాచార్యునివలన వేదాంతార్థములను విని మననము చేసి వర్ణాశ్రమోచిత కర్మజ్ఞానములతో
కూడిన నిధిధ్యాసనరూప భగవదుపాసనముచేత సంసారమువదలి అర్చిరాదిమార్గముగా పోయి నిత్యవిభూతికిని లీలావిభూతికిని నడుమను ఉండెడి
విరజ అనునదిలో స్నానముచేసి దివ్యశరీరమును పొంది నిత్యవిభూతిని చేరి నిత్యముక్తు లతోడ ఈశ్వరుని కల్యాణగుణములను అనుభవించుచు
సర్వవిధకైంకర్యములను చేయుచు పునరావృత్తిలేని నిరతిశయానందమును అనుభవించుచున్నాడు.
 ఇది వైష్ణవ విశిష్ణాద్వైతమత స్వరూపము. శైవమతము సహితము విశిష్టా ద్వైతమేను. అందు సర్వము శివపరత్వము అని చెప్పుచున్నది. చిత్తు ,
అచిత్తు , ఈశ్వరుడు అనుటకు బదులుగా పశువు, పాశము, పతి అని చెప్పబడుచున్నది. వైకుంఠమునకు బదులు కైలాసము మోక్షస్థా నమై
ఉండును.

వివరణ[మూలపాఠ్యాన్ని సవరించు]

ఆచార్య రామానుజాచార్యుడు చిత్ (జీవులు), అచిత్ (జడము), ఈశ్వరుడు (పురుషోత్తముడు) అను మూడు పదార్ధములను


ఒప్పుకొనుచున్నాడు.అనంత సంఖ్యాకులగు జీవులును, ఈజగత్తు ను కలసి ఈశ్వరుని శరీరము; ఈజీవజగద్యుక్తమగు శరీరమునకు ఈశ్వరుడె
ఆత్మ.1.స్థూల సూక్ష్మ చేతనాచేతన, బ్రహ్మముల ఏకత్వము, 2.ద్వైతాద్వైత శ్రు తుల అవిరోధము 3. బ్రహ్మముయొక్క సగుణత్వ సవిశేషత్వ, విభుత్వములు
4. బ్రహ్మముయొక్క నిర్గుణత్వ నిర్విశేషఖంఢనము 5.జీవుని అనుత్వ, బ్రహ్మస్వభావత్వ, దాసత్వములు 6. జీవుని బంధకారణమగు అవిద్య 7.
మోక్షోపాయమగు విద్య 8. భక్తియొక్క మోక్షకారణత్వ, శ్రేష్ఠతలు 9. బ్రహ్మైక్యనిరాసన 10. అనిర్వచ్నీయవాదఖంఢనము 11. జగత్తు యొక్క
సత్యత్వస్థా పన, 12. జీవజగత్తు ల ఈశ్వర శరీరత్వము అను విషయములు ఇందు ఆలోచింపబడినవి.

రామానుజమతమున పదార్ధములన్నియు ప్రమాణ ప్రమేయబేధముల రెండు విధములు.అందు ప్రమాణములు ప్రత్యక్ష, అనుమాన, శబ్దములని
విభజింపబడినవి.ప్రమేయము ద్రవ్యద్రవ్యములని రెండు విధములు. ద్రవ్యము జడాజడములని రెండు విధములు. జడము ప్రకృతి కాలమను రెండు
విధములు.ప్రకృతి చతుర్వింశతిత్త్వాత్మకము.కాలము భూత, భవిష్యత్, వర్తమాన రూపము.అజడములు ప్రాక్, ప్రత్యక్ అను రెండు రూపములు. ప్రత్యక్
జీవేశ్వర భెధముల ద్విరిధము. జెవులు నిత్య, బద్ధ, ముక్తు లని మూడు విధములు. అందు బద్ధు లు బుభుక్షు, ముముక్షు వులని రెండు విధములు.
బుభుక్షులు అర్ధకామ పరులు, ధర్మకామ పరులని రెండు విధములు. ముముక్షువులు కైవల్య పరులు, మోక్షపరులుగా విభజింపబడుచున్నారు. భక్త, ప్రపన్న
లని మోక్షపరులు రెండు తెగలు కలరు. ప్రపన్నలు మరల ఐకాంతికి, పరమైకాంతికిగా భేదముకలదు. పరమైకాంతికులు దృప్తు లు, ఆర్యులు.ఈశ్వరుడు
పర, వ్యూహ, విభు, అంతర్యామి, అర్చావతారమను ఐదు తెగలుగా విభజించాడు. పరుడు నారాయణుడు. వ్యూహము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న,
అనిరుద్ధు లని చతుర్విధము, కేశవాదులు తదితర వ్యూహములు.మత్స్యాది, అవతారములు విభవములనబడెను. శ్రీరంగాది ఆలయములలో
పూజింపబడు మూర్తివిశేషములు అర్చావతారములు. అద్రవ్యము సత్వ, రజః, తమః, శబ్ద, స్పర్స, రూప, రస, గంధ, సంయోగ, శాక్తు లని పది విధములు.

 ప్రమేయనిరుక్తి : యధావస్థిత వ్యవహారాను గునమగు జ్ఞానమే ప్రమేయమని నిర్వచించాడు. అనగా, అన్యధాజ్ఞాన, విపరీతజ్ఞాన రహితమని
భావము.దీనికి సాధనమగునదియే ప్రమాణము. ఈప్రమాణము ప్రత్య్క్ష, అనుమాన, శబ్దములని మూడు విధములు. ప్రత్యక్ష నిర్వికల్ప,
సవికల్పములని రెండు విధములు. ఈ రెండును విశిష్ట విషయకములు. నిర్విశేషమగు జ్ఞానము అసంభవము. స్మృతి, ప్రత్యభిజ్ఞ భావాంతర
రూపమగు అభావజ్ఞానము, యోగజజ్ఞానము, ప్రత్యక్ష-అంతర్గతములు. భ్రమ, స్వప్నాది జ్ఞానములు కూడా జ్ఞానములే. కనుక, 'సర్వం జ్ఞానం సత్యం
సవిశేషవిషయంచ'. ఉపమానము, అర్ధా పత్తు లు అనుమానాంతర్గతములు. అపౌరుషేయము నిత్యము అగు వేదవ్యాక్యమే శబ్దప్రమాణము.

శంకర మతమున జ్ఞానము నిరపేక్షము. రామానుజుమతమున అపేక్షికము. అద్వైతుల జ్ఞానము స్వప్రకాశము, నిర్విశేషము. ఈ జ్ఞానము ప్రత్యగాత్మ
స్వరూపము. రామానుజుమతమున జ్ఞానము సవిశేష విషయకము, నిర్విశేషవస్తు జ్ఞానము అసంభవము. నిర్విశేషవస్తు వే జ్ఞానస్వరూపమని శాంకరమతము.

 అధికారి- కర్మఫలా నిత్యజ్ఞానమును బడసినవాడే బ్రహ్మ జిజ్ఞాసకు అధికారి. ధర్మానుష్ఠా నానంతరము మోక్షేచ్చ. జ్ఞానకర్మలకు కార్యకారణ
భావమున్నది. నిష్కామకర్మ వలన చిత్త శుద్ధి లభించును, పిదప జ్ఞానోదయమగును. కర్మజ్ఞానము లేకున్న బ్ర్మహ్మజిజ్ఞాసకు అధికారములేదు. ఈ
జ్ఞానము సర్వాశ్రమ ధర్మాపేక్షము. శాంకర మతమున కర్మమీమాంస, బ్రహ్మ మీమాంసలు వేర్వేరు శాస్త్రములు. కర్మ జ్ఞానము లేకున్నను, సాధన
చతుష్టయ సంపన్నుడైన, బ్రహ్మజ్ఞానాధికారము. కర్మలు చిత్త సుద్ధి కలిగించి, పారంపర్యముగ మోక్షకారణమగుచున్నవే కాని, సాక్షాత్కారణములు
కావు. జ్ఞానమే మోక్షకారణము. ఈ భేదమువలన విశిష్టా ద్వైతులు జ్ఞాన-కర్మసముచ్చయవాదులని, అద్వైతులు కేవలజ్ఞానవాదులని
చెప్పబడుచున్నారు.
 విషయము- స్థూల సూక్ష్మ చేతనాచేతన విశిష్టమగు బ్రహ్మమే రామానుజదర్శన విషయము. ఆ బ్రహ్మమే పురుషోత్తముడనబడు
నారాయణుడు.ఈ బ్రహ్మము శబ్దగమ్యమని చెప్పబడుటవలన, నిర్విశేషము కాజాలదు.
 సంబధము- రామానుజుడు శాస్త్రమును ప్రతిపాదకమగును, పురుషోత్తముని ప్రతిపాద్యమగును పేర్కొనుచున్నాడు. కేవలము శాస్త్రప్రమాణము
వలననే బ్రహ్మమును మనము గ్రహింప వలెను. బ్రహ్మము సశరీరియా లేక అశరీరియా? ఇటువంటి ప్రశ్నలకి వేదమే ప్రమాణమని నిర్వచించాడు.
 ప్రయోజనము - అవిద్యా నివృత్తియే ప్రయోజనము అని నిర్వచించాడు. ఉపాసనా బలమున బ్రహ్మ సాక్షాత్కారమైన జీవుని అవిద్య తొలగును.
ముక్తు డు, ఈశ్వరదాసత్వరూపమున వెలయుచు, అపారమగు లీలానందమున ఆస్వాదించును.

పై నాలుగింటిని అనుబంధ చతుష్టయములుగా నిర్వచించెను.

 బ్రహ్మము- ఏవంగుణ విశిష్టు డగు ఈశ్వరునికి అద్వైతవాదమున చోటున్నది కాని, ఈయన పర బ్రహ్మకాదు. ఈ గుణములలో కొన్నింటిని వారు,
బ్రహ్మముయొక్క తటస్థలక్షణముగ అంగీకరించారు. పర- బ్రహ్మమును ఆశ్రయించి పెంపొందిన వివర్తము. అద్వైతులకు ఈశ్వరుడుకూడా
మాయాంతర్గతుడు, జీవుల వలే బద్ధు డు కాడు, మాయాధీశుడు. నిర్గుణ బ్రహ్మము యొక్క ప్రతిబింబము.పారమార్ధిక దశయందు, శాస్త్రమువలే,
ఈయన ఉనికి కూడా విలోపమందును.
 ఈశ్వరుడు-పరుడు - రామానుజుని ఈశ్వరుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, ఆర్చాభెదముల పమచ విధముల వెలయుచున్నాడు. శంఖ,
చక్ర, గదా, పద్మధారి- చతుర్భుజుడు, కిరీటాదిభూషణ భూషితుడై, వైకుంఠవాసియగు నారాయణుడే ఈశ్వరుడు, పరుడు.
 వ్యూహము - ఈయనయే సృష్ట్యాది నిమిత్తము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధు లను వ్యూహరూపమున వెలయుచున్నాడు.
వాసుదేవుడు షడ్గుణ పరిపూర్ణుడు. సంకర్షుణుడు జ్ఞానబలయుక్తు డు. ప్రద్యుమ్నుడు ఐశ్వర్య వీర్యయతుడు. అనిరుద్ధు డు వీర్య, శక్తి యుక్తు డు.
 జీవుడు - జీవుడు బ్రహ్మముయొక్క శరీరము. కాని అణుపరిమాణ యుక్తు డు. బ్రహ్మము, జీవులకు సజాతీయ, విజాతీయ భేదములు లేవు,
స్వగత భెదమున్నది. జీవులు బద్ధ, ముక్త, నిత్యులని మూడు విధములుగ చెప్పబడుచున్నారు. సంసార నివృత్తిని పొదనివారు బద్ధు లు, దేవ,
మనుష్య, తిర్యక్, స్థా వరములుగాగల జీవులదరు బద్ధు లే.
 సాధన - ధ్యానము, ఉపాసనలను ముక్తిసాధనాలుగ గ్రహించాడు. భక్తియే మోక్షోపాయము, జ్ఞానము కాదు. బంధము పారమార్ధికమగుట
వలన, పరమమపురుషుని ప్రసాదమువలననే తొలగును. వేదనా, ధ్యాస ఉపాసనాశబ్దవాచ్యమగు నదియే భక్తియగును, దాని స్వరూపము
తైలధారనుబోలు ధ్రు వానుస్మృతి. ఇయ్యది, ఆశ్రయాది త్రివిధ దోషరహితమైన ఆహార శుద్ధ్యాదులవలన విశిద్ధతను పొందినవాని పక్షమున ప్రత్యక్షమూ
పరణమించును.
 ప్రపత్తి - ప్రతికూల విర్జనమును, అనుకూల సంకల్పపూర్వకమును, సర్వతోభావమును నగు ఆత్మసమర్పణయే ప్రపత్తి అనబడు న్యాసవిద్య.
 ఉత్క్రాంతి-ముక్తి - ప్రాకృత దేహము తొలగి, అప్రాకృత దేహమున వైకుంఠమున కరిగి సమానభోగమును, బ్రహ్మామును, నారాయణుని
ఆశ్రయించుటయే ముక్తి.ముక్తికి అర్హుడగు జీవుడు సుక్ర్తములను హితులకును, దుష్కృతములను శత్రు వులకును, సంపదను దాయాదులకును
వదలి వాక్కును మనస్సునను, మనస్సును హృదయమున నిలిపి, ముక్తిద్వారమగు సుషుమ్నానాడి యందు ప్రవేశించి, బ్రహ్మరంధ్రద్వారమున
నిర్గతుడగును. పిదప సూర్య కిరణములను ఆశ్రయించి దిన, పక్ష, ఉత్తరాయణ, సంవత్సరాభిమానులగు దేవతల మార్గమున సత్కరింపబడి,
సూర్యమండలమును భెదించుకొని కరుగును. అట, చంద్ర, విద్యుత్, వరుణ, ఇంద్ర, ప్రజాపతులను ఆతివాహిక -ప్రధప్రదర్శకుల సాయమును బడసి
క్రమముగ విరజానాదిని చేరుకొనును. అట, సూక్ష్మ శరీరమును పరిత్యజించి దివ్య దేహమును బడసి ఇంద్ర ప్రజాపతులను ద్వారపాలకుల
ఆదేశమున వైకుంఠమును ప్రవేశించి ఐరమ్మదమను సరోవరమును, సోమసవనమను అశ్శ్వత్థ వృక్షమును గాంచి అప్సరసలచే అభినందితుడగును.
పిదప అనంత, గరుడ, విష్వక్సేనులకును, అచార్యులకును ప్రణమిల్లి భగవత్పర్యంక సమీపమునకు పోవును. ఆ పర్యంకమున ధర్మ పీఠమున,
ఆసీనుడైయున్న నారాయణుడికి దాస్యానంద అనుభవమును పొందును. ఈ నిర్గమనమును ఉత్క్రాంతి లేదా గతి అనబడును

You might also like