You are on page 1of 9

మన మహర్షు లు -31 : మైత్రేయ మహర్షి:

మైత్రేయుడు ఎంత గొప్పవాడంటే తల్లి గర్భంలో వుండగానే ధర్మశాస్త్రా లు, వేదవేదాంగాలు

అన్నీ నేర్చేసుకున్నాడు.

చిన్నతనంలోనే రాక్షసులందర్నీ నాశనం చేసే యజ్ఞం చేశాడు. పులస్త్య బ్రహ్మర్షి దగ్గర

దివ్యజ్ఞా నసిద్ధి పొందాడు.

ఒకసారి గురువు పరాశర మహర్షిని మీ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను. విష్ణు మూర్తె

తత్త్వాన్ని నాకు వివరించండని అడిగాడు మైత్రేయ మహర్షి -

ఇవే కాకుండా భూమి మొదలైన భూత ప్రమాణాలు, సప్త సాగరాలు, సప్త ద్వీపాలు

సప్త కులపర్వతాలు, సూర్యగ్రహం మొదలైన వాటి సంచారాలు, చతుర్విధ భూత నిర్మాణం,

చతుర్ధశ మన్వంతరాలు, చతుర్యుగ ప్రమాణాలు, కల్పకల్ప విభాగం, యుగధర్మాలు, దేవర్షి


చరిత్రలు, బ్రా హ్మణ వర్ణధర్మాలు, బ్రహ్మచర్యం మొదలైన వాటి గురించి కూడ

చెప్పమన్నాడు

పరాశరుడు ఆనందంతో విష్ణు తత్త్వం గురించి చక్కగా వివరంగా చెప్పాడు మైత్రేయుడికి.

--- పుట్టడం, చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఇవన్నీ ఏ జీవికి ఒకే చోట జరగదు.

ఎవరి కర్మని బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది.

ధనం సంపాదించడం, దాచడం, ఖర్చు పెట్టడం, ఇదంతా దుఃఖానికే, కాని, ఎవరికేనా చాలా

డబ్బుంది అంటే అది సంతోషపడే విషయం కాదు స్త్రీలు, స్నేహితులు, చుట్టా లు, పిల్ల లు,

ఇళ్ళు, పొ లాలు ఇవన్నీ పో వడం రావడం

వల్ల కష్టమే గాని సుఖముండదు.

అసలు దుఃఖానికి కారణం మనం చేసే పని. అది విత్త నం. అదే చెట్టు లాగ పెరిగి

పెద్దదవుతుంది.

పుడుతూ ఉండడం, రోగాలు, వృద్ధా ప్యంతో బాధపడుతూ ఉండడం ఇవన్నీ లేకుండా

భగవన్నామం చేసుకుని మోక్షానికి ప్రయత్నించడమే మంచిదని జ్ఞా నులు చెప్తు న్నారని

అన్నీ వివరంగా పరాశరుడు మైత్రేయ మహర్షికి చెప్పాడు..

మైత్రేయుడు అన్ని తీర్థా లు తిరుగుతూ కామ్యకవనంలో పాండవుల్ని చూసి బాధపడి

దుర్యోధనుడికి బుద్ధి చెప్పాలని వాళ్ళదగ్గరకి వెళ్ళాడు.


ధృతరాష్ట్రు డు మహర్షిని సత్కరించి పాండవులెలా వున్నారని అడిగాడు.

మహామునుల దీవనలందుకుంటున్న పాండవులకి కష్టా లెందుకుంటాయి? వాళ్ళు ధర్మం

తప్పితే సూర్యచంద్రు లు గతులు తప్పుతారు. బలంలో ఒక్కక్కడు నూరేసి ఏనుగులకి

సమానమని చెప్పాడు మైత్రేయుడు

మైత్రేయ మహర్షి చెప్తుంటే దుర్యోధనుడు తొడలు కొట్టు కుంటూ కూర్చున్నాడు.

దుర్యోధనా! నా మాట లక్ష్యపెట్టక నన్ను గౌరవించని నువ్వు భీముడితో తొడమీద గదతో

కొట్టించుకుని ఛస్తా వ్! అని శపించాడు మైత్రేయుడు.

దృతరాష్ట్రు డు మైత్రేయుడి కాళ్ళమీదపడి క్షమించమన్నాడు.

మైత్రేయుడు వినకుండా కోపంతో వెళ్ళిపో యాడు

కొంతకాలం తర్వాత విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి గంగానది దగ్గర ఇసుక మీద

పద్మాసనం వేసుకుని ఇంద్రియాల్ని అరికట్టి ఆచార, వ్రతాల, ఉపవాసాల్లో కృశించిపో యిన

పుణ్యపురుషుడయిన మైత్రేయ మహర్షి పాదాలకి నమస్కారం చేసి మహర్షీ భగవంతుడు

స్వతంత్రు డైనా ఎన్నో అవతారాలెత్తు తాడు కదా.... ఏ పన్లు చేశాడు? సవివరంగా

తెలియజేయండి...అంటూ అడిగాడు.
మైత్రేయ మహర్షి విదురుడితో లోకానికంతకి ఈశ్వరుడు హరి. జీవుడు భగవంతుడి మీద

ఆధారపడ్డా డు. నారాయణుడు అన్నింటికీ తాను ఆధారమవుతాడు కానీ, తాను

ఆధారపడడు. హరి భజన వల్ల సమస్త కష్టా లు పో తాయని చెప్పాడు. ఇంకా విష్ణు మూర్తి

అవతారాలు అన్నింటి గురించి కూడా చెప్పించుకుని విని విదురుడు ఆనందంగా

వెళ్ళిపో యాడు.

ఒకసారి మైత్రేయుడి ఆశ్రమానికి వ్యాసుడు చెప్పకుండా వచ్చాడు. మైత్రేయుడు భక్తితో

పూజచేసి చక్కటి భోజనం పెట్టి స్వామీ! మీరాక నాకు చాలా ఆనందంగా వుంది మీరాకకు

కారణం చెప్పండన్నాడు.

మహర్షీ! తపము, దానము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసా! దానమే గొప్పది. అలాగే

దానాలన్నింటిలో అన్నదానం చాలా గొప్పది

ఎందుకంటే ప్రా ణం శరీరంలో ఉంటుంది. శరీరానికి బలం అన్నం వల్ల నే వస్తుంది.

జ్ఞా నవంతులు అన్నదానం చేస్తా రు. తపము, విద్య, దానము, ధర్మగుణాన్ని పెంచుతాయి

ఉన్నతమైన విద్య భగవంతుణ్ణి చూపించే మార్గం. నువ్వు చేసిన అన్నదానం వల్ల నేను

ఎంతో ఆనందాన్ని అనుభవిస్తు న్నాను అని చెప్పి వ్యాసుడు మైత్రేయుణ్ణి అభినందించి

వెళ్ళిపో యాడు .

మైత్రేయ మహర్షి కధ చదవడం వల్ల మనం కూడా శ్రీహరితత్వాన్ని...అన్నదాన

మహిమను..అహంకారం లేకుండా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నాము..


మన మహర్షు లు -32: యాజ్ఞవల్క్య మహర్షి:

పూర్వం గంగానదీ తీరంలో ఉన్న చమత్కార పురంలో యజ్ఞవల్కుడు అనే

బ్రా హ్మణుడుండేవాడు. అతడి భార్య సుకన్య. అతడు బ్రహ్మని గురించి తపస్సు చేసి

బ్రహ్మవిద్యని వ్యాప్తి చెయ్యడానికి బ్రహ్మనే తనకు కొడుకుగా పుట్టమనడిగాడు

బ్రహ్మ సరేనన్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశీ ఆదివారం ధనుర్లగ్నంలో యజ్ఞవల్కుడికి

కొడుకుగా పుట్టా డు. ఆ పిల్లా డు బ్రహ్మగారంత తేజస్సుతో వెలిగిపో తున్నాడు. అతడికి

యాజ్ఞవల్క్యుడు, బ్రహ్మరాతుడు, దైవరాతుడని పేర్లు పెట్టా రు.


యాజ్ఞవల్క్యుడికి సమయ సందర్భ కాలోచితం గా సంస్కారాలన్నీ జరిపించి విద్య

నేర్చుకుందుకు పంపించారు.

ఋగ్వేదం పాష్కలుడి దగ్గర, సామవేదం జైమిని మహర్షి దగ్గర, అధర్వణ వేదం ఆరుణి

ఋషి దగ్గర నేర్చుకున్నాక యాజ్ఞవల్క్యుణ్ణి వైశంపాయనుడి దగ్గరకి పంపించారు.

ఆయన సేవ చేసుకుని గురువుగారితో మంచి వాడనిపించుకుని యజుర్వేదం,

వేదరహస్యాలు, పరమార్ధ రహస్యాలు అందరికంటే ముందే నేర్చేసుకున్నాడు

యాజ్ఞవల్క్యుడు.

కాని యాజ్ఞవల్క్యుడు నాకు అన్ని వేదాలు వచ్చు. నేను బ్రహ్మహత్యాపాతకం కూడ ఏడు

రోజుల్లో పో గొట్టగలనని గర్వంగా అనడం మొదలు పెట్టా డు. గురువుగారికి ఇది తెలిసి నిజం

తెలిసికోడానికి అతని గర్వం అణిగించడానికి తన మేనల్లు ణ్ణి కాలితో తన్ని నా

బ్రహ్మహత్యాపాతకం ఎవరైనా తగ్గిస్తా రా? అని శిష్యుల్ని అడిగాడు.

యాజ్ఞవల్కుడు 'వాళ్ళకేం తెలుసు నాకే వచ్చు 'అన్నాడు. గురువుగారు కోపం వచ్చి

మూర్ఖా ! నాకు రాని విద్య నీ దగ్గరేముంది? నీ గర్వం అణగాలనే ఇలా చేశాను అన్నాడు

వైశంపాయనుడు.

నేను చెప్పిన వేదాలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపొ మ్మన్నాడు.

శిష్యుడు ఎంత బ్రతిమిలాడినా వినలేదు గురువు .


గురుదేవా! మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తా నని యాజ్ఞవల్క్యుడు రక్తం రూపంలో వేదాలన్నీ

అక్కడే వదిలేసి తపస్సు చేసి వైశంపాయనుడి బ్రహ్మహత్యాపాతకం పో గొట్టా డు.

ఆ రక్తం గడ్డ లు కట్టి వుంటే తిత్త రపక్షులు తిని తిత్త రులనే వేదాలు చెప్పాయి. వాటినే

“తెత్తి రీయోపనిషత్తు " అంటారు.

యాజ్ఞవల్క్యుడు సూర్యుణ్ణి ఆరాధించి శుక్లయజుర్వేదం నేర్చుకుని ఎంతో మంది

శిష్యులు మళ్ళీ వాళ్ళకి

శిష్యుల్లో ప్రచారంలోకి తెచ్చాడు. యాజ్ఞవల్క్యుడి మొదటి శిష్యుడు కణ్వుడు.

ఒకసారి జనక చక్రవర్తి యాగం చేసి ఋషులందర్నీ పిలిచాడు. యాజ్ఞవల్క్యుడు కూడ

వెళ్ళాడు. యాగం అయిపో యాక జనకుడు మీలో గొప్పవాడెవరో చెప్తే ఆయనకి

ధనరాశుల్ని ఇస్తా ననీ మీరే తేల్చుకుని చెప్పండి నాకంత శక్తి లేదని అన్నాడు.

ఎవరికి వాళ్ళు లేవలేదు. యాజ్ఞవల్క్యుడు మాత్రం శిష్యుల్ని పిలిచి ఆధనం ఇంటికి

తీసికెళ్ళండి అన్నాడు.

శాకల్యముని లేచి నువ్వే గొప్పవాడివని నీకు నువ్వే నిర్ణయించుకుంటావా? నాతో

వాదించమన్నాడు.

శాకల్యమునితో వాదించి ఆయన్ని ఓడించాడు యాజ్ఞల్యుడు .జనకుడు ఆయనని

సన్మానించి పంపాడు.
జనకచక్రవర్తి యాజ్ఞవల్క్యుణ్ణి అడిగి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాడు.

తర్వాత విశ్వావసుడు యాజ్ఞవల్క్యుణ్ణి తత్త్వబో ధన చెయ్యమని అడిగి విశ్వావిశ్వాలు,

మిత్రా వరుణులు, జ్ఞా నజ్ఞేయాలు తపో తపాలు, సూర్యాతిసూర్యులు, విద్యావిద్యలు

వేద్యావేద్యాలు వంటి చాలా విషయాల గురించి తెలుసుకున్నాడు.

మహర్షు లందరూ కలిసి ఒక గొప్ప యోగికి పట్టా భిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

అందరికంటే గొప్ప యోగరహస్యాలు తెలిసినవాడు యాజ్ఞవల్క్యుడేనని అతనికి యోగీంద్ర

పట్టా భిషేకం మాఘశుద్ధ పౌర్ణమినాడు చేశారు.

యాజ్ఞవల్క్యుడు ఋషులకి చెప్పిన విషయాలే 'యోగ శాస్త్రం',

'యోగయాజ్ఞవల్య్యం

అనే పేరుతో పన్నెండు అధ్యాయాలులో గ్రంథాలుగా వచ్చాయి.

'యాజ్ఞవల్క్యస్మృతి' అనే గ్రంథంలో నాలుగు కాండలున్నాయి. మొదటి దాంట్లో

పధ్నాలుగు విద్యలు, పరిషత్తు , సంస్కాత, స్నాతకం, పౌరోహితం, వివాహం మొదలైనవి

రెండో కాండలో న్యాయస్థా నం, శిక్ష, స్త్రీధనం గురించి మూడు, నాలుగు, కాండల్లో అపరకర్మ,

అశౌచశుద్ధి, యతి ధర్మాలు, మోక్షమార్గం, యమ నియమాలు, ప్రా యశ్చిత్తా లు

మొదలైనవి.
చేసే పనులు, పొందిన జ్ఞా నం రెండూ కలిస్తే నే మోక్షం కలుగుతుంది. ఒక్క జ్ఞా నం వల్ల

మోక్షం రాదని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

You might also like