You are on page 1of 5

11/25/22, 12:54 PM Print

న్యా య వ్య వస్థ క్రీయాశీలత

పౌరహక్కు లు ప్రమాదంలో పడినప్పు డు, సమాఖ్య స్ఫూ ర్తికి భంగం కలిగినప్పు డు, రాజ్యాంగ
ఔన్న త్యా నికి అవరోధం ఏర్ప డినప్పు డు, అర్హులైన వారికి సామాజిక న్యా యం అందనప్పు డు
న్యా యవ్య వస్థ అనివార్యంగా జోక్యం చేసుకుంటుంది. ప్రజా పాలనలో ప్రధానమైన శాసన,
కార్య నిర్వా హక వ్య వస్థల రాజ్యాంగ అతిక్రమణలను, అలసత్వా న్ని నిరోధిస్తుంది.
జవాబుదారీతనాన్ని పెంచుతుంది. రాజ్యాంగ పరిమితుల్లో పరిధులు విస్తరించుకొని చురుగ్గా
వ్య వహరించి, పదునైన న్యా యాన్ని పంచుతుంది.
దేశ పరిపాలన రాజ్యాంగబద్ధంగా కొనసాగాలంటే శాసన, కార్య నిర్వా హక, న్యా యవ్య వస్థలు తమ
విధులను సమర్థంగా నిర్వ హించాలి. వాటిలో ఎలాంటి లోపాలు ఏర్ప డినా న్యా యవ్య వస్థ
క్రియాశీలకం అవుతుంది. పరిపాలనను సరిచేస్తుంది.

అర్థ వివరణ
సాధారణంగా న్యా యవ్య వస్థ క్రియాశీలతను శాసన, కార్య నిర్వా హక వ్య వస్థల అధికార పరిధిలో
జోక్యం చేసుకోవడంగా పరిగణిస్తుంటారు. వాస్తవానికి న్యా యవ్య వస్థ సాధారణ విధుల కంటే
క్రియాశీలత భిన్న మైనది కాదు. సాధారణ పరిభాషలో చెప్పా లంటే క్రియాశీలత అంటే చురుగ్గా
ఉండటం. 'ప్రతి న్యా యమూర్తి పురోగమన దృక్ప థంతో విధులను నిర్వ హించడాన్ని క్రియాశీలతగా
చెప్ప వచ్చు ' అని జస్టిస్ కృష్ణయ్య ర్ పేర్కొ న్నా రు. ఆ ప్రకారం చూస్తే న్యా యవ్య వస్థ క్రియాశీలత
అనేది దృఢమైన చర్య లతో నిర్మా ణాత్మ కంగా మౌలిక చట్టా న్ని రూపొందించడమే అని అర్థం
చేసుకోవచ్చు . న్యా యవ్య వస్థ క్రియాత్మ క వైఖరి వల్ల శాసన వ్య వస్థను సజీవంగా ఉండటంతోపాటు
సామాజిక, ఆర్థిక మార్పు ల ప్రక్రియల్లో కీలకంగా వ్య వహరిస్తుంది. స్వే చ్ఛ , సమానత్వం, న్యా యం
లాంటి భావనలను ప్రోత్స హిస్తుంది. సామాజిక పరివర్తనకు కృషి చేస్తుంది. కేవలం న్యా యనిర్ణేతగా
ఉండాలనే సంప్రదాయ భావనను దాటి, అందుకు భిన్నంగా రాజ్యాంగ సంవిధానంలో చోదకశక్తిగా
వ్య వహరించడమే న్యా యవ్య వస్థ క్రియాశీలత అంతిమ లక్ష్యం.
‘శాసన, కార్య నిర్వా హక వ్య వస్థల అశ్రద్ధ, అలసత్వం కారణంగా కొన్ని సందర్భా ల్లో సామాజిక
దోపిడికీ గురయ్యే వర్గా లకు సామాజిక న్యా యాన్ని అందించడానికి పౌర సేచ్ఛా సంస్థలు, సామాజిక
సేవా సంస్థలు, స్వ చ్ఛంద సంస్థలు ప్రజాప్రయోజన వ్యా జ్యా ల ద్వా రా ముందుకొస్తున్నా యి. ఆ
వ్యా జ్యా లు న్యా యస్థా నాల న్యా యసమీక్ష అధికార పరిధిని, న్యా య పరిమితులను ఎప్ప టికప్పు డు
విస్తృతపరిచాయి. న్యా యస్థా నాలు పోషిస్తున్న ఈ పాత్రను విమర్శించేవారు దానికి న్యా యశాఖ
క్రియాశీలత అని పేరు పెట్టా రు.” 
- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్

'భారత న్యా యవ్య వస్థపై న్యా య క్రియాశీలత ఒక ఒత్తిడితో కూడిన కుదుపు లాంటిది. సరైన
నిర్ణయాలను తీసుకోవడంలో శాసన వ్య వస్థ, కార్య నిర్వా హక వ్య వస్థలు ప్రదర్శించే అలసత్వం వల్ల
న్యా యశాఖ | క్రియాశీలకంగా మారాల్సి న పరిస్థితి ఏర్ప డుతుంది. సున్ని తమైన సమస్య లు
పరిష్కా రం కాకుండా మిగిలిపోయినప్పు డు ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెరిగి, తగిన పరిష్కా రం
కోసం న్యా యస్థా నాలనుఆశ్రయిస్తా రు.' -  జస్టిస్ ఎ.ఎం. అహ్మ ది

about:blank 1/5
11/25/22, 12:54 PM Print

'క్రమపద్ధతిలో కోర్టు ఆదేశాలను ఇవ్వ డం, మారిన పరిస్థితులకు అనుగుణంగా శాసనాలను


రూపొందించడానికి తగిన సూచనలు చేయడం, సమన్యా యాన్ని అందించడమే న్యా య వ్య వస్థ
క్రియాశీలత - ప్రముఖ న్యా య నిపుణులు రాజీవ్ ధావన్

క్రియాశీలతకు కారణాలు

భారత సమాఖ్య వ్య వస్థలో తలెత్తే సమస్య లు.


రాజ్యాంగ ఔన్న త్యా నికి అవరోధం ఏర్ప డటం.
మానవ, పౌర హక్కు లకు భంగం కలగడం.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గా ల వారికి న్యా యం
సమన్యా య పాలనకు ఇబ్బందులు ఎదురవడం.
పాలనా వ్య వస్థలో పారదర్శ కత, జవాబుదారీతనం లోపించడం.

పౌరహక్కు ల కార్య కర్తలు, పర్యా వరణ పరిరక్షణ వాదులు, బాలల హక్కు ల పరిరక్షణ బృందాలు,
సాంఘిక దురాచారాల నిర్మూ లన కోసం పోరాడేవారు, మహిళాభ్యు దయ బృందాల్లాంటివి
న్యా యవ్య వస్థ క్రియాశీలతకు దోహదపడుతున్నా యి. ప్రాథమిక హక్కు ల్లో ని ఆర్టికల్ 21లో పేర్కొ న్న
జీవించే హక్కు పరిధిని క్రియాశీలత ద్వా రా పెంచారు. దానిలో అంతర్భా గంగానే ఆర్టికల్ 21(A)
ద్వా రా 14 సంవత్స రాల్లో పు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు ను
నిర్దేశించారు.

ప్రయోజనాలు

ప్రాథమిక హక్కు లపై విధించే ఆంక్షలను న్యా యవ్య వస్థ నివారిస్తుంది.


శాసన, కార్య నిర్వా హక వ్య వస్థల వైఫల్యా లను ప్రశ్ని స్తుంది. 
ప్రాథమిక హక్కు లకు విస్తృతమైన వివరణను ఇస్తుంది.
పరిపాలనలో పారదర్శ కతను, జవాబుదారీతనాన్ని ప్రోత్స హిస్తుంది.
కేవలం వ్య క్తు లకే పరిమితం కాకుండా సమూహాలకు న్యా యం అందుతోంది.
ఎన్ని కల ప్రక్రియను మరింత స్వే చ్ఛ గా, స్వ తంత్రంగా మార్చ డానికి తోడ్ప డుతుంది.
ఎన్ని కల్లో పోటీ చేసే అభ్య ర్థులు కోర్టు ఆదేశాన్ని అనుసరించి తమ ఆస్తులు, ఆదాయం,
విద్యా ర్హతలు,
నేరచరిత్ర లాంటి అంశాలతో కూడిన 'అఫిడవిట్ ను సమర్పి స్తున్నా రు. దీనిద్వా రా ఉత్తమ
ప్రతినిధిని ఎన్ను కోవడానికి ప్రజలకు అవకాశం లభిస్తోంది.

ప్రతికూల ఫలితాలు

శాసన, కార్య నిర్వా హక, న్యా యవ్య వస్థల మధ్య అంతరాన్ని పెంచే అవకాశం ఉంది.
ప్రభుత్వ కార్య కలాపాలను నియంత్రిస్తుంది.
రాజ్యాంగపర ఉల్లంఘనలు జరిగే ప్రమాదం ఉంది.
ప్రజాస్వా మ్య ప్రక్రియకు విఘాతం కలిగే వీలుంది.

about:blank 2/5
11/25/22, 12:54 PM Print

సుప్రీంకోర్టు కేసులు
బెన్నె ట్ కోల్మ న్ వర్సె స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: ప్రభుత్వ కార్య కలాపాలకు
సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే సమాచార స్వే చ్ఛా హక్కు అనేది ఆర్టికల్ 19(1)(A) లో
అంతర్భా గమని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.
నందినీ శపతి వర్సె స్ పి.ఎల్. దాని కేసు: ఒక వ్య క్తిని శారీరకంగా, మానసికంగా హింసించి లేదా
ఒత్తిడికి గురిచేసి సమాచారాన్ని రాబడితే అది బలవంతపు సాక్ష్యం అవుతుందని, ఈ విధానం
ఆర్టికల్ 20(3)కి వ్య తిరేకమని సర్వో న్న త న్యా యస్థా నం పేర్కొంది.
అబ్దుల్ కరీం వర్సె స్ స్టేట్ ఆఫ్ కర్ణా టక కేసు: ఒక వ్య క్తి నుంచి సమాచారం రాబట్టడం కోసం
అతడి ఆరోగ్యం దెబ్బ తినే విధంగా 'నార్కో అనాలసిస్ పరీక్ష'ను పదేపదే వినియోగించకూడదు .
ఖ్వా జా అహ్మ ద్ అబ్బా స్ వర్సె స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: సినిమాలు
భావోద్రేకాలను రెచ్చ గొట్టే అవకాశం ఉండటం వల్ల వాటిపై ముందస్తుగానే సెన్సా ర్షిప్ విధించడం
భావవ్య క్తీకరణ స్వే చ్ఛ కు వ్య తిరేకం కాదు.
లతాసింగ్ వర్సె స్ స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కేసు: ఒక మహిళ తనకు నచ్చి న పురుషుడిని
భర్తగా ఎంచుకోవడం (వివాహం) ఆర్టికల్ 21లో పేర్కొ న్న జీవించే హక్కు లో అంతర్భా గం.
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీన్ వర్సె స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: ఆకలి,
పోషకాహార లోపాలను అధిగమించడానికి ఆహార హక్కు ను చట్టబద్ధంగా అమలు చేయాలని
సుప్రీంకోర్టు ప్రభుత్వా న్ని ఆదేశింది.   
అపర్ణా భట్ వర్సె స్ స్టేట్ ఆఫ్ మధ్య ప్రదేశ్ కేసు: అత్యా చారం, లైంగిక వేధింపుల కేసుల్లో
ఎలాంటి పరిస్థితుల్లో నూ నిందితులు, బాధితురాలి మధ్య రాజీ సాధ్య పడదు.
సుప్రీంకోర్టు అడ్వ కేట్స్ ఆన్ రికార్డ్ వర్సె స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: న్యా యమూర్తుల
నియామకం కోసం 99వ రాజ్యాంగ సవరణ చట్టం -2014 ద్వా రా ఏర్పా టు చేసిన 'నేషనల్
జ్యు డీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్ చెల్లుబాటు కాదు.

ప్రజాప్రయోజన వ్యా జ్యం


ప్రజాప్రయోజన వ్యా జ్యం (పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ పిల్) భావన 1960వ దశకంలో అమెరికాలో
ఆవిర్భ వించింది. న్యా యవ్య వస్థ గుర్తించిన స్థా యి (Locus-Standi) కి సంబంధించిన సరళీకృత
నియమాల నుంచి పుట్టుకొచ్చిందే ప్రజాప్రయోజన వ్యా జ్యం (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్) లేదా
సామాజిక చర్యా వ్యా జ్యం (సోషల్ యాక్షన్ లిటిగేషన్). ప్రభుత్వ అధికారం వల్ల ఒక వ్య క్తి తన
చట్టబద్ధమైన హక్కు లకు భంగం కలిగి నష్టపోయి గాయపడతాడో ఆ వ్య క్తి మాత్రమే
న్యా యపరిహారం కోసం న్యా యస్థా నాలను ఆశ్రయించాలి అనే సూత్రం సంప్రదాయ ‘గుర్తించిన
స్థా యి' నియమంపై ఆధారపడి ఉంటుంది. ప్రజాప్రయోజన వ్యా జ్యం ఈ సంప్రదాయ నియమాన్ని
న్యా యవ్య వస్థ క్రియాశీలతలో భాగంగా సరళీకరించింది. ఆ సరళీకృత నియమం ప్రకారం
చట్టబద్ధమైన హక్కు లను నష్టపోయిన లేదా అన్యా యానికి గురైన వ్య క్తి స్వ యంగా న్యా యస్థా నాన్ని
ఆశ్రయించలేనప్పు డు, సామాజిక స్పృహ, చైతన్యం కలిగిన వ్య క్తు ల సహాయంతో కోర్టు నుంచి
న్యా యాన్ని పొందే ప్రక్రియనే ప్రజాప్రయోజన వ్యా జ్యం అంటారు. మన దేశంలో 1980వ దశకంలో
సుప్రీంకోర్టు న్యా యమూర్తులు జస్టిస్ పి.ఎన్. భగవతి, జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్య ర్లు దీనికి విస్తృత

about:blank 3/5
11/25/22, 12:54 PM Print

ప్రాచుర్యం కల్పించారు. న్యా య ఆదేశాలు, చట్టం, రాజ్యాంగ లక్ష్యా లు సక్రమంగా, సమర్థంగా


అమలయ్యే లా చూడటం ప్రజాప్రయోజన వ్యా జ్యం లక్ష్యం.

'పిల్' లోని మౌలికాంశాలు:

సాధారణ, సంప్రదాయ వ్యా జ్యా లకు ఇది భిన్న మైనది. ప్రజల సమష్టి ప్రయోజనాలు దీనిలో
ఇమిడి ఉంటాయి.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు, పేదలు నిర్లక్ష్యా నికి గురైన వారికి రాజ్యాంగ
హక్కు లు, న్యా యం అందించడానికి పిల్ తోడ్ప డుతుంది.
అన్యా యానికి గురై, న్యా యస్థా నాలను ఆశ్రయించలేని నిస్స హాయ స్థితిలో ఉన్న ప్రజల
తరుపున ఎవరైనా న్యా యస్థా నంలో దీన్ని వేయవచ్చు . 
న్యా య సహాయం కోసం సాగే ఉద్య మానికి సామాజిక అస్త్రంగా దీన్ని పరిగణించవచ్చు .
దీని ప్రభావం పిటిషనర్ తోపాటు ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు, న్యా యస్థా నాల మీద
పడుతుంది. అది వెనుకబడిన వర్గా ల వారికి సామాజిక న్యా యాన్ని అందిస్తుంది.
ప్రజల ప్రయోజనార్థం ఆదేశాలు వెలువరించే సమయంలో అప్ప టికే నిర్ణయించి
అమలవుతున్న విధానాల మార్పు ల విషయంలో న్యా యస్థా నం ఆచితూచి వ్య వహరిస్తుంది.
అత్యంత జాగ్రత్తతో ప్రాథమిక హక్కు లకు భంగం కలగకుండా తీర్పు ను వెలువరిస్తుంది.

నియమ నిబంధనల పరిధి: ప్రజాప్రయోజన వ్యా జ్యం పిటీషన్లను విచారించేందుకు 1988లో


సుప్రీంకోర్టు నియమ నిబంధనలను రూపొందించింది. వీటిని 1993, 2003ల్లో సవరించారు. వాటి
ప్రకారం ప్రజాప్రయోజన వ్యా జ్యా నికి సంబంధించిన విచారణకు స్వీ కరించే, స్వీ కరించకూడని
అంశాలను నిర్ణయించారు.

స్వీ కరించే అంశాలు:

మహిళలపై జరిగే అత్యా చారాలు, హత్య లు, అపహరణలు లాంటి నేరాలు, వేధింపులు.
పర్యా వరణ సమతౌల్య తను దెబ్బ తీసే వ్య వహారాలు, చారిత్రక, సాంస్కృతిక కట్టడాల
పరిరక్షణ, పురాతన కటడాల సంరక్షణ, వన్య ప్రాణుల, అడవుల పరిరక్షణ అంశాలు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మి కుల వ్య వహారాలు.
ముందస్తు విడుదల, 14 ఏళ్ల యావజ్జీవ శిక్ష అనుభవించిన తర్వా త విడుదల, వ్య క్తిగత
పూచీకత్తుపై విడుదల లాంటి వ్య వహారాల్లో ; జైళ్లలో జరిగే వేధింపులు, అనుమానాస్ప ద
మరణాలు, విచారణను జాప్యం చేయడం లాంటి ప్రాథమిక హక్కు ల ఉల్లంఘనలు.
కార్మి కులకు కనీస వేతనాలు చెల్లించకపోవడం, కార్మి క చట్టా లను ఉల్లంఘించడం లాంటి
అంశాలు.
ఎస్సీ , ఎస్టీ వర్గా లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గా లకు చెందిన వారిపైనా పోలీసులు /
ఇతరులు వేధింపులకు పాల్ప డే అంశాలు.

పిల్ పరిధిలోకి రాని అంశాలు:

about:blank 4/5
11/25/22, 12:54 PM Print

పెన్షన్, గ్రాట్యు టీ చెల్లింపులకు సంబంధించిన సేవా అంశాలు హైకోర్టు, దిగువస్థా యి


న్యా యస్థా నాల్లో పెండింగ్లో ఉన్న కేసుల వ్య వహారాలు, భూయజమాని, అద్దెదారు, కౌలుదారులకు
సంబంధించిన వివాదాలు వివిధ రకాల విద్యా సంస్థల్లో జరిగే ప్రవేశాలు

పిల్ - దుర్వి నియోగ నివారణకు సుప్రీంకోర్టు నియమాలు:

పిటిషన్ను విచారణకు స్వీ కరించే ముందు దానిలో ప్రజాప్రయోజనం ఇమిడి ఉందా? లేదా?
అనేవిషయాన్ని నిర్ధా రించుకోవాలి. సదుద్దేశంతో వచ్చి న వాటిని మాత్రమే విచారణకు
స్వీ కరించాలి.పిటిషన్లో పేర్కొ న్న విషయాల్లో నిజానిజాలను ప్రాథమికంగా న్యా యస్థా నం
నిర్ధా రించుకోవాలి.విస్తృత ప్రజాప్రయోజనాలు ఉన్న పిటిషన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వా లి.
అనవసరమైన పిటిషన్లు, కుట్రపూరిత ఉద్దే శాలతో కూడిన పిటిషన్లను తిరస్క రించడంతోపాటు, ఆ
పిటిషనర్ల నుంచి జరిమానా పేరుతో రుసుం వసూలు చేయాలి. పిటిషన్ను స్వీ కరించే ముందు
ప్రతి న్యా యమూర్తి అప్రమత్తంగా వ్య వహరించాలి. రాజ్యాంగపరమైన ధర్మా న్ని అమలు
చేయడంలో ప్రభుత్వా లు విఫలమైనప్పు డు, పౌరుల ప్రాథమిక హక్కు లకు భంగం కలిగినప్పు డు,
ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశాల మధ్య వైరుధ్యం ఏర్ప డినప్పు డు కోర్టు జోక్యం చేసుకుంటుంది.
ఆ అంశాలకు సంబంధించి టెలిగ్రామ్ లేదా ఉత్తరం లేదా మరేదైనా రూపంలో సమాచారం
న్యా యస్థా నం ముందుకు వస్తే దాన్ని పిటిషన్ గా పరిగణిస్తుంది. పత్రికలు, టీవీ ఛానెల్స్ లో
వచ్చి న వార్తలను కూడా కోర్టు తనకు తానుగా కేసు (సుమోటోగా తీసుకొని విచారిస్తుంది. తీర్పు ను
వెలువరిస్తుంది.

about:blank 5/5

You might also like