You are on page 1of 11

క్యూ-టి సెంటర్ కమ్యూనిటీ కన్సల్టే షన్ అక్టో బర్ 2023

పరిచయం
క్వియర్ వ్యక్తు ల మధ్య వనరులు పంచుకోవడం క్వియర్ స్త్రీవాద దృక్పధం తో జరగాలని, అందులో
కమ్యూనిటీ సభ్యులు ముఖ్యమైన భాగస్వాములు అని క్యూ టి సెంటర్ లో మేము నమ్ముతాము. క్వియర్
స్త్రీవాద భావజాలం అంటే కుల వ్యవస్థ కు వ్యతిరేకంగా, ఎప్పటినుండో వనరులపై పురుషాధిక్య, కుల
ఆధిపత్య వ్యవస్థ ల గుత్తా ధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ పని చెయ్యడం. చారిత్రా త్మకంగా అణిచివేయబడ్డ ఎల్ జి
బి టి క్యు ఐ ఎ + సముదాయాలు న్యాయబద్ధ ంగా వనరులు పంచుకోవడానికి, వ్యవస్థా గత సపో ర్ట్ ని
ఏర్పర్చుకోవడానికి అవసరమయ్యే రూపకల్పన గురించి అర్ధ ం చేసుకోవటానికి క్యూ టి సెంటర్ చేసే ఈ
ప్రయత్నం లో కమ్యూనిటీ ప్రధాన భాగస్వామి. QT సెంటర్ క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు ల కోసం అన్ని జెండర్
అస్తిత్వాలు గల వ్యక్తు లు ఒకే దగ్గ ర వుండగలిగే తాత్కాలిక నివాస సౌకర్యాన్ని (జెండర్-న్యూట్రల్ షెల్టర్)
ఏర్పాటు చెయ్యాలి అనే లక్ష్యంతో పని చేస్తో ంది. అలాగే డ్రా ప్-ఇన్ స్పేస్, హెల్ప్ లైన్ సేవ, న్యాయ సహాయ
సేవ, మానసిక ఆరోగ్యానికి తోడ్పడే సేవలు, మరియు నిరంతర కమ్యూనిటీ సపో ర్ట్ వంటి ఇతర సహాయక
సేవలను కూడా క్యూ టి సెంటర్ అందిస్తు ంది.

తెలంగాణ రాష్ట ్ర వ్యాప్త ంగా, వివిధ నేపధ్యాల నుండి వచ్చే కమ్యూనిటీ సభ్యులను ఒక దగ్గ రికి తీసుకొచ్చి
క్యూ టి సెంటర్ దృక్పధాన్ని, ఇప్పటి వరకు చేసిన పనిని పంచుకోవడానికి; అలాగే కమ్యూనిటీ సభ్యుల
అనుభవాలు వినడానికి, అన్ని జెండర్ అస్తిత్వాలు గల వ్యక్తు లు ఒకే దగ్గ ర వుండగలిగే తాత్కాలిక నివాస
సౌకర్యం (జెండర్-న్యూట్రల్ షెల్టర్) ఏర్పర్చటానికి సంబంధించి వారి ఆలోచలను తెలుసుకోవడానికి 8
అక్టో బరు 2023న, క్యూటి సెంటర్ ఒక కమ్యూనిటీ కన్సల్టే షన్ నిర్వహించింది. కమ్యూనిటీ సభ్యులు
అందరూ ఒక దగ్గ రికి వచ్చి వారి ఆలోచనలను, దృక్పధాలను తెలియజేయడానికి మరియు
జెండర్-న్యూట్రల్ షెల్టర్ పై వారి అనుభవాలు మరియు అభిప్రా యాలను పంచుకోవడానికి ఇది ఒక
బహిరంగ వేదిక.

ఈ వేదికలో కమ్యూనిటీ సంప్రదింపుల ద్వారా జెండర్-న్యూట్రల్ షెల్టర్ కి సంబంధించి సభ్యులకి ఉన్న


అనేక ఆలోచనలను వినడానికి మాకు అవకాశం లభించింది. తమ జీవితంలో ఎప్పుడో అప్పుడు షెల్టర్
అవసరం పడిన కమ్యూనిటీ సభ్యులతో మాట్లా డడానికి, వాటిపై వారి అభిప్రా యాలను పంచుకోవడానికి
కూడా ఇది మాకు తోడ్పడింది. ఇది భవిష్యత్తు లో ఎదురవ్వ బో యే సమస్యలు, సంభవించ బో యే
సంఘటనలు, వాటిలో కొన్నింటిని అయినా నివారించగలిగే లేదా ఎదుర్కొనే మార్గా లకు సంబంధించి కొన్ని
సూచనలను మా దృష్టికి తీసుకు వచ్చింది.

కన్సల్టే షన్ లో చర్చకు, ప్రస్తా వనకు వచ్చిన అంశాలు:

1
క్యూటి సెంటర్ సిబ్బంది ఏప్రిల్ 2023లో ప్రా రంభించినప్పటి నుండి ఇప్పటికి వరకు జరిగిన పనుల గురించి
ఒక ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా క్యూ సెంటర్ పనిని ఈ మూడు భాగాలలో చెప్పారు - 1.
ఎస్సెన్న్షియల్ సేవలు 2. కమ్యూనిటీ ఔట్రీచ్ 3. కమ్యూనిటీ బిల్డింగ్

షెల్టర్/నివాసానికి సంబంధించి ఏవైనా అనుభవాలు ఉంటే వ్రా యాలి అని సభ్యులందరికీ ఒక సర్వే ఫారమ్
ఇచ్చి ఇష్ట ం ఉన్నవారు దానిని నింపాలి సిందిగా కోరడం జరిగింది.

కమ్యూనిటీ కన్సల్టే షన్ కోసం వచ్చిన సభ్యులందరినీ రాండమ్ గా ఐదు గ్రూ పులుగా విభజించి. ప్రతి గ్రూ ప్
కి ఈ క్రింది రెండు ప్రశ్నలు ఇచ్చాము:

1.​​క్యూ టి సెంటర్ అన్ని రకాల జండర్ క్వియర్ వ్యక్తు లకి (వారి వారి జండర్- కుల విశేషాధికారాలని
పరిగణనలోకి తీసుకున్న తర్వాత) ఉపయోగపడాలని మా ఉద్దేశం. జండర్ తటస్థ త వుండే స్థ లాలు
పితృస్వామ్యం జెండర్ పాత్రలని సవాలు చెయ్యటానికి సహాయ పడతాయని మా నమ్మకం. కానీ
అటువంటి స్థ లాల్లో అందరూ కలిసి వున్నప్పుడు ఎటువంటి సవాళ్లు వస్తా యి? వాటిని ఎదుర్కోవటానికి
మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి?

2.క్యూ టి సెంటర్ లో తాత్కాలిక వసతి సౌకర్యం, డ్రా ప్ ఇన్ స్పేస్, మానసిక ఆరోగ్య సేవలు అన్నీ కలిపి
ఒకే స్థ లంలో ఇస్తా ము. దీనితో కమ్యూనిటీ సంబంధాలు గట్టి పడి ఒక ఉత్తేజ భరితమయిన కమ్యూనిటీ
ప్రదేశం ఏర్పడుతుందని మా ఉద్దేశం. ఇటువంటి నమూనాతో వచ్చే ప్రయోజనాలేమిటి? అలాగే ఈ
నమూనా లో వున్న లోపాలేమిటి? వీటిని పూరించటానికి మీ ఉద్దేశంలో ఎటువంటి చర్యలు
అవసరమవుతాయి?

ప్రతి గ్రూ ప్ వారు వారి గ్రూ ప్ కి ఒక సమన్వయకర్త ని ఎంచుకున్నారు. ఇచ్చిన ప్రశ్నలను చర్చించడానికి,
వారి అభిప్రా యాలు వారికిచ్చిన పేపర్ మీద వ్రా యడానికి ప్రతి గ్రూ ప్ కి 45 నిమిషాలు ఇవ్వడం జరిగింది.
దీని తర్వాత గ్రూ ప్ సభ్యులు తమ చర్చల సారాంశాన్ని అందరితో పంచుకున్నారు, అందులో వచ్చిన
విషయాలపై చర్చించడం జరిగింది . ఇది బహిరంగ చర్చ గా సాగింది. పంచుకున్న అన్ని అంశాల పై
అందరూ స్పందించవచ్చు అలాగే చెప్పిన విషయాల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు.

ట్రా న్స్ జెండర్ వ్యక్తు లకు అన్ని రిజర్వేషన్ వర్గా లలో ట్రా న్స్ జెండర్ వ్యక్తు లని జోడించాలి అనే హారిజాంటల్
రిజర్వేషన్ల న గురించి చర్చించి, సమర్ధించే వేదికగా కూడా ఈ సంప్రదింపులు పనిచేశాయి. తెలంగాణ రాష్ట ్ర
బీసీ సంక్షేమ కమిషన్ ద్వారా సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతిలో ట్రా న్స్‌జెండర్ల ను
చేర్చడం కోసం ఏర్పాటు చేసిన సంప్రదింపుల సమావేశానికి కమ్యూనిటీ సభ్యులకి అందిన ఆహ్వానానికి
ప్రతిస్పందనగా ఇది చర్చ జరిగింది.

2
అభిప్రా యాల సర్వే నుండి తెలిసిన విషయాలు:
కమ్యూనిటీ కన్సల్టే షన్ సమయంలో పాల్గొ నేవారి కోసం ఒక సర్వే కూడా చెయ్యటం జరిగింది. కన్సల్టే షన్
లో పాల్గొ నే ప్రతి వ్యక్తి తమ అభిప్రా యాలను వివరంగా తెలియజేయడానికే ఇది రూపొ ందించబడింది.

మొదటి ప్రశ్న "మీకు ఎప్పుడైనా షెల్టర్ హో మ్ అవసరం వచ్చిందా?" ఈ ప్రశ్న తర్వాత రెండు ఉప ప్రశ్నలు
వచ్చాయి: కమ్యూనిటీ లో కి చేరక ముందు మరియు కమ్యూనిటీ లోకి వచ్చిన తర్వాత. కమ్యూనిటీ
సభ్యులు షెల్టర్ హో మ్‌లలో నివసించకపో యినా, వ్యక్తిగత లేదా సామాజిక లేదా ఆర్థిక కారణాల వల్ల షెల్టర్
కావాల్సిన అవసరం ఉందని వారు భావించారా అని నిర్ధా రించడానికి ఈ ప్రశ్న రూపొ ందించబడింది.
కమ్యూనిటీలో భాగమైన తర్వాత ఆశ్రయం పొ ందాల్సిన అవసరం ఉందని వారు భావించారా అనే ఉప-ప్రశ్న,
మన కమ్యూనిటీ రూపకల్పన లో తరచుగా కనిపించని వనరుల లభ్యత, సంరక్షణ మరియు సపో ర్ట్
యొక్క అంశాలను అంచనా వేయడంలో మాకు సహాయపడుతుంది. అలాగే వారిచ్చిన జవాబుల
ఆధారంగా మేము ఈ అంశాలను క్యూ టి సెంటర్ షెల్టర్ హో మ్‌లో భాగంగా చేయగలమా అని అంచనా
వేయడంలోను సహాయపడుతుంది.

మొత్త ం 47 మంది సర్వే ఫారం నింపారు. కమ్యూనిటీ వనరులు వారికి అందుబాటులో రావడానికి ముందు
షెల్టర్ వెతుక్కోవాల్సిన అవసరం వచ్చిందా అనే ప్రశ్నకి 29 మంది "అవును" అని జవాబు ఇచ్చారు. 17
మంది "లేదు" అని జవాబు ఇచ్చారు. ఒక్కరు మాత్రం ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వ లేదు.

కమ్యూనిటీ వనరులు అందుబాటులోకి వచ్చిన తర్వాత షెల్టర్ హో మ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం


వచ్చిందా అన్న ప్రశ్నకి 23 మంది "అవును" అని జవాబు ఇచ్చారు. 20 మంది కమ్యూనిటీ వనరులు
అందుబాటులోకి వచ్చిన తర్వాత షెల్టర్ హో మ్ అవసరం వచ్చిందా అన్న దానికి "లేదు" అని జవాబు
ఇచ్చారు. 4 ఈ ప్రశ్నకు స్పందించలేదు.

షెల్టర్ హో మ్స్ అవసరం రావడానికి గల సర్వేలో పాల్గొ న్నవారు పేర్కొన్న ప్రధాన కారణాలు

1.కుటుంబం అంగీకరించకపో వడం


కుటుంబం అంటే రక్త సంబంధమైన కుటుంబాలు. భిన్నమైన జెండర్ గుర్తింపు/ప్రవర్త న మరియు/లేదా
లైగికత్వం కారణంగా కుటుంబం అంగీకరించకపో వడమే షెల్టర్ హో మ్‌లు అవసరమనే భావన
కలగజేయడానికి ప్రధాన కారణం. కొంతమంది కుటుంబాల తిరస్కారం హింసకు దారితీస్తు ందని కూడా
చెప్పారు, దీని వలన క్వియర్-ట్రా న్స్ వ్యక్తు లు వారు జన్మించిన కుటుంబాల ను అసురక్షితంగా భావిస్తా రు.
భద్రత లేకపో వడం నిరాశ్రయతకు మరియు ఏ విధమైన కమ్యూనిటీ లేదా నిర్మాణాత్మక మద్ద తు
లేకపో వడానికి కూడా దారి తీస్తు ంది, ఇది ఆకలి బాధకు, ఆర్థిక వనరులు లేని స్థితికి దారితీస్తు ంది. క్వియర్
మరియు ట్రా న్స్ వ్యక్తు ల ప్రేమ సంబంధాలని అంగీకరించని కుటుంబాల నుండి కూడా వారి భద్రతకు
ముప్పు ఉంది అని కొంత మంది చెప్పారు.

3
కమ్యూనిటీ సభ్యులు ఇచ్చిన జవాబులను బట్టి కుటుంబ తిరస్కారం వివిధ సందర్భాలకు దారి తెస్తు ంది
అని తెలుస్తు ంది. కుటుంబ నేపధ్యంలో వివక్ష ఉన్నప్పుడు శారీరక మరియు మానసిక వేధింపులకు దారి
తియ్యవచ్చు, ప్రత్యేకించి క్వియర్ మరియు ట్రా న్స్ వ్యక్తు లు తమ జెండర్ గుర్తింపును వ్యక్తీకరించినప్పుడు,
ఇది శారీరక అడ, మగా జెండర్ అస్తిత్వాలనే నమ్మే కుటుంబ వ్యవస్థ ల్లో ఆమోదయోగ్యం కానప్పుడు ఈ
వివక్ష హింసకు కూడా దారి తీస్తు ంది, అది వారి ప్రా ణాలకు ముప్పు ఏర్పరుస్తు ంది. అటువంటి
పరిస్థితులలో, క్వియర్ -ట్రా న్స్ వ్యక్తికి పుట్టిన కుటుంబాలను విడిచిపెట్టడం తప్ప వేరే మార్గ ం ఉండదు.

2. భద్రత సమస్యలు
క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు లు ప్రత్యేకంగా వారి అస్తిత్వాల గురించి వారి కుటుంబాలకు చెప్పినప్పుడు లేదా వేరే
వాళ్ళు వారి కుటుంబాలకు చెప్పినప్పుడు, వారు పుట్టిన కుటుంబం నుండి భద్రతా పరమైన సమస్యలను
ఎదుర్కొంటారు. వారి జండర్ గుర్తింపు మరియు వ్యక్తీకరణ చుట్టూ కుటుంబం వారు ఎలా ఉండాలి
ఉండకూడదు అని గట్టి నియమాలు పెట్టి అనుక్షణం పర్యవేక్షిస్తూ వుంటారు. సమాజ ఆమోదం పొ ందని
ఎలాంటి ప్రేమ సంబంధాలు వారికి వున్నట్టు కనిపించినా కూడా భద్రతా సమస్యలు పెరుగుతాయి.

3. జండర్ అస్తిత్వం కారణంగా సామాజిక వివక్ష


ఈ వివక్ష కారణంగా క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు ల కు సమాజం లోని ఎన్నో వ్యవస్థ లు, విషయాలు
అందుబాటులో వుండవు, ఇది వారి జీవన నాణ్యత పై విపరీత ప్రభావాన్ని చూపిస్తు ంది. క్వియర్ ట్రా న్స్
వ్యక్తు లు సమాజ ఆమోదానికి వ్యతిరేకంగా వుండే వారి జండర్ ని వ్యక్త పరచడం వల్ల అందరూ
ఉపయోగించే పబ్లి క్ స్థ లాలు కూడా వారికి సురక్షితం కాదు. భిక్షాటన మరియు సెక్స్ వర్క్ కి వ్యతిరేకంగా
ఉన్న భావనల కారణంగా పో లీసు హింస మరియు అరెస్టు ల బెదిరింపులు కూడా ఉన్నాయి. సామాజిక
వివక్ష అనేది ఉపాధి అవకాశాల కొరతకు కూడా దారి తీస్తు ంది, దీనివల్ల సురక్షితమైన గృహాలు నివాస
స్థ లాలు అందుబాటులో వుండవు.

4.ట్రా న్స్ వ్యక్తు లకు నివాసం లేకపో వడం


గృహాల కోసం అన్వేషణ కులం మరియు వర్గ నియమాలు/అస్తిత్వాల పై ఆధారపడి ఉంటుంది,
"గౌరవనీయత" యొక్క మధ్యతరగతి ప్రమాణాలకు అనుగుణంగా ఉండక పో వడం వల్ల చాలా మంది
వ్యక్తు లు వివక్షకు గురవుతారు. వారికి ఇండ్లు ఇవ్వడానికి నిరాకరిస్తా రు, దాని కారణంగా ట్రా న్స్ వ్యక్తు లకు
సురక్షితమైన గృహాల లో నివాస సౌకర్యం దొ రకదు. ట్రా న్స్ వ్యక్తు లకు ఇండ్లు అందుబాటులో ఉండవు,
లేదా ఎక్కువ అవకాశాలు అందుబాటులో లేకపో వడం వల్ల సాధారణ స్థా యి కంటే ఎక్కువ అద్దెల కట్టా ల్సి
వచ్చి దో పిడీకి గురవుతారు. సురక్షితమైన నివాస స్థ లాలు లేకపో వడం వల్ల క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు లు
హింసాపూరితమైన, అసురక్షితమైన పరిస్థితిలో ఉండవలసి వస్తు ంది.

5.మానసిక ఆరోగ్య కి కావలిసిన సపో ర్ట్

4
క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు లు తరచుగా వారి జెండర్ అస్తిత్వం మరియు లైంగికత్వం కారణంగా ఎదుర్కొనే
వివక్ష వల్ల ప్రత్యేకమైన ఒత్తి ళ్ల కు గురవుతారు. అలాగే, వారు వైద్య మరియు మానసిక ఆరోగ్యానికి
మరియు మానసిక శ్రేయస్సు సంబంధించిన సేవల ను వ్యవస్థా గతంగా వారి అందుబాటులో లేకుండా
ఉంచబడుతాయి.

6. కమ్యూనిటీ సపో ర్ట్ లేకపో వడం


క్వియర్ - ట్రా న్స్ కుటుంబాలు కు తరచుగా సురక్షితమైన మరియు వారికి మద్ద తు ని బలాన్ని
ఇచ్చేటువంటి వ్యవస్థ లు అందుబాటులో వుండవు. ఇది తమ అస్థిత్వాన్ని వెతుక్కునే యువ వ్యక్తు లను
ప్రమాదంలో పడేస్తు ంది.

7. ఆర్థిక సమస్యలు
వ్యవస్థా గతమైన సమస్యలు మరియు సామాజిక వివక్ష కారణంగా, క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు లు ఆర్థికంగా
బలహీనమైన పరిస్థితుల్లో ఉంటారు. క్వీర్ - ట్రా న్స్ వ్యక్తు ల ను ఆర్థిక వనరుల నుండి దూరం చేసి వారు
పుట్టిన కుటుంబాలు వారికి ఇతర సపో ర్ట్ సిస్టమ్ల
‌ ు అందుబాటులో లేకుండా లేదా వారు ఆధారపడ
గలిగినటువంటి ఇతర నమ్మకమైన భద్రతా సంబంధాలను నిర్మించుకో కుండా చెయ్యటం వారి జీవితాలను
నియంత్రించే ప్రయత్నం లో ఒక్కటి. కొనసాగుతున్న సామాజిక వివక్ష కారణంగా, స్థిరమైన ఉపాధి
పొ ందడం కష్ట ం. ఇంకా, క్వీర్ - ట్రా న్స్ వ్యక్తు లు వారి ప్రత్యేకమైన ఒత్తి ళ్ల కారణంగా మానసిక ఆరోగ్య
సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా ఉద్యోగాలను నిలబెట్టు కోలేక ఆర్థికంగా దుర్బలమైన
పరిస్థితుల్లో ఉండాల్సి వస్తు ంది.

8. స్వతంత్రంగా జీవించాలనుకోవడం
క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు లు స్వతంత్రంగా జీవించాలనుకుంటారు; ఇది వారి జీవితాలను ప్రభావితం చేసే
నిర్ణ యాలు తీసుకునే స్వేచ్ఛ మరియు స్వాతంత్య్రాన్ని ఇస్తు ంది. ఈ స్వతంత్రం (స్వయంప్రతిపత్తి ) అనేది
ప్రత్యేకంగా అణచివేయబడ్డ సమూహాలకు, వ్యక్తు లకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది పుట్టు క తో
కుటుంబం మరియు సామాజిక వ్యవస్థ లతో నిత్యం చేసే మంతనాలు, వారి జీవితాన్ని గణనీయంగా
ప్రభావితం చేస్తు ంది మరియు ఎన్నో అవరోధాలను ముందుంచుతుంది.

రెండవ ప్రశ్న "మీరు ఎప్పుడైనా షెల్టర్ హో మ్‌లో ఉన్నారా". ఈ ప్రశ్న కన్సల్టే షన్ లో పాల్గొ నేవారికి షెల్టర్
హో మ్‌లు లో జీవించిన అనుభవం ఉందో లేదో తెసులుసుకోవడానికి ఉద్దేశించబడింది. దీని తరువాతి ప్రశ్న
వారి అనుభవాన్ని వివరించమని. కన్సల్టే షన్ లో పాల్గొ న్న 47 మంది లో కేవలం 4 మంది మాత్రమే
షెల్టర్ హో మ్‌లో నివసించారు. అందులో ఇద్ద రు తమ అనుభవాన్ని పంచుకోలేదు. మిగతా ఇద్ద రు తమ
అనుభవాలను పంచుకున్నారు. అందులో ఒకరు వారు వికలాంగుల కోసం వున్నా షెల్టర్ హో మ్‌లో
ఉన్నానని పేర్కొన్నారు, అక్కడ వారు వివక్ష ఎదుర్కోవలసివస్తు ందనే భయం కారణంగా తన జండర్
అస్థిత్వాన్ని బహిర్గతం చేయలేదు అని చెప్పారు. క్వీర్ - ట్రా న్స్ వ్యక్తు ల కోసం ప్రత్యేక షెల్టర్ హో మ్

5
నెలకొల్పితే తప్ప, షెల్టర్ కోరుకునేవారు షెల్టర్ దొ రికిన తరువాత అది కోల్పోకుండా ఉండడానికి వారు తమ
జండర్ అస్థిత్వాన్ని లేదా లైంగికత్వాన్ని దాచవలసి వస్తు ంది అనే వాస్త వాన్ని ఈ విషయం అర్ధ ం
చేయిస్తు ంది. రెండవ వ్యక్తి షెల్టర్ హో మ్‌లో వున్న అనుభవం సానుకూలంగా ఉందని పంచుకున్నారు. ఆ
షెల్టర్ హో మ్‌లో వాతావరణం సురక్షితమైనదిగా, తన గురించి శ్రద్ధ తీసుకునేలా వుంది అని చెప్పారు.

సర్వేలోని మూడవ ప్రశ్న: వివిధ జెండర్లకు చెందిన క్వియర్ వ్యక్తు లతో స్థ లం/వనరులను
పంచుకోవడంలో కన్సల్టే షన్ లో పాల్గొ నే వారికి ఏదైనా ముందస్తు అనుభవం ఉందా? - కమ్యూనిటీ
ప్రదేశాలలో వనరులను పంచుకోవాల్సిన పరిస్థితుల్లో జీవించిన అనుభవం కన్సల్టే షన్ లో పాల్గొ న్నవారికి
ఉందో లేదో అని నిర్ధా రించడానికి సర్వేలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఈ అనుభవం అనేది ఏదైనా
కమ్యూనిటీ స్పేస్‌లలో లేదా క్వియర్ ట్రా న్స్ వ్యక్తు లతో కూడిన సమూహాలలో భాగంగా కావచ్చు. వనరుల,
భౌతిక స్థ లం, ఆర్థిక వనరులు, లేదా క్వియర్ ట్రా న్స్ వ్యక్తి ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గించే వనరులు
ఏదైనా కావచ్చు.

కన్సల్టే షన్ లో పాల్గొ న్న వారిలో 25 మంది వనరులను పంచుకోవడంలో ముందస్తు అనుభవం ఉందా
అన్న ప్రశ్నకి "అవును" అని జవాబు ఇచ్చారు. వనరులను పంచుకోవలసి వచ్చినందు వల్ల అసౌకర్యం
మరియు సంకోచాన్ని ఎదుర్కోవలసి వచ్చింది అని చెప్పారు. వనరుల పంచుకునే సందర్భంలో తరచుగా
వ్యక్తు ల మధ్య విభేదాలు, గొడవలకు దారితీసింది. ఏదేమైనప్పటిక,ీ వనరులు సంఘర్షణ మరియు
అసౌకర్యానికి దారి తీసినప్పటిక,ీ క్వియర్ వ్యక్తు లకు ఇది అవసరమని కూడా కన్సల్టే షన్లో పాల్గొ న్నవారు
అంగీకరించారు. కొంతమంది సభ్యులు కమ్యూనిటీ స్థ లంలో వనరులు పంచుకుంటున్న సమయంలో
తాము ఒక పెద్ద కమ్యూనిటీలో భాగమనే అనుభవం కలిగింది అని సానుకూల అనుభవాలను కూడా
పంచుకున్నారు.

సర్వేలోని నాల్గ వ ప్రశ్న “వివిధ జెండర్లకు చెందిన క్వియర్ వ్యక్తు లు కమ్యూనిటీ స్థ లాన్ని పంచుకోగలరని
మీరు నమ్ముతున్నారా?” జెండర్-న్యూట్రల్ నివాస స్థ లాల పట్ల పాల్గొ న్న వారి అభిప్రా యాలు
తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగడం జరిగింది. పాల్గొ న్నవారిలో 29 మంది ఈ ప్రశ్నకు "అవును" అని
జవాబిచ్చారు. సభ్యులు ఇచ్చిన కొన్ని కారణాలలో జెండర్-న్యూట్రల్ నివాస స్థ లంలో కలిసి ఉండటం వల్ల
ఒకరి అనుభవాలను మరొకరు అర్థ ం చేసుకోవడానికి సహాయపడుతుంది అని, అంటే ఒకరి జీవితాన్ని
ఒకరు అర్థ ం చేసుకోవచ్చు అని, అలాగే దాని వల్ల ఒకరి పట్ల ఒకరు సహానుభూతి ఏర్పరచుకోవచ్చు అని
చెప్పారు. ఇంకా, పాల్గొ న్నవారిలో జెండర్-న్యూట్రల్ నివాస స్థ లంలో నివసించడం వల్ల సిస్-హెటిరో
పితృస్వామ్య వ్యవస్థ ల నిరంతర ప్రభావం వల్ల నేర్చుకున్న హానికరమైన దృక్పధాలను ఆలోచనలు
మార్చుకోవడానికి సహాయపడుతుంది అని చెప్పారు. మరి కొంత మంది కొత్త స్నేహాలని
ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తు ందని కూడా సూచించారు. నాల్గ వ ప్రశ్నకి "అవును" అని జవాబు
ఇచ్చిన కొంతమంది తాము స్థ లాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటిక,ీ దుస్తు లు మార్చుకోవడానికి
మరియు ఇతర కార్యకలాపాలకు ప్రైవేట్ స్థ లాలు ఉంటే బాగుంటుంది అని చెప్పారు. సభ్యుల నుండి మరొక

6
ప్రతిస్పందన ఏమిటంటే, సమూహంగా, వారు ఎదుర్కునే అణిచివేత ఒకే విధంగా ఉంటుంది కాబట్టి, ఒకే
విధమైన సమస్యలను ఎదుర్కుంటారు కాబట్టి వారు కలిసి జీవించచ్చు అని చెప్పారు.

పాల్గొ న్నవారిలో ప్రశ్నలకు "లేదు" అని ప్రతిస్పందించిన వారు అన్ని జెండర్ల వ్యక్తు లు కలిసి
జీవించలేరని వారు విశ్వసిస్తు న్నట్లు చెప్పారు. ప్రతి జెండర్ సమూహానికి వారి స్వంత సమస్యలు
ఉంటాయి మరియు వారు ఒకరితో ఒకరు జీవించ లేదు కాబట్టి అన్ని జెండర్ల వ్యక్తు లు ఒకే నివాస స్థ లం
లో ఉంటే గొడవలకు దారి తీస్తు ంది అని చెప్పారు.

సంప్రదింపుల ద్వారా వ్యక్త పరిచిన విషయాలు: రెండు ప్రశ్నల పై చర్చ ద్వారా ముందుకు వచ్చిన
విషయాలు:

1. విభిన్న జెండర్ అస్తిత్వాలు మరియు లైంగికత్వాలు ఉన్న వ్యక్తు లు కలిసి ఒక నివాస స్థ లం లో
ఉండగలరా?
అవునని పాల్గొ న్న సభ్యులలో దాదాపు అందరు వ్యక్త పరిచిన అభిప్రా యం. సభ్యులలో కొంత మంది మాత్రం
జండర్-న్యూట్రల్ షెల్టర్‌ల అంశానికి సంబంధించి సంశయాన్ని వ్యక్త ం చేశారు, దాని పట్ల ఒక ప్రయత్నం
చెయ్యాలి అని అనిపించినా, ముందుకు ఎలా వెళ్లా లో స్పష్ట త లేకపో వడం, దాని పర్యవసానాలు ఎలా
ఉంటాయో తెలియక పో వడం వల్ల కష్ట మవుతుందని అన్నారు. విభిన్న జెండర్ అస్తిత్వం మరియు
లైంగికత్వం గల వ్యక్తు లు ఒక నివాస స్థ లాన్ని పంచుకోవాలనే ఆలోచనకు వ్యతిరేకంగా కొంత మంది
అభిప్రా యాలు ఉన్నాయి. వాళ్ళు జండర్-న్యూట్రల్ నివాస స్థ లంలో లైంగిక వేధింపుల విషయం గురించి
భయాన్ని వ్యక్త పరిచారు. అలాగే, జండర్-న్యూట్రల్ నివాస స్థ లంలో ఒక జండర్ అస్తిత్వం వున్న వ్యక్తు ల
ఆధిపత్యం వుండే అవకాశం ఉంటుంది అనే భయాన్ని వ్యక్థ పరిచారు.

విభిన్న జెండర్ అస్తిత్వాలు వున్న వ్యక్తు లు స్థ లాన్ని పంచుకున్నప్పుడు, జండర్-ఆధారిత వివక్ష గురించి
కమ్యూనిటీ సభ్యులు భయం వ్యక్త పరిచారు. ఆధిపత్య కులల వారు మరియు ఆధిపత్య మతాల వారు చేసే
కుల మరియు మత ఆధారిత వివక్ష పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. కమ్యూనిటీ సభ్యులు
నివాసం కోసం వచ్చే వారి మధ్య జరిగే సంఘర్షణలు ఎదుర్కునే సమస్యలలో ఒకటిగా పేర్కొన్నారు.
వ్యక్తు లు తమ జండర్ ని ఎలా వ్యక్త పరుస్తు న్నారు అనే దానిపై కూడా బేధాభిప్రా యాలు, తగాదాలు
రావొచ్చని పేర్కొన్నారు.

2. గొడవలను పరిష్కరించే విధానం


జండర్-న్యూట్రల్ షెల్టర్ స్థ లాల నిర్వహణ పై అందరికీ సాధారణంగా వున్న భయాలు, సంశయాల
కారణంగా, కమ్యూనిటీ సభ్యులు గొడవలు, తగాదాలు అయ్యినప్పుడు వాటిని పరిష్కరించే పద్ధ తులకు
సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తా రు. విభిన్న జండర్ అస్తిత్వాలు మరియు లైంగికత్వాలు వున్న వ్యక్తు లు
కలిసి నివాస స్థ లాన్ని పంచుకున్నప్పుడు ఖచ్చితంగా గొడవలు వస్తా యని చెప్పారు. అటువంటి

7
సందర్భంలో, ఒక సంస్థ గా, క్యూ టి సెంటర్ సంఘర్షణలను పరిష్కరించే ఎలాంటి ప్రణాళికలు సిద్ధం
చేస్తు ంది అని అడిగారు.

3. సెంటర్ లో పని చేసే వారి నైపుణ్యత


చర్చ లో లేవనెత్తి న మరొక ముఖ్య విషయం ఏమిటంటే, క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు ల సంబంధించిన
సమస్యలను, ముఖ్యంగా షెల్టర్ హో మ్‌లలో వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి సెంటర్ లో పని చేసే
వ్యక్తు లకు ఎలాంటి నైపుణ్యం ఉండాలి అనేద.ి ప్రధాన ప్రశ్న ఏమిటంటే- సంఘర్షణలను, సమస్యలు
ఎదుర్కోవడానికి సెంటర్ సిబ్బంది కి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి?

4. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచన:


కన్సల్టే షన్ లో పాల్గొ న్నవారు తమ చర్చల ద్వారా షెల్టర్ కోరేవారు తరచుగా మానసిక ఆరోగ్య సమస్యలతో
బాధపడుతూ ఉంటారని, మానసిక ఆరోగ్యానికి సంబందించిన చికిత్స మరియు సపో ర్ట్ అవసరమని
సూచించారు. అటువంటి సందర్భంలో, ఒక సంస్థ గా, క్యూ టి సెంటర్ మానసిక ఆరోగ్య సమస్యలతో ఎలా
డీల్ చేస్తు ంది, అలాగే, నివాసం కోసం వచ్చే క్వియర్ - ట్రా న్స్ వ్యక్తు లు ఆత్మహత్య ప్రయత్నం, తమని
తాము హాని చేసుకునే అవకాశం ఉంటుంది, ఆత్మహత్య నివారణ విధానాలు ఏంటి, సెంటర్ లో పని చేసే
వాళ్ళు ఆత్మహత్యల నివారణ పద్ధ తుల్లో శిక్షణ పొ ంది ఉంటారు అనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

5. శారీరక ఆరోగ్యానికి సంబందించిన ఆలోచనలు


మానసిక ఆరోగ్యం లాగే, నివాసం కోరే వచ్చే వారికి అవసరమయ్యే శారీరక ఆరోగ్యం మరియు వైద్య
సంరక్షణ వంటి అంశాల పట్ల కూడా చాలా మంది ఆలోచనలు వ్యక్త పరిచారు. మాట్లా డిన శారీరక ఆరోగ్య
సమస్యలలో ఒకటి, గర్భిణీ క్వియర్ స్త్రీ లేదా ట్రా న్స్‌మ్యాన్ ఉంటే, వారిని ఎలా చూసుకుంటాం? HIVతో
జీవిస్తు న్న వ్యక్తు లకు మరియు వృద్ధ క్వియర్ వ్యక్తు లకు సపో ర్ట్ ఇచ్చే సామర్థ ్యం గురించి కూడా
పాల్గొ న్నవారు ఆలోచనలు వ్యక్త ం చేశారు. వారు గుర్తించుకునే జెండర్ కి అనుగుణంగా శరీరంలో
మార్పులు చేసుకోవడానికి చేసుకునే సర్జ రీల నుండి కోలుకోవడానికి నివాసం పొ ందుతున్న వ్యక్తు లకు
కావలసిన సపో ర్ట్ గురించి కూడా ప్రశ్నలు అడిగారు.

6. కమ్యూనిటీ వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులను పరిష్కరించే దిశగా చేసే పనులు


(క్రైసిస్ ఇంటర్వెన్ష న్)
చర్చలో, క్వియర్ వ్యక్తు లు ఇబ్బందులు, గొడవల లో ఇరుక్కున్నప్పుడు ఎదురయ్యే సమస్యలని
పరిష్కరించే దిశగా చేసే పనులకు సంబంధించి, ముఖ్యంగా పో లీసులు మరియు రక్త సంబంధీకులయిన
కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురయినప్పుడు వారు పుట్టిన కుటుంబాల నుండి నివాసం
కోరుకునే వారి పై హింస, అలాగే వారితో చోటు పంచుకునే వాళ్ళ భద్రత కు కూడా ప్రమాదం కలిగే
అవకాశం ఉంటుంది అన్న ఆలోచన ఈ కన్సల్టే షన్ లో పాల్గొ న్నవారు వ్యక్త ం చేశారు. ఇంకా,

8
రక్త సంబంధమైన కుటుంబం దాఖలు చేసిన ఫిర్యాదుల కారణంగా పో లీసు హింస లేదా షెల్టర్ హో మ్ లో
పో లీసులు జోక్యం చేసుకునే అవకాశం కూడా ప్రస్తా వనకి వచ్చింది.

7. అవగాహన మరియు క్యూ టి సెంటర్ పని గురించి ప్రచారం


కన్సల్టే షన్ లో పాల్గొ న్నవారు కమ్యూనిటీ సభ్యులకు క్యూ టి సెంటర్ పనుల గురించి అవగాహన
కల్పించాలని సూచించారు. ఇప్పటికే హెల్ప్ల
‌ ైన్ నంబర్‌లు ఉన్నప్పటిక,ీ ఒక సంస్థ గా, కమ్యూనిటీ
సభ్యులందరికి సెంటర్ పని గురించి, సదుపాయాల గురించి, హెల్ప్ల
‌ ైన్ సర్వీస్ గురించి తెలిసే లా
చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగారు.

8. సెంటర్ ఎవరిది మరియు సామాజిక న్యాయం ఆధారంగా సమానత్వం గురించిన ఆసక్తి


పరిమిత వనరుల అవసరం ఉన్న వారు అందరు న్యాయంగా పంచుకోవాలి అనేది క్యూ టి సెంటర్ ప్రధాన
విలువలలో ఒకటి. జండర్-న్యూట్రల్ నివాస స్థ లాన్ని ఏర్పాటు చెయ్యడం అనేది వనరులను పంచుకోవడం
వైపు వేసే ఒక అడుగు. ఈ ప్రధాన విలువకు ప్రతిస్పందనగా, కన్సల్టే షన్ లో పాల్గొ న్నవారు కమ్యూనిటీ
సభ్యులలో క్యూ టి సెంటర్ తమది అనే భావాన్ని పెంపొ ందించాలని అన్నారు. తద్వారా నివాసం కోసం
వచ్చే వారు మరియు డ్రా ప్-ఇన్ స్పేస్ వాడుకోవడానికి వచ్చే కమ్యూనిటీ సభ్యులకి ‘ఈ చోటు మాది,
మేము ఈ చోటుకి చెందుతాము’ అనే భావన కలుగుతుంది అని చెప్పారు. కమ్యూనిటీ లోని ఏ ఒక గ్రూ ప్
ఆధిపత్యం లేకుండా అందరూ వనరులను సామాజిక న్యాయాన్ని ఆధారం చేసుకొని వనరులను సమంగా
పంచుకోవాలని చెప్పారు.

9. భద్రత కు సంబంధించిన ఆలోచనలు


షెల్టర్ స్థ లంలో భద్రతా ప్రమాణాలు మరియు బయటి వ్యక్తు ల కారణంగా తలెత్తే భద్రతా సమస్యల గురించి
పాల్గొ న్న వారందరూ ఏకగ్రీవంగా తమ ఆలోచనలను వ్యక్త ం చేశారు. నివాసం కోసం వచ్చే వారి మధ్య
మరియు నివాసం కోరి వచ్చే వారు మరియు సెంటర్ సిబ్బంది సభ్యుల మధ్య జరిగే పరస్పర పని తో
లోపలి నుంచి భద్రతా సమస్య లేవనెత్తచ్చు అని చెప్పారు. బయటి నుండి వచ్చే భద్రతా సమస్యలు చట్ట
అమలు చేసే అధికారులు మరియు రక్త సంబంధమైన కుటుంబాలకు సంబంధించినవి అయి వుంటాయని
చెప్పారు.

10. షెల్టర్ కోరుకునే వారు మరియు వారి అవసరాలకు ప్రా ధాన్యత ఇవ్వడం
క్యూ-టి సెంటర్‌లోని సిబ్బంది నివాసం కల్పించడం గురించి నిర్ణ యాలు తీసుకునేటప్పుడు దేని ఆధారంగా
ఎవరికి ప్రా ధాన్యత ఎలా ఇస్తా రు అనే ప్రక్రియ గురించి కూడా పాల్గొ న్నవారు వారి ఆలోచనలు వ్యక్త ం
చేశారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే- నివాసం కోరే వారు ఏదైనా తక్షణ ప్రమాదంలో లేని వ్యక్తి అయితే
లేదా ప్రమాదంలో ఉండి నివాసం అవసరమైన వ్యక్తి అయి ఉంటే, ప్రా ధాన్యత ప్రక్రియ ఎలా ఉంటుంది?
అలాగే తాత్కాలిక నివాసం ఎంత గడువు వరకు ఇస్తా రు అని కూడా అడిగారు.

9
11. షెల్టర్ కోరి వచ్చే వారి అందరి పట్ల నియమాలు ఒకేలా ఉండాలి
నివాసం కోరి వచ్చే వారి అందరి పట్ల నియమాలు ఒకే లా వర్తించాలి అని వ్యక్త ం చేశారు. ఒక జెండర్
గుర్తింపు వ్యక్తు ల పట్ల కానీ లేదా ఆధిపత్య మత లేదా కులల నుండి వచ్చిన సభ్యులకు ప్రా ధాన్యతనిస్తూ
పక్షపాత ధో రణి చూపకూడదు అని చెప్పారు.

12. హక్కుల వివరణ


ఏ పరిస్థితిలో అయినా నివాసం కోరే వ్యక్తికి ఉన్న చట్ట పరమైన హక్కుల గురించి అవగాహన అవసరమని,
దానిని వారికీ కలిపించాలి అని కూడా కన్సల్టే షన్ లో పాల్గొ న్నవారు వ్యక్త పరిచారు. క్వియర్ -ట్రా న్స్
వ్యక్తు లకు హక్కుల గురించి తెలియకపో వడం వల్ల హక్కుల గురించి వివరిస్తే అది వారికి ఎంతో చేయూత
నిస్తు ంది అని చెప్పారు.

13. హిజ్రా వారి గురు-చేలా వ్యవస్థ తో కలిసి పని చేయడం


గురు-చేలా వ్యవస్థ తో నిరంతరం కలిసి పని చేయడం అవసరమని కూడా పాల్గొ న్నవారు వ్యక్త పరిచారు,
ఎందుకంటే నివాసం కోరే వారిలో ఇప్పటికే గురు-చేలా వ్యవస్థ లో ఉన్న వారు అయి ఉండొ చ్చు లేదా
ఇంతకు ముందు ఉండి వచ్చిన వారయినా ఉండొ చ్చు లేదా నివాసం లేదా ఇతర సపో ర్ట్ అవసరమై వచ్చె
గురువులు కూడా ఉండవచ్చు అని చెప్పారు.

14. ఇతర విషయాలు:


కన్సల్టే షన్ లో పాల్గొ న్న వారు లేవనెత్తి న మరి కొన్ని విషయాలు:
● పాల్గొ న్నవారు షెల్టర్ నివాసితుల మధ్య ప్రేమ సంబంధాలు ఏర్పడిత,ే ఆ పరిస్థితి తో వ్యవహరించే
విధానం గురించి అడిగారు.
● వారు గుర్తించుకునే జెండర్ కి అనుగుణంగా శరీరంలో మార్పులు చేసుకోవడానికి చేసుకునే
సర్జ రీలు అయిన వారి మధ్య సర్జ రీలు కాని వారి మధ్య జరిగే వివక్ష ఎలా
నివారించబడుతుంది/పరిష్కరించబడుతుంది?
● భాగస్వాముల ఉండడం లేకపో వడం వల్ల తలైతే అభద్రతా భావనలను ఎలా నివారించగలము?
అసలు భాగస్వాములు తో కలిసి ఒకే దగ్గ ర ఉంటారా? డిసెబిలిటీ ఉన్న వ్యక్తు లకు సెంటర్ ఇబ్బంది
లేకుండా అందుబాటులో ఉండేలా చేస్తా రా?
● కమ్యూనిటీ సభ్యులకు శిక్షణ ఇచ్చే నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉంటుంది?
● కుటుంబాలు మరియు పరిచయస్తు ల సెంటర్ ని సందర్శించ టానికి ఎలాంటి నియమాల
రూపకల్పన ఉంటుంది?
● నో డ్రగ్స్, నో సెక్స్, నో స్మోకింగ్ పాలసీ ఉంటుందా?
● సపో ర్ట్ గ్రూ ప్‌ల లో పాల్గొ నే వ్యక్తు ల గోప్యతను కాపాడుకోవడం, షెల్టర్ నివాసితులు మరియు ఇతర
సేవలు కోరేవారి గోప్యత రక్షణ ఎలా ఉంటుంది?

10
ప్రధాన ప్రశ్నలు:
1. జండర్ న్యూట్రల్ షెల్టర్ కోసం జండర్ న్యూట్రల్ లైంగిక వేధింపుల నివారణ విధానం ఎలా
ఉంటుంది?
2. క్వియర్ ట్రా న్స్ వ్యక్తు ల సమస్యలు తీర్చడానికి పో లీసు వారితో కలిసి ఎలా పని చేస్తా రు?
3. షెల్టర్‌లో నివాసితుల మధ్య, నివాసితులు మరియు సిబ్బంది మధ్య బేధాభిప్రా యాలు గొడవల
పరిష్కారానికి సంబంధించిన పద్ధ తులు ఏమిటి?
4. నివాసితుల శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎలా సపో ర్ట్ ఇవ్వబడుతుంది?
5. సెంటర్ యొక్క బాధ్యతలు నిర్వహించడానికి మరియు పని కోసం ఇక్కడ పని చేసే సిబ్బందికి
ఎలాంటి నైపుణ్య శిక్షణ సపో ర్ట్ ఉంటుంది?

ఈ సంప్రదింపులలో పాల్గొ ని వారి విలువైన అనుభవాలను, అభిప్రా యాలను పంచుకున్న కమ్యూనిటీ


సబ్యులకు QT సెంటర్‌తరపున మేము కృతజ్ఞు లం. QT సెంటర్ లో భాగమయిన తాత్కాలిక నివాస
సౌకర్యం గురించి ముందుకు సాగడానికి మరియు దాని గురించి ఆలోచించడంలో , రూపొ ందించడం
చేయడంలో మీ భాగస్వామ్య చాలా ముఖ్యమైనది, అవసరమైనది.

ఒక జాతీయ స్థా యి వర్క్‌షాప్ ద్వారా షెల్టర్ హో మ్‌లను నడపడం, షెల్టర్ హో మ్‌లను అధ్యయనం
చేయడంలో అనుభవం ఉన్న క్వియర్ కమ్యూనిటీ మరియు క్వియర్ కమ్యూనిటీ కాని నిపుణుల దగ్గ రికి
మీరు వేసిన అన్ని ప్రశ్నలను పంచుకున్న అభిప్రా యాలను తీసుకెళ్తా ము మరియు ఈ వర్క్‌షాప్
ఫలితంగా జెండర్ న్యూట్రల్ హౌసింగ్ కోసం డ్రా ఫ్ట్ ప్రో టోకాల్ పాలసీని రూపొ ందించాలని మేము
ఆశిస్తు న్నాము.ఇది సిద్ధమైన తర్వాత మేము దాన్ని మీతో పంచుకుంటాము.

11

You might also like