You are on page 1of 1

పద్య కవితా సౌరభం

—--------------------------
చీమలు పెట్టిన పుట్ట లు :

పాములకిరవైనట్లు పామరుఁడు తగన్ :

హేమంబు కూడా బెట్టిన :

భూమీశుల పాలు జేరు భువిలో సుమతీ :

సుమతీ శతక కారుడు బద్దెన,సుమతీ అంటే ఓ మంచి బుద్ది కలిగినవాడా డబ్భు,బంగారం అతిగా దాచేస్తే

ఏమౌతుందో తెలుసా,రాజుల పాలు అవుతుంది ఈ భువిలో ,అని తెలియజేస్తు న్నారు.

చీమలు పెట్టిన పుట్ట లు అంటే చీమ చాలా చిన్నది .కానీ కష్ట పడే గుణం,ముందు చూపుతో అన్ని

సమకూర్చుకునే గుణము చీమలో ఉంటుంది,కూడని గుణమేమిటంటే ,చీమలు పెట్టిన పుట్ట లు,పాములకిరవైనట్లు

,అంటే చీమలుచాలా చిన్నగా ఉంటాయి ,సమూహాలుగా నివసిస్తు ంటాయి.కానీ అవి నివసించడానికి చిన్న పుట్ట

చాలు,కానీ పుట్ట ని నిర్మించుకుంటూ పెద్ద పుట్ట గా నిర్మించేస్తా యి,అవి కట్టిన పుట్ట లను పాములు స్థా నాన్ని

ఆక్రమించుకుంటాయి.ఇలాగే మనిషి కూడా సంపాదన మొదలు పెట్టినప్పటినుంచి,దాన్ని దాచి,పాతరోజుల్లో ఐతే

బిందెల్లో దాచి ,భూమిలో పాతిపెట్టేవారు,ఎవ్వరికి చెప్పేవారు కాదు,అది ఎప్పుడో ఎవ్వరికో దొ రక


ి ేది,భూమీసులపాలు

జేరు భువిలో సుమతీ ,అంటే దొ రికన


ి సొ మ్ము రాజులకి అప్పజెప్పేవారు.

డబ్భుని గురించి 3 సుభాషితాలు పెద్దలు చెపుతుంటారు.1.దానము 2.భోగము 3.నాశనము .

దానము: తనకున్నదాంట్లో కొంత పుణ్యకార్యాలకి,లేక పేదవారికి దానము చేయాలి.సత్కార్యాలకి

వినియోగించాలి,చీమల్లా గ దాచుకుంటూ పో కూడదు.

భోగము: కొంత డబ్భు తన సౌఖ్యం కోసం హాయిగా బతకడానికి ఖర్చు పెట్టు కోవాలి.ఏమిలేనివాడిలా అంతా దాచి పెట్టి

బతుకకూడదు.”కంపు నోటవ
ి ాడు దాస్తే,మంచి నోటి వాడు అనుభవిస్తా డని” సామెత. తాను సౌఖ్యంగా అనుభవించాలి.

నాశనము: డబ్భుఉంది కదా అని అవసరానికి మించి ఖర్చు చేయకూడదు,అనవసర ఖర్చు వ్యసనాలకు దారి

తీస్తు ంది.

చీమల్లా గా దాస్తూ పో వడమేకాదు కొంత దానం చేయాలి. సత్కార్యాలకు వినియోగించాలి,తాను సౌఖ్యంగా బతకాలి

,అవసరానికి మించి ఖర్చు చేసి నాశనము ఔతే వ్యధే మిగులుతుంది,సన్మార్గ వర్త నులై సంపాదనను సక్రమ మార్గ ంలో

పెట్టు కొని తరించాలని ఈ పద్యం ద్వారా బద్దెన మహాకవి తెలియజేస్తు న్నారు.

—-----------------------------

You might also like