You are on page 1of 3

మనిషే, మానవ సంబంధాలే ఏకైక ప్రమాణం

నిన్న ఉదయం పదకొండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర దాకా నేను హైదరాబాదు ఎన్ఐఎ ఆఫీసులో ఉన్నాను.

‘బడు’ ప్రయోగం నాకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు గనుక ఆ మాట అన్నాను గాని వాస్త వంగా “ఉంచబడ్డా ను” అనాలి!!

ఆ ఆరు గంటల్లో అరగంటో, ముప్పై నిమిషాలో భోజన విరామం మినహాయిస్తే మిగిలిన ఐదు గంటల చిల్ల ర

“ప్రశ్నించబడ్డా ను”!

గురువారం సో దా జరిగిన సందర్భంలో వాళ్ల ఆఫీసుకు రావలసి ఉంటుందని నోటీసు ఏమీ ఇవ్వలేదు గాని శనివారం

నేను ఖమ్మం ప్రజాస్వామ్య రచయిత్రు ల వేదిక సభలో మాట్లా డడానికి వెళ్తుండగా మార్గమధ్యంలో వాళ్ల నుంచి ఫో న్

వచ్చింది. ఆఫీసుకు రాగలరా అని అడిగారు. శని, ఆది, సో మ వరుసగా మూడు ఊళ్లలో మూడు సభల్లో మాట్లా డవలసి

ఉందని, హైదరాబాదుకే మంగళవారం తిరిగి వస్తా నని అన్నాను. “అయితే మంగళవారం రండి” అన్నారు. అలా ఎన్ఐఎ

ఆఫీసుకు వెళ్లవలసి వచ్చింది.

ఆ ఐదు గంటల పైన జరిగిన ప్రశ్నలూ జవాబులూ, ఆ జవాబులను నమోదు చేసుకోవడం, తమ ఎదురుగా ఉన్న లాప్

టాప్ లో ఉన్న సమాచారంతో పో ల్చి చూసుకోవడం, దాని నుంచి ప్రశ్నలు అడగడం వగైరా పనులను ఇద్దరు

అధికారులు నిర్వహించారు. నేను పుట్టిన దగ్గరి నుంచి, ఇంకాస్త వెనక్కి వెళ్లి మా అమ్మా బాపుల దగ్గరి నుంచి, వాళ్ల

కుటుంబాల నుంచి మొదలు పెట్టి ప్రస్తు తం నన్ను ఇరికించిన కేసు దాకా వందల ప్రశ్నలు. ఏయే సంవత్సరాల్లో

ఎక్కడెక్కడ ఏమి చదువుకున్నాను, ఏమి ఉద్యోగాలు చేశాను, నా ఆరోగ్య సమస్య ఏమిటి, అన్నదమ్ములు,

అక్కచెల్లె ళ్లు ఎవరు, ఏమి చేస్తా రు, వాళ్ల పిల్ల లు ఏమి చేస్తా రు, నావీ వనజవీ ఆదాయ వ్యయాలు ఏమిటి, ఆస్తు లు

ఏమిటి, వీక్షణం ఎట్లా నడుస్తుంది, నన్ను నిందితుడిగా చూపిన కేసులో ఇతర నిందితులతో నా పరిచయం ఏమిటి

వగైరా వగైరా నా జీవిత చరిత్ర మొత్తం జాగ్రత్త గా నమోదై బహుశా ఇప్పుడు ఎన్ఐఎ కవిలెకట్టలో చేరింది.

ఒక అధికారి ఇలా ఒకటొకటిగా ప్రశ్నలు అడుగుతూ, జవాబులు వింటూ రాసుకుంటూ పో గా, చివరి అరగంటలో వచ్చిన

మరొక అధికారి “వేణు భయ్”, “వేణన్నా” అంటూ కొంత హాస్యం, కొంత సరదా, కొంత కోపం మేళవించిన గొంతుతో కాస్త

చర్చ చేశారు. “మమ్మల్ని దుర్మార్గ సంస్థ అన్నవన్నా. మేం ఏం దుర్మార్గం చేశామన్నా? మా మీద అంత కసి, కోపం

ఎందుకన్నా” అని జవాబు ఆశించినట్టు కాకుండా నాకు వినిపించాలన్నట్టు గా మాట్లా డారు. గురువారం దాడి జరగగానే

నేను మాట్లా డిన పత్రికాసమావేశం వీడియో క్లిప్పింగ్ నాకు మరొకసారి వినిపించి, “మమ్మల్ని దుర్మార్గ సంస్థ

అన్నవన్నా. మాది చాలా ప్రొ ఫెషనల్ సంస్థ అన్నా” అన్నారు. “మిగిలిన చరిత్ర అంతా నాకు అవసరం లేదు, మా

ఇంట్లో నే మీరు చేసిన దుర్మార్గా లు రెండు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు కేసునే రద్దు చేయబో తుండగా
భీమా కోరేగాం అనే అబద్ధపు కేసు మీరు తీసుకుని నడుపుతున్నారు. తెలంగాణ పో లీసులు పెట్టిన అబద్ధపు,

అడ్డ దిడ్డ పు కేసును తీసుకుని ఇప్పుడు నా ఇంటి మీద దాడిచేశారు, ఇప్పుడు నన్ను ఇక్కడ కూచోబెట్టా రు. ఇవి

రెండూ చాలు నేనా మాట అనడానికి” అన్నాను.

నా రాజకీయ విశ్వాసాలతో పాటు, నాకు లేని, అంటగడుతున్న పరిచయాలతో పాటు, కాస్త రాజ్యాంగమూ, చట్టమూ,

భారత సామాజిక స్థి తీ, ఫో న్లు ఎత్తు కుపో వడంలో సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తు న్న వ్యవహారం,

“మావోయిస్టు లు చేస్తు న్న హింసాకాండ” వంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. “మీలాంటి వాళ్లు గ్రా మాలకు వెళ్లి

పాఠశాలలు పెట్టి చదువు లేనివాళ్లకు చదువు చెప్పాలన్నా. దాని బదులు ప్రజలను రెచ్చగొట్టి వాళ్ల చేతికి తుపాకి

ఇస్తు న్నారు” అన్నారు. నవ్వేశాను.

ఇంతకూ నా జీవిత చరిత్ర రాయడానికి వాళ్లు రూపొందించుకున్న చట్రంలో నా రచనల గురించీ, ఉపన్యాసాల గురించీ

దాదాపుగా లేదు. వీక్షణం గురించి అతి కొద్ది మాత్రమే ఉంది. నా జీవితం, నా వ్యక్తిత్వం, నా కార్యాచరణ సమస్తం రచన,

ఉపన్యాసం మాత్రమే అని నేననుకుంటాను. అసలు నా రచనల మీద, ఉపన్యాసాల మీద కోపంతోనే ఈ అబద్ధపు కేసు

తయారయింది. కాని, విచారణలో మాత్రం అవి నా జీవితంలో లేనే లేవన్నట్టు వ్యవహరించడం, నేను చేసినవి

వదిలిపెట్టి, చేయనివేవో చేశానని చూపడానికి ప్రయత్నించడం ఒక వ్యూహం.

మొదట ప్రశ్నల పరంపరలో ఒక భాగం, నా ఫో న్ కాల్ డేటా రికార్డ్ పట్టు కుని ‘ఫలానా వాళ్లకు ఇన్ని కాల్స్ చేశారు,

ఎందుకు?’ ‘మీ ఫో న్ నుంచి ఫలానా రాష్ట్రా నికి, ఫలానా నగరానికి ఇన్ని కాల్స్ ఉన్నాయి, ఎవరికి చేశారు, ఎందుకు

చేశారు’ వంటి ప్రశ్నలతో దాదాపు పది పదిహేను మంది పేర్లతో కాసేపు నడిచింది. ఒకరితో ఒకరు మాట్లా డుకోవడం ఈ

దేశంలో ఎప్పటి నుంచి నేరమయిందో తెలియదు. మనుషుల మధ్య సంబంధాలను అనుమానించే, నియంత్రించే ఈ

పద్ధతి దుర్మార్గం కాక మరేమిటి? ఒక పత్రికా సంపాదకుడిగా నేను వందలాది మంది రచయితలతో మాట్లా డి ఉంటాను.

ఒక పాఠకుడిగా వందలాది మంది రచయితలతో వారి రచనల గురించి మాట్లా డి ఉంటాను. ఒక రచయితగా,

ఉపన్యాసకుడిగా నా రచనల గురించో, ఉపన్యాసాల గురించో మాట్లా డడానికి నాతో వందలాది మంది మాట్లా డి ఉంటారు.

నన్ను సభల్లో వక్తగా పిలవడానికి ఎన్నో సభల నిర్వాహకులు నాతో మాట్లా డి ఉంటారు. అవన్నీ అలా ఉంచి,

స్నేహితులు నాకు ఫో న్ చేస్తా రు, నేను స్నేహితులకు ఫో న్ చేస్తా ను. అది నేరమా? పో నీ ఎక్కువసార్లు మాట్లా డుకుంటే

నేరమా? మనుషులు ఎందుకు మాట్లా డుకుంటారు అని అడిగితే ఎట్లా ? ‘ఏల సలిలంబు పారు, గాడ్పేల విసరు, ఏల నా

హృదయంబు ప్రేమించు నిన్ను’ అన్నాడు కృష్ణశాస్త్రి.


ఇవన్నీ బహిరంగ జీవితంలో, అత్యంత సహజమైన మానవ సంబంధాల వ్యక్తీకరణలు. మాట, మానవ సంబంధం నేరం

కాదు. అది నేరమని ఏదైనా ఒక ప్రభుత్వం నిర్వచించినా మనిషిగా నేను నా మాటలూ, మానవ సంబంధాలూ ఆపను.

నా రచనలూ మాటలూ మానవ సంబంధాలూ అన్నీ తెరిచిన పుస్త కం. నాకు మార్క్సిజంలో విశ్వాసం ఉండడం, ప్రజా

జీవితంలో ప్రతి సంచలనానికీ నేను ప్రతిస్పందించడం, మంచి బతుకు కోసం ప్రజలు చేసే ప్రతి ప్రయత్నాన్నీ నాకు

చేతనైనంత వరకు సమర్థించడం తెరిచిన పుస్త కం. ‘మార్క్సిజంలో నా విశ్వాసం కూడా అది మానవ సంబంధాలను

ఉన్నతీకరించే శాస్త్రమూ శాస్త్రమూ గనుకనే’ అని 2000 లో నా కవితా సంపుటం ‘పా(వురం’ ముందుమాటలో

రాసుకున్నాను. ఇరవై ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ అదే మాట.

ప్రతి అనుభవం మీదా బహిరంగంగా రాసేవాణ్నే, కాని ఈ అనుభవం మీద రాయాలని ప్రత్యేకంగా అనుకోలేదు. అంతా

ముగిసి వచ్చేస్తు న్నప్పుడు అప్పటిదాకా సరదాగా మాట్లా డుతున్న అధికారి, మరొక అధికారితో ‘ఇప్పుడు వేణన్న

పో యి రాస్త డు జూడు. ‘దుర్మార్గమైన ఎన్ఐఎ తిండి కూడా పెట్టకుండా ఆరు గంటలు నన్ను కూచోబెట్టింది’ అని. కదన్నా’

అని నవ్వుతూ అన్నారు. వ్యవస్థ, వ్యవస్థను కాపాడుతున్న ఆ సంస్థ దుర్మార్గమైనవే కాని అందులో ఉద్యోగులుగా తమ

విధి నిర్వహిస్తు న్న ఆ అధికారుల మీద నాకు అటువంటి అభిప్రా యమేమీ లేదు. సరిగ్గా భోజన సమయానికి భోజనం

పెట్టించారు. ఇద్దరు అధికారులూ మర్యాదగా, గౌరవంగా మాట్లా డారు. ఒక అధికారి రెండు మూడు విసుర్లు

విసిరినప్పటికీ అవి అంత లెక్కలోకి తీసుకోదగినవి కావు. ఆయన అలా అన్నందుకైనా ఇది రాయాలనిపించింది.

You might also like