You are on page 1of 19

10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు - 2024

కార్యాచరణ ప్రణాళిక
జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ - ఖమ్మం
--------------------------------------------------------------------------------------------------------------
తెలుగు
10 వ తరగతి - 2024 పబ్లిక్ పరీక్షలకు సంబంధించి చదువ వలసిన ముఖ్యాంశాలు :
1. ప్రధానంగా ప్రశ్నా పత్రంలో మొదటి అంశం పరిచిత గద్యం. దీనికి 5 మార్కులుంటాయి.
రామాయణం 6 కాండల నుండి ఒక 10 పేరాలు - వాటి క్రింద ప్రశ్నలు ఇచ్చి అభ్యాస చేయించాలి.
2. ఇదే మాదిరిగా అపరిచిత పద్యం/ గద్యం 10 మార్కులకు ఇవ్వబడుతుంది. ప్రశ్నలిచ్చి జవాబులు రాయమని గాని,
ప్రశ్నలు తయారుచేయమని గాని, జత పరచమని గాని లేక ఖాళీలు పూరించడం గాని ఇవ్వవచ్చు. వేమన, సుమతీ
శతక పద్యాలలో ఒక ఐదు అభ్యాసం చేయిస్తే మంచిది.
3. పరిచిత పద్యం క్రింద రెండు పద్యాలు యిచ్చి ప్రతిపదార్ధం వ్రాయమని కాని, పూరించి భావం రాయమని కాని
యిస్తారు. ఒకటి రాయవలసి వుంటుంది. దాన శీలము, వీర తెలంగాణ పాఠాలలోని 6 పద్యాలు చదివిస్తే మంచిది.
4. కవి పరిచయాలు : పోతన, అలిశెట్టి, సినారె
రచయిత పరిచయాలు: యశోదా రెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, సామల సదాశివ చదివించాలి.
5. దానశీలం, వీర తెలంగాణ, భిక్ష తాత్పర్యాలు చదివించాలి.
6. నగర గీతం, జీవన భాష్యం సారాంశం చదివించాలి.

7. ప్రధానంగా క్రింది ప్రశ్నలు చదివిస్తే తేలికగా ఉత్తీర్ణత సాధించవచ్చు.


1. దానం - దాని ప్రాధాన్యత
2. గ్రామాలలో వచ్చిన మార్పులు
3. పట్టణ జీవితం - గ్రామ జీవితాల్లో నీకేది ఇష్టం. ఎందుకు?
4. నిమ్న వర్గాల అభివృధ్ధికి భాగ్యరెడ్డి వర్మ కృషి.
5. కోపం వల్ల కలిగే అనర్ధాలు
6. చార్మినార్ కథల నేపధ్యం
7. గోల్కొండ కోటలో నీకు నచ్చిన అంశాలు - సాహిత్య సేవ

8. రామాయణానికి సంబంధించి :
1. రామాయణం ఎందుకు చదవాలి?
2. రాముని గుణగణాలు
3. అన్నదమ్ముల అనుబంధం
4. మంధర, సీతాన్వేషణ, విరాధుడు, కబంధుల వృత్తాంతాలు.
5. హనుమంతుడు, సుగ్రీవుడు, మంధర, విభీషణుల పాత్ర స్వభావాలు

9. భాషాంశాలకు సంబంధించి:
1. పాఠ్య పుస్తకం వెనుకవున్న నానార్ధాలు, వ్యుత్పత్యర్ధాలు చదివించాలి.
2. కొన్ని జాతీయాలకు సొంత వాక్యాలు రాయించాలి.
3.పాఠ్యాంశం వెనుక ఇవ్వని, అర్ధాలు, పర్యాయ పదాలు, ప్రకృతి, వికృతులు చదివించాలి.
4. సవర్ణ, గుణ, వృధ్ధి, యణాదేశ, అత్త్వ, ఇత్త్వ, ఉత్త్వ సంధులు - రుగాగమ, సరళాదేశ సంధులు
5. అనుప్రాక అలంకారాలలో అంత్య, వృత్య, యమకం, అర్ధాలంకారాలలో రూపక, శ్లేష, అతిశయోక్తి మరియు
ఉపమాలంకారాలు అభ్యాసం చేయించాలి.
పై అంశాలను చదివితే విద్యార్ధులు 10 వ తరగతి తెలుగులో తేలికగా ఉత్తీర్ణులు కావచ్చు.
HINDI
दसवी ं की वार्षिक परीक्षा मे ं आसानी से २० अं क पाने के लिए कुछ सूचनाएँ:

* अर्थग्राह्यता प्रतिक्रिया के प्रश्नों के उत्तर एक वाक्य में लिखने का अभ्यास करवाएँ।


* अर्थ ग्राह्याता प्रतिक्रिया में अधिक अंक पाने के लिए "क कार "के प्रश्न (क्या, कब ,कौन
कहां...आदि) अधिक अभ्यास करवाना चाहिए।
* हर एक पाठ में सरल शब्दों का उपयोग करके कम पंक्तियों में सारांश अभ्यास करवाना चाहिए।
(सारांश ऐसे होना चाहिए प्रश्न चाहे जैसे भी पूछे वह सारांश उपयोग में होना है)
* रोज़ एक या दो स्वरचना प्रश्न और उतर कक्षा में स्वयं श्यामपट पर लिखकर वाचन करें, और
छात्रों से पढ़वाएँ। और लिखवाएं।
* कवि परिचय, लेखक परिचय को अच्छी तरह याद करवाएँ।
* बरसते बादल, मां मुझे आने दे, कण - कण का अधिकारी कविता पाठों का भाव अपने शब्दों में
लिखने का अभ्यास करवाएँ।
* पोस्टर, नारे, पत्रलेखन, साक्षात्कार प्रश्न, सूचना लेखन, डायरी लेखन ... आदि का
अभ्यास करवाएँ।
* पर्याय, लिंग, वचन, उपसर्ग, प्रत्यय, विलोम शब्द, शुद्ध वर्तनी, पुनरूक्त, ,शब्द भेद... आदि के
बारे में अच्छी तरह अलग - अलग उदाहरणों के साथ समझाएँ।
* रोज़ एक सफ़ेद कागज़ पर सुदं र लेखन के साथ लिखने का अभ्यास करवाएँ।
ENGLISH
Tracking the ‘D’ , ‘C’ and slow – learning group for SSC – March 2024 Public Examination
SECTION – A
A) Study Skills:
Q (9-12) 4×2=8
* The target group should be given enough practice on different question types based on the
input.
Eg: What is the diagram/ chart/ table about?
How many divisions are there ? What are they?
 Differences among the components / items/ streams/ sections
 Similarities
 Highest, lowest, smallest, biggest, most, productive, least productive, most important, least
important, average, first one, last one.
 Total, sum .......

Q. (15) Focus should be on the lay out / format 5M

Q. (16) Focus should on the features / farmat

 Major Discourse 10M


 Interview / Conversation practice
 Choreography scripts ( Poem)
 Bio – graphical sketch

Awareness should be provided – by drawing their attention on modalities / features and main
ideas.

* Q. (1-4) & Q (5-8) 4 × 3 = 12 & 4 × 3 = 12

 Regular practice should be given on different questions ...... encouraging the students to
write answers on their own .

 Selected ‘A’ – Reading passages atleast 6 to 8 should be taken and through practice should
be given to identify the relevant sections in the reading text based on the questions.

 Oral reading practice should be taken -up at individual/group level .

PART – B
Q. (27-31) Cloze Test: 5M
Text book independent passages

Q. (32-36) Elements of Vocabulary 5M

Regular class – work, home work should be assigned on the above two tasks and thumb –
rules, tips should be provided in the class: at least 25 to 30 tasks/ exercises should be
throughly discussed in the class room.
* Quick revision → 50 10 minutes
* Class room practice → 10 – 15 minutes
* Feed back / evaluation → 10 minutes
* Home assignments / guidence to answer the question and inviting some groups for oral
presentation in the class → 10 minutes.

గణిత శాస్త్రం
1. Real Numbers

1. Euclid division lemma : * Find HCF of given numbers.


* Showing the pattern of different numbers.

2. Fundamental theorem of Artithmetic:

➢ Find LCM & HCF of given number


➢ To check terminating decimal or Non – Terminating reporting decimal.
➢ Proving composite number.

3. Proofs: Irrational numbers:

➢ √2 or √3 or √5 or √7 ..............
➢ 3√2 or 3+ √2 or 3 - √2 or 3√ + 5
➢ √2 + √3
➢ 3√2 + 2 √3
➢ 2√5 ± 3√2

4. Logarithm Sums :

➢ Logarithmic form ⇌ Exponential form


➢ Find the value of .................
➢ Showing required pattern using ‘If’ condition.

2. Sets
1. Definitions of different sets:
• Set * Equal sets
• Empty set * Disjoint sets
• Finite set * Cardinal no. of set.
• Infinite set
• Subset

2. Set builder Form ⇌ Roster form ⇌ Venn diagram


( Rule form) (List form)
3. Operations on sets :

➢ Union
➢ Intersection
➢ difference

4. Drawings – Venn diagrams: * For Subsets


* For Joint sets
* For disjoint sets

5. Formulae & Proofs or Representations:

➢ n(AᴗB) = n(A) + n(B) – n((A∩B) . For any two non empty disjointsets.
➢ n(AᴗB) = n(A) + n(B) For disjointsets
➢ If A ᴄ B Then n(AᴗB) = n (B) & n ((A∩B) = n(A).
➢ (A-B) ᴗ (B-A) = (AᴗB) – ((A∩B) ..........

3. Polynomials
1) Definition of polynomials:
➢ Types of polynomials
➢ Degree of polynomials
➢ Value of polynomials
➢ Zero / Zeroes of polynomial

2) Formation of polynomials with given zero / zeroes of sum of zeroes


Product of zeroes
3) Relation between coefficients and and sum of zeroes, product of zeroes of Q.P.
C.P.
4) Division of algorithm on polynomials & Applications.
L.P.
5) Graph of polynomial Q.P............ This is important for Final Exam

C.P.

4. Pair of Linear Equations in Two Variables


General form of L. E in T.V. with condition.
Pair of L.E. in T.V. :- Relation between ratio of co – efficients and solutions.
Solving methods of PLE in TV .→1. Substitution method
2. Elimination method
3. Graphical metho
* 4. Formula method.
Situations leading to P.LE in T.V and their solution.
Pair of LE in TV, which are in not Standard form:-
→First make them into Standared Form by using suitable
substitution & solve by any one of the method.
Situation leading to Non – standard form of PLE in T.V. & Finding solution to them.
5. Quadriatic Equations
➢ General form of Quadriatic Equation with condition.
➢ Formation of Quadriatic Equation with given two roots (or) Sum of roots &
Product of roots.
➢ Verifying that the given values are roots or not.
➢ Solving methods of Quadriatic Equation : 1. Factorisation method
2. Completing square method
3. Graphical method
4. Formula method.
➢ Nature of roots using the value of Discriminent.
➢ Situations leading to form Quadriatic Equation & finding solution.

6. Progressions
➢ Definitions of Arithmetic Progression & Geometric Progression.
➢ General form of AP & GP.
➢ Testing rule for AP & GP
➢ nth term of AP & GP
➢ nth term of AP & GP from last.
➢ Sn of AP. & GP with a & d for AP
a & r for GP
➢ A.M. & G.M.
➢ Situations leading to form A.P & G.P and finding required items.

7. Co-ordinate Geometry
Type of ∆le
 Distance between two points = Type of Quadrilatoral
Equidistant points
 Slope of Collinearity

 Mid point of line segment


 Area of ∆le when 3 vertices were given & using Heron’s formula also.
 Centroid of ∆le = Point of concurrance of Median of ∆le
 Area of given Quadrilateral
 Section Formula * Points of Trisection
 Finding ratio when X- axis divises given
 Finding ratio when Y- axis divises given.

8. Similar Triangles
➔ Definition of Similar Triangles →Two conditions.
➔ Similarity Criterions
➔ Drawing similar ∆le to given measurements with scale factor (k˂1
k˃1)
➔ Drawing a line segment of given length and dividing in given ratio.
➔ Thales theorem: its applications * Converse of BPT and its applications.
(BPT Theorem)
➔ Convene of pythagoras Theorem & it’s applications
Converse of pythagoras Theorem & it’s applications
➔ Relation between ratio of areas of two similar triangles & ratio of corresponsing sides/
medians/ altitudes / perimeters
➔ And sides to perimeters also.
9. Tangents and Secants to a Circle
Definitions of Tangent, Secant, Segment, Sector, arc, chord.
Length of tangent to a circle from external point.
*** Construction of pair of tangents to a Circle When distance from centre of
circle to External point is given
When inclination between
two tangents is given.

No. of tangents to a Circle →different cases.


Finding shaded regions – relatd to circle & combination of different figures.
* Area of sector * Area of Minor segment
* Area of Annules * Area of Major segment * Area of semicircle
(Ring)
Situations leading to form → Sector, Segment
→Chord become tangent to another circle.

10. Mensuration

➢ Formulae → LSA, TSA and volume of cuboid, cube, cylinder (prisms)


cone, sphere, Hemisphere.
➢ Diagonal of cuboid & cube.
➢ Relation between l, r & h of cone
➢ Questions on combination & conversions of 3D objects and finding required component
with units.

11. Trigonometry

 Pythagoras Theorem → Pythagoras Triplets (3,4,5 ) * (8,15,17)


(5, 12, 13)
(7, 24, 25)
(9, 40, 41)

 Basic Trigonometry ratios → Sin θ Cosec θ


Defnitions of Cos θ Sec θ
Tan θ Cot θ

 Values:
Sinθ
θ → 0˚ 30˚ 45˚ 60˚ 90˚ * Tan θ =
cosθ
1 1
Sin θ → 0 √1 2 √3/2 1 * Cosec θ =
2 sinθ
1
Cos θ → 1 √3/2 √1 2 ½ 0 * Sec θ =
cosθ

1
* Cot θ =
tanθ
Trigonometric identities : 1st → Sin2 θ + Cos2 θ = 1
2nd →Sec2 θ - Tan2 θ = 1
3rd → Cosec 2θ - Cot2 θ = 1

Complementary Trigonometric ratios:

Sin θ = Cos(90 - θ) Tan θ = Cot(90 - θ) Cosec θ = Sec(90 - θ)


Cos θ = Sin (90 - θ) Cot θ = Tan (90 - θ) Sec θ = Cosec (90 - θ)

Differential Questions: →Find the value of .............


→ Show that ...............
→ Prove that ................
→ Justify your answer

12. Application of Trigonometry


➢ To find heights & distances
➢ Angle of Elevation:-
➢ Angle of depression:- One right angled Traingle
➢ Drawing appropriate figure
and solve for required thing. Two right angled Triangles

13. Probability

n(E)
➢ P(E) = * Total no. of outcomes n(s) is important
n( S)
➢ O ≤ P(E) ≤ 1 * n(s) for coins * different type of coloured balls....
dices
numberred cards * related to plane figures
deck of cards
➢ P(E) + P(Ē) = 1
➢ Understanding different events: → Sure Event
→ Impossible Event
14. Statistics
➔ Range of given data
➔ Measure of Central tendencies → 1. Mean
2. Median
3. Mode
➔ Formula to find Mean
Median for ungrouped data & grouped data.
Mode

➔ Able to explain each letter in the formula


➔ Finding Mean/ Median/ Mode for ungrouped & grouped data using appropriate formula.

Direct method
➔ Mean Deviation Method
for grouped /classified data
Step deviation Method

➔ ***Drawing O gives LCF →(UB, LCF)


GCF → (LB, GCF)
భౌతిక శాస్త్రం
ప్రణాళికతో చదివితే తక్కువ సమయంలోనే భౌతిక శాస్త్రంలో మంచి మార్కులు సాధించ వచ్చు.
➢ మారిన ప్రశ్న పత్రంలో పుస్తకం లోని 20 ప్రయోగాలకు గాను 9 మార్కులు కేటాయించ బడ్డాయి.
➢ 2 మార్కుల ప్రశ్నగా ప్రయోగ సామాగ్రి పరిశీలనలు, ఫలితం లలో ఒక దానిని అడుగుతారు.
➢ 6 మార్కుల ప్రశ్న లో ప్రయోగ విధానంతో పాటు పై వానిలో ఒకటి అడుగుతారు. ప్రయోగం పరిశీలనల
ఆధారంగా ఒకటి ఒక్క మార్కు బిట్ వస్తుంది.
➢ ప్రశ్నాపత్రంలో బొమ్మల పై ఒక 6 మార్కుల ప్రశ్న, ఒక బిట్ మొత్తం 7 మార్కులు కేటాయించబడినవి.
➢ బొమ్మలు ఎక్కువగా ప్రయోగ అమరిక చూపే పటాలు వస్తాయి. వీటికి అదనంగా s, p ఆర్బిటాల్ ఆకారాలు,
కిరణ చిత్రాలు, అణువుల అకృతి పటాలు, ఆర్బిటాల్ ఆకృతులు,అయస్కాంత వేర్పాటు, ప్లవన ప్రక్రియ పటాలు
నేర్చుకుంటే ఈ మార్కులు సులభంగా సాధించవచ్చు.
➢ ఇవి కాకుండా పట్టిక రూపంలో సమాచారం ఇచ్చే ప్రశ్నకు 4 మార్కులు కేటాయించ బడినవి.
ఈ ప్రశ్నలు కేవలం
i. పదార్ధం pH,
ii. కటకం లేదంటే దర్పణం ముందు వస్తువు దూరం బట్టి ప్రతిబింబ లక్షణాలు
iii. దృష్టి దోషాలు
iv. క్వాంటం సంఖ్యలు
v. అవర్తన పట్టిక
vi. నిరోధకత
vii. లోహాల క్రియాశీలత క్రమం
viii. హైడ్రో కార్బన్ ల ధర్మాలు
ix. ప్రమేయ సమూహాలు వంటి కేవలం కొన్ని అంశాల పై మాత్రమే ఈ ప్రశ్నలు వస్తాయి.
పాఠ్య పుస్తకం లోని ముఖ్యమయిన ప్రయోగాలు
i. పుటాకార దర్పణం లేదా కుంభాకార కటకం నాభ్యంతరం కనుగొనే ప్రయోగం.
ii. వస్తు స్థానం బట్టి ప్రతిబింబ లక్షణాలు గుర్తించు ప్రయోగం.
iii. ఇంద్ర ధనుస్సు ఏర్పరుచుట
iv. నీటితో పొడి సున్నం జరుపు చర్య
V. అవక్షేపం ఏర్పడు ప్రయోగం
vi. లోహం తో ఆమ్లం లేదా క్షారం జరుపు చర్య
vii. కార్బొనేట్ల తో ఆమ్లం జరుపు చర్య
viii. విలీన ఆమ్లం విద్యుద్వాహకత పరిశీలించు ప్రయోగం.
ix. ఓం నియమం పరిశీలించు ప్రయోగం
X. నిరోధం పై a) పదార్ధం స్వభావం b) ఉష్ణోగ్రత c) వాహక పొడవు d) మధ్యచ్ఛేద వైశాల్యం ప్రభావం
పరిశీలించు ప్రయోగాలు.
xi. ఆయిరిస్టెడ్ ప్రయోగం
xii. విద్యుత్ ప్రవహిస్తున్న సాలేనోయిడ్ ప్రవర్తన
xiii. లోహ క్షయం ప్రభావితం చేయు అంశాలు పరిశీలించు ప్రయోగం
xiv. సబ్బు తయారీ విధానం.
xv. మిసిలి తయారీ
➢ మిగిలిన విభాగాలలో
i. ఊహించు సామర్ధ్యం పై 2 మార్కుల ప్రశ్న
ii. నిజ జీవిత సంధానం తో 6 మార్కుల ప్రశ్న
➢ విషయ అవగాహన పై 18 మార్కులకు వచ్చే ప్రశ్నలలో
i. బ్లీచింగ్ పౌడర్ వాషింగ్ సోడా వంటి వాని ఉపయోగాలు, కుంభాకార పుటాకార దర్పణాల భేదాలు, దృష్టి
దోషాలు, ఆకాశం నీలి రంగుకి కారణం,
ii. అఫ్ బో, హుండు నియమాలు ,
iii. అవర్తన పట్టిక లక్షణాలు, ధర్మాల క్రమత,
iv. సోలార్ కుక్కర్,
v.రియర్ వ్యూ మిర్రర్,
vi. సమీకరణాలు తుల్య పరచుట,
vii. క్వాంటం సంఖ్యలు,
viii. బోర్ నమూనా,
ix. మోటార్,
x. నిరోదాన్ని ప్రభావితం చేయు అంశాలు,
xi. కార్బన్ రూపంతరాలు,
xii. ధాతు సాంద్రీకరణ పద్ధతులు వంటి అంశాలు చదవ గలిగితే మంచి మార్కులు సాధించ వచ్చు.
➢ పాఠ్యపుస్తకం చదివితే పార్ట్ బి సమాధానాలు సులభంగా గుర్తించవచ్చు.
జీవశాస్త్రం
జీవశాస్త్రం పరీక్షను 40 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో పార్ట్ - A, పార్ట్ - B ఉంటాయి. పార్ట్ - A లో మూడు
విభాగాలు ఉంటాయి. విభాగం I లో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు మూడు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
అన్నీ రాయాలి. నాలుగు పాయింట్స్ రాయాలి.
విభాగం II లో స్వల్ప సమాధాన ప్రశ్నలు మూడు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. అన్నీ రాయాలి. ఎనిమిది
పాయింట్స్ రాయాలి
విభాగం-III లో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి
ప్రశ్నకు 6 మార్కులు.
పార్ట్ - B లో పది ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.

సిలబస్ విశ్లేషణ
పోషణ: ఈ అధ్యాయంలో స్వయం పోషణ, పర పోషణ, కిరణజన్య సంయోగక్రియ కారకాలు, అంత్య ఉత్పన్నాలు;
హరితరేణువు నిర్మాణం, మానవుల్లో జీర్ణక్రియ, జీర్ణగ్రంథులు - ఎంజైమ్లు, పోషకాహార లోపం - వ్యాధులు, విటమిన్ల
రకాలు లోప వ్యాధులు లాంటివి ముఖ్యమైనవి. హరితరేణువు పటం, మానవుల్లో జీర్ణవ్యవస్థ ఫ్లో చార్ట్ నేర్చుకోవాలి.
శ్వాసక్రియ: మానవుల శ్వాసక్రియలోని వివిధ దశలు, వాయు ప్రసారమార్గం, వాయుగోణులు - రక్త కేశనాళికల మధ్య
వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ, వాయు శ్వాసక్రియ - అవాయు శ్వాసక్రియ, వాయు మార్పిడి వ్యవస్థ - పరిణామం,
మొక్కల శ్వాసక్రియలో ఉష్ణం, CO2 విడుదలవడం, కిణ్వనం లాంటి అంశాలు నేర్చుకోవాలి. దీనిలో వాయు
శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ, మైటోకాండ్రియా, మానవుల్లో వాయు ప్రసార మార్గం పటాలు ప్రధానమైనవి.
ప్రసరణ: ప్రసరణ ఆవశ్యకత, హృదయం అంతర్నిర్మాణం, రక్తప్రసరణ, కవాటాలు, రక్తనాళాలు; ధమనులు - సిరలు,
హార్దిక వలయం, ఏక వలయ, ద్వి వలయ రక్తప్రసరణ; రక్త పీడనం, రక్త స్కందనం, మొక్కల్లో నీటి రవాణా -
ద్రవాభిసరణ, వేరు పీడనం, మొక్కల్లో ఆహార పదార్థాల రవాణా అంశాలను నేర్చుకోవాలి. హృదయం - బాహ్య,
అంతర్నిర్మాణం పటం సాధన చేయాలి.
చేయాలి
విసర్జన: విసర్జన - ఆవశ్యకత, మానవ విసర్జక వ్యవస్థలోని భాగాలు, మూత్రపిండం - అంతర్నిర్మాణం, నెఫ్రాన్
నిర్మాణం, మూత్రం ఏర్పడే విధానంలోని దశలు, డయాలసిస్, మానవ శరీరంలోని అనుబంధ విసర్జక అవయవాలు,
మొక్కల్లో విసర్జన, ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు చదవాలి. మానవ విసర్జక వ్యవస్థ, మూత్రపిండం - అంతర్నిర్మాణం,
నెఫ్రాన్ నిర్మాణం ముఖ్యమైన పటాలు.
పటాలు
నియంత్రణ సమన్వయం: నాడీ వ్యవస్థ, నాడీకణ నిర్మాణం - నాడీసంధి, నాడులు రకాలు, ప్రతీకార చర్యా చాపం,
మానవ నాడీ వ్యవస్థలోని భాగాలు; కేంద్ర, పరధీయ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ; మెదడు భాగాలు విధులు,
అంతస్రావ వ్యవస్థ, మొక్కల్లో నియంత్రణ, ఫైటో హార్మోన్ల ఉపయోగాలు లాంటి ప్రశ్నలు నేర్చుకోవాలి. నాడీకణ
నిర్మాణం పటం ముఖ్యమైంది.
ప్రత్యుత్పత్తి: ప్రత్యుత్పత్తి రకాలు; సహజ, కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి; అలైంగిక ప్రత్యుత్పత్తి రకాలు, సిద్ధ బీజోత్పత్తి,
పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి, పరాగ సంపర్కం - ఫలదీకరణం, ద్వి ఫలదీకరణం, మానవుల్లో ప్రత్యుత్పత్తి,
పిండాభివృద్ధి - శిశు జననం, కుటుంబ నియంత్రణ మార్గాలు, కణ విభజన అంశాలు చదవాలి.
పటాలు: సహజ, కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి , ద్వి ఫలదీకరణం, స్త్రీ - పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, శుక్రకణం, పుష్పం
భాగాలు నేర్చుకోవాలి.
జీవక్రియల్లో సమన్వయం: జీవక్రియల్లో సమన్వయం, ఆకలిని ఉత్తేజపరిచే కారకాలు, మానవుల్లో దంతాల రకాలు,
విధులు; పిండిపై లాలాజలం చర్య, ఆహార వాహికలో పెరిస్టాలిటిక్ చలనం, జీర్ణాశయం ఒక రుబ్బురోలు లాంటిది,
చిన్న పేగుల్లో శోషణ, రెండో మెదడు ముఖ్యమైనవి.
అనువంశికత - పరిణామం: అనువంశికత - వంశపారంపర్యం, వైవిధ్యాలు; మెండల్ బఠానీ మొక్కను ఎంపిక
చేసుకోవడానికి కారణాలు, ఏక సంకరణం, మెండల్ ప్రతిపాదించిన సూత్రాలు, లామార్క్ వాదం, ఆగస్ట్ వీజ్మన్
ఎలుకలపై చేసిన ప్రయోగం, చార్లెస్ డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతం, జీవపరిణామ నిదర్శనాలు; నిర్మాణ, క్రియా
సామ్య అవయవాలు, అవశేషావయవాలు చదవాల్సిన అంశాలు. మానవుల్లో లింగ నిర్ధారణ; నిర్మాణ, క్రియా సామ్య
అవయవాల పటాలు సాధన చేయాలి.
చేయాలి
మన పర్యావరణం: ఆహార సంబంధాలు, ఆహార గొలుసు, పిరమిడ్ల రకాలు, జైవిక వ్యవస్థాపనం, వృద్ధీకరణం; కీటక
నాశనులను వాడకుండా నివారణ చర్యలు ప్రధానమైని. దీనిలో ఆహార గొలుసు , ఆహారపు జాలకం, వివిధ రకాల
పిరమిడ్ల పటాలు నేర్చుకోవాలి.
సహజ వనరులు: పునరుద్ధరించదగిన, పునరుద్ధరించలేని వనరులు; వడిచెర్ల, వనపర్తి గ్రామంలోని నీటి పరిస్థితి;
ఇక్రిశాట్, కొత్తపల్లి గ్రామంలో నీటి యాజమాన్య పరిస్థితి, ఇక్రిసాట్, సముదాయ, రైతు ఆధారిత విధానాలు;
సుస్థిరాభివృద్ధి, పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యే నాలుగు Rలు ముఖ్యమైనవి.
ప్రయోగాలు: ఆకుల్లో పిండి పదార్థం ఉందని నిరూపించే ప్రయోగం, కిరణజన్య సంయోగక్రియకు CO2, కాంతి
అవసరమని, కిరణ జన్య సంయోగక్రియలో O2 విడుదల అవుతుందని నిరూపించే ప్రయోగాలు; మొక్కల శ్వాసక్రియలో
ఉష్ణం, CO2 విడుదలవడం; హృదయం అంతర్నిర్మాణం, పరిశీలన; మొక్కల్లో నీటి రవాణా - ద్రవాభిసరణ,
మూత్రపిండం - అంతర్నిర్మాణం పరిశీలన ప్రధానమైనవి. రైజోపస్లో సిద్ధ బీజాలను పరిశీలించడం, పిండిపై లాలాజలం
చర్య; ఆమ్లం, పత్రం ప్రయోగాలను నేర్చుకోవాలి.
ప్రశ్నల రకం:
1 ప్రయోగశాల సామాగ్రి (AS -3)
2 ఏమి జరగవచ్చు (AS -2)
3 నిత్యజీవిత వినియోగం (AS -6,7)
4 పోలికలు- బేధాలు –విషయావగాహన (AS -1)
5 పట్టికల విశ్లేషణ (AS -4)
6 నిత్యజీవిత వినియోగం (AS -6,7)
7 భావనల అవగాహన -విషయావగాహన (AS -1)
8 ప్రయోగశాలా కృత్యం - (AS -3)
9 బొమ్మ –భాగాలు (AS -5)
పార్ట్ –బి లో ఎనిమిది ప్రశ్నలు భావనల అవగాహన -విషయావగాహన (AS -1)నుండి, ఒక ప్రశ్న బొమ్మ –భాగాలు
(AS -5)నుండి, ఒక ప్రశ్న ప్రయోగాలు –క్షేత్ర పరిశీలనలు - (AS -3) నుండి వస్తాయి.
SOCIAL STUDIES
PLAN OF ACTION
* సాంఘిక శాస్త్రంలోని రెండు భాగాలలో మొదటి భాగం లోని భావనలు విద్యార్ధి పరిసరములతో దగ్గరి సంబంధం
కల్గి ఉంటాయి. భావనలను అర్ధంచేసుకోవడం సులభంగా ఉంటుంది. కాబట్టి మొదటి భాగం నుండే 20-25
మార్కులు సాధించేలా అభ్యాసం చేయించాలి.
* రివిజన్ సమయంలో విద్యా ప్రమాణాల వారీగా ప్రాక్టీస్ చేయించాలి.

I. విషయావగాహన: విషయావగాహనకు సంబంధించి ప్రతి పాఠంలో ముఖ్యమైన భావనలను గుర్తించి, వాటిని


తరగతి గదిలో మైండ్ మ్యాపింగ్ చేయించడం ద్వారా అవగాహన కలిగించి, స్వంతంగా సమాధానాలు
వ్రాసేటట్లు ప్రాక్టీస్ చేయించాలి. ముఖ్యంగా 2, 3, 6, 7 మరియు 8 పాఠాలలో సులభమైన అంశాలను
నేర్పించాలి
(A) మొదటి విభాగములోని రెండు మార్కుల ప్రశ్నలు, రెండవ విభాగములోని నాలుగు మార్కుల ప్రశ్నలపై దృష్టి
పెట్టాలి.
(B) ఈ రెండింటిలో కారణాలు, ఉదాహరణలు, పోలికలు, బేధాలు, లక్షణాలు కనీసం ఒక్కొక్కదానికి ఒకటి,
రెండు అభ్యాసం చేయించాలి.
ఉదా:- మొదటి పాఠంలో థార్ ఎడారి యొక్క రెండు భౌతిక లక్షణాలు, అండమాన్, నికోబార్ దీవులకు
- లక్షదీవులకు తేడాలు, తూర్పు కనుమలు- పశ్చిమ కనుమలకు; తూర్పు తీర మైదానం - పశ్చిమ
తీర మైదానాలకు గల తేడాలు మొదలగునవి. నాల్గవ పాఠంలో Climograph అనగా నేమి?
వాతావరణంలోని అంశాలేవి? శీతోష్ణస్థితికి - వాతావరణానికి తేడా ఏమిటి?
శీతోష్ణస్థితిని ప్రభావితంచేయు అంశాలు ఏవి? లాంటి ప్రశ్నలను అభ్యాసం చేయించాలి.
(C) ప్రతి పాఠం వెనుక ఉన్న కీలక పదాలకు వివరణలు ఒకటి, రెండు వాక్యాలలో అభ్యాసం చేయించి స్వంతంగా
రాయించాలి.
(D) ప్రతి పాఠంలో సులభమైన భావనలను గుర్తించి వాటిపై పలుమార్లు చర్చించాలి.
(E) ఒక్కొక్క విద్యార్ధిని ఒకరిద్దరు తెలివైన విద్యార్ధులతో కూర్చోబెట్టి, వారు చర్చించుకుంటూ ఉండగా వినేలా
చూడాలి.
(F) కీలక భావనలను ఉపాధ్యాయులు అనేక పర్యాయములు వివరించాలి.
(G) వెనుకబడిన విద్యార్ధులు పూర్తి వాక్యంలో రాయడం కాకుండా, కనీసం కీలక పదాలను పాయింట్ వారీగా
రాసేలా చూడాలి. ఉదా:- N.T. రామారావు ప్రవేశపెట్టిన పథకాలు
. మధ్యపాన నిషేధం
. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం
. పేదవారికి రెండు రూపాయలకు కిలో బియ్యం
II. ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్ధం చేసుకొని వ్యాఖ్యానించుట:
* పాఠాలలో విశ్లేషణకు అవకాశము కల్గిన పేరాగ్రాఫ్ లను గుర్తించి, ఎలా వ్యాఖ్యానించాలో, పిల్లల
ప్రతిస్పందనలను తరగతి గదిలో పిల్లలతో చెప్పించి, రాయించాలి.
* ఇచ్చిన పేరాగ్రాఫ్ లోని కొన్ని పదాల ఆధారంగా అదే పేరా సారాంశాన్ని వ్రాసేలా అభ్యాసం చేయించాలి.
* కొత్త చట్టాలు చేయడం, ఉన్న చట్టాలను సరిగా అమలుచేయడం, చట్టాలపై ప్రజలకు అవగాహన చేయించడం
వంటివి సలహాలు/సూచనలలో ముగింపులో రాసేలా అభ్యాసం చేయించాలి.
* వెనుకబడిన పిల్లలు వ్యాఖ్యానంలో కారణాలు, పోలికలు వ్రాయ లేకపోవచ్చు. కానీ ఆ విషయము వాళ్ళ
ప్రాంతములో ఏ విధముగా ఉందో రాయగలరు.

III. సమాచార నైపుణ్యాలు:


1. పాఠ్య పుస్తకం లోని పట్టికలు, గ్రాఫ్ లు పిల్లలతో విశ్లేషణ చేయించాలి. పట్టికలు, గ్రాఫ్ మొదలైన వాటి పైన
గల హెడ్డింగ్ చదివి దానిని ఈ గ్రాఫ్ దేని గురించి తెలుపుతుంది అంటే జవాబు రాసేలా నేర్పించాలి.
2. ఉపాధ్యాయులు పట్టికలు, గ్రాఫ్ లకు సంబంధించిన సంఖ్యాత్మకమైన సమాధానములను అభ్యాసము
చేయించాలి. ఉదా:- మూడవ పాఠంలో పేజి నంబర్ 30 లోని పట్టిక . . . . . .
* సేవా రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంత? ఆ శాతాన్ని చూసి రాసేలా అభ్యాసం
చేయించాలి.
* విశ్లేషణ: పట్టికలోని అంశాల ఆధారంగా కొన్ని వాక్యాలు వ్రాసేలా చూడాలి.

IV. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన-ప్రశ్నించడం:


* పాఠ్యాంశములలో ఉన్న సమకాలీన అంశములను గుర్తించి, వాటిపై పిల్లలతో కారణాలు, సమస్యలు, పరిష్కార
మార్గాలు గురించి మాట్లాడించి, రాయించాలి.
* భూగోళం వేడెక్కుట అధిక జనాభా, పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, వ్యవసాయరంగ సమస్యలు,
భూగర్భ జల సమస్యలు, వలసల వలన ఏర్పడే సమస్యలు, చౌక ధరల దుకాణాల పనితీరు, ఆధునిక
వ్యవసాయం వలన ఏర్పడే నష్టాలు వంటివి అభ్యాసం చేయించాలి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, పర్యావరణ సమస్యలు, మతమును రాజకీయాలలో
వినియోగించుకుంటున్న తీరు. ఇలాంటి వాటిని విద్యార్ధుల స్థాయిలో ఒక హాఫ్ పేజ్ రాసేలా అభ్యాసం చేయిస్తే
సరిపోతుంది.
V. పట నైపుణ్యాలు:
* తెలంగాణ అవుట్ లైన్ మ్యాప్ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయించాలి.
భారతదేశం పొలిటికల్ మ్యాప్ మరియు భారతదేశం అవుట్ లైన్ మ్యాప్ లను పుస్తకంలో చూసుకుంటూ
అనేక పర్యాయములు అభ్యాసం చేయించాలి.
* వీలైనంత వరకు పబ్లిక్ ప్రశ్నాపత్రంతో ఇచ్చే మ్యాప్ ను జిరాక్స్ తీయించి ప్రాక్టీస్ చేయిస్తే, పిల్లల మెదడులో
దాని ఆకారము స్థిరపడుతుంది.
* రాష్ట్రాలు, రాజధానులు, నదులు, పర్వతాలు, కొన్ని ఎంపికచేసి అభ్యాసం చేయించాలి. వీటి అభ్యాసం
నిరంతరం కొనసాగించాలి. భారతదేశ పటంలో 1 , 5 వ పాఠాలలోని అంశాలు, ప్రపంచ పటంలో 12,13
పాఠాలలోని అంశాలను గుర్తింపచేయాలి.
* పటములతో గేమ్స్ ఆడించే ప్రయత్నం చేయాలి. విద్యార్ధులను గ్రూప్ లు చేసి గేమ్స్ ఆడించాలి.
అలాగే మ్యాప్ పాయింటింగ్ కు సంబంధించి క్విజ్ నిర్వహించాలి.
* మ్యాప్ లో గుర్తించాల్సినవి ముందుగా విద్యార్ధులకు ఇచ్చి అభ్యాసం చేయించి మ్యాపుల్లో గుర్తింపచేయలి.
* మ్యాప్ లపై కొన్ని ప్రశ్నలను తయారుచేసి, అభ్యాసం చేయించాలి.
ఉదా:- 12 వ పాఠము - పేజి నంబర్ 181 – పటం 2 (1942 లో జపాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతం)
1. జపాన్ చే ఆక్రమించబడిన భారతదేశం యొక్క పొరుగుదేశం ఏది?
2. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇటీవల ఏమని పిలువబడుతున్నది?
3. జపాన్ నియంత్రణలో వున్న చైనా ప్రాంతం ఏది?
4. జపాన్ నియంత్రణలోని కొన్ని దేశాలు మరియు ప్రాంతాల పేర్లు తెలపండి.
* పటంలో పరోక్షంగా ఇవ్వబడే అంశాలను కూడా గుర్తుపెట్టగలిగే విధంగా అభ్యాసం చేయించాలి.
ఉదా:- ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం నెలకొల్పబడిఉన్న నగరం.

VI. ప్రశంస/ అభినందన – సున్నితత్వం:


* నినాదాలకు సంబంధించిన Themes ను గుర్తించి, ఒక్కొక్క Theme ఆధారంగా కనీసం రెండు నినాదాలు
అభ్యాసం చేయించాలి.
* జాతీయ నాయకుల, గొప్ప వ్యక్తుల లక్షణాలు ఒక్కొక్కరివి 2 మరియు 3 మాత్రమే నేర్చుకొని అభ్యాసం చేస్తే
సరిపోతుంది.
ఉదా:- గాంధీజీ... సత్యము, అహింస ; సుభాష్ చంద్రబోస్ ... దేశభక్తి, స్వాతంత్ర్య పిపాస
* కొన్ని సులభమైన లేఖలు అభ్యాసం చేయించాలి. ( సమకాలీన సమస్యలపై)
* కొన్ని ముఖ్యమైన భావనలపై "నీవైతే ఏమి చేసేవాడివి?” అనే అంశాలు ఒకటి, రెండు అభ్యాసం చేయించాలి.
PART – B:
* బహుళైచ్చిక ప్రశ్నలకు సంబంధించి ముఖ్యమైన భావనలపై అభ్యాసం చేయించాలి.
* క్రిందివానిలో నిజమైనది గుర్తించుట, జత పరుచుట, భిన్నమైన దానిని గుర్తించుట లాంటి విభిన్నమైన
రకాలలో బిట్లను ప్రాక్టీస్ చేయించాలి. ( సోషల్ స్టడీస్ ఫోరం చేత నిర్వహించబడిన వివిధ టాలెంట్ టెస్ట్
పేపర్లను ప్రాక్టీస్ చేయిస్తే ఉపయుక్తంగా ఉంటుంది).
* ఈ సంవత్సరం విడుదల చేసిన బ్లూ ప్రింట్ ప్రకారం పార్ట్ - బి లో సమకాలీన అంశాలపై రెండు బిట్లు వస్తాయి.
కాబట్టి వివిధ స్థాయిలలో, వివిధ హోదాలలో ఉన్న వ్యక్తులను గుర్తుంచుకొనేలా ప్రాక్టీస్ చేయించాలి.
* క్విజ్ కార్యక్రమం నిర్వహించినట్లయితే విద్యార్ధులు ఆసక్తిగా పాల్గొంటారు.

గమనిక:- ఇవి కేవలం సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. ఉపాధ్యాయులు తమ విద్యార్ధుల స్థాయిని దృష్టిలో
ఉంచుకొని, సులభమైన మార్గాలలో విద్యార్ధులు రాసేలా వ్యక్తిగతంగా ప్రణాళిక చేసుకోవడం చాలా
మంచిది. ఏఏ అంశాల్లో విద్యార్ధులు వెనుకబడి ఉన్నారో గుర్తించి, ఆయా అంశాల్లో అభ్యాసం
చేయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.

You might also like