You are on page 1of 59

పాఠ్యాంశము:

అయస్కాంతాలతో ఆటలు
Presentation by
CVVMMK Dhaveji
School Asst. Biology
Taylor High School, Narsapur 534275
AP State -India
muralidahveji@yahoo.com
గుండుసూదులు ఉంచే డబ్బా మూతకు
గుండుసూదులు అంటుకుని ఉంటాయి.

ఎందుకు?
ఫ్రీడ్జ్ ఇనుపబీరువాల తలుపులకు బొమ్మలు గల
బిళ్ళలు అంటుకుని ఉంటాయి.

ఎందుకు?
ఈ బిళ్ళలు చెక్క తలుపులకు ప్లా స్టిక్ కు
అంటుకుని ఉంటాయా?

ఎందుకు?
ఈ విధంగా అంటుకుని ఉండడానికి సహాయపడే
పదార్ధా న్ని అయస్కాంతం అంటారు
అయస్కాంతాలు వివిధ ఆకారాలలో ఉంటాయి

U ఆకార అయస్కాంతం దండాయస్కాంతం

వలయాకార అయస్కాంతం గుర్రపునాడ అయస్కాంతం


ఇప్పటివరకు మనకు తెలిసిన ఆయాస్కాంత పదార్ధా లలో
నియో డైమియమ్
బలమైన అయస్కాంతం
ఇప్పటివరకు మనకు తెలిసిన ఆయాస్కాంత పదార్ధా లలో
నియో డైమియమ్
బలమైన అయస్కాంతం
కృత్యం-2
ఈ పట్టిక పూరించుము
వస్తు వు పేరు ఏ పదార్ధంతో తయారైంది వస్తు వును అయస్కాంతం
ఆకర్షించిందా ?
ఇనుప మేకు ఇనుము
స్కేలు ప్లా స్టిక్
గాజుముక్క గాజు
పెన్సిల్ చెక్క, గ్రాఫైటు
బ్లేడు ఇనుము
చెక్కముక్క చెక్క
ఇత్తడి తాళం ఇత్తడి
చెవి
పెన్ ప్లా స్టిక్
సుద్ద సుద్దపొడి
స్టీల్ చెమ్చా స్టీలు
చాకు ఇనుము
అయస్కాంతం ఆకర్షించిన పదార్ధా లను
“అయస్కాంత పదార్ధా లు “ అని అంటారు

అయస్కాంతం ఆకర్షించని పదార్ధా లను


“అనయస్కాంత పదార్ధా లు “ అని అంటారు
అయస్కాంతానికి గల ఆకర్షించే లక్షణాన్ని ఉపయోగించి
కొన్ని మిశ్రమాలను వేరు చేస్తా రు.
ఇనుపరజను ఇసుక మిశ్రమము నుండి ఇనుమును
అయస్కాంతం ఉపయోగించి వేరుచేయవచ్చు
ఇనుపరజను గంధకము మిశ్రమము నుండి ఇనుమును
అయస్కాంతం ఉపయోగించి వేరుచేయవచ్చు
ఒక తెల్లకాగితం పై ఇనుపరజను పలచగా అంతటా
ఏకరీతిగా ఉండే విధంగా చల్లండి. ఆ కాగితం కింద ఒక
దండాయస్కాంతన్ని ఉంచి అటు ఇటు కదల్చి ఒక చోట
స్థిరంగా ఉంచి గమనించండి
తెల్లకాగితం పై పలచగా అంతటా ఏకరీతిగా ఉండే విధంగా
చల్లిన ఇనుపరజను ఒకదానికొకటి ఎదురుగా కొంత
దూరంలో గల రెండు ప్రత్యేక ప్రదేశాలలో పొగుపడింది
అయస్కాంతపు కొన భాగాలు మిగతా ప్రదేశాలకంటే
ఎక్కువ ఇనుపరజనును ఆకర్షించాయి . అంటే ఆకర్షించే
లక్షణం అయస్కాంతం అంతటా ఒకేలా ఉండక, దాని
రెండు కొనలలో ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది
ఈ రెండు కొనలను ధృవాలు అని అంటారు.

ఉత్తర ధృవము (N) సాధారణంగా ఎరుపు రంగుతో


సూచిస్తా రు “N” అని వ్రాస్తా రు.
దక్షిణ ధృవము (S) సాధారణంగా నీలి రంగుతో
సూచిస్తా రు “S” అని వ్రాస్తా రు.
దండాయస్కాంతంతో దిక్కులు తెలుసుకుందాం

ఒక దండాయస్కాంతం మధ్యలో పురిలేని సన్నని


దారం కట్టి భూమికి సమాంతరంగా ఉండేలా ఒక
స్టాండ్ కు వేలాడ తీయండి
ఆ అయస్కాంతం నిశ్చలస్థితి కి వచ్చేవరకు ఆగి
పరిశీలించండి
ఆ దండాయస్కాంతం నిశ్చలస్థితి కి వచ్చాక ఉత్తర దక్షిణ
ధృవాలను చూపిస్తు న్నది

అంటే

స్వేచ్ఛగా వేలాడతీయబడ్డ దండాయస్కాంతం


ఉత్తర దక్షిణ ధృవాలను చూపిస్తుంది
స్వేచ్ఛగా వేలాడతీయబడ్డ దండాయస్కాంతం
ఉత్తర దక్షిణ ధృవాలను చూపిస్తుంది

ఈ ధర్మాన్ని
“అయస్కాంత దిశాధర్మం”
అంటారు
ఈ అయస్కాంత దిశాధర్మం ఆధారంగా
అయస్కాంత దిక్సూచి తయారుచేస్తా రు.
ఈ అయస్కాంత దిశాధర్మం ఆధారంగా
అయస్కాంత దిక్సూచి తయారుచేస్తా రు.
దిక్సూచి వృత్తా కారంలో ఉండే పలుచని రేకు డబ్బా దీని
అడుగు భాగాన ఉత్తరం (N), దక్షిణం (S), తూర్పు (E)
మరియు పశ్చిమం (W) దిక్కులను సూచించే అక్షరాలు రాసి
ఉంటాయి. అడుగు భాగంలో మధ్యలో సన్నని మొనపై
స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగే పలుచని అయస్కాంత సూచీ
అమర్చబడి ఉంటుంది. అంటారు
అడుగు భాగంలో మధ్యలో సన్నని మొనపై స్వేచ్ఛగా గుండ్రంగా
తిరిగే పలుచని అయస్కాంత సూచీ అమర్చబడి ఉంటుంది.
ఈ మొత్తం అమరిక మీద పలుచని పారదర్శక గాజు బిళ్ళతో
డబ్బా మూసేసి ఉంటుంది.
ఏ ప్రదేశంలోనైనా దిక్కులు తెలుసుకోవడానికి, ఓడలలో,
విమానాలలో దీనిని వాడతారు.
పర్వతారోహకులు, మిలటరీ జవానులు కొత్తప్రదేశాలలో
దిక్కులు తెలుసుకోవడానికి దీనిని వాడతారు.
రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణ

ఒకే పరిమాణం గల రెండు దండాయస్కాంతాలను పైన


చూపినట్లు అమరుస్తూ వాటి మధ్య ఆకర్షణ వికర్షణలను
పరిశీలించండి
రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణ
ఏ ఏ ధృవాలు ఎదురెదురుగా ఉంచినప్పుడు అయస్కాంతాలు
పరస్పరం ఆకర్షించుకున్నాయి?

ఏ ఏ ధృవాలు ఎదురెదురుగా ఉంచినప్పుడు అయస్కాంతాలు


పరస్పరం వికర్షించుకున్నాయి?
సజాతి ధృవాలు (N-N,S-S)ఎదురెదురుగా ఉంచినప్పుడు
అయస్కాంతాలు పరస్పరం వికర్షించుకున్నాయి.
విజాతి ధృవాలు (N-S, S-N) ఎదురెదురుగా
ఉంచినప్పుడు అయస్కాంతాలు పరస్పరం
ఆకర్షించుకున్నాయి.
భూమి ఒక అయస్కాంతం.

స్వేచ్చగా వేలాడదీసి ఉన్న దండాయస్కాంతం ఉత్తర దక్షిణ


ధృవాలనే ఎందుకు చూపిస్తుంది
ఒక దండాయస్కాంతన్ని తరగతి గది బల్లపై ఉంచి, మరొక
దండాయస్కాంతాన్ని సన్నని దారంతో మొదటి
దండాయస్కాంతనికి దగ్గరగా వేలాడదీయండి .

వేలాడదీసిన దండాయస్కాంతం ఏ ఏ దిశలను సూచిస్తూ


ఆగినది.
గది బల్లపై ఉంచిన దండాయస్కాంతాన్ని కొద్దిగా తిప్పి దాని
దిశ మార్చండి.

వేలాడదీసిన దండాయస్కాంతం దిశలో ఏమైనా మార్పు


గమనించారా?
వేలాడదీసిన దండాయస్కాంతం బల్లపైనున్న
దండాయస్కాంతం దిశలోనే ఆగినది కానీ వేలాడదీసిన
దండాయస్కాంతపు ఉత్తరధృవం బల్లపైనున్న
దండాయస్కాంతపు దక్షిణ ధ్రు వం వైపుగాను , వేలాడదీసిన
దండాయస్కాంతపు దక్షిణ ధృవం బల్లపైనున్న
దండాయస్కాంతపు ఉత్తర ధ్రు వం వైపుగాను ఆగినవి
అంటే భూమి ఒక అయస్కాంతంగా, స్వేచ్ఛగా వేలాడే
అయస్కాంతం పై ప్రభావం చూపడం వలననే అది
ఎల్లప్పుడు ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది
గది బల్లపై ఉంచిన దండాయస్కాంతాన్ని కొద్దిగా తిప్పి దాని
దిశ మార్చండి.

వేలాడదీసిన దండాయస్కాంతం దిశలో ఏమైనా మార్పు


గమనించారా?
మనకు ఇచ్చిన వస్తు వు అయస్కాంతమో కాదో
కనుక్కుందాము

ఒకే పరిమాణం, ఆకారం, ఒకే రంగు కలిగిన మూడు


వస్తు వులను మీకిస్తే ఒక దండాయస్కాంతంతో వాటిలో ఏ
వస్తు వు అయస్కాంతమో, ఏ వస్తు వు
అయస్కాంతపదార్ధంతో తయారైనదో , ఏ వస్తు వు
అనయస్కాంత పదార్ధంతో తయారైనదో ఎలా
కనుక్కుంటావు?
పట్టిక
పరిశీలించిన అంశం 1 వ వస్తు వు 2వ వస్తు వు 3 వ వస్తు వు
ఆకర్షించబడింది / ఆకర్షించబడింది / ఆకర్షించబడింది /
వికర్షించ బడింది / ఏ వికర్షించ బడింది / ఏ వికర్షించ బడింది / ఏ
ప్రభావము లేదు ప్రభావము లేదు ప్రభావము లేదు

వస్తు వును అయస్కాంతపు మొదటి ధ్రు వం


వద్దకు తెచ్చినప్పుడు గమనించిన మార్పు
వస్తు వును అయస్కాంతపు రెండవ ధ్రు వం
వద్దకు తెచ్చినప్పుడు గమనించిన మార్పు
1. ఒక వస్తు వును దండాయస్కాంతపు ఒక ధృవం
ఆకర్షించి రెండవ ధృవం వికర్షించితే అది అయస్కాంతం.

2. ఒక వస్తు వును దండాయస్కాంతపు రెండు ధృవాలు


ఆకర్షించితే అది అయస్కాంతపదార్ధం.

3. ఒక వస్తు వును దండాయస్కాంతపు రెండు ధృవాలు


ఆకర్షణ వికర్షణలు చేయకపోతే అది
అనయస్కాంతపదార్ధం.
అయస్కాంతాన్ని తయారుచేద్దాం .

ఒక సన్నని ఇనుప మేకును బల్లపై ఉంచి దండాయస్కాంతపు ఒక


ధృవాన్ని మేకు కొనవద్ద ఆనించి రెండో కొనవరకు రుద్దండి.
ఆయాస్కాంతం పైకిఎత్తి తిరిగి అదే ధృవాన్ని మేకు మొదటి కొనవద్ద
ఆనించి రెండవ కొన వరకు రుద్దండి. ఇలా 20 నుండి 30 సార్లు
చేయండి. ఇప్పుడు మేకు అయస్కాంతంలా పనిచేస్తుంది.
అయస్కాంత దిక్సూచిని తయారుచేద్దాం .

ఆయస్కాంతీకరించిన ఒక గుండు సూదిని తీసుకొని కార్క్


ముక్క పై టేప్ తో అతికించండి. ఒక గ్లా స్ లోని నీటిలో
తెలియాడేటట్లు ఆ కర్క్ ను ఉంచండి. (కార్క్ సులభంగా
తెలియాడేందుకు కొద్ది డిటర్జెంట్ కలపండి)
అయస్కాంత ప్రేరణ

ఒక జెమ్ క్లిప్ను దండాయస్కాంతపు ఏదేని ధృవం వద్దకు


తీసుకుని వస్తే అది అయస్కాంతమునకు ఆకర్షించబడుతుంది,
మరియొక జెమ్ క్లిప్ను మొదటి జెమ్ క్లిప్ వద్దకు తెచ్చిన అది
దానికి ఆకర్షించబడుతుంది
అయస్కాంత ప్రేరణ

అంటే ఆయాస్కాంతంకి జెమ్ క్లిప్ అంటిఉండడంవల్ల అది


అయస్కాంత స్వభావం కలిగి రెండవ జెమ్ క్లిప్ ను
ఆకర్షించగల్గింది.
అయస్కాంతం
కీలక పదాలు

• అయస్కాంతం
• దిక్సూచి
• అయస్కాంత పదార్ధం
• ఆనయస్కాంతపదార్ధం
• ఉత్తరధృవం
• దక్షిణ ధృవం
• సజాతి ధృవాలు , విజాతి ధృవాలు
• ఆకర్షణ, వికర్షణ
• అయస్కాంత ప్రేరణ
మనం ఏమి నేర్చుకున్నాం

• లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం .


• అయస్కాంతాలు వివిధ ఆకారాల్లో తయారుచేస్తా రు.
దండాయస్కాంతం, గుర్రపునాద అయస్కాంతం,
వలయాకారపు అయస్కాంతం, బిళ్ళ అయస్కాంతం
మొన్నగునవి.
• అయస్కాంతం ఆకర్షించే పదార్ధా లను
అయస్కాంతపదార్ధా లు అంటారు
• అయస్కాంతం ఆకర్షించని పదార్ధా లను
అనయస్కాంత పదార్ధా లు అంటారు
• అయస్కాంటతానికి ఆకర్షించే గుణం ధృవాలవద్ద
ఎక్కువగా ఉంటుంది .
• ప్రతి ఆయాస్కాంతనికి రెండు ధృవాలు ఉంటాయి. ఉత్తర
ధృవం, దక్షిణ ధృవం
• స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఉత్తర దక్షిణ
ధృవాలను చూపిస్తుంది.
• అయస్కాంత సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి
అయస్కాంత విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి
• అయస్కాంతనికి దగ్గరగా ఉండటంవల్ల ఒక అయస్కాంత
పదార్ధం అయస్కాంత ధర్మన్ని పొందితే దానిని
అయస్కాంత ప్రేరణ అంటారు.
‘గార్డెన్ వర్బ్లర్’ (Garden Warbler) పక్షి దాని శరీర దిక్సూచి
సహాయంతో యూరోప్ నుండి మధ్య ఆఫ్రికా వరకు వలస వెళ్ళి
తనగూడు దారితప్పక తిరిగి చేరుతుంది

The garden warbler flies from Europe to central Africa in the fall and returns to
Europe in the spring. Its internal "compass" helps it find the way.
ఇప్పటివరకు మనకు తెలిసిన ఆయాస్కాంత పదార్ధా లలో
నియో డైమియమ్
బలమైన అయస్కాంతం
సాధారణంగా ఇనుము, రాగి, నికేల్, అల్యూమినియమ్ల మిశ్రమంతో
శక్తివంతమైన అయస్కాంతములను తయారు చేస్తా రు
పూర్వం శత్రు నౌకల నుంచి సీలలను తొలగించి ముంచడానికి లోడ్ స్టోన్
అయస్కాంతాలను వాడేవారు
ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగచుట్టను ఉపయోగించి
విద్యుదయస్కాంతన్ని తయారుచేయవచ్చు
జంతువుల కడుపులో పెరుకుపోయిన ఇనుప మేకులు తీగలు
తొలగించడానికి అయస్కాంత పరికరాలను వాడతారు
వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని
ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు
భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి పెద్ద అయస్కాంతంలా
పనిచేస్తుందని భావిస్తు న్నారు
అయస్కాంతం ఉపయోగించి ఆటబొమ్మల్ని తయారుచేయుట

You might also like