You are on page 1of 109

Page: 78 (Original Page No.

88)

రెండవ భాగము
Page: 79 (Original Page No. 89)

1
రాయ్చంద్భాయ్
కిందటి అధ్యాయంలో నేను చెప్పాను కదా బొంబాయి నౌకాశ్రయం వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉందని, జూన్, జులై మాసాల్లో
అరేబియా సముద్రం ఇలా ఉండటం ఏమంత సాధారణ విషయం కాదు. అరేబియా సముద్రం అంతా ఇలాగే అలజడిగా ఉంటుంది.
ఓడలో ప్రయాణికులంతా దాదాపుగా జబ్బున పడ్డా రు; వాళ్లలో నేనొక్కడినే ఆరోగ్యవంతంగా ఉన్నాను, ఓడ పైకి ఎక్కి సముద్రంలో
తుఫాను కెరటాలను చూస్తూ, అక్కడ అలల సయ్యాటలను చూస్తూ ఆనందిస్తు న్నాను. ఉదయం అల్పాహరం సమయంలో నాతో
పాటూ అక్కడ ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు, అటుకులతో చేసిన గంజిని పళ్లెంలో చాలా జాగ్రత్తగా తాగాలి, పళ్లేళాలను జాగ్రత్తగా
పట్టు కోకపోతే ఆ గంజి కాస్త తన దారి తాను చూసుకుని సముద్రం పాలవుతుంది.

బయట కల్లోత తుఫాను నా మదిలో కల్లోల తుఫాను ఒక్కటే. అయితే ఈ లోపలి తుఫానుకు కూడా నేను చలించలేదు. తరువాత

నేను చెప్పబోయేది కూడా ఇదే అనుకుంటున్నాను. కులంతో నేను ఎదుర్కోవాల్సిన సమస్య అక్కడ సిద్ధంగా ఉంది. నేను నా వృత్తి

ఆరంభంలోనే దీనిపై అసహాయతను ప్రకటించియున్నాను. ఇక అప్పటి నుంచి, నేనొక సంస్కర్తను. సంస్కరణలు ఎంత మంచిగా

తీసుకురాగలడానికి అవకాశాలు ఏంటనే దానిపై మల్లగుల్లా లు పడతున్నాను. కానీ నాకు అంతుబట్టని విదంగా అక్కడ అనేక

సమస్యలున్నాయి.

మా పెద్దన్నయ్య నన్ను ఓడ వద్దకు వచ్చి కలుసుకున్నారు. ఆయన అప్పటికే డాక్టర్ మెహతా, వారి పెద్ద అన్నయ్యగారితో పరిచయం

ఏర్పరచుకున్నారు. డాక్టర్ మెహతాగారు నన్ను బొంబాయికి వెళ్లినప్పడు వాళ్ల ఇంటికి వెళ్లమని ప్రోద్బలం చేశారు, దాంతో మేం

అక్కడికి వెళ్లాం. ఇంగ్లండ్లో ఆయనతో ఏర్పడిన పరిచయం భారదేశంలోనూ కొనసాగింది, చివరికి అది మా రెండు కుటుంబాల

మధ్య శాశ్వత స్నేహ బంధాన్ని పండించింది.

మా అమ్మగానిరి చూడాలని నేను తహతహలాడాను. ఆమె నన్ను తిరిగి తన ఒడిలోకి చేర్చుకోవడానికి ప్రాణంతో జీవించి లేదనే

విషయం నాకు తెలీదు, నేను సూతక స్నానం చేస్తు న్నాను. అమ్మ చనిపోయిందన్న విషయాన్ని మా అన్నయ్య దాచి ఉంచాడు, నేను

ఇంగ్లండ్లో ఉన్నపుడే ఈ ఘోరం జరిగిపోయింది. నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఈ వార్త వింటే బాధపడతాని ఆయన చెప్పలేదు.

ఇప్పుడైనా సరే ఈ వార్త నాకు ఎంత తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసిందో చెప్పనలవి కాదు. కానీ నేను ఇప్పుడు దాని గురించి
చెప్పకూడదు. అమ్మ మరణించిందన్న బాధ మా నాన్నగారు మరణించినప్పుడు నేను పొందిన బాధ కంటే ఎక్కువగా ఉంది. వార్త

నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా వరకు నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. కానీ ఈ తీవ్రమై దుఃఖాన్ని నాకు నేనుగా

బయలకు కనిపించనివ్వకుండా ఉండాలనుకోవడం కూడా నాకు గుర్తుంది. కన్నీళ్లు కూడా రాకుండా బలవంతంగా

ఆపేసుకున్నాను. ఇంత జరిగినా ఏమీ జరగనట్లు గా జీవితాన్ని సాగించదలిచాను.

డాక్టర్ మెహతా చాలా మంది స్నేహితులకు ఆయన నన్ను పరిచయం చేశారు, వారిలో ఆయన సోదరుడు శ్రీ రవిశంకర్ జగ్జీవన్.

ఆయనవల్లే అప్పుడు మాకు జీవితకాలం స్నేహ బంధం పెరిగింది. ఈ పరిచయంలో ప్రత్యేకించి చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు,
ఆయన కవి రాయచంద్ లేక రాజ్చంద్ర, డాక్టర్ మెహతా సోదరుడికి ఆయన అల్లు డు, మరియు రేవాశంకర్ జగ్జీవన్ పేరిట
నిర్వహిస్తు న్న బంగారు నగల సంస్థలో భాగస్వామి కూడా.

Page: 80 (Original Page No. 90)


అప్పుడు ఆయనకు 25 ఏళ్లకు మించి ఉండవు. కానీ ఆయనతో నా మొదటి పరిచయంలోనే ఆయన ఓ గొప్ప వ్యక్తిత్వమున్న వ్యక్తి,

ఆయన నుంచి ఎంతో నేర్చుకోదగ్గ వ్యక్తి అని గుర్తించారు. ఆయన శతావధానిగా కూడా తెలుసు (ఒక వ్యక్తి ఒకే సారి వంద మంది

ప్రుచ్చకలు అడిగే సమస్యలను పూరించి వాటిని చివరలో అన్నీ వరుసగా అప్పజెప్పే ప్రజ్ఞా ప్రక్రియ). ఆయన ప్రజ్ఞా పాఠవాల్లో కొన్ని

చూడమని డాక్టర్ మెహతా గారు కూడా నాకు సూచించారు.

నాకు తెలిసిన యూరోపియన్ పదాలన్నిటినీ ఆయన ముందు బయటపెట్టా ను, వాటిని మళ్లీ వల్లె వేయమని ఆ కవిని అడిగాను.

నేను ఎలా చెప్పానో అదే క్రమంలో ఆయన వాటిని తూచ తప్పకుండా నాకు అప్పజెప్పారు. ఆయన ప్రతిభ చూసి ఈర్శ్య పడ్డా ను.

అప్పటి వరకు నాకు ధారణ శక్తి పట్ల పెద్ద నాలో ఉన్న అపభ్రమలను ఈ సంఘటన తరువాత తొలగిపోయాయి. ఇదంతా

ఆయనకున్న అపారమైన శాస్త్ర పరిజ్ఞానం, నిష్కల్మషమైన వ్యక్తిత్వం, స్వీయ పరివర్తన కోసం తపించే గుణం వల్లే అనుకున్నాను. కానీ

ఆయన ఆ చివరి దానికోసమే జీవిస్తు న్నారని తరువాత తెలుసుకోగలిగాను.

ముక్తా నంద్ చెప్పిన ఈ నాలుగు వాఖ్యాలు ఆయన పెదాలపై ఎప్పుడూ నర్తించేవి, మరియ ఆయన హృదంలో నాటుకుని
పోయాయి:

ప్రతి రోజూ, నా ప్రతి పనిలోనూ

పరమాత్ముడు ప్రత్యక్షమైనప్పుడే
నా జన్మ ధన్యమైనట్లు భావిస్తా ను

నిశ్చయంగా అతడే

ముక్తా నందుడి జీవితానికి

ఆధార సూత్రం

రాయ్ఛాంద్భాయ్ వ్యాపార లావాదేవీలు లక్షల రూపాయల్లో జరుగుతుంటాయి. ముత్యాలు మరియు వజ్రాల గురించి ఆయను

అన్నీ బాగా లెతుసు. ఎలాంటి క్లిష్టమైన వ్యాపార సమస్యలైనా ఆయనకు లెక్కలేదు. కానీ ఆయన జీవితానికి సంబంధించి ఇలాంటి

అంశాలేవీ ముఖ్యమైనవి కావు. ఆయనకున్న ఒకే ఒక కోరిక భగవంతుడ్ని ప్రత్యక్షంగా చూడాలి. ఆయన టేబుల్పై ఆయన

వ్యాపరానికి సంబంధించిన పుస్తకాలతో పాటు మత గ్రంథాలు కొన్ని, ఆయన డైరీ ఉంటాయి. ఆయన వ్యాపారం ముగిసిన వెంటనే

ఆయన ఈ పుస్తకాలు లేదంటే డైరీని తెరచి చదువుతారు.

చాలా వరకు ప్రచురితమైన ఆ రచనలన్నీ కూడా ఈ డైరీ నుంచి రూపు దిద్దు కున్నవే. ఎంతో భారమైన వ్యాపార లావాదేవీలు
ముగియగానే ఆయన తన ఆత్మలో దాగిఉన్న అనేక విషయాలను స్పష్టంగా రాయడానికి ఉపక్రమిస్తా రు, ఒక వ్యాపారవేత్తగా
కాకుండా ఒక నిజమైన సత్యాభిలాషిలాగా రాస్తుంటారు. వ్యాపార కార్యకలాపాల మధ్యలో కూడా ఆయన దైవ చింతనలో

మునిగిపోవడం నేను ఒకసారి కాదు రెండు సార్లు చూశాను, అది కూడా చాలా తరచుగా. అందర్నీ సమానంగా చూడటంలో

ఆయన ఎవరినీ కూడా తక్కువ చేసి చూడటాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆయనకు బద్దు డై ఉండటానికి మా మధ్య ఎలాంటి

వ్యాపార సంబంధం లేకు మరే ఇతర స్వార్థపరమైన బంధంగానీ లేవు. అయినప్పటికీ ఆయనతో సన్నిహిత సంబంధాలను నేను

ఎంతో ఆస్వాదించాను. ఆ సమయంలో నేను పనిలేని బారిష్టరును. నేనెప్పుడైనా ఆయన్ను చూసినప్పుడు ఆయన నాతో మత

ప్రవృత్తి గురించి చాలా లోతుగా మాట్లా డేవారు. అప్పట్లో వీటిపైన నాకు అపనమ్మకం ఉండేది, వాటిపైన నాకు పెద్ద ఆసక్తి ఉండేది

కాదు. అయినప్పటికీ

Page: 81 (Original Page No. 91)


మతపరమైన చర్చలు జరుగుతుండేవి. అయినప్పటికీ ఆయన మాటలు మాత్రం నాలో చాలా ఆసక్తిగా ఉండేవి. అప్పటి నుంచి

నేను చాలా మంది ఆధ్మాత్మికవేత్తలను, ప్రబోధకులను కలిశాను. వివిధ విశ్వాసాల పెద్దలను కలవడానికి ప్రయత్నించేవాడ్ని, అయితే
ఎంతమందిని కలిసినా వారిలో ఎవరూ కూడా రాయ్చాంధ్భాయ్ ప్రభావితం చేసినట్లు గా వేరెవరూ చేయలేకపోయారనే విషయం
మీకు తప్పనిసరిగా చెప్పాలి. ఆయన మాటలు నా హృదయాంతరాళాల్లోకి చొచ్చుకుపోయేవి. వారి బుద్ధి కుశలత, విలువలకు

ఆయనిచ్చే ప్రాముఖ్యతల పట్ల నాకెంతో గౌరవం ఏర్పడింది. ఆయన నన్ను ఎన్నటికీ కూడా ఉద్దేశపూర్వకంగా దారి తప్పేలా

చేయరనే ప్రగాఢ విశ్వాసం నాకు కలిగింది. ఆయన తన అంతర్గత ఆలోచనలు కూడా నాతో పంచుకునేవారు. నేను ఎప్పుడు

ఆధ్మాత్మిక సంకట స్థితిలో పడినా ఆప్పుడల్లా ఆయన నాకు రక్షగా ఉండేవారు.


ఆయన పట్ల నాకు ఇంతటి ఉన్నతమైన భక్తి గౌరవ భావాలున్నప్పటికీ కూడా ఆయనకు నా గురువుగా హృదయ సింహాసనం
వేయలేకపోయాను. నా హృదయ సింహాసనం ఇప్పటికీ ఖాళీగానే ఉంది, దాన్ని ఆసీనులయ్యే వారికి నా శోధన కొనసాగుతూనే

ఉంది.

హైందవ గురువు పట్ల, ఆధ్మాత్మిక పరివర్తన కలిగించడంలో వారి ప్రాముఖ్యత పట్ల నాకు విశ్వాసముంది. గురు సాన్నిధ్యం లేనిదే

ఎలాంటి వారికైనా నిజమైన జ్ఞానం పొందడం అసంభవమని నేను అనుకుంటున్నాను. ప్రాపంచిక విషయాల బోధనలో గురువు

సరైనవారు కాకపోయినా ఫరవాలేదు కానీ, ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం అలా ఉండకూడదు. కేవలం ఒక పరిపూర్ణ జ్ఞాని*

మాత్రం గురు సింహాసనాన్ని అధిరోహించగలరు. ఆ పరిపూర్థత్వం కోసం అతడు నిరంతరం అలుపెరగని పోరాటం చేయాల్సిందే.

ఆ గురు స్థా నం కావాలనుకునే వారు ఎవరైనా అవిశ్రాంత పోరాటంచేసి పరిపూర్ణత సాధించినవారికి ఆ హక్కు ఉంటుంది. అది

అతడు స్వీయ ప్రతిభ. మిగిలినదంతా భగవంతుడి చేతుల్లో ఉంటుంది.

అలా, నేను రాయ్ ఛాంద్భాయ్కి గురువుగా నా హృదయ సింహాసనం వేయనప్పటికీ, ఎన్నో సందర్భాలు ఆయన నాకు
మార్గదర్శకులుగా, సహాయకులు ఎలా పనిచేశారో మనం చూడవచ్చు. నా జీవితంపై అమిత ప్రభావం చూపి, ఆకట్టు కున్న వ్యక్తు లు

ముగ్గురున్నారు: ప్రత్యక్ష సాంగత్యం ఉన్న రాయ్ఛాంద్ భాయ్; తన పుస్తకం ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ద్వారా టాల్స్టాయ్; అన్టు దిస్

లాస్ట్ అనే పుస్తకం ద్వారా రస్కిన్. వీరి గురించి తగిన సందర్భాల్లో మీకు తెలియజేస్తా ను.

2
జీవితాన్ని ఎలా ప్రారంభించానంటే
మా పెద్దన్నయ్యా నాపైన చాలా పెద్ద ఆశలు పెట్టకున్నారు. అందులో నా ద్వారా సంపద, కీర్తి ప్రతిష్టలు వస్తా యనే ఆశలు కూడా

ఉన్నాయి. ఆయనది విశాల హృదయం, తప్పులను క్షమించే దయాగుణం. ఇవన్నీ ఆయన నిరాడంభరత్వంతో కలగలసి ఉంటాయి.

Page: 82 (Original Page No. 92)


వీటివల్ల ఆయనకు చాలా మంది మిత్రు లుండేంవారు. వారి ద్వారా నాకు వాదించడానికి కేసులు తెప్పించాలని అనుకునేవారు.

దాంతో పాటు లాయర్గా నా ప్రాక్టీసు బాగుంటుందని అనుకునేవారు, ఆ అంచనాలతోనే, ఇంటి ఖర్చులను బాగా పెంచేశారు. నా

ప్రాక్టీసుకు కావాల్సిన ఏర్పాట్లలో దేన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు.


నా విదేశీ యాత్రప్పుడు రేగిన నా కులం సంఘర్షణ తుఫాను ఇంకా రగులుతూనే ఉంది. నేను వచ్చిన తరువాత నా కులం వాళ్లు

రెండు వర్గాలుగా విడిపోయారు. అందులో ఒక వర్గం వారు వెంటనే నన్ను తమలో కలుపుకొన్నారు, కానీ మరో వర్గ మాత్రం నన్ను

కుల బహిష్కరణ చేశారు. అయితే వారిని కూడా శాంతింపజేయడం కోసం మా అన్నయ్య నన్ను రాజ్కోట్కు వెళ్లడానికి ముందే

నాసిక్కు తీసుకెళ్లి, అక్కడ నదిలో పవిత్ర స్నానం చేయించారు. రాజ్కోట్కు వచ్చాక, కులం వారికి విందు ఏర్పాటు చేశారు. నాకు

ఇవేమీ నచ్చలేదు. కానీ మా అన్నయ్య ప్రేమ నన్ను కట్టిపడేసింది, ఆయన పట్ల నాకున్న ఆరాధానా భావం మిన్నకుండిపోయేలా

చేసింది. దాంతో ఆయన చెప్పినట్లు , ఆయన మాటే శాసనంలాగా ఏదో యాంత్రికంగా చేశాను. నన్ను కులంలో మళ్లీ

చేర్చుకోవాలనుకున్న వివాదానికి దానితో ముగింపు పడింది.

నన్ను కులం నుంచి వెలి వేసిన వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి నేనెప్పుడూ ప్రతయ్నించలేదు. ఆ వర్గానికి చెందిన ఏ కుల పెద్దల పట్ల

నేను ఈర్శ్యా ద్వేషాలు పెంచుకోలేదు. వారిలో కొంతమంది నన్ను ఇష్టపడేవారు కారు, కానీ వారి మనోభావాలను దెబ్బతీయకుండా

నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడ్ని. నన్ను కుల బహిష్కారం చేసినప్పుడు విధించి కొన్ని నిబంధనలను నేను గౌరవించేవాడ్ని.
వాటి ప్రకారం, నా బంధువుల్లో ఎవరూ కూడా, చివరకు మా మామయ్య, అత్తయ్య, చివరకు మా సోదరి, బావగారు నన్ను దగ్గరకు
తీసుకోకూడదు. నాకు భోజనం పెట్టరాదు. దాంతో నేను వారి ఇళ్లలో కనీసం మంచినీళ్లు కూడా తాగేవాడ్ని కాను. అయితే ఈ

నిషేదాజ్ఞలను రహస్యంగా ఉల్లంఘించడానికి వారు ఏర్పాట్లు చేసేవారు. కానీ నేను బహిరంగంగా చేయలేని పనిని ఇలా రహస్యంగా

చేయడానికి ఎంతమాత్రం అంగీకరించేవాడ్ని కాను.

జాగురతతో కూడిన నా ప్రవర్తనా ఫలితంగా ఏ సందర్భంలోనూ నా కులం వాళ్లు నాకు ఇబ్బందులు కలిగించలేదు; నేడు, నేను
పొందిందీ ఏమీ లేదు, నన్ను వెలివేసిన సర్వసభ్య సమావేశం వర్గానికి చెందిన వారి అనురాగం, ఆప్యాయతలు తప్ప, వారిలో ఇప్పటికీ
నన్ను వెలిపడ్డవాడిగానే పరిగణించేవారూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నేను నా కులానికి ఏదో చేస్తా నని వారు ఏమీ

ఆశించకుండానే వారు నా పనిలో భాగా సాయపడ్డా రు.

ఇవన్నీ కూడా కేవలం నా సహనం వల్లనే సాధ్యమయ్యాయని నేను భావిస్తు న్నాను. ఒకవేళ నేనుగనుక నన్ను కులంలో చేర్చుకోవాలని
ఆందోళన చేసినా, లేకా మరిన్ని గ్రూపులుగా విభజించడానికి నేను ప్రయత్నించినా, ఒక వేళ నా కులం వాళ్లను రెచ్చగొట్టినా వాళ్లు
నాపైన దాడికి పాల్పడేవారు. ఇంగ్లండ్ నుంచి వచ్చాక నేను ఈ తుఫాన్ను చల్లా ర్చకపోతే మళ్లీ నేను ఈ ఆందోళన సుడిగుండంలో

పడిపోతానని అనుకున్నాను, అలా నటించాను.

నా భార్యతో నా సంబంధాలు అప్పటికీ కూడా నేను ఆశించినంతగా లేవు. ఇంగ్లండ్లో ఉన్నప్పటికీ కూడా ఆమె పట్ల నా అసూయ
తగ్గలేదు ప్రతి చిన్న విషయంలోనూ చీటికి మాటికి ఆమెను అసహ్యించుకోవడం, ఆమెను అనుమానించడం మాత్రం నేను
మానలేదు.
Page: 83 (Original Page No. 93)
అందువల్ల నాకు ఇష్టమైన కోరికలన్నీ అలాగే ఉండిపోయాయి. నేనేమనుకున్నానంటే నా భార్య తప్పకుండా చదవడం, రాయడం

నేర్చుకోవాలి, ఆమెకు చదువుల్లో నేను సాయపడాలని అనుకున్నాను. కానీ నా కామోద్రేకం అందుకు అడ్డు వచ్చింది, ఆమె నా

ప్రవర్తనతో ఇబ్బందులు పడింది. ఒకసారి ఎంత వరకు వెళ్లా నంటే ఆమెను ఏకంగా వాళ్ల పుట్టింటికి పంపించేసేంతవరకు, అమెను

అష్ట కష్టా లు పెట్టిన తరువాతే నేను మళ్లీ ఆమెను నా వద్దకు తీసుకువచ్చాను. కొంతకాలానికి తప్పంతా నాదేనని గ్రహించాను.

మా ఇంట్లో ఉన్న పిల్లలకు విద్యాబుద్దు లు నేర్పించాలని కంకణం కట్టు కున్నాను. మా పెద్దన్నయ్య పిల్లలు, నా కుమారుడు, నేను

ఇంగ్లండ్కు వెళుతున్నప్పుడు వాడ్ని ఇంట్లో విడిచివెళ్లా ను, ఇప్పడు వాడికి నాలుగేళ్లు . నేను వాళ్లకు చిన్న చిన్న వ్యాయామక

కసరత్తు లు నేర్పించి వారిని దారుడ్యంగా మార్చి, వారికి ఉపయోగపడేలా నా సొంత సలహాలు ఇవ్వాలని అనుకున్నాను. దీనికి మా

అన్నయ్య మద్దతు కూడా ఉంది, దాంతో నా ప్రయత్నాల్లో నేను ఎంతో కొంత సఫలీకృతుడయ్యాను. చిన్నపిల్లలతో గడపడం అంటే

నాకు చాలా ఇష్టం. వారిలో ఆటలు ఆడుకోవడం, జోకులు వేసి నవ్వించడం అనే అలవాటు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నాలో

ఉంది. పిల్లలకు నేను ఓ మంచి ఉపాధ్యాయుడ్ని అని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను.

ఇక ఆహారంలోనూ మార్పులు అవసరమని భావించాను. టీ, కాపీ అనేవి అప్పటికే మా ఇంట్లో ఉన్నాయి. నేను వచ్చే సరికి ఇంట్లో

కాస్తంతా ఇంగ్లీసు వాతావరణం ఉండేలా చూసుకోవడం అవసరమని మా అన్నయ్య భావించారు. చివరికి ఏమైందంటే ఎప్పుడో

ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉంచిన పింగాణి పాత్రలు, ఇతరత్రా వస్తు వుల ఉపయోగం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దీనిక

నా సంస్కరణలు కొంత ముగింపు ఇచ్చాయి. ఇంట్లో టీ, కాఫీల స్థా నంలో నేను అటుకుల గంజీ, కోకా లను ప్రవేశపెట్టా ను.

అయితే నిజం చెప్పాలంటే అది టీ, కాఫీలకు కాస్త అదనంగా మారిపోయాయి. బూట్లు , షూలు అప్పటికే ఉన్నాయి. ఇక నేను

యూరోపియన్ దుస్తు లు ధరించడం ద్వారా మా ఇంటికి ఐరోపా వాసనలు అద్దడం పూర్తి చేశాను.

అలా ఖర్చులు పెరిగిపోతున్నాయి, రోజై ఏదో ఒక కొత్త వస్తు వు వచ్చి చేరుతోంది. ఇంట్లో తెల్ల ఏనుగును మేపుతున్న చందాన పరిస్థితి

తయారైంది. కానీ దానికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తేవడం? రాజ్కోట్లో ప్రాక్టీసు ప్రారంభించడమంటే తప్పకుండా

నవ్వులపాలు కావడమే. సరైన వకీలుకుండాల్సిన పరిజ్ఞానం నాకు అంతంతమాత్రమే, కానీ ఫీజు మాత్రం పదింతలు కావాలని

కోరుకుంటున్నాను! నన్ను వకీలుగా పెట్టు కోవడానికి కక్షిదారులెవరూ మూర్కులు కారు. పోనీ అలాంటివాడెవడైనా వచ్చినా, నా

అజ్ఞానానికి తోడు నా అహంకారం, మోసం అనేవి అదనంగా వచ్చి చేరుతాయి. ఇవన్నీ నెత్తిన వేసుకుని నేను ప్రపంచానికి మరింత
భారమవ్వాలా?
కొంతమంది మిత్రు లు నన్ను బొంబాయికి వెళ్లమని సలహా ఇచ్చారు. అక్కడ హై కోర్టు లో అనుభవం సంపాదించి, భారతీయ

న్యాయం అధ్యయనం చేసి, వ్యాజ్యాలతో కొంత కాలం గడిపితే బాగుంటుందనేది వారి సూచన. వారి సలహాను పాటించి నేను

బొంబాయికి వెళ్లా ను.

బొంబాయిలో నేను ఇల్లు తీసుకున్నాను, నాకోసం ఒక వంటవాడ్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆయన బ్రాహ్మణుడు. నేను ఆయన్ను

ఎప్పుడూ ఒక నౌకరుగా కాకుండా ఇంట్లో మనిషిగా వ్యవహరించాను.

Page: 84 (Original Page No. 94)


ఆయన స్నానం చేసేటప్పుడు కేవలం ఒంటిపైన నీళ్లు పోసుకుంటారు కానీ రుద్దు కోరు. ఆయన పంచ, ఆయన అగ్నిహోత్రం కూడా

మురికిగా ఉంటాయి. ఆయనకు ఆధ్యాత్మిక గ్రంథాల గురించి ఏమాత్రం తెలీదు. నాకు ఇంతకంటే మంచి వంట మనిషి ఎక్కడ
దొరుకుతారు?

‘రవిశంకర్,’ (అది ఆయన పేరు), అని పిలిచి అతడ్ని అడిగాను. ‘నీకు వంట చేయడం తెలియకపోవచ్చు కానీ మీకు సం వందన

పూజలు (నిత్య పూజలు), తదితరాలు తప్పకుండా తెలిసి ఉండాలి కదా.’ అన్నాను.

‘సంధ్యావందనమా, సార్! నాగలే మాకు సంధ్య, చేతిలో పార మా నిత్య పూజ. నేను ఆ తరహా బ్రాహ్మణుడిని. ఇక్కడ నేను మీ

దయతో జీవిస్తు న్నాను. కాదంటారా వ్యవసాయం నాకోసం ఎలాగూ ఉంది.’ అన్నారు.

నేను రవిశంకర్కు గురువులా మారాను. నాకు తగినంత సమయం ఉంది. సగం వంట నేనే చేయడం ప్రారంభించాను. శాఖాహార

వంటకాల్లో ఆంగ్లేయిల వంటకాల ప్రయోగాలను కూడా పరిచయం చేశాను. నేను ఒక పొయ్యి ఏర్పాటు చేస్తే, వంట శాలను

రవిశంకర్ నిర్వహించేవారు. నేను ఎవరితోనైనా కలిసి భోజనం చేయడానికి ఇబ్బంది లేదు, అలాగే రవిశంకర్కు కూడా. అలా

మేమిద్దరం కలిసి భోజనం చేసేవాళ్లం. కాకంటే అక్కడ ఒక చిన్న అవరోధం ఉండేది అదేంటంటే రవిశంకర్ అలాగే మురికిగా

ఉండేవారు, ఆహారాన్ని కూడా శుభ్రంగా ఉంచేరవారు కారు!

కానీ నాకు బొంబాయిలో నాలుగు లేదా అయిదు నెలలకు మించి ఉండటం కష్టసాధ్యంగా మారింది. పెరుగుతున్న నా ఖర్చులను

తట్టు కోవడానికి సరిపడా నాకు అక్కడ ఆదాయం లేదు.


ఇదిగో ఇలా నేను జీవితా్ని ప్రారంభించాను. బారిస్టర్ వృత్తి మంచి వృత్తి కాదని అనుకున్నాను - ఇది పైన పటారం, లోన లొటారం

లాంటిది. ఇక కిం కర్తవ్యం అంటూ మధనపడిపోసాగాను.

3
మొదటి కేసు
బొంబాయిలో నేను, ఒక వైపు భారతీయ న్యాయ శాస్త్ర అధ్యయనం చేస్తూనే మరోవైపు వంటలో ప్రయోగాలు చేస్తూ ఉన్నాను.

వీర్ఛాంద్ గాంధీ అనే మిత్రు డు ఒకరు నాతో కలిశారు. ఆయన మా అన్న మిత్రు డు కూడా. నాకు కేసులు పట్టు కొస్తా డని మా

అన్నయ్య ఏర్పాటు చేసిన మనిషి. ఇండియన్ లా గురించి చదవడం చాలా విసుగెత్తిస్తోంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ I అయితే నా వల్ల

అయ్యేపనికాదు. అంత కాదు కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కొంత ఫరవాలేదు. వీర్ ఛాంద్ గాంధీ సొలిసిటర్ పరీక్షల కోసం

చదువుతున్నాడు. ఆయన నాకు బారిస్టర్లు , వకీళ్ల గురించిన అన్ని రకాల కథలు చెబుతున్నారు. ‘సర్ ఫిరోజ్షా సామర్థ్యం,’ గురించి
అతడు చెబుతూ, ‘ఆయనకున్న న్యాయశాస్త్రా నికి సంబంధించి ఆయనకున్న అపార జ్ఞానమంతా,

Page: 85 (Original Page No. 95)

ఆయనకు ఎవిడెన్స్ యాక్ట్ మనసులో నిక్షిప్తమై ఉండటంపైనే ఉంది. 32 వ సెక్షన్లోని కేసులన్నిటి గురించి యానకు తెలుసు. బద్రు ద్దీన్

త్యాబ్జీకి ఉన్న శక్తిమంతమైన వాదనా పటిమ న్యాయమూర్తిని సైతం మంత్రముగ్దు డ్ని చేస్తుంది.’

ఇలాంటి మహామహుల కథలన్నీ వింటుంటే నేను మరింత నీరసపడ్డా ను.

‘ఇదేమీ అసాధారణమేమీ కాదు,’ అని అతడు మరికొంత చెబుతూ, ‘కొత్తగా వచ్చిన బారిస్టర్ అయిదు నుంచి ఏడేళ్ల పాటు ఎదురు
చూడక తప్పదు. ఆ కారణంగానే నేను సొలిసిటర్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నాను. నువ్వు గనుక మూడేళ్లలోపు ఆర్జించగలిగితే

నువ్వు అదృష్టవంతుడివే.’ అన్నారు.

ప్రతి నెలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంటి బయట బారిస్టర్ అంటూ బోర్డు తగిలించాను, కానీ నేను ఇప్పటికీ బారిష్టర్ వృత్తికి

సన్నద్ధం కాలేదని నా అంతరాత్మ చెబుతోంది, దానికి నేను ఏమాత్రం సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. ఫలితంగా నా చవుకోసం
సరైన ధ్యాస చూపలేకపోతున్నాను. ఎవిడెన్స్ యాక్ట్ గురించి కొంత ఇష్టం పెంచుకున్నాను, మయన్స్ హిందూ లా గురంచి చాలా

ఆసక్తితో చదివాను. అయినప్పటికీ నేను ఒక కేసు చేపట్టడానికి మాత్రం ధైర్యం చాలడం లేదు. నా పరిస్థితిని మాటల్లో చెప్పలేనిది,

ఇది ఎలా ఉందంటే కొత్త పెళ్లి కూతురు మొదటి సారి అత్తా రింటికి వచ్చినట్లు గా ఉంది!

సరిగ్గా ఈ సమయంలో, మామిభాయ్ కేసు ఒకటి చేపట్టా ను. అది ‘చిన్న కారణాలతో కూడుకున్నది’, ‘ఈ కేసు తెచ్చినందకు

దళారీకి కొంత కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది,’ అని నాకు చెప్పారు. నేను దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు.

‘కానీ చివరకు గొప్ప గొప్ప క్రిమినల్ లాయర్లు కూడా నెలకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల కమిషన్ చెల్లిస్తా రు!’

‘ఆయన్ను అనుసరించాల్సిన అవసరం నాకు లేదు,’ అని చెప్పాను. ‘నాకు నెలకు రూ.300 చాలు. మా నాన్నగారు అంతకంటే

ఎక్కువ తీసుకోలేదు.’

‘కానీ ఆ రోజులు వెళ్లిపోయాయి. బొంబాయిలో ఖర్చులన్నీ చాలా భయంకరంగా పెరిగిపోయాయి. నువ్వు వ్యాపార దృక్పథంతో

ఉండాలి.’

కానీ నేను మొండివాడ్ని. నేను ఎలాంటి కమిషన్ ఇవ్వలేదు. కానీ మామిభాయ్ కేసు నేను స్వీకరించాను. అది చాలా సులభమైన

కేసు. కేవలం రూ.30 ల ఫీజు మాత్రమే వసూలు చేశాను. ఆ కేసు కేవలం ఒక రోజులోపే ముగిసిపోయింది.

స్మాల్ కాజెస్ కోర్టు లో నేను రంగ ప్రవేశం చేయడం ఇదే మొదటిసారి. నేను ప్రతివాది తరఫున హాజరయ్యాను, అలా కక్షిదారుడి

సాక్షాలను ప్రశ్నించాలి. కోర్టు లో లేచి నిలుచున్నాను, కానీ గుండె దడదడలాడిపోతోంది. తల తిరిగినట్లు గా అనిపించింది. కోర్టు లో

నిలబడటం కష్టంగా అనిపిస్తోంది. కక్షిదారుడి సాక్షులను ప్రశ్నించడానికి నోరు పెగలడం లేదు. న్యాయమూర్తి నవ్వుతున్నారు, ఇక

కోర్టు లో మిగిలిన న్యాయవాదుల సంగతి చెప్పక్కర్లేదు. కానీ నేను ఇవేమీ చూడటం లేదు. నేను అలా కూర్చొండిపోయాను, నేను

ఈ కేసును వాదించలేనని దళారీకి చెప్పేశాను. నా బదులు పటేల్ను వకీలుగా పెట్టు కుంటే బాగుంటుందనిపించి నేను అతడికి ఫీజు

వెనక్కి ఇచ్చేశాను. దాంతో రూ.51 ల ఫీజుతో ఈ కేసును పటేల్ చేపట్టా రు. ఆయనకు ఈ కేసు చిన్నపిల్లల ఆట లాంటిది.

Page: 86 (Original Page No. 96)


నేను కోర్టు నుంచి వడివడిగా బయటకు వచ్చేశాను, కనీసం నా క్లైంట్ ఈ కేసు గెలిచారో, ఓడిపోయారో కూడా తెలుసుకోకుండా
వచ్చేశాను. కానీ దీన్ని చూసి నాకు నేనే అవమానభారంతో కుంగిపోయాను. ఒక కేసు చేపట్టడానికి నాకు ధైర్యం వచ్చేంత వరకు

మళ్లీ ఎలాంటి కేసు చేపట్ల కూడదని నిర్ణయించుకున్నాను. ఆ కారణంగా నేను దక్షిణాఫ్రికాకు వెళ్లేంత వరకు మళ్లీ కోర్టు గుమ్మం

తొక్కలేదు. నా ఈ నిర్ణయం సరైంది కాదు. కానీ ఆ నిర్ణయం తీసుకోక తప్పనిపరిస్థితి. నాకు అక్కడ కేసులు అప్పగించేందుకు

మూర్కులెవరూ లేరు, కేసు ఓడిపోవాలి అనుకునేవారు తప్ప!

కానీ బొంబాయిలో ఉండగానే మరో కేసు నా కోసం సిద్ధంగా ఉంది. దాని కేవలం అర్జీ మాత్రమే రాస్తే సరిపోతుంది. పోరుబందర్లో ఒక

పేద ముస్లిం భూమిని జప్తు చేసుకున్నారు. ఆయన నన్ను ఒక గొప్ప తండ్రిగారికి తనయుడైన గొప్ప వ్యక్తిగా భావించి నా వద్దకు

వచ్చారు. ఆయన కేసు చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ నేను ఆయనకు కావాల్సిన అర్జీ రాయడానికి ఒప్పుకొన్నాను.

దాన్ని అచ్చువేసుకునే ఖర్చు ఆయనే భరించుకోవాలి. ఆ అర్జీని రాసి నా మిత్రు లకు చదివి వినిపించాను. వారంతా బాగుందని

మెచ్చుకున్నారు. వారి మాటలు నాకు కాస్తంత స్థైర్యం పెంపొందించాయి, నేను అర్జీలు రాయడానికి పనికొస్తా ననే నమ్మకం

కలిగించింది, అది వాస్తవం కూడా.

నేను ఎలాంటి ఫీజు తీసుకోకుండా అర్జీలు రాసే వృత్తి చేపట్టి ఉంటే అది బ్రహ్మాండంగా జరిగేది. రోట్లో రుబ్బడానికి కావాల్సిన

గింజలను అవి తీసుకురాలేదు కదా. దాంతో నేను ఉపాధ్యాయ వృత్తి స్వీకరిద్దా మని అనుకున్నాను. నాకు ఆంగ్లంలో చాలా మంచి

పరిజ్ఞానముంది. ఏదో కొన్ని పాఠశాలలో మెట్రిక్యులేషన్ విద్యార్థు లకు ఆంగ్ల పాఠాలు బోధిస్తే, అది నాకు కూడా చాలా సంతోషం

కలిగిస్తుంది. ఆ విధంగానైనా ఇంటి ఖర్చలు కొంతైన భరించగలుగుతాను. అదే సమయంలో నేను పత్రికల్లో ఒక ప్రకటన

చూశాను: ‘కావలెను, రోజూ ఒక గంట ఆంగ్లం బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు కావలెను. జీతం రూ.75.’ ఆ ప్రకటన వచ్చింది

ఒక ప్రముఖ పాఠశాల నుంచింది. నేను ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం వారు ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. నేను చాలా
ఆశలతో అక్కడికి వెళ్లా ను, కానీ ఆ పాఠశాల ప్రధానోప్యాధ్యాయులు నాకు డిగ్రీ పట్టా లేదని ఏమాత్రం కనికరం లేకుండా నన్న
తిరస్కరించారు.

‘కానీ నేను లండన్ మెట్రిక్యులేషన్, లాటిన్ రెండో భాషగా ఉత్తీర్ణుడయ్యాను.’

‘నిజమే, కానీ మాకు డిగ్రీ చదివిన వారు కావాలి.’

నేను ఏమీ చేయలేకపోయాను. తీవ్ర నిరాశతో నా చేతులను పిసుక్కున్నాను. మా అన్నయ్య కూడా చాలా ఆందోళన చెందారు. ఇక

బొంబాయిలో ఉండటం వల్ల ఏమాత్రం లాభం లేదని చివరకు మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. నేన రాజ్కోట్లోనే స్థిరపడాలి,

అక్కడ మా సోదరుడు కూడా ఒక చిన్న వకీలు, అక్కడ ఆయన నాకు దరఖాస్తు లు, ఆర్జీలు రాసే పని చూపించగలరు. పైగా అక్కడ
నా సంసారం ఉంది, బొంబాయిలో సంసారం ఎత్తేసి వెళ్లిపోవడం వల్ల డబ్బు ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ సలహా నాకు

నచ్చింది. దాంతో బొంబాయిలో ఆరు నెలలపాటు సాగిన నా స్వల్పకాలిక మకాం ముగిసిపోయింది.

బొంబాయిలో ఉన్నప్పుడు రోజూ హై కోర్టు కు హాజరయ్యేవాడ్ని, కానీ అక్కడ నేను నేర్చుకన్నది ఏమీ లేదు. అక్కడ పెద్దగా

నేర్చుకోవడానికి తగినంత జ్ఞానం కూడా నాకు లేదు.

Page: 87 (Original Page No. 97)

అక్కడ నడిచే వ్యాజ్యాలు కూడా పెద్దగా అర్తమయ్యేవికావు, నిద్ర వచ్చేది కూడా. ఊరట కలిగించేది ఏమిటంటే అక్కడ నాలాగా

నిద్రపోయే వకీళ్లు మరికొంతమంది ఉండటం, దాంతో నేను నిద్రపోతున్నానని అవమానభారం కొంత తగ్గింది. మరికొంత కాలం

పోయిన తరువాత ఈ అవమానానికి కూడా విడిచేశాను. హై కోర్టు లో ఇలా నిద్రపోవడం ఒక దర్జా అనుకోవడం మొదలుపెట్టా ను.

బొంబాయిలో ప్రస్తు త తరం వకీళ్లు కూడా ఒక వేళ వారికి గనుకు కేసులు లేకపోతే నేను చేసినట్లు గా ఇలాగే చేస్తు న్నారేమో. అక్కడ

నేనున్నట్లయితే వారికి వాస్తవిక జీవిన సూత్రాలు చెప్పేవాడ్ని. నేను గిర్గావ్ంలో నివిసిస్తు న్నప్పటికీ కూడా ఎప్పుడూ ట్యాక్సీలు కానీ

ట్రామ్కార్ కానీ ఎక్కలేదు. హై కోర్టు కు ఎప్పుడూ నడిచేర వెళ్లేవాడ్ని.

కోర్టు కు నడిచి వెళ్లడానికి 45 నిమిషాలు పట్టేది, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కూడా కాలినడకనే వచ్చేవాడ్ని. సూర్యుడి ప్రతాపానికి

ఇబ్బంది పడేవాడ్ని. ఇలా ఇంటి నుంచి కోర్టు కు కోర్టు నుంచి ఇంటికి నడిచి వెళ్లడం వల్ల చాలా వరకు డబ్బు ఆదా అయ్యేది.

బొంబాయిలో చాలా మంది నా మిత్రు లు అనారోగ్యం బారిన పడేవారు, కానీ నేను కనీసం ఒక్కసారి కూడా అస్వస్థతకు గురి కాలేదు.

చివరకు నేను సంపాదించడం మొదలు పెట్టా క కూడా నేను కార్యాలయానికి నడిచి వెళ్లే అలవాటను మాత్రం మానుకోలేదు. దాని

ఫలాలను నేను ఇప్పటికీ కూడా అస్వాధిస్తు న్నాను.

4
మొదటి ఎదురు దెబ్బ
నిరాశచెంది, నేను బొంబాయి విడిచిపెట్టి రాజ్కోట్కు వెళ్లిపోయాను. అక్కడ నా సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాను.

ఇక్కడ నాకు కొంత ఫరవాలేదు. ధరఖాస్తు లు రాయడం, అర్జీలు రాసే పనులు వస్తు న్నాయి. నెలకు సగటున రూ.300

ఆర్జిస్తు న్నాను. దీనికి నేను నా ప్రతిభ కంటే మా అన్నయ్య పలుకుబడికే ధన్యవాదాలు చెప్పుకోవాలి. మా అన్నయ్య, అక్కడ తన

భాగస్వామితో కలిసి ప్రాక్టీసులో స్థిరపడ్డా రు. అక్కడ అన్ని ధరఖాస్తు లు, అవసరమైనవీ, ముఖ్యమైనవి, తాన మనసుకు తట్టినవి

అన్నీ కూడా పెద్దపెద్ద బారిష్టర్లకు పంపేవారు. ఆయన వద్దకు వచ్చే పేద క్లైంట్లకు మాత్రం నేను దరఖాస్తు లు రాసే పనిలో పడ్డా ను.

ఇక్కడ మాత్రం ఒక విషయం ఒప్పుకొని తీరాలి, నేను ఎవరికీ కమిషన్ ఇవ్వకూడదని పెట్టు కున్న కట్టు బాటు, ఏదైతే నేను
బొంబాయిలో కచ్చితంగా పాటించానో దాన్ని ఇక్కడ పాటించలేదు. ఎందకంటే ఈ రెండు చోట్ల పరిస్థితులు వేర్వేరు అని నాకు
చెప్పారు; బొంబాయిలో అయితే కమిషన్ మధ్య దళారులకు చెల్లించాలి, కానీ ఇక్కడ నేరుగా వకీళ్లకే సొమ్ము చెల్లించాలి;
బొంబాయిలో లాగానే బారిష్టర్లందరూ ఎలాంటి మినహాయింపులు లేకుండా తమకొచ్చే ఫీజులో కొంత శాతం కమిషన్గా వకీళ్లకు
చెల్లించాల్సి ఉంటుంది. మా అన్నయ్య నాతో చెసిన వాదనకు నాకు సమాధానం లేకుండా చేసింది. ‘ఇలా చూడు నువ్వు ’, అని

ఆయన చెబుతూ ‘నేను ఇంకో వకీలుతో కలిసిన భాగస్వామిని. నేను ఎల్లప్పుడూ నీకు నీవు చేయగలిగిన కేసులు నీకు వచ్చేలా

చేయగలను.

Page: 88 (Original Page No. 98)

ఒక వేళ నువ్వు గనుక నా భాగస్వామికి కమిషన్ చెల్లించడానికి నిరాకరించావనుకో, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినట్లే. అదే నువ్వు,

నేను కలిసి ప్రాక్టీస్ ఏర్పాటు చేశామనుకో, అప్పుడు ఫీజు నీ జేబులోకే వస్తుంది, అప్పుడు నేను దానంతట నా వాటా పొందుతాను.
కానీ నా భాగస్వామి సంగతి ఎలా చెప్పు? ఒక వేళ అతను ఇదే కేసును ఇంకో బారిష్టర్కు ఇచ్చాడనుకో, అప్పుడు తప్పకుండా అతను
ఆయన అతడి నుంచి తన కమిషన్ పొందుతాడు కదా.’

ఈ అభ్యర్థనను నేను స్వీకరించాను, నేను గనుక బారిస్టర్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే, ఇలాంటి కేసుల్లో కమిషన్కు సంబంధించి నా
సిద్ధాంతాలపై పట్టు బట్టకూడదు అని అనుకున్నాను. అలా నాకు నేను సర్ది చెప్పుకున్నానేగానీ, అది కూడా ఆత్మవంచనే. ఇంకాస్త

చెప్పాలంటే, ఏమైనప్పటికీ, తరువాత నేను ఏ ఇతర కేసుకు కూడా ఇలా కమిషన్ ఇచ్చినట్లు నాకు గుర్తు లేదు.

అలా నా జీవితం సాఫీగా సాగిపోయేలా ప్రారంభమైంది, సరిగ్గా అప్పుడే నాకు జీవితంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి వరకు

నేను బ్రిటిష్ అధికారి ఎలా ఉంటారో విన్నదే కానీ, ఎప్పుడూ ప్రత్యక్షంగా ఒకరికొకరు తారసపడింది లేదు.
పోరుబందర్ సంస్థా నాదీశులు దివంగత రాణాసాహేబ్కు ఆయన సింహాసనం (గడి*) అధిరోహించక ముందు ఆయనకు మా
అన్నయ్య కార్యదర్శిగా, సలహాదారుగా వ్యవహరించేవారు, అయితే ఆ సమయంలో ఆయనకు మా అన్నయ్య తప్పుడు సలహాలు
ఇచ్చారనే అభియోగాలు మా అన్నయ్య తలపై వేలాడుతున్నాయి. ఈ వ్యవహారం మా అన్నయ్య అంటే గిట్టని రాజకీయ ఏజెంటు

వరకు వెళ్లింది. ఆ అధికారి నాకు ఇంగ్లండ్లో ఉండగా పరిచయం. ఆయన నాతో చాలా స్నేహంగానూ ఉండేవారు. నా ఈ స్నేహాన్ని

ఉపయోగించుకుని ఆయన తరఫున నా మిత్రు డితో నా గురించి మంచిగా మాట్లా డాలని కోరారు. తన పట్ల ఉన్న అభియోగాలను

కొట్టేసి, తనపట్ల ఆయనకున్న పక్షపాతం రూపుమాపేలా ప్రయత్నించాలని కోరారు. కానీ నాకు ఈ ఆలోచన నచ్చలేదు. ఇంగ్లండ్లో

ఆయనతో నాకున్న పరిచయాన్ని ఇలా దుర్వినియోగం చేయడం మంచిది కాదని నాకు అనిపించింది. ఒక వేళ మా అన్నయ్య
నిజంగానే తప్పు చేసిఉంటే, నా సిఫారసువల్ల జరిగే ప్రయోజనం ఏమిటీ? ఒక వేళ ఆయన అమాయకుడైతే, తప్పకుండా దావా వేసి ,
తన నిజాయతీపై నమ్మకంతో, వచ్చే ఫలితాన్ని ఎదుర్కోవాలి. నా సలహా మా అన్నయ్యకు నచ్చలేదు. ‘కతివాడ్ గురించి నీకేమీ

తెలీదు,’ అని అన్నారు. నువ్వు ఇంకా లోకం గురించి తెలుసుకోవాల్సింది ఉంది. ఇక్కడ కేవలం పలుకుబడే పనిచేస్తుంది. ఒక

తమ్ముడిగా ఇది నీకు తగదు, నువ్వు నా గురించి ఆ అధికారికి ఒక మంచి మాట చెప్పిరావడం తమ్ముడిగా నీ ధర్మం.’ అన్నారు.

నేను ఆయన అభ్యర్థనను కాదనలేకపోయాను. నా అబీష్టా నికి వ్యతిరేకంగానే ఆ అధికారి దగ్గరకు వెళ్లా ను. నేను ఆయన్ను

కలవడానికి ఎలాంటి హక్కులేదనే తెలుసు. నేను నా ఆత్మగౌరవంతో రాజీపడ్డా నని నాకు బాగా స్పృహలో ఉంది. కానీ ఆయన్ను

కలవడానికి సమయం కోరి, అనుమతి తీసుకున్నాను. నేను ఆయనకు పాత స్నేహం గురించి గుర్తు చేశాను. కానీ ఈ కథియావాడ్
ఇంగ్లండ్లో నేను చూసిన అధికారి వేరు అని వెంటనే గ్రహించాను; ఆ అధికారి సెలవులో వెళ్లా డు, ఇక్కడ విధుల్లో ఉన్న అధికారి అతడు
కాదు. అయినప్పటికీ ఆ పొలిటికల్ ఏజెంట్ మా స్నేహాన్ని అంగీకరించారు.

Page: 89 (Original Page No. 99)

కానీ మా అన్నయ్య గురించి గుర్తు చేయగానే ఆయన గంభీరంగా మారిపోయారు. ‘ఆ పరిచయాన్ని దుర్వినియోగం చేయడానికి

నువ్వు ఇక్కడికి రాకూడదు, అంతే కదా?’ అన్న భావం ఆయన ముఖ కవళికల్లోనూ, కనుబొమ్మల్లోనూ కనిపించింది. అవేమీ

పట్టించుకోకుండా నేను వచ్చిన కేసు గురించి చెప్పడం మొదలుపెట్టా ను, అసహనంతో ఉన్న ఆ అధికారి. ‘మీ అన్నయ్య ఒక

కుట్రదారుడు. దాని గురించి నేను నీ నుంచి ఇంకేమీ వినదలచుకోలేదు. నాకు అంత సమయం లేదు. ఒక వేళ మీ అన్నయ్య

ఏమైనా చెప్పదలచుకుంటే, అతడ్ని పద్దతి ప్రకారం దరఖాస్తు చేసుకోమనండి.’ అన్నారు. ఆ సమాధానం చాలు, అది

నేనూహించిందే. కానీ స్వార్థం గుడ్డిది. నేను మళ్లీ చెప్పుకొంటూ పోతున్నాను. దాంతో ఆ అధికారి లేచి నిలబడి: ‘నువ్వు వెంటనే

ఇక్కడి నుంచి వెళ్లు .’ అన్నారు.


‘కానీ దయచేసి నేను చెప్పేదీ వినండి,’ అని నేను అన్నాను. అది ఆయనకు ఇంకా కోపం తెప్పించింది. ఆయన తన నౌకరును పిలిచి

నన్ను బయటకు పంపేయాల్సిందిగా ఆదేశించారు. నౌకరు వచ్చినా కూడా నేను లెక్క చేయకుండా అక్కడే నిలుచుకున్నాను.

దాంతో నౌకరు నా భుజాల మీద చేతులు వేసి నన్ను గది బయట పడేశాడు.

నౌకరుతో పాటు ఆ అధికారి కూడా బయటకు వెళ్లిపోయారు. నేను కోపంతో, మండిపోతూ అక్కడి నుంచి వచ్చేశాను. అదే

కోపంలో ఈ సంఘటన పట్ల ఒక లేఖ కూడా రాశాను: ‘మీరు నన్ను అవమానించారు. మీ నౌకరు ద్వారా నాపై దాడి చేశారు. మీరు

పశ్చాత్తా పం చెందకపోతే, మీకు వ్యతిరేకంగా చట్టపరంగా ముందుకెళతాను .’

దానికి ఆయన ఒక రౌతు ద్వారా వెంటనే సమాధానం పంపారు.

‘మీరే నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. మిమ్మల్ని వెళ్లిపొమ్మని నేను చెప్పినా మీరు పట్టించుకోలేదు. మిమ్మల్ని బయటకు

పంపడానికి నేను నా నౌకరును పిలవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. చివరకు ఆయన చెప్పినా కూడా మీరు నా

కార్యాలయం నుంచి బయటకు వెళ్లడానికి నిరాకరించారు. దాంతో అతడు మిమ్నల్ని బలవంతంగా బయటకు పంపారు. మీ ఇష్టం

మీరేమైనా చేసుకోండి.’

ఆ జవాబు పత్రం జేబులో ఉంచుకుని, నేను దిగాలుగా ఇంటికొచ్చారు. జరిగిందంతా మా అన్నయ్యకు చెప్పాను. ఆయన కూడా

చాలా బాధపడ్డా రు, కానీ నన్ను ఎలా అనునయించాలో ఆయనకు తెలియలేదు. ఆయన తన వకీలు మిత్రు డితో మాట్లా డారు.

నాకు ఆ ఇంగ్లీషు అధికారికి వ్యతిరేకంగా ఎలా దావా వేసి ముందుకెళ్లా లో తెలీదు. అదే సమయానికి సర్ ఫిరోజ్షా మెహతా

బొంబాయి నుంచి ఒక కేసు వాదించే నిమిత్తం రాజ్కోట్కు రావడం జరిగింది. కానీ ఒక నాలాంటి ఒక జూనియర్ బారిష్టర్ అంతటి
పెద్దా యన్ను కలుసుకోవడానికి ధైర్యం చేయడం ఎలా? దాంతో ఆయన్ను కేసు కోసం రప్పించిన వకీలు ద్వారా, నా కేసుకు
సంబంధించిన కాగితాలను ఆయన వద్దకు పంపి ఆయన సలహా కోరాను. ‘గాంధీకి చెప్పండి’, అని ఆయన అన్నారు. ‘ఇలాంటివన్నీ

చాలా మంది వకీళ్లకు, బారిష్టర్లకు చాలా సర్వసాధారణమైన అనుభవాలు. అతను చూస్తుంటే ఇంకా ఇంగ్లండ్ నుంచి కొత్తగా

వచ్చినట్లే ఉన్నాడు, ఉడుకు రక్తంతో ఉన్నాడు. ఆయనకు బ్రిటీష్ అధికారుల గురించి తెలీదు. ఇక్కడ ఆయన
సంపాదించదలచుకుంటే, హాయిగా జీవితం సాగించాలనుకుంటే ఈ పత్రాలను చించేసి, అక్కడ జరిగిన అవమానం గురించి ఇక
మరచిపొమ్మను. ఆ అధికారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన సాధించేది ఏమీ ఉండదు సరికదా తద్భిన్నంగా అతడికే నష్టం

కలిగించవచ్చు. జీవితం గురించి ఇంకా తెలుసుకోవాలని ఆయనకు చెప్పండి.’ అన్నారు.


ఆయన సలహాకు నాకు ఏమాత్రం మింగుడుపడనిది. కానీ దాన్ని భరించాల్సిందే. దాంతో ఆ అవమాన సంఘటను అంతటితో

వదిలేశాను. అయితే అది కొంత మేలు కూడా చేసింది.

Page: 90 (Original Page No. 100)


ఏంటంటే మళ్లీ ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని, ఇంకెప్పుడూ కూడా ఇలా స్నేహాన్ని దుర్వినియోగం చేయకూడదు అని ,’
నాకు నేను సమాధానం చెప్పుకొన్నాను. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా దాన్ని జవదాటిందది లేదు. ఈ ఎదురుదెబ్బ నా

జీవిత పంథాను మార్చేసింది.

5
దక్షిణాఫ్రికాకు సన్నద్ధత
నేను ఆ అధికారి వద్దకు వెళ్లడం నేను చేసిన తప్పే అనడంలో నాకెలాంటి అనుమానం లేదు. కానీ అతడి అసహనం, మరియు

పట్టరాని కోపం ముందు నా తప్పు చిన్నదిగా మారింది. అతడు బలవంతంగా నన్ను బయటకు గెంటించాల్సిన అవసరం లేదు.

నేను మహా అంటే ఆయన విలువైన సమయాన్ని ఓ ఐదు నిమిషాలు తీసుకుని ఉంటాను. అతడు ఏ మాత్రం నా మాటలు వినడానికి

సిద్ధంగా లేడు. నన్ను బయటకు వెళ్లమని సౌమ్యంగా అతడు చెప్పి ఉండొచ్చు. కానీ అధికారం అనే అహంకారం అతడ్ని హద్దు లు

మీరేలా చేసింది. తరువాత నాకు తెలిసిందేమిటంటే సహనం లేకపోవడం ఒక్కటే అతడి సద్గుణం కాదు, అతడి వద్దకు వచ్చే

సందర్శకులను హేళన చేయడం అతడికి సర్వసాధారణమని తెలిసింది. ఏమాత్రం చిన్న కష్టంతో వచ్చిన వారిని కూడా ఆ అధికారి

అసహనంతో వెళ్లగొడుతుంటాడు.
సహజంగానే నాకు సంబంధించిన చాలా పనులన్నీ ఆయన దర్బారులోనే నిర్వహించాల్సి ఉంది. అతడ్ని ఒప్పించడం నా వల్ల అయ్యే

పనికాదు. అతడు చెప్పినట్లు నడుకోవాలనే కోరికా నాకు లేదు. పైగా అతడికి వ్యతిరేకంగా పోరాడుతానని ఒక సారి హెచ్చరించి

ఉన్నాను కూడా. అక్కడ మౌనంగా ఉండటం నాకు ఇష్టం లేదు.

ఈ నేపథ్యంలోనే నేను మన దేశ రాజకీయాల గురించి కొంత నేర్చుకోవడం ఆరంభించాను. కథియావాడ్, అనేది కొన్ని చిన్న చిన్న

రాజ్యాల కూటమి. సహజంగానే అక్కడ రాజకీయ నేపథ్యంలో గొప్పగానే ఉంటుంది. అధికారం కోసం రాజ్యాలు, అధికారుల మధ్య

కుట్రలు, కుతంత్రాలు ఆ రోజుల్లో సర్వసాధాణం. సంస్థా నాదీశులైతే ఇక ఎంతసేపు ఇతరుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడేవారు

మరియు ఎవరు ఏది చెప్పినా వినడానికి ఎప్పుడూ చెవులు రెక్కించి ఉంచేవారు. చివరకు సాహిబ్ నౌకరు కూడా చాడీలు చెప్పేవాడే.

ఇక దొరగారి శిరస్తేదార్ అయితే దొరకు గురువు కంటే ఎక్కువ. దొరకు ఆయన కళ్లు , చెవుల్లాంటి వారు. దొరకు ఏదైనా చెప్పాలంటే

ఆయనే చెప్పాలి. అక్కడ శిరస్తేదార్ అనుకున్నదే చట్టం. ఆయన ఆదాయం కూడా దొర కంటే ఎక్కువగా ఉండేది. ఇది కొంత

అతశయోక్తిగా అనిపించవచ్చు, కానీ ఆయన తప్పకుండా తన వేతనాని కంటే ఎక్కువగా ఆడంబరంగా జీవించేవారు.

ఈ వాతావరణమంతా ఆనకు విషతుల్యంలా అనిపించేది, దీని బారిన పడకుండా నన్ను నేను ఎలా రక్షించుకోవడం అనేది నా
నిరంతర సమస్య.

వీటన్నిటి వల్ల నేను క్రమంగా కుంగిపోతున్నాను. మా అన్నయ్య దీన్ని బాగా గమనించారు. దాంతో మేమిద్దరం ఏమనుకున్నాం
అంటే, నేను గనుక ఏదైనా ఉద్యోగం సంపాదిస్తే, నేను ఈ కుట్రల వాతావరణం నుంచి స్వేచ్ఛగా బయటపడొచ్చునని, కానీ ఎలాంటి
కుట్ర లేకుండా మంత్రిపదవిగానీ, న్యాయమూర్తి పదవిగానీ ఇక్కడ లభించడం వీలయ్యే పనేకాదు.

Page: 91 (Original Page No. 101)


పైగా ఆ దొరతో నాకున్న వైరం ఎలాగూ నా ప్రాక్టీసుకు అడ్డు తగులుతూనే ఉంటుంది.
అప్పట్లో పోరుబందర్ బ్రిటీష్ వారి పరిపాలనలో ఉండేది. సంస్థా నాదీశుడికి మరిన్ని అధికారాలు సాధించడానికి వీలుగా చేస్తు న్న

ప్రయత్నాల్లో ఏదో పని మీద నేను అక్కడికి వచ్చాను. పోరుబందర్ పాలనాధికారిని కూడా నేను కలుసుకోవాలి. మెర్స్ తెగ నుంచి

అధికంగా వసూలు చేస్తు న్న భూమి శిస్తు (విగోటి)కు సంబంధించి ఆయనతో మాట్లా డాలి. అక్కడి అధికారి, భారతీయుడే,

అయినప్పటికీ, ఆయన అహంకారంలో దొర కంటే కొంచెం మేలు అనిపించింది. ఆయన సమర్థు డే, కానీ ఆయన సామర్థ్యం వల్ల

రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రాణాగారికి మరికొన్ని అధికారాలు సాధించడంలో నేను

సఫలీకృతుడయ్యాను. కానీ మెర్స్కు మాత్రం ఎలాంటి ఉపశమనాన్ని సాధించలేకపోయాను. వారి సమస్యల పట్ల కనీసం ఏమంత

శ్రద్ద కూడా పెట్టలేదని అనిపించింది.

కనీసం ఈ ప్రయత్నంలో కూడా నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. నా క్లైంట్లకు న్యాయం జరగలేదని భావించాను. కానీ వారికి

న్యాయం కలిగింపజేసే సాధనం కూడా నావద్ద లేదు. చివరకు నేను చేయగలిగిందల్లా పొలిటికల్ ఏజెంట్కు లేక గవర్నర్కు అప్పీలు

చేసుకోవడం, వాళ్లు దాన్న ‘ఇందులో మేం జోక్యం చేసుకోం.’ అని కొట్టి పారేశారు. అక్కడ అమలు చేయడానికి ఏవైనా చట్టా లు,

నిబంధనలు ఉన్నాయా అంటే, ఏదైనా చేయగలగడానికి వీలుండేది. కానీ అక్కడంతా దొరగారు అనుకున్నదే చట్టం.

నేను కోపంతో రగిలిపోయాను.

ఈ మధ్యకాలంలోనే, మెమన్ సంస్థ ఒకటి పోరుబందర్ నుంచి మా అన్నయ్యకు ఒక అవకాశం ఇస్తూ లేఖ రాసింది, అది; ‘మాకు
దక్షిణాఫ్రికాలో వ్యాపారం ఉంది. మాది ఒక పెద్ద సంస్థ, మాకు అక్కడ కోర్టు లో ఒక పెద్ద కేసు ఉంది. మాకు 40,000 పౌండ్లు రావాల్సి

ఉంది. ఆ కేసు అక్కడ చాలా కాలంగా విచారణ జరుగుతోంది. దీని కోసం మేం మంచి వకీళ్లు , బారిష్టర్ల సేవలు

వినియోగించుకోదలిచాం. మీరు గనుక మీ తమ్ముడ్ని అక్కడికి పంపితే, అది మాకూ, అతడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అక్కడ మా న్యాయవాదులకు ఆయన మనకంటే బాగా సూచనలు ఇవ్వగలుడు. పైగా అతడికి ప్రపంచంలో ఒక కొత్త ప్రదేశాన్ని

చూసిన అవకాశం కూడా కలుగుతుంది, కొత్త పరిచయాలు కూడా ఏర్పరచుకోవచ్చు.’

ఈ ప్రతిపాదన గురించి మా అన్నయ్య నాతో చర్చించారు. నేను న్యాయవాదుల కౌన్సిల్కు సూచనలు చేయడం వరకేనా లేక

కోర్టు కు హాజరు కావాలా అనేది నాకు సరిగ్గా చె,ప్పలేదు. కానీ నేను దీనికి మొగ్గు చూపాను.

దివంగత సేట్ అబ్దు ల్ కరీమ్ జావేరీ, ఆయన దాదా అబ్దు ల్లా అండ్ కో సంస్థ భాగస్వామి, ఆయనకు నన్ను మా అన్నయ్య

పరిచయం చేశారు. సంస్థ సమస్యల్లో ఉంది, ఇదేమీ నీకు ఇబ్బంది కలిగించే ఉద్యోగం కాదు,’ అని సేట్ నాకు భరోసా ఇచ్చారు.

‘అక్కడ మేముం ఐరోపాకు చెందిన పెద్దపెద్ద వాళ్లను స్నేహితులుగా కలిగి ఉన్నాం. నువ్వు వాళ్లతో పరిచయం పెంచుకోవచ్చచు. మా

దుకాణంలో కూడా నువ్వు పనికొస్తా వు. చాలా వరకు మా ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, అలా నువ్వు మాకు
సాయపడొచ్చు కూడా. మీరు ఇక అక్కడ మా అతిథిగా ఉంటారు, దాంతో మీకు ఎంతైనా మీరు ఖర్చు భరించాల్సిన అవసరం

ఉండదు.’ అన్నారు.

‘అక్కడ ఎంతకాలం నా సేవలు మీకు అవసరం అవుతాయి?’ అని అడిగాను. ‘మరికు నాకు మీరు ఏమి చెల్లిస్తా రు?

Page: 92 (Original Page No. 102)

‘ఒక ఏడాదికంటే మించి ఉండదు. మొదటి తరగతి శ్రేణిలో మీరు ప్రయాణించడానికి మేం చెల్లిస్తాం, దానికి అదనంగా అన్ని కలిపి

మీకు 105 పౌండ్లు వేతనం కూడా ఇస్తాం.’

దీనికోసం ఒక బారిష్టర్ అంతదూరం వెళ్లి చేయాల్సిన పనికాదు. బదులుగా ఆ సంస్థ నౌకరు ఒకరు వెళ్లినా సరిపోతుంది. కానీ ఏదో

విదంగా నేను భారతదేశం వదలి వెళ్లా లి. మరోవైపు దీనిద్వారా ఒక కొత్త దేశాన్ని చూసి వచ్చే అవకాశం ఊరిస్తోంది. పైగా కొత్త

అనుభవం కూడా వస్తుంది. అదీగాక నేను మా అన్నయ్యకు 105 పౌండ్ల డబ్బు పంపొచ్చు, అది ఆయన కుటుంబ పోషణ

ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని మరే ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను, దక్షిణాఫ్రికా ప్రయాణానికి

సిద్ధమయ్యాను.

6
నాటల్కు రాక
దక్షిణాఫ్రికాకు బయలుదేరుతున్నప్పుడు నేను ఇక్కడి నుంచి దూరంగా వెళుతున్నాననే భావన ఏమీ కలగడం లేదు, అది ఇంతకు
ముందు ఇంగ్లండ్కు వెళ్లే సమయంలోనే అనుభవించాను. ఇప్పుడు మా అమ్మగారు కూడా లేరు. ఇప్పుడు కొంచెం లోకం గురించి,

విదేశీ ప్రయాణాల గురించి కూడా తెలుసుకున్నాను. రాజ్కోట్ నుండి బొంబాయికి వెళ్లడం ఇప్పుడు నాకు కొత్తేమీ కాదు.
ఈ సారి నేను బాధపడిందల్లా నా భార్య నుంచి వేరుగా వెళుతుండటం చూసే. నేను ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చాక మాకు మరో

బిడ్డ పుట్టింది. కోరికల నుంచి మా ప్రేమ ఇంకా విడివడిందని చెప్పలేము, కానీ మెల్లమెల్లగా మా ప్రేమ స్వచ్ఛంగా మారుతోంది.
ఐరోపా నుంచి నేను తిరిగి వచ్చాక, మేమిద్దరం కాస్తంత దగ్గరగా మెలిగాము, ఇప్పుడు నేను ఆమెకు ఉపాధ్యాయుడిగా మారను,
ఏదో విధంగా ఆమెకు కొన్ని సంస్కరణలు నేర్పాను. ఈ సంస్కరణలు ఇలాగే కొనసాగాలంటే మేమిద్దరం మరింత దగ్గరగా

ఉండాల్సిన అవసరం ఉందని మేమిద్దరం భావించాం. కానీ దక్షిణాఫ్రికా అవకాశం ఊరించడంతో మేమిద్దరం ఎడబాటను భరించక

తప్పలేదు. ‘మనం తప్పకుండా మళ్లీ ఏడాదిలోపు కలుస్తాం,’ అని నేను ఆమెకు చెప్పి ఏదో ఆమెను అలా ఓదార్చాను. ఇక

రాజ్కోట్ నుంచి బొంబాయికి వచ్చేశాను.

ఇక్కడ నేను నా ప్రయాణానికి సంబంధించిన పాసును దాదా అబ్దు ల్లా అండ్ కంపెనీ ఏజెంట్ ద్వారా పొందాలి. కానీ ఓడపైన నాకు

బెర్తు అందుబాటులో లేదు. నేను గనుక ఇప్పుడు ప్రయాణించలేదంటే, బొంబాయిలో నేను ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ‘మా

శక్తిమేర ప్రయత్నించా,’మని చెప్పారు ఏజెంటు. ‘మొదటి తరగతి శ్రేణి ప్రయాణ టికెట్టు సాధించడం కోసం ప్రయత్నించాం, కానీ

ఫలించలేదు - ఒకవేళ నువ్వు వెళ్లదలచుకుంటే ఓడపైన డెక్లో ప్రయాణించడానికి సిద్ధపడాల్సిందే. కానీ నీకు ఆహారం మాత్రం

మొదటి తరగతి శ్రేణి బోజన శాలలోనే ఉంటుంది.’ అన్నారు.

అవి నేను మొదటి తరగతి శ్రేణిలోనే ప్రయాణించే రోజులు, కానీ ఒక బారిష్టర్ ఎలా ఓడపైన డెక్లో ప్రయాణించడగలడు? దాంతో నేను
ఆ ప్రతిపాదనను తిరస్కరించాను. ఆ ఏజెంటు చెబుతున్నది నాకు నమ్మబుద్ది కాలేదు. మొదటి శ్రేణి ప్రయాణ టికెట్లు లేవు అనేది

నేను నమ్మడం లేదు.

Page: 93 (Original Page No. 103)


ఆ ఏజెంటు అనుమతితో బెర్తు సంపాదించడానికి నేనే స్వయంగా ప్రయత్నించాను. ఓడలోకి వెళ్లి అక్కడ ఓడి ప్రధాన అధికారిని

కలిశాను. ఆయన చాలా నిర్మొహమాటంగా చెప్పారు, ‘సాధారణంగా మాకు ఇంత రద్దీ ఉండదు. కానీ ఈ సారి ఈ ఓడలో

మొజాంబిక్ గవర్నర్ జనరల్ ప్రయాణిస్తుండటంతో, అన్ని బెర్తు లు వారికి కేటాయించడమైనది.’

‘ఏదో విధంగా మీరు నాకు సర్దు బాటు చేయలేరా?’ అని ఆయన్ను అడిగాను.

ఆయన నన్ను ఎగాదిగా చూసి నవ్వారు. ‘ఒకటే మార్గముంది,’ అన్నారు. ‘నా క్యాబిన్లో అదనంగా ఒక బెర్తు ఉంది. సాధారణంగా

దాన్ని ప్రయాణికులకు ఇవ్వం. కానీ నీకు కావాలంటే దాన్ని ఇస్తా ను .’ అన్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపి నా ప్రయాణ టికెట్
కొనుగోలు చేయమని ఏజెంటుకు చెప్పాను. అలా 1893 ఏప్రిల్ మాసంలో ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికాలో నా అదృష్టా న్ని

పరీక్షించుకోవడానికి బయలుదేరాను.

మేము మొదటగా చేరుకునే రేవు లాము, 13 రోజుల్లో అక్కడికి చేరుకున్నాం. ఈ సారి ఓడ కెప్టెన్, నేను ఇద్దరం మంచి

మిత్రు లమయ్యాం. ఆయనకు చదరంగం ఆడటంఅంటే ఎంతో ఇష్టం. ఆయన ఈ ఆట కొత్తగా నేర్చుకుంటున్నాడు. దాంతో

ఆయన తనతో ఆడటానికి ఇంకా కొత్తగా నేర్చుకుంటున్న ఆటగాడు కావాలనుకుంటున్నాడు. ఆడటానికి నన్ను పిలిచారు. నేను

ఈ ఆట గురించి చాలా విన్నాను కానీ ఎప్పుడు ఆడింది లేదు. మన మేథస్సును పెంచుకోవడానికి ఈ ఆట చాలా అవకాశం

కలిగిస్తుందని దీన్ని ఆడే ఆటగాళ్లు చెబుతుంటారు. ఆ కెప్టెన్ నాకు ఈ ఆట గురించి పాఠాలు చెప్బడానికి ఉపక్రమించారు. నాకున్న

అపారమైన ఓర్పు కారణంగా ఆయన నాలో ఓ మంచి వ్యక్తిని చూశారు. ఆడిన ప్రతిసారి నేను ఓడిపోయేవాడ్ని, దాంతో ఆయన

నాకు చదరంగం పాఠాలను మరింత ఆసక్తితో చెప్పేవాడు. ఆ ఆట నాకు బాగా నచ్చింది కానీ, ఈ ఓడ ప్రయాణం తరువాత ఆ

ఇష్టా న్ని అట్టే కొనసాగించలేదు, దాంతో ఆ ఆటలో నా పరిజ్ఞానం, పావులు కదపడాన్ని మించి ముందుకెళ్లలేదు.

లాము రేవులో మేం ప్రయాణిస్తు న్న ఓడ మూడు నుంచి నాలుగు గంటల పాటు నిలిచింది. నౌకాశ్రయం చూద్దా మని నేను కిందకు

దిగాను. కెప్టెన్ కూడా తీరానికి వచ్చారు. ఈ రేపు చాలా మోసపూరితమైంది, ఎప్పుడేమవుతుందో తెలీదు, కాబట్టి ముందగానే తిరగి

వచ్చేయండి అని దిగే సమయంలో కెప్టెన్ నన్ను హెచ్చరించారు.

అది చాలా చిన్న ప్రాంతం. అక్కడ ఒక తపాలా కార్యాలయం ఉంటే వెళ్లా ను, అక్కడ ఓ భారతీయ గుమస్తా ఉండటం నాకు

సంతోషం కలిగించింది. నేను ఆయనతో మాట కలిపాను. ఆఫ్రికా ప్రజలను కూడా చూశాను, వారి జీవన శైలి గురించి

తెలుసుకున్నాను, నాకు అది చాలా ఆసక్తిగా అనిపించింది. దీంతో కొంత సమయం గడచిపోయింది.

ఓడ డెక్లో ప్రయాణిస్తు న్న కొంతమంది ప్రయాణికులు కూడా నాతోపాటు ఉన్నారు, ప్రయాణం చేసే సమయంలో వారితో పరిచయం
కూడా ఏర్పడింది. వాళ్లంతా తీరంలో తమకు కావాల్సిన మంచి ఆహారం వండుకోవడానికి ఓడ దిగి వచ్చారు. వాళ్లంతా మళ్లీ ఓడ

ఎక్కడానికి ఒక పడవలో బయలుదేరుతుండటం చూసి, నేను కూడా వారితోపాటే పడవ ఎక్కాను. ఆ రేవులో ఆటుపోట్లు
ఎక్కువగా ఉన్నాయి. మా పడవలో పరిమితికి మించి ప్రయాణికులున్నారు. అలల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, దాంతో మా

బోటును ఓడ ఎక్కడానికి ఉన్న నిచ్చెనకు కట్టి నిలపడానికి కుదరడం లేదు. పడవ నిచ్చెనను తాకి మళ్లీ బలంగా వెనక్కి

వచ్చేస్తోంది.

Page: 94 (Original Page No. 104)


ఓడ బయలుదేరడానికి అప్పటికే మొదటి సైరన్ మోగింది. నేను ఆందోళన చెందాను. మేం పడుతున్న ప్రయాసలను ఓడ కెప్టెన్

అక్కడ పై నుంచి చూస్తు న్నారు. ఓడను మరో ఐదు నిమిషాలు ఎక్కువ సేపు ఆగమని ఆయన ఆదేశించారు. ఓడకు సమీపంలో

మరో పడవఉంది, దాన్ని ఒక మిత్రు డకు పది రూపాయలకు నన్ను తీసుకెళ్లడానికి మాట్లా డారు. ఆ పడవ నడిపే వ్యక్తి నన్ను ఈ

పడవ నుంచి లాక్కొన్నారు. అప్పటికీ ఓడ నిచ్చెన తీసేశారు. దాంతో నేను అక్కడ తాడు పట్టు కుని ఓడ ఎక్కాల్సి వచ్చింది. ఆ

వెంటనే ఓడ బయలుదేరింది. మిగిలిన ప్రయాణికులు ఎక్కకుండానే అక్కడే ఆగిపోయారు. కెప్టెన్ నన్ను ఎందుకు హెచ్చరించారో

తెలుసుకుని ఆయన్ను అభినందించకుండా ఉండలేకపోయాను.

లాము తరువాత వచ్చే రేవు మంబాసా, ఆ తరువాత జాన్జీబర్. ఇక్కడ ఓడ చాలా రోజులుంటుంది - ఎమినిది లేక పది రోజులు -

మేం అక్కడ మరో పడవలోకి మారాల్సి ఉంటుంది. ఓడ కెప్టెన్కు నేను బాగా నచ్చాను. అయితే ఆయన ఇష్టం మరో

అవాంఛనీయపరిణామానికి దారి తీసింది. బయట వివాహారానికి ఆయనతో తోడుగా రమ్మని నన్నూ, మరో ఆంగ్లేయిడిని పిలిచారు.

అలా మేం ఆయనతో కలిసి పడవలో తీరం చేరుకున్నాం.

ఈ విహారం వెనుక అంతరార్థం అంటే ఏమిటో నాకు తెలీదు. నేను అలాంటి విషయాల్లో అజ్ఞానిననే విషయం ఈ కెప్టెన్ కు చాలా

తక్కువ తెలుసు. ఒక దళారీ ద్వారా మేం ఒక నీగ్రో మహిళ ఇల్లు తీసుకున్నాం. మాకు ప్రతి ఒక్కరికి ఒక గది ఇచ్చారు. నా గదిలో

నీగ్రో స్థ్రీని చూసి నేను సిగ్గుతో కుచించుకుపోయాను. ఆ పేద మహిళ నన్ను చూసి ఏమనుకుందో ఏమో ఆ భగవంతుడికే తెలియాలి.

ఇంతల్ కెప్టెన్ పిలవడంతో నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. కెప్టెన్ నా అమాయకత్వాన్ని చూశారు. మొదట్లో నేను చాలా

అవమానంగా భావించాను. కానీ తరువాత అది తలచుకుంటేనే భయంకరంగా అనిపించింది. అవమాన భారం దూరమైపోయింది,

ఒక ఆడదాన్ని చూడగానే నేను ఏమాత్రం చలించిపోకుండా ఉండేలా చేసినందుకు భగవంతుడికి నా కృతజ్ఞతలు. నా దౌర్బల్యాన్ని
చూసి నాకు నేనే చీదరించుకున్నాను, అసలు ఆ గదిలోకి వెళ్లనని ముందే నేను ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయానని నా పట్ల
నాకే జాలి కలిగింది.
నా జీవితంలో ఇలాంటిది మూడో సంఘటన. చాలా మంది యువత , ఇలాంటి విషయాల్లో మొదట ఆయాకంగా ఉంటారు,

తరువాత అలా చేయకపోవడం అవమానమే తప్పుడు ఆలోచనలతో ఈ పాపంలోకి దిగుతారు. కానీ నేను అందులోంచి సురక్షితంగా

బయట పడ్డా నని చెప్పడం లేదు. నేను గనుక ఆ గదిలోకి వెళ్లడానికి ముందుగానే నిరాకరించినట్లయితే నేను సచ్చీలుడననీ

చెప్పగలను. నేను సురక్షితంగా బయటపడటం అంతా దేవుడి దయ, ఆయనకే నా కృతజ్ఞతలు. ఈ సంఘటన దేవుడి పట్ల నాకున్న

నమ్మకాన్ని మరింత పెంచింది.

మేం ఆ రేవులో వారం రోజులు అక్కడే గడపాలి. నేను ఆ పట్టణంలో గది తీసుకుని బస చేశాను. ఆ సమయాన్ని ఆ చుట్టు పక్కల

ప్రదేశాలను చూడటానికి కేటాయించాను. సుసంపన్నమైన వృక్ష సంపదతో జాంజిబర్ రేవు ప్రాంతం కేరళ (మలబారు)ను

తలపిస్తోంది. అక్కడ ఉన్న భారీ వృక్షాలు, వాటికి కాసిన పెద్దపెద్ద పండ్లను చూసి నాకు ఆశ్చర్యమేసింది.

ఇక అక్కడి నుంచి మేం మాంజాంమిక్ చేరుకుంటాం, అక్కడి నుంచి మే మాసం చివరికి మేం నాటల్ చేరుకున్నాం.

Page: 95 (Original Page No. 105)

7
కొన్ని అనుభవాలు
డర్బన్ నగరమే నాటల్ ఓడరేవు. దాన్ని నాటల్ రేవు అని కూడా పిలుస్తా రు. అక్కడ నన్ను తీసుకుని వెళ్లడానికి అబ్దు ల్లా సేఠ్

వచ్చారు. ఓడ తీరానికి చేరగానే తమ స్నేహితులను కలుసుకోవడానికి ప్రజలంతా ఒడపైకి రావడం చూశాను. అక్కడ వారు

భారతీయులకు తగిన గౌరవం ఇవ్వనట్లు గా నాకు అనిపించింది. తగినంత గౌరవం ఇచ్చినట్లు గా నాకు కనిపించలేదు. అబ్దు ల్లా

సేఠ్ పట్ల కూడా వారు అమర్యాదకరంగా ప్రవర్తించడాన్ని కూడా నేను గమనించాను, అది నా మనసు నొచ్చుకుంది. అబ్దు ల్లా సేఠ్

మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. నా వైపు ఎవరైతే చూస్తు న్నారో వారంతా నన్ను కొంత ఆసక్తితో చూడటం గమనించాను. నేను

అక్కడ ఇతర భారతీయులకంటే కాస్తంత భిన్నమైన దుస్తు లు ధరించి ఉన్నాను. నేను పొడవైనా గౌనుకోటు, తలపాగా ధరించాను,

చూడటానికి బెంగాల్ తలపాగా తరహాలో ఉంది.


నన్ను అక్కడి నుంచి నేరుగా ఆ సంస్థ క్వార్టర్స్కు తీసుకెళ్లి, ఒక గదిలో దిగబెట్టా రు, నా గది అబ్దు ల్లా సేఠ్ గది పక్కనే ఉంది.

ఆయనకు నేను అర్థం కాలేదు, ఆయన నాకు అర్థం కావడం లేదు. నా ద్వారా ఆయన తమ్ముడు ఆయనకు పంపిన పత్రాలను

ఆయన చదివారు, తరువాత కొంత తీక్షణంగా మారారు. తాను మేపడానికి తన తమ్ముడు తనకు ఒక తెల్ల ఏనుగును పంపించాడని

అర్థం చేసుకున్నారు కాబోలు. నా ఆహార్యం, వేషాధారణ, జీవన శైలి చూసి ఐరోపా వారి లాగా మరింత ఖర్చు అవుతుందని

భావించారు. నాకు అక్కడ ఇవ్వడానికి పనికూడా ఏమీ లేదు. వారి కేసు నడిచేది ట్రాన్స్వాల్లో. అక్కడికి నన్ను వెంటనే

పంపించివేయడం ఏమాత్రం అర్థవంతం కాదు. ఎంతకాలం అతడు నా సామర్థ్యం, నిజాయతీలను నమ్మగలడు? నన్ను

చూసుకోవడానికి అతడు ప్రిటోరియాలో ఉండలేడు. ప్రతివాదులు ప్రిటోరియాలో ఉన్నారు. వాళ్లు నన్నెక్కడ ప్రలోభాలకు గురి చేసి

తమవైపు తిప్పుకుంటారోనని భయం. ఒకవేళ గనుక ఆ కేసుకు సంబంధించిన పని నాకు అప్పజెప్పకపోతే, ఇక అక్కడ నేను
చేయాల్సిన పని ఏముంటుంది, మిగిలిన పనులన్నీ నా కంటే అక్కడ గుమస్తా లే చాలా బాగా చేసేస్తా రు? ఆ గుమస్తా లు తప్పు చేస్తే,
వారిని దండించవచ్చు. ఒక వేళ నేనే తప్పు చేస్తే దండించేదెలా? ఒక వేళ ఇక్కడ కేసుకు సంబంధించి నాకు ఎలాంటి పని

ఇవ్వకపోతే , నన్ను కేవలం ఎలాంటి పనిలేకుండా కూర్చొబెట్టా ల్సిందే.

అబ్దు ల్లా సేఠ్ వాస్తవంగా అక్షర జ్ఞానం లేనివాడే, కానీ అపారమైన అనుభవపాఠాలు అతడి సొంతం. అతడు వ్యవహారాల పట్ల చాలా

తెలివిగా ఉంటారు, బుద్ది కుశలతతో ఉంటారు. అలవాటు చేసుకుని మాట్లా డటానికి అవసరమైన ఆంగ్లం నేర్చుకున్నారు. అక్కడ

ఆయన వ్యాపార కార్యకలాపాలకు ఆ మాత్రం సరిపోతోంది. బ్యాంకు మేనేజర్లతో మాట్లా డటం, ఐరోపా వ్యాపారులతో కానీ, కేసు

గురించి కౌన్సిల్ కు వివరించడానికి కానీ ఇది సరిపోతోంది. అక్కడ భారతీయులు ఆయన్ను చాలా గొప్పగా చూస్తుంటారు. అక్కడ

వీరి సంస్థ చాలా పెద్దతి, ఒక వేళ కాకపోయినా, అక్కడున్న భారతీయ సంస్థల్లో కెల్లా ఇదే పెద్ద సంస్థ.

Page: 96 (Original Page No. 106)


ఇలా అనేక సానుకూలాంశాలున్నప్పటికీ ఒక ప్రతికూలాంశం కూడా ఉంది - సహజంగానే ఆయన అనుమానపు స్వభావం..
ఇస్తాం మతం అంటే ఎంతో గొప్పగా భావిస్తా రు, ఇస్లాం సిద్ధాంతాల గురించి తెలియజెప్పడమంటే అతడికి చాలా ఇష్టం. ఆయనకు

అరబక్ రాకపోయినా, పవిత్ర ఖురాన్ మరియు ఇస్లాం సాహిత్యంతో ఆయనకున్న సాధారణ పరిజ్ఞానం బాగానే ఉంది.

మాట్లా డేటప్పుడు చాలా ప్రామాణిక మాటలు చెబుతుంటారు, ఎల్లప్పుడూ అవి అతడివద్ద సిద్ధంగా ఉంటాయి. అతడితో పరిచయం

వల్ల నాకు ఇస్లాం మతం గురించి సరిపడా జ్ఞానం వచ్చింది. మేమిద్దరం ఎప్పుడు సన్నిహితంతా కలిసినా, మా మధ్య మతపరమైన

అంశాల మీద సుదీర్ఘ చర్చలు జరిగేవి.

నేను వచ్చిన రెండో లేక మూడవ రోజు అనుకుంటా, డర్బన్ న్యాయస్థా నం చూసిరావడం కోసం ఆయన నన్ను తీసుకెళ్లా రు.

అక్కడ నన్ను ఆయనకు తెలిసిన అనేక మందికి పరిచయం చేశారు, తన వకీలు పక్కనే నన్ను కూర్చోబెట్టా రు. అక్కడ మేజిస్ట్రేట్

(న్యాయమూర్తి) నా వైపు కాసేపు తీక్షణంగా చూసి, చివరకు నన్ను నా తలపాగా తీయాలని ఆదేశించారు. దానికి నేను నిరాకరిస్తూ,

కోర్టు నుంచి బయటకు వచ్చేశాను.

ఇక్కడ కూడా నాకు తగువు సిద్ధంగా ఉందన్నమాట.

అబ్దు ల్లా సేఠ్ నాకు కొంతమంది భారతీయులు ఎందుకు తమ తలపాగా తీసేయాల్సిన అవసరముందో వివరించారు. ఎవరైతే
ముస్లిం సంప్రదాయాలను పాటిస్తుంటారో వారు మాత్రం తలపాగా ఉంచుకోవచ్చు, కానీ మిగిలిన భారతీయులు ఎవరైతే కోర్టు లోకి
వచ్చారో వారంతా తలపాగా తీసేయాల్సిందే, ఇదిక్కడ నిబంధన.

ఈ సూక్ష్మమైన బేధం గురించి తెలుసుకోవడానికి నేను మరికొంత లోతుగా వెళ్లా లి. ఈ రెండు మూడు రోజుల వ్యవధిలోనే, అక్కడ

భారతీయులందరూ వివిధ వర్గాలు విడిపోయి ఉండటాన్ని నేను గమనించారు. వాళ్లలో ముస్లిం వ్యాపారుల వర్గం, ఆ వర్గం వారికి

వారే ‘అరబ్బు’లుగా వ్యవహరిస్తా రు. మరో వర్గం హిందువులు, మరో వర్గం గుమస్తా లు వారు ఫారసీలుగా చెప్పుకొంటుంటారు.

ఎటొచ్చి హిందువులే అటు ఇటు కాకుండా ఉండిపోయారు, వాళ్లు అరబ్బులతో కలిసేంత వరకు అంతే. ఫారసీ గుమస్తా లు తమకు

తాము పర్షియన్లు గా పిలుచుకుంటారు. ఈ మూడు సామాజిక వర్గాలకు ఒకరితో ఒకరికి కొన్ని సామాజిక సంబంధాలుంటాయి.

కానీ వీరందర్నీ మించిన మరో తెగ అక్కడ ఉంది. ఇందులో తమిళులు, తెలుగువారు మరియు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన

ఒప్పంద మరియు స్వేచ్ఛా కూలీలు. ఈ ఒప్పంద కార్మికులు అంతా నాటల్లో అయిదు సంవత్సరాల పాటు పనిచేయడానికి

ఒప్పందం చేసుకుని వచ్చినవారు. వీరిని గిర్మిటీలోని గిర్మిటియాస్ అని వ్యవహరిస్తా రు. ఈ గిర్మిటీ అనే పదం ‘అగ్రిమెంట్’.

ఆంగ్లపదం నుంచి సంకర పదంగా ఏర్పడింది. ముందు చెప్పిన మూడు తరగతుల వారికి ఈ తరగతి వారితో వ్యాపార సంబంధాలు

తప్ప ఇంకెలాంటి సంబంధాలు ఉండవు. వీరిని ఆంగ్లేయిలు ‘కూలీలు’, అని పిలిచేవారు. అక్కడ ఎక్కువ భాగం ప్రజలంతా ఈ

కూలీల వర్గానికి చెందినవారే ఉండేవారు. దాంతో భారతీయులను అక్కడ ‘కూలీలు’, అని లేక ‘సామీలు’. అని పిలిచేవారు. ‘సామి’
అనేది తమిళుల పేరు చివర ఉంటే సాధారణ పేరు. ఈ పదానికి సంస్కృత బాషలోని స్వామీ, అంటే గురువుకు ఎలాంటి సంబంధం

లేదు. అయినప్పటికీ, ఎప్పుడైనా ఒక భారతీయుడు ‘సామి’ అని పిలుపించుకోవడం నామోషీగా భావించేవారు, అతడు తనను

హేళన చేస్తు న్నారని వెంటనే గ్రహిస్తా డు, దాంతో అతడు వెంటనే తెలివిగా ఇలా బదులు చెప్పేవారు: ‘నన్ను నువ్వు సామీ అని
పిలిచావు, కానీ సామి అంటే గురువు అని నువ్వు మరచిపోతున్నావ్

Page: 97 (Original Page No. 107)


నేను నీ గురువును కాను!’ అనేవారు. దాంతో కొంతమంది ఆంగ్లేయిలు తమాయించుకుంటే, మరికొంతమంది ఆగ్రహం

చెందేవారు. అవకాశం దొరకాలే కానీ ప్రమాణపూర్వకంగా ఈ భారతీయులను పులిమేయాలని వారు భావిస్తుంటారు. కానీ వీరిని

ఎదుర్కోవడానికి ‘సామీ’ కంటే మించిన పదం దొరకడం లేదు. చివరకు అక్కడ మాస్టర్ అంటేనే అవమానించినట్లు గా అర్థం

చేసుకునే స్థా యికి వెళ్లింది.

ఇక అప్పటి నుంచి నన్ను కూడా అంతా ‘కూలీ బారిష్టర్’. అని పిలిచేవారు. వర్తకులను ‘కూలీ వర్తకులు’ అనేవారు. ‘కూలీ’ అనే

పదానికి అసలు అర్థా న్ని మరచిపోయారు, అక్కడ భారతీయులకు అది సాధారణ పేరుగా మారిపోయింది. ముస్లిం వర్తకులు దీన్ని

సహించేవారు కాదు, దాంతో వారు ఏమనేవారంటే: ‘నేనేం కూలీని కాను, నేను ఒక అరబ్బును,’ లేక ‘నేను వర్తకుడిని,’ అని

చెప్పేవారు. ఇక ఆంగ్లేయుడు కనుక మర్యాదస్తు డైతే, కూలీ అన్నందుకు క్షమాపణలు చెబుతాడు.

ఆ సమయంలో తలపాగా ధరించడమనేది అత్యంత ప్రాముఖ్యమైన అంశంగా మారింది. ఒకరి ఆదేశాలకు లోబడి భారతీయుడి

తలపాగా తీసి జేబులో పెట్టు కుంటే అది అవమానంగా ఉండేది. దాంతో నేను ఈ భారతీయ తలపాగా ధరించాలనే ఆలోచన

విరమించుకుని, ఆంగ్లేయిల టోపీ ధరించాలని అనుకున్నాను. అందువల్ల నేను అవమానాలు పడకుండా ఉండటంతోపాటు,

అవనసరమైన వివాదాల నుంచి కాపాడబడతాను అనుకున్నాను.

కానీ నా ప్రతిపాదనకు అబ్దు ల్లా సేఠ్ అంగీకరించలేదు. ఆయన ఏమన్నారంటే, నువ్వు గనుక అలాంటి పని ఏదైనా చేశావంటే, దాని

వల్ల మరింత దుష్ఫరిణామాలు ఎదురవుతాయి. భారతీయుల తలపాగాతోనే సర్దు కుపో. పైగా నీ తలకు భారతీయ తలపాగానే

బాగుంటుంది. ఒక వేళ నువ్వు గనుక ఆంగ్లేయిల టోపీ ధరిస్తే, అందులో నువ్వు హోటళ్లో వెయిటర్లా గా కనిపిస్తా వు.’ అన్నారు.
ఆయన సలహాలో కొంత వాస్తవిక వివేకం, దేశభక్తి, మరియు కొంత తాత్వికత కూడా ఉంది అనిపించింది. ఆయన మాటల్లో తెలివి
తెలుస్తూనే ఉంది, ఇక దేశభక్తి అంటారా, భారతీయ తలపాగా పెట్టు కోమని కోరారంటే ఆయనలో దేశభక్తి లేకుండా ఎలా ఆ మాటలు
వస్తా యి; ఇక హోటళ్లో వెయిటర్తో పోల్చడం చూస్తే వారి పట్ల ఆయనకున్న చులకనభావం కనిపిస్తోంది. ఒప్పంద భారతీయ

కార్మికుల్లో మరో మూడు తరగతులున్నాయి - హిందువులు, ముస్లింలు మరియు క్రైస్త వులు. చివరిలో ఉన్నవారు మాత్రం భారతీయ

ఒప్పంద కార్మికుల పిల్లలు, వారంతా క్రైస్త వ మతమార్పిడి చేసుకున్నవారు. 1893 లో కూడా వారి సంఖ్య చాలా పెద్దదిగా ఉండేది.

వాళ్లు ఆంగ్లేయిల దుస్తు లు ధరించేవారు, వారిలో ఎక్కువ మంది హోటళ్లలో వెయిటర్లు గా పనిచేసి ఎక్కువగా ఆర్జించేవారు.

బహుశా ఆంగ్లేయిల టోపీ గురించి అబ్దు ల్లా సేఠ్ చేసిన విమర్శలు ఈ తరగతి వారిని ఉద్దేశించి చేసినవి కాబోలు. అలా హోటళ్లో

వెయిటర్గా పనిచేయడం తక్కువతనంగా పరిగణించేవారు. ఈ అభిప్రాయం ఇప్పటికీ కూడా చాలా మందిలో ఉంది.

మొత్తా నికి చూస్తే అబ్దు ల్లా సేఠ్ సలహా నాకు నచ్చింది. నేను ఈ సంఘటన గురించి అక్కడి మీడియాకు లేఖ రాశాను, అందులో

నేను కోర్టు లో తలపాగా ధరించుకోవడాన్ని సమర్థించుకున్నాను. నేను అడిగిన ప్రశ్న పత్రికల్లో పెద్ద ఎత్తు న చర్చనీయాంశమైంది.

పత్రికలు నన్ను ఒక ‘ఆహ్వానించదగ్గ సందర్శకుడు (అన్వెల్కం విజిటర్)’. అభివర్ణించారు. నేను వచ్చిన కొన్ని రోజులకే నా గురించి

ఈ సంఘటన నేను ఊహించని రీతిలో నాకు ప్రచారం కల్పించింది. కొంతమంది నన్ను సమర్ధించారు, కొంతమంది నా ధిక్కార

స్వరాన్ని తీవ్రంగా విమర్శించారు.

Page: 98 (Original Page No. 108)

నా తల పాగా నాతోనే ఉండేది, ముఖ్యంగా నేను దక్షిణాఫ్రికాలో ఉన్నన్ని రోజులు అది కొనసాగింది. అయితే దక్షిణాఫ్రికాలో నా

తలపాగాను ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ఎప్పుడు అనే వివరాలను తరువాత వివరిస్తా ను.

8
ప్రిటోరియా మార్గంలో
కొంతకాలానికి నేను డర్బన్లో నివసిస్తు న్న భారతీయ క్రైస్త వులతో పరిచయం ఏర్పడింది. అక్కడ కోర్టు లో దుబాసీగా ఉండే పాల్గారు,

రోమన్ క్యాథలిక్కులు. మా ఇద్దరికీ స్నేహం ఏర్పడింది, దాంతో పాటు దివంగత సుభాన్ గాడ్ఫ్రేతోనూ స్నేహం ఏర్పడింది. ఆయన

అప్పట్లో ప్రొటెస్టంట్ మిషకింద ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. అలాగే ఫాదర్ జేమ్స్ గాడ్ఫ్రేతో ఆయన 1924 లో భారతదేశాన్ని

పర్యటించిన బృందంలో సభ్యుడు కూడా, ఆయనతోనూ పరిచయమైంది. ఇలాగే అదే సమయంలో దివంగత పారసీ రుస్తోంజీ,

మరియు దివంగత యాడమ్జీ మియాఖాన్లతోనూ పరిచయం కలిగింది. వ్యాపార విషయ సందర్భాల్లో తప్ప ఈ మిత్రు లంతా ఒకరికి

ఒకరు తారసపడని వీళ్లు ఎలా నాకు దగ్గరయ్యారు అనేది, నేను తరువాత వివరిస్తా ను.

అలా నేను అక్కడ నా పరిచయాలను విస్తృతపరచుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే నేను పనిచేస్తు న్న సంస్థకు న్యాయవాది నుంచి

లేఖ వచ్చింది, అందులో కేసు గురించి సన్నాహాలు చేయాలని ఉంది. దీనికోసం అబ్దు ల్లా సేఠ్ స్వయంగా ప్రిటోరియాకు వెళ్లడమా లేక

తన తరఫున ప్రతినిధిని పంపడమో చేయాల్సి ఉంది.

అబ్దు ల్లా సేఠ్ ఆ లేఖ నా చేతికిచ్చి చదవమని చెప్పి, ప్రిటోరియాకు వెళతావా అని అడిగారు. ‘నేను మీ నుంచి ఆ కేసు గురించి పూర్తిగా

అర్థం చేసుకున్న తరువాతే ఏమైనా చెప్పగలను ,’ అన్నాను. ‘ఒకవేళ నేను ఇలాగే వెళితే నేను అక్కడ ఏమి చేయాలో తెలీక నష్టం

కలుగుతుంది’ అని చెప్పాను. దాంతో ఆయన నాకు కేసు గురించి వివరించాలని తన గుమస్తా లను ఆదేశించారు. నేను ఈ కేసు

అధ్యయనం చేయడం ప్రారంభించాను. అలా చేస్తుంటే నేను ఈ వ్యవహారానికి సంబంధించి మళ్లీ ఓనమాలు నేర్చుకుంటున్నట్లు గా

అనిపించింది. నేను జాంజిబర్లో ఉన్నన్ని రోజులు కూడా అక్క డ కోర్టు కు వెళ్లి అక్కడ ఎలా పనిచేస్తుంటారో గమనించేవాడ్ని. ఒక
పారసీ న్యాయవాది కోర్టు లో ఒక సాక్షిని విచారిస్తూ అతడికి పద్దు ల పుస్తకంలోని అప్పులు, చెల్లింపులు, ఆదాయాల గురించి ప్రశ్నలు
అడుగుతున్నారు. అదంతా నాకు అర్థం కాక అయోమయంగా ఉంది. ఈ పద్దు ల పుస్తకం గురించి నేను పాఠశాలలోగానీ, లేక

ఇంగ్లండ్లో ఉన్నప్పుడు గానీ నేర్చుకోలేదు. ఇక నేను దక్షణిఫ్రికాకు ఏ కేసు పనిమీదైతే వచ్చానో ఆ కేసు పూర్తిగా జమా ఖర్చులకు

సంబంధించినదే. ఎవరికైతే ఈ పద్దు లు, జమాఖర్చుల గురించి అర్థమవుతుందో వారేర ఈ కేసు గురించి బాగా

వివరించగలుగుతారు. ఇక ఆ గుమస్తా అయితే ఇది జమా, ఇది ఖర్చు అంటూ చెప్పుకొంటూ పోతున్నారు, దాంతో నేను మరింత

గందరగోళానికి గురయ్యాను. నాకు కనీసం పి. నోట్ అంటే కూడా ఏమిటో తెలీదు. కనీసం ఇంగ్లీషు డిక్షనరీలో కూడా ఆ పదానికి

అర్థం లేదు.

Page: 99 (Original Page No. 109)


ఆ గుమస్తా కు నా ఇబ్బంది గురించి తెలియజెప్పాను. పి.నోట్ అంటే ప్రామిశరీ నోటు అని అతడి వద్ద నుంచి నేర్చుకున్నాను. పద్దు ల

పుస్తకాన్ని ఎలా నిర్వహించాలనే దానిపైన ఒక పుస్తకాన్ని కొనుక్కుని చదివాను. అది నాకు కొంత నమ్మకాన్ని కలిగించింది. నేను ఆ

కేసు గురించి అర్థం చేసుకున్నాను. పద్దు లు ఎలా రాయలో అబ్దు ల్లా సేఠ్కు ఏమీ తెలీదని నేను గ్రహించాను, కానీ అతడికి ఉన్న

వాస్తవిక పరిజ్ఞానంతో ఎలాంటి పద్దు లనైనా ఇట్టే చిటికెలో చెప్పేయగలడు. ప్రిటోరియాకు వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆయనకు

చెప్పాను.

‘మీరు ఎక్కడ బస చేస్తా రు?’ అని సేఠ్ నన్ను అడిగారు.

‘మీరు ఎక్కడ చెబితే అక్కడ బస చేస్తా ను,’ అని నేను చెప్పాను.

‘అయితే నేను మన న్యాయవాదికి ఒక లేఖ రాస్తా ను. నువ్వు బస చేయడానికి ఆయన ఏర్పాట్లు చేస్తా రు. అక్కడ నాకున్న మెమన్

మిత్రు లకు కూడా రాస్తా ను, కానీ నువ్వు వారితో కలిసి బస చేయొద్దనేది నా లసహా. మన ప్రతిపక్షం వారికి ప్రిటోరియాలా చాలా

పలుకుబడి ఉంది. మన రహస్య ఉత్తర ప్రత్యుత్తరాలు వారిలో ఎవరైనా చదివారంటే, అది మనకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. నువ్వు

వారికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచింది.’

‘మీ న్యాయవాది ఎక్కడ చెబితే అక్కడ నేను బస చేస్తా ను, లేక పోతే నేను స్వయంగా ఎక్కడైనా బస తీసుకుని ఉంటాను. మీరు

ఏమీ ఆందోళన చెందకండి, మనిద్దరి మధ్య ఉన్న విషయాలు ఇంకెవరికీ ఏ మాత్రం తెలియనివ్వను. కానీ నేను ప్రతివాదులతో కూడా

స్నేహ సంబంధాలు నెరపాలని అనుకుంటున్నాను. నేను వారికి ఒక స్నేహితుడిలాగా ఉండటానికి ప్రయత్నిస్తా ను, ఒక వేళ వీలుపడితే,

కేసులను కోర్టు బయటే పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తా ను. ఎంతైనా తయ్యబ్ సేఠ్ కూడా మీ బంధువే కదా.’

అబ్దు ల్లా సేఠ్కు సేఠ్తయ్యబ్ హాజీ ఖాన్ ముహమ్మద్ చాలా దగ్గర బంధువు.

రాజీ గురించి నేనే ప్రస్తా వించగానే ఎందుకో సేఠ్ ఒక్కసారిగా కాస్త కలవర పడ్డా రు. అది నేను గమనించాను. అప్పటికే నేను డర్బన్కు

వచ్చి ఆరు లేక ఏడు రోజులైంది. ఇప్పుడు మేమిద్దరం ఒకరి కొకరం బాగా అర్థమయ్యాం. నన్ను ఆయన ఇప్పుడు ‘తెల్ల ఏనుగు’గా

పరిగణించడం కూడా లేదు. ఆయన ఇలా చెప్పారు:

‘ని...జమే, నాకూ అదే అనిపిస్తోంది. కోర్టు వెలుపల రాజీపడటం కంటే ఉత్తమమైంది ఇంకొకటి లేదు. కానీ మేమందరం

బంధువులం, ఒకరికొకరు చాలా బాగా తెలుసు. తయ్యబ్ సేఠ్ అంత సులభంగా రాజీకి వచ్చే మనిషి కాదు. మనం గనుక ఏమాత్రం
మనం ఏమరుపాటుగా ఉన్నా, మనం తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్నివైపుల నుంచి నట్లు బిగించేస్తా రు, మనల్ని అథః
పాతాళానికి తొక్కేస్తా డు. అందువల్ల మీరు ఏం చేసినా ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించండి.’

‘దాని గురించి మీరేమీ ఆదుర్దా పడకండి,’ అన్నాను నేను. ‘నేను తయ్యబ్ సేఠ్తో మాట్లా డాలనుకుంటున్నాను, లేకపోతే ఈ కేసు

గురించి వారికి సంబంధించి ఇంకెవరితోనైనా సరే. నేను ఆయనకు ఒకటే చెబుతాను, ఒక అవగాహనకు రమ్మని, దానివల్ల

అనవసరమైన వివాదం నుంచి కాలయాపన చేయకుండా ఆదా చేసుకుందామని చెబుతాను.’

నేను వచ్చిన ఏడవ రోజో లేక ఎనిమిదవ రోజు అనుకుంటాను, నేను డర్బన్ నుంచి బయలుదేరాను. మొదటి తరగతి శ్రేణి ప్రయాణ

టికెట్ నా కోసం రిజర్వు చేశారు. దీనికోసం అయిదు షిల్లింగ్లు అదనంగా చెల్లించాల్సి రావడం అక్కడ ఆనవాయితీ.

Page: 100 (Original Page No. 110)


పరుపు కోసం ఆ మొత్తా న్ని చెల్లించాలి. అబ్దు ల్లా సేఠ్ పట్టు బట్టి పరుపు బుక్ చేశారు. కానీ నేను మాత్రం ఎందుకు దాని కోసం

అయిదు షిల్లింగ్లు వృథా చేయడం అని దాన్ని తిరస్కరించాను. కానీ అబ్దు ల్లా సేఠ్ వినకుండా నన్ను హెచ్చరించారు. ‘ఇలా

చూడండి,’ అని ఆయన అంటూ, ‘ఇది భారతదేశం లాంటి దేశం కాదు. దేవుడి దయ వల్ల మనకు కావాల్సినంత, ఇతరులకు

సాయం చేయడానికి కావాల్సినంత ఉంది. మీకు అవసరమైన ఖర్చులు చేసుకోవడానికి ఏమాత్రం సంకోచించకండి.’ అన్నారు.

ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పి, ఆ కేసు గురించి ఏమీ ఆదుర్దా చెందకండి అని చెప్పాను.

నేను ప్రయాణిస్తు న రైలు రాత్రి 9 గంటలకు రిట్జ్బర్గ్కు చేరింది, అది నాటల్ రాజధాని. ఈ స్టేషన్లోనే ప్రయాణికులకు పరుపులు

అందజేస్తా రు. రైలులోని నౌకరు నా వద్దకు వచ్చి మీకు పరుపు ఏమైనా కావాలా అని అడిగారు, ‘వద్దు , నా వద్ద ఒకటి ఉంది.’

అన్నాను. దాంతో అతడు వెళ్లిపోయాడు. కానీ ఆ తరువాత ఒక ప్రయాణికుడు వచ్చారు. నా వైపు ఎగాదిగా చూశారు. నన్ను

‘నల్లవాణ్ని’ చూసినట్లు చూశాడు. అతడికి ఏమాత్రం నచ్చనట్లుంది. బయటకు వెళ్లి ఒకరు, ఇద్దరు అధికారులతో కలిసి మళ్లీ నా

వద్దకు వచ్చారు. వాళ్లు కూడా చాలా మౌనంగా ఉన్నారు, ఇంతలో మరో అధికారి నా వద్దకు వచ్చి, ‘లేవండి ఇక్కడి నుంచి, మీరు

వెనుక సాధారణ బోగీలో ప్రయాణించాలి.’ అన్నాడు.

‘కానీ నేను మొదటి తరగతి శ్రేణి టికెట్టు కలిగి ఉన్నా,’నని నేను చెప్పాను.

‘ఆ సంగతి ఇక్కడ కుదరదు,’ అని మిగిలిన వాళ్లు శృతి కలిశారు. ‘నేను చెబుతున్నాను కదా, నువ్వు వెనుక బోగికీ వెళ్లా ల్సిందే.’
‘నేను కూడా మీకే చెబుతున్నాను, నన్ను ఈ బోగీలో ప్రయాణించడానికి డర్బన్లో అనుమతి ఇచ్చారు, నేను అలాగే ఈ బోగీలోనే
ప్రయాణించాలని అనుకుంటున్నాను.’

‘కుదరదు, నువ్వు ప్రయాణించడానికి వీలు లేదు,’ అని ఆ అధికారి అన్నారు. ‘ఈ బోగి దిగి వెళతావా లేకుండా నేను పోలీసులను

పిలిపించి బయటకు గెంటించివేస్తా ను.’

‘నిజమే, మీరు చేయగలరు, కానీ నాకు నేనుగా బోగీ దిగి వెళ్లడానికి నిరాకరిస్తు న్నాను.’

దాంతో ఒక పోలీసు కానిస్టేబుల్ వచ్చారు. నన్ను చేతులతో బలవంతంగా పట్టు కుని లాగి బయటకు పడేశారు. నా సామాగ్రి నంతా

కూడా బయటకు విసిరేశారు. నేను మరో బోగీ ఎక్కడానికి నిరాకరించాను, దాంతో రైలు కదలి వెళ్లిపోయింది. నేను వెళ్లి

ప్రయాణికులు వేచిఉండే గదికి వెళ్లా ను, నా చేతి సంచిని మాత్రం నాతో ఉంచుకుని మిగిలిన సామాను అంతా అక్కడే పెట్టా ను. రైల్వే

అధికారులు దాన్ని పరిరక్షిస్తు న్నారు.

అది చలికాలం, దక్షిణాఫ్రికాలోని ఎత్తైన కొండల ప్రాంతాల్లో అయితే చలి మరీ అధికంగా ఉంటుంది. మారిట్జ్బర్గ్ చాలా ఎత్తైన పర్వత

ప్రాంతం. అక్కడ ఎముకలు కొరికే చలి. నా కోటు నా సామాగ్రి సంచుల్లో ఉండిపోయింది, కానీ నేను దాన్ని అడిగి తీసుకునే ధైర్యం

చేయలేకపోయాను, అలా అడిగి మరోసారి వారి నుంచి అవమానపడాలని పించలేదు. ఆ గదిలో ఒక లాంథరు వెలుగుతూ ఉంది.
అర్థరాత్రి వేళ ఒక ప్రయాణికుడు నా వద్దకు వచ్చారు, వీలైతే నాతో మాట్లా డాలని అనుకుంటున్నాడు, కానీ నేను అతడితో మాట్లా డే
స్థితిలో లేను.

ఇప్పుడు నేనేం చేయాలి అనే దానిపై ఆలోచించసాగాను. నా హక్కుల కోసం పోరాడటమా లేక భారతదేశానికి తిరిగి వెళ్లిపోవడమా
లేక ఈ అవమానాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రిటోరియాకు వెళ్లడమా, ఈ కేసు ముగిసిన తరువాత భారతదేశానికి తిరిగి
వెళ్లిపోవడమా? వచ్చిన పని పూర్తి చేయకుండా తిరిగి భారతదేశానికి వెళితే అది పిరికితనమే అవుతుంది.

Page: 101 (Original Page No. 111)


ఇప్పడు నేను ఎదర్కొన్న ఈ కష్టం కొంతే - ఇది ఇక్కడ నెలకొన్న తీవ్రమైన వర్ణ వివక్షకు ఒక చిన్న లక్షణం మాత్రమే. నేను

ప్రయత్నించాలి, ఒక వీలయితే, ఈ రోగాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలి, ఇందుకోసం ఎలాంటి కష్టా లనైనా ఎదుర్కోవాలి.
అన్యాయాలను ఎదుర్కోవాలి అని నేను అనుకున్నప్పుడు ఈ వర్ణ వివక్షను రూపుమాపేందుకు ఎంతదూరం అవసరమైతే అంత
దూరం వెళ్లా ల్సిందే.

దాంతో నేను తరువాత వచ్చే రైలు అందుకుని ప్రిటోరియాకు వెళ్లా లని నిర్ణయించుకున్నాను.న

మరుసటి రోజు ఉదయం నేను రైల్వే జనరల్ మేనేజర్కు ఒక సుదీర్ఘ టెలీగ్రామ్ పంపాను, అలాగే జరిగినదాని గురించి అబ్దు ల్లా సేఠ్కు
తెలియజేశాను.

ఆయన వెంటనే రైల్వే జనరల్ మేనేజర్ను కలిశారు. కానీ ఆ మేనేజర్ కూడా రైల్వే అధికారుల తీరునే సమర్థించారు, కానీ నేను

జాగ్రత్తగా నా గయ్యం చేరుకునేలా చూడాలని స్టేషన్ మాస్టర్కు చెప్పినట్లు చెప్పారు. మారిట్ఝ్బర్గ్లో ఉన్న భారతీయ వ్యాపారులకు,

ఇతర ప్రాంతాల్లో ఉన్న తన స్నేహితులకు అబ్దు ల్లా సేఠ్ ఫోన్ చేసి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఆ వ్యాపారులంతా నన్ను
చూడటానికి స్టేషన్కు వచ్చారు, వారంతా తమకు జరిగిన అవమానాలు, కష్టా ల గురించి వివరించి చెబుతూ ఇక్కడ ఇలాంటివి
అసాధారణం కావని, నన్ను అనునయించే ప్రయత్నం చేశారు. వారుకూడా చెప్పిందేమిటంటే భారతీయులు మొదటి లేదా రెండో

తరగతి శ్రేణిలో ప్రయాణించాలంటే ఇక్కడ రైల్వే అధికారులు మరియు తెల్లవారి నుంచి ఇబ్బందులు ఎదర్కోవాల్సిందేనని. ఆ

రోజంతా ఇ లాంటి బాధాకరమైన సంఘటనలు వినడంతోనే గడచిపోయింది. ఆ రోజు సాయంత్రం రైలు వచ్చింది. అందులో నా

కోసం ఒక బెర్తు రిజర్వు చేశారు. మారిట్ఝ్బర్గ్లో నేను పరుపు టికెట్ను కొనుగోలు చేశాను, డర్బన్లో ఎక్కే సమయంలో నేను ఏదైతో

వద్దని అనుకున్నానో దాన్ని ఇప్పుడు ఇక్కడ కొన్నాను.

రైలు నన్ను చార్లెస్టౌన్కు తీసుకెళ్లింది.

9
మరిన్ని కష్టా లు
రైలు ఉదయాన్నే చార్లెస్టౌన్కు చేరింది. ఆ రోజుల్లో చార్లెస్టౌన్, జోహనెస్బర్గ్ల మధ్య రైలు మార్గం లేదు. కానీ గుర్రపు బగ్గీ ఉంటుంది.

అది వెళ్లేటప్పుడు స్టాండెర్టన్లో ఆగుతుంది. ఆ గుర్రపు బగ్గీ టిక్కెట్టు కూడా నా వద్ద ఉంది. మారిట్ఝ్ బర్గ్లో ఒక రోజు ప్రయాణం

అంతరాయం కలిగినా టికెట్ రద్దు కాకుండా ఉండిపోయింది. దాంతోపాటు చార్లెస్టౌన్లోని గుర్రపు బగ్గీ వాడికి అబ్దు ల్లా సేఠ్ ఫోన్ చేసి

మాట్లా డాడు కూడా.

కానీ ఆ ఏజెంట్ సరైనవాడు కాదు, ఏదో ఒక చిన్న కారణంతో నన్ను ఎక్కించుకోకూడదు అనుకుంటున్నాడు. నేను కొత్త అని

అతడు గుర్తించాడు, దాంతో అతడు ‘నీ టికెట్ రద్దయింది.’ అన్నాడు. నేను అతడికి తగిన సమాధానం చెప్పాను. అతడి ఉద్దేశం
వెనుక ఆంతర్యం ఏమిటంటే నన్ను గుర్రపు బగ్గీలోకి ఎక్కించుకోకూడదు, కానీ అప్పటికే లోపల మరో ప్రయాణికుడికి మాత్రం చోటు
కల్పించారు.

Page: 102 (Original Page No. 112)

కానీ నన్ను వారు ‘కూలీ’ అనుకున్నారు, పైగా కొత్తగా కనిపిస్తు న్నాను, ఆ గుర్రపు బగ్గీ ఇన్ఛార్జి (లీడర్) తెల్లవాడు, ఆయన గుర్రపు

బగ్గీ నడిపే వ్యక్తిని పిలిచాడు. బగ్గీలో తెల్ల ప్రయాణికుల పక్కన నాకు సీటు ఇవ్వొద్దని ఆదేశించాడు. దాంతో బగ్గీవాడు కూడా అదే

విదంగా ఆలోచించాడు. బగ్గీబోగీ వెలుపల రెండు వైపులా సీట్లు ఉన్నాయి. ఇందులో ఒకదాంట్లో బగ్గీ లీడరు కూర్చోవడం విధి.

ఈ రోజు అతడు తన సీటు నాకు ఇచ్చి అతడు లోపల కూర్చొన్నాడు. ఇది తీవ్రమైన అన్యాయం, అవమానం అని నాకు తెలుసు.

కానీ దాన్ని ఇక్కడితో వదిలేయడం మంచిది అని నాకు అనిపించింది. నేను బగ్గీలోపల కూర్చొంటాను అని బలవంతం చేయలేదు.

ఒక వేళ నేను లోపలే కూర్చొంటానని ఆందోళన చేస్తే ఆ బగ్గీ నన్ను అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది. అలా చేయడం అంటే మరో రోజు

వృథా చేసుకోవడమే అవుతుంది. కానీ మరుసటి రోజు ఏమి జరుగుతుందో పైవాడికే తెలుస్తుంది. మనసులో నాకు నేను ఎంతో

మదనపడుతూనే, ముందుజాగ్రత్తగా బగ్గీ నడుపుతున్న వ్యక్తి పక్కన కూర్చొన్నాను.

తెల్లవారుజామున 3 గంటలకు బగ్గీ పర్డేకోఫ్కు చేరుకుంది. ఇంతలో ఆ బగ్గీ లీడర్కు పొగ తాగాలనిపించి, బయట కొంత గాలి

పీల్చుకుందామనిపించింది, దాంతో నేను కూర్చొన్న సీటులో కూర్చోవాలని అనుకున్నాడు. దాంతో అతడు గుర్రపు బగ్గీ రౌతు వద్ద
ఒక పాత మురికి గుడ్డను తీసుకుని బగ్గీ మెట్ల వద్ద పరచి, నావైపు చూసి మాట్లా డుతూ, ‘సామి, నువ్వు దానిపైన కూర్చో, నేను
రౌతు పక్కన కూర్చోవాలని అనుకుంటున్నాను.’ అన్నారు. ఈ అవమానాన్ని నేను భరించలేకపోయాను. కాస్త భయం భయంగానే
అతడ్ని అడిగాను, ‘నన్ను లోపల కూర్చొండబెట్టు కోవాల్సి ఉన్నామీరే కదా నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పింది, అయినా సరే
అవమానాన్ని భరించాను. ఇప్పుడు మీరు బయట కూర్చొని పొగ తాగాలని అనుకుంటున్నారు, దాని కోసం నన్ను మీ పాదాల దగ్గర

కూర్చోమంటున్నారు, నేను అలా చేయలేను, కావాలంటే నేను లోపల కూర్చొంటాను.’ అన్నాను.

నా నుంచి ఆ మాటలు బయటకు వచ్చాయో లేదో, వెంటనే అతడి కోపంతో నాపైకి వచ్చాడు, నా గూభ పగలగొట్టా డు. నా చేయిని

బలంగా పట్టు కుని నన్ను కిందకు లాగిపడేయడానికి ప్రయత్నించాడు. నేను ఆ గుర్రపుబగ్గీ రాగి కడ్డీలు పట్టు కుని పెనుగులాడాను.
నా ముంజేతి ఎముకలు విరిగే ప్రమాదమున్న సరే వదలకుండా గట్టిగా పట్టు కున్నాను. లోపల ఉన్న ప్రయాణికులు ఇదంతా

చూస్తు న్నారు - అతడు నాపైకి దూసుకొచ్చాడు, నన్ను లాగి, బూతులు తిట్టా డు, కానీ నేను మాత్రం అలాగే ఉండిపోయాను.

అతడు బలిష్టు డు, నేను బలహీణుడ్ని. కొంతమంది ప్రయాణికులకు నా పరిస్థితి చూసి జాలి కలిగింది, వారంతా బయటకు వచ్చి;

‘అతడ్ని వదిలేయండి, అతడ్ని కొట్టొద్దు , ఇందులో అతడి తప్పు లేదు, అతడు చెప్పింది నిజం. ఒక వేళ అతడు అక్కడ

ఉండలేకపోతే, అతడ్ని లోపలకి వచ్చి మాతో వచ్చి కూర్చోమని చెప్పండి.’ అన్నారు. ‘భయపడొద్దు ,’ అంటూ ఆ వ్యక్తిని అరిచారు.

దాంతో అతడు కొంత వెనక్కి తగ్గాడు, నన్ను కొట్టడం ఆపాడు. నా చేతిని పట్టు కుని మరింతగా దూషించాడు. గుర్రపు బగ్గీ వెనుక
సీట్లో కూర్చొని ఉన్న నౌకరును పిలిచి ఆ సీటు ఖాళీ చేసి బగ్గీ మెట్ల వద్ద కూర్చోవాల్సిందిగా ఆదేశించాడు, ఆ నౌకరు సీటులో ఇతడు
కూర్చొన్నాడు.

ప్రయాణికులంతా తమతమ సీట్లలో కూర్చొన్నారు. ఈల ఊదారు, బగ్గీ దౌడు తీసింది. నా యదలోపుల గుండె వేగంగా

కొట్టు కుంటోంది, అసలు నేను ప్రాణాలతో నా గమ్యాన్ని చేరుకోగలనా అని నాకు ఆందోళనగా ఉంది. ఆ మనిషి ఇప్పుడు నా వైపు
చాలా కోపంగా చూస్తు న్నాడు, నావైపు వేలు చూపి హెచ్చరిస్తూ, గుర్రు గా చూస్తూ

Page: 103 (Original Page No. 113)


‘జాగ్రత్త, స్టాండెర్డ్టన్లో గనుక ఒక సారి దిగాననుకె, నా తడాఖా ఏంటో నీకు చూపిస్తా ను.’ అన్నాడు. నేనేమీ మాట్లా డకుండా

కూర్చొని, దేవుడా కాపాడు అని ప్రార్థిస్తు న్నాను.

చీకటి పడ్డా క మేం స్టాండెర్టన్కు చేరుకున్నాం, అక్కడ కొంతమంది భారతీయుల ముఖాలు చూడగానే నాకు పెద్ద ఊరట లిగింది.
నేను బగ్గీ దిగిన వెంటనే ఈ మిత్రు లంతా నా వద్దకు వచ్చి అన్నారు; ‘మేమంతా నీకు స్వాగతం పలకడానికే ఇక్కడికి వచ్చాము, నిన్ను
ఇసా సేఠ్ దుకాణం వద్దకు తీసుకెళతాం, మాకు దాదా అబ్దు ల్లా నుంచి టెలీగ్రామ్ వచ్చింది.’ నాకు చాలా సంతోషమేసింది, మేము

సేఠ్ ఇషా హాజీ సుమ్మార్ కొట్టు కు వెళ్లాం. అక్కడ సేఠ్, ఆయన గుమస్తా లంతా నా చుట్టూ చేరారు. నాకు జరిగినదంతా వారికి

చెప్పాను. ఇదంతా విని వారంతా చాలా బాధపడ్డా రు. ఇలాగే వారికి జరిగిన చేదు అనుభవాల గురించి నాకు తెలయజేసి నన్ను

అనునయించే ప్రయత్నం చేశారు.

జరిగిన ఈ సంఘటన మొత్తం గురించి ఆ గుర్రపు బగ్గీ కంపెనీ ఏజెంట్కు తెలియజేయాలని అనుకున్నాను. దాంతో నేను

జరిగినదంతా పూసిగుచ్చినట్లు వివరిస్తూ ఆయనకు లేఖ రాశాను, అతడి మనిషి నన్ను బెదిరించడం చర్యలు తీసుకోవాలని కోరాను.
అలాగే మరుసటి రోజు ఉదయం నా తిరుగు ప్రయాణంలో నాకు మిగిలిన ప్రయాణికులందరితో కలిసి బగ్గీలోపల కలిసి ప్రయాణించే
ఏర్పాట్లు చేసేలా హామీ ఇవ్వాలని కోరాను. దీనికి స్పందిస్తూ ఆ ఏజెంట్ నుంచి నాకు సమాధానం వచ్చింది: ‘స్టాండెర్టన్ నుంచి

మాకు ఒక పెద్ద బోగీ ఉన్న గుర్రపు బగ్గీ ఉంది, దాని ఇంఛార్జిగా మరో వ్యక్తి ఉంటారు. మీరు ఎవరిపైన అయితే ఫిర్యాదు చేశారు,

అతడు రేపటి నుంచి పనిలో ఉండరు, మీకు మిగిలిన అందరి ప్రయాణికులతో కలిసి సీటు ఏర్పాటు చేస్తాం.’ ఇది నాకు కొంత

స్వాంతన కలిగించింది. నిజానికి, నాపైన దాడికి పాల్పడిన వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలని నేనేమీ కోరుకోలేదు, ఇక ఈ దాడి

అధ్యాయానికి ఇంతటితో ఇక్కడ ముగిసిపోయింది.

మరుసటి రోజు ఉదయం ఇషా సేఠ్ మనిషి వచ్చి నన్ను బగ్గీ వద్దకు తీసుకెళ్లా రు. అందులో నాకు మంచి సీటు ఇచ్చారు. దాంతో

నేను ఆ రోజు రాత్రికి జోహనెస్బర్గ్కు చాలా క్షేమంగా చేరుకున్నాను.

స్టాండెర్టన్ ఒక చిన్న గ్రామం , జోహనెస్బర్గ్ ఒక పెద్ద నగరం. అబ్దు ల్లా సేఠ్ జోహనెస్బర్గ్కు కూడా తంతి ద్వారా మాట్లా డారు. అక్కడ

ముహమ్మద్ కసమ్ కమ్రు ద్దీన్ సంస్థ పేరు, చిరునామా ఇచ్చాడు. బగ్గీ ఆగిన స్థలం వద్దకు ఆయన మనిషి ఒకరు నన్ను తీసుకెళ్లడానికి

వచ్చారు. కానీ నేను అతడ్ని చూడలేదు, అతడు నన్ను గుర్తించలేదు. దాంతో నేను ఒక హోటల్కు వెళ్లా లని నిర్ణయించుకున్నాను.

నాకు అక్కడ చాలా హోటళ్ల పేర్లు తెలుసు.

ఒక ట్యాక్సీ కారు తీసుకుని గ్రాండ్ నేషనల్ హోటల్కు వెళ్లా ను. అక్కడ మేనేజరును కలిసి గది కావాలని అడిగాను. అతడు ఒక
క్షణం తెరిపారా నన్ను చూసి, చాలా సౌమ్యంగా చెప్పాడు, ‘నన్ను క్షమించండి, మా వద్ద అన్నీ భర్తీ అయ్యాయి’, సెలవు అన్నట్లు గా
నమస్కరించి వెళ్లిపోయాడు. దాంతో నేను టాక్సీ డ్రైవర్ను ముహమ్మద్ కసమ్ కమ్రు ద్దీన్ కొట్టు వద్దకు తీసుకెళ్లమని చెప్పాను.

అక్కడ అబ్దు ల్ గనీ సేఠ్ నా కోసం ఎదురు చూస్తు న్నారు. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. హోటల్ వద్ద నాకు ఎదురైన

అనుభవాన్ని విని హాయిగా నవ్వుకున్నారు. ‘మిమ్మల్ని హోటల్లోకి అనుమతిస్తా రు అని మీరు ఎలా అనుకున్నారు?’ అన్నారు.

‘ఎందుకు రానివ్వరు?’ అని అడిగాను.

‘ఇక్కడ మీరు కొన్నాళ్లుంటే మీకు అర్థమవుతుంది,’ అని ఆయన అన్నారు. ‘ఇలాంటి దేశంలో మేం గత్యంతరం లేకు ఉంటున్నాం,
కారణం, డబ్బు సంపాదించాలనే ఆశతో,

Page: 104 (Original Page No. 114)


మేము ఈ అవమానాలన్నీ మరుగునపెట్టేస్తుంటాం, కాబట్టే ఇక్కడ ఉండగలుగుతున్నాం.’ ఈ మాటలతో ఆయన దక్షిణాఫ్రికాలో

భారతీయులు పడుతున్న కష్టా ల గురించి వివరించారు.

మున్ముందు మనం సేఠ్ అబ్దు ల్ ఘనీ గురించి మరింత తెలుసుకుంటాం.

ఆయన అన్నారు: ‘నీలాంటి మనుషులకు ఈ దేశం సరిపోదు. ఇలా చూడండి, రేపు మీరు ప్రిటోరియా వెళతారు కదా, మీరు

మూడో తరగతిలోనే ప్రయాణించాల్సి ఉంటుందిద. నాటల్ కంటే ట్రాన్స్వాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. అక్కడ

మొదటి, రెండో తరగతి టికెట్లను భారతీయులకు ఎప్పుడూ ఇవ్వరు.’

‘ఈ దిశగా మీరు నిరంతర ప్రయత్నాలు ఏమీ చేయలేదా.’

‘మేము చాలా సార్లు విజ్ఞాపనలు పంపాము, కానీ నేను అనుకునేదేమిటంటే మనవాళ్ల వల్ల కూడా అని. మనవాళ్లు ఒకటో, రెండో

తరగతిలో ప్రయాణించడానికి ముందుకు రారు. రైల్వే వారి నిబంధనలు కూడా పంపాను, వాటిని చదివాం, అందులో లోపం ఉంది.

పాత ట్రాన్స్వాల్ చట్టంలో పొందుపరచినది సరైంది కాదు, స్పష్టమైనది కాదు: రైల్వే నిబంధనలు ఇప్పుడైతే మరీ తక్కువ. .

నేను సేఠ్కు చెప్పాను: ‘నేను ఒకటో తరగతిలోనే ప్రయాణించాలని అనుకుంటున్నాను, అలా నేను చేయలేనిపక్షంలో, ప్రిటోరియాకు

ట్యాక్సీలో వెళతాను, ముప్పైఏడు మైళ్ల ప్రయాణమే కదా.’

దానివల్ల ఎక్కువ సమయం, డబ్బు ఖర్చుచేయడమే అవుతుందని సేఠ్ అబ్దు ల్ ఘనీ భావించారు. కానీ నేను ఒకటో తరగతిలోనే

ప్రయాణించాలన్న నా ప్రతిపాదనకు అంగీకరించారు. దాని ప్రకారం మేం స్టేషన్ మాస్టర్కు ఒక లేఖ రాశాం. అందులో నేనే

రాసిందేమిటంటే, నేను ఒక బారిష్టర్ను, నేను ఎల్లప్పుడూ ఒకటో తరగతిలోనే ప్రయాణిస్తా ను. దాంతో పాటు లేఖలో మరోవిషయం

ఏమి రాశానంటే నేను ప్రిటోరియాకు ఎంత వీలైతే అంత తొందరగా చేరుకోవాలి అని. మీ సమాధానం కోసం వేచి ఉండే సమయం

లేనందువల్ల మీ స్పందనను నేను స్టేషన్కు వచ్చి స్వయంగా తీసుకుంటాను, నేను ఒకటో తరగతి టికెట్ ఇస్తా రని ఆశిస్తు న్నాను.

నేను ఆయన స్పందనను ఇలా వ్యక్తిగతంగా స్వీకరిస్తా నని చెప్పడానికి కూడా ఒక కారణముంది. నేను ఏమనుకున్నానంటే ఒక వేళ
స్టేషన్ మాస్టర్ గనుక రాతపూర్వకంగా జవాబిస్తే, అందులో అతడు తప్పకుండా ‘కుదరదు’, అని చెబుతాడు, ప్రత్యేకించి
ఎందుకుంటే ఒక ‘కూలీ’ బారిష్టర్ పట్ల ఆయన సొంత అభిప్రాయాలు ఆయనకుంటాయి అనుకున్నాను. దాంతో నేను ఒక నకిలీ

ఆంగ్లేయిడి తరహాలో వేషధారణలో వెళ్లా లి అనుకున్నాను. అలా అతడితో మాట్లా డి, వీలయితే ఒకటో తరగతి టికెట్

తీసుకుందామనేది నా భావన. అలా నేను స్టేషన్కు ఫ్రాక్కోటు, నెక్ టై కట్టు కుని వెళ్లి నేరుగా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి ఒకటో

తరగతి టికెట్కు సరిపడా డబ్బు పెట్టి టికెట్ అడిగాను.

‘నాకు ఆ లేఖ పంపింది మీరేనా?’ అని ఆయన అడిగారు.


‘అవును. మీరు గనుక నాకు ఒక టికెట్ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నేను తప్పనిసరిగా ఈ రోజు ప్రిటోరియా చేరాలి.’

ఆయన నా పట్ల జాలిగా చూసి, నవ్వుతూ అన్నారు: ‘నేను ట్రాన్స్వాలెర్ పౌరుడ్ని కాను. నేను హాలెండ్ పౌరుణ్ని. మీ మనోభావాలను

గౌరవిస్తు న్నాను. మీకు నా సానుభూతి కూడా ఉంది. నేను మీకు టికెట్ ఇస్తా ను - కానీ ఒక షరతు. ఏమైనా సరే, రైలు గార్డు గనుక

వచ్చి మిమ్మల్ని మూడో తరగతికి మారమని అడిగితే మాత్రం వెళ్లా ల్సిందే, ఆ వివాదంలోకి నన్ను లాగొద్దు .

Page: 105 (Original Page No. 115)


ఈ చర్యలపై నువ్వు రైల్వే కంపెనీకి వ్యతిరేకంగా పోరాడకూడదు. మీరు సురక్షితంగా ప్రయాణం చేయాలని నేను

కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే పెద్దమనిషిలా ఉన్నారు.’

ఈ మాటలు చెప్పిన తరువాత ఆయన ఒకటో తరగతి టికెట్ బుక్ చేశారు. ఆయనకు ధన్యవాదాలు చెబుతూ, ఆయనకు

అలాంటిదేమీ ఉండదనే హామీ ఇచ్చాను.

సేఠ్ అబ్దు ల్ ఘనీ నాకు వీడ్కోలు పలకడానికి స్టేషన్కు వచ్చారు. జరిగింది తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు. నాకు హెచ్చరిక

చేస్తూ అన్నారు: ‘నువ్వు గనుక క్షేమంగా ప్రిటోరియా చేరుకుంటే నేను చాలా ధన్యుడ్ని. ఒకటో తరగతి బోగీలో నిన్ను గార్డ్

మనశ్శాంతిగా కూర్చోనివ్వడనే నా భయమంతా, ఒక వేళ అతడు ఊరుకున్నా, అందులో ప్రయాణికులు అలా ఉండనివ్వరు.’

నేను ఒకటో తరగతి బోగీలోకి ఎక్కి సీటులో కూర్చొన్నాను, రైలు కదిలింది. జెర్మిస్టన్లో గార్డు వచ్చి మా టికెట్లను పరిశీలించారు. నన్ను

అక్కడ చూసి ఆయన కోపోద్రిక్తు లయ్యారు. వేలు చూపించి హెచ్చరిస్తూ మూడో తరగతి బోగీలోకి వెళ్లా లని చెప్పారు. నేను నా

మొదటి తరగతి టికెట్ను చూపించాను.

‘అదంతా కుదరదు,’ అని ఆయన అన్నాడు. ‘మూడో తరగతికి తిరిగెళ్లు .’

ఆ మొత్తం బోగీలో ఒకే ఒక ఆంగ్లేయిడు ప్రయాణిస్తు న్నారు. ఆయన ఆ గార్డు కు అడ్డు పడ్డా రు. ‘ఈ పెద్ద మనిషిని ఇబ్బంది

పెట్టడంలో మీ ఉద్దేశమేమిటీ?’ అని ప్రశ్నించారు. ‘ఆయన ఒకటో తరగతి టికెట్ కలిగి ఉండటం నువ్వు చూడటం లేదా? ఆయన

నాతో కలిసి ప్రయాణం చేయడం వల్ల నేనేమీ అనుకోను.’ అంటూ, నావైపు చూసి అన్నారు, ‘మీరు ఇక్కడ సౌకర్యంగా కూర్చొండి.’

అన్నారు.
ఆ గార్డు సణిగాడు: ‘ఈ కూలీతో కలిసి నువ్వు ప్రయాణం చేయదలిస్తే, నేనేం చేయగలను?’ అనుకుంటూ వెళ్లిపోయారు.

సాయంత్రం 8 గంటలకు రైలు ప్రిటోరియాకు చేరుకుంది.

10
ప్రిటోరియాలో మొదటి రోజు
ప్రిటోరియా స్టేషన్లో నన్ను తీసుకెళ్లడానికి దాదా అబ్దు ల్లా న్యాయవాది తరఫున ఎవరో ఒకరు వస్తా రని ఊహించాను. ఇక్కడ నన్ను

తీసుకుని వెళ్లడానికి భారతీయులు ఎవరూ రారు అనే సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను అక్కడ భారతీయుల ఇళ్లలో

నివాసం ఉండబోనని ఆయనకు వాగ్దా నం చేశాను కాబట్టి. కానీ ఆ న్యాయవాది మాత్రం ఎవర్నీ పంపలేదు. తరువాత నాకు

అర్థమైంది ఏమిటంటే, నేను ఆదివారం వచ్చాను అని, దాంతో ఆయన ఎవరికీ అసౌకర్యం కలిగించలేక నా వద్దకు ఎవర్నీ పంపలేదు.
నేను గాభరాపడ్డా ను, ఎక్కడికి వెళ్లా లి అనే ఆందోళన కలిగింది, ఎందుకంటే బస చేయడానికి ఏ హోటల్ కూడా నాకు
అనుమతివ్వదనే భయం ఉంది.

Page: 106 (Original Page No. 116)


1893 లో ప్రిటోరియా స్టేషన్ పరిస్థితులు 1914 నాటి పరిస్థితులకంటే భిన్నమైనవి. అక్కడ దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి.

ప్రయాణికులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. నేను ప్రయాణికులందరూ వెళ్లిపోయేంతవరకు వేచి ఉండి, టికెట్ కలెక్టరు
కొంచెంత తీరకగా ఉన్నప్పడు ఆయన వద్దకు వెళ్లా ను, నా టెకెట్ను ఆయన చూపించి, ఇక్కడ ఏమైనా నేను దిగడానికి చిన్న హోటల్
ఉందేమో సలహా ఇస్తా రేమో లేక, మరేదైనా సరైన ప్రాంతం గురించి సలహా ఇసత్ఆరమేని ఆశించాను. లేకపోతే నేను ఆ రాత్రి ఆ

స్టేషన్లోనే గడపాల్సి వస్తుందేమోనని అనుకుంటున్నాను. అతడ్ని ఈ విషయం అడగడానికి కూడా నాకు కాస్త జంకుగా ఉంది,

ఎందుకంటే అవమానిస్తా డేమోనన్న అనుమానం.

స్టేషన్ నుంచి ప్రయాణికులందరూ వెళ్లిపోయారు. నేను నా టికెట్ను టికెట్ కలెక్టర్కు ఇచ్చి ఆయన వద్ద నుంచి ఆరా తీయడం

ప్రారంభించాను. ఆయన చాలా మర్యాదపూర్వకంగా సమాధానాలు చెప్పారు. కానీ ఆయన నేను ఆశించిన రీతిలో సాయ
పడలేరని నాకు అనిపించింది. అయితే మా పక్కనే ఉంటూ మా సంభాషణలు వింటున్న ఒక అమెరికా నీగ్రో మా మాటలకు అడ్డు

తగులుతూ మాతో మాట కలిపారు.

‘మిమ్మల్ని చూస్తుంటే,’ అని ఆయన అన్నారు, ‘మీరు ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్తలాగా కనిపిస్తు న్నారు, కనీసం ఇక్కడ మిత్రు లు
కూడా ఎవరూ లేనట్లుంది. మీరు గనుక నాతోపాటు వస్తే, నేను మిమ్మల్ని ఒక చిన్న హోటల్కు తీసుకెళతాను, ఆ హోటల్

యజమాని అమెరికాకు చెందినవారు, ఆయన నాకు బాగా తెలుసు. ఆయన మీకు గది ఇవ్వడానికి అంగీకరిస్తా రని

అనుకుంటున్నాను.’

ఆయన చెబుతున్నదానిపై నా అనుమానాలు నాకున్నాయి, కానీ ఆయన ధన్యవాదాలు తెలిపి, ఆయన సలహాను పాటించాను.

అలా ఆయన నన్ను జాన్స్టన్ ఫ్యామిలీ హోటల్కు తీసుకెళ్లా రు. నన్ను పన్కన నిలబడమని చెప్పి ఆయన జాన్స్టన్తో మాట్లా డి

వచ్చారు. తరువాత ఆయన ఆ హోటళ్లో ఆ రాత్రి బస చేయడానికి అంగీకరించారు. కానీ రాత్రి భోజనం మాత్రం నాకు నా గదికే

పంపుతామనే షరతు మీదనే గది ఇచ్చారు.

‘నేను మీకు హామీ ఇస్తు న్నాను,’ అని ఆయన అంటూ, ‘నాకు ఎలాంటి వర్ణ వివక్ష లేదు, కానీ ఇక్కడ నేను ఊరోపా కట్టు బాట్లను
పాటించాలి, ఒక వేళ మిమ్మల్ని గనుక నేను భోజన శాలలో భోజనం చేయడానికి అనుమతించాననుకోండి, అక్కడ ఉన్న నా
అథిదులంతా దీనికి అడ్డు చెప్పవచ్చు లేకపోతే వారు ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.’ అన్నారు.

‘మీకు కృతజ్ఞతలు,’ అని నేను అన్నాను, ‘మీరు ఈ రాత్రికి నాకు కేవలం బస చేయడానికి అనుమతిచ్చినా సరే. నాకు ఇప్పడిప్పుడే
ఇక్కడ పరిస్థితులు ఎంతో కొంత అవగతమవుతున్నాయి, నేను ఇబ్బందులను అర్థం చేసుకోగలను, మీరు నాకు భోజనం నా గదికి
పంపితే నేను ఏమీ అనుకోను. రేపు నేను మరేదైనా ఇతర ఏర్పాట్లు చేసుకోగలను అని అనుకుంటున్నాను.’

నాకు గదిఆ చూపించారు, అక్కడ నేను భోజనం కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ గడిపాను. గదిలో నేను ఒక్కడినే. ఆ హోటళ్లో

అతిథులు ఏమంత ఎక్కువగా లేరు. వెయిటర్ తొందరగానే భోజనం తీసుకొస్తా రని ఊహించాను. కానీ వెయిటర్కు బదులుగా

జాన్స్టన్ నా గదిలో ప్రత్యక్షమయ్యారు. ఆయన అన్నారు: ‘మిమ్మల్ని ఇలా గదిలోనే భోజనం చేయమని అడిగినందుకు నేను

సిగ్గుపడ్డా ను. ఇక్కడున్న ఇతర అతిథులకు మీ గురించి చెప్పాను, మీకేమీ అభ్యంతరం లేకపోతే ఆయన కూడా మీతో పాటే ఇక్కడ

భోజన శాలలో భోజనం చేస్తా రు అని అనిడిగాను. వారు దానికి చాలా సంతోషంగా అంగీకరించారు, ఆయన మాతో కలిసి భోజనం
చేయడానికి మాకేమీ అభ్యంతరం లేదు, ఆయనకు ఎన్నాళ్లు ఇష్టముంటే అన్నాళ్లు ఈ హోటల్లోనే ఉండొచ్చు, మాతో కలిసి భోజనం
చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి మీరు దయచేసి భోజన శాలకు వచ్చి భోజనం చేయండి, అలాగే మీరు ఇక్కడ ఎన్ని రోజులు

అవసరమైతే అన్ని రోజులు బస చేయొచ్చు.’

Page: 107 (Original Page No. 117)


నేను అతడికి మరోమారు కృతజ్ఞతలు చెప్పి, భోజన శాలకు వెళ్లి సంతృప్తిగా భోజనం చేశాను.

మరుసటి రోజు ఉదయం నాకు న్యాయవాది (అటార్నీ) ఏ.డబ్ల్యూ, బేకర్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన గురించి నాకు అబ్దు ల్లా

సేఠ్ ఇదివరకే కొంత చెప్పియున్నారు, కనునక ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించడం నాకేమంత ఆశ్చర్యం కలిగించలేదు.

ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేశారు. నా గురించి ఆయన విషయాలు చెప్పాను. ఆయన మాట్లా డుతూ:

‘బారిష్టర్గా మీరు ఇక్కడ చేసే పని ఏమీ లేదు. దాని కోసం ఇప్పటికే మేము మంచి లాయర్లను వినియోగించుకుంటున్నాం. ఈ కేసు

చాలా కాలంగా కొనసాగుతోంది. చాలి సంక్లిష్టమైన కేసు. మాకు ఏదైనా అదనపు సమాచారం కావాలని అనిపించినప్పుడు మాత్రమే

నేను మీ సహాయం తీసుకుంటాను. నా కక్షిదారుతో నేను జరిపే ఉత్తరప్రత్యుత్తరాలు మరింత సులభతరంగా చేయడంలో మీరు

సహాయపడగలరనుకోండి, నేను ఇప్పుడు నాకు ఆయన నుంచి కావాల్సిన సమాచారాన్నంతా మీ ద్వారా అడుగుతాను. అది

తప్పకుండా ఎంతో మేలు చేసేదే. నేను ఇంకా మీకు బస చేయడానికి గది చూడలేదు, మిమ్మల్ని చూసిన తరువాత ఆ పని చేస్తే

ఉత్తమంగా ఉంటుందని నేను భావించాను. ఇక్కడ వర్ణ వివక్ష చాలా భయకరంగా ఉంది, దాంతో ఇక్కడ మీలాంటి వ్యక్తు లకు

తొందరంగా బస చూడటం అంత సులభం కాదు. కానీ నాకు ఓ పేద మహిళ తెలుసు. ఆమె రొట్టెలు అమ్మే ఆయన భార్య. ఆమె

నీకు ఆశ్రయం ఇచ్చి తద్వారా మరింత ఆదాయం గడిస్తుందని అనుకుంటున్నాను. రండి, మనం ఆమె ఇంటికి వెళదాం .’

అలా ఆయన నన్ను ఆమె ఇంటికి తీసుకెళ్లా రు. ఆమెకు పక్కకు తీసుకెళ్లి నా గురించి వ్యక్తిగతంగా ఆమెతో మాట్లా డారు. వారానికి

35 షిల్లింగులు చెల్లించి ఆమె ఇంట్లో బస చేయడానికి ఆమె అంగీకరించారు.

బేకర్ గారు కేవలం వకీలు మాత్రమే కాకుండా ఆయన ఒక గొప్ప మత బోధకుడు కూడా. ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నారు,

ఇప్పుడు ఆయన తన న్యాయవాద వృత్తిని పూర్తిగా వదిలేసి పూర్తిగా మిషనరీ కార్యకలాపాల్లోనే నిమగ్నమై ఉన్నాను. ఆయన బాగా

కలిగిన వారు. ఇప్పటికీ నాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతుంటారు. ఆ ఉత్తరాల్లో ఆయనది ఎప్పుడూ ఒకటే సారాంశం

ఉంటుంది. ఆయన వివిద అభిప్రాయ కోణాల నుంచి క్రైస్త వమతం చాలా ఉన్నతమైనదని పైకెత్తేస్తుంటారు, మానవాళిని రక్షించేది
కేవలం దేవుడి కుమారుడు మాత్రమే, ఎవరైనా సరే ఏసు ప్రభువును ప్రార్థించనిదే వారికి శాంతి లభించడం అనేది అసాధ్యమని
చెబుతుంటారు.

.
మా మధ్య జరిగిన మొటి ఇంటర్వ్యూలోనే బేకర్ నా కున్న మతపరమైన అభిప్రాయాలను మదింపు వేశారు. నేను ఆయనకు

చెప్పాను: ‘నేను పుట్టు కతోనే హిందువును, అయినప్పటికీ నాకు ఇప్పటి వరకు హిందూ మతం గురించి ఎక్కువగా తెలియదు,

ఇతర మతాల గురించి కూడా చాలా తక్కువే తెలుసు. నిజానికి నేను ఎక్కడ ఏ స్థితిలో ఉన్నానో కూడా నాకు తెలియదు. ఏది

ఏమిటో, నేను దేన్ని విశ్వసించాలో కూడా నాకు తెలీదు. నేను నా మతం గురించి సునిశితంగా అధ్యయనం చేయాలని
అనుకుంటున్నాను, దాంతో పాటుగా నాకు సాధ్యమైనంత వరకు ఇతర మతాలను గురించి కూడా అధ్యయనం చేయాలని
అనుకుంటున్నాను.’

బేకర్ గారు నా మాటలు విని చాలా సంతోషించారు. ఆయన అన్నారు: ‘దక్షిణాఫ్రికా జనరల్ మిషన్ డైరెక్టర్లలో నేను కూడా ఒకడిని.

నా సొంత ఖర్చుతో ఒక చర్చిని నిర్మించాను అక్కడ క్రమం తప్పకుండా వేడుకలు నిర్వహిస్తుంటాం. నేను ఈ కుల వివక్షకు

దూరంగా ఉంటాను. ఇక్కడ నాతో పాటు పనిచేసే కొంతమంది సహచరులు కూడా ఉన్నారు. మేమంతా ప్రతి రోజూ ఒంటి

గంటలకు కొంతసేపు కలుసుకుంటాం, కొన్ని నిమిషాల పాటు శాంతి, క్రాంతి కోసం ప్రార్థనలు చేస్తాం. మీరు కూడా గనుక మాతో

కలిస్తే నేను ఎంతో సంతోషిస్తా ను. నేను మిమ్మల్ని నా సహచరులకు పరిచయం చేస్తా ను, వారు కూడా మిమ్మల్ని కలుసుకున్నందుకు

ఎంతో సంతోషిస్తా రు.

Page: 108 (Original Page No. 118)


నేను గట్టిగా చెప్పగలను, వారితో సాంగత్యం మీకు కూడా నచ్చుతుంది. దీంతోపాటు మీకు నేను కొన్ని మత గ్రంథాలు కూడా

ఇస్తా ను. అది అన్ని పుస్తకాల కంటే అత్యున్నత పుస్తకం కూడ అనుకోండి, అది పవిత్ర బైబిల్, దాన్ని మీకు నేను ప్రత్యేకించి

ఇస్తు న్నాను.’

బేకర్గారికి ధన్యవాదాలు చెప్పాను ఒంటి గంటకు జరిగే ప్రార్థనలకు రోజూ సాధ్యమైనంతవరకు వస్తా నని అంగీకారం తెలిపారు.

‘అయితే నేను రేపు ఒంటి గంటకు మీ కోసం ఇక్కడ ఎదురు చూస్తుంటా, మనం అందరం కలిసి ప్రార్థనకు వెళదాం,’ అని బేకర్
గారు చెప్పగానే మేం ఇద్దరం సెలవు తీసుకుని వెళ్లిపోయాం.

అప్పటి దాకా నాకు ఆలోచించడానికి సమయం దొరకలేదు.


నేను జాన్స్టన్ వద్దకు వెళ్లా ను, అక్కడ హోటల్ బిల్లు చెల్లించేసి, గది ఖాళీ చేసి, కొత్త బసకు చేరుకున్నాను. అక్కడే మధ్యాహ్న

భోజనం అయింది. ఆ ఇంట్లో మహిళ చాలా మంచి మహిళ. ఆమె నా కోసం శాఖాహార భోజనం వండింది. నేను ఆ కుటుంబంతో

ఇట్టే కలిసిపోవడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు.

తరువాత నేను దాదా అబ్దు ల్లా తన స్నేహితుడికి అందించమని రాసిన లేఖను ఇవ్వడానికి ఆయన మిత్రు డిని కలవడానికి వెళ్లా ను.

ఆయన ద్వారా దక్షిణాఫ్రికాలో భారతీయులు పడుతున్న మరిన్ని కష్టా ల గురించి తెలుసుకున్నాను. ఆయన నన్ను తనతో పాటు

ఉండమని బలవంతపెట్టా డు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, నేను ఇప్పటికే మాట ఇచ్చిన సంగతి తెలిపాను. నాకు ఎప్పుడు ఎలాంటి

అవసరం వచ్చినా ఏమాత్రం వెనుకాడకుండా తనను అడగాలని ఆయన కోరారు.

చీకటి పడింది. నేను ఇంటికి చేరుకున్నాను. రాత్రి భోజనం చేశాను. నా గదికి వెళ్లి పడుకోగానే గాఢ నిద్రపట్టేసింది. అక్కడ

వెనువెంటనే చేయాల్సిన పని ఏమీ లేకపోయింది. అబ్దు ల్లా సేఠ్కు ఈ విషయం చెప్పాను. బేకర్ గారు నాపైన ఇంత ఆసక్తి
ప్రదర్శించడానికి అర్థం ఏమిటీ? ఆయన మత సహచరుల నుంచి నేను పొందగలిగేదేమిటీ? నేను క్రైస్త వం గురించి నేర్చుకోవడం
ఎంతవరకు సమంజసం? హిందూ మతానికి సంబంధించి సాహిత్యాన్ని అక్కడ పొందడమెలా? నా సొంత మతం గురించి నాకు
పూర్తిగా తెలియకుండా క్రైస్త వ మతం గురించి నేను సరిగ్గా ఎలా అర్థం చేసుకునేది? చివరకు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా
వద్దకు వచ్చిన అన్ని అంశాలను ఎలాంటి పక్షపాతం లేకుండా ఓర్పుతో అధ్యయనం చేయాలి, భగవంతుడు చూపించిన విధంగా
బేకర్ గారి బృందంతో మెలగాలి అనుకున్నాను. నా సొంత మతం గురించి నేను పూర్తిగా తెలుసుకోకుండానే ఇతర మతాన్ని

అంగీకరించకూడదు అనుకున్నాను.

అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.

Page: 109 (Original Page No. 119)

11
క్రైస్త వులతో పరిచయం
మరుసటి రో.ఉ ఒంటి గంటలకు బేకర్ గారి ప్రార్థనా సమావేశానికి వెళ్లా ను. అక్కడ నన్ను మిస్ హర్రీస్, మిస్ గబ్, మిస్టర్ కోట్స్

మరికొంతమందికి నన్ను పరిచయం చేశారు. అందరూ మోకాళ్లపైన కూర్చొని ప్రార్థన చేశారు, నేను కూడా వారిని అనుసరించాను.
ఆ ప్రార్థనలు, ప్రతి ఒక్కరూ తమ తమ కోరికలను బట్టి ప్రభువుకు చేస్తు న్న విన్నపాలున్నాయి. అవి సహజంగా ఆ రోజు ప్రశాంతంగా

గడచుగాక అని కోరడమే లేక, దేవుడు తన హృదయ ద్వారాలు తెరవాలని కోరడంలాటివి ఉంటాయి.

ఇప్పుడు నా క్షేమం కోసం ఒక ప్రార్థన కూడా ఇందులో జతకలిసింది: ‘ప్రియమైన ప్రభువా, మాతో కలసి వచ్చిన ఈ ప్రియ

సోదరుడకు మీరు మార్గమును చూపండి, దేవుడా, మాకు ఎలాంగైతే శాంతిని ప్రసాదించారో, అతడికి కూడా శాంతిని కల్పించండి.

మమ్మల్ని కాపాడుతున్న ఏసు ప్రభువు ఇతడిని కూడా కాపాడుగాక. ప్రభువాత అతడి తరఫున మీకు ఈ విన్నపం చేస్తు న్నాం తండ్రీ.’

ఈ సమావేశాల్లో ఎలాంటి పద్యాలు పాడటం కానీ, సంగీత వాయిద్యాలు మోగించడం గానీ ఏమీ లేవు. అలా ప్రతి రోజు ప్రార్థనలు

ముగియగానే మేమందరం అక్కడి నుంచి వెళ్లిపోయేవాళ్లం. అది భోజన సమయం, అందరూ భోజనాలకు వెళ్లా ల్సినసమయం.

దాంతో ఈ ప్రార్థనలు అయిదు నిమిషాలకు మించి చేసేవాళ్లు కారు.

మిస్ హర్రీస్, గభ్ ఇద్దరూ పెండ్లి కాని యువతులు. మిస్టర్ కోట్స్ మాత్రం క్వాకర్ తెగకు చెందిన వ్యారు. ఆ ఇద్దరు అవివాహిత

మహిళలు కలిసి ఉంటున్నారు. వారు ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వారి ఇంటికి తేనీరు సేవించడానికి

రావాల్సిందిగా ఆహ్వానించారు.

మేముం ఆదివారం కలిసినప్పుడు, మిస్టర్ కోట్స్గారికి నేను ఆ వారం చదివిన మతగ్రంథాల గురించి చెప్పేవావడ్ని. ఆ పుస్తకాల

గురించి చర్చించేవాళ్లం, ఆ పుస్తకాలపై నాకు కలిగిన అభిప్రాయాన్ని కూడా వారితో పంచుకునేవాడ్ని. ఆ ఇద్దరు మహిళలు తమ

మదురమైన అనుభవాల గురించి చెప్పేవారు, వారికి అనుభూతి పొందిన శాంతి గురించి మాట్లా డేవారు.

మిస్టర్ కోట్స్గారు చాలా నిర్మల హృదయం కలిగిన పరిపూర్ణ యువకుడు. మేమిద్దరం కలిసి అలా బయట తిరిగేవాళ్లం, ఆయన

నాకు మరికొంతమంది క్రైస్త వ స్నేహితులను పరిచయం చేశారు.

అలా మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాక, ఆయన తన అభిరుచి మేరకు నాకు కొన్ని పుస్తకాలు ఇవ్వసాగారు, వాటితో నా
పుస్తకాల అల్మరా నిండిపోయింది. ఆయన నాకు దండిగా పుస్తకాలు ఇచ్చేవారు, ఆయనపైన విశ్వాసంతో నేను ఆ పుస్తకాలను చదివే

వాడ్ని, వాటి గురించి ఆయనతో చర్చించేవాడ్ని.

1893 లో నేను అలాంటి పుస్తకాలను చాలా చదివాను. ఆ పుస్తకాల పేర్లు అన్నీ గుర్తు కు రావడం లేదు కానీ, వాటిలో డాక్టర్ పార్కర్

రాసిన ది సిటీ టెంపుల్, పియర్సన్ రాసిన మెనీ ఇఫాలిబుల్ ప్రూ ఫ్స్ అండ్ బట్లర్ అనాలజీ కూడా అందులో ఉన్నాయి. ఈ

గ్రంథాల్లోని కొన్ని భాగాలు నాకు అర్థం కాలేదు. వాటిలో కొన్ని అంశాలు నాకు బాగా నచ్చాయి, మరికొన్ని పెద్దగా నచ్చలేదు. మెనీ

ఇన్ఫాలిబుల్ ప్రూ ఫ్స్ పుస్తకంలో ఆ రచయితకు అర్థమైనంతవరకు చాలా ఆధారాలను బెబిల్ యొక్క మతానికి మద్దతుగా ఉండేవి.

ఈ పుస్తకం నాపైన ఎలాంటి ప్రభావం చూపలేదు.


Page: 110 (Original Page No. 120)
పార్కర్గారి నీతి వ్యాఖ్యానాలు ఉత్తేజభరితంగా ఉన్నప్పటికీ, క్రైస్త వ మత విశ్వాసాలపై నమ్మకం లేని వారికి ఇది ఏ విధంగానూ
ఉపయోగపడదు. బట్లర్ అనాలజీ పుస్తకం చాలా గంభీరమైంది, సంక్లిష్టమైన పుస్తకం. కనీసం నాలుగు అయిదు సార్లు చదివితే గానీ

పూర్తిగా అర్థం కాదు. అది నాస్తిక వాదులను ఆస్తికవాదంలోకి మార్చాలనే దృష్టితో రాసినట్లు గా నాకు అనిపించింది. అందులో

దేవుడు ఉన్నాడని అందులో ఏసిన గట్టి వాదనలు నాకు అనవసరమైనది. ఎందకంటే నేను అప్పటికే అవిశ్వాసా స్థితిని దాటేశాను.
కానీ దేవుడికి, మనిషికి మధ్య సంధాన కర్తగా ఉండటానికి దేవుడు ఒక్క ఏసుక్రీస్తు ను మాత్రమే సృష్టించాడనే వాదన నాకు
హృదయంగమంగా అనిపించలేదు.

కానీ మిస్టర్ కోట్స్ మాత్రం ఓటమిని అంత సులభంగా అంగీకరించే వ్యక్తి కాదు. ఆయనకు నా పట్ల చాలా ఆప్యాయతుంది. ఆయన

నా మెడ చుట్టూ చూశారు, తులసీ దళాలతో చేసిన వైష్ణవ మాల అది. ఆయన దాన్నో మూడ విశ్వాసంగా భావించారు, చాలా

నొచ్చుకున్నారు. ‘ఈ పిచ్చి నమ్మకం మీది కాదనుకుంటాను. రండి, నన్ను ఆ దుండను తెంచేయనివ్వండి.’

‘కుదరదు, మీరు అలా చేయకూడదు, ఇది మా తల్లిగారు నాకిచ్చిన పవిత్రమైన బహుమతి.’

‘అయితే దాన్ని మీరు నమ్ముతున్నారా?’

‘అందులో ఏమి మహత్తు ఉందో నాకు తెలియదు. దాన్ని నేను దరించకపోవడం వల్ల నాకు కీడు జరుగుతుందని నేను భావించడం

లేదు. కానీ, నా శ్రయేస్సు కోరి మా అమ్మ ప్రేమతో నా మెడలో వేసిన ఈ మాలను తగు కారణాలు ఏవీ లేకుండా నేను మెడలోంచి

తీయను. కాల గమనంలో దానంతగా అదే పాడైపోయి, తెగిపోయి పడిపోవాలి, అలా జరిగినప్పుడు మరో దండ తీసుకని మెడలో

వేసుకోవాలని నాకేమీ లేదు, కానీ ఈ దండను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పాడు చేయను.’

నా వాదనను మిస్టర్ కోట్స్గారు అభినందించలేకపోయారు, కారణం ఆయనకు నా మతంపైన ఏ మాత్రం విశ్వాసం లేదు. ఆయన

నన్ను అజ్ఞాన అగాధం నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇతర మతాల్లో కొంత నిజమున్నా సరే, సత్యానికి
ప్రతీకగా భావించే క్రైస్త వ మతాన్ని నేను స్వీకరిస్తే తప్ప పరిష్కారాలు అసాధ్యమని, ఒక్క ఏసుక్రీస్తు ద్వారా తప్ప నేను చేసిన పాపాలు
పొగోట్టబడవని, అలా కానప్పుడు చేసిన మంచిపనులన్నీ నిఫ్ప్రయోజనమని ఆయన నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఆయన నాకు పలు పుస్తకాలను పరిచయం చేసిన మాదిరిగానే, పలువురు స్నేహితులను ఆయన పరిచయం చేశారు, వారంతా
కరుడుగట్టిన క్రైస్త వ విశ్వాసులే. వాటిలో ఒకటి క్రైస్త వ శాఖకు చెందిన ప్లైమౌత్ బ్రెథ్రెన్ వారి కుటుంబం.

మిస్టర్ కోట్స్ గారికి పరియస్తు లంతా చాలా బాగా చదువుకున్నవారు. పాపబీతి ఉన్నవారు. కానీ ఈ కుటుంబంతో జరిగిన

పరిచయంలో, ప్లైమౌత్ బ్రెథ్రెన్ కుటుంబంలో ఒకరు నేను ఏమాత్రం సిద్ధపడకుండానే నాతో వాదనకు దిగారు:
Page: 111 (Original Page No. 121)
‘మా మతం సౌందర్యాన్ని మీరు అర్థం చేసుకోలేదు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే, మీరు జీవితంలో అనుక్షణం కష్టా లను

దాటడం గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ తన పాపాలను సరిదిద్దు కుని వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే.

ఎడతెగని ఈ క్రియా చక్రం నుంచి మీకు మోక్షసిద్ధి ఎలా సాధ్యమవుతుంది? మీకెప్పటికీ శాంతి లభించదు. మనందరం

పాపులమేనని మీరు అంగీకరిస్తు న్నారు. కానీ ఒక సారి మా విశ్వాసం ఎంత పరిపూర్ణంగా ఉంటుందో చూడండి. అభివృద్ధి,

ప్రాయశ్చిత్తా ల కోసం మనం చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే, అయినప్పటికీ మనకు తప్పకుండా మోక్షం కావాల్సిందే. మనం ఈ పపాల

భారాన్ని ఎలా మోయగలం? మనం భరించగలం, కానీ వాటిని ఏసుప్రభువుపైకి వేసేయాలి. ఆయన ఒక్కడే పాపరహితుడైన దేవుని

కుమారుడు. ఎవరైతే ఆయన యెడల విశ్వాసం కలిగి ఉంటారో వారి పాపాలను పరిహరించబడుననేది ఆయన వాఖ్యం.

అందులోనే దేవుని అనంతమైన దయ ఉంది. ఏసుప్రభువు యొక్క ముక్తిపై మనం విశ్వాసం ఉంచుకున్నచో, మనకు ఎలాంటి

పాపాలు అంటవు. మనం తప్పకుండా పాపాలు చేస్తాం, పాపరహితంగా ఈ లోకంలో జీవించడం అసాధ్యం. అందుచేత ఏసు

ప్రభువు మానవులు చేసే పాపాలచే బాధింపబడి, ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఈ ఏసు ఒక్కడే రక్షకుడిని నమ్మిన వాడికే శాంతి

లభిస్తుంది. ఆలోచించండి మీది ఎంత అశాంతి జీవితం, మాది ఎంత నమ్మకమైన ప్రశాంత జీవితమో.’

నాకు నచ్చచెప్పడంలో వారి వాదన పూర్తీగా విఫలమైంది. నేను వారికి చాలా సౌమ్యంగా బదులు చెప్పాను: ‘ఒకవేళ దీన్నే గనుక

క్రైస్త వులందరూ క్రైస్త వం అని అనుకుంటే, దాన్ని నేను అంగీకరించను. నా పపాల పర్యవసానాల నుంచి నేను విముక్తిని కోరుకోను.

నేను పాపం నుంచే విముక్తి పొందాలనుకుంటాను లేకపోతే అసలు పాపపు ఆలోచనల నుంచే విముక్తి కావాలని కోరుకుంటాను.

అలాంటి అంతిమ స్థితి చేరుకునేంత వరకు నాకు అశాంతియే ప్రీతికరం.’

దీనికి ప్లైమౌత్ బ్రదర్ బదులిచ్చారు: ‘నేను మీకు హామీ ఇస్తు న్నాను, మీ ప్రయత్నాలన్నీ నిష్ఫలమే. నేను చెప్పిందానిపై మరొకమారు

ఆలోచించండి.’

ఆయన మాటల్లా గే ఆయన చేతలున్నాయి. ఆయన బుద్దిపూర్వకంగా తప్పులు చేస్తా రు. అంతటితో ఆగకుండా అవేమీ నా

మనసును ఆందోళన కలిగించలేకపోయాయని చాటే ప్రయత్నం చేస్తా రు.

అయితే ఇలాంటి ప్రాయశ్చిత్త సిద్ధాంతాలను క్రైస్త వులు నమ్మరని నాకు ఈ మిత్రలను కలవడానికి ముందే తెలుసు. మిస్టర్ కోట్స్

గారు మాత్రం తనకు తాను పాపబీతితో వ్యవహరిస్తు న్నారు. కానీ ఆయన చాలా నిర్మల హృదయుడు. స్వీయ పరివర్తన

పరిశుద్దు లవడం సాధ్యమనే విశ్వాసం కలిగిన వారు. ఆ ఇద్దరు మహిళల నమ్మకం కూడా అదే. నా చేతుల్లోకి వచ్చి చేరిన కొన్ని

పుస్తకాల్లో కొన్ని పూర్తి భక్తి ప్రధానమైనవే. నాకు తాజాగా ఎదురైన అనుభవం గురించి కోట్స్ గారు చాలా ఆందోళన చెందుతున్నారు,
ప్లైమౌత్ బ్రదర్ తన మతం పట్ల చేసిన వక్రభాష్యం కారణంగా నేను క్రైస్త వానికి వ్యతిరేకంగా ఎలాంటి వివక్ష పెట్టు కోనని కోట్స్ గారికి
నేను గట్టి హామీ ఇచ్చాను.

నాకు మరెక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉన్నదల్లా బైబిల్ మరియు అందులో ఆమోదించిన తాత్పర్యంతోనే.

Page: 112 (Original Page No. 122)

12
భారతీయులతో పరిచయం
క్రైస్త వులతో పరిచయాల గురించి మరికొంత రాయడానికి ముందుగా, అదే సమయంలో నాకు ఎదురైన ఇతర అనుభవాల గురించి
ఇక్కడ ప్రస్తా విస్తా ను.

నాటల్లో దాదా అబ్దు ల్లా ఎలాంటి స్థితిలో ఉన్నారో ఇక్కడ ప్రిటోరియాలో కూడా సేఠ్ త్యబ్ హాజి ఖాన్ ముహమ్మద్ అలాంటి స్థితిలో
ఉన్నారు. ఆయన లేకుండా అక్కడ ఎలాంటి సమావేశాలు జరిగేవి కావు. నేను వెళ్లిన మొదటి వారంలోనే ఆయనతో స్నేహం
చేసుకున్నాను, నేను ఇక్కడ ప్రిటోరియాలోని భారతీయులందరితో పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నట్లు నేను ఆయనతో
చెప్పాను. ఇక్కడ భారతీయుల పరిస్థితుల గురించి తెలుసుకోవాలని ఉందని, ఇందులో ఆయన సహాయం కోసం అర్థించాను.

సహాయం చేయడానికి ఆయన ఆనందంగా అంగీకరించారు.

ప్రిటోరియలో భారతీయులందరితో సమావేశం కావడం ద్వారా నా మొదటి అడుగు వేశాను. ట్రాన్స్వాల్లో వారి పరిస్థితులు ఎలా

ఉన్నాయో వారికి వివరించాను. సేట్ హాజి ముహ్మమద్ హాజీ జసూబ్ గారితో నాకు పరిచయ లేఖ కూడా ఉంది. దాంతో ఆయన

ఇంట్లో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముందుగా ఈ సమావేశానికి మెమన్ వర్తకులు హాజరయ్యారు. హిందువుల హాజరు చాలా

తక్కువగా ఉంది. నిజానికి, ప్రిటోరియాలో హిందువుల జనాభా కూడా చాలా తక్కువే.


ఈ సమావేశంలోనే నేను చేసిన ప్రసంగమే నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి బహిరంగ సహావేశ ప్రసంగం. నేను

ప్రసంగించాల్సిన అంశంపై చాలా కసరత్తు చేశాను, ప్రధానంగా వ్యాపారంలో నిజాయతీ పాటించడంపైన. వ్యాపారంలో నిజాయతీగా

ఉండటం సాధ్యం కాదని వర్తకలు వాదించడం చాలా సార్లు విన్నాను. నేను అప్పుడూ, ఇప్పుడు కూడా దాన్ని నేను

అంగీకరించలేదు. వ్యాపారంలో నిజాయతీకి పొంతన కుదరదని వాదించే వర్తకలు ఈరోజు కూడా ఉన్నారు. వ్యాపారం అనేది
చాలా వాస్తవిక వ్యవహారం, సత్యం అనేది మతపరమైన అంశం; వాస్తవిక వ్యవహారం అనేది ఒక అంశం, మతమనేది పూర్తిగా మరో
అంశం. నిండు నిజాయతీగా ఉండటం వ్యాపారంలో అయ్యే పనికాదు. ఎవరైనా అలా సత్యం పలికినా, అది అంతవరకే. నా

ప్రసంగంలో ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించాను. వర్తకులు నిజాయతీని రెండింతలు కలిగి ఉండాలని వారిని జాగృతపరిచాను.

విదేశీ గడ్డపై ఉన్నప్పుడు వారు మరింత నిజాయతీ, సత్యంతో కూడుకున్నవారై ఉండాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశాను.
ఎందుకంటే కొంతమంది భారతీయుల అసత్య ప్రవర్తన వల్ల మిగిలిన లక్షలాది మంది భారతీయులు కూడా అసత్య ప్రవర్తన
కలిగినవారేనని పరిగణిస్తా రు కాబట్టి.

ఇక్కడ ఆంగ్లేయిలు వారి చుట్టు పక్కల ఉన్నవాళ్లతో పోల్చితే మనవాళ్లు ఎంత అశుభ్రమైన అలవాట్లతో ఉన్నారో, మన పట్ల వారు
ఎంత దారుణంగా వ్యవహరిస్తు న్నారో వివరించి చెప్పాను. హిందువులు, ముస్లింలు, పారసీలు, క్రైస్త వులు, గుజరాతీలు, మద్రాసీలు,
పంజాబీలు, సింధు, కచ్చీసు, సూర్తీలు ఇలా మన మధ్య ఉన్న ఈ బేధాలన్నీ విడిచిపెట్టా ల్సిన అవసరం ఉందని నొక్కి
వక్కాణించాను.

Page: 113 (Original Page No. 123)


భారతీయులతో కలసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న కష్టా ల గురించి పై అధికారులకు
విజ్ఞాపనలు పంపాలని సలహా ఇస్తూ ముగించాను. ఈ పనులు చేయడానికి నేను ఎలాంటి ఫలితం ఆశించకుండా నా సేవలు

అందిస్తా నని చెప్పాను.

నా ప్రసంగం సమావేశాన్ని ఆకట్టు కున్నట్లు నేను గమనించాను.

నా ప్రసంగం తరువాత దానిపై చర్చలు జరిగాయి. కొంతమంది నాకు ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అందజేస్తా మన్నారు,

వారిని నేను ప్రోత్సహించాను. ఆ సభలోని ప్రేక్షకుల్లో కొంతమందికి మాత్రమే ఇంగ్లీషు తెలుసు. ఈ దేశంలో ఇంగ్లీషు పరిజ్ఞానం కలిగి

ఉండటం ఎంతో మంచిదని నేను భావించాను. తీరికగా ఉన్నవారు ఇంగ్లీషు నేర్చుకోవాలని నేను సలహా ఇచ్చాను. ఇంగ్లీషును మనం

పెద్ద వయసులో కూడా నేర్చుకోవచ్చని చెప్పారు. అలా పెద్ద పెద్ద వయసులో ఇంగ్లీషు నేర్చుకున్నవారి గురించి ఉదాహరణలు కూడా

చెప్పాను. వీటితో పాటు ఎవరికైనా ఇంగ్లీషు నేర్చుకోవాలని అనిపిస్తే నేనే స్వయంగా తరగతులు తీసుకుంటానని ముందుకొచ్చాను.
కానీ తరగతి ప్రారంభించలేదు, కానీ మగ్గురు మాత్రం ఇంగ్లీషు నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. కానీ నేను వారి ఇంటి వద్దకే వెళ్లి

ఇంగ్లీషు బోధించాలని షరతు పెట్టా రు. అందులో ఒద్దరు ముస్లమానులు - వారిద్దరిలో ఒక్కరు క్షురకర్మ చేసేవారు, ఇంకొకరు

గుమస్తా - మరొకతను చిల్లర కొట్టు నిర్వహించే హిందువు. నేను వారు చెప్పినట్లు గానే చేయడానికి అంగీకరించాను. వారికి నా

శక్తిమేర పాఠాలు చెప్పడానికి నేను ఎన్నడూ వెనుకాడలేదు. వారు మాత్రం కొన్ని సార్లు తరగతులు ఎగ్గొట్టడానికి ప్రయత్నించారు,

కానీ నేను ఎగ్గొట్టలేదు. కొన్ని సార్లు వాళ్లు వాళ్ల కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారా లేదా అని చూడటానికే నేను వెళ్లే వాడ్ని. అయినా

సరే నేను ఎప్పుడూ సహనం కోల్పోలేదు. ఈ ముగ్గరికి ఇంగ్లీషు నేర్చుకోవాలన్న బలమైన కాంక్షలు ఏమీ లేవు. కానీ వారిలో ఇద్దరు

మాత్రం ఒక ఎనిమిది నెలల్లో కొంత ప్రగతి కనబరచారు. ఇద్దరు తమ పద్దు ల పుస్తకాలు నిర్వహించడానికి, వ్యాపార ఉత్తర

ప్రత్యుత్తరాలు నిర్వహించడం నేర్చుకున్నారు. ఒక క్షురకర్మ చేసే వ్యక్తి అయితే తన వద్దకు వచ్చే ఖాతాదారులతో మాట్లా డటానికి

అవసరమైన ఇంగ్లీషు వస్తే చాలు అనుకునేవాడు. అలా నేర్చుకున్న ఫలితంగా, ఆ ఇద్దరు ఇప్పుడు మరింత ఎక్కువగా ఆర్జిస్తు న్నారు

కూడా.

ఆ సమావేశం ఫలితం పట్ల నాకు సంతృప్తిగా ఉంది. నాకు గుర్తు న్నంత వరకు ఇలాంటి సమావేశాలు వారానికి ఒకటి, లేక నెలకు

ఒకటై నా నిర్వహించాలని నిర్ణయించాం. ఇవి కొంచె అటు, ఇటుగా క్రమం తప్పకుండా జరిగేవి. ఈ సమావేశాల్లో ప్రతి ఒక్కరు తమ

అభిప్రాయాలను చాలా స్వేచ్ఛగా పంచుకునేవారు. దీని ఫలితంగా నాకు ప్రిటోరియా తెలియని భారతీయుడంటూ లేకుండా

పోయింది, వారి పరిస్థితులు గురించి కూడా నేను తెలుసుకునేవాడ్ని. దీంతో ఇక అక్కడ ప్రిటోరియాలోని బ్రిటిష్ ఏజెంట్ జాకోబస్

డీ వెట్తో పరిచయం చేసుకోవాలనిపించింది. ఆయనకు భారతీయుల పట్ల సానుభూతి కూడా ఉంది. కానీ ఆయనకు చాలా

పరిమితమైన పలుకుబడి మాత్రమే ఉంది. అయినప్పటికీ ఆయన తన వల్లనైనంత సాయం చేయడానికి అంగీకరించారు. నేను

ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు వచ్చి ఆయన్ను కలవొచ్చని ఆయన చెప్పారు.

Page: 114 (Original Page No. 124)

ఇక ఇప్పుడు రైల్వే అధికారులతో చర్చలు జరిపాము. రైల్వే సొంత నియమావళి ప్రకారం కూడా, భారతీయులు ప్రయాణాల్లో

ఎదర్కొంటున్న ఇబ్బందులకు న్యాయం చేయడం లేదని అని వారికి చెప్పాను. వారు నాకు సమాధానం పంపుతూ, ఎవరైతే
భారతీయులు సరైన దుస్తు లు ధరిస్తా రో అలాంటి వారికి ఒకటో తరగతి, రెండో తరగతిలో ప్రయాణించడానికి టికెట్లు ఇస్తా మని వారు
చెప్పారు. అది ఏమాత్రం ఉపశమనం కలిగించేది కాదు. ఎందుకంటే ఎవరు ‘సరిగ్గా దుస్తు లు వేసుకున్నారు’ లేదు అనేది దానిపై

నిర్ణయాధికారం స్టేషన్ మాస్టర్ చేతుల్లో ఉంటుంది.


భారతీయుల వ్యవహారాలకు సంబంధించి కొన్ని పత్రాలను బ్రిటిష్ ఏజెంట్ నాకు చూపించారు. తయ్యబ్ సేఠ్ కూడా ఇలాంటివే

మరికొన్ని పత్రాలు కూడా ఇచ్చారు. ఆరెంజ్ ఫ్రీ స్టేట్ నుంచి భారతీయులను ఎంత క్రూ రంగా వేటాడి తరిమేశారో వీటి ద్వారా నాకు

తెలిసింది.

క్లు ప్తంగా చెప్పాలంటే, ప్రిటోరియాలో బస చేయడం వల్ల ట్రాన్స్వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్లోని భారతీయుల సామాజిక, ఆర్థిక మరియు
రాజకీయ స్థితిగతులపై లోతైన అధ్యయనం చేయగలిగాను. ఈ అధ్యయనం భవిష్యత్తు లో నాకు అమూలమైన సేవ చేస్తుందని నేను

ఊహించలేదు. ఒక వేళ కేసు గనుక ఏడాదిలోపే పూర్తి అయిపోతే, నేను ఏడాది చివరిలోపు లేకుంటే అంతకంటే ముందే

భారతదేశానికి తిరిగి వచ్చేయాలని అనుకన్నాను. కానీ దేవుడు మరో విధంగా తలచాడు.

13
కూలీ అంటే ఎవరు
ట్రాన్స్వాల్ మరియు ఆరెంజ్ ఫ్రీ స్టేట్లోని భారతీయుల స్థితిగతుల గురించి వర్ణించడానికి ఇది సరైన చోటు కాదు. వీటి గురించి

తెలుసుకోవాలనుకునే వారికి దక్షిణాఫ్రికాలో సత్యగ్రహ చరిత్ర చదవమని నా సలహా. అయినప్పటికీ ఒక్క చాలా సంక్షిప్తంగా ఒకటి

రెండు మాటలు ప్రస్తా వించడం అవసరం.

ఆరెంజ్ ఫ్రీ స్టేట్లోని భారతీయులను 1888 లో తెచ్చిన చట్టం లేక అంతకంటే ముందు నుంచే వారి హక్కులను కాలరాస్తు న్నారు.
వారు అక్కడ ఉండాలి అనుకుంటే వారు అక్కడ హోటళ్లలో వెయిటర్లు గా పనిచేయాల్సిందే, లేకపోతే మరేదైనా బానిస వృత్తి
చేపట్టా ల్సిందే. వ్యాపారులందర్నీ ఏదో నామమాత్ర పరిహారం ఇచ్చి వెళ్లగొట్టేశారు. వాళ్లు ఎన్నో విజ్ఞాపనలు, విన్నపాలు చేసుకున్నా

వాటిని తుంగలోకి తొక్కేశారు.

1885 లో ట్రాన్స్వాల్లో మరింత కఠినమైన చట్టా న్ని తీసుకొచ్చారు. దాన్ని 1886 లో పాక్షికంగా సవరించారు. ఈ సవరణ ప్రకారం

ట్రాన్స్వాల్లోకి ప్రవేశించడానికి భారతీయులందరూ తప్పనిసరిగా 3 పౌండ్లు పన్ను చెల్లించాలి. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో తప్ప వారికి

సొంతంగా భూములుండకూడదు, ఉన్నా ఆ భూమిపై వారికి హక్కు ఉండదు. వారికి ఓటు హక్కు కూడా లేదు.
Page: 115 (Original Page No. 125)
ఆసియాఖండ వాసుల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం కింద ఇవన్నీ తీసుకొచ్చారు. శ్వేతవర్ణం కాని జాతుల ప్రజలకూ ఇది

వర్తిస్తుంది. ఈ చట్టా ల ప్రకారం, భారతీయులు బహిరంగంగా పాదాచారులు నడిచే ఫుట్పాత్లపై నడవకూడదు, రాత్రి 9 గంటల

తరువాత అనుమతి లేనిదే ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ఈ చివరి నిబంధనైతే మాత్రం భారతీయుల వరకు చివరి వరకు

కొనసాగేది. కొంతమంది ‘అరబ్బు’ల పేరుతో తిరిగేవాళ్లు మాత్రం ఈ చట్టం నుంచి తప్పించుకునేవారు. అయితే వారు కూడా ఈ

చట్టం నుంచి మినహాయింపు పొందడమనేది అక్కడి పోలీసుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉండేది.

ఈ రెండు చట్టా ల పర్యవసానాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నేను భావించాను. కోట్స్ గారితో కలిసి నేను తరచూ రాత్రిపూటా

బయటకు వెళ్లేవాడిని, సహజంగా మేము రాత్రి 10 గంటల్లోపే తిరిగి ఇల్లు చేరుకునేవాళ్లం. ఒక వేళ పోలీసులు నన్ను అరెస్టు చేస్తే

ఏమవతుంది? దీని గురించి నా కంటే ఎక్కువగా కోట్స్ గారే ఆందోళన చెందుతున్నారు. ఆయన తన వద్ద ఉన్న నీగ్రో నౌకర్లకు

పాసులు ఇచ్చారు, కానీ నాకు ఒక పాసు ఎలా ఇవ్వగలరు? నౌకరుకు కేవలం యజమాని మాత్రమే పాసులు జారీ చేయగలరు. ఒక
వేళ నేను ఒక పాసు కావాలని కోరుకున్నా, కోట్స్గారు నాకు ఒక పాసు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన అలా చేయలేరు,
కారణం అది మోసం అవుతుంది.

దాంతో కోట్స్గారు లేక ఆయన మిత్రు లు కొంతమంది నన్ను స్టేట్ అటార్నీ డాక్టర్ క్రా వ్సే వద్దకు తీసుకెళ్లా రు. ఆయన ప్రభుత్వ వకీలు

కావడంతో మేం ఆయన సహాధ్యాయ బారిష్టర్లు గా మారాం. నిజానికి నేను రాత్రి 9 గంటల తరువాత ఇంటి నుంచి బయటకు వచ్చి

తిరగడానికరి పాసు కోరుకోవడం దారుణంగా ఆయనకు అనింపించింది. ఆయన నా పట్ల జాలి చూపించారు. ఆయన నాకు పాసు
జారీకి బదులుగా, ఏకంగా నేను పోలీసుల అనుమతి ఏమాత్రం అవసరం లేకుండా ఎప్పుడు అనుకుంటే అప్పుడు బయట
తిరగడానికి వీలుగా ఒక అధీకృత లేఖ ఇచ్చారు. నేను ఎప్పుడు బయటకు వెళ్లినా ఈ లేఖను నేను నావద్ద ఉంచుకునేవాడ్ని.

నిజానికి ఈ లేఖను ఉపయోగించే తరుణం ఏదీ నాకు ఆసన్నం కాకపోవడంమే యాధృచ్చికమే.

డాక్టర్ క్రా వ్సే నన్ను ఆయన నివాసానికి ఆహ్వానించారు, ఆ తరువాత మేమిద్దరం మంచి మిత్రలమయ్యాం. నేను తరచుగా ఆయన్ను

చూడటానికి వెళ్లేవాడ్ని. నేను మరో గొప్ప సోదరుడు, జోహనెస్బర్గ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు పరిచయమయ్యానంటే కేవలం క్రా వసే

ద్వారానే. బోయర్ యుద్ధ సమయంలో ఆయన ఒక ఇంగ్లీషు అధికారిని హత్య చేయబోయాడనే అభియోగాలపై అక్కడి

న్యాయస్థా నం ఆయనకు ఏడు సంవత్సరాల కారాగారం విధించింది. ఆయన న్యాయశాస్త్ర పట్టా ను కూడా రద్దు చేశారు. అక్కడ

యుద్ధం ముగియడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. తరువాత ట్రాన్స్వాల్ బార్లో ఆయన గౌరవ న్యాయవాదిగా

పునర్నియామకమమై, ప్రాక్టీసు మళ్లీ కొనసాగిస్తు న్నారు.


ఈ సంబంధాలు తరువాత కాలంలో నా ప్రజా జీవితానికి ఎంతగానో ఉపయోగపడ్డా యి, నా పని కూడా చాలా సులభతరమైంది.

ఫుట్పాత్పైన నడవడానికి కూడా నిబంధనలు విధించిన పరిస్థితులు నాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. నేను ఎల్లప్పుడూ

ప్రెసిడెంట్ స్ట్రీట్లోని బహిరంగ ప్రాంతంలో వ్యాహ్యాళికి వెళ్లేవాడ్ని. ప్రెసిడెంట్ క్రూ గెర్ గారి ఇల్లు కూడా ఇదే వీధిలో ఉంది - ఆ ఇల్లు చాలా

నిరాడంబరంగా, డాబుసరి, ఉద్యానవనాలు లేకుండా ఉన్న భవనం అది. పొరుగున ఉన్న ఇళ్లకు దీనికి పెద్ద తేడా లేకుండా

సర్వసాధారణంగా ఉండేది.

Page: 116 (Original Page No. 126)


ప్రిటోరియాలో చాలా మంది కోటీశ్వరుల ఇళ్లు చుట్టూ ఉద్యానవనాలతో ఇంద్రభవనాల్లా ఉండేవి. అయినప్పటికీ ప్రెసిడెంట్ క్రూ గెర్

గారు చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఆయన ఇంటి ముందు రక్షక భటుల కాపాల కారణంగా ఇది ఎవరో ఒక అధికారి ఇల్లు అని

గుర్తు పడతారు. నేను ఫుట్పాత్పై నడుచుకుంటూ ఆ పోలీసులకు పక్కగా వెళ్లేవాడ్ని, అయితే వారు ఎప్పుడూ నాకు ఎలాంటి

ఆటంకం కలిగించలేదు.

అక్కడ కాపాలా ఉండే రక్షక భటులు ఆయా సమయాలను బట్టి మారుతూ ఉండేవారు. ఒక సారి వారిలో ఒక వ్యక్తి, నాకు కనీసం
ఎలాంటి హెచ్చరిక కూడా చేయకుండా, కనీసం ఫుట్పాత్ పైన నడవద్దని మాటమాత్రంగానైనా అడగకుండా నన్ను అక్కడి నుంచి
వీధిలోకి నెట్టేశాడు. నేను విస్తు పోయాను. నేను ముందు అతడ్ని అతడ్ని ప్రవర్తనను ప్రశ్నించకుండా మిన్నకుండిపోయాను, కోట్సు

గారు నా వెనకాలే అడుగు దూరంలో వస్తు న్నారు, ఆయన నన్ను అభినందిస్తూ చెప్పారు:

‘గాంధీ, నేను అంతా చూశాను. మీరు గనుక ఈ మనిషికి వ్యతిరేకంగా న్యాయస్థా నంలో పోరాటం చేస్తే నేను మీ తరఫున సాక్షిగా

సంతోషంగా ఉంటాను. మీమ్మల్ని చాలా దారుణంగా కొట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించండి.’

‘మీరు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు,’ అన్నాను. ‘అయినా అతడికేం తెలుసు? అతడికి తెలిసిందల్లా శ్వేతవర్ణం కాని ప్రజలంతా

ఒక్కటేనని. నా పట్ల ప్రవర్తించినట్లు గానే అతడు నీగ్రో ప్రజల పట్ల కూడా ప్రవర్తిస్తా డు అనుకోవడంలో అనుమానం లేదు. నేను
వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకంగా న్యాయస్థా నంలో కేసు వేయకూడదని నియమంగా పెట్టు కున్నాను, దాంతో నేను అతడికి
వ్యతిరేకంగా దావా వేయాలని అనుకోవడం లేదు.’
‘మీ పద్దతి మీదేనండి,’ కోట్స్గారు అన్నారు, ‘కానీ ఒకసారి మళ్లీ ఆలోచించండి. అలాంటి మనుషులకు మనం ఒక గుణపాఠం

చెప్పాలి.’ ఆయన తరువాత ఆ పోలీసుతో మాట్లా డి అతడ్ని మందలించాడు. ఆ పోలీసు బోయెర్ ప్రాంతానికి చెందిన వాడు

కావడంతో వాళ్లు డచ్ భాషలో మాట్లా డుకున్నారు. దాంతో వారు మాట్లా డేది నాకు అర్థం కాలేదు. కానీ అతడు వచ్చి నాకు

క్షమాపణలు చెప్పారు, కానీ అది అవసరం లేదు, ఎందుకంటే నేను అప్పటికే అతడ్ని క్షమించేశాను కాబట్టి.

అయితే నేను తరువాత ఆ వీధి గుండా ఎప్పుడూ వెళ్లలేదు. ఆయన స్థా నంలో వచ్చే ఇతర పోలీసులు ఉంటారు, వారికి ఈ విషయం
గురించి తెలియదు కదా, వారు కూడా ఇలాగే ప్రవర్తించవచ్చు, అనవసరంగా నేను అలాంటి పరిస్థితి మళ్లీ ఎందుకు ఎదుర్కోవడం?
ఆ కారణంగా నేను మరో దారి వెతుక్కున్నాను.

ఈ సంఘటన నాకు ఇక్కడ స్థిరపడ్డ భారతీయుల గురించి తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఈ సంఘటనను అక్కడ ప్రయోగాత్మక

కేసులా చేస్తే ఎలా ఉంటుందని నేను చర్చిస్తు న్నాను. బ్రిటీష్ ఏజెంట్గారిని కలిశాక, ఈ నిబంధలను ఒకసారి పరిశీలించాక

అవసరమైతే అలా కేసు వేయడానికి కూడా సిద్ధపడాలని అనుకున్నాను.

ఆ విధంగా నేను అక్కడ స్థిరపడిన భారతీయుల స్థితిగతులను అధ్యయనం చేయడం ప్రారంభించాను, కేవలం చదవడం, చెప్పింది
వినడం ద్వారా మాత్రమే కాకుండా స్వయంగా వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడం ద్వారా కూడా అధ్యయనం చేశాను.

భారతీయుల ఆత్మగౌరవానికి దక్షిణాఫ్రికా సరైన దేశం కాదని గుర్తించాను. ఈ పరిస్థితులు ఎలా మెరుగుపరచాలనే ప్రశ్నలతో నా

మనసు నిండిపోయింది.

కానీ నాకు ఆ సమయంలో ప్రధాన విధి దాదా అబ్దు ల్లా కేసు కోసం హాజరు కావడమే.

Page: 117 (Original Page No. 127)


14
కేసు కొరకు సన్నాహాలు
ప్రిటోరియాలో నేను గడిపిన ఏడాది కాలం నా జీవితంలో ఎంతో విలువైఏన అనుభవాలను ఇచ్చింది. ప్రజా సేవ చేయడం ఎలాగో

నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం కలిగింది, దానికి కావల్సిన కొంత శక్తి కూడా ఇక్కడే తెచ్చుకున్నాను. ఇక్కడే నాకు మతపరమైన

స్ఫూర్తి కూడా ఆలోకనం చేసుకున్నాను, దాంతో పాటు కొంత న్యాయవాద వృత్తి అనుభవాన్ని గడించాను. ఇక్కడే ఒక జూనియర్

బారిస్టర్ సీనియర్ బారిస్టర్ వద్ద నేర్చుకోవాల్సిన వన్నీ నేర్చుకున్నాను. ఇక్కడే నేను ఇక న్యాయవాద వృత్తికి పనికొస్తా ననే స్థైర్యం

కూడా సంపాదించుకున్నాను.

అలాగే నేను ఇక్కడ న్యాయవాదిగా విజయవంతం కావడానికి అవసరమైన రహస్యమేంటో కూడా నేర్చుకోగలిగాను. దాదా అబ్దు ల్లా

గారికి చిన్న కేసు కాదు. ఆ దావా విలువ 40,000 పౌండ్లు . ఇది ఒక వ్యాపార లావాదేవీలకు సంబంధించిన దావా మాత్రమే

కాకుండా, చిక్కులతో కూడిన జమా ఖర్చులకు సంబంధించినది. ప్రామిసరీ నోటు ఆధారంగా కొన్ని చెల్లింపులు కూడా జరిగాయి.

కొన్ని అయితే ప్రామిసరీ నోటు రాసిస్తా మని నోటి మాటకు లోబడి కూడా నడిచిన లావాదేవీలున్నాయి. ఈ ప్రామిసరీ నోటులు

మోసపూరితంగా తీసుకన్నారని, వాటిని పరిగణనలోకి తీసుకోవడానికి తగిన ఆధారాలు లేవని ప్రతివాదులు వాదిస్తు న్నారు. ఈ

కేసులో అనేకమైన వాస్తవాలు, న్యాయపరమైన చిక్కులు ముడిపడి ఉన్నాయి.

ఉభయపక్షాలు కూడా ఉత్తమ వకీళ్లను వినియోగించుకున్నాయి. దీనివల్ల వారు చేస్తు న్న పని గురించి అధ్యయనం చేయడానికి ఒక

మంచి అవకాశం దొరికింది. నాకు అప్పగించిన బాధ్యతల ప్రకారం వాది తరఫున కేసు వాదిస్తు న్న అటార్నీ గారికి కేసుకు సంబంధించి

అన్ని విషయాలు సిద్ధం చేయడం, ఈ కేసులోని వాస్తవాలన్నీ ఆయనకు బదలాయించడం లాంటి పనులను నేను చేస్తు న్నాను. నేను
సిద్ధం చేసిన వాటిలో అటార్నీ ఎంత మేర స్వీకరిస్తా రు, ఎంత మేర తిరస్కరిస్తా రు, అలాగే వీటి ఆధారంగా అటార్నీ రూపొందించిన
నోట్ను న్యాయవాదులు ఎంత వరకు ఉపయోగిస్తు న్నారు అనేది తెలుసుకోవడం నాకు నిజంగా పాఠం నేర్చుకున్నట్లు గానే ఉండేది.

ఈ కేసుకు సంబంధించి చేస్తు న్న సన్నాహాలు నాకు మంచి ఆకళింపు శక్తిని కలిగించాయి, అలాగే సాక్షాలను సిద్ధం చేసే సామర్థ్యాన్ని

పెంచడం చూశాను. నేను ఈ కేసులో చాలా శ్రద్ధగా నిమగ్నమైపోయాను. నిజానికి నాకు నేనే అలా నిమగ్నమయ్యాను. ఈ కేసుకు

సంబంధించి జరిగిన అన్ని లావాదేవీల పత్రాలన్నీ చదివాను. మా కక్షిదారుడు గొప్ప తెలివైనవారు, పైగా ఆయనకు నాపైన పూర్తిగా

విశ్వాసం ఉంచారు. దాంతో నా పని చాలా సులవైంది. ఖాతా పుస్తకాలను చాలా శ్రద్ధగా చదివాను, అందులో జరిగిన లావాదేవీలకు

సంబంధించిన విషయాలను అనువాదం చెయడంలో నా సామర్థ్యం పెంచుకున్నాను. ఈ లావాదేవీలన్నీ కూడా చాలా వరకు

గుజరాతీ బాషలో ఉండేవి. నేను ఇంతకు ముందే చెప్పాను, మత పరమైన సంభాషణలన్నా, ప్రజా సేవ అన్నా నాకు చాలా ఆసక్తి,

నేను ఎప్పుడూ వాటికి కొంత సమయం కేటాయిస్తా ను, అయితే అవి నా ప్రాథమిక ఆసక్తి ఏమీ కాదు.
Page: 118 (Original Page No. 128)

కేసుకు సంబంధించి అన్నీ సిద్ధం చేయడమే నా ప్రధాన కర్తవ్యం. న్యాయం గురించి చదడం, కేసులను అధ్యయనం చేయడం,

ఎప్పుడు అవసరమైనా, నా సమయాన్ని ముందుగా దీనికే కేటాయించేవాడ్ని. దాని ఫలితంగా నాకు ఈ కేసు గురించిన చలా

అంశాలు మననం చేసుకోగలిగాను, నేను తెలుసుకున్న విషయాలు చివరకు వాది, ప్రతివాదులకు కూడా తెలీవు. నా వద్ద ఉభయ

పక్షాలకు చెందిన పత్రాలన్నీ ఉండేవి.

పిన్కట్గారు చెప్పిన సలహా ఈ సందర్భంగా గుర్తు కొస్తోంది - వాస్తవాలే ముప్పాతిక భాగం న్యాయం. దీన్ని తరువాత కాలంలో

దక్షిణాఫ్రికాలోని ప్రసిద్ధ భారిష్టర్ లియోనార్డ్ కూడా సమర్థించారు. అప్పుడు అలాంటి కేసే ఒకటి నా చేతిలో ఉంది. ధర్మం నా

కక్షిదారుడివైపే ఉన్నప్పటికీ, న్యాయం మాత్రం అతడికి వ్యతిరేకంగా ఉంది. చాలా నిరాశపడ్డ నేను సాయం కోసం లియోనార్డ్ను

సంప్రదించాను. ఆయన కూడా ఈ కేసులో వాస్తవాలు చాలా బలంగా ఉన్నాయని విశ్వసించారు. ఆయన ఆశ్చర్యపడుతూ, ‘గాంధీ,

నాకు ఒక విషయం అర్థమవుతోంది. అదేమిటంటే, మనం గనుక వాస్తవాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే, అప్పుడు న్యాయం

దానంతట అదే పనిచేస్తుంది. మనం కేసులో నిజాల గురించి మరింత లోతుగా చూద్దాం.’ ఈ మాటలు చెప్పిన తరువాత ఆయన

నన్ను ఈ కేసు గురించి మరింతగా అధ్యయనం చేసి తరువాత తనను వచ్చి కలవాలని చెప్పారు. దాంతో ఈ కేసును మళ్లీ పునః
పరిశీలించాను, దాన్ని పూర్తిగా ఒక కొత్త కోణంలో పరిశీలించాను, ఈ కేసులో ఒక అంశం ఆధారాంగా దక్షిణాఫ్రికాలో నడిచిన ఒక పాత
కేసు కూడా నాకు గుర్తు కువచ్చింది. చాలా సంతోషంతో లియోనార్డ్గారి వద్దకు వెళ్లా ను. కేసు గురించి ప్రతి విషయాన్ని ఆయనకు

చెప్పాను. ‘మంచిది,’ అని ఆయన అంటూ ‘మనం ఈ కేసును గెలవగలం, అయితే ఈ కేసను ఏ న్యాయమూర్తు లు విచారణకు

స్వీకరిస్తా రో అనేది కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.’

నేను దాదా అబ్దు ల్లా గారి కేసుకు ఏర్పాట్లు చేస్తు న్న సమయంలో, కేసులు నిజాలకు ఇంత ప్రాముఖ్యత ఉంటుందని నేను పూర్తిగా
గ్రహించలేకపోయాను. ఒక్కసారి గనుక మనం సత్యాన్ని గ్రహిస్తే, న్యాయం దానంతట అదే మనకు సహాయపడుతుంది. దాదా

అబ్దు ల్లా కేసులో నిజాలు చాలా బలంగా ఉన్నట్లు నేను చూశాను. దాంతో న్యాయం కూడా ఆయన వైపు తప్పకుండా ఉంటుందని

భావించాం. కానీ ఇందులో ఒక చిన్న చిక్కముడి ఉండటం చూశాను. ఇది గనుక ఇలాగే కొనసాగితే, అది వాది, ప్రతివాదులిద్దరికీ

నష్టం కలిగిస్తుంది, వారిద్దరూ బంధవులు, పైగా ఒకే నగరానికి చెందినవారు. ఈ కేసు ఎంతకాలం కొనసాగుతుందో ఏ ఒక్కరూ

చెప్పలేని పరిస్థితి. ఒక వేళ ఈ కేసుపై ఇలాగే న్యాయస్థా నంలో పారాడుతూ పోతే, అది అలా అంతం లేకుండా కొనసాగుతుంది,
దానివల్ల ఉభపక్షాలకు ఏ మాత్రం ఉపయోగం లేదు. దాంతో అవకాశముంటే వీలైనంత త్వరగా ఇద్దరూ కలిసి ఈ కేసును

తేల్చేసుకోవడం మంచిదని నేను అనుకున్నాను.

నేను తయ్యబ్ సేఠ్ను కలిసి, మధ్యవర్తిత్తవం కోసం వెళ్లా లని సలహా ఇచ్చి అభ్యర్థించాను. ఆయన్ను తనన్యాయవాదులను కలవాలని

సూచించాను. ఇంకో సలహా ఏం చెప్పానంటే, మధ్యవర్తి రెండు పార్టీలను కూర్చోబెట్టు కుని మాట్లా డి నమ్మకం కుదిరేలా

మధ్యవర్తిత్వం నడిపితే, ఈ కేసు చాలా తొందరగా ముగుస్తుంది ’ అని చెప్పాను. ఈ కేసు కోసం మీరు ఫ్లీడర్ల కోసం డబ్బు ఖర్చు

చేయాల్సి రావడం చూస్తుంటే వాళ్ల పెద్ద వర్తకులైనా వారి ధనం కరిగిపోయే ప్రమాదముంది. ఈ కేసు కోసం వారు వారి విలువైన

సమయాన్ని ఎంతో వెచ్చించాల్సి వస్తోంది, దాంతో మిగిలిన పనుల కోసం సమయం కేటాయించలేక పోతున్నారు.

Page: 119 (Original Page No. 129)

మరోవైపు ఇద్దరి మధ్య పరస్పర అనంగీకారం తీవ్రంగా పెరిగిపోతోంది. నేను నా వృత్తిపట్ల వేసారిపోతున్నాను. న్యాయవాదులు తమ

పార్టీలు ఒకరినొకరు ఓడించుకోవడం కోసం లా పాయింట్లు వెతకడమే న్యాయవాదుల పని. గెలిచిన పార్టీ ఎప్పుడూ కూడా తాను

పెట్టిన ఖర్చులను తిరిగి రాబట్టు కోలేదు అనే సంగతి మొదటి సారి చూశాను. కోర్టు ఫీజు నియమావళి ప్రకారం పార్టీకి, పార్టీకి మధ్య

నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది, లాయర్ల కిచ్చే ఫీజు కంటే క్లైంట్లు చెల్లించుకునే ఫీజులు అధికంగా ఉంటున్నాయి. దీన్ని నేను

భరిచం లేకపోయాను. ఇప్పుడు రెండు పార్టీలకు ఇవన్నీ వివరించి, వారిద్దర్నీ కలపాలనేదే నా ప్రధాన కర్తవ్యంగా భావించాను.

వారిద్దర్నీ రాజీకి తీసుకురావడానికి ప్రతి అంశంలోనూ కష్టపడ్డా ను. ఎట్టకేలకు తయ్యబ్ సేట్ అంగీకరించారు. మధ్యవర్తిని

నియమించారు. ఈ కేసు ఆయన ఎదుట వాదనకు వచ్చింది, చివరకు దాదా అబ్దు ల్లా గెలిచారు.

కానీ ఇది నాకు సంతృప్తి కలిగించలేదు.ఈ తీర్పును నా క్లైంట్ వెంటనే అమలు పరిస్తే తీర్పులో చెప్పిన మొత్తం సొమ్మును వెంటనే

చెల్లించడం తయ్యబ్ సేఠ్కు అసాధ్యం. దక్షిణాఫ్రికాలో నివసిస్తు న్న పోరుబందర్ మెమన్ల మధ్య రాయని ఒక కట్టు బాటు ఉంది,

అదేమిటంటే దివాళా తీయడం కంటే చావే శరణ్యం అని. ఒకేసారి 37 వేల పౌండ్లు , ఇతర ఖర్చులు కలిపి చెల్లించడం తయ్యబ్

సేఠ్కు అసాధ్యం. ఆయన ఇందులో అణాపైసలతో చెల్లించాలనే అనుకుంటున్నారు, కానీ తాను దివాళా తీయాలని అనుకోవడం

లేదు. మరి దీనికి ఒక్కటే మార్గం ఉంది. ఈ సొమ్మును వాయిదాల పద్దతిలో చెల్లించడానికి దాదా అబ్దు ల్లా అంగీకరించాలి.
ఆయన కూడా చాలా ఉదారంగా ముందుకొచ్చారు, తయ్యబ్ సేఠ్ సుదీర్ఘ కాలం కంతుల వారీగా ఆ సొమ్ము చెల్లించడానికి
అంగీకరించారు. ఇలా ఆయన వాయుదాల్లో చెల్లించడానికి అబ్దు ల్లా ను అంగీకరింపజేయడం వీరిద్దర్నీ రాజీకి రప్పించడానికి పడ్డ

కష్టం కంటే ఎక్కువ శ్రమపడాల్సి వచ్చింది. అయతే తుది ఫలితంపై ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో ఇద్దరి గౌరవమూ

పెరిగింది. నా సంతోషానికి అవధుల్లేవు. నిజమైన లా ప్రాక్టీసు ఏమిటో నేర్చుకున్నాను. మానవ హృదయంలోకి ప్రవేశించడానికి
మనషి గుణాలలోని మంచి కోణాలను కనుగొనగలిగాను, విడిపోయిన పార్టీలను కలపడమే న్యాయవాది వృత్తి యొక్క
పరమార్థమని నేను గ్రహించాను. ఈ అనుభవ పాఠం నాలో బాగా నాటుకుపోయిందది. ఎంతలా అంటే లాయర్గా 20 ఏళ్లు నేను

చేసిన ప్రాక్టీసులో ఈ అనుభవ పాఠంతో ఎన్నో కేసులను కోర్టు కు బయటకు ప్రైవేటుగా రాజీ కుదర్చగలిగేంతలా. దానివల్ల నేను

నష్టపోయిందేమీ లేదు - డబ్బు నష్టపోలేదు, నా ఆత్మ సంతృఫ్తి కూడా నష్ట పోలేదు.

Page: 120 (Original Page No. 130)

15
మతపర మథనం
క్రైస్త వ మిత్రు లతో నాకు కలిగిన అనుభవాల గురించి మళ్లీ మీకు వివరించడానికి ఇది సరైన సమయం అనిభావిస్తు న్నాను. బేకర్ గారు

నా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఆయన నన్ను వెల్లింగ్టన్లో జరిగిన సభకు తీసుకెళ్లా రు. మత
జ్ఞానోదయం కోసం, ఇంకో మాటలో చెప్పాలంటే ఆత్మ పరిశుద్ధి కోసం కొన్ని సంవత్సరాలకు ఒకసారి అక్కడ క్రైస్త వులంతా
కలుసుకోవడం కోసం ఇలాంటి సభను ఏర్పాటు చేస్తుంటారు.

మనం ఒక రకంగా మత పునరుద్ధరణ లేక పునఃప్రతిష్ట గా కూడా చెబుతుంటాము కదా. వెల్లింగ్టన్లో జరుగుతున్న సభ కూడా

ఇలాంటిందే. ఈ సభాధ్యక్షులు రెవరెంట్ ఆండ్రూ ముర్రే ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మత ప్రబోధకులు. సభా మందిరంలో చేస్తు న్న
మత ప్రబోధాలు, నిర్వహిస్తు న్న ఉత్సవాలు, సభకు హాజరైన ప్రజలంతా చూపుతున్న ఉత్సుకత, ఆతురత, ఈ వాతావరణం ఇవన్నీ
నన్ను తప్పకుండా క్రైస్త వం స్వీకరించేలా ఉసిగొల్పుతాయని బేకర్గారి నమ్మకం.

అయితే ఆయన అంతిమ నమ్మకం మాత్రం ప్రార్థనే. ప్రార్థన పట్ల ఆయనకు అమితమైన విశ్వాసం. మనం తప్పకుండా పరిశుద్ధ

మనసుతో ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పకుండా ఆలకిస్తా డని ఆయన కున్న గట్టి నమ్మకం. అలా ప్రార్థనలపై ఆధారపడిన వారిని,

ఐహిక అవసరాలకోసం కూడా పూర్తిగా ప్రార్థనపైనే ఆధారపడ్డ బ్రిస్టల్కు చెందిన జార్జి ముల్లర్లాంటి వారిని ఉదహరించారు. ప్రార్థన
గొప్పతనం గురించి ఆయన చెప్పే విషయాలన్నీ కూడా నేను ఎలాంటి పక్షపాతం లేకుండా శ్రద్ధగా ఆలకించాను, ఒక వేళ నేను గనుక
క్రైస్త వం స్వీకరించాలని మనసులో అనుకుంటే నన్ను ఏ శక్తీ ఆపలేదని ఆయన గట్టిగా చెప్పాను. ఎందుకంటే నేను అప్పటికే నా

ఆత్మప్రభోధానుసారం నడచుకోవడం మొదలు పెట్టి చాలా కాలమైంది. అంతరాత్మ చెబితే నేను సంతోషంగా అలాగే చేస్తా ను.

అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేయడం నాకు చాలా కష్టం, చాలా బాధతో కూడుకున్నది.

అలా మేం వెల్లింగ్టన్కు వెళ్లాం. నాలాంటి ‘నల్లరంగువాడ్ని’ తన వెంట తీసుకుని వెళ్లడం వల్ల బేకర్ గారు చాలా ఇబ్బందులు పడాల్సి

వచ్చింది. పలు సందర్భాల్లో ఆయన పూర్తిగా నావల్లే చాలా అసౌకర్యానికి గురి కావాల్సి వచ్చింది. మా ప్రయాణం మధ్యలో ఒక

రోజు ఆగిపోయింది, ఆ రోజు ఆదివారం కావడంతో అలా జరిగింది. బేకర్గారు, ఆయన బృందం ఆదివారం రోజు ప్రయాణం

చేయరు. దాంతో మేం అక్కడ స్టేషన్లోని ఒక హోటల్కు వెళ్లా ము. ఆ మేనేజరుతో చాలా వాగ్యుద్ధం జరిగిన తరువాత ఎట్టకేలకు
నన్ను హోటల్లో బస చేయడానికి అనుమతించారు, కానీ నేను భోజనశాలక వచ్చి భోజనం చేయడానికి మాత్రం ససేమిరా
అంగీకరించలేదు. అయితే బేకర్ గారు దాన్ని అంత సులభంగా వదిలేసే రకం కాదు. హోటల్కు వచ్చిన అతిథికి ఉన్న హక్కులపై

నిలబడి మాట్లా డారు. కానీ నేను ఆయన పడుతున్న ఇబ్బందులు గమనిస్తు న్నాను. వెల్లింగ్టన్ లో కూడా నేను బేకర్గారితోనే కలిసి

బస చేశాను. ఆయననా కోసం ఒకవైపు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అవేమీ పైకు కనిపించకుండనీయకుండా చేసే ప్రతయ్నం

చేస్తు న్నారు. కానీ నేను అవన్నీ చూస్తూనే ఉన్నాను.

Page: 121 (Original Page No. 131)


సదస్సులో పాల్గొన్న క్రైస్త వులంతా ఎంతో భక్తిశ్రద్ధా పరులు. వారి భక్తి విశ్వాసాలు చూసి నాకెంతో సంతోషం కలిగింది. అక్కడ రెవరెంట్

ముర్రేను కలిశాను. అక్కడ చాలా మంది నా కోసం ప్రార్థనలు చేయడం చూశాను. వారు ఆలపించిన దేవుని కీర్తనల్లో కొన్ని నాకు

నచ్చాయి. అవి చాలా మదురంగా ఉన్నాయి.


ఈ సదస్సు మూడు రోజుల్లో ముగిసిపోయిందిత. ఆ సమావేశాలకు హాజరైన భక్తు లను నేను అర్థం చేసుకుని అభినందించాను.

కాకుంటే నేను నా విశ్వాసాన్ని - మతాన్ని మార్చుకోవడానికి ఎలాంటి కారణం మాత్రం కనిపించలేదు. నేను స్వర్గానికి లేక మోక్షానికి

చేరుకోవాలంటే కేవలం నేను క్రైస్త వుడినైతే తప్ప సాధ్యం కాదనే నమ్మకాన్ని నేను విశ్వసించడం అసాధ్యం. ఈ విషయాన్ని అక్కడ నేను

కలిసిన కొంతమంది క్రైస్త వ మిత్రు లకు నిర్మొహమాటంగా చెప్పేశాను. అది విని వారు విస్తు పోవడం మినహా మరేమీ

చేయలేకపోయారు.

నా ఇబ్బందులు మరింత జఠిలమయ్యాయి. ఏసుక్రీస్తు ఒక్కరే దేవుడు సృష్టించిన కుమారుడని, ఆయన్ను ఎవరైతే విశ్వసిస్తా రో

వారికి పునర్జన్మం ఉండదని నమ్మమని చెప్పడం నా విశ్వాసానికి తగనది. ఒక వేళ దేవుడికి కుమారులంటే మనమంతా ఆయన

కుమారులమే. ఏసు ప్రభువు గనుక దేవుడు అయితే ఆయనలాగే మిగిలిన మానవులంతా కూడా దైవసమానులే కదా. కేవలం
ఏసుక్రీస్తు తన మరణం ద్వారా, తన రక్తం ద్వారా పాపాలను కడిగేస్తా డనే నమ్మకాన్ని విశ్వసించడానికి నా కున్న కారణాలు సిద్ధంగా
లేవు. అయితే వారు చెప్పేదాంట్లో కొంత వాస్తవముండుగాక. ఇంకొక విషయం ఏమిటంటే, క్రైస్త వ సిద్ధాంతం ప్రకారం కేవలం

మనుషులకు మాత్రమే ఆత్మ ఉంటుంది, ఇతర ప్రాణులకు ఆత్ముండదు. అవి మరణంతో అంతరిస్తా యి; ఈ నమ్మకానికి నేను

వ్యతిరేకం. ఏసు ప్రభువు త్యాగానికి ప్రతీక, మహానుభావుడు అని నేను అంగీకరిస్తా ను. అయినంత మాత్రానా ఆయనేమీ ఒక

అద్వీతీయ పురుషుడు కారు. శిలువపై ఆయన మరణం ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణ. కానీ అందులో ఏదో రహస్యం ఉందని,

అందులో మహాత్యం ఉందని చెబుతున్నదాన్ని నా మనసు అంగీకరించడం లేదు. ఇతర విశ్వాసాల్లో జీవించే పవిత్రమైన మనుషులు

నాకు ఇవ్వజాలలేని విశ్వాసాన్ని పవత్రిమైన క్రైస్త వులు కూడా నాకు ఇవ్వజాలరు. క్రైస్త వుల్లో లాగానే ఇతర మత ధర్మాల్లోనూ ఇదే తరహా

విశ్వాసాలను నేను చూశాను. సైద్ధాంతికంగా క్రైస్త వ సిద్ధాంతాల్లో ఎలాంటి ప్రత్యేకతలు లేవు. త్యాగం విషయానికి గనుక వస్తే,

హిందువులు ఇప్పటికే గొప్ప గొప్ప త్యాగాలతో క్రైస్త వులను దాటిపోయారని నాకు అనిపిస్తుంది. క్రైస్త వం ఒక్కటే సరైన మతమని,

లేకపోతే మిగిలిన అన్ని మతాల కంటే చాలా గొప్పమతమని భావించడం నా వల్ల అయ్యేపనికాదు.

నా మనసులో చెలరేగుతున్న ఈ భావనలను అవకాశమొచ్చినప్పుడల్లా నా క్రైస్త వ మిత్రు లతో పంచుకునేడాడ్ని. కానీ దానికి వారు

ఇచ్చే సమాధానం మాత్రం నన్ను తృప్తి పరచలేకపోయేది.

అయితే నేను క్రైస్త వ మతం సరైనమతమని, అన్నిటికంటే గొప్ప మతమని పరిగణించలేపోయాను, అదే సందర్భంలో హిందూ
మతాన్ని కూడా నేను సర్వోన్నతమైనదిగా భావించడం లేదు. హిందూ మతంలో ఉన్న లోపాలన్నీ నా కళ్లకు కనిపిస్తు న్నాయి.

అంటరానితనమే హిందూమతంలో ఒక భాగమైతే, అది కుళ్లిపోయింది, అది దానికున్న జబ్బు. ఇన్ని వర్ణాలు, కులాలు ఉండాల్సిన

అవసరం ఎందుకో నాకు అర్థం కాదు.


Page: 122 (Original Page No. 132)
వేదాలను మనం అపౌరుషేయాలని పరిగణించడంలో పరమార్థమేమిటీ? అవి అపౌరుషేయాలైనప్పుడు, బైబిల్ మరియు ఖురాన్లు
ఎందుకు కాకూడదు?

క్రైస్త వ మిత్రు లు ఎలాగైతే నన్ను వారి మతంలోకి కలుపుకోవాలని ప్రయత్నిస్తు న్నారోర, అలాగే ముస్లిం మిత్రు లు కూడా నన్న వారి
మతంలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తు న్నారు. అబ్దు ల్లా సేఠ్ అయితేఉ నన్ను ఇస్లాం గురించి తెలుసుకోమని ప్రోద్బలం చేసేవారు.

తదుపరి ఆయన ఎల్లప్పుడూ నాకు ఇస్లాం గొప్పతనం గురించి ఎంతోకొంత చెప్పడానికి ప్రయత్నించేవారు.

ఇక్కడ నా ఇబ్బందుల గురించి నేను రాయ్ఛాంద్భాయ్కి లేఖ రాశాను. అలాగే భారతదేశంలో ఉన్న ఇతర మత పెద్దలకు కూడా

సమాచారం అందించాను. వారి నుంచి నాకు సమాధానం కూడా వచ్చింది. రాయ్ఛాంద్భాయ్ గారి రాసిన లేఖ నాకు కొంత వరకు

సమాధానపరచింది. ఆయన నన్ను సహనంతో ఉండాలని, హిందూ మతం గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలని

సూచించారు. ఆయన రాసిన వాటిలో ఒక వ్యాఖ్యం మాత్రం ప్రభావాత్మకంగా ఉంది: ‘ఈ ప్రశ్ననను మనం నిష్పాక్షిక దృష్టితో
పరిశీలిస్తే, హిందూ మతంలోని సున్నితమైన, మహోన్నతమైన ఆలోచనలు, ఆత్మదృష్టి, దయార్థ గుణాలు, మరి ఏ ఇతర మతాల్లో
లేవని నేను గట్టిగా నమ్ముతున్నాను.’

సేల్స్ అనువాదం చేసిన ఖురాన్ గ్రంథాన్ని కొనుక్కొని చదివాను. ఇస్లాం గురించి రాసిన మరికొన్ని ఇతర పుస్తకాలను చదివాను. నేను

ఇంగ్లండ్లో పరిచయమైన క్రైస్త వ మిత్రు లకు లేఖ రాశాను. వారిలో ఒకరు నన్ను ఎడ్వార్డ్ మెయిట్ల్యాండ్కు పరిచయం చేశారు. నేను

ఇప్పుడు ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. ఆయన అన్నా కింగ్స్ఫోర్ఢ్ తో కలిసి రాసిన ది పెర్ఫెక్ట్ వే అనే పుస్తకాన్ని నాకు

పంపారు. ప్రస్తు త క్రైస్త వ విశ్వాసాలను తిరస్కరిస్తూ రాసిన పుస్తకం అది. ఆయన నాకు మరో పుస్తకం కూడా పంపారు. ది న్యూ

ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది బైబిల్. ఈ రెండు పుస్తకాలు నాకు బాగా నచ్చాయి. అవి హిందూ మతానికి మద్దు తు పలికే విధంగా

కనిపిస్తు న్నాయి. ఇక టాల్స్టాయ్గారు రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ అనే పుస్తకం చదివి

పరమానందభరితుడినయ్యాను. అది నా మనసుకు హత్తు కుంది. ఈ పుస్తకంలోని స్వతంత్ర ఆలోచనా విధానం, గొప్ప నైతికత,
సత్యం అనేవి పరిశీలిస్తే ఈ పుస్తకం ముందు ఇప్పటి వరకు కోట్స్గారు నాకు ఇచ్చిన పుస్తకాలు ఎందుకూ కొరగానివిగా
అనిపించాయి.

ఈ పుస్తకాలు చదవడం వల్ల నేను క్రైస్త వ మిత్రు లు ఊహించని విధంగా కొత్త మార్గంలో పడ్డా ను. ఎడ్వార్డ్ మెయిట్ల్యాండ్తో నా ఉత్తర

ప్రత్యుత్తరాలు చాలా కాలం కొనసాగింది. అలాగే రాయ్ ఛాంద్భాయ్తోనూ ఆయన మరణించే వరకు ఇది కొనసాగించాను. ఆయన
పంపిన కొన్ని పుస్తకాలను కూడా నేను చదివాను. వాటిలో పంచికరణ్, మణిరత్నమాల, యోగాశిష్ట యొక్క ముముక్షు ప్రకరణ,

హరిబంద్ర సూరీగారి శద్దా ర్శన సముచ్ఛయం, మరికొన్ని ఇతర పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి.

నా క్రైస్త వ మిత్రు లు ఊహించని పంథాను నేను ఎంచుకున్నప్పటికీ, వారి సాంగత్యం వల్ల నాకు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగింది, దానికి
వారికి నేనెల్లపుడూ రుణపడి ఉంటాను. వారి గురించి గుర్తు చేసుకోవడం నాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. సంవత్సరాలు

గడిచిన కొద్దీ కూడా ఆ మధరు స్మృతులు, ఆ పవిత్ర స్నేహానుబంధాలు నా మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.

Page: 123 (Original Page No. 133)

16
తాను ఒకటి తలిస్తే, దైవ మొకటి తలిచే
నేను వచ్చిన కేసు పని పూర్తైంది. ఇక నేను ప్రిటోరియాలో ఉండటానికి ఎలాంటి కారణం లేదు. నేను మళ్లీ డర్బన్కు తిరిగివెళ్లి,

అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. కానీ అబ్దు ల్లా సేట్ మాత్రం నాకు వీడ్కోలు ఏర్పాటు

చేయకుండా ప్రయాణించడానికి అనుమతించే రకం కాదు. సిడెన్హాంలో నాకు ఘనమైనవీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు.

నేను ఆ రోజంతా అక్కడే గడపాలని ఆయన ప్రతిపాదించారు. దాంతో నేను అక్కడ ఉన్న కొన్ని వార్తా పత్రికలను తీసుకుని వాటిని

తిరగేస్తూ కూర్చొన్నాను. ఒక పత్రికలో ఒక మూల ‘భారతీయుడి ఓటు’ (ఇండియన్ ఫ్రాంఛైజ్) అనే శీర్షికతలో ప్రచురితమైన వార్త

నాకు కనిపించింది. అక్కడ చట్ట సభ ముందుకు తీసుకొస్తు న్న బిల్లు కు సంబంధించిన వార్త అది. నాటల్ శాసన సభకు సభ్యులను

ఎన్నుకోవడానికి భారతీయులకు ఓటు హక్కు లేకుండా తీసుకొస్తు న్న ప్రతిపాది బిల్లు అది. నేను ఆ బిల్లు తను తీవ్రంగా

వ్యతిరేకించాను, అలాగే ఆ సభకు హాజరైన అతిథులంతా కూడా దాన్ని వ్యతిరేకించారు.

ఈ విషయం గురించి అబ్దు ల్లా సేఠ్ వద్ద ఆరా తీశాను. ఆయన అన్నారు: ‘మనకు ఈ విషయాలన్నీ ఏమి అర్థమవుతాయి? మన

వర్తకంపై ప్రభావం చూపే అంశాలైతే మనకు అర్థమవుతాయి. నీకు తెలుసు, ఆరెంజ్ ఫ్రీ స్టేట్లో మన వర్తకమంతా

తుడిచిపెట్టు కుపోయింది. దాని గురించి అక్కడ ఆందోళన చేశాం, కానీ ఫలితం లేకుండా పోయింది. మేమంతా చదువురాని

మందబుద్ది వాళ్లం. మేము రోజూ వార్తా పత్రికను కేవలం ఆ రోజు మార్కెట్లో ధరలు, తదితరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికే

చూస్తాం. చట్టం గురించి మాకు ఏమి తెలుస్తుంది? అక్కడున్న ఐరోపా వకీళ్లే మా చెవులు, కళ్లు .’
‘కావొచ్చు,’ అన్నాను నేను, ‘ఇప్పుడు ఇక్కడ పుట్టిన ఎంతో మంది యువ భారతీయుల్లో విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు.
వాళ్లు మీకేమీ సహాయపడరా?

‘వాళ్లా !’ అబ్దు ల్లా సేఠ్ ఆశ్చర్యంగానూ, నిరాశతోనూ అన్నారు, ‘వాళ్లు మమ్మల్ని అసలు పట్టించుకోరు, మా వద్దకు రారు, సత్యం

చెప్పరు. మేముం కూడా వారిని పట్టించుకోవడం మానేశాం. వారంతా క్రైస్త వులు కావడంతో వారంతా క్రైస్త వ మతాధికారి చెప్పు

చేతల్లో ఉంటారు. ఆ మతాధికారి ప్రభుత్వానికి తొత్తు గా ఉంటారు.’

ఈ మాటలు నా కళ్లు తెరిపించాయి. అయితే ఈ వర్గం కూడా మన సొంతవాళ్లే అని తెలియజెప్పాల్సి ఉందని నేను భావించారు.
క్రైస్త వం అంటే అర్థమేమిటీ? వాళ్లు క్రైస్త వులు అయినంత మాత్రానా వారు భారతీయులను అడ్డు కుంటారా?

అయితే నేను ఇంటికి తిరిగెళ్లి పోతున్నాను, ఆ విషయం మీద నా మనసులో కలిగిన ఆలోచనలను అక్కడికి వారితో పంచుకోవడానికి
కొంత వెనుకాడాను. అయితే అబ్దు ల్లా సేట్కు ఒకటే మాట చెప్పాను: ‘ఈ బిల్లు , ఒక వేళ చట్టంగా ఆమోదం పొందితే, దాని వల్ల

మనవాళ్లు అంతులేని కష్టా లు పడాల్సి వస్తుంది. మనం సమాధి కావాడనికి ఇది మొదటి అంకం. అది మన ఆత్మగౌరవాన్ని కూకటి

వేళ్లతో సహా పెకలించివేస్తుంది.’

Page: 124 (Original Page No. 134)


‘అది జరగొచ్చు,’ అని అబ్దు ల్లా సేఠ్ శృతి కలిపారు. ‘అసలు ఈ ఓటు హక్కు ప్రశ్న ఎక్కడ మొదలైందో నేను నీకు చెబుతాను.

మనకైతే దాని గురించి బొత్తిగా తెలీదు. కానీ ఎస్కోంబ్ ఉన్నారు కదా, ఆయన ఒక ఉత్తమ వకీళ్లలో ఒకరు, నీకు కూడా తెలుసు,

ఆయనే మా బుర్రల్లోకి ఈ ఆలోచన ఎక్కించారు.

అప్పటి నుంచి అలా జరుగుతోంది. ఆయన ఒక గొప్ప పోరాట యోధుడు. ఆయనకు, వార్ఫ్ ఇంజినీరుకు మధ్య ఏమాత్రం పడదు.

ఇంజినీరు ఎక్కడ తన ఓట్లన్నీ దక్కించుకని తనను ఎన్నికల్లో ఓడిస్తా డేమోనని భయపడేవారు. ఆ విషయాన్ని ఆయన మాకు

తెలిపాడు. అలా ఆయన ప్రోద్బలంతో ఓటర్లు గా నమోదు చేసుకున్నాం. ఆయనకు ఓటు వేశాం. మీరు చెబుతున్న ఈ ఓటు

హక్కు అప్పుడు నిజంగా మాకు విలువ ఇచ్చి మేం వినియోగించుకున్నది కాదు అనే సంగతి మీరు ఇప్పుడు తెలుసకుని ఉంటారు.

కానీ మీరు ఏం చెబుతారో మేం అర్థం చేసుకోగలం. మంచిది, అది సరేర, ఇప్పుడు మీ సలహా ఏమిటీ?’
మా సంభాషణలను అక్కడ ఉన్న ఇతర అతిథులంతా ఎంతో ఆసక్తితో వింటున్నారు. వారిలో ఒకరు చెప్పారు: ‘మీరు ఏం చేయాలో

నేను చెప్పేదా? మీరు ఈ ఓడలో ప్రయాణాన్ని రద్దు చేసుకోండి. ఇక్కడ మరో నెల రోజుల పాటు ఉండండి. మేము మీరు

సూచించినట్లు గా పోరాడతాము.’

మిగిలిన వాళ్లు అంతా కూడా గట్టిగా ఆయనకు మద్దతు పలికారు: ‘నిజం, నిజం. అబ్దు ల్లా సేఠ్గారు, మీరు తప్పనిసరిగా గాంధీని

వెళ్లకుండా అడ్డు కోవాల్సిందే.’

సేట్గారు మంచి అనుభవశాలి. ఆయన అన్నారు: ‘నేనిప్పుడు ఆయన్ను అడ్డు కోబోవడం లేదు. లేక ఉండమని కోరడం లేదు. నాకు

ఎంత హక్కు ఉందో మీకు కూడా అంతే హక్కు ఉంది. అయితే మీరు అంటున్నది నిజం. మనమంతా కలిసి ఆయన ఇక్కడే

ఉండేలా ఒత్తిడి తెద్దాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆయన బారిష్టర్. మరి ఆయన ఫీజు సంగతేంటీ?’

ఆయన ఫీజు గురించి మాట్లా డటం నన్ను కలచివేసింది, ఉద్వేగానికి గురయ్యాను: ‘అబ్దు ల్లా సేఠ్గారు, ఫీజు సంగతి అక్కడ

అప్రస్తు తం. ప్రజా సేవకు ఎలాంటి ఫీజు ఉండదు. ఒక సేవకుడిగా నేను ఇక్కడ ఉండగలను. మీకు తెలుసు, నాకు ఇక్కడున్న

మిత్రు ల గురించి ఏమీ తెలీదు. ఒక వేళ మీరుగను వారంతా నాకు సహకరిస్తా రని మీరు నమ్మితే, నేను ఇక్కడ మరో నెల

రోజులపాటు ఉండటానికి సిద్ధం. అయితే ఇక్కడ ఒక విషయం, మీరు నాకు ఏమీ చెల్లించవలసిన అవసరం లేనప్పటికీ, ఇప్పుడు

మనం చేపట్టా ల్సిన పని ప్రారంభించడానికి కొంత సొమ్ము లేకుండా చేయలేం. మనం వారికి టెలీగ్రాములు పంపాలి, మన
డిమాండ్లకు సంబంధించి కొంత సాహిత్యం ప్రచురించాలి, కొన్ని పర్యటనలు కూడా చేయాల్సి ఉంటుంది, స్థా నికంగా ఉండే వకీళ్లను
కూడా సమం సంప్రదించాల్సి ఉంటుంది. నాకు మీ చట్టా ల గురించి తెలుసుకోలేదు కాబట్టి వాటిని గురించి తెలుసుకోవడానికి కొన్ని

లా పుస్తకాలు కూడా నాకు అవసరం. ఇవన్నీ మనం డబ్బు లేకుండా చేయలేం. మరొక్క విషయం ఏమిటంటే ఈ పనులన్నీ ఒకే

మనిషి చేయలేడు. అతడికి సాయం చేయడానికి మీలో చాలా మంది ముందుకు రావాల్సి ఉంటుంది.’

అక్కడున్నవారి మద్ధతు స్వరాలతో ఆ ప్రాంతం హోరెత్తింది: ‘అల్లా గొప్పవారు, దయ కలిగిన వారు. డబ్బు దానంతట అదే

వస్తుంది. మీకు సాయం చేయడానికి మీకు ఎంతమంది అవసరమైతే అంతమంది మనషులు ఇక్కడ ఉన్నారు. మీరు దయచేసి

ఇక్కడే ఉండటానికి అంగీకరించింది. అంతా మంచే జరుగుతుంది.’

దాంతో నా వీడ్కోలు సభ కాస్త కార్యాచరణ కమిటీగా మారిపోయింది. వింధు భోజనం తదితరాలు ముగించాలని నేను కోరాను.

వెంటనే నేను ఇంటికి తిరిగి వచ్చేసి, పని ప్రారంభించాను.


Page: 125 (Original Page No. 135)
నా సొంత ఆలోచనల మేరకు దీనికి సంబంధించి ప్రచారం ఎలా ఉండాలనేది రేఖామాత్రంగా రూపొందించుకున్నాను. ఓటర్ల

జాబితాలో చేర్చిన వారి పేర్లను ఒక సారి మదింపు వేసుకున్నాను. అక్కడ నెల రోజులు ఉండిపోవాలని మనసులో

నిశ్చయించుకున్నాను.

భగవంతుడు నా జీవితానికి దక్షిణాఫ్రికాలో పునాది వేశారు. అక్కడే నాలో జాతి ఆత్మ గౌరవం కోసం పోరాట బీజాలను నాటారు.

17
నాటల్లో స్థిరపడటం
1893 లో నాటల్లోని భారతీయ సమాజానికి సేఠ్ హాజీ ముహమ్మద్ హాజీ దాదా అగ్రనాయకుడిగా గుర్తింపు పొందారు. ఆర్థికంగా

మాత్రం కూడా సేఠ్ అబ్దు ల్లా హాజీ ఆదాం వారందరింలోనూ ముఖ్యమైనవారు. అయితే ఆయన, ఇతరులు అంతా కూడా ప్రజా

సంబంధ విషయాల్లో సేఠ్ హాజీ ముహమ్మద్కు మొదటి స్థా నం ఇచ్చేవారు. ఆ విధంగా అబ్దు ల్లా సేఠ్ ఇంట్లో ఆయన అధ్యక్షతన ఒక

సమావేశాన్ని ఏర్పాటు చేశాం.ఈ సమావేశంలో ఓటు హక్కు బిల్లు ను వ్యతిరేకించాలని తీర్మానించాం.

స్వచ్ఛందంగా సేవకులను నమోదు చేసుకున్నాం. సమావేశానికి నాటల్లో పుట్టిన భారతీయులను, అంటే ప్రధానంగా భారతీయ క్రైస్త వ

యువకులను సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించాం. డర్బన్ కోర్టు లో దుబాసీగా ఉన్న పాల్గారు, మిషనరీ స్కూలు

ప్రధానోపాధ్యాయులు సుభాన్ గాడ్ఫ్రే లాంటి వారంతా హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎక్కువ సంఖ్యలో క్రైస్త వ యువకులు

హాజరయ్యేలా వారే బాధ్యతవహించారు. ఆ విధంగా చాలా మంది యువకులు హాజరయ్యారు. వారంతా వారికి వారే స్వచ్ఛంద

సేవకులుగా నమోదు చేసుకున్నారు.

స్థా నిక వర్తకులు కూడా చాలా మంది స్వచ్ఛంద సేవకులుగా నమోదు చేసుకున్నారు, వీరిలో ప్రముఖంగా వ్యక్తి సేఠ్ దావూద్
ముహమ్మద్, ముహమ్మద్ కసమ్ కమ్రు ద్దీన్, ఆడంజీ మియాఖాన్, ఎ.కొలందవేలు పిళ్లై, సి. లాచిరామ్, రంగస్వామి పడియాచ్చి,

మరియు అమద్ జీవా, పార్సీ రుస్తోంజీ లాంటి వారు నమోదు చేసుకున్నారు. గుమస్తా ల నుంచి మెజర్స్ మానెక్జీ, జోషి, నరసింహ్రం

మరియు ఇతరులు, దాదా అబ్దు ల్లా అండ్ కో సంస్థ, ఇతర పెద్ద సంస్థల ఉద్యోగులు. ప్రజోపయోగ పనులు చేయడానికి వారిని కూడా

భాగస్వాములుగా ముందుకు రావడం ఆశ్చర్యపరిచింది. ఇలా వారు భాగస్వామ్యం వహించడం వారి జీవితంలో వారికి ఒక కొత్త
అనుభవం. విపత్తు లో సమాజం అన్నీ అధిగమించింది. ఎక్కువ, తక్కువ, చిన్న, పెద్దా , యజమాని, నౌకరు, హిందువులు,

ముస్లింలు, పార్సీలు, క్రైస్త వులు, గుజరాతీలు, మద్రాసీలు, సింధీలు తదితర తరతమ బేధాలన్నీ పోయాయి. ఇప్పుడు మేమంతా

భరతమాత ముద్దు బిడ్డలం, ఆమె సేవకులం.

Page: 126 (Original Page No. 136)

ఇది రెండో సారి, ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందో లేక ఆమోదం పొందబొతుందో, ఈ బిల్లు సందర్భంగా చట్టసభలో వక్తలు
మాట్లా డుతూ భారతీయులు ఈ బిల్లు పట్ల ఎమాత్రం గట్టి వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదని, వారికి వారే ఓటుహక్కుకు అనర్హులని
ఇది రుజువు చేస్తోందని మాట్లా డుతున్నారు.

ఆ సమావేశానికి మేం ఈ పరిస్థితిని వివరించాం. ముందుగా మేం చేసిందేమిటంటే శాసనసభ స్పీకర్కు ఒక టెలీగ్రామ్ పంపి

అందులో ఆ బిల్లు గురించి తదుపరి చర్చను వాయిదా వేయాలని కోరాం. అలాంటి విజ్ఞాప టెలిగ్రామ్నే ప్రధాన మంత్రి సర్ జాన్

రాబిన్సన్కు, దాదా అబ్దు ల్లా స్నేహితులు ఎస్కోంబ్కు పంపాము. మా టెలీగ్రామ్కు వెంటనే స్పీకర్ సమాధానం పంపుతూ ఈ

బిల్లు పైన చర్చను రెండు రోజుల పాటు వాయిదా వేస్తు న్నట్లు తెలిపారు. ఇది మా హృదయాలకు ఎంతో సంతోషం కలిగించింది.

శాసనసభకు పంపవలసిన అర్జీని వెంటనే రూపొందించాము. మూడు కాపీలు సిద్ధం చేశాం, మరో అదనపు కాపీని అక్కడి

మీడియా కోసం అవసరమైంది. దాంతో పాటుగా ఎంతమంది వీలైతే అంతమందితో సంతకాల సేకరణ చేపట్టా లని కూడా

ప్రతిపాదించాం. ఈ పనులన్నీ కూడా ఒక్క రాత్రిలోపే జరిగిపోవాలి. ఆంగ్లభాషా పరిజ్ఞానం ఉన్న వాలంటీర్లు (స్వచ్ఛంద సేవకలు),

ఇతర మరికొంత మంది అంతా రాత్రంతా కూర్చొని పనిచేశాం.

ఆర్థర్ అని ఒక పెద్దా యన ఉండేవారు మంచి దస్తూరీ రాయడంలో దిట్ట, ఆయన చేత ప్రధాన కాపీ సిద్ధం చేయించాం. మిగిలిన

కాపీలను ఒకరు చెబుతుంటే ఒకరు రాశారు. అలా ఒకే సారి అయిదు కాపీలను సిద్ధం చేశాం. ఇక పిటీషన్లలో సంతకాల సేకరణ

కోసం వర్తక వాలంటీర్లు తమ సొంత వాహనాల్లో కొంతమంది, అద్దె వాహనాల్లో కొంతమంది బయటకు వెళ్లా రు. ఇదంతా కూడా

చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసేసి, ఆ పిటీషన్ను పంపేశాము. వార్తా పత్రికలు మాకు అనురకూలంగా వ్యాఖ్యలు చేస్తూ
వార్తలు ప్రచురించాయి. అది శాసనసభపై ఒక మంచి అభిప్రాయం కలిగించేలా చేసింది. శాసనసభలో దీని గురించి చర్చ జరిగింది.

పిటిషన్లో పేర్కొన్న వాదనపై అధికారపక్షం సమాధానం చెప్పింది. బిల్లు ను సమర్థిస్తు న్న వాళ్లు వాదిస్తూ, ఏవో కుంటిసాకులు చెప్పారు.

ఆ బిల్లు , ఎలాగైతేనేం ఆమోదం పొందింది.

ఇలా జరుగుతుందని మేము ఊహించిందే, కానీ ఈ ఆందోళన అనేది మాత్రం అక్కడి భారతీయ సమాజానికి కొత్త జీవితానికి ప్రేరణ
కలిగించింది. ఇది అక్కడి సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతీయ సమాజమంతా ఒక్కటే దాన్ని విడదీయలేరనే ధృడ

అభిప్రాయాన్ని కలిగించింది. అక్కడ వాణిజ్య హక్కుల కోసం పోరాడటం వారి ప్రధాన కర్తవ్యం ఎలాగో అలాగే అక్కడ తమ రాజకీయ

హక్కుల కోసం పోరాడటం కూడా వారి ప్రధాన కర్తవ్యం అనే భావన కలిగించింది.

లార్డ్ రిప్పన్ అప్పట్లో ఈ కాలనీలకు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తు న్నారు. ఆయన వద్దకు ప్రదర్శనగా వెళ్లి పిటిషన్ ఇవ్వాలని

నిర్ణయించాం. ఇదేమంత చిన్న పనికాదు, ఒక్కరోజులు చేసే పని కాదు. ఈ పని కోసం వాలంటీర్ల జాబితా సిద్ధం చేశాం, వారంతా

వారు చేయాల్సిన పనులు చేశారు.

ఈ పిటిషన్ రాయడానికి నేనే ఆపసోపాలు పడ్డా ను. ఈ విషయానికి సంబంధించి అందుబాటులో ఉన్న సారాంశం అంతా చదివాను.

నా వాదనంతా కేవలం సిద్ధాంతం, దాని ఆవశ్యకత చుట్టూనే కేంద్రీకరించాను. నాటల్లో మాకు ఓటు వినియోగించుకునే హక్కు

ఉందని నేను వాదించాను.

Page: 127 (Original Page No. 137)


భారతదేశంలో మాకు ఎలాగైతే ఒక విధరమైన ఓటు హక్కు కల్పించారో, అలాగే ఇక్కడ కూడా మాకు ఓటు హక్కును
కల్పించండని అభ్యర్థించాను. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే భారతీయులు కూడా చాలా తక్కువగానే ఉన్నారు.

పదిహేను రోజుల్లో 10 వేల సంతకాలను సేకరించాం. దేశం మొత్తం తిరిగి ఇంతమంది సంతకాలు సేకరించడం అంత తేలిక

పనికాదు. ప్రత్యేకించింది మేం వినియోగిస్తు న్న మనుషులు ఈ పనులకు పూర్తి కొత్త. ప్రత్యేక చొరవ ఉన్న వాలంటీర్లను ఈ పనుల

కోసం ఎంపిక చేశాం. సంతకం చేసేవారికి ముందుగా ఈ పిటిషన్లో ఏముందతో తెలియజేయకుండా ఏ ఒక్కరి నుంచి కూడా

సంతకం సేకరించకూడదని నిర్ణయించాం. గ్రామాలు చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్నాయి. కార్యకర్తలు పూర్తిగా మనసు పెట్టి
పనిచేస్తే తప్ప ఈ పని పూర్తి చేయలేము. కార్యకర్తలు అది చేసి చూపించారు. ఎంతో ఉత్సాహంతో వారికి కేటాయించిన బాధ్యతను

వారు నెరవేర్చారు. కానీ నేను ఈ వాఖ్యాలు రాస్తు న్నప్పుడు సేఠ్ దావూద్ ముహమ్మద్, రుస్తోంజీ, ఆడంజీ మియాఖాన్, అమద్

జీవాలు పడ్డ కృషి నా కళ్లముందు కదలాడుతోంది. వారు అత్యధికంగా సంతకాలు సేకరించి తీసుకొచ్చారు. సంతకాల సేకరణ

కోసం దావూద్ సేఠ్ అయితే రోజంతా తన వాహనంలో పరుగులు తీస్తూనే కనిపించారు. ఇదంతా కూడా అమూల్యమైన సేవ.

వీరిలో ఏ ఒక్కరు కూడా దీని కోసం ఒక్కపైసా కూడా అడక్కుండా తమ ఖర్చులు తామే భరించుకున్నారు. దాదా అబ్దు ల్లా గారి

గృహమైతే ఒక దశలో సామూహిక విడిది సత్రంగా, ప్రజా కార్యాలయంగా మారిపోయింది. నాకు సాయపడ్డ చాలా మంది

విద్యావంతులైన మిత్రు లు, మరికొంత మంది ఇతర మిత్రు లు అందరూ కూడా అక్కడే భోజనం చేసి వెళ్లేవారు. అలా ప్రతి ఒక్కరూ

తమ శక్తిమేర కృషి చేశారు.

చివరికి ఎట్టకేలకు ఆ పిటిషన్ను సమర్పించాం. వెయ్యి కాపీలను అచ్చు వేయించి పంపిణీ చేశాం. దానివల్ల నాటల్ భారతీయుల

పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మొదటి సారి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈ కాపీలను నేను అన్ని వార్తా పత్రికలకు,

నాకు తెలిసిన ప్రాచారకర్తలకు పంపాను.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా, మా పిటిషన్పై ప్రధాన కథనాన్ని ప్రచురించింది, భారతీయుల డిమాండ్ను గట్టిగా సమర్థించింది. పిటిషన్

కాపీలను ఇంగ్లండ్లోని జర్నల్స్, ప్రచారకర్తలకు, వివిధ పార్టీల ప్రతినిధులకు పంపాము. మా కోరికలను లండన్ టై మ్స్ పత్రిక

సమర్థించింది, దాంతో ఈ బిల్లు వీగిపోతుందనే ఆశలు మాలో మొదలయ్యాయి.

ఇక ఇప్పుడు నాటల్ను విడిచిపెట్టి రావడం నాకు అసాధ్యం. భారతీయ మిత్రు లంతా నన్ను చుట్టిముట్టేసి నన్ను అక్కడే శాశ్వతంగా

ఉండిపొమ్మని ప్రాధేయపడుతున్నారు. నేను నా ఇబ్బందుల గురించి చెప్పాను. జనం సొమ్ము ఖర్చు పెట్టి ఇక్కడ ఉండకూదని నేను

నా మనసులో గట్టిగా అనుకున్నాను. నేను అక్కడ సొంతంగా ఒక ఇల్లు కలిగి ఉండాలని, ఆ ఇల్లు కూడా చాలా మంచిగా, మంచి

ప్రాంతంలో ఉండాలని అనుకున్నాను. అంతే కాకుండా నేను బారిస్టర్ హోదాకు తగ్గట్లు నా ఇల్లు , జీవన శైలి ఉన్నప్పుడే నా

సమాజానికి గౌరవం తేగలననిపించింది. అలాంటి ఇల్లు నడపాలంటే కనీసమంటే ఏడాదికి 300 పౌండ్లు లేకండా

అవసరమవుతుంది.

Page: 128 (Original Page No. 138)


ఈ కారణంగా నేను నిర్ణయించుకుంది ఏమంటే ఆ మేరకు రాబడి వచ్చేలా కేసులు గనుక నాకు వచ్చేలా చూస్తమని మా
సమాజంలోని సభ్యులు నాకు హామీ ఇస్తేనే ఇక్కడ ఉండిపోవాలని అనుకున్నాను. నా నిర్ణయాన్ని వారికి చెప్పాను.

‘కానీ,’ అని వారన్నారు, ‘ప్రజా సేవ నిమిత్తం నీకు ఆ సొమ్మను ఏర్పాటు చేయగలం. ఆ సొమ్ము సేకరించడం మాకు చాలా సులభం.

ఈ సొమ్ముకు, నువ్వు వాదించే ప్రైవేటు కేసులకు వచ్చే సొమ్మకు ఎలాంటి సంబంధం లేదనుకో.’

‘కుదరదు, ప్రజా సేవకు సంబంధించి మీ నుంచి నేను ఏమీ తీసుకోను,’ అని చెప్పాను, ‘ఈ పనిలో బారిష్టర్గా నా తెలివితేటలను
ఉపయోగించడం లేదు, మీరంత పనిచేసేలా మిమ్మల్ని సన్నద్ధం చేయడమే నా పని. అలాంటప్పుడు దానికి నేను ఫీజు ఎలా వసూలు
చేస్తా ను? పైగా ఈ పనుల కోసం మిమ్మల్ని తరచూ డబ్బులు కూడా సర్దు బాటు చేయమని నేను కోరుతుంటాను, ఇకవేళ
ఇప్పుడుగనుక నేను మీ నుంచి నా ఖర్చులకు సొమ్ము వసూలు చేశాననుకోండి, రేపు మరికొన్ని పెద్ద కార్యక్రమాలకు పెద్ద సొమ్ము
సేకరించాలని అడగడానికి నాకు ఇబ్బందికరంగా ఉంటుంది, అది చివరకు బండి ఆగిపోవడానికి దారి తీస్తుంది. దీనికంటే కూడా

ప్రజా సేవ కోసం మన సమాజం ఏటా 300 పౌండ్లు కనుగొనాలని నేను కోరుకుంటున్నాను.’

‘కానీ మేము మిమ్మల్ని చాలా కాలంగా చూస్తు న్నాం, మీరు అవసరానికి మించి మీరు ఏమీ తీసుకోకుండా చాలా కచ్చితంగా
ఉంటారు, మీరు ఇక్కడే ఉండాలని మేమంతా కొరుకుంటున్నప్పుడు, మీ ఖర్చుల గురించి మేము కనుగొనలేమా?’

‘మీకు నా పట్ల ఉన్న ప్రేమా, ఆదరణ వల్ల మీరు నా గురించి ఇలా మాట్లా డుతున్నారు. ఈ ప్రేమాధరణలు ఎప్పటికీ ఇలాగే
ఉండగలవని మీరు ఎలా కచ్చితంగా చెప్పగలరు? ఒక మిత్రు డిగా, ఒక స్నేహితుడిగా నేను సందర్భానుసారం మీకు కొన్ని కఠినమైన
విషయాలను చెబుతుంటాను. అప్పుడు నా పట్ల మీ ఆప్యాయత ఇలాగే ఉంటుందనేది భగవంతుడికే తెలియాలి. అయితే

వాస్తవమేమిటంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సేవకు జీతం పుచ్చుకోను. మీరు మీ కోర్టు కేసులన్నీ నాకు ఇవ్వగలిగితే నాకు అది

చాలు, ఇంకేమీ అవసరం లేదు. మీకు అది కూడా కష్టంగా ఉండొచ్చు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నేను తెల్ల

బారిష్టర్ను కాను. నా పట్ల న్యాయస్థా నం ఎలా ప్రతిస్పందిస్తుందో నేను ఎలా కచ్చితంగా చెప్పగలను? నేను ఒక ఉత్తమ

న్యాయవాదిగా మీకు ఎంత వరకు ఉపయోగపడతానో కూడా నేను కచ్చితంగా చెప్పలేను. ఒకవేళ మీరు ప్రతిధారణ న్యాయవాది

(రీటై నర్స్)గా పెట్టు కున్నా మీకు కొంత ఇబ్బందులే. దానికి మీరు చెల్లించే సొమ్ము అయినా అది కూడా ప్రజా సేవకు ప్రతిఫలంగానే

నేను పరిగణిస్తా ను.’

ఈ చర్చల పర్యవసానంగా దాదాపు 20 మంది వర్తకులు నన్న వారి న్యాయపరమైన పనుల కోసం ఏడాది పాటు ప్రతిధారణ

న్యాయవాదిగా వినియోగించుకున్నారు. దీంతో పాటు నేను నాటల్ నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో అబ్దు ల్లా సేఠ్గారు

నాకు ఇవ్వదలచిన కానుక సొమ్ముతో ఆయన నాకు అక్కడ ఉండటానికి అవసరమైన ఉపకరణ సామగ్రి అంతా కొనుగోలు చేశారు.
అలా నేను నాటల్లో స్థిరపడ్డా ను.

Page: 129 (Original Page No. 139)

18
వర్ణ వివక్ష
న్యాయస్థా నం అనేది న్యాయానికి ప్రతీక, అక్కడ గుడ్డిదైన న్యాయదేవత ఎలాంటి పక్షపాతం లేకుండా చేత త్రాసును ధరించి
ఉంటుంది. ఆమె గుడ్డిదే కావచ్చు కానీ ఆమె సూక్ష్మ గ్రాహి. విధి ఆమెను ఉద్దేశపూర్వకంగా గుడ్డిదానిగా చేసింది. ఆమె మనిషి

బాహ్య స్వరూపం చూసి తీర్పు చెప్పదు, కానీ అతడి అంతరాత్మ యోగ్యతను బట్టి తీర్పు చెపుతుంది. దానికి తద్భిన్నంగా నాటల్లోని
న్యాయవాదుల సంఘం ఈ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా, న్యాయ ప్రతీకకు విరుద్ధంగా వ్యవహరించేలా సుప్రీం కోర్టు ను
ఒప్పించడానికి పూనుకుంది.

సుప్రీం కోర్టు లో న్యాయవాదిగా ప్రవేశానికి నేను దరఖాస్తు చేసుకున్నాను. దానికి సంబంధించి బొంబాయి హై కోర్టు నుంచి నేను

పొందిన ప్రవేశ ధృవపత్రాన్ని నేను కలిగి ఉన్నాను. నేను అక్కడ నమోదు చేసుకునే సమయంలో నా ఇంగ్లీషు ప్రతిని వారి వద్ద

భద్రపరచాల్సి వచ్చింది. ఇద్దరి వద్ద నుంచి నా ప్రవర్తనకు సంబంధించి ధృవీకరణ పత్రాలు రెండు దరఖాస్తు కు జత చేయాల్సిన

అవసరం ఉంది. వీటిని ఆంగ్లేయిల వద్ద నుంచి సంపాదించినట్లయితే వాటికి విలువ ఎక్కువ ఉంటుందని నాకు అనిపించింది.

వాటిని నేను ఇద్దరు ప్రసిద్ధి చెందిన ఐరోపా వర్తకుల నుంచి సంపాదించాను, వారు నాకు అబ్దు ల్లా సేఠ్ ద్వారా తెలిసిన వారు. నా

దరఖాస్తు ను అక్కడ న్యాయస్థా నంలోని బార్ సభ్యుడి ద్వారా సమర్పించాను. నిబంధనల ప్రకారం అటార్నీ జనరల్ ఎలాంటి ఫీజు

పుచ్చుకోకుండా ఇలాంది దరఖాస్తు లను సమర్పించాలి. మెసర్స్ దాదా అబ్దు ల్లా అండ్ కో సంస్థకు న్యాయ సలహాదారుగా అప్పట్లో

వ్యవహరిస్తు న్న ఎస్కోంబ్ ఆ సమయంలో అటార్నీ జనరలగ్ కూడా ఉన్నారు. నేను ఆయన్ను కలిశాను, ఆయన నా దరఖాస్తు ను

సమర్పించడానికి దయతో అంగీకరించారు.


అక్కడ న్యాయవాదుల సంఘం నా దరఖాస్తు ను వ్యతిరేకిస్తూ నాకు తాఖీదు జారీ చేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. వారు

వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో ఒకటి నేను ఇంగ్లీషు ధృవీకరణ పత్రం అసలు ప్రతిని నా దరఖాస్తు తో జతపరచకపోవడం. కానీ వారి
ప్రధాన అభ్యంతరం వేరే, న్యాయవాదుల ప్రవేశానికి సంబంధించి నియంత్రణలు రూపొందించినప్పడు, నల్లవారు న్యాయవాదులు
ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది పట్టించుకోలేదు. నాటల్ దేశాభివృద్ధికి ఐరోపా వారి సంస్థలే

కారణం, అలాంటప్పుడు బార్లో తెల్లవారి ఆధిక్యతను కాపాడుకోవడం వారికి ఎంతో అవసరం. ఒక వేళ నల్లవాళ్లను చేర్చుకుంటే,

క్రమక్రమంగా బార్లో తెల్లవారి ఆధిక్యత తగ్గిపోతుంది, వారి రక్షణ గోడ కూలిపోతుంది.

న్యాయవాదుల సంఘం వారు వ్యతిరేకతను బలంగా వాదించడానికి వీలుగా సుప్రసిద్ధ న్యాయవాదిని వినియోగించుకున్నాను. ఆ

న్యాయవాదికి కూడా దాదా అబ్దు ల్లా అండ్ కో సంస్థకు సంబంధం ఉన్నావారే., ఆయన తనను వచ్చి కలవాల్సిందిగా నాకు దాదా

అబ్దు ల్లా ద్వారా వర్తమానం పంపారు. ఆయన చాలా నిర్మొహమాటంగా నాతో మాట్లా డారు, నా పూర్త వృత్తాంతం గుంరిచి నన్ను

అడిగి తెలుసుకున్నారు.

Page: 130 (Original Page No. 140)

తరువాత ఆయన నాతో అన్నారు: ‘నేను మీకు వ్యతిరేకంగా ఏమీ చెప్పను. నేను భయపడిందల్లా మీరు ఇక్కడ కాలనీల్లో

జన్మించినవారేమోనని. దానికి కారణం నువ్వు నీ దరఖాస్తు తో పాటు అసలు ప్రతి ధృవీకరణ పత్రాలను జతచేయకపోవడం నా

అనుమానానికి కారణమైంది. ఇక్కడ కొంతమంది వేరేవాళ్ల సర్టిఫికెట్లను తమ పేరుతో ఉపయోగించుకునేవాళ్లు కూడా ఉన్నారు.

ఐరోపా వర్తకుల నుంచి తీసుకుని మీరు సమర్పించిన ధృవీకరణ పత్రాల వల్ల నాకెలాంటి ఉపయోగమూ లేదు. వాళ్లకు నీ గురించి
ఏమి తెలుసు? వాళ్లకు మీరెంతకాలం నుంచి తెలుసు చెప్పండి?’

‘కావచ్చు,’ అని నేనునన్నాను, ‘అయినా ఇక్కడ ప్రతి ఒక్కరూ నాకు కొత్తే కదా, చివరకు అబ్దు ల్లా సేఠ్కు కూడా నేను ఇక్కడికి
వచ్చాకే కదా తెలిసింది.’

‘అయితే నువ్వు చెప్పేదేమిటీ, ఆయన కూడా నీలాగే అదే ప్రాంతానికి చెందినవాడు అని అంతేగా? అక్కడ మీ నాన్నగారు ప్రధాన
మంత్రిగా ఉన్నట్లయితే, సేఠ్ అబ్దు ల్లా కు మీ కుటుంబం గురించి తెలిసి ఉండేది, అప్పుడు నువ్వు అతడి నుంచి ప్రమాణపత్రం దాఖలు
చేసిఉన్నట్లయితే, నాకు ఏమాత్రం అభ్యంతరం ఉండేదికాదు. అప్పుడు నేను నీ దరఖాస్తు ను వ్యతిరేకించలనేని నా అశక్తతను

న్యాయవాదుల సంఘానికి సంతోషంగా చెప్పేవాడ్ని.’


ఆయన మాటలు నాకు కోపం తెప్పించాయి. కానీ నా భావాలు బయటకు కనిపించనివ్వకుండా అణచుకున్నాను. ‘ఒకవేళ నేనే
గనుక దాదా అబ్దు ల్లా గారి ప్రమాణ పత్రాన్ని జత చేసి ఉంటేనా,’ అని నామనసులో నేనే అనుకుని, ‘దాన్ని కూడా తిరస్కరించేవారు,
అప్పుడు వారు ఐరోపావారి నుంచి ధృవీకరణ పత్రాలు కావాలని కోరేవారు. నన్ను న్యాయవాదిగా చేర్చుకోవడానికి నా పుట్టు
పూర్వోత్తరాలతో పనేంటీ? నా పుట్టక, మంచిది కావచ్చు, అభ్యంతరకరమైంది కావచ్చు, నాకు వ్యతిరేకంగా అవి ఎలా
పనిచేస్తా యి?’ అలా నాలో నేనే మదనపడ్డా ను, కానీ చాలా ప్రశాంతంగా ఉంటూనే ఆయనకు సమాధానమిచ్చాను :

‘న్యాయవాదుల సంఘానికి ఈ వివరాలన్నీ అవసరమని నేను భావించకపోయినప్పటికీ, మీరు కోరినట్లు గా ప్రమాణపత్రాలు


సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’

అలా సేఠ్ అబ్దు ల్లా గారి ప్రమాణ పత్రాన్ని సిద్ధం చేశాం, దాన్ని న్యాయవాదుల సంఘం తరఫున వాదిస్తు న్న వకీలుకు అందజేశాం.

దానిపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు, కానీ న్యయవాదుల సంఘం మాత్రం సంతృప్తి చెందలేదు. అది సుప్రీం కోర్టు ముందు నా

దరఖాస్తు ను వ్యతిరేకించింది. అయితే న్యాయస్థా నం మాత్రం ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది. చివరకు ఎస్కోంబ్గారి వివరణ

కూడా న్యాయస్థా నం కోరలేదు. ప్రధాన న్యాయమూర్తి దీనిపై స్పందిస్తూ :

‘దరఖాస్తు దారు ధృవీకరణ పత్రాల అసలు కాపీలను జత చేయలేదని చేస్తు న్న అభ్యంతరాల్లో ఎలాంటి పసలేదు.ఒక వేళ ఆయన

తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేసిఉంటే ఆయన్ను విచారించవచ్చు. ఆయనగనుక దోషిగా నిరూపించడబడితే ఆయన పేరును

జాబితాల్లోంచి తొలగించవ్చు. అందువల్ల ఈ న్యాయస్థా నంలో గాంధీని న్యాయవాదిగా నమోదు చేసుకోవడాన్ని అడ్డు కునే

అధికారం ఈ న్యాయస్థా నానికి లేదు. మేం ఆయన దరఖాస్తు ను ఆమోదిస్తు న్నాం. మిస్టర్ గాంధీ, మీరిప్పుడు న్యాయవాదిగా

ప్రమాణం స్వీకారం చేయవచ్చు .’

న్యయస్థా న రిజిస్టా ర్ ముందు నేను నిలుచుని న్యాయవాదిగా ప్రమాణం తీసుకున్నాను. నేను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే,

ప్రధాన న్యాయమూర్తి నాకేసి మాట్లా డుతూ, అన్నారు:

Page: 131 (Original Page No. 141)


‘మిస్టర్ గాంధీ, మీరిప్పుడు తప్పనిసరిగా మీ తలపాగా తీసి పక్కనపెట్టా లి. ఇక్కడ ప్రాక్టీసు చేసే బారిష్టర్లు న్యాయస్థా నంలో
ధరించాల్సిన వస్త్ర వేషధారణపై న్యాయస్థా నం రూపొందించిన నియమావళిని మీకు అందజేస్తు న్నాం, దాన్ని మీరు పాటించాల్సి
ఉంటుంది .’

నా పరిమితులు ఏమిటో నాకు తెలుసు. ఒకప్పుడు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు లో ఈ తలపాగా పెట్టు కోవాలని ఎలా కోరుకున్నానో,

ఇప్పుడు ఇక్కడ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలను గౌరవిస్తూ తలపాగాను తీసివేశాను. అంతేకాదు, ఒకవేళ నేను కోర్టు

ఉత్తర్వులను దిక్కరిస్తే, అదిక్కడ ఏ మాత్రం సమ్మతంగా ఉండదు కూడా. కానీ నేను దీని కోసం పోరాడటం కంటే నా

శక్తియుక్తు లను పెద్ద పోరాటాల కోసం దాచుకోవాల్సిన అవసరం ఉంది. అంతే నా తలపాగాను నిలబెట్టు కోవడం కోసం పోరాడి నా

నైపుణ్యాలను వృథా చేసుకోకూడదు. మరో మంచి కారణం కోసం దాన్ని వినియోగించాలి.

నేను ఇలా మెత్తబడటం (బహుశా ఇది బలహీనతేమో?) చూసి సేఠ్ అబ్దు ల్లా మరియు ఇతర మిత్రు లకు నచ్చలేదు.

న్యాయస్థా నంలో ప్రాక్టీసు చేస్తు న్నప్పుడు నేను తలపాగా ధరించి నిలబడే నా హక్కను నేను కలిగి ఉండాలని వారు భావించారు. కానీ

నేను వారికి కారణాలు వివరించే ప్రయత్నం చేశాను. దేశాన్ని బట్టి ఆచారాలు మారతాయని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాను.

‘మనం రోమ్లో ఉన్నప్పుడు మనం రోమన్లు చేసినట్లు గా చేయాలి. అదే సమంజసం,’ అని నేను చెప్పాను, ‘మన వారు చెప్పిందాన్ని
దిక్కరించవచ్చు, ఒక వేళ భారతదేశంలో ఒక ఆంగ్లేయ అధికారి లేక న్యాయమూర్తి నిన్ను నీ తలపాగా తీసేయమని
ఆదేశించినప్పుడు, కానీ ఒక న్యాయస్థా న అధికారిగా, నాటల్ దేశంలో న్యయస్థా నం సంప్రదాయాలను తిరస్కరించడం ఏమాత్రం
బాగుండదు.’

ఇలా, ఇతే తరహా వాదనలతో నను మిత్రు లకు కొంతవరకు నచ్చజెప్పాను. అయితే వారిని పూర్తిగా శాంతింపజేశానని నేను

అనుకోవడం లేదు. ఈ సందర్భంలో, ఒక సిద్ధాంతం వర్తింపు అనే అంశం విభిన్న పరిస్థితుల్లో విభిన్న కోణాల నుంచి చూడాల్సి

ఉంటుంది. అయితే నా జీవితమంతా, సత్యానికి సంబంధించిన ప్రతి సందర్భం కూడా రాజీపడటంలోని గొప్పదనమేంటో

తెలయజేసింది. నా తదుపరి జీవితంలో ముఖ్యంగా సత్యగ్రహ సమయంలో ఈ స్ఫూర్తి ఎంత అవసరమో తెలుసుకున్నాను. ఇది

తరచూ నా ప్రాణాలకు ముప్పుగా మారేది, మిత్రు ల అసంతృప్తికి కారణభూతమయ్యేది. కానీ సత్యం కష్టమైంది, కఠినమైంది, వికసిత

పుష్ఫం లాంటిది.

న్యాయవాదుల సంఘం వ్యతిరేకత నాకు దక్షిణాఫ్రికాలో మరో ప్రచారాన్ని సంతరించిపెట్టింది. వారి వ్యతిరేకతలను వార్తా పత్రికలన్నీ

ఖండించాయి, న్యాయవాదుల సంఘం ఓర్వలేని తనాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఈ ప్రచారం వల్ల, కొంతవరకు, నా పని

సులువైపోయింది.

Page: 132 (Original Page No. 142)

19
నాటల్ ఇండియన్ కాంగ్రెస్
న్యాయవాదిగా ప్రాక్టీసు అనేది నాకు అక్కడ అప్రధానమైన వ్యాపకం. నాటల్లో నేను ఉండిపోవడానికి న్యాయం చేకూర్చాలంటే నేను

ఎక్కువగా ప్రజా సేవపైనే దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఓటుహక్కు తిరస్కరిస్తూ తెచ్చిన బిల్లు కు వ్యతిరేకంగా పిటిషన్లు

పంపడంతోనే పని అయిపోయినట్లు కాదు. దేశంలోని కాలనీల సెక్రటరీపై స్పందించేలా చేయడానికి వీలుగా నిరంతరం ఆందోళనలు

చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక శాశ్వత సంస్థను ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లా ల్సిన అవసరముందని

ఆలోచించాను. దానికోసం సేఠ్ అబ్దు ల్లా మరికొంతమంది మిత్రు లను సంప్రదించాను. మేమంతా కలిసి ఒక ప్రజా సంఘాన్ని

ఏర్పాటు చేసి దానికో శాశ్వత రూపు ఇవ్వాలని అనుకున్నాం.

ఈ సంస్థకు ఏ పేరు పెట్టా లనేదానిపై నాకు సంకఠ స్థితి ఏర్పడింది. ఈ సంస్థ పేరు ప్రత్యేకించి ఫలానా పార్టీ గుర్తు చేసేదిగా

ఉండకూడదు. ‘కాంగ్రెస్’, పేరు, నాకు తెలుసు. ఈ పేరు ఇంగ్లండ్లోని కన్సర్వేటివ్స్ పార్టీ వారికి అసలు నచ్చదు. అయినప్పటికీ

కాంగ్రెస్ అనేది భారతదేశానికి ప్రాణప్రదంగా మారింది. దాన్నే నాటల్లో కూడా ప్రచారంలోకి తేవాలని నేను అనుకుంటున్నాను. ఈ

పేరును స్వీకరించడానికి వెనుకాడటం అనేది పిరికితనమే అవుతుంది. ఈ పేరు పెట్టడానికి గల కారణాలను వివరించి, ఇక్కడ

ఏర్పాటు చేయబోయే సంస్థ పేరు నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అని ఉండాలని సిఫారసు చేశాను. అలా మే 22 వ తేదీన నాటల్

ఇండియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది.

ఆ రోజు దాదా అబ్దు ల్లా గారి విశాలమైన గద్ది మొత్తం కిక్కిరిసిపోయింది. అక్కడ హాజరైన వారందరూ కాంగ్రెస్ ను ఎంతో

ఉత్సుకతతో ఆమోదించారు. దాని రాజ్యాంగం చాలా చిన్నది, సభ్యత్వం మాత్రం చాలా పెద్దది. ఎవరైతే నెలకు అయిదు షిల్లింగులు

చెల్లించేవారంతా దీని సభ్యులే. బాగా ధనికులుగా ఉన్న వారిని సాధ్యమైనంత ఎక్కువ మంది చందాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాం.

అబ్దు ల్లా సేఠ్ నెలకు రెండు పౌండ్లు చందా ఇస్తూ జాబితాలో ముందు నిలిచారు. ఆయన వెనుక ఇదే విధంగా మరో ఇద్దరు మిత్రు లు

కూడా అంతే స్థా యి చందా చెల్లించారు. నేను కూడా నా చాందాను తగ్గించుకోకూడదు అనుకున్నాను. నెలకు ఒక పౌను చందా

చెల్లించాను. అదేమంత నాకు చిన్న మొత్తం కాదు. కానీ చెల్లించాలి అనుకుంటే చెల్లించగలను. అలా మేం నెలకు ఒక పౌను చెల్లించే

చందాదారులను బాగానే చేర్చగలిగాం. నెలకు 10 షిల్లింగులు చందా చెల్లించేవారి సంఖ్య అయితే మరింత ఎక్కువగా ఉంది. పార్టీకి

ఎవరైనా విరాళాలు ఇస్తే చాలా సంతోషంగా స్వకరించే విధానం కూడా ఉంది.

అయితే అడిగేంత వరకు కూడా ఎవరూ తమ చందాను చెల్లించరని అనుభవవపూర్తకంగా తెలిసింది. డర్బన్ బయట ఉండే

సభ్యులను ప్రతిసారి అడిగి చందా వసూలు చేయడం అసాధ్యం. ఆరంభంలో చూపించే ఉత్సాహం ఆ తరువాత కనిపించదు.
Page: 133 (Original Page No. 143)
చివరకు డర్బన్లో ఉన్న సభ్యులను కూడా వారు తమ సభ్యత్వ రుసుం చెల్లించాలని పలు పదేపదే అడగాల్సి వచ్చేది.

పార్టీ కార్యదర్శిగా ఈ సభ్యత్వ రుసుం వసూలు చేసే బాధ్యతలు నాపైన పడ్డా యి. చివరికి పరిస్థితి ఏ స్థితికి వచ్చిందంటే నేను, నా

గుమస్తా ను రోజంతా ఈ చందాలు వసూలు చేసుకురమ్మని పురమాయిండానికే సరిపోయేలా మారింది. ఆయన కూడా తిరిగి
తిరిగి అలసిపోయారు, ఇక నేను ఏమనుకున్నానంటే, కాస్త పరిస్థితి మెరుగయ్యాక, ప్రతి నెలా ఈ చందాలు చెల్లించే బదులు
సంవత్సరానికి ఒకసారే ముందుగానే చెల్లించడం తప్పనిసరి చేయడమే మంచిదని భావించాను. దాంతో నేను కాంగ్రెస్ ను

సమావేశపరిచాను. నా ప్రతిపాదనను ప్రతి ఒక్కరూ స్వాగతించారు. ప్రతి నెలా చెల్లించడాని బదులు సంవత్సరానికి కనీసం 3 పౌండ్లు

సభ్యత్వ చందా నిర్ణయించడం అందరికీ ఆమోదయోగ్యమైంది. దానివల్ల ఈ వసూళ్ల పని కొంత సులభతరమైంది.

దీని నుంచి నేను నేర్చుకున్న మరో విషయం ఏమిటంటే ప్రజా సేవకు ఎట్టి పరిస్థితిలోనూ అప్పు చేసి సొమ్ము వినియోగించరాదు అని.

ఒక్క డబ్బు విషయంలో తప్ప ప్రజలు ఎలాంటి వాగ్దా నాలు ఇచ్చినా వాటిపైన మనం ఆధారపడవచ్చుని బోధపడింది. తాము

చెప్పినట్లు గా తమ సభ్యత్వ రుసుమును తొందరగా చెల్లించడానికి ముందుకు వచ్చిన ప్రజలు నాకు కనిపించలేదు. ఈ సిద్ధాంతంలో

నాటల్లోని భారతీయులు కూడా మినహాయింపు కాదు. అందువల్ల , చేతిలో డబ్బు లేకుండా ఏ పనికీ పూనుకునేవాళ్లం కాము.

దానివల్ల నాటల్ ఇండియన్ కాంగ్రెస్ ఎప్పుడూ కూడా అప్పుల్లో కూరుకుపోలేదు.

నా సహచర కార్యకర్తలు, పార్టీలోకి కొత్త సభ్యులను చేర్చడానికి ఎంతో ఉత్సాహం చూపేవారు. అది వారికి అప్పగించిన బాధ్యత, అదే

సమయంలో అది వారికో వెలకట్టలేని అనుభవం కూడా. చాలా మంది ప్రజలు సభ్యత్వ రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకోవడానికి

ముందుకు వచ్చారు.

సుదూర ప్రాంత గ్రామాల్లో, ముఖ్యంగా మారుమూల ఉన్న ప్రాంతాల్లో ఈ పని చేయడం కష్టంగా ఉండేది. ఈ ప్రజా సేవ స్వరూపం

ఎలా ఉంటుందో ఈ ప్రజలకు తెలీదు. ఈ సుదూర ప్రాంతాల నుంచి మాకు ఆహ్వానాలు ఉండేవి. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ

వర్తకులంతా మాకు వారి ఆతిథ్యాన్ని కల్పించేవారు.

ఈ పర్యటనలో ఒక సారి మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. మాకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి 6 పౌండ్లు విరాళం ఇస్తా రని

మేం ఆశిస్తే, ఆయన అంత ఇవ్వడానికి నిరాకరిస్తూ కేవలం 3 పౌండ్లు మాత్రమే ఇచ్చాడు. ఇక వేళ మేము అతడిచ్చిన విరాళాన్ని

స్వీకరించామనుకోండి, మిగిలిన వాళ్లు కూడా ఆయన్నే అనుసరిస్తా రు. దానివల్ల మేం చేస్తు న్న విరాళాల సేకరణ అంతా

పాడైపోతుంది. అది రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత సమయం, మేమంతా మంచి ఆకలితో ఉన్నాను. కానీ మేం ఆశించినంత
చందాను అతడి నుంచి తీసుకోకుండా ఎలా మేమందరం ముందుగానే భోజనం చేయగలం? ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలన్నీ
విఫలమయ్యాయి. ఆ దాత చాలా కఠినంగా ఉన్నారు. పట్టణంలోని ఇతర వర్తకులంతా ఆయనకు నచ్చజెప్పి చూశారు. ఆయనతో

ఆ రాత్రంతా కూర్చొని మాట్లా డాము. ఎంత చెప్పినా సరే ఆయన తాను కనీసం ఇంత కూడా మెట్టు దిగడం లేదు. నా సహచర

కార్యకర్తల్లో చాలా మందికి ఆయనపై ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. అయినా సరే ఎవరికి వారు తమాయించుకుని

ప్రశాంతంగా ఉన్నారు. చివరకు ఎట్టకేలకు పొద్దు పొడిచే వేళకు ఆయన మెత్తబడి 6 పౌండ్లు ఇచ్చారు, మాకు భోజనం పెట్టా రు. ఈ

సంఘటన టొంగాట్లో జరిగింది.

Page: 134 (Original Page No. 144)


అయితే అప్పటికే ఈ సంఘటన గురించి ఉత్తర కోస్తా , చార్లెస్టౌన్ మారుమూల ప్రాంతాల వరకు టాంటాం అయిపోయింది. దానివల్ల

మా చందాల వసూళ్లను మరింత సులభతరం చేసింది.

అయితే మేం కేవలం చంధాల వసూళ్లు ఒక్కటి మాత్రమే చేయాల్సిన పనికాదు. నిజానికి ఒకరి వద్ద అవసరానికి మించిన ధనం

ఉండకూడదనే సూత్రాన్ని నేను చాలా కాలంగా నేర్చుకున్న పాఠం.

సమావేశాలను నెలకు ఒకసారి లేక అవసరాన్ని బట్టి వారానికి ఒక సమావేశం కూడా నిర్వహించేవాళ్లం. సమావేశం జరిగిన తరువాత

తీసుకున్న తీర్మానాలను చదివి వినిపించేవాళ్లం, అలాగే అన్ని రకాల సందేహాలను అక్కడ చర్చించేవాళ్లం. బహిరంగ చర్చల్లో ఎలా

మాట్లా డాలి, విషయం మీద క్లప్తంగా ఎలా మాట్లా డాలనే దానిపైన ప్రజలకు అనుభవం లేదు. ప్రతి ఒక్కరూ నిలబడి మాట్లా డటానికి

అంగీకరించేవారు. అయితే సమావేశంలో ఎలా వ్యవహరించాలి అనే నియమాల గురించి వారికి చెప్పేవాడ్ని, వారు దాన్ని

గౌరవించేవారు. వాళ్లు కూడా ఇది తమకు ఒక అవగాహనగా అర్థం చేసుకునేవారు. ప్రేక్షకుల ముందు ఎప్పుడూ మాట్లా డని వారు
కూడా ఎంతో మంది తరువాత కాలంలో ప్రజా ప్రయోజనాల అంశాలకు సంబంధించి బాగా ఆలోచించి, బహిరంగంగా మాట్లా డటం
అలవరచుకున్నారు.

ప్రజా సేవ కార్యక్రమాల్లో చిల్లర ఖర్చులకు ఎక్కువ సొమ్ము ఖర్చు అవుతుందని నాకు బాగా తెలుసు. ఆరంభంలో నేను రసీదు

పుస్తకాలు అచ్చువేయించకూడదు అనుకుఏరన్కనాను. నా కార్యాలయంలో సైక్లోస్టైల్ మిషన్ ఉండేది. దాని ద్వారా రసీదు కాపీలు,

సమావేశ నివేదికలను సిద్ధం చేసేవాడ్ని. రసీదులు ఎప్పుడూనా అచ్చు వేయించాలంటే కాంగ్రెస్ వద్ద గల్లా పెట్టే పూర్తిగా

నిండిపోయినప్పుడు మరియు ఎక్కువ మంది సభ్యులు, పని ఎక్కువైనప్పుడు మాత్రమే. అలాంటి ఆర్థిక క్రమశిక్షణ ఎలాంటి

సంస్థకైనా అత్యావశ్యం. అయితే చాలా సందర్భాల్లో అలాంటి ప్రయత్నం చేయరని నాకు తెలుసు. ఈ కారణంగానే నేను సంస్థ
ప్రారంభంలో చిన్నగా ఉన్నాసరే, తరువాత పెద్దదైనా సరే అందులో చేసే చిన్న చిన్న ఖర్చుల నుంచీ కూడా ప్రతిదీ పద్దు
రాయాల్సిందేననుకుని రాశాను.
ప్రజలు తాము చెల్లించిన సొమ్ముకు సంబంధించి రసీదులు జాగ్రత్తగా ఉంచుకోవాలనేది పట్టించుకోరు. కానీ మనం ఎల్లప్పుడూ

వారిని రశీదులు దగ్గర ఉంచుకోమని కోరేవారం. ప్రతి పైసాకు అలా పక్కా లెక్కలుండేవి. నేను ఇప్పుడు కూడా ధైర్యంగా

చెప్పగలను, నాటల్ ఇండియన్ కాంగ్రెస్కు సంబంధించి 1894 నుంచి నిర్వహించిన లెక్కల పద్దు లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

ఎలాంటి సంస్థకైనా జాగ్రత్తగా లెక్కలు నిర్వహించి భద్రపరచడమనేది అత్యంతావశ్యకరం. అవి లేకపోతే ఆ సంస్థ ప్రతిష్ఠ

దిగజారిపోతుంది. లెక్కలు సక్రమంగా నిర్వహించకపోతే వాస్తవాన్ని నిలబెట్టు కోవడం, దాన్ని పవిత్రతను కాపాడుకోవడం అసాధ్యం.

ఈ కాంగ్రెస్ యొక్క మరో ప్రధాన విధి ఆ దేశంలో పుట్టిన విద్యావంతులైన భారతీయులకు సేవ చేయడం. కాంగ్రెస్ సంస్థ గొడుగు

కింద ది కలోనియల్ బోర్న్ ఇండియన్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ను ఏర్పాటు చేశాం. ఇందులో సభ్యులుగా ఎక్కువగా అక్కడ

విద్యావంతులైన భారతీయు యువకులే ఉంటారు. వారు కేవలం నామమాత్రపు సభ్యత్వ రుసుం మాత్రమే చెల్లించాలి. ఈ
సంఘం అక్కడ ప్రజల అవసరాలు, వారి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, వారిలో ఆలోచనలు రగిలించి, వారిని అక్కడ మిగిలిన
భారతీయులైన వర్తకులందరితో అనుసంధానం చేయడం.

Page: 135 (Original Page No. 145)


దాంతోపాటుగా అక్కడి భారతీయ సమాజానికి సేవ చేసే అవకాశం కల్పించడం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చర్చించే సంఘం.

ఇందులో సభ్యులు క్రమం తప్పకుండా సమావేశమై, వివిధ అంశాలపై మాట్లా డటం, వార్త పత్రికలు చదవడం లాంటివి చేసేవారు. ఆ

సంఘాని ఒక చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశాం.

ఇక కాంగ్రెస్కున్న మూడో ప్రధానమైన విధి ప్రచారం. నాటల్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను దక్షిణాఫ్రికా మరియు ఇంగ్లండ్లోని

ఆంగ్లేయులకు, భారతదేశంలోని భారతీయ ప్రజలకు పరిచయంచేయడమే ఇందులో భాగం. ఆ దృష్టికోణంలో భాగంగా నేను రెండు

కరపత్రాలను రాశాను. మొదటి కరపత్రం దక్షిణాఫ్రికాలోని ప్రతి బ్రిటిష్ వ్యక్తికి విజ్ఞాపన. అందులో నాటల్లోని భారతీయుల సాధారణ

పరిస్థితులను వివరిస్మతూ ఒక ప్రకటన, దాన్ని బలపరిచే ఆధారాలు అందులో ఉన్నాయి. ఇంకొక కరపత్రం భారతీయులకు ఓటు

హక్కు గురించి - ఇచ్చిన పిలుపు. ఇందులో నాటల్లో భారతీయులకు ఓటహక్కు గురించిన చరిత్ర, వాస్తవాలు, గణాంకాలతో సహా

కలిగి ఉంది. ఈ రెండు కరపత్రాలను రూపొందించడానికి నేను త్రికరణశుద్దిగా శ్రమించి, అధ్యయనం చేసి రూపొందించాను. పడ్డ

శ్రమకు ఊహించని స్థా యిలో ఫలితం కూడా వచ్చింది. ఈ కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేశాం.

ఈ కార్యకలాపాలన్నిటి ఫలితంగా మేం దక్షిణాఫ్రికాలోని ఎంతోమంది భారతీయ మిత్రు ల హృదయాలను గెలుచుకోగలిగాం,


మరియు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల సానుభూతిని కూడా సంపాదించాం. దాంతో పాటు దక్షిణాఫ్రికాలోని

భారతీయులకు తదుపతరి విధిగా చేయాల్సిన కర్తవ్యం కూడా నిర్దేశించింది.


20
బాలసుందరం
హృదయం మంచిదైతే సంకల్పం నెరవేరుతుంది. ఇది నాకు జీవితంలో స్వయంగా ఎదురైన అనుభవైకవేద్యం. పేదలకు సేవ

చేయాలనేది నా మనసులో ఉండే కోరిక. అది నన్ను పేదల వద్దకు తీసుకెళ్లి వాళ్లతో మమేకమై వాళ్లలో నన్ను చూసుకునేలా చేసింది.

నాటల్ ఇండియన్ కాంగ్రెస్లో అక్కడి భారతీయ వర్తకులు, గుమస్తా ల వర్గం భాగానే సభ్యులుగా చేరారు, కానీ ఇంకా నైపుణ్యేతర
వేతన జీవులు, ఒప్పంద కార్మికులు దూరంగా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ మనది అని వారు భావించలేకపోయారు. కారణం వాళ్లంతా

కాంగ్రెస్ సభ్యులుగా చేరడానికి కావాల్సిన సభ్యత్వం చెల్లించలేని వర్గంగానే ఉండిపోయారు. వారికి సేవ చేయడం ద్వారానే కాంగ్రెస్

వారి హృదయాలను గెలుచుకోగలదు. సరిగ్గా ఈ సందర్భంలోనే అటు కాంగ్రెస్గానీ, ఇటు నేనుగానీ ఊహించని అవకాశం ఒకటి

దానంతట అదే కలిగింది. నేను మహా అంటే అతికష్టం మీద మూడు లేదా నాలుగు నెలలు ప్రాక్టీసు చేసి ఉంటాను, కాంగ్రెస్ కూడా

ఇంకా శైశవ దశలోనే ఉంది.

Page: 136 (Original Page No. 146)


సరిగ్గా అప్పుడే నా వద్దకు ఒక తమిళ వ్యక్తి వచ్చాడు. చించేరసిన చొక్కా, చేతిలో తలపాగా, ముందరి రెండు పళ్లు విరిగిపోయి, నోటి

నుంచి రక్తం ధారలై కారుతూ, గజగజ వణుకుతూ, విలపిస్తూ నా ముందు నిలబడ్డా డు. అతడి యజమానికి అతడ్ని

విచక్షణారహితంగా కొట్టా డు. మా గుమస్తా ద్వారా ఆయనకు జరిగిన విషయమంతా కనుకొన్నాను. ఆయన కూడా తమిళుడే.

బాలసుందరం - నా ముందు నిలుచున్న వ్యక్తి పేరు అది - డర్బన్లో ఒక సుప్రసిద్ధ ఐరోపా నివాసి వద్ద ఒప్పంద కార్మికుడిగా

పనిచేస్తు న్నాడు. ఆ యజమానికి, అతడిపై కోపం వచ్చింది, సహనం కోల్పోయాడు, బాలసుందరాన్ని తీవ్రంగా కొట్టా డు. ఈ దాడిలో

అతడి రెండు పళ్లు విరిగిపోయాయి.

నేను అతడ్ని వెంటనే వైద్యుడి వద్దకు పంపాను. ఆ రోజుల్లో అక్కడ కేవలం ఒక్క తెల్లవారే వైద్యులుగా ఉండేవారు. గాయాల తీరు

గురించి వైద్యుడి నుంచి ఒక ధృవీకరణ తప్రం కావాలని కోరాను. బాలసుందరం కోలుకున్నారు. వైద్యుడి నుంచి ధృవీకరణపత్రం
సాధించాను. దాంతో గాయపడ్డ బాలసుందరాన్ని వెంటపెట్టకుని నేరుగా మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లా ను, ఆయనకు నేను నా ప్రకటన

సమర్పించాను. దాన్ని చదివిన మేజిస్ట్రేట్ ఆగ్రహంచెంది, ఆ యజమానికి వ్యతిరేకంగా తాఖీదు జారీ చేశారు.

ఆ యజమానికి శిక్ష పడాలనేది నా ఉద్దేశం కాదు, దానికంటే ముందు బాలసుందరానికి ఆ యజమాని నుంచి విముక్తి కలిగించాలి.

నేను ఒప్పంద కార్మికుల చట్టా లను చదివాను. ఒక వేళ సాధారణ నౌకరలు యజమానికి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా

వెళ్లిపోతే సివిల్ కోర్టు ద్వారా ఆ యజమాని తీసుకునే చర్యలకు కార్మికుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ఒప్పంద

కార్మికుడి కేసు పూర్తి భిన్నమైంది. ఇక్కడా అతడికి హక్కుంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఇతడికి వ్యతిరేకంగా క్రిమినల్ కోర్టు కు

వెళ్లొచ్చు, దోషిగా తేల్చి జైలుకు కూడా పంపొచ్చు. అందుకే సర్ విలియమ్ హంటర్ ఒప్పంద కార్మిక వ్యవస్థ బానిసత్వం లాంటి

దుష్టవ్యవస్థ అంటారు. బానిస లాగే, ఒప్పంద కార్మికుడు కూడా యజమాని ఆస్థి.

బాలసుందరంను విడిపించడానికి అక్కడ రెండే మార్గాలున్నాయి: ఒప్పంద కార్మికుల రక్షకుడి సాయం కోరి, అతడి ద్వారా ఈ
ఒప్పందాన్ని రద్దు చేయడమా లేక, ఈ ఒప్పంద కార్మికుడ్ని మరొరకరి బదిలీ చేయడం, లేక పోతే బాలసుందరమం యజమాన్నే
అతడ్ని విడిచిపెట్టడం. దాంతో అతడ్ని తరువాత కలసి అతడికి చెప్పాను: ‘నీకు వ్యతిరేకంగా కేసువేసి పోరాడి, నీకు శిక్ష పడేలా

చూడాలని నేను అనుకోవడం లేదు. నువ్వు ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టా వనే సంగతి నీకు బాగా ఎరుకేనని అనుకుంటున్నాను. ఈ

ఒప్పంద కార్మికుడ్ని నువ్వు ఇంకొకరికి బదిలీ చేస్తే చాలా నేను సంతోషిస్తా ను.’ దీనికి అతడు వెంటనే ఒప్పుకొన్నాడు. తరువాత
ఒప్పంద కార్మికుల రక్షకుడిని సంప్రదించాను, అయితే బాలసుందరంను పనిలో పెట్టు కోవడానికి యజమానిని నేను చూడాలనే
షరతుపైన అతడు అంగీకరించాడు.

అలా నేను ఇప్పడు ఒక యజమానిని వెతికే పనిలో పడ్డా ను. అతడు ఐరోపా వ్యక్తి అయి ఉండాలి. ఎందుకంటే భారతీయులు

ఎవరూ కూడా ఒప్పంద కార్మికులను వినియోగించుకోవడానికి వీలు లేదు. ఆ సమయంలో నాకు కేవలం కొద్ది మంది మాత్రమే

ఐరోపా వారు తెలుసు. వారిలో ఒకర్ని కలిశాను. ఆయన ఎంతో దయతో బాలసుందరంను తీసుకోవడానికి అంగీకరించారు.

ఆయన దయార్థహృదయానికి నేను కృతజ్ఞతలు చెప్పాను. బాలసుందరం యజమానిని మేజిస్ట్రేట్ దోషిగా నిర్దా రించారు. ఆయన

నుంచి ఒప్పంద కార్మికుడిని మరొకరికి బదలాయించడానికి అంగీకార పత్రం తీసుకున్నారు.

Page: 137 (Original Page No. 147)


బాలసుందరం కేసు అక్కడ ఒప్పంద కార్మికుల చెవుల్లో మారుమోగిపోయింది. వారు నన్ను వారి స్నేహితుడిగా పరిగణించారు. ఈ

సంబంధాన్ని నేను ఎంతో సంతోషంగా భావించాను. దాంతో క్రమం తప్పంకుండా నా కార్యాలయానికి చాలా మంది ఒప్పంద

కార్మికులు రావడం ప్రారంభమైంది. దాని వల్ల నాకు వారి సుఖ దుఃఖాలను తెలుసుకునే అవకాశం దొకికింది.
బాలసుందరం కేసు ప్రతిధ్వనులు మద్రాసు వరకు కూడా పాకాయి. ఆ ప్రాంతంలో వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు, ఎవరైతే

నాటల్లో ఒప్పంద కార్మికులుగా వచ్చారో, వారంతా కూడా ఈ కేసు గురించి తమ వారి నుంచి తెలుసుకున్నారు.

నిజానికి ఇది ఏమంత అసాధారణమైన కేసు ఏమీ కాదు, నిజం చెప్పాలంటే ఇప్పటికి నాటల్లో ఒప్పంద కార్మికుల సమస్యలను
బహిరంగంగా వెలుగులోకి తెచ్చి వారి కోసం గొంతు వినిపించిన ఒక వ్యక్తి వారికి కనిపించడం వారిని ఆశ్చర్యం, ఆనందానికి గురి
చేసింది. ఇది వారిలో ఆశను పెంచింది.

బాలసుందరం నా కార్యాలయంలో ప్రవేశించినప్పుడు చేతిలో తలపాగా ఉందని నేను ఇంతకు ముందే చెప్పాను కదా. ఇది అక్కడ

మనకెదురవుతున్న అవమానాలు, ప్రత్యేకమైన విచారకర పరిస్థితులను తెలియజేస్తోంది. నన్ను నా తలపాగా తీసేమని చెప్పిన

సంఘట గురించి మీకు ఇప్పటికే వివరించాను. ఒక ఐరోపా పౌరుడ్ని సందర్శించే సమయంలో ప్రతి ఒప్పంద కార్మికుడు మరియు

ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తన తలపాగా తీసి మాట్లా డే సంప్రదాయాన్ని బలవంతంగా రుద్ది అమలు చేస్తు న్నారు. తలపాగా

ఎలాంటిదైనా, టోపీ, సిక్కులు ధరించే తలపాగా, తలచుట్టూ కట్టకునే తలపాగా ఏదైనా సరే. రెండు చేతులు జోడించి చేసే

నమస్కారం కూడా సరిపోదు. బాలసుందరం ఏమనుకున్నారంటే ఈ పద్దతిని నా ముందు కూడా పాటించాలేమో అనుకున్నాడు.

ఇది నా అనుభవంలో మొదటి కేసు. ఆయన అలా చేయడం నాకు ఇబ్బందికరంగా అనిపించి ఆయన్ను తలపాగా తలకు

చుట్టు కోవాలని కోరాను. ఆయన అలాగే చేశారు. అతడు కొంచెం సంకోచిస్తూనే అలా చేసినా, అతడి మోములో సంతోషం

కనిపించడం నేను గమనించాను.

తన తోటి మనుషులను అవమానపరచడం ద్వారా తాము గౌరం పొందుతామని మనుషులు ఎలా అనుకుంటారో, నాకు ఇప్పటికీ
అంతుబట్టని విషయం.

21
3 పౌండ్ల పన్ను
బాలసుందరం కేసు నన్ను భారతీయ ఒప్పంద కార్మికులకు దగ్గరగా చేర్చింది. ఇది ఏమి సూచించిందటే, వారిపైన విధిస్తు న్న ప్రత్యేక

భారీ పన్నులకు వ్యతిరేకంగాప ప్రచారం చేయడానికి వారి పరిస్థితుల గురించి అధ్యయనం చేసేలా చేసింది.
Page: 138 (Original Page No. 148)
సరిగ్గా అదే సంవత్సరం,ర 1984 లో, నాటల్ ప్రభుత్వం అక్కడ పనిచేస్తు న్న ఒప్పంద కార్మికులపై 2.5 పౌండ్ల వార్షికపన్ను విధిస్తూ

చట్టం తెచ్చింది. ఆ ప్రతిపాదన నన్నునిర్ఘాంతపరిచింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ముందు చర్చకు పెట్టా ను. దీన్ని వ్యతిరేకిస్తూ

అవసరమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టా లని సమావేశం వెంటనే తీర్మానించింది.

ఈ సందర్భంగా ఈ పన్ను పూర్వాపరాల గురించి నేను ఇక్కడ తప్పనిసరిగా చెప్పాల్సిందే.

1860 వ సంవత్సరంలో నాటల్లోని ఐరోపావారు, ఇక్కడ చెరకు సాగు చేయడానికి విస్తా రమైన అవకాశాలున్నట్లు గుర్తించారు.

దాంతో వారికి పనిచేసే కూలీలు అవసరమయ్యారు. బయట నుంచి కూలీలను తెచ్చుకోకుండా అక్కడ చెరకు సాగు చేయడం,

చక్కెర తయారు చేయడం అసాధ్యం. నాటల్లోని జులు తెగవారు ఈ పనులు చేయడానికి పనికారారు. దాంతో నాటల్ ప్రభుత్వం

భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. భారతీయ కూలీలను ఇక్కడ పనుల్లో నియమించుకోవడానికి వారి అనుమతి తీసుకుంది. ఈ

నియామకాలు ఎలా ఉంటాయంటే అయిదు సంవత్సరాల పాటు నాటల్లో పనిచేసేలా ఒప్పందంపై ఆ కూలీ సంతకాలు చేయాలి.
ఒప్పంద గడువు ముగిశాఖ ఆ కార్మికుడికి ఇష్టమైతే అక్కడే నాటల్లోనే స్థిరపడే స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ భూమిపై యాజమాన్య
హక్కులు పొందొచ్చు. ఇలా ఈ పనికోసం వచ్చేవారిని ప్రలోభపెట్టా రు. దాని ద్వారా అక్కడ వారి ఒప్పందం ముగిసిన తరువాత

కూడా అక్కడ వ్యవసాయం, పరిశ్రమను భారతీయ కూలీల కాయకష్టంతో అభివృద్ధి చేయొచ్చని తెల్లవారు భావించారు.

భారతీయులు మాత్రం వారు ఆశించినదానికంటే ఎక్కువగానే ఇచ్చారు. అక్కడ భారీ మొత్తంలోకూరగాయలు పండించేవారు.

అక్కడ వీరు పలు రకాల భారతీయ వంగడాలను పరిచయం చేసి వాటిని అక్కడ స్థా నికంగా చాలా చౌకగా పెంచేలా చేశారు.

భారతీయులే అక్కడ మామిడి పంటను పరిచయం చేశారు. వారి పరిశ్రమ కేవలం వ్యవసాయంతోనే ఆపలేదు. అక్కడ వర్తకంలోకి

ప్రవేశించారు. అక్కడ భవనాల కోసం భూములు కొన్నారు. చాలా మంది కార్మికుల స్థా యి నుంచి భూమలులు, ఇళ్ల యజమానుల

హోదాకు చేరుకున్నారు. భారతదేశంలోని చాలా మంది వర్తకులు వీరిని అనుసరిస్తూ ఇక్కడికి వచ్చి వ్యాపారం కోసం స్థిరపడ్డా రు.

వారిలో దివంగత సేఠ్ అబుబకర్ అమోద్ మొదటి వారు. అచిరకాలంలోనే ఆయన చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు.

దీంతో తెల్లవాళ్లలోని వర్తకులు కంగుతిన్నారు. మొదట్లో వారు భారతీయ కూలీలను స్వాగతించేవారు. కానీ అప్పుడు వారికి

మనవాళ్ల వ్యాపార నైపుణ్యంపై అంత నమ్మకం ఉండేది కాదు. మనవాళ్లను వారు వ్యక్తిగత వ్యవసాయదారులుగా

పరిగణించినట్లయితే సహించేవారే కానీ, వ్యాపారంలో మనవాళ్ల నుంచి ఎదురవుతున్న పోటీని మాత్రం సహించలేకపోయారు.

ఇది భారతీయుల పట్ల వారిలో వ్యతిరేక బీజాలు నాటాయి. ఇది మరింత పెరగడానికి కొన్ని ఇతర అంశాలు

కారణభూతమయ్యాయి. మన ప్రత్యేక జీవన శైలి, మన నిరాడంబరత, పరిశుభ్రత, శుభ్రతకు సంబంధించి మన భిన్నమైన పద్దతులు,
మన పరిసరాలను శుభ్రంగా, అందంగా ఉంచుకోవడంలో మనవాళ్లు నెమ్మదిగా ఉండటం, ఇళ్లకు మరమ్మతులు
చేయించుకోకుండా మనవాళ్లలో నెలకొన్న పిసినారితనం - ఇవన్నీ, మత విద్వేషాల్లో కలగలసి. అవి నెమ్మదిగా మనపట్ల వ్యతిరేక

కుంపటి రగిలించాయి. ఈ ద్వేషాన్ని చివరకు ఓటుహక్కు నిరాకరిస్తూ తీసుకొచ్చిన బిల్లు రూపంలో

Page: 139 (Original Page No. 149)

మరియు భారతీయ ఒప్పంద కూలీలపై పన్ను విధిస్తూ తెచ్చిన బిల్లు రూపంలో వ్యక్తపరిచారు. ఈ చట్టంతో అప్పటికే చాలా వరకు

చిన్న చిన్న చిక్కులు ఏర్పడటం ప్రారంభమైంది.

ఈ చట్టంలో మొదటి సూచన, ఇక్కడ భారతీయ కార్మికులందర్నీ బలవంతంగా స్వేదేశానికి తరలించడం. దానివల్ల వారి ఒప్పందం

గడువు భారతదేశంలోనే ముగిసిపోతుంది. ఈ సూచనను భారతీయ ప్రభుత్వం అంగీకరించడానికి సిద్దంగా లేదు. దాంతో
దీనితరువాత మరో సూచన తెచ్చారు, దాని ప్రకారం

1. ఒప్పంద కార్మికులు తమ ఒప్పందం గడువు తీరిపోగానే వారంత తప్పనిసరిగా భారత్కు వళ్లిపోవాలి; లేదా

2. అతడు ప్రతి రెండేళ్లకు ఒక సారి కొత్తగా ఒప్పందంపై సంతకాలు చేయాలి, ప్రతి రెన్యూవల్ కు కొంత వేతనం పెరుగుదల
ఉంటుంది. అది కూడా

3. ఒక వేళ గనుక అతడు భారతదేశానికి తిరిగి వెళ్లిపోవడానికి నిరాకరించినా లేక ఒప్పందం రెన్యూవల్ చేయించుకోవడానికి
నిరాకరించినా ఆ కార్మికుడు ఏడాదికి 25 పౌండ్ల పన్ను చెల్లించాలి.

ఈ ప్రతిపాదలనకు భారత ప్రభుత్వం నుంచి ఆమోదం సంపాదించడం కోసం సర్ హెన్నీ బిన్స్, మాసనల్తో కూడిన ప్రతినిధి బృందాన్ని
భారత్కు పంపారు. భారత్కు అప్పుడు వైస్రాయ్గా లార్డ్ ఎల్గిన్ ఉన్నారు. ఆయన ఈ 25 పౌండ్ల పన్ను విధించడాన్ని తిరస్కరించారు,

బదులుగా కార్మికులపై సంవత్సరానికి 3 పైండ్ల పన్ను విధించడానికి అంగీకరించారు. వేస్రాయ్ చేసిన అతి పెద్ద తప్పు అదేనని నేను

అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. ఈ అనుమతి ఇచ్చే సమయంలో ఆయన భారతదేశం ప్రయోజనాల గురించి

ఏ మాత్రం ఆలోచించలేదు. అసలు నాటల్ తెల్లవారికి లాభం చేకూర్చడం అతడి విధుల్లో భాగం కాదు. దీనివల్ల తరువాతమూడు
నాలుగు సంవత్సరాల్లో ప్రతి భారతీయ ఒప్పంద కూలీ తన భార్య, 16 ఏళ్లకుపైబడిన తన పిల్లలు, 13 ఏళ్లకుపైబడిన ఆడబిడ్డ
అందరూ ఈ పన్ను చట్టం కిందకు వచ్చారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లు - నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబం ఏడాదికి ఇలా

12 పౌండ్లు పన్ను కట్టా ల్సి వచ్చేది - ఇంట్లో భర్తకు నెలకు సగటు ఆదాయం 14 షిల్లింగ్లకు మించి వచ్చేది కాదు. ఇది ప్రపంచంలో

మరెక్కడా లేని అరాచకమైన చట్టం.


మేము ఈ పన్నుకు వ్యతిరేకంగా తీవ్రస్థా యిలో ప్రచారం ప్రారంభించాం. ఒక వేళగనుక నాటల్ ఇండియన్ కాంగ్రెస్ దీనిపైన మౌనంగా

ఉంటే, వైస్రాయ్ 25 పౌండ్ల పన్ను విధించడానికి కూడా అనుమతించేవారే. 25 పౌండ్ల నుంచి 3 పౌండ్లకు పన్ను తగ్గించడానికి ఏకైక

కారణం కాంగ్రెస్ చేస్తు న్న ఆందోళనల ఫలితమే. కానీ నేను అలా తప్పుగా అనుకునేమో. నిజానికి కాంగ్రెస్ ఆందోళనలతో సంబంధం

లేకుండా భారతీయ ప్రభుత్వం ఒకేసారి 25 పౌండ్ల పన్ను విధించడం సరికాదని దాన్ని 3 పౌండ్లకు తగ్గించి ఉండొచ్చు. ఏది

ఏమైనప్పటికీ ఈ విషయంలో భారత ప్రభుత్వం చేసింది ముమ్మాటికీ విశ్వాసఘాతుకం. భారతీయ సంక్షేమ పరిరక్షుడిఆ వైస్రాయ్

ఎట్టి పరిస్థితులోనూ ఈ అమానవీయ పన్నుకు ఆమోదం తెలిపిఉండకూడదు.

25 పౌండ్ల నుంచి 3 పౌండ్లకు పన్ను తగ్గించడాన్ని కాంగ్రెస్ ఏమాత్రం తమ విజయంగా భావించడం లేదు. భారతీయ ఒప్పంద

కార్మికుల ప్రయోజనాలను పూర్తి స్థా యిలో పరిరక్షించలేకపోయామనే బాధ మాలో ఇంకా మిగిలే ఉంది.

Page: 140 (Original Page No. 150)


ఈ పన్ను ఉపసంహరింపజేయాలనే పట్టు దల మాలో అలాగే ఉంది, అయితే ఇది సాకారమవడానికి ఇరవై ఏళ్లు పట్టింది. ఇది
సాకారమవడం, ఒక్క నాటల్లోని భారతీయ ఒప్పంద కార్మికులే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారతీయులందరూ ఏకమై జరిపిన
పోరాట ఫలితమే. గోఖలేకి ఇచ్చిన వాగ్దా నం కూడా తప్పడంతో ఈ ఆందోళనలకు తుది రూపు ఇచ్చింది. ఈ ఆందోళనలో
ఎంతోమంది భారతీయ ఒప్పంద కార్మికులు సంపూర్ణంగా పాల్గొన్నారు, ఆందోళనకారులపై ఆంగ్లేయిలు కాల్పులకు తెగబడటంతో
కొంతమంది అసువులుబాసారు. దాదాపు పది వేలమందికిపైగా కారాగారంలో బాధలు అనుభవించారు.

ఏమైతేనేం చివరకు సత్యమే గెలిచింది. ఆ సత్యాన్ని భారతీయుల కష్టా లు చాటాయి. ఎంతో ఓర్పు, సహనతో, అవిశ్రాంత

పోరాటంతో సత్యం కోసం వెరక పోరాడకపోతే ఆ విజయం సిద్ధించేది కాదు. ఒక అక్కడ భారతీయ సమాజం ఈ పోరాటాన్ని
వదిలేసి ఉన్నా, ఈ పన్ను విధించడం అన్యాయమంటూ కాంగ్రెస్ తాను చేస్తు న్న ప్రచారాన్ని రద్దు చేసుకున్నా ఈ అన్యాయమైన
పన్నును ఇక్కడ భారతీయు ఒప్పంద కార్మికులపై విధించేవారు, ఈ రోజుకు కూడా వారి నుంచి ముక్కుపిండి వసూలు
చేస్తుండేవారు. అలా జరిగి ఉంటే దక్షిణాఫ్రికాలోని భారతీయులకే కాక ప్రపంచంలోని భారతీయులందరికీ అది పెద్ద అవమానం.

22
మతాలపై తులనాత్మక అధ్యయనం
నేను ఇలా పూర్తిగా ప్రజాసేవలోనే నిమగ్నపోగలిగానంటే, దాని వెనుక ఉన్న కారణం ఆత్మ పరివర్తన సాధించాలని గట్టిగా
కోకరుకోవడమే. సేవ చేయడమై నిజమైన మతమని నాకు అనిపించింది. కేవలం సేవ ద్వారానే భగవంతుడి సాక్షాత్కారం

కలుగుతుందని భావించాను. నేను చేసే సేవ ఏదైనా భారతదేశానికి సవ చేస్తు న్నట్లు గానే భావిస్తా ను. ఎందుకంటే నేను ఏమీ

కోరుకోకుండానే ఇది నాకు అబ్బింది. ఎందుకంటే అది నా అభిరుచి కూడా. దక్షిణాఫ్రియాను చూసి రొవొచ్చు అనే కాంక్షతో

ఇక్కడికి వచ్చాను, అలాగే కథియావాడాలోని కుట్రల నుంచి తప్పించుకుని నా జీవనోపాధి వెతుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ

నేను చెప్పాను కదా, నేను ఇక్కడ ఈశ్వరాన్వేషణలో, స్వీయ పరివర్తనలో నిమగ్నమైపోయాను.

క్రైస్త వ మిత్రు లు నాలోని జ్ఞానతృష్ణను కొంత రగిలించారు, అయితే అది నన్ను కుదురుగా ఉండనివ్వలేదు, నన్ను ప్రశాంతంగా
ఉండనివ్వలేదు, చివరకు నేను వారి అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నా సరే. డర్బన్లోని ది సౌత్ ఆఫ్రికా జనరల్ మిషన్ అధిపతి స్పెన్సర్

వాల్టన్ నన్ను పసిగట్టా రు. నేను దాదాపు వారి కుటుంబంలో ఒక సభ్యుడిలా కలిసిపోయాను. ఆయన పరిచయానికి కంటే ముందు

నాకు ప్రిటోరియాతో ఉన్న పరిచయం మూలంగా ఈయన పరిచయమయ్యారు. వాల్టన్ గారిది ఆమనదైన వ్యక్తిత్వం. ఆయన నన్ను

ఎప్పుడూ కూడా క్రైస్త వంలో చేరమని కోరినట్లు నాకు గుర్తు లేదు.

Page: 141 (Original Page No. 151)


కానీ ఆయన తన జీవితాన్ని తెరచిన పుస్తకంలా నా ముందుంచేవారు. నేను ఆయన కదలికలను గమనించేవాడ్ని. ఆయన శ్రీమతి

వాల్టన్ చాలా హుందా కలగిని, ప్రజ్ఞావంతురాలైన మహిళ. వీరిద్దరి వ్యక్తిత్వాలను నేను చాలా ఇష్టపడేవాడ్ని. మాకు మా మధ్య ఉన్న

మౌలిక తేడాలు బాగా తెలుసు. మేం జరిపే ఎలాంటి చర్చలు కూడా వీటి మీద ప్రభావం చూపేవి కావు. ఇంకా చెప్పాలంటే కొన్ని సార్లు

ఈ వైరుధ్యాలు మాకు మేలు చేసేవి. ఎక్కడైతే సహనం, దాతృత్వం మరియు సత్యం ఉంటాయో అక్కడ ఇవి ఎంతో ఉపకరిస్తా యి.

వాల్టన్ దంపతుల వినయం, పట్టు దల మరియు పనిపట్ల వారికున్న భక్తిశ్రద్ధలు నాకు చాలా బాగా నచ్చుతాయి. మేము తరచూ

కలిసేవాళ్లం.

ఈ స్నేహం నాలోని మత జిజ్ఞాసను సజీవంగా నిలిపేలా చేసింది. ప్రిటోరియాలో లాగా మతాలపై నేను అధ్యయనం చేసేందుకు

ఇక్కడ సమయం దొరకడం అసాధ్యంగా మారింది. కానీ ఏ మాత్రం చిన్న సమయం దొరికినా నేను ఆ సమయాన్ని దానికోసం

వెచ్చిస్తా ను. మతసబంధమైన ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయ్ఛాంద్భాయ్ నాకు మార్గదర్శనం చేస్తు న్నారు.

నర్మదాశంకర్ గారి ధర్మ విచార్ పుస్తకాన్ని ఒక మిత్రు డు నాకు పంపారు. దాని పీఠిక నాకు ఎంతో ఉపకరించింది. ఆ కవి

విశృంకలంగా జీవించిన విధానం గురించి నేను విని ఉన్నాను. ఈ పుస్తకం పీఠికలో ఆయన మతపరమైన అధ్యయనం వల్ల తన
జీవితాన్ని ఎలా పరివర్తన చేసుకోగలిగారో వివరించారు. నాకు ఈ పుస్తకం చాలా బాగా నచ్చింది. కవర్ పేజీ నుంచి చివరి వరకు

ఆసాంతం ఎంతో శ్రద్ధతో చదివాను. అలాగే మాక్స్ ముల్లర్ రాసిన పుస్తకం, ఇండియా - వాట్ కెన్ ఇట్ టీచ్ అజ్? కూడా ఎంతో

ఆసక్తితో చదివాను. థియోసాఫికల్ సొసైటీ ప్రచురించిన ఉపనషత్తు ల అనువాధాన్ని కూడా చదివాను. ఇవన్నీ కూడా నాకు

హిందూమతం పట్ల గౌరవాన్ని పెంచాయి. ఈ మతం గొప్పతనాలు నాలో క్రమకమ్రంగా వృద్ధి చెందడం ప్రారంభమైంది. అయితే,

అంతమాత్రం చేత ఇది నన్ను ఇతర మతాల ఎడల వ్యతిరేక భావనలు కలిగించలేదు. వాషింగ్టన్గారు రాసిన ఇర్వింగ్స్ లైఫ్ ఆఫ్

మహమ్మద్ అండ్ హిస్ సక్ససర్స్ అండ్ కార్లైల్ పనెగైరిక్ ఆన్ ది ప్రాఫెట్ పుస్తకాన్ని కూడా చదివాను. ఈ పుస్తకాలు మహమ్మద్ ప్రవక్త

యెడల నాకు గౌరవాన్ని పెంచాయి. దాంతో పాటు ది సేయింగ్స్ ఆఫ్ జరాతుస్త్రా పుస్తకాన్ని కూడా చదివాను.

అలా నేను ఇతర మతాల గురించి మరంతి జ్ఞానం సముపార్జించుకున్నాను. ఈ అధ్యయనాలు నాలో ఆత్మపరిశీలనను

రగిలించాయి. చదివిన వాటిలో నాకు మంచిదని తోచిన ప్రతిదాన్ని ఆచరణలో పెట్టడం ఒక అలవాటుగా మార్చాయి. అలా నేను

కొన్ని కొన్ని హిందూ పుస్తకాలను చదవడం ద్వారా యోగాసనాల గురించి కూడా తెలుసుకుని వాటి సాధన కూడా చేశాను. కానీ

ఎక్కువ కాలం ఆ సాధన కొనసాగించలేకపోయాను. భారతదేశం వెళ్లా క అక్కడ ఒక యోగా సాధకుడి సహాయంతో సాధాన

చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ కోరిక ఎప్పటికీ తీరలేదు.

నేను టాల్స్టాయ్ పుస్తకాలు కూడా విరివిగా చదివాను. ది గాస్పెల్ ఇన్ బ్రీఫ్, వాట్ టు డు? మరికొన్ని ఇతర పుస్తకాలు నా

మనసుపై చెరగని ముద్రవేశాయి. విశ్వవ్యాప్తమైన ప్రేమకు అనంతమైన అవకాశముందనే సత్యం నేను తెలుసుకోవడం మొదలు

పెట్టా ను.

సరిగ్గా ఇదే సమయంలో నాకు మరో క్రైస్త వ కుటుంబంతో పరిచయం కలిగింది. వారి సలహా మేరకు ప్రతి ఆదివారం నేను వెస్లియన్

చర్చికి వెళ్లేవాడిని. ఆరోజుల్లో నేను ఎప్పుడు అక్కడికి వెళ్లినా ఆ కుటుంబంతో కలిసి విందు చేయాలని వారు నాకు

ఆహ్వానించారు.

Page: 142 (Original Page No. 152)


ఆ చర్చి నన్ను పెద్దగా ఆకట్టు కోలేకపోయింది. అక్కడ జరిగే ప్రార్థనలు కూడా స్ఫూర్తిదాయకంగా ఏమీ లేవు. అక్కడి మతాదిపతుల

ప్రవచనాలు కూడా నాలో ఏమీ మతపరమైన భావనలు కలిగించలేకపోయింది. వారంతా ఏమీ భక్తి మనస్సుతో సమావేశమైనవారు

కారు; వారంతా ఏదో మాటవరసకు అలా వచ్చినట్లు కనిపిస్తు న్నారు. ఏదో కాస్త మానసిక ప్రశాంతత కోసం, ఆచారం పాటించాలనో

అక్కడికి వస్తు న్నారు. కొన్ని సార్లు నాకు అక్కడ అనుకోకుండా నిద్రపట్టేసేది. చాలా అవమానంగా భావించేవాడ్ని, అయితే అక్కడ నా
సహచరులు కొంతమంది నాకంటే ఏమీ ఉత్తమంగా లేరు, దాంతో నేను దీన్ని తేలిగ్గా తీసుకున్నాను. ఇలాంటి చోటుకు ఎక్కువసేపు

వెళ్లలేను, దాంతో ఆచిరకాలంలోనే ఈ చర్చికి హాజరు కావడం మానేశాను.

కానీ దీనివల్ల ఆ కుటుంబంతో నా సంబంధాలు దెబ్బతిన్నాయి. నేను ప్రతి ఆదివారం వారిని తప్పకుండా కలవడం ఆగిపోయింది.

వాస్తవంగా చెప్పాలంటే ఆ కుటుంబమే నన్ను ఇక రావొద్దు అని చెప్పినట్లు గా భావించాలి. అది అలా జరిగిపోయింది. కానీ ఇంట్లో

ఆతిథ్యం ఇచ్చే మహిళ చాలా మంచి వ్యక్తి, నిరాడంబరమైన స్త్రీ. కానీ కొంత సంకుచిత మనస్కురాలు. మేము ఎప్పుడూ

మతపరమైన అంశాలే చర్చించుకునేవాళ్లం. అప్పుడు నేను ఆర్నాల్డ్స్ రాసిన లైట్ ఆఫ్ ఆసియా మళ్లీ చదివాను. ఒక సారి మా

మధ్య ఏసుక్రీస్తు , గౌతమ బుద్ధు డి జీవితాల మద్య పోలికలపై చర్చ జరిగింది. ‘బుద్ధు డి కరుణ చడండి’ అని నేను అన్నాను. అది

కేవలం మానవాళికి మాత్రమే పరిమితం కాలేదు, అది సకల ప్రాణులకు పరివ్యాపితమైనది.

అతని భుజం మీద సంతోషంతో కూర్చున్న మేకపిల్ల చిత్తరువు కండ్ల యెదుట కనబడితే హృదయం ప్రేమతో నిండిపోతుంది. కాని

ఏసులో యీ విధమైన సర్వభూత వ్యాప్తమగు దయ కనబడదు. నేను ఇలా పోల్చడం ఆ ఉత్తమ మహిళకు బాధ కలిగించింది. నేను

ఆమె భావాలను అర్థం చేసుకున్నాను. దాంతో ఈ చర్చను అక్కడితో ముగించేశాను. భోజనం చేయడానికి భోజన శాలకు వెళ్లా ను.

అక్కడ ఆమె కుమారుడు, అయిదు సంవత్సరాల బాలుడు, నాతో పాటు భోజనానికి కూర్చొన్నాడు. చిన్న పిల్లల మధ్య గడపాలంటే

నాకు చాలా సంతోషం. పైగా ఈ పిల్లా డు నేనూ చాలా కాలంగా స్నేహితులం. నేను అతడి ప్లేటులోని మాంసం ముక్క గురించి

ఆటపట్టిస్తూ, నా ప్లేటులోని ఆపిల్ గురించి గొప్పగా చెబుతూ మాట్లా డేవాడ్ని. దాంతో ఆ అమాయక బాలుడు దాన్ని అందుకుని

నావైపు కూర్చొని నాతోపాటు పండు గొప్పతనాన్ని పొగిడేవాడు. ఇక వాళ్ల అమ్మ సంగతి చూడాలి? ఆమె దిగులు పడేది.

నాకు అదో హెచ్చరికలాంటిది. నన్ను నేను ఒక సారి పరిశీలించుకుని, ఆ విషయాన్ని మార్చివేసేవాడ్ని. మరుసటి వారం నేను వాళ్ల

ఇంటికి యథావిధిగానే వెళ్లా ను. కానీ జంకు లేకుండా వెళ్లలేకపోయాను. నేను అక్కడికి వెళ్లదలచుకోకూడదు అనుకోలేదు,

అలాంటి ఆలోచన మంచిది కూడా కాదని నా ఉద్దేశం. కానీ ఆ ఉత్తమ మహిళ నా మార్గాన్ని సుగమం చేశారు.

‘గాంధీ,’ అని ఆమె అన్నారు, ‘నేను మీతో ఇలా చెబుతున్నానని దయచేసి ఏమీ అనుకోవద్దు . నీతో మా పిల్లవాడు కలవడం మంచిది

కాదు. ప్రతి రోజు అతడు మాంసం తినడానికి నిరాకరిస్తూ, పండ్లు కావాలని అడుతున్నాడు, అదేమంటే మీరు చేసిన వాదనను

గుర్తు చేస్తు న్నాడు. ఇది చాలా దారుణం. ఒక వేళగనుక అతడు మాంసం తినడం మానేస్తే, అతడు జబ్బు పడకపోవచ్చు, కానీ

బక్కపలచనవ్వాల్సిందే కదా. దాన్ని నేను ఎలా తట్టు కోగలను? ఇప్పటి నుంచి మీరు కేవలం పెద్దవాళ్లతో మాత్రమే మాట్లా డాలి. మీతో

చేరితో పిల్లలు చెడిపోతారని వారంతా విశ్వసిస్తు న్నారు .’


‘శ్రీమతి---- గారు’ అని బదులు చెబుతూ, ‘నన్ను క్షమించండి, బిడ్డ తల్లిగా మీ మనోభావాలను నేను అర్థం చేజుకోగలను,

ఎందుకంటే నాకు కూడా బిడ్డలున్నారు. మనం ఈ ఇబ్బందికర పరిస్థితికి ఇక్కడితో ముగింపు పలుకుదాం

Page: 143 (Original Page No. 153)


ఇక్కడ నేను ఏమి తింటున్నాను, ఏది తినడానికి తిరస్కరిస్తు న్నాను అనేది పిల్లవాడిమీద నేను చెప్పేదానికంటే కూడా ఎక్కువ
ప్రభావం చూపుతోంది. వీటన్నిటికీ నా ముందు ఒక్కటే మంచి మార్గముంది. నేను ఇలా ఇక్కడికి రావడం మానుకోవడం

మంచిదని భావిస్తు న్నాను. అయితే ఇది మన స్నేహ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదు.’

‘మీకు కృతజ్ఞతలు,’ అని ఊరట ఉట్టిపడుతున్న కళతో ఆమె అన్నారు.

23
కాపురం
కాపురం ఏర్పాటు చేయడం నాకు కొత్త అనుభవం ఏమీ కాదు. కానీ నాటల్లో నేను కాపురం ఏర్పాటు చేయడమనేది నేను

బొంబాయిలో లండన్లో గడిపిన దానికంటే భిన్నమైంది. ఈ సారి ఇక్కడ కేవలం హంగు ఆర్భాటం కోసమే కొంత ఖర్చు చేయాల్సి

వచ్చింది. నాటల్లో నేను భారతీయ బారిష్టర్గా, భారతీయుల ప్రతినిధి హోదా చూపించడానికి ఈ మాత్రం సంసార హంగు

అవసరమని నేను భావించాను. ఒక మంచి, ప్రాముఖ్యమైన ప్రాంతంలో నేను అందమైన చిన్న ఇల్లు తీసుకున్నాను. ఆ ఇంటికి

తగ్గట్టు అందమైన సామగ్రి కూడా అలంకరించాం. సాధారణమైన ఆహారమే, కానీ ఒక్కోసారి ఆంగ్లేయ మిత్రు లను, భారతీయ

సహచర కార్యకర్తలను ఇంటికి ఆహ్వానించినప్పడు ఇంటి నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ అయ్యేది.

ప్రతి ఇంటికీ ఒక మంచి నౌకరు అత్యవసరం. కానీ ఎవరినైనా ఎలా నౌకరుగా వినియోగించుకోవాలో నాకు తెలీని అంశం.

నాతో పాటూ ఒక స్నేహితుడు తోడుగా, సాయంగా ఉండేవారు. ఒక వంట మనిషి మా ఇంట్లో ఒక సభ్యుడిగా మారిపోయారు. మా

కార్యాలయ గుమస్తా కూడా నాతో పాటూ అక్కడో భోజనం చేసి, ఇంట్లోనే ఉండేవారు.
ఈ ప్రయోగంలో నేను బాగానే విజయం సాధించానని భావించాను. అయితే ఇందులో కొన్ని చిన్న చేదు అనుభవాలు కూడా

లేకపోలేదు.

నాకు తోడుగా ఉండే నా స్నేహితుడు చాలా తెలివైన వాడు, అతడు నాకు ఎంతో నమ్మకస్తు డు అనుకునేవాడ్ని. కానీ నేను

మోసపోయాను. నాతో పాటూ ఇంట్లో ఉంటున్న కార్యాలయ గుమస్తా ను చూస్తే అతడికి ఈర్శ్య. ఆ గుమస్తా పై నాకు అనుమానం

కలిగేలా అతుడు ఒక పన్నాగం రచించాడు. ఆ గుమస్తా మిత్రు డికి స్వతసిద్ధంగా కొంత కోపిష్టి. నేను అతడ్ని అనుమానిస్తు న్నానని

పసిగట్టగానే వెంటనే అతడు నా ఇంటిని, కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నేనెంతో బాధపడ్డా ను. ఒకవేళ నేను అతడి పట్ల

అన్యాయంగా ప్రవర్తించానేమో, నా అంతరాత్మ నాకెప్పుడూ మెలిపెట్టేది.

ఈ నేపథ్యంలోనే, ఏ కారణాలచేతనో కానీ, మా వంట మనిషికి కొన్ని రోజులు సెలవు అవసరమైంది. అతడు లేనన్ని రోజులూబ

బదులుగా మరో వంటమనిషిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మనిషి ద్వారా నా మిత్రు డు ఎంతటి దుర్మార్గుడో

నాకు తెలిసి వచ్చింది.. నా దృష్టిలో అతడ్ని దేవుడే నా వద్దకు పంపాడేమో. అతడు వచ్చిన తరువాత రెండు మూడు రోజుల్లోనే.

Page: 144 (Original Page No. 154)

నాకు తెలీకుండానే నా ఇంట్లో జరుగుతున్న కొన్ని అవకతవకలను అతడు గుర్తించాడు. దాంతో అతడు నన్ను హెచ్చరించాలని

అనుకున్నాడు. నేను ఒక నమ్మకమైన వాడిగా, ముక్కుసూటి మనిషిగా నాకు గుర్తింపు వచ్చింది. అలాంటిది, అతడు ఇవన్నీ

కనుగొనడం, మరింత ఆశ్చర్యపరిచాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనానికి నేను కార్యాలయం నుంచి ఇంటికి

వెళ్లేవాడిని. కానీ ఒక రోజు 12 గంటలకల్లా ఆ వంట మనిషి నా కార్యాలయానికి వచ్చి, నాతో అన్నాడు, ‘దయచేసి ఒక సారి ఇంటికి

రండి, వచ్చి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు .’

‘ఇప్పుడు, ఏమిటిదంతా?’ అన్నాను. ‘అదేమింటో నువ్వు నాకు ఇప్పడు చెప్పు. ఈ సమయంలో నేను కార్యాలయం విడిచిపెట్టి
ఇంటకి వచ్చి అక్కడ ఎలా చూడగలను?’
‘మీరే బాధపడతారు, ఇప్పడు గనుక రాకుంటే, నేను చెప్పగలిగింది అంతవరకే.’

అతడంత గట్టిగా ప్రాదేయపడటంతో, నేను నా కార్యాలయ గుమస్తా , కార్యాలయానికి వచ్చిన నా వంటమనిషితో కలిసి ఇంటికి
వెళ్లా ను. అతడు నన్ను నేరుగా పై అంతస్థు కు తీసుకెళ్లి, నాకు తోడుగా ఉన్న మిత్రు డి గది వద్దకు తీసుకెళ్లి చెప్పాడు, ‘ఈ తలుపు

తెరచి, మీరే చూడండి.’

నాకంతా బోధపడింది. నేను తలు.ఉ తట్టా ను. సమాధానం లేదు! గోడలు కదిలేంత గట్టిగా తలుపు తట్టా ను. తలుపులు

తెరచుకున్నాయి. గదిలోపల ఒక వేశ్య ఉండటం చూశాను. ఆమెను వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోమ్మన్నాను, ఇంకెప్పుడూ రావద్దని

చెప్పాను.

స్నేహితుడికి నేను చెప్పాను, ‘ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దారుణంగా మోసపోయాను, నన్ను ఒక

మూర్ఖుడిగా మార్చావు. నిన్ను నేను నమ్మినందుకు నువ్వ నాకిచ్చిన ప్రతిఫలం ఇదా?’

అతడు బుద్ది తెచ్చుకోవాల్సిందిపోయి, నా రహస్యాలన్నీ బయటపెడతానని నన్ను బెదిరించాడు.

‘నా దగ్గర దాపరికాలేమీ లేవు,’ నేను అన్నాను. ‘నేనేం చేశానో అవన్నీ బయటపెట్టు నాకేమీ భయం లేదు. కానీ నువ్వు వెంటనే నా

ఇల్లు వదలి వెళ్లిపోవాల్సిందే.’

అతడు మరింత దురుసుగా ప్రవర్తించాడు. దానివల్ల ఉపయోగం లేదు. దాంతో నేను కింది అంతస్తు లో నిలుచుని ఉన్న గుమస్తా కు

చెప్పాను: ‘దయచేసి వెళ్లి పోలీసు సూపరింటెండెంట్ గారికి సమాచారం చెప్పండి. ఆయనకు నా శుభాభినందనలు తెలిపి, నాతో

పాటు నివసిస్తు న్న ఒక వ్యక్తి తనంతట తాను అనుచితంగా ప్రవర్తించాడని చెప్పండి. అతడ్ని నేను నా ఇంట్లో ఉంచుకోవాలనుకోవడం

లేదు, కానీ అతడు ఇల్లు వదలిపెట్టి వెళ్లడానికి నిరాకరిస్తు న్నాడు. పోలీసులను నాకు సాయంగా పంపితే నేను వారికి ఎంతో

కృతజ్ఞుడిని.’

ఇది నేను ఎంత గంభీరంగా ఉన్నానో అతడికి చూపింది. చేసిన తప్పు అతడ్ని భయపెట్టింది. అతడు నన్ను క్షమాపణ వేడుకున్నాడు.

దయచేసి పోలీసులకు చెప్పొద్దని ప్రాధేయపడ్డా డు. వెంటనే ఇల్లు వదలి వెళ్లిపోతానని అంగీకరించి, వెళ్లిపోయాడు.
ఈ సంఘటన నా జీవితంలో తగిన హెచ్చరిక. ఈ దుష్ట మేదావి చేత నేను ఎలా మోసపోయానే కేవలం నేను ఇప్పుడే స్పష్టంగా

చూడగలుగుతున్నాను.

నేను అతడికి ఆశ్రయం ఇవ్వడం మంచి కోసం వెళ్లి చెడ్డను కొనితెచ్చికొన్నాను. ‘పల్లేరు మొక్కపై అంజూర పండ్లు ’ ఆశించాను. నా

మిత్రు డు చెడ్డ గుణాల గురించి నాకు తెలుసు, కానీ నేను అతడు నా పట్ల నమ్మకంగానే ఉంటాడని నమ్మాను.

Page: 145 (Original Page No. 155)


అతడిని బాగుపరుద్దా మని ప్రయత్నించి నేను నాశనానికి దగ్గరయ్యాను. నేను నా శ్రయేభిలాషులు చెప్పింది కూడా పెడచెవినపెట్టా ను.

నా పచ్చితనం నన్ను పూర్తిగా గుడ్డివాడ్ని చేసింది.

కానీ నేను ఆ వంట మనిషి కోసమే అయితే సత్యాన్ని ఎప్పటికీ కనుక్కొని ఉండేవాడ్ని కాను. నా స్నేహితుడి ప్రలోభాల వలలో

పడిపోయి ఉన్నట్లయితే, బహుశా నేనిప్పుడు తలపెట్టిన ఏకాంత జీవితం కొనసాగించలేకపోయేవాడ్ని. నేను నా సమయమంతా

అతడికోసం వృథా చేసిఉండేవాడ్ని. అతడికి నన్ను చీకట్లో పెట్టి, తప్పుదోవ పట్టించే శక్తి అతడికి ఉంది.

కానీ భగవంతుడు నన్ను ముందే కాపాడారు. నా ఉద్దేశాలను స్వచ్ఛమైనవి. దానివల్లే నా తప్పిదాల నుంచి నేను కాపాడబడ్డా ను.

ముందగానే ఎదురైన ఈ అనుభవం భవిష్యత్తు లో నన్ను మరింత జాగురూకతతో ఉండేలా చేసింది.

ఆ వంట మనిషి దాదాపు నాకు స్వర్గం నుంచి పంపిన దేవదూత లాంటివారే. అతడికి వంట చేయడం రాదు, వంట మనిషిగా అతడు

నా వద్ద ఎంతో కాలం పని చేయలేదు. కానీ ఏ ఒక్కరూ కూడా నా కళ్లు తెరిపించలేదు. అలా జరగడం ఇదే మొదటి సారి కాదట,

తరువాత నేను తెలుసుకున్నాను, ఆమెను తరచూ నా ఇంటికి తీసుకుని వచ్చేవాడట. ఇంతకుముందు కూడా ఆమె తరచుగా

వచ్చింది. కానీ ఈ వంట మనిషికున్న ధైర్యం మరెవరికీ లేకపోయింది. నేను నా మిత్రు డ్ని ఎంత గుడ్డిగా నమ్మానో ప్రతి ఒక్కరికీ

తెలుసు. ఆ వంట మనిషిని, అక్కడ ఉండటం, కేవలం నాకు ఈ సేవ చేయడానికే పంపినట్లుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే

అతడు నా వద్ద నుంచి వెళ్లిపోతానని అభ్యర్థించారు.

‘నేను మీ ఇంట్లో ఉండలేను,’ అని ఆయన చెప్పారు. ‘మీరు చాలా సులభంగా మోసపోతారు. నాకు ఇది తగిన చోటు కాదు.’

నేను అతడ్ని వెళ్లనిచ్చాను.


నా గుమస్తా పట్ల నాకు విషబీజాలు నూరిపోసిన వ్యక్తి మరెవరో కాదు నా మిత్రు డేనన్న సంగతి నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నా

గుమస్తా పట్ల చేసిన అన్యాయాన్ని సరిదిద్దు కోవడానికి నేను చాలా తీవ్రంగా కృషి చేశాను. అలా చేసినప్పటికీ, నేను అతడిని పూర్తిగా

సంతృప్తిపరచలేకపోయాననే బాధ నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ, మీరెంత అతికించినా, పగులు పగులే

కదా.

24
స్వదేశానికి

ఇప్పటికే నేను దక్షిణాఫ్రికాకు వచ్చి మూడు సంవత్సరాలు గడిచింది. ఇక్కడ ప్రజలు నాకు తెలుసు, వారంతా నాకు తెలుసు.

1896 లో నేను ఒక ఆరు నెలలు ఇంటికి వెళ్లి వస్తా నని అనుమతి కోరాను. నేను అక్కడ చాలా కాలం ఉన్నాను కాబట్టి, అక్కడ నేను

మంచి ప్రాక్టీసు కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాను, అక్కడ ప్రజలు కూడా నా అవసరాన్ని కోరుకుంటున్నారు.

Page: 146 (Original Page No. 156)


దాంతో నా మనసు ఇంటికి వెళ్లా లని కోరుకుంటోంది. అక్కడ నా భార్య, పిల్లలను చూడాలి, అక్కడే వారితో స్థిరపడిపోవాలి.
దాంతోపాటుగా నాకు ఏమనిపించిందంటే, నేను గనుక ఇంటికి వెళితే, అక్కడ ప్రజాభిప్రాయాలపై అవగాహన కల్పించడం,
దక్షిణాఫ్రికాలోని భారతీయులపై ఆసక్తి కలిగేలా చేయడం లాంటి ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా 3 పౌండ్ల పన్ను

గురించి గొంతు విప్పేలా చేయడం. ఈ పన్ను పూర్తిగా రద్దు చేసేంత వరకు అక్కడ శాంతికి ఆస్కారం లేదు. కానీ నేను లేనప్పుడు

ఇక్కడ ఈ కాంగ్రెస్ కార్యకలాపాలకు మరియు విద్యా సంఘాన్ని ఎవరు నిర్వహిస్తా రు? నాకు ఇద్దరు వ్యక్తు లు కనిపించారు -

ఆడంజీ మియాఖాన్, పార్సీ రుస్తోంజీ. వాణిజ్య తరగతుల నుంచి చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు.
కానీ ఇక్కడ కార్యదర్శిగా రోజు వారీ కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించడానికి, అక్కడ భారతీయ సమాజంపై మంచి పట్టు
అధికారం ఉన్నవారిలో అందరికంటే వీరిద్దరే చాలా ముందున్న సమర్థు లు. ఇక కార్యదర్శిగా పనిచేసేవారికి తప్పనిసరిగా ఆంగ్ల భాషా
పరిజ్ఞానం ఉండాలి. దాంతో కాంగ్రెస్కు నేను దివంగత ఆడంజీ మియాఖాన్ పేరును సిఫారసు చేశాను. ఆయన్ను కార్యదర్శగా

ఆయన నియామకాన్ని అందరూ అంగీకరించారు. నా ఈ ఎంపిక ఒక మంచి నిర్ణయమని తరువాత అనుభవంలో తెలిసింది.

ఆడంజీ మియఖాన్ తన దీక్షా దక్షత, ఉదారత, మంచితనం, మర్యాదలతో అందర్నీ సంతృప్తిపరిచేలా పనిచేశారు. కార్యదర్శి పనులు

చేయడానికి ఆంగ్ల ఉన్నత విద్యకు చెందిన బారిష్టర్ చదినవారే అవసరం లేదని ఆయన తన పనితీరు ద్వారా నిరూపించారు.

1896 సంవత్సరం మధ్యలో కోల్కతాకు వెళుతున్న పొంగోలా అనే స్టీమర్ ఓడ ఎక్కి ఇంటికి బయలుదేరాను.

ఓడలో చాలా తక్కువ మంది ప్రయాణికులే ఉన్నారు. వారిలో ఇద్దరు ఆంగ్లేయ అధికారులున్నారు. వారితో నేను దగ్గర పరిచయం

పెంచుకున్నాను. వారిలో ఒకరితో నేను ప్రతి రోజూ ఒక గండ చదరంగం ఆడేవాడ్ని. ఓడలోని వైద్యుడు తమిళం స్వీయ శిక్షణ

పుస్తకం నాకు ఇచ్చాడు. దాన్ని చదవడం ప్రారంభించాను. నాటల్లో ఉన్నప్పుడు అక్కడ ముస్లిం సోదరులకు దగ్గరవడానికి ఉర్దూ

భాష, మద్రాస్ భారతీయులకు దగ్గరవడానికి తమిళ భాష తప్పనిసరిగా నేర్చుకోవాలని అను అనుభవం తెలిపింది.

నాతో కలిసి ఉర్దూ చదవడానికి ఉవ్విళ్లూరుతున్న ఆంగ్లేయ మిత్రు డి అభ్యర్థన మేరకు, ఓడలో ప్రయాణిస్తు న్న ప్రయాణికుల్లో మంచి
ఉర్దూ తెలిసిన ఒక మున్షీని కనుగొన్నాం, ఆయన ద్వారా ఉర్దూ చదువడంలో మంచి ప్రగతి సాధించాం. ఆ ఆంగ్లేయ అధికారికి నా

కంటే చాలా మంచి జ్ఞాపకశక్తి ఉంది. ఒక్కసారి ఆయన ఒక పదం చూశారంటే దాన్ని ఎప్పటికీ మరచిపోరు; ఉర్దూ అక్షరాలను

చదవడానికి నేను తరచూ ఇబ్బందులు ఎదుర్కొనేవాడ్ని.

దాన్ని అదిగమించాలని గట్టి పట్టు దలతో చదివాను, కానీ నేను ఎప్పటికీ ఆ అధికారిని అధిగమించలేకపోయాను.

తమిళంలో అయితే నేను మంచి ప్రగతే సాధించాను. దానికి నాకు ఎవరి సహాయం అవసరం కాలేదు. కానీ తమిళం స్వీయ శిక్షణ

పుస్తకం చాలా బాగా రాశారు. దాని వల్ల ఈ భాష నేర్చుకోవడానికి బయటవారి సహాయం అవసరమనిపించలేదు.

ఈ రెండు భాషల గురించి అధ్యయనాలను నేను భారతదేశం వెళ్లా కూడా కొనసాగించాలని అనుకున్నాను. కానీ అది సాధ్యం

కాలేదు. 1893 నుంచి నా చదువులన్నీ ఎక్కువగా కారాగారంలోనే జరిగాయి.


Page: 147 (Original Page No. 157)
కారాగారాల్లో ఉన్నప్పుడు తమిళం మరియు ఉర్దూ భాషల్లో కొంత ప్రగతి సాధించడానికి ప్రయత్నించాను - దక్షిణాఫ్రికా జైళ్లలో

తమిళం, యరవాడ జైల్లో ఉర్దూ భాష. కానీ తమిళం మాట్లా డటం మాత్రం నేను ఎప్పటికీ నేర్చుకోలేకపోయాను. చదవడం కొద్దిగా

వచ్చినప్పటికీ దాన్ని ప్రాక్టీసు చేయకపోవడంతో అది తుప్పుపట్టినట్లయింది.

తమిళం, తెలుగు భాషలను నిర్లక్ష్యం చేయడంపై నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. దక్షిణాఫ్రికాలో ద్రవిడులు నా పట్ల చూపిన

ఆదరాభిమానాలు నాకెప్పుడూ గుర్తు కొస్తుంటాయి. నేను ఎప్పుడు ఒక తమిళం లేదా తెలుగు మిత్రు డిని కలిసినా, దక్షిణాఫ్రికాలోని

వారి స్వదేశీయుల విశ్వాసం, పట్టు దల, నిస్వార్థ త్యాగాలే నాకు గుర్తు కొస్తా యి. ఆడవాళ్లైనా, మగవాళ్లైనా సరే, వారిలో చాలా వరకు

నిరక్షరాస్యులే. దక్షిణాఫ్రికాలో జరిపిన పోరాటం ఎంత గొప్పదంటే, అది నిరక్షరాస్యులు జరిపిన పోరాటం, పేదలు జరిపిన పోరాటం,

ఈ పోరాటంలో పేదలు తమ వంతు భాగాన్ని పూర్తిగా దక్కించుకున్నారు. ఏమైనప్పటికీ, వారి భాషను నేర్చుకోలేకపోవడమనేది,

చాలా నిరాడంబరులు, మంచి మనస్కులైన వారి హృదయాలను చూరగొనడానికి నాకు ఎన్నడూ అడ్డంకిగా మారలేదు. వాళ్లు

కొద్ది కొద్దిగా హిందీ, ఇంగ్లీషు మాట్లా డేవారు. దానివల్ల మేం పని చేయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. నేను ప్రేమాభిమానాలు

చూరగొనడానికి తమిళం మరియు తెలుగు నేర్చుకోవాలని అనుకున్నాను. తమిళం విషయానికొస్తే, నేను ఇదివరకే చెప్పినట్లు కొంత

ప్రగతి సాధించాను. కానీ తెలుగు, భారతదేశంలో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను, కానీ అక్షరమాలను దాటి

ముందుకెళ్లలేకపోయాను. ఇక నేను ఎప్పటికీ ఈ భాషలు నేర్చుకోలేనేమో అన్న భయం నాలో ఉంది. దానివల్ల కనీసం ద్రవిడులైనా

హిందీ భాషను నేర్చుకుంటారని ఆశిస్తు న్నాను. దక్షిణాఫ్రికాలోని ఆంగ్లభాష మాట్లా డలేని వాళ్లంతా హిందూ, హిందూస్తా నీ భాషలను

మాట్లా డేవారు, కొంత తేడాగా ఉన్నా సరే. ఒక్క ఇంగ్లీషు మాట్లా డేవాళ్లే, హిందీ భాషను నేర్చుకోవడం లేదు. మన సొంత భాషలను

నేర్చుకోవడానికి ఈ ఆంగ్ల భాష పరిజ్ఞానం ఒక అడ్డంకిగా మారుతోందని భావిస్తుంటారు.

నేను కొంచెం దారి మళ్లా నేమో. ఇక నా యాత్ర గురించి చెప్పడం ముగిస్తా ను. నేను ప్రయాణిస్తు న్న ఓడ పొంగోలా కెప్టెన్ గురించి నా

ప్రియమైన పాఠకులకు పరిచయం చేయనివ్వండి. మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఆ మంచి కెప్టెన్ ప్లేమౌత్ బ్రదర్కు

సోదరుడిలాంటి వాడు. మా ఇద్దరి చర్చలు సముద్రయానం కంటే ఎక్కువగా ఆధ్యాత్మిక అంశాలపైన జరిగేవి. నీతికి, ధర్మానికి

మధ్య అతడు చక్కటి విభజన రేఖ గీస్తా డు. బైబిల్ ప్రోబోధాలన్నీ అతడికి చిన్నపిల్లల ఆటల్లాంటివి. దాని అందమంతా దాని

నిరాడంబరతపైనే ఉంది. ఆయన ఏమంటారంటే ఆడవాళ్లు , మగవాళ్లు , చిన్నపిల్లలు అందరూ ఏసుక్రీస్తు , ఆయన త్యాగాలపై

విశ్వాసం ఉంచితే చాలు, వారు చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఈ మిత్రు డు మాటలు నాకు ప్రిటోరియాలోని ప్లేమౌత్

బ్రదర్ను గుర్తు కు తెచ్చాయి. నైతిక ఆంక్షలు విధించే మతం ఏదైనా అతడి దృష్టిలో మంచిది కాదు. ఈ మొత్తం చర్చలకు నా

శాఖాహార భోజనమే సందర్భమైంది. నేనెందుకు మాంసం లేక గొడ్డు మాంసం తినకూడదు? మనిషి ఆస్వాధించడం కోసం దేవుడు
ఈ చిన్న ప్రాణులను సృష్టించలేదా. ఎలాగైతే ఆయన ఈ శాఖాహార సామ్రాజ్యాన్ని సృష్టించారో అలా? ఈ ప్రశనలు అనివార్యంగా

మమ్మల్ని మతపరమైన చర్చల్లోకి నెట్టేశాయి.

Page: 148 (Original Page No. 158)

మేం ఒకరి చెప్పింది ఒకరు అంగీకరించలేపోయాం. నా మనసులో నేను ధృడంగా అనుకున్నదల్లా మతము మరియు నైతికత

రెండూ పర్యాయపదాలే. తనకున్న తద్వ్యతిరేక నమ్మకాలే నిజమైనవని నమ్మడంలో ఈ కెప్టెన్కు ఎలాంటి అనుమానం లేదు.

ఇరవై నాలుగు రోజుల సంతోషమయమైన ప్రయాణం తరువాత చివరికి, హుగ్లీ నది సౌందర్యాన్ని చూసి ఆస్వాధించడానికి, నేను
కోల్కతాలో అడుగు పెట్టా ను. అదే రోజు రైలు అందుకుని బొంబాయికి ప్రయాణమయ్యాను.

25
భారతదేశంలో

బొంబాయికి వెళ్లే మార్గమధ్యలో ప్రయాణిస్తు న్న రైలు అలహాబాద్లో 45 నిమిషాలసేపు ఆగింది. ఆ పట్టణంలో తిరిగి రావడానికి నేను

ఈ సమయాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడ ఒక మందుల దుకాణంలో కొన్ని ఔషధాలను కూడా

కొనుగోలు చేశాను. ఆ మందుల దుకాణం యజమాని సగం నిద్రతో ఉన్నాడు. మందులు ఇవ్వడానికి అతడు చాలా ఆలస్యం

చేశాడు, ఈ కారణంగా నేను రైల్వే స్టేషను చేరుకునే సరికే నేను వెళ్లా ల్సిన రైలు అప్పుడే కదులుతోంది. అప్పటికీ ఆ స్టేషన్ మాస్టర్ నా
మీద దయతో నా కోసం ఒక నిమిషం రైలును ఆపారు. అయితే నేను రావడం గమనించలేని ఆయన నా సామాను జాగ్రత్తగా రైలు

నుంచి బయటకు దించండని అధికారులను ఆదేశించారు.

దాంతో నేను కెల్లెనెర్ హోటళ్లో ఒక గది తీసుకుని అక్కడి నుంచే నా పని ప్రారంభించాను. అలహాబాదు నుండి ప్రచురితమవుతున్న

పయనీర్ పత్రిక ఖ్యాతి గురించి నేను విని ఉన్నాను. ఆ పత్రిక భారతీయుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తు న్నదని నేను అర్థం

చేసుకుని ఉన్నాను. ఆ సమయంలో ఆ పత్రిక సంపాదకులుగా ఉన్న మిస్టర్ చెస్నే జూనియర్పై నేను అప్పటికే ఒక అభిప్రాయం కలిగి

ఉన్నాను. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరి సహాయం పొందాలని అనుకున్నాను. దాంతో నేను చెస్నీ ఒక నోట్ రాసి పంపాను, అందులో
నేను రైలు ఎలా తప్పిపోయానో వివరించాను, రేపు నేను వెళతాను కాబట్టి ఈ లోపు ఆయన్ను కలవాలని ఉంది సమయం ఇవ్వమని
అందులో కోరాను. ఆయన వెంటనే దానికి అంగీకరించారు, అది నాకు ఎంతో సంతోషం కలిగించింది, ముఖ్యంగా నేను ఆయన్ను

కలిసినప్పుడు ఆయన నేను చెప్పేదంతా ఎంతో ఓపిగ్గా విన్నారు. నేను ఏమి రాసినా ఆయన తన పత్రికలో అచ్చువేస్తా నని నాకు

హామీ ఇచ్చారు, అయితే భారతీయుల కోర్కెలన్నీటికీ మాత్రం అందులో ఆమోదం తెలుపలేను అని చెప్పారు. ఎందుకంటే

వాటికంటే ముందు ఆయన దక్షిణాఫ్రికాలోని కాలనీల్లోని ప్రజల అభిప్రాయాలకు విలువ ఎంతో అర్థం చేసుకోవాల్సి ఉంది.

‘ఈ మాత్రం చాలు,’ అన్నాను నేను, ‘అక్కడ సమస్యను మీరు అధ్యయనం చేసి, మీ పత్రికలో చర్చించండి. నేను అడిగేది, కోరేది

ఏమీ లేదు, మాకు న్యాయం చేయాలని మాత్రమే.’

Page: 149 (Original Page No. 159)


మిగిలిన రోజంతా మూడు నదుల అద్భుత సంగమం త్రివేణి అందాలను చూస్తూ గడిపేశాను. నా ముందున్న పని గురించి ప్రణాళికా

సిద్ధం చేసుకుంటూ గడిపాను.

ది పయనీర్ పత్రిక సంపాదకుడితో నాకు కలిగిన అనూహ్య భేటీ కొన్ని వరుస సంఘటనలకు పునాది వేసింది, అవి నేను నాటల్లో నా
ఉరితీతకు కారణభూతమైంది.
నేను బొంబాయిలో విడిది చేయకుండా నేరుగా రాజ్కోట్కు వెళ్లా ను, దక్షిణాఫ్రికాలో పరిస్థితుల గురించి కరపత్రం
రూపొందించడంలో నిమగ్నమయ్యాను. ఈ కరపత్రం రాయడానికి, ప్రచురించడానికి దాదాపు నెల రోజులు పట్టింది. ఆకుపచ్చ

రంగు కవర్తో దీన్ని ముద్రించాం, తరువాత ఇది ఆకుపచ్చ కరపత్రంగా గుర్తింపు పొందింది. ఇందులో దక్షిణాఫ్రికాలోని భారతీయు

స్థితిగతుల గురించి ఉద్దేశపూర్వకంగానే కొంత తగ్గించి రాశాను. ఇందులో నేను ఉపయోగించిన భాష గతంలో నేను రెండు

కరపత్రాలు రూపొందించినప్పడు ఉపయోగించిన భాష కంటే సరళమైది. ఎందకంటే దూరంగా విన్న విషయాలకంటే ఇవి పెద్దగా

కనిపిస్తా యి కాబట్టి.

పది వేల ప్రతులను అచ్చు వేసి వాటిని అన్ని పత్రికలకు, భారతదేశంలోని ప్రతి పార్టీ నేతలకు పంపాము. ది పయనీర్ పత్రిక

అందరికంటే ముందు దీన్ని తన సంపాదకీయంలో ప్రచురించింది. ఈ ఆర్టికల్ ను సంగ్రహంగా రాయటర్ ద్వారా ఇంగ్లండ్కు

చేరింది. అక్కడి నుంచి దీన్ని సంగ్రహంగా రాయటర్స్ లండన్ కార్యాలయం నాటల్కు పంపింది. అది అచ్చులో మూడు పంక్తు లకు

మంచి లేదు. అది లఘు చిత్రం, కానీ విపులీకరించింది. ఆ ఎడిషన్లోని దృశ్యం ద్వారా నేను నాటల్లోని భారతీయులను ఎలా

పరిగణిస్తు న్నారో అద్దం పట్టగలిగాను. కానీ అది నా మాటల్లో కాదు. ఇది నాటల్ లో ఎలాంటి ప్రభావం చూపింది అనేది మనం

తరువాత చూద్దాం. ఈ నేపథ్యంలో ప్రతి వార్తా పత్రిక ఈ కరపత్రంలో సంధించిన ప్రశ్నలపై చర్చించాయి.

ఈ కరపత్రాలను తపాలా ద్వారా పంపడమనేది చిన్న విషయం ఏమీ కాదు, అది ఖర్చుతో కూడుకున్నది కూడా, ఒక వేళ నేను

గనుక కవర్లు అతికించడం తదితర సాయం కోసం పనివాళ్లను వినియోగించుకుని ఉంటే. కానీ దానికంటే కూడా నేను చాలా చిన్న

ఆలోచన చేశాను. నేనుంటున్న ప్రాంతంలో చుట్టు పక్కల ఉన్న పిల్లలందర్నీ పిలిపించుకుని, వారికి పాఠశాల లేనప్పుడు ఉదయం

రెండు గంటలు వచ్చి స్వచ్ఛందంగా ఈ పనులు చేయాలని అడిగాను. వాళ్లంతా ఈ పని చేయడానికి అంగీకరించారు. ప్రతిఫలంగా

నేను వారికి ఆశీర్వాదాలు ఇస్తా నని హామీ ఇచ్చాను. నేను సేకరించిన తపాల బిల్లలను ఉపయోగించాం. వాళ్లు ఈ పనిని ఇట్టే

ఏమాత్రం సమయం తీసుకోకుండా చేసేశారు. స్వచ్ఛంద సేవకులుగా చిన్నపిల్లలతో నాకు అది మొట్టమొదటి అనుభవం. ఆ నాటి

ఆ చిన్నపిల్లలో ఇద్దరు ఇప్పుడు నా సహచర కార్యకర్తలుగా ఉన్నారు.

అదే సమయంలో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. సర్వత్రా భయం ఆవరించి ఉంది. రాజ్కోట్లో కూడా ఇది

వ్యాపిస్తుందేమోనన్న భయం నెలకొంది. పారిశుద్ధ్య శాఖలో నేను ఏమైనా సహాయపడగలనేమోనని నాకు అనిపించింది. వారికి నా

సేవలు అందిస్తా నని చెప్పాను. వాళ్లు దానికి అంగీకరించారు.


Page: 150 (Original Page No. 160)
ఈ సమస్యను పరిశీలించడానికి నియమించిన కమిటీలో నన్ను కూడా నియమించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా

ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు గట్టిగా చెప్పే బాధ్యతలు నాకు అప్పటించారు. ప్రతి వీధిలోనూ దీని గురించి తనిఖీలు

చేయాలని కమిటీ నిర్ణయించింది. తమ మరుగుదొడ్లను పరిశీలించడానికి పేద ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, పైగా వాటి

పరిశుభ్రత పెంచడానికి మేం చెప్పిన సలహాలను పాటించి ముందుకు తీసుకెళ్లే వారు. మా అనుభవంలో మాకు తెలిసిందేమిటంటే

ధనవంతుల మరుగుదొడ్లు చాలా అపరిశుభ్రంగా ఉండటం. అవి నల్లగా, పాచిపట్టిపోయి, గలీజుగా, పురుగులతో కంపు

కొడుతున్నాయి. వాటిని బాగు చేసుకోవడానికి మేం చెప్పిన సలహాలు చాలా చిన్నవి. ఉదాహరణకు, మలం నేలమీద పడకుండా

బక్కెట్లు ఉంచమని చెప్పాం, మూత్రం కూడా నేలపైన విసర్జించకుండా బకెట్లలో సేకరించాలని చెప్పాం. మరుగుదొడ్లకు మరియు

బయట గొడలకు మధ్య ఉన్న కట్టడాలను కూల్చివేయమని చెప్పాం. దానివల్ల మరుగుదొడ్లకు ఎక్కువ వెలుతురు, గాలి

లభిస్తయాని, దానివల్ల మరుగుదొడ్లను పాకీ పనివారు సరిగ్గా శుభ్రం చేయగలుగుతారు. ఈ మెరుగైన పద్దతులు పాటించడానికి

ధనవంతులు పలు అభ్యంతరాలు తెలిపారు, కొంతమంది అయితే అసలు మేం చెప్పిందాన్ని పాటించలేదు.

ఈ కమిటీ అస్పృశ్యుల గృహ సముదాయాలను కూడా పరిశీలించింది. అక్కడికి వెళ్లడానికి కమిటీలో ఒకే ఒక సభ్యుడు నాకు

తోడుకు వచ్చారు. మిగిలిన వారికి మేం ఇలా అస్పృశ్యుల ఆవాసాలకు వెళ్లడం, అక్కడ వారి మరుగుదొడ్లను పరిశీలించడం

ఒకింత విస్మయంగా తోచింది. కానీ నా వరకైతే మాత్రం ఆ ఆవాసాలకు వెళ్లడం ఆమోదనీయ ఆశ్చర్యమే. అలాంటి ప్రాంతాలకు

వెళ్లడం నా జీవితంలో అదే మొదటిసారి. ఆ కాలనీల్లోని మహిళలు, పురుషులు మమ్మల్ని ఆశ్చర్యంతో చూశారు. అక్కడ

మరుగుదొడ్లు పరిశీలిస్తా మని వాళ్లను నేను అడిగాను.

‘మాకు మరుగుదొడ్లా !’ అని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టా రు. ‘మేం కాల కృత్యాల కోసం బహిర్బూమికి వెళతాం. మరుగుదొడ్లు అనేవి

మీలాంటి పెద్దవాళ్లకే.’

‘మంచిది, మరైతే, మీరేమీ అనుకోకుంటే మీ ఇళ్లను ఒక సారి తనిఖీ చేయొచ్చా?’ అని నేను అడిగాను.

‘సంతోషంగా చేసుకోండి సార్, మారు మా ఇళ్లలో మూల మూలలా చూడొచ్చు. మావి ఇళ్లు కావు, అవన్నీ బొరియలే.’

నేను ఆ ఇళ్లలోపలికి వెళ్లి చూశాను, బయట ఎంత శుభ్రంగా ఉన్నాయో, లోలప కూడా అంతే శుభ్రంగా ఉండటం చూసి
సంతోషమేసింది. ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా చిమ్మేశారు. ఇంట్లో గచ్చ అంతా ఆవుపేడతో శుభ్రంగా అలికారు. కొన్ని

కుండలు, పాత్రలు అయితే మరింత శుభ్రంగా ఉండి మెరుస్తు న్నాయి. ఈ గృహ సముదాయాల్లో ప్లేగు వ్యాధి వస్తుందనే భయం

లేదు.
ఇక ఉన్నత వర్గాల గృహ సముదాయాల్లో మరుగుదొడ్ల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది, కొన్ని వివరాలు ఇక్క నేను
చెప్పలేను. నీళ్లు , మూత్రాన్ని బయటకు తీసుకెళ్లేలా ప్రతి గదికీ ఒక తూము ఉంది. దానర్థం ఇల్లు మొత్తం దుర్గంధం కొడుతోందని.
ఆ ఇళ్లలో ఒక ఒక ఇంటి మేడమీద పడకగది ఉంది, ఆ గది నుంచిచ మల, మూత్రాలను బయటకు తీసుకెళ్లడానికి ఒక తూము
మాత్రమే ఉంది.

Page: 151 (Original Page No. 161)


ఈ తూము నుంచి ఒక గొట్ట కింది ప్లోరుకు అమర్చారు. ఆ గదిలో వస్తు న్న కంపు భరించి అక్కడ నిలుచోవడానికి సాధ్యం కావడం

లేదు. మరి ఆ గదిలో ఉన్నవారు ఎలా నిద్రపోతున్నారో అనేది పాఠకుల ఊహకే వదలిపెడుతున్నాను.

మా కిటీ అక్కడి వైష్ణవ ఆలయాన్ని (హవేలీ) కూడా సందర్శించింది. అక్కడి ఆలయ పూజారి మా కుటుంబానికి చాలా మంచి

స్నేహితుడు. దాంతో మేం ఆలయమంతా పరిశీలించడానికి, అక్కడ మాకు ఏదైనా మెరుగుపరచాలనిపిస్తే మా సలహా మేరకు

చేయడానికి ఆయన అంగీకరించారు. ఆలయ ప్రాంగణంలో ఒక చోటుంది, ఆ చోటు గురించి చివరకు ఆ పూజారికి కూడా తెలీదు.

ఆలయంలో ఊడ్చిన చెత్త, విస్తళ్లు , ఆకులు అన్నీ కూడా అక్కడ గోడ మీద విసిరేశారు. కాకులకు, గద్దలకు అది నిలయంగా

మారింది. ఇక ఆలయంలో మరుగుదొడ్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆలయంలో పరిస్థితిన మెరుగుపరచడానికి మేం చెప్పిన

సలహాలను ఆ పూజారి ఎన్ని పాటించాడో తెలీదు, ఎందుకంటే నేను రాజ్కోట్లో ఎక్కువ కాలం ఉండలేదు.

దేవుడ్ని ఆరాధించే చోట కూడా అంతటి అపరిశుభ్ర వాతావరణం ఉండటం చూసి నాకు చాలా బాధ కలిగింది. పవిత్రంగా భావించే

ప్రదేశంలో పారిశుధ్యం మరియు పరిశుభ్రత నియమాలను జాగ్రత్తగా పాటించాలని ఎవరైనా ఆశిస్తా రు. మన స్మృతికర్తలు, ఎప్పుడో

చెప్పారు, బాహ్య, అంతర్ శుద్ధి ఎంతో గొప్ప అత్యావశ్యమని చాటారు.

26
రెండు అభిరుచులు
బ్రిటిష్ రాజ్యంగం పట్ల నేను చూపే విధేయత బహుశా ఇంకెవరికీ కూడా లేదేమో. సత్యం పట్ల నాకు ప్రేమ పెరగడానికి ఈ విధేయతే

కారణమని భావిస్తా ను. ఈ విధేయత విషయంలోగానీ, ఏ ఇతర ధర్మం విషయంలో గానీ నటించడం అంటే నాకు సాధ్యమయ్యే

పనికాదు. నాటల్లో నేను పాల్గొన్న ప్రతి సమావేశంలోనూ జాతీయ గీతాన్ని ఆలపించేవాళ్లం. ఈ జాతీయగీతాలాపనలో నేను కూడా

తప్పనిసరిగా పాల్గొనాలని భావించేవాడ్ని. నాకు బ్రిటీష్ పాలనలోని లోపాల గురించి తెలియక పోవడం వల్ల కాదు, కానీ జాతీయ

గీతం అనేది సర్వాంగీకరమైందని భావించడమే. ఆ రోజుల్లో నేను బ్రిటిష్ పాలన మొత్తం మీద మేలు చేసేదేనని నమ్మేవాడిని.

అయితే వర్ణ వివక్ష, దక్షిణాఫ్రికాలో ఎప్పుడైతే చూశానో, నాకనిపించింది, బ్రిటీష్ సంప్రదాయాల్లో చాలా ప్రతికూలంగా ఉన్నాయని,
అయితే అవి కేవలం తాత్కాలికమైనవి, అది కూడా ఈ ప్రాంతానికే పరిమితం అనుకున్నాను. ఆ విధంగా నేను బ్రిటిష్

సింహాసనానికి విధేయత చూపడలో ఆంగ్లేయిలతో పోటీపడ్డా ను. చాలా సునిశితమైన పట్టు దలతో నేను జాతీయ గీతం రాగాన్ని

నేర్చుకుని దాన్ని ఎక్కడ ఆలపిస్తు న్నా నేను కూడా వారితో కలిసి ఆలపించేవాడ్ని. ఎప్పుడైనా సరే ఎలాంటి గొడవ, డాంభికం

లేకుండా విధేయత ప్రదర్శించాల్సిన సందరర్భం వస్తే, నేను దాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండేవాడ్ని. నా జీవితంలో నేను
ఎప్పుడూ కూడా ఈ విధేయతను దుర్వినియోగం చేయలేదు, ఏ పరిస్థితుల్లోనూ కూడా దాన్ని నా స్వార్థ ప్రయోజనాల కోసం
ఉపయోగించలేదు.

Page: 152 (Original Page No. 162)


నా వరకు అది ఒక సహజ సిద్ధమైన విధి, దాన్ని నేను ఎలాంటి గుర్తింపు ఆశించకుండా పాటించాను.

నేను భారతదేశానికి చేరకున్నప్పుడు విక్టోరియా మహారాణి వజ్రోత్సవ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్కోట్లో

నిర్వహించదలచిన ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో చేరాల్సిందిగా నాకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని

నేను అంగీకరించాను. కానీ ఈ వేడుకలంతా కేవలం ఆర్బాటం ప్రదర్శించడానికి చేస్తు న్నవేమోనని నాకు అనుమానం. తరువాత

ఈ వేడుకలంతా ఒక పెద్ద మోసంగా గుర్తించాను, అది నాకు చాలా బాధ కలిగించింది. దాంతో నేను ఆ కమిటలో ఇంకా
కొనసాగాలా అని నా అంతరాత్మను ప్రశ్నించుకున్నాను, చివరకు ఏమనుకున్నానంటే ఏదైనా సరే నాకు అప్పగించిన బాధ్యతలను
సక్రమంగా నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాను.

మా కార్యక్రమాల ప్రతిపాదనల్లో మొక్కలు నాటడం కూడా ఒకటి. చాలా మంది దీన్ని ఒక మొక్కుబడి వ్యవహారంగా చేసిన కేవలం

అధికారుల సంతృప్తి పరచడానికి మాత్రమే చేస్తుండటం చూశాను. మొక్కలు నాటడం అనేది తప్పనిసరి కార్యక్రమం కాదని, ఇది

కేవలం ఒక సలహా మాత్రమేనని వారికి వివరించే ప్రయత్నం చేశాను. దీన్ని చేస్తే చాలా చిత్తశుద్ధితో చేయాలి, లేకపోతే వదిలేయాలి.
నేను చెప్పింది విని వారంతా నన్ను చూసి నవ్వుకున్నారని అర్థమైంది. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేను ఎంతో చిత్తశుద్ధితో

చేశాను, నాకు ఇచ్చిన మొక్కను నాటడమే కాదు, దానికి నీళ్లు పోసి చాలా జాగ్రత్తగా పెంచి సంరక్షించాను అని నాకు బాగా గుర్తు .

అదే విదంగా మా ఇంట్లో చిన్నపిల్లలకు జాతీయ గీతం ఆలపించడం నేర్పించాలని అనుకున్నాను. అక్కడ లోకల్ ట్రైనింగ్ కాలేజీలోని

విద్యార్థు లకు దీన్ని నేర్పినట్లు నాకు గుర్తు . అయితే అది వజ్రోత్సవాలకు సందర్భంగానా లేక కింగ్ ఎడ్వార్డ్ VII ను భారతీయ

చక్రవర్తిగా పట్టా భిషిక్తు డైన సందర్భంగానో సరిగ్గా నాకు గుర్తు లేదు. ఆ తరువాత కాలంలో నాకు ఈ గీతం పట్ల వ్యతిరేకభావనలు

మొదలయ్యాయి. నా అంతరంగంలో అహింస మార్గం మరింత ఎక్కువయ్యే కొద్ది, నేను నా ఆలోచనలు, మాట్లా డేదానిపై చాలా

జాగ్రత్తగా మారిపోయాను. ఆ జాతీయగీతంలోని కొన్ని వ్యాఖ్యాలివి:

ఆమె శత్రు వులను చెదరగొట్టు ము

వారు పతనయ్యేలా చేయండి;

వారి రాజకీయాలను గందరగోళపరచండి

వారి కుయుక్తు లను విచ్ఛిన్నం చేయండి.

ఇవిప్రత్యేకించి నా అహింసా తత్వానికి పూర్తిగా విరుద్ధమైనవి. నా మనోభావాలను డాక్టర్ భూత్గారితో పంచుకున్నాను, ఆయన కూడా

అహింసపట్ల నమ్మకం కలిగిన వారు ఈ వాఖ్యాలను ఎలా ఆలపించగలరని అన్నారు. మనం అంటున్న ఈ ‘శత్రు వులు’ ను
‘మోసగాళ్లు గా’? ఎలా పరిగణిస్తాం? వారు శత్రు వులైనంతమాత్రం చేత, వారు తప్పు చేసినవారు అవుతారా? దేవుడు నుండి మనం
న్యాయం కోరవచ్చు కదా. నా మనోభావాలను డాక్టర్ భూత్ సంపూర్ణంగా బలపరిచారు. ఆయన తన సమాజం కోసం మరో కొత్త

జాతీయ గీతాన్ని రూపొందించారు. కానీ డాక్టర్ బూత్ తరువాత చాలా చేశారు.

ఈ విధేయత లాగానే నాకు రోగులకు సేవ చేయడం కూడా నా మదిలో చాలా లోతుగా నాటుకుపోయింది. జబ్బుపడ్డ ప్రజలకు

సేవ చేయడమంటే నాకు చాలా ఇష్టం, వారు నా మిత్రు లైనా సరే, అపరిచితులైనా సరే.

Page: 153 (Original Page No. 163)


దక్షిణాఫ్రికాపై కరపత్రం సిద్ధం చేస్తూ రాజ్ కోట్లో క్షణం తీరికి లేకుండా ఉన్నాను. ఎప్పుడైనా ఒక సారి అలా బొంబాయికి వెళ్లి ఇలా

వచ్చేసేవాడిని. నగరాల్లో ఈ సమస్యపై సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలనేది నా అభిలాష. దానికి నేను

మొట్టమొదటగా ఎంచుకున్న నగరం బొంబాయి. దానికోసం మొట్టమొదటగా నేను కలుసుకుంది జస్టిస్ రానాడే, ఆయన నేను

చెపినదంతా ఎంతో శ్రద్ధగా విని, నన్ను సర్ ఫిరోజ్షా మెహతా గారిని కలవమని సలహా ఇచ్చారు.
జస్టిస్ బద్రు ద్దీన్ త్యాబ్జీ, తరువాత నేను కలిసిన వ్యక్తి, ఆయన కూడా అదే తరహా సలహా ఇచ్చారు. .‘జస్టిస్ రానాడే, నేను కలసి నీకు

చాలా కొద్దిగా మాత్రమే సలహా ఇవ్వగలం,’ అన్నారు. ‘మా పరిస్థితి ఏమిటో నీకు తెలుసు. ఇలాంటి ప్రజా సంబంధ విషయాల్లో మేము

క్రియాశీల పాత్ర పోషించలేము, కానీ మా సానుభూతి మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు ఉపయోగపడే విధంగా సలహా ఇచ్చి

మనిషి సర్ ఫిరోజ్షా మెహతా.’ దాంతో నేను తప్పనిసరిగా సర్ ఫిరోజ్షా మెహతాగారిని కలవాలని అనుకున్నాను. కానీ ఈ పెద్ద
మనుషులు నాకు ఇచ్చిన సలహా మేరకు ఆయన చెప్పినట్లు నడచుకోవాలని, ఆయన చాలా మంచి సలహా ఇవ్వగలరని చెప్పడం
చూస్తుంటే ప్రజల్లో సర్ ఫిరోజ్షా గారికి ఎంత పలుకుబడి ఉందో అర్థమవుతోంది. నేను తరువాత ఆయన్ను కలిశాను. ఆయన్ను

చూడగానే నాకు భయం వేసింది. ఆయన గురించి అంతకు ముందే ఆయనకున్న సుప్రసిద్ధ పేర్ల గురించి విని ఉన్నారు. నాకు

తెలుసు నేను చూస్తు న్నది ‘బొంబాయి సింహం’, ‘ప్రెసెడెన్సీకి మకుటం లేని మహరాజు’.ను అని. కానీ ఈ మహారాజు

అనుకున్నంతగా నన్ను భయపెట్టలేదు. ఒక ఎదుగుతున్న కొడుకును తండ్రి ఎలా కలుస్తా డో అంతటి వాత్సల్యం మా కలయికలో

చూపించారు. ఆయన గదిలో మేమిద్దరం సమావేశమయ్యాం. ఆయన చుట్టూ చాలా మంది ఆయన అనుచరులు, మిత్రు లు

గుమిగూడి ఉన్నారు. వారిలో డి.ఈ.వాచా, మిస్టర్ కామాలున్నారు, వారిని ఆయన నాకు పరిచయం చేశారు. వాచా గారి గురించి

నేను ఇది వరకే విని ఉన్నాను. ఆయన సర్ ఫిరోజ్షా మరియు శ్రీమాన్ వీర్ఛాంద్ గాంధీ గారికి కుడిభుజం లాంటివారు. వారిద్దరు

ఆయన గొప్ప గణిత మేథావి అని పరిచయం చేశారు. వాచా గారు అన్నారు, ‘గాంధీ, మనం మళ్లీ తప్పకుండా కలుద్దాం.’

ఈ పరిచయ కార్యక్రమం అంతా కేవలం రెండు నిమిషాల్లో ముగిసిపోయింది. సర్ ఫిరోజ్షా గారు నేను చెప్పింది చాలా జగ్రత్తగా

విన్నారు. నేను జస్టిస్ రానాడే, త్యాబ్జీలను కలిసిన సంగతి కూడా ఆయనకు చెప్పాను. ‘గాంధీ,’ అంటూ ఆయన చెప్పారు, ‘నేను

మీకు తప్పకుండా సాయం చేయగలను, నేను ఇక్కడ తప్పకుండా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తా ను.’ ఈ మాటలు

చెప్పిన ఆయన వెంటనే తన పక్కన ఉన్న తన కార్యదర్శి మున్షీగారి వైపు తిరిగి, ఈ సభ నిర్వహించే తేదీని నిర్ణయించమని చెప్పారు.

ఆ సభ తేదీని నిర్ణయించిన తరువాత ఆయన నాకు వీడ్కోలు పలికి వెళ్లి పోయారు. వెళుతూ నన్ను ఆ సమావేశానికి ముందు రోజు

మళ్లీ ఒకసారి వచ్చి కలవమని చెప్పారు. ఆయనతో జరిగిన భేటీ నాలోని భయాలను పోగొట్టింది, నేను ఎంతో సంతోషంగా ఇంటికి

వెళ్లా ను.

బొంబాయిలో ఉండగానే నేను మా బావ గారిని కలిశాను, ఆయన జబ్బు చేసి మంచాన పడి ఉన్నారు. ఆయనేమీ ఉన్నవాడు కారు.

మా అక్కగారు (ఆయన భార్య) కూడా ఆయనకు సేవలు చేయడానికి సరిపోవడం లేదు. ఆయన జబ్బు చాలా తీవ్రంగా ఉంది.

దాంతో నేను ఆయన్ను రాజ్ కోట్కు తీసుకెళతానని చెప్పాను. అందుకు ఆయన అంగీకరించడంతో, నేను మా అక్క, బావగార్లను

వెంట పెట్టకుని ఇంటికి వచ్చాను. ఆయన అనారోగ్యం నేను ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగింది.
Page: 154 (Original Page No. 164)
మా భావగారిని నా గదిలో ఉంచుకుని ఆయనకు రేయింబవళ్లు సపర్యలు చేశాను. నేను రాత్రిళ్లు ఆయన పక్కనే మేలుకుని

ఉంటూ, ఒక వైపు ఆయనకు సపర్యలు చేస్తూనే, మరోవైపు దక్షిణాఫ్రికాకు సంబంధించిన నా పనులు చేసుకుంటూ గడిపాను.

చివరికి, ఏదైతేనేం, ఆయన చనిపోయారు. కానీ ఆయన చివరి రోజుల్లో ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందనే గొప్ప ఊరట

నాకు కలిగింది.

సపర్యలు చేయాలనే ఆకాంక్ష నాలో క్రమంగా ఒక అభిరుచిగా మారింది, ఇది తరచూ పలు నా అసలు పని కూడా నిర్లక్ష్యం చేసేలా
మారింది. పలు సందర్భాల్లో నేను మాత్రమే ఈ పనులో్ల నిమగ్నమై పోకుండా, నా భార్య, నా మొత్తం కుటుంబాన్ని కూడా ఈ

సేవలకు వినియోగించేవాడిని.

ఒక వ్యక్తి సంతోషంగా ముందు కొచ్చి ఈ సేవలు చేయకపోతే ఈ సేవలకు ఎలాంటి అర్థం లేదు. ఇదేదో కేవలం ఎవరి మెప్పుకోసమో,

నటిస్తూ చేస్తే, అది మనిషికి నష్టం చేయడమే కాకుండా, అతడి స్ఫూర్తిని దెబ్బ తీస్తుంది. మనం చేసే సేవ ఏదైనా సరే సంతోషంగా

చేయకపోతే అది అటు సేవ చేసే వారికి గానీ, సేవ చేయించుకునే వారికి గానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. సంతోషంతో మనం

చేసే సేవ ముందు మన బోగాలు, సంపదలు అన్నీ కూడా తుచ్చమైనవిగానే తోస్తా యి.

27
బొంబాయి సమావేశం
మా బావగారు మరణించిన మరుసటి రోజే నేను బహిరంగ సభ కోసం బొంబాయికి వెళ్లా ల్సి వచ్చింది. దాంతో నాకు ఆ సభలో ఏమి

మాట్లా డాలో కూడా ఆలోచించుకునే సమయం కూడా లేకపోయింది. రేయిం బవళ్లు మా బావగారిని కనిపెట్టు కుని ఉండటం వల్ల

నేను బాగా అలసిపోయిఉన్నాను. నా గొంతు కూడా కీచుపోయింది. అయినప్పటికీ , దేవుడి మీద భారం వేసి బొంబాయికి వెళ్లా ను.

నేను నా ప్రసంగపాఠాన్ని రాసుకుని రావాలని ఎప్పుడూ కలగనలేదు.

సర్ ఫిరోజ్షా గారి ఆదేశాల మేరకు ఈ సభ సందర్భంగా ఆయన కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు హాజరయ్యాను.

‘మీ ప్రసంగపాఠం సిద్ధమైందా, గాంధీ?’ అని ఆయన అడిగారు. ‘లేదు, సార్,’ అని బదులు చెప్పాను, కొంత భయంతో

వణుకుతూ, ‘అలా ఆసువుగా మాట్లా డటమే అని నేను అనుకున్నాను.’


‘అది బొంబాయిలో పని చేయదు. ఇక్కడ పత్రికల్లో చెడుగా రాస్తా రు. ఈ సభ ద్వారా మీరు లబ్ది పొందానుకుంటే, మీరు

తప్పకుండా మీ ప్రసంగ పాఠం రాయాల్సిందే, అలాగే ఆ ప్రసంగ ప్రతిని తెల్లవారేలోపు అచ్చు కూడా వేయాల్సి ఉంటుంది. మీరు
ఇదంతా ఏదోలా చేయగలరని అనుకుంటున్నాను?’

నేను చాలా కంగారు పడ్డా ను, అయినా సరే , ప్రయత్నిస్తా ను అని ఆయనకు చెప్పాను.

‘అయితే నాకు చెప్పండి, మీ ప్రసంగపాఠం రాత ప్రతి కోసం మున్షీని ఎన్ని గంటలకు రమ్మంటారు?’

‘ఈ రాత్కి పదకొండు గంటలకు,’ అన్నాను నేను.

Page: 155 (Original Page No. 165)


మరుసటి రోజు సమావేశానికి వెళ్లా ను, అప్పుడు గానీ నాకు సర్ ఫిరోజ్షాగారు చెప్పిన సలహా పరమార్థమేమిటో అర్థమైంది. సర్

కౌవాస్జీ జహంగీర్ ఇన్స్టిట్యూట్లో ఈ సమావేశం జరిగింది. సర్ ఫిరోజ్షా మెహతా గారు ఉపన్యాసం చేసే సమయంలో సభా మందిరం

కిక్కిరిసిపోయి ఉంటుందని చెప్పగా విని ఉన్నాను. ప్రధానంగా విద్యార్థు లు ఎక్కువ మంది ఆయన చెప్పింది వినడానికి వస్తా రు,

దాంతో గదిలో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. అలాంటి సభ చూడటం నా జీవితంలో ఇదే మొదటి సారి. ఆ సభలో నేను

మాట్లా డేది చాలా కొద్ది మందికే వినబడుతోంది. నేను నా ప్రసంగ పాఠం చదవడం మొదలుపెట్టగానే కొంత జంకు పట్టకుంది. సర్

ఫిరోజ్షా గారు నన్ను నిరంతరం ఉత్సాహపరుస్తూ నన్ను మరింత గట్టిగా, పెద్దగా మాట్లా డమని చెబుతూనే ఉన్నారు. నాకు

అనిపిస్తు న్నదేమిటంటే, ఆయన ప్రోత్సహిస్తు న్న కొద్దీ, నా గొంతు మరింత చిన్నగా చిన్నగా కుచించుకుపోతోంది.

నా పాత స్నేహితుడు శ్రీమత్ కేశవావ్ దేశ్పాండే నాకు సహాయంగా వచ్చారు. నేను నా ప్రసంగపాఠాన్ని ఆయనకు ఇచ్చాను.

ఆయనకు మంచి గొంతు ఉంది. కానీ ఆయన చెప్పింది వినడానికి సభికులు నిరాకరించారు. సభలో ఉన్నవారంతా ‘వాచా’, ‘వాచా’,

అని అరవడంతో సభామందిరం దద్దరిల్లింది. దాంతో వాచా గారు లేచి నిలబడి నా ప్రసంగ పాఠాన్ని చదివారు. అది చాలా అద్భుత

ఫలితమిచ్చింది. సభలో ఉన్న వారంతా చాలా నిశబ్దంగా, శ్రద్ధతో ఆ ప్రసంగపాఠాన్ని ఆసాంతం విన్నారు. కొన్ని చోట్ల సభలో ఉన్నవారు

అవసరమైన చోట్లల్లా ‘సిగ్గు’ అని నినాదాలు చేస్తూ కరతాళ ధ్వనులతో అభినందించారు. ఇది నా మనుసుకు ఎంతో

హాయిగొలిపింది.
సర్ ఫిరరోజ్షా గారికి కూడా ఈ ఉపన్యాసం నచ్చింది. నాకు పరమానందం కలిగింది.

ఈ సమావేశం ద్వారా శ్రీమత్ దేశ్పాండస్త్ర, మరో పారసీ మిత్రు డు క్రియా శీల సానుభూతి గెలుచుకునేలా చేసింది. ఈ పారసీ

మిత్రు డి గురించి చెప్పడానికి నేను వెనుకాడటం లేదు. ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో అత్యున్నత అధికారిగా ఉన్నారు. ఆ ఇద్దరూ

నాతో కలిసి దక్షిణాఫ్రికాకు వస్తా మని తీర్మానించారు. సి.ఎం.కుర్సెట్జీ, అక్కడ స్మాల్ కాజెస్ కోర్డు జడ్డి, ఈ పార్సీ మిత్రు డు

తీర్మానాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించారు. పారసీ మిత్రు డు అప్పటికే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఉన్నారు.

దాంతో వీవాహమా లేక దక్షిణాఫ్రికాకు వెళ్లడమా ఏదో ఒకటి తేల్చుకోవాలని ఒక ప్రతిపాదనను ఆ జడ్జీ ముందుకు తీసుకొచ్చాడు.

దాంతో ఆ మిత్రు డు వివాహాన్నే ఎంపిక చేసుకున్నాడు. కానీ ఈ పారసీ మిత్రు డి వాగ్దా న బంగానికి పారసీ రుస్తోంజీ ప్రాయశ్చిత్తం

చేసుకుంటున్నారు. నాడు వాగ్దా న బంగానికి కారణమైన ఒక పారసీ మహిళకు ప్రాయశ్చితంగా ఈ రోజు ఎంతోమంది పారసీ

మహిళలు తమ వివాహాలను వాయిదా వేసుకుని ఖాదీ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. అందువల్ల నేను ఆ దంపతులను

సంతోషంగా క్షమించేస్తు న్నాను. శ్రీమాన్ దేశ్పాండే గారికి వివాహంపై కోరిక లేదు. కానీ ఆయన కూడా నాతోపాటు రాలేకపోయారు.

ఈ రోజు ఆయన కూడా నాడు తన వాగ్దా నబంగానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. నేను దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు అక్కడ

జాంజిబర్లో త్యాబ్జీగారిని కలిశాను. ఆయన కూడా నాతో కలిసి వస్తా నని, సహాయం చేస్తా నని చెప్పారు, కానీ ఆయన కూడా రాలేదు.

అబ్బాస్ త్యాబ్జి కూడా తన తప్పిదానికి పాశ్చాత్తా పం వ్యక్తం చేశారు. అలా దక్షిణాఫ్రికాకు నేను బారిష్టర్లను తీసుకెళ్లా లని చేసిన ఈ

మూడు ప్రయత్నాల్లో ఏదీ కూడా ఫలవంతం కాలేదు.

ఈ సందర్భంగా నేను పెస్టోంజీ పడ్షా గారిని గుర్తు చేసుకుంటున్నాను. నేను ఇంగ్లండ్లో ఉన్నప్పటి నుంచి ఆయనతో నాకు మంచి

స్నేహబాంధవ్యం ఉంది.

Page: 156 (Original Page No. 166)

లండన్లోని శాఖాహార హోటళ్లో ఆయన్ను మొదటి సారి కలిశాను. ఆయన సోదరుడు బార్జోర్జీ పడ్షా నాకు తెలుసు. ఆయన

‘పిచ్చోడు’గా ప్రసిద్ధి. కానీ ఆయన్ను ఎప్పుడూ నేను కలవలేదు. కానీ మిత్రు లు మాత్రం ఆయన గురించి చెబుతూ ఆయన చాలా
వెర్రివాడని చెప్పేవారు. గుర్పు బగ్గీ ఎక్కడం తప్పుగా బావించి అతడు ట్రామ్ కారులు కూడా ఎక్కేవారు కాదని, అసాధారణమైన
ధారణ శక్తి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలాంటి పట్టా లు తీసుకోవడానికి నిరారకించేవాడు, స్వతంత్రభావాలను పెంపొందించుకున్న
వ్యక్తి, పారసీ అయినప్పటికీ కూడా శాఖాహారిగా ఉండేవాడు. పెస్టోంజీకి ఇలాంటి పేరు లేదు, కానీ ఆయన తన పాండిత్యంతో

లండన్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించారు. మా ఇద్దరి మద్య ఒక సాధారణ పోలిక ఏమిటంటే, ఇద్దరం శాఖాహారులమే, అంతే

తప్ప ఆయన పాండిత్యంతో తులతూగడానికి నేను సరిపోను.

ఆయన్ను మళ్లీ బొంబాయిలో చూశాను. అక్కడ హై కోర్టు లో ఆయన ప్రొటోనోటరీగా ఉన్నారు. నేను ఆయన్ను కలిసినప్పుడు

ఆయన ఒక పెద్ద గుజరాతీ నిఘంటువు తయారీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. దిక్షణాఫ్రికాలో నా ఉద్యమాలకు సాయంగా రావాలని

నేను అభ్యర్థించని మిత్రు డు లేరు. పెస్తోంజీ పడ్షా, ఆయన నాకు సాయం చేయడానికి నిరాకరించడమే కాకుండా, నన్ను తిరిగి

దక్షిణాఫ్రికాకు వెళ్లవద్దని కూడా సలహా ఇచ్చారు.

‘నీకు సాయం చేయడం అసాధ్యం,’ అని ఆయన అన్నారు. ‘కానీ నీకు చెబుతున్నాను విను, నువ్వు మళ్లీ దక్షిణాఫ్రికాకు వెళ్లడం

కూడా నాకు ఇష్టం లేదు. ఇక్కడ నువ్వు చేయ్యాలనుకుంటే పని లేదా? చూడు, ఇప్పుడు, మన మాతృభాషకు చేయాల్సిన పని

తక్కువగా ఏమీ లేదు. నేను శాస్త్రీయమైన పదాలు కనుగొనాల్సి ఉంది. కానీ ఇది చేయాల్సిన పనుల్లో ఒక్కటే. కానీ ఈ నేల మీద

ఉన్న పేదరికం గురించి ఆలోచించు. దక్షిణాఫ్రికాలో మనవాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారు, అందులో అనుమానం లేదు, కానీ నీలాంటి

వ్యక్తి అక్కడ పనుల కోసం త్యాగం చేయాలని నేను కోరుకోవడం లేదు. ఇక్కడ మనం స్వరాజ్యం సాధిద్దాం, దానిద్వారా మనం

అక్కడ ఉన్న మనవాళ్లకు కూడా మేలు చేసినవాళ్లం అవుతాము. నాకు తెలుసు నిన్ను మార్చలేనని, కానీ నీలాగా, నీతోపాటు

ఇంకొకరిని అక్కడికి తీసుకుని పోవడాన్ని మాత్రం నేను ప్రోత్సహించలేను.’ ,

ఆయన సలహా నాకు నచ్చలేదు. కానీ అది పెస్టోంజీ పడ్షా పట్ల నా గౌరవాన్ని మరింత పెంచింది. ఆయనకున్న దేశాభిమానం,

మాతృభాషాభిమానం నన్ను కట్టిపడేశాయి. ఆ సంఘటన మా ఇద్దర్నీ మరింత దగ్గరగా చేసింది. నేను ఆయన భావాలను అర్థం

చేసుకున్నాను. కానీ దక్షిణాఫ్రికాలో నేను చేయాల్సిన పని వదిలేయలేను. నేను అనుకున్నది చేయాలనే తలంపు మరింత పెరిగింది.

దేశభక్తు డు ఎవరైనా సరే తన దేశమాతకు సేవ చేయడానికి ఉన్న ఏ మార్గాన్నికూడా నిర్లక్ష్యం చేయడు. నా వరకు అయితే భగవద్గీత

చెప్పిన ఉపదేశమే చక్కటి తార్కాణం:

చివరకు పరధర్మమునందు ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ


స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్ననూ

చక్కగా అనుష్టించబడు ఆ పరధర్మముకంటేను

స్వధర్మాచరణమే ఉత్తమము,

స్వధర్మాచరణము నందు మరణించిననూ శ్రయేస్కరమే

పరధర్మాచరణము భయావహము.

Page: 157 (Original Page No. 167)

28
పూనా మరియు మద్రాసు
సర్ ఫిరోజ్షా నా మార్గాన్ని సులభం చేశారు. అలా నేను బొంబాయి నుంచి పూనాకు వెళ్లా ను. అక్కడ రెండు పక్షాలున్నాయి. నాకు

ప్రతి ఒక్కరి సాయం అవసరం. మొదటగా నేను లోకమాన్య తిలక్ గారిని కలిశాను. ఆయన అన్నారు:

‘నువ్వు అన్ని పార్టీల సాయం తీసుకోవాలనుకోవడం మంచిదే. దక్షిణాఫ్రికా సమస్యకు సంబంధించి ఇక్కడ ఎలాంటి

భిన్నాభిప్రాయాలు లేవు. అయితే దీనికి నీకు ఒక పార్టీయేతర వ్యక్తి సభాపతిగా అవసరం. మీరు ఆచార్య భండార్కర్గారిని కలవండి.

ఆయన ఇప్పటి వరకు ఎలాంటి ప్రజా ఉద్యమాల్లోనూ భాగస్వామ్యం వహించలేదు. అయితే ఈ సమస్య తప్పకుండా ఆయన్ను ప్రజా

ఉద్యమాల్లోకి వచ్చేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఆయన్ను కలవండి, ఆయన ఏం చెబుతారో వచ్చి నాకు చెప్పండి. నీకు నేను

పూర్తి స్థా యిలో సహాయం చేయగలను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నన్ను కలవచ్చు. మీకు నేను సహాయం

చేయడానికి సిద్ధంగా ఉన్నాను.’

లోకమాన్య గారితో నాకు ఇదే మొట్ట మొదటి సమావేశం. ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల వెనుక రహస్యమేంటో నాకు ఈ భేటీ

ద్వారా తెలిసి వచ్చింది.

తరువా నేను గోఖలే గారిని కలిశాను. ఫెర్గస్సన్ కళాశాల మైదానంలో ఆయన్ను కలిశాను. ఆయన నన్ను చాలా సాదరంగా

ఆహ్వానించారు, ఆయన చూపిన ఆదరణ వెంటనే నా హృదయాన్ని చూరగొంది. ఆయనతో కూడా ఇదే నా మొదటి భేటీ.

అయినప్పటికీ మేమిద్దరం ఎప్పటి నుంచో తెలిసిన పాత స్నేహితుల్లా గా మా భేటీ సాగిపోయింది. నాకు సర్ ఫిరోజ్షా హిమాలయ

పర్వతంలా, లోకమాన్యగారు ఒక మహా సముద్రంలా కనిపించారు. కానీ గోఖలే గారు గంగానది ప్రవాహంలా అనిపించారు. ఎవరైనా

సరే ఆ పవిత్ర నదిలో మునిగి సేద దీరుతారు. హిమాలయాలను అధిరోహించడం కష్టం. అలాగే ఎవరైనా సరే మహా సముంద్రం

ఈదే ప్రయత్నం చేలేరు. కానీ ఎవరినైనా సరే ఈత కొట్టండని గంగానది పిలుస్తుంది. గంగానది ఒడ్డు న ఉండాలన్నా, దానిపై నావలో
విహరించాలన్నా ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. గోఖలే గారు నన్ను చాలా తీక్షణంగా పరీక్షించారు, ఒక విద్యార్థికి పాఠశాలలో

ప్రవేశం కల్పించే సమయంలో పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థిని ఎలాగైతే పరీక్షిస్తా డో అలా పరీక్షించారు. నేను ఎవరెవర్ని కలవాలో,

ఎలా కలవాలో కూడా ఆయన నాకు చెప్పారు. అలాగే నేను చేసే ప్రపంగాన్ని కూడా ఒక సారి చూస్తా నని చెప్పారు. ఆయన కళాశాల

అంతా చూపించారు. నాకు ఎప్పుడు అవసరమొచ్చినా తనను వచ్చి కలవచ్చని హామీ కూడా ఇచ్చారు. డాక్టర్ బండార్కర్గారిని

కలిసి, ఆయనతో జరిపిన చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని కోరారు. అలా ఆయన నన్ను ఎంతో సంతోషంగా అక్కడి

నుంచి పంపారు. రాజనీతి అంశాల్లో గోఖలేగారు ఆయన జీవించి ఉన్నంత కాలమూ నా హృదయంలో సుస్థిర స్థా నాన్ని

ఆక్రమించుకుని ఉన్నారు, ఆయన మరణాంతరం కూడా ఆ స్థా నం అలాగే పదిలంగా ఉంది. ఆ స్థా నం ఆయనకే ప్రత్యేకం.

డాక్టర్ బండార్కర్గారు నా పట్ల ఒక తండ్రిలా వాత్సల్యం చూపించారు. ఆయన్ను కలిసినప్పుడు మధ్యాహ్న సమయం. నిజానికి ఆ

సమయంలో ఆయన చాలా బిజీగా ఉన్నా నేను బిజీగా ఉన్నానని ఈ అవిశ్రాంత సేవకుడు నాతో చెప్పలేరు. పైగా మేం నిర్వహించే

సమావేశానికి ఒక పార్టీయేతర వ్యక్తిగా సభాపతి స్థా నం ఆక్రమించే బాధ్యత ఆయనపై పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

Page: 158 (Original Page No. 168)


ఆయన దన అంగీకారాన్ని కూడా తనదైన శైలితో కూడిన ఆశర్చర్యార్థకంతో వ్యక్తం చేసేవారు, ‘అంతే’, ‘అంతే’.

నేను చెప్పేదంత విన్న తరువాత ఆయన అన్నారు: ‘నేను రాజకీయాల్లో పాల్గొనడం లేదని ఎవర్ని అడిగినా మీకు చెబుతారు. కానీ

నేను మీ అభ్యర్థనను తిరస్కరించడం లేదు. మీరు చెబుతున్న సమస్య చాలా ప్రత్యేకమైంది, పైగా దీనిపై మీరు చేస్తు న్న పరిశ్రమ చాలా

ఆకట్టు కుంది, దానివల్ల నేను మీరు నిర్వహించే సమావేశంలో పాల్గొనడానికి నిరాకరించలేను. మీరు తిలక్ మరియు గోఖలేగారిని

కలిసి మంచిపని చేశారు. మీరు వారికి చెప్పండి, ఆ రెండు పక్షాలు కలిసి నిర్వహిస్తు న్న ఈ సమావేశానికి నేను సంతోషంగా సభాపతి

స్థా నం అలంకరిస్తా నని. ఆ సభకు సంబంధించి సమయం గురించి మీరు నన్ను అడగక్కర్లేదు, వాళ్లకు ఏ సమయం అనుకూలంగా

ఉంటుందో చెప్పండి అదే సమయం నాకు కూడా సమ్మతమే.’ అని చెప్పి ఆయన నన్ను అభినందించి, ఆశీర్వదించి నా నుంచి సెలవు

తీసుకున్నారు.

ఎలాంటి చడీచప్పుడు లేకుండా, పూనాలోని ఆ నిస్వార్థ కార్యకర్తలు చిన్న ప్రదేశంలో ఒక గొప్ప సహను ఏర్పాటు చేశారు. నా

కార్యసాధనకు కావాల్సిన విశ్వాసం, ఆనందాతిరేకాలను నింపి నన్ను సాగనపంపారు.


నేను తరువాత మద్రాసుకు వెళ్లా ను. అదో ఉత్సాహ నందనవనం. బాలసుందరం సంఘటన ఈ సమావేశంపై గొప్ప ప్రభావం

చూపింది. నా ప్రసంగపాఠాన్ని అచ్చువేశాం, నావరకు అయితే, అది చాలా పెద్దగా అనిపించింది. కానీ ప్రేక్షకులు మాత్రం నా

ప్రసంగంలోని ప్రతి మాటను ఎంతో శ్రద్ధతో ఆలకించారు. సమావేశం ముగిసిన తరువాత యథావిధిగా జరిగే పంపీణీ కార్యక్రమం

‘ఆకుపచ్చ కరపత్రం’. నేను సవరణలతో కూడిన రెండు కరపత్రాన్ని 10 వేల కాపీలతో సిద్ధం చేశాను. ఆ కరపత్రాలు హాట్కేకుల్లా

విక్రయమైపోయాయి. కానీ ఇంత పెద్ద సంఖ్యలో వాటిని అచ్చు వేయించాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపించింది. నేనే

అత్యుత్సాహంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని తప్పుగా లెక్కించాను. నా ఉపన్యాసం ఉద్దేశించింది కేవలం ఆంగ్లం

తెలిసిన వారి కోసం కదా, మద్రాసులో చివరకు ఆ తరగతి కూడా మొత్తం పదివేల కాపీలను తీసుకోలేదు.

అక్కడ శ్రీమాన్ జి. పరమేశ్వరన్ పిళ్లై, మద్రాస్ స్టాండర్డ్ పత్రిక సంపాదకులు నాకు చాలా సహయకారిగా మారారు. సమస్యను
ఆయన చాలా సునిశితంగా అధ్యయనం చేశారు, ఆయన తరచూ తన కార్యాలయానికి నన్ను ఆహ్వానించి, నాకు తగు సూచనలు
చేశారు. ది హిందూ పత్రిక శ్రీమాన్ జి.సుబ్రమణియమ్, డాక్టర్ సుబ్రమణియమ్ నా పట్ల ఎంతో సూనుభూతి చూపారు. అయితే

శ్రీమాన్ జి. పరమేశ్వరమ్ పిళ్లూ గారు మద్రాసు స్టాండర్డ్ పత్రికలో నేను చెప్పినట్లు గా కాలమ్స్ ప్రచురించడానికి వీలు కల్పించారు.

ఈ అవకాశాన్ని నేను ఎంతో స్వేచ్ఛగా ఉపయోగించుకున్నాను. పచ్చయప్ప సభామందిరంలో ఈ సమావేశం జరిగింది. నాకు

గుర్తు న్నంత వరకు ఆ సమావేశానికి డాక్టర్ సుబ్రమణియమ్ సభాపతిగా ఉన్నారు.

నేను అక్కడ మిత్రు లను కలిసినప్పుడు వారి నుంచి నాకు లభించిన ఆదరణ, అభిమానం చాలా గొప్పగా ఉన్నాయి. నేను వారితో

ఇంగ్లీషుతో సంభాషించినప్పటికీ, నేను ఇంట్లోనే ఉన్నంత అనుభూతి కలిగింది. ప్రేమను ఏ అడ్డంకి చేధించగలదు?

Page: 159 (Original Page No. 169)

29
‘త్వరగా తిరిగొచ్చేయ్’
మద్రాసు నుంచి నేను కలకత్తా కు వెళ్లా ను. అక్కడ నాకెదురైన ఇబ్బందులు అన్నీ ఇవన్నీ కావు. నాక్క అక్కడ ఎవరూ తెలీదు.

దాంతో నేను అక్కడి గ్రేట్ ఈస్టర్న్ హోటల్లో గది తీసుకున్నాను. అక్కడ నాకు ఎల్లెర్త్రోప్ గారితో పరిచయమైంది, ఆయన డైలీ

టెలీగ్రాఫ్ ప్రతినిధి. ఆయన తాను నివసిస్తు న్న బెంగాల్ క్లబ్కు రమ్మని నన్ను ఆహ్వానించారు. ఆ క్లబ్లోని డ్రాయింగ్ రూమ్లోకి ఒక

భారతీయుడ్ని తీసుకెళ్ల కూడదని ఆయనకు అప్పటి వరకు తెలీదు. తరువాత ఈ నిబంధన గురించి తెలుసుకుని, ఆయన తన

గదికి తీసుకెళ్లా రు. ఇక్కడి స్థా నిక ఆంగ్లేయిలు చూపుతున్న వర్ణ వివక్షపట్ల ఆయన ఎంతగానో బాధను వ్యక్తం చేసి, నన్ను డ్రాయింగ్

రూముకు తీసుకెళ్లలేకపోయినందుకు నాకు క్షమాపణలు చెప్పారు.

నేను సురేంధ్రనాథ్ భెనర్జీని కూడా కలిశాను, ఆయన బెంగాల్ ఆరాధ్యదైవం. నేను ఆయన్ను కలిసినప్పడు, చాలా మంది మిత్రు లు

ఆయన చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఆయన అన్నారు:

‘నా భయమంతా ఏమిటంటే ఇక్కడ ప్రజలు నీ పని గురించి పెద్ద శ్రద్ధ చూపరేమోనని. నువ్వు తెలుసుకోవాల్సింది, ఇక్కడ మాకున్న

ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ నీవంతు ప్రయత్నం నువ్వు చేయ్యి. నువ్వు కొంతమంది మహారాజుల సానుభూతి పొందడానికి

ప్రయత్నించు. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా కలవాలనేది గుర్తుంచుకో. రాజా శ్రీ ప్యారీమోహన్ ముఖర్జీ,

మహారాజా ఠాగోర్లను తప్పకుండా కలువు.

ఇద్దరూ ఉదారవాదులే, ప్రజా సేవలో ఇద్దరూ తగిన భాగస్వామ్యం వహిస్తు న్నారు.’

నేను ఈ ఇద్దరు పెద్ద మనుషులను కలిశాను, కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు నన్ను చాలా బాగానే ఆదరించి, కలకత్తా లో

బహిరంగ సభ ఏర్పాటు చేయడం అంత సులభం కాదని చెప్పేశారు. ఒక వేళ ఏదైనా చేయగలిగితో అది ప్రత్యేకించి సురేంద్రనాథ్

బెనర్జీగారి వల్లే అవుతుందని చెప్పారు.

దాంతో నా లక్ష్యం మరింత కష్టసాధ్యమని నాకు అనిపించింది. అక్కడి అమృత బజార్ పత్రిక కార్యాలయానికి వెళ్లా ను. అక్కడ నేను

కలిసిన వ్యక్తి నన్ను చూసి నేనో దేశ దిమ్మరిని అనుకున్నారు. దాంతో ఆ బెంగాలీ మరో మెట్టు పైకెక్కి కూర్చొన్నారు. ఆ పత్రిక

సంపాదకులు నన్ను ఒక గంట సేపు బయట వేచి ఉండేలా చేశారు. ఆయన్ను కలవడానికి చాలా మంది అక్కడ నిరీక్షిస్తు న్నారు.

ఆయన వాళ్లందర్నీ పంపిచేశాక కూడా ఆయన నావైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలా చాలా సేపు నిరీక్షించిన మీదట నా విషయం

ఆయనకు చెబుదామని అనుకుంటుండగా, ఆయన అన్నారు: ‘మాకెంత పని ఉందో నువ్వు చూస్తు న్నావు కదా? మీలాంటి వాళ్లు

రోజూ ఎంత మంది వస్తుంటారో అంతే లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్లడం మంచిది. నేను మీరు చెప్పేది వినే పరిస్థితుల్లో లేను.’

ఒక క్షణం నాకు కోపం వచ్చింది, కానీ వెంటనే తమాయించుకుని ఆ సంపాదకుడి పరిస్థితి అర్థం చేసుకున్నాను.
బంగబసి పత్రిక పేరు ప్రఖ్యాతుల గురించి నేను విని ఉన్నాను. అక్కడి రోజూ ఎంతో మంది సందర్శకులు వచ్చి వెళ్లడం కూడా

చూస్తు న్నాను.

Page: 160 (Original Page No. 170)


అయితే వారంతా ఆయనకు పరిచయిస్తు లే. ఆ పత్రికలో చర్చనీయాంశాలకు కొదవ లేదు, దక్షిణాఫ్రికా సమస్య గురించి ఆ

సమయంలో చాలా తక్కువ మందికి తెలుసు.

అయినా సమస్య తీవ్రత ఎంతో ఆ సమస్యతో బాధపడే మనిషికే తెలుస్తుంది, రోజూ పత్రికాధిపతి కార్యాలయానికి ఇలాంటి
సమస్యలతో వచ్చేవారిలో అతడు కూడా ఒకరు. ప్రతి ఒక్కరికి వారి సొంత సమస్య ఉంటుంది. ప్రతికాధిపతి వాళ్ల సమస్యలన్నీ ఎలా

తీర్చగలరు? పైగా సమస్యలతో వచ్చినవారు పత్రికాధిపతి అక్కడ చాలా శక్తి ఉందని భావిస్తుంటారు. కానీ ఆయనకు ఒక్కరికే

తెలుసు తన శక్తి అంతా పత్రిక కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చేంత వరకే నని. అయితే నేనేమీ నిరాశ చెందలేదు. మిగిలిన ఇతర

పత్రికల సంపాదకులను కలవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అందులో భాగంగానే ఆంగ్లో-ఇండియన్ సంపాదకులను కూడా

కలిశాను. ది స్టేట్స్మన్, ది ఇంగ్లిష్మెన్ పత్రికలు నా సమస్య ప్రాధాన్యతను గుర్తించారు. వారికి చాలా పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చాను,

వాటిని వారు యథాతథంగా ప్రచురించారు.

శాండర్స్గారు, ఇంగ్లీష్మన్ పత్రికా సంపాదకులు, నన్ను తన సొంత మనిషిలా చూసుకున్నారు. ఆయన తన కార్యాలయాన్ని, పత్రికను

నా ఇష్టం వచ్చినట్లు వాడుకునే స్వేచ్ఛను కలిగించారు. అందులో అచ్చువేసే వాటికి సంబంధించి ఏమైనా మార్పుల చేయాలంటే చేసే

స్వేచ్ఛ కూడా ఆయన నాకు కల్పించారు. దక్షిణాఫ్రికాలో పరిస్థితిపై ఆయ్న రాసిన ప్రధాన కథనం నాకు ఎంతగానో నచ్చింది. దానికి

సంబంధించిన ముందు ప్రతిని ఆయన నా పరిశీలనార్థం ముందుగానే నాకు పంపారు. మా ఇద్దరి మధ్య స్నేహం ఎంతో

బలపడిందని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. తనవల్లనైనంత సాయం తప్పకుండా చేస్తా నని ఆయన నాకు మాట

ఇచ్చారు. ఆ ఇచ్చిన మాటను తూచ తప్పకుండా పాటించారు. ఆయన తీవ్ర అనారోగ్యం పాలైనప్పటి వరకు నాతో ఉత్తర

ప్రత్యుత్తరాలు నడుపుతూనే ఉన్నారు.


నా జీవితమంతా నాకు ఇలాంటి కెంతో మంది స్నేహితులు లభించడం నా అదృష్టం. ఇవన్నీ నాకు అనుకోకుండా జరిగినవే.

శాండర్స్గారికి నాలో నచ్చిన అంశం ఏమిటంటే నా మాటల్లో అతిశయోక్తి లేకుపోవడం, సత్యం పట్ల నాకున్న భక్తి. నా సమస్య పట్ల

సానుభూతి ప్రకటించడానికి ముందు ఆయన నన్ను శల్య పరీక్ష చేశారు. చివరకు దక్షిణాఫ్రికాలోని శ్వేత జాతీయులకు సంబంధించి
కూడా ఎలాంటి అంశాల్లోనూ నేను నిష్ఫక్షపాతమైన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఏ మాత్రం ఇబ్బంది పడకపోవడం చూసి
ఆయన నన్ను మెచ్చుకున్నారు. ఎదుటివారికి న్యాయం జరగాలని మనం పోరాడితే మనకు తప్పకుండా వెంటనే న్యాయం

జరుగుతుందని నా అనుభవం నాకు చూపింది.

ఇలా అనుకోకుండా శాండర్స్ నుంచి సహాయసహకారాలు అందేసరికి, కోల్కతాలో బహిరంగ సమావేశం నిర్వహించడంలో విజయం
సాధిస్తా మనే ఆశలు చిగురింపజేసింది, అప్పుడే నేను డర్బన్ నుంచి తంతి సందేశం అందుకున్నాను: ‘జనవరిలో పార్లమెంటు

ప్రారంభమవుతోంది, త్వరగా తిరిగి వచ్చేసేయ్.’

దాంతో నేను పత్రికలనుద్దేశించి ఒక లేఖ రాశాను. నేను ఉన్నపళంగా కలకత్తా ను వీడి ఎందుకు వెళ్లా ల్సి వచ్చిందో అందులో

వివరించాను. బయలుదేరే ముందు నేను బొంబాయిలోని దాదా అబ్దు ల్లా అండ్ కో., ప్రతినిధికి తంతి చేసి, దక్షిణాఫ్రికాకు వెళ్లడానికి

సిద్ధంగా ఉన్న మొదటి ఓడకే నా టికెట్ను సిద్ధం చేయమని కోరాను.

Page: 161 (Original Page No. 171)


వెంటనే దాదా అబ్దు ల్లా కోర్ల్యాండ్ స్టీమర్ ఓడలో ప్రయాణానికి టికెట్టు ఏర్పాటు చేశారు, నాతో పాటు నా భార్య, పిల్లలను
వెంటపెట్టు కుని దక్షిణాఫ్రికాకు ఉచితంగా తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. నేను ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆనందంగా

స్వీకరించాను. డిసెంబరు మాసం ప్రారంభంలో నేను రెండో సారి దక్షిణాఫ్రికా యాత్రకు బయలు దేరాను. ఈ సారి నా వెంట నా

భార్య, నా ఇద్దరు కుమారులు మరియు నా వితంతు సోదరి ఏకైక కుమారుడు ఉన్నారు. అదే సమయంలో డర్బన్కు నాడేరి అనే

స్టీమర్ నౌక కూడా వెళుతోంది. ఈ స్టీమరు ఏజెంటు కూడా దాదా అబ్దు ల్లా అండ్ కో. ఈ రెండు ఓడలు దాదాపు ఎనిమిది వందల

మంది ప్రయాణికులను తీసుకుని బయలుదేరాయి, వారిలో సగం మంది ట్రాన్స్వాల్లో దిగిపోయేవారే.


*************************************************************************************

You might also like