You are on page 1of 4

Class 9, Ls- 3.

కాళోజి work sheet

I. ఈ క్రింది ప్రశ్నలకు సరైన సమాధానమును గుర్తించుము.

1. కాళోజి కి దేనిపై ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి ?


A. సాహిత్యంలొ భాషను ఉప యోగించే విషయంలొ కాళోజికి కొన్ని ఖచ్చితమైన
అభిప్రాయాలు ఉన్నాయి.

2. “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వా రం కాళోజి అని ఎవరు అన్నారు?


A. ”తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వా రం కాళోజి” అని దాశరథి కృష్ణమాచార్యు లు
అన్నారు.

3) కాళోజి సమాజ గొడవని తన గొడవగా చేసుకొని ఏ పేరుతో అనేక కవితలు రాసారు?


A. కాళోజి “నా గొడవ” అనే పేరుతో అనేక కవితలు రాసారు.

4) కాళోజి రజాకర్ల పై ఉన్న కోపంతో రాసిన కవిత ఏది?


A. కాళోజి గారు రజాకర్ల పై ఉన్న కోపంతో “కాటేసి తీరాలి” అనే కవితను రాసారు.

5) కాళోజి గారు ఏ యుద్ధం అప్పుడు జన్మించారు?


A. మొదటి ప్రపంచ యుద్ధం

6) కాళోజి గారి ఆత్మకథగా ఉన్న పుస్తకం పేరు ఏమిటి?


A. ఇది నా గొడవ.

7) కాళోజి గారి భార్య పేరు ఏమిటి?


A. రుక్మిణి

8) నా గొడవ అనే పుస్తకానికి ఎన్ని సంపుటాలుగా వెలువరించారు?


A. 8 సంపుటాలుగా వెలువరించారు.

9) కాళోజి ఏ రెండు ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని చెప్పారు?


A. వ్యక్తిత్వాన్ని, నమ్మకాన్ని కోల్పోవద్దు అని అన్నారు.

10) కాళోజి ఎలాంటి జీవితం గడిపాడు ? 


A. కాళోజి ప్రజాస్వామ్య జీవితం గడిపారు.

11) కాళోజి ఎప్పుడు ఏ మాటలు గుర్తు చేసే వాడు ?


  A. “నీ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కుల కోసం అవసరమైతే నా ప్రాణాలు
ఇచ్చి పోరాడుతా” అని అన్నారు.

12) మహాకవి శ్రీ శ్రీ కాళోజిని ఏ ప్రపంచ కవితో పోల్చారు?


A.  ఫ్రెంచికవి లూయీ ఆరగాన్

 13) నా గొడవ అనే పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?


A. నా గొడవ అనే పుస్తకాన్ని 1953 లో మహబూబ్ నగర్ జిల్లా లోని అలంపూర్ లో జరిగింది .

14) కాళోజి దృష్టిలో భాష ఎన్నిరకాలుగా ఉంటుంది?


A. కాళోజి దృష్టిలో భాష రెండు రకాలుగా ఉంటుంది.

15. భాషలో రెండు రకాలు ఏమిటి?

A.భాషలో రెండు రకాలు. 1."బడి పలుకుల భాష". 2. "పలుకుబడుల భాష" ఇది జనం నిత్య

వ్యవహారంలోవాడెభాష.

16. కాళోజి ఎప్పుడు ఏ భాషపై మొగ్గు చూపేవారు?

A. కాళోజి ఎప్పుడు జీవభాషపై మొగ్గు చూపేవారు.

17. కాళోజి ఏ పార్టిలో సభ్యుడు?

A. కంగ్రెసు పార్టి.

18. కాళోజి కాంగ్రెసుపార్టి తరపున ఏ పదవి కోసం  పోటి చేశారు?

A.  ఎమ్.ఎల్.ఎ గా  పోటి చేశారు.

19. రాజకీయాలలో ఏ వ్యక్తిత్వం కాళోజికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు? 

A. పార్టీయే దేవుడు, సర్వస్వం అని భావించడము, పార్టీ తప్పు చేసినా సమర్ధించడం,

ఇటువంటివి కాళోజికి అస్సలు ఇష్టం ఉండేది కాదు.

20. కాళోజి ఎక్కువగా ఎవరి చరిత్ర కథ గురించి చెప్పేవారు?

A. ప్రహ్లా ద చరిత్ర కథ గురించి చెప్పేవారు.

 21. ఓటుకు చాలా విలువ ఉంటుందని కాళోజి గారు ఏ రూపంలో ప్రజలకు తెలియజేశారు?

A. మెడలో బోర్డు వేసుకొని ఓటుకు చాలా విలువ ఉంటుందని తిరిగారు

 22. కాళోజి గారు వేటిపై తిరగబడ్డా రు?

A. అన్యాయం, అణచివేత లపై తిరగబడ్డా రు

 23. కాళోజి గారు ఏ వారసత్వం లో నుంచి ఎదిగారు?

A. ఈ నేల సాంస్కృతిక వారసత్వం లో నుంచి ఎదిగారు.

 24. కాళోజి గా రి ఎన్ని దశాబ్దా ల ప్రజా జీవితంతో ముడిపడింది?

A. ఎనిమిది దశాబ్దా లకు పైగా ముడిపడిన జీవితం ఆయనది..

25. ప్రజాస్వామ్యంలో దేనికి చాలా విలువ ఉంటుందని కాళోజి గారు భావించారు ?

  A. ఓటుకు 

26. కాళోజి గారి స్వభావం ఎటువంటిది ? 

A. అన్యాయాలను నిర్భయంగా ఎదురించే స్వభావం

27. ఆయన నిర్భయ స్వభావానికి ఉదాహరణగా నిలిచిన సంఘటన ఏది?


A. 1948 లో వరంగల్ సెంట్రల్ జైల్ లో జరిగిన సంఘటన.

28 . కాళోజి గారు ఎందుకు ఉద్యమ కవి ? 

A. ప్రజల వైపుగా కవిత్వం వినిపించాడు.నిజాం ను ఎదిరించాడు. నిరంకుశ ప్రభుత్వాల్ని


ధిక్కరించాడు. అందుకే ఆయన ఉద్యమకవి.

29. ఖలీల్ జిబ్రాన్ రాసిన "దిప్రాఫెట్" ను తెలుగులో ఏ పుస్తకంగా అనువదించబడింది?

A. జీవన గీత

30. కాళోజి గారు ఎప్పుడు మరణించారు?

A. 13-11-2002

31. తన మరణం తరువాత తన భౌతిక దేహాన్ని ఏ విధంగా ఉపయోగపడాలని ఆశించారు?

A. తన మరణం తరువాత తన భౌతిక దేహాన్ని వైద్య విద్యార్థు లకు పరిశోధనకు

ఉపయోగపడాలని ఆశించారు.

32. కాళోజి ఎటువంటి కవి?

A. తెలంగాణ పక్షాన నిలిచి తాడిత, పీడిత ప్రజల గుండెలలో కొలువైన ప్రజా కవి కాళోజి .

33. దేనిలో తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది?

A. మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో, వీటిలో తెలంగాణ

స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది.

34. సమాజ గొడవలని తన గొడవగా భావించి ఎలాంటి కవితలు రాశాడు?

A. "నాగొడవ" అనే పేరుతో అనేక కవితలు రాశాడు.

35. కాళోజి నిజానికి 'అంతర్జా తీయ కవి’ అని ఎందుకు అన్నారు?

A. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జా తీయ దృక్పథం కలిగి ఉన్న కవి కాళోజి అందుకే ఆయనను
అంతర్జా తీయ కవి అని అన్నారు.

36. కాళోజి కత్తిగట్టి పోరాడిన వాడు అని ఎందుకు అన్నారు?

A. నిరంకుశ రాజ్యాల మీద తను ఎల్లప్పుడు పొరాడాడు. అందుకే కాళోజిని కత్తిగట్టి పోరాడిన

వాడు అని అన్నారు.

37. కాళోజి కవిత్వాలను ఎవరు ఆదరిం చేవారు?

A. తెలుగు నాటి ప్రజలు కాళోజి కవిత్వాలను ఆదరించేవారు.

38. కాళోజి ఎందులో మమైకమయ్యారు?


A. కాళోజి ప్రజా ఉద్యమాలలో మమైకమయ్యారు.

39. కాళోజి కథల్లో స్పష్టంగా కనిపించేది ఏమిటి ?


A. స్వచ్ఛత ,సూటిదనం
40. కాళోజి ఏ ఊర్లోపుట్టా డు?
A. రట్టహళ్ళి
41. అలంకరణ పట్ల గల మోజును నవ్వు తెప్పించే విధంగా రాసిన కాళోజి కథ ఏది?
A. ఫేస్ పౌడర్
42. కాళోజి జన్మించిన సంవత్సరం ఏది ?
A. 1914  

43. జనం నిత్య వ్యవహారంలోవాడే భాష ఏది?

A. పలుకుబడులభాష

44. కాళోజి దృష్టిలో భాష ఎన్నిరకాలు ?

A. 2

---XXX---

You might also like