You are on page 1of 7

తెలుగు భాషా ప్రాముఖ్యత - చరిత్ర

తెలుగు భాష 12 ద్రావిడ భాషలలో తీయనైనది


తెలుగు భాషలో ఒక సంగీతం ఉంది

ఒక నది ప్రవహిస్తు న్నట్లు ...


ఒక కోయల కూస్తు న్నట్టు ...
ఓ సముద్రం మూలుగుతున్నటు
ఏ విషయానైనా ఒక భాషలోకి తీసుకువెళ్లా లి అంటే
అది తెలుగు భాషే… వేరే భాషకు సాధ్యం కాదు...  

ఆయనకు పిడికెడు అన్నం పెట్టకపోయినా అయన పద్యాలు


లండన్ మ్యూజియం లైబ్రరీలో నాకు కనిపించాయి
తెలుగు కొండల్లో లోయల్లో పద్యాలు పాడినా
లండన్ దాక అవి చేరాయని నేను గర్వపడుతున్నా

నేను ఇంగ్లీష్ చదవగలను కానీ మాట్లా డలేను


అందుకే ఇతర దేశాలు వెళ్ళినపుడు translator ని
పెట్టు కుంటా కానీ చాలా సార్లు translator అవసరం లేదు
మీ ఉపన్యాసమే సంగీతంలా ఉంది అని
మధ్య లోనే translation ఆపేయమనేవాళ్లు

ప్రపంచంలో తెలుగు వాళ్లు ఎక్కడికి వెళ్లినా


airport నే కలిసిపోతారు...
వాళ్ళ ముఖ కవళికలు సాత్విక వాచికాభినయాలు
కన్నులో ఉండే కరుణ ఆత్మీయత
హృదయానికదుకునే ప్రేమ ఇవన్నీ తెలుగు వారి
భావవికాసానికి గురుతులు...
తెలుగు విశ్వజనీనమైన అటువంటిది

తెలుగులో అనేకమైన ట్రెండ్స్ వచ్చాయి


అన్ని మతాలకు సంబందించిన శాఖలు వచ్చాయి
నన్నయ్య కూడా సంస్కృత నుంచి భారతాన్ని
తెలుగులోకి తీసుకువచ్చేటప్పుడు

'''శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే'''


'''లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం'''
'''తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై'''
'''ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే'''

వేదాల సారాన్ని కూడా త్రిమూర్తు ల తత్వాన్ని తెలుగులోకి


తీసుకువస్తు న్నా అని చెపుకున్నారు
అంటే మొత్తం వైదిక సాహిత్యాన్ని తెలుగులో తీసుకువచ్చే
బాధ్యత నన్నయ్య భుజాన వేసుకున్నాడు

నన్నయ్య, తిక్కన, ఎర్రన్న


వాళ్ళ ముగ్గురు తెలుగులో భారతాన్ని
తీసుకువచ్చేటప్పుడు ఎంతో కష్టపడ్డా రు
రామ - రాముడు
భీమా - భీముడు
డు ప్రత్యయం తో కొని వందల నామవాచకాలను  
తెలుగులోకి తీసుకువచ్చారు
అవే నామవాచకాలు రామాయణ భారత అనువాదాల
తరవాత తెలుగు వారు పెట్టు కోడం మొదలు పెట్టా రు

ఆ తర్వాత మరి శ్రీనాథుడు, పోతన


భగవతాన్ని అనువదించేటప్పుడు
దేశీయతకు ఎక్కువ చోటు ఇచ్చారు
తెలుగు నుడికారపు సొగబును తీసుకొని
పోతన భగవతాన్ని రచించారు

నిజానికి నన్నయ్య భారతాన్ని తెలుగులోకి


అనువదించేటప్పుడు కొంత ఘర్షణ జరిగింది
ఎలా సంస్కృత పదాన్ని తెలుగు చేయాలి...
మనకి ఉన్న తెలుగులో భారతాన్ని
అనువదించడం కష్టంగా ఉంది

ఎందుకంటే మనది
ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ
ఘ ఝ ఢ ధ భ ఙ ఞ శ లు... లేని తెలుగు

రెండు అక్షరాలతోనే కొన్ని వేల పదాలు ఉండేవి


అమ్మ, అక్క, కుండ, బాన...
ఇది మూలవాసుల భాష దళితుల భాష
తెలుగులో వాన రెండు అక్షరాలు
సంస్కృతంలోకి వచ్చేసరికి వర్షం

ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ
ఘ ఝ ఢ ధ భ ఙ ఞ శ లు సంస్కృత
సమంబులను గూడి తెలుఁగున
ఇవి పలకలేక చాల మంది బ్రాహ్మణులు
కూడా సంస్కృత కాలేజీ నుంచి వెళ్ళిపోయేవారు

దళితుడా... బ్రాహ్మణుడా కాదు


భాష నేర్చుకోవాలనుకునేవాడికే వస్తుంది
నేర్చుకోలేనివాడికి రాదు...

నేను ఇక్కడ భావజాల విషయంగా మాట్లా డంటం లేదు


భావజాలపరంగా నన్నయ్య... తిక్కన గురించి
నేను ఇప్పుడు మాట్లా డడంలేదు...
భాష వరకే పరిమితం అవుతున్న...

డు, ము, వు, లు  ప్రథమా విభక్తి


అనే ఒక సూత్రం దగ్గర దగ్గర
20 వేల పాదాలను తెలుగులోకి తీసుకువచ్చింది...
సంస్కృత పదాలను తెలుగులోకి తీసుకువచ్చింది
రామ కాస్త రాముడు అయింది

రాముడు అనడం తో వాళ్ళు అనుకునే దేవుడు


కూడా మాములు నామవాచకంగా మారింది

భాషను సృష్టించింది మూలవాసులు


ఎవరికీ ప్రకృతితో సంబంధం ఉందొ
ఎవరికీ నదితో సంబంధం ఉందొ
కొండతో సంబంధం ఉందొ
లోయతో సంబంధం ఉందొ
ఇది తెలుగు బాషా
నాటు, కోత, కలుపు
ఈ పదాలను సృష్టించింది మూలవాసులు

ముఖ్యంగా గిరిజనులు, దళితులు


ఎవరైతే ప్రకృతితో సంబంధం ఉందొ
తెలుగు వారు సృష్టించింది
ప్రకృతి సంబంధం లేనివాళ్లు
మూలవాసులు దగ్గర భాష నేర్చుకున్నారు

భాష ఎక్కడ పుట్టింది అంటే


జన జీవనం నుండి పుట్టింది
ఏ ప్రజలైతే శ్రమకు అనుబంధంగా ఉంటారో
వాళ్ళు రోజూ పదాలను సృష్టిస్తా రు
రాయి, నేయి, పూత, కుడుము/ ము ప్రత్యయం
కూడూ... కూడిక నుంచి వచ్చింది కూడూ

బ్రాహ్మణులు చాలా మంది భోజనం అంటారు


నిజానికి భోం అనేది శబ్దం... పదం కాదు

బ్రాహ్మణులకు భాష రాదు...


ఎందుకంటే వారికీ ప్రకృతితో సంబంధం లేదు
వారు భాషను నేర్చుకున్నారు
ఆ నేర్చుకునేది సంస్కృతం ఎక్కువ నేర్చుకున్నారు
అందుకనే వారు కూడూ అనే పదాన్ని నీచార్ధంగా వాడారు
తెలుగు భాష ప్రపంచంలో అత్యుత్తమైన
నది నాగరికత కాలంలో పుట్టింది
అది సంస్కృతం కంటే ముందు పుట్టింది

సంస్కృతం ఇక్కడికి వచ్చింది


తెలుగు ఇక్కడ పుట్టింది
భాషగా సంస్కృతం చాలా మంచి భాష

వైదిక ఉద్యమం అయిన తర్వాత


పోతన అనువదించేటపుడు సంస్కృతం కన్నా
తెలుగు ఎక్కవ వాడారు
గజేంద్ర మోక్షం లో

అడిగెదనని కడువడి జను


నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్
వడివడి జిడిముడి తడబడ
నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్

ఈ పద్యంలో ఒక సంస్కృత పదం కూడా లేదు


పోతన తెలుగు భాషకు చాల కాంట్రిబ్యూట్ చేసారు

వాళ్ళ తర్వాత ప్రబంధ కవులు వచ్చారు ఈ కాలంలో


తెలుగు ఇంకా అభివృద్ధి అయింది
8 మంది పోటీ పడి రాశారు

అందులో కృష్ణదేవరాయలు మాములు వారు కాదు


ఆయన సంస్కృతం లోనూ, తెలుగులోనూ పండితుడు...
అక్కడ వైష్ణము వచ్చింది, శైవములోనూ అనేక గ్రంధాలు వచ్చాయి
వాటితో అనేకమైనటువంటి పారిభాషిక పదాలు చేరాయి
వైదికం వచ్చినప్పుడు కొన్ని పదాలు, శైవం వచ్చినపుడు కొన్ని పదాలు

ఆతర్వాత బ్రిటిష్ వాళ్ళు భారత దేశానికి వచ్చిన తర్వాత


కొన్ని పదాలు వచ్చాయి
తెలుగుకు అబ్సర్బింగ్ నేచర్ ఉంది

తెలుగుకు విస్తరించే గుణం ఉంది


తెలుగు వారికీ తీసుకువచ్చే గుణం ఉంది

You might also like