You are on page 1of 2

మాఘ పురాణం -

🚩వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణమ్వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం

పతిమ్వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం

శంకరమ్.

మృగ శృంగుని చరిత ్ర

ఆ బ్రా హ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను

పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసయ


ి ున్నాడు గదా! అప్పుడాతను

శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయంలో ఆ ప్రా ంతమందు తిరుగాడు మృగములు, జంతువులు,

తమయొక్క శృంగములచే నతనిని గీకెడివి. అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యెను. 

☘వివాహమాడు కన్య గుణములు 

మృగశృంగునాకు యుక్త వయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రు లు

నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగ శృంగుడు వారిమాట లాలకించి ఇట్లు పలికెను.

“పూజ్యులగు తల్లిదండ్రు లారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రా యము

గూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థా శ్రమము మంచిదని దైవజ్ఞు లు నుడివిరి. అయినను అందరూ ఆ

సుఖమును పొ ందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య

లభించినప్పుడే గృహస్థా శ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –

శ్లో : కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా

శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!

ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను,

రాచకార్యములలో భర్త కు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను,

రూమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం

ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థా న్ని మనుజుడు

ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు

కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక

గుణవంతురాలగు భార్యను పొ ందుట కన్నా మరొక స్వర్గ ము లేదు.

గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గ తుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-

కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.

భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బో లిన కష్ట ములనుభవించుచు మరల నరక

కూపమునకే పో గలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను.

అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తు రాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి

కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రా హ్మణులను

పూజించునదియై, అత్త మామల మాటలకు జవదాటనిదై యుండవలెను. 

ఈ నీతులన్నీ మునుపు అగస్త ్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే

ఎంచుకొనవలయును. అయినా అదెటుళ సాధ్యపడును? అని మృగ శృంగుడు తల్లిదండ్రు లతో తన మనస్సులో నున్న

సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను. “కుమారా! నీమాటలు

నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్ట ం

నెరవేరవలయునన్న ణా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము” అని

పలికెను.

🙏ఓం నమఃశివాయ🔱

You might also like