You are on page 1of 2

శ్రీ వరదరాజస్వామి ఆలయం :-

విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో (సుమారు 4 అడుగుల)
నిలువెత్తు శ్రీ వరదరాజస్వామి వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది.
బంగారు బావి :-
దర్శనానంతరం వెలుపలకు రాగానే అద్దా ల గదిలో బంగారు తాపడంతో ఉంటుంది. ఇందులోని నీటినే స్వామి వారి
అభిషేకాలకు ప్రసాదాలకు వాడతారు. ఇందులో వైకుంఠం లోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనది గా
చెపుతారు.
వకుళాదేవి :-
బంగారుబావి ప్రక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది.
శ్రీవారి తల్లి (పెంచిన). ద్వాపరయుగంలో యశోదయే ఈ కలియుగంలో స్వామి వారి కళ్యాణం చూడడానికి వకుళాదేవిగా
అవతరించింది.
అంకురార్పణ మండపం :-
బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తా రు.
ఇంకా గరుడ, విష్వక్సేనుల, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తా రు.
యాగశాల :-
హోమాది క్రతువులు నిర్వహించే ప్రదేశం. కాని ఇప్పడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తు న్నారు. బ్రహ్మోత్సవాల
సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తా రు.
సభ అర :-
కైంకర్యాలకై ఉపయోగించే బంగారు వెండి పాత్రలు కంచాలు గొడుగులు ఉంచే ప్రదేశం.
ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విశనకర్రలను కూడా ఇక్కడే భద్రపరుస్తా రు.
సంకీర్తన భాండాగారం :-
సభ అర ప్రక్కనే ఉన్న గది. దీనికి ఇరువైపులా తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల
విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్ళపాక వంశం వారు రచించిన దాదాపు 32000 సంకీర్తనలను భద్రపరిచారు.
సాధుసుబ్రమణ్యశాస్త్రి* గారి విశేష కృషి వలన ఈనాడు మనం వాటిని మననం చేసుకోగలుగుతున్నాము.
భాష్యకార్ల సన్నిధి :-
ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో
మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి.
తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తు న్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే
మోకాళ్ళ పర్వతం.
ఈనాటికి కాలినడకన వచ్చే భక్తు లు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు.
ప్రధాన వంటశాల (పోటు) :-
విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర,
ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌
పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తా రు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తా రు.
పరకామణి :-
స్వామి వారికి భక్తు లు సమర్పించిన నగదు లెక్కించే ప్రదేశం.
చందనపు అర :-
స్వామి వారికి సమర్పించే చందనాన్ని భద్రపరిచే ప్రదేశం.
ఆనందనిలయ విమానం :-
ఆనందనిలయం పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు.
గరుత్ముంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుండి భూమిమీదకు తీసుకు వచ్చారని చెప్తా రు. దీనిమీద దాదాపు 64 మంది
దేవతా ప్రతిమలు ఉన్నట్లు చెపుతారు.
విమాన వెంకటేశ్వరస్వామి :-
గోపురంపై వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామివారు.
రికార్డు గది :-
స్వామి వారి ఆభరణాలు వివరాలు, జమ ఖర్చులు భద్రపరచు గది.
వేదశాల :-
రికార్డు గది ప్రక్కనే వేద పఠనం చేసే పండితులు ఉండేగది. ఇక్కడే మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.
శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి :-
రామానుజాచార్యులుచే ప్రతిష్టితం చేయబడింది.
శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం. క్రీ.శ 1469 లోని కందాడై
రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తా వన ఉంది.
*'అళగియ సింగర్‌' (అందమైన సింహం)* అని, *వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం)* అని ప్రస్తా వన ఉంది.
చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండడం ప్రత్యేకం.
ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.
శంకుస్థా పన స్థంభం :-
రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థా పన చేసిన ప్రాంతం.
పరిమళ అర :-
శంకుస్థా పన స్థంభంకు వెళ్ళే దారిలో ఉంటుంది. స్వామి వారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర.
ఈ గది గోడపై రాసిన భక్తు ల కోరికలను స్వామి తీరుస్తా డని నమ్మకం.
శ్రీవారి హుండి :-
భక్తు లు కానుకలు వేసే ప్రాంతం.
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగిననూ మార్పు చెందని ఒకేఒక స్థలం. దీని క్రింద శ్రీచక్రయంత్రం ధనాకర్షణ
యంత్రం ఉందని నమ్మకం.
బంగారు వరలక్ష్మి :-
హుండి ఎడమగోడపై బంగారు లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఈవిడ భక్తు లకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.
కటహ తీర్థం :-
అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టి లాంటి నిర్మాణం. ఇందులో స్వామి వారి
పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తా రు.
విష్వక్సేన :-
హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ప్రస్తు తం ఈ
విగ్రహం అంకురార్పణ మండపంలో ఉంది.
ఘంట మండపం :-
బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం.
దీనినే మహామణి మండపం అంటారు.
పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు. దీనిని
*ఘంటపని* అనేవారట. ఈ గంటలననుసరించే స్వామి వారి ఆహారసేవనలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం
చంద్రగిరి రాజులు ఆహారం సేవించేవారట.
ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.

You might also like