You are on page 1of 267

తులసి

---- యండమూరి వీరేంద్రనాథ్


అర్ధరాత్రి

ఒక అజినపత్ర నిద్రలేచిన వేళ -

శ్మశానపు నడిబొడ్డు న ఖద్యోదుడు ఆవిర్భవించినట్టు పశ్యత్పాలుడి పాలనేత్రం నుంచి ఎగిసినట్టు మంటలు.


టపటప కొట్టు కున్న నాగాంతకపు రెక్క ఎగిసిపడిన కృకవాకువు రక్తం. వికృతమైన సకృత్ప్ర జనపు అరుపు.
కృకలాసపు నిర్నిమేషపు కన్ను.

ఉన్నట్టుండి అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చరాలు ఆచరాలై -నడిచి వస్తు న్న మనుష్యుల్ని చూసి మౌనం
వహించాయి.

దూరంగా చీకట్లోంచి ఒక గుంపు వస్తూంది, నెమ్మదిగా నడుస్తూ.........

వాళ్ళ కళ్ళు సగం మూసుకుని వున్నాయి. అయినా శ్మశానపు అణువణువూ తెలిసినట్టు కదిలివస్తు న్నారు,
క్రమబద్దంగా, లయబద్దంగా వాళ్ళు అలా కదిలి వస్తూంటే ఒక కెరటం ఉవ్వెత్తు న ఎగిసి ముందుకు
వస్తు న్నట్టుంది. వాళ్ళ చేతుల్లో కాగడాలు అర్ధరాత్రి శత్రు రాజ్యం మీద దండెత్తడానికి బయల్దేరిన సైనికుల్లా
వున్నాయి.

అందులో ప్రతీ ఒక్కడూ క్షుద్రదేవతోపాసకుడే.

చనిపోయిన తన సహచరుణ్ని చూడడానికి, బిస్తా గ్రామం నుంచి బయల్దేరి శ్మశానానికి వస్తు న్నారు వాళ్ళు.

సరిగ్గా ఇరవై నాలుగు గంటల క్రితం కాద్రా చనిపోయేడు. బిస్తా గ్రామపు మహా మాంత్రికుడు కాద్రా. కాష్మోరా
అనే క్షుద్రదేవతని ఉపాసన చేస్తుండగా ముగ్గురు నాగరీకులు కార్లో (ఈ కారు అనే పదం అక్కడ చాలా మందికి
తెలీదు) వచ్చి అతన్ని చంపేసేరు.

బిస్తా లోకి పరాయి వాళ్ళు వచ్చేరు. వచ్చి తమ తాలూకు మనిషిని చంపేసేరు.

చనిపోయిన మంత్రగాని చుట్టూ ఇరవై నాల్గు గంటలపాటూ క్షుద్ర దేవతలు ఆవరించి వుంటాయి... ఆ
తరువాతే అతణ్ని చూడాలి. అందుకే వాళ్ళు బయల్దేరారు. అయితే కేవలం చూడ్డా నికే కాదు.

వాళ్ళ పెదవులు ఛందోబద్దంగా కదులుతున్నాయి.

ఉక్త అత్యుక్త మధ్య ప్రతిష్ట గాయత్రి ఉష్ణిక్కు, అనుష్టు ప్పు. ప్రజ్ఞి -అతిశక్వరి - అషి, ధృతి, కృతి, ఉత్కృతి
మొదలైన ఛందస్సులకి రాక్షసగణాల్ని చేర్చి క్షుద్రదేవతల్ని పిలుస్తు న్నారు వాళ్ళు. అవర్ణ వివర్ణ వార్యాసూర్త క్రోధ
భ్రంశ క్షుద్ర స్వేద ఉన్మాదములయిన పైత్యములతో తమ శత్రు వు చచ్చిపోవడం కోసం వాళ్ళు మంత్రాల్ని
జపిస్తు న్నారు.

నెమ్మదిగా వాళ్ళు శ్మశానపు నడిబొడ్డు కు చేరుకున్నారు.


మంటలు ఉజ్వలంగా వెలుగుతున్నాయి.

అక్కడ నిలబడి వున్నాడు -

విషాచి.

బిస్తా గ్రామంలోకెల్లా వయసు మీరినవాడు అతడు. చర్మం సాగి వేలాడుతోంది. మంట వెలుగు వాలిన రెప్పల
క్రింద కాళ్ళమీద వికృతంగా మెరుస్తూంది రొమ్ముమీద ఎముకలు చర్మంనుంచి బయటకు పొడుచుకు
వచ్చినయ్. నడుముకి చిన్న గుడ్డ తప్ప ఇంకేమీ లేదు.

సరిగ్గా పన్నెండయింది.

దివిటీలు అక్కడికి చేరుకున్నాయి. చిన్నలు, పెద్దలు, యువకులు, వృద్ధు లు అందరూ వున్నారక్కడ. మొత్తం
బిస్తా గ్రామమే అక్కడికి చేరుకొన్నట్టు వుంది.

వాళ్ళు ఎన్నో మరణాల్ని చూసిన వాళ్ళు - మరణాల మధ్య బ్రతుకు తున్నవాళ్ళు, మరణాన్ని బ్రతుకు
తెరువుగా చేసుకున్నవాళ్ళు.

అయినా మరణం అంత భయంకరంగా వుంటుందని వాళ్ళకి తెలీదు. అప్రయత్నంగా 'హ' అన్నారు.
ఒక్కసారిగా అంతమంది నోటినుంచి వచ్చిన శబ్దం గాలిలో హిప్ మన్న శబ్దం చేసింది. ఒక డేగ రెక్కలు టపటపా
కొట్టు కుంది.

వాళ్ళముందు కాద్రా శవం భయంకరంగా వుంది -వళ్లు జలదరించేలా..

అప్పటికి కాద్రా మరణించి ఇరవై నాలుగు గంటలు అయింది. రక్తం పీల్చేయబడిన శరీరం, గాలిపోయిన
బ్లా డర్ లా వుంది. ఒక డేగ పీకినట్టుంది - కన్ను ముఖంనుంచి బయటకొచ్చి , ఎలక్ట్రికల్ వర్లు ఆధారంగా
వేలాడుతున్న హోల్డర్ లా నరాల ఆధారంతో వేలాడుతూంది. నోటి దగ్గర రక్తం గడ్డకట్టింది. ఏ నక్కో
పీక్కుతినట్టు తొడ దగ్గిర మాంసం నల్లగా కమిలిపోయింది. సగం గోతిలో, సగం పైనా పడటంతో చెయ్యి
మాత్రం పైకి కనబడుతూంది.

అక్కడున్న వాళ్ళందరూ ఆ శవాన్నే కన్నార్పకుండా చూస్తు న్నారు. కొంతసేపు క్రితమే వాళ్ళకు తెలిసింది
కాద్రా కాష్మోరాని ప్రయోగిస్తు న్నాడని.

అప్పటి వరకూ ఆ రహస్యం తెలిసినవాళ్ళు ఇద్దరే.

ఆ గ్రామ పెద్ద విషాచి, కాద్రా రక్తం తుడిచిన వృద్ధు డు. వాళ్ళిద్దరికే తెలుసు కాద్రా కాష్మోరాని నిద్రలేపుతున్న
సంగతి. ఇరవై రోజులు క్రితం విషాచి కాద్రాని కలుసుకున్నాడు. కాష్మోరా వంటి భయంకరమైన క్షుద్రదేవతని నిద్ర
లేపే ప్రయత్నం చెయ్యొద్దన్నాడు. కాద్రా వినలేదు. దానికి ఫలితం అనుభవించాడు. ఐతే దానికి కారణం ఎవరో
ముగ్గురు వచ్చారు. వృద్ధు డు వాళ్ళకి కాద్రా ఎక్కడున్నాడో చెప్పాడు. అంతే. తెల్లవారు జామున శ్మశానం
నడిబొ్డులో కాద్రా చచ్చిపడున్నాడు.

రక్తం పీల్చెయ్యబడి -
కాద్రా మరణం సంగతి ప్రొద్దు న్న తెలిసింది. ఓ కుర్రవాడు చూసేడు శవాన్ని. ఊళ్ళోకొచ్చి విషాచికి చెప్పి - ఆ
తర్వాత అరగంటలో రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎవరూ శ్మశానం వైపు
వెళ్ళకుండా కట్టు దిట్టం చేసేడు విషాచి.

కాష్మోరాని లేపడమే కష్టం ఆఖరి అంకం అంత కష్టం కాదు. బొమ్మని మంటల్లో వేస్తే చాలు, ఆరాధన
పూర్తయినట్టే.

మరేమిటి అడ్డు పడింది?

లక్ష ప్రశ్నలు అక్కడి వారిని వేధిస్తు న్నాయి.

వాళ్ళ ఆలోచనలు భంగపరుస్తూ విషాచి ఒరియాలో బిగ్గరగా ఏదో అన్నాడు. వాళ్ళలో నలుగురు యువకులు
ముందుకు వచ్చారు. మళ్ళీ అతడేదో అన్నాడు. అందులో ఒకడు వంగి కాద్రా శరీరాన్ని గోతిలో నుంచి
బయటకు లాగేడు. శవం గుండె భాగంలో చిన్న క్రా స్ లాగా రంధ్రం చేయబడింది. గులాభి అంటుని తీసినట్టు
వేళ్లతో గుండెని పైకి పెకిలించి సహచరుడికి అందించాడు. తరువాత శవాన్ని తిప్పి, బోర్లా పడేలా చేసేడు. చెవుల
వెనుకనుంచి చర్మాన్ని కోసి ఒక్కసారి వేళ్ళతో కదిపేసరికి స్కల్ ముందుకు వెళ్ళిపోయింది. మెదడుని
బయటకు తీసేడు.

బిస్తా గ్రామంలో కెల్లా గొప్ప మంత్రగాడు కాద్రా. అంత గొప్ప మంత్రగాడి గుండెకీ, మెదడుకీ, ఎంత
విలువుంటుందో క్షుద్ర విద్యలతో పరిచయం వున్న వాళ్ళకి తెలుస్తుంది.

*********
మంత్రగాణ్ని దహనం చెయ్యరు. పాతి పెడ్తా రు. ఆ పాతి పెట్టడం కూడా పూర్తిగా పాతి పెట్టరు. శరీరం అంతా
భూమిలో వుంటుంది. ఒక చెయ్యి మాత్రం బయటికి వుంటుంది...

క్షుద్ర దేవతల పిలుపు నందుకోవడం కోసం అలా చెయ్యి బయటకు వుంచాలని వాళ్ళ విశ్వాసం. ఏ నక్కా
పీక్కు తినకపోతే మాంసం శుష్కించి కేవలం ఎముకల అరచెయ్యి భూమిలోంచి బయటకు పొడుచుకు
వచ్చినట్టు భయంకరంగా ఉంటుంది.

శవాన్ని పాతిపెట్టిన తరువాత కృకవాకువు రక్తా న్ని తీర్ఘంగా సేవించి గ్రామం వైపు సాగిపోయారు వాళ్ళు.

వృద్ధు డూ, విషాచి కనుసైగ నందుకుని ఇంకొక కుర్రవాడూ మాత్రం ఆగిపోయారు. వెళుతున్న వాళ్ళకి
తెలుసు, ఆ కుర్రవాణ్ణి గ్రామ పెద్ద ఆగిపొమ్మనాడంటే - ఇంకొన్ని సంవత్సరాల్లో ఆ గ్రామంలో మరో మహా
మాంత్రికుడు తయారవ్వబోతున్నాడన్న మాట. విషాచి దయకు పాత్రు డయినవాడు ఎంతో అదృష్ట వంతుడు.
ఎన్నో సంవత్సరాలు శుశ్రూష చేస్తే గానీ యువకులకు గురువు అనుగ్రహం దొరకదు. అది దొరికి, సాధన చేసి
పరిపూర్ణత సాధించేసరికి వృద్ధా ప్యం వస్తుంది.

నిజమైన మంత్రగాడెవడూ యాభై సంవత్సరాలకి ముందు సిద్ధత్వం పొందడు. కానీ ఆ కుర్రవాడు


అదృష్టవంతుడు. ఇరవైయ్యేళ్ళకే మహా మాంత్రికుడవబోతున్నాడు.
శ్మశానం నుంచి ఊరు కదిలి వెళ్ళిపోయిన తరువాత విషాచి ఆ కుర్రవాడికేసి క్షణం తీక్షణంగా చూసేడు. పదేళ్ళ
కుర్రవాడు, ధృడమయిగా ఉన్నాడు. కానీ లేతగా వున్నాడు. చదువు లేదు. కానీ మొహంలో జ్ఞానం వుంది.

విషాచి చూపులకి ఇంకొకరైతే గజగజ వణకాల్సిందే. ఆ కుర్రవాడు తొణకలేదు. నిర్లిప్తంగా చూస్తూ


నిలబడ్డా డు.

నిర్లిప్తత అన్న పదాన్ని ఇక్కడ గమనించాలి.

మంత్రగాడి మొహంలో ఏ భావమూ సామాన్యంగా కనబడదు. కనబడకూడదు. మోహావేశాలకి అతీతంగా


వుండాలి. కాద్రా అలానే వుండేవాడు. నిర్లిప్తంగా ప్రతీ విషయానికీ....... రక్తం త్రాగేటప్పుడు కూడా.

విషాచి పెదవులమీద నెమ్మదిగా చిరునవ్వు వెలిసింది. సంతృప్తితో తల పంకించేడు. తను అప్పచెప్పబోయే


కార్యాన్ని సమర్ధవంతంగా నిర్వహించగలడనే నమ్మకం కుదిరింది. దగ్గిరకు రమ్మన్నట్టు పిలిచేడు. కుర్రవాడు
దగ్గరికొచ్చాడు.

"ఇతడి పేరు తెలుసా?" వృద్ధు డివైపు తిరిగి అడిగేడు.

వృధ్దు డు తెలీదన్నట్టు తలూపేడు. అతడికి అయోమయంగా వుంది. మంత్రం నేర్పేటప్పుడు మూడోవాడు


వుండకూడదన్నది ఆచారం. మరి విషాచి తనని ఎందుకు వుండమన్నాడు?

"...... ఈ కుర్రవాడి పేరు దార్కాసాహు. అందరూ దార్కా అంటారు" ఉన్నట్లుండి విషాచి కంఠం
తీవ్రమైంది. ఆ శ్మశానమే కంపిస్తుందా అన్నట్లు అరిచేడు. "బిస్తా గ్రామపు మంత్రగాళ్ళకు దార్కాని నాయకుణ్ని
చేయబోతున్నాను. ఎవరికయినా అభ్యంతరం వుందా?"

కీచురాయి కూడా భయపడినట్టు చప్పుడు చేయడం మానేసింది. ప్రేతాత్మలు లయ విన్యాసం ఆపుచేసి


క్రతువును చూడడానికి ఆగేయి.

విషాచి మొహం మంటల వెలుగులో ఎర్రగా వుంది.

"దార్కా! ఈ రోజు నేను నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తు న్నాను. చేతబడి నుంచి కాష్మోరా వరకూ అన్ని విద్యలు
నీకు నేర్పబోతున్నాను. నేను మరణించే లోపులో ఈ విద్యలు నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుంటే....
నేర్చుకుంటే ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న వయసులో మహా మాంత్రికుడివైన ఖ్యాతి నీకు దక్కుతుంది."

చెట్లు -చేమలు -పుట్టలు -పక్షులు అన్నీ మౌనంగా, భయంగా విషాచి చెప్పేవి వింటున్నాయి.

"మంత్రగాడికి జాలి, దయ, క్షమ, వుండకూడదు. మనం చేతబడి చేసినవాడు రక్తం కక్కుకుంటున్నా
చలించకూడదు. బాధతో విల విలలాడ్తు న్నా బాధపడకూడదు. ఆ మనసు ఈ వయసులో నీ కుందని
నిరూపించుకోవాలి నువ్వు."

దార్కా నిశ్చలంగా నిలబడి వున్నాడు.

వృద్ధు డు విషాచి చెప్పేది వింటున్నాడు.

విషాచి మంటల వెనుకనుంచి ఒక కర్ర తీసేడు. దాన్ని చూడగానే వృద్ధు డు అప్రయత్నంగా అడుగు వెనక్కి
వేసేడు.

"ఎవరో ముగ్గురు పరాయి దేశస్థు లు బిస్తా మంత్రగాళ్ళ సామ్రాజ్యంలో ప్రవేశించి, ఆ గ్రామపు ఒకే ఒక
కాష్మోరా ప్రయోగశాలిని చంపితే చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. అయితే కాద్రా
శ్మశానంలో కాష్మోరా నిర్వహిస్తు న్నాడని వాళ్ళకి ఎలా తెలిసింది."

వృద్ధు డు మరో అడుగు వెనక్కి వేసేడు.

"దార్కా -మన ఆచారాలను ఇతడు అగౌరవ పరిచేడు. అజ్ఞానం. వల్లనైతేనేం -నల్లమందు మత్తు లో నైతేనేం
శత్రు వుకి ఆచూకీ చెప్పాడు. బిస్తా గ్రామానికి తలవంపులు తెచ్చాడు. అతడిని శిక్షించే బాధ్య....." విషాచి వాక్యం
పూర్తి కాలేదు. దార్కా చిరుతకన్నా వేగంగా కదిలేడు. అతడి వేళ్ళు మెరుపుకన్నా వేగంగా - అతడి గోళ్ళు డేగ
కన్నా వాడిగా -

వృద్ధు డు పెట్టిన కేక శ్మశానంలో మారుమ్రేగింది. కళ్ళనుంచి కారిన రక్తంతో కలిసి, ఆగిన గుండె చర్మం పైగా
జారి, వాలిన శరీరం మీదనుంచి భూమ్మీదకు జారిపోయింది.

భయంతో గుడ్లగూబ మరింత మునగ దీసుకుంది.

తీతువు అరవబోయి మానేసింది.

విషాచి కళ్ళు వృద్దు డు అచేతన శరీరంవైపు నిర్లిప్తంగా - దార్కా వైపు అభినందిస్తు న్నట్టూ చూశాయి.

"దార్కా -ఇప్పుడు నీకో మంత్రం నేర్పబోతున్నాను. దశ విధనాడులు గురించి నేను చెబ్తా ను. విను.ముక్కుకి
ఎడమభాగాన వుండేది ఇడా నాడి. కుడివైపు వుండేది పింగళనాడి. మధ్య నుండేది సుషుమ్న నాడి. కుడి నేత్ర
గాంధార నాడి - నాలుక ఆస్తిని నాడి -చెవి పుషానాడి. ఎడమ చెవి పయస్విని, నాభితో శంఖినీ నాడి
వుంటాయి.

పది నాడుల్నీ పది క్షుద్రదేవతలు ఆశ్రయించి వుంటాయి. వాటిని నువ్వు నీ చెప్పు చేతల్లోకి తీసుకున్న క్షణం
ఎవరినైనా నీ చేతబడేటట్టు చెయ్యవచ్చు. నువ్వు చేతబడి చేసినవాడు నువ్వు ఏ క్షుద్ర దేవతను ఆ రోజు కొలిస్తే
ఆ రోజు ఆ అంగం బాధతో గిలగిల లాడ్తా డు. పురుషుడికి నడుము నొప్పితో - స్త్రీకి పొత్తి కడుపు నొప్పితో
ప్రారంభమయ్యే ఈ చేతబడి ఎలా నేర్చుకోవాలో నీకు చెబ్తా ను దానికి ముందుగా నువ్వోమాట ఇవ్వాలి.

కాష్మోరాకు ఒక రోజు నిద్ర మనిషికి పదకొండు సంవత్సరాలు. పదకొండు సంవత్సరాల తర్వాత,


అసంతృప్తు డై కాష్మోరా నిద్ర లేస్తా డు. ఆ విలయతాండవానికి ఆజ్యం నువ్వు పోయాలి. ఎవరి మీద ఈ కాష్మోరా
ప్రయోగింపబడిందో నువ్వు కనుక్కోవాలి. వాళ్ళని కాష్మోరా పీక్కు తింటాడు.

అంతకన్నా ముఖ్య విషయం

పగ.

ఎవరు బిస్తా లోకి వచ్చింది?

కనుక్కోవటానికి ఆధారం లేదు. అందుకే నువ్వు నాగరిక ప్రపంచములోకి వెళ్ళాలి నీ క్షుద్రశక్తు ల సంగతి
ఎవరికీ తెలియకుండా వాళ్ళలో కలిసిపోవాలి. ఎలా కనుక్కుంటావో నాకు తెలియదు. కనుక్కోవాలి. ఆ
ముగ్గుర్నీ చంపాలి. నాకా మాట ఇవ్వు."

దార్కా మాట ఇస్తు న్నట్టు దక్షిణం వైపుకి చెయ్యి ఎత్తేడు. సంతృప్తు డయిన విషాచి ఆకుల దొప్ప పైకి ఎత్తా డు.

అందులో కాద్రా మెదడు ఉంది.

2
రోజులు గడుస్తు న్నాయి.

దార్కా గురువు దగ్గర ఒక్కొక్క మంత్రమే నేర్చుకుంటున్నాడు. అతడెంత తొందరగా ఆ విద్యని అవగాహన
చేసుకున్నాడంటే - గురువైన విషాచికే అది ఆశ్చర్యంగా వుంది. శరీరాన్ని ఎండబెట్టి, చలికి వణికించి ఎన్నో
బాధలకు గురవటాన్ని శరీరానికి ఎండబెట్టి, చలికి వణికించి ఎన్నో బాధలకు గురవటాన్ని శరీరానికి నేర్పిన మహా
మహా మంత్రగాళ్ళు కూడా చూపించలేని ఏకాగ్రతని అతడు చూపించాడు. తన ఎన్నిక తప్పనందుకు విషాచికి
ఆనందంగా వుంది.

రెండు సంవత్సరాలు గడిచినయ్.

దార్కాకి పన్నెండు సంవత్సరాలు వచ్చినయ్. వయసుకి మించిన ఎత్తు తో బలంగా తయారయ్యాడు.


కొద్దికొద్దిగా నూనుగు మీసాలు వచ్చినయ్. అన్నిటికన్నా మించినది అతడి కళ్ళలో తీక్షణత. ఒకసారి అతడి
కళ్ళలోకి చూసిన వాడెవడూ వాటిని మర్చిపోలేడు. దీపం దగ్గరికి ఆకర్షితమయ్యే శలభంలా
ఆకర్షింపబడతాడు.
మనిషి మాంత్రికుడు అవ్వడానికి పది సంవత్సరాలు, మహా మాంత్రికుడు అవ్వడానికి ఇరవై సంవత్సరాలూ,
యోగసిద్ధ తాంత్రికుడవ్వడానికి ఆ పైన ఇరవై అయిదు సంవత్సరాలూ పడతాయని గ్రంధాల్లో వ్రాసివుంది. ఆ
లెక్కన యాభయ్ ఐదు సంవత్సరాలు. కానీ ఎంతో అనుభవజ్ఞుడూ , మహాసిద్ధు డూ అయిన విషాచికే
ఆశ్చర్యంగా వుంది దార్కా ప్రగతి. మంత్రగాళ్లు నేర్చుకోవడానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టే
మామూలు చేతబడి అతడు నాలుగు సంవత్సరాలకల్లా వేర్చుకున్నాడు.

ఈ మధ్య దార్కా ఆదోలా వుండడాన్ని విషాచి పసిగట్టేడు. అయినా ఎందుకో అడగలేదు. అతడే చెప్తా డు
కదా అని. ఒకరోజు అతడి అంచనా ఫలించింది.

"నేనొకటి చెబ్దా మనుకున్నాను విషాచీ" అన్నాడు దార్కా.

"ఏమిటి"

దార్కా తటపటాయిస్తూ క్షణం ఆగేడు చెప్పాలా వద్దా అన్నట్టూ. విషాచి రెట్టించలేదు చెప్పమన్నట్టూ కొంచెం
నిశ్శబ్దం. తర్వాత దార్కా నెమ్మదిగా అన్నాడు.

ధ్యానముద్రలో నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకో చిత్రం కనబడ్తూంది.

"ఏమిటది?"

"ఐదు తలలున్న సింహం."

నడూస్తు న్న విషాచి చప్పున ఆగిపోయి "ఏమిటీ - సరిగ్గా చెప్పు" అన్నాడు.

"ఒక కమలంలో అది కన్పిస్తూంది. దానిపైన నాలుగు తలల రాక్షసుడు కనిపిస్తు న్నాడు. పద్మం మధ్యలో
నక్షత్రం ఒకటి ఉంది."

అప్పుడు విషాచి నవ్విన భయంకరమైన నవ్వు ఆ చుట్టు ప్రక్కల భయంకరంగా ప్రతిధ్వనించింది. "సాధించేవు
దార్కా. మహా యోగులకు కూడా సాధ్యంకాని యోగాన్ని నువ్వు సాధించేవు."

"ఏమి సాధించేను నేను."

"అది చెప్పేముందు నీకు మూలాధార చక్రం గురించి చెప్పాలి. వెన్నెముక కొసన ఒక చక్రం వుంది. అన్ని
చక్రా లకి ఆధారం కాబట్టే దాన్ని మూలాధార చక్రం అన్నారు. ఆ చక్రా నికి నాలుగు దళాలుంటాయి. అవి
రక్తవర్ణంలో వుంటాయి. వాటిమీద అక్షరాలుంటాయి. మధ్యలో ఐరావతం అనే ఏనుగు ఐదు తొండాల్తో
వుంటుంది. ఇదిగో ఇలా" అంటూ ఎండుకొమ్మతో గీసి చూపించేడు.
ఈ మూలాధార చక్రం దర్శనమైనవాడు మహాయోగి అవుతాడని సిద్ధు లు చెబ్తూ వుంటారు. లింగం పై
భాగంలో కుండలినీ శక్తి వుంది. ఆ కుండలిని లేపి సుషమ్న ద్వారా మూలాధారం నుంచి సహస్రారానికి చేర్చడం
రాజయోగం లక్ష్యం.

దార్కా ఈ యోగులు మనకి శత్రు వులు. వీరిని దేముడు రక్షిస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళకి మన ఈ చీకటి
ప్రపంచంలో ఒక మహా మాంత్రికుడు ఉద్భవించేడు. మూలాధార చక్రంలో అయిదు తలల సింహాన్ని
చూసినవాడు. సింహం ఏనుగు శత్రు వు. దార్కా! ఇక నిన్ను ఎదుర్కొనే వాడులేడు. నాతో రా"

ఎక్కడికీ అని అడగలేదు దార్కా. అడగడం అతడి చరిత్రలోనే లేదు. ఇద్దరూ చీకటిలో నడుస్తు న్నారు.

అరగంటలో శ్మశానం మధ్యకి చేరుకున్నారు.

చప్పున దార్కా ఆగేడు -

కాద్రా చేతిని చూసి,

భూమిలోంచి పైకి పొడుచుకు వచ్చిన ఎముకలు! చూపుడువేలూ - మధ్య వేలూ శిధిలమైపోయినయ్.


ఎముకలతో సహా.

"ఇలా రా" అన్న మాటలకి అక్కణ్నుంచి కదిలేడు దార్కా. కొంత దూరం తీసుకెళ్లి "ఇక్కడ తవ్వు"
అన్నాడు.

మారు మాట్లా డకుండా దార్కా తవ్వడం ప్రారంబించాడు. ఈ లోపులో విషాచి వెతికి రాళ్ళు పట్టు కొచ్చేడు.

రెండు గంటల్లో నిలువెత్తు గొయ్యి తయారయింది. అందులో రాళ్ళు పక్కల్న పేర్చాడు -విషాచి. అంచున
కూడా వాటిని కూర్చి, వాటి ఆలంబనతో మన్ను పేర్చాడు. పిరమిడ్ కట్టిన శాస్త్రజ్ఞుడి ఏకాగ్రత, నేర్పు అతడిలో
ఉంది. ఇదంతా ఎందుకో ఆడలేదు దార్కా.

"పద" అన్నాడు విషాచి పని పూర్తి చేసి.

ఇద్దరూ వెనుదిరిగేరు.

గ్రామం వేపు వస్తూంటే విషాచి అన్నాడు. "దార్కా! నిన్ను నా శిష్యుడిగా ఎందుకు స్వీకరించానో - నీ నుంచి
ఏం కోరుతున్నానో నీకు తెలుసు. ఇక నేను నీకు బోధించనవసరంలేదు. మూలాధార చక్రంలో సింహాన్ని
చూడగల్గిన నిన్ను - ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఏమీ చేయలేదు. కాద్రా చనిపోయిన రోజు నేను ఎందుకు నిన్ను నా
శిష్యుడుగా స్వీకరించానో నీకు తెలుసా?"
"తెలుసు"

"బిస్తా గ్రామంలోకి ముగ్గురు వచ్చి ఒక మాంత్రికుణ్నిం చంపేరు."

"వాళ్ళమీద పగ తీర్చుకోవాలి."

"అవును దార్కా! అందుకే నీకే విద్యలన్నీ నేర్పి - ప్రపంచంలో కెల్లా పెద్ద మాంత్రికుణ్ని చేసింది. ఇంత చిన్న
వయసులో ఇంత గొప్ప మంత్రగాడు ఎవరూలేరు. చరిత్రలో. దార్కా -మంత్రగాళ్ళ చీకటి జీవితపు చరిత్ర పుటల్లో
నీ పేరు ఎర్రటి అక్షరాల్తో వ్రాయబడుతుంది."

"కృతజ్ఞుడ్ని విషాచి నువ్వు నాకు నేర్పిన ఈ మహావిద్యలకి నేను నీకు సదా కృతజ్ఞుడ్ని అయివుంటాను. నీ
కోర్కె తీరుస్తా ను. కాద్రాని చంపిన ముగ్గురు వ్యక్తు ల్నీచంపుతాను. వాళ్ళని మామూలుగా చంపను విషాచీ -
ఒకర్ని మానసికంగా చంపుతాను. ఇంకొకర్ని మంత్రం శక్తితో దగ్దం చేస్తా ను. మరొకర్ని స్వయంగా ఈ చేతుల్తో
హత్యచేస్తా ను......."

విషాచి కళ్ళెత్తి దార్కావైపు చూసేడు. దార్కాలో ఆవేశంలేదు. వుద్వేగం లేదు. అతడి కళ్లు నిస్తేజంగా
వున్నాయి. కుందేలు మీదకి పంజా విసరబోయే పులిలా వున్నాడు. అతడి నిశ్చలత చూసి ఆ క్షణం విషాచికి
ఒళ్లు గగుర్పొడిచింది. ఎన్నో మరణాల్ని చూసిన వృద్దు డు కూడా ఆ క్షణం భయంతో వణికేడు. నెమ్మదిగా
అన్నాడు.

"ఎక్కడని వెతుకుతావు దార్కా వాళ్ళని? అర్ధరాత్రి వచ్చారు. అప్పుడే వెళ్ళిపోయారు."

దార్కా చెయ్యి బిగుసుకుంది. "వెతుకుతాను - భూమ్మీద - నీళ్ళలో - అగ్నిలో- గాలిలో. ఎక్కడున్నాసరే


వాళ్ళని పట్టు కుంటాను -నా మాట నమ్ము విషాచీ."

ఇద్దరూ దార్కా గుడిసె చేరుకున్నారు.

విషాచి నడుము గుడ్డలోంచి బొమ్మ ఒకటి తీసేడు. దానికి కాళ్ళూ చేతులూ లేవు.

"దీనిమీదే దార్కా - కాష్మోరాని ప్రయోగించింది. ఆఖరి క్షణంలో ఇది అగ్నిలో పడబోయేముందు వాళ్ళు
వచ్చి, మంత్రాన్ని రాకుండా చేసేరు. కాద్రాని పైశాచిక గణాలకి బలిచేశారు. ఈ బొమ్మ తప్ప మనకిక ఏ
ఆధారమూ లేదు" అంటూ అందించేడు.

దార్కా బొమ్మిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం నూట ఎనిమిది ముళ్ళు గుచ్చబడిన
బొమ్మ! గుడ్డలు శిధిలమైపోయి వున్నాయి. కర్మ సగంలో ఆగిపోయిన బొమ్మ. అతడి వేళ్ళు నెమ్మదిగా బొమ్మని
తడుముతున్నాయి.

అప్పుడు దొరికింది -
నడుము ప్రాంతములో

ముడివేయబడిన వెంట్రు క.

శిథిలమవకుండా యధాతథంగా.

అతడు సాలోచనగా విషాచివేపు చూసేడు.

ఈ ఒక్క వెంట్రు క సాయంతో ఎలా - ఎలా కనుక్కోవటం? ఈ వెంట్రు క ఎవరిమీద ప్రయోగింపబడిందో


తెలుసుకుంటే - వాళ్ళ తాలుకా ఎవరోచ్చారో కనుక్కోవడం -ఆ తరువాత సులభం. కానీ అసలీ వెంట్రు క
ఎవరిదో తెలుసుకోవడం ఎలా?

అతడు దాని గురించి మరి ఆలోచించకుండా లోపల పెట్టు కున్నాడు - విషాచి వెళ్ళడానికి సిద్ధపడి మళ్ళీ
వెనక్కి తిరిగి అన్నాడు

"దార్కా - కాద్రా మరణించిన రోజు రాత్రి నేను అతడి ఇంటికి వెళ్ళి శోధించాను మూల మూలలా వెతికాను,
ఎవరిమీద అతడు ప్రయోగము చేశాడో వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమోనని కాని ఏమీ దొరకలేదు."

దార్కా మాట్లా డలేదు.

"వెళ్ళొస్తా ను" అన్నాడు విషాచి

"మంచిది"

విషాచి చీకట్లో కలిసిపోయాడు. దార్కా అక్కడే అలాగే కొద్దిసేపు నిలబడి లోపలికెళ్ళాడు.

బాగా చీకటి పడింది.

అతడు వెల్లకిలా పడుకుని ఆలోచిస్తు న్నాడు.

ఈ వెంట్రు క సాయంతో చేతబడి కుదరదు. అయినా తను చేయవలసింది - కాద్రా ఎవరిమీద చేతబడిచేసి
కృతార్ధు డు కాలేకపోయాడో వాళ్ళని చంపడం కాదు. వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళెవరు? అది కనుక్కోవాలి.
ఎలా - ఎలా?

విషాచి. కాద్రా ఇల్లంతా వెతికానని అన్నాడు. ఏమీ దొరకలేదా?


మంత్రగాడు చనిపోతే ఆ ఇల్లు పాడు పెడ్తా డు. ఇంకెవరూ చేరరు ఖాళీగా వుండాల్సిందే.

ఒక్కసారి వెళ్లి వెతికితే......

అర్ధరాత్రి కావొస్తోంది.

తనపాక తలుపు దగ్గరకు వేసి, బయటకి నడిచేడు.

బిస్తా గ్రామం నిద్రపోతోంది. బయట వారు ఆ గ్రామాన్ని ఆ నిశిరాత్రి చూస్తే అమాయకంగా తల్లి ఒడిలో
నిద్రిస్తు న్న పాప గుర్తు వస్తుంది. కానీ అమాయకంగా కనబడే ప్రతి పాకలోనూ మూసిన తలుపులు వెనుక ఏదో
ఒక రైటువల్ ఎప్పుడూ జరుగుతూనే వుంటుందన్న విషయం చాలా కొద్దిమంది బయటవాళ్ళకు తెలుసు.

దార్కా దేన్నీ పట్టించుకోకుండా నడుస్తు న్నాడు. కుక్కలు కూడా మొరగడం లేదు. ఆ గ్రామంలో అర్దరాత్రి
నడిచే నిశాచరులు వాటికి కొత్త కాదు, పగలు నడిస్తేనే విచిత్రం.

ఐదు నిమిషాల్లో అతడు కాద్రా పాక చేరుకున్నాడు. మిగతావాటికి దూరంగా. తన ప్రత్యేకత


నిలుపుకుంటున్నట్టు గా వుంది. ఒకప్పటి వైభవాన్ని కోల్పోయిన కోట, గతస్మృతుల్ని తల్చుకుంటూ
శిధిలమైనట్టు గా వుంది.

అతడు ఒక్క క్షణం నిలబడి ఆ ఇంటివైపు చూసేడు.

కదిలిన తలుపు కుదుపుకు పై నుంచి ఒక చెద రాలి టప్ న నేలమీద పడింది - అంతే ఆ తరువాత గాడమైన
నిశ్శబ్దం. అతడు అడుగు ముందుకు వేశాడు. కాళ్ళ మధ్యనుంచి ఒక ఎలుక బెదురుతూ పరుగెత్తింది.

తనని రెండు కళ్ళు నిశితంగా గమనిస్తు న్నాయని అతడికి తెలీదు.

పాక మధ్యలో నిలబడి అతడు అగ్గిపుల్ల వెలిగించాడు.

ఆ తర్వాత నెమ్మదిగా వెతకడం మొదలు పెట్టా డు. వెతకడానికి ఏమీలేదు. శిధిలమైన పాత గుడ్డలూ
ఒకప్పుడు మహా అద్భుతాల్ని సృష్టించిన ఎముకలూ, పాత ట్రంకు పెట్టె - ముట్టు కోగానే పూడిపోయింది
దండెం.

అంతలో అగ్గిపుల్ల ఆరిపోయింది.

పాత తలుపు కొద్దిగా కదిలిన చప్పుడు, చల్లటిగాలి లోపలికి రివ్వున వీస్తూంది. అతడు రెండు చేతులూ
అడ్డు పెట్టి మరో అగ్గిపుల్ల వెలిగించాడు.
ఈసారి పైకప్పు వెతకటం మొదలు పెట్టా డు. చూరుకింద, తాటాకుల మధ్యా వెతికాడు. ఏమీ దొరకలేదు.

ఉన్నట్టుండి అతడు ఆగిపోయేడు.

ఎవరో తనని గమనిస్తు న్న భావన. అతడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ వెతకసాగాడు.

దక్షిణం వైపు చూరుకి అడ్డంగా వున్న తాటాకు తొలగించేడు. అక్కడ కనబడింది చిన్న తాటాకుల కట్ట,
చప్పున చేత్తో బయటకు లాగాడు. అదే అతడు చేసిన తప్పు. ఆ ఊపుకి కాగితాలు నుసినుసిగా
రాలిపోయాయి. నాలుగు సంవత్సరాల్నుంచి ఆ చూరులో శిధిలమైన కాగితాలు......

అతడు మోకాళ్ళ మీద వంగొని ఒక్కొక్క కాగితమే వెతకసాగేడు. చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోయిన
కాగితాలు. సున్నితంగా వాటిని ఒక్కొక్క దానినే వేరుచేస్తూ కావాల్సిన దానికోసం చదవసాగేడు.
అన్నీఒరియాలోనే వున్న కాగితాలు. అయిదు నిమిషాల తర్వాత దొరికింది ఒక కాగితం -అది తెలుగులో వుంది.

అతడికి తెలుగురాదు. ఆ కాగితం వైపే చూస్తు న్నాడు. అతడి మనసు చెబుతున్నది. ఆ కాగితమే కావల్సింది
అనీ. కానీ దాన్ని బయటకు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. గాలికి నుసినుసి అయిపోతుంది. మడత పెట్టడానికి
కూడా వీల్లేదు.

అతడో క్షమం ఆలోచించి, ఆ కాగితాన్ని అక్కడే వుంచి - లేచేడు పైన చిన్న రాయి వుంచి - లేచేడు బయటకు
రావడానికి ఉద్యుక్తు డై వెనుదిరిగి గుమ్మం దగ్గిర నిలబడ్డ వ్యక్తిని చూసి స్థా ణువైపోయాడు.

అక్కడ విషాచి నిలబడి వున్నాడు.

దార్కాని చూసి చిరునవ్వుతో అడుగు ముందుకేసి "సెహభాష్ దార్కా! నా అంచనా తప్పుకాలేదు. అప్పుడూ
కాలేదు. ఇప్పుడూ కాలేదు" అన్నాడు. దార్కా మాట్లా డలేదు. విషాచి దగ్గరకొచ్చి అన్నాడు.

"కాద్రా మరణించిన రోజు రాత్రే నేను ఈ పాకంతా వెతికేను. ఈ ఉత్తరం దొరికింది నాకు. సాయంత్రం నీకు
ఏమీ దొరకలేదు అని ఎందుకు చెప్పానో తెలుసా -"

దార్కా తెలీదన్నట్టు తలూపేడు.

"ఇంక ఇక్కడ పనిలేదు. పోదాం పద."

ఇద్దరూ బయటకు నడిచారు. రాత్రి పన్నెండున్నర కావొస్తూంది. ఎముకల్ని కొరికే చలి.

ఇద్దరూ నడుస్తుంటే విషాచి చెప్పడం మొదలు పెట్టా డు.


"కాద్రాని చంపిన వాళ్ళమీద పగతీర్చుకోవటం కోసం నిన్ను ఎన్నుకున్నాను దార్కా. నా అంచనా తప్పు
కాలేదని నువ్వు నిరూపించావు. చాలా తొందర తొందరగా విద్యలన్నీ నేర్చుకున్నావు. కానీ ఒక్క అనుమాత్రం
మాత్రం నాకు మిగిలిపోయింది. నేనెంత కసితో, పగతో రగిలి పోతున్నానో, అంత పట్టు దలా నీకూ వుందా లేదా
అని.....

అందుకే ఈ రోజు రాత్రి నీకు ఈ పాక పరిశోధన గురించి చెప్పాను. నిజంగా నీకు నా కున్నంత పగవుంటే -
ఈ రాత్రి నువ్వు నిద్రపోవు. ఆ పాకను నువ్వు స్వయంగా శోధిస్తే తప్ప నీకు నిద్ర పట్టదు. నా అంచనా
నిజమైంది. రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ వచ్చాను.

దార్కా! ఒక్క విషయం చెప్తా ను విను. మాంత్రికుడికి కావాల్సింది పట్టు దల. ఎటువంటి పరిస్థితుల్లోనూ
అతడు నిరాశ చెందకూడదు. ప్రేతాత్మలు సరదాగా అతడ్ని ఏడిపిస్తూ వుంటాయి. క్షుద్ర దేవతలు
పరీక్షిస్తూవుంటారు. వీటన్నింటికి తట్టు కొని నిలబడి వుండగలగాలి.... ఆ ఉత్తరం నాలుగు సంవత్సరాల క్రితం
మరింత జీవంతో వుంది. అప్పుడే చదివాను దాన్ని. కానీ దురదృష్టవశాత్తు అందులో నా కెక్కువ సమాచారం
దొరకలేదు. సంతకం పెట్టిన తల్లి అన్న పదాన్ని వదిలిపెట్టు . కాద్రా కాష్మోరాని ప్రయోగించింది తులసి అనే
పాపమీద. ఆ పాప ఆంద్ర దేశంలో వుంటుంది అంతే. అంతకన్నా ఎక్కువ తెలీదు. ఇప్పుడు చెప్పు దార్కా -
ఎలా -ఎలా -ఆ ముగ్గుర్నీ పట్టు కోవడం?"

నడుస్తు న్న దార్కా ఆగాడు. అతడితోపాటు కదుల్తూన్న ప్రకృతి కూడా ఆగినట్టు ది. అతడి కంఠం ట్రాన్స్ లో
వున్నట్టూ వినిపించింది.

"ఆ ముగ్గుర్నీ పట్టు కోవాలి అంటే ముందు తులసి ఎక్కడున్నదో కనుక్కోవాలి."

"ఎలా? ఆంధ్రదేశంలో ఆ పేరు మీద ఎంతమంది వుండివుంటారు?"

"ఉండరు" దార్కా కంఠం స్థిరంగా పలికింది. "తులసి అన్న పేరు మీద ఎక్కువమంది వుండి వుండరు.
వెతకాలి. ఒక్కోవూరు వెతుక్కుంటూ జల్లెడతో గాలించాలి. అంగుళం అంగుళం శోధించాలి."

విషాచి సాలోచనగా అతన్ని చూస్తూ ఇంకో ప్రశ్న వేశాడు. "కానీ నీకు దొరికిన తులసే మనకు కావాల్సిన
తులసి అని నమ్మకం ఏమిటి.. ఎలా దాన్ని ధృవపర్చుకోవడం?"

మొట్టమొదటిసారి దార్కా పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి.

"నీకు తెలియకనే అడుగుతున్నావా విషాచీ"

"నిజంగా తెలీదు దార్కా -ఈ సమస్యకు పరిష్కారం తెలియకే నాలుగు సంవత్సరాలనుంచీ


కొట్టు కుంటున్నా. ఏ ఆధారంతో తులసిని పట్టు కుంటావ్?"
దార్కా పెదవులమీద నవ్వు ఆగిపోయింది. కళ్ళు మామూలుగా మారిపోయినయ్. అవే కళ్ళు పులి
కుందేలు మీదకు పంజా విసరబోయే ముందు సాగించే నిస్తేజమైన చూపు.

"ఏ ఆధారంతో పట్టు కుంటావ్ దార్కా" ఆలస్యం భరించలేనట్టు అడిగేడు విషాచి. దార్కా నడుము
గుడ్డలోంచి శిధిలమైన బొమ్మ తీసేడు. దాని మధ్యగా కట్టబడిన వెంట్రు క లాగి, "ఈ వెంట్రు క సాయంతో"
అన్నాడు.

విషాచి నిర్విణ్ణుడై "వెంట్రు క సాయంతోనా -ఎలా?" అన్నాడు.

"నా గురువైన విషాచీ, నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా చెబ్తా విను. వెతగ్గా వెతగ్గా నాకు దొరికిన
తులసి మనకి కావల్సిన తులసో కాదో చెప్పాలంటే -ఆ దొరికిన తులసికి చేతబడి చెయ్యాలి. ఆ తులసి ఇప్పటికే
పదహారేళ్ళ వయసు వున్న అమ్మాయి అయివుంటుంది. అలాటి కన్నెపిల్లలకి ఎవరైనా చేతబడి చేయాలంటే -
వాళ్ళ రక్తపు గుడ్డను బొమ్మకు చుట్టి - వాళ్ల తాలుకా ఒక వస్తు వును బొమ్మతో కలిపి భూమిలో పాతి పెట్టా లి.
నేనన్న ఆ వస్తు వు ఈ 'వెంట్రు క' నేను సంపాదించిన రక్తపు గుడ్డా ఈ వస్తు వు ఒకే అమ్మాయివి అయన
పక్షంలో..... దార్కా నవ్వేడు. "అలా పాతిపెట్టిన పదిరోజుల్లో ఆ తులసికి నెలలు ఆగిపోతాయి. పొత్తికడుపులో
నొప్పితో చేతబడి ప్రారంభం అవుతుంది. ఆ తులసే మనకు కావాల్సిన తులసి. ఆ తరువాత ఆ ముగ్గురు ఎవరో
తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఆ తులసి మనకు కావాల్సిన అమ్మాయి కాకపోతే భద్రంగా బొమ్మని
తవ్వి తీయాలి. ఆ వెంట్రు కతో మళ్ళీ వెతకడం ప్రారంభించాలి. ఇంకో తులసి పేరున్న అమ్మాయి దొరికే వరకూ
అలా వెతుకుతూనే వుండాలి........"

విషాచి ఆనందంతో కదిలిపోయాడు. చేతులు సాచి దార్కాని కౌగిలించుకుని "అమోఘం అమోఘం దార్కా, నీ
తెలివితేటలు అపారం. ఇన్నాళ్ళకి నా పగ తీరుతుందనే నమ్మకం నాకు కల్గుతుంది" అన్నాడు ఆనందంతో.
అంతలో అతడి ముఖంలో సంశయం పొడచూపింది - "కానీ సమయం చాలా తక్కువ."

దార్కా విస్మయంతో "దేనికి?" అన్నాడు.

"అన్నీ చెప్పిన నీకు ఒక్క నేనొక్కటి మాత్రం చెప్పలేదు" అన్నాడు విషాచి - "అది కాష్మోరా"

దూరంగా ఒక గుడ్ల గూబ ఉన్నట్టుండి వికృతంగా అరిచింది. ఎక్కడో ఒక కుక్క వికృతంగా ఏడ్వడం
మొదలు పెట్టింది.

"కాద్రా తులసిమీద కాష్మోరాని ప్రయోగించాడు. కాద్రా మరణంతో కాష్మోరా అసంతృప్తు డై తిరిగి నిద్రలోకి
జారుకున్నాడు. మళ్ళీ పదకొండు సంవత్సరాల తర్వాత కాష్మోరా నిద్రలేస్తా డు. ఆ తులసి ఎవరో ఆమెను
పీల్చుకుతింటాడు ఎక్కడున్నా సరే అందుకని. ఈ లోపులోనే మనం ఆచూకీ తెలుసుకోవాలి. తులసి మరణం
జరగాలి. మనకి తులసితో సంబంధం లేదు."

"అవును ఇంకెంతో సమయం లేదు. అయిదారు సంవత్సరాలు -అంతే . ఈ లోపులో విశాలమైన ఆంధ్ర
దేశం అంతా గాలించాలి. అందులో ఎంత మంది తులసిలు దొరుకుతారో తెలీదు. ప్రతి తులసికీ పరీక్ష పెట్టా లి.
కాష్మోరా నిద్రలేచే లోపులో ఇది జరగాలి."

"నా అనుమానం అదికాదు దార్కా"

"మరి"

"నువ్వు వెళ్తు న్నది నాగరిక ప్రపంచంలోకి. నీ కన్నా తెలివి గల వాళ్ళు, మోసగాళ్ళు అక్కడ వుంటారు. దానికి
కూడా భయపడటంలేదు నేను. నీ వయసెంత?"

"పదహారు."

"పదహారేళ్ళ యువకుడివి. ఎలా? ఒక యువతి రక్తపు గుడ్డను సంపాదించగలవ్ నువ్వు?"

దార్కా నెమ్మదిగా అన్నాడు. "కష్టం- చాలా కష్టం - నాగరిక ప్రపంచంలో మరీ కష్టం. అందుకే కదా విషాచీ
నువ్వు ఈ పనికి నన్ను ఎన్నుకున్నావ్" ఆ మాటలకి విషాచి సాలోచనగా దార్కా కళ్ళలోకి చూసేడు. చాలాసేపు
ఇధ్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు కన్నార్పకుండా చూసుకున్నారు. దార్కా ముఖంలో ఏ భావం లేదు. విషాచి తల
పంకిస్తూ "చెయ్యగలవ్ నువ్వు చెయ్యగలవ్ నాకు తెలుసు" అన్నాడు.

"చేస్తా ను విషాచీ. నా ప్రాణం పోయేలోపులో ఆ ముగ్గురి ప్రాణాలు తియ్యటం ఖాయం. ఒకర్ని మానసికంగా
చంపుతాను. ఇంకొకర్ని దగ్ధం చేస్తా ను. మరొకర్ని......."

"నీ ప్రతిజ్ఞ నాకు గుర్తుంది దార్కా., దాన్ని నువ్వు మాటిమాటికీ జ్ఞాపకం చెయ్యక్కర్లేదు, నాలుగు
సంవత్సరాల క్రితం నువ్వు కాద్రా సమాధి దగ్గర చేసిన ప్రతిజ్ఞని ప్రతి క్షణమూ ప్రతి రాత్రీ నేను మననం
చేసుకుంటూనే వున్నాను. కానీ ఇంకొక్క అనుమానం నేను నీకు చేతబడి నేర్పాను, వశీకరణం నేర్పాను. దృష్టి
కేంద్రీకరించి ఎదుటి వస్తు వుని భస్మీపటలం చేసే అరుత్యుంగ విద్య నేర్పలేదు. మరి నీ శత్రు వుల్లో ఒకరిని ఎలా
భస్మం చేస్తా వు దార్కా?"

మొదటిసారి ఓడిపోయినట్టు తల వంచుకున్నాడు దార్కా.......విషాచి అతని భుజంమీద చెయ్యివేసి,


"నువ్వు మాట తప్పనక్కర్లేదు దార్కా, నీకు నేను ఆ విద్యను కూడా నేర్పుతాను"

దార్కా విస్మయానందాలు నిండిన మొహంతో "విషాచీ" అన్నాడు

"అవును. కొన్ని వేల సంవత్సరాలక్రితమే నిక్షిప్తమైపోయిన ఈ విద్య నా ఒక్కడికే తెలుసు. అది నా తోనే
అంతరించి పోవాలనుకున్నాను. కానీ ఈ క్షణం నా ప్రత్యర్ధు ల్ని చంపబోతున్న నీకు ఆఖరి విద్యగా దాన్ని
నేర్పబోతున్నాను. ఈ క్షణమే ఈ రాత్రేదాన్నినీకు నేర్పుతాను. రేపొద్దు న్న తెల్లవారకముందే బిస్తా గ్రామాన్ని
వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి . సరిగ్గా ఐదు సంవత్సరాల కాలంలో నీ పని పూర్తవ్వాలి. నాగరికుల మద్య
నాగరీకుడిలా మెలగుతూ ఈ కార్యం సాధించాలి. నీ శత్రు వును తెలుసుకున్న మరుక్షణం నీ కళ్ళతో బడబాగ్ని
సృష్టించి అతడిని చంపాలి. ఇంకో అయిదు నిమిషాల్లో వెలుగు చుక్క పొడిచే సమయానికి నీకా విద్య
నేర్పుతాను. పద దార్కా శ్మశానానికి పద."

దార్కా కదల్లేదు.

"రేపు నేను వెళ్ళిపోతున్నాను. ఇన్నేల్ళుగా నాలో మెదుల్తు న్న ఒక అనుమానానికి ఈ చివరి క్షణం జవాబు
చెప్పు, ఈ గ్రామ పెద్దవి నువ్వు. అది సరే, కానీ మరో ముగ్గురు వచ్చి ఒక మంత్రగాణ్ని చంపితే దానికింత పగతో
నువ్వు రగిలిపోవటం దేనికి?"

విషాచి నెమ్మదిగా తలెత్తా డు. ఆ నీరవంలో అతడి కంఠం అస్పష్టంగా పలికింది. "కాద్రా నా కొడుకు కాబట్టి"

దార్కా విస్మయంతో అతడి దృఢమైన శరీరం కేసి చూస్తూ "విషాచీ, నీ వయసెంత?" అని అడిగేడు.

"ఎంతనుకుంటున్నావింతకాలం" అంటూ నవ్వేడు.

"యేభయి సంవత్సరాలు"

"మూర్ఖుడా! నా వయసు నూట ముప్ఫయి అయిదేళ్ళు"

3
శ్మశానపు నడిబొడ్డు లో గురువైన విషాచి, దార్కాకి అరత్యుంగ విద్య నేర్పుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల
క్రితమే మంత్రగాళ్ళ చీకటి ప్రపంచంలో నిక్షిప్తమైపోయిన కాష్మోరా ప్రయోగం -అరత్యుంగ లాంటి విద్యలు
తెలిసిన ఒకే ఒక మాంత్రికుడు ఆ విద్యల్ని శిష్యుడికి నేర్పుతాడు.

దశకషాయ మూలమైన నల్ల వుప్పి, కోలాకువున్న, చేదుపొల్లి వరగోకి, నేల ఉసిరిక మొదలైన మాతృకల
కషాయాన్ని దార్కా చేత తాగించేడు. తెల్లగురివింద వేళ్ళను మారేడాకులు రసంలో నూరి కంటి రెప్పలకు
పట్టించేడు.

(ఈ మూలికలు సంపాదించటం కోసం మంత్రగాళ్ళు చెట్లను నేలనుంచి పీకబోయే ముందు ఈ మంత్రం


చదువుతారు.

ఓం భేతాలాశ్చ పిశాచశ్చ రాక్షసాశ్చ సరీసృపాః


అపసర్పంతు తే సర్వే వృక్షా దస్మాచ్ఛివాజ్ఞయా

అంటే - భేతాళ పిశాచ రాక్షస సర్పములు శివుని ఆజ్ఞచే ఈ చెట్టు కు దూరంగా వుండమని అర్ధం.
క్షుద్రదేవతోపాసకులు కూడా శివుని ఆరాధించం ఇక్కడ విశేషం.)
దార్కా శ్మశానపు నడిబొడ్డు న నగ్నంగా పడుకొని వున్నాడు. అతడు చెప్పసాగేడు.

"మంత్రగాళ్ళ చరిత్రలో అత్యంత విశిష్టమైన స్థా నాన్ని పొందబోతున్న ఓ దార్కా - నీకు నేను చెప్పబోతున్న ఈ
విద్య చాలాకాలం క్రితమే నిరోధించబడింది. ప్రేతగణాలకు మూలాధిపతి అయిన శివుడు అనేవాడికి ఫాలనేత్రం
వుండేది అనీ -దాన్ని తెరిచిన మరుక్షణం ఎదురుగా ఉండే వస్తు వైనా భస్మీపటలం అయిపోయేదని పూర్వులు
చెప్పేవారు. ప్రేతాత్మలకు గురువైన ఆ శివుడితో సమానంగా స్థా నం పొందటానికి ఏ మంత్రగాడూ
ఇష్టపడకపోవటంతో ఈ విద్య మాలాటి వృద్ధు ల చేతుల్తోనే సమాప్తం కావాల్సింది.

కానీ దార్కా -ఈ రోజు నేను నీ కిది చెబుతున్నాను. కేవలం నీవన్న "దగ్ద" అన్నమాట నిలబెట్టడానికే -నా
స్వార్ధంతో నీ కిది చెబుతున్నాను. జాగ్రత్తగా విను ఈ ప్రయోగం ఇంతవరకూ ఎవరిమీదా ప్రయోగింపబడలేదు.
దశరగాళాన్ని కలిపితే వచ్చే ఈ మిశ్రమం అత్యంత ప్రతిభావంతమైనదని పూర్వులు చెప్పేవారు. ఈ విషాలన్నీ
ఒక్కొక్కటీ ఒక్కొక్కలా ప్రమాదకరమైనవి. పాములనుంచీ, తేలునుంచీ, వృక్షాలనుంచీ, తీగెలనుంచి సేకరించిన
ఏ ఒక్కటై నా చాలు మనిషిని సమూలంగా కూలగొట్టడానికి. కానీ ఈ పది కలిపితే అది ఔషదం అవుతుందని
అనటం చాలా ఆశ్చర్యకరం. ఇది ఇంకా ఘోరమైన విషంగా కూడా మారవచ్చు. అప్పుడు నీ కన్నులు పోయే
ప్రమాదం ఉంది. ఈ మిశ్రమం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో నిజంగా నాకు తెలియదు. దార్కా కేవలం గ్రంధాల్లో
చదివి దాన్ని ప్రయోగించి నిన్ను గ్రు డ్డివాణ్ని చెయ్యటం నా కిష్టం లేదు. అందువల్ల నీ ఒక్క కన్ను మీద మాత్రమే
ఈ ప్రయోగం చేస్తా ను"

దార్కా వింటున్నాడు.

"ఈ మిశ్రమం కంట్లో పడిన మరుక్షణం నీ కన్నుపోతే -అందుకు నన్నుద్వేషించవుగా దార్కా."

"ద్వేషించను విషాచీ నా ప్రాణం పోయినా సరే."

"ఈ విద్య నీకు అలవడిన క్షణంనుంచీ నువ్వు తళతళలాడే నీటివంక ఎప్పుపడూ తదేకంగా చూడకు. నీ
కంటిని ఎప్పుడూ చేతితో రుద్దకు. అలా రుద్దిన మరుక్షణం అందులోంచి మంట బయల్దేరుతుంది. నేను
చెప్పినవి మర్చిపోకు దార్కా, ఇప్పుడు నీ కన్ను తెరువు - ఎడమ కన్ను. నేనీ మిశ్రమాన్ని నీ నేత్రాంతగర్భంలో
పోయబోతున్నాను."

తెల్లవారబోతున్నది. రాత్రంతా వేటసాగించిన గుడ్లగూబ కూడా నిద్రకుపక్రమించినట్లుంది. కేవలం


ఆకాశమూ, నక్షత్రమూ, పృధ్వీ చెట్లూ చేమలూ మాత్రమే ఆ తంతు గమనిస్తు న్నాయి.

దార్కా కళ్ళు తెరుచుకుని చూస్తు న్నాడు. అతడు వెల్లకిలా పడుకొని వున్నాడు. ఎదురుగా వినీలాకాశం
కనిపిస్తూంది. అంతలో విషాచి చెయ్యి తన ఎడమ కన్ను మీదకు చేరడం కనిపించింది. అరచేతుల మధ్య చిన్న
దొప్పలోని దశవిధ మిశ్రమం నెమ్మదిగా వంగుతూంది. అతడు కన్నార్పకుండా చూస్తు న్నాడు. వంగిన
దొప్పలోంచి ఒక్క చుక్క కిందికి జారి అతడి తెల్లటి కనుగుడ్డు మధ్యలో నల్లటి కనుపాపమీద "టప్" మని
పడింది.

అప్పుడు దార్కా పెట్టిన కేక ఆ శ్మశానం దాటి బిస్తా గ్రామాన్ని ప్రవేశించింది. బాధతో అతడు అరిచే అరుపులకి
బిస్తా గ్రామపు తల్లు లు పిల్లల్ని దగ్గిరకు తీసుకుపడుకున్నారు. పెద్దలు బైటకి రాబోయి, ఆ కేక దార్కాదని
గ్రహించి, శ్మశానం నుంచి వస్తుందని విని- రావడం మానేశారు. దార్కా శ్మశానంలో నేల మీద పొర్లు తున్నాడు
అతడి నగ్నమైన శరీరం నిండా ముళ్ళు గ్రు చ్చుకుని మరింత బాధ పెడుతున్నాయి. అయినా కను బాధతో
పోల్చుకుంటే అదో లెక్కలోనిది కాదు. వేళ్ళు కన్నులోకి దోపి గుడ్డు పెరికి బైట పారెయ్యాలన్నంత బాధ -పెద్ద
యంత్రం భగభగ మండే మంటల్ని ఎగదోసినట్లు .

అయిదు నిముషాలకి అతడి బాధ ఉపశమించి, మిగిలిన ఒక కన్ను తెరిచి చూస్తే -

విషాచి మోకాళ్లమీద తలవంచుకుని ఉన్నాడు. మొట్టమొదటిసారి అతడి జీవితంలో విషాదం కనిపించింది.

"క్షమించు దార్కా" అన్నాడు కంపిస్తు న్న కంఠంతో.

"ఇందులో క్షమించడానికేముంది విషాచీ " అన్నాడు దార్కా, "నువ్వు ముందే చెప్పావుగా కన్ను పోయినా
పోవచ్చని."

విషాచి మాట్లా డలేదు.

అతడి మౌనాన్ని ఇంకోలా అర్ధం చేసుకున్నాడు దార్కా వాళ్ళ ముగ్గుర్ని చంపడానికి నా ఈ ఒక్క కన్ను
చాలు దాని గురించి అనుమానపడకు" అన్నాడు.

విషాచి దాన్ని వినిపించుకోలేదు. తన ఆలోచనల్లోనే కొంచెం సేపుండి -ఒక నిర్ణయానికొచ్చినట్లు గా తలపంకించి


ఇలా అన్నాడు.

"దార్కా -నేను చెప్పేది జాగ్రత్తగా విను. మంత్రగాడు పరిపూర్ణుడవటానికి పదహారు స్థా యిలున్నాయి. ఎంతో
భయంకరమైనది అని చెప్పబడ్తు న్న చేతబడి నిజానికి ఎనిమిదో మెట్టు మాత్రమే. ఆ తరువాత కొన్ని విద్యల
తరువాత కాష్మోరా.

"దార్కా - ప్రతివాడికీ కొద్దిగా స్వార్ధం వుంటుంది. ఆ స్వార్ధంతోనే నీకు చివరి విద్య అయిన కాష్మోరా
నేర్పలేదు. కేవలం నా కొడుకైన కాద్రాకి మాత్రమే నేర్పాను. నా మరణంతో ఆ విద్య అంతరించి
పోవాలనుకున్నాను. కానీ ఈ రోజు తెలిసీ తెలియని విద్య ప్రయోగించి నీ కన్ను పోగొట్టేను. దాని ప్రతిగా నీకు
కాష్మోరా నేర్పుతాను. ఈ క్షణమే నిన్ను నా కొడుకుగా స్వీకరిస్తు ననాను."

"విషాచీ"

"అవును! తెల్లవారేలోపులో నేను నీకిది నేర్పుతాను. ఈ విద్యతో నీ చదువు పూర్తవుతుంది. నిన్ను మించిన
మంత్రగాడు ఇక ప్రపంచంలో ఎవరూ వుండరు. లే- దార్కా యిలా దక్షిణం దిక్కుగా కూర్చో. నీ నగ్న శరీరాన్ని
యీ ప్రేతాత్మలు సరీగ్గా చూడనీ. నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు పఠించు. అంతా
వెలుగురేఖ పొడవకముందే జరిగిపోవాలి సుమా. చీకటి విడిపోతే ప్రేతాత్మలు వెళ్ళిపోతాయి. త్వరత్వరగా
పఠించు" అంటూ మంత్రం చెప్పాడు.

దార్కా మంత్రం విన్నాడు. మంత్రం చెప్పేటప్పుడు నోట్లో ఏ చిన్న పదార్ధమూ వుండకూడదు. దానికి నీళ్ళు
కావాలి. అదే అడిగేడు.

విషాచి నవ్వేడు.

"దార్కా మంత్రగాడికి కావల్సినవి అనుకున్నప్పుడు దొరకవు. దొరికిన వాటితోనే సంతృప్తి పర్చుకోవాలి.


నిజంగా నీ దగ్గర నీరేలేదా?"

దార్కాకి క్షణంలో అర్ధమైంది.

మంత్రవిద్యలో ఏదీ క్షుద్రం కాదు.

రెండు నిముషాల్లో నోరు ప్రక్షాళన మయింది.

నూట ఎనిమిది సార్లు మంత్రపఠనం పూర్తి అయింది.

ఆ తర్వాత అతడు నిద్రపోతున్న కాష్మోరాని ఎట్లు లేపాలో చెప్పాడు. పూజకి కావాల్సిన వస్తు వులు, వాటిని
ఉపయోగించే విధానం తెలిపాడు. క్షుద్ర కర్మలన్నీ స్త్రీ పురుషుల జననేంద్రియాల మీదే జరుగుతాయి. అతడు
దార్కాని ఉత్తర దిక్కుగా నిలబెట్టా డు. ఆరడుగుల దార్కా నగ్నంగా అలా నిలబడి వుంటే గ్రీకు శిల్పం
నిలబడినట్టు వుంది.

అతడి పురుషత్వాన్ని చూసి ప్రకృతికి కూడా అతడితో రమించాలని బుద్ధి పుట్టింది కాబోలు - దక్షిణం నుంచి
గాలి రివ్వున వీచి అతన్ని స్పృశించి సంతృప్తి పొందుతూంది. అతడిని అలా చూసి విషాచి ఇంకేమైనా వుందా?
మంత్రగాడవుతున్నాడు కాబట్టి బయపడ్తా రేమో గానీ లేకపోతే బిస్తా గ్రామపు యువతులు ఇతడ్ని ఇలా
బ్రతకనిచ్చేవారా! అతడికి నవ్వొచ్చింది. ఈ యువకుడు ఇపుడు నాగరిక ప్రపంచంలోకి వెళుతున్నాడు. అక్కడి
స్త్రీలకు ఇతడి మంత్రశక్తు ల సంగతి తెలియదుగా మరి, ఇతణ్ని ఇలా వుంచుతారా? ఏమో నాగరిక ప్రపంచంలో
నైతిక విలువలకి ప్రాధాన్యత ఎక్కువటగా! చూడాలి.

ఒకవైపు విషాచి ఆలోచిస్తూనే తన పని చేసుకుపోతున్నాడు.

కాల్చడానికి వూచ కావాలి. ముందు అనుకోకపోవడం వల్ల వూచ తెచ్చుకోలేదు. కాలికున్న కడియం విప్పి
వంకర తీసి ఎర్రగా కాల్చేడు.
.................

దార్కా కళ్ళు నెమ్మదిగా విప్పేడు.

విషాచి సంతృప్తితో తల పంకించాడు. "నీ కిక నేర్పవలసింది ఏమీ లేదు. దార్కా, ప్రపంచంలో నిన్ను మించిన
వాడెవడూ లేడు."

"కృతజ్ఞుడ్ని"

"నేనీ క్షణమే నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం కోసం బయలుదేరుతున్నాను. ఇక బిస్తా లోకి వెళ్ళే అవసరం లేదు
విషాచీ! అయిదు సంవత్సరాల లోపులో ఆ ముగ్గుర్నీ చంపి నీకు ఆ మంచి వార్త చెప్పడానికి వస్తా ను.
అంతవరకూ నా కోసం వేచివుండు"

"నీ మీద నమ్మకం ఉంది. వేచి వుండక్కర్లేదు."

"అంటే" అన్నాడు అర్ధంకానట్టు దార్కా.

విషాచి నవ్వి వూరుకున్నాడు. తూర్పున వెలుగురేఖ నెమ్మదిగా విచ్చుకొంటూంది. నిశ్శబ్దంగా ప్రేతాత్మలు


తమ స్థా నాన్ని చేరుకుంటూంటే - ప్రపంచం నిద్రలేస్తూందనటానికి నిదర్శనంగా పక్షులు కిలకిల
మొదలయ్యాయి.

"వెళ్ళొస్తా ను"

"మంచిది.నీకు శుభమగు గాక"

దార్కా మంత్రగాళ్ళ ఆనవాయితీ ప్రకారం వంగి గురువు కటి ప్రదేశంలో తలవంచి నమస్కారం చేశేడు.
విషాచి అతడి తలమీద ఎడమ చేత్తో స్పృశించి ఏదో మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాడు. అతడు లేవగానే
దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తు కొని "వెళ్ళిరా" అన్నాడు.

ఆ తరువాత విషాచి కదిలేడు.

అక్కడికి పది గజాల దూరంలో అతడు దార్కా కలిసి తవ్విన గొయ్యి వుంది. అన్నీ రాళ్ళూ -రాళ్ళ మీద మట్టీ
పేర్చబడి వుంది. అతడు గుంటలోకి దిగేడు.

విషాచి మరణించాడని తెలిస్తే గ్రామం గ్రామం కదిలి వస్తుంది. కపాలం వలుస్తా రు. ఆ మెదడుని
తింటాడెవడో. ఈ ప్రపంచంలో ఒకడే మహా మాంత్రికుడుండాలి. ఒకప్పుడు ఇద్దరుండేవారు కాద్రా విషాచీలు.
తండ్రీ కొడుకులు.

కాద్రా మెదడు దార్కా తిని మాంత్రికుడయ్యాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో విషాచి మరణిస్తే -గ్రామస్థు ల్లో
ఇంకో దార్కా ఉద్భవిస్తా డు. అది విషాచికి ఇష్టం లేదు. తన మరణం గురించి బిస్తా లో తెలియకూడదు. మూడో
కంటికి తెలియకుండా అది జరిగిపోవాలి. తన మెదడు తనతోనే నిక్షిప్తం అయి పోవాలి. తనలోనే -తనతోనే

అతడు గుంటలో చిన్నరాయిని కదిపేడు.

ముందుగా చిన్న శబ్దం అయింది. ఆ తరువాత అది క్రమంగా పెరుగుతూపోయింది సన్నటి ఇసుక,
రాళ్ళమీద కప్పబడిపోతుననాయి. నిముషంలో అది నిండిపోయింది. ఆ తర్వాత రాళ్ళమధ్యనుండి
తోసుకుంటూ ఒక చెయ్యి బయటకు వచ్చింది. అతి కష్టం మీద బయటకొచ్చిన ఆ చెయ్యి లోపల మనిషి
అంతిమ క్షణాన్ని భయంకరంగా సూచిస్తూ టపటపా కొట్టు కుంది. పిడికిల మూసుకుని వేగంగా విడిచేయ
సాగింది. తరువాత దాని వేగం తగ్గింది. ఆ తరువాత రెండు నిముషాలకి అది అచేతనమయింది.

4
విషాచి ఆత్మార్పణం గావించిన సంగతి దార్కాకు తెలీదు. ఆ సమయానికే అతడు ప్రయాణంలో సగ దూరం
వెల్ళిపోయాడు. మరో రెండు గంటలు గడిచేసరికల్లా అతడు రైల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తు న్నాడు.

కేవలం గోచీతో ప్రయాణం చేస్తు న్న అతడిని కంపార్ట్ మెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తు న్నారు. కొందరు
ముసి ముసిగా నవ్వుకుంటున్నారు.

అతడు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

రైలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు లో ప్రవేశిస్తూంది. టికెట్ కలెక్టర్ ఒక్కొక్కరినే చెక్ చేసుకుంటూ వస్తు న్నాడు.

దార్కాకి తెలీదు ట్రైన్ లో టికెట్ కొని ఎక్కాలని. ఒకవేళ తెల్సినా కూడా ఏమీ లాభం లేదు. అతడి వద్ద
డబ్బేమీ లేదు.

టికెట్ కలెక్టర్ దగ్గరకు వస్తు న్నాడు. దార్కా అటూ ఇటూ చూసేడు. ఒక్కొక్కరూ తమ దగ్గరున్న పచ్చ
కాగితం ముక్క చూపిస్తుంటే అతనికి అర్ధమయింది. తనూ అలాంటిది చూపించాలని

టికెట్ కలెక్టర్ వచ్చి చెయ్యి సాచాడు.

దార్కా కదల్లేదు. తలెత్తి చూసేడు. అతడి మొహంలో ఏ భావమూ లేదు.


"టికెట్ ప్లీజ్"

దార్కా లేదన్నట్టూ అస్పష్టంగా తలూపేడు.

ఆ కంపార్ట్ మెంట్ లో ఒకమ్మాయి తమవైపే చూస్తూవుండడం ఆ టికెట్ కలెక్టర్ గమనించేడు. ఒకప్పుడు


అతడు ఫుట్ బాల్ ప్లేయరు. తన పర్సనాలిటీ మీద అందంమీద అంత నమ్మకం వున్నవాడు. దార్కా రెక్క
పట్టు కుని లేపి, "లెగు బే" అంటూ కంపార్ట్ మెంటు చివరివరకూ లాక్కొచ్చాడు.

అక్కడెవరో అన్నీ మూటలు అడ్డు గా పెట్టా రు. వాటి వెనక్కి వచ్చి తరువాత ఎవరూ లేకుండా వుండడం
చూసి "ఊ! రూపాయి తియ్యి" అన్నాడు.

గిరిజనులు ఆ ప్రాంతంలో రూపాయిచ్చి ప్రయాణం చేస్తా రని దార్కాకు తెలియదు.

"రూపాయి కూడా లేదా"

దార్కా లేదన్నట్టు తలూపక మౌనం వహించాడు. అది తనని అవమానించటంగా భావించి, టికెట్ కలెక్టర్
అతడి చెంపమీద ఛెళ్ళున కొట్టేడు. అనాగరికులైన ఈ ఒరియా ప్రజలమీద అధికారులు ఇంతకన్నా ఎక్కువ
దారుణంగానే ప్రవర్తిస్తా రు. అందులో ఓ అమ్మాయి ప్రేక్షకురాలు.

దార్కా ఈ దెబ్బ ఊహించలేదు. నిలదొక్కుకోలేక పక్కకు తూలి పడ్డా డు. చెక్క తలకి టప్ మని
కొట్టు కుంది. టికెట్ కలెక్టర్ చేతులు దులుపుకుంటూ "వచ్చే స్టేషన్ లో దిగు లేకపోతే చర్మం వొలిచేస్తా ను" అని
లోపలికి వెళ్ళబోయి, దార్కా మొహం చూసి ఆగిపోయాడు.

దార్కా చేతులమీద లేస్తు న్నాడు.

అందుక్కాదు అతడు ఆగింది.

ఆ మొహాన్ని చూసి.

అవే కళ్ళు, నిస్తేజమైన కళ్ళు, పంజా విసరబోయే ముందు పులి కళ్ళలో కృరత్వం..... నిస్తేజంతో కలిసి....
తలుపులన్నీ వేసి కొట్టబోతే పిల్లి కళ్ళలో కనబడే తెగింపు.

- ఎందుకో తెలీదు టికెట్ కలెక్టర్ వెన్నులో సన్నగా చలి, తరంగంలా మొదలయి వళ్ళంతా వ్యాపించింది. ఆ
భయంతోనే అసంకల్పితంగా కాలు విసిరేడు. అది దార్కా గెడ్డం కింద తగిలింది. అతడు వెనక్కి పడ్డా డు.
దార్కాకి ఒక కన్ను కనపడదు. అందువల్ల తనవేపు పక్కనుంచి వస్తు న్న కాలుని చూసుకోలేదు. వాష్ బేసిన్
గొట్టం అతడి పెదవికి తగిలి చిట్లింది. తడిమొహానికి అంటింది. టికెట్ కలెక్టర్ బూటుతోపాటు ఎగిరిన మట్టి
అది. దార్కా మొహం ఎర్రగా కందిపోయింది. నెమ్మదిగా లేస్తు న్నాడు.
వాష్ బేసిన్ పట్టు కుని అతడు నెమ్మదిగా లేచి నిలబడ్డా డు. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అది చూసి
టికెట్ కలెక్టర్ మళ్లీ చెయ్యి ఎత్తా డు.

ఎందుకు నాయనా పాపం అతణ్ని అలా కొడ్తా వ్?

తమ తమ బోన్లలోకి చప్పున వెళ్ళిపోయిన పులుల్లా ఇద్దరూ మామూలుగా మారిపోయారు. దార్కా తలెత్తి


చూశాడు. ఖద్దరు బట్టల్లో ఒకాయన నిలబడి వున్నాడు. ఆయన నుదురు ఆకాశంలా వింది. నుదుటి మీద
బొట్టు సూర్యుడిలా ప్రకాశిస్తుంది.

టికెట్ కలెక్టర్ అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు. దార్కా లేచి తన సీటు దగ్గరికి వచ్చి ఆయన పక్కన
కూర్చున్నాడు.

"నీకు తెలుగు రాదా"

దార్కా రాదన్నట్టు తలూపేడు. ఆ తరువాత సంభాషణ ఒరియాలో జరిగింది.

దార్కా సాలోచనగా ఆయన వైపు చూశాడు. అవును నేర్చుకోవాలి. కనీసపు తెలుగయినా రాకపోతే ఈ
తెలుగుదేశంలో కష్టం. అందులోనూ పూర్తి చేయవలసిన పని కూడా తక్కువేమీ కాదు. ఎంతోమందితో
మాట్లా డితే గానీ ఆ తులసి ఎక్కడ వున్నది తెలీదు. తెలిసిన ఈ కొద్ది ఒరియా భాషతో అది సాధ్యం కాదు.
నేర్చుకోవాలి. నేర్చుకోవాలి......

"నేను మీ ఇంట్లో పని చేస్తా ను. నాకు తెలుగు నేర్పండి"

"ఏం పని చేస్తా వ్ నువ్వు?"

"ఏ పని అయినా సరే"

ఆయన ఒప్పుకుంటున్నట్టు తలూపేడు.

దార్కా అడిగేడు తెలుగు నేర్చుకోవటానికి, మామూలుగా మాట్లా డటానికి ఎంతకాలం పడ్తుంది?"

"ఒక సంవత్సరం"

దార్కా ఉలిక్కిపడి "ఒక సంవత్సరమా" అన్నాడు. సమయం అసలే తక్కువ ఉన్నవి ఐదారు సంవత్సరాలు.
కాష్మోరా నిద్రలేచి తులసిని చంపకముందే ఆమెను కనుక్కోవాలి. అందులో ఒక సంవత్సరం ఈ తెలుగు
నేర్చుకోవడానికే సరిపోతే ఎలా?
"అంతకన్నా తక్కువ కాలంలో నేర్చుకోవడానికి వీలుపడదా?"

"మాములుగా మాట్లా డటం, వ్రాయటం వీటికైతే ఆర్నెల్లు చాలు. అంతకన్నా తక్కువ ఎటువంటి
పరిస్థితిలోనూ సాధ్యంకాదు. 'సరస్వతీ నమస్తు భ్యం' అన్న పద్యం నేర్చుకవడానికే నాల్గు రోజులు పడ్తుంది."

"ఏం పద్యం అది?"

"సరస్వతీ నమస్తు భ్యం..... వరదే కామ రూపిణీ....." ఆయన చెప్పారు. చెబుతున్నంతసేపూ దార్కా కళ్ళు
మూసుకుని విన్నాడు. విషాచి మంత్రం చెబ్తుంటే ఎలా విన్నాడో అంత శ్రద్దగా విన్నాడు.

పద్యం పూర్తయింది అనగానే దార్కా పెదవులు కదిలాయి. ఒక్క అచ్చు కూడా పొల్లు బోకుండా అతడు
తిరిగి పద్యాన్ని వప్పచెబుతుంటే ఆయన తెల్లబోయి చూడసాగేడు. పద్యం పూర్తి చేసి దార్కా కళ్ళు తెరిచి
అడిగేడు - "ఇప్పుడు చెప్పండి తెలుగు నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది?"

ఆయన విస్మయం నుంచి కోలుకోకుండానే అసంకల్పితంగా "నెల" అన్నాడు.

రైలు వేగం తగ్గింది.

ఆయన చేతిసంచి పట్టు కొని "దిగు" అన్నాడు.

దార్కా లేచాడు.

టికెట్ కలెక్టర్ వస్తు న్నాడు. దార్కా అతడివేపు చూసి నవ్వేడు. టికెట్ కలెక్టర్ మొహం చిట్లించి "దిగు బే"
అన్నాడు. దార్కా మళ్ళీ అతడి వేపు నవ్వి దిగిపోయేడు.

"వీడెవడో పిచ్చివాడిలా వున్నాడు" అనుకున్నాడు టికెట్ కలెక్టర్. వాష్ బేసిన్ దగ్గర కొట్టినప్పుడు. దార్కా
పడిలేవబోతూ, తన బూటుకాలు తొక్కిన మట్టిని సేకరించాడనీ అది తనతో పాటు తీసుకెళుతున్నాడనీ అతడికి
తెలీదు.

బిస్తా గ్రామస్తు లు తమకు జరిగిన అన్యాయాన్ని చితిలో కూడా మర్చిపోరు........

*********
"ఇదే మా ఇల్లు " అన్నారు. ఆచార్యులు ఒరియాలో.

తలెత్తి చూశాడు దార్కా. చాలా పెద్ద ఇల్లు . పురాతనమైనది ఒకప్పటి పూర్వపు వైభవాన్ని కోల్పోయింది.
"మా పూర్వీకులు విజయనగర సంస్థా నాదీశుల దగ్గర కొలువు చేసేవారు. మా తాతగారి నాన్నగారు
దారివెంట వెళుతూంటే పశుపక్ష్యాదులు కూడా వినమ్రతతో తలవంచేవని ప్రతీతి" ఆయన పెదవులమీద జీవం
లేని నవ్వు వెలసింది.. "ఇప్పుడు మేము తెలుగు అధ్యాపకులుగా మిగిలిపోయేము" అంటూ లోపలికి నడిచేరు,
దార్కా అనుసరించేడు.

"చాలా పెద్ద ఇల్లు మాది. ఈ ఇంట్లో నువ్వు నీకు కావలసినంత కాలం నిరభ్యంతరంగా వుండవచ్చు"

"ఊరికే వుండను. మీ ఇంట్లో పని చేస్తా ను. ఉన్నంత కాలమూ ఏదో ఒక పని చేస్తా ను"

"సరే! ఏదో ఒకటి చెద్దూగాన్లే రేపటినుంచి ప్రారంభిస్తా ను"

"కాదు, ఇప్పటినుంచే" అన్నాడు దార్కా. ఆయన ఆశ్చర్యంగా చూసేరు.

సమయం విలువ దార్కాకి బాగా తెలుస్తూంది. నిజానికి సమస్య ఇంత క్లిష్టమైందని అతడు అనుకోలేదు.
అతడి గురువైన విషాచికి కూడా తెలీదు. ఇన్ని రకాలయిన చదువులు వుంటాయని, వాళ్ళకున్న పరిజ్ఞానంతో
పెద్ద వూళ్ళలో, వూరుకొక కళాశాల వుంటుందనీ, అది వెతికితే సరిపోతుందనీ అనుకున్నారు. కానీ ఆచార్యుల
వారితో జరిగిన సంభాషణతో దార్కాకి తెలిసింది - అమ్మాయిలు ఇంజనీరింగు, మెడిసిన్ పాలిటెక్నిక్ కూడా
చదువుతారని. అప్పుడర్ధమయిందతడికి తన పని ఎంత కష్టమో.

రాత్రి పదయింది.

ఒక్క రోజులో దార్కా నేర్చుకున్న తెలుగు, ఆయనకి ఎంతో విస్మయాన్ని కలిగించింది. దార్కా తెలుగులో, ఆ
భాషలో ఎంతో పరిచయం వున్నవాడిలా "నాకీ రోజు భోజనం వద్దు మీరు చేసెయ్యండి" అనగలిగాడు
మొదటిరోజే.

*************
దార్కాకి రెండోరోజు అర్ధమయింది, తను రాష్ట్రంలో కొంచెం దూరం ముందుకొచ్చేసేడని, ఆంధ్రలో
మొట్టమొదటి పట్టణం విజయనగరం అనుకున్నాడు. పార్వతీపురం, బొబ్బిలిలో కూడా కళాశాలలు వున్నట్టు
తెలిసింది వెళ్ళి పరిశీలించి వచ్చేడు. తులసి అన్న పేరున్న అమ్మాయి దొరకలేదు. పొద్దు న్నే వెళ్ళి సాయంత్రం
విజయనగరం వచ్చేసేవాడు.

చూస్తూ వుండగానే పదిరోజులు గడిచిపోయాయి. అనుకున్నదాని కన్నా చాలా తొందరగా చదువు


నేర్చుకుంటున్నాడు దార్కా. తెలుగేకాదు., ఇంగ్లీష్ కూడా. అక్షరాల్ని కూడబలుక్కుని చదవడం - ఇంగ్లీషు
పదాల్ని అర్ధం చేసుకోవడం కూడా తొందర్లోనే అలవడింది. అతడు ఒక్కనిముషం కూడా వధాపరిచేవాడు
కాదు. చాలా తక్కువసేపు నిద్రపోయేవాడు. ఇంటిపని చేస్తూ కూడా చదువు గురించే ఆలోచించేవాడు.
ఆ రోజు అమావాస్య!

రాత్రి దాదాపు పన్నెండు అవుతూ వుండగా అతడు లేచాడు. ఒక పని మిగిలిపోయింది. టికెట్ కలెక్టర్ మీద
కసి తీర్చుకోవడం ..... అతడు అసలు ఆ పని మొదటి రోజే చేయవలసింది నిజానికి మంత్రగాళ్ళు తమ పనులు
నిర్వర్తించడానికి అమావాస్య, పూర్ణమి అని ఏమీ లేవు కానీ బాగా చీకటిగా వుంటుందనే వాళ్ళు అమావాస్య
ఎన్నుకుంటారు.

అతడు స్మశానం చేరుకునే సరికి రాత్రి పన్నెండయింది. అతడికి అది కొత్తగా వుంది. బిస్తా గ్రామపు స్మశానాన్ని
మాత్రమే చూసేడు అతడు. అయినా దాని గురించి పట్టించుకోకుండా తన పనికి ఉపక్రమించేడు.

తనతోపాటు తెచ్చిన మట్టిని దొప్పలో వుంచి దక్షిణ దిక్కుగా కూర్చున్నాడు. నడుము గుడ్డలోంచి చిన్న
గుడ్డ తీసేడు కాలి మట్టి దాని కాళ్ళకు రాసేడు. చిన్న గొయ్యి తీసి, ఆ బొమ్మని నడుము వరకూ పాతి పెట్టా డు.
అతడు ఈ పనిని చాలా సునాయాసంగా చాలా అనుభవజ్ఞుడైన డాక్టరు ఒక చిన్న టాన్సిల్స్ ఆపరేషన్ ఎంత
సులభంగా నిర్వర్తిస్తా డో అలా చేస్తు న్నాడు.

నిజానికి ఇది అతడికి చాలా చిన్న విద్య కాష్మోరా నేర్చినవాడికి చేతబడి......

అతడు దక్షిణం దిక్కుగా తిరిగి మంత్రం చదవబోతుంటే అఫ్పుడు పడింది అతడి భుజంమీద చెయ్యి.
మెరుపులా వెనక్కి తిరిగాడు.

వెనుక ఆచార్యులవారు నిలబడి వున్నారు.

అతడు విస్మయంనుంచి తేరుకోవటానికి నిముషం పట్టింది. నిజానికి చేతబడి చేస్తు న్న మాంత్రికుణ్ని
ఎవరయినా చూసినా, ఆపినా అలా చూసినవాణ్ని మంత్రగాడు చంపడమో, తను చావడమో చేస్తా డు,
ప్రాణాలతో వదలడు.

కానీ ఇక్కడ వున్నది గురువయిన ఆచార్యులు. గాఢమయిన నిశ్శబ్దంలో కొద్దిగా కదిలి "ఇప్పుడు చెప్పు-
ఎవరు నువ్వు?" అడిగాడాయన.

దార్కా మాట్లా డలేదు.

"ఒరిస్సా నుంచి ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఈ స్మశానంలో నీకేం పని? మా కుటుంబాన్ని
సర్వనాశనం చేయడానికే ఈ రాత్రి ఇలా వచ్చావు కదూ?" ఆయన కంఠం అతణ్ని నిలదీసింది.

కర్కోటకుడూ -కారుణ్యం లేని మాంత్రికుడు అయిన దార్కాయే ఈ మాటలకి కదిలిపోయేడు.. "నేనా ....
మీ కుటుంబాన్నా...." అన్నాడు విచలితుడై..... "ఎందుకు?"
"మరి ఏమిటి ఈ పని?"

"ఆ రోజు అన్యాయంగా నన్ను కొట్టిన ఆ టికెట్ కలెక్టర్ అంతం చూడడానికి."

"చేతబడి చేస్తు న్నావ్ కదూ" సూటిగా అడిగాడు "దార్కా! అసలు నువ్వెవరు?"

దార్కా చెప్పాడు తమ పూర్తి మాంత్రికుడ్ని ముగ్గురు చంపిన సంగతీ -తన పగ సంగతి అంతా చెప్పి అన్నాడు
-" ఆ టికెట్ కలెక్టర్ నా గురించి ఏమనుకున్నాడు? అంతు తేల్చందే నేను వూరుకోను"

"అంత గొప్పవాడివా నువ్వు?"

"కాష్మోరా ప్రయోగించగల ఏకైక మాంత్రికుణ్ని"

"ఎంతో నిష్టతో మంత్రాన్ని నేర్చిన నీకే ఇంత అహం వుంటే, ఒక మామూలు మనిషైన ఆ టికెట్ కలెక్టర్ కి
ఎంతుండాలి? అందుకే అతడు నిన్ను కొట్టేడు. మంత్రంలో రుషత్వం పొందిన నువ్వు అతణ్ని క్షమించలేవూ!"

దార్కా మాట్లా డలేదు.

"ప్రపంచంలో ఎవరూ సాధించలేనిదీ, చేయలేనిదీ అయిన కాష్మోరాని నీ చెప్పుచేతుల్లోకి తీసుకోగలిగిన ఓ


మహా మాంత్రికుడా! ఈ ప్రేక్షకుడికోసం నీ విద్యల్లో ఒకదానిని ప్రదర్శించగలవా?"

ఆ మాటతో దార్కా కదిలేడు. అతడి మొహం మామూలుగా మారిపోయింది. అవే కళ్ళు, నిస్తేజంగా....
ఉన్నట్టుండి అతడు కేక పెట్టేడు. అది ధ్వనించి.... ప్రతి ధ్వనించింది..... దిగంతాల్లో మార్మోగింది. స్మశానం
కదిలిపోయింది. అతడి పూర్వీకులైన కాద్రా, విషాచీల ప్రేతాత్మలు కూడా భయంతో వణికిపోయేలా వుంది ఆ
కేక......

అతడు చూపుడు వేలుతో ఒక వృక్షాన్ని చూపిస్తూ అన్నాడు.

"నా సేవల్తో సంతుష్టు డై రురుడ్ని నేను పిలుస్తా ను, కళకళ లాడుతున్న ఈ మర్రిచెట్టు ని క్షణంలో మసి
చెయ్యమని ఆజ్ఞాపిస్తు న్నాను" అని మౌనం వహించేడు. అతడి పెదవులు అస్పష్టంగా కదిలేయి. మొదటి అక్షరం
'మ' మరో అక్షరం "హ" -ఇలా అతడి మంత్రం పూర్తయింది.

గాలిలో చిన్న కదలిక క్షణంలో ఉధృతం అయింది. ప్రేతాత్మలు గుసగుసలాడుతున్న ధ్వని.

కానీ అంతలో మళ్లీ మామూలు వాతావరణం నెలకొంది. చెట్టు అలాగే వుంది ఆచార్యులవారు అలాగే
చూస్తు న్నారు.
దార్కా మొహం ఎర్రబడింది. మరోసారి మంత్రం పఠించేడు. కానీ చెట్టు లో ఏ మార్పూలేదు.
అంచెలంచెలుగా పెద్ద పెద్ద దేవతలందర్నీ పిలిచాడు. రురుడు - కాలుడు- రుద్రు డు -భైరవుడు.

అతడిలో కసి పెరిగిపోతూంది. ఆవేశంతో వూగిపోతూ అధిష్టా న దేవత "క్షిత్" నే ఎలుగెత్తి ఆహ్వానించాడు.
క్షిత్ కూడా పూజ్యము పవిత్రము అయిన స్థలానికి రావడానికి భయపడ్డట్టు మౌనం వహించింది.

దార్కా మోకాళ్ళ మీద కూలిపోయేడు. సర్వశక్తి సంపన్నుడనని అనుకుంటున్న ఆ మహా మాంత్రికుడు,


సామాన్యంగా కనబడే ఒక పండితుడి ముందు ఓడిపోయాడు. తలవంచి అన్నాడు."పదహారు సంవత్సరాల
ఆకుంఠిత దీక్షతో నేనెంతో నేర్చుకున్నానని అనుకున్నాను. కానీ ఇంకా నేర్చుకోవలసింది చాలా వుందని
అర్దమయింది. ఇరవై రెండు అంశాల క్షుద్ర దేవతలకన్నా గొప్ప దేవత ఎవరు మీ చెప్పు చేతల్లో వున్నారు?
కాష్మోరా, క్షిత్ లను కూడా శాసించగల ఏ దేవతని మీరు పూజిస్తు న్నారు? చెప్పండి."

ఆయన నవ్వేరు, "నాకు యే దేవతా తెలీదు బాబూ" అన్నారు. "పచ్చగా కళకళలాడే ఓ చెట్టు అన్యాయంగా
నాశనం అవకుండా కాపాడమని నా ఇష్టదైవాన్ని ఏకాగ్రతతో, నమ్మకంతో, ఆర్ద్రతతో ప్రార్ధించానంతే. నువ్వు చాలా
గొప్ప మాంత్రికుడివి. కానీ మంత్రం కన్నా నమ్మకం గొప్పది దార్కా. నమ్మకం కన్నా నిజాయితీ ఇంకా గొప్పది"
ఆ నిరవంలో ఆయన కంఠం మృదువుగా వినిపించింది. "చెట్టు ను చంపడం చాలా సులభం దార్కా. తల్లి
వేరును కత్తిరిస్తే చాలు, చచ్చిపోతుంది. కానీ బ్రతికించడం.......అది చాలా కష్టం. నువ్వు సర్వశక్ిత
సంపన్నుడివి. నీ విద్యల్ని ఇలా వృధాపరచుకోకు" అప్పటివరకూ వున్న మత్తు లోంచి బయటకు వచ్చినట్టు
దార్కా తల విదిలించి, మామూలు మనిషై పోయాడు. పూర్వపు పగ మళ్ళీ కళ్ళలోంచి వచ్చింది.

"నా కన్యాయం చెయ్యని చెట్టు ని నేను నాశనం చెయ్యదల్చుకుంటే మీ యిష్టదైవం అడ్డు పడింది. కానీ మా
కాద్రాని చంపిన ఆ ముగ్గుర్నీ నేను చంపుతూంటే ఏ దేవతా అడ్డు పడదు. అలా అడ్డు పడితే ఆ దేవతతో
స్వయంగా నేనే పోరాడతాను. ప్రాణం పోయేవరకూ పోరాడతాను."

"నీ నిర్ణయం మారదా దార్కా?"

"మారదు. నా గురువన విషాచికి గురుదక్షిణగా ఆ ముగ్గుర్నీ ప్రేతాత్మలుగా మార్చిఅర్పంచనిదే నా ప్రతిజ్ఞ


నెరవేరదు"

"ఆ గురువుకేనా నువ్వు దక్షిణ ఇచ్చేది -ఈ గురువుకి ఇవ్వవా?"

ఊహించని ఈ ప్రశ్నకి దార్కా ఖంగుతిని, అంతలోనే సర్దు కుని - "ఏమడిగినా ఇస్తా ను ఆ ముగ్గుర్నీ
చంపవద్దనడం తప్ప......"

ఆచార్యులవారు చెయ్యి సాచేరు. "ప్రమాణం చయ్యి. నీ కున్న ఈ మహిమాన్వితమైన శక్తు ల్ని


అమాయకులైన ప్రజలమీద ప్రయోగించనని."

దార్కా నెమ్మదిగా తలెత్తా డు.


"నా గురువైన మీకు, నేను నమ్మిన క్షుద్రవిద్యలమీద ప్రమాణం చేసి చెబ్తు న్నాను. ఆ ముగ్గుర్నీ నా పద
తీర్చుకోవడానికి కావల్సినవాళ్ళనీ తప్ప మరో వ్యక్తిని "నేను చంపను- నా ప్రాణం పోయే పరిస్థితుల్లోనైనా సరే,
కానీ నేను చెప్పిన ఆ ముగ్గురి విషయం కూడా ఎక్కడా వెల్లడి చేయనని మీరూ నాకు మాటివ్వాలి"

"మంచిది వెళ్ళిరా దార్కా.......నీకు తెలుసుగా మా ఇంట్లో నీకు స్థా నం లేదిక"

"అఖ్కర్లేదు స్వామీ. మీకు నా కృతజ్ఞతలు నన్ను ఆశీర్వదించండి."

"క్షమించు దార్కా" తల తిప్పుకున్నాడాయన.

దార్కా వంగి మంత్రగాళ్ళ రీతిలో ఆయన కటికి నమస్కరించి దక్షిణం దిక్కుగా సాగిపోయేడు.

ఆయన అటే చూస్తూ నిలబడ్డా డు.

ఈ యువకుడు మహామాంత్రికుడు అందులో సంశయం లేదు. నాగరిక ప్రపంచంలో నిశ్శబ్దంగా పాములా


జారిపోతున్న ఈ తాంత్రికుడ్నిఎవరు ఆపగలరు?

రోజులు గడుస్తు న్నాయి.

వారాలు నెలలవుతున్నాయి. నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. నాలుగు సంవత్సరాలు గడిచినయ్.

అతడి వేట కొనసాగుతూనే వుంది. నిరాశ చెందకుండా వేట సాగిస్తూనే వున్నాడు. ముందు పెద్ద పెద్ద
పట్టణాల్లో అన్వేషించటం ప్రారంభించాడు, తరువాత చిన్నవూర్లు .

మొదట్లో కష్టమయ్యేది తరువాత అతడికి సులువు తెలిసింది. కొన్ని సత్యాలు కూడా తెలిశాయి. డబ్బుతో ఏ
పనయినా సాధించవచ్చు........మనిషి మానసికంగా బలహీనుడు....... ఇలాంటివి వాటితో తన పని
నిర్వర్తించుకునేవాడు.

అతడికి డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాలేదు. చిన్న చిన్న మాజిక్కులు చేసేవాళ్ళు ఎలాటి విద్యల్ని
ప్రదర్శిస్తరో అలాటివి అతడు చాలా సునాయాసంగా ప్రదర్శించేవాడు. అయితే ఎక్కువ సమయం డబ్బు
సంపాదనకోసం వెచ్చించేవాడు కాదు. పక్కవూరు వెళ్ళడానికి మాత్రమే. అంతే మళ్ళీ వేట.

అన్వేషణ సాగుతూంది.
అతడికి గడ్డం పెరిగింది. కళ్ళు మరింత లోతుగా వెళ్ళాయి. మొహంలో తొలి యవ్వనపు లేతదనం పోయి
మరింత పగా, కసి, చోటు చేసుకున్నాయి.

ఆఖరి సంవత్సరం.

********
స్త్రీల కళాశాల అన్న బోర్డు లకింద ఒక క్షణం నిలబడ్డా డు దార్కా. సమయం పది కావొస్తుంది. రకరకాల చీరల్లో
అమ్మాయిలు ఒద్దికగా నడుచుకుంటూ ఆవరణలోకి ప్రవేశిస్తు న్నారు. వాళ్ళకు తెలీదు మనుషుల రక్తా న్ని
దేవతలకు తర్పణంగా ఇచ్చే మహామాంత్రికుడు తమలో ఒకరికోసం రాత్రింబవళ్ళు అన్వేషిస్తు న్నాడని.

అతడు లోపలకు ప్రవేశించబోతూవుంటే గూర్ఖా ఆపుచేసేడు.

"ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారు. కావాలంటే నేనిక్కడే నిలబడి వుంటా, వెళ్ళి అడిగిరా" అన్నాడు దార్కా.
ఎంతకాలం నుంచో ప్రయోగిస్తు న్న ట్రిక్ అది ఎక్కడా ఫెయిల్ అవలేదు.

రెండు నిముషాల తర్వాత అతడు ఆఫీసు రూమువైపు వెళుతున్నాడు. పెద్ద కాంపౌండు మధ్యలో
అక్కడక్కడా బిల్డింగ్స్ విసిరేసినట్టు వున్నాయి. బయట బస్సులరొద లోపలికి వినిపించడంలేదు. రోడ్డు
కిరువైపులా చెట్లు .

అమ్మాయిలు అతడిని చిత్రంగా చూస్తు న్నారు. సెక్స్ గురించి తెలిసినవాళ్ళు ఆ దృష్టితోనూ -తెలియని వాళ్ళు
ఆరాధనా పూర్వకంగానూ.

అతడు ఆఫీసులోకి ప్రవేశించాడు. ఉన్న నలుగురు ప్యూన్లలోనూ ముసలివాణ్ని ఎన్నుకున్నాడు


యువకులకన్నా ముసలివాళ్ళు డబ్బుకు తొందరగా లొంగుతారని అతడి అనుభవం నేర్పింది.

"పెళ్లి చూపులుంటాయిగా బాబూ - దానికన్నా ముందే తొందరెందుకు" పది రూపాయలు కాగితం


అందుకుంటూ అన్నాడు ఫ్యూను. అతడు నవ్వి వూరుకున్నాడు. ఫ్యూన్ లోపలికి వెళ్ళాడు.

అయిదు నిమిషాల తర్వాత ఓ పది రిజిస్టర్లు తీసుకొచ్చి ముందు పడేశాడు. ప్రిన్సిపాల్ కన్నా అతడే ఆ
కాలేజీలో ఎక్కువ పలుకుబడి వున్నవాడిలా వున్నాడు. "వెతికి ఏ క్లా సో చెప్పండి బాబూ, క్షణాలమీద
చూపిస్తా ను" అన్నాడు.

"అంత సులభం కాదు" అనుకున్నాడు దార్కా తనలో తానే. కొన్ని వందల రోజుల్నుంచీ, కొన్నివేల రిజిస్టర్లు
వెతగ్గా దొరికినది, క్షణాల్లో దొరుకుతుందా!

అతడు ఫైనలియర్ తో ప్రారంభించేడు. ఆమె వయసు ఇరవై అని అతడికి తెలుసు కాబట్టి.
ఆర్ట్సులో ఎవరూ లేరు. బై.పి.సి చూసేడు చూపుడు వేలుతో చాలా వేగంగా చదువుతూ పోతున్నాడు. ఆ
పని చేసీ చేసీ అతడికి బాగా అలవాటు అయిపోయింది. లక్ష్మీ, లలిత, సుశీల ఈ పేర్లే ఎక్కువగా తగిలేవి.

రిజిస్టర్లో ఎక్కడా తులసి పేరు లేదు.

**********
రాత్రి పదిన్నరయింది. సత్రంలో ఒకమూల పడుకున్న దార్కా లేచి కూర్చున్నాడు.

అతడు తన నడుము గుడ్డలోంచి ఒక పుల్లకట్ట తీసేడు. నిజానికి అవి పన్నెండు కట్టలు. ఒక్కో కట్టలోనూ
ముప్పై పుల్లలున్నాయి. ఒక్కొక్క పుల్లకి అయిదు కణుపులున్నాయి. ఆ కట్టని విషాచి ఇచ్చాడు. బిస్తా లో
మంత్రగాడిగా వున్న రోజుల్లో అమావాస్య పూర్ణిమ తప్ప ఇంకేమీ తెలీదు. అయిదు సంవత్సరాల కాలాన్ని గుర్తు
వుంచుకోవడం కోసం విషాచి ఆ కట్టని ఇఛ్చాడు.

ముప్పై పుల్లలూ ముప్పై రోజులకు సూచన! పన్నెండు కట్టలూ ఒక్కోకట్ట ఒక్కొక్క నెలకి, ఒక్కొక్క కణపూ
ఒక్కొక్క సంవత్సరానికి అంటే అయిదు కణుపులు అయిదు సంవత్సరాలు.

ప్రతిరోజూ పుల్లలో ఒక్కొక్క కణుపుని విరుచుకుంటూ వస్తు న్నాడు. దార్కా. రోజు దాటి రోజు వస్తే పుల్ల
చిన్నదవుతూంది.

అన్ని పుల్లలూ విరిగిపోయిన రోజు.

అయిదు సంవత్సరాలూ అయిపోయినట్టన్నమాట. ఆఖరి పుల్ల విరిగేరోజున కాష్మోరా నిద్ర లేస్తా డు. ఆ
తులసిని విరుచుకు తింటాడు. ఎక్కడున్నా సరే.

ఈ లోపులో తులసిని పట్టు కోవాలి. తన దగ్గరున్న వెంట్రు కతో ఆ తులసిని నిరూపించాలి లేకపోతే తన
కడుపు తనే చీల్చుకుని చచ్చిపోతానని అతడు ప్రతిజ్ఞ చేసేడు.

చేతిలో పుల్లలకట్ట చిన్నదై పోయింది.

చాలా చిన్నదై పోయింది.

6
సిద్దేశ్వరీ ఆలయం నాలుగు అంతస్థు ల భవనం
తెల్లవారుఝామున నాలుగున్నరకి అక్కడి భక్తు లు నిద్రలేస్తా రు. సిద్దేశ్వరికి స్నానం చేయించి, అర్చన
చేస్తా రు. ఆ తరువాత ఆమె పూజలో కూర్చుంటారు. దాదాపు ఎనిమిదింటికి ఆమె అతిధి గృహంలోకి వస్తా రు.
అప్పటికే అక్కడ జనం తండోపతండాలుగా వేచి వుంటారు. మంత్రు లు , రాజకీయ నాయకులు, భక్తు లు,
ఐ.ఏ.యస్. ఆఫీసర్లు ఒకరనేమిటి - అందరూ అక్కడ ఆమె దర్శనం కోసం వేచి వుంటారు. ఆమె ప్రదాన
శిష్యుడు, సదానంద చక్రవర్తి అక్కడ నిజిటర్స్ ని లోపలికి పంపుతాడు.

సిద్దేశ్వరిలో మహిమాన్విత మైన శక్తి వుంది.

ఆమె ప్రశ్నలకి సమాధానం చెబ్తా రు. ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్పగలరు. అదికాదు గొప్పతనం. ఆమె
ప్రశ్న చూడకుండానే జవాబు చెప్పగలరు అదీ విశేషం.

మానవుల్లో అతీతశక్తు లు చూపించగలవారంటే, వారికి ఎంత ప్రాచుర్యం లభిస్తుందో అందరికీ తెలుసు.


అందులో సిద్దేశ్వరి దేవీ ఉపాసకురాలు.

మొదట్లో ఆమెకంత ప్రాచుర్యం లభించలేదు కానీ ఒక మంత్రి గారి మనవడు మరణశయ్య మీద వుండగా
ఆమె 'ఏమీ ఫర్లేదని' చెప్పింది. ఆ అబ్బాయికి తర్వాత నయం అవటంతో, ఆ మంత్రిగారు సిద్దేశ్వరీ భవనానికి
విరివిగా విరాళాలు అందజెయ్యటమే గాక, తన శక్తిమేర ఇప్పించాడు కూడా. ఆ తరువాత దేశ ప్రజల్ని మరింత
మూర్ఖత్వం వైపు నడిపించడానికి అలవాటుపడ్డ రాజకీయ నాయకుడు ఒకాయన దేవీ దర్శనంకోసం రావడంతో
కథ మలుపు తిరిగింది.

మూడు నెలల్లో సిద్దేశ్వరీ ఆలయంకు ఎంత ప్రాదాన్యత లభించిందంటే - ప్రభుత్వమే ఆ భవంతి వరకూ
రోడ్డు వేయించి, కరెంటు పెట్టించేసింది. తీర్ధయాత్రలకు వచ్చే ప్రజల్ని అదుపులో పెట్టడం కోసం చిన్న పోలీసు
స్టేషను వెలిసింది. దుకాణాలూ, హోటళ్ళ సంగతి చెప్పక్కర్లేదు.

సిద్ధేశ్వరి అలవాట్లు చాలా విచిత్రమైనవి. ఆమె తిండీ, నీరూ ముట్టదు. కేవలం గాలి భోంచేస్తా రు అంతేకాదు,
రోజుకి ఎనిమిది గంటలు ధ్యాన ముద్రలో వుంటారు. భక్తు లు ప్రతిరోజూ ఆమె ధ్యానంలోకి వెళ్ళడాన్ని అత్యంత
భక్తిశ్రద్దలతో చూస్తా రు. ఒక చిన్న ఇనుప పెట్టెలో ఆమె కూర్చుని వుండగా, ప్రధాన శిష్యుడు తలుపు వేస్తా డు.
ఆమె ఆరాధ్యదైవమైన దేవీ విగ్రహం ఒళ్ళో వుంచుకుని, ఆమె లోపల ధ్యానంలోకి ప్రవేశిస్తుంది. ఎనిమిది గంటలు
తరువాత భక్తు ల సమక్షంలో ఆమె వున్న పెట్టె తెరవబడుతుంది. ఆమె తల చుట్టూ ఉజ్వలమైన వెలుగు
ప్రకాశిస్తూ వుండగా ఆమె అందులోంచి బైటకి వస్తుంది. ఆమె కళ్ళు దీప్తితో వెలుగుతూ వుంటాయి. ఆమె
మొహం దయతో ప్రకాశిస్తూ వుంటుంది. భక్తు లు భక్తితో, గౌరవంతో హర్షధ్వానాలు చేస్తా రు.

ఆ తర్వాత ఆమె మళ్లీ అతిథి గృహంలో కూర్చుని భక్తు ల ప్రశ్నలకు జవాబులు చెప్తుంది.

ఆ గృహంలో ఒక పొడవైన టేబిల్ వుంది. దానికి ఒక చివర సింహాసనంలాంటి కుర్చీలో ఆమె


కూర్చుంటుంది. వచ్చిన వ్యక్తి దూరంగా కుర్చీలో కూర్చుని, తన ప్రశ్న వ్రాస్తా డు. ఆ తర్వాత ఆ కాగితాన్ని
మడిచి తన జేబులో పెట్టు కుని, పక్క గదిలో వున్న దేవీ విగ్రహం ముందు మోకరిల్లు తాడు. తరువాత వ చ్చి
విశాలమైన హాలులో నిశ్శబ్దంగా కూర్చుంటాడు. తరువాత సిద్దేశ్వరీ దేవి ప్రసాదాన్ని స్వయంగా అందిస్తుంది. ఆ
పళ్ళెంలో అతడి ప్రశ్నకు జవాబు వుంటుంది.

భక్తు డు ఆశ్చర్యంతో తలమునకలవుతాడు. కాదుకాదు భక్తితో సాష్టాంగపడి ప్రణమిల్లు తాడు. విభ్రాంతితో


తనకొచ్చిన జవాబు చూసుకుని పరవశుడవుతాడు. తన శక్తి వంచన లేకుండా కానుకలు
సమర్పించుకొంటాడు.

హేతువాద సంస్థ ప్రెసిడెంటూ , సైన్సు లెక్చరరూ అయిన ఓ డాక్టర్ ఇనపట్టె రహస్యాన్ని స్వయంగా
శోధించడానికి పూనుకున్నాడు.

సిద్ధేశ్వరి కరుణించి ఆ రోజున తన గదిలోనే యోగముద్రలోకి వెళ్ళడానికి అంగీకరించారు. ఆమె బదులు అదే
సమయానికి ఆ హేతువాద సంస్థా ధ్యక్షుడు ఆ ఇనుప పెట్టె లాంటి విశ్రామ స్థా నంలో కూర్చున్నాడు. తలుపులు
వేసేయబడ్డా యి.

రెండు గంటల త్రవాత ధ్యాన ముద్రలోనే దేవి పలికింది. "ఆ అజ్ఞాన డాక్టర్ని పాపం వెలికితీయండి
నాయనలారా" అని భక్తు లు తలుపులు తెరిచి ఊపిరాడక కొన ప్రాణంతో వున్న ఆయన్ని బయటకీడ్చారు ఆ
తరువాత ఆయన తన హేతువాదాన్ని వదిలి దేవి శిష్యకోటిలో ఒకడయ్యేడు అది వేరే సంగతి.

ఇంకా కొంత మంది వీటిని శోధించడానికి ప్రయత్నించారు గానీ సాక్షాత్ భగవత్ స్వరూపులయిన దేవిమీద
ఇలా పరీక్షలు జరపడాన్ని ప్రజలు ముక్త కంఠంతో ప్రతిఘటించారు. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాధినేతలు
కూడా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల మాట మన్నించారు.

సిద్ధేశ్వరి దేవి మహత్తు దేశం అంతటా పాకిపోయింది.

**********
అతిథి గృహంలో ఒకమ్మాయి కూర్చుని వుంది.

సిద్ధేశ్వరీ ఆలయం భక్తు లతో కళకళలాడుతూంది. సదానంద చక్రవర్తి హడావుడిగా తిరుగుతున్నాడు.ఒకరి


తరువాత ఒకరు లోపలికి వెళుతున్నారు.

ఆమె వంతు వచ్చింది. చక్రవర్తి దగ్గరకు రాగానే లేచి నిలబడింది. చక్రవర్తి ఆమె వైపు సాలోచనగా చూసేడు.

ఆ అమ్మాయికి ఇరవై రెండు నిండుతున్నాయి. గుండ్రటి మొహం, నిండయిన కళ్ళు కొద్దిగా పొడవు - గడ్డం
మీద చిన్న నొక్కూ.

ఆమెకి చక్రవర్తి చూపు ఎందుకో నచ్చలేదు. దాన్ని పట్టించుకోకుండా లోపలికి నడిచింది. పొడవైన వరండాలో
ఇద్దరూ నడుస్తుంటే, ఆమె తలతిప్పి పక్కకి చూసింది. చిన్న పిట్టగోడ కవతల భక్తు లు తిరుగుతున్నారు. ఆమె
చూస్తుంది అది కాదు. ఆ గ్రౌండ్ అవతల వున్న పాకకి - తాటాకుల మధ్యనుంచి అస్పష్టంగా కనబడుతున్న
ఎయిర్ కండిషనర్ ని, చాలా జాగ్రత్తగా గమనిస్తే కనిపించదది.

ఆమె కెందుకో వెన్నులో చలి మొదలై వళ్ళంతా పాకింది. ఆ క్షణం అక్కణ్నుంచి పారిపోవాలన్న భావన తన
ఫీలింగ్స్ తనలోనే అణచుకుని ముందుకు సాగింది. ఇద్దరూ చిన్న రూమ్ లోకి ప్రవేశించారు. అక్కడో బల్ల బల్ల
మీద పుస్తకం వున్నాయి.

ఆ గదిలో సన్నగా చల్లటిగాలి ఎక్కణ్నుంచో వీస్తూంది.

"ఈ పుస్తకంలో సంతకం పెట్టండి" అన్నాడు

ఆమె వంగి పుస్తకం తెరిచింది. అవసరమైన దానికన్నా చాలా దగ్గరగా అతడు నిలబడి వుండటాన్ని ఆమె
పట్టించుకోకుండా పెన్ తీసుకుంది. పేరూ, అడ్రసూ వ్రాసి, ప్రక్కనున్న ఇంకో కాలమ్ వైపు చూసింది. అందులో
అంకెలేసి ఉన్నాయి. పై వాళ్ళవి.

ఆమె అనుమానం అర్ధం చేసుకున్నట్టు చక్రవర్తి అన్నాడు - "చాలా పెద్ద ఎత్తు లో ఇక్కడ సంతర్పణలు
జరుగుతాయి. వాటికి భక్తు ల విరాళాలే ఆధారం"

ఆమె మిగతా వాళ్ళు ఎంతెంత వేశారో చూసింది. అయిదు వేలూ ఆరువేలూ అలా వున్నాయి. ఒక స్థా యికి
తగ్గిన విజిటర్స్ కి అసలక్కడ ప్రవేశం వుండదని ఆమె గ్రహించింది. తనకి ముందు తెలీదు..... ఇంత డబ్బు
తీసుకురావాలని చాలా ఇన్ డైరెక్టు గా చెబుతున్నారు తన ప్రశ్నకి సమాధానం కావాలంటే ఎంత ఇవ్వాలో.

ఆమె పెన్ తో తన పేరు ఎదురుగా, రూ.216 అన్న అంకె వేసింది, వేస్తూ, వేస్తూ ఓరగా చక్రవర్తి మొహంలోకి
చూసింది. అతడి అరచెయ్యి బిగుసుకుని -క్షణంలో మామూలు అయిపోయింది.

"రండి" అన్నాడు మామూలుగా "దేవి ప్రసాదం తీసుకుని వెళుదురు గాని"

ఆమె నడక సాగిస్తూ నేనో ప్రశ్నకి జవాబు తెలుసుకోవడానికి వచ్చాను" అంది.

"దేవీ ఈ రోజు పూర్తి ధ్యాన ముద్రలో వున్నారు. బహుశా జవాబు ఇవ్వరు. దూరంనుంచి వెళ్ళిపోదురు
గాని."

ఆమెకి అర్ధం అయింది ఇప్పుడు - తను పూర్తి విరాళం ఇస్తేగాని తన ప్రశ్నకి సమాధానం దొరకదు. చాలా ఇన్
డైరెక్టు గా ఈ విషయం తనకి తెలియబర్చబడుతూంది.

ఆమె క్షణం తటపటాయించి "భక్తు లకోసం ఇంత చేస్తు న్న యీ సంస్థకి ఉడతాభక్తిగా నేనో కానుక
సమర్పించుకొందామనుకుంటున్నాను" అని వేలికి వున్న వజ్రపు టుంగరం హుండీలో వేయడానికి వంగింది.
ఈ విషయం ఇంట్లో తెలిస్తే తనని తలవాచేటట్లు చివాట్లు పెడుతుందనీ, రెండ్రోజుల్లో ఫారిన్ నుంచి తన
తండ్రి ఫోన్ లో తనని మందలించబోతున్నాడనీ ఆమెకు తెలుసు. అయినా తన ప్రశ్నకు ఆమె సమాధానం
తెలుసుకోవాలని ధృడ నిస్చయంతో వుంది. అందుకే రెండు వేలు చేసే ఉంగరాన్ని కోల్పోడానికి కూడా
సిద్ధపడింది. ఆమె హుండీలో ఉంగరాన్ని వేసి లేస్తూంటే చెవి దగ్గర అతడి స్వరం అతి నెమ్మదిగా వినిపించింది
"చాలా తెలివైన వారు మీరు"అని. ఆమె దాన్ని పట్టించుకోలేదు. ముందుకు నడిచింది.

ఇద్దరూ పొడవైన వరండాలో నడుస్తూంటే "మనసు నిర్మలంగా వుంచుకోండి. దేవిని నమ్మండి. నిండు
మనసుతో దేవిని స్తు తించండి. మీ ప్రశ్న కాగితం మీద వ్రాసుకోండి. తన కరుణా కటాక్ష వీక్షణాలతో దేవి మీ
ప్రశ్నని చూడకుండానే జవాబు చెబుతుంది. మీ కోర్కెలు నెరవేరతాయి. కష్టం తొలగి పోతుంది మీరు
చేయవలసినదల్లా మీ ప్రశ్న వ్రాయడమే."

అని చక్రవర్తి ఆగి, "వెళ్ళండి" అని చూపించేడు. ఒక తలుపు దగ్గరకు వేసి వుంది. ఆ క్షణం అట్నుంచి అటే
వెనక్కి తిరిగి వెళ్ళిపో అని ఆమె సిక్త్స్ సెన్స్ చెబుతూంది. మనసేదో కీడు శంకిస్తూంది.

తలుపు తెరుస్తూ ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అతడలాగే నిశ్చలంగా -చూపు తిప్పకుండా
చూస్తు న్నాడు. ఆమె చప్పున తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనుక తలుపు నెమ్మదిగా
మూసుకుంది.

లోపల విశాలమైన గది మసక చీకటిగా వుంది. ఒక మూల నిలువెత్తు విగ్రహం ముందు దీపం మినుక్కు
మినుక్కు మని వెలుగుతూంది. ఆమె దృష్టి గది మధ్యలో వున్న పొడవాటి టేబిల్ మీద పడింది.

"రా తల్లీ ఆగిపోయావేం"

ఆమె ఉలిక్కిపడి చూసింది. బల్లకు ఒక మూల వృద్ధు రాలు కూర్చుని వుంది.

సిద్దేశ్వరీ దేవి.......

ఆమె కళ్ళు మసక చీకటికి అలవాటు పడ్డా యి. ప్రతి వస్తు వు స్పష్టంగా చూడగలుగుతుంది. సిద్ధేశ్వరీ దేవి ఆ
కుర్చీలో సామ్రాజ్యాన్ని జయించిన రాణిలా కూర్చుని వుంది.

"రా తల్లీ దేవిని నీ సంశయం అడిగి తెలుసుకో"

ఆమె ముందుకు నడిచి, బల్లకి ఇంకో చివర కూర్చున్నది. కొన్నిలక్షలమంది సైనికులు చనిపోయిన తరువాత
సంధి ప్రాతిపదికల చర్చలకోసం కూర్చున్న రాజుల్లా వున్నారు ఇద్దరూ. నిశ్శబ్దం రాజ్యం ఏలుతూంది
ఇద్దరిమధ్యా.

"వెళ్ళిపో -ఇక్కణ్నుంచి వెళ్ళిపో"అని మనసు సంకేతాలు పంపుతూంది.


సిద్ధేశ్వరి ఆమె వైపు దయగా చూస్తుంది. దూరగా దేవి విగ్రహం నిశ్చలంగా వుంది. ముందు దీపం ఆరి
వెలుగుతూంది. ఆమె ముందుకు వంగింది. బల్లమీద కాగితం కలం, వున్నాయి.

"వద్దు వద్దు ...." అంటుంది మనసు. "చాలా పటిష్టమైన గుంపు ఇది. ఇరవై ఏళ్ళ అమ్మాయి ఒంటరిగా దీన్ని
ఎదుర్కోలేవు. వెళ్ళిపో వెళ్ళిపో" అని హెచ్చరిస్తూంది. ఆ అమ్మాయి చేతిలోని కాగితాన్ని తీసుకుంది. తెల్లటి
కాగితం

సిద్దేశ్వరీ దేవి ఆమె వైపే నిశ్చలంగా చూస్తూంది. తన మనసు మీద ఏ విధమైన హిప్నాటిక్ ప్రభావం
వుండకుండా వుండడానికి మనసుని అదుపులో పెట్టు కోవడానికి ప్రయత్నం చేస్తూంది. తమ ప్రశ్నము టెలీపతి
క్లెయిర్ వాయెన్స్ ద్వారా అవతలి వాళ్ళు తెలుసుకోకుండా వుండడానికి ఒకటి రెండు మూడు అంకెలు
లెక్కబెడుతూంది.

ఆమె కలం చేతిలోకి తీసుకోబోయి ఆగింది.

ఈ కలంలో ఏదైనా ఎలక్ట్రికల్ కంప్యూటర్ వుందేమో. తను వ్రాసిన ప్రశ్నని అది ఎక్కడన్నా రీ ప్రింట్
చేస్తుందేమో, ఆమె పై కప్పు కేసి చుట్టూ గోడల కేసి చూసింది. ఎక్కడైనా అద్దా లు గాని, రిఫ్లెక్టర్స్ గాని
వున్నాయేమోనని.

సిద్ధేశ్వరి ఆమెవైపు చూస్తూంది.

"నేను.....నేను ఏ ప్రశ్ననైనా వ్రాయవచ్చునా!"

"నిస్సందేహంగా నిర్భయంగా వ్రాయవచ్చు తల్లీ. దేవి జవాబు చెప్పటమే కాకుండా పరిష్కారం కూడా
చూపిస్తుంది."

...........పై ప్రశ్న అడుగుతూ చేతిలోని కాగితాన్ని క్రిందికి జార్చింది. మోకాళ్ళ మీద పెట్టు కున్నా హాండ్ బ్యాగ్
లోంచి తన పెన్నూ నోట్ బుక్ లోంచి చప్పుడవకుండా చింపిన కాగితమూ బల్లమీద అదే స్థా నంలో పెట్టింది.
ఇదంతా క్షణంలో, రెండో కంటికి తెలియకుండానే జరిగిపోయింది.

"వ్రాయి తల్లీ!"

తన కలాన్ని చేతిలోకి తీసుకుని ఆమె ముందుకు వంగింది. మనసు ఆకరి సంకేతాన్ని పంపుతూంది - వద్దు -
వద్దు -ఆ ప్రస్న వ్రాయకు -ప్రమాదం - ప్రమా.... ఆమె ప్రశ్న వ్రాయడం పూర్తిచేసింది. గుండ్రటి అక్షరాల్తో తెల్లటి
కాగితం మీద చిన్న ప్రశ్న.

"ఈ ప్రశ్నలకి దేవి సమాధానం చెప్పడం -ఇదంతా బోగస్ అనుకుంటున్నాను. నా అభిప్రాయం నిజమేనా?"
ఆమె కాగితం మడత పెట్టింది. దాన్ని మరో నాలుగు మడతలు వేసింది.

"దేవీ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిలబడమ్మా" సిద్ధేశ్వరీ కంఠంలో ఏ మార్పూ లేదు. ఆమె గదిలో ఒక మూల
వున్న విగ్రహం దగ్గరకు వెళ్ళింది. విగ్రహం ముందు చిన్న దీపం వెలుగుతూంది.

"నీ ప్రశ్నను దేవీ వెలుగుకు అర్పణం చెయ్యి తల్లీ"

ఆ అమ్మాయి కాగితాన్ని ఒక చివర అంటించింది. నెమ్మదిగా మంట కాగితాన్ని దగ్దం చేసింది ఆ వెలుగులో
తలతిప్పి సిద్దేశ్వరి వైపు ఓరగా చూసి ఉలిక్కిపడింది.

మంట వెలుగులోసిద్దేశ్వరి మొహం ఎర్రగా ప్రతిబింబిస్తుంది. జారిపోయిన చర్మం వెనుక బిగించిన పళ్ళ
ఆవేశం స్పష్టంగా కనిపిస్తూంది. ఆమె కళ్ళు అగ్ని గోళాల్లా వున్నాయి.

తన మనసులో భావం -తన ప్రశ్న ఆమెకి ఎలా చేరింది?

ఇంత తొందరగా

మానవాతీత శక్తు లు వున్నాయా?

ఆమె వళ్ళు జలదరించింది. ఒక చెమట చుక్క పాపిటిమీద నుంచి నుదుటి మీదకు జారింది. కంపిస్తు న్న
కాళ్ళతో తలుపువైపు వెళ్ళబోయింది.

"అటు కాదమ్మా"

నాగస్వరం విన్నదానిలా ఆమె చప్పున ఆగిపోయింది. డోర్ హాండిల్ మీద నుంచి ఆమె చెయ్యి కిందకి
వాలిపోయింది.

"నీ ప్రశ్నకి కాళికాదేవి స్వయంగా సమాధానం చెబుతుందట అటు వెళ్ళు"

ఆ అమ్మాయి తలతిప్పి చూసింది. ఎడమవైపు ఇంకోదారి, చిన్న తలుపు.

"వెళ్ళు తల్లీ" ఈ సారి సిద్ధేస్వరి కంఠం, మొహమూ మాములుగా వున్నాయి. ఆమె ఇక తప్పనిసరి
అయినట్టు అటు నడిచింది. ఎడమవైపు తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించింది.

ఆమె వెనుక తలుపు దానంతట అదే మూసుకుపోవడం -లాక్ పడడం ఆమె గమనించలేదు. చిన్న
చప్పుడుకు అటు చూసింది.
ఆ మసక చీకట్లో బల్లమీద ఉన్న పుర్రెను చూసి ఆమె కెవ్వున అరవబోయింది. నోటమాట రాలేదు.
భయంకన్నా విస్మయం ఎక్కువైతే ఆ స్థితి మనిషిని కట్రాట చేస్తుంది. ఆమె నోటికి చెయ్యి అడ్డు పెట్టు కుని
నిశ్చేష్టు రాలై శిలలా ఆగిపోయింది.

పుర్రె దానంతట అదే నాలుగు అంగుళాలు గాలిలోకి లేచింది. ప్రతి ద్వనిస్తు న్న స్వరంతో బొంగురు గొంతుతో
-ఆపుర్రె అన్నది.

".......పైశాచిక గణాల ప్రతినిధి శివుడి ఆజ్ఞ

దేవీ ఉపాసకురాల్ని అనుమానిస్తు న్నావా మూర్ఖురాలా....."

ఒక్కసారి గాలిలోకి లేచిన పుర్రె వికృత స్వరంతో అలా మాట్లా డేసరికి ఇరవై ఏళ్ళ అమ్మాయి బెదిరిపోయింది.
హిస్టీరిక్ గా మారి కెవ్వు కెవ్వున అరవసాగింది.

ఆ అరుపులు బయటికి వినిపించడం లేదు.

"ఎందుకలా అరుస్తా వ్?" అని పుర్రె అడిగింది.

భయంతో ఆమె చప్పున అరవడం మానేసింది. ఉన్నట్టుండి ఆ గదిలో నెలకొన్న నిశ్శబ్దం కూడా
భయంకరంగా కూడా వుంది. ఆమెకు కొద్దిగా ధైర్యం వచ్చింది. స్వతహాగా ధైర్యవంతురాలు ఒక్కసారిగా గదిలో
వున్న చీకటి - గాలిలోకి లేచిన పుర్రె ఆమెని భయపెట్టా యి అంతే.

ఆమెకి కొంచెం ధైర్యం చేకూరగానే అడుగు ముందుకు వేసింది. పుర్రె కల్ళ స్థా నంలో వున్న రెండు కన్నాలూ
ఆమెనే తీక్షణంగా చూస్తు న్నట్టు వున్నాయి. ఆమె ఒకటి గమనించింది. మాటలు పుర్రెలోంచి వస్తు న్నాయి.
అందులో సందేహం లేదు. అయినా అనుమానం తీరక చుట్టూ చూసుంది. గది మామూలుగానే వుంది.
ఎక్కడా మైకులు లేవు.

టేబిల్ మీద నుంచి పుర్రెకు ఏమైనా కనెక్షన్ వుందేమో అని ఆమెకు అనుమానం వచ్చింది.

ఇంకో రెండడుగులు వేసి ఆమె బల్ల దగ్గరకు వెళ్ళింది. బల్లమీద పుర్రె నిశ్చలంగా వుంది. ఆమె చెయ్యిచాచి
పుర్రెని చేతుల్లోకి తీసుకోబోయి ఒక క్షణం ఆలోచించింది. ఏ మాత్రం కరెంట్ కనెక్షన్ వున్నా తన మరణం
ఖాయం. ఒకవేళ అలాంటి కనెక్షన్ వుంటే పుర్రె గాలిలోకి ఎలా లేచింది? మసక చీకట్లో వైర్లు తనకి కనబడలేదా?
లేకపోతే సన్నటి వైర్లా అవి.

వైర్లు వున్నాయో లేవో తీసుచూస్తే తెలిసిపోతుంది కదా.

ఆమె తటపటాయిస్తూ పుర్రెమీద చెయ్యివేసింది.


షాక్ కొట్టలేదు మామూలుగానే వుంది.

ఆమె నాలుగు వేళ్ళతోనూ దాని పై భాగాన పట్టు కొని పైకి ఎత్తింది. చాలా తేలిగ్గా మామూలు పుర్రెలాగానే
చేతిలోకి వచ్చింది అది.

పుర్రెకి టేబుల్ కి కనెక్షన్ చేస్తూ వైర్లు లేవు. అసలేమీ కనెక్షన్ లేదు.

ఆమెకిది విస్మయం కలిగించింది.

తన అంచనాలన్నీ తారుమారు కావడం నిరాశ కల్గించింది.

అప్పుడొచ్చింది ఆమెకు అనుమానం.

మానవాతీత శక్తు లు వున్నాయా -అని- ఆ భావంతోపాటు వచ్చిన భయాన్ని నొక్కిపట్టి చేతిలోని పుర్రెకేసి
పరీక్షగా చూసింది.

చాలా పురాతనమైంది. నుదురు పక్కనుంచి దవడ భాగం పక్కగా పగులు చూసింది చేతిలో తేలిగ్గా
తిరుగుతూంది అటూ ఇటూ.

దానిలో ఏ రహస్యమూ లేదని ఆమె పూర్తిగా నిశ్చయించుకొని, తిరిగి టేబిల్ మీద పెట్టబోతుంటే అప్పుడు
వినిపించింది చిన్న నవ్వు.

పుర్రె లోంచి -సన్నగా చాలా సన్నగా.

గొంతులోంచి రాబోయిన కేకని అతి కష్టంమీద ఆపుకొంది. కాని వళ్ళంతా చిగురుటాకులా వణికిపోసాగింది.
ఒక్కసారిగా పుర్రె చేతుల్లంచి నేలమీద పడి శబ్దం చేసింది.

నవ్వు పుర్రెలోంచే -నిశ్చయంగా పుర్రెలోంచే వచ్చింది. ఆమె స్థా ణువై -కళ్ళు పెద్దవి చేసి అలాగే దానికేసి
చూడసాగింది.

అల తరువాత అల వచ్చినట్టు మాటలు ఆపుర్రెలోంచి తరంగాలై ఆ గదిలో వినిపించినయ్.

"మానవులకు అతీతమయిన శక్తి ఒకటుందని నమ్ము దాన్ని ప్రచారం చెయ్యి. నేనే దెయ్యాన్ని సకల చరాచర
సృష్టి స్థితి లయకారుణ్ని నేనే"

ధ్వని ప్రతిధ్వని మిశ్రమాల్తో బొంగురు గొంతులో ఆ మాటలు ఎంత ధైర్యవంతులైన వారినయినా


దిగజార్చేటట్టు వున్నాయి. కాళ్ళ ముందు పుర్రె వికృతంగా వుంది.
ఆమెకి ఏడుపు వచ్చింది

ఆమె వయసెంతనీ? ఇరవై ఇంకా నిండాలేదు. అసలు అంతదూరం ధైర్యంగా వచ్చిందంటేనే గొప్ప.

ఆమె చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది. గదిలో వాతావరణం కొద్దికొద్దిగా చల్లబడడం
ఆమె గమనించలేదు.

నెమ్మదిగా స్పృహ తప్పింది.

***********
"రండి" అన్న మాటలతో ఆమె కళ్ళు విప్పింది. కళ్ళు విప్పుతూనే చుట్టూ ఆశ్చర్యంగా చూసింది. వరుసగా
కుర్చీలు వేసి వున్నాయి. సిద్దేశ్వరీ దేవిని తమ ప్రశ్నలు అడగటానికి కూర్చున్న అతిధులు ఆ కుర్చీలలో కూర్చుని
వున్నారు. ఆమె ముందు కూర్చున్న వారు లోపలినుంచి వస్తు న్నారు. వాళ్ళ మొహాల్లో దేవి పట్ల గౌరవం, తమ
ప్రశ్నకి సమాధానం తెలుసుకున్న ఆనందం వున్నాయి. వెనక్కి తిరిగి తిరిగి నమస్కారాలు చేసుకుంటూ
వెళుతున్నారు.

"మీ వంతు వచ్చింది రండి"

ఆమె తలెత్తి ఎదుటి వ్యక్తి వైపు చూసింది. ఎదురుగా చక్రవర్తి నిలబడి వున్నాడు. అతడే - తనను లోపలికి
తీసుకు వెళ్ళినవాడే.

.....ఆమెకంతా అయోమయంగా ఉంది. తను మళ్ళీ యిక్కడికెలా వచ్చింది? లోపలికి వెళ్ళడం పుర్రె
మాట్లా డం -అంతా భ్రమా?

ఆమె వాచీ చూసుకుంది.

ఎనిమిది ఇరవై. అంటే తను వచ్చి అరగంటపైగా గడిచిపోయిందన్న మాట కుర్చీ వెనక్కివాలి నిద్రపోయినా
తను? నిద్రలో కలగన్నదా?

"సిద్ధేశ్వరీ దేవి మీ కోసం ఎదురు చూస్తు న్నారు. అతిథికీ మద్య ఎక్కువ వ్యవధి వుండడం ఆమె యిష్టపదు"
అంటున్నాడు చక్రవర్తి.

అదే గొంతు అదే ఆకారం. ఎలా తను కలలో ఇదే ఆకారాన్ని చూసింది? తనకి ఏమయినా మానవాతీత
శ్కతులు అలవడుతున్నాయా? క్లెయిర్ వాయెన్స్?
తన ఎదురుగా చక్రవర్తి అసహనంగా కదలడం ఆమె గమనించి వూహల్లోంచి బైటకొచ్చింది. చుట్టూ
వున్నవాళ్ళు తమనే గమనించి సిగ్గుపడి, చప్పున అతడిని అనుసరించింది.

అదే వరండా -అదే మసక చీకటి.

ఇద్దరూ ముందు గదిలోకి ప్రవేశించారు. అక్కడో రిజిష్టరు తన కలలో చూసిన లాటిదే వుంది.

"మీరు మీ పేరు వ్రాయండి"

ఆమె చేతిలోకి పెన్ తీసుకుంటూ తలెత్తి "కొంచెం మంచినీళ్ళు దొరుకుతాయా ప్లీజ్" అన్నది.

అతను కదలలేదు. క్షణం ఆమె కళ్ళలోకి సూటిగా చూసేడు. ఆమె వెన్నునుంచి సన్నగా చలిపాకింది. "వద్దు "
అని అనబోయింది. "ఒక్క నిమిషం తెచ్చిస్తా ను" అని అతడు బయటకు వెళ్ళాడు.

ఆమె చప్పున రిజిష్టరు చూసింది.

అవధుల పేర్లు -వచ్చిన టై మ్..... ఇచ్చిన కానుకలు.- అన్నీ వ్రాసి వున్నాయి.

ఆమె తొందర తొందరగా పేర్లు చూడసాగింది.

ఆమెకి టెన్షన్ ఎక్కువైంది. తను స్వయంగా పెన్ తో తన పేరు వ్రాసింది. రూ.216/- అని కూడా వ్రాసింది. ఈ
రోజే.... ఈ రోజే.

ఏమైంది ఆ పేరు? ఆమె నుదుటి మీద చెమట పడుతూంది. చెయ్యి వణుకుతూంది. ఒకవైపు చక్రవర్తి
వచ్చేస్తా డేమో నని భయం..... ఆమె గబగబ పేజీలు వెనక్కి తిప్పింది. అంతకు ముందురోజు...... దాని క్రితం
రోజు.....వరుసగా వ్రాసివున్న పేర్లు ..ఇచ్చిన విరాళాలు.

తన పేరు లేదు.

అంతలో తలుపు దగ్గర చప్పుడయింది. చక్రవర్తి గ్లా సుతో వస్తు న్నాడు. ఆమ పెన్ తీసుకుని పేరు వ్రాసింది.
టై మ్ వేస్తూ వుంటే....

"ఎన్నో పుణ్యకార్యాలు ఇక్కడ జరుగుతూ వుంటాయి. అందుకని భక్తు లు విరాళాలు వేస్తా రు" వెనక నుంచి
చక్రవర్తి కంఠం మందంగా వినిపించింది. ఆమె వెనుదిరగకుండానే తన పేరు కెదురుగా రూ.216. అని వేసింది.
వేస్తూ ఓరగా అతడి మొహంలో కలిగే మార్పులకోసం చూసింది.

చాలా చిత్రంగా అతడి మొహంలో ఏ మార్పూ లేదు. "రండి దేవి ప్రసాదం తీసుకొందురుగానీ" అన్నాడు.
ఆమె నిటారుగా నిలబడి "నేను దేవిని ప్రశ్న అడుగుదామని వచ్చాను" అన్నది.

"ఇంకొంచెం విరాళం ఇవ్వవలసి వుంటుంది. దేవి సమయం చాలా విలువైంది."

అప్పుడొచ్చింది ఆమెకు జ్ఞాపకం........ తనుహుండీలో వేసిన వుంగరం సంగతి చక్రవర్తి గమనిస్తు న్నాడన్న
విషయం కూడా పట్టించుకోకుండా చప్పున ఎడమ చెయ్యి ఎత్తి చూసుకుంది.

అరచేతి పైన,

నాలుగో వేలికి బిగుతుగా -

తళతళా మెరుస్తూంది -

తండ్రి నతకి నాలుగేళ్ళ క్రితం బహుమతిగా ఇచ్చిన వజ్రపుటుంగరం.

*************
"ఇదంతా జరిగింది -నిజంగా జరిగింది -మీరు నమ్మాలి" అంది తులసి. ఆమె కంఠంలో వాళ్ళని
నమ్మించాలన్న ప్రయత్నం తాలూకు అలసట బాగా కనిపిస్తూంది.

"రిలాక్సవు తొందరపడకు" అన్నాడు పండిత్. ఆమె తల అడ్డంగా విదిలిస్తూ దాదాపు ఏడుపు కంఠంతో
"మీరంతా నన్నెందుకు నమ్మరు?" అని అడిగింది.

"సైన్సు నమ్మదు కాబట్టి" అన్నాడు జయదేవ్ -కుర్చీలో వెనక్కి వాలి.

తన కెదురుగా వున్న ఇద్దరూ రెండు వేరు వేరు రంగాల్లో ప్రఖ్యాతి చెందిన ప్రొఫెసర్లు . తనేమో ఇంకా
గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాని అమ్మాయి. నీళ్ళు నిండిన కళ్ళతో ఆమె నిస్సహాయంగా వాళ్ళవైపు చూసింది.
ఆమెని అనునయిస్తు న్నట్టు పండిత్ అన్నాడు.

"మాటలు పుర్రెలోంచి వస్తు న్నట్టు నువ్వే చెప్పావు. ఇంకెక్కడా స్పీకర్లు లేవనీ, నీవే దాన్ని స్వయంగా
పరీక్షించావ్ అంటున్నావ్. పుర్రెబల్లకీ వైరు కనెక్షన్ ఏదీలేదు. మరి పుర్రెలోంచి ఎలా వచ్చినయ్. పుర్రె గాలికి
లేచిందంటే ఏ అయస్కాంతమో పెట్టి, పుర్రెలో ఇనుపముక్క తాపడం చేసి, గాలిలో నాట్యం
చేయించారనుకోవచ్చు, కనీ దానిలోంచి మాటలు రావడానికి సైన్సు రీజనింగ్ చెప్పదే......"

"కానీ" అంటూ ఏదో చెప్పబోయింది.

దానికి అడ్డు తగుల్తూ "అంతకన్నా ముఖ్య విషయం - ప్రశ్న చూడకుండానే సమాధానం చెప్పడం" అన్నాడు
జయదేవ్.

"ఆఁ అదొకటి" అన్నాడు పండిత్.

"గదిలో అద్దా లు గాని రిఫ్లెక్టర్ గానీ లేదని నువ్వే అన్నావు, మూల కూర్చుని వ్రాసిన ప్రశ్న ఆమెకు ఎలా
తెలిసింది."

తులసి మాట్లా డలేదు.

"ఇదంతా నీ భ్రమ" అంతే తను చెప్పవలసింది అంతే అన్నట్టు సిగరెట్టు వెలిగించుకున్నాడు పండిత్.

"కానీ ఆ దేవి అందరి ప్రశ్నలకి అలాగే సమాధానం చెప్తుందట."

"హెలూసినేషన్" అన్నాడు.

"అంటే?"

"సైకిల్ సెల్ఫ్ నిర్వచనం ప్రకారం చూస్తు న్నట్టూ, వింటున్నట్టు , భ్రాంతి ఆ కుర్చీలో కూర్చుని, కళ్ళు
మూసుకుని నువ్వు భవిష్యత్తు లోకి వెళ్ళిపోయావు. నీలో అంతర్గతంగా వాళ్ళ పట్ల భయం వుంది. అదే పుర్రె
రూపంలో నీకు కనపడింది. చలిగాలిలో కూరుకుపోతున్నానన్న భావం కూడా అదే. నిజానికి మొదటిసారి
నువ్వు లోపలికి వెళ్ళనే లేదు. రిజిష్టర్ లో నీ పేరు లేకపోవడానికి, నీ చేతికి ఉంగరం అలాగే వుండడానికి కారణం
అదే" అన్నాడు జయదేవ్.

చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు వుండిపోయారు.

ఆమె లేచి "వెళ్ళొస్తా ను" అంది.

"నన్ను దిగబెట్టమంటావా"

"వద్దు అంకుల్, థాంక్స్"

ఆమె అన్యమనస్కంగా డ్రైవ్ చెయ్యసాగింది. ఎన్నో ఆలోచనలు, తను భ్రాంతితో వుండవచ్చు -నిజమే - కానీ
అంతమంది తమతమ ప్రశ్నలకు సమాధానం ఎలా పొందగలుగుతున్నారు? ఏమో.... నిజమే నేమో.....
మానవాతీత శక్తి వుందేమో.... అదే జయదేవ్ అంకుల్ చెప్పినట్టు "మాన్ హిప్నాటిక్ ట్రాన్స్" ఏమో సిద్ధేశ్వరీదేవి
నిజంగా దైవోపాసకురాలు ఏమో. లేకపోతే ఒక్క ఆధారము కూడా లేకుండా ఎలా వుంటుంది?

ఆమె ఇంటికి వెళ్ళి కూడా అదే ఆలోచనలో వుంది. తల్లికి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. శారద,
కూతురు అన్యమనస్కంగా వుండడాన్ని గమనించలేదు.

రాత్రి బాగా పొద్దు పోయింది. తన గదిలో పడుకుని ఆలోచించ సాగింది తులసి. ప్రొద్దు న జరిగిన సంఘటన
కళ్ళకు కట్టినట్టు గా వుంది. పుర్రె గాలిలోకి ఎగరటం తన ప్రశ్నకు సమాధానం చెప్పడం

ఇదంతా భ్రమ ఎలా అవుతుంది? భ్రమ కాదని ఎలా వీళ్లని నమ్మించటం?.....ఆమె జరిగిందంతా మననం
చేసుకోసాగింది.

రెండొందల పదహారు అంకె వెయ్యడం -ఉంగరం హుండీలో వెయ్యడం - లోపలికి వెళ్ళటం తన నోట్ బుక్
లో కాగితం చింపటం.

అకస్మాత్తు గా ఆమె ఆలోచన అక్కడ ఆగిపోయింది. తన నోట్ బుక్ లో కాగితం అవును అది నిరూపిస్తుంది.

ఆమె ఒక్క ఉదుటున లేచి పుస్తకాల డ్రాయర్ దగ్గరికి పరుగెత్తింది! ఆ రోజు కొత్తగా కొన్న నలభై పేజీల నోట్
పుస్తకాల్లోంచి ఒక సరికొత్త నోట్ బుక్ తీసి పేజీలు లెక్కపెట్టింది. నలభై పేజీలున్నాయి. సిద్ధేశ్వరీ ఆలయంలో
తను మధ్యపేజీ చింపిన పుస్తకం తీసింది. తీస్తూ వుంటే ఆమె మొహం టెన్షన్ తో ఎర్రబడింది. వణుకుతున్న
చేతుల్తో పేజీలు లెక్క పెట్టడం పూర్తి చేసింది. ముప్పై ఆరున్నాయి.

*************
ఆ రాత్రి ఆమె డైరీలో ఇలా వ్రాసుకుంది.

"ఈ విషయాన్ని అంకుల్ తోగానీ, మాస్టా రుతోగానీ చెప్పినా వాళ్ళు నమ్మరు నేనే కనుక్కోవాలి. దానికోసం
ఎంతకాలమైనా ఆగాలి. రెండు నెలల్లో దేవి పూజ జరుగుతుంది. ఈ హడావుడిలో లోపలికి ప్రవేశించాలి. ఆ
రహస్యాన్ని శోధించాలి.నాకేదైనా జరిగినా ఈ డైరీయే వాళ్ళని అరెస్టు చేయించాలి. అప్పుడు ఒక మోసగాళ్ళ
ముఠా నుంచి ప్రజల్ని రక్షించానన్న తృప్తి అయినా నా ఆత్మకు మిగులుతుంది

డైరీ వ్రాయడం పూర్తి చేసి ఆమె నిశ్చింతగా నిద్రపోయింది.

7
రాత్రి ఒంటి గంట అయింది.

కంపార్టు మెంట్ లో అందరూ నిద్రబోతున్నారు. రైలు నెమ్మదిగా వెళుతోంది. తెరచి వున్న కిటికీలంచి బైట
చీకటి కాటుకలా వుంది.

అతడు పుల్లల కట్ట తీసేడు కణుపులు లెక్క పెట్టేడు.


పదమూడు వున్నాయి.

అంటే పదమూడు రోజులు.

ఇంకో పదమూడు రోజుల్లో కాష్మోరా నిద్రలేస్తా డు. ఆ తర్వాత వారానికి తులసి మరణం.

రైలు చీకట్లో ఆగింది. ఊరులేదు. అంతా చీకటి. చెరుకు కోసిన భూములు -కీచురాళ్ళు శబ్దం తప్ప అంతా
నిశ్శబ్దంగా వుంది.

గెడ్డం కిటికీకి ఆన్చుకుని శూన్యంలోకి చూస్తు న్నాడు దార్కా.

ఆ చీకట్లో ఆ విశాలమైన పొలాల్లోకి చూస్తూ వుంటే అతని బాల్యం గుర్తు కు వచ్చింది. బిస్తా తన గ్రామస్తు లు.
- గురువైన విషాచి -అతడు తన మీద పెట్టు కున్న నమ్మకం - తన ప్రతిజ్ఞ -ఐదేళ్ళు కష్టపడి నేర్చుకున్న మంత్ర
విద్య -కఠోరమైన నియమాలూ -వర్షానికి తడు్సతూ -చలికి వణుకుతూ -అర్ధరాత్రి మానవ కంకణాల మధ్య -
టపటపా పేలిపోయే కపాలాల మధ్య -జీవితాన్ని తపస్సుగా మార్చుకుని -శ్రమిస్తూ తపిస్తూ -

తను సాధించిందేమిటి?

ఏమీ లేదు.

చాలా చిన్న ప్రతిజ్ఞ

ముగ్గుర్ని చంపడం. అది చెయ్యలేక పోతున్నాడు.

తన మీద ఎంతో నమ్మకం పెట్టు కున్న తన గురువు కోరికని నెరవేర్చలేక పోతున్నాడు.

మబ్బుల చాటునుంచి చంద్రు డు బైటకొచ్చాడు. రైల్వే ట్రాక్ పక్కనే వున్న గుంటలో నీరు తళతళ
మెరుస్తూంది.

కిటికీ చెక్క మీద తల పెట్టు కుని "క్షమించు విషాచి, నేను ఓడిపోతున్నాను. నన్ను క్షమించు" పదేపదే
అనుకొన్నాడు. కళ్ళ వెంట నీరు కారటం మొదలు పెట్టింది.

అతన్ని ఎవరూ గమనించలేదు. అందరూ నిద్రలో వున్నారు.

రైలు కూత వేసింది.

అతడు కళ్ళు రుద్దు కున్నాడు.


కిటికీలోంచి బైటకు చూశాడు.

అతడి చూపు నీటిమీద నుంచి ఎండిపోయిన చెరకు తోటమీద పడింది.

వెన్నెల్లో ఎండిన చెరకు పిప్పి తెల్లగా మెరుస్తూంది.

రైలు కదిలింది.

కొంచెం దూరం వెళ్ళేక దూరంగా మంట కనపడి, తలను మరింత వంచి చూసేడు.

చెరకు తోట దగ్గర పెద్ద మంట.

రైలు వేగం పుంజుకున్న కొద్దీ ఆ మంట దూరం అయిపోయింది. అతడు దాన్నే చూస్తూ వుండిపోయాడు.
ఎండిన చెరుకుని మంట బెడ్తా రని అతడికి తెలుసు. అతడికి తెలియనిదల్లా ఆ మంట తను కన్ను
నులుముకోవటం వల్ల వచ్చిందనే -

అతడు ఆ మంటనే చూస్తూ రెండు నిమిషాల పాటు వుండిపోవడం మంచిది అయింది. అతడేగాని
తలతిప్పి కంపార్ట్మెంట్ లోకి చూసి వుంటే అందులో వున్న వాళ్ళందరూ మసి అయి వుండేవారు.

అరుత్యుంద ద్వారా.

*********
ఆ మహాపట్టణాన్ని చూసి అతడికి క్షణం ఏం చెయ్యాలో తోచలేదు. అందులోనూ అతడు రైలు దిగేసరికి
తొమ్మిదిన్నరయింది. ఆఫీసులకి వెళ్ళే జనంతోనూ రిక్షా వాళ్ళతోనూ అంతా హడావుడిగా వుంది.

అతడు ఏదైనా ఊర్లో దిగగానే చేసే మొదటి పని స్త్రీల కళాశాలలు ఎన్ని వున్నాయి అని వాకబు చేయటం,
అయితే ఆ నగరంలో అది అంత సులభంగా దొరకలేదు. కొంచెం కష్టపడవలసి వచ్చింది.

స్నానం భోజనం వీటికి అంత ప్రాముఖ్యత లేదు. పట్టు కోవాలి- ఎలాగైనా ఆ తులసి మరణించే లోపులో
పట్టు కోవాలి. అదే ధ్యేయం.

మళ్లీ మామూలు తతంగమే. అయితే ఈ సారి గేటు దగ్గర గూర్ఖా లేడు. యూనివర్శిటీ క్యాంపస్ లో అది కో
ఎడ్యుకేషన్ కాలేజీ అందువల్ల దార్కా సరాసరి లోపలికి వెళ్ళిపోగలిగేడు. కాలేజీ అంతా నిర్మానుష్యంగా వుంది.
అతడు ఆఫీసు రూములోకి ప్రవేశించాడు. ఇద్దరు ముగ్గురు క్లర్కులు పని చేసుకుంటున్నారు. ఒక క్లర్కు
ముందు నలుగురు అయిదుగురు అమ్మాయిలు మార్కుల మెమొరాండంలు కోసం గుమికూడి వున్నారు.
దార్కా గుమ్మం దగ్గరే నిలబడి చుట్టూ చూసేడు. మొదట్లో అతడికి భయంగాను జంకుగాను వుండేది. ఆ
తరువాత తరువాత అలవాటై పోయింది. ఎవరిని ఎలా "టాకిల్" చేయాలో తెలుసు అతడికి.

"ఇదిగో" అన్నాడు ఒక ఫ్యూను దుస్తు ల్లో వున్న వ్యక్తిని చూసి.

"నాకో సాయం చేయాలి చేస్తా రా?" ఇలా అంటున్నప్పుడు ఒక పది రూపాయల నోటుని కింద జేబులోంచి
తీసి పై జేబులోకి మార్చుకున్నాడు.

అతడు అది గమనించకుండా "ఏం సాయం" అని అడిగాడు.

"నాకు అటెండెన్స్ రిజిష్టర్ కావాలి. ఒక అమ్మాయిని ఆమెకు తెలియకుండానే చూడాలి" అని రహస్యంగా
చెప్పాడు.

"ఎందుకు చూడడం" అతడూ రహస్యంగానే అడిగేడు.

వీడికి, ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదేమని తనలో తను విసుక్కొని "పెళ్ళి చూపులకి ముందు ఒకసారి
చూద్దా మని" అన్నాడు. పెళ్ళిచూపులు అనే మాట వినపడి, అమ్మాయిలు ఓరగా అతడివైపు చూసేరు.

"పెళ్ళి చూపులకి ముందా?" అని గెడ్డం గోక్కుని, ఐడియా బాగానే వుంది కానబ్బాయ్ - నేనిక్కడ ఫ్యూన్ ని
కాదు.

పాఠాలు చెప్పేవాణ్ని. నా పేరు పండిత్ ప్రొఫెసర్ పండిత్" అన్నాడు.

దార్కా దెబ్బతిన్నట్టూ ఆయనవైపు చూసి "సారీ" అన్నాడు. ఈ లోపులో అమ్మాయిలు వాళ్ళని


చుట్టు ముట్టేరు. ఇద్దరమ్మాయిలు జీన్స్ లో వున్నారు. ఒకమ్మాయి గులాబిరంగు చీర కట్టు కుంది. యింకో
అమ్మాయి పంజాబీ డ్రెస్ లో వుంది. వాళ్ళని చూడలేదు దార్కా.

"ఎవరీ ప్రవరాఖ్యుడు" అందో అమ్మాయి.

"ష్ -ఊరుకో" అని మందలించి, "ఏంకావాలి మీకు?" అని అడిగింది గులాబీరంగు చీరె కట్టు కున్న
అమ్మాయి.
దార్కా కి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. అతడు అంతకు ముందెన్నడూ ఇలా అమ్మాయిల్తో
మాట్లా డిన వాడు కాడు. అందులో వీళ్ళు తనని ఏడిపించడానికి కంకణం కట్టు కున్న వాళ్ళలా వున్నారు.
అతడు తడబడి "ఏం లేదు , ఏం లేదు" అని అక్కడినుండి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తు డయ్యాడు.
పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి "ఆ అమ్మాయి పేరు చెప్పండి గల్లీ గల్లీ వెతికి పట్టు కుంటాము" అంది
తాము అంతా విన్నట్టు సూచిస్తూ.

దార్కా మొహం ఎర్రబడింది "లక్ష్మి" అన్నాడు పళ్ళ బిగువున.

"హాయ్ - నేనే" అంది ఆ అమ్మాయి వెంటనే.

"నా పేరూ లక్ష్మే" అంది జీన్స్ వేసుకున్నా అమ్మాయి.

"నా పేరూ అదే" అని మూడో అమ్మాయి అన్నది. అందరూ నవ్వు బిగపట్టా రు.

స్లిప్పర్స్ చివర్లో కనబడ్తు న్న పాదాల అంచుగోళ్ళని పరిశీలిస్తూ దార్కా ఆవేశంతో కందిపోయిన మొహాన్ని
చాటుచేసుకున్నాడు.

అతడి ఇబ్బంది గమనించినట్టు గులాబీ రంగు చీరె కట్టు కున్న అమ్మాయి "చాల్లెండే" అని అతడి వైపు తిరిగి
"మా కాలేజీకి శలవలండీ వచ్చే నెల పదో తారీకు వరకూ శలవలు" అంది.

వాళ్ళేదో అంటున్నారు అతడు గమనించలేదు కాళ్ళక్రింద భూమి జారిపోతున్నట్లు వుంది. హీనమైన


కంఠంతో "ఒక్క కాలేజీయేనా?" అని అడిగేడు.

"కాదు - యూనివర్సిటీ అంతా."

చిగురుటాకులా అతడు వణికిపోయేడు. అయిపోయింది. ఏ మూలో వున్న ఆఖరి ఆశ కూడా పోయింది.


ఇక ఎక్కడని వెతుకుతాడు.

అదీ వారంరోజుల్లో.

అతడు అక్కడనుండి మౌనంగా సాగిపోయేడు.

అప్పటివరకూ లేని మార్పు ఒక్కసారిగా అతడిలో వచ్చేసరికి ఆ అమ్మాయిలు కూడా ఏమీ


మాట్లా డలేకపోయారు. వాళ్ళు కూడా బయటికి నడిచేరు.

సైకిల్ స్టాండు పక్కన తచ్చాడుతున్న ప్రొఫెసర్ని చూసి, "ఈ రోజు కూడా మీరు కారు తేలేదా మాస్టా రూ"
అంది గులాబీరంగు చీరె కట్టు కున్న అమ్మాయి.

"అవును కదూ" తల గోకున్నాడు పండిత్.

"రండి, నా కార్లో డ్రాప్ చేస్తా ను. నేను వెళ్ళేది అటేగా"


"సరే -"

కారు "తులసి" ఇంటివైపు సాగిపోయింది.

* * *
సరిగ్గా అదే సమయానికి ఓ ఆలోచన వచ్చింది అతడికి. కళ్ళు దీప్తితో వెలిగేయి. ఒక్క వుదుటున లేచాడు
దార్కా, సరిపడా డబ్బు వుందా అని చూసుకున్నాడు. పరుగులాంటి నడకతో మొదట పత్రికాఫీసు
చేరుకున్నాడు.

* * *
ఆ రోజు సాయంత్రం ఎడిషన్ లో అన్ని లోకల్ న్యూస్ పేపర్లలోనూ ఒక మూల ఒక ప్రకటన పడింది ఇలా.-

'తు ల సి'

నిన్ను కవలాలనుకుంటున్నాను. కోట పక్కన

మైలురాయి దగ్గరికి శనివారం అయిదింటికి రా.

'కా ష్మో రా'

* * *
తన జీవితంలో ఎన్నడూ లేనంత ఉద్విగ్నతతో దార్కా ఆ రోజు గడిపేడు. సాయంత్రం అవుతున్న కొద్దీ టెన్షన్
అయితే దానిక్కారణం వుంది.

ఆ రోజు మధ్యాహ్నం అథడు పత్రికాఫీసుకు వెళ్ళినప్పుడు అడ్వర్ టై జ్ మెంట్ మేనేజర్ "రండి" అని "చిన్న
న్యూస్ మీకు" అన్నాడు.

"ఏమిటి?"

"మీకు పోన్ వచ్చింది"

దార్కా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తనని తను కంట్రోల్ చేసుకుంటూ "ఎవరు?" అన్నాడు. అంటూంటే
అతడి కంఠం వణికింది.

"ఓ స్త్రీ"

రక్తనాళాలు పగిలిపోతాయేమోనన్నంత ఉద్నిగ్నత. పరిస్థితి పట్టించుకోకుండా ఆ మానేజర్ చెప్పుకు


పోతున్నాడు.

"సాధారణంగా అడ్వర్టెయిజ్ మెంట్ ఇచ్చిన వాళ్ళకి వచ్చిన పోన కాల్స్ మేం పట్టించుకోం. కానీ మీ ప్రకటన
చాలా చిత్రంగా వుండటంతో నాకు ఇంటరెస్టు కలిగింది. కాష్మోరా ఎవరు?"

దార్కా పళ్లు బిగువున అడిగేడు "ఆ అమ్మాయి ఏమంది?"

"మీ గురించి అడిగింది. మాకు తెలీదన్నాను. అంతే."

దార్కా లేచాడు. "సాయంత్రం వస్తా నందా?"

"వస్తుందట కాష్మోరా అంటే ఎవరు?"

దార్కా జవాబు చెప్పలేదు. "వెళ్లొస్తా ను" అంటూ కదిలేడు. ఫర్వాలేదు తన బాణం తగలవలసిన చోటే
తగిలింది.

* * *
సాయంత్రం ఐదవుతూంది.

బాగా మేఘాలు పట్టటంవల్ల అప్పటికే చీకటి పడుతూంది. చలిగాలి రివ్వున వీస్తూంది. శిధిలమయిన
కోటను చీకటి దుప్పటిలా కప్పుతూంది.

మైలురాయికి కొంచెం దూరంలో స్మశానం వుంది. అక్కడ కూర్చుని వున్నాడు దార్కా.

రోడ్డు మీద వాహనాలు వెళ్ళడం లేదు. నిర్మానుష్యంగా వుంది. ముందుగానే చీకటి పడడంవల్ల శ్మశానం తన
వాతావరణాన్ని పుంజుకొంటూంది. ఒక కీచురాయి ఒకసారి అరిచి, మళ్లీ నిశ్శబ్దా నికి దోహదం చేసింది.

దార్కా రోడ్ వైపే చూస్తు న్నాడు.

ఐదయింది.
దూరంనుంచి ఒక కారు వస్తూంది.

కారు స్పీడుగా వచ్చి ఆగింది. అతడు వూపిరి బిగపట్టా డు. కారు డోరు తెరుచుకుంది.

దార్కా లేచి నించున్నాడు.

కారులోంచి ఒక వ్యక్తి దిగేడు. అయిదున్నర అడుగుల ఎత్తు వున్నాడు కారు దిగగానే అతడు దార్కా వద్దకు
రాలేదు. అక్కడే నిలబడి ఒక క్షణం సూటిగా చూసేడు.

ఇద్దరికీ మధ్య వందగజాల దూరం కన్నా ఎక్కువ వుండదు.

ఆ వ్యక్తం నెమ్మదిగా దార్కా దగ్గరికి నడిచి రాసాగేడు. దార్కా కదలకుండా నిలబడి వున్నాడు.

రెండు నిమిషాల్లో దార్కా దగ్గరికి వచ్చాడు. షర్టు మోచేతులు వరకూ మడిచి వుంది. వయసు నలభైకి
దగ్గరగా వుంటుంది. కానీ అంత ఉన్నట్టు కనబడడు. అతడి కళ్ళలో తీక్షణ కొట్టొచ్చినట్టు కనబడుతూంది.
మొహం కరుగ్గా ఉంది.

దార్కా ఏదో అనబోయేడు. అంతలోనే అతడి మాటల్ని ఖండిస్తూ ప్రశ్న వినబడింది.

"ఎవరు నువ్వు?" స్మశానంలో ఆ ప్రశ్న తిరిగి ప్రతిధ్వనించింది.

దార్కా అతడివేపు చూశాడు. బిగించిన పళ్ళ మధ్యనించి తిరిగి అదే ప్రశ్న కర్కశంగా "ఎవరు నువ్వు?"

'మీరెవరు' -అనబోయేడు దార్కా. అనబోతూ అనబోతూ ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని గుర్తించి చప్పున
అడుగు వెనక్కి వెయ్యబోయాడే గానీ క్షణం ఆలస్యం అయింది. విసురుగా వచ్చి గెడ్డం కింద తగిలిన దెబ్బ
ఎంత బలంగా వుందంటే - ఆరడుగుల దార్కా కూడా దాన్ని తట్టు కోలేక పక్కకు పడ్డా డు.

అతడు లేవబోతూంటే బూటుకాలు వచ్చి డొక్కలో తగిలింది. ముందుకు తూలేడు., ఆ తరువాత రెండు
నిమిషాలపాటు తగిలినచోట తగలకుండా అతడిమీద దెబ్బలు పడ్డా యి. సరీగ్గా ఊపిరి పీల్చుకోవటానికి కూడా
సమయం ఇవ్వలేదు. కొడుతున్న వ్యక్తికి తెలుసు -అవతలి వ్యక్తి తన కన్నా బలవంతుడనీ ఏ మాత్రం
వీలుచిక్కినా తనని అధిగమిస్తా డనీ అందుకే గుక్క తిప్పుకోకుండా కొడ్తు న్నాడు.

దార్కా సమాధి పక్కన పడ్డా డు. ముందు సమాధి రాయికి కొట్టు కొని నుదురు చిట్లింది. అంతలో అతడి
జుట్టు పట్టు కుని లేపి, తిరిగి కొట్టటంతో వెళ్ళి దుమ్ములో పడ్డా డు వంటినిండా ఒక్కసారిగా వందల ముళ్ళు
గుచ్చుకోవడంతో ప్రాణాలు తోడేసినట్టయింది.

"తులసికీ, కాష్మోరాకీ సంబంధం ఏమిటి?" భుజం రెక్క పట్టు కుని లేపుతూ అడిగేడా వ్యక్తి.
దార్కా మాట్లా డలేదు.

"కాష్మోరాకీ, నీకూ సంబంధం"

మౌనం

"అసలు నువ్వెవరు?"

దీనికి జవాబు ఇవ్వలేదు దార్కా. అతడు ఎంత తప్పు చేసేడో అతనికి అర్ధమవుతూంది. పత్రికాఫీసుకు
ఉత్తరం వ్రాయమని అంటే సరిపోయేది. కానీ ఏడు రోజుల్లోనే తులసి మరణిస్తుందని సమయం ఎక్కువగా
లేదనీ ఇలా కలుసుకోవడానికి తొందరపడ్డా డు. అయినా ఆ కలుసుకునే స్థలం కూడా ఏ పత్రికాఫీసులోనే
అయితే బావుండేది. ఇలా స్మశానానికి రమ్మని పిలవడం ఎవరికయినా అనుమానం కలుగుతుంది. ఎంత
చదువుకున్నా తన అనాగరికత ఎక్కడికి పోతుంది. స్మశానానికి రమ్మని పిలవటం.

అంత బాధలోనూ అతడికి నవ్వొచ్చింది.

అతడికి నెమ్మదిగా నిస్సత్తు వ ఆవరిస్తూంది. ముక్కులోంచి ధారాపాతంగా రక్తం కారుతోంది. కాళ్ళు


తేలిపోతున్నాయి. కళ్లు మూతలు పడుతున్నాయి.

"మీ....మీ....మీరెవరూ?" అన్నాడు ఆర్చుకుపోతున్న గొంతుతో దార్కా.

అప్పటివరకూ కర్కశంగా వున్న అతడి మొహంలో కొద్దిగా నవ్వు కనబడింది.

"నేనెవరో నీకు కావాలా అయితే విను" అన్నాడు.

"నా పేరు అబ్రకదబ్ర. ఆశ్చర్యపోకు. జెర్మనీలో దెయ్యాలు పారదోలేవాణ్ని అబ్రకదబ్ర అంటారు. నా అసలు
పేరు అబ్బూరి కేదారేశ్వర బ్రాహ్మిణ్"

దార్కాకు ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది. తను తులసి గురించి ప్రకటన ఇస్తే, ఈ దెయ్యాలు తోలేవాడు
వచ్చాడు స్మశానానికి.

"చెప్పు -కాష్మోరా ఎవరు? దాని గురించి నీకెలా తెలిసింది."

దార్కా నవ్వేడు "కాష్మోరా గురించి అలా ప్రకటిస్తే మానవాతీత శక్తు లు అలవడతాయని చదివేను ఎక్కడో
అందుకుని....." అన్నాడు.

ఆ మూర్ఖత్వం చూసి అబ్రకదబ్రకు నవ్వొచ్చింది. కానీ అంతలోనే తీరని అనుమానంతో దార్కా కళ్ళలోకి
చూస్తూ "నిజం చెప్పకపోతే వళ్ళు చీరేస్తా ను" అన్నాడు. ఒకరికి కావాల్సిన విషయం ఒకరు తెలుసుకోవడం
కోసం ఎంత పక్కపక్కగా వెళుతున్నారో ఇద్దరికీ తెలియలేదు. అప్పటికే దార్కా వళ్ళంతా చీరుకుపోయి ఉంది.
ముళ్లు గుచ్చుకుని రక్తం స్రవిస్తూంది. బట్టలు పీలికలైపోయాయి. అబ్రకదబ్ర చేతులమధ్య అతడు శవంలా
జారిపోతున్నాడు.

"నాకు తెలీదు ఇంకేమీ" అంటున్న దార్కా మాట పూర్తికాలేదు గెడ్డంకింద ఇంకొకసారి దెబ్బ పడింది.

దార్కా కూలిపోయాడు కుప్పగా.

వెన్ను దగ్గిర తగిలిన రాయి నరాల్ని పిండేస్తూంది. "పిచ్చి పిచ్చి మంత్ర తంత్రాలతో మనుష్యుల్ని భయపెట్టి
బాధపెట్టే నీకు యిదే శిక్ష" అంటూ తిరిగి చేతులు దులుపుకుని కారు దగ్గరకు వెళ్ళిపోయాడు బ్రాహ్మిణ్.

అచేతనంగా పడివున్నాడు దార్కా. స్మశానాపు చరచరాలన్నీ తమ సహచరుడి స్థితికి జాలిగా మౌనం


వహించినట్టు వున్నాయి.

ఆ నిశ్శబ్దా న్ని చెదురుస్తూ కారు కదిలి వెళ్ళిపోయిన శబ్దం. అదీ తగ్గిపోయింది - దూరంగా నెమ్మది
నెమ్మదిగా.

ఆ నీరవంలో అచేతనంగా పడివున్న దార్కా నెమ్మదిగా తలెత్తా డు.

అతడికి అడుగు దూరంలో కాలి జాడలున్నాయి.

అతడి ప్రత్యర్ధివి

దార్కా చేతుల్లోకి బలం తీసుకుని కొద్దిగా ముందుకు దూకేడు. ఆ అడుగుజాడ ముద్రలోంచి కాలి క్రింద
నలిగిన మట్టిని చేతిలోకి తీసుకున్నాడు.

మంత్రగాడి పగకు గురిఅయినవాడు ప్రాణాలతో భూమ్మీద వుండటానికి వీల్లేదు.

అతడి పిడికిలిలో మట్టి బిగుసుకుంది.

అతడి కళ్ళు మూతలు పడుతున్నాయి. శరీరం తేలిపోతున్నట్టు భావన.

అప్పుడు స్ఫురించింది అతడికి, తన గురువైన ఆచార్యుల వారికి్చిన వాగ్దా నం............ దక్షిణంగా గురువుకు
చేసిన ప్రతిజ్ఞ.......

"ఆ ముగ్గుర్నీ తప్ప ఇంకెవర్నీ చంపను నేను. నాకున్న విద్యల్తో నాలుగో వ్యక్తికి ద్రోహం తలపెట్టను......"

అతడి పిడికిలి నెమ్మదిగా విచ్చుకుంది. చేతిలోని మట్టి భూమ్మీద మట్టిలో కలిసిపోయింది. తనకి కావలసిన
ముగ్గురిలో తనని కొట్టినవాడు ఒకడని అతడికి తెలీదు. అతడి తల వాలిపోయింది పక్కకు.

స్పృహ తప్పుతూంటే దూరంగా ఒక కారు వస్తూన్న శబ్దం వినిపించింది. అది మైలురాయి దగ్గర ఆగింది.
అందులోంచి ఒక స్త్రీ దిగింది. ముందురోజు అతడికోసం పత్రికాఫీసుకు ఫోన్ చేసిన స్త్రీ ఆమే -
సిద్ధేశ్వరీదేవి !

8
అబ్రకదబ్ర ఇంటికి వచ్చాడన్న మాటేగానీ సంతృప్తిగా లేడు.

అసలు ఆ ప్రకటన ఏమిటో ఎందుకో అర్ధం కాలేదు.

తులసి కోసం కాష్మోరా వేచి వుండడం ఏమిటి ? దానికి పత్రికా ప్రకటన ఏమిటి? ఎవరిచ్చి వుంటారు ఆ
ప్రకటన? స్మశానంలో తనను కలిసిన కుర్రవాడికి, ఈ కాష్మోరాకి ఏమిటి సంబంధం?

అన్నీ అనుమానాలే. ఒకవేళ ఈ కుర్రవాడు ఎవరిచేతనయినా నియమించబడిన వాడు అయితే.......

ఎవరిచ్చి వుంటారు ఈ ప్రకటన?

ఈ తెరవెనుక వున్నవాడు ఎవడు?

తెర వెనుక అన్న ఆలోచన రాగానే అతడికి వెంటనే స్ఫురించింది ఒక పేరు -

'శ్రీనివాస పిళ్ళయ్' మరి ఆగలేదు.

కారు వేసుకుని బయలుదేరాడు.

కారు శ్రీనివాసపిళ్ళయ్ (ఒకప్పటి) ఇంటిముందు ఆగింది.

ఒక రిటై ర్డ్ డిప్యూటీ కలెక్టర్ వుంటున్నాడు ఆ ఇంట్లో అబ్రకదబ్ర శ్రీనివాస్ పిళ్ళయ్ గురించి అడిగేడు.
"అబ్బో -ఇప్పటి మాటా అది! పది సంవత్సరాల క్రితం......"

"అదే తరువాత ఎక్కడయినా కనపడ్డా డా?"

"కనపడ్డా డు!"

అబ్రకదబ్ర ఉద్విగ్నతతో "ఎక్కడ"అన్నాడు.

"రోడ్డు మీద"

ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ని ఆస్వాదించే స్థితిలో లేడు అతడు.

"ఎంత కాలం క్రితం వరకూ మీకు కనపడ్డా డు"


"దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితం" అన్నాడాయన. "రోడ్డు మీద నడుస్తూ ఉన్నట్టుండి తనమీద
ఏదో పడినట్టు చేతులు అడ్డు పెట్టు కునేవాడు. 'టప్.....టపా టపా టప్' అనరిచేవాడు. చిన్న పిల్లలందరూ
గుంపుగా వెనక పడేవారు. తర్వాత అంటే ఓ మూడు నాలుగు సంవత్సరాలు అయిందనుకుంటా - కనబడడం
మానేసేడు. ఏమయ్యాడు తెలీదు."

పెద్దమ్మాయి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.

ఈయన ఏదో అబద్ధం చెబుతున్నాడు. అబద్దం - అబద్ధం

"ఈ ఇల్లు మీరు కొన్నారా?" కాఫీ సిప్ చేస్తూ అడిగాడు.

"ఔను, ఏం?"

"ఎవరి దగ్గర" తాపీగా ప్రశ్నించేడు.

అప్పటివరకు మామూలుగా వున్న ఆయన మొహం చప్పున మారిపోయింది. కుర్చీలోంచి లేచి "మీరెవరు?"
అన్నాడు.

అబ్రకదబ్ర కుర్చీ వెనక్కివాలి "స్టా ర్ డిటెక్టివ్ ఏజన్సీ అపిలియేటెడ్ టూ స్కాట్ లాండ్ యార్డ్" అన్నాడు. ఆ
రిటై ర్డ్ డిప్యూటీ కలెక్టర్ చెయ్యి సన్నగా వణకడం స్పష్టంగా తెలుస్తూంది.

ఆయన బలహీనమైన గొంతుతో "నేను డబ్బు ఇచ్చే ఈ ఇల్లు కొనుకున్నాను" అన్నాడు.

"ఎవరికి?"

"పిళ్ళై తమ్ముడికి"

"అతడెవడు"

"శ్రీనివాస పిళ్ళై ఒక మఠానికి ట్రస్టీ"

"తెలుసు, పది సంవత్సరాల క్రితం పిచ్చెక్కక ముందు"

"మేం ఆ ట్రస్ట్ కి నెల నెలా అద్దె పంపుతూ వుండేవాళ్ళం. మా ఆవిడ అంటూ వుండేది -ఇంటి యజమాని
మనముందే రోడ్లమీదే పిచ్చెక్కి తిరుగుతూంటే మన కెందుకండీ వాళ్ళ కెవరికో నెలనెలా అద్దె పంపించడం అని-
కానీ నేను ఒప్పుకోలేదు. అలా దాదాపు ఏడు సంవత్సరాలు జరిగింది"
"తరువాత"

"ఒక రోజు పిళ్ళైని అతని తమ్ముడు తీసుకొచ్చాడు ఈ ఇల్లు మాకు అమ్మేస్తు న్నానన్నాడు"

"ఆ పిచ్చి వాడికి నేను తమ్ముణ్ని అని ఎవరో వస్తే మీరు నమ్మేటట్టు చేసింది. ఏడు సంవత్సరాల నుంచి అద్దె
కడుతున్నాం అది ఎవరికి కడుతున్నామో తెలియకుండా నెల నెలా అద్దె కడుతున్నాం. అది ఎటుపోతుందో
తెలీదు"

"ఎంత కొన్నారీ ఇల్లు "

"పదిహేను వేలకు"

అబ్రకదబ్ర చేతిలో కాఫీ తొణికింది. లక్షపైగా చేసే ఇల్లు పదిహేను వేలకు -

"ఎవరికిచ్చారు ఆ డబ్బు"

"పిళ్ళయ్ తమ్ముడికి"

"తర్వాతేం జరిగింది"

"ఇల్లు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది"

"నేనడుగుతూంది పిళ్ళయ్ సంగతి" అసహనంగా అన్నాడు అబ్రకదబ్ర

"ఆ తరువాత అతడు కనబడలేదు. "

"అంటే... చంపేసేరా?"

ఆయన ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డా డు. వందేళ్ళు మీదపడ్డట్టు కృంగిపోయాడు.

"నాకూ అనుమానం వచ్చిందిబాబూ. కానీ ఏం చెయ్యను? ఇల్లు రిజిస్టరు అయిపోయంది. తర్వాత ఎవరూ
నన్ను ప్రశ్నించలేదు. నేనూ అద్దె కట్టడం మానేశాను. నెమ్మదిగా ఆ విషయం మర్చిపోయాను. ఆ తమ్ముడు
పిళ్ళైని ఏం చేసేడో"

అబ్రకదబ్ర కన్నార్పకుండా ఆయనవేపు చూసేడు. ఆయన మాటల్లో నిజం వుండవచ్చును. కానీ దాని వెనుక
ఎంత చేదు నగ్నసత్యం.
మంత్రగాళ్ళు మనుష్యుల్ని చంపుతారు. చేతబడులు చేస్తా డు. హింసిస్తా డు. కానీ నాగరికత ముసుగులో
మనిషి, సాటి మనిషిని ఎంత తేలిగ్గా చంపుతున్నాడు. ఈ రిటై ల్డ్ డిప్యూటీ కలెక్టర్ తన ఇంటికోసం రోడ్డు వెంట
తిరిగే ఓ పిచ్చి వాడి మరణాన్ని ఎంత సహజమైన ఆత్మవంచనతో ఒప్పుకుంటున్నాడు. ఇంతకన్నా చేతబడి
చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు?

అతడు లేచి "వెళ్లొస్తా ను" అన్నాడు.

మెట్లు దిగుతుంటే వెనుకనుంచి ఆయన కంఠం వినిపించింది.

"బాబూ"

అబ్రకదబ్ర ఆగేడు.

"మా ఇంటికేం ప్రమాదం లేదుగా"

కసితో, రోషంతో "లేదు" అన్నాడు వెనుదిరక్కుండానే.

అతడు కారు దగ్గరికొచ్చి కూర్చుని తలుపు వేయబోతూ వుంటే లోపల్నుంచి పెద్ద కూతురు పరుగెత్తు కు
వచ్చింది.

"మీరు స్కాట్ లాండ్ యార్డ్ వెళ్ళారా?"

"వెళ్ళాను"

"జేమ్స్ బాండ్ ని చూసేరా?"

"చూసేను -ఏం?"

"రియల్లీ మాట్లా డేరా" ఉద్విగ్నతతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.

"అప్పుడప్పుడు -ఏం?"

ఆమె ఆనందం పట్టలేక కెవ్వున అరిచి డోర్ లోంచి చెయ్యి లోపలికి పెట్టి "ఆటోగ్రాఫ్ ప్లీజ్" అంది.

"చేతిమీదేనా?"

".......ప్లీజ్....."

చేతిమీద సంతకం (పెన్ -తో) పెట్టేడు.


ఆమె దానివైపే చూసుకుంటూ వుండగా కారు కదిలింది. చల్లటిగాలి రివ్వున వీస్తూంది. అతనికి నవ్వు
వచ్చింది.
నడుమునొప్పి చేతబడేమో అని భయపడే అనాగరికుడైన గ్రామస్తు ని చూసి హేతువాది హేళన చేస్తా డు.
చదువుకున్న వాళ్ళ అనాగరికతని చూసి ఇంకా తెలివైన వాడు నవ్వుకొంటాడు.

ఇంతకీ శ్రీనివాసపిళ్ళయ్ ఏమయ్యాడు?

9
"హేతువాదం" అన్నాడు పండిత్. "మనకి తెలియనిదంతా లేదనుకోవడం హేతువాదం కాదు"

తులసి పెన్ తో పుస్తకంలో పిచ్చిగీతలు గీస్తూంది.

పండిత్ చెబుతున్నాడు.

"ఒకరు ఒక చేతిని తాయెత్తు కట్టు కున్నారంటే, అది తమ సంతృప్తికి అయుండకపోవచ్చు సర్! కేవలం
ఇంట్లో వాళ్ళ కోసం అయివుండొచ్చుగా"

"అందమైన ఆత్మ వంచన అన్నాడు" పండిత్.

క్లా సు ఘొల్లు మంది. తులసి మొహం ఎర్రగా కందిపోయింది. అది గమనించి పండిత్ అనునయిస్తు న్నట్టు
అన్నాడు - "మీరు చదువుకునే వాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకదాన్ని నమ్మి మీ చేతికి తాయెత్తు లు కట్టినా,
మీమీద తమ అభిప్రాయాలు రుద్దినా నమ్మి దానని మీరు ఎదుర్కోవాలి అంటే వాళ్ళతో దెబ్బలాడమని కాదు.
వాళ్ళని మీకున్న హేతువాదంతో వప్పించాలి. ఒక గుడ్డలో కట్టిన చిన్న రాగి ముక్క మిమ్మల్నెలా రక్షిస్తుంది అని
ప్రశ్నించాలి."

* * *
ఆ సాయంత్రం తులసి తల్లితో ఘర్షణ పడింది.

"ఏదో చిన్న తాయెత్తు నా ఆరోగ్యాన్ని కాపాడుతుందా?"

"నాకు తెలీదమ్మా" అంది శారద. "ఎవరో సంతాన్ ఫకీరట! పది సంవత్సరాల క్రితం నీ చేతికి కట్టా డు.
ఇరవైరెండేళ్ళ వయసు వచ్చేవరకూ విప్పొద్దని మీ నాన్నగారికి చెప్పాడు"

తులసి తన గదిలోకి వచ్చేసింది. సాయంత్రం ఆరయ్యింది. బాగా చీకటిపడింది.

తాయెత్తు .

జాకెట్ క్రింద - చేతికి కట్టబడి వుంది. దాదాపు శిదిలావస్థలో వుంది అది. పది సంవత్సరాల నుంచీ నీళ్ళకి
తడిసీ రాపిడికి నలిగీ.....

ఆమెకి నవ్వొచ్చింది. పండిత్ చెప్పేవరకూ తనకు దాని గురించి గుర్తు లేదు. ఇన్ని ప్రయోగాలు చేస్తు న్న తను,
తన విషయంలో ఇంత చిన్న దాన్ని మర్చిపోయింది. ఆమె కత్తెర తీసుకుని టాయిలెట్ లోకి వెళ్ళింది. చేతిమీద
వున్న జాకెట్ కొద్దిగా పైకెత్తి కత్తెరతో కట్ చేసింది. టప్ మన్న శబ్దంతో తాడు తెగింది. దాన్ని టాయిలెట్ లో వేసి
ఫ్లెష్ అవుట్ లాగింది. పెద్ద శబ్దంతో నీళ్ళు నిండుకున్నాయి. డ్రైనేజ్ గుండా నీళ్ళు వెళ్ళిపోతున్న చప్పుడూ
నీళ్ళతోపాటు తాయెత్తు కూడా వెళ్ళిపోయింది.

* * *
దార్కా కళ్ళు విప్పేడు. గది చల్లగా వుంది. చుట్టూ చీకటి.

వళ్ళంతా నొప్పులు, రక్తం పోవటంవల్ల నీరసంగా కూడా ఉంది.

అయినా అతడు దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎంతకాలం తను ఇలా స్పృహ తప్పి వున్నాడో
తెలుసుకోవాలి ముందు.

అతడు పక్క మీదనుంచి లేచాడు.

చాలా అందంగా అలంకరించబడి వుంది గది. చల్లటి గాలి ఒక మూలనుంచి రివ్వున వీస్తోంది.

నిశ్శబ్దా న్ని భంగపరుస్తూ గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. దార్కా పెట్టసాగేడు,


ఒకటి...రెండు......మూడు... పన్నెండు పూర్తయ్యేయి.

ఎవరు తనని ఇక్కడ వుంచింది? స్మశానం నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు?ఎందుకిలా బంధించి
వుంచారు?

దార్కా చేయి వెంటిలేటర్ గుండా జార్చి బయట గడియతీసి, ఆ గదిలోకి ప్రవేశించాడు.

చాలా విశాలమైన గది అది.

గదిలోకి అడుగుపెడుతూనే అతడు నిస్చేష్టు డై క్షణంపాటు నిలబడి పోయాడు. గదిలో బల్లమీద అతడినే
నిశ్చలంగా చూస్తు న్నట్టు వుంది.......

ఒక పుర్రె.

తన పూర్వ సహచరుణ్ని చూసినట్టు అతడు చప్పున దాని దగ్గరకు వెళ్ళాడు. చేతుల్లోకి తీసుకున్నాడు.

క్షణంలో వెయ్యోవంతు కూడా పట్టలేదు అతడికి -ఆ పుర్రెకీ మామూలు పుర్రెకీ భేదం వున్నదని
తెలుసుకోవడానికి.

చిన్నతనం నుంచీ కపాలాల మధ్య పెరిగినవాడు. కపాలాన్ని సాధనాలుగా చేసుకుని విద్యల్ని సాధించినవాడు.
అతడికి ఆ పుర్రెలో వున్న తేడాని కనుక్కోవటంలో పెద్ద కష్టం ఏముంది?

అతడు చేతిలోని పుర్రెని పరీక్షగా చూసేడు. నుదుటిమీద నుంచి ఎడమ కంటి వరకూ చీలి వుంది. అందులో
వింత ఏమీ లేదు. అతడికి బరువులో తేడా తెలుస్తూంది. కపాలాన్ని చూడగానే ఎంత కాలం క్రితందో అతడు
సులబంగా చెప్పగలడు.అంత పురాతనమయిన కపాలం అంత బరువు వుండడానికి వీలులేదు. అతడు లోపల
చెయ్యిపెట్టి చూసేడు. అంతా డొల్లగా వుంది కానీ-

మెదడు వుండవలసిన చోట కొద్దిగా ఉబ్బెత్తు గా లోపలివైపు వున్నట్లు అనిపించింది.

నుదురు దగ్గర చీలికని ఎడంచేసి లోపల ఏముందో చూడడం కోసం వేళ్ళతో కణతల దగ్గర నొక్కుతూంటే
వెనుకనుంచి వినబడింది.

"హల్లో!"

అతడు చప్పున వెనుతిరిగేడు.

గుమ్మం దగ్గర చక్రవర్తి నిలబడి వున్నాడు.

"ఎలా వుంది ఆరోగ్యం?"

దార్కా మాట్లా డలేదు. తలుపు వెంటిలేటర్ నుంచి బయటపడిన విషయం అతడు అడుగుతాడని
అనుకున్నాడు. కానీ చక్రవర్తి ఆ ప్రసక్తి ఏమీ తీసుకురాకుండా "నాతో రా" అన్నాడు.

దార్కా అతడిని అనుసరించేడు.

ఇద్దరూ ఇంకో గదిలో ప్రవేశించారు.

దార్కాకి ఆశ్చర్యంగా వుంది. ఇన్ని గదుల్లో ప్రవేశిస్తూన్నా బయటికి ద్వారం కనపడకపోవడం. చాలా
ధనవంతులై వుండాలి వీళ్ళు ప్రతి గదీ అందంగా అలంకరింపబడివుంది.

చక్రవర్తి లైటు వేసేడు.

గది మధ్య లో కుర్చీలో కూర్చుని వుంది.

సిద్ధేశ్వరి.

లైటు వెలగ్గానే తల పైకెత్తి దార్కా కేసి చూసింది. దార్కా నిర్లిప్తంగా చూస్తు న్నాడు. అతడికి భయంగా ఏమీ
లేదు. ఇటువంటి వాళ్ళను వందమందినైనా అతడు కావాలంటే కట్రాటలు చెయ్యగలడు. కానీ అతడు
ఆశించినట్టు గాక, సిద్దేశ్వరి మృదువైన కంఠంతో "కూర్చో" అన్నది.

దార్కా కూర్చుంటు ఆమె వైపు చూసి ఉలిక్కిపడ్డా డు. మంత్రాలు చదివీ చదివీ అభ్యాసం చేసీ చేసీ తీక్షణత
సంతరించుకున్న అతడి కళ్ళకి సిద్దేశ్వరిలో ఏదో అపశృతి కనిపించిది ఏమిటది.

ఏదో వుంది, ఏదో

అతడు తనవైపే సూటిగా చూడడం గమనించి ఆమె మందహాసం చేసింది. చక్రవర్తి మౌనంగా నిలబడి
వున్నాడు. ఆ గదిలో నిశ్శబ్దా న్ని భంగపరుస్తూ ఆమె అడిగింది.

"కాష్మోరా ఎవరు?"

దార్కా భారంగా ఊపిరి వదిలి వెనక్కి జారపడ్డా డు. ఈ కాష్మోరా ఎందుకింత ఆసక్తికరంగా ఈ నాగరికులకు
కనబడ్తు న్నాడు?

"చెప్పు -కాష్మోరా ఎవరు?"

దార్కా ఆలోచిస్తు న్నాడు. అంతకు ముందురోజే అతడు స్మశానంలో ఒకరిని ఎదుర్కోవలసి వచ్చింది. తను
జాగ్రత్తగా మాట్లా డి వుంటే వచ్చిందెవరో తెలిసి వుండేది. కేవలం తన తొందరపాటు చర్యవల్ల అనవసరంగా
దెబ్బలు తగిలాయి. ఈ సారి ఆ తప్పు చెయ్యకూడదు. ఇంకోరకంగా ప్రవర్తించాలి.

"కాష్మోరా....." అని సిద్దేశ్వరి ఏదో అనబోతుంటే మధ్యలో అతడు అందుకుని కాష్మోరా అనేది ప్రయోగం.
చేతబడి కన్నా ఎనిమిది రెట్లు పెద్దది. క్షిత్ అనేది పదిహేనో అంకం. దాని తరువాతది కాష్మోరా" అన్నాడు.

"చేతబడులు అనేవి వున్నాయా?"

దార్కా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు గదిలో గాఢమైన నిశ్శబ్దం పేరుకుంది.

"నీ పేరు?"

"దార్కా"

"ఊరు?"

"బిస్తా "

సిద్దేశ్వరి నెమ్మదిగా తలెత్తింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.


"ఎవరిమీద కాష్మోరా ప్రయోగించాలనుకుంటున్నావ్ నువ్వు?"

దార్కా మాట్లా డలేదు. అతని వద్దనుంచి జవాబు రాకపోవడంతో ఆమె అన్నది -"ఈ సిద్దేశ్వరికి 'భవిష్యత్'
వర్తమానం, గతం' అన్నీతెలుసు. నాకు తెలియక కాదు నిన్నుఅడుగుతున్నది కేవలం నీ ద్వారా అన్నీ
తెలుసుకుందామని.'

దార్కా నవ్వేడు. "మీకేం తెలుసు చెప్పండి, చూద్దాం"

ఆమె నవ్వలేదు. చిన్న గొంతుతో అంది. "ఉదాహరణకి కాష్మోరా ప్రయోగిస్తే ఆ మనిషి ఇరవై ఒక్క రోజులు
బాధపడతాడన్నది నాకు తెలుసంటే......"

దార్కా ఉలిక్కిపడ్డా డు.

ఆమె నవ్వింది. "కాష్మోరాలో చివరి అంకం పీడం. దాన్నే కోమా అంటారు. ఇరవై ఒకటో రోజు రోగి కోమాలోకి
వెళతాడని నాకు తెలుసంటే........"

దార్కా ఆమెవైపు సాలోచనగా చూసేడు. ఆమెకు నిజంగా మనోగ్రహణ శక్తి వుందా?

అతడి ఆలోచన్లని తెగ్గొడుతూ ఆమె అన్నది

"నువ్వు తులసి మీద కాష్మోరాని ప్రయోగింపదల్చుకున్నావ్ అని కూడా నాకు తెలుసు."

అదే ఆమె చేసిన తప్పు. దాంతో అతడికి అర్ధమైపోయింది. కుర్చీ వెనక్కి వాలి నవ్వేడు. "మీకు గతం తెలిసి
వుంటే తెలిసి వుండవచ్చు కానీ భవిష్యత్ తెలియదు. తులసిని చంపడం నా ఆశయం కాదు. పేపర్లో నేనిచ్చిన
ప్రకటన చూసి మీరు ఊహించిన కథ అది."

"కాష్మోరాలో ఇరవై ఒక్కరోజు......" అంటున్న ఆమె మాటల్ని మధ్యలో ఖండిస్తూ "దానికేముంది..........ఏ


ప్రాచీన గ్రంధంలో చూసినా అది కనబడుతుంది" అన్నాడు.

ఆమె కొద్దిగా విసుగుతో........"సరే నా గురించి దేనికిలే....నీకేం శక్తు లున్నాయి. అది చెప్పు" అన్నది.

అతడు లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆలోచిస్తూ.........ఆ గది, అవతల ఇంకో గది, దానికి ఒక కిటికీ
ఉన్నాయి. కిటికీలోంచి మైదానంలో తిరుగుతున్న కోళ్ళు కనబడుతున్నాయి.

"ఏం చెప్పమంటారు?"
"నీకున్న శక్తిలో ఏదయినా సరే."

అతడి వద్దనుంచి జవాబు రాలేదు. నిశ్చలంగా నిలబడి వున్నాడు. ఎంతసేపటికీ అతడు కదలకపోవడంతో
చక్రవర్తి అతడి దగ్గిరగా వెళ్లా డు. దార్కా దృష్టి కిటికీలోంచి బయటకు వుండడం చూసి, అతనూ అటు
చూసేడు.

ఆ దృశ్యం చూసి అతడు నిశ్చేష్టు డయ్యాడు. మైదానంలో కోళ్ళు శిలా విగ్రహాల్లా నిస్చలంగా నిలబడి
వున్నాయి. ఒక్కసారిగా అన్ని కోళ్ళు అంత నిశ్చలతని సంతరించుకోవటంతో -ఆ చిత్రం -మనిషి
వూహించలనిది.

"శభాష్" అంది సిద్దేశ్వరి" దార్కా, నువ్వు నిజంగా గొప్ప మంత్రగాడివి"

దార్కా మౌనంగా వున్నాడు. తను ప్రదర్శించింది తనకున్న విద్యలో కెల్లా అతి చిన్నది.

"దార్కా నీ కెన్ని గొప్ప శక్తు లున్నాయో నాకు అన్ని శక్తు లు వున్నాయి. కానీ నిశ్చయంగా నా కన్నా నువ్వే
గొప్పవాడివి."

"మీకేం శక్తు లున్నాయి."

సిద్దేశ్వరి నవ్వింది. చక్రవర్తి ఆ ప్రశ్నకి జవాబు యిచ్చాడు. "దేవీ ప్రతిరోజూ నాలుగయిదు గంటలపాటూ ఒక
పెట్టెలో కూర్చుని దేవుని ప్రార్థిస్తా రు. ఆ పెట్టెలో గంటకన్నా ఎవ్వరూ కూర్చోలేరు."

దార్కాకి నవ్వొచ్చింది. బిస్తా లో కుర్రవాళ్ళు ఆడుకునే ఆటల్లో నేలలో తలదూర్చి ఒంటెలా గంటల తరబడి
వుండిపోవడం గూడా ఒక ఆట.

"నీ చేతులు గాలిలోకి సాచు నాయనా"

ప్రతిజ్ఞ చేస్తు న్నవాడి భంగిమలో దార్కా చేతులు సాచేడు 'అలాక్కాదు' అంటూ ఆమె సరిచేసి "గుప్పెళ్ళు
ముయ్యి నాయనా" అంది.

అతడు మూసేడు.

శివుడి విగ్రహం ముందు అగరొత్తి వెలుగుతుంది.

"నాయనా లింగపు నుదుటిమీద అడ్డంగా వ్రాసిన బూడిద చాలా పవిత్రమైంది. లింగం కన్నా అది గొప్పది. నా
మహిమవల్ల నేను ఆ పవిత్ర భస్మాన్ని నీ చేతుల్లో సృష్టించదల్చుకున్నాను. ఇప్పటి వరకూ, బాబాలు, ఋషులూ
తమ చేతుల్తోనే వాటిని సృష్టించి భక్తు లకు ఇచ్చేవారు కానీ ఈ రోజు నా కున్న సమస్త శక్తు ల్నీ వినియోగించి ఆ
భస్మాన్ని నీ చేతిలోనే సృష్టించబోతున్నాను. ఈ క్షణమే నిన్ను నా శిష్యుడిగా స్వీకరించబోతున్నాను"
సిద్దేశ్వరి అగరొత్తు పొడిని అతడి కుడిచేతి పిడికిలిమీద చల్లింది.

"భగవంతుడి అపూర్వమైన శక్తి నా నుంచి నీకు ప్రవహించబోతూంది. ఈ ప్రపంచంలో పెరిగిపోతున్న


పాపులను రక్షించడానికి భగవంతుడి తరపున వచ్చిన ప్రతినిధిని నేను. నా ఆజ్ఞ ప్రకారం నీకు గొప్ప మేలు
జరగబోతూంది నాయనా. నీ ఎడమ చెయ్యి విప్పు."

దార్కా కళ్ళు విప్పి తన చేతులవైపు చూసుకున్నాడు. పిడికిళ్ళు మూసుకునే వున్నాయి. కుడి చెయ్యిమీద
అగరొత్తు లు తాలూకా బూడిద అలాగే వుంది. అతడు తన ఎడమ చేతి పిడికిలిని నెమ్మదిగా విప్పేడు.

అరచేతి మధ్యలో బూడిద -క్షమించాలి. లింగపు నుదుటిమీద రాసే పవిత్ర భస్మం మెరుస్తూ వుంది.

10
కాకతాళీయంగా జరిగే సంఘటనల గురించీ మనుష్యులీద వాటి ప్రభావం గురించీ, కాకతాళీయంగా జరిగే
పరిచయాలు ఎంత బలంగా పెనవేసుకుపోతాయన్నదీ, ఇంతకుముందొకసారి ప్రస్తా వించడం జరిగింది. శారదకి
ప్రొఫెసర్ జయదేవ్ తో జరిగిన పరిచయం అలాంటిదే.

అలాటి పరిచయమే అబ్రకదబ్రకీ, పండిత్ కీ మధ్య జరిగింది. తులసి పంతొమ్మిదో పుట్టినరోజు జరిగిన
పార్టీలో ఆమె వాళ్ళిద్దర్నీ ఒక్కొక్కరికి పరిచయం చేసింది. అప్పుడెక్కువ మాటలు జరగలేదు.

మళ్ళీ ఇన్నాళ్ళకి, లైన్స్ క్లబ్ ఫంక్షన్ లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది, కాక్ టై ల్స్ మధ్య.

మామూలుగా ఇధ్దరు కలుసుకుంటే సినిమాని గురించో, రాజకీయాల గురించో మాట్లా డుకుంటారు. కానీ
పండిత్ లాటి వాళ్ళు కంప్యూటర్ల గురించీ, డాల్డన్ ధియరీ గురించీ మాట్లా డతారు.

అబ్రకదబ్రతో పండిత్ మనిషి మెదడు గురించి మాట్లా డడం మొదలుపెట్టా డు.

"సృష్టి చాలా విచిత్రమైనది. ఈ ప్రపంచాన్ని మానవాతీత శక్తిఏదో నడిపిస్తూందని నమ్మేవాళ్ళు వాదనకి బలం
చేకూర్చే విషయం ఒకటుంది. అది 'మెదడు' ఒక చిన్న చీమ మెదడులాంటి కంప్యూటర్ తయారు
చెయ్యాలంటే ఎన్నో మిలియన్ల సర్క్యూట్స్ ని అమర్చాలి. దేముడూ అనే వాడు అని నమ్మితే, అతడి అద్భుత
సృష్టి మెదడు. మనిషి విలువైన అవయవాల్ని దేముడు అని భద్రమయినచోట అమర్చాడు. ఎముకల వెనుక
గుండెనీ, క్రొవ్వు మధ్య కిడ్నీస్ నీ, ఇలా అయితే అన్నింటికన్నా విలువైన మెదడు విషయంలో ఇంకా జాగ్రత్త
తీసుకున్నాడు. ఒక ఇనప్పెట్టెలాంటి స్కల్ లో దాన్ని పెట్టేడు. అది చాలదన్నట్టూ ఆ ఇనప్పెట్టెలో పెరిబ్రోస్సినల్
ద్రవం పోసేడు. ఆ ద్రవంలో తేలుతూ మెదడు రాపిడి నుండి రక్షించబడుతుంది. ఆ ద్రవమే మెదడుని అన్ని
వైపులనుంచీ నొక్కుతూ కదలకుండా ఉంచుతుంది.
మనిషి మెదడులాంటి కంప్యూటర్ ని తయారు చెయ్యాలనుకొంటే దానికి ఎలక్ట్రా నిక్ సెల్స్ కంటే, అంతకన్నా
ఎక్కువ పవరుగల మనిషి నరాల కణాల్ని ఉపయోగించవచ్చనే కొత్త థియరీని నేను ప్రతిపాదిస్తు న్నాను"

ఎవరో అడిగేరు "మనిషి మెదడుని తొలగించి ఆ స్థా నంలో కంప్యూటర్ ని అమర్చవచ్చంటారా" అని

"అమర్చవచ్చు."

"ఇదేదో చందమామ కథలా వుంది" ఓ మూలనుండి సన్నటి స్వరం.

అందరూ ఘొల్లు మన్నారు. అబ్రకదబ్రకి కూడా నవ్వొచ్చింది.

అంతలో పండిత్ జవాబు చెప్పేడు. "మనిషి మెడ దగ్గర 37 గ్రాముల రేడియో ఆక్టివ్ ఐసోటోపు ఫ్లూ టోనియమ్
239 ఆక్సైడ్ అమర్చడం ద్వారా, మెదడుని కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చెయ్యవచ్చునని."

"ఎవరు కనుక్కున్నారు?"

"భారతదేశపు ఒక డాక్టర్ డాక్టర్ సన్యాల్."

"ఆపరేషన్ విజయవంతం అయిందా?"

"అయింది"

"అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు?"

"కేవలం నేనొక్కణ్ణే ఆ సమయంలో డాక్టర్ సన్యాల్ తో వున్నాను కాబట్టి -ఆ రహస్యంగా జరిగిన ఆపరేషన్ కి
నేనొక్కణ్ణే ప్రత్యక్షసాక్షిని కాబట్టి......."

"మీరీ విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు?"

"చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టి - డాక్టర్ సన్యాల్ చనిపోయాడు కాబట్టి"

"ఇంతకీ ఏమిటా ఆపరేషన్? ఎవరికి చేశారు?"

"టప్ టపా టప్ అని ఎప్పుడూ అరుస్తూ తిరిగే ఓ పిచ్చివాడి మెదడుని కంప్యూటరైజ్ చేసి సరిచేసేం"

అబ్రకదబ్ర చేతిలో గ్లా సు జారి నేలమీద పడి భళ్ళున బ్రద్ధలయింది. అతిధులందరూ అతడివైపు తిరిగి
చూసేరు.
అబ్రకదబ్ర నిశ్చేష్టతతో స్థా ణువై నిలబడి వున్నాడు. అతడి పెదవులు అస్పష్టంగా కదిలినయ్...... "టప్ టపా
టప్ అని అరుస్తూ తిరిగే పిచ్చివాడా!"

11
"మీకు నిజంగా అద్బుత శక్తు లున్నాయి" అన్నాడు దార్కా.. సిద్దేశ్వరి నవ్వింది.. "నీ శక్తు లతో పోల్చుకుంటే
నావి చాలా చిన్నవి దార్కా. అందుకే మనిద్దరం కలిస్తే ఈ ప్రపంచంలో ఇంక ఏ శక్తి మనల్ని ఓడించలేదు."

"నా ఆశయం వేరు" అన్నాడు దార్కా.

"ఏమిటి నీ ఆశయం?" అని అడిగేడు చక్రవర్తి దార్కా చెప్పబోతూ వుంటే సిద్దేశ్వరీ చేత్తో ఆగమని సైగచేసి,
దార్కా వైపు తిరిగింది.

"నాయనా, దేవి మహత్తు తో నీ ఆశయం కనుక్కోగలను నేను. దాన్ని సాధించడం ఎలాగో కూడా
చెప్పగలను. అలా కూర్చో -నీ ప్రశ్నవ్రాయి."

దార్కా పొడవాటి బల్లకు ఒక చివర కూర్చొన్నాడు. కాగితం మీద ప్రశ్న వ్రాసేడు.

"కాద్రాని చంపిన ముగ్గురు వ్యక్తు లు ఎవరు?"

బల్లకి అటుచివర్న కూర్చొన్న సిద్దేశ్వరి పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. "తులసి కోసం కాద్రాని
చంపిన ముగ్గురు వ్యక్తు లు వివరాలూ నీకు కావాలా నాయనా" అని అడిగింది.

దార్కా అప్రతిభుడయ్యాడు.

తను ప్రశ్న వ్రాస్తుండగానే ఆ చివర కూర్చున్న ఆమెకి అది ఎలా తెలిసింది?"

"నీకు తులసి చిరునామా కావాలా నాయనా"

ఈమె తనకి ఆ చిరునామా ఇవ్వబోతూందా? తన ఇన్నాళ్ళ ఆశయం నెరవేరబోతూందా? ఉద్వేగంతో


అతడు లేచి నిలబడ్డా డు.

సిద్దేశ్వరి చక్రవర్తి వైపు కళ్ళతో సైగ చేసింది. చక్రవర్తి ఒక రిజిష్టరు పుస్తకం తీసుకొచ్చి బల్లమీద వుంచి తెరిచేడు.

దార్కా ఆత్రంగా పేజీలవపు చూసేడు. విరాళాలు, దాతల పేర్లు చిరునామాలు వున్నాయి అందులో.

రూ.216, తులసి, అని చదవగానే పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కణ్నుంచి తినబోతున్న తాయిలం
జారిపోయిన పిల్లవాడిలా వున్న దార్కా పరిస్థితి గమనించినట్టు సిద్దేశ్వరి చిరునవ్వుతో "ఆ తులసి వివరాలు చిన్న
కాగితం మీద వ్రాసిస్తా డ్లే నాయనా. దానికి తొందరేముంది? ముందిది చెప్పు. ఆ తులసి ఎవరో నీకెందుకు"
అంది.

"తులసిని కనుక్కోవడం నా జీవితాశయం"

"ఎందుకో?"

దార్కా మాట్లా డలేదు. సిద్దేశ్వరి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి తాపీగా చెప్పడం మొదలు పెట్టింది.

"దార్కా! ప్రజలని బాధలనుంచి తప్పించడానికి, ప్రజల దుఃఖం తొలగించడానికి దేవుడు తరపున పంపబడ్డ
దేవిని నేను. ప్రజలకి నమ్మకం కలిగించడం కోసం దేవుడు నాకు కొన్ని శక్తు లు ఇచ్చాడు. వాటిని ప్రదర్శించి
ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాను. తండోపతండాలుగా ప్రజలు నన్ను కలుస్తు న్నారు."

ఆమె మొహంలో కొద్దిగా నవ్వు తొంగి చూసింది. "నీలో నాకుబాగా నచ్చింది నిజాయితీ. దార్కా - ఆ
నిజాయితీతోనే నేనూ నీకు కొన్ని విషయాలు చెప్తా ను విను. ప్రజలు మూర్ఖులు, వారి మూర్ఖత్వాన్ని డబ్బు
చేసుకోవడంలో తప్పులేదు. వారి భ్రాంతులకి, వారి మానసిక రుగ్మతలకీ మానవాతీత శక్తు ల పేర్లు అన్వయించి
డబ్బు సంపాదించడం నా ఆశయం. నాతో రా చూపిస్తా ను" అతడు తటపటాయించి ఆమెతో నడిచేడు.
వాళ్ళిద్దరూ విశాలమైన వరండా గుండా ప్రయాణం చేసి చీకటిగా వున్న చోట మెట్లు దిగి కింది గదిలోకి వెళ్ళారు.
గది అడుగున వున్నా అఖ్కడ ఎంతో చల్లగా వుండడం అతడు గమనించేడు. సిద్దేశ్వరి ఇనుప పెట్టె తెరిచింది.

ఆ దృశ్యాన్ని చూసి దార్కా అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసేడు.

ఆ పెట్టెనిండా బంగారు ఆభరణాలు, కరెన్సీ వున్నాయి .కొన్ని లక్షల విలువగల ఆభరణాలు.అతడు నిశ్చేష్టత
నుంచి తేరుకోకుండానే ఆమె అన్నది, "ఇంతకాలం మానవాతీత శక్తు లు ఏవీ లేవనే నేను నమ్ముతూ వచ్చాను.
కానీ నిన్ను చూసిన తరువాత నా అభిప్రాయం మార్చుకొన్నాను. ఈ ప్రపంచంలో నీ అవసరం నాకు చాలా
వున్నది దార్కా."

అతడు విస్మయంతో "నా అవసరమా" అన్నాడు.

"నా అంతరంగిక శిష్యులు -నన్ను ఎంతగానో నమ్ముకున్నవారు కొంతమంది వున్నారు." అంది సిద్ధేశ్వరి.
"వారికి సాయం చేయవలసిన బాధ్యత నా మీద వుంది."

"దానికి నేనేం సాయపడగలను"

"చాలా"

"ఎలా?"
"తన పార్టీలో తనకన్నా పై స్థా నంలో వున్న మంత్రిని నా శిష్యుడు ఏదైనా చేసి
అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు. ఈ రాజకీయ చదరంగంలో చేతబడి అనే షా నువ్వు చెప్పాలి. బిజినెస్
లో తన ప్రత్యర్ధి ఒక పదిరోజులపాటు మంచాన పడితే నా శిష్యుడికి నూనె గింజల వ్యాపారంలో పది లక్షల పైగా
లాభం వస్తుంది. అతడి ఉపవాయువుల మీద నువ్వు ప్రయోగం చెయ్యాలి దార్కా! ఎవరికీ చెప్పుకోలేనివి నా
వాళ్ళు నాకు చెప్పుకుంటారు. అవి నీకు చెబుతుంటాను. వారి వారి శతృవుల్ని నీ శక్తితో చంపాలి -బాధ పెట్టా లి
-లేవకుండా చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా నీకు......" ఆమె అతడివైపు చూసి చప్పున మాటల్ని ఆపింది.

అంత చీకటిలోనూ అతడి మొహం ఎర్రగా ప్రతిబింబిస్తూంది. బిగించిన పెదవులు అతడు తన కసినీ,
కోపాన్నీ, రోషాన్నీ, ఎంత బలంగా నిగ్రహించుకుంటున్నాడో సూచిస్తు న్నాయి. అతి కష్టం మీద తన కోపాన్ని
దిగమింగి, "నన్ను మీ డబ్బుతో కొనాలనుకుంటున్నారా" అన్నాడు.

"అంత పెద్ద పదాలెందుకు. మన మొక వ్యాపారపు అగ్రిమెంటులో....."

"క్షమించండి....."

ఇనప్పెట్టె మూసి, ఆమె అతడి దగ్గిర కొచ్చింది. "ఒక్కొక్క చేతబడికీ నీకు లక్ష రూపాయలిస్తా ను"

అతడు మొహం తిప్పుకున్నాడు.

"సరే....... నీ కిష్టం లేకపోతే వెళ్ళిరా దార్కా"

"మరి తులసి వివరాలు-"

"నీకూ నాకు మధ్య వ్యాపారపు అగ్రిమెంట్ కుదర్లేదుగా దార్కా."

దార్కా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. దొరికిన లేడిని చంపకుండా ఆడిస్తు న్న పులిలా తాపీగా వుంది సిద్దేశ్వరి.

"ఈ భవనాన్ని సర్వనాశనం చేసైనా సరే తులసి చిరునామా సంపాదిస్తా ను"

"లక్ష రూపాయలు ఇశ్తా నన్నా ఒక మనిషిని చంపడానికి ఇష్టపడని నువ్వు అంత ఘాతుకానికి తలపడి నా
అనుచరుల్ని చంపుతావని నేననుకోను" అని ఆమె నవ్వింది.

దార్కా ఎటూతోచని వాడిలా నిలబడ్డా డు. సిద్దేశ్వరి తన అడుగు జాడలు చెరుపుతూ అంది. "ఆలోచించుకో
దార్కా నీకు ఒక్కరోజు టైం యిస్తు న్నాను."

ఒక రోజు.....
అంటే.....

తులసి మరణానికి ఇంకా ఎంతో సమయం వుండదు. ఈ ఒక్క రోజూ తను ఇక్కడే బందించబడితే- ఇక
ఎలా --

"నీ జీవితాశయం నెరవేరాలంటే నీకు తులసి వివరాలు కావాలి. అది చెప్పగిలగేది నేను ఒక్కదాన్నే. దానికి
ప్రతిఫలంగా నాకు నువ్వు సాయం చెయ్యాలి. అది బిజినెస్." అని ఆమె ఆగి, "నేనీ అడుగుజాడలు ఎందుకు
చెరుపుతున్నాననో తెలుసా" అంది. దార్కా మాట్లా డలేదు. నా కాలి క్రింద మట్టిలో నా మీద చేతబడి.....ఆ....
నాభిస్థా నంలో వుండే శంఖినీ నాడిమీద ప్రయోగం చెయ్యకుండా" అంటూ ఆమె నవ్వింది హేళనగా.

దార్కా నిర్లిప్తంగా "నేను నీమీద చేతబడి అంటూ చెయ్యవలసి వస్తే శంఖినీ మీద చెయ్యకూడదు సిద్దేశ్వరీ
నడుము దగ్గర వుండే లకుహా నాడిమీద చెయ్యాలి"

ఆమె అదిరిపడి "ఏమిటీ" అంది.

"మరి పురుషులకు చేతబడి చేసేది లకుహ మీదేగా, సిద్దేశ్వరీ -మంత్రగాడి కళ్ళు పిల్లికంటే చురుకయినవి
సుమా" అంటూ మొట్టమొదటిసారి నవ్వేడు. "నాకు నిన్ను చూసిన క్షణమే అనుమానం వచ్చింది నువ్వు స్త్రీవి
కావు."

ఆమె స్థా ణువైంది. పాలిపోయిన మొహంలోకి తిరిగి రక్తం చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. "చాలు
తెలుసుకున్నావ్? నిన్ను బ్రతకనివ్వకూడదు" అంటూ వెళ్ళిపోయింది.

12
ఆ మరుసటి రోజే సిద్దేశ్వరీ ఆలయంలో మహాపూజ.

ఆ రోజు అక్కడ చాలా కోలాహలంగా వుంటుంది. ఆ హడావుడిలోనే లోపలికి ప్రవేశించాలి అనుకుంది


తులసి.

ఆమె కూర్చుని రెండు ఉత్తరాలు వ్రాసింది. ఒకటి అబ్రకదబ్ర అంకుల్ కీ రెండవది కమీషనర్ ఆఫ్ పోలీస్ కి

ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు ఉద్వేగంతో ......

ప్రొద్దు నే లేచి, తొందర తొందరగా తయారయి, ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి, సిద్దేశ్వరీ ఆలయానికి బయలు
దేరింది.

ఆమె అక్కడకు చేరుకునే సరికి కోలాహలంగా వుంది. వందలమైళ్ళ దూరం నుంచి వచ్చినవాళ్ళు, నగరంలో
వున్న ధనవంతుల కార్లు ఆ వీధి అంతా నిండివున్నాయి. యాభై పెళ్ళిళ్ళు ఒకే సారి జరుగుతున్నంత సంబరంగా
వుంది అక్కడ.

సింహద్వారం నుంచి లోపలికి ప్రవేశించి ఆమె. ఆ రోజు సిద్దేశ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పదు. ఆమెకు
కనకాభిషేకం జరుగుతూంది. పదహారేళ్ళ వయసున్న ఇద్దరు కన్నెపిల్లల భుజాలమీద చేతులువేసి ఆమె
సింహాసనం వద్దకు నడుస్తూంది. భక్తు లు పారవశ్యంతో చూస్తు న్నారు.

ఆమె పక్కకి తిరగబోయి, చప్పున ఆగిపోయింది. జనాన్ని ఎడం చేసుకుంటూ చక్రవర్తి అటువైపే వస్తు న్నాడు.
ఆమె మొహంచాటు చేసుకుని గిరుక్కున వేరొక పక్కకి తిరిగింది. అక్కడో ద్వారం వుంటే మరి
ఆలోచించకుండా తోసుకుని వెళ్ళింది.

ఒక నిముషం ఆగి, ఎవరూ ఆ గదిలో లేరని నిశ్చయించుకుని తల లోపలికి పెట్టి చూసింది.

సహజంగా ధైర్యవంతురాలూ, సాహసవంతురాలూ అయిన తులసి కూడా అదృశ్యాన్ని చూసి


భయకంపితురాలు అయింది.

ఎనిమిది అడుగుల నిలువెత్తు విగ్రహం - కాళీకాదేవిది, ఆమె ముందున్నది. క్రిందనుంచి చూడడం వల్ల అది
మరింత భయంకరంగా కనబడుతోంది. విగ్రహపు ఒక చేతికి వున్న త్రిశూలానికి ఒక చిన్న మేకపిల్ల గుచ్చబడి
వున్నది. శరీరం నుంచి రక్తం ఒక్కొక్క చుక్కే కారుతూంది.

దాన్ని చూసికాదు ఆమె భయపడింది - కాళికాదేవి మరోచేతివైపు చూసి, మనిషి తల జుట్టు పట్టు కుని
వేలాడదీసింది. విగ్రహం తాలూకా మరోచెయ్యి.

అది నిజంగా మనిషి తలే అయితే శరీరంనుంచి వేరుచేసి చాలా కాలం అవడం వల్ల రక్తం బొట్లు కారడం
లేదు. ఆదృశ్యాన్ని చూసి తులసి కడుపులో తిప్పింది. తనని తాను సంభాళించుకుని తూలి క్రింద పడకుండా
జాగ్రత్తగా దిగి ఆ గొట్టా నికే ఆనుకుని ఓ నిమిషం కళ్ళుమూసుకుంది.

ఎయిర్ కండిషనర్ తాలుకు గొట్టంపై కప్పు గుండా వేరొక గదిలోకి ప్రవేశించడాన్ని గమనించింది.

ఆమె గమ్యం, తను ప్రశ్న రాసి జవాబు పొందిన గది. ఆ గది రహస్యాన్ని శోధించాలి. ముందు ఆ గదిలోకి
ప్రవేశించాలి .అసలు ఆ గది ఎక్కడ ?

ఆమె వైప్ పట్టు కుని పైకి ఎక్కింది. దాని పక్కనేవున్న వెంటిలేటర్ గుండా పక్కగదిలోకి చూసింది.

ఆ గదిలో పెద్ద ఇనప్పెట్టె వుంది. దాని పక్కనే ఒక యువకుడు మోకాళ్ళ మీద కూర్చుని గోడకి తల ఆన్చి
ఏదో ఆలోచిస్తు న్నాడు.
ఎక్కడో చూసింది అతడిని -ఎక్కడ -

జ్ఞాపకం రాలేదు.

ఆమె మరి దాని గురించి ఆలోచించకుండా ఆ గొట్టం పట్టు కునే సాగిపోయింది.

ఆ పక్క రూమే ఆమకు కావాల్సింది. వెంటిలేటర్ నుంచి చూడగానే గుర్తించింది. గది మధ్యగా పొడవాటి
టేబిలు, చెరోవైపూ చెరో కుర్చీ, టేబిల్ మీద కాగితం -పెన్సిల్.

వెంటిలేటర్ నుంచి క్రింద గచ్చుమీదకి ఎంత దూరం వుంటుందా అని ఆలోచించింది. దాదాపు పది
అడుగులు, అయితే గచ్చుమీద తివాచీ వుంటుంది కాబట్టి పెద్ద ప్రమాదం జరక్కపోవచ్చు.

"బెస్టా ఫ్ లక్ , జోన్ ఆఫ్ ఆర్క్" అనుకుంటూ కళ్ళుమూసుకుని గదిలోకి దూకేసింది.

ఎక్కువ చప్పుడు కాకుండా తివాచీ కాపాడింది.

అయితే ఆమె గమనించిన విషయం ఒకటుంది. ఆ హాలుకి పక్కనే వున్న గది తలుపువేసి వుండటం -

ఎక్కడ దాక్కోవాలో అర్ధం కాలేదు. ఆ గదిలో ఏమీ లేదు పొడవాటి బల్లతప్ప అదీ పూర్తిగా తనని దాచలేదు -
అని తెలిసినా వేరే గత్యంతరం లేక - లేడిలా దాని దగ్గరకు పరిగెత్తి కిందకు దూరింది.

టేబిల్ క్రిందనుంచి గదిలోకి వస్తు న్న వ్యక్తి కాళ్ళు కనబడుతున్నాయి. ఆమె కొద్దిగా తలవంచి వస్తు న్నది ఎవరో
అని చూసింది.

చక్రవర్తి!

అతడు గది మధ్యలోకి వచ్చి ఆగేడు.

ఆగి చుట్టూ చూసేడు.

తులసి గుండె చప్పుడు ఆమెకే స్పుటంగా వినిపిస్తూంది. మరింత ముణగ తీసుకుని మూలకి వెళ్ళింది.
అంతలో చక్రవర్తి గొంతు వినిపించింది.

"ఈ గదిలో ఎవరో వున్నారు. ఎవరది? మర్యాదగా బయటికి రండి ఎలాగూ తప్పించుకోలేరు."

తన కాళ్ళు కనబడ్తు న్నాయేమోనని అనుమానం తులసికి కలిగింది. వాటిని కప్పుకోవడం కోసం -పైనున్న
టేబిల్ మీద గుడ్డని కొద్దిగా కిందకి లాగింది.
అదే ఆమె చేసిన తప్పు.

13
బయట్నుంచి చూసిన వాడెవడూ ఆ ఇంట్లో అంత మంచి ఆపరేషన్ థియేటర్ వుందనుకోరు. పైకి పురాతన
భవనంగా కనబడుతూంది కాంపౌండ్ లో పిచ్చి మొక్కలు అస్తవ్యస్తంగా పెరిగినయ్. లోపల గదుల్నిండా బూజు
వుంది. గచ్చంతా దుమ్మూ - కానీ ఆ గది ఆ ఒక్క గది .......తలుపు తెరిచి లోపలికి చూస్తూనే విస్తు బోయేడు
పండిత్.

గోడలు అద్దా ల్లా మెరుస్తు న్నాయి. దాదాపు ముప్పై అడుగుల పొడవూ, ఇరవై అడుగుల వెడల్పూ వున్న ఆ
గది నిండా ఎలక్ట్రా నిక్ ఎక్విప్ మెంట్, వైర్లూ అమర్చబడి వున్నాయి.

"నా యావదాస్తీ ఈ గది. ఈ పరికరాలు" అన్నాడు సన్యాల్.

"ఫాంటసీ సినిమా చూస్తు న్నట్టుంది."

"మనిషి జీవితమే ఒక ఫాంటసీ" నవ్వేడు..." మరిక ఆలస్యం దేనికి?"

"నాకు భయంగా వుంది."

"ఈ క్షణం ఇక భయానికి చోటులేదు పండిత్. ఇన్నాళ్ళూ నేను చేసిన ప్రయత్నానికి ఒక రూపం
రాబోతూంది చరిత్రలో ఎవరూ సాధించలేని విజయం మనమిద్దరం సాధించబోతున్నాం"

"కానీ ఫెయిల్ అయితే, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వాళ్ళం అవుతాం"

"అందుకే చావడానికి సిద్దంగా వున్నవాడిని తీసుకువచ్చాను"

అప్పుడు చూసేడు పండిత్ - రోగిని కుర్చీలో తల వెనక్కి వాల్చి పడివున్నాడు.

"ఇతనో పిచ్చివాడు. నాకు బాగా తెలుసు. "టప్ టపా టప్" అని అరుచుకుంటూ రోడ్లవెంట తిరిగేవాడు.
నిన్నే ఇతడిని బయట పొదల్లో పడి వుండగా చూసేను. ఎవరో ఇతడిని చచ్చే వరకూ కొట్టి అక్కడే పడేసేరు.
పిచ్చివాడిని కొట్టవలసిన అవసరం ఎవరికి వచ్చిందో నాకు అర్ధం కాలేదు. ఏది ఏమైనా నాకు కావాల్సిన 'వస్తు వు'
దొరికింది. ఈ పిచ్చివాడు ఈ ఆపరేషన్లో మరణించినా లోకం పట్టించుకోదు. అదే గానీ, బాగుపడితే లోకం
జోహార్లర్పిస్తుంది. పండిత్ - నువ్వు నాకు సాయం చెయ్యాలి. మూడోకంటికి ఈ విషయం తెలియకూడదు -
చేస్తా వా?"
పండిత్ తటపటాయించి "చేస్తా ను" అన్నాడు.

అయిదు నిమిషాల తర్వాత ఆపరేషన్ ప్రారంభం అయింది. ఆపరేషన్ అంటే కత్తు లూ కటార్లతో రక్తం
ధారాపాతంగా కార్చే ఆపరేషన్ కాదు మనిషి విజ్ఞానం ఆ పరిధిని ఎప్పుడో దాటిపోయింది. వంటి నిండా దెబ్బల్తో
రక్తం కోల్పోయిన, నిస్సత్తు వగా వున్న రోగిని కూడా ఆపరేట్ చేసే ఆధునిక పరికరాల్ని కనుక్కొంది విజ్ఞానంయ

ఆ గదిలో ఆపరేషన్ టేబిల్ లేదు. పళ్ళ డాక్టర్ గదిలో వుండే కుర్చీలాంటిది వుంది. ఒక పెద్ద
న్యూరోసైక్రియాట్రిక్ యూనిట్ లో వుండవలసిన పరికరాలన్నీ ఆ గదిలో ఉన్నాయి.

సన్యాల్ రోగి వైపు చూస్తూ అన్నాడు "ఇతడు ఒకప్పుడు చాలా తెలివైన వాడు అయ్యుంటాడు
న్యూరోలాజికల్ పరీక్షలో ఏమీ బయటపడలేదు. ఎలక్ట్రో ఎన్ సెఫె లో గ్రామ్ మామూలుగానే వుంది. మెదడు
యొక్క కుడివైపు టెంపోరల్ లోబ్ లోనే ఏదో పాడయింది. మనం చెయ్యవలసిందల్లా - అది ఏమిటో కనుక్కొని
సరిచెయ్యటమే. అయితే ఆ పనిని మనం కాకుండా కంప్యూటర్ చేస్తుంది. నా ఉద్దేశ్యం, ఆ ఇరిటేషన్ వున్న
భాగం లింబిక్ సిస్టమ్ యొక్క పోస్టీరియల్ ఏరియాలో వుండే ఎమిగ్ డాలా అయి వుంటుందనీ అదే అతడిని
పిచ్చివాడిని చేసింది. 'టప్ టపా టప్' అని మాటిమాటికీ అరిచేలా చేస్తుంది. ఆ చచ్చుపడిన మెదడు భాగానికి
మనం ఎలక్ట్రిక్ షాక్ యివ్వాలి. మెదడుకి షాక్ ఇవ్వడం అనేది చాలాకాలం నుంచి వస్తు న్నదే. అయితే దానివల్ల
కొన్ని దుష్పరిణామాలు కూడా కల్గుతున్నాయి. అందువల్ల నేను ఈ షాక్ ని మెదడు బయట్నుంచి కాక లోపలే
కలిగేలా చేస్తు న్నాను"

"అంటే ఎలా?"

"ఎలా అంటే, ఇతడి మెదడులోకి నలభై ఎలక్ట్రోడ్స్ చొప్పించి ఆ ఎలక్ట్రోడ్స్ కి కావల్సిన కంప్యూటర్ ని అతడి
చెవి వెనకకు కుట్టేసి, దానికి రెండువైర్లు అమర్చి, సిగరెట్ పాకెట్ సైజులో వుండే ప్లూ టోనియం -239 ఆక్సైడ్
ఐసోటోప్ ని అతడి భుజంమీద అమర్చటం ద్వారా"

తెరిచి వుంచిన పండిత్ నోరు అలానే వుండిపోయింది.

ఆ ప్రొఫెసర్ రోగి మెదడులో ఎలక్ట్రోడ్స్ చొప్పించి, చెవి ప్రక్కన కంప్యూటర్ కుట్టి, దాంతో మెదడుని
సరిచేస్తా డు - ఇంకో భాషలో చెప్పాలంటే మనిషి మెదడుకి బదులు కంప్యూటర్ అమరుస్తా డా సాధ్యమయ్యే
పనేనా ఇది?

కళ్ళెదురుగా కనబడుతుంటే కాదనటం ఎలా?

మనిషి విజ్ఞానికి అవధుల్లేవు. ఈ ప్రయత్నం సఫలీకృతం అయితే....... అవుతే..... అసలీ సైన్సు ఎక్కడికి
వెళుతూంది! సైన్సు ఇంత వేగంగా ముందుకెళుతూంటే మనిషి ఇంకా చేతబడుల దగ్గిరే వున్నాడా? ఆ
తరువాత ఆలోచించడానికి అతడికి సాధ్యంకాలేదు.
అతడి ఆలోచనల్ని చెదరగొడుతూ "రండి, మీరే నాకు సాయం చెయ్యాలి. నర్సులు లేరు" అన్నాడు సన్యాల్.

ఆ మహా యజ్ఞంలో పాల్గొనడానికి తనూ వంగేడూ పండిత్.

సన్యాల్ కత్తితో రోగి జుట్టు గీసెయ్యసాగాడు.

దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ అతడిని పిచ్చి వాడిని చేయడం కోసం అప్పుడు గుండు చేసేడు.
అతడిని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యడం కోసం మరో ప్రొఫెసర్ ఇప్పుడు ఇదే పని చేస్తు న్నాడు.

అయిదు నిమిషాలు గడిచాయి.

"ఎలా వుంది పండిత్ నీకు"

"నెర్వస్ గా"

సన్యాల్ నవ్వేడు. పండిత్ చేతివేళ్ళు సన్నగా వణుకుతున్నాయి.

పండిత్..... నిజానికి ఈ ఆపరేషన్ కి ఆరుగురు కావాలి. కంప్యూటర్ కి కావాల్సిన వివరాలు అందించేవాడితో


సహా ఏడుగురు. నువ్వు ముగ్గురి పని చెయ్యాలి. నేను నలుగురి పని చేస్తా ను సరేనా......."

పండిత్ అసంకల్పితంగా తలూపేడు. ఆ గదిలో ఏడు టెలివిజన్ స్క్రీన్ లు వున్నాయి. అన్నిటికి వేర్వేరు
పరికరాలు కాకుండా ఇ.సి.జి. శ్వాస, రక్త ప్రసరణం, రెకల్ టెంపరేచర్, పెరిఫెరల్ ఆల్జీరియల్ ప్రెజర్ అన్నీ ఒకే
టెలివిజన్ లో కనబడడం డాక్టర్ కి సాయం చేస్తూంది. సైన్సు సాధించిన మరో అద్బుతమైన విజయం అది.
ఇంకా కొంతకాలం పోతే డాక్టర్స్ అవసరం లేకుండా కంప్యూటర్లే ఆపరేషన్ చేస్తా యేమో.

పండిత్ వాచీ చూసుకున్నాడు.

సన్యాల్ గుండు గీయడం పూర్తి అయింది. రోగి కుర్చీలో నస్త్రా ణంగా......రిలాక్స్ డ్ గా పడుకుని వున్నాడు.
అతడి గుండు మీద నల్ల ఇంకుతో "X" మార్కు వేశాడు. రోగి శరీరానికి టెలివిజన్ కంప్యూటర్లు వైర్లు
అమర్చటానికి అయిదు నిమిషాలు పట్టింది. మనిషి శరీరం నుంచి వైర్లు బయటకొచ్చినట్టు వుంది.

ఉన్నట్టుండి టెలివిజన్ పని చేయడం ప్రారంభించింది. గుండె చప్పుడు -వంకర గీతల్లో స్పష్టంగా
కనబడుతూంది. శ్వాస తాలూకు వివరాలూ, టెంపరేచర్ -అన్నీ తెరమీద కనబడ్తు న్నాయి. అయిదు సెకన్లకొక
సారి టెలివిజన్ లో బొమ్మ కనబడుతూంది.

"ఆ మీట నొక్కు"


పండిత్ నొక్కేడు. రవిశంకర్ సితార్ సన్నగా వినబడుతూంది.

అనెస్తిటిస్టు లేడు సన్యాలే ఎనస్టీషియా యిచ్చాడు. సూది గుచ్చీ గుచ్చగానే టెలివిజన్ తెరమీద Operation
Begun అన్న పదాలు వాటంతటవే రావడం అపూర్వమైన దృశ్యం.

"ఎక్స్ -రే" అన్నాడు సన్యాల్. కాలితో మీట నొక్కేడు. ఏడు టెలివిజన్స్ లోనూ రోగి కపాలం ఏడు భిన్న
కోణాల్లో కనబడింది.

నన్యాల్ చేతిలోకి 2 యం.యం డ్రిల్ తీసుకున్నాడు. వడ్రంగి స్క్రూ బిగించే ముందు చెక్కకి కన్నం పెట్టటం
కోసం వాడే బర్మాలా వుందది సన్నటి శబ్దంతో రోగి తలమీద రెండు రంద్రాలు చెయ్యబడ్డా యి.

ఒకప్పుడు ఇదంతా ఒక తలనొప్పి వ్యవహారం. సరిగ్గా ఎక్కడ ఆపరేట్ చెయ్యాలో మాటిమాటికి ఎక్స్ రేని
సంప్రదించడం. ఇప్పుడలా అవసరంలేదు. అసలింకొంత కాలం పోతే లేసర్ బీమ్ ల సాయంతో శరీరం
కొయ్యకుండానే అన్ని ఆపరేషన్ లూ చెయ్యవచ్చేమో.

సన్యాల్ పండిత్ వైపు తిరిగి. ఇవ్వమన్నట్టు సైగచేసేడు.

పండిత్ ట్రే వైపు చూసేడు.

ట్రే మధ్యలో వుంది -పోస్టల్ స్టాంప్ అంత బిళ్ళ వుంది. సాలె పురుగులా దాని నుంచి ఇరవై వైర్లు బయటికి
వచ్చినయ్. పండిత్ కి తెలుసు. పైకి బిళ్ళలా కనబడ్తు న్నా దాన్ని మైక్రోస్కోప్ లో చూస్తే కొన్ని వందల కనెక్షన్లు
కనబడతాయని

ఇంకొద్ది క్షణాల్లో ఆ బిళ్ళ అతడి శరీరంలో ఒక అంగంగా శాశ్వత స్థా నాన్ని సంపాదించుకుంటుందని. అతడి
చితిమీద అతడితో పాటు అంతమై పోతుంది.

కపాలపు రంధ్రంలోంచి ద్రవం కొద్దిగా బయటకు వచ్చింది. మెదడుని భద్రపరచడానికి ఒక ఇనప్పెట్టెలాటి


కపాలాన్ని సృష్టించి అది చాలదని తెలుసుకుని, ఈ ద్రవాన్ని కూడా పోసినట్లు న్నాడు దేముడు.

పండిత్ ఒకటి గమనించేడు.... మనిషిని నవ్వించేది, ఏడిపించేదీ, బాధల్ని రవాణా చేసేది అయిన మెదడు.
తనకి కలుగుతున్న బాదల్ని మాత్రం గమనించలేదు.

చిన్న తపాళా బిళ్ళ ఆకారంలో ఉన్న కంప్యూటర్ ని సన్యాల్ చేతుల్లోకి తీసుకున్నాడు. రోగి తల రంధ్రం
గుండా లోపలికి చొప్పించేడు. రోగి కొద్దిగా కదిలేడు

"ఎలా వుంది ఫ్రెండ్..... "

"టప్ టపా టప్" దూరంగా ఎక్కణ్నుంచో వస్తు న్నట్టూ వుంది ఆ స్వరం. సన్యాల్ సన్నగా నవ్వేడు.
టెలివిజన్ తెరమీద గ్రాఫ్ కనబడ్తుంది. కంప్యూటర్ చేరవలసిన పాయింట్ కన్నా ఎడమవైపుకి వెళుతున్నట్టు
గమనించి చూపుడు వేల్తో కొద్దిగా పక్కకి జరిపేడు. అతడు దాన్ని తలలో కొద్దిగా కదుపుతూ వుంటే బయట
టెలివిజన్ లో అది కనబడుతూంది.

రెండు నిమిషాల్లో అతను చేరవలసిన స్థా నాన్ని చేరుకున్నాడు. గ్రాఫ్ లో వున్న పాయింట్ కి, మెదడులో వున్న
కంప్యూటర్ పాయింట్ కి చేరుకోగానే -ఏడు టెలివిజన్ తెరల్లోనూ ఒకే పదం కనిపించింది.

CORRECT

సన్యాల్ సిమెంట్ తో తల రంధ్రాన్ని పూడ్చేసేడు. భూమిలోంచి కొత్తిమీర మొక్కలు పొడుచుకొచ్చినట్లు ,


రోగి తలలోంచి వైర్లు బయట కొచ్చి వున్నాయి.

సన్యాల్ సంతృప్తిగా నిలబడి ఊపిరి పీల్చుకోవటంతో ఆపరేషన్ స్టేజీ వన్ విజయవంతమైనట్టు పండిత్
గ్రహించేడు. గాఢంగా ఊపిరి వదులుతూ సన్యాల్ గుండె నిమురుకోవడం చూసి, "ఏమైంది" అని అడిగేడు
పండిత్.

"సన్నటి నొప్పి -అప్పుడప్పుడొస్తూంది" నవ్వేడు సన్యాల్.

ఫర్లేదు గుండెకి బదులు బర్చర్ వాల్వ్ పెట్టొచ్చు. రేడియో ధార్మిక శక్తితో అది నడుస్తూంది. అప్పుడు గుండె
నిరంతరం కొట్టు కునే అవసరం ఉండదు. ఆ ఎనర్జీ అంతా శరీరానికి మిగిలిపోతుంది. దాంతో మనిషికి
విపరీతమైన శక్తి వస్తుంది. గంటకి యాభై మైళ్ళ వేగంతో పరిగెత్త గలిగే శక్తి వస్తుంది. అప్పుడు సిటీబస్ లు
అక్కర్లేదు. ఈ లోపులో STAGE 5 COMPUTER system వస్తుంది. అనాసిస్ టాబ్లెట్ పరిమాణంలో
మెదడు తయారు చేయబడుతుంది. ఇంగ్లండులో వున్న స్నేహితుడు అతడి మెదడులో ఈ టాబ్లెట్ ని
చొప్పించుకుని పరిదోరుజపాటు లండన్ అంతా చూసి, దాన్ని భారతదేశం పంపిస్తే - ఆ టాబ్లెట్ ని ఇక్కడ మన
మెదడులో చొప్పించుకుంటే ......పదిరోజుల పాటు లండన్ చూసిన అనుభూతి కల్గుతుంది. అంటే.....
భౌతికమైన అనుభవానికీ, మానసిక అనుభూతికీ మధ్య తేడాని కంప్యూటర్ తగ్గించేస్తుంది. మనిషి ఇంట్లో
కూర్చుని ఈ భావనా తరంగాల సాయంతో గాలిలో ప్రయాణం చెయ్యవచ్చు. (నారదుడిలా) తెలివైన వాళ్ళ
మెదళ్లు తెలివి తక్కువ వాళ్ల మెదడుని ట్యూన్ చేస్తే బార్య హేమమాలినిలా కనబడ్తుంది. ఇంకా ముందుకెళితే -
ఇంట్లో కూర్చునే మెదడుని సినిమా హాలుకి పంపిచవచ్చు. స్మశానంలో కూర్చుని ఎక్కడో హాయిగా పని
చేసుకుంటున్న వాడిని క్షణాలమీద చంపవచ్చును........

అంతే చేతబడి...
.....................
......................

"ఏమిటి ఆలోచిస్తు న్నారు"


పండిత్ తడబడి "ఏం లేదు" అన్నాడు.

"ఇంకా చిన్న పని మిగిలివుంది......." అన్నాడు సన్యాల్. ఔను -మెదడులో అమర్చిన కంప్యూటర్ కు
సరిపోయే శక్తినిచ్చే పని ఇంకా మిగిలివుంది. పండిత్ చిన్న పాకెట్ లాటికి డాక్టర్ కి అందించేడు. అందులో
ముప్పైఏడు గ్రాముల రేడియో ఆక్టివ్ ఐసోటోపు ప్లూ టోనియం - 239 వుంది. పైకి అది మామూలుగా
కనబడుతోంది. కానీ, అది బహిర్గతం చేసే వేడితో పదిమందికి సరిపడా వంట చెయ్యవచ్చు.

సన్యాల్ రోగి భుజం దగ్గిర చర్మాన్ని కోసి, ఆ పాకెట్ ని శరీరంలో అమర్చేడు. తల దగ్గిర్నుంచి సన్నటి గీతలా
చర్మాన్ని కోసి, వైర్లని భుజం దగ్గిర కలిపేడు.

పండిత్ కి తెలుసు -ఈ రోగి మరణించినపుడు జాగ్రత్తగా ఈ శరీరంలోంచి ఆ రేడియో ఆక్టివ్ పాకెట్


తీసెయ్యాలని..... లేకపోతే రోగి చచ్చిపోయిన తరువాత, ఆ పాకెట్ గానీ విడిపోతే ఆ శవాన్ని పాతిపెట్టిన ధార్మిక
శక్తికి స్మశానంలో ప్రవేశించినవాళ్ళు కూడా శవాలుగా మారతారు -రేడియో.

మరో రెండు నిముషాల్లో సన్యాల్ రోగి భుజం దగ్గిర చర్మం కుట్టేశాడు. ఆ తరువాత పెద్ద కంప్యూటర్
దగ్గిరనుంచి రోగి మెదడుకి సూచన్లు యివ్వసాగాడు. ఒకటి రెండు -మూడు-

అలా ఒక్కో సూచనా పంపిస్తూంటే -రోగిలో చలనం లేదు. ఆపరేషన్ ఫెయిలయిందా అని అనుమానపడ్డా డు
పండిత్. ముప్పైరెండు ఎలక్ట్రోడ్ నుంచి పంపిన సూచనకి రోగి కొద్దిగా కదిలేడు. సన్యాల్ పెదవులమీద
విజయవంతమైన చిరునవ్వు వెలిసింది రోగి చెవి దగ్గరగా వంగి "నీ పేరు" అన్నాడు. రోగి పెదవులు అస్పష్టంగా
కదిలినయ్ మాటరాలేదు! ముప్పైమూడో ఎలక్ట్రోడ్ ప్రయత్నించి - తిరిగి అడిగాడు "నీ పేరు"

ఈ సారి రోగి నోటినుంచి స్పష్టంగా మామూలు మనిషిలా మాటలు వెలువడ్డా యి.

"నా పేరు.........."

"ఊ........నీ పేరు?"

"శ్రీనివాసపిళ్ళయ్"

రక్తం అంటుకున్న చేతుల్తోనే ప్రొఫెసర్లిద్దరూ షేక్ హాండ్స్ తో అభినందించుకున్నారు. సైన్సు చరిత్రలో అదొక
అద్భుత విజయం అని వాళ్లకి తెలుసు. అంతలో ఉన్నట్టుండి టెలివిజన్స్ లో అకస్మాత్తు గా గీతలు
అదృశ్యమయ్యాయి. పండిత్ ఆందోళనగా సన్యాల్ వైపు చూసేడు. సన్యాల్ కంప్యూటర్ వైపు చూసేడు.
కంప్యూటర్ దానంతట అదే ఆ డాక్టర్ కి ఆఖరి సందేశం పంపింది. టెలివిజన్ తెరమీద ఎలక్ట్రా నిక్ అక్షరాలు
మెరుస్తూ క్షణంపాటు కనబడ్డా యి.

"కంగ్రాచ్యులేషన్స్" అని
పండిత్ వాచీవైపు చూసుకున్నాడు - 7-19.

* * *
"తరువాత ఏమైంది" అబ్రకదబ్ర టెన్షన్ తో అడిగాడు.

పండిత్ వెంటనే జవాబు చెప్పలేదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం
పెట్టు కోవడం అంత సులభం కాదు. అయినా అచ్చుపుస్తకంలో పేజీల్లా అతడి జ్ఞాపకపు పుటల్లో స్మృతులు
తిరుగుతున్నాయి.......

సన్యాల్ కాగితం మీద వ్రాసుకున్నాడు.

రోగి పేరు -శ్రీనివాసపిళ్ళయ్.

ఆపరేషన్ కుడివైపు టెంపోరల్ లోబ్ లో ఎలక్ట్రోడ్ అమర్చటం నష్టమైన రక్తం 250 సి.సి. రికవరీ, 12 గంటలు.
అతడు వ్రాయటం పూర్తిచేసి పండిత్ వైపు తిరిగి "థాంక్యూ ప్రొఫెసర్" అన్నాడు. "మీరు చేసిన సాయానికి
కృతజ్ఞతలు."

పండిత్ కి తెలుసు. నిజానికి తను చేసింది ఏమీలేదని. పెద్దవాడు గారడీ చేస్తూంటే సాయంచేసే
చిన్నపిల్లవాడిలా నిలబడ్డా డు తను. అంతే.

"ఇంక మనం చెయ్యవలసిందేమీలేదు. ఆ రాత్రికి......రోగికి ప్రొద్దు న్నగ్గానీ మెలకువరాదు. మీరు విశ్రాంతి


తీసుకోండి" అన్నాడు సన్యాల్.

ఇద్దరూ చెరో రూములోకి వెళ్ళి పడుకొన్నారు.

పండిత్ ఆలోచించసాగేడు.

అతడికి ఎప్పుడో చదివిన విషయం జ్ఞాపకం వచ్చింది.

ఒక ఆస్పత్రిలో ఒక పదేళ్ళ కుర్రవాడు అడ్మిట్ చెయ్యబడ్డా డు. అతడు తల దువ్వుకునేటప్పుడు జుట్టు


మధ్యలో నొప్పిగా వుండేది. తరువాత అక్కడ వాపు బయల్దేరింది.

న్యూరోలాజికల్ పరీక్షలో ఏమీ బయట పడలేదు. ఎక్స్ రేలో తేలింది. అతడి తలలో 6 సెం.మీ. మేకు
వున్నట్టు
ఒక సైక్రియాటిస్టు ఎంతో శ్రమతో ఆ కుర్రవాణ్ని అనునయించి విషయం రాబట్టేడు. ఎన్నో దిగ్భ్రాంతి కలిగించే
విషయాలు అందులో బయటపడ్డా యి.

ఆ కుర్రవాడికి ఒక సాధువు దగ్గరకి ప్రతిరోజూ వెళ్లే అలవాటు వుంది. ఆ సాధువుకి తనకి తెలిసిన మంత్ర
విద్యని ఈ కుర్రవాడి మీద ప్రయోగం చెయ్యదల్చుకున్నాడు. డీప్ హిప్నాసిస్ లో ఆ కుర్రవాణ్ని ప్రవేశపెట్టి మేకు
దిగకొట్టేసేడు.

మరి ఆ సాధువుకి మానవాతీత శక్తు లు వచ్చాయో లేదో తెలీదు కానీ, డాక్టర్లు చాలా కష్టపడి ఆ కుర్రవాణ్ని
రక్షించవలసి వచ్చింది.

బాగా అలసిపోవడం వల్ల పండిత్ కి వెంటనే నిద్రపట్టింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి బాగా
తెల్లవారిపోయింది. కిటికీలోంచి ఎండ నిటారుగా పడ్తూంది. తన నిద్రకి తనని తనే తిట్టు కుంటూ
బైటరూములోకి వచ్చేడు. సన్యాల్ తలుపు దగ్గరికే వేసివుంది. అతడూ లేవలేదు.

పండిత్ ఆపరేషన్ రూములోకి వెళ్ళాడు. అదే ఇన్ టెన్సివ్ కేర్ రూముగా కూడా ఉపయోగపడ్తుంది.
సన్నటిగాలి ఎయిర్ కండిషనర్ లోంచి చల్లగా వీస్తూంది.

రోగిని చూడడం కోసం కుర్చీని నెమ్మదిగా తిప్పి -పండిత్ స్థా ణువై అలానే నిలబడిపోయాడు.

శ్రీనివాసపిళ్ళై కుర్చీలో లేడు.

పండిత్ దాదాపు పరుగుబెడ్తు న్నటటు సన్యాల్ గదిలో ప్రవేశించాడు. దగ్గరికి వేసివున్న తలుపుల్ని దభేలున
తెరచి "డాక్టర్" అని అరిచాడు. సన్యాల్ లో కదలికలేదు. అతడిని కదిపి లేపటానికి మీద చెయ్యి వేసిన పండిత్,
మరోషాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు.

సన్యాల్ శరీరం చల్లగా తగిలింది.

ఒక అవయవం బదులుగా కంప్యూటర్ ని అమర్చగలిగిన ఆ డాక్టర్ గుండె అనె మరో అవయవం


పనిచెయ్యని కారణంగా అచేతనుడయ్యాడు.

* * *
"ఆ తరువాత ఆ రోగి ఏం అయ్యాడో నాకు తెలీదు. ఇప్పుడు ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్పాను. సన్యాల్ మరణం
తరువాత ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అతడు చేసిన ఆపరేషన్ గురించి ఇద్దరు ముగ్గురు
డాక్టర్లతో మాట్లా డేను. నా మాటల్ని హేళనగా కొట్టి పడేసేరు వాళ్ళు. అదీగాక ఒక మనిషికి అలా బలవంతంగా
ఆపరేషన్ చేసినందుకు.శిక్ష పడుతుందని కూడా అప్పట్లో భయం వేసింది నాకు. దాంతో ఇంక దాని సంగతి
ఎవరికీ చెప్పలేదు. కాని నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజురాత్రి ఆపరేషన్ అయ్యాక రోగి నోటితో స్వయంగా తన
పేరు చెప్పటం....."

అబ్రకదబ్ర పండిత్ మాటలు వినటంలేదు.

".....శ్రీనివాస పిళ్ళై...... శ్రీనివాసపిళ్ళై........." అని తనలో తనే గొణుక్కుంటున్నాడు.

* * *
"ఆ బల్లకింద ఎవరున్నారు? బైటకిరండి మర్యాదగా" చక్రవర్తి కంఠం గదిలో మారుమ్రోగింది. తులసి టేబిల్
క్లా త్ మరికొంచెం లాగింది. దానికింద గరుగ్గా ఏదో తగిలింది.

చక్రవర్తి రెండడుగులు ముందుకేసి బల్ల దగ్గరికి వస్తు న్నాడు తులసి మరింత ముణగదీసుకుని బల్లకోడు
దగ్గరికి జరిగింది. కోడుమీదనుంచి ఆమె మెడమీదకి పాములా ఏదో జారింది. ఆమె కెవ్వున అరవబోయి, అతి
కష్టం మీద తమాయించుకుని తడిమి చూసుకుంది. తాడు చేతికి తగిలింది.

చక్రవర్తి మోకాళ్ళమీద వంగేడు.

తులసి అప్రయత్నంగా తాడు లాగింది. దాంతోపాటు బల్లగుడ్డ కిందవున్న మరో చైనా సిల్కుగుడ్డ చేతిలోకి
వచ్చింది. దాంతోపాటు కార్బన్ పేపర్ కాగితం కూడా అప్పుడు చూసిందామె. కుర్చీలో కూర్చుని కాళ్ళు
పెట్టు కునే చోట చెప్పులు వుండడం. అయితే అవి మామూలు చెప్పుల్లా కాకుండా రాజులువాడే పాదుకల్లా
వున్నాయి. ఆమె గుండెల్నిండా వూపిరి పీల్చుకుంది. చక్రవర్తి తనకోసం వంగగానే ఆ పాదుకతో అతడి తల
బద్దలు కొట్టా లని ఆమె ఉద్దేశ్యం.

అతడు తలవంచి బల్లకిందకు వస్తు న్నాడు.

ఆమె సివంగిలా ముందుకుదూకి, ఆ వూపులోనే ఆ వెండి చెప్పుని పట్టు కుని, ఎత్తి కొట్టబోయింది. కానీ,
అంతవేగంలోనూ ఆమె విస్తు బోయేటట్టు - ఆ చెప్పులు నేలకే తాపడం చేయబడి వున్నాయి. వస్తా యన్న
ఉద్దేశ్యంతో వాటిని పట్టు కుని వుండడంవల్ల ఆమె ముందుకి తూలింది.......సరిగ్గా చక్రవర్తి కాళ్ళమీదకి......

స్త్రీ అనయినా చూడకుండా ఆమెని అతడు ఎంత బలంగా కొట్టేడంటే - కార్పెట్ మీద దాదాపు అయిదు
గజాల దూరంలో వెళ్ళి పడిందామె. పెదవి చిట్లింది. తల అదిరిపోయి క్షణంపాటు ఏమీ కనపడలేదు. ఆమె
కళ్ళు తెరిచేసరికి అతడు ఆమె దగ్గరికి వచ్చేడు. ఆమెను చూడగానే "నువ్వే నన్నమాట" అన్నాడు.

తులసి జవాబు చెప్పలేదు.

"క్రితం సారి వచ్చినప్పుడే సరిగ్గా మర్యాద చేసి పంపవల్సింది వదిలేశాం. తిరిగి వచ్చావన్నమాట" అని అడుగు
ముందుకు వేసేడు.
ఇక పారిపోవడానికి దారిలేదు. తులసి కళ్ళు గట్టిగా మూసుకుంది. అతడు దగ్గరికి రావడం తెలుస్తూంది.
తెలుగు సినిమా పతాక సన్నివేశంలోలా పోలీసులు వస్తా రని. ఇన్స్పెక్టర్ ఎడమచేతితో పిస్టల్ ఎక్కుపెట్టి "యూ
ఆర్ అండర్ అరెస్ట్ - హేండ్సప్" అంటాడని ఆశపడ్డది.

కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఆమె రెక్క పట్టు కుని లేవదీసేడు చక్రవర్తి.

డిటెక్టివ్ నవలలు నేను చదవను గాక చదవను -అనుకొంది తులసి.

"ఈ గదిలోకి నువ్వెలా ప్రవేశించావ్?" అడిగాడు చక్రవర్తి.

"ఛూమంతర్......" అంది తులసి. "మూర్ఖుడా -మానవాతీత శక్తు ల్నే ప్రశ్నిస్తు న్నావా!"

చావడం ఎలాగూ తప్పనిసరి అయినప్పుడు జేమ్స్ బాండ్ లాగా చావడం మంచిది. "నీ మానవాతీత శక్తు ల్ని
మా కాళీమాత వదిలిస్తుందిలే" అంటూ గుమ్మంవేపు తోసేడు. ఆమెకు తను చూసిన విగ్రహం జ్ఞాపకం
వచ్చింది. విగ్రహపు చేతిలో రక్తంకారిపోయి కుదించుకుపోయిన మనిషి తల....... ఆ తలని తన తల 'రీప్లేస్'
చెయ్యబోతూందా -

గుమ్మందాటుతున్నదల్లా - క్షణంలో వెయ్యవ వంతు ఆగింది. ఆమె దృష్టి గుమ్మం అవతల -కొద్దిగా కదిలిన
నీడమీద పడింది.

ఎవరో వున్నారు బయట. వేచి చూస్తు న్నారు., తమ రాకకోసం గన్ షాట్ గా. చక్రవర్తి తరుపు మనిషికాదు.
ఆమె ముందుకు అడుగు వేయడం కొద్దిగా ఆలశ్యం చేసింది. అది గమనించిన చక్రవర్తి గుమ్మంలోంచి
ముందుముందుకు వెళ్ళాడు.

రెండు చేతుల్లో ఇనుప కడ్డీల్లాంటివి, ఒక పిడికిలితో ఇంకొకటి బిగుసుకుని అతని తలమీద మెరుపులా
పడ్డా యి. చక్రవర్తి కుప్పలా కూలిపోయేడు.

"వెల్ డన్ జేమ్స్ బాండ్" అంది తులసి కొట్టిన వ్యక్తిని చూస్తూ. అతను మాట్లా డకుండా, మోకాళ్ళ మీద
వంగి చక్రవర్తిని పరీక్షించసాగేడు.

"చచ్చేడా?" అని అడిగింది తులసి.... లెదన్నట్టు తలూపేడు. అతడు.

"వీడు మీ శత్రు వర్గంలో వాడా? మిత్రు డిని పొరపాటున కొట్టేరా"

"శత్రు వే"
"అయితే మనం మనం ఒకటన్నమాట. మిత్రు డికి శత్రు వు శత్రు వు, శత్రు వుకి శత్రు వు మిత్రు డు అవుతాడు.
బైదిబై చార్లెస్ బ్రాన్ సన్ మీకు అన్నయ్యా?"

"వాడెవడు"

"ఓ ఇంగ్లీషు హీరో మీలాగే ఎప్పుడూ నవ్వకుండా వుంటాడు. సీరియస్ గా"

అతడు నవ్వి "నా పేరు దార్కా" అన్నాడు.

* * *

సాయంత్రం అయిదయింది.

మెయిన్ రోడ్ జనంతో కిటకిట లాడుతూంది. శారద కారు ఒక ప్రక్కగా ఆపుచేసింది. ఆమెతో పాటు ఇద్దరు
దిగేరు. మహిళామండలి సభ్యురాళ్ళు వరద బాదితుల సహాయార్ధం డొనేషన్లు వసూలు చేయడానికి
తిరుగుతున్న వాళ్ళు. శ్రీధర్ వెళ్ళిపోయిన తరువాత తోచక ఆ మండలిలో చేరింది.

వాళ్ళ పని పూర్తయ్యేసరికి ఏడున్నర కావొస్తుంది . వీధి లైట్లు చీకటిని పారద్రోలుతున్నాయి

ఆమె కారు ఎక్కబోతూంటే వెనుకనుండి మోచేతి దగ్గర ఎవరో తాకినట్లయి వెనుదిరిగింది.

వెనుకనున్న వ్యక్తిని చూసి, కెవ్వున అరవబోయి తమాయించుకుంది. అతడి జుట్టు పాయలు పాయలుగా
వేలాడుతూంది. గుడ్డల పీలికలయి వున్నాయి. గెడ్డం పెరిగి వుంది. కళ్ళు గాజు గోళాల్లా , అదోలా వున్నాయి.

"హి హ్హి హ్హి" అన్నాడు శారదను చూసి

ఆమె చుట్టూ అతడు గెంతులు వేస్తూ "దెయ్యము లేచును- కళ్ళు పీకును- తులసి పాతుము -అయినా
ఆగను" అని వికృతంగా అరవసాగేడు.

ఆమె కళ్లనిండా నీళ్ళు తిరిగేయి . అంతలో వాళ్ళని రక్షించడానికా అన్నట్టు కానిస్టేబుల్ వచ్చి లాఠీతో వాణ్ని
ఆపి, దారి తీసేడు. ముగ్గురు ఆడవాళ్ళూ వడివడిగా కారు చేరుకున్నారు.

"రక్తం చూడొద్దనూ -మట్టి తినమనూ -అందర్నీ రక్షించేది ఆంజనేయుడు" అని అరుస్తూనే వున్నాడు
వాడు.

శారద ఇగ్నిషన్ తిప్పింది. కారు స్టా ర్టు కావడంలేదు. అంతలో ఆ పిచ్చివాడు తనని తప్పించుకుని కారువైపు
పురగెత్తు కు రావడం కనిపించింది.

దుఃఖంతో, నిస్సహాయంగా ఆమె ఆక్సిలేటర్ టపాటపా నొక్కుతూ ఇగ్నిషన్ తిప్పసాగింది.

అతడు కారు కిటికీ అద్దం అవతల్నుంచి మొహం దగ్గిరగా పెట్టి, లోపలికి వినిపించేలా అరవసాగేడు.

"ఖేచరి ముద్ర పట్టించు. నీ కూతురికి ఖేచరి ముద్ర. ఇలా ఇలా కారు అద్దా నికి మొహాన్ని మరింత బలంగా
అదిమాడు. కూరుతి ప్రసక్తి రావడంతో శారద చెయ్యి ఇగ్నిషన్ మీదనుంచి జారిపోయింది. అతడి బలానికి
అద్దం ఏ క్షణమయినా పగిలిపోయేలా వుంది.

ఆమె బయటకు చూసింది. పోలీసు కారువైపు పరుగెత్తు కు వస్తు న్నాడు. అద్దం అవతల పిచ్చివాడి మొహం
వికృతంగా వుంది. "ఖేచరీ" అన్నాడు -ఆ తరువాత ఓ అద్భుతం జరిగింది. ఆ పిచ్చివాడి నోటి మధ్యనుండి
నాలుక బయటికి వచ్చింది. మామూలుగా కాదు. పొడుగ్గా - ఇంకా పొడుగ్గా -పాములా -పైకొచ్చి ముక్కుమీద
నుంచి పైకెళ్ళి కనుబొమ్మలు కలిసేచోట బొట్టు పెట్టినట్టు ఆనింది. కార్లో వున్న ఆడవాళ్ళిద్దరూ కెవ్వుకెవ్వున
అరవసాగారు. పిచ్చివాడు నాలుకని మళ్ళీ మామూలుగా నోట్లోకి లాగేసుకుని వెర్రిగా "ఖేచరీ" అన్నాడు.

ఈ లోపులో పోలీసు వెనుకనుంచి లాఠీతో వాడినెత్తిమీద మోదడం - వాడు "అమ్మా" అని


కుప్పకూలిపోవడం. అదే టై ముకి కారు స్టా ర్టు అయి వేగంగా సాగిపోవడం -అన్నీ ఒక్క క్షణంలో జరిగేయి.

14

"మనం ముందు బయటపడాలి"

"ఈ బిల్డింగు ఒక తేనెతుట్టు లాంటిది. ఎన్ని గదులున్నాయో ఎవరికీ తెలీదు. ఆ గదుల్లోంచిబయటపడడం


అంత సులభం అని నేననుకోను" అంది తులసి.

"నా గది పైకప్పులోంచి చూసిందెవరు?"

"నేనే......"

"నేనందులోంచి బయటపడ్డా ను"

"దెన్ యూ హావ్ టూ థాంక్ మీ"

అతడు మౌనంగా వూరుకున్నాడు. ఆమె ఇంగ్లీషు ఉచ్ఛారణ అతడిని కొద్దిగా ఇబ్బందిలో పెట్టింది. మాట
మారుస్తూ "వీణ్ని ఎక్కడయినా దాయాలి ముందు" అన్నాడు చక్రవర్తి శరీరాన్ని బల్లకింద చూస్తూ వుంటే,
అప్పుడు మళ్ళీ ఆమె పాదుకల్ని చూసింది. అంతా గుర్తొచ్చింది. తనొచ్చిన పనీ, ఇరుక్కుపోయిన
విధానం.........

మరుక్షణం ఆమె దార్కా సంగతి మర్చిపోయి పరిశోధనలో పడింది. పాదుకలు నేలకి ఎందుకు తాపడం చేసి
వున్నాయి? ఆమె బల్లక్రిందకి వంగి చెప్పుని బలంగా లాగింది. అది చేతికి వచ్చింది కానీ, దానికి ప్లగ్, ఆ ప్లగ్ కి
పిన్ వుండటం ఆశ్చర్యం కలిగించింది. అంతలోనే ఆమెకి బల్లమీద గరుగ్గా తగిలిన కాగితం విషయం జ్ఞాపకం
వచ్చింది. లేచి ఆ పై గుడ్డని బలవంతంగా లాగింది. దానిక్రింద నల్లగా గరుగ్గా కనబడింది......

కార్బన్ కాగితం..........

ఆమె దాన్ని తీసి అడుగున ఏముందో చూసింది. తెల్లటి చైనా సిల్కు గుడ్డ....... దాని చివర

ఒక తాడుకి కట్టబడి వుంది. ఆ తాడు బల్లకోడులోకి వెళ్ళిపోయింది.

భక్తు డు ప్రశ్న వ్రాస్తూ వుంటే, అది కింద చైనా సిల్కుగుడ్డ మీద కాపీలా పడుతుందన్నమాట, తరువాత ఎవరో
ఎక్కణ్నుంచో దాన్ని లాగుతారు......కానీ......కానీ సిద్దేశ్వరి కుర్చీలోంచి లేవకుండానే ప్రశ్నకి ఎలా సమాధానం
చెప్పగలుగుతుంది? ఆమె ఒక్క క్షణం ఆలోచించింది.

దార్కా ప్రేక్షకుడిలా గమనిస్తు న్నాడు. ఆమె మొహంలో పనిపట్ల ఏకాగ్రత, కళ్ళలో తీక్షణత, కదలికలో
చురుకు, అతడికి తను విషాచికి శిష్యుడిగా వున్న రోజుల్ని గుర్తు తెస్తు న్నాయి.

తులసి చూపుడు వేల్తో బల్లకోళ్ళని కొట్టింది. ఆమె అనుకున్నట్టే ఒక కోడు డోలగా వుంది. దాని క్రింద
తివాచీని తడిమి చూసింది. ఒక తాడు ఎత్తు గా తగిలింది. దాన్ని తడుముకుంటూ ప్రయాణం సాగించింది. అది
పక్క రూమ్ లోకి వెళ్ళింది. ఆమె తలుపు తెరిచి, ఆగదిలోకి అడుగు పెట్టీ పెట్టగానే నిశ్చేష్టు రాలై
నిలబడిపోయింది.

ఆ గదిలో గోడకి చిన్న ట్రాన్స్ మీటర్ వుంది.

ఆమె జేమ్స్ బాండ్ లా సన్నగా విజిల్ వేయబోయి ఆడదాన్నని గుర్తు వచ్చి, మానేసి "అదీ విషయం" అంది
అంతా అర్ధమైపోయినట్టు గా.

"ఏమిటి" అన్నాడు దార్కా.

"సిద్దేశ్వరి ఈ కుర్చీలో కూర్చోగానే, తన పాదుకల్ని ఈ ప్లగ్ కన్నాల్లో పెడుతుంది.

ఆ పాదుకలకి వున్న వైర్లకి ఆమె చెవి దగ్గర వున్న హెడ్ ఫోన్స్ కనెక్ట్ చెయ్యబడి వుంటాయి. మనం ప్రశ్న
వ్రాయగానే, అది కార్బన్ కాగితం ద్వారా కింద వున్న సిల్కు గుడ్డమీద పడుతుంది. ఆ గుడ్డని పక్కగదిలో వున్న
అసిస్టెంటు తాడుతో, బల్లకోడు గుండా, తివాచీ కిందనుంచి లాగేస్తా డు. దాన్ని చదివి ట్రాన్స్ మీటర్ లో
చెబుతాడు. అది సిద్దేశ్వరి పాదుకల గుండా ఆమె చెవి దగ్గర వినబడ్తుంది. ఆ తరువాత సంగతి
తెలిసిందే........"

దార్కా ఈ మోసాన్ని తొందరగా జీర్ణించుకోలేకపోయాడు. తులసి అంది.

"మన మూర్ఖత్వాన్ని ఆసరాగా చేసుకుని సిద్దేశ్వరి లక్షలు లక్షలు సంపాదించింది. చాలా తెలివిగా పగడ్బందీగా
వేసిన ప్లా న్ ఇది"

"ఇంత సులభమా ఇది"


"తెలిస్తే అంతా సులభం, తెలియకపోతే మానవాతీత శక్తి" అంది తులసి. మానవాతీతం అనగానే ఆమెకి
గాలిలో ఎగిరి తనతో మాట్లా డిన పుర్రె జ్ఞాపకం వచ్చింది.

పక్క గదిలోకి పరిగెత్తింది. చీకటిగా వుంది ఆ గది. బల్లమీద పుర్రె గాజు గోళాల్లా మినుక్కు మినుక్కు
మంటున్న కళ్ళు -అయితే ఈసారి ఆమె భయపడకుండా దాన్ని చేతుల్లోకి తీసుకుంది.
"అది ఖాళీ పుర్రెకాదు" అన్నాడు వెనుక నుంచి దార్కా ద్వారం దగ్గర నిలబడి. ఆమె అతడివైపు సాలోచనగా
చూసింది. అతడు ఆమె దగ్గరగా వచ్చి ఆ పుర్రెని చేతుల్లోకి తీసుకుని, నుదురు దగ్గర వుండే చీలికని ఎడం
చేశాడు. కొంచెం విడిపోగానే వేల్తో దాన్ని రెండుగా విడగొట్టేడు. కపాలం రెండుగా చీలిపోయింది. లోపల చిన్న
స్పీకర్ కనపడగానే తులసి పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. వంగి బల్లకింద చూసింది. ఆమె భావించినట్టే
అక్కడో "కాయిల్" వుంది.

ఆమె లేస్తూ "పుర్రె మాట్లా డుతూందీ అంటే అందరూ పుర్రెని పరీక్షిస్తా రు. నీ కెలా తెలిసిందో గానీ మా
కందరికీ ్ది మామూలు పుర్రెలాగే కనపడింది." అంది.

దార్కా మాట్లా డలేదు. కపాలాల్తో తనకున్న అనుభవం ఆమెకు చెప్పదల్చుకోలేదు.

"అందులోనూ పుర్రెకు ఏ వైరు కనెక్షన్ లేకపోవడంతో అసలు బల్లని చూడాలీ అన్న అనుమానం ఎవరికీ
రాదు. కానీ మాటలు పుర్రెలోంచే వస్తా యి. నిస్సంశయంగా పుర్రెలోంచే....... దానిక్కారణం తెలుసుకోవాలంటే
ఫిజిక్సు తెలియాలి. నువ్వు ఫిజిక్స్ చదువుకున్నావా......?"

"లేదు........"

అతడి మాటలు పట్టించుకోకుండా తనలో తానే అనుకుంటున్నట్టు "ఇండక్షన్" అన్నది. "ఇండక్షన్ ద్వారా
మాటలు పుర్రెలోంచే వినబడ్తా యి .నీకు ఫిజిక్స్ తెలియకపోతే దాని గురించి ఎంత చెప్పినా అర్ధంకాదు"

"కానీ సిద్దేశ్వరికి మానవాతీత శక్తు లు వున్నాయి "అన్నాడు దార్కా. "నేను స్వయంగా చూసేను. లేకపోతే
నమ్మేవాణ్ని కాదు."

"ఏది -? తలుపులన్నీ వేసుకుని ఇనప్పెట్టెలో కూర్చోవడమా" అని నవ్వింది తులసి. "ఆమె వళ్ళో వున్న దేవి
విగ్రహంలోనే వున్నది ట్రిక్ అంతా. అందులోంచే ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేది."

"అదికాదు" అన్నాడు దార్కా "ఆమె నా చేతి లోంచి బూడిద తెప్పించింది."

"ఏమిటీ.....?"

అతను వివరంగా చెప్పాడు. చేతులు సాచి, పిడికిళ్ళు మూస్తే అందులో బూడిద


రావడం.........అంతా....
అంతా విని ఆమె నవ్వింది. అటూ యిటూ చూస్తూ "కొంచెం బూడిద వుంటే నేనూ చూపిస్తా ను" అంది.
అతడు చుట్టూ చూశాడు. ఏమీ దొరకలేదు. అతడిదృష్టి తులసి మొహంమీద నిల్చుండిపోయింది. గుండ్రటి
మొహపు నుదుటి మధ్యలో గుండ్రటిబొట్టు - కుంకుమది.

అతడి దృష్టి బొట్టు మీదపడగానే, ఆమె అర్ధమైనట్టు కుంకుమ తడిమి చూసుకుంది. అతడు చేతులు సాచి
నిలబడ్డా డు "అలాక్కాదు, అని ఆమె అరచేతులు కిందకి వుండేటట్టు సరిచేసి పిడికిళ్ళు ముయ్యి" అన్నది.
అతడు ముయ్యగానే ఆమె, తన నుదుటినుంచి కొంచెం కుంకుమతీసి అతడి కుడి పిడికిలిమీద జల్లి "తెరువు
రెండు చేతుల్నీ" అంది అతడు పిడికిళ్ళు తెరిచాడు. ఎడమచేతి మధ్యలో కుంకుమ వుంది మిలమిలా
మెరుస్తూ.

అతడు దిగ్ర్బాంతుడై "ఎలా జరిగింది ఇది? అరె సిద్దేశ్వరి కూడా ఇలానే చేసిందే" అన్నాడు.

తులసి చిరునవ్వుతో "ఆశ్చర్యంగా నువ్వు సారీ -మీరు ఆలోచించలేదు కానీ, నేను చేసిన ప్రతీ పనిని
జాగ్రత్తగా గమనించి వుంటే కుడి నుంచి ఎడమ చేతిలోకి కుంకుమ ఎలా వచ్చిందో అర్ధమవుతుంది" అంది.

అతడు కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించి, అంతా అర్ధమైనట్లు నవ్వేడు.

తులసి విస్మయంతో కళ్ళు పెద్దవిచేసి "ఫర్లేదు మీకూ తెలివివుందే" అని, వెంటనే అతడి మొహాన్ని చూసి
నవ్వేసి, "సారీ" అన్నది. అప్పటికే అతడి మొహం చిన్న పిల్లా డలా రోషంగా ఎర్రబడింది.

అంతలో దూరంగా గోడ గడియారం గంటలు కొట్టటం వినిపించింది.

ఒకటి......రెండు.......

"అర్ధరాత్రయింది" అన్నది తులసి.

దార్కా ఆమె మాటలు వినటంలేదు.

తొమ్మిది......పది......పదకొండు........పన్నెండు.......

అయిపోయింది.

ఆఖరిరోజు పన్నెండయిపోయింది.

కాష్మోరా నిద్రలేచి వుంటుంది.


ఇక తనచేతబడి పనిచెయ్యదు.

అంటే........అంటే.....తను తులసిని పట్టు కోలేడు.

తులసి దార్కావైపు భయంగా చూసింది. అతడిలో వున్నట్టుండి మార్పు.

ఆమె అతణ్నే చూస్తూంది.

అతడి తలలో ఆలోచనల హోరు అయిపోయింది. తులసిని చంపటం కోసం కాష్మోరా లేచి వుంటుంది. తన
చేతబడి పనిచెయ్యదు. తన పగ తీరదు. ఇక ఏడు రోజుల్లో తులసి మరణం తన మరణం కూడా.

మరణం అతన్ని భయపెట్టడం లేదు.

ఓటమి బాధ పెడుతూంది.

"కాష్మోరా -కాష్మోరా" అని గొణిగేడు.

ఆమెకి సంభాషణ కొనసాగించడానికి . అతనిని మాటల్లో పెట్టి మామూలు మనిషిని చెయ్యడానికీ ఆమెకు
వీలు దొరికింది.

"కాష్మోరా -" అంది.

దార్కా తలెత్తా డు.

"మా ఇట్లో డైనింగ్ టేబుల్ దగ్గర అప్పుడప్పుడూ చెప్పుకుంటూ వుంటాం కాష్మోరా అన్న పేరు. ఏమిటి
కాష్మోరా అంటే-" దార్కా వెంటనే జవాబు చెప్పలేదు. తరువాత నెమ్మదిగా అన్నాడు.

"సరిగ్గా అయిదు నిమిషాల క్రితం కాష్మోరా నిద్రలేచి వుంటాడు. పదొకొండు సంవత్సరాల నిద్ర తర్వాత"
దార్కా కంఠం వణికింది.

"కాష్మోరా కుంభకర్ణుడి పెద్దన్నయ్యా?" పదకొండు సంవత్సరాల తర్వాత లేవడానికి" నవ్వింది తులసి.

దార్కా నెమ్మదిగా తలెత్తా డు -అతడి కంఠంలో అదోలాటి కంపన వుంది. "అరవై రెండు క్షుద్రశక్తు ల కలయిక
-పదిహేనో విద్య" అన్నాడు అదే "కాష్మోరా"

తులసి అతడి వైపు జాలిగా చూసింది. సైన్సు ఇంత ప్రగతి సాధించింది. తనలాటి అమ్మాయిలు కూడా
బాబాలు ఈశ్వరుడూ వీళ్ళ మోసాలు బహిర్గతం చెయ్యడం కోసం ప్రాణాలకు తెగించి అపాయాలను కొని
తెచ్చుకుంటున్నారు. యువతరం ఇలా హేతువాదం వైపు కొనసాగిపోతున్న తరుణంలో -ఈ యువకుడు
పాపం ఏం చదువుకున్నాడో తెలీదు కానీ -ఏదో పాత ఇంగ్లీషు సినిమాలోలా , సాతాను నిద్రలేస్తూందీ అన్న
హేలూసినేషన్ లా మొహం అంతా కందగడ్డలా చేసుకుని అరుస్తు న్నాడు. ఈ ప్రజల అజ్ఞానాన్ని ఎవరు
పోగొట్టగలరు?

తులసికి అతడిని ఏడిపించాలని బుద్దిపుట్టింది.

"అయితే కాష్మోరా ఎప్పుడు నిద్రపోయాడో నీకెలా తెలుసు? అంటే ఐ మీన్ -ఏ మర్రిచెట్టు వూడలమీదో -
రావిచెట్టు తొర్రలోనో పడుకోవడం నువ్వు చూసేవా?"

ఆమె మాటల్లో వ్యంగ్యం అతడు గ్రహించలేదు. అసలు అందులో వ్యంగ్యం వుంటుందన్న భావం అతడికి
రాలేదు. "కాష్మోరా అసంతృప్తు డై నిద్రపోయాడు -నా గురువు చెప్పాడు - పదకొండు సంవత్సరాల దీర్ఘనిద్ర"
అన్నాడు నిజాయితీగా.

తెరలు తెరలుగా వస్తు న్న నవ్వును ఆమె పెదవుల వెనుక బిగపట్టి "సరీగ్గా ఈ రోజే లేస్తా డని ఎలా తెలుసు?
ఏదైనా క్లెయిర్ వాయిన్స్ లో కాష్మోరా మెసేజ్ పంపేడా" అంది.

ఆమె వాడిన ఇంగ్లీషు పదాలు అతడికి అర్ధం కాలేదు. తనలో తను "రోజుకో పుల్ల చొప్పున ముప్పై పుల్లలు
విరిచేడు -నెలయింది. అలాటిది పన్నెండయితే సంవత్సరం -అయిదు కణుపులూ అయిదు సంవత్సరాలు
"అన్నాడు స్వగతంలా.

అంతలో మరో గడియారం పన్నెండు కొట్టింది. ఈ సారి అతడు ఆవేశాన్నీ, ఉద్విగ్నతనీ


ఆపుకోలేకపోయాడు. బిస్తా గ్రామపు మంత్రగాడిగా మారి దిక్కులు పిక్కటిల్లేలా - "ఓడిపోయాను
విషాచీ........అని ఆభవంతి ప్రతిధ్వనించేలా అరిచాడు.

పూజలో ఉన్న సిద్దేశ్వరి ఉలిక్కిపడింది. వడివడిగా ఆ గదివైపు రాసాగింది.

"ఏమిటా అరుపు? ప్లీజ్ అందరూ వస్తా రు" అంది తులసి దార్కా నెమ్మదిగా సర్దు కున్నాడు.

అది అర్ధరాత్రి కాబట్టి ఎవరూ లేరని తులసి అనుకొంది. కానీ సిద్దేశ్వరి ఆలయంలో చాలా పూజలు రాత్రివేళ
జరుగుతాయని ఆమెకు తెలియదు. అందులోనూ ఆ రోజు మహాపూజ దేశం నలుమూలల్నుంచి మహా
మహులందరూ వచ్చి ఉన్నారు.

సిద్దేశ్వరి ఒక్కోగది వెతుక్కుంటూ వస్తూంది. ఆమె మొహం ఎర్రగా కందిపోయి వుంది.

గదిలో తులసి దార్కా వైపు జాలిగా -సాలోచనగా చూసింది. తాము ఇంత కష్టపడి సైంటిఫిక్ గా నీరూపించి,
మనుషుల అజ్ఞానాన్ని పారద్రోలటానికి ప్రయత్నం చేస్తూవుంటే, ఈ వ్యక్తి ఇంకా క్షుద్రశ్కతుల్నీ మానవాతీత
విద్యల్ని నమ్మే యుగంలోనే వున్నాడు.
ఎలా యితన్ని మార్చటం ? అంతలో ఆమె మెదడులో ఏదో మెరిసింది.

"అయిదు సంవత్సరాలు అయిదు కణుపులూ, ముప్పై పుల్లలు ముప్పై రోజులూ కదూ"

"అవును" అన్నాడు దార్కా.

"ఈ లెక్కలూ యివన్నీ ఎంత తప్పో ఇప్పుడు అర్ధమయ్యాయా"

"ఎలా?"

"ప్రతి నెలకీ రోజులు ముప్పై కాదు. కొన్నిటికి ముప్పై ఒకటి -ఫిబ్రవరి ఇరవై ఎనిమిదే."

దార్కా స్థా ణువయ్యాడు. అమావాస్య -పున్నముల సాయంతో చివరి క్షణం వరకూ సరిగ్గా లెక్కకట్టగలిగే తన
గురువయిన విషాచి, తనను నాగరిక ప్రపంచంలోకి పంపే ప్రయత్నంలో నాగరికంగా లెక్కకట్టబోయి తప్పు
లెక్కవేసేడు.

అయితేనేం మంచే జరిగింది.

తులసి తనమాటమీద అతడి రియాక్షన్ కోసం చూస్తూ వుండగా అతడి మొహంలో ఓటమి బదులు
సంతోషం చోటుచేసుకుంటూ వుండగా బయట సిద్దేశ్వరి అలికిడి వినిపించింది.

* * *
అదే సమయానికి తన పాక మధ్యలో ఇస్మాయిల్ చేతులు గాలిలోకి సాగి ప్రార్ధన చేస్తు న్నాడు.

ముప్పై అయిదన్నా నిండకుండానే ఇస్మాయిల్ యాభై ఏళ్ళ వాడుగా మారేడు. జుట్టు చాలా తెల్లబడింది.
బుగ్గలు జారిపోయాయి. కానీ మొహం మీద నవ్వు మాత్రం చెరగలేదు. మనిషిలో హుషారు తగ్గలేదు.

ఎవరో చెప్పుకుంటుంటారు -చేతబడి తిరగ్గొడుతూంటే వక్రించిందనీ అందుకే ఆ వయసులో అలా


అయిపోయేడని.

ఆ మాటే అతడి దగ్గిర అంటే నవ్వుతారు - "ఆంజనేయ భక్తు డ్ని సార్. నన్నుఎవరేం చేయలేరు" అని.

అతడికి పిల్లలంటే అమితమైన ప్రేమ. అందుకే ఇరవై సంవత్సరాలనుంచి ఆ స్కూల్ బస్ క్లీనర్ ఉద్యోగమే
చేస్తు న్నాడు. వాళ్ళు ఇంకో మంచి ఉద్యోగంలోకి ప్రమోట్ చేస్తా మన్నా వద్దన్నాడు. అతడి జీవితం అంతా బస్
లోకి వస్తూన్న పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పటం తోనూ, దిగిపోయేటప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పటంతోనే
సంతృప్తిగా వెళ్ళిపోయింది.
ఒక బ్యాచ్ తరువాత ఇంకొక బ్యాచ్ వచ్చేది -ఒక ఏడు తర్వాత ఇంకొక ఏడు పైబడేది కదిలివచ్చే పిల్లలు -
కదలాడే జ్ఞాపకాలు మంచివి చెడ్డవి -అన్నిటిమధ్యా అస్పష్టంగా -

బస్ ఆ వీధిలోంచి వెళ్ళినప్పుడల్లా ........

ఆ యిల్లు దగ్గిర పడుతున్నప్పుడల్లా ......

సమయం దగ్గిర పడుతున్నట్టూ - ముంచుకొస్తు న్నట్టూ భావన.

.............
................

అతడు ప్రతిరోజూ చూస్తూనే వున్నాడు తులసిని.

తన బస్ లోంచి గెంతి టాటా చెప్పి విశాలమైన కాంపౌండ్ లోకి పరిగెత్తే పదేళ్ల తులసి. -

పొందిగ్గా ఓణి పరికిణీల్తో హై స్కూల్ కెళ్ళటాన్ని.........

ఒద్దికైన చీరలో కాలేజీ స్టూడెంటవటాన్నీ................

ఒక్కోరోజూ గడుస్తూంటే అతడు తల్లడిల్లి పోతున్నాడు. రాబోయే మారణహోమాన్ని తల్చుకుని.

చెప్పుకోటానికి ఎవరూలేరు. ఆపటం ఎలాగో తెలీదు. తెలిసిన కొద్ది జ్ఞానమూ తెలియచెపుతుంది .


పదకొండేళ్ళ పగతో కాష్మోరా తిరగ బెట్టబోతూందని ఈసారి రెట్టించిన పగతో - ఉత్తరం దిక్కునుంచి
వెతుక్కుంటూ వచ్చి. అది ఆ పాపని (తులసి అతడికి ఇంకా పాపే) పెకిలించుకు పోతుందని.

ఎలా ఆపటం?

అతడు కొట్టు మిట్టా డుతున్నాడు. ఏం చేయాలో తేచక -

శ్రీధర్ కి చెప్పొచ్చు. కానీ ఏం లాభం? ఆ తండ్రి మనస్సు బాధ పెట్టటం తప్ప. జరిగేది ఎలానూ
జరగబోతూన్నప్పుడు అది ముందేచెప్పి బాధ పెట్టటం ఎందుకు అని ఇంతకాలం ఉపేక్షించాడు. కానీ రోజు దాటి
రోజూ గడుస్తూంటే అతడి మనసు ఆగలేదు. శ్రీధర్ ఇంటికి వెళ్ళాడు. శ్రీధర్ అసలు ఈ దేశంలో లేడని, పారిస్
వెళ్ళాడని తెలిసింది. కుంగిపోయాడు.

కాష్మోరా గురించి తెలిసినవాళ్ళు యిద్దరు. ఒకడు తను. రెండో వాడు రోడ్లు పట్టు కుని తిరుగుతున్నాడు
పకీరు.

శవారూఢం స్మశాన వాసిని

క్రీం హ్రీం......... దక్షిణకాశి.

ఆ వూహతోనే అతడు వణికిపోయేడు.

.......ముక్కు నుంచి కారే రక్తం నేరేడు వర్ణంలో వుంటుంది. ఎడమకాలు నేలమీద ఆనదు.......

కదిలిస్తు న్న కాష్మోరాకి పంచభూతాలూ సాయం చేస్తా యి. పంచ భూతాలు అంటే భూమి -నీరు- గాలి -
ఆకాశమూ -అగ్ని.

ఇవన్నీ దేముడు సృష్టించినవి అయినా దెయ్యానికి సాయం చేస్తా యి. కారణాలు అన్వేషించాలంటే
మంత్రశాస్త్రా న్ని మరింత మధించాలి. పంచభూతముల గురించి తెలుసుకోవాలి. జ -అంటే పుట్టినది.
పంచభూతముల నుంచి పుట్టినవి వరుసగా.... భూమి నుంచి మాంసము, నీటినుంచి నెత్తు రు, అగ్నినుంచి
ఆకలి, గాలినుంచి మనసు, ఆకాశం నుంచి కామము పుట్టేయి. ఇవన్నీ క్షుద్రదేవత అంశాలు. అందుకే క్షుద్ర
దేవతలకి పంచభూతాలు సాయం చేస్తా యి. ఆ కారణం వల్లే దేముడెంత గొప్ప వాడయ్యాడో క్షుద్రదేవత కూడా
అంత గొప్ప అయింది.

ఇక కొద్దికాలంలో - చాలా కొద్దికాలంలో

కాష్మోరా లేవబోతూంది.

అప్పుడు భూమి కంపిస్తూంది. వాయువు వెయ్యిశవాలు కాల్చిన బూడిద తోడుగా ఝంఝా మారుతమై
కదుల్తుంది. ఆకాశం రక్తా న్ని వర్షిస్తుంది. అంత వర్షంలోనూ శ్మశానం మధ్యలో అగ్ని ఉజ్వలమై వెలుగుతుంది.
అగ్నికి నీరు తోడవుతుంది. ఆ అయిదింటిలోంచే కాష్మోరా లేస్తుంది.

........ఇస్మాయిల్ వణికిపోయేడు. ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి?

ఆ రోజు మధ్యాహ్నం అతడు విద్యావతి ఇంటికి వెళ్ళేడు.

మొట్టమొదటిసారి తన ఇంటికి తులసి విషయమై ఆందోళనపడుతూ వచ్చిన ఇద్దరూ ఇప్పటికీ అతడికి


గుర్తు న్నారు. శ్రీధర్, విద్యాపతి. ఆ తరువాత బిస్తా వెళ్ళిన వాళ్ళలో కూడా విద్యావతి ఉన్నాడని అతడికి
తెలుసు.

పదకొండు సంవత్సరాల తర్వాత తనను కలుసుకోవచ్చిన బస్ క్లీనర్ ని విద్యావతి ఆసక్తిగా ఆహ్వానించాడు.
కాలం విద్యాపతిలో బాగా మార్పు తెచ్చింది. బట్టతల .......... డయాబిటిస్.....ఊపిరిసలపనంత పని.......
కుర్చీలో ఇస్మాయిల్ ముణగదీసుకుని కూర్చున్నాడు. చుట్టూ పెద్ద పెద్ద రేక్స్ లో నల్లటి బౌండు
పుస్తకాలు...... ఎక్కడో నాలుగైదు టై మ్ మిషన్ల చప్పుళ్ళు..... ఎదురుగా నల్లటి కుర్చీలో ఎత్తు గా విద్యాపతి.

వీళ్లెవరికీ పట్టదేం.....? ఒక వైపు అంత ఘోరం జరగబోతుంటే ఇలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారేం?
ఉరుకులూ పరుగులూ మీద వస్తు న్న ప్రళయాన్ని ఆపరేం........?

"చెప్పు" అన్నాడు విద్యాపతి. కొన్ని లీగల్ విషయాలు మాట్లా డటానికి అయిదు నిమిషాల్లో ఒక పెద్ద క్లయింట్
రాబోతున్నాడు. ఆ తొందర్లో వున్నాడు అతడు.

ఇస్మాయిల్ వణుకుతూన్న చేతివేళ్ళని గుప్పెళ్ళతో బిగించి, పిడికిళ్ళు పళ్ళోగట్టిగా అదిమిపెట్టి, కంపిస్తూన్న


గొంతుతో అన్నాడు....... "కాష్మోరా లేవబోతూంది బాబూ కాష్మోరా లేవబోతూంది?"

విద్యాపతి నుదురు చిట్లించి "ఏ కాష్మోరా" అన్నాడు అర్ధంకాక.

ఇస్మాయిల్ స్థా ణువయ్యాడు.

అంతలో విద్యాపతి "ఓ....కాష్మోరా" అన్నాడు గుర్తొచ్చినట్టు . తర్వాత కుర్చీ వెనక్కి వాలేడు..... "అయితే
ఏమిటి?"

ఈ ప్రస్న ఇస్మాయిల్ వూహించనిది.

"దా...దా.......దాన్నాపాలి?" అన్నాడు తడారిపోయిన గొంతుతో.

"ఎలా?"

ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో ఇస్మాయిల్ కి తెలియలేదు. ఎదుటి వ్యక్తిని మౌనం మీద ఎలా కన్విన్స్
చెయ్యాలో విద్యాపతికి బాగా తెలుసు.

"అప్పుడెప్పుడో కుర్రాళ్ళుగా వున్నప్పుడు అడ్వెంచరస్ గా వెళ్ళి ఏదో చేసేం తల్చుకొంటేనే నవ్వొస్తూంది.


చెప్పుకోవటానికి బాగానే వుందనుకో కానీ మళ్లీ ఇప్పుడు అదే చెబితే మూర్ఖత్వం అంటారు. ఆ రోజుల్లో కూడా
వీటిమీద నాకు పెద్ద నమ్మకం లేదు. సైన్సు ఇంత అభివృద్ధి చెందుతున్న రోజుల్లో....... ఇంత ప్రాక్టీసున్న లాయర్
మళ్ళీ మంత్రాలు తంత్రాలూ అంటూ గ్రహపూజలు చేయిస్తు న్నాడంటె అందరూ నవ్వుతారు. లాజికల్ గా
ఆలోచిద్దాం. కాష్మోరా లేవకుండా ఆపటం కోసం వచ్చానన్నావ్, దానికోసం ఏం చెయ్యాలో నీకు తెలీదు. మరి
నాకెందుకు చెప్పటం? కేవలం సానుభూతి కోసమా? లేక సాయం కోసమా?"

ఇస్మాయిల్ మాట్లా డలేదు. ఏం మాట్లా డాలో తెలీదు.


విద్యాపతి బెల్ కొట్టి గుమాస్తా ని పిలిచాడు. "ఇదిగో...... ఇతడికో వందరూపాయలిచ్చి పంపించు" అని
మళ్ళీ తన పనిలో మునిగిపోయేడు. అతడేగానీ తలెత్తి ఇస్మాయిల్ వైపు చూసివుంటే ఆ కళ్ళనిండా నిండిన
నీళ్ళను చూసేవాడు.

మరో క్షణం కూర్చొని నిశ్శబ్దంగా ఇస్మాయిల్ బయట కొచ్చేసేడు.

గుమాస్తా వంద పట్టు కొచ్చేసరికి వరండాలో ఇస్మాయిల్ లేడు. అథడికిచ్చినట్టు రాసుకొని దాన్ని తన
జోబులో వేసుకున్నాడు గుమాస్తా .

* * *
ఆ రోజు జరిగిన సంఘటన అతడి మనసుని కృంగదీసింది. అతడు బీదవాడే కావచ్చు. మంత్రతంత్రాల్తో
క్షుద్రదేవతల్ని ఆరాధించే వాడే కావచ్చు. కానీ పిల్లలమధ్య పెరుగుతున్నవాడు. పిల్లలంటే మమకారం
పెంచుకున్నవాడు. తన ముందు పెరిగిన పాప ప్రాణాపాయంలో వుంటే చూస్తూ వూరుకోలేకపోయాడు. కానీ
ఏం చెయ్యగలడు?

వరదలో కొట్టు కుపోతున్నవాడు -ఇంకొకడ్ని చూసి చెయ్యి సాచిదగ్గిరకు చేరినట్టు సంతాన్ ఫకీర్ దగ్గరకు
బయలుదేరేడు. ఫకీరుండేది నగరం అవతల ఏరుదాటేక పాడుపడ్డ కోటలో.

అప్పుడు అర్ధరాత్రి దాటి అరగంటయింది. ఫకీరు పగలంతా పిచ్చి వాడే. మామూలుగా మాట్లా డేది ఆ
అర్దరాత్రే.

* * *
అర్ధరాత్రి నిశ్శబ్దా న్ని చెదురుస్తూ బయట గుమ్మందగ్గర చప్పుడు వినిపించగానే తులసి ఒక్క గెంతులో బల్ల
కిందికి లేడిలా గెంతింది. ఇక్కడే చక్రవర్తి శరీరం వుంది. ఆమె దాని వెనక్కి వెళ్ళి నక్కి కూర్చుంది.

తలుపు తీసిన సిద్దేశ్వరిని చూస్తూనే ఆమె గుండె వేగంగా కొట్టు కోసాగింది.

గది మధ్యలో దార్కా నిలబడి వున్నాడు. అతడిని చూస్తూనే సిద్దేశ్వరి "నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావ్?"
అని అడిగింది. దార్కా మాట్లా డలేదు. వెంటిలేటర్ నుంచి ఆమె దృష్టి గదిలో వస్తు వులమీద పడింది. బల్లమీద
గుడ్డ, లాగివున్న కార్చన్ కాగితం, జరిపిన పాదుకలూ ఒక్కొక్క వస్తు వునూ చూస్తు న్న కొద్దీ ఆమె ముఖంలో
భావాలు మారిపోసాగేయి. నిప్పులు కురుస్తూన్న కళ్ళతో దార్కాని చూస్తూ "ఇదంతా చేసింది నువ్వేనా" అని
అడిగింది. దార్కా దానికి సమాధానం చెప్పలేదు.

బల్ల వెనగ్గా కూర్చున్న తులసి వళ్ళు చెమటతో తడుస్తూంది.


"ఇదంతా ఏమిటి" రెట్టించింది సిద్దేశ్వరి.

దార్కా నవ్వేడు. "ఏదయినా ప్రశ్న కాగితం మీద రాయి సిద్దేశ్వరీ! సమాధానం చెబ్తా ను"

"ఓహో -అంతా కనుక్కున్నావన్నమాట. మూర్ఖుడా, నీ చేతిలో భస్మం నిన్ను దగ్దం చేస్తుంది -జాగ్రత్త"

"నువ్వు చేతులు చాపు సిద్దేశ్వరీ. నేను బూడిదని తెప్పిస్తా ను."

వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న తులసికి మాత్రం - దార్కా సిద్దేశ్వరిని ఇలా రెచ్చగొట్టటం నచ్చలేదు. ఆమె ఆ
గదిలో ఎక్కువసేపు వుండటం ప్రమాదకరం.

సిద్దేశ్వరి ఆవేశంతో వణుకుతూంది. "ఇంతకాలం నేను రహస్యంగా కాపాడుకుంటూ వస్తు న్నవన్నీ నువ్వు
గ్రహించేసే వన్నమాట దార్కా! నువ్వు చాలా తెలివైనవాడివి. ఇంత తెలివైన వాడు నాతో పాటు ఈ భూమ్మీద
వుండటానికి వీలులేదు. నిన్ను దేవికి ప్రసాదంగా అర్పిస్తా ను."

"అయితే నన్ను చంపుతావన్నమాట."

"నిస్సంశయంగా"

"అన్నీ తెలిసిపోయినయ్. కానీ ఒక్కటే తెలియటంలేదు. నన్ను చంపబోయే ముందు ఆ ఒక్కటీ చెప్పు.
ఎందుకు నువ్వు ఇలా స్త్రీ వేషం వేసుకున్నావ్?"

"అవునది కూడా తెలిసింది కదూ నీకు" సిద్దేశ్వరి నవ్వింది.

వింటున్న తులసి స్థంబించింది. సిద్దేశ్వరి స్త్రీ కాదా? ఆమె ఉత్సుకత ఆపుకోలేక పోయింది. ముందు వున్న
చక్రవర్తి శరీరాన్ని (అది శవంగా మారిందని ఆమెకి తెలీదు) పక్కకి జరిపి తల ముందుకు పెట్టి చూసింది.
తనెంత తప్పు చేస్తూందో ఆ ఉద్వేగంలో ఆమె గ్రహించలేదు.

దార్కా చూస్తూ వుండగా సిద్దేశ్వరి తలమీద జుట్టు ని రెండు చేతుల చూపుడు వేళ్ళతో పాయలుగా విడగొట్టి
విగ్గులో నల్లగా ఇమిడి వున్న హెడ్ ఫోన్స్ ని తీసి బల్ల మీద పెట్టింది. ఆ తరువాత రెండు చేతుల్తోనూ మెడ
వెనుకనుంచి విగ్గును లాగేసింది.

ప్రత్యక్షంగా చూస్తు న్న దార్కా, పరోక్షంగా చూస్తు న్న తులసి నిశ్చేష్టు లయ్యారు.

వాళ్ళు చూస్తు న్నది ఎదుటి వ్యక్తి గుండుని కాదు, 'మాడు' ప్రదేశం నుంచి బయటకొచ్చిన వైరుని.....
చెవికింద సిగరెట్ ప్యాకెట్ సైజులో వున్న రేడియో ఆక్టివ్ ఐసోటోప్ ప్లూ టోనియం -239 ఆక్సైడ్ పాకెట్టు ని.
"ఇవన్నీ దాయటం కోసం దార్కా నేను స్త్రీగా తయారయ్యేను. అదీగాక యోగులకన్నా యోగినులకు
భక్తు ల్నుంచి ఎక్కువగా గౌరవం లభిస్తుంది ఈ దేశంలో"

తులసి తన కళ్ళముందు దృశ్యాన్ని నమ్మలేకపోతూంది. సిద్దేశ్వరి మొగవాడు. అంతేకాదు -అతడి


మెదడులో ఏదో మిషన్ వుంది.

సిద్దేశ్వరి యోగిని అని నమ్మటం కన్నా ఇది మరింత భయంకరంగా వుంది. అతడి గుండుమీద వైర్లు
వికృతంగా ఉన్నాయి. తల నుంచి చెవి దగ్గిరకు వెళ్ళిన వైరు పాడయిపోయిన నీటి పంపు గొట్టంలా వుంది.
అన్నిటికన్నా భయంకరంగా చెవి దగ్గర చర్మానికి అతుక్కుపోయి కణతలా వేలాడుతూంది ప్లూ టోనియం
పాకెట్.

ఆ దృశ్యాన్ని చూడలేనట్టూ చప్పున వెనక్కి జరిగింది. అంతకు ముందే చక్రవర్తి శరీరాన్ని వెనక్కి జరిపిన
సంగతి ఆమె మర్చిపోయింది. వెనుకకు జరిగేసరికి ఆ శవపుకాలు మెత్తగా తగిలింది. అసలే భయంతో
వుందేమో, చప్పున దాన్ని ముందుకు తోసింది. 'దబ్' మన్న శబ్దంతో ఆ కాలు బల్ల బయటకొచ్చి పడింది.

సిద్దేశ్వరి గిర్రు న వెనుదిరిగింది.

ఉన్నట్టుండి ఆ గదిలో వ్యాపించిన నిశ్శబ్దం వళ్ళు గగుర్పొడిచేదిలా వుంది. గుండె చప్పుడు తనకే
వినిపిస్తూంది తులసికి. దార్కా కూడా ఇది వూహించనివాడిలా నిశ్చేష్టు డయ్యాడు.

ముందు తేరుకున్నది సిద్దేశ్వరి.

ఆమె వడివడిగా తనవైపు రావటం చూసి, తులసి మరింత ముణగదీసుకు పోయింది. సిద్దేశ్వరి వంగి
చూడబోతూ వుంటే, "అతడ్ని కొట్టింది నేనే" అని వెనుకనుంచి దార్కా అన్నాడు. ఆ మాటతో ఆమె ఆగి,
వెనక్కి తిరిగింది. ఆమె శవం దగ్గిరకి వెళ్ళటానికి వీలు కలిగించకుండా దార్కా వచ్చి చక్రవర్తి శరీరాన్ని బయటికి
లాగేడు.

చాలా తెలివిగా, సమయస్పూర్తితో తనను కాపాడినందుకు తులసి అతడికి మనసులోనే అభినందనలు


తెలిపింది. చక్రవర్తి శవాన్ని చూడగానే సిద్దేశ్వరి మొహంలో హిస్టీరియా తాలూకా లక్షణాలు కనపడ్డా యి.
ఇంతకాలం కుడిభుజంలా వ్యవహరించిన వ్యక్తి మరణం తక్కువ దెబ్బేమీ కాదు. "దార్కా!" అంది ఆవేశంతో
వణుకుతున్న కంఠంతో "దీనికి ప్రతీకారంగా నేను నా భక్తు లచేత నిన్నెలా చంపిస్తా నో చూద్దూగాని."

* * *
"మహాపూజ ఆఖరి అంకం ఇది కేవలం దేవి అంతరంగిక భక్తు లకే అక్కడ ప్రవేశం కల్పించబడింది" అంది
సిద్దేశ్వరి. పదిమంది భక్తు లూ చేతులు కట్టు కొని వినమ్రతతో నిలబడి వున్నారు... అందరూ సమాజంలో పెద్ద
స్థా నాల్లో ఉన్నవారే. చదువుకున్నవారే.

"దేవికి అత్యంత ప్రియమైనది నరబలి. మనిషిలో ఒక్కో అంగాన్ని ఒక్కో రుచితో స్వీకరిస్తుంది దేవి. మీ
సమస్య ఏమిటి?"

భక్తు ల్లో ఒకాయన ముందుకొచ్చాడు. అరవ యాసతో "నీకు తెలియదా ఏమి దేవీ? అల్లు డు చచ్చిపోయాక
నా కూతురికి దెయ్యం పట్టింది" అన్నాడు.

"దెయ్యాన్ని దేవి వదిలిస్తుంది. మనిషి కళ్ళు నైవేద్యం పెట్టా లి."

ఈ సంభాషణ జరుగుతూ వుండగా తులసి పై గదిలోంచి మెట్లు దిగి, ఎరువుల గది పక్కగా నేలమాళిగలోకి
వచ్చింది. ఎయిర్ కండిషన్డు గొట్టం పక్కనుంచి నిచ్చెన మెట్లు ఎక్కింది. 'నా భక్తు లచేత నేను నిన్ను చంపిస్తా ను'
అన్న సిద్దేశ్వరి మాటలు కలవర పెడుతున్నాయి."

"మీ సమస్య ఏమిటి?" పత్రికా ప్రొప్రయిటర్ ని అడిగింది.

"నా పత్రిక సర్క్యులేషన్ అకస్మాత్తు గా పడిపోయింది. మూసేయ్యాల్సిన పరిస్థితి"

"నా స్తోత్రాలు వేస్తు న్నా పడిపోయిందా?" సిద్దేశ్వరి అడిగింది.

ఆయన తలూపేడు.

"దేవికి మనిషి రక్తా న్ని తర్పణంగా వదలండి. మీ కోర్కెనెరవేరుతుంది."

తులసి నిచ్చెన పైకి ఎక్కి నెమ్మదిగా చెక్క తలుపు ఎత్తింది. పూర్వపు గదే అది. కాళికాదేవి విగ్రహం అలాగే
వుంది. కానీ ముందు దృశ్యం భయంకరంగా వుంది. దార్కా దానిముందు నిలబెట్టబడివున్నాడు. అతడికి
నాల్గడుగుల దూరంలో సిద్దేశ్వరి వుంది. అగరొత్తు లూ దూపం -గదంతా మసక చీకటి -

ఆమెకేం చెయ్యాలో పాలుపోలేదు. ఆ నిచ్చెనకే అనుకొని నిస్త్రా ణగా కళ్ళు మూసుకుంది. ఆకలితో,
దాహంతో శోషవచ్చేటట్లు వుంది.

"ఈ ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం అదికారంలో వుండగా నాకు ఎగుమతులకి లైసెన్సు దొరకదు. దేవికి
ఎన్ని మర బలులయినా ఇవ్వండి" ఆవేశంతో అన్నాడు సేఠ్.

సిద్దేశ్వరి నవ్వింది. "దేవి హృదయానికి దగ్గిర కావాలంటే మనిషి గుండె నైవేద్యం పెట్టా లి నాయనా"

"కాదు కాదు. ఈ ప్రభుత్వమే వుండాలి" భక్తు ల్లోంచి ఇంకో ఆయన అరవటంతో సిద్దేశ్వరి అటు తిరిగి
నవ్వింది. "ఓ! అధికారంలో వున్న మంత్రివరేణ్యులూ ఇక్కడే వున్నారే -ఎలా?"

"దేవి అనుగ్రహం కోసం నా తరపున మనిషి గుండె సమర్పించు సిద్దేశ్వరీ -ఎంత ఖర్చయినాసరే. ఈ
ప్రభుత్వమే అధికారంలో కొనసాగాలి" అంటున్నారు మంత్రిగారు. "ఖర్చు" అన్నపదం వినబడేసరికి సేఠ్ నవ్వేడు
"నా చందా లక్ష" అన్నాడు.

"రెండు లక్షలు" అన్నాడు వెంటనే మంత్రి.

"బలమయిన యువకుడు వయసులో వున్నాడు. దేవి తప్పక సంతృప్తి చెందుతుంది. నిస్సంశయంగా"


అంది దార్కా వేపు చూస్తూ సిద్దేశ్వరి.

"మూడు లక్షలు"

"నాలుగు"

తన గుండెకు పెరుగుతూన్న రేటు గురించి ఆలోచించటం లేదు దార్కా. అయితే అతడు దిగులు
పడుతున్నాడు. ఆ దిగులు ఈ సమాజం గురించి, ఈ నాగరికుల గురించి, కూతురికి మళ్ళీ పెళ్ళి చెయ్యాల్సిన
సాంఘిక బాధ్యత వదిలిపెట్టి దేవికి మనిషి కళ్ళు అర్పుస్తు న్నాడు అరవాయన. పాఠకుల్లో నైతిక స్పృహ
కలిగించాల్సిన పత్రికాధిపతి దేవీ స్తోత్రాలూ బాబాల మహత్తు లూ ప్రచురిస్తు న్నాడు. జనాన్ని చైతన్యంతో
ప్రగతివేపు నడపాల్సిన రాజకీయవేత్త మనిషి గుండెను బేరమాడుతున్నాడు. సాంఘికంగా నైతికంగా, .....
రాజకీయంగా..... ప్రజల్లో యింత మూర్ఖత్వం నిండి వుందా..... ఏమిటి నాగరికత?ఎక్కడికి వెళుతున్నాడు
.మనిషి? ముందుకా వెనక్కా? తమలా స్మశానాల్లో కపాలాలు మధ్య పూజ చెయ్యకపోయినా, నాగరికత
ముసుగులో నాల్గు గోడలమధ్య చేస్తు న్న దేమిటి?

ఇక్కడ దార్కా నిర్లిప్తంగా, నిశ్చలంగా నిలబడి యిలా ఆలోచిస్తూ వుంటే. అక్కడ తులసి క్షణాలు
గడుస్తు న్నకొద్దీ కంగారు పడిపోతున్నది అతడి బలి ఎలా ఆపుచెయ్యటం?

దార్కా కళ్ళు యాభైవేలకి, నెత్తు రు అరవైవేలకి సెటిలయ్యాయి. గుండె తాలూకు వేలం యింకా
కొనసాగుతూనే వుంది. భక్తు లు పారవశ్యంతో చూస్తు న్నారు. అందులో రిటై ర్డు సూపర్నెండెంట్ ఆఫ్ పోలీస్
కూడా వుండటం విశేషం. లంచాలు పట్టీ పట్టీ రిటై ర్ అయ్యాక పాపబీతితో ఆయన ఆ దేవీ భక్తు డయ్యాడు.

చివరికి ఆరు లక్షలకు బేరం సెటిల్ అయింది. ఇద్దరూ తలోమూడు లక్షలు యిచ్చేటట్టూ, మంత్రిగారు పార్టీ
మార్చేటట్టూ, సేఠ్ తన పలుకుబడి వుపయోగించి తిరిగి మంత్రి పదవి. ఆయనకు సంపాదించి పెట్టేటట్టూ.

సర్వేజనాః సుఖినోభవంతు.

ఒక పళ్ళెంలో బంగారు కత్తీ తీసుకురాబడింది. దార్కా కళ్ళు పెరికించటం కోసం. వెండిపాత్ర రక్తా న్ని
పట్టటానికి సిద్దంగా ఉంది. మంటల్లోకి నెయ్యి ధారాపాతంగా కారుతూంది. సాంబ్రాణి పొగ ఉక్కిరి బిక్కిరి
చేస్తుంది.

సిద్దేశ్వరి కత్తి చేతుల్లోకి తీసుకుంది.

అదే గదికి కింద, మాళిగలో తులసి కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూంది. అయిపోతూంది,
నరబలి కావొస్తుంది. ఎలా ఆపటం దాన్ని? ఎలా? ఎలా?

ఆమె చేతితో టపటపా నుదురు కొట్టు కుంది. తన కళ్ళముందే ఇంత కామ్ గా, ప్రశాంతంగా జరుగుతున్న
రక్తతర్పణం ఆమెని భీతావహురాల్ని చేస్తూంది.

ఏదో చూసింది తను. యిది ఇక్కడ ఎందుకుందీ అనుకుంది. ఏమిటిది.......... ఏమిటిది..... ఎక్కడో
చదివింది తను.......... చూడగానే గుర్తొచ్చింది.......

అదే ఈ పరిస్థితిలో దార్కాని రక్షించగలిగేది అని మనసు పదే పదే చెబుతూంది.

ఏమిటిది?

తులసి కళ్ళు గట్టిగా మూసుకుంది.

ఇంకెంతో టై మ్ లేదు. త్వరగా జ్ఞాపకం రావాలి......... ఏమిటిది? ఆమె తన మెదడుని, ఆలోచననీ, బుద్దినీ
అన్నిటినీ కేంద్రీకరించి గుర్తు తెచ్చుకోసాగింది.

ఫ్లా ష్ లాగా -మేఘాల మధ్యనుంచి వచ్చిన మెరుపులుగా ఆమెకు స్పురించింది.

ఎలక్ట్రిక్ షార్టు సర్క్యూట్

సిద్దేశ్వరి ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ఉపయోగించే వైరూ మాట్లా డే కపాలంలోని స్పీకరూ - సిద్దేశ్వరి
తలుపులన్నీ మూసి ఇనప్పెట్టెలో కూర్చున్నప్పుడు వళ్ళో పెట్టు కున్న విగ్రహంలోంచి వచ్చే ఆక్సిజన్ -

వాటన్నిటి సాయంతోనూ - ఇంకా వాటికి కొంచెం ఫిజిక్సూ - కొంచెం కెమిస్ట్రీ కలిపి ఆ భవంతిని పేల్చేస్తే.

ఆ ఆలోచన వచ్చాక తులసి మరి ఆగలేదు. సమయం కూడా ఎంతో లేదు. అప్పటికే దార్కా దేవి విగ్రహం
దగ్గరకు తీసుకు రాబడ్డా డు.

అతడి చుట్టూ వున్న వ్యక్తు ల గురించీ, వారి విజ్ఞానం గురించీ, నాగరికత గురించీ, సమాజంలో వారి స్థా నం
గురించీ, ఆలోచించి విచారించే సమయం కూడా లేదు.
అందరూ చివరికి తనూ, ఈ దార్కా -అందరు ఈ భవంతి కింద కప్పబడిపోయినా సరే ప్రజల్ని మూర్ఖత్వం
నుంచి రక్షించాలి.

ఆమె నిచ్చెన మీద నుంచి ఒక్క గెంతులో నేలమీదకి దూకింది. దాదాపు పదహారు గంటల్నుంచి ఏమీ
తినలేదు. అయినా ఓపిక తెచ్చుకుంది. జువ్వలా పరుగెత్తింది.

మిగతా భవంతి అంతా ప్రశాంతంగా వుంది.

ఎయిర్ కండిషన ర్ చెప్పుడు చెయ్యటం లేదు.

ఆమె నుదుటిమీద చెమట పట్టింది. ఇంక ఎంతో సమయం లేదు. సిద్దేశ్వరి మంత్రోచ్చారణ ఉచ్ఛస్వరంతో
వినిపిస్తూంది.

ఆమె ముందుగదిలోకి వచ్చింది. తొందర తొందరగా వెతకసాగింది. అన్ని వైపులా మూసివున్న ఇనప్పెట్టెలో
కూర్చొన్న సిద్దేశ్వరికి ఆక్సిజన్ లోపలే ఎలా తయారు చేసుకోగల్గుతూంది? దానికోసం ఆమె ఉపయోగించే
పదార్ధా లు ఏమిటి?

లాగివున్న బల్ల -బల్ల ప్రక్కన చక్రవర్తి శవం. వైర్లూ. బ్యాటరీ సెల్సు, కపాలం, దేవి, విగ్రహం! ఆమె చుట్టూ
చూసింది. గోడకి అల్మైరాలా వున్న జైయింట్ మీద ఆమె దృష్టి పడింది. చప్పున పరుగెత్తి దాన్ని తెరిచింది.

అది ఫ్రిజిడేర్. గోడలోకే తాపడం చెయ్యబడింది.

ప్రత్యేక వాతావరణంలో భద్రపరచబడిన ద్రవం కంటై నర్ లో వుంది. చూడగానే అది ఆమెకు
అర్ధమయిపోయింది.

లిక్విడ్ ఆక్సిజన్ ! ఆమె మరి ఆలస్యం చెయ్యలేదు.

సిద్దేశ్వరి కన అసిస్టెంటు నుంచి వార్తల్ని గ్రహించే పొడవాటి వైపుని తివాచీ క్రిందనుంచి లాగింది.

కాయిల్స్ దానికి అమర్చి ఫ్రిజ్ లో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ కంటై నర్ తీసుకొని ఒక్క పరుగులో నేలమాళిగలోకి
వచ్చింది. ఆమె ఆయాసంతో రొప్పుతూంది. ఉద్వేగంతో వేళ్ళు కంపిస్తు న్నాయి. తన ప్రయత్నం ఎంతవరకు
ఫలిస్తుందో ఆమెకే అనుమానంగా వుంది.

పై గదిలో దార్కా కళ్ళు మూసుకున్నాడు. ఎలా ఆ వలయం లోంచి బయటపడాలో అర్ధం కావటంలేదు.
సిద్దేశ్వరి మరింత ధూపం వేసింది. అక్కడున్న వాళ్ళందరూ అదోలాటి హిప్నాటిక్ ట్రాన్స్ లో వున్నారు. క్షద్రంగా
తమ కోర్కెల్ని తీర్చుకొనే ఆశతో వున్నారు. దార్కా రక్తం పట్టేపాత్ర సిద్దేశ్వరి చేతిలో వున్నది. కళ్ళు పెరికే కత్తి
విగ్రహం ముందు మెరుస్తూంది. దార్కా నిర్వికారంగా వున్నాడు. మనుషుల అజ్ఞానం అతడిని తాత్కాలికంగా
ఒక విధమైన వేదాంతిని చేసింది. తన గుండె ఆరు లక్షల ఖరీదు.

సరీగ్గా అతడి పాదాల కిందే, గదిలో తులసి చాలా సీరియస్ గా మిషన్ కన్నా వేగంగా తన పని చేసుకుంటూ
పోతూంది. వైరుకి కాయిల్స్ చుట్టింది. లిక్విడ్ ఆక్సిజన్ వున్న కంటై నర్ మధ్యలో కాయిల్ అమర్చి పై కప్పుకు
సరీగ్గా దేవి విగ్రహం కింద అమర్చింది. వైరు తీసుకుంటూ గదిలో కొచ్చింది.

స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ అందులో పెట్టింది. స్విచ్ వేయగానే కరెంట్ షార్టు సర్క్యూట్ అయి, వేడి పుట్టి లిక్విడ్
ఆక్సిజన్ విస్పోటనంతో ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోయి.......

ఏ పరికరాల్తో సిద్దేశ్వరి యింతకాలం ప్రజల్ని మోసం చేస్తూ వస్తుందో. అవే పరికరాల్తో ఆమె నాశనం
కాబోతూంది.

తులసి వైర్లు సరిగా వున్నాయో లేదో చూచుకుని స్విచ్ ఆన్ చెయ్యటానికి చెయ్యి చాచింది.

సిద్దేశ్వరి దార్కా చెవి దగ్గరికి వంగింది. "దార్కా!" ఆఖరి అవకాశం యిస్తు న్నాను. నాతో చేతులు కలుపు.
చేతబడులు చెయ్యి, క్షుద్రశక్తన్నా ప్రయోగించు. మనం కోటీశ్వరుల మవుతాం. చక్రవర్తి హత్యను క్షమిస్తా న్నేను"
దార్కా మౌనం వహించేడు. సిద్దేశ్వరి కత్తిని అతడి చాతీమీద ఆన్చింది. క్రింది గదిలో తులసి కళ్ళు గట్టిగా
మూసుకుంది. ఎక్కడో గడియారం రెండున్నర అయినట్టూ గంట కొట్టింది. టెన్షన్ తో వేలు కంపిస్తూ వుండగా
నెమ్మదిగా ప్లగ్ స్విచ్ వేసింది. అంతే.

ఏమీ జరగలేదు. కనీసం "తుస్" మన్న శబ్దం కూడా వినబడలేదు.

* * *
అదే రాత్రి రెండున్నరకి

ఊరి పొలిమేర్లు దాటేడు ఇస్మాయిల్. కోటవైపు నడుస్తు న్నాడు.

స్మశానం పక్కనుంచి నడుస్తు న్నాడు. దాని పక్కనే ఏరు వుంది. ఏరు దాటాక కోట. స్మశానంలో చితిమంట
మినుక్కు మినుక్కు మని వెలుగుతూంది. ఈశాన్యపు దిక్కు నుంచీ కొద్దిగా గాలి కదిలింది. పంచ భూతాలూ
అతడినే చూస్తు న్నాయి. భూమి, గాలి, నీరు, ఆకాశం వాయువు.

క్షుద్ర దేవతకి ఎదురు నిలవబోతున్నాడు అతడు.

పంచభూతాలు చీకట్లో శత్రు వుని గమనిస్తు న్న సైనికుల్లా వున్నాయి.


అతడు స్మశానం దాటేడు. ఏరు దాదాపు ఎడిపోయి వుంది. చీల మండలదాకా వస్తు న్నాయి
నీళ్ళు.... చల్లగా శవం వళ్లు లా......గాలికి నీళ్ళ అలలు నెమ్మదిగా కదులుతున్నాయి ఆహ్వానిస్తు న్నట్లు .

ఇస్మాయిల్ కి అమావాస్య చీకట్లో నడవటం కొత్తకాదు. నడుస్తూ కోటవైపు వెళుతున్నాడు. ఏరు దాటి గట్టు
ఎక్కేడు.

కోటమీద చీకట్లు దట్టంగా పరుచుకొని వున్నాయి. పిచ్చిమొక్కలు గాలికి వూగుతున్నాయ్. దారి సరిగ్గా
లేదు. రాళ్ళూ రప్పలతో నిండివుంది. ఇస్మాయిల్ తూలి మళ్ళీ లేచాడు. ఏదో పక్షి ఆ అలికిడికి లేచి రెక్కలు
టపటపా కొట్టు కుని మళ్ళీ పడుకుంది.

నిటారుగా వుంది కొండ. కొండమీదకి దారి - కొండచుట్టు కవచంలా కోటగోడ, అక్కడక్కడా


కూలిపోయింది.

ఇస్మాయిల్ కోటలోకి ప్రవేశించాడు. పెద్ద స్తంభం పక్కనుంచి తిరిగి మెట్లు ఎక్కేడు. పై కప్పులో మట్టి బాగా
పేరుకుని, అక్కడక్కడా చెట్లు మొలిచినయ్. ఎప్పుడో కురిసిన వర్షం తాలూకు నీళ్ళు ఎర్రగా నిల్చినయ్. పక్కనే
కీచురాయి అరుస్తూంది.

ఇస్మాయిల్ తలవంచి చూసేడు.

ఒకప్పటి గుర్రపుశాల వరుసగా రాళ్ళు పాతి వున్నాయి. ఒక మూల పూర్తిగా కూలిపోయింది. ఒక పక్క
రెండు కుండలు, ఇటుక రాళ్ళు, నిప్పు చేసినట్టు గుర్తు లు వున్నాయి దానికి నాల్గడుగుల దూరంలో
ముణగదీసుకుని పడుకుని వున్నాడు సంతాన్ ఫకీర్.

చప్పుడుకి కళ్ళు తెరిచి చూసేడు "ఎవరూ?"

"నేనే ఇస్మాయిల్ ని" వచ్చి కూర్చుంటూ అన్నాడు.

ఇద్దరూ కొంచెం సేపు మాట్లా డలేదు. ఏరుమీద చీకటినీ, ఏరు అవతల శ్మశానపు నిశ్శబ్దా న్నీ చూస్తూ
వుండిపోయాడు. నిశ్శబ్దా న్ని భంగపరుస్తూ ఇస్మాయిల్ అన్నాడు. "కాష్మోరా లేస్తుంది"

"తెలుసు"

ఫకీర్ నిర్లిప్తంగా అలా అనటం చూసి ఇస్మాయిల్ విస్మయంతో తలెత్తి చూసేడు. అది గ్రహించినట్టు ఫకీర్
"అవును, ఏం చెయ్యగలం? ఖాష్మోరా లేస్తుంది. లేవకుండా ఆపుచోయగలమా? లేచిన తర్వాత దారుణాలు
చెయ్యకుండా చూడగలమా?" అన్నాడు.

"నువ్వు చెయ్యగలవు"
ఫకీర్ ఒక్క ఉదుటున లేచి "లేదు లేదు , నేను చెయ్యలేను. మూర్ఖుడా! కాష్మోరా అంటే
ఏమనుకుంటున్నావు? దాన్ని ఆపు చెయ్యటమా" అని అరిచేడు.

ఇస్మాయిల్ కదలలేదు. "నువ్వు నిజంగా చెయ్యలేవా ఫకీరూ" అని అడిగేడు. ఫకీర్ ఆవేశం తగ్గిపోయింది.
"చెయ్యలేను, నేనే కాదు ఎవరూ చేయలేరు. మహా విద్య తెలిసినవాడు కూడా కాష్మోరాని ఎదిరించలేడు"

"వారం రోజుల బాధ..... మళ్ళీ" అన్నాడు ఇస్మాయిల్ "తులసి చాలా మంచి పిల్ల. నా కళ్ళముందే పెరిగి
పెద్దదయింది" ఆగేడు....... "నా కళ్ళముందే పోతూంది" అతడిగొంతు గద్గదమయింది.

ఫకీర్ పక్కలోంచి చిన్న తోలుసంచి తీసి ఇచ్చేడు. "తులసి చుట్టూ ఇది ఆఖరి వారంలో చల్లమను, ఎక్కువ
బాధ వుండదు. ప్రాణం సులువుగా పోతుంది."

"ఏమిటిది?"

"తులసితీర్ధం" అన్నాడు ఫకీరు. "ర-స్త్రీ బీజం, మ- పురుష బీజం ఆ వారంరోజులూ ఆ రెండు అక్షరాల్నీ
కలిపి మధించాలి. శక్తి పుడుతుంది. అది ఆంజనేయులు ఆ శక్తికి కాష్మోరా ప్రభావం పౌండ్రమవదు. తులసి
తక్కువ బాధతో మరణిస్తుంది."

కాబట్టి తులసి మరణం ఖాయం. రామభజన చేసినా, తులసితీర్ధం చల్లినా! అయినా వాళ్ళు ఇవన్నీ చేస్తా రా -
నాగరికులు.

ఇస్మాయిల్ లేచాడు. "వెళ్లొస్తా ను ఫకీర్"

"మంచిది"

అతడు కోట బయటకు వచ్చేసేడు. చేతిలో తులసితీర్ధపు సంచి వుంది.

ఒక్కసారిగా వాతావరణం చల్లబడినట్లయి తల పైకెత్తా డు. నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకుంటూ


వస్తు న్నాయి.

ఉన్నట్టుండి కాళ్ళకి తడి తగిలి నిశ్చేష్టు డై, ఆలోచనలోనే ఏరు వరకూ వచ్చిన సంగతి చూసుకుని నవ్వుకుని
ముందుకు సాగేడు. ఏరు నిర్మలంగా వుంది.

నిశ్శబ్దంగా - ప్రశాంతంగా.

పాదాలు నీళ్ళలో తడుస్తు న్నాయి. కదుల్తు న్న నీళ్ళలో అడుగు పడగానే సన్నటి శబ్దంతో చిప్పిల్లు తున్నాయి.
ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం తపాతపామని గమ్మత్తు గా వినిపిస్తూంది.
ఇల్మాయిల్ చటుక్కున ఆగేడు. నీళ్ళు మోకాళ్ళవరకూ రావటం చూసి, వెళ్ళేటప్పుడు రాలేదు..... ఏరు
పొంగిందా? వీలులేదే..... ఎటు వెళుతున్నాడు తను? స్మశానం ఏ దిక్కున వుంది?

మంట ఎదురుగా కనబడుతూంది.

అటు నడిచేడు.

వెళుతున్న కొద్దీ నీళ్ళు పైపైకి వస్తు న్నాయి. అతడు కొద్దిగా కంగారుపడి వెనుదిరిగి చూసేడు.

వెనుక కోటలేదు.

అతడు దిగ్రాంతుడయ్యాడు. అటువైపు రెండు మూడు మంటలు కనిపించాయి. అటుందా స్మశానం ?


మరి కోట?

అతడు కుడిచేతివైపుకు చూసేడు చీకటిగా వుంది.....ఆ చీకటిలో కప్పబడిపోయిందా కోట? అటువైపు కోట
-చెరోవైపు దీపాలు వుంటే మరి ఏరు ఎట్నుంచి ఎటు వెళుతుంది?

నీళ్ళు నడుమువరకూ పాకినయ్. అతడు చేతిలో సంచి తడవకుండా పట్టు కుని కదలకుండా నిలబడ్డా డు.

నీళ్ళు నడుమువరకే వున్నాయి. అలాగే సాగిపోతున్నాయి.

అంటే...........

ఏరు పొంగటం లేదన్నమాట

అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని వెనుదిరిగేడు. ఎట్నుంచి వచ్చాడో అటువైపుకు అడుగు ముందుకు
వేసేసరికి చాతీవరకూ వచ్చినయ్ నీళ్ళు.

అప్పుడు వేసింది అతడికి భయం. సన్నగా వణికేడు. ఆ వణుకు చల్లటి నీళ్ళవల్ల వచ్చిందికాదు, భయంవల్ల
వచ్చింది.

అతడు కళ్ళు మూసుకునిద సర్వశత్రు నివారణమైన భద్రకాళి మంత్రాన్ని ఉచ్చరించసాగేడు...... హ్రీం క్షం
భక్షజ్వాలాజిహ్వే.....

మంత్రం పూర్తవలేదు. నీరు మెడలోంచి పాకి నోటివరకూ వచ్చినయ్. మరణం అనివార్యం అని
తెలిసిపోయింది. మనసులో ఆఖరుదీ పరిపూర్ణమైనదీ అయిన ఆంజనేయ దండకం మొదలుపెట్టా డు.
నీరు పెరుగుతూంది. నెమ్మదిగా - నెమ్మదిగా ముక్కు మీదుగా కంటివరకూ -అతడి ఆఖరు చూపు
దూరంనుంచి వస్తు న్న పెద్ద అలమీద పడింది. అది వచ్చి తనని కప్పేస్తూ వుండగా అతను అనుకున్నాడు.-
"ఎక్కడున్నావయ్యా శ్రీధర్! తొందరగా వచ్చి మరణం ముందు ఏడు రోజుల భాదనుంచైనా కనీసం నీ
కూతుర్ని తప్పించు"

అదే సమయానికి కొన్ని వేలమైళ్ళ దూరంలో, శ్రీధర్ రెండ్రోజుల్లో రాబోతున్న కూతురి కోసం రూమ్ రిజర్వ్
చేస్తు న్నాడు.

ఇస్మాయిల్ తల మునిగిపోయింది. భూమిలో పాతి పెట్టిన మంత్రగాడి చెయ్యి బయటికి వచ్చినట్లు నీటిమీద
ఒక చెయ్యే కనబడుతుంది. నీరు ఇంకా పైకి లేచింది. తులసితీర్ధపు తొలుసంచిని తాకింది. సంచి జారి నీటిలో
కలిసిపోయింది. అదే తన గమ్యం అయినట్లు నీటిమట్టం నెమ్మదిగా తగ్గిపోయింది. ఇంకా.......ఇంకా......

ఇంకా......

ఐదు నిమిషాల్లో ఏరు మామూలుగానే పారుతూంది అరికాళ్ళని తడిపే నీళ్ళుకూడా లేవు.

అయితే చాలా చిత్రంగా.............

ఇస్మాయిల్ శవం కూడా లేదు.

గాలి, నీరు, అగ్నీ, వాయువూ మామూలుగానే వున్నాయి. భూమి మాత్రం ఇసుక మెట్టరూపంలో కొద్దిగా
ఉబ్బిందంతే.

15
ఆమెకు దుఃఖం వచ్చింది.

రోషంతో నిస్సహాయంగా తను తయారుచేసిన పరికరాలవైపు చూసుకొంది. అన్నీ వెక్కిరిస్తు న్నట్టు


కనబడ్డా యి. అప్పుడే లిక్విడ్ ఆక్సిజన్ గాలిలో కలిసిపోతూంది.

"ఎందుకిలా జరిగింది?"

నిద్రలేమి -ఆకలి -దాహం -నిస్సహాయత - అన్నీ ఒక్కసారిగా ఆమెని చుట్టముట్టేయి

కదిలి ముందుకొచ్చింది. ఆ గదిలో ఎయిర్ కండిషనర్ గొట్టా ల మధ్యా, వైర్ ల మధ్యా అచేతనంగా -
ఒంటరిగా నిలబడింది. గదంతా నిశ్శబ్దంగా వుంది.
నిశ్శబ్దంగా -

నిశ్శ-

ఆమె ఉలిక్కిపడింది . ఏమిటి గది ఇంత నిశ్శబ్దంగా వుంది?

ఎయిర్ కండిషనర్ పని చెయ్యటంలేదా? అంటే - అంటే......

కరెంట్ లేదా......

ఆమెకి ఏడ్వాలో, నవ్వాలో, అర్ధంకాలేదు. మరింక ముందేం చెయ్యాలో తోచలేదు.

ఓ నిర్ణయానికి వచ్చింది..

ఒక్కసారిగా నేలమాళిగ తలుపు తెరుచుకొని పైకి గెంతుతుంది. అక్కడున్న వాళ్ళందరూ నిశ్చేష్టతతో


వుండగా, ఒక్క గెంతులో విగ్రహం దగ్గర కత్తి తీసుకుని సిద్దేశ్వరిని పొడిచేస్తుంది. తరువాత తనకి ఉరిశిక్ష పడినా
సరే - సిద్దేశ్వరి చర్యలు ఆపుచెయ్యాలి.

ఉడుకు రక్తం ఆమెని ప్రోత్సహిస్తుంది. మరిక ఆగలేదు.

నిచ్చెన ఎక్కి నేలమాళిగ తలుపు నెమ్మదిగా పైకెత్తింది. తన ముందు నేలలోంచి సీత బయటకొస్తు న్నట్టు
వస్తు న్న అమ్మాయిని చూసి అక్కడున్న వాళ్ళందరూ స్థా ణువులయ్యారు

స్టెయిల్ గా నవ్వి జేమ్స్ బాండ్ లా "గుడ్ మార్నింగ్ ఎవ్విరి బడీ" అంటూ పైకి రాబోయింది. అయితే ఆమె
వూహించినట్టు సిద్దేశ్వరి నిశ్చేష్టు రాలు అవలేదు. కత్తి చేతుల్లోకి తీసుకుని "ఆగు అక్కడే" అంది.

ఇది వూహించని తులసి తెల్లబోయి, అంతలో తేరుకుని, ఒక్క గెంతులో పైకి దూకేసింది. అకస్మాత్తు గా తమ
ముందు ప్రత్యక్షమయిన ఆమెని చూసి దార్కా విస్మయంతో ముందు అచేతనమైనా, వెంటనే కదలి ఆమె
దగ్గరగా వచ్చేడు. అదే అతడు చేసిన మంచిపని.

అప్పుడు వినిపించింది ఎయిర్ కండిషనరు స్టా ర్టయిన శబ్దం. ఆ తర్వాత ఒక క్షణానికి........

చెవులు బ్రద్దలయ్యేలా.......

బ్రహ్మాండమైన విస్పోటనం.

ఆ గది గోడలు కదిలిపోయాయి. అత్యంత ప్రతితో, భక్తి శ్రద్దలతో పూజింపబడుతున్న కాళికాదేవి విగ్రహం
నేలలోకి దిగిపోయింది. చెక్కముక్కలు గాలిలో కాగితం ముక్కల్లా ఎగిరాయి.

పార్టీ మార్చి ఇంకో పార్టీలోకి దూకుదామనుకున్న మంత్రిగారి శరీరం గుమ్మం దూకి అవతల పడింది.
ఉండచుట్టి న్యూస్ పేపర్ ని ప్రొద్దు న్నే పేపరు కుర్రాడు మేడపైకి విసిరిన భంగిమలో పత్రికాధిపతి శరీరం గాలిలోకి
ఎగిరింది. సేఠ్ మొగం దీపపు కుందెలో పడి నూనెలో కాలింది. గదంతా దట్టమైన పొగలు, చీకటి - ఒకరికొకరు
కనబడటంలేదు. సిద్దేశ్వరి ఏమయ్యాడో తెలీదు.

దగ్గులు వినిపిస్తు న్నాయి. దూరంగా ఎవరో పరుగెడుతున్న చప్పుడు, అంతా కోలాహలం..... అయోమయం.
తులసి దార్కా చెయ్యి పట్టు కొని "పద" అంది ఆత్రు తగా.

ఇద్దరూ ఒక్క గెంతులో బయటకొచ్చేరు. డోర్ తీసివున్న కార్లో కూర్చుని "ఎక్కు" అంది. దార్కా ఎక్కగానే
అరవయ్ కిలోమీటర్ల స్పీడ్ తో రివర్స్ చేసి గేరు మార్చింది.

సెంట్రి - (నిజానికి వాడు యమలోకం ముందు కాపలాకాసే భటుడిలా వున్నాడు) పరుగెత్తు కుంటూ వచ్చి
"క్యాహోరా హై అందర్" అన్నాడు.

"దేవీ పూజా కా క్లయిమాక్స్" అని కారు పోనిచ్చింది తులసి. రెండు నిముషాలు ఎవరూ మాట్లా డలేదు.
"ఎటు" అనడిగింది - చెప్పాడు. ఆమె మనసంతా టెన్షన్ తో నిండివుంది. తను చూసినదంతా పండిత్ కి,
అబ్రకదబ్ర అంకుల్ కీ చెప్పాలి. ఈ రహస్యం రేపు పేపర్ లో పడితే ఇన్నాళ్ళ సిద్దేశ్వరి మోసం బయటపడితే ఈ
ప్రపంచపు రియాక్షన్ ఎలా వుంటుంది? ఇంతకాలం డబ్బులు పోగొట్టు కున్న వాళ్ళంతా ఎలా ఫీలౌతారు?

దార్కా ఆలోచనలు వేరు. అతడు ఈ సిద్దేశ్వరి విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వటంలేదు. ఎలా తులసిని
పట్టు కోవటం ఈ లక్ష్మి తెలివితేటల వలన తనకు కొంత టై ము దొరికింది. ఈ లోపులో తులసిని పట్టు కోవాలి.
తులసి ఈ నగరంలోనే వుంది రిజిష్టర్ లో చూశాడు.

అతడు ఆలోచనల్లో వుండగానే సత్రం ముందు కారు ఆపి, సీటు వెనక్కు వాలి నవ్వి "తగ్గిందా" అనడిగింది.

"ఏమిటి?"

"టెన్షన్"

అతడికి ఆ పదం అర్ధం అంతగా తెలీదు.

"సీ యూ" అని కారు పోనిచ్చింది. అతడు అటువైపే ఓక్షణం చూస్తూ నిలబడ్డా డు. తర్వాత నడుము దగ్గర
తడుముకుంటూ సత్రం మెట్లెక్కబోయాడు. వెంట్రు కని అలా తడిమి చూసుకోవడం అయిదు సంవత్సరాల
అలవాటు. తడుముకుంటూ అడుగు ముందుకెయ్యబోయి అలాగే ఆగిపోయేడు

పొట్లంలో కట్టినది -ప్రాణంకన్నా భద్రంగా అయిదు సంవత్సరాలనుంచీ చూసుకొంటున్నది లేదు! అతడు


గాభరాగా జేబులూ, శరీరమూ తడివి చూసుకున్నాడు
ఆ పేలుడు సమయంలో ఎక్కడ జారిపోయిందో.........

దార్కా నోటి తడి ఆరిపోయింది.

16
మూడేళ్ళపాటు ప్రజల్ని మోసగించిన దేవి గుట్టు బట్టబయలు


విద్యార్ధిని అపూర్వ సాహసం

మూడేళ్ళపాటు ప్రజల ప్రశ్నలకు, చూడకుండా సమాధానం చెప్పి దానిని దేవుడి అంశకు ఆపాదిస్తూ,
ప్రజల్నించి లక్షలు లక్షలు వసూలు చేస్తూ వచ్చిన సిద్దేశ్వరీదేవి రహస్యాన్ని తులసి అనే విద్యార్ధిని, అపూర్వ
దైర్యసాహసాలు ప్రదర్శించి బహిర్గతం చేసింది. కేవలం ఎలక్ట్రిక్ వైరులూ, పరికరాల సాయంతో దేవి ఇంతకాలం
చేస్తూవచ్చిన మోసాల్ని ప్రజలూ, అధికారులూ తెలుసుకోలేక పోయారు. బహుదూర ప్రాంతాల్నుంచి కూడా
వచ్చి విలువైన కానుకలు సమర్పించి తమ కష్టా లు దేవికి చెప్పుకొనేవారు భక్తు లు అయితే ఈ దేవి స్త్రీ కాదనీ,
పురుషుడనీ తెలుస్తూంది. పోలీసులు ఈ దేవి రూపంలో వున్న వ్యక్తి కోసం గాలిస్తు న్నారు.

"ఏమిటి ఏదో అడ్వెంచర్ చేసేవట" శారదతో ఫోన్ లో మాట్లా డిన తరువాత, కూతురితో మాట్లా డుతూ
అన్నాడు శ్రీధర్.

ఇంటర్నేషనల్ కాల్ అది.

"అవును డాడీ" అంటూ తొందర తొందరగా తనేం చేసిందో వివరించి చెప్పింది. 'గుడ్' అని అన్నాడు.

"నేనొక నాల్రోజులు ఆలస్యంగా వస్తా ను డాడీ"

"అదేమిటి?" విస్మయంతో అడిగాడు శ్రీధర్. "నీ గురించి అన్ని ఏర్పాట్లు చేసేను."

"ఒక్క నాల్రోజులు డాడీ" బతుమాలుతున్నట్టు అడిగింది.

"సర్లే. అయితే, కానీ సరిగ్గా ఆ రోజు రాకపోతే ఇక రానట్టే. నేను వచ్చెయ్యాలి"

"థాంక్యూ"

"ఇంతకీ నాల్రోజులు ఎందుకు"

శారద కూతురి చేతిలోంచి రిసీవర్ తీసుకొని "నాల్రోజులూ వరుసగా మీ కూతురికి సన్మానాలు,


అభినందనలూ వున్నాయట" అంది. అట్నుంచి శ్రీధర్ నవ్వు వినబడింది.

* * *
"మీరు మా పత్రికకి ఒక వ్యాసం వ్రాయాలి" అన్నాడు కరస్పాండెంటు.

"దేని గురించి"

"దేని గురించైనా సరే, వార్తల్లో వ్యక్తి కదా మీరు! మానవాతీత శక్తు లమీదగానీ, భ్రాంతుల గురించిగానీ,
పిచ్చివాళ్ళూ, దెయ్యం పట్టటం - దేని గురించైనా వ్రాయండి. మీరు ఏం వ్రాసినా మా పాఠకులు చదువుతారు."

సరేనంది తులసి "ఫారిన్ నుంచి రాగానే వ్రాస్తా ను"

"ధాంక్సండీ వచ్చేనెలలో మీ వ్యాసం ప్రచురించబోతున్నాను ప్రకటిస్తాం" అంటూ అతడు వెళ్ళిపోయాడు.

అక్కడే వున్న శారద ఈ సంబాషణలో కల్పించుకోకపోవటం గమనార్హం. ఆమె మొహం భావరహితంగా


వుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే, కూతురు చేస్తు న్న ఈ అడ్వంచర్ వల్ల అనాసక్తత, భయం, దిగులు
కనబడతాయి.

ఆ సాయంత్రం ఆమె తులసితో గుడికి వెళదామంది.


పక్కలో బాంబు పడినట్టు తులసి అదిరిపోయి, "నేనా - గుడికా అంది. అడిగింది తననేనా అన్నంత
విస్మయంతో.....శారద మాట్లా డలేదు. కానీ ఆ మౌనంలో వున్న కమేండ్ తో తులసి లేచి, "పద" అంది. తన
యిష్టా యిష్టా లు ఏమైనా, తల్లికోసం ఆ మాత్రం చేయటంలో తప్పు లేదన్న సంస్కారం ఆమెకి వుంది."

తల్లి ఎప్పుడూ వెళ్ళే గుడివైపు కారు తిప్పబోతూ వుంటే "అటుకాదు" అని చెప్పింది శారద. సాధారణంగా
ఇద్దరూ వెళితే తులసే డ్రైవ్ చేస్తుంది కారు.

ఊరి పొలిమేర్లు దాటి పల్లెటూరి మొదట్లో వున్న ఆలయం దగ్గర ఆగింది కారు. శిధిలావస్థలో వుంది గుడి.
ఒక్క పూజారి మాత్రం దాన్ని ఇంకా అంటిపెట్టు కునే వున్నాడు. కూలిపోవటానికి సిద్దంగా వున్నా, శుబ్రంగా
వుంది గుడి.

రెండువందల అడుగుల ఎత్తు గోపురం, గర్భగుడి చీకటి, గబ్బిలాల మత్తు వాసన దేవుడి ముందు నిశ్శబ్దంగా
వెలిగే జ్యోతి - చేతులు జోడించి కళ్ళు మూసుకున్న తల్లి........హారతి పళ్లెం పట్టిన శతవృద్ధు డి మొహంలో
నిర్మలత్వం -

అంతా గమనిస్తూంది తులసి. ఈసారి యెందుకో ఆమెకి యిది తెలివైనవాడు తెలివితక్కువ వాడిమీద
ఆడుకునే ప్రక్రియగా కనబడలేదు.

"బాగున్నావా తల్లీ" పూజారి అడుగుతున్నాడు. శారద తలూపి, అరుగుమీద స్థంభానికి అనుకొని


కూర్చొంది.

తులసి గుడి అవతలి ప్రాంగణంలోకి నడిచింది. అక్కడక్కడా రాళ్ళమీద విగ్రహాలూ - పిచ్చిమొక్కలు -పాచి
పట్టిన కోనేరు చుట్టూ స్తబ్దమైన నీరు -

ఆమె కెందుకో చిత్రమైన స్పందనతో వళ్లు జలదరించింది. విపరీతమైన శబ్దా లు చేసే యంత్రాల మధ్యనుంచి
ఒక్కసారిగా నీరసంలో అలసట తీర్చుకున్న భావన.....

తల్లి అలికిడి వినిపించటంతో ఆలోచనలముండి తెప్పరిల్లి కారు దగ్గరికి కదిలింది. కార్లో కూడా ఎవరూ
మాట్లా డుకోలేదు. పచ్చని పొలాల మధ్యనుంచి చల్లటి గాలి రివ్వున వీస్తూంది.

"ఇప్పుడు చెప్పు - దేముడున్నాడా?"

నిశ్శబ్దంలోంచి వచ్చిన తల్లి ప్రశ్నకి తులసి ఉలిక్కిపడింది. అంత హఠాత్తు గా. ఆ రకమైన ప్రశ్నని తులసి
ఊహించలేదు.

దేముడు అన్న ప్రశ్నకి సమాధానం మనం చెప్పుకునే జవాబు మీద ఆధారపడి వుంటుందని నా వుద్దేశం.
మనిషి ఎలా బ్రతకాలనుకుంటాడు? ప్రశాంతంగా -ఆనందంగా - అవునా? మరి ఆ ప్రశాంతత, ఆనందం
మనిషికి భక్తిలో దొరికితే, ఆ భక్తిని దేవుడికి ఆపాదించుకొంటే మీ అందరికీ ఎందుకు అభ్యంతరం?

- నేనెక్కువ చదువుకోలేదు. ఇంగ్లీషులో వాదించలేను కూడా.

భక్తే ఒక హెలూసినేషన్, భ్రాంతి అని నువ్వంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఆ భ్రాంతే నాకు ఆనందం
యిస్తు న్నప్పుడు దాన్నెందుకు వదులుకోవాలి నేను.

తులసి - మనుషులందరూ నీ అంత మానసిక స్థయిర్యం, డబ్బు సమస్య లేకపోవటం, మంచి ఆరోగ్యం,
బలమైన మనస్తత్వం కలిగి వుంటారనుకోకు. చాలా బలహీనులు వాళ్ళు. ఏ మాత్రం కష్టమొచ్చినా, ఏదో ఒక
అండకోసం వెతుక్కుంటారు.

ఆ అండ దేముడు. దేముడు మనిషికి బలాన్ని యిస్తా డు. తిరుపతి కొండ గచ్చుమీద అటూ ఇటూ
పొర్లు తూ భక్తితో గోవిందా అని అరిచే భక్తు ల్ని చూసి జాలిపడే అవసరంలేదు తులసీ, నీ విజ్ఞానం, నీ
కాంట్రాడిక్షన్ నీకు అలాంటి స్థితి తీసుకురాలేక పోయేయే. అని నీ మీద నువ్వే జాలిపడాలి. ఆ మెంటల్ బాలెన్స్
నీ కొచ్చేక మళ్ళీ ఈ గుడి, ఈ ప్రశాంతత వీటినే ఆశ్రయిస్తా వు. నువ్వు అప్పుడు నీ మనస్సుని సరి అయిన
మార్గంలో పెట్టటానికి, నీకు మరింత శాంతి దొరికే మార్గాన్ని సూచించటానికి ఒక పుస్తకంగానీ, ఒక గురువుగానీ
లభిస్తా రు. ఆ పుస్తకం భగవద్గీత కావచ్చు -ఆ గురువు బాబాగానీ, అమ్మగానీ కావచ్చు........

తులసి! ఈ రోజు నువ్వు సాధించిన విజయం అపూర్వమే. కానీ ఈ ఒక్క విజయంలోనూ బాబాలందరూ
మోసగాళ్ళనీ, దేముడు లేడనీ నిర్ణయానికి రాకు. మనిషి దుఃఖాన్ని పోగొట్టటానికి జీవితాన్ని త్యాగం చేసిన
హర్షులెందరో వున్నారు... ఆ బాబాలు డబ్బుకోసం చెయ్యరు ఇదంతా. అయితే నువ్వు అడగొచ్చు - మరి ఈ
బాబాలు ఎందుకు గాలిలోంచి లింగాలూ -బూడిద తెప్పిస్తు న్నారని.
చాలా మంచి ప్రశ్నయిది.

ఎటు తోచని పరిస్థితిలో కొట్టు మిట్టా డుతున్న మనిషి ఏదో ఒక అద్భుతం చూపిస్తే తప్ప దేముణ్ని నమ్మడు.
మళ్లీ నీకో ప్రశ్న రావచ్చు. మనిషిని ప్రొడక్టివ్ పనులు చేసే స్థితినుంచి ఏమీ లభించని భజనలూ, భక్తిగీతాలూ -
పూజలవైపు ఎందుకు తిప్పుకోవాలి అని, నిజమే దేశంలో ఈ "భక్తి" వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ఏ మాత్రం
ఎకనామిక్స్ చదువుకున్నా అది తెలుస్తూంది. ప్రగతికి అది అడ్డు పడుతుంది. మరి ఈ ప్రగతి ఎల్.ఎస్. డీలూ ,
మత్తు ద్రవాలూ, సినిమాలు అన్నింటినీ సృష్టించింది కదా. వాటి అన్నిటితో పోల్చుకుంటే "భక్తి"
నిరపాయకరమయిన వ్యసనం కదా."

తులసి అప్రతిభురాలయింది. తన తల్లిలో ఇంత అనలిటికల్ నాలెడ్జి వుందని ఆమె వూహించలేదు. విస్మయం!
ఆమెని ఎంతగా కప్పివేసిందంటే దానినుంచి తేరుకోవటానికి ఆమెకి దాదాపు అయిదు నిమిషాలు పట్టింది.

"నేను......నేను చెప్పింది తప్పా" అని అస్పష్టంగా గొణిగింది.

"లేదు లేదు" అన్నది శారద. "సిద్దేశ్వరి రహస్యం బట్టబయలు కావల్సిందే, కానీ తులసి! నాకు సిద్దేశ్వరి కన్నా
నువ్వు ఎక్కువ. ఇరవయ్యేళ్ళ వయసు చాలాచెడ్డది పరిస్థితుల ప్రభావం చాలా ఉంటుంది. పక్కవాళ్ళ మాటలు
విని కుర్రవాళ్ళు నాలుగయిదు సంవత్సరాలపాటు తాత్కాలికంగా విప్లవకారులుగా మారేది ఈ వయసులోనే.
విప్లవం మంచిదే. కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి గదా. ఈ అబినందనలూ ఇవన్నీ నన్ను దేముడు
లేడు అన్న వైపుకు గుడ్డిగా తీసుకెళతాయేమో నా భయం"

"దేముడు లేడు" అంది తులసి స్థిరంగా!

"కానీ ప్రశాంతత వుంది -భక్తి వుంద -నమ్మకం వుంది" అంది శారద. "అదే నేను చెప్పేది. అప్పుడే ఒక
నిర్ణయానికి రావటానికి నీకున్న వయసు, అనుభవం సరిపోవు, ఈ రోజు నిన్ను అభినందిస్తు న్న వాళ్ళలో సగానికి
పైగా ఆపద సమయంలో దేముణ్ని నమ్మినవారే. ఇక్కడ దేముడు అంటే సింహాసనం మీద అప్సరసల మధ్య
కూర్చునే వాడు కాదు. నీటికి నాలుగు డిగ్రీల దగ్గర మార్పు పెట్టి మంచుని నీటిలో తేలుస్తు న్న శక్తి
మిండనోవాడీస్ నుంచి బయటికి రాకుండా ఆపుతున్న శక్తి -అన్నిటికన్నా ముఖ్యంగా, మనిషిలో స్థయిర్యాన్ని
నింపుతున్న శక్తి. ఆ నమ్మకం అదీ దేముడు. కొందరికి అతడు గుడిలో వుంటాడు.- కొందరికి మనసులో
వుంటాడు. అతడి భావన ప్రశాంతత నిస్తుంది. దాన్ని కాదనే హక్కు నీకు లేదు. మోసాన్ని ఎదుర్కో! తప్పు లేదు
కానీ మనిషిని నీతి మార్గములో నడిపిస్తు న్నది దేముడు అన్న భావనని ఎదుర్కోకు."

మనుషులందరూ విజ్ఞానవంతులయిన రోజు - మనుషులందరూ నీతిగా బ్రతికిన రోజు దేముడి అవసరం


లేదు. కానీ ఆ రోజు అసలు వస్తుందా? రాదు. అంతవరకూ ప్రజలకి ఈ అజ్ఞానం ఇస్తు న్న ప్రశాంతత లోనూ,
నిరపాయకరమైన భక్తి భావంలోనూ బ్రతకనీ, అదితెలియ చెప్పాలనే నిన్నింత దూరం తీసుకొచ్చింది.

* * *
చిన్న పుర్రెని సంపాదించేడు దార్కా. మిగిలిన కొద్దిపాటి డబ్బుతోనూ ఒక కోడిని కొన్నాడు.
పంచమూలకద్రవాలు అంతకుముందు రోజే దగ్గర పెట్టు కొన్నాడు.

అంతకుముందు ఒకరోజు నుంచీ అతడు ఉపవాసం ఉన్నాడు.

ఆ రాత్రి అతడు నిద్రపోలేదు. చాలా సేపు దేవుతారాధన చేస్తూ కూర్చున్నాడు. కొంచెం సేపు గురువైన
విషాచిని ధ్యానించేడు. ఆ తరువాత ఆచార్యులవారిని.

దాదాపు పన్నెండు అవుతూండగా మిగతా కార్యక్రమానికి ఉపక్రమించేడు. ఎండకి దాహంతో కాకి


అరుస్తూంది. సత్రం నిర్మానుష్యంగా వుంది.

కోడి రక్తంతో ముగ్గు వేసేడు. ఆ ముగ్గు మధ్యలో అతడు కూర్చొని పుర్రెని ఎదురుగా పెట్టు కున్నాడు.
క్షుద్రదేవతల్లో ముఖ్యుడయిన శివుణ్ని అతడు ప్రార్ధించాడు. ముందు. తర్వాత కాష్మోరాని, ఆ తరువాత క్షిత్ ని.

మంత్రగాళ్ళు తమ మరణాన్ని పగటిపూట, అందులోనూ మధ్యాహ్నం పూట కోరుకుంటారు.

తన మరణాన్ని ఏ బాధా లేకుండా తనకి ప్రసాదించమని దార్కా క్షుద్రదేవతల్ని ప్రార్ధిస్తు న్నాడు. తులసిని
పట్టు కోలేక పోయినందుకు ఈ ఆత్మహత్యని చేసుకుంటున్నాడు అతడు.

* * *
"పన్నెండవుతూంది! ఇంకా బయల్దేరలా?" అంది శారద.

"వచ్చేస్తు న్నా" అని ఫోన్ లో ఆఖరి స్నేహితురాలికి గుడ్ బై చెప్పేసి సోఫాలోంచి లేచింది తులసి. నౌకరు
సామానులు కారులో పెట్టేడు.

"ఎన్ని గంటల ప్లయిటు?"

"రెండున్నర!"

అబ్రకదబ్ర డ్రైవ్ చేస్తు న్నాడు. పక్కనే తులసి కూర్చుంది. వెనుక సీటులో శారద.

"ఎప్పుడొస్తు న్నావ్ తిరిగి" అడిగేడు అబ్రకదబ్ర

"నాకేమో శలవులు. రెండు నెలలూ అక్కడే వుండిపోవాలని వుంది అంకుల్! డాడీ పదిహేను రోజుల్లో
వచ్చెయ్యాలి అంటున్నారు. ఎలా గయినా ఓ నెలయినా వుంటాననుకో" నవ్వింది.
కాష్మోరా నిద్ర లేవటానికి సరిగ్గా ఇరవై రోజులుంది అప్పటికి.

* * *
పంచమూలక ద్రవంలో బందాన్ని గీసేడు దార్కా ముగ్గుకి అడుగు అవతలగా - అక్కడో సింహపు బొమ్మని
బొగ్గుతో వేసేడు.

ఉన్న రెండు నిమ్మకాయలూ ఉత్తర దిక్కుగా కోసిపెట్టా డు.

అయిదు నిమిషాల క్రితమే స్నానం చేసినా, ఎండకి చెమట ధారాపాతంగా కారుతూంది. గాలి కూడా
స్థంబించింది. కాకి అరుస్తూనే వుంది.

నడుముకి చిన్న గుడ్డ తప్ప ఇంకే అచ్చాదనా లేదు.

సత్రపు గది ద్వారానికి తలుపులేదు. తొందర తొందరగా తంతు నిర్వహించాలి. అతడు చాలా కామ్ గా,
అయినా తొందర తొందరగా తన పని చేసుకుపోతున్నాడు. కోడి రక్తంలో చూపుడువేలు ముంచి, చాతీమధ్య
నుంచి బొడ్డు కిందవరకూ గీత గీసేడు. సరళరేఖ.

నడుముకి చెరోవైపునా చేతులు పెట్టు కొని వేళ్ళు ఆ గీతమీద పెట్టేడు. గోళ్ళు నెమ్మదిగా దిగుతున్నాయి.

పన్నెండవటానికి ఒక్క నిమిషం వుంది.

* * *
ఎయిర్ పోర్ట్ వైపు దూసుకుపోతుంది కారు.

"ఫారిన్ నుంచి నాకేం తెస్తా వ్?" అబ్రకదబ్ర అడిగేడు.

తులసి గొంతు బొంగురుచేసి, "మాయా మంత్రాల మహాన్విత మంత్రదండం" అంది. ఆ తరువాత


నవ్వేసింది. అబ్రకదబ్ర కూడా నవ్వేడు. శారద నవ్వలేదు. దాదాపు పది సంవత్సరాల క్రితం 'ఫారెన్ నుంచి నాకేం
తెస్తా వ్ పాపా' అని డాక్టర్ అడగటం, 'స్టెతస్కోప్' అని తులసి అనటం, ఎయిర్ పోర్టు లో పాప మూర్చపోయి
ప్రయాణం ఆగి పోవటం అన్నీ వరుసగా గుర్తు వచ్చాయి.

ఆ సమయంలో అది గుర్తు కురావటం ఆమెకి అంత బాగా అనిపించలేదు. ఆమె ఏదో అనబోతుంటే తులసి
చప్పున పక్కకి తిరిగి "ఒక్క నిమిషం ఇక్కడాపు అంకుల్" అంది.
"మళ్ళీ ఇంకో ఫ్రెండా?" అన్నాడు అబ్రకదబ్ర కారు పక్కకుతీసి ఆపుచేస్తూ.

* * *
గోళ్ళు నెమ్మదిగా చర్మంలోకి దిగుతున్నాయి. రక్తం ఎర్రగా పేరుకోవటం ప్రారంభించింది.

ముగ్గు మధ్యలో వున్నాడతను. ముగ్గు అవతల గాలిలో నెమ్మదిగా కలకలం బయలుదేరటం తెలుస్తుంది. ఆ
బంధాన్ని దాటి లోపలికి వచ్చే వీలులేదు. శక్తు లకి అతడు మరింత అశక్తు డవ్వాలి. అప్పుడు గానీ అవి లోపలికి
ప్రవేశించలేవు.

ఈ లోపులో తన ప్రాణం పోవాలి అదీ అతడి ప్రయత్నం వేళ్ళు కొంచెం లోపలికి దిగగానే, మంత్రోచ్చారణ
ఆపకుండా పేగులు లాగెయ్యాలి. ప్రాణం ఒక్కసారిగా పోవాలి! అతడు శ్వాస బిగపట్టేడు. నాలుక మడతపడి
లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనసే మంత్రాన్ని పఠిస్తూంది. చివరిసారి అతడు వేళ్ళ చివర్లలోకి బలాన్ని
తీసుకున్నాడు కళ్ళు మూసుకొని చీల్చుకోబోతూంటే, అప్పుడు వినిపించింది 'హల్లో' అని.

అతడు చప్పున కళ్ళు తెరిచాడు. గాలిలో కలకలం చప్పున ఆగిపోయిన భావన.

ఎదురుగా గుమ్మానికి ఆనుకొని, చేతులు కట్టు కొని నిలబడి నవ్వుతూ, "నేనూ, తులసిని ఎయిర్ పోర్టు కి
వెళుతూంటే దార్లో సత్రం చూసేసరికి గుర్తొచ్చింది.......నిన్ను దింపింది ఇక్కడేనని! హౌ ఆర్యూ" అంది తులసి.

* * *
"ఇక్కడేమిటి తనకి పని" అన్నాడు అబ్రకదబ్ర.

"ఏమో నాకూ తెలీదు" కారు విండోలోంచి సత్రంవైపు చూస్తూ అన్నది శారద. అబ్రకదబ్ర కారు హారన్
కొట్టేడు.

ఆ శబ్దా న్ని సత్రం గుమాస్తా వెనుకనుంచి పరుగెత్తు కు వచ్చి, కారుని చూసి, లోపలికి వెళ్ళాడు.

అదే సమయానికి లోపల దార్కా, "నీ పేరు......నీ పేరు తులసా" అని అడుగుతున్నాడు....ఉద్వేగంతో
కంపిస్తు న్న కంఠంతో.

"అవును........ఏం?"

"నీకు.......నీకు కాష్మోరా తెలుసా?"

"ఇరవై రోజులు పట్టే దెయ్యమేనా.......అమ్మ చెప్తూ వుంటుంది."


దార్కా చప్పున లేచి నిలబడ్డా డు. అతడి పెదవులు అదురుతున్నాయి. పళ్లు బిగుసుకున్నాయి.

"పది సంవత్సరాల క్రితం కాష్మోరా నిన్ను బాధించిందా?"

"అవునట, నేను నమ్మననుకో, కానీ......." అంటూన్న ఆమె మాటల్ని అతడు మధ్యలో ఖండిస్తూ "బిస్తా
వెళ్ళినవాళ్ళు ముగ్గురూ నీ తరుపు వాళ్ళేనా" అన్నాడు.

ఆ మాటలో కరుకుదనానికి ఆమె మొహంలో నవ్వు మాయమయింది.

"అవును........ఏం" అంది కొద్దిగా బెదిరి.

"ఎవరు వాళ్ళు?"

"ఒకరు మా......." ఆమె చెప్పబోతూంటే సత్రం గుమాస్తా కంఠం వెనుకనుంచి వినబడింది.

"ఏం జరుగుతూంది ఇక్కడ?"

ఇద్దరూ చప్పున అటు చూసేరు. లోపలికొచ్చిన గుమాస్తా గదిలో పుర్రెని చూసి అడుగు వెనక్కి వేసి, కెవ్వున
అరిచినంత పని చేసేడు. ఈ లోపులో బయట అదేపనిగా హారన్ వినిపించసాగింది. గుమాస్తా తులసివైపు......
అనుమానంగా చూస్తూ "మీ ఇద్దరికీ ఏమిటి సంబంధం ఈ రక్తం ఇదంతా" అంటున్నాడు. మళ్ళీ హారన్
వినిపించింది తులసికి ఇక అక్కడ వుండటం మంచిది కాదనిపించింది.

"వెళ్ళొస్తా ను" అంటూ బయటికి నడిచింది.

అప్పుడు తెప్పరిల్లేడు దార్కా, ఒక్కసారిగా 'ఆగు' అని అరిచి ముందుకు వెళ్ళబోయాడు. సత్రం గుమాస్తా
అడ్డు నిలబడి ఏమిటయ్యా ఇదంతా సత్రం ఖాలీ చెయ్యి అంటున్నాడు. దార్కా రెండు చేతుల్తోనూ విసురుగా
అతడ్ని పక్కకు తోసి, బయటకు పరుగెత్తా డు. అప్పటికే కారు స్టా ర్టయింది. అతడు బయటికి చేరుకొనేసరికి
అది మలుపు తిరుగుతుంది.

ఒక క్షణం......... ఒక్క క్షణమే......అతడు స్థా ణువై నిలబడిపోయాడు. తరువాత ఒక్కసారిగా వింటినుంచి


వెలువడిన బాణంలా ముందుకు పరుగెత్తా డు.

ఇరవై సంవత్సరాల వయస్సు యిచ్చిన బలం, నిరంతర యోగాభ్యాసం వల్ల వచ్చిన చురుకు - అన్నటికన్నా
ఎక్కువగా, గురువైన విషాచికోర్కె తీర్చాలనే పట్టు దలా, అన్నీ కలిసి అతడిని తూనీగలా పరుగెత్తిస్తు న్నాయి.
నడుముకి చిన్న గుడ్డతో రోడ్డు మీద పరుగెడుతున్న అతడిని జనం ఆశ్చర్యంగా చూడసాగేరు. అతడు దేనినీ
పట్టించుకోలేదు. బాణంలా సాగిపోతున్నాడు....ఆరు మూడైనా, మూడు ఆరైనా తులసిని తన ప్రశ్నకి
సమాధానం చెప్పకుండా వెళ్ళనివ్వడు. ప్రపంచాన్ని సర్వనాశనం చేసైనా సరే, తన ప్రయత్నం
నెరవేర్చుకుంటాడు. ఇన్నాళ్ళకు వేట ఫలించబోతోంది. ఇంకెవరూ దీన్ని ఆపలేరు. కాద్రాని చంపినవారెవరో
తెలియబోతుంది.

అయితే.........అతడు ఎంతవేగంగా వెళ్ళినప్పటికీ, ఊరు చివరనున్న ఎయిర్ పోర్టు చేరుకొనేసరికి గంటకి


పైగానే పట్టింది.

బయట కారుకి టోకిన్ లు ఇచ్చే కుర్రాళ్ళు లోపలికి దూసుకు వస్తు న్న దార్కాని చూసి విస్మయంతో నోరు
తెరిచారు. ఊపిరి తీసుకోవటానికి కూడా అతడు ఆగలేదు. అదే వేగంతో ఎయిర్ పోర్టు బిల్డింగ్ గేటు దగ్గరికి
చేరుకున్నాడు. కాని అతడు అక్కడ సెక్యూరిటీ ఇన్ స్పెక్టర్ చే ఆపబడ్డా డు.

* * *
"వెళ్ళొస్తా ను" అని ఆఖరిసారి చెప్పి, 'చెక్ ఇన్'లోకి వెళ్ళింది.

అతడి మొహం కసితో, రోషంతో ఎర్రబడింది. పది సంవత్సరాల తపస్సు ఫలితం....... ఆఖరి క్షణంలో
అందబోయి, చివరి క్షణంలో చేజారి పోతూంది. తులసితోపాటు వచ్చిన వాళ్ళ జాడ తెలిసినా బావుణ్ను. కానీ
అంతమందిలో వాళ్ళని ఎలా కనుక్కోవటం?

దార్కా అక్కణ్నుంచి బయట కొచ్చేసేడు. ఎడమవైపు జనం వుండటం చూసి అటు పరిగెత్తా డు.

విమానం మెట్లు ఎక్కుతూ తులసి వెనుదిరిగింది. చెయ్యి గాలిలో వూపింది. తరువాత లోపలికి
వెళ్ళిపోయింది. ఆమె వెనుకే తలుపు మూసుకుంది.

లోపల తులసి ఎర్రలైటు వెలగ్గానే సీటు బెల్టు బిగించుకుంది. ముందు సీటు కవర్ లో వున్న పేపరు తీసుకొని
చదవసాగింది.

దార్కా అక్కణ్నుంచి కదిలేడు. జనం నుంచి తప్పుకొని ఇంకా కుడివైపుకి వెళ్ళాడు. పక్కనే నిలబెట్టబడివున్న
విమానాలు వరుసగా కనిపిస్తు న్నాయి. వాటిమధ్య రన్ వే ఎండకి మెరుస్తూంది. అక్కడ జనం లేరు. దార్కా
క్షణం అటూ ఇటూ చూసి, వాటి మధ్యగా పరుగెత్తా డు. విమానాల మధ్య అతడు పరుగెడుతూంటే పెద్ద పెద్ద
రాబందుల మధ్య కోడిపిల్లలా వున్నాడు.

ఇంకో వంద అడుగులు పరుగెడితే అతడు విమానాన్ని చేరుకుంటాడు. కానీ ఎలా....... అక్కడంతా గ్రౌండ్
స్టా ప్ వున్నారు. ఏం చెయ్యాలో తోచక అతడు క్షణం తటపటాయించేడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి
నిప్పులు వర్షించటానికి సిద్దంగా...

లోపల ఎయిర్ హోస్టెస్ చెబుతూంది..... "గుడ్ ఆప్టర్ నూన్ ఎవ్విరి బడీ ఐసే. 1 2 8 బొంబాయికి చేరే
టై ము అయిదున్నర. విమానా్ని నడుపుతూంది కెప్టెన్ మాధూర్" వగైరా..... వగైరా.... తులసి సీట్ వెనక్కి వాలి
కళ్లు మూసుకుంది.

చిన్న కుదుపుతో విమానం కదిలింది.

దార్కా నీడలోంచి బయటకొచ్చేడు. సూర్యకిరణం వాలుగా పడుతూంది.

విమానం విపరీతమైన శబ్దంతో బయలుదేరబోతోంది. దార్కా నిస్సహాయంగా నిలబడి వున్నాడు. చివరగా


వచ్చి చేరింది, చేజారి పోతున్నదని దిగులు.......బాధ......కంట్లో నీటిపొర.

ఎయిర్ హోస్టెస్ ట్రేలో చాక్లెట్లు పట్టు కొచ్చింది. తులసి చిరు నవ్వుతో రెండు తీసుకుని "థాంక్యూ" అంది.

విమానం కొద్దిగా జర్క్ ఇచ్చి ఆగిపోయింది. ప్రయాణీకులు ముందుకు తూలేరు. అన్నివైపులా మూసి
వుంది కాబట్టి వినబడలేదుగానీ,లేకపోతే టప్ మన్న శబ్దం ప్రయాణీకులు వినేవారే.విమానం కొద్దిగా పక్కకి
తూలింది.

ప్రయాణీకుల్లో హాహాకారాలు బయలుదేరాయి. రన్ వే మీదకు వెళ్ళకుండానే, గాలిలోకి తేలకుండానే


విమానం పక్కకి వొరగటం అనుభవజ్ఞుడైన మాధుర్ కే విభ్రాంతి కలిగించింది. ఎదుటి అద్దంలోంచి బయటకు
చూసేడు.

నలుగురు ప్లేన్ వైపు పరుగెత్తు కుంటూ రావటం కనిపించింది.

ఏం జరుగుతూంది బయట?

అతడి నుదుటిమీద చెమటపట్టింది. సీటులోంచి లేవబోతూ ఎదుటి మీటర్లవైపు చూసి అదిరిపడ్డా డు.
టెంపరేచర్ సూచించే ముల్లు వేగంగా ముందుకు కదుల్తూంది.

అతడి చూపుడువేలు ఎర్రబటన్ వైపు అప్రయత్నంగా వెళ్ళింది బటన్ నొక్కబడటం, చిన్న


విస్పోటనం.......రెండూ ఒకేసారి జరిగాయి. అతడు కేబిన్ తలుపు తెరుచుకుని ముందుకు రాబోయి, ఆ
దృశ్యాన్ని చూసి నిశ్చేష్టు డై ఆగిపోయాడు.

కొంతమంది మొహం కప్పుకుని ఏడుస్తు న్నారు. కొంతమంది హిస్టీరియా పట్టినట్టు అరుస్తు న్నారు.
నడుముకు అడ్డు గా కట్టివున్న బెల్టు కూడా విప్పుకోకుండా కొంతమంది లేవటానికి ప్రయత్నిస్తు న్నారు.

అప్పుడు చూసేడు అతడు. కిటికీ ఓవెల్ షేప్ అద్దా ల అవతల ఎర్రటి మంటలు విమానం కిందనుంచి పైకి
వస్తు న్నాయి.

చివరి సీట్లోంచి చువ్వలా లేచి దూసుకువస్తూ ఎవరో అరిచేరు. 'ఓపెన్ ద ఎమర్జెన్సీ -క్షణంలో అతడి కర్తవ్యం
జ్ఞాపకం వచ్చింది. మరుక్షణం అనుభవజ్ఞుడైన చోదకుడు అయిపోయాడు. అతడి చేతులు మిషన్ కన్నా
వేగంగా పనిచేశాయి. తెరుచుకున్న గేటులోంచి వేడిగాలి లోపలికి ఒక్కసారిగా దూసుకొచ్చింది మరిన్ని
ఆక్రందనలు.

విమానంవైపు ఫైరింజన్లు వేగంగా వస్తు న్నాయి. ఒకరి తర్వాత ఒకరు బయటకు దూకుతున్నారు. భయంతో
బెల్టు విప్పుకోటానికి కూడా శక్తిలేని ప్రయాణీకులకు ఎయిర్ హోస్టెస్ లు సహాయం చేస్తు న్నారు. వారితోపాటు
యింకో అమ్మాయి కూడా సాయపడటాన్ని మాధుర్ అభినందన పూర్వకంగా చూసేడు. అతడూ అటు
పరిగెత్తా డు.

చాలామంది ప్రయాణీకులు విమానాన్ని ఖాళీచేసేరు. స్పృహతప్పిన వాళ్ళనీ, హిస్టీరిక్ గా మారిన వాళ్ళనీ


తీసుకొని వాన్, రన్ వే క్రా స్ చేసి వెళ్ళిపోతూంది.

అప్పుడు అర్ధమైంది దార్కాకి. తన కన్ను అరత్యుంగ విద్యని ప్రదర్శిస్తూందని.

ఎయిర్ హోస్టెస్ లు ఫైర్ సర్వీస్ మెన్ సాయంతో జీప్ లోకి చేర్చబడ్డా రు. ఖాళీ కుర్చీల మధ్య కాలుతున్న
కార్పెట్ మీద అతడు మౌనంగా నిలబడ్డా డు. అప్పటివరకూ కళకళలాడుతున్నది స్మశానంగా మారుతూంది.
అతడుకూడా దూకబోతూంటే వెనుక అలికిడి వినిపించింది. మిగిలిపోయిన అమ్మాయి పరుగెత్తు కు వస్తూంది.
"యూ ఇడియట్ జంప్ ఫస్ట్" అని అరిచేడు. ఆ క్షణం అథడికి అమితంగా కోపం వచ్చింది. అటువంటి
పరిస్థితుల్లో ప్రయాణీకులందరూ దిగారో లేదో చూసుకున్నాకనే ఎయిర్ హోస్టెస్ లు తమ ప్రాణాల్ని రక్షించుకునే
ప్రయత్నం చేయాలి. ప్రాణంమీద ప్రేమ రూల్సుని లెక్కచేయకపోవచ్చు. కానీ అతడు తన విధి నిర్వహణపట్ల
ఖచ్చితంగా ప్రవర్తించే పైలట్లలో ఒకడు.

తను తిట్టిన అమ్మాయి అప్పటివరకూ తమకు సాయపడిన అమ్మాయిగా గుర్తించగానే "సారీ" అన్నాడు
నొచ్చుకుంటూ. మళ్ళీ వెంటనే "గెటవుట్........క్విక్" అని అరిచేడు.

తులసి మొహం అప్పటికే వేడికి బాగా కమిలిపోయింది. రాడ్ ని రెండు చేతుల్తోనూ పట్టు కుని డైవ్ చేసింది.
ఆమె వెనకే మాదుర్ దిగబోయాడు. విమానం సీటు తలకు కొట్టు కుంది. క్షణంపాటు స్పృహతప్పుతున్న
అనుభూతి.

రెండు చేతులూ కార్పెట్ మీద ఆన్చి లేవబోతూంటే చెవులు బద్దలయ్యేటంత శబ్దం వినిపించింది.

ముందు అతడి శరీరం గాలిలో ఒకటిగా లేచింది. తర్వాత రెండయింది. నాలుగయింది. ఒక చెయ్యీ కాలూ
శరీరంనుంచి విడిపడిపోయేయి. అణువల్లా చిద్రమైన అంగాలు, ప్రాణంతోపాటు గాలిలో కలిసిపోయేయి.

* * *
దాదాపు ఐదు గంటల తర్వాత మరో ప్లయిట్ అప్పట్లో లేదని తెలిసేక వాళ్ళు తిరిగి ఇంటికి
ప్రయాణమయ్యారు. రన్ వే మీద యింకా ఫైర్ ఇంజన్ లు తిరుగుతూనే వున్నాయి. పైలట్ చనిపోయినట్లు
తులసికి తెలియనివ్వలేదు. అబ్రకదబ్ర.

నిజానికి లోపల మంటలమధ్య చిక్కుకున్న తులసికన్నా విజిటర్స్ లాంజ్ లోనుంచి చూస్తు న్న శారద
ఎక్కువగా హడావుడి చేసింది. కొద్దిగా మంటల్ని చూడగానే ఆమె కెవ్వున అరిచి స్పృహతప్పి పడిపోయింది.
అబ్రకదబ్ర కూడా కంగారుపడ్డా డుగానీ, ఎమర్జన్సీ నుంచీ ప్రయాణీకులు బయటకు రావటం చూసి
సర్దు కున్నాడు. తులసిని చూసేక అతడు మరింత మామూలు మనిషయ్యాడు.

పైలట్ మరణం గురించి తెలియని తులసి, ప్రమాదం తాలూక షాక్ నుంచి తొందర్లోనే తేరుకుంది.

ఇక ఆ రోజుకు ఫ్లయిట్ లేదని తెలుసుకుని వాళ్ళు తమ కారు దగ్గరకు వస్తుంటే - చాలా దూరంనుంచి
వాళ్ళనే గమనసి్తున్న దార్కా తాపీగా కారువద్దకు చేరుకున్నాడు. అతడిని చూడగానే తులసి "హాయ్" అంది
"నువ్విక్కడికి ఎలా వచ్చేవ్?"

దార్కా మాట్లా డలేదు. తులసి అబ్రకదబ్ర వైపు తిరిగి "సిద్దేశ్వరి ఆలయం నుంచి బయటపడింది మేమిద్దరమే
అంకుల్" అంది.

అప్పుడు వాళ్ళిద్దరూ ఒకర్నొకరు చూసుకున్న చూపు ఎలా వుందంటే ఏమాత్రం శక్తివున్నా అవతలివాడు
భస్మం అయిపోయేవాడే.

ఎప్పుడూ నవ్వుతూ వుండే అబ్రకదబ్ర చాలా చిత్రంగా, సీరియస్ గా ఏదో ఆలోచిస్తు న్నాడు. అతడు కారు
స్టా ర్ట్ చెయ్యబోతూంటే, నేనూ వూరివరకూ వస్తా ను" అన్నాడు దార్కా. చదరంగంలో ఆఖరి ఎత్తు వెయ్యబోయే
ఆటగాడిలా వున్నాడు. అతడు చాలా కాలిక్యులేటెడ్ గా ఆవేశాన్ని లోపలే అణచుకుంటూ.

ఎయిర్ పోర్ట్ నుంచి ఊరు ఆరు కిలోమీటర్లు . అయినా వంటిమీద సరీగ్గా బట్టలు లేకుండా వున్న ఆ
యువకుడ్ని కార్లో ఎక్కించుకోవటానికి శారద సంశయిస్తూ ఏదో అనబోతూంటే, తులసి వంగి తలుపు తెరచి
"గెటిన్" అంది.

చాలాచిత్రంగా, అబ్రకదబ్ర దేనికి అభ్యంతరం పెట్టలేదు. జాగ్రత్తగా గమనిస్తే అతడి మొహంలో ఏదో
అనిర్వచనీయమైన ఉద్రిక్తత కనబడుతుంది. ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. సరిగ్గా ఐదు గంటల క్రితం
అతడు ఒక అపురూపమైన దృశ్యాన్ని చూశాడు. దానిని వాస్తవానికి అన్వయించుకోలేకపోతున్నాడు. తన
పక్కన అడుగు దూరంలో కూర్చొన్న వ్యక్తి మామూలు మనిషి కాడు - కాడు - కాడు అని సిక్త్ సెన్స్
చెబుతుంది.

"నీ పేరు" అడిగేడు.

"దార్కా"
"ఏం చేస్తుంటావు సత్రంలో"

"బాటసారులకు జోతిష్యం చెబుతూ వుంటాను"

తులసి చప్పున ముందు సీటుమీదకి వంగి "నా చెయ్యి చూడవూ" అంది . కారు గాందీబొమ్ పక్కనుంచి
తిరుగుతూంది.

"మీరేం చేస్తూవుంటారు" దార్కా అడిగాడు.

"కేదారీ కన్ స్ట్రక్షన్ కంపెనీ ప్రొప్రైటర్ని" అన్నాడు అబ్రకదబ్ర

"నా చెయ్యి" అంది తులిస గారాబంగా. దార్కా ఆ చెతివంక నిమిషంపాటు తదేకంగా చూసేడు. "దాదాపు
పదేళ్ళ వయసులో నీకు ప్రాణాపాయం సంభవించింది ముగ్గురు వ్యక్తు లు నిన్ను రక్షించారు" అన్నాడు.

"కరెక్ట్" అని అరిచింది తులసి. అబ్రకదబ్ర, శారద కూడా విస్మయంగా చూసేరు.

"ఆ ముగ్గురూ..... ఎవరు వాళ్ళు" అడిగేడు దార్కా మామూలు కంఠంతో - క్యాజువల్ గా.
"మా డాడీ శ్రీధర్, అబ్రకదబ్ర అంకుల్, లాయర్ విద్యాపతి" అంది తులసి తేలిగ్గా, దార్కా పెదవులమీద
విజయపూర్వకమైన నవ్వు కదిలింది." కారు ఆపుతారా -సత్రం వచ్చేసింది.........." నమ్రతగా అడిగేడు.

కారు ఆగింది.

డోర్ తియ్యటం అతడికి సరిగ్గా రాలేదు. దిగి, మళ్ళీ తలుపు వేస్తుంటే చూపుడువేలు ఆ సందులో
ఇరుక్కొంది.

"సారీ" అన్నాడు అబ్రకదబ్ర

"ఫర్లేదు"

కారు కదిలింది. తులసి కారులోంచి చెయ్యి వూపింది. చూపుడు వేలునుంచి కారుతున్న రక్తా న్ని బొటన
వేలుతో అదిమిపెట్టి దార్కా కూడా చెయ్యి ఎత్తా డు. కారు నెమ్మదిగా అదృశ్యమైంది. అతడు అలానే కొంచెం
సేపు నిలబడ్డా డు. ఆ తరువాత సత్రంలోని - తన గదిలోకి నడిచాడు.

"దొరికేరు విషాచీ -ముగ్గురూ దొరికేరు ఇన్నాళ్ళకి మన పగ తీరబోతూంది మొదటివాణ్ని భస్మం చేస్తా ను -


రెండోవాణ్ని మానసికంగా చిత్రవధ చేస్తా ను- మూడోవాణ్ని ఈ చేతుల్తో స్వయంగా చంపుతాను-"
అనుకొన్నాడు అతడు.
సత్రం గోడలు మరకలు పట్టి వున్నాయి. అయినా తెల్లగానే వున్నాయి. అతడు చూపుడు వేలు రక్తంతో ఆ
గోడమీద ఆ ముగ్గురి పేర్లూ వ్రాసేడు. చాలా వికృతంగా భయంకరంగా వున్నాయి. ఆ అక్షరాలు.

అదే వరుసలో అతడు వాళ్ళమీద పగ తీర్చుకోదల్చేడు.

17
"నేను చూసేను.......స్వయంగా నా కళ్ళతో చూసేను" అన్నాడు అబ్రకదబ్ర టెన్షన్ నిండిన స్వరంతో.
"నిజానికి నేను అప్పుడే అరుద్దా మనుకున్నాను. కానీ అందరూ పిచ్చివాడు అంటారని వూరుకున్నాను"

పండిత్, జయదేవ్ వింటున్నారు.

"అతడ్ని అక్కడ చూడగానే అనుమానం వచ్చింది.....కాష్మోరా గురించి పేపర్ లో ప్రకటించినవాడు అక్కడ


ఎందుకున్నాడా అని. తరువాత అతడు నా పక్కనే కార్లో కూర్చొని వూళ్ళోకి వచ్చేడు కూడా. తులసికి సిద్దేశ్వరి
ఆలయంలో పరిచయం అయినవాడట అతడు"

"నాన్సెన్స్"అన్నాడు జయదేవ్. "మనిషి కళ్ళలోంచి కిరణం బయల్దేరిందా? అది విమానాన్ని కాల్చేసిందా -


ఇంకా నయం. శివుడు మూడో కన్ను తెరిచాడనలేదు" అని నవ్వుతూ తిరిగి "ఏం పండిత్......" అన్నాడు.

"నా కళ్ళతో నేను చూడకపోతే నేనూ నమ్మేవాణ్ని కాదు"

పండిత్ సాలోచనగా "ఇన్ ఫ్రారెడ్ లేసర్ బీమ్" అన్నాడు జయదేవ్ మొహంలో నవ్వు మాయమయింది.
పండిత్ ఏదో చెప్పదల్చుకున్నాడని అర్ధమయింది. ఇద్దరూ అతడివైపు చూసేరు. పండిత్ అన్నాడు -
"చిన్న పిల్లలు బూతద్దంతో కాగితాన్ని కాల్చటం మీరు చూసే వుంటారు. సూర్యకిరణాన్ని లెన్స్ ద్వారా
కేంద్రీకరించటంతో ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. అంతవరకూ ఒప్పుకుంటారు కదా"

"ఒప్పుకుంటాం"

అతడు రాక్ లోంచి ఒక పుస్తకం తీసి పేజీ తిప్పేడు. అందులో బొమ్మ చూపిస్తూ "సూర్యకిరణం నుంచి లేసర్
బీమ్ ను ఎలా తయారు చెయ్యవచ్చో ఒక ఆర్టిస్ట్ వేసిన ఊహాచిత్రం ఇది" అన్నాడు.

"ఎంత సన్నటి కిరణంలోంచైనా, ఆ కిరణపు బాహ్య వెలుగు తరంగాల్ని విడగొట్టగలిగితే అది లేసర్ గా
మారుతుంది."

అబ్రకదబ్ర కల్పించుకొని "కానీ విమానం కాలిపోతున్నప్పుడు బాగా మబ్బు పట్టి వుంది" అన్నాడు.

"చీకట్లో కూడా ఈ కిరణాన్ని సృష్టించవచ్చు."


"ఎలా?"

"జువాలజీ చదువుకున్న వాళ్ళకు క్వాట్ ల గురించి తెలుస్తుంది భూమిలో వుండే ఒక రకమైన రాళ్ళు ఇవి.
వీటికి సూర్యశక్తిని తమలో దాచుకునే గుణం వుంది. జపాను వాచీలు సూర్యశక్తితో ఆటోమాటిక్ గా తిరగటం
కోసం ఉపయోగించేది ఈ రాళ్ళనే. వీటిలోంచి 'రాపిడి' ద్వారా శక్తి పుట్టించవచ్చు."

"అయితే?"

"ఏదయినా పసరు పోసి, కంట్లో ఈ రాయిని సృష్టించగలిగితే, పగలంతా అది సూర్యశక్తిని గ్రహించగల్గుతుంది.
కొద్దిగా కంటిని రుద్దు కుంటే ఇదుగో ఇలా........" అని బొమ్మ వేశాడు.

"క్వాట్జ్ నుంచి ఉత్పత్తి అయిన కిరణం రెటినా కాన్ వెక్స్ లెన్స్ మీద పడి, లేసర్గా మారి కంటి నుండి
బహిర్గతమవుతుంది. ఆ లేసర్ బీమ్ విమానాన్నేమిటి -వజ్రా్ని కూడా కోయగలుగుతుంది."

"ఫెంటాస్టిక్ -నమ్మలేకుండా వున్నాను"

"నేను నమ్మను కానీ కేవలం యిది సైన్సు ద్వారా ఎలా సాధ్యమవుతుంది. అన్న వివరణ ఇచ్చానంతే. వీటి
అన్నిటికన్నా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటుంది.- మన కళ్ళముందు జరుగుతూ వున్నది?"

"ఏమిటది?"

"అమెరికాలో ఒక భవన నిర్మాణం జరుగుతూంది. నూటయాభై మీటర్లు పొడవున్న ఆ హాల్లో నలభై లేసర్
బీమ్ లు, ఒక అంగుళం పొడవూ వెడల్పూ ఉన్న ట్రటియము బిళ్ళ 300,000,90,00,000000000 వాట్ల
ఉష్ణాన్ని ప్రసారం చేస్తూ కాలుస్తా యి."

"దీంట్లో ఆశ్చర్యం లేదు."

"దాంట్లో ఆశ్చర్యం లేదు కానీ ఆ మిషన్ పేరేమిటో తెలుసా?"

"ఏమిటి?"

"శివ............"

* * *
"నేను డాడీ, తులసిని -" ఫోనులో అన్నది.
"ఏమిటి నువ్వింకా బయలుదేరలేదా?"

"ఫ్లయిట్ మిస్సయింది డాడీ. రేపు బాంబే వచ్చి. అక్కణ్నుంచి రావాలి. మరి రేపు అక్కడ పరిస్థితి ఎలా
వుందో...... అనుమానంగా అంది తులసి.

"కట్ ఇట్" అన్నాడు శ్రీధర్ అట్నుంచి, "ప్రయాణం కాన్సిల్ చేసుకో."

"అదేమిటి డాడీ -నేనూ........" అంటున్న కూతురి మాటల్ని మధ్యలో ఖండిస్తూ "నువ్వు మూడు నాల్గు
రోజుల తర్వాత వస్తే ఇక్కడేం చూడలేవు. నాల్రోజుల్లో ఇక్కణ్నుంచి అబూదాబి వెళ్ళాలి. అదంతా డ్రై నేను
అక్కడికి వచ్చిన తర్వాత నాతో కలిసి తిరిగి వద్దూవుగాని. అప్పుడయితే తీరికగా అన్నీ చూడొచ్చు.........."

"నీకు కోపం వచ్చినట్టుంది డాడీ. అసలు ఏమైందంటే - ఇక్కడ విమానం......"

"నాకేం కోపం రాలేదు. ఇప్పుడో నాల్రోజులు ఆలస్యంగా వస్తే ఏదీ తీరిగ్గా చూడటానికి వీలుపడదూ
అంటున్నానంతే."

* * *
"మనం అనవసరంగా చిన్న విషయం పెద్దది చేస్తు న్నామేమో, దార్కా గురించి ఈ కంటి కిరణాల గురించీ
వూహించుకొని బయపడుతున్నామేమో"

"ఇంకో సంఘటన ఏదయినా జరిగితే అప్పుడు ఆలోచిద్దాం" కారు దిగుతూ అన్నాడు పండిత్.

అతడు ఇంటికొచ్చి స్నానం చేసి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేసరికి ఫోన్ మోగింది. వెంటనే దాన్ని
అందుకోలేదు అతడు. తీరిగ్గా తల దువ్వుకొని, ఈజీ చెయిర్ లో కూర్చొని తాపీగా రిసీవర్ తీసుకొని "హలో"
అన్నాడు.

చిన్న నవ్వు అవతల్నుంచి.

జయదేవ్ మొహం చిట్లించి "ఎవరూ" అన్నాడు.

"నేను శ్రీనివాసపిళ్ళయ్ ని" మృదువుగా వినిపించింది కంఠం. "హౌ ఆర్యూ ప్రొఫెసర్ జయదేవ్......."

గడియారం టిక్ టిక్ మన్న శబ్దం తప్ప ఇంకేమీ వినబడటం లేదు. ఆరువేలుల్నుంచీ నిశ్సబ్దం మరింత
భయంకరంగా వుంది. చదరంగంలో ఎత్తు వేసేవాళ్ళు తమలో తామే ఆలోచించుకుంటూ నిశ్శబ్దంగా వున్నట్టు
ఇద్దరూ మౌనంగా వున్నారు. ముందు కదిలింది జయదేవ్.
"చెప్పు"

అవతలనుంచి మళ్ళీ నవ్వు. "చాలా కాలానికి కలుసుకున్నాం కదూ! పది సంవత్సరాల పైగా అయింది.
అయినా ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం వుంది ప్రొఫెసర్ జయదేవ్! టప్ టపా టప్"

జయదేవ్ వెన్ను జలదరించింది. ప్రత్యర్ధి తెలివితేటలూ, బలం అంతా అతడి నవ్వులో కనపడుతూంది గొంతు
దగ్గర గాటు పెట్టి రక్తం తడేస్తూ కూడా నవ్వుతూ వుండగలిగే క్రౌర్యం -అయినా అదీ నవ్వే.

"ఇరవై నాలుగు గంటల నరకం - టప్ టప్. మని నిజంగానే పిచ్చెక్కి పోయాను జయదేవ్! నీ తెలివితేటలకి
నా జోహార్లు ........." అతడి కంఠంలో అకస్మాత్ గా మార్పు వచ్చింది. "ఈ సారి నేను నీతో
ఆడుకోవాలనుకుంటున్నాను ప్రొఫెసర్! ఇరవయ్ నాలుగు గంటల బదులు ఇరవై నాలుగు రోజులు. ఈ ఇరవై
నాలుగు రోజులూ నువ్వు అనుక్షణం ప్రాణభయంతో చావాలి. ఇరవై నాలుగు రోజుల్లో నేను నిన్ను చంపుతాను.
ఇరవయ్ నాలుగు గంటలపాటు నేను అనుభవించిన నరకాన్ని నువ్వు ఇరవై నాలుగు రోజులు అనుభవించాలి.
ఇరవై నాలుగోరోజు మరణం ఖాయం"

ఫోన్ పెట్టేశాడు శ్రీనివాసపిళ్ళయ్

విశాలమైన రూము మసక చీకటిగా వుంది.

పిళ్ళయ్ లేచి అద్దం దగ్గరికి వచ్చాడు. డ్రస్సింగ్ టేబిల్ ప్రక్కనే బ్రీఫ్ కేసు వుంది. అందులో యాభైలక్షల పైగా
డబ్బుంది.

సిద్దేశ్వరి రూపంలో ప్రజల అజ్ఞానం మీద సంపాదించింది.

అతడు అద్దంలో చూసుకున్నాడు జుట్టు మధ్యనుంచి రెండు వైర్లు భుజం కిందికి అక్కడో చిన్న పాకెట్.
శరీరంలో అంగంగా మారిపోయిన లోహపు పాకెట్ -జీవితాంతం దాన్ని భరిస్తూ తిరగటం ఎంత దుర్భరమో
అది అనుభవిస్తు న్న వాళ్ళకే తెలుస్తుంది.

దీనికంతటికీ కారణం జయదేవ్.

అతణ్ని చంపాలి.

సిద్దేశ్వరి రూపంలో అది చాలా సులభం అయుండేది. చంపటం మరింత ఆహ్లా దకరంగా ఉండేది. అలా
జరగకుండా చేసింది ఇద్దరు.

తన గమ్యం కోటి రూపాయలు సంపాదించటం, అది చేరక ముందే అడ్డు పడింది యిద్దరు, వాళ్ళనీ
చంపాలి.
దార్కారక్తంతో గోడమీద పేర్లు వ్రాసిపెట్తే, పిళ్ళయ్ పెన్ తో అద్దంమీద ఆ పేర్లు వ్రాసేడు.

ప్రొ. జయదేవ్

తులసి.

దార్కా

తెలివయినవాళ్ళు తాము చంపాలనుకున్న వాళ్ళని కత్తు లద్వారాగాని పిస్తోళ్ళ ద్వారాగాని చంపరు.


మానసికంగా హింసించి హింసించి చివరకు ప్రాణం పోయేటట్లు చేస్తా రు.

శ్రీనివాసపిళ్ళయ్ తెలివయినవాడు.

చాలా.............

* * *
శ్రీనివాసపిళ్ళయ్ తన ప్రత్యర్ధు ల్ని చంపటానికి ఇరవై నాలుగు రోజులూ గడువు పెట్టు కున్నాడు.
దానిక్కారణం అతడు అనుభవించిన ఇరవయ్ నాలుగు గంటల బాధ. దార్కా కూడా తన ప్రత్యర్ధు ల్ని
చంపటానికి ఇరవయ్ నాలుగు రోజుల గడువే పెట్టు కున్నాడు. ఈ ఇరవయ్ నాలుగు అన్న సంఖ్యకు ఆ రోజు
చాలా ప్రాముఖ్యత లభించింది.

కాష్మోరా నిద్రలేచేది ఆ రోజునుంచి సరిగా పదిహేడు రోజులకు, ఆ పైన తులసిని బాధించేది ఏడ్రోజులు.
మొత్తం కలిపితే ఇరవై నాలుగు రోజులు.

తులసిగానీ శ్రీనివాసపిళ్ళయ్ ఎత్తు కు బలికాకపోతే కాష్మోరావల్ల మరణించేది ఇరవయ్నాలుగోరోజు. ఈ


లోపులోనే మరణిస్తే తిరిగి అసంతృప్తు డయిన కాష్మోరా ఏం చేస్తా డు?

ఈ మారణహోమంలో మరణించవలసిన ఆరుగురిలో ఎంతమంది మరణిస్తా రో, ఇంకా ఎంతమంది


అమాయకులు వాళ్ళతోపాటు బలి అవుతారో ఇరవయ్ నాలుగు రోజుల కాలమే నిర్ణయిస్తుంది.

ఏది ఏమయినా తమ తమ ఆయుధాలయిన క్షుద్రశక్తు ల్ని, సైంటిఫిక్ ఇన్ స్ట్రు మెంట్స్ నీ సిద్దంచేసుకుని,
ప్రత్యర్ధు ల్ని చంపటం కోసం చదరంగపు పావుల్ని సరిచూసుకుంటున్నారు దార్కా, శ్రీనివాసపిళ్ళయ్ లు.

* * *
శారద భర్తకు ఉత్తరం రాయడం పూర్తిచేసింది. కూతురి అభినందన తాలూకు ఫోటో కూడా కవరులోపెట్టి
అంటించింది. ఆ రోజు ప్రొద్దు న్నే తులసి పుట్టిన రోజు తాలూకు గ్రీటింగ్స్ పంపేడు శ్రీధర్

ఇంటికి ఫర్లాంగు దూరంలో పోస్టు బాక్సు వుంది స్వయంగా పోస్టు చేయడానికి బయలుదేరింది. పోస్టు చేసి
వస్తూంటే ఎదురింటిముందు లారీ ఆగటం చూసింది. సామానులు దింపుతున్నారు. లారీ పక్కనే వాకింగ్ స్టిక్
తో ఒకాయన నిలబడి ఉన్నారు.

పాష్ కాలనీలలో ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు.

ఆమె లోపలికి వచ్చేసింది.

దాదాపు అరగంట తర్వాత కాలింగ్ బెల్ వినిపించింది. ఎదురింటి ఆయన.

"నమస్తే"

ఆమె గుర్తు పట్టి "లోపలికి రండి" అన్నది.

"వద్దు వద్దు " అన్నాడు "ఎదురింటికి కొత్తగా వచ్చేను. కొద్దిగా అగ్గిపెట్టె వుంటే ఇస్తా రా?"

లోపలినుంచి తీసుకొచ్చి ఇచ్చింది.

"చాలా దూరం వరకూ షాపుల్లేవు" అన్నాడాయన.

శారద నవ్వుతూ తలూపి "ఏమైనా కావాలంటే అడగండి మొహమాట పడవద్దు "అంది.

"కావాల్సొస్తుంది అనుకోను. నేనొక్కణ్నే - రెండు గుప్పెళ్ళ బియ్యం వండుకుంటే సరిపోతుంది"

ఆయన మాటల్లో తెలుగుదనం ఆమెకు నచ్చింది. "లోపలికి రండి" అంది అడ్డు తొలగుతూ
....."మీరొక్కరేనా?"

"అవును" అన్నాడాయన వచ్చి కూర్చుంటూ. "నా భార్య చనిపోయి పదిహేను సంవత్సరాలయింది."

"ఐయామ్ సారీ.........."

"ఫర్లేదు! అన్నట్టు ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ! డాక్టర్ వెంకట్. పూర్తిపేరు వెంకటేశ్వర్లు అనుకోండి.
కొంచెం కట్ చేసాను వైజాగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టరుగా పనిచేసి రిటై రయ్యేను. ఇక్కడ హిప్నోధెరపిస్ట్ కమ్
సైక్రియాటిస్ట్ గా ప్రాక్టీసు చెయ్యాలనుకుంటున్నాను........."

ఆమె ఆసక్తిగా నవ్వింది. హిప్నోధెరపిస్ట్ అనగానే జయదేవ్ జ్ఞాపకం వచ్చేడు.

"మా అమ్మాయికి తెలిస్తే. ఇక ప్రశ్నలతో మిమ్మల్ని వేధించి చంపుతుంది"


ఆయన నవ్వేరు. "నాకు ప్రాక్టీసు పెరిగేవరకూ ఎలాగూ కంపెనీ కావాలి......... చంపనివ్వండి"

ఆమె ఏదో చెప్పబోయి ఆగింది - తులసి గురించి - కానీ ఇంకా పరిచయం పెరగకుండానే చెబితే బాగోదని
వూరుకుంది.

ఆయన చెంపమీద కొట్టు కుని "దోమలు ఎక్కువా ఇక్కడ?" అన్నాడు.

"చాలా ఎక్కువ ఎన్ని మస్కిటో కాయిల్స్ వాడినా లాభం వుండటంలేదు"

"అల్ట్రా సానిక్ రిపెల్లర్ వాడండి. కొత్తగా మార్కెట్ లోకి వచ్చినయ్. నూట యాభై రూపాయలుంటుంది."

శారద నవ్వి వూరుకుంది. ఆయన లేచి నిలబడ్డా డు" వెళ్ళొస్తా ను"

"ఈ రోజు సాయంత్రం అయిదింటికి చిన్న పార్టీ వుంది. మా అమ్మాయి పుట్టిన రోజు ఈవేళ"

"ఎన్నో సంవత్సరం వస్తుంది?"

"ఇరవై ఒకటి నిండుతాయి. ఇంగ్లీషు లెక్క ప్రకారం "అని ఆగి ".......డాక్టర్" అంది.

మెట్లు దిగుతున్నాయన ఆగేడు. ఆమె కొద్దిగా తటపటాయించి "తులసిని కాస్త పరీక్ష చెయ్యాలి మీరు"
అన్నది.

ఆయన విస్మయంతో "ఏమైంది" అన్నాడు. "కాస్త పరీక్ష చెయ్యాలి మీరు" అంది.

"పైకి చాలా హుషారుగా ఉత్సాహంగా వుంటుంది కానీ ఈ మధ్య ఓ నెలనుంచి అదోలా వుంది. పైకి
కనబడదు. కానీ లోలోపలే ఏదో కుమిలిపోతుందని నా అనుమానం. మీరు సైకాలజిస్టు కదా, కొంచెం ఎగ్జా మ్
చెయ్యండి........"

"తులసి మనసులో బాధ పడ్తుందని మీకెలా తెలుసు? ఒక్కతే కూర్చుని ఆలోచిస్తూ వుంటుందా? రాత్రిళ్ళు
ఏడుస్తూ వుంటుందా? అన్యమనస్కంగా వుంటుందా?"

"అలాంటిదేమీ లేదు డాక్టర్. చాలామంది ఆడపిల్లల కంటే తులసి చాలా హుషారయిన అమ్మాయి"

"మరి మనసులో బాధపడుతూందని ఎలా అంటున్నారు? మీరు సైకాలజీ చదివేరా?"

"కూతురి గురించి తెలుసుకోవటానికి ప్రతి తల్లీ సైకాలజీ చదవక్కరలేదని నేననుకుంటున్నాను డాక్టర్."

ఆయన కొద్దిగా దెబ్బతిని, తరువాత బిగ్గరగా నవ్వేస్తూ "సరెసరె చూస్తా ను" అన్నాడు.
18
"మాతా అన్నపూర్ణేశ్వరీ, భవతి భిక్షాందేహి" ఎలుగెత్తి అరిచాడు దార్కా, అతడి నిలువెత్తు విగ్రహం
ప్రాతఃకాలపు ఎండలో మిల మిల మెరుస్తూంది.
అంతక్రితమే అబ్రకదబ్ర ఇంటినుంచి భయటకు వెళ్ళటం అతడు గమనించేడు. ఆ తరువాత ఆ
గడహప్రాంగణంలోకి ప్రవేశించాడు.

చిన్న ప్రహరీగోడ, పదిగజాల స్థలం. ఆ స్థలంలో అస్తవ్యస్తంగా పెరిగిన మొక్కలు పూర్వపు వాసనల్ని
పోగొట్టు కోని పాత ఇల్లు

"......మాదా కబళం తల్లీ!"

"ఒక్క నిముషం వుండబ్బీ" లోపలినుంచి స్త్రీకంఠం వినిపించింది అబ్రకదబ్ర భార్యది. అతడు వేచి ఉన్నది
ఆమె కోసమే.

రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచినయ్.

ఆమె వస్తూన్న అలికిడి.

దార్కా ఊపిరి బిగపట్టి నిలబడ్డా డు.

రెండు చేతుల్తోనూ అన్నపు పాత్రని పట్టు కొచ్చిందామె.

సౌహార్ధమూ, సౌహిత్యమూ, సౌహృదయమూ, సౌభ్రాత్రమూ, సౌజన్యమూ నిండిన సోమిదేవమ్మలాంటి ఆ


ముత్తయిదువని చూసి, అతడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేయబోయి తమాయించుకున్నాడు.
తరువాత పూర్వీకులు పఠించిన వేదవేదాంగాల పుణ్యఫలం ఆమె మొహంలో మూర్తీభవించింది.

కర్తవ్యం గుర్తొచ్చి - క్షణంలో అతడు తేరుకుని, చేతులు సాచేడు. అన్నం వంచుతూ ఆమె అన్నది
"కుర్రవాడివి యిలా యాయవారము చేసుకోకుండా ఏదైనా పని చేయకూడదా నాయనా!"

అతడు నవ్వి వెనుదిరిగేడు.

గంట తరువాత తిరిగి వచ్చి తలుపు తట్టేడు. ఆమె అతడిని చూసి ఆశ్చర్యపోయింది. "ఏదైనా పని ఇప్పించు
తల్లీ! నీ మాటలు నా మీద పనిచేసినయ్" అన్నాడతడు నమ్రతగా.

"మాటవరసకన్నాను. నేనేమివ్వగలను"

"అలా అనకమ్మా! ఈ రోజునుంచి యాయవారము మానేశాను. మొదట రోజు పని మీ ఇంటినుంచే


ప్రారంభిస్తా ను. అది శుభప్రదం కాదనకు."
ఆమె తటపటాయించి "ఏం పని వుంది మా ఇంట్లో"అంది సందిగ్ధంగా.

"ఈ మొక్కలు పీకటం కూడా పనేగా?"

ఆమెకీ ఆలోచన నచ్చినట్టు గా "సరేసరే అంతా శుభ్రంచెయ్యి. ఓ మూడు రూపాయలిస్తా ను" అని లోపలికి
వెళ్ళబోతూ వెనుదిరిగి "మధ్యాహ్నం బాగా ఎండగా వుంటుంది. మా యింటి భోజనమే చేద్దూగానిలే" అన్నది.

అతడు పని ప్రారంభించాడు. మొక్కలు పీకుతూ పోసాగాడు. అరగంట తర్వాత మొక్కల్లో చిక్కుకుని
దొరికినయ్...... కిటికీలోంచి వుండచుట్టి పడేసిన తల వెంట్రు కలు.

అవి తీసుకుని అతడు బయటకొచ్చేసేడు.

నల్లంచి పిట్ట రక్తము, గాడిద లద్దె, తెల్ల కిర్సనాయిలు పోర్టు లైను కలిపి ఉడకబెట్టి ప్రయోగం చేయాలి.
వారంరోజులు మౌనంగా ఆవాహన చేయాలి. ఇరవై రెండు రోజులు శుష్కించి శుష్కించి రోగి, కన్ను
మూస్తుంది. డాక్టర్ దాన్ని రమణం కింద నిర్ధా రణ చేస్తా డు. నిజానికి అది మరణం కాదు 'ముద్ర' బంధువులు
శవాన్ని స్మశానంలో పాతి పెడతారు. ఆరాత్రి మంత్రగాడు దాన్ని వెలికితీస్తా డు. ఆ శవాన్ని స్నానం చేయించి
పూజ చేస్తా డు. తరువాత ఆ శవానికి అతడికీ ఇరవై నిమిషాలపాటు వాగ్వివాదం జరుగుతుంది.

శవం అతడిని దగ్గరకు చేరనీయదు క్షుద్రశక్తు లమీద ఆధిపత్యం సంపాదించిన మంత్రగాడు మాటల్లో
మభ్యపెట్టి శవం కాలు పట్టు కుంటాడు. పాదం దగ్గర వున్న "బచనిక" అన్న నరాన్ని సన్నటి ఇనుప రంపంతో
కత్తిరిస్తా డు. అప్పుడు అది మరణిస్తుంది.

ఈ మొత్తం ప్రయోగాన్ని "పాతాళకుట్టి" అంటారు.

* * *
"మే ఐ కమిన్"

డాక్టర్ వెంటక్ తలెత్తి "యస్. ఎవరు మీరు"అన్నాడు.

"మీరు సైకాలజిస్టు కదా, నేనెవరో చెప్పుకోలేరా!"

అతడు అర్ధంకానట్టు చూసేడు. ఆమె నవ్వి కేకు ముక్కవున్న చేతిని ముందుకు సాచింది.

"ఓ......తులసి" అన్నాడు "హేపీ బర్త్ డే టూ యూ."

"థాంక్స్" అందామె కూర్చుంటూ. "అమ్మ చెప్పింది.........మీరు కొత్తగా వచ్చేరట కదా. విష్ యూ హాపీ
ప్రాక్టీస్ డాక్టర్."

"థాంక్యూ" అని డాక్టర్ అటూ ఇటూ చూసేడు.

"ఏమిటి చూస్తు న్నారు?"

"పుట్టినరోజు బహుమతిగా ఏమివ్వాలా అని"

"అబ్బెబ్బె........ఏమీ వద్దు డాక్టర్" అంది తులసి నొచ్చుకుంటూ. "దానికోసం కాదు నేను కేకు తెచ్చింది."

ఆ మాటలు పట్టించుకోకుండా అతడు అటు ఇటూ చూసేడు. బల్లమీద పాకెట్ లో చుట్టి వుంది. అది తీసి
అందించేడు.

"ఏమిటది?"

"మస్కిటో రిపెల్లర్ దోమల్ని ప్రారదోలేది"

ఆమె విప్పి చూసి "ఎలా?" అంది.

"అస్ట్రా సానిక్ ధ్వని తరంగాలద్వారా సెకనుకి ఇరవై వేల తరంగాలకన్నా ఎక్కువ వేగంతో వచ్చే తరంగాల్ని
అల్ట్రా సానిక్ వేవ్స్ అంటారు. అవి మనం వినలేం. దోమలు విని భరించలేక పారిపోతాయి"

"ఇరవై వేలు దాటితే అల్ట్రా సానిక్ - ఇరవై లోపులో అయితే ఇన్ ప్రాసానిక్" అని ఆగి...... తులసి సాలోచనగా
"ఇరవైకన్నా తక్కువ తరంగాల్ని మనిషి గొంతు సృష్టించలేదా" అన్నది.

"లేదు"

"కొన్ని ప్రత్యేకమైనా అక్షరాలు, హ్రీం హ్రీం అన్నవి ఇరవై కన్నా తక్కువ తరంగాల్ని సృష్టించగలిగితే అది ఎదుటి
మనిషిని చంపుతుందా....... ఇన్ ప్రాసానిక్ వేవ్స్ ద్వారా"

డాక్టర్ నవ్వి "క్షుద్రశక్తు ల్ని నమ్ముతున్నావా నువ్వు" అని అడిగేడు.

"లేదు లేదు నెవ్వర్" అంది తులసి. "హేతువాదం గురించీ మా అమ్మ ఇలానే వాదిస్తుంది" అని నవ్వింది.
అంతలోనే జ్ఞాపకం వచ్చినట్టు లేచి "పార్టీకి టై మ్ అయిపోయింది డాక్టర్. ముందు మీకు స్వీట్ ఇవ్వాలని
యింకా నేను కొయ్యకుండానే పట్టు కొచ్చేను" అని వెళ్ళబోయింది.

"నీ ప్రెజెంటేషన్" అన్నాడు ఆమె పాకెట్ తీసుకుంది." ఇంకోసారి థాంక్స్ చాలా విలువైనది ఇచ్చారు"
"విలువైనది కాదు. నూట యాభై రూపాయలు మాత్రమే."

ఆమె వెల్ళిపోయింది. స్ప్రింగ్ డోర్స్ ఆమె వెనుకే మూసుకుపోయాయి.

19
పార్టీ బాగా జరిగింది. అందరూ వచ్చేరు. శ్రీధర్ ఒక్కడే లేడు. అయితే శారద దాన్ని బయటపడనివ్వలేదు
ఇంకో పదిరోజుల్లో వచ్చే స్తు న్నాడన్న సంతృప్తి .

పార్టీలో పెళ్ళి ప్రసక్తి వచ్చింది.... తెచ్చింది అబ్రకదబ్రయే.

తులసి వంగి కేకుముక్కలు కోస్తూంటే చెవిదగ్గర రహస్యంగా "ఇరవై ఒకటో సంవత్సరంలో పెళ్ళి చేసుకోవటం
అదృష్టం అని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. ఎందుకో తెలుసా?" అన్నాడు. తులసి చురుగ్గా కళ్ళెత్తి "ఎందుకు"
అంది.

"రెండుకన్నా ఒకటి తక్కువది. రెండుకి ఎడమవైపు వుంటుంది. ఆ సంవత్సరంలో పెళ్ళి చేసుకుంటే


మొగుడు 'ఒకటి' అంకెలాగా తుపుహ్హా వుంచాజు, రానీ 2 కి అణిగి మణిగి వుంటాడు. ఇంకే సంఖ్యకీ ఇది
లేదు."

"20 లో చేసుకుంటే మరీ మంచిదిగా" పండిత్ అడిగేడు.

"అప్పుడు మొగుడు వ్యక్తిత్వం సున్నా అవుతుంది."

అందరూ ఘొల్లు మన్నారు. అప్పటికే తులసి మొహం బాగా ఎర్రబడింది. "నేనసలు పెళ్ళి చేసుకోను" అంది
రోషంగా.

"ఆ వయసులో అందరూ అలా అన్నవారే" అన్నాడు డాక్టర్ పార్ధసారధి.

"నా స్వానుభవంమీద చెబుతున్నాను. పెళ్ళి చేసుకున్న మొగాడికన్నా చేసుకని వాడు మూడు వందలా
అరవై అయిదు రెట్లు అదృష్టవంతుడు" అన్నాడు జయదేవ్.

"నేనన్నది ఆడవాళ్ళ సంగతి" అన్నాడు డాక్టర్" విజ్ఞానంలో ప్రగతి సాధించటం సైన్సు - వీటన్నిటికన్నా తన
సంసారాన్ని సరిగ్గా చూసుకోవటం, పిల్లల్ని కనటం -వీటిలో ఎక్కువ సంతృప్తి లభిస్తుంది స్త్రీకి."

మిగతా వాళ్ళకి వినబడకుండా అబ్రకదబ్ర పార్ధసారధితో "పిల్లల్ని కనటం సైన్సులో ఏ భాగం గురూగారూ!
ఫిజిక్సా -కెమిస్ట్రీనా -జువాలజీనా అని అడిగాడు. పార్థసారధిని ఏడిపించటం అబ్రకదబ్ర దినచర్లలో ఒకటి.
ఇతడిక్కడ ఇలా సంతోషంగా జోకులేస్తూంటే అక్కడ అతడి భార్య పక్కమీద అటూ ఇటూ పొర్లు తూంది."

ముందామెకి బాగా దాహం వేసింది. వెళ్ళి తాగింది. అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ దాహం వేసింది.
అరగంటలో తను దాదాపు పదిహేను గ్లా సుల నీరు తాగటం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. వచ్చి పడుకున్నాక
కొంచెం సేపటకి కుడివైపు పక్కటెముకల క్రింద భగ్గుభగ్గున ఏదో మండుతున్న భావన ఆమె పళ్లు బిగించి బాధని
అముచుకొంది. ఆ తరువాత అయిదు నిముషాలకి ఓ చిత్రం జరిగింది. నోట్లోకి లాలాజనం విపరీతంగా
రాసాగింది. ఆమె పక్కమీద నుంచి లేవబోయింది. కానీ ఏదో అదృశ్యశక్తి నొక్కి పెట్టినట్టు నిస్త్రా ణతో లేవలేక
పోయింది. చాలా బలవంతం మీదలేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. కల్ళు తిరిగేయి.
మోచేతుల దగ్గిర సూదులతో పొడుస్తు న్న బాధ. అతి బలవంతం మీద మరో అడుగువేసి కుప్పగా
కూలిపోయింది. అదే సమయానికి దార్కా మొదటి అంకం పూర్తి చేసి స్మశానంలో రెండో వాయువు
ప్రయోగానికి సిద్దపడ్డా డు.

..........

"వెధవ జోకు లెయ్యకు" అన్నాడు పార్ధసారధి.

"ఏది జోకు? పిల్లల్ని కనటమా -సైన్సా" అడిగాడు అబ్రకదబ్ర.

శారద ఐస్ క్రీమ్ తీసుకురావటం కోసం లోపలికి వెళ్ళింది. ఈ సంభాషణ వింటున్న తులసి మొహం
క్రమక్రమంగా పాలిపోవటం అక్కడెవరూ గమనించలేదు. ఆమె పెదవులు ఎందుకో సన్నగా వణుకుతున్నాయి.
భయంతో వేళ్ళ చివర్లు కంపిస్తు న్నాయి. అస్పష్టమైన వ్యధని కళ్లు సూచిస్తు న్నాయి. ఆమె తల్లి అనుకుంటున్నది
కరెక్టే, ఆమె ఏదో బాధపడ్తూంది దేనికో......

"తులసిని చేసుకోబోయే కుర్రవాడు తెలివైనవాడూ, జీవితంపట్ల స్థిరమైన అభిప్రాయం ఉన్నవాడూ అయి


వుండాలి" అన్నాడు జయదేవ్.

అప్పుడు వినబడింది నవ్వు - తులసిది.

అతడు తులసివైపు చూసి, "ఏం నేను చెబుతున్నదానిలో తప్పేమైనా వుందా" అని అడిగేడు.

తులసి ఇంకా నవ్వసాగంది.

ఆమె మామూలుగా నవ్వటంలేదనీ, అందులో హిస్టీరియా లక్షణాలున్నాయనీ మొదట గ్రహించింది


జయదేవ్ అడుగు ముందుకేసి, "తులసీ" అన్నాడు.

తులసి తలాడిస్తూ మరింత బిగ్గరగా నవ్వసాగింది.


ఈ లోపులో ట్రేలో ఐస్ క్రీమ్ లు అక్కడికి పట్టు కొచ్చింది శారద . తులసి నవ్వుతూ వుండటం అందరూ
ఆమెవైపే చూస్తూ ఉండటం చూసి, ఆమె ఆందోళనగా "ఏమైంది" అంది. ఎవరూ మాట్లా డలేదు.

"పెళ్ళి" అంది తులసి నవ్వు మధ్య, మళ్ళీ తెరలు తెరలుగా నవ్వు - జయదేవ్ అడుగు ముందుకేసి తులసి
చెంపమీద ఫెట్ మని కొట్టేడు. ఆమె నవ్వు ఆగిపోయింది. కానీ అది ఏడుపులోకి దిగింది. చేతుల్లో మొహం
దాచుకుని ఏడవసాగింది. శారద ఆ దృశ్యాన్ని చూసి ట్రే వదిలేసింది. భళ్ళుమనే శబ్దంతో ఐస్ క్రీం కప్పులు
భ్రద్దలయ్యేయి. మళ్లీ నిశ్శబ్దం. అబ్రకదబ్ర తులసితో ఏదో అనబోయి జయదేవ్ సౌంజ్ఞతో ఆగిపయేడు.

జయదేవ్ చేతివేళ్ళు తులసి తల నిమరసాగేయి. అందులో రిధమ్ ఆమెని తాత్కాలికమయిన ట్రాన్స్ లోకి
పంపింది. అయిదు నిమిషాల తర్వాత ఆమె కళ్లు విప్పింది.

"ఎలా వుంది?" జయదేవ్ అడిగేడు.

తులసి ఆశ్చర్యంతో "ఏమైంది నాకు" అన్నది. పార్ధసారధి చెప్పబోతూ వుంటే జయదేవ్ "ఏం కాలేదు -
నిద్రొస్తుందన్నావ్" అన్నాడు.

"సారీ అంకుల్" అంది తులసి నవ్వి. "........అలా అనిపించింది"

అక్కడున్న వాళ్ళందరూ మొహమొహాలు చూసుకున్నారు.

వాతావరణాన్ని మామూలుగా మార్చటం కోసం జయదేవ్ శారద వైపు తిరిగి, "ఇంకా ఐస్ క్రీం వుందా" అని
అడిగేడు. శారద తెప్పరిల్లి "ఉంది తెస్తా ను" అని లోపలికి వెళ్ళింది.

టెన్షన్ రిలాక్సయింది. పూర్వపు వాతావరణం నెలకొంది. ఐస్ క్రీం కప్పులు బ్రద్దలయిన శబ్దంతో ఆగిపోయిన
సాలెపురుగు, తిరిగి బల్లకింద గూడుని జాగ్రత్తగా అల్లసాగింది.

* * *
శ్రీనివాస పిళ్ళయ్ కారు సత్రం ముందు ఆగింది - దార్కా గురించి వాకబు చెయ్యటం కోసం.

సత్రం గుమాస్తా జవాబు ఒకటే. "ఎక్కడో పని దొరికిందట గాంధీ స్ట్రీట్ లో అక్కడికి వెళ్ళిపోయాడు"

అయితే శ్రీనివాసపిళ్ళయ్ జయదేవ్ లా తిరిగిపోలేదు.

ఆలోచించేడు.

సిద్దేశ్వరి రూపంలో వున్నప్పుడు దార్కా అన్న మాటలు గుర్తు న్నాయి. తులసిమీద కాష్మోరా ప్రయోగాన్ని
విఫలం చేసిన వాళ్ళకోసం అతడు వెతుకుతున్నాడు. వాళ్ళు దొరికి వుంటారు ఈపాటికి. అతడికి దొరికిన పని -
అంటే వాళ్ళని చంపటం.... గాంధీ స్ట్రీటు.....

అంటే విద్యాపతి...

అతడి కారు విద్యాపతి ఇంటివైపు సాగిపోయింది. దాదాపు నాల్గు గంటలు వేచివున్న తర్వాత ఆ పరిసర
ప్రాంతంలో దార్కా కనబడ్డా డు. అయితే వెంటనే అతడిని పలకరించలేదు పిళ్ళై. అతడిని అనుసరించేడు. ఆ
మరుసిటరోజు అబ్రకదబ్ర ఇంటికి వెల్లటం అతడి భార్య వెంట్రు కలు సేకరించటం అంతా దూరంనించి
గమనించేడు.

స్మశానంలో దార్కా మొదటి అంకం పూర్తిచేసి బయటకు వస్తుంటే - కారులో వెనుకనుంచి వచ్చి ఆగి,
"హల్లో దార్కా" అన్నాడు.

దార్కా తన పేరు విని స్థా ణువయ్యేడు. అతడు సిద్దేశ్వరిని గుర్తించలేదు. అసలు ఆ రెండు రూపాలకీ పోలిక
లేదు.

"ఎవరు నువ్వు"

"నీ స్నేహితుణ్ని - ప్రయోగం బాగా జరిగిందా?"

"ఏ ప్రయోగం?"

"అబ్రకదబ్ర భార్య మీద చేతబడి"

దార్కా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పిళ్ళై నవ్వి "నేను నీ స్నేహితుణ్నని చెప్పానుగా. అందుకని వాళ్ళూ నా
శత్రు వులే. నువ్వు వాళ్ళని తొందరగా చంపు"

ఈ మాటలతో దార్కా తేరుకున్నాడు "నా పేరు మీకెలా తెలిసింది? మీరెవరు?" అన్నాడు అనుమానంగా
చూస్తూ.

"చెబ్తా ను ముందు ఇది చెప్పు తులసిమీద కాష్మోరా ప్రయోగం ఇంకా ఎన్నాళ్ళలోపు జరుగుతుంది.?"

"ఇంకా దాదాపు పదిహేను రోజుల్లో కాష్మోరా నిద్ర లేస్తుంది -ఆ తర్వాత ఏడు రోజులు"

శ్రీనివాస పిళ్లై కారు స్టా ర్టు చేసేడు. దార్కా ఏదో అనబోతూ వుంటే కారు ముందుకు సాగిపోయింది.

దార్కా నుదురు చిట్లించి అటువైపు చూసేడు. తన గురించి ఇంత తెలుసుకున్నతడు ఎవరు? మిత్రు ణ్ని
అంటాడు - మరి మిత్రు డైతే తులసిని చంపే కాష్మోరా గురించి ఎందుకు వాకబు చేసేడు? దార్కా క్షణంపాటు
కళ్ళు మూసుకున్నాడు. ఆ వ్యక్తి మొహం తన జ్ఞాపకాలలో ముద్రపడటం కోసం.......ఒక్కసారి అలా ఆ
ముద్రపడితే ఎప్పటికైనా పనికొస్తుంది అది.......

శ్రీనివాసపిళ్ళై ఇంటికొచ్చిన తర్వాత ఉత్తరం వ్రాసేడు.

"డియర్ శ్రీధర్,

"మీ హితోభిలాషుల్లో నేనొక్కణ్ని. బిస్తా నుంచి దార్కా అనే మంత్రగాడు వచ్చాడు. తులసి మీద కాష్మోరా ను
ప్రయోగించటానికి అతడు ప్రయత్నం చేస్తు న్నాడు. తులసికి అనారోగ్యం మొదలవగానే స్మశానానికి వెళితే నా
మాటలు నిజమని తెలుస్తా యి. అక్కడ క్షుద్ర దేవతల్ని ఆవాహన చేస్తూ ఆ మంత్రగాడు కనబడతాడు.
తరువాత ఏం చెయ్యాలో మీకు తలుసు. నా మాటలు నిజమని రుజువు చేయటానికి తులసికి రాబోతున్న
అనారోగ్యమే తార్కాణం త్వరపడండి......."

శారదకు రెండురోజుల తరువాత ఈ ఉత్తరం చేరింది. శ్రీధర్ పేరుమీద వచ్చే ఉత్తరాన్ని రీ డైరెక్టు చేస్తుంది
శారద సాధారణంగా కానీ శ్రీధర్ స్వదేశం వచ్చే రోజు దగ్గిర పడింది కాబట్టి వచ్చిన తర్వాత ఇవ్వొచ్చులే అని
బల్లమీద పెట్టింది. ఆ మరుసటిరోజు దాన్ని చూసిన తులసి గాలికి అది ఎగిరిపోకుండా పుస్తకాల మధ్య పెట్టింది.

* * *
అబ్రకదబ్ర ఇంటికి చేరుకునేసరికి పదిన్నరయింది. తలుపు తీసిన భారయ్తో "నువ్వు కూడా వస్తే బావుండేది.
ఆ ముగ్గురూ ఒంటరిగాళ్ళే మొత్తంమీద అందరం మొగాళ్ళమే అయిపోయాం" అన్నాడు నవ్వుతూ.

ఎప్పుడూ ప్రసన్నతతోనూ, గంభీరంతోనూ వుండే ఆమె మొహంలో ఆ రోజు అలసట. బాధ చోటు చేసుకుని
వుండటం మసక చీకట్లో అతడు గుర్తించలేదు. ఆమె ఆ రోజు తన అస్వస్థత గురించి అతడితో చెబ్దా మనుకుంది
కానీ మళ్ళీ ఇప్పుడు బాగానే వుందిగా అని సరి పెట్టు కుంది.

ఆమె వంటిల్లు సర్ది వచ్చేసరికి, బ్రాహ్మిణ్ పడుకొని వున్నాడు. ఆమె పక్క మంచంమీద దిండు సర్దు కొంది.
చాలా సేపు నిశ్సబ్దం తర్వాత -ఆలోచన్ల మధ్య భంగం కలిగినట్లు కదిలి "ఏమండీ" అన్నది. అతడు పక్కకు
తిరిగాడు.

"నేనోసారి మా నాన్నగార్ని అమ్మనీ చూసి వద్దా మనుకుంటున్నాను"

అతడు విచలితుడై "ఎందుకింత అకస్మాత్తు గా యీ కోర్కె పుట్టింది" అన్నాడు ఆమె మాట్లా డలేదు. అతనే
అన్నాడు, "నువ్వు వెళ్ళిపోతే ఎలా? వాళ్ళనే రమ్మని వ్రాద్దాంలే."

దీనికి ఆమె మౌనం వహించింది. మళ్ళీ ఆలోచన ........నిశ్శబ్దం.......దాన్ని కదిల్చి భంగపరుస్తూ సన్నటి
స్వరంతో "ఏమండీ, నేను అకస్మాత్తు గా చచ్చిపోతే మీరేం చేస్తా రు" అనడిగింది.

నెమ్మదిగా - కానీ స్పష్టంగా వినబడిన ఆ ప్రశ్నకు మగత నిద్రలోకి జారుకుంటున్న బ్రాహ్మిణ్ ఉలిక్కిపడి కళ్ళు
విప్పేడు.

"నీకేమైనా మతిపోయిందా. పడుకో పడుకో" అన్నాడు.

ఆమె కల్ళు మూసుకుంది. ఆమెకు తెలుస్తూంది. మృత్యువు ఒక వేపునుంచి కబళించటానికి


రాబోతూందని. చదువుకునన వాళ్ళు సిక్త్ సెన్స్ అంటారు. విజ్ఞులు ఇ.ఎస్.ప్పీ. అంటారు. అవేమీ తెలియవు
కానీ మృత్యువు రాబోతూంది. అది తెలుస్తూంది.

ఆమె కళ్ళు విప్పి భర్తవైపు చూసింది. నిర్మలంగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అతడు. తను వెళ్ళిపోయాక
ఇతడు ఒక్కడూ శేషజీవితాన్ని ఎలా గడుపుతాడు? ఎప్పుడూ నవ్వుతూ తృళ్ళుతూ తేలిగ్గా జీవితా్ని
గడుపుకొనే ఇతడికి - తనులేని లోటు ఎంత భరించలేనిదవుతుందో తనొక్కదానికే తెలుసు.

అతడికి నిద్రాభంగం కలుగుతుందా, నుదుటిమీద వెంట్రు కలు వెనక్కి జరిపి సుతారంగా ముద్దు పెట్టు కుంది
- ఆర్తితో, ఆప్యాయతతో, వేదనతో.

తల్లి బిడ్డని పెట్టు కొన్నట్టు ........

అదే సమయానికి తన గురువుకిచ్చిన ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసం దార్కా, ఒక పవిత్రమైన ఆలయాన్ని ధ్వంసం
చేస్తు న్నాడని తెలుసుకోకుండా, తన పనిలో నిమగ్నమై వున్నాడు.

* * *
రాత్రి పదకొండు కావొస్తుంది. శారదకు నిద్రపట్టటం లేదు.

కొబ్బరి ఆకు కిటికి అవతల్నుంచి కదులుతున్న సవ్వడి తప్ప వాతావరణమంతా ప్రశాంతంగా వుంది.
బ్రహ్మాండమైన తుఫాను వచ్చే ముందు అలాగే గాలి ప్రశాంతంగా వుంటుంది. ఇరుపక్షాలూ రణరంగంలో
మోహరించి ఉన్నప్పుడు -యుద్దం ప్రారంభమయ్యే ముందు కొంచెం సేపు అలాగే వుంటుంది.

ఆ స్థబ్దతలో -ఆ నీరసంలో అప్పుడు ఆమెకు కనబడింది శ్రీధర్లేని లోటు. తొందరగా వచ్చేస్తే బావుణ్ను -
తొందరగా వచ్చేస్తే బావుణ్ను అనుకుంది.

"వచ్చేస్తా ను"

ఆమ ఉలిక్కిపడింది.
చిన్న నవ్వు వినిపించింది ".........వచ్చేస్తా నన్నాగా"

శారద వేళ్ళు భయంతో దుప్పటి కొసల్ని పట్టు కున్నాయి. తల తిప్పి చూసింది.

పక్క మంచంమీద తులసి పడుకొని వుంది. ఫిరమిడ్ లో మమ్మీలా చేతులు సాచి వెల్లకిలా పడుకొనివుంది.
కిటికీలోంచి పడుతూన్న వెన్నెల వెలుతురులో తులసి మొహం రక్తం అంతా ఎవరో పీల్చేసినట్టూ తెల్లగా
పాలిపోయి వుంది. సమాధిలో శవంలా ఆమె శరీరం నిశ్చలంగా వుంది. కానీ గొంతులో నుంచి
మాటలొస్తు న్నాయి. సన్నటి నవ్వు కూడా వినబడుతూంది.

కూతుర్ని లేపటానికి వంగిన శారద చెయ్యి అలాగే మద్యలో ఆగిపోయింది.

తులసిలో కదలిక లేదు. అయితే ఎప్పుడు విప్పుకుందో తెలీదు గానీ, వెంట్రు కలు పక్కంతా చిందర
వందరగా పడున్నాయి శారద నిస్చేష్టు రాలయింది అందుక్కాదు.

తులసి వెంట్రు క కొసర్లు -చివరి అంగుళం మేరా, ప్రాణం వచ్చినట్లూ కదులుతున్నాయి. శరీరమంతా
నిశ్చలంగా వుంది. గాలికూడా లేదు వెంట్రు కలు కదలటానికి. కానీ కొసర్లు మాత్రం బురదలో పురుగులు
వికవికలాడుతున్నట్లు కదులుతున్నాయి. ఆ దృశ్యం ఎంత భయంకరంగా వుందంటే శారద నోట కెవ్వుమన్న
సబ్దం కూడా రాలేదు.

20
"అయితే దేవుడూ దెయ్యం ఇవేమీ లేవంటావ్" అనడిగేడు వెంకట్ నవ్వుతూ.

తులసి తల అడ్డంగా వూపుతూ.... "లేవు. ఇవన్నీ తెలివి అయిన వాడు తెలివి తక్కువవాడ్ని దోచుకోవటానికి
చేస్తు న్న మోసాల్లో కొన్ని."

శారద ఇద్దర్నీ చూస్తూంది. క్రితంరోజు రాత్రి జరిగిన సంఘటన తులసి హిస్టీరికల్ గా నవ్వటం, ఏడవటం
అంతా ఆమె సైక్రియాటిస్ట్ కి చెప్పింది. ఆ మరుసటిరోజే అతడు ట్రీట్ మెంట్ మొదలుపెట్టా డు.

వెంటనే సమస్యల్లోకి వెళ్లకుండా రోగిని సంభాషణలో పెట్టడం శారద గమనించింది.

"మామూలుగానే సైన్స్ చెప్పే "శరీరం" "మనస్సు" కాక శరీరంలో మూడో శక్తి వుందని మన ఋషులు కొన్ని
వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నారు. తీగెల్లో కరెంటు ప్రవహించినట్లు శరీరంలో ఒక రకమయిన శక్తి
ప్రవహిస్తూ వుంటుంది. దీన్ని "కి" అంటారు దీన్ని పాశ్చాత్యులు నమ్మరు. వారు శరీరమంతా నెర్వస్ సిస్టం
ద్వారా కంట్రోల్ చెయ్యబడుతూందని భావిస్తా రు. ధర్డు డెమెన్షన్ లో వీటన్నిటికన్నా అతీతంగా ఒక ద్రవం కరెంట్
లా శరీరమంతా శక్తిని ప్రవహింప చేస్తుందని మన ఋషులు నమ్మేవారు. చైనావారు దీన్ని మెరీడియన్ అన్నారు.
ఈ మెరిడియన్ ని కంట్రోల్ చెయ్యటంద్వారా వ్యాధుల్ని నయం చేయవచ్చని చైనీస్ వైద్యశాస్త్రం నిరూపించింది.
దాన్ని "ఆక్యూపంక్చర్" అన్నారు. తులసి విస్మయంగా అతడివైపు చూసింది. అతడు బొమ్మను చూపించేడు."

The large Intestine Meridian

చూపుడు వేలునుంచి ప్రవహించే కరెంటు పెద్ద ప్రేవుల్లోకి వెళుతుందని నిరూపించబడింది బొమ్మలో. ప్రోపుల్లో
వ్యాధిని చూపుడు వేలూ, బొటనవేలూ మధ్యలో సూది గుచ్చటంద్వారా తగ్గించవచ్చు నని డాక్టర్లు (చైనీస్)
నిరూపించేరు కూడా. అయినా పాశ్చాత్యదేశపు డాక్టర్లు దీన్ని విశ్వసించరు. దీన్నిబట్టి ఏం తెలుస్తుంది? సైన్స్
నిరూపించలేని విషయాలు చాలా వున్నాయి. సైన్స్ కి, మానవాతీత శక్తు లకి జరిగే సంఘర్షణలో ఒక
విధమయిన రాజీ అప్పుడప్పుడు కనబడుతుంది:"

తులసి విసురుగా కుర్చీలోంచి లేచి నిలబడి........ "మనిషికి, మనిషికి మధ్య ఆర్ధిక అసమానత
తొలగిపోయినరోజు ఈ దేముడూ దెయ్యాల ప్రసక్తి రాదు. మతం, దేముడూ ఇవన్నీ మనిషిని నొక్కిపట్టి
వుంచటానికి చేసే ప్రయత్నాలు కాపిటలిస్టు వ్యవస్థలో......."

వెంకట్ అడ్డు పడి, నేను సైన్స్ గురించి మాట్లా డుతూ వుంటే నువ్వు ఎకనామిక్స్ గురించి
మాట్లా డుతున్నావు.

తులసి మరింత రోషంతో....... "ఆర్ధికంగా బాగుపడటం కోసం మనిషి సైన్స్ ని వాడుకుంటున్నాడు" అని
అరిచింది..... "గుడ్డలమీద భాస్వరం జల్లు తాడు అయిదు నిమిషాల తర్వాత అవి అంటుకొని బట్టలు
తగలబడటం చూసి, అమాయకులయిన గ్రామస్థు లు భయంతో వణికిపోతారు. మంత్రగాడికి మొక్కుబడులు
చెల్లిస్తా రు"

"కానీ నేను చెబుతున్నది................"

"నేను చెబుతున్నది ఇంకా పూర్తికాలేదు" అంది తులసి ఆ కంఠంలో వున్నధీమాకి శారదే కట్రాట అయింది.
తులసి అన్నది...... "అంజనం పేరిట అద్దా నికి మసి పూస్తా డు మంత్రగాడు. మీ పోయిన వస్తు వు ఎవరు తీసేరో
అద్దంలో చూపిస్తా నంటాడు. ఒక పాపని కూర్చోపెట్టి నీకో బొమ్మ కనబడుతుంది చూడు. బొమ్మ
కనబడుతుంది చూడు అని అంటాడు. ఆ మాటలకి హిప్నటై జ్ అయిన చిన్న పాపకి నిజంగానే అద్దంలో బొమ్మ
కనబడుతుంది. అక్కణ్నుంచి యిక అంతా తనే చెబుతాడు. అది వాళ్ల పనిమనిషి కదా అంటాడు. పెరట్లో తవ్వి
పాతిపెట్టింది కదా అంటాడు. హిప్నటై జ్ అన్నంత పెద్ద పదం ఆ మంత్రగాడికి తెలియకపోవచ్చు. కానీ తన
కంఠానికి పాప కంట్రోల్ అయిన విషయం తెల్సు. తనేం చెపితే పాపకి అంజనంలో అది కనబడుతుందన్న
విషయం తెలుసు. చుట్టూ వున్నవాళ్ళు మాత్రం పాప "బొమ్మ కనబడుతుంది" అనగానే విభ్రాంతులు
అయిపోతారు. మంత్రగాడే తర్వాత పాపకి సూచనలిస్తు న్న విషయం పట్టించుకోరు.

........ఏదీ నేనో వస్తు వు పారేసుకుంటాను. అంజనం వేసి వెతికి చెప్పమనండి చూద్దాం" సవాలు చేసినట్టు
అంది.
ఆమె మాట్లా డటం ఆపగానే ఆ గదిలో నిశ్శబ్దం కూడా అదోలాటి ఆవేశాన్ని సంతరించుకుంది. శారద
కూతురివేపు అబినందన పూర్వకంగా చూసింది. ఎంత ఎదిగిపోయింది తులసి!

కూతురి భావాలతో తను ఏకీభవించకపోవచ్చు. దేముడిపట్ల తన ఆలోచనలు వేరే విధంగా వుండొచ్చు -


కానీ ఆ మాటల్లో వున్న నిజాయితీ -తను నమ్మిన భావంపట్ల వున్న సిన్సియారిటీ, హేతువాదం, ఆవేశం అన్నీ
ఎంత ముచ్చటగా వున్నాయి.

అంతలో తులసి అంది..........

".......నాకున్న పరిధిలో నేను మామూలు మంత్రగాళ్ళ మోసాలు బయట పెడుతూంటే నాకు తెలియని
సుషుమ్న కుండలిని గురించి చెబుతారెందుకు? నన్నెవరూ అర్ధం చేసుకోరేం -అర్ధం చేసుకోరేం - అంటూంటే
గుండెలోంచి దుఃఖం తన్నుకొచ్చింది .మొహం చేతుల్లో కప్పుకొని ఏడవసాగింది. ఒక్కసారిగా ఆమెను
భరించలేనంత నిస్సహాయత ఆవరించింది. యుద్దంలో అన్ని వైపులనుంచీ శత్రు వులు చుట్టు ముడుతుంటే
ఒకటై పోయింది. ఒంటిరతనంతో దుఃఖం తెంచుకుంది. చూస్తూన్న శారద మనసంతా కూతురిపట్ల జాలితో
నిండిపోయింది. చప్పున కూతురి దగ్గరికి వెళ్ళబోయింది. వెంకట్ సంజ్ఞచేసి ఆపు చేశాడు. సమ్మెట దెబ్బ
వెయ్యటానికి ఇనుమును బాగా కాలుస్తు న్న కమ్మరిలా వున్నాడు.

"నువ్వు దేముణ్ని నమ్ముతున్నావ్ తులసీ. మానవాతీత శక్తు ల్ని కూడా నమ్ముతున్నావ్. నీ తండ్రీ తల్లీ
ఇద్దరూ వాటిని నమ్మినవారే. నీ రక్తంలోనే అది జీర్ణించుకుపోయింది. తర్వాత సిద్దేశ్వరి మీద నువ్వు సాధించిన
విజయం నిన్ను చాలా ఎత్తు కు తీసుకెళ్ళింది. ఒకవేపు అస్థికత్వం, మరోవేపు నాస్థికత్వం, రెండు పరస్పర
విరుద్దమయిన భావాల ఘర్షణ నీ మనసులో అనుక్షణం కదులుతూ నిన్ను బాధ పెడుతున్నాయి. అది స్కైజో
ప్రెన్నియాలోకి దిగబోతూంది."

వింటూన్న శారద ఉలిక్కిపడింది.

తులసి అతడివేపు అయోమయంగా చూసింది.

"నువ్వు పక్కరూములో పడుకో" అని తులసితో అన్నాడు. ఆమె వెళ్ళిపోయాక అతడు తన రాక్ లోంచి ఒక
ఇంజక్షన్ సిరంజ్ తీశాడు.

"తులసి మనసులో ఏదో వుంచుకుని బాధపడుతూంది. అది ఏమిటో బయటకు తియ్యాలి" అతడు రాక్
లోంచి చిన్న సిసాతీసేడు.

"ఏమిటిది?" శారద అడిగింది.

"పెంటధాల్" అన్నాడు వెంకట్. "మన మనసులోని విషయాలను బయటకు తీసుకొస్తుంది.చూద్దు రుగాని


రండి" అంటూ లోపలికి వెళ్ళాడు. శారద అతడిని అనుసరించింది. లోపల తులసి పడుకొని వుంది. సిరెంజ్
లోకి 500 మిల్లీగ్రాముల పెంటథాల్ ని డిస్టిల్ వాటర్ తో తీసుకున్నాడు. తులసి చేతిని వెనక్కి తిప్పి ఇంట్రావీనస్
ఇచ్చేడు.

నిముషం గడిచింది.

అతడు సూదిని రక్తనాళంలోంచి బయటకు తీయక పోవటాన్ని శారద విస్మయంగా చూసింది. అది
గమనించి అతనన్నాడు, "మనకి సమాచారం కావల్సినంతసేపూ ఈ ఇంజక్షన్ ఇస్తూనే వుండాలి. పెంటథాల్
రక్తంలో కలుస్తు న్నంతసేపూ రోగి సుషూప్తిలోకి వెళ్ళి మనసులోని భావాల్ని బయట పెడ్తుంది. తనేం చెబుతున్నది
రోగికి తెలీదు"

సైన్సు ఎంతగా ముందుకెళ్ళిందీ చూస్తుంటే శారదకి ఆశ్చర్యం గానూ అయోమయంగానూ వంది. కానీ
ఇదంతా కళ్ళముందు జరుగుతూ వుంటేలేదని ఎలా అనగలగటం? ఇంకొంతకాలం పోతే కోర్టు లూ అవీ
వుండవన్న మాట. (పెంటథాల్ మత్తు లో నేరస్థు డు చెప్పిన విషయాల్ని నిజాలుగా తీసుకునే హక్కు
న్యాయశాస్త్రా నికి కలిగిస్తే చాలు)

తులసి కళ్ళు మూతలు పడటాన్ని ఆమె గమనించింది.

"నీ పేరు" అడిగేడు. తులసి జవాబు చెప్పలేదు. ఆమె పూర్తిగా నిద్రలోకి జారిపోకుండా తట్టిలేపుతూ, "నీ
పేరూ"అన్నాడు మళ్ళీ.

"తులసి"

"ఏం చదువుతున్నావు?"

చెప్పింది.

"నాన్నగారి పేరు?"

"శ్రీధర్"

"అమ్మ"

"శారద"

"నీకు నాన్న ఎక్కువ ఇష్టమా........అమ్మంటేనా........."

"నాన్నంటే........"
శారద మొహంలో చిరునవ్వు. కూతురి ఆప్యాయతని కూడా భర్తకి ఇచచేయటంలో వున్న తృప్తి.

"సినిమాలు బాగా చూస్తా వా........"

"చూస్తా ను"

"నీ ఫేవరేట్ ఆక్టరెవరు?"

"అమితాబచ్చన్"

"నవలలు చదువుతావా?"

"చదువుతాను"

"ఇంగ్లీషా - తెలుగా"

"అన్నీ"

"ఇంగ్లీషులో నీ అబిమాన రచయిత ఎవరు?"

చెప్పింది.

"తెలుగులో"

చెప్పింది

వింటున్న శారదకి, అతడు డైరెక్టు గా సబ్జెక్టు లోకి వెళ్ళకుండా ఉపోద్ఘాతంతో మొదలుపెట్టటం గమనించింది.

"ఏం ఆటలు నీకిష్టం?"

"క్రికెట్"

"నువ్వాడతావా"

"ఆ! కాలేజీలో"

"నువ్వు బాట్స్ మన్ వా......బౌలర్ వా?"


"బాట్స్ మన్"

"ఆడవాళ్ళని బాట్స్ మన్ అంటారా బాట్స్ వుమన్ అంటారా?"

....................

"నిన్న ఎన్ని రన్స్ కొట్టేవు"

"ఆడలేదు"

"ఎంతకాలం నుంచి ఆడటంలేదు"

"పదిహేన్రోజుల్నుంచి"

"ఎందుకు"

.........మౌనం

"ఎందుకు ఆడటంలేదు"

....మౌనం

వెంకట్ ఆమెని తట్టిలేపుతూ "ఎందుకు" అని రెట్టించాడు. ఆమె నుంచి సమాధానం లేదు అతడు ప్రశ్న
మార్చేడు.

"నీకు దేముడంటే నమ్మకం వుందా?"

"లేదు"

"నిన్ను రాత్రొక కలొచ్చింది నీకు"

"అవును"

"ఏం కల"

.......మౌనం

శారదొక విషయం గమనించింది. సైకాలజిస్టు పేషెంటు నుంచి ఒక పదమే సమాధానంగా వచ్చేటట్లు ప్రశ్నలు
ఫ్రేమ్ చేస్తు న్నాడు. అంతకన్నా పెద్ద వివరణ ఇవ్వవలసి వచ్చినట్లయితే పేషెంటు మౌనం వహిస్తుంది.

"రాత్రి కలలో ఎవరు కనబడ్డా రు నీకు?"


పూర్తిగా నిద్రలోకి జారకుండా తట్టిలేవుతూ.......... "ఎవరు వచ్చేరు కలలోకి" అని రెచ్చించాడు.

"సదానంద చక్రవర్తి"

"ఎవరతను?"

"సిద్దేశ్వరి శిష్యుడు"

వింటున్న శ్రోతలిద్దరికీ షాక్ తగిలినట్టయింది.

తులసి రక్తనాళంలోకి ఒక్కో చుక్కే పెంటథాల్ ప్రవహిస్తుంది. సిరెంజిని మరికొద్దిగా నొక్కుతూ "చక్రవర్తి
ఎక్కడున్నాడు" అని అడిగేడు.

"ఆకాశంలో"

"ఏమన్నాడు?"

"రమ్మన్నాడు"

శారదకి తులసి నిద్రలో 'వచ్చేస్తు న్నాను' అని అనటం గుర్తొచ్చింది. అయితే సదానంద కలలోకి రావటం
ఏమిటి? ఆమె ఆలోచిస్తూ ఉండగానే అతడు మరోప్రశ్న వేసేడు.

"చక్రవర్తి ఇప్పుడెక్కడ వున్నాడు?"

"చచ్చిపోయాడు"

"నువ్వుచూసేవా?"

"చూసేను"

"అందుకేనా నీకు భయమేస్తూంది?"

......................

"అందుకేనా నువ్వీ మధ్య దిగులుగా వుంటున్నావు?"

...................

"ఎందుకు బాధపడుతున్నావు నువ్వు?" మరోచుక్క పెంటథాల్ ని పంపుతూ అడిగేడు. తులసి పెదవులు


కదిలేయి. జవాబు రాలేదు. వెంకట్ తలెత్తి శారదతో, "మీరు కాస్త బైట కూర్చొంటారా" అని అడిగేడు. ఆమె
బయట విజిటర్స్ రూమ్ లోకి వచ్చేసింది.
శారద మనసంతా అదోలా వుంది. ఏం జరుగుతూంది తన కూతురికి? ఇంత ఆప్యాయతతో చూసుకునే
తల్లిదండ్రు లూ, మంచి ఆరోగ్యం డబ్బూ వున్న అమ్మాయికి మానసిక వ్యధ ఏమిటి? ఆమె ఆలోచన్లలో
వుండగానే లోపలినుంచి మాటలు వినిపించాయి. అయితే గోడ అడ్డు వుండటంవల్ల అవి స్పష్టంగా వినిపించడం
లేదు.
"నీ...........గ్యం...........లేదా" వెంకట్ కంఠం.

తులసి జవాబు వినిపించలేదు.

"ఎంత నుంచి"

...............

"-నెల"

"కాదు" తులసి కంఠం

"పదిహేను రోజులు"

తులసి జవాబు వినిపించలేదు.

"ఏమైంది.-"

తులసి ఏదో జవాబు చెప్పింది. అది విని వెంకట్ "వ్వాట్" అని ఎంత గట్టిగా అరిచేడంటే., బయట కూర్చున్న
శారద ఒక్క గెంతులో లోపలికి వెళ్ళటానికి ఉద్యుక్తు రాలైంది. అంతలోనే ఏదో వస్తు వు పడిపోయిన చప్పుడు
అయింది.

శారద లోపలికి ప్రవేశించేసరికి వెంకట్ గోడకి ఆనుకొని నిలబడి వున్నాడు. చేతిలో సిరెంజి నేలమీద
బ్రద్దలయింది. తులసి చేతినుంచి రక్తం స్రవిస్తూంది.

శారద చూస్తూంది వాటిని కాదు.

పక్కమీద తులసి కూర్చొని వుంది. ఆమె కళ్ళు మూతబడి యోగముద్రలో వున్నట్టు వున్నాయి. ప్రార్ధన
చేస్తు న్నట్టు బాసింపెట్లు వేసుకుని కూర్చుంది. ఆమె నాలుక బాగా ముందుకొ్చ్చి, మళ్ళీ మళ్ళీ లోపలికి
మడతపడి వెళ్ళింది ఖేచరిలోలా......

నేలమీద పెంఠథాల్ ద్రవం నెమ్మదిగా పారుతూంది.

* * *
ఫోన్ మోగింది, జయదేవ్ అందుకున్నాడు.

"హౌ ఆర్యూ ప్రొఫెసర్?"


జయదేవ్ చెయ్యి ఫోన్ మీద బిగుసుకుంది. అవతలి కంఠం తాపీగా వినిపిస్తూంది.

జయదేవ్ చిన్న కాగతం మీద ఏదో వ్రాసి పండిత్ కి చూపించాడు. పండిత్ బయటకు పరుగెత్తా డు.
అప్పటివరకూ అవతల్నుంచి వస్తు న్న మాటలు వింటున్నవాడిలా "ఊఁ చెప్పు" అన్నాడు జయదేవ్.

"నువ్వు బాగా డిటెక్టివ్ నవలలు చదువుతావా జయదేవ్?"

"ఏం?"

"మధ్యలో కొంచెం సేపు మాట్లా డలేదు. అంటే - టెలిఫోన్ ట్రాప్ చెయ్యమని నీ పక్కనున్న మనిషికి వ్రాసి
ఇచ్చావన్నమాట. కానీ -సారీ నీ చౌకబారు డిటెక్టివ్ పరిజ్ఞానం ఆటోమాటిక్ గా టెలిఫోన్ ఎక్స్చేంజి సిస్టంలో
పనికిరాదు" మళ్ళీ నవ్వు.

"నవ్వుతూ రక్తం తాగేవాడే కావచ్చు. శత్రు వే కావచ్చు . కానీ ప్రత్యర్ధి చాలా తెలివయినవాడు. ఆ విషయం
వప్పుకోవాలి" అనుకున్నాడు జయదేవ్. అంతలో మళ్ళీ పిళ్ళయ్ కంఠం వినిపించింది.

"నిన్ను చంపబోయే ముందు నీకింకొంచెం మానసిక ఘర్షణ పెడదామనుకుంటున్నాను. నీకు కాష్మోరా


గురించి తెలుసా?"

జయదేవ్ ఉలిక్కిపడ్డా డు "కాష్మోరా?"

"తంత్రశాస్త్రంలో కాష్మోరా గురించి వ్రాసివుంది. పదకొండు సంవత్సరాల తర్వాత లేచి అది తిరిగి
ఆవహిస్తుందట. అంటే సరీగ్గా పది -పదకొండు రోజుల్లో తులసిని కాష్మోరా పట్టు కోబోతుందన్న మాట. ఆ
తరువాత ఏడు రోజులకి తులసి మరణిస్తుంది."

"నాన్సెన్స్" అన్నాడు జయదేవ్. "నేను నమ్మను"

"నువ్వు నమ్మవు. అదే నాక్కావల్సింది" అన్నాడు పిళ్ళయ్ అటు నుంచి రోజు రోజుకీ తులసి
కృశించిపోతూంటే దానికి నువ్వు సైంటిఫిక్ గా కారణాలు వెతుకుతావు. నేను చెప్పాను కాబట్టి యిప్పుడది
కాష్మోరా అని నీకు తెలుసు. కానీ దాన్ని నువ్వు నమ్ముతున్నావంటే అందరూ నవ్వుతారు. నీ పని బోనులోపడ్డ
ఎలుకలా అవుతుంది. నీ కళ్ళముందే తులసి మరణిస్తుంది. అంతదాకా నువ్వు బ్రతికివుంటే......" నవ్వేడు.
"కాష్మోరా గురించి బయటికి కక్కలేవు. మనసులో ఉంచుకోలేవు"

జయదేవ్ పళ్ళు బిగించి "కాష్మోరా పేరుతో నువ్వు మళ్ళీ ఏదయినా" అనపోతూ వుంటే పిళ్ళయ్ అడ్డు
పడ్డా డు.
"అప్పుడంటే లక్షల ఆస్తికోసం చెయ్యవలసి వచ్చింది ఇప్పుడా అవసరం నాకు లేదు. మీరంతా బాధతో
చూస్తుంటే చూస్తూ నవ్వుకోవటమే........."

అవును తులసిని చంపే అవసరం పిళ్ళయ్ కి లేదు అనుకున్నాడు జయదేవ్. "నువ్వేమీ చెయ్యని పక్షంలో
కాష్మోరా తులసిని ఏమీ చెయ్యదు"
"చెయ్యటం మొదలు పెట్టింది జయదేవ్. అప్పుడే ఆ లక్షణాలు కనపడుతున్నాయి. కావాలంటే ఆమె తల్లిని
వివరాలు కనుక్కో! నీకింకా ఈ కాష్మోరా గురించి వివరాలు కావాలంటే చెప్పగలిగేవాడు ఒక్కడే వున్నాడు"

"ఎవరు?"

"పగ సాధించటం కోసం బిస్తా నుంచి వచ్చిన ఏకైక మహా మాంత్రికుడు దార్కా. అతడే తులసిని
చంపుతున్నాడు."

ఫోన్ కట్ అయింది.

* * *
"మరింతకాలం నాకెందుకు చెప్పలేదు" అన్నాడు కొద్దికోపంతో జయదేవ్. శారద వెంటనే మాట్లా డలేదు.
తరువాత నెమ్మదిగా అన్నది.

"ఎంతో కాలం కాలేదు నాల్గు రోజుల్నుంచే చిత్రంగా ప్రవర్తిస్తూంది. ఎదురింటి డాక్టర్ ఏమీ ఫర్వాలేదన్నాడు.
అయినా ఇప్పుడు బాగానే వుంది."

చిత్రంగా ప్రవర్తిస్తూందా........ఎందుకు......ఎందుకూ.......

అతడు కాష్మోరా గురించి చెబ్దా మనుకున్నాడు. తనే దాన్ని నమ్మనప్పుడు దాని ప్రసక్తి ఎందుకు
అనుకున్నాడు మళ్ళీ వెళ్ళబోతూ ఆగి , "దార్కా అన్న పేరు ఎప్పుడయినా వినటం జరిగిందా" అని అడిగేడు.

"దార్కా" అంది శారద ఏదో గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నిస్తూ "ఆఁ మొన్న మాతోపాటే కారులో ఎయిర్
పోర్టు నుంచి వచ్చేడు"

జయదేవ్ కి షాక్ తగిలినట్లయింది.

అతడేనా దార్కా?

అబ్రకదబ్ర చెప్పింది అతడి గురించేనా?

కంట్లోంచి మంటను సృష్టించాడూ అంటే ఈ రోజు తను నవ్వుతూ కొట్టిపడేసేడు.

బిస్తా నుంచి వచ్చిన మహామాంత్రికుడు అతడేనా -

అయితే అతడి పగ ఎవరిమీద?


కాష్మోరా బారినుండి ఒకసారి బ్రతికిన తులసిమీదా!

"అతడు మీ కారులో ఎందుకు ఎక్కాడు"

"తులసికి సిద్దేశ్వరి ఆలయంలో పరిచయమయ్యాడట అతడు"

సిద్దేశ్వరి.........!

నరాలు తెగిపోతాయా అన్నంత టెన్షన్ అతడిలో బయలుదేరింది. సిద్దేశ్వరి అంటే - శ్రీనివాసపిళ్ళయ్.

శ్రీనివాసపిళ్ళయ్, దార్కా ఒకటయ్యారా?

అందుకే అతడు ఫోనులో అలా సవాల్ చేసేడా?

లేదు.........లేదు.......కాష్మోరా లేదు. అంతా నాన్సెన్స్ అనుకున్నాడు. మరి దార్కా కంట్లోంచి వెలువడిన


శక్తి?

ఏది ఏమైనా తులసి అపాయంలో వున్నదననే నిర్వివాదాంసం. అది కాష్మోరావల్ల కావచ్చు! దార్కా వల్ల
కావచ్చు . క్రితంసారి ఎలక్ట్రా నిక్ పరికరాల్ని ధ్వంసం చేసి ఆమెని కాపాడేడు. ఈసారి అది సాధ్యం కాకపోవచ్చు.

"శ్రీధర్ ఎప్పుడు వస్తు న్నాడు?"

"ఇంకో పదిరోజులు పట్టవచ్చు."

అతడో నిశ్చయానికి వచ్చినట్టు "తులసిని నాతోపాటు తీసుకువెళతాను" అన్నాడు.

శారద విస్మయంతో "ఎక్కడికి" అంది. "వైజాగ్" అన్నాడు. "ఆమె కొన్ని రోజులపాటు ఇక్కడ వుండటం
నాకిష్టంలేదు. సైక్రియాటిస్టు ల కాన్ఫరెన్స్ కి నాల్రోజులపాటు వెళుతున్నాను. తననీ తీసుకెళతాను"

ఆమె కొంచెం తటపటాయించి ఆ పరిస్థితిలో కూతురికి మార్పు అవసరం గుర్తించి సరేనన్నది.

* * *
"ఏమిటిది?" అంది తులసి.

"మెస్కలిన్" అన్నాడు వెంకట్. "కేవలం నువ్వు అడిగేవని ఇస్తు న్నాను. ఇది తీసుకున్న తర్వాత మనసుని
ప్రశాంతంగా వుంచుకోవటానికి ప్రయత్నించు. చాలా హాయిగా వుంటుంది. నవ్వటంగానీ బాధ కలిగించే
ఆలోచనగానీ చేయకు. ఒకసారి నవ్వితే ఇక నవ్వు అలా వస్తూనే వుంటుంది .ఖంగు తిన్నప్పటిలా..... కానీ
మనసు ప్రశాంతంగా వుచుకుంటే నీ బాధలన్నీ మర్చిపోతావు, అందుకే నువ్వు అడగగానే ఇది ఇస్తు న్నాను"
అంటూ ఇచ్చేడు.

కొంచెం సేపు తులసికి మామూలుగానే ఉన్నది. తరువాత ఎంతో హాయిగా అనిపించింది. శరీరం గాలిలో
తేలిపోతున్నట్టూ -విమానంలో ప్రయాణం చేస్తు న్నట్టూ చిత్రమైన అనుభూతి -

"ఎలా వుంది" అని అడిగాడు వెంకట్.

అది తులసికి "అయ్యేలా ఆ ఆవూన్దీ ఈఈ" అన్నట్టు వినిపించింది.

"ప్ర.......ప్.........రో.......ప్" అంటూ తడబడింది.

"ప్రశాంతంగా" అని అతడు అందించేడు.

ఆమె మామూలుగా తలూపటం కోసం తలూపింది. అయితే ఆ తల గాలిలో వెనక్కి వెళ్ళి, ముందుకొచ్చి.
గెడ్డం కాలర్ బోన్ పక్కన మెడకింద కొట్టు కుంది.చాలా గమ్మత్తు గా వుంది. అవయవాలు స్వాధీనంలో
లేకపోవటం.

వెంకట్ లేచి పక్కగదిలోకి వెళ్ళాడు.

ఏమీ తోచక, టేబిల్ మీద పుస్తకం తీసుకోవటానికి చెయ్యి చాచింది చెయ్యి గాలిలో ప్రయామం చేస్తుందేగానీ
ఎంత సేపటికీ టేబిల్ ని చేరుకోవటంలేదు. రెండు నిముషాల ప్రయత్నం తర్వాత చెయ్యి ఇంకా తన తొడమీదే
వున్నట్టు గమనించింది. బాగా నవ్వొచ్చింది. అయినా నవ్వొద్దని డాక్టరు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి
బలవంతంమీద ఆపుకొంది. అతి కష్టంమీద పుస్తకాన్ని చేతిలోకి తీసుకొంది.

చిన్నపిల్లల బొమ్మల పుస్తకం అది.

బొమ్మలు మసగ్గా కనబడుతున్నాయి.

ఒక గుర్రం - చాలా వికృతంగా వుంది (ఉందా లేక అలా కనిపిస్తుందా?)

ఒక రాజకుమారి.........నాజూగ్గా వుంది కానీ ఆమె మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనబడుతూంది.

ఇంకో పేజీలో గుర్రం అమ్మాయి మీదకు వస్తూంది.


మరో పేజీ తిప్పింది,. మంత్రగాడు మంత్రదండాన్ని గాలిలోకి విసురుతున్నాడు. గుర్రం మనిషిగా
మారిపోయింది. నాలుగు కాళ్ళున్నాయి. మొహం మాత్రం మనిషిదే.

రాజకుమారి తల తిప్పింది.

అది......అది.......తనే.

గుర్రం మనిషి మరింత దగ్గరకొచ్చేడు. ముందుకాళ్ళు పైకెత్తి తల తిప్పేడు. అది......అది......సదానంద


చక్రవర్తి.

ఆమె కెవ్వున అరిచింది. సరీగ్గా అదే సమయానికి గేటు తెరుచుకొని జయదేవ్ లోపలికి వస్తు న్నాడు. చిన్న
చప్పుడుతో కరెంట్ పోయింది.

లోపల్నుంచి వెంకట్ అరుపు విని పరుగెత్తు కొచ్చాడు. అతడి చేతిలో కొవ్వొత్తి వుంది. "ఏమైంది" అన్నాడు
తులసి మాట్లా డలేదు. అప్పటికే ఆమె స్పృహతప్పింది.

వెంకట్ వంగి 'తులసిని' లేపబోయాడు.

తలుపు కొట్టిన ధ్వని వినిపించింది.

అతడు కొవ్వొత్తి టేబుల్ మీద పెట్టి వెళ్ళి తలుపు తీశాడు.

మెట్లమీద నిలువెత్తు విగ్రహం - జయదేవ్

కొవ్వొత్తి కాంతి జయదేవ్ మొహం మీద మసగ్గా పడుతూంది.

"గుడీవినింగ్ డాక్టర్ నా పేరు జయదేవ్"

"గుడీవినింగ్ ప్రొఫెసర్. లోపలికి రండి"

జయదేవ్ లోపలికొచ్చేడు. కుర్చీలో వాలిపోయి వున్న తులసిని చూడగానే ఆందోళనగా "ఏమైంది" అని
అడిగేడు.

"ప్రైమల్ ధెరపీ" అన్నాడు వెంకట్ తలవైపు చూస్తూ. జయదేవ్ కి అంతకన్నా వివరణ అక్కర్లేదు. పేషెంటుని
మానసికంగా బలహీన పరిచి విషయాన్ని రాబట్టటాన్ని ప్రైమల్ థెరపీ అంటారు.

"తులసి మానసికంగా ఏదో బాధపడుతుందని శారద గారు చెప్పారు. ఏమిటది?" అని అడిగాడు జయదేవ్.
"అది తెలుసుకోవటం కోసమే ఇదంతా" అన్నాడు వెంకట్ జయదేవ్ కి. శారద చెప్పింది తులసి నిద్రలో
మాట్లా డటం -నాలుక బయట పెట్టటం, రాత్రిళ్ళు ఏడవటం అంతా -

ఇద్దరూ కొద్దిసేపు మాట్లా డలేదు. జయదేవ్ జాలిగా తులసివైపు చూశాడు. చిన్న మెదడు.......మనిషిని ఎన్ని
బాధలకు గురిచేస్తుంది! ఆలోచనలతో, బాధతో , వ్యధతో , ఆనందంతో, ఉద్రేకంతో మనిషిని ఎంతలా
ఆడిస్తుంది. తులసిలాటి ఆరోగ్యకరమైన అమ్మాయి ఇలా ఎందుకు మారిపోయింది. కాష్మోరా. ........ కాదు -
కాదు.

సైకోసిస్ -న్యూరోసిస్ -సైకోసోమాటిక్ డిఫిషియన్సీ -హిస్టీరియా - ఎపిలెన్సీ -స్కిజోప్రెనియా -డిఫ్రెషన్ -


ఏదయినా అయి వుండవచ్చు.

కొంచెం సేపటికి తులసి తేరుకొంది. కళ్ళు విప్పి జయదేవ్ ని చూసి, "హల్లో అంకుల్" అని పలకరించింది
చాలా మామూలుగా.

"ఎలా వుంది"

"బాగానే వుందే........."

జయదేవ్ వెంకట్ వైపు తిరిగి "ఏదయినా మందు ఇస్తా రా" అన్నాడు.

"ఓ ఇంజెక్షన్ ఇస్తా ను రేపు మళ్ళీ చూస్తా ను"

తులసి డాక్టర్ తో కలిసి లోపలికి వెళ్ళింది. వెంకట్ సిరంజిలోకి మందు తీసుకొని "ఏదీ చెయ్యి" అన్నాడు.

చెయ్యి యివ్వకుండా తులసి నవ్వి "మీ వయసెంత డాక్టరుగారూ" అంది.

అతడు విస్తు బోయి "అరవై- ఎందుకు" అని అడిగాడు.

"మీకు మతిమరుపు ఎక్కువ అవుతూంది. మీరు చేస్తు న్న ఇంజెక్షన్ ఏమిటో చూసుకున్నారా-"

వెంకట్ బాటిల్ వైపు చూసి నాలుక్కొరుక్కుని "సారీ" అన్నాడు సిరెంజి కడుగుతూ "ప్రొగైనాన్ గురించి
నీకెలా తెలుసు?" అని అడిగాడు.

"క్రికెట్ మాచ్ గురించి ఏదయినా వూరు వెళుతున్నప్పుడు కొంత మంది తీసుకునేవాళ్ళం"

రెండు 'పో'తో మొదలవటంతో పొరపాటు పడ్డా ను. ప్రొల్యూటస్ 500 మిల్లీగ్రాములు ఇంజెక్టు చేస్తూ వెంకట్
అన్నాడు.
ఆమె బయటకొచ్చేక అప్పటివరకూ ఎదురుచూస్తు న్న జయదేవ్ లేచి నిలబడ్డా డు. డాక్టర్ దగ్గిర షేక్ హాండ్
తీసుకొని, ఇద్దరూబయట కొచ్చేరు.

"రేపు సాయంత్రం నాతో వస్తు న్నావు" అన్నాడు జయదేవ్.

"ఎక్కడికి?"

"అది వెళ్ళేటప్పుడు చెబ్తా ను"

జయదేవ్ కి ఎంత భయం వేసిందంటే - తను ఒకవేళ 'వైజాగ్' అని మనసులో అనుకుంటే, ఆ విషయాన్ని
కూడా సైన్సు పరికరాల ద్వారా పిళ్ళయ్ కనుక్కోగలడని అనిపించింది.

21
తెల్లవారు జామున నాలుగున్నరకి విద్యావతి ఇంటి ప్రహరీగోడ దూకి....... లోపలి కాంపౌండ్ లోకి వెళ్ళి
చెట్టెక్కి ఆకులమాటున కూర్చున్నాడు దార్కా.

ప్రొద్దు న్న ఆరింటికి విద్యాపతి తన స్టడీ రూమ్ లోకి వస్తా డు. దాదాపు రెండు గంటల సేపు పుస్తకాలు
చదువుతూ కూర్చుంటాడు..... కిటికీ ప్రక్కన కూర్చొని - ఒంటరిగా.

అతడిని భస్మం చేయటానికి అంతకన్నా మంచి సమయం ఇంకొకటి వుండదు. బయట అయితే ఎవరన్నా
చూసినా - తన చూపు ఇంకెవరి మీదయినా పడినా కష్టం. ఇలా అయితే ఇంటి పెద్దపోయి అందరూ
ఏడుస్తూవుంటే అక్కణ్నుంచి తప్పుకోవటం చాలా సులభం.

అసలు ఈ పని నాల్గురోజుల కరితం చేయాల్సింది. కాని విద్యావతి వూరు వెళ్లటంవల్ల ఆలస్యమయింది.
అతడి ఇంటిముందు కాపువేసి క్రితం రాత్రి అతడు రావటాన్కి చూసేడు.

ఆరున్నర అయింది.

పక్షులు నిద్రలేచి, కిల కిలా రవాలు చేస్తు న్నాయి.

ఏడయింది - ఎనిమిదయింది.

ఎనిమిదిన్నరయింది. చెట్ల ఆకుల మధ్య అసహనంగా దార్కా కదిలేడు. అంతలో గేటు తెరుస్తు న్న చప్పుడు
వినిపించింది. లోపలకు ఫియెట్ దూసుకొచ్చింది.
అందులోంచి దిగింది తులసి. దార్కా స్థా ణువయ్యేడు.

ఆ సమయంలో తులసి అక్కడకు రావటం దార్కాకు ఎందుకో అంత బాగా అనిపించలేదు. అతడు
అసహనంగా తల విదల్చబోతూంటే అకస్మాత్తు గా గుమ్మం దగ్గిర విద్యాపతి కనిపించాడు. పుల్ సూట్ లో
వున్నాడతను.

దార్కా చెయ్యి చెటటుకొమ్మ చుట్టూ బిగుసుకొంది. మరిక ఆలస్యం చేయదల్చుకోలేదు. రెండో చేత్తో కన్ను
రుద్దు కున్నాడు. అతడికి తెల్సు - కన్ను రుద్దు కున్న మరుక్షణం కిరణం బయలుదేరుతుందని. అది ఇనుప
తలుపును నిమిషంలో కాలుస్తుంది. మనిషిని క్షణంలో కాల్చి చంపుతుంది.

విద్యాపతి మొదటి మెట్టు దిగేడు.

దార్కా కంటినుంచి చెయ్యితీసి కన్ను తెరిచాడు.

అయితే -ఎవరూ వూహించని విధంలో ఒక అనూహ్యమయిన సంఘటన - అకస్మాత్తు గా - అనుకోకుండా -


చప్పున జరిగిపోయింది.

తన కారును తులసి కారు అడ్డం వుండటంతో విద్యాపతి 'తులసీ! నీ కారు అడ్డు తియ్యి' అంటూ లోపలికి
వెల్ళాడు. దూరంగావున్న దార్కాకు ఈ మాటలు వినిపించలేదు. అతడు కన్ను రుద్దు కుని, సంసిద్దు డై
కన్నుతెరిచేసరికి విద్యాపతి లోపలకు వెళ్ళటం -అతడు వున్న మెట్ల మీదకు - అదే సమయానికి లోపల్నుంచి
విద్యాపతి మనవరాలు పరుగెత్తు కు రావటం ఒకేసారి జరిగిపోయినయ్. దార్కా చప్పున కన్ను
మూసుకోబోయేడు - కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.

లోపల్నుంచి గాలిలా దూసుకొచ్చిన ఆ పాప మెట్టు మీదకు దిగీ దిగగానే ఏదో తగిలినట్టు ఆగిపోయింది. ఆ
పాప చేసిన ఆర్తనాదం ఎవరి హృదయాన్నయినా కరిగించేలా వుంది. దార్కా చేత్తో కన్ను మూసుకున్నాడు.
లోపల్నుంచి ఈ లోపులో తులిస వచ్చింది........అప్పటికే పాప మోకాళ్ళమీద నుంచి కిందకు కూలిపోయింది.
గుండెని నొక్కిపట్టిన ఆ చిన్నారి చేతులు క్షణంపాటు అటూ ఇటూ కొట్టు కుని కొద్దిసేపటికి
అచేతనమయ్యాయి.

తులసి ఎంతలా నిర్వీర్యురాలయిందంటే -ఆమె అసలు ఓ శిలలా మారిపోయిందా అనిపించింది.

లోపలున్న విద్యాపతి - మనవరాలి ఆక్రందన విని ముందు బయట కొచ్చేడు. విద్యాపతి పాప తలను ఒళ్ళో
పెట్టు కున్నాడు. అందరూ చుట్టూ మూగేరు. క్షణం తర్వాత చేతుల మీద శరీరాన్ని లోపలకు తీసుకెళ్లా డు.
అంతే దార్కాకు కనిపించింది అక్కడి వరకే.

ఆ తర్వాత ఒక నిముషానికి లోపలనుంచి రోదనలు వినిపించాయి. బయట గేటు దగ్గర గూర్ఖా కూడా
లోపలకు పరుగెత్తా డు. వెళ్లిపోవడానికి అదే మంచి అదను. అయినా దార్కా వెళ్ళలేదు అసలు అతడిలో చలనం
లేదు రక్తమంతా తోడేసినట్టూ అతడి మొహం పాలిపోయింది. వంట్లో సత్తు వ పోయినట్టు చేతులు
వణుకుతున్నాయి. ఎప్పుడు తూలి పడిపోతారో తనకే తెలియనంతగా కదిలిపోతున్నాడు.

అతడో పది క్షణాలు అలాగే చూసివుంటే పాప శరీరం భస్మం అయిపోయి వుండేది. ఇప్పుడు కిరణం
బాణంలా గుండెల్లోంచి దూసుకుపోయింది.

అతడు తేరుకోవటానికి దాదాపు అరగంట పట్టింది. లోపల్నుంచి పెద్ద ఎత్తు న రోదనలు వినబడుతున్నాయి.
ఒకటి తరువాత ఒకటి కార్లు వస్తు న్నాయి.

దార్కా నెమ్మదిగా చెట్టు వెనుకవైపు దిగేడు.

అతడి నెవరూ పట్టించుకోవటం లేదు. అయినా ఎవరైనా కనబడతారేమోనన్న భయంతో ఆగి వున్న కార్లని
చాటు చేసుకుంటూ గేటు వరకూ నడిచేడు.

అక్కడ ఆగి వెనుదిరిగి చూసేడు.

ఇంకా అక్కడే -శూన్యంలోకి చూస్తూ నిలబడి వుంది. తులసి. గోడకు ఆనుకొని వుండటంవల్ల ఆమెను
ఎవరూ పట్టించుకోలేదు. ఆమె దార్కాని కూడా గమనించలేదు.

దార్కా నెమ్మదిగా అక్కణ్నుంచి కదిలేడు.

* * *
"మనం ఎక్కడికి వెళుతున్నాం?" కార్లో వెళుతూ చాలా సేపటికి మాట్లా డింది తులసి.

"ఊరు" అన్నాడు జయదేవ్.

ఇలా అకస్మాత్తు గా చెప్పినందుకు తులసి ఆశ్చర్యపోతుందనుకున్నాడు. కానీ ఆమె దేనినీ పట్టించుకోలేదు.


వెనుక డిక్కీలో శారద కూతురి తాలూకు బట్టలు సర్ది పెట్టింది. ముందు నాల్రోజులపాటు తులసిని దూరంగా
ఉంచాలని అనుకున్నారు. జయదేవ్, శారద, కానీ తులసి పాప మరణాన్ని చూసి షాక్ తిన్నది. కాబట్టి ఇంకా
కొంత ఎక్కువ కాలం అంటే పది పదిహేను రోజులపాటు ఆ పరిసరాల్నుంచి దూరంగా ఉంటే బావుంటుందన్న
ఆలోచన జయదేవ్ వెలిబుచ్చాడు. శారద దానికి వెంటనే వప్పుకున్నది. ఎందుకంటే ఆ లోపులో వాళ్ళ నాన్నగారే
ఎలాగూ వస్తా రు. అయితే జయదేవ్ ఆలోచన వేరు.

పిళ్ళయ్ ఫోన్ లో చెప్పిన దాన్ని బట్టి కాష్మోరా అనే మానవాతీత శక్తిగాని, పిళ్ళయ్ తాలూకు సైన్సు గానీ
తులసిని బాధపెడ్తూంది. దీన్నించి తులసిని దూరంగా తీసుకెళ్లా లి. అది అతని ఆశయం. అందుకే తాము
ఎక్కడికి వెళ్తూందీ రహస్యంగా అట్టేపెట్టేడు. శారదకి తప్ప ఇంకెవరికి తెలియనివ్వలేదు. విద్యాపతి మనవరాలి
దహన సంస్కారానికి కూడా ఆగకుండా తీసుకొచ్చేసాడు.

దాదాపు పన్నెండు గంటల డ్రైవ్ తర్వాత కారు వైజాగ్ ప్రవేశించింది. ఓ గంటసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత
అతడు తులసి గదిలోకి ప్రవేశించాడు.

కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ వుంది తులసి కిటికీ లోంచి సముద్రం. మనిషి పాపాన్ని తనలోనే
దాచుకున్న మనసులా ఉంది.

"నౌ వాడూ యూ ఫీల్ బేబీ" అన్నాడు

ఆమె మాట్లా డలేదు ఆమె కళ్ళు గాజు గోళాల్లా భావరహితంగా వున్నాయి.

"హుషారుగా వుండడానికి నీకో ఇంజెక్షన్ ఇస్తా ను" అంటూ ఆమె జవాబుకు ఎదురు చూడకుండా ఇంజెక్షన్
చేసేడు. అయిదు నిమిషాల్లో ఆమె పక్కమీద వాలిపోయింది.

అతడు తన గదిలోకి వచ్చేడు. అక్కడ కూర్చొని వుంది ఓ డాక్టర్. ఆమెకు నలభయ్ ఐదేళ్ళుంటాయి. తెల్లటి
వెంట్రు క పాయలు మెరుపుతోనూ, కళ్ళు విజ్ఞానంతోనూ మెరిసిపోతున్నాయి.

"వెళ్ళండి డాక్టర్" అన్నాడు జయదేవ్ "తులసికి సెడెటివ్ ని ఇచ్చేను"

ఆమె లేచి వెళ్ళటానికి ఉద్యుక్తు రాలయింది. జయదేవ్ అన్నాడు "ఏదీ వదిలిపెట్టవద్దు , జాగ్రత్తగా పరీక్ష
చేయండి"

డాక్టరు తలూపి లోపలికి తులసి గదిలోకి వెళ్ళింది ఆమె చేతిలో చిన్న కంప్యూటర్ లా ఎలక్ట్రోమాగ్నెట్ డివైస్
వుంది. ఇంకో చేతిలో మెటల్ డిటెక్టివ్ వుంది.

తులసి మంచం పక్కనే నిలబడి పేషెంట్ వేపు చూసింది. ఆమె ముగ్జంగా మనోహరంగా నిద్రపోతున్న ఈ
అమ్మాయి మానసిక ఘర్షణకి కారణాన్ని ప్రొఫెసర్ జయదేవ్ ఎంత లోతుగా ఆలోచిస్తు న్నాడు....సైన్స్......
సైన్స్......సైన్స్......డామిట్.

ఆమె నెమ్మదిగా వేళ్లతో తులసి చీర కుచ్చెళ్ళను తప్పించింది. ఆ తరువాత జాకెట్ నీ, బ్రానీ.......

లేత సాయంత్రపు సూర్యకాంతి సముద్రం మీదనుంచి విశ్లేషణ చెంది శరీరం మీద పరావర్తన మవుతూంది.

చాలామంది అమ్మాయిలు చీరల్లోనే బావుంటారు.

తులసి అలాకాదు ఓ పాలరాయిని గుర్తు తెలియని గ్రీకు శిల్పి కారుడు ఏళ్ళ తరబడి నిద్రాహారాలు మాని
చెక్కినట్టుంది. పాలిండ్లు పిరమిడ్లయ్, మొనలు వడ్లయ్, కడుపు అలల అలజడ్లయ్, నడుము వంపుల
తెడ్లయ్. దానికి కటి అడ్డయి, యవ్వనం శరీరపు అంగాంగాల్లోకి ఉబికిపోయింది. ఆ అందం డాక్టర్నే కళ్ళు
తిప్పుకోనివ్వకుండా చేస్తూంది క్షణంలో తేరుకుని డాక్టర్ తన పనిలో నిమగ్నమయింది.

తులసి వెంట్రు క చివర్లనుంచీ కాలి బొటన వ్రేలి గోరువరకు క్షుణ్నంగా పరీక్షించింది. ఈ లోపులో జయదేవ్
తన స్నేహితుడికి ఫోన్ చేసేడు. అతడు మద్రాసు వెళుతూంటే తన కారు అతడికిచ్చి, అతడి కారు
తీసుకున్నాడు. తమ తాలూకు వస్తు వులేవీ తులసి దగ్గిరలో వుంచటానికి వీలులేకుండా జాగ్రత్త పడుతున్నాడు
అతడు.

డాక్టర్ జయదేవ్ వున్న గదిలోకి వచ్చింది.

"ఏమైనా దొరకిందా?" ఫోన్ పెట్టేస్తూ అడిగేడు.

"లేదు, ఆమె శరీరం అంతా పరీక్షించేను. చివరికి గాజులూ, చెవి పోగులు కూడా చెక్ చేశాను. ఏ 'ఫారిన్
బాడీ' ఆమెలో గానీ, ఆమె ధరించిన ఆభరణాల్లోగానీ లేదు.

జయదేవ్ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.

పదకొండు సంవత్సరాల క్రితం ఒక తాయెత్తు ద్వారా తులసికి సంకేతాలు పంపేడు పిళ్ళై, ఈసారి అన్ని
మార్గాలూ ఇప్పట్నుంచే మూసేస్తు న్నాడు తను.

జయదేవ్ ఇలా ఆలోచిస్తు న్ సమయంలో అక్కడ శారదకి ఫోన్ వచ్చింది. "ఎవరు మీరు" అని అడిగింది.

"తులసి క్రికెట్ టీమ్ తాలూకు కోచ్ ని. తులసి కావాలి" అన్నాడు పిళ్ళయ్.

"తులసి వూళ్ళో లేదు"

పిళ్ళయ్ ఉలిక్కిపడ్డా డు. "లేదా" అన్నాడు. "ఏ వూరెళ్లింది?"

"తెలీదు" అన్నది శారద.

"సిలోన్ వెళ్ళే క్రికెట్ జట్టు ఎంపిక జరుగుతూంది. ఆమె అవసరము చాలా వుంది."

"సారీ తులసి క్రికెట్ ఇక ఆడదు" ఫోన్ పెట్టేసింది శారద. తులసి గురించి ఏమీ మాట్లా డవద్దని ఆమెకి ప్రత్యేక
సూచనిచ్చేడు జయదేవ్.
ఫోన్ డిస్ కనెక్టవటంతో పిళ్ళయ్ కుర్చీ వెనక్కి జారబడ్డా డు.ఒక క్షణం మొహం గంభీరంగా వుంది.
సాలోచనగా చెయ్యిసాచి సిగార్ వెలిగించుకున్నాడు.

22
రాత్రి పన్నెండయింది.

స్మశానం మూలలో ఎండిన చెట్టు మొదట్లో కాళ్ళుసాచి చెట్టు కి జారబడి నిస్త్రా ణగా కూర్చొని వున్నాడు
దార్కా. అతడి మొహం భావరహితంగా వుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే..........ఎదుటిమంట వెలుగులో ఆ
మొహంలో ప్రతిబింబిస్తు న్న బాధా వీచికలు కనబడకపోవు.

అతడి ఎదురుగా మంట ఉజ్వలంగా వెలుగుతూంది. ఎర్రగా. నాలుకలు సాచి, ఎనిమిది దిక్కులకూ
ప్రతినిధులయిన ఎనిమిది ఎముకలు ఆ మంటల్లో కాలుతున్నాయి. ఆ రోజు పూజ పూర్తయింది. అయినా
అతడు అక్కడనుంచి లేవలేదు. అలాగే కూర్చుని వుండిపోయాడు.

ఆలోచన్లలో సముద్రపు హోరు.

గుండెల్లో అనూహ్యమైన వ్యధ.

అతడి కళ్ళముందు ఒకే దృశ్యం పదే పదే కదలాడుతున్నది.

ఒక పాప పదేళ్ళది, అల్లరినీ అమాయకత్వాన్నీ కలబోసుకున్నది. బాణంలా లోపల్నుంచి బయటకు


దూసుకొచ్చింది. లేడిలా కింది మెట్టు మీదకు దూకింది. అంతే. వేటగాని బాణం డొక్కలో తగిలిన లేడిలా
విలవిలలాడింది. భూమ్మీదకు వాలిపోయింది.

ఆ వేటగాడు తనే ........తనే!

నిర్లక్ష్యంగా.........నిర్దా క్షిణ్యంగా చంపేసేడు. తనకి నిష్కృతిలేదు. శక్తి వున్నదన్న అహంతో తొందరపడ్డా డు.
తప్పు తనదే.... తనదే......

ఎర్రటి మంటలు తనవైపు తీక్షణంగా చూస్తు న్నట్టూ అనిపించింది. పరిశీలిస్తే అందులో ఆచార్యుల వారి
ఆకృతి గోచరించింది. "దార్కా! నా కిచ్చిన మాట ఏం చేసేవు?" అని వేయి గొంతుల్తో ప్రశ్నిస్తు న్నట్టూ వుంది.
"ఒక అమాయక ప్రాణిని నీ శక్తితో బలిపెట్టటానికి నీకేం అదికారం వుంది దార్కా" అని పరిహసిస్తు న్నట్టూ వుంది

అతనికి దుఃఖం వచ్చింది. అది కంటి నీరు కాదు. కడుపులో తెరలు తెరలుగా వెల్లు బికే దుఃఖం. ఎంతో
మానసిక వ్యధతో మనసంతా కదిలిపోతే తప్ప మొగవాడికి అటువంటి దుఃఖం రాదు.
కాలుతున్న ఎముక చేతిని కాలుస్తూంది. మనసు మంటతో పోల్చుకుంటే అదేపాటిది. అతడు
ఆచార్యులవారిని తల్చుకున్నాడు. "ఓ నా గురువా! నేను నీ కిచ్చినమాట నిలబెట్టు కోలేనందుకు ఈ శిక్ష
విధించు కుంటున్నాను. సర్వశక్తి సంపన్నమయిన ఈ విద్య ఇంత వినాశకరమైందని తెలిసి దీన్ని ఈ క్షణమే
విడిచిపెడుతున్నాను. నా వల్ల జరిగిన పాపం ఈ శిక్షతో పరిహారమయ్యేలా అనుగ్రహించు."

ఆ తరువాత రెండు చేతుల్తోనూ ఎముకను కంటి వద్దకు తెచ్చేడు. ఇనుప ఊచలా వున్న ఎర్రటి ఎముక
భగభగ మండుతూ అతడి ఎడమ కంటిలోకి చొచ్చుకుపోయింది. గంగవెర్రు లెత్తించే బాధ అతడి గొంతులోనే
సుడులు తిరిగి ఆగిపోయింది. బాధతో బిగించిన పెదవి పళ్లకింద నలిగి ఓ చుక్క రక్తం కారినదంతే!

ఆర్ద్రతతో స్మశానమే వణికింది. చిరుగాలి అతడిని ఆప్యాయంగా జాలిగా స్పర్శించింది. కాలిన రక్తపు వాసన ఆ
గాలిలో వ్యాపించింది.

తనకి కోపమొస్తే మూడో కన్ను తెరిచే దేవుడు ఆ కన్నే శక్తిగా భక్తు ల్నుంచి పూజలందుకుంటున్న ఆ శివుడి
కన్నా, తన కంటి శక్తి ప్రపంచానికి హానికరమయిందని తెలుసుకొని, దాన్ని వదిలిపెట్టిన దార్కా వేయిరెట్లు
గొప్పవాడు!

* * *
అదే రాత్రి -

రెండు గంటలు కావొస్తుంది. తులసి లేకపోవటంవల్ల శారద ఒక్కతే ఆ గదిలో పడుకొని వుంది. ఆమె
కెందుకో మెలకువ వచ్చింది. అయితే అది సాధారణమయిన మెలకువ కాదు. ఏదో జరిగింది.

తులసి పక్క ఖాళీగా వుంది. బెడ్ లైట్ వెలుతుర్లో రూమ్ మామూలుగా వుంది. కానీ ఏదో జరిగింది.

ఆమె క్షణం పక్కమీద అలాగే కూర్చుని వుంది. అప్పుడు వినిపించింది సన్నటి చప్పుడు ఎక్కడో కిర్రు మని

శారద లేచి తల దిండుకింద నుంచి బ్యాటరీలైటు తీసుకుంది. చాలా పవర్ ఫుల్ బ్యాటరీలైటు అది.
కిటికీలోంచి బయటకు వేసి చూసింది.లైట్లు కూడా గాలిలేక నిశ్చలంగా వున్నాయి. అంతా నిశ్శబ్దం ఆ చీకట్లో
బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు.

ఆమె లైటు ఆర్పి పడుకుంది.

అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ సన్నగా శబ్దం అయింది.

"ఎవరిదీ?" అందామె లేచి. అలికిడి లేదు.


ఏదో జరుగుతూంది.

శారద స్వతహాగా ధైర్యవంతురాలు అంత పెద్ద ఇంట్లో ఒక్కతే పడుకోటం అంత సులభం కాదు. ఔట్ హౌస్
కూడా ఇంటికి చాలా దూరంలో వుంది.

ఇంకోసారి చప్పుడవటంతో ఆమె మరి ఆగలేక తలుపు తీసుకొని బయటకు వచ్చింది. వరండాలో నీడ
పొడుగ్గా పడుతూంది. కిందికి మెట్లు మెలికలు తిరిగి వున్నాయి. ఆమె చేతిలో బ్యాటరీలైటును చుట్టూ
తిప్పింది. ఫర్నిచర్ మీద వెలుతురు పాక్కుంటూ వెళ్లింది.

అంతా నిశ్చలంగా, నిశ్శబ్దంగా వుంది. ఎక్కడి వస్తు వులు అక్కడే వున్నాయి. ఆమె నెమ్మదిగా మెట్లు దిగి
కిందికి రాసాగింది. గోడ గడియారం చప్పుడు తప్ప ఇంకేమీ లేదు.

ఆమె మెట్లు దిగుతూ వుంటే అకస్మాత్తు గా గాలి వీచింది. ఆమె నిశ్చేష్టు రాలయింది. అంతవరకూ
మామూలుగా వున్న వాతావరణం లోంచి చిన్న సూచన కూడా ఇవ్వకుండా ఒక్కసారి అంతలా గాలి రావటం
ఆమెలో భయోత్పాదన కలిగించింది. ధడేలుమన్న శబ్దంతో తలుపులు మూసుకుపోయాయి. తులసి. తనూ
పడుకునే గది తలుపులు. ఆ గదిలోంచే బయటకు వచ్చిన గాలి వరండాలోకి పాకుతూంది. ఆమె వెనక్కి వెళ్ళి
బలవంతంగా తలుపులు తీసుకుని గదిలోకి ప్రవేశించింది. కిటికీలోంచి వస్తూంది గాలి. ఆమెనే లేపేసేటట్టు
వుంది. అతి కష్టంమీద ఆమె కిటికీ తలుపులు వెయ్యగలిగింది. అద్దా ల అవతల చెట్లు , అప్పటి వరకూ
అమాయకంగా వున్నవి, దెయ్యం పట్టినట్టూ ఊగసాగాయి.

పెద్ద లైటు వేసుకుని పడుకుంటే బావుంటుందని ఆమె భావించింది.

లైటు వేయటానికి వంగుతూంటే అకస్మాత్తు గా కడుపులో తిప్పింది.

ఆమె చప్పున వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది.

* * *
"ఎన్ని రాత్రు ల్నుంచి ఇలా అవుతూంది?" పార్ధసారధి అడిగేడు.

"మూడు రోజుల్నుంచీ " అంది శారద. "పగలంతా బాగానే వుంటుంది. చీకటి పడగానే అదోలా వుంటుంది.
బ్లెడ్ ప్రజర్ ఎక్కువైనట్లు ......ఏదో ఉద్వేగం ఆవరించినట్టూ! దానితో కడుపులో త్రిప్పటం మొదలు పెడుతూంది.
రాత్రి ఏ రెండింటికో మెలకువ వస్తుంది వామిటింగ్ అవుతుంది."

"ఫుడ్ కంట్రోల్ చెయ్యలేకపోయారా....."


"రెండోరోజే చేసేను. అయినా మార్పేమీ లేదు. ఒక రోజంటే అనుకోవచ్చు. వరుసగా మూడురోజులూ అదే
సమయానికి అలా అవటం ఏమిటి?"

కొంచెం సేపు పార్ధసారధి మాట్లా డలేదు. తర్వాత మాటమారుస్తూ "శ్రీధర్ ఎప్పుడు వస్తు న్నాడు?"
అనడిగేడు.

"ఇంకో నాలుగయిదు రోజుల్లే"

"తులసి......."

"తెలీదు"

"మరి అంత పెద్దింట్లో ఒక్కరే ఎందుకు -మా ఇంట్లో వుండొచ్చుగా! అక్కయ్యవాళ్ళు వచ్చేరు."

"నౌకర్లు న్నారు -ఫర్లేదు" నవ్వింది "థాంక్స్"

"పోనీ ఈరోజు డిన్నర్ కి పుండిపోండి"

ఆమె కాదనలేదు. తులసి లేకపోవటం ఆమెకి ఒంటరితనాన్ని కలుగచేస్తోంది. ఆమె మౌనాన్ని అర్ధం
చేసుకొని అతడు ఆమెను లోపలికి తీసుకెళ్ళి విధవ అక్కయ్యకు పరిచయం చేశాడు.

అతడు తిరిగి వచ్చేసరికి పండిత్ ఎదుటి కుర్చీలో కూర్చుని వున్నాడు. "హలో" అన్నాడు పార్ధసారధి.

"ఎప్పుడొచ్చేరు?"

"శారదగారు మీతో మాట్లా డుతూ వుంటే......" అన్నాడు పండిత్. "మీ కన్ సల్టింగ్ రూమ్ సౌండ్ ప్రూ ఫ్
చేయించుకోవాలి డాక్టర్ గారూ! మాటలన్నీ బయటకు వినిపిస్తు న్నాయి."

సారధి నవ్వి వూరుకున్నాడు.

"మా ఇంటితాళం ఎక్కడో మర్చిపోయాను" అన్నాడు పండిత్ ".....ఎలా వెళ్ళను?"

"నా దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోకూడదూ -ఆర్నెల్లలో మీ మతి మరుపు బాగుచేస్తా ను" అన్నాడు డాక్టర్.

"మతిమరుపు లేదనటానికి ఇరవయ్ ఎనిమిదో ఎక్కం వప్పచెప్పమంటారా?" ఇద్దరూ నవ్వుకున్నారు........

"మా ఇంట్లో పడుకోండి"


"శారదగార్ని పడుకోమనండి - నేను వాళ్ళింటికి వెళతాను" అంటూ లోపలికి వెళ్ళాడు.

శారద దానికి వప్పుకుంది. ".........గెస్ట్ రూం తెలుసుగా, భోజనం కావాలంటే డైనింగ్ రూమ్ లో ఫ్రిజ్....."
అంటూ చెప్పబోయింది.

ఆమె మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ "అన్నీ నేను చూసుకుంటాను" అని తాళాలు ఆమె దగ్గర్నుంచి
తీసుకుని, "రేపు నా తాళాలు తీరిగ్గా వెతుక్కోవాలి" అంటూ వాటిని జోబులో వేసుకుని ఆ రాత్రి శ్రీధర్ యింట్లో
గడపటం కోసం బయలుదేరాడు. అతడి రెండో జేబులో ఇంకో తాళం చెవులగుత్తి వుంది. అది తనింటిది.

23
"సంవత్సరానికి ఎనిమిది లక్షలా నలబై నాలుగువేలు రూపాయల జీతాలు, ఎస్టా బ్లిష్ మెంట్ ఖర్చుతో
నడుపబడుతున్న ఆసుపత్రి. మానసికరోగాలూ, రుగ్మతలూ, అన్నిటికీ ట్రీట్ మెంట్ యిచ్చి, మనుష్యులతో
హేళన చేయబడే ఒకే ఒక రోగం 'పిచ్చి' ..........దాన్ని నయంచేసే ఆస్పత్రి -

పిచ్చాసుపత్రి

"విశాఖపట్నం అనగానే జ్ఞాపకం వచ్చేది - జోకుల్లో తరచూ చోటు చేసుకొనేది అయిన ఆస్పత్రిని మీరు
చూస్తు న్నారు" డాక్టర్ అవంతి చెప్పుకుపోతున్నాడు ఉన్నవారు ప్రేక్షకులై వింటున్నారు.

విజిటర్స్ కదిలేరు.

"మనిషి పిచ్చితనాన్ని పట్టిచ్చేది చూపు. ఆ వృద్ధు డి కంటిచూపులో నిస్తేజతను గమనించండి. నిస్తేజత


పిచ్చితనానికి గుర్తు " అన్నాడు. వాళ్ళతోపాటు నడుస్తు న్న తులసి ఆగింది. గోడమీద బొగ్గుతో ఇలా వ్రాసి వుంది
-

"మాండవ్యతీరంనుండే వెలుగుతున్నది కిరణమణి

కిరణాల గుడిలోన మరపురాని మరువింతలు

1966 లో విప్లవం -సంఘర్షణలో వైశిష్ట్యం"

ఆమె ఆగటం చూసి అవంతి అన్నాడు, "విప్లవం తాలూకు బావాలు బాగా జీర్ణం చేసుకుంది ఆమె. తరువాత
ప్రేమలో పడింది. ప్రియుడు మోసం చేసేడు. దాంతో ఘర్షణ భరించలేక చచ్చిపోయిన హిట్లర్ ఆలోచనలు తన
శరీరాన్ని ఆశ్రయించటాన్ని ఆహ్వానించింది. తనే హిట్లర్ నన్న భ్రాంతిలో కాలం గడుపుతూ వుంటుంది. దాన్ని ఆ
అమ్మాయి తాలూకు వాళ్ళు దెయ్యం నయంకాక ఇక్కడ జేర్పించారు -విప్లవభావం, ప్రేమ రెండు భిన్నకోణాల్లో"
అంటూన్న అతడి మాటల్ని మధ్యలో ఆపుచేసి, "అయితే దేముడూ -దెయ్యం ఇవేమీ లేవంటారా....." అంది
తులసి.

"లేవు" అన్నాడు డాక్టర్ కొద్దిగా విస్తు పోయి. తులసి సంగతి అతడికి తెలుసు ఆమె ప్రశ్న వేయడం అతడికి
ఆశ్చర్యంగా అనిపించింది.

"మీరు మూర్ఖులు" అంది తులసి.

అక్కడున్న వారంతా ఆమె మాటలకు స్థా ణువులయ్యారు. అవంతి మొహం పాలిపోయింది. పేలవంగా
నవ్వుతూ "సర్లేండి తులసిగారూ, రండి వెళదాం" అన్నాడు.

ఆమె మొహం చిట్లించి "తులసెవరు?" అంది.

అవంతిలోని డాక్టర్ ఆమెని పరీక్షగా చూసేడు. ఆమె కనురెప్పలు రెపరెపలాడుతున్నాయి. "నీ పేరు?" అని
అడిగాడు ఏకవచనంతో.

చుట్టూ వున్నవాళ్ళు భయపడేటంత బిగ్గరగా మొగగొంతుతో నవ్వింది తులసి. ఆమె కంఠంలో అకస్మాత్తు గా
వచ్చిన మార్పుకి అందరూ విస్తు పోతూండగా ఆమె అంది. "నా పేరా......." నవ్వింది మళ్ళీ. ".....కాష్మోరా"

దూరంనించి సుడిగాలి గిర్రు న తిరుగుతూ వస్తూంది.

* * *
"ఆమె కళ్ళలో ఆ నిస్తేజమైన చూపు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆమె అకస్మాత్తు గా
రెచ్చిపోవటంతో ఆ అనుమానం దృవపడింది."

"రెచ్చిపోయి కొట్టిందా?" అడిగాడు జయదేవ్.

"కొట్టబోతుంటే చుట్టూ వున్నవాళ్ళు పట్టు కున్నారు."

"ఐయామ్ సారీ డాక్టర్"

అవంతి లేచాడు. "ఇట్సాల్ రైట్ మీకు చెప్పనక్కర్లేదని నాకు తెలుసు. అయినా చెబుతున్నాను. ఇక్కడ
ఆస్పత్రిలో చూపించినా సరే. మీతో తీసుకువెళ్ళినా సరే."

జయదేవ్ మాట్లా డలేదు. షేక్ హాండిచ్చేడు. డాక్టర్ గుమ్మంవరకూ వెళ్లి వెనుదిరిగి "ప్రొఫెసర్" అన్నాడు.

జయదేవ్ ఏమిటన్నట్టు చూసేడు. డాక్టర్ కొద్దిగా తటపటాయించి "కాష్మోరా DX's ఏమిటి?" అని
అడిగాడు.

పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డా డు జయదేవ్. "కాష్మోరా.......కాష్మోరా" అతడి పెదవులు కంపించినయ్.


డాక్టర్ తన జవాబు కోసం ఇంకా ఎదురు చూడటం చూసి, తనలో తనే సర్దు కుని "నాకు తెలీదు" అన్నాడు
డాక్టర్ వెళ్ళిపోయాడు. వెనుకే స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది.

* * *
రాత్రి తొమ్మిది అవుతూ వుండగా పండిత్. శ్రీధర్ వాళ్ల ఇల్లు తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించాడు. అతడు
తన ఇంటిలోనే భోజనం పూర్తికానిచ్చేడు. అయినా శ్రీధర్ ఇంట్లో పదార్ధా లన్నీ తినే వాడిలా చెక్ చేసేడు.
తరువాత బెడ్రూంలోకి వచ్చాడు. నిజానికి ఇంట్లో గెస్ట్ రూం వుంది. కానీ అతడు తులసి వాళ్ళ బెడ్ రూమ్ లోనే
పడుకోదల్చేడు.

బెడ్ రూంలో రెండు మంచాలున్నాయి. ఒకటి తులసిది -ఇంకొకటి శారదది. అయితే అది ఎవరిదో
తెలియదు.

అతడు కుడివేపు మంచంమీద పడుకొన్నాడు.

అది తులసిది.

అతడు నిద్రకుపక్రమిస్తూ వుండగా పది కొట్టింది.

* * *
పదవుతూండగా జయదేవ్ తులసి గదిలోకి ప్రవేశించాడు. తులసి కిటికీ వూచలు పట్టు కొని నిలబడి
దూరంగా సముద్రంవైపు చూస్తూంది.

"ఎలా వుంది బేబీ"

ఆమె మాట్లా డలేదు. వెనుదిరగలేదు కూడా.

"చాలాకాలం తర్వాత నాకో కోర్కె పుడ్తోంది. ఏమిటి అని అడగవేం?"

"ఏమిటి" ఆమె కంఠం ఎక్కణ్నుంచో వస్తు న్నట్టు హీనంగా వుంది. అతడు మాట్లా డకపోవటం చూసి వెనక్కి
తిరిగి "ఏమిటి" అంది మళ్ళీ.

అతడు నెమ్మదిగా అన్నాడు. "నిన్నోసారి హిప్నాసిస్లోకి తీసుకెళ్ళాలనుంది బేబీ"

ఆమె అతడివైపు అయోమయంగా చూసింది. అతడు దాన్ని పట్టించుకోకుండా "ఇలా వచ్చి కూర్చో అని.
ఆమె కుర్చీలో కూర్చోగానే తలమీద చెయ్యివేసి "నువ్వు హాయిగా నిద్రపోతున్నావు -నీకు నా మాటలు తప్ప
మరేమీ వినిపించటం లేదు. హాయిగా ప్రశాంతంగా అనసాగాడు.
తులసి కనురెప్పలు మూతపడసాగేయి.

* * *

రాత్రి పదకొండు అయింది.

అబ్రకదబ్ర భార్య పక్క మీద మెలికలు తిరిగిపోతూంది పక్కనే అతడు నిలబడి వున్నాడు. ఆమె చెయ్యి తన
చేతిలోకి తీసుకుని "కొంచెం ఓర్చుకో అమ్మా తగ్గిపోతుంది" అంటూంది ఆమె తల్లి. మంచానికి అటు పక్క
నిలబడి వున్నాడు ఆమె తండ్రి.

అందరి మొహాల్లో నిస్సహాయత.

అదే సమయానికి దార్కా స్మశానంలో ఆరో అంకం పూర్తిచేసి ఏడో అంకంలోకి వెళ్ళాడు.

* * *
పన్నెండవుతూ వుండగా పండిత్ కి మెలకువ వచ్చింది

ఏదో చప్పుడు

అతనికి మెలకువ వచ్చేసరికి వళ్ళంతా చెమట పట్టింది. ఏదో తెలియని ఉద్వేగం.......... రక్తప్రసరణ
అకస్మాత్తు గా వచ్చినట్టు భావన.

అతడు పక్కమీదనుంచి లేవబోతూంటే మళ్ళీ చప్పుడు వినిపించింది. లేచి బయటకు రాబోయాడు.


అప్పుడు తిప్పింది కడుపులో...... మరు నిముషం వాంతి అయింది.

అయిదు నిముషాల తర్వాత తేరుకున్నాడు. బాగా నీరసంగా వుంది. కానీ అదికాదు సమస్య ఏదో
జరుగుతూంది. ఏదో..... ఆ గదిలోంచి ఏదో శక్తి తనని బయటకు తోసెయ్యటానికి ప్రయత్నం చేస్తోంది. అతడి
గుండెల్లో దడగా వుంది. రక్తం శరీరం అంతా వడివడిగా ప్రవహించటం తెలుస్తూంది. 'వెళ్ళిపో.......వెళ్ళిపో...'
అతడి మనసు తొందర పెడుతుంది.

కానీ అతడు వెళ్ళదల్చుకోలేదు. ఆ గది రహస్యం తెలుసుకొని గానీ బయటకు పోదల్చుకోలేదు.

ముందు తులసి పక్కకింద, మంచంకింద వెతికేడు. ఆ తరువాత రెండోపక్క అంతా వెతికి చూసేడు. అది
వెదుకుతూ వుండగా రెండోసారి వాంతయింది.

అతడు బాగా నీరసపడిపోయాడు. అతి కష్టంమీద టీపాయ్ సోఫాలు జరిపి వెతక గలిగాడు. ఆ తరువాత
డ్రెస్సింగ్ టేబిల్ దగ్గిరకు వెళ్తూంటే మూడోసారి మళ్ళీ వాంతయింది.

దాంతో అతడికి స్పృహ తప్పసాగింది. నరాల్ని నిస్సత్తు వ ఆవరించింది. వాష్ బేసిన్ ని పట్టు కొని మోకాళ్ళమీద
కూలిపోయాడు. పక్కవరకూ వెళ్ళటానికి కూడా ఓపిక లేకపోయింది.
పూర్తిగా స్పృహ తప్పుతూ వుండగా టెలిఫోన్ మోగింది.

వైజాగ్ నుంచి జయదేవ్ చేసిన ట్రంక్ కాల్ అది.

* * *
"నీ పేరు?" జయదేవ్ నిద్రపోతున్న తులసిని అడిగాడు. తులసి హిప్నాటిక్ ట్రాన్స్ లో వుంది. ఆమె మాట్లా డలేక
పోవటంతో అదే ప్రశ్నని రెట్టించాడు. "నీ పేరు?"

"కాష్మోరా!"

అతడి భృకుటి ముడిపడింది. సర్దు కోవటానికి కొంచెం సేపు పట్టింది అతడి ప్రశ్నలకి తులసి నిద్రలోనే జవాబు
యిస్తూంది.

"నీ వయసెంత?"

"పదకొండు"

"నెలలా, సంవత్సరాలా?"

"సంవత్సరాలు"

"నీకేమిటిష్టం?"

"స్కిప్పింగ్"

"ఇంకా"

"బొమ్మలెయ్యటం"

"ఏం చదువుతున్నావు నువ్వు"

మౌనం

"ఎక్కడ పుట్టా వు"

మౌనం
"సముద్రంలోనా, భూమిలోనా, గాలిలోనా, స్మశానంలోనా? ఎక్కడ పుట్టేవు నువ్వు?"

మౌనం

"దెయ్యాలున్నాయా"

అప్పటివరకూ అచేతనంగా వున్న తులసి శరీరం పాములా నెమ్మదిగా మెలికలు తిరగసాగింది. జయదేవ్
అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసేడు. దూరంగా గడియారం పన్నెండు కొడుతూంది. బయట సముద్రం మీద
చీకటి కాటుకలా పరుచుకొని వుంది. తులసి నోరు ఎడమ పక్కకి వెళ్ళిపోతూంది. నాలుక బయటకొచ్చింది.
కొండచిలువ తన తోకని తానే పట్టు కోవటానికి ప్రయత్నం చేసినట్టు తులసి తల వెనక్కి వంగుతోంది. వెన్నెముక
విరిగిపోతుందా అన్నట్టు వంగి, మోకాళ్ళ వెనుక భాగాన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేస్తూంది. బిగించిన
పళ్ళమధ్య నుంచి భయంకరమైన శబ్దం - కిర్ ర్ర్ ర్ర్ ర్ మని బయటకొస్తూంది. జయదేవ్ కి భయం వేసింది.
జీవితంలో మొట్టమొదటిసారి........ఆ చీకటి రాత్రి....

"ప్లీ...........స్" అని అరిచేడు.

రెండు నిముషాల్లో సబ్జెక్టు సర్దు కొంది.

జయదేవ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తులసికి పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ఇచ్చేడు. "నువ్వు ప్రశాంతంగా
నిద్రపోతావు. నిద్రనుంచి నీకు మెలకువ వచ్చేక అయిదు నిముషాలకు నీకు బొమ్మలు గీయాలన్న కోర్కె
పుడుతుంది. నీ మనసుకు నచ్చిన బొమ్మ మనసు చెప్పినట్టూ గీస్తా వు. చెయ్యి ఎలా వెళితే అలాగే....... కేవలం
మనసు చెప్పినట్టు ......."

ఆమాటలు విని అతడు ఆమె పక్కన కాగితమూ, కలమూ పెట్టి తన గదిలోకి వచ్చేసేడు.

కిటికీ దగ్గర నిలబడి సముద్రాన్ని చూస్తుంటే కెరటాల్లాంటి ఆళోచనలు మనసులో......

దీనికంతటికీ కారణం శ్రీనివాసపిళ్ళయ్ అనుకుంటే, తను తులసిని ఎవరికీ తెలియని ప్రదేశానికి


తీసుకొచ్చేడు కదా. అయినా ఇలానే ప్రవర్తిస్తూందేమిటి?

కాష్మోరా నిజంగా వుందా? ఆ విషయం తెలియకపోయినా బావుణ్ణు.

నిజంగా తను నమ్మిన విషయాన్ని చెప్పి తనను ఇరకాటంలో పడేసేడు శ్రీనివాసపిళ్లయ్. ఒకవేళ తులసి
మానవాతీత శక్తు లతో బాధ పడుతున్న పక్షంలో ఇలా తనవెంట తీసుకొచ్చి చాలా పొరపాటు చేస్తు న్నాడు.
తనకు ఓ అమ్మాయిమీద ఇలా ఎక్స్ పెరిమెంట్లు చేసే అధికారం లేదు. తన ఓటమి తులసిని రక్షించే పక్షంలో
తను ఓడిపోవటానికి అభ్యంతరం లేదు.
కొంతకాలం క్రితం ఓ ఫకీరు ఏ మాటలు ఎనుకున్నాడో సరీగ్గా అవే మాటలు ఆ ప్రొఫెసరు కూడా ఆ క్షణం
అనుకున్నాడు "శ్రీధర్ ఎక్కడున్నావయ్యా.....తొందరగా వచ్చి నీ కూతుర్ని రక్షించుకో!"

మేఘాల మధ్యనుంచి గాలిలా దూసుకువస్తు న్న విమానపు చివరి సీట్లో - వెనక్కి వాలి కళ్ళు మూసుకొని
కూర్చొని వున్నాడు శ్రీధర్.

* * *
గంట అయ్యేక తులసి గదిలోకి ప్రవేశించాడు జయదేవ్. తులసి పక్కమీద నిద్రపోతుంది. ఆమె ట్రాన్స్ నుంచి
బయటకొచ్చినట్టు వస్తు వులు చెదిరివున్నాయి. అతడు చప్పున కాగితంవైపు చూసేడు దానిమీద బొమ్మ వేసి
వుంది.

ఇలా -

అతడి మొహం వాడిపోయింది.

తులసి ప్రవర్తన, మానసిక పరిస్థితి, చివరికి ఈ బొమ్మ ఒకే బొమ్మలో ఎన్నో భావాల్ని చొప్పించటానికి చేసిన
ప్రయత్నం.

అన్నీ కలిపితే -

స్కిజోఫ్రెనియా.

అతడు తన గదిలోకి వచ్చిన తర్వాత చాలాసేపు నిద్రపోలేదు. ఈ విషయం అంతా శారదకి చెప్పటం తన
బాధ్యత అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చాక ఇక ఆగలేదు. శ్రీధర్ ఇంటికి ట్రంకాల్ చేసేడు.

ఇప్పుడు దాదాపు పన్నెండున్నరయింది.

పండిత్ వాష్ బేసిన్ పక్కన పడిపోయి వుండగా ఫోన్ మోగింది.

చెవులు గింగుర్లెత్తేలా ఫోన్ మోగటం అతడికి వినిపిస్తూనే వుంది. కానీ అతడు లేవటానికి అశక్తు డయ్యాడు.

తన ప్రాణం పోతుందని అతడికి తెలుసు. అయితే అంతటి విజ్ఞుడికి తన ప్రాణాన్ని తీసే శక్తి ఏదో
తెలియటంలేదు. ఒకటి మాత్రం తెలుసు. ఆ శక్తి తులసికోసం ఉద్దేశింపబడింది. తన మూర్ఖత్వంవల్ల వచ్చి ఆ
రాత్రి ఆ సాలెగూడులో చిక్కుకున్నాడు.
ఫోన్ మోగటం ఆగిపోయింది.

"నెంబర్ నో రెస్పాన్స్ సర్ -ఎవరూ ఎత్తటం లేదు" అంది టెలిఫోన్ ఆపరేటర్. జయదేవ్ ఫోన్ పెట్టేశాడు.
అతడి భృకుటి ముడిపడింది.

24
దార్కా స్మశానంలో ఆ రోజు అలంకరణ పూర్తిచేసి వూళ్ళోకి వచ్చేసరికి ఒంటిగంట దాటింది. అతడు వీధి
మలుపు తిరుగుతూ వుండగా ఒక కారు, పక్క నుంచి వెళ్ళి మలుపులో కొద్దిగాస్లో అయింది. అతడు డ్రైవింగ్
సీటు దగ్గర వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డా డు.

ఒకప్పుడు ఆ వ్యక్తి తనని కాష్మోరా గురించి అడిగేడు. తులసి మరణం గురించి వాకబు చేసేడు. అదే
కారు......

దార్కా కారువెనకే నడక వేగం హెచ్చించాడు.

కారు వీధిమలుపులో అదృశ్యమైంది. ఆ వీధి చివరికి వెళ్ళాడు . కుడికా -ఎడమకా అని ఆలోచించి, కుడికి
తిరిగేడు. ఆ వీధి అయ్యాక

నాలుగిళ్ళ తర్వాత పోర్టికోలో కనబడింది కారు. లోపల లైటు వేసి వుంది.

అతడు తనని తులసి మరణం గురించి ఎందుకు అడిగాడు?

దార్కా సంశయించలేదు. లోపలికి ప్రవేశించాడు. లోపలి వ్యక్తి తలుపు వెయ్యలేదనుకుంటాను -


చప్పుడవకుండా లోపలికి ప్రవేశించాడు.

డిమ్ లైటులో ఆ వ్యక్తి చొక్కా విప్పుకుంటున్నాడు.

మెడ దగ్గర చిన్న సిగరెట్ పెట్టెలాంటి వస్తు వు అద్దంలో కనబడే అస్పష్టమైన ఆకారం -

చూస్తు న్న దార్కా ఉలిక్కిపడ్డా డు.

అదే ఆకారం. ఎక్కడో చూసేడు. ఎక్కడా -చప్పున అతడికి స్పురించింది.

సిద్దేశ్వరి!

అతడు సిద్దేశ్వరి.
దార్కా ఇలా ఆలోచిస్తు న్న సమయంలో శ్రీనివాసపిళ్ళయ్ బట్టలు మార్చుకొని నిద్రకుపక్రమించేడు. ఆ
తరువాత ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. దార్కా కి ఆశ్చర్యంగా కనిపించిన విషయం సిద్దేశ్వరి
పడుకోబోయేముందు తలుపులు వేయకపోవటం.... ఇంట్లో సామానులేవీ లేకపోవటం.......

ఒక్కో గదీ చూసుకొంటూ హాలులోకి ప్రవేశించిన దార్కా ఉలిక్కిపడ్డా డు. బల్లమీద పెద్ద ఫోటో వుంది.

అది తులసిది.

అతడు చప్పున అడుగు వెనక్కి వేయటంతో చెయ్యి ఒక పడవాటి పెట్టెమీద పడింది. వీణ పెట్టెలా వుందది.
అతడు దాని తలుపులు నెమ్మదిగా తెరిచాడు. మాంత్రికుడూ, శవాలతో ఆడుకునేవాడూ అయిన అతడే
భయంతో ఒక్క అడుగు వెనక్కి వేసేడు.

చేతులు రెండూ చాతీమీద పెట్టు కుని సజీవాకృతిలో నవ్వుతూ వున్నాడు సదానంద చక్రవర్తి.

మమ్మీ!

దార్కా ఆశ్చర్యం చక్రవర్తి ప్లా స్టిక్ శవాన్ని చూసి కాదు -తులసి బొమ్మని చూసి.. తన ఊహ నిజమైతే సిద్దేశ్వరికి
తులసి మొదటి సారి పరిచయమైంది ఆమె ఆలయం ధ్వంసం చేసినప్పుడు కావొచ్చు. అప్పుడే పగగా మారి
వుండవచ్చు. మరి తులసి బొమ్మ ప్రేము కట్టించి ఇంట్లో పెట్టు కోవటం దేనికి?

అతడు మరో గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో రకరకాల వైర్లూ కెమికల్సూ వున్నాయి. అవన్నీ జయదేవ్ ని
చంపటంకోసం పిళ్ళయ్ ఉపయోగిస్తు న్నవి. అతడు ఓ బాటిల్ ని అల్మైరా నుంచి బయటకు తీసి, చూసి లోపల
పెట్టేడు. అతడికి విషాల గురించి అంతగా తెలీదు. అతడు తీసిన బాటిల్ పొటాషియం సైనేడ్.

అల్మైరా తరువాత బల్లమీద పుస్తకాలు పరీక్ష చేసేడు. పుస్తకాల మధ్య ఓ కాగితం కనబడింది. ఆ కాగితంలో
వున్న పేర్లు చూసి ఆశ్చర్యపోయాడు అతడు. అందులో తన పేరూ, తులసి పేరూ, ఇంకెవరో జయదేవ్ పేరూ
వ్రాసి వున్నాయి. జయదేవ్ పేరుకింద ఇరవై నాలుగు స్టెప్స్ వ్రాసి వున్నాయి.

1. కార్లో కార్బన్ డై ఆక్సైడ్


2. షేవింగ్ క్రీంలో పోటాషియం సైనేడ్.
3. టెలిఫోన్ లో ఎండ్రిన్.......ఇలా......

అతడికది ఏమీ అర్ధంకాలేదు. కానీ ఒకటి మాత్రం అర్ధమైంది. తనెలా ముగ్గుర్నీ చంపుదామనుకున్నాడో,
అలాగే సిద్దేశ్వరి తను ముగ్గుర్నీ చంపదల్చుకున్నాడు.

అతడికి నవ్వొచ్చింది. ఇంకొద్ది రోజుల్లో తులసి మరణం. తను వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ జయదేవ్
ఎవరో -అతడి మీద పగ సాదించటం ఒక్కటే సిద్దేశ్వరి చేయగలిగేదే. అతడిని జాగ్రత్తగా వుండమని తులసి
కనబడితే చెప్పాలి. అయితే తులసికి ఈ జయదేవ్ తెలుసో తెలీదో.......

అతడు ఆలోచనలలో వుండగానే పక్కరూమ్ లో చప్పుడు అయింది. అతడు తలవంచి చూసేడు. పక్కమీద
సిద్దేశ్వరి (పిళ్ళయ్) అటూ ఇటూ పొర్లు తున్నాడు. అతడి చెయ్యి గోడమీద తడుముతూంది. అక్కడో
వైరుకనెక్షన్ వూడిపోయింది. అతడు అంత తొందరగా ఎందుకు ఇంటికి వచ్చి, తలుపులన్నా వేసుకోకుండా
పక్కమీదవాలిపోయాడే దార్కాకు అర్ధమయింది. ఆ వైరుకి, అతడికీ ఏదో సంబంధం వుంది.

దార్కా నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి వైరు సరిచేశాడు. ఆ తర్వాత నిశ్శబ్దంగా ఇంటినుంచి బయటపడ్డా డు.

* * *
"నో రెస్పాన్స్"అని టెలిఫోన్ ఆపరేటర్ చెప్పగానే జయదేవ్ ఉలిక్కిపడ్డా డు. అతడి మనసేదో కీడు
శంకించింది. శారద ఏమయి వుంటుంది?

విద్యాపతి యింకా విచారం నుంచి తేరుకోలేదు. అబ్రకదబ్ర భార్యకు బావోలేదు. అందుకే పార్ధసారధి ఇంటికి
ఫోన్ చేసేడు. పార్ధసారధి నిద్ర గొతు వినిపించింది. "రెండ్రోజుల నుంచీ వాంతులయి. శారదగారు ఇక్కడే
పడుకొన్నారు. కానీ తాళాలు పండిత్ తీసుకెళ్ళారు" జయదేవ్ చేతిలో టెలిఫోన్ వణికింది. "క్విక్"
అనరిచేడు........ "వెంటనే పండిత్ యింటికి ఫోన్ చెయ్యండి. అతడు అక్కడుంటే సరే, లేకపోతే శ్రీధర్ ఇంటికి
వెళ్ళండి. పండిత్ ఎలా వున్నాడో చూడండి."

"ఇప్పుడా, రాత్రి రెండింటికా."

"ఇప్పుడే - క్విక్"

"ఇంత రాత్రప్పుడు ఎందుకు"

జయదేవ్ కి సహనం నశించింది. "వాంతులకి కారణం వంట్లో బాగోలేకపోవటం కాదు డాక్టర్ గారూ....
తులసి గదిలో పడుకోవటం..... ఆ గది సంగతి గ్రహించాడు. అందుకే ఆ వలలోకి అతడు ప్రవేశించాడు.
తొందరగా వెళ్ళండి అతడిని రక్షించండి."

ఫోన్ డిస్ కనెక్టయింది.

గంట తర్వాత పార్దసారధి నుంచి ఫోన్ వచ్చిది -పండిత్ స్పృహతప్పి వున్న స్థితిలో ఆ గదినుంచి బయటకు
తీసుకొచ్చినట్టూ, అతడు కోలుకుంటున్నట్టూ........

జయదేవ్ ఆ మాటలు విని అంతగా సంతోషించలేదు. అయితే వేట సాగుతూనే వుందన్నమాట?


అనుకున్నాడు. అతడికి అర్ధం కానిది ఒకటే.....
కాష్మోరా లేదనుకుంటే...... తులసి ఇంకా తన గదిలో వుందనుకొనే, పిళ్ళై సైన్సు ద్వారా ఆమెని
బాధపెడ్తు న్నాడని అనుకొంటే -మరి తులసిని తనతో ఇంతదూరం తీసుకొచ్చాక కూడా ఆమె ఎందుకు పిచ్చిగా
ప్రవర్తిస్తూంది.?

మానవాతీత శక్తు లున్నాయా!

ఉన్నాయా అనుకొంటే మరి కాష్మోరా ఇంకా నిద్ర లేవకముందే తులసి ఇలా పిచ్చిగా ఎలా ప్రవర్తిస్తుంది?

దూరంగా మూడు కొట్టింది. ఈ రాత్రి ఇక నిద్ర పట్టదు. అతడు తులిస గదిలోకి వెళ్ళాడు. ఆమెకు
నిద్రాభంగం కలిగించకుండా మళ్ళీ ఆ కాగితాన్ని తీసుకుని గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చొని, బొమ్మని చూసేడు
ఏమీ అర్ధంకాలేదు. ఆ కాగితం పట్టు కొని కిటికీ వద్దకు ఆలోచిస్తూ నడిచేడు.

బొమ్మ ఆమె 'ఇన్ సెక్యూరిటీ' ని తెలుపుతూందన్న మాట వాస్తవం. అయితే ఆమె ఎందువల్ల ఆ భావాన్ని
పెంపొందించుకొంది? కాష్మోరా అనే దెయ్యం గురించి ఆమెకు ఎవరయినా చెప్పారా?......ఈ సమస్య ఎటూ
తేలదు.

అతడు ఆ కాగితాన్ని కిటికీలోంచి బయటకు వదిలేశాడు. అది కింద ఇసుకమీద పడింది. ముందు. ఆ
తరువాత గాలి తెమ్మెరకి సముద్రం వైపు వెళ్ళిపోయింది. ఒక కెరటం నెమ్మదిగా దాన్ని తనలో ఐక్యం చేసుకుంది.

జయదేవ్ గాని ఆ బొమ్మని మరికొంత సేపు చూసి, ఎనలైజ్ చేసి వుంటే ఓ అద్భుతమైన రహస్యం
బయటపడి వుండేది.

ఐదు అవుతూండగా తలుపు తట్టిన శబ్దం వినిపించి మెలకువ వచ్చింది జయదేవ్ కు. కిటికీలోంచి వెలుతురు
పడుతోంది. తలుపు తెరిచేడు ఎదురుగా తులసి.

"గుడ్ మార్నింగ్ అంకుల్"

"రా రా, అప్పుడే స్నానం చేసేసేవే....."

తులసి నవ్వి "ఇదిగో ఇది చదువు" అని ఓ కాగితాన్ని ఇచ్చింది. జయదేవ్ దాన్ని అందుకొని
చదువుతూండగా, చప్పుడు కాకుండా టేబిల్ మీద వున్న కారు తాళాలు తీసికొంది అడుగుల శబ్దం
వినిపించకుండా గది బయటకు నడిచి, నెమ్మదిగా తలుపును బయట గడియ వేసింది. ఆ తర్వాత మరి క్షణం
ఆగలేదు. జువ్వలా తన గదిలోకి పరుగెత్తి బ్రీఫ్ కేస్ తీసుకొని కారిడార్ లోంచి మెట్లు మీదకు వడివడిగా
చేరుకుంది రాకెట్ కన్నా వేగంగా మెట్లు దిగి, రిసెప్షన్ దాటింది.

జయదేవ్ తులసి ఏం వ్రాసిందా అని చదవసాగేడు కాగితంలో ఇలా వుంది!


".........సముద్రం మీద చీకటి.......నాకు పిచ్చి అనుకున్న వాళ్ళకు పిచ్చి. అనంతానంతమైన బ్రహ్మాండం.
బ్రద్దలవ్వటానికి ఆర్నెల్లు అడ్డం విప్లవాల రోచిస్సులు - దేముడి చుట్టూ శృంఖలాలు. ఎవర్నీ ఆపలేవు.
వెళ్ళిపోతున్న నన్నూ ఆపలేవు.......గుడ్ బై అంకుల్"

చివరివరకూ అతడు చదవలేదు. తలుపు చప్పుడవటంతో పరుగెత్తు కు వెళ్ళి వాటిని బలంగా లాగేడు,
రాలేదు. బల్ల మీద చూస్తే తాళాలు లేవు. కిటికీలోంచి తులసి కారిడార్ లో పరుగెత్తటం కనిపించింది. అతడు
చప్పున టెలిఫోన్ దగ్గరికి పరుగెత్తా డు.

తులసి వడివడిగా మెట్లు దిగుతుంటే అతడు హోటల్ ఆపరేటర్ కు ఫోన్ చేసేడు. జయదేవ్ చెప్పేది
అతడికేమీ అర్దంకాలేదు. నిద్రకు జోగుతున్నాడు.

"గివ్ మీ రిసెప్షన్......" రిసీవర్ బద్దలయ్యేటట్టు అరిచేడు. మరు నిమిషం రిసెప్షనిస్టు లైన్ లోకి వచ్చాడు."ఆ
అమ్మాయిని ఆపండి.......తులసి.." అతడి మాటలు రిసెప్షనిస్టు కు అర్ధమయ్యే లోపులో తులసి కౌంటర్
దాటింది. మరు నిముషం పార్కింగ్ ప్లేస్ లోంచి నల్ల అంబాసిడర్ బాణంలా బయటకు దూసుకుపోయింది.

రిసెప్షనిస్ట్ తాపీగా బయటకు వెళ్ళి చూసొచ్చి కారు వెళ్ళిపోయిందని ఫోన్ లో చెప్పేడు. ఈ లోపులో గది
తలుపులు బైటనుంచి తెరిచారెవరో.

జయదేవ్ పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసేడు. కారు నంబరు, వెళ్లే దారి చెప్పాడు.

"క్రిమినల్?" అడిగాడు సబ్ ఇన్ స్పెక్టర్.

"కాదు......"

"మరి....."

జయదేవ్ క్షణం ఆగేడు. "ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదు"

"మైగాడ్? పిచ్చిదా?"

అతడు తటపటాయించి, "ఔను ఇన్ స్పెక్టర్ పిచ్చిదే" అన్నాడు అలా అంటుంటే అతడి కళ్ళుతడి
అయ్యేయి.

జీవితంలో మొదటిసారి........

* * *
పోలీస్ స్టేషన్ లో ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి పదయింది.

వైజాగ్ లో మరి వుండదల్చుకోలేదు. తులసిని తీసుకుని వూరు వచ్చేసేడు. అతడు వచ్చేసరికి పండిత్ బాగా
కోలుకున్నాడు. వాళ్ళు ఇద్దరూ కలిసి, తులసి గదిని క్షుణ్నంగా వెతికారు. ఏమీ దొరకలేదు. ఆ రాత్రి ఆ ఇంటిలో
పడుకున్నారు. చాలా చిత్రంగా ఏమీ కాలేదు. ఆ తర్వాత రోజు శారద, తులసి కూడా పడుకున్నారు. ఆ
మరుసటిరోజు సమస్య లేకపోయింది. ఎందుకంటే శ్రీధర్ వచ్చేది ఆ రోజే.

శారద బాగా కృంగిపోయింది. ఇంటిలో హుషారుగా తిరిగే కూతురు పిచ్చిగా ప్రవర్తించటం ఎవరినయినా
కృంగదీస్తుంది.

మామూలప్పుడు తులసి మామూలుగానే ప్రవర్తించింది. పిచ్చి ఎక్కువైనప్పుడు మాత్రం ఎవరూ


పట్టు కోలేరు.

దార్కా కూడా పెద్ద సంతోషంగా ఏమీలేడు విద్యాపతి మనవరాలి మరణంతో అతడు విద్యాపతి, చంపటం
అనే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. విషాచి పసరు పోసినప్పుడు కన్ను పోయిందనుకున్నాడు.
అప్పుడు భస్మం చేయటం అన్న ప్రసక్తే లేదు తరువాత కన్నుకి ఆ శక్తి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆ కన్నే
పోయింది. పొడుచుకోవటం వల్ల.

అబ్రకదబ్ర భార్య మరణానికి ఇంకా పదిరోజులున్నది. ఆ తరువాత చేయవలసిన కార్యక్రమమంతా మిగిలి


వున్నది. అప్పటిదాకా ఏమి చెయ్యాలి?

దార్కాకి జయదేవ్ పేరు జ్ఞాపకం వచ్చింది. తమ ఉమ్మడి శత్రు వయిన సిద్దేశ్వరి ఇంటిలో అతడి పేరు చూసేడు.
అతడికి సిద్దేశ్వరి హత్యా ప్రయత్నాలు గురించి చెబితే..........? కనీసం అతడు ప్రాణాలయినా
రక్షఇంచబడతాయి కదా!

అతడు జయదేవ్ చిరునామా తెల్సుకోలేడు.

అతడు శ్రీధర్ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడుతూంది. అతడిని ముందు చూసింది శారద. అతడిని
చూస్తూనే మొహం చిట్లింటి........."ఏం కావాలి?" అంది.

"తులసి" అన్నాడు.

"ఆమె లేదు" అనబోతూ వుంటే లోపల్నుంచి 'కమిన్' అని వినిపించింది. దార్కా అటు నడిచేడు.

గదిలో పక్కమీద వున్న తులసిని చూసి అతడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి అంతలో సర్దు కున్నాడు.

నెల రోజుల పూర్వం చూసిన తులసికీ, ఈ తులసికీ అసలు సంబంధంలేదు. ఆమె మొహంమీద గోళ్ళు
రక్కులు.......ఆమె గీసుకున్నవే వున్నాయి. మెడ చీపురుపుల్లలా మారింది. కళ్ళలో జీవం లేదు.
అతడు ఆమెవేపు జాలిగా చూసాడు. కాష్మోరా తన ప్రభావం అప్పుడే చూపించటం మొదలు పెట్టిందా? అలా
వీలులేదే? దానికి ఇంకా రెండు మూడు రోజులు గడువుంది. మరి తులసి ఇలా మారిందేమిటి?

తనతోపాటు లేడిలా ఒక్కో గదిలోంచి ఇంకో గదిలోకి పరుగెత్తిన హుషారయిన అమ్మాయేనా ఈమె? ఇలా
అస్తిపంజరంలా మారిపోయింది.

"అలా నిలబడిపోయావేం? రా"

ఆ గొంతులో మార్దవం లేదు. బొంగురుగా వుంది. అతడు గది లోపలికి ప్రవేశించాడు. అప్పుడు తులసి
మామూలుగానే వుంది.

"కూర్చో" అంద.

అతడు కూర్చోలేదు "జయదేవ్ అనే ఆయన నీకు తెలుసా?" అన్నాడు.

"ఓ! జయదేవ్ అంకుల్ -తెలియకపోవటమేం?" అంది.

అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వీళ్ళు అలా మాట్లా డుకొంటున్న సమయంలో శారద అవతలి
గదిలోంచి అబ్రకదబ్రకి ఫోన్ చేస్తూంది "ఆ ......అతడే.......ఇక్కడే వున్నాడు"

"నేను వస్తు న్నాను" అని అబ్రకదబ్ర ఫోన్ పెట్టేశాడు.

ఈ లోపులో జయదేవ్ చిరునామా తెలుసుకొని దార్కా లేచేడు.

"అప్పుడప్పుడూ వస్తూ వుండు " అంది తులసి "నాకేం కాలేదంటే వీళ్ళు నమ్మటంలేదు. దెయ్యం పట్టిందట
నాకు. దెయ్యం పట్టిన వాళ్ళు ఇలా మామూలుగా మాట్లా డతారా ఎక్కడయినా?"

"నీకు దెయ్యం పట్టిందన్న వాళ్ళకే దెయ్యం పట్టింది"

"అమ్మ! ఇన్నాళ్ళకు నన్ను సపోర్టు చేస్తు న్నవాడివి ఒక్కడివి కనబడ్డా వు......... కమాన్! ఐస్ క్రీం తిందూగానీ
రా" అంటూ మంచం కింద నుంచి లక్కపిడతలు తీసింది. దాన్ని పిల్లలాడుకొనే ఆ చిన్న చెక్క గిన్నెలో శనగపప్పు
ముద్ ఐస్ క్రీంలా వుంది.

"చాలా బాగా అన్నావు సుమా! నాకు దెయ్యం పట్టిందన్న వాళ్ళకు దెయ్యం పట్టింది. అసలు దెయ్యం
గురించి మాట్లా డితేనే దెయ్యం పడుతుంది. నవ్వింది దేముడి గురించి మాట్లా డు (ఏడుపు) దేముడి గురించి
చెడుగా మాట్లా డేను నేను. అందుకే దెయ్యాన్నిపంపించేడు నా మీదకి. నా దెయ్యం పేరేమిటో తెలుసా -
(నవ్వు) హహ్హా - కాష్మోరా - ఐయామ్ కాష్మోరా"

కూతురికి మళ్ళీ స్ట్రోక్ వచ్చినదని శారద ఇంజెక్షన్ ఇవ్వటం కోసం గదిలోకి రాబోయి, ఆ దృశ్యాన్ని చూసి
ఆగిపోయింది.

గది మధ్యలో దార్కా నిశ్చలంగా నిలబడి వున్నాడు. అతడి చూపు తులసివేపు తీక్షణంగా ప్రసరిస్తూంది.
తులసి పక్క మీద ఓ మూలకు ముడుచుకుపోయి కూర్చుంది. అతడి మొహంలో ఏదో ఉజ్జ్వలత స్పష్టంగా
కనబడుతూంది. అది తులసి పిచ్చిని అణచివేస్తు న్నట్టూ వుంది. తులసి అసంబద్దమైన మాటలు క్రమంగా
తగ్గిపోయినయ్. మామూలుగా మారిపోయి పక్కమీద వాలిపోయింది. చూస్తు న్న శారదకి దిగ్బ్రాంతితో
నోటమాట రాలేదు.

ఈ లోపులో బయట కారు చప్పుడయింది. అబ్రకదబ్ర లోపలికి వస్తు న్నాడు. దార్కా తులసి గదిలోంచి
బయటకొచ్చాడు. ఇద్దరూ హాల్లో కలుసుకున్నారు క్షణం ఆగి, దార్కా బయటికి కదలబోతూంటే "ఆగు"
అన్నాడు అబ్రకదబ్రయ

దార్కా ఆగేడు.

"ఎందుకొచ్చావిక్కడికి?"

"తులసిని చూద్దా మని......."

అబ్రకదబ్ర అతడి రెక్క పట్టు కొని విసురుగా వెనక్కి తిప్పేడు. దార్కా తూలి పడబోతూంటే ఆపుచేసి "మళ్ళీ
ఆ చుట్టు ప్రక్కల ఎక్కడయినా కనపడ్డా వో జాగ్రత్త" అని ముందుకు తోసేడు

దార్కా నిలదొక్కుకుని తాపీగా అన్నాడు - "మా జాతిగురించి మీకు సరిగ్గా తెలీదు. మేం ఏదీ వుంచుకోం!
దెబ్బకుదెబ్బ! ఆ రోజు స్మశానంలో వూహించని రీతిలో నన్ను కొట్టేరు. అనుకొన్నప్పుడు దెబ్బ తగిలితే ఎలా
వుంటుందో తెలుసా" అని అబ్రకదబ్ర ఆ మాటల అర్ధా న్ని గ్రహించే లోపులో గెడ్డం క్రింద ఎంత బలంగా
కొట్టా డంటే -ఆ దెబ్బకి మొజాయిక్ ఫోర్ మీద అతడు చివరివరకూ జారి గోడకి కొట్టు కుని ఆగేడు. దవడ
పక్కకు జరిగిపోయింది.

శారద కట్రాటై చూస్తూ వుండగా, తాపీగా, అసలేమీ జరగనట్టూ అక్కణ్నుంచి కదలి వెళ్ళిపోయాడు దార్కా.

* * *
నాగరిక ప్రపంచంలోకి వచ్చి అన్నీ నేర్చుకొన్న దార్కా కొన్ని విషయాలలో ఇంకా తికమక పడుతూనే
వుంటాడు. అటువంటి వాటిలో రోడ్డు దాటటం ఒకటి. పాదచారులు పచ్చలైటు వెలిగినప్పుడు రోడ్డు
దాటటాన్ని అతడు తూచా తప్పకుండా అమలుపర్చేవాడు. అయితే ఆ రోజు అతడు పొరపాటు చేసేడు. కార్లు
సాగిపోవటానికి వెలిగిన లేటు చూసి, అది తమ కోసమే అనుకొని రోడ్డు మీదకు నడిచేడు. దూసుకువస్తు న్న
కారుని చూసి, చప్పున వెనక్కి వెళ్ళబోయాడు కాని కొద్దిగా ఆలస్యం అయింది.

కీచుమన్న శబ్దంతో కారు ఆగింది. అతడికి పెద్ద దెబ్బలేమీ తగల్లేదు. మోకాలి దగ్గర గీసుకుపోయింది
కారులో కూర్చున్న వ్యక్తి చప్పున దిగి చెయ్యి అందిస్తూ "దెబ్బ తిగిలిందా " అనడిగేడు.

"లేదు" అన్నాడు దార్కా లేస్తూ.

ఈ లోపులో పోలీసు పరిగెత్తు కు వచ్చేడు -కేస్ బుక్ చెయ్యటానికి.

"ఆయనదేం తప్పులేదు. నాదే తప్పు" అన్నాడు దార్కా

కారు వ్యక్తి విసుగ్గా "పడినతనికి దెబ్బలు తగలలేదు. పైగా నాది తప్పు కాదంటున్నాడు ఇంకా ఎందుకు
స్టేషన్ కి" అన్నాడు.

"వాదనలనవసరం. స్టేషన్ లో అన్నీ ఎస్సైగారితో మాట్లా డుదురు గానీ" అన్నాడు పోలీసు. "లేదూ ఇక్కడే
తేల్చుకోవాలంటే......." ఆర్దోక్తితో తనకు కావాల్సింది సూచిస్తూ ఆపుచేసేడు.

కారు వ్యక్తి మొహం ఎర్రబడింది. "నయాపైసా ఇవ్వను. పద స్టేషన్ కి" అన్నాడు.

ముగ్గురూ స్టేషన్ కి వెళ్ళారు అతడిని చూస్తూనే ఎస్సై కుర్చీలోంచి లేస్తూ "బహుకాల దర్శనం, రండి -రండి"
అంటూంటే పోలీస్ మొహం వాడిపోయింది.

"తప్పంతా నాదే నాకీ ఎడమకన్ను కనబడదు. అందుకని ఆ లైటు మా కోసమే అనుకున్నాను" అన్నాడు
దార్కా

"ఫర్లేదు" అన్నాడు ఎస్సై. "అయినా ఈయన కారు ఫాస్టు గా రన్ చేసేడంటే నేను నమ్మను"

ఇద్దరూ నవ్వుకున్నారు.

వాళ్ళముందే పోలీసుని తలవాచేటట్లు చీవాట్లు పెట్టి, వాళ్ళకు టీ ఇప్పించి మరీ వదిలి పెట్టా డు యస్సై.

ఇద్దర బయటకొచ్చిన తర్వాత కారు వ్యక్తి దార్కాని చూసి నవ్వేడు "చాలా థాంక్స్ మీ అంత నిజాయితీగా
వున్న మనుషుల్ని నేనీకాలంలో చూడలేదు. మీ పేరు?" ఛేయి సాచి అన్నాడు.

"నా పేరు దార్కా"


"గుడ్, నా పేరు శ్రీధర్"

ముందుకు సాచిన దార్కా చెయ్యి మద్యలోనే ఆగిపోయింది.

చదరంగంలో పావులన్నీ సిద్దమయ్యేయి.

కాష్మోరా నిద్రలేవటానికి రెండు రోజులుంది. అబ్రకదబ్ర భార్య మరణానికి ఏడు రోజులుంది. తులసి
మరణానికి తొమ్మిది రోజులుంది. జయదేవ్ పదిరోజుల్లోగా మరణిస్తా డు. విద్యాపతి, శ్రీధర్, అబ్రకదబ్ర మరణం
కూడా ఆలోపే!

"గ్లా డ్ టు మీట్ యూ" అన్నాడు దార్కా ఇంగ్లీషులో మాట్లా డుతూ.

25
"మీరందరూ ఇంతకాలం నాకీ విషయం చెప్పకుండా ఎందుకు దాచారో అర్ధంకాలేదు" శ్రీధర్ మొహం
కోపంతోనూ, ఉద్వేగంతోనూ ఎర్రబడింది. ఎవరూ మాట్లా డలేదు - శారద, అబ్రకదబ్ర, జయదేవ్.........

"తులసి నోటివెంట కాష్మోరా అన్నపదం వచ్చిన వెంటనే నాకు కేబిల్ పంపటమో, ఫోన్ లో చెప్పటమో
చెయ్యాల్సింది. పదకొండు సంవత్సరాల క్రితం జరిగింది అందరూ మర్చిపోయారా లేక ఫర్లేదులే అని
వూరుకున్నారా....? అతడి తీక్షణతకి అబ్రకదబ్ర కూడా తలవంచుకున్నాడు.

శారద కొద్దిగా కదిలి "మేమిక్కడ ఓ సైక్రియాటిస్టు కి" అంటూ ఏదో చెప్పబోయింది.

"సైక్రియాటిస్టు ?" రెట్టించాడు శ్రీధర్. "నీ కూతుర్ని చిన్నప్పుడు ఏ సైక్రియాటిస్టు రక్షించాడు?"

శారద తలయెత్తి జయదేవ్ వైపు చూసింది. మాట్లా డవద్దన్నట్టు తలపంకించాడు. శ్రీధర్ ఉద్వేగం మాటల్లో
బయటపడటమే మంచిది. తులసికి ఇలా ప్రాణాలమీదకొచ్చిందని అతడికి ఇంటికొచ్చేదాకా తెలీదు.
తెలియగానే కోపంతో వూగిపోయాడు. అది తులసి అనారోగ్యంవల్ల కాదు - తమ ఇంట్లో కాష్మోరా పదం తిరిగి
వినిపించటం వల్ల!

"నాదే తప్పు"అన్నాడు జయదేవ్. "నేనొకటి వూహించాను. దాన్నుంచి తప్పించటం కోసం తులసిని నాతో
వైజాగ్ తీసుకుని వెళ్ళాను. అక్కడే ఈ కాష్మోరా ఆమెని ఆవహించటం గురించి తెలిసింది. అంతకు ముందు
ఆమె కొద్దిగా హిస్టీరికల్ గా ప్రవర్తించిన మాట నిజమే. కానీ దాని గురించి అంత సీరియస్ గా తీసుకోలేదు మేం"

జయదేవ్ మాటల్తో శ్రీధర్ కొద్దిగా శాంతించాడు అక్కడ అందరికీ జయదేవ్ అంటే గౌరవం వుంది.

"ఇన్నాళ్ళ తర్వాత తులసి నోటివెంట కాష్మోరా పేరు ఎందుకు బయటకొచ్చింది?"


"సరిగ్గా పదకొండు సంవత్సరాలకి" అన్నాడు అప్పటివరకూ మాట్లా డని అబ్రకదబ్ర. అతడితో మునుపటి
హుషారులేదు. భార్య అనారోగ్యం అతడిని బాగా కృంగదీసింది.

అందరూ అతడివైపు చూసేరు. ".....అసంతృప్తు డైన కాష్మోరా పదకొండు సంవత్సరాలకి లేస్తా డు. కాష్మోరా
గురించి తులసి మాట్లా డుతున్నది అని తెలియగానే లైబ్రరీలు వెతికాను. 'తంత్ర' అనే పుస్తకములో దొరికింది."

శ్రీధర్ మొహం వాడిపోయింది. గతంలో కాష్మోరా చేసిన ఘాతుకాల్ని తల్చుకుని వళ్ళు గగుర్పొడిచింది.

"మరెందుకు వెంటనే సంతాన్ ఫకీర్ ని......" మధ్యలో ఆపుచేసేడు అతనికి అబ్రకదబ్ర భార్య సంగతి
గుర్తు వచ్చింది. ఎవరి బాధల్లో వాళ్ళున్నారు.

"సంతాన్ ఫకీర్ నన్ను కలిసేడు" అంది శారద నెమ్మదిగా, ఆ గదిలో సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దం
వ్యాపించింది. ఖేచరి నేర్పమన్నాడు. ఖేచరంటే నాలుక కింద నరాన్ని కోసి సాగదీయటం. అలా చేయటాన్ని నేను
వూహించలేకపోయాను"

"ప్రాణంకన్నా అది ముఖ్యమా?"

"ప్రాణం పోకుండా అది ఆపు చెయ్యదు. దాని ప్రబావం కొద్దిగా తగ్గిస్తుందంతే."

"అంటే నా కూతురికి మరణం ఖాయమా!"

ఎవరూ మాట్లా డలేదు.

శ్రీధర్ లేచాడు. "గుడ్ బై ఎవ్విరిబడి నా గురించి ఎవరూ వెతక్కండి"

శారద మొహం ఆందోళనతో నిండింది.

"ఎక్కడికి?" అని అడిగేడు అబ్రకదబ్ర.

"సంతాన్ ఫకీర్ దగ్గరికి"

* * *
స్మశానం దాటేడు. ఏరు దాటేడు. కోట దగ్గరికి చేరుకున్నాడు.

అదే వాతావరణం అతడికి ఫకీరు శ్రీచక్రం ఇచ్చినప్పటి వాతావరణం. అవే జేగురు రంగు గోడలు - మూల
నిలిచిన వర్షపు నీరు.

అతడు చాలా సేపు వేచి వుండవలసి వచ్చింది.

రాత్రి దాదాపు ఒకగంట కావొస్తూ వుండగా పిచ్చిపాటలు పాడుకుంటూ ఫకీర్ కోటలో ప్రవేశించాడు.

"ఎవరదీ"

శ్రీధర్ వెలుగులోకి వచ్చేడు "నేను"

"నేనంటే"

"చాలాకాలం క్రితం కలుసుకున్నాను....... కాష్మోరా....."

"ఓ శ్రీధర్"

"అవున్నేనే"

ఫకీర్ గాఢంగా విశ్వసించేడు. "పదకొండు సంవత్సరాలు గడిచాయన్నమాట"

శ్రీధర్ మాట్లా డలేదు.

"కాద్రాని చంపి ఎంతకాలమయింది సరీగ్గా?"

"ఎల్లుండికి పదకొండు సంవత్సరాలు, సరీగ్గా"

"ఎల్లుండి రాత్రి కాష్మోరా నిద్రలేస్తూందన్నమాట. ప్రళయకాల ఝంఝా మారుతంలా" ఫకీర్ సాలోచనగా


అన్నాడు "ఏడురోజులు ఆవాహన తులసిని పీక్కుతినటానికి."

శ్రీధర్ వణుకుతున్న కంఠంతో "అలా జరగటానికి వీల్లేదు" అన్నాడు. ఫకీర్ తన ఆలోచనల్లోనే వుండి
"ఎవరాపగలరు" అన్నాడు.

"నువ్వు"

ఫకీర్ ధ్యానభంగం జరిగినట్టూ కళ్ళు తెరిచాడు. "మూర్ఖుడా, కాష్మోరాని ఎవరూ ఎదిరించలేరు"

"పదకొండు సంవత్సరాల క్రితమూ నువ్వీమాటే అన్నావు ఫకీర్"


"అప్పటి సంగతి వేరు. ఒక మంత్రగాడు కాష్మోరాని ప్రయోగం చేస్తుండగా అతడిని చంపటం జరిగింది. ఆఖరి
అంకం పూర్తికాక కాష్మోరా అసంతృప్తు డవటం జరిగింది. కానీ పదకొండు సంవత్సరాల్లో ఇప్పుడు ఆ అంకం
పూర్తయింది. పూర్తిబలం పుంజుకొని, రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన పగతో కాష్మోరా నిద్ర లేవబోతూంది.
దీనికి పూజ చేసినవాడుగానీ లేపేవాడుగానీ ఎవరూ లేరు. కేవలం పంచభూతాల సాయంతో అది
జరుగుతుంది. దాన్నెవరూ ఆపలేరు"

"నువ్వూ ఆపలేవా ఫకీరూ"

"కాష్మోరా ముందు ఫకీరు బ్రహ్మాండం ముందు పిపీలికమంత"

"అయితే నా కూతురు మరణించవలసిందేనా" శ్రీధర్ కంఠం వణికింది. ఫకీరు మాట్లా డలేదు.

* * *
పేషెంటు పేరు: తులసి

ఇన్ ఫార్మెంటు - జయదేవ్

పేషెంటు వయసు -21

చదువు - గ్రాడ్యుయేట్

తెలివితేటలు -నార్మల్ కన్నా ఎక్కువ

తల్లిదండ్రు లు - శారద, శ్రీధర్

తల్లిదండ్రు లు చదువుకున్నవారేనా - అవును

వారసత్వపు లక్షణాలు - తల్లివైపు కానీ, తండ్రివైపు గానీ ఎవరికీ మతి చలించటం కానీ, మానసికమైన
వ్యాధులు గానీ లేవు.

రిక్రియేషనల్ ఆక్టివిటీస్ - క్రికెట్

ఎడిక్షన్స్ - లేవు

పేషెంటు పూర్వపు లక్షణాలు.- సోషల్, మిక్సింగ్ టై ప్, ఇంటలిజెంట్, ఓవర్ సెన్సిటివ్ (చివరిది అండర్ లైన్
చేయబడింది)
తల్లిదండ్రు లతో సంబంధాలు. -ఓవర్ ప్రొడెక్షన్ (అండర్ లైన్ చేయబడింది)

సైకో పాథాలజీ - రిగ్రెషన్, చిన్నపిల్లలా ప్రవర్తన, సబ్ నార్మల్ సైకాలజికల్ లివింగ్.

క్లినికల్ మానిఫెస్టేషన్స్ - నిస్తేజత, ద్వంద్వ ప్రవృత్తి, మతం వేదాంతం, దేముడు, సైన్స్, సెక్స్ ల గురించి
మాట్లా డినప్పుడు

ఎమోషనల్ గా మారటం కొత్త కొత్త పదాలు మాట్లా డటం, రీజనింగ్ లేకపోవటం.

కన్ క్లూ షన్ - హెబెఫ్రెనిక్ స్కిజోఫ్రెనియా

ట్రీట్మెంట్ - 10 - 12 కన్ వల్ షన్స్ నాలుగు నుంచీ ఆరు వారాలదాకా. షాక్ ట్రీట్ మెంట్.

* * *
రాత్రి మూడవుతూంది.

ఫకీర్ నిద్రపోలేదు. కూలిన గోడకి ఆనుకుని కళ్ళు మూసుకుని వున్నాడు. ఎప్పుడూ పిచ్చిగా ఏవేవో
మాట్లా డే అతడి పెదవులు ఇప్పుడు కదలటంలేదు. వెర్రిగా చూసే కళ్ళు ఏవో ఆలోచిస్తు న్నాయి.

మనసులో వ్యధ భరించలేనట్లు అతడు లేచి కోట బైటకు వచ్చాడు. దూరంగా ేరు. -ఏరుమీద మసక
వెన్నెల

ప్రకృతి నిద్రపోతున్నట్టుంది.

ఏటి కవతల స్మశానంలో కూడా వెలుతురు లేదు.

"నా కూతుర్ని రక్షించు ఫకీర్..... నా కూతుర్ని రక్షించు" అంటున్న శ్రీధర్ మాటలు అతడి చెవిలో
ప్రతిధ్వనిస్తు న్నాయి. ఊరిలోకి వెళదామా అనుకున్నాడు. మళ్ళీ సందిగ్దత - ఏం చెయ్యగలడు? పదకొండు
సంవత్సరాల క్రితం ఆ మాంత్రికుణ్ని చంపకుండా వున్నా బావుండేది. అప్పుడే తులసి మరణించి వుండేది.
ఇంతమందికి ఇంత వ్యధ - తులసికి ఇంత బాధ వుండేదికాదు.

అతడు నడుస్తూనే వున్నాడు. కాలికింద మెత్తటి ఇసుక జారుతూంది. ఏటి నీరు ఎండిపోయింది.
అక్కడక్కడా చిన్న చిన్న నీటిగుంటలున్నాయి అంతే!

నడుస్తూన్న ఫకీరు అకస్మాత్తు గా ఆగిపోయాడు.


ఒక ఇసుకదిబ్బ.... ఎత్తు గా వేటవేసి వుంది. అతడు చూస్తుంది ఆ మెట్టని కాదు, మెట్టపైన - ఒక చెయ్యి
లోపల్నుంచి పొడుచుకు వచ్చింది. మాంసంలేదు ఎముకలకి కొద్దిగా అక్కడక్కడ అది అంటుకుని
వుందేమో....... ఆ విశాలమైన ఇసుక మెట్టలోంచి అలా బయటకొచ్చిన చెయ్యి ఎటువంటి ధైర్యస్థు డికయినా
భయం కొల్పేటట్టు వుంది. ఏ నక్కో తోడేలో ఆ చేతిని సగం బయటకు లాగి, మరిరాక, వదిలేసి వెళ్లిపోయి
నట్టుంది. బిస్తా లో మంత్రగాడి శవపు చేయి వచ్చినట్టు భూమిలోంచి బయటకు వచ్చింది ఆ ఎముకల పొద.

మోకాళ్ళమీద కూర్చొని చేతుల్తో ఇసుకని పక్కకి తవ్విపోసేడు ఫకీర్ -అరగంట తర్వాత బయటపడింది శవం.

ఇస్మాయిల్ ది

చీకిపోయి, నానిపోయి, శిధిలమైపోయింది శవం. మొహంమీద మాంసం ఇంకా కొద్దిగా మిగిలివున్నది.


బట్టలు బాగా చీకిపోయినయ్. పొట్ట భాగంలో పెద్ద రంధ్రం వుంది. కనుగుడ్లు బుగ్గలు లేవు. నుదుటిపైన కొద్దిగా
జుట్టుంది -అంతే!

ఫకీర్ స్తబ్దు డై చూసేడు.

"....పాప..........చాలా చిన్నది -అందంగా వుండేది. రక్షించటానికి మార్గమే లేదా" అన్నట్టు వుంది


ఇస్మాయిల్ మొహం.

............

"ఈ చిన్న తులసితీర్ధపు సంచి పాపని ఘోరమైన బాధల్నుంచి కొద్దిగానయినా రక్షించగలిగితే -మరణాన్ని
సులువుగా తప్పించగలిగితే దానికి నేను సాయపడతాను"

......................

"పంచభూతాలు నన్నెదుర్కొంటాయని తెలుసు. భూతాలు ఒప్పుకోవని తెలుసు. కానీ ఒక పాపకోసం ఆ


మాత్రం కష్టపడితే ఏం?" అడుగుతున్నట్టు వుంది.

ఫకీర్ బిగ్గరగా రోదించాడు పిచ్చిగా.

ఒక అమాయకుడు ఈ క్షుద్రశక్తు లకి బలి అయిపోయేడు. నిర్దా క్షిణ్యంగా, అమానుషంగా శక్తు లు ఇతణ్ని
బలి తీసుకున్నాయి. ఎవరి కెవరు ఈ ప్రపంచంలో! ఒక పాపకోసం ఇతడు ఎందుకు ఇంత కష్టపడ్డా డు?
ఎందుకు ప్రాణాలు అర్పించేడు.

ఫకీర్ మొహంలో దుఃఖం మాయమై ఆ స్థా నానే రోషం చోటుచేసుకుంది. ఉత్తర దిక్కువైపు తీక్షణంగా చూసి
లేచి నిలబడ్డా డు. మరుక్షణం ఊరివేపు నడిచేడు. అప్పుడు నాలుగవుతూంది. ఇంకా వెలుగుచుక్క
పొడవలేదు.

* * *
శ్రీధర్ బాల్కనీలో కూర్చొని వున్నాడు. రాత్రంతా అలాగే కూర్చుని వున్నాడు కల్ళు ఎర్రగా చింతనిప్పుల్లా
వున్నాయి.

చచ్చిపోవటం వేరు - చావుతెలియటం వేరు - కళ్ళముందు పెళ్లి కెదిగిన కూతురు మరణించబోతూంది.


కాష్మోరా ఎంత శ్కతివంతమైనదో అతడికి తెలుసు. ఆ విషయం ఇస్మాయిల్ గానీ, ఫకీర్ గానీ ఇంతకాలం తనకి
చెప్పలేదు అన్న ప్రశ్నకి వెంటనే సమాధానం దొరికింది. చెప్పి ఏం లాభం - పదకొండు సంవత్సరాలూ వ్యధ తప్ప
-

రాత్రంతా ఆలోచిస్తు న్నాడు.

అర్ధరాత్రయింది.

తెల్లవారుతూంది.

శారదకి కూడా అతడిని లోపలికి రమ్మనటానికి భయం వేసింది. దాదాపు పది సిగరెట్టు ప్యాకెట్లు
ఖర్చయినయ్. చీకట్లోకి చూస్తూ కూర్చున్నాడు అతడు. శూన్యంలోకి.........

గేటు చప్పుడవటంతో అతడు తల తిప్పేడు. ఆశ్చర్యానందాల్తో చప్పున కుర్చీలోంచి లేచి నిలబడ్డా డు.

సంతాన్ ఫకీర్ గేటు తెరుచుకుని లోపలికి వస్తు న్నాడు. అతడి ఒక చేతిలో తోలుసంచి వుంది. మరో చేతిలో
చెక్క విగ్రహం వుంది.

* * *
"సరీగ్గా పదకొండు సంవత్సరాల క్రితం ఇలాగే బయల్దేరాము. అయితే అప్పుడు చాలా హడావుడిగా ఏమీ
చూసుకోకుండా బయలుదేరవలసి వచ్చింది"

ఇంజన్ ఆయిల్, రేడియేటర్ వాటర్ చెక్ చేస్తూ అన్నాడు శ్రీధర్.

"రేపు రాత్రి పన్నెండింటి లోపులో బిస్తా లో వుండాలి. అంతేకదా, చాలా సమయం వుంది" టై ర్లలో గాలి
చూసుకున్నాడు "అప్పుడు నాతో వచ్చిన ఇద్దరూ చాలా దుస్థితిలో వున్నారు. విద్యాపతి మనవరాలి మరణం
బ్రాహ్మిణ్ భార్యకి అనారోగ్యం......."
ఆ మాటల్తో ఫకీర్ మొహం మరింత పాలిపోయింది. పెదవులు అస్పష్టంగా గొణగసాగేయి. ఎప్పుడూ
పిచ్చిగా, వెర్రిగా సంతోషంతో వుండే అతడి మొహం గంభీరంగా, పేలవంగా వుంది కారు సీట్లో ఒక మూలకి
కూర్చొని వణికిపోతున్నాడు.

ఎదుర్కోబోయేది సామాన్యమైన శక్తి కాదని తెలుసు. పదకొండు సంవత్సరాల పరిపూర్ణమైన కాష్మోరా,


దాన్నెదుర్కొన్న ముగ్గురిలో ఇద్దరు "చాలా దుస్థితిలో" వున్నారు. మిగిలిన ఒక్కడూ దాని దగ్గరకే స్వయంగా
వెళుతున్నాడు. అది లేచే సమయానికి అక్కడే వుంటాడు. ఏం జరగబోతోంది?

ఈ తులసి తీర్ధంలో ఈ ఆంజనేయుడి విగ్రహంతో ఈ ఎనిమిది మంత్రపు చెక్క మేకుల్తే బలవంతమైన


కాష్మోరాని తామిద్దరూ కలిసి భూస్థా పితం చేయగలరా?

ఆలోచనలతో మంత్రం చదువుతూనే ఫకీరు కళ్ళు తెరిచాడు.

ఈ లోపులో శ్రీధర్ లోపలికి వెళ్ళేడు.

అస్థిపంజరంలా పడుకొని వున్న కూతురివైపు కొంచెం సేపు తదేకంగా చూసేడు. నెమ్మదిగా వంగి
నుదుటిమీద ముద్దు పెట్టు కుని, "తగ్గిపోతుందమ్మా. ఇక రెండు రోజులు అంతే" అన్నాడు.

గాలి కదిలిన ధ్వని.......ఎవరో నవ్వినట్టు .

బయటకు వచ్చాడు. శారద హాల్లో నిలబడి వుంది. యిద్దరి చూపులూ కలుసుకున్నాయి. ఎవరూ
మాట్లా డలేదు. వారి భావాలు కలవవు. మాట్లా డడానికి ఏమీలేదు వాదన తప్ప..........వాదనకి అది సమయం
కాదని ఇద్దరికీ తెలుసు. కావల్సింది కూతురు బ్రతకటం.

శ్రీధర్ బయటకు నడిచేడు. శారద మెట్లమీద నిలబడింది. ఆమె మొహం భావరహితంగా వుంది.
చదువుకున్న సైన్సు - అదురుతున్న కన్ను అపశకునం కాదని చెబుతుంది. శ్రీధర్ కారులోంచే చెయ్యి వూపేడు.
ఆమె అలాగే నిశ్చలంగా నిలబడి వుంది.

బిస్తా వెళ్ళటం కోసం కారు బాణంలా గేటులోంచి దూసుకుపోయింది. వెనకే దుమ్ము తెరలా పైకి లేచింది.

ఆ చప్పుడుకి కొద్దిగా గులాబీపొద కదిలింది.

పొద వెనకనుంచి ఓ పిల్లి నల్లది -మట్టిరోడ్డు మధ్యకి వచ్చి కారు వెల్ళినవైపే చూస్తూ నిలబడింది. ఓ క్షణం
తరువాత అది ఉన్నట్టుండి అరిచిన అరుపు - తల్లి శవం దగ్గర చిన్నపాప ఏడ్చినట్టు వికృతంగా ప్రతి ధ్వనించింది.

26
"సిక్త్స్ సెన్స్ వున్నదా?" జయదేవ్ అడిగాడు.

"ఉందేమో తెలీదు. కానీ సైన్సు కి ఎక్కడా దొరకలేదు" పండిత్ అన్నాడు.

"హేతువాదానికి అది నిలబడదు"

"కానీ మనం ఏదయినా అనుకోవటం, కొంత సేపటికో కొంత కాలానికో అది జరగటం........ చాలామందికి
అవుతూ వుంటుంది"

"నాకు సరిగ్గా అర్ధంకాలేదు"

"చాలా హడావుడిగా స్టేషన్ కి బయలుదేరతాం - మనసు చెబ్తూనే వుంటుంది. ట్రైన్ ఆలస్యంగా వస్తుందని.
మనం వెళ్ళేసరికి అలానే ట్రైన్ ఆలస్యంగా వస్తుంది -ఇలాంటివే చాలా ఉదాహరణలు ఇవ్వొచ్చు. సినిమా టికెట్
దొరక్కపోవటం వగైరా....... ఒకరోజు మనసంతా అదోలా వుంటుంది. ఏదో దుర్వార్త వింటాం అనిపిస్తుంది. ఆ
రోజో, ఆ మరుసటిరోజో దగ్గరబంధువు అనారగ్యమో, మరణమో అని టెలిగ్రాం వస్తుంది....... అదే సిక్త్స్ సెన్స్
అంటే"

పండిత్ నవ్వేడు. "అదే సిక్త్స్ సెన్స్ అనుకుంటే సైన్సు దానికి చాలా సులభంగా జవాబు చెబుతుంది. స్టేషన్ కి
వెలితే ఛాన్సులు రెండు. ట్రైన్ సమయానికి రావటం, రాకపోవటం అంతే. అంటే మనం అనుకున్నది అవటానికి
యాభయ్ శాతం ఛాన్సుంది అన్నమాట. అలా అనుకున్నది జరిగినప్పుడు మనకేదో అద్భుతశక్తి వున్నదన్న
భ్రమలో పడిపోతాం. జరగనివి సులభంగా మర్చిపోతాం. కానీ జరిగిన మన నమ్మకాని మరింత పెంచుకుంటూ
పోతాయి. యిద్దరు ముగ్గురు స్టూడెంట్లు నా దగ్గిర కిలాగే వచ్చేరు, జరగబోయే విషయాలు తమకి ముందే
తెలుస్తు న్నాయని.......ఏదయినా ముందు అలా తెలియగానే ఆ విషయాన్ని కాగితం మీద వ్రాసుకొని
వుంచుకోమన్నాను. నాలుగు రోజులు తర్వాత చూస్తే వాళ్ళు వ్రాసుకున్న విషయాల్లో యాభయ్ శాతం
నిజంకాలేదు"

ఫోన్ మోగింది అంతలో.

జయదేవ్ వంగి రిసీవర్ అందుకోబోయేడు.

"స్టా ప్" అన్నమాట పండిత్ కంఠం నుంచి అకస్మాత్తు గా బుల్లెట్ గా దూసుకు వచ్చింది. ఈ హఠాత్ శబ్దా నికి
జయదేవ్ ఉలిక్కిపడి ఫోన్ మీద నుంచి చెయ్యి తీసేడు.

"టెలిఫోన్ మోతలో అదో రకమైన మార్పు వినిపించటంలేదూ" పండిత్ అడిగేడు. జయదేవ్ ఆ శబ్దా న్ని
శ్రద్దగా విని తలెత్తి కొద్దిగా కన్ ప్యూజ్ అయి "ఔను -ఏమిటిది" అన్నాడు.

పండిత్ మాట్లా డలేదు.


సైన్స్.

డామిట్ - సైన్స్.

* * *
రెండ్రోజుల్లో తులసి స్థితి మరింత దిగజారిపోయింది. మరీ పిచ్చిగా ప్రవర్తిస్తుంది. తల దువ్వుకోవటం, స్నానం
అన్నీ మానేసింది. ఒక్కప్పటి హుషారయిన అమ్మాయేనా అనిపించేలా వుంది.

ఉన్నట్టుండి ఇరిటేట్ అయిపోతుంది. ఉద్రేకం వచ్చేస్తుంది. కొంచెం సేపటికి మామూలుగా మారుతుంది.


రాత్రిళ్ళు విపరీతంగా ఏడుస్తుంది. కారమం లేకుండానే

ఆ రోజు తెల్లవారు ఝామున నాలుగింటికే లేచి తలారా స్నానం చేసి తులసికోట చుట్టూ ప్రదక్షిణం
చేయటం మొదలు పెట్టింది. ఎనిమిదయినా లోపలికి రాదు. బలవంతంగా లోపలికి తీసుకువచ్చి గదిలో పెట్టి
తాళం వేయవలసి వచ్చింది. లోపల ఆమె చేసిన అల్లరికి గదిలో వస్తు వులన్నీ చెల్లా చెదరయ్యాయి.

ఆ తరువాత కొంతసేపటికి ఉద్రేకం తగ్గి శాంతించింది.

భోజనాల సమయంలో "ఇంకొంచెం వడ్డించుకో అమ్మా" అంది శారద వద్దంది తులసి. "ఇంకొంచెం తినాలి
నువ్వు. చూడు యెలా అయిపోతున్నావో" శారద మాట పూర్తి చెయ్యలేదు. తులసి తల నెమ్మదిగా పైకెత్తి
తల్లివంక చూసింది. ఆ చూపుకి శారద క్షణం భయపడింది. బలంగా విసిరిందంటే -అది ముందు హాల్లోకి
ఎగిరివెళ్ళి ఐదువేలు ఖరీదు చేసే షాండ్లియర్ ని తాకింది.

భళ్ళుమన్న శబ్దంతో దీపాలు బద్దలయి, గదంతా గాజు పెంకులు చిందరవందరగా పడ్డా యి.

తులసి కుర్చీలోంచి లేచి తన గదిలోకి పరుగెత్తింది. పగిలిన గాజు పెంకులమీద ఆమె పరుగెత్తు తూ వుంటే,
నాలుగో అడుగు నుంచీ రక్తపు జాడలు ఎర్రగా పడ్డా యి.

* * *
"నా కూతురైన తులసికి ఇవ్వబోయే షాక్ ట్రీట్ మెంట్ తాలూకు పరిణామాలన్నీ నాకు విశదీకరించబడినవి.
దానికి నేను అంగీకరిస్తు న్నాను"

శారదకాగితం చదివి సంతకం పెట్టింది. తులసికి దాదాపు ఎనిమిది గంటల్నుంచీ తినటానికి ఏమీ
ఇవ్వడంలేదు. అంతకుముందే ఆమె పూర్తిగా పరీక్ష చేయబడింది. న్యూరోలాజికల్ చెకప్, ఫండస్
ఎగ్జా మినేషన్.
షాక్ సమయంలో నాలుక పెదవులు కొరుక్కోకుండా పళ్ళమధ్య గాప్ అమర్చబడింది.

ప్రత్యేకమైన మంచంమీద తులసి వెల్లకిలా పడుకోబెట్టబడింది. ఆమె చేతులు చెరోవైపు మంచానికి


అమర్చబడివున్న బెల్టు లకి బంధింపబడ్డా యి. అలాగే కాళ్ళు కూడా.

షాక్ ఇవ్వగానే పేషెంటు విపరీతమైన ఆకస్మిక పరిణామాలకి లోనవుతే ఇవ్వటానికి వీలుగా పరాల్డిహై డ్
సిద్దంగా వుంది.

తులసి చెక్కిళ్ళపైన ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అమర్చబడ్డా యి.

ఏం జరగబోతోందో తులసికే తెలీదు.

అన్నీ సరిగ్గా వున్నాయోలేదో చివరిసారి చూచుకొని వెంకట్ స్విచ్ ఆన్ చేసేడు.

సెకనులో ఇరవయ్యొవ వంతుపాటు 50 సైకిల్స్ ఆల్టర్నేటింగ్ కరెంటు 90 నుంచి 120 వోల్టు ల మధ్య
ఒక్కసారిగా ఆ లేత శరీరపు తలలోకి ప్రవేశించి తులసిని వూపేసింది.

ఆ షాక్ కి తులసి శరీరం గాలిలోకి ఎలా ఎగిరిపడిందంటే, ఆ దృశ్యాన్ని శారద జీవితాంతం మర్చిపోలేదు.
మర్చిపోలేదు. నీటిలోంచి నేలమీద పడిన చేపపిల్లలా గిలగిలా కొట్టు కుంది. నోరు ఒకపక్కకి గాగ్ ని తోయడానికి
విఫలయత్నం చేసింది. నడుము ఎగిరెగిరి దబ్ మన్న శబ్దంతో పక్కకి కొట్టు కుంది. మెలికలు తిరిగిన శరీరం
బంధించిన బెల్టు లని తెంపటానికి ప్రయత్నం చేసింది. బాధతో మొహం వికృతంగా మారింది. అడుతూ
పాడుతూ తమ మధ్య తిరిగే ఇరవయ్యేళ్ళ కూతురు, ఆ బాధని తట్టు కోలేక కనీసం బాధని ప్రదర్శించటానికి
వీలుకూడా లేక బంధింపబడి ఆ బంధనాల మధ్య విలవిల లాడటాన్ని ఆ తల్లి భావరహితంగా,మౌనంగా
చూసింది. ఎగిసిపడే సముద్ర తరంగాల్లాంటి వ్యధని మనస్సులోనే దాచుకొని నిశ్చలంగా నిలబడింది.

"అయిపోయింది!" అన్నాడు వంకట్ కనెక్షన్స్ తీసేస్తూ.

శారద మాట్లా డలేదు.

తులసి ఉచ్చ్వాస నిశ్వాసలు, పల్స్ - పది నిముషాల కొకసారి అరగంటపాటూ చెక్ చేయబడ్డా యి.
అరగంటలో పేషెంటు బాగా తేరుకొంది.

మరో రెండు గంటల తర్వాత డిస్చార్జ్ చేయబడింది.

పేషెంటు మానసిక స్థితిలో మార్పులేదు.


* * *
"అదే బిస్తా !" అన్నాడు శ్రీధర్.

ఫకీరు కళ్ళు తెరిచేడు. అతడి కళ్ళు అగ్నిగోళాల్లా వున్నాయి. ఏకాగ్రతతో మంత్రం పఠించి పఛించీ మొహం
అదోరకమైన తేజస్సుని నింపుకొంది.

"ఊర్లోంచి వెళ్ళటమెందుకు? కారు ఇక్కడే ఆపుచేసి చుట్టూ తిరిగి వెళదాం.... ఇంకా నాలుగు గంటల
టై ముంది కదా?" అన్నాడు శ్రీధర్.

ఫకీర్ మాట్లా డకుండా కారుదిగేడు. మేకుల్నీ, విగ్రహాన్నీ, సంచినీ పట్టు కున్న అతడి చెయ్యి కొద్దిగా
వణుకుతూంది.

కారు డోర్లో నాలుగు వైపులా లాక్ చేసి ఫకీర్ ని అనుసరించేడు.

ఆ ప్రదేశం అంతా తుప్పల్తోనూ పొదల్తోనూ నిండివుంది. దూరంగా లోయలో బిస్తా గ్రామపు దీపాలు
మినుక్కు మినుక్కుమని కనబడుతున్నాయి ఊరుని చుట్టు కొని, అటువైపు స్మశానంలోకి ప్రవేశించాలి.

పదకొండు సంవత్సరాల క్రితం వెళ్ళినదారి....... అప్పుడెలా వుందో ఇప్పుడూ అలాగే వుంది. మరింత
దట్టంగా తుప్పలు పెరిగినయ్.........అంతే.

ఇద్దరూ స్మశానం చేరుకున్నారు.

ఫకీరు ఆగేడు.

"కాద్రాని చంపిందెక్కడో జ్ఞాపకం వుందా?" చాలా సేపటికి ఫకీర్ నొరువిప్పి మాట్లా డిన మొదటిమాట. శ్రీధర్
అయోమయంగా చుట్టూ చూసేడు అన్నీ ఒకేలాంటి సమాధులు ......... పిచ్చి మొక్కలు.... ఎప్పటిమాట అది!
అతడు గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నంచేసి, విఫలుడై, తల అడ్డంగా వూపేడు......" ఈ ప్రదేశంలోనే -
ఎక్కడో!"

"ఫర్లేదు -" అన్నాడు ఫకీరు.

శ్రీధర్ వాచీ చూసుకున్నాడు ఎనిమిదిన్నర కావొస్తూంది.

ఇంకా మూడు -మూడున్నరా గంటల మధ్యా -

అతడికో అనుమానం వచ్చింది "ఫకీర్" అన్నాడు. శ్మశానాన్ని పరిశీలనగా చూస్తు న్న ఫకీర్ తలతిప్పి చూసేడు
శ్రీధర్ వైపు.

"కాష్మోరా నిద్రలేపటాన్ని భయంకరంగా వర్ణించావు. ఇక్కడంతా ఇంత ప్రశాంతంగా వుందేం? మనలెక్క


తప్పా!"

"లెక్క తప్పు కావటానికి వీల్లేదు!" అని ఫకీరు మళ్ళీ తనపనిలో మునిగిపోయేడు. శ్రీధర్ కి మరింకేం
చెయ్యాలో తోచలేదు.

ఏమిటింత ప్రశాంతంగా వుంది వాతావరణం? ఏ చిన్న సూచనా లేదేం? శ్మశానంలో మంటకూడా లేదు. పక్షి
అరుపు - కీచురాయి శబ్దం - ఏమీ వినబడలేదు. గాలికూడా నెమ్మదిగా ఆహ్లా దకరంగా కదుల్తూంది.

ఫకీరు తలెత్తటం చూసి అతడూ ఆకాశంకేసి చూసేడు. ఆకాశం నిర్మలంగా వుంది. నక్షత్రాలు మినుక్కు
మినుక్కుమని వెలుగుతున్నాయి. ఫకీరు తలదించుకొని తన పనిలో మునిగిపోయాడు. శ్రీధర్ జేబులోంచి
పాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు.

ఆకాశం ఆగ్నేయ మూలనుంచి -ఏనుగు చర్మం కన్నా నల్లగా, మందంగా వున్న చిన్న మేఘం పడవలా
తేలుతూ వేగంగా దూసుకురావటాన్ని ఆ ఇద్దరూ గమనించలేదు.

* * *
టెలిఫోన్ బెల్ వినిపిస్తూనే వుంది.

"నాన్సెన్స్" - అన్నాడు జయదేవ్. "- ఇలా భయపడుతూ ఎంతసేపు కూర్చోవటం? చూద్దాం ఏమవుతుందో
-"

"ముట్టు కోవద్దు ......." అన్నాడు పండిత్. "నేను లేస్తా ను"

వంగి దానిమీద రబ్బర్ క్లా త్ వేసేడు. రిసీవర్ జాగ్రత్తగా పైకెత్తి టెస్ట్ తో పరీక్ష చేసేడు. అందులో కరెంట్ ఏదీ
పాస్ అవటం లేదని ధృవపర్చుకుని, క్లా త్ తీసేసి చేతిలోకి రిసీవర్ ని తీసుకొని పరీక్షగా చూసేడు.

పండిత్ జాగ్రత్తగా మౌత్ పీస్ విప్పేడు. చిన్న ప్లా స్టిక్ ముక్క, రంధ్రాలున్నది బయటకి తీసేడు. తరువాత చెవి
దగ్గిర పెట్టు కొనే హెడ్ విప్పేడు. హెడ్ దగ్గర ఉండవలసిన కార్డు లేదు. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
మాగ్నెటిక్ కాయిల్స్ మధ్య ఇంక్ పిల్లర్ లాంటి ప్లా స్టిక్ గొట్టం వుంది. మౌత్ పీస్ ని మరింత పరీక్షగా చూసేడు.
చేతుల్తో పట్టు కొనే గొట్టం లోపల చిన్న లివర్ అమర్చబడి వుండటం గమనించేడు.

"ఏమిటిది?" అన్నమాట జయదేవ్ నోటినుంచి రాగానే ఆ ద్వని తరంగాల్ని పట్టు కున్నట్టూ పండిత్ చేతిలో
రిసీవర్ చిన్న జర్క్ ఇచ్చింది. స్ స్ మన్న శబ్దంతో ఫోన్ హెడ్ లోంచి ద్రవం ఎంత వేగంగా బయటకొచ్చిందంటే.
టెలిఫోన్ వెల్లికిలా పట్టు కోబడి వుండటం వల్ల, అది పైకి వెళ్ళి పాన్ కి తగిలి గదంతా చిమ్మింది. ఈ అకస్మిక
పరిణామానికి నిశ్చేష్టు లయ్యారు ఇద్దరూ.

తిరుగుతూన్న పాన్ నుంచి టప్ టప్ మని ఒక్కోచుక్కా క్రిందికి కారుతున్న ద్రవంవేపు స్థా ణువులై చూసేరు.

ముందు తేరుకున్న పండిత్, వంగి ద్రవంవేపు పరీక్షగా చూసేడు.

"ఏమిటది?"

"ఎండ్రిన్" అన్నాడు పండిత్........ "రిసీవర్ మీదనుంచి ఫోన్ తియ్యగానే లివర్ ఆపరేషన్ మొదలయ్యేలా
ఏర్పాటు చేయబడింది. "హలో" అన్న ధ్వని తరంగం రాగానే లివర్ ఇంక్ పిల్లర్ సిస్టమ్ లో ద్రవాన్ని చెవిలోకి
వేగంగా తోస్తుంది. "హలో" బదులు "ఏమిటిది" అన్నమాట యిప్పుడు ఈ కదలికని కలిగించింది. ఇదే చెవి
దగ్గర పెట్టు కుని వుంటే........" ఆర్దోక్తిలో ఆపుచేసేడు.

మిగతాది ఇద్దరికీ తెలుసు.

పరీక్ష ఫెయిల్ అయినవాళ్ళూ, ప్రేమ విఫలం అయినవాళ్ళూ ఎండ్రిన్ తాగుతారు. డాక్టర్లు కష్టపడి వాళ్ళని
బ్రతికిస్తా రు. చెవిలో కొద్దిగా ఎండ్రిన్ పోసుకుంటే రాకెట్ కన్నా వేగంగా అది డయాఫ్రమ్ ని చీల్చుకుని వెళ్లి
మెదడు నేరాల్ని నిస్తేజపరుస్తుంది!

మరణించేవాడ్ని దేముడు కూడా రక్షించలేడు.

27
పన్నెండవటానికి సరీగ్గా పదిహేను నిముషాలుంది.

శ్రీధర్ లో టెన్షన్ ఎక్కువ అవుతూంది. ఫకీరు ఎందుకంత భయపడుతున్నాడో అర్ధంకాలేదు. అతడు


మరింత వేగంగా మంత్రాలు పఠిస్తు న్నాడు. విగ్రహాన్ని మరింత గట్టిగా రొమ్ములకి హత్తు కొంటున్నాడు.
మాటిమాటికీ చుట్టూ పరిశీలిస్తు న్నాడు. శ్రీధర్ అడిగిన ప్రశ్నలకి దేనికి జవాబు చెప్పడం లేదు.

శ్రీధర్ సిగరెట్ తీసి నోట్లో పెట్టు కొని అగ్గిపుల్ల వెలిగించేడు. ఆరిపోయింది. ఇంకో పుల్ల తీసి వెలిగించేడు
సిగరెట్ అంటించే లోపులో అది ఆరిపోయింది. విసుక్కుంటూ మరో పుల్ల తీసి వెలిగించి, రెండు చేతులూ
అడ్డు పెట్టా డు.

అదీ ఆరిపోయింది.

అప్పుడు గమనించేడు అతడు గాలిని!


రివ్వున వీస్తుంది. ఆలోచనల్లో పడి గమనించలేదు. చెట్లు ఊగుతున్నాయి. అతడు అప్రయత్నంగా తల పైకెత్తి
చూసేడు. ఆకాశాన్ని చూసి ఉలిక్కిపడ్డా డు.

ఒక నక్షత్రంకూడా లేదు. ఎప్పుడు కమ్ముకున్నాయో తెలీదు., కానీ నల్లటి మేఘాలు దట్టంగా


కమ్ముకున్నాయి. శ్మశానం అంతా చీకటిగా వుంది. చిన్న వెలుగు రేఖకూడా లేదు... ఒక్కసారిగా అంత చీకటి
ఎలా వచ్చింది? అతడు చుట్టూ చూసేడు. దక్షిణంవేపు చూస్తే అప్పుడర్ధమయింది. అతడికి. బిస్తా గ్రామపు
దీపాలు లేకపోవటం!

అన్నీ ఆరిపోయి వున్నాయి.

అతడి వళ్ళు ఎందుకో అప్రయత్నంగా జలదరించింది.

అతడు మళ్ళీ వాచీ చూసుకున్నాడు. పన్నెండవటానికి పన్నెండు నిముషాలుంది. టై మ్ చూస్తూ వుండగా


తలమీద పెద్ద వానచినుకు పడింది. నిముషం తిరిగేసరికి జల్లెడలోంచి పడినట్లు టప టపా చినుకులు
పడసాగేయి. అతడు కళ్ళు చిట్లించి చూసేడు. కళ్ళు చిట్లించి చూసేడు- ఫకీరు కనబడలేదు.

"ఫకీర!" అని పిల్చేడు. అతడు గొంతు హెచ్చించి మరింత బిగ్గరగా అరిచేడు. దూరంనుంచి పీలగా జవాబు
వినిపించింది.

గాలి మరింత ఉధృతమవటంతో శబ్దం అదోలా వస్తూంది. పెద్ద చెట్లు కూడా నేలకు తగిలేలా
వూగుతున్నాయి. ఆ దృశ్యం ఎంత ధైర్యవంతుడి గుండెలనైనా వణికించేలా వుంది. వాతావరణంలో అంత
అకస్మాత్తు గా మార్పు ఎలా వచ్చిందో అతడికి అర్ధం కావటంలేదు. చుట్టూ నిశ్శబ్దంగా పొంచివున్న సైనికులు
ఒక్కసారిగా కూడబలుక్కుని దండెత్తినట్టు వుంది.

దాదాపు పరుగెడ్తు న్నట్టూ అతడు పరుగెత్తేడు. చెవులు బద్దలయ్యేలా ఉరుముల చప్పుడు! మెరుపు
వెలుగులో ఫకీర్ ను చూసి వణికిపోయేడు. ఫకీరు తలమీదనుంచి నీరు ధారాపాతంగా కారుతూంది. జుట్టు
పాయలు పాయలుగా వేలాడుతూంది. అతడే ఒక శవంలా వున్నాడు. వంగి మేకు కొడుతున్నాడు.

అసలు వర్షమే బాణాల్తో కొడుతున్నట్టు వుంది. వేల వేల మంది జనం ఒక్కసారిగా రోధిస్తు న్నట్టు శబ్దం.
ధండర్ స్టా రమ్ అంటే ఏమిటో తెలుస్తూంది. ఫకీరు చేతిలో ఆరు మేకులు అయిపోయినయ్. పన్నెండవటానికి
యింకా మూడు నిముషాలుంది.

ఒక్కసారి గాలి ఆగిపోయింది గాలితోపాటే వర్షం కూడా. ప్రకృతంతా స్థంభించినట్టూ ఒక్కసారిగా


అలుముకున్న ఆ నిశ్శబ్దం ఫకీర్ ని కూడా భయపెట్టినట్టయింది. పాలిపోయిన మొహంతో ఆకాశంవేపు
చూసేడు.
దక్షిణం, నైరుతులవేపు పాతవలసిన మేకులు మిగిలిపోయాయి. ఇద్దరూ దక్షిణంవైపు చూసేరు. దట్టంగా
వున్నాయి. చెట్లు కదలకుండా. శత్రు వుని ఆహ్వానిస్తు న్నట్టూ...... నోరు తెరుచుకొని నిలబడ్డ కొండచిలువల్లా
అప్రయత్నంగా ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ముందు కదిలింది ఫకీరు.

శ్రీధర్ అతణ్ని అనుసరించేడు. "ఈ విగ్రహాన్ని పట్టు కో........" అన్నాడు ఫకీరు. శ్రీధర్ అర్ధంకానట్టు చూసి
దాన్ని తాకేడు. అందుడు చేతికర్రని పట్టు కొని నడిచినట్టు ఇద్దరూ నడుస్తు న్నారు. "ఎటువంటి పరిస్థితుల్లోనూ
విగ్రహాన్ని వదలకు" చేతిలో తులసితీర్ధపు సంచిని గాలిలో పైకెత్తా డు. "ఖేటి -భవన్నిఖిల ఖేటీ - కదంబ వసవాటీ"
స్తోత్రం చేస్తూ పడుస్తు న్నాడు.

ఆ స్తోత్రాన్ని భరించేలనట్టు ఆకాశం గర్జించింది. ఫకీరు కంఠం మరింత ఉచ్చస్వరంతో పఠించసాగింది.


పన్నెండుకి ఇంకా ఒక నిముషం వుంది. శ్మశానపు ఉత్తర దిక్కునుంచి ఏదో ఎర్రగా మెరవటాన్ని శ్రీధర్
గమనించేడు. "శ్రీధర్ పరుగెత్తు - సమయం లేదు" అంటూ ఫకీరు వేగం హెచ్చించాడు. విగ్రహాన్ని పట్టు కోవటం
కష్టంగా వుంది. నైరుతిమూల మేకుని నేలమీద వుంచి అరచేతిని రాయిచేసి భూమిలో కొడుతున్నాడు.
స్రవిస్తు న్న రక్తా న్ని పట్టించుకోవటంలేదు. రక్తంతో తడిసిన మేకు, భూమి లోకి దిగింది. శ్రీధర్ అది
చూడటంలేదు. ఎర్రటి బింబాన్నే విస్మయంగా చూస్తు న్నాడు. ఏమిటిది? ఇంత వర్షంలో అది ఎలా వచ్చింది?
లేక మిణుగురు పురుగుల గుంపా? బింబం పరిపూర్ణమైంది అది........ అది కదుల్తోంది. లేదు కదలటంలేదు.
హెలూసినేషన్ తన భ్రమ - పరస్పర విరుద్దమయిన భావాల్తో అతడు కదిలిపోతున్నాడు.

నైరుతి పూర్తయింది. మిగిలింది దక్షిణం దిక్కు.

వర్షానికి పాములు పుట్టల అడుక్కు వెళ్ళి దాక్కున్నాయి. ఉరుము శబ్దా నికి పొదల్లో నక్కలు కూడా
బెదురుతున్నాయి.

విగ్రహం చేత్తోపట్టు కుని మేకువేపే చూస్తు న్న శ్రీధర్, ఎంతకీ దానిమీద దెబ్బ పడకపోయేసరికి ఫకీరువేపు
తలెత్తి చూసి స్థా ణువయ్యేడు.

ఏదో శక్తి వంచుతున్నట్టూ ఫకీరు వెనక్కి వాలిపోతున్నాడు. అతడి నోటివెంట, ముక్కులోంచి రక్తం
వస్తూంది. బహుశా అతడు తాగిన పసరువల్ల వస్తుందేమో రక్తం.

శ్రీధర్ ఒక్క ఉదుటున లేవబోయాడు. గాలి ఒక్కసారిగా ఉధృతమై అతణ్ని వెనక్కి తోసేసింది. బలం అంతా
కూడదీసుకున్నా వీలుకాలేదు. ఈ లోపులో ఫకీరు శరీరం గాలిలోకి లేచింది. ఈత కొడుతున్నవాడిలా గాలిలో
చేతులు కదుపుతున్నాడు. శ్రీధర్ కి చప్పున ఏదో అర్ధమైంది.

విగ్రహం.

చేతిలో విగ్రహాన్ని ఫకీరుకి అందించటం కోసం ముందుకు సాచేడు.

పెళ్ళున ఆకాశం బ్రద్దలయిన చప్పుడు. గాలి చాలా చిత్రంగా ఇద్దర్నీ చెరోవేపుకి తోసేస్తుంది. "వెళ్ళిపో -
పరుగెత్తు " ఫకీరు కంఠం అస్పష్టంగా అంటూంది. గాలి హోరులో లీలగా ఆ స్వరం వినిపిస్తూంది. శ్రీధర్
విగ్రహాన్ని అతడిచేతికి తాకించటం కోసం విఫలప్రయత్నం చేస్తు న్నాడు. ఏదో శక్తి దాన్ని ఆపుతోంది. చెళ్ళు ఛెళ్ళున
కొట్టినట్టు ఫకీరు శరీరం గాలిలో వంకర్లు తిరుగుతూంది. వరదలో కొట్టు కుపోతున్నవాడిలా వున్నాడు.
నోటినుండి భళ్ళున రక్తం కక్కేడు. విగ్రహాన్ని వదలకు పరుగెత్తు . వెళ్ళిపో."

శ్రీధర్ వినిపించుకోవటంలేదు. తనకోసం వచ్చినవాడు ఫకీరు అతణ్ని రక్షించాలి.

విగ్రహాన్ని అతడి మీదకు విసిరివేయటానికి విఫల ప్రయత్నం చేసేడు. "పరుగెత్తు మూర్ఖుడా - పరుగెత్తు "
మరింత రక్తం కక్కేడు ఫకీరు. దుమ్ము తెరలా లేచింది. శ్రీధర్ కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం అతడు
కళ్ళు తెరిచేసరికి ఫకీరు ఎదురుగా లేడు. శ్రీధర్ కాళ్ళు నేలమీద ఆనటం లేదు. చేతిలో గట్టిగా పట్టు కున్న
విగ్రహమే తనని రక్షిస్తు న్న భావన, చదువుకున్న చదువు, హేతువాదం అక్కడ వాదనకి నిలబడటంలేదు.

మిన్ను మిన్ను నడుము మధ్యకి విరిగిన చప్పుడు ఒక ఎర్రటి కిరణం జిగేలుమంటూ బాణంలా ఆకాశం
నుంచి దూసుకు వచ్చింది. ఫెళ ఫెళ నినాద ఝంఝామారుదుజ్జిత చిలమంద్రమైన స్వరం క్షణంపాటూ
దిగంతాలకు వ్యాపించింది. పచ్చటి మర్రిచెట్టు , కాలుతున్న బాణం చీల్చినట్టు రెండుగా వొరిగిపోయింది.
నల్లగామాడి కొయ్యలమధ్య మసి అయిపోతూ, ఫకీరు అరచిన అరుపు గాలిహోరులో కలిసిపోయింది.

* * *
శ్రీధర్ కు మెలకువ వచ్చేసరికి మిట్టమధ్యాహ్నమయింది. సూర్యకిరణం నిలువుగా కళ్ళలో పడుతూంది.
వళ్ళంతా సూదులతో గుచ్చినట్టు బాధ. తుప్పలమధ్య తను పడివున్నట్టూ గమనించేడు. రొమ్ముల మీద
విగ్రహం అలానే వుంది.

అతడు కష్టపడి, అవయవాలు స్వాధీనంలోకి తెచ్చుకొని లేచాడు. అంతకుముందు రాత్రి ప్రళయం తాలూకు
ఛాయలు అలాగే వున్నాయి. పిడుగుపడి మసి అయిన చెట్టు , కాల్వలు కట్టిన ఏటిపాయ ఛాయ - విరిగిన
కొమ్మలు - యుద్దం అయిపోయిన రణరంగంలా వుంది.

అతడు బలహీనంగా అడుగులో అడుగు వేసుకుంటూ శ్మశానం బయటకు నడిచేడు. అతడి మనసు
శూన్యంగా వుంది. ఎంత హుషారుగా వచ్చాడో అంత ఖేదంతో వెళుతున్నాడు.................

తోడుగా వచ్చిన ఫకీర్ని కాష్మోరా కోరలకి అర్పించి.

అతి కారు చెట్లమధ్య లీలగా కనిపిస్తూంది. అతడు దాని దగ్గరకు చేరుకొనేసరికి దాన్ని పరీక్షగా చూస్తన్న
గొర్రెల కాపర్లద్దరు బెదిరి దూరంగా తప్పుకున్నారు. బట్టలు పీలికలై , గడ్డం పెరిగి పిచ్చివాడిలా వున్నాడతను.

కారులో కూర్చొని ఒక్క క్షణం శ్మశానం దిక్కుగా చూసేడు.


ఫకీరు, ఫకీరు అని మనసులో వేదనగా అనుకున్నాడు. పదకొండు సంవత్సరాల క్రితం తన కూతుర్ని
రక్షించిన ఫకీరు -అతడికి ముందే తెలుసుకుంటా మరణం కాయమని. అయినా ప్రాణాలకి తెగించి ప్రయత్నం
చేసేడు.

ఒక కన్నీటిచుక్క శ్రీధర్ కంటినుంచి జారి స్టీరింగ్ మీద పడింది. అంతలో ఏదో భావం మనసులో కదలాడి
వళ్లు జలదరించింది.

ఇంకా ఆరురోజులే.......

తన కూతురి మరణానికి.

ఎవరు ఆపలేరు. ఉన్న ఒక్క ఆధారమూ పోయింది. ఎలా!........... ఎలా! అతడిచేతులు కసితో రోషంతో
స్టీరింగ్ ని బిగించి పట్టు కున్నాయి. తల స్టీరింగ్ కేసి టపటపా కొట్టు కున్నాడు.

వెళ్ళాలి?

ఆఖరి క్షణంలో కూతురి దగ్గర వుండాలి.

అతడు వాచీ చూసుకున్నాడు. రెండయింది. టై మ్ చూస్తూ అతడు ఉలిక్కిపడ్డా డు. వాచీలో వున్న తారీఖు
చూసి, తన కళ్ళని తను నమ్మలేకపోతున్నాడు. కాష్మోరా లేచిన రాత్రి తాలూకు తేదీ ముందుకు జరిగిపోయి,
రెండు రోజులయింది.

అంటే.........అంటే దాదాపు అరవై రెండు గంటలపాటూ తను స్పృహతప్పి పడి వున్నాడా? ఆ శ్మశానంలో -
తిండిలేక..... నీళ్ళులేక అరవై రెండు గంటలపాటూ...... ఇంపాజిబుల్......

అదికాదు అతడు ఆలోచిస్తు న్నది.....

తన కూతురి మరణం గురించి!

వాచీ చూపిస్తు న్నది నిజమైన తేదీయేగానీ అవుతే - తులసి మరణం ఇంకా నాలుగు రోజులే.

శ్రీధర్ ఇగ్నిషన్ తిప్పేడు. రెండు మూడు ప్రయత్నాల్లో కారు స్టా ర్టయింది. ఆ తర్వాత అది క్షణంలో రివర్స్
అయి, గతుకుల్లోంచి లేస్తూ బాణంలా ఆంధ్రదేశంవైపు దూసుకుపోయింది.

దూరంగా నిలబడి చూస్తు న్న పశువుల కుర్రాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు.

* * *
జయదేవ్ సోఫా వెనక్కి వాలి. కళ్ళు మూసుకుని ఆలోచిస్తు న్నాడు. ఏమైంది తులసికి? అంత ఆరోగ్యమైన
అమ్మాయి వున్నట్టుండి ఎందుకిలా మారిపోయింది? ఆ మారిపోవటానికి, శ్రీనివాసపిళ్ళైకి ఏదయినా
సంబందం వుందా? అదే అంతుబట్టని ప్రశ్నగా మిగిలిపోతూంది.

ఆలోచనలో అతడు, ఎయిర్ కండిషనర్ కొద్దిసేపు ఆగి, తిరిగి ప్రారంభం కావటాన్ని గుర్తించలేదు. లోపలికి
గాలి వదలవలసిన మిషన్ గదిలోని గాలిని బయటకు తోసేస్తూంది. దాదాపు ఐదునిముషాల తరువాత అతడు
గదిలో ఏదో మార్పు గమనించేడు. వళ్ళంతా చెమట పట్టెయ్యసాగింది. ఎయిర్ కండిషనర్ దగ్గరికి వెళ్ళి
చూసేడు. ఆగిపోయినట్టు తోచింది. వెళ్ళి ఫాన్ వేసేడు. తిరగలేదు., కరెంట్ పోయింది.

మరి ఎయిర్ కండిషనర్ శబ్దం ఏమిటి? అతడికి అర్ధంగాక మళ్ళీ దాని దగ్గరకు వెళ్ళాడు. దాని సమీపంగా
వెళ్ళాక. అప్పుడు గమనించేడు ఆ విషయాన్ని! చాలా చిత్రంగా తన చొక్కా చివర్లు కండిషనర్ వైపు
ఆకర్షింతమవటాన్ని!

అప్పటికే అతడి శరీరం చెమటతో తడిసి ముద్దయిపోయింది. ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది. ఏదో అర్ధమై
వళ్లు జలదరించి చప్పున తలుపు దగ్గరికి పరుగెత్తా డు లాగితే రాలేదు. బలంగా రెండు చేతుల్తో తోసేడు,
కదల్లేదు.

వూపిరాడక చచ్చిపోతాడు. అందులో విషాదం ఏమీలేదు. ఆ తర్వాత దృశ్యమే భయంకరమైనది గాలిలో


గాలి మరింత తోడెయ్యబడి శూన్యం ఏర్పడుతుంది. శరీరంలోనూ, వూపిరితిత్తు ల్లోనూ వున్న గాలి చర్మాన్ని
పెటిల్లు న పేల్చి బయటకు వస్తుంది. కనుగుడ్లు పేలిపోతాయి. అంత భయంకరమైన మరణం ఎవరికీ వద్దు !

అతడు బలమంతా కూడదీసుకుని తలుపుని భుజాల్తో కొట్టా డు. బలమయిన తలుపులు అప్పుడే అతని
శరీరం బౌతికమైన చర్యకు లోనవుతుంది. మోకాళ్ళమీద కూలిపోతూవుంటే బయట ఎవరో కదిలిన చప్పుడు
వినిపించింది. బయటనుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. అతడికి ప్రాణం లేచి వచ్చింది. "సేవ్ మి" అని
అరవటానికి ప్రయత్నం చేస్తూ వుండగా స్పృహ తప్పింది.

తిరిగి జయదేవ్ స్పృ వచ్చేసరికి సోఫాలో వున్నాడు. తల తిప్పి గుమ్మం తలుపులు బ్రద్దలు కొట్టబడి వుండటం
గమనించాడు. అతడు లేచి కూర్చోబోతూ..... ఎదుటి బల్ల మీద వున్న యువకుణ్ని చూసి, అతడే తన
ప్రాణాల్ని ఈసారి కాపాడింది అని గ్రహించి "థాంక్యూ" అన్నాడు.

"అసలేం జరిగింది."

"నా ప్రాణాలు తీయటానికి జరుగుతున్న ఇరవైనాలుగు ప్రయత్నాల్లో ఇది ఒకటి" నవ్వేడు.

"ఎవరు తీస్తు న్నారు? సిద్దేశ్వరీ?"


జయదేవ్ షాక్ తగిలినవాడిలా చప్పున ముందుకు వంగి "సిద్దేశ్వరి నీకు తెలుసా? నువ్వెవరు?" అని
అడిగేడు.

".........నా పేరు దార్కా!"

జయదేవ్ స్థా ణువయ్యాడు. దార్కా..........దార్కా.......

శ్రీనివాసపిళ్లయ్ హెచ్చరించింది ఇతడి గురించే. "పగ సాధించటం కోసం బిస్తా నుంచి వచ్చిన మహా
మాంత్రికుడు దార్కా.........అతడే తులసిని చంపుతున్నాడు........" గుర్తు రాగానే అప్రయత్నంగా జయదేవ్
పిడికిళ్ళు బిగుసుకున్నాయ్. ఎలా ఇతనిని బంధించడం అని ఆలోచిస్తు న్నాడు.

జయదేవ్ లో కలుగుతున్న భావాన్ని దార్కా గమనిస్తు న్నాడు. అయినా అతడు అక్కడనుంచి కదలకుండా
"సిద్దేశ్వరి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. మీతో పాటు నన్నూ, తులసినీ........" అన్నాడు.

ఆ చివరి మాటలు విని జయదేవ్ ఉలిక్కిపడ్డా డు. ఇంతలో దార్కా మళ్ళీ అన్నాడు. "సిద్దేశ్వరి మొగవాడు"

"అవును. అతడి అసలు పేరు శ్రీనివాసపిళ్ళై" జయదేవ్ చప్పున అన్నాడు. "నిజం చెప్పు అతడు తులసిని
చంపుదామనుకుంటున్నాడా?"

"అవును, మన ముగ్గుర్నీ! అందుకే మిమ్మల్ని హెచ్చరిద్దా మని వచ్చాను"

"నా చిరునామా నీకెలా దొరికింది?" జయదేవ్ అనుమానం పూర్తిగా తీరలేదు

"తులసి ఇచ్చింది."

అతడు మరింత విస్మయంతో "తులసా!" అన్నాడు. "తులసి నీకు బాగా తెలుసా? నీ స్నేహితురాలా?"

ఈ ప్రపంచంలో నాకెవరయినా స్నేహితులున్నారంటే తులసి ఒక్కతే. అనుకున్నాడు దార్కా క్షణంలో


వెయ్యవవంతు అతడి మనసంతా విషాదంతో నిండిపోయింది. ఆ భావానికి అర్ధంలేదు. విషాదం మాత్రం
వుంది.

జయదేవ్ ఆలోచనలు చురుగ్గా సాగినయ్. పిళ్ళయ్ తనని చంపాలనుకొంటున్న విషయం తనకు తెలుసు.
ఇప్పుడు దార్కా చెబుతున్నదాన్ని బట్టి చూస్తుంటే తులసిమీద కూడా పిళ్ళయ్ కు పగ వున్నట్టూ తోస్తుంది.
అవును. పిళ్లయ్ సిద్దేశ్వరి రూపంలో వున్న రహస్యాన్ని బట్టబయలు చేసింది తులసేగా. తను మూర్ఖుడు. ఇంత
చిన్న విషయం ఆలోచించలేక పోయాడు. రహస్యం పొగ మంచులా విడిపోతూంది. పిళ్ళయ్ చెప్పిన కాష్మోరా
తన హేతువాదాన్ని నొక్కిపట్టి వుంచింది. కొద్దిగా కాకపోతే కొద్దిగా ఇంతకాలం తులసి మతిచాంచల్యానికి
కారణం కాష్మోరాయేనేమో అని బావించే స్థితికి వచ్చేడు చివరికి. ఇప్పుడీ మంత్రగాడి సాయంతో అలాంటి
క్షుద్రదేవతలేమీ కారణం కాదని తెలుస్తూంది.
"చివరిగా ఒక ప్రశ్న" జయదేవ్ అడిగేడు "పిళ్ళయ్ సంగతి నీకెలా తెలుసు?"

"అతడు నన్నోసారి కాష్మోరా సంగతి అడుగుతూ వుండగా చూసి గుర్తు పెట్టు కున్నాను"

"ఏమడిగేడు........"

"కాష్మోరా తులసిని ఎన్ని రోజుల్లో చంపుతుంది?" అని అడిగేడు.

"నువ్వేం చెప్పావు?"

"అప్పటికి ఇరవై నాలుగో అయిదో చెప్పాను. ఇప్పటికి మాత్రం సరిగ్గా నాల్రోజులు వుంది అది. సరీగ్గా
నాలుగోరోజు రాత్రి పన్నెండింటికి"

జయదేవ్ మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. అదన్నమాట సంగతి! సరీగ్గా క్షుద్రశక్తే తులసిని చంపేలా
అందరికీ అనుమానం వచ్చేటట్టు తులసి మరణిస్తుందన్నమాట.

"పిళ్ళై నన్ను చంపుదామనుకుంటున్న సంగతి నీకెలా తెల్సింది?"

"అతడి ఇంటిలో చూసేడు. ఇరవైనాలుగు విధాలుగా మిమ్మల్ని చంపటం కోసం వ్రాసుకున్న కాగితం.
అందుకే మిమ్మల్ని హెచ్చరించటానికి అందులో పదాలకి అర్ధం తెలియకపోయినా, గుర్తుంచుకొన్నాను. కారులో
కార్బన్ డై ఆక్సైడ్ అట, ఫోన్ లో ఎండ్రిన్......... ఇంకా......"

జయదేవ్ పిడికిళ్ళు ఆవేశంతో మూసుకున్నాయ్. " నా గురించి కాదు, తులసి తులసి గురించి చెప్పు,
నిజమైన అపాయంలో వున్నది నేను కాదు ఆమే... పిళ్ళై ఇల్లు చూసేవా నువ్వు........"

"అతడి పేరు పిళ్ళై అవునో కాదో తెలియదు. నన్ను కాష్మోరా గురించి"

"అతడి గుర్తు లు చెప్పు......."మధ్యలో ఆపుచేస్తూ తొందరగా అఢిగేడు.

"చాలా పెద్ద గుర్తు ఒకటే వుంది -ఎవరికి లేనిది!"

"ఏమిటది?"

"తలలోంచి వైర్లు బయటికి రావటం"

జయదేవ్ ఒక్క గెంతులో ముందుకు కదిలి "కమాన్ క్విక్" అని అరిచేడు. ఎందుకు ఎక్కడికి అని
అడగకుండా అతణ్ని అనుసరించేడు దార్కా. మరుక్షణం ఇద్దరూ కార్లో వున్నారు. దార్కా గుర్తు లు చెబుతుంటే
కారు పిళ్ళై ఇంటివైపు బాణంలా సాగిపోయింది.

చిన్న పోర్టికో చుట్టూ తుప్పల్లా టి మొక్కలు విశాలంగా నిర్మానుష్యంగా వున్న బంగ్లా ...... ప్రహరీగోడ ఎత్తు గా
వుంది. ముందుగేట వేసి వుంది.

దూరంగా కారు ఆపుచేసాడు జయదేవ్. ఇద్దరూ ఆ ఇంటివైపు మౌనంగా క్షణంసేపు చూ్తూ కూర్చొన్నారు.
ముట్టడి చేయడానికి వ్యూహం పన్నుతున్న సైనికుల్లా . తరువాత మాట్లా డుకోకుండానే యిద్దరు కారు దిగారు.
లోపలి వ్యక్తు లు తమని గమనించకూడదని వారి ఉద్దేశ్యం. దార్కాకి ఫర్లేదు. కానీ జయదేవ్ కి ఇలా ఇళ్ళలో
ప్రవేశించటం క్రొత్త. అది అర్ధం చేసుకున్న వాడిలా దార్కాయే ముందు ఇంటి వెనుక భాగం ప్రవేశించి
గోడదూకేడు. వయసెక్కువ అవటంవల్ల కొంచెం కష్టమైనా దార్కా సాయంతో లోపలికి వెళ్ళగలిగేడు జయదేవ్.

మరింత అశ్తవ్యస్తంగా వున్నాయి అక్కడ చెట్లు . ఎవరూ వాటిగురించి పట్టించుకొనట్టూ లేదు. కాళ్ళకి తీగెలు
తగులుతున్నాయి. అక్కడక్కడా పాచిపట్టి చిత్తడిగా వుంది. శబ్దం చెయ్యకుండా ఇద్దరూ వెనక తలుపు దగ్గరకు
చేరుకున్నారు. ఎప్పట్నుంచో తెరవనట్టూ అది బిగుసుకుపోయి వుంది. తలుపు సందులో బూజుపట్టింది.

దార్కా కొద్దిగా పక్కకి జిరిగి కిటికీలోంచి లోపలికి చూసాడు. లోపల మసక చీకటిగా వుంది. ఎవరి అలికిడీ
లేదు. చప్పుడు చేయకుండా ఇద్దరూ ఇంటి ముందు భాగానికి చేరుకున్నారు. సింహద్వారం తాళం వేసివుంది.

ఇద్దరూ మొహమొహాలు చూసుకొన్నారు. దార్కా ముందుకు కదిలేడు చిన్న వూచతో అతడి వేళ్ళు రండు
క్షణాలు మిషన్ కన్నా వేగంగా కదిలినయ్.

జయదేవ్ అతణ్ణే గమనిస్తు న్నాడు అతడి చురుకుదనం చూడముచ్చటగా వుంది. "ఎందుకు, ఎక్కడికి" అని
ప్రశ్నలు వేయకుండా అనుసరించటం తన మనసులోని భావాన్ని తను చెప్పకుండానే గ్రహించటం అతడికి
నచ్చింది. దార్కా ఎడమకన్ను లేకపోవటాన్ని కూడా అతడు గమనించలేకపోలేదు. అయితే ఆ ప్రసక్తికి అది
సమయం కాదు.

చిన్న చప్పుడుతో తాళం వూడిపోయింది.

"ఎవరన్నా వచ్చే లోపులో మనం మన పని పూర్తిచేసుకోవాలి" రహస్యంగా అన్నాడు జయదేవ్. దార్కా
తలూపేడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుని లోపలికి ప్రవేశించారు ఇద్దరూ. లోపల చీకటిగా వుంది. కిటికీ
తెరవటం ప్రమాదకరం.

జయదేవ్ లైట్ వేసాడు.

ఆ లేటు వెలుగులో ఆ గదిని చూచి ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.

గదిలో ఒక్క వస్తు వూ లేదు. అంతకుముందే ఇల్లు ఖాళీ చేసినట్టు శూన్యంగా వుంది.
* * *
ముందు తేరుకున్నది దార్కా "ఏం చేద్దాం" అని అడిగేడు.

జయదేవ్ కొద్దిసేపు మౌనంగా వూరుకొని "వెతకాలి ఎక్కడో ఏదో ఒక ఆధారం దొరక్కపోదు" అన్నాడు.
ఇద్దరూ ఆ ఖాళీ గదులు వెతకటం మొదలు పెట్టా రు.

"ఇదిగో ఇక్కడే" అన్నాడు దార్కా. హాల్లో ఒక మూల చూపిస్తూ "ఇక్కడే తులసి బొమ్మ చూసింది నేను"

జయదేవ్ ఆలోచనలో పడ్డా డు. పూర్వం తాంత్రికులు బొమ్మ పెట్టి పూజలు చేసేవారట. శ్రీనివాసపిళ్ళై
చెప్పినట్టూ ఏదైనా మానవాతీత శక్తు ల్ని ఆక్రమించేడా ఈసారి అతడు?

"ఇక్కడే సదానంద చక్రవర్తి శవపు బొమ్మని చూసింది"

"సదానంద చక్రవర్తి ఎవరు?"

"సిద్దేశ్వరి శిష్యుడు. చచ్చిపోయాడు"

వెతుకుతూ ఇద్దరూ చెరో రూమ్ లోకి వెళ్ళారు.

ఒకప్పటి శ్రీనివాసపిళ్ళై బెడ్ రూమ్ లోకి -ఎక్కడైతే దార్కా పిళ్ళయ్ తలలో వైర్లు ప్లగ్కి అమర్చుకొని
వుండగా కనపడ్డా డో -అక్కడ నేలకి అయిదడుగుల ఎత్తు లో, పెన్సిల్ తో వ్రాయబడి కనిపించింది దార్కాకి ఒక
సంఖ్య.

11130

అతడు జయదేవ్ కి ఆ విషయం చెప్పగానే మరి ఆలస్యం చేయకుండా -వడివడిగా బయటకొచ్చేసేరు.

కారులో అయిదు నిముషాల్లో పబ్లిక్ ఫోన్ చేరుకున్నారు.

ఆ ఫోన్ నెంబరే ఒక గొప్ప రహస్యాన్ని తెలియబర్చబోతోందని ఎందుకో సిక్త్స్ సెన్స్ చెబుతోంది.


వణుకుతున్న వేళ్ళతో డయల్ చేసేడు.

ఒకటి.....ఒకటి........ఒకటి........మూడు...సున్న.

అవతల ఫోన్ మ్రోగుతున్న చప్పుడు.


అరనిముషం తర్వాత రిసీవర్ ఎత్తిన ధ్వని.

తరువాత చాలా కామ్ గా, నెమ్మదిగా వినిపించింది ఆ స్వరం "హల్లో ,.......వెంకట్ హియర్"

జయదేవ్ చేతిలోంచి రిసీవర్ అప్రయత్నంగా జారిపోయింది.

* * *
"ఇప్పటికి మూడు షాక్ లిచ్చేం ఫలితం ఏమీ కనబడలేదు. పైగా పరిస్థితి రోజు రోజుకి మరింత
దిగజారిపోతూంది. డాక్టర్! ఒక మాట చెప్పండి. ఈ విజ్ఞానం - ఈ సైన్స్ -ఇదంతా బూటకం అనీ -
మానవాతీత శక్తు లున్నాయని.......!! మా కూతుర్ని కాష్మోరా దెయ్యానికి అప్పచెప్పి తర్పణం వదుల్తాం"
అంటూ బావురుమంది శారద.

వెంకట్ మాట్లా డలేదు. మౌనంగా.......ఆర్ద్రంగా........ తులసివైపు చూసేడు.

తులసి స్కిప్పింగ్ చేస్తూంది. హాల్ మధ్యలో చిన్నపిల్లల్లో నిలబడి స్కిప్పింగ్ చేస్తూంది.

రెండు రోజుల్నుంచి ఆమె ప్రవర్తన మరింత విచిత్రంగా వుంది. రిగ్రేషన్ మరింత ఎక్కువైంది. చదువు, జ్ఞానం
అంతా మర్చిపోయింది. ఎక్కడో సంపాదించిన లక్కపిడతల్లో వంటవండటం ప్రారంభించింది ప్రొద్దు న్నే. ఆ
తరువాత కాగితంమీద పెన్సిల్ తో "ఎ" నుంచి "జడ్" వరకూ వ్రాసింది. ఆపైన నాలుగో తరగతి చదువుకునే
వాళ్ళు వేసే లెక్కలూ గుణింతాలూ చేసింది. ఇంగ్లీషు మర్చిపోయింది. సైన్సు మర్చిపోయింది.

కూతురు ప్రవర్తనతో శారదకి పిచ్చెక్కి నట్టయింది. శ్రీధర్ తిరిగి రాకపోవటం మరోవైపు ఆందోళన
కలిగిస్తూంది. అబ్రకదబ్ర కూడా లేడు మాట సాయానికి. ఆమె దాదాపు ఒంటరిదయింది. కొంచెం ధైర్యం
చెప్పేవాడు వెంకట్ ఒక్కడే. అతడూ శక్తివంచన లేకుండా ట్రీట్ చేస్తు న్నాడు.

"కాష్మోరా" అన్న పదం ఆమె మనోధైర్యం మీద పెద్ద దెబ్బ తీసింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆమె
తిరిగి క్షుద్రశక్తు ల్ని నమ్మే స్థితిలోకి వెళ్ళటంలేదు. కానీ సమస్య స్వంతకూతురిది. క్షుద్రశక్తు లు లేవనే తన వాదన
చివరికి మూర్ఖత్వంలోకి దారితీస్తే , ఆ క్షుద్రశక్తు లవల్లే కూతురు మరణిస్తే ఆ వ్యధ జీవితాంతం వదిలి పెట్టదు.
ఆమె చుట్టూవున్న పరిస్థితులు ఆమెని ఈ క్షుద్ర దేవతోపాసకులు తన ఇంటికి రావటాన్ని నిర్లిప్తంగా
గమనించేటట్లు చేసినయ్.

ఒక మంత్రగడొచ్చి ఇంటిచుట్టూ నిమ్మకాయలు కోసిపోయేడు. మరో మంత్రగాడు పొద్దు న్నే పసుపుతో స్నానం
చేయించి. కోడిని కోసి తులసి జుట్టు లో మూడుముళ్ళు వేసి వాటిని విప్పొద్దనిచెప్పి వెళ్ళిపోయాడు. వచ్చేవాళ్ళు
పోయేవాళ్ళ మధ్య, తులసి పిచ్చి మరింత ఎక్కువైంది. ఎవరూ లేకుండా చూసి దేముడి గదినిండా
కిర్సనాయిల్ పోసి విగ్రహాల్ని కాల్చేసింది. అందరు వచ్చేసరికి బొమ్మలు తగలబడిపోయాయి. అంతకు
ముందురోజే తలారా స్నానంచేసి దేముడికి భక్తితో దణ్నం పెట్టిన కూతురు, మరుసటిరోజు ఇలా ప్రవర్తించటం
శారదని నిశ్చేష్టు రాల్ని చేసింది.

అనుభవజ్ఞుడు, మానసిక శాస్త్రా న్ని బాగా అధ్యయనం చేసిన వాడూ అయిన వెంకట్ ఈ ఇన్ కాన్సిస్టెన్సీ
అర్ధం కావటంలేదు. తులసి స్కైజోఫెర్నియాతో బాధపడుతుందనేది నిర్వివాదాంశం. అయితే అది ఇంత
వేగంగా, ఇంత లోతుగా, ఇంత తొందర్లో ఎలా ఆమెను లోబర్చుకున్నదీ అన్నది అంతుబట్టటం లేదు.

తులసిని ట్రీట్ చెయ్యటంలో తను ఫెయిల్ అవుతున్నానన్న విషయం అతడికి తెలుస్తూంది.

అందుకే శారద అతడి దగ్గర కళ్ళనీరు పెట్టు కున్నప్పుడు అతడు కదిలిపోయేడు. "నేను శక్తివంచన లేకుండా
ప్రయత్నం చేస్తూనే వున్నానమ్మా. ఇంకో రెండ్రోజులు చూసి మెంటల్ హాస్పిటల్ లో చేర్పిద్దాం." అన్నాడు.
ఓటమితో అతడి మొహం మ్లానమైంది.... తలవంచుకొని బయటకు నడిచేడు. వెనకే శారద వచ్చి అరుగుమీద
నిలబడింది.

"డాక్టర్.........."

అతడు మెట్లమీద ఆగేడు. మసక చీకట్లో అతడి మొహంమీద విషాదం కొట్టొచ్చినట్టు కనబడుతూంది.

"తులసికి నయం అవుతుందా డాక్టర్..... నిజాయితీగా చెప్పండి నేనేమీ అనుకోను."

అతడో క్షమం మౌనంగా వుండి నెమ్మదిగా అన్నాడు. "నీ వయసొపది సంవత్సరాలు ఎక్కువైతే నా చెల్లెలి
వయ్యేదానివి. పది సంవత్సరాలు తక్కువైతే కూతురి వయ్యేదానివి. ఏది ఏమైనా తులసి నాప్రాణం అమ్మా. నా
ప్రాణం పోయినా సరే. తులసిని కాపాడతాను - ప్రపంచం తిరగబడినా సరే........" అతడు వడివడిగా
నడుచుకుంటూ తన ఇంటివైపు వెళ్ళిపోయేడు. ఆ వృద్ధు డి మొహంలో పట్టు దల కొట్టొచ్చినట్టు
కనబడుతూంది.

సాయంత్రం ఆరయింది. మేఘాలు దట్టంగా పట్టటంవల్ల, అప్పటికే బాగా చీకటి పడింది. చలిగాలి రివ్వున
వీస్తూంది.

తన ఇంటి తలుపులు తీసి వుండటం గమనించలేదు. అతడు తులసి గురించే ఆలోచిస్తు లోపలికి
ప్రవేశించాడు. హాల్లోపలికి నాలుగడుగులు వేసేక, అప్పుడు వినిపించింది గంభీరంగా జయదేవ్ కంఠం. "గుడ్
ఈవెనింగ్ పిళ్ళై, చాలా కాలానికి కల్సుకున్నాం"

అతడు అప్రతిభుడై చప్పున వెనక్కి అడుగువేసి, అంతలో గుమ్మం దగ్గర ఏదో నీడ కదిలినట్లయ్
వెనుదిరిగేడు.

తలుపు దగ్గరికి వేసి దానికి అడ్డంగా నిలబడుతూ కనిపించేడు - దార్కా!


వెంకట్ ఇద్దరివైపు చూసి జయదేవ్ తో "ఏమిటిది ప్రొఫెసర్"

"నటించొద్దు పిళ్ళై........."

"పిళ్ళై ఎవరు......" వెంకట్ అడిగేడు ఆశ్చర్యంగా, అతడి కంఠంలో కనబడిన నిజాయితీ జయదేవ్ ని
అయోమయంలో పడేసింది. ఈ లోపులో దార్కా, వెంకట్ దగ్గరికి వెళ్ళి అతడి మెడని పరీక్షించి - "ఈయన
సిద్దేశ్వరి కాడు" అన్నాడు.

వెంకట్ కిదంతా ఆశ్చర్యంగా వుంది. కొద్దిగా కోపంగా కూడా వుంది.

"ఏమిటి ఈ దౌర్జన్యం? నా యింట్లో........నా మీద" అన్నాడు.

జయదేవ్ దాన్ని వినిపించుకోలేదు. ఆలోచిస్తు న్నాడు. వెంకట్ పిళ్ళై కాకపోతే మరెవరు? పిళ్ళై ఇంట్లో వెంకట్
ఫోన్ నెంబరు ఎందుకు వ్రాసి వుంది? అతడు తన ఆలోచన్లని పక్కకి తోసి, " వెంకట్! నిజం దాచి లాభంలేదు.
మాకు అంతా తెలిసిపోయింది. పిళ్ళైకి మీకూ వున్న సంబంధం ఏమిటి చెప్పండి" అన్నాడు.

"నేను ఫోన్ చేసుకోవచ్చా" వెంకట్ అడిగేడు.

"ఎక్కడికి"

వెంకట్ ఈ లోపులో ఫోను డయల్ చేసేడు. "హల్లో పోలీస్ స్టేషన్" అంటున్నాడు. జయదేవ్ వేళ్ళతో
డిస్కనెక్ట్ చేసి "కోపంవద్దు డాక్టర్"అన్నాడు.

"లేకపోతే ఏమిటిది........"

పోలీసుల్ని పిలుస్తు న్నాడంటే వెంకటే నిశ్చయంగా పిళ్ళై తాలూకు మనిషి కాడు.

కానీ ఆ విషయం మరింత నిర్దా రణ కావాలి.

జయదేవ్ ఫోన్ తన ముందుకు లాక్కుని తొందర తొందరగా డయల్ చేసేడు. విశాఖపట్నం డాక్టర్
అవంతికి. మరు నిముషం అవంతి లైన్లోకి వచ్చేడు.

"హల్లో........"

"డాక్టర్"
"యస్"

"నేను జయదేవ్ ని! ఒక్క విషయం చెప్పండి. డాక్టర్ వెంకట్ అనే ఆయన మీ ఆస్పత్రిలో పనిచేసి ఈ మధ్య
రిటై రయ్యారా?"

ఒక క్షణం నిశ్శబ్దం తరువాత అవంతి కంఠం వినిపించింది "- అయ్యారు."

జయదేవ్ నవనాడులూ కృంగిపోయినట్టయింది. అంత తేలిగ్గా పోయిందనుకున్నాడు కాని మొదట్లోనే


వున్నాడు.

వెంకట్ నిజమైన సైక్రియాటిస్టేననీ అతడికి పిళ్ళైకీ సంబంధం లేదనే అనిపిస్తూంది. అయితే మరి పిళ్ళై దగ్గిర
ఇతడి ఫోన్ నంబర్ ఎందుకుంది?

ఈ లోపులో దార్కా కదలటం చూసి జయదేవ్ తలెత్తా డు బయటికి వెళదామన్నట్టు దార్కా సైగచేశాడు.
ఇద్దరూ బయట వరండాలో కి వచ్చారు. దార్కా కొద్దిగా తటపటాయించి "చిన్న సలహా - మీకు నచ్చితేనే"
అన్నాడు.

"ఏమిటి?"

"ఈ వెంకట్ ఏం చేసేడో తులసినే అడుగుతే"

జయదేవ్ కి మొదట అర్ధంకాలేదు. నెమ్మదిగా అర్ధమయీ అవగానే ఆనందంతో విజిల్ వేయబోయేడు. ఆ


ఆలోచన వచ్చినందుకు దార్కాని ప్రశంసాపూర్వకంగా చూసేడు....... నిజమే.

వెంకటే పిళ్ళై తాలూకు మనిషిగానీ అయివుంటే, అది తులసిగానీ, శారదగానీ వెంటనే చెప్పేస్తా రు. ఎలాటి
ట్రీట్ మెంట్ ఇఛ్చాడో, ఏ విధంగా ప్రవర్తించాడో.

దార్కాతో "పద ఎదురింటికి వెళదాం" అని లోపలికి తొంగిచూసి, "సారీ డాక్టర్! మేము వచ్చేవరకూ మీరు
ఇంట్లో బందీలుగా వుండక తప్పదు" తలుపు గొళ్ళెం పెట్టా డు.

దార్కా కదల్లేదు "ఎందుకు బయట గొళ్ళెం" అని అడిగేడు.

జయదేవ్ "మనం వెళ్ళగానే వెంకట్ పారిపోయి పిళ్ళైకి విషయం చెప్పకుండా" అన్నాడు.

దార్కా నవ్వి, "ఆ విషయం ఇంట్లోంచి ఫోన్ లోనే చెప్పొచ్చుగా" అన్నాడు. జయదేవ్ నాలిక్కర్చుకుని
లోపలికి తిరిగి వెళ్ళి ఫోన్ కనెక్షన్ కేసి వచ్చాడు. ఇద్దరూ ఎదురింటివైపు నడుస్తూంటే జయదేవ్ అడిగేడు.

"నీకిన్ని విషయాలు ఎలా తెలిసేయ్? అసలు నువ్వెవరు? ఏం చదువుకున్నావు?"


దార్కా జవాబు చెప్పలేదు. అతడికి ఆచార్యులవారు జ్ఞాపకం వచ్చారు. అతడు మౌనంగా వుండటం చూసి
జయదేవ్ కూడా ఆ ప్రశ్న రెట్టించలేదు.

ఇద్దరూ ఎదురింటికి వెళ్లేసరికి అక్కడ పరిస్థితి అద్వాన్నంగా వుంది. తులసి చిన్న పిల్లలా బిగ్గరగా
ఏడుస్తూంది. శారద కళ్ళనిండా నీళ్ళతో ఆమెని సముదాయిస్తుంది. ఇంట్లో వస్తు వులన్నీ ఎవరో విసిరేసి నట్టు గా
చెల్లా చెదురుగా పడివున్నాయి.

"ఏం కావాలట?" జయదేవ్ అడిగేడు. మూడో మనిషి కనబడే సరికి అప్పటివరకూ వున్న బింకం
సడలిపోయి, స్త్రీ సహజమైన దుఃఖం ముంచుకురాగా "తనకి గౌను కావాల్ట జయదేవ్ బాబూ" అంది రుద్దంగా.

"పేషెంట్ ని ఇరిటేట్ చేయటం మంచిదికాదు. గౌను యిచ్చెయ్యకపోయారా"

"గౌను లేదు"

"నైటు గౌను"

"అది కాదు. చిన్నపిల్లలేసుకొనేది కావాల్ట. పదకొండేళ్ళ పాపట తను. ఆ గౌను వేసుకుని స్కూల్ కి
వెళుతుందట." దుఃఖం తో గొంతు పూడుకుపోగా శారద అంది.

ఆ గదిలో సూదిపడితే వినిపించేటంత నిశ్శబ్దం వ్యాపించింది .శారద దార్కా వైపు చూసింది. అతణ్ని
జయదేవ్ తో పాటు చూసి ఆమెకి ఆశ్చర్యం వేసింది. అయితే కూతురి తాలూకు ఆవేదన దాన్ని మింగేసింది.

జయదేవ్ ని చూసి తులసి ఏమనుకుందో ఏమో తన గదిలోకి వెళ్ళిపోయింది. జయదేవ్ శారదని అడిగేడు.

"శారదగారూ - తులసి ఇలా ప్రవర్తించటానికి కారణం మానవాతీత శక్తి ఏదీకాదని, దీనికంతటికీ వెనక ఏదో
బలమైన కారణం వుందనీ నమ్ముతున్నాను. నా వూహ నిజమే అయితే, దానిక్కారణం వెంకట్ అని నా
అభిప్రాయం."

"కాదు" వెంటనే అన్నది శారద.

"అంక నిశ్చయంగా ఎలా చెప్పగలరు?"

ఆ ప్రశ్నకి ఆమెకి వెంటనే సమాధానం దొరకలేదు. ఏం చెబ్తుంది?...... పదేళ్ళు చిన్నదానివైతే కూతురినీ,


పదేళ్ళు పెద్దదయితే చెల్లెలివీ అయేదానివమ్మా.....అన్న మాటలా - ఊహూ..... కావు - అంతకన్నా బాగా
నటించగలరు చాలామంది! అదికాదు, ఏదో వుంది! అవును........మనసు!! తన మనసు చెబ్తూంది.......
డాక్టర్ వెంకట్ అటువంటి వాడు కాడని!!!
ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లు "డాక్టర్ వెంకట్ అటువంటి వారు కాదు. ఆయన ట్రీట్ మెంట్ పట్ల నాకు
నమ్మకం వుంది. కానీ ఎలా అంటే నేను సమాధానం చెప్పలేను ప్రొఫెసర్" అంది నిశ్చలంగా.

ఆమె కంఠంలో స్థిరత్వానికి జయదేవ్ ఎదురు చెప్పలేకపోయేడు.

అంతా చూస్తు న్న దార్కా ఆలోచనలు ఇంకోలా వున్నాయి. అతడు తులసిని చూసి కదిలిపోయేడు. చాలా
కొద్దిరోజుల్లో ఎంత మార్పు? రెండ్రోజులు క్రితం లేచిన కాష్మోరా ప్రభావం ఆ అమ్మాయి శరీరం మీద ఎంతలా
వుందో ఆ మంత్రగాడి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తూంది. ఎలాటి అమ్మాయి ఎలా మారిపోయింది ? అదే దృశ్యం?
సిద్దేశ్వరి ఆలయము బ్రద్దలుకొట్టి తన చెయ్యి పట్టు కొని "పద" అంటూ తూనీగలా పరుగెత్తటం! అలాంటి
హుషారయిన తులసి ఇప్పుడు పిచ్చిలో గోళ్ళతో మొహం రక్కుకుంది. జుట్టు కు తైలసంస్కారం లేదు.
చూపుల్లోని - నిస్తేజత, నవ్వు నిర్జీవం, అస్థిపంజరంలా మారిపోయింది.

"సరే మీరు చెప్పినదంతా నమ్ముతాను. వెంకట్ నిజమైన డాక్టరే" అన్న జయదేవ్ మాటల్తో దార్కా ఈ
లోకంలోకి వచ్చాడు "అయినా కొన్ని ప్రశ్నలకి ఏం అనుకోకుండా జవాబు చెప్పండి"

శారద తలూపింది.

"వెంకట్ తాలూకువిగానీ, వెంకట్ ఇచ్చినవిగానీ ఏయే వస్తు వులున్నాయి. ఈ ఇంట్లో ఏమీ వదలకుండా
ఆలోచించి చెప్పండి"

"ఇంజెక్షన్ బాటిల్స్ టానిక్స్"

జయదేవ్ ఒక్కొక్కటే శోధించటం మొదలుపెట్టేడు. ఎందులో నయినా ఏదయినా దొరుకుతుందేమోనని!


శారద నిర్లిప్తంగా చూస్తూంది. ఈ లోపులో దార్కా తులసి గదిలోకి వెళ్ళేడు. పక్కమీద పడుకొనివున్న తులసి
చప్పుడికి గుమ్మం వైపు చూసింది.

ఇద్దరి చూపులు కల్సుకున్నాయ్!

చాలాకాలం తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు అందులో ఒకరు మరొకర్ని గుర్తు పట్టలేని స్థితిలో
వుంటే కలిగే విషాదమయ నిశ్శబ్దం దార్కా అడుగు ముందుకేసి తులసి దగ్గరకు వెళ్ళాడు.

ఎవరైనా దగ్గరకు వస్తుంటే నానా భీభత్సం చేసే తులసి, అతడు వస్తూంటే చాలా కామ్ గా ప్రశాంతంగా
అతడివైపు చూడసాగింది. అతడు సూటిగా ఆమె కళ్ళలోకి చూసేడు.

పాము బుసకొడుతున్నట్టు ఆమె వూపిరి వదుల్తూంది. అతడు మరింత దగ్గరికి వెళ్ళేడు.

ఆమె కామ్ గానే వుంది. కానీ.........ఆ కళ్ళు నెమ్మదిగా రక్తవర్ణంలోకి మారసాగినయ్. ప్రమాదాన్ని
పసిగట్టినట్టు అతడు దగ్గరికి రాగానే పొదలోంచి పులి బయటికి దూకినట్లు ఆమె పక్కమీద నుంచి
లంఘించబోయింది. అది గ్రహించినట్టూ అతడు చెయ్యి గాలిలోకి సాచేడు. ఆమె నిశ్చలమయింది.

అతడి పెదవులు ఉచ్చరించినయ్.

"ఓ హెండెరె హెండి - తులసి తోమజాయిచ్చి కహి - మోమజాయిచ్చి జోరభటి - నిళోజోరాభుత్తు జోరా -
తులసి -రిత్తు జోరా. దుష్టిజోరా -కేఝుడాయి - ముజడోయి కేంపుకాయి........... ముపుంకాయి...... ఖాడో -
ఖాడో. -నొచ్చుడు బోలి -కోఠీ కోఠీ అగ్గం"

(ఓ కాష్మోరా! నిన్నెదిరించే శక్తి మాకులేదు. నిన్ను ప్రార్ధిస్తు న్నాను. ఆ ప్రార్ధనలో ఆజ్ఞాపించే శక్తికూడా వుంది
సుమా! ఈ తులసిని నీతోపాటు తీసుకుపోయే ముందు బాధపెట్టకు జ్వరం చేతగానీ, దిష్టిచేతగానీ, రక్తం
చేతగానీ, గాలి చేతగానీ బాధ పెట్టకు. బ్రతికిన ఏడురోజులూ ప్రశాంతంగా బ్రతకనీ. ఇది ప్రార్ధన - మంత్రపు ఆజ్ఞ)

తులసి నెమ్మదిగా నిద్లలోకి జారుకున్నది. అప్పటివరకూ ఏదో బాధలో వున్నది. తేరుకున్నట్టు మొహంలో
తెరిపినపడ్డది.

ఈ లోపులో బయట జయదేవ్ మందు సీసాలు పరిశీలించటం పూర్తయింది. అన్నీ బాగానే వున్నట్టు
అనిపించేయి . అంతలో శారద ఏదో జ్ఞాపకం వచ్చినట్లు "మస్కిటో రిపెల్లర్" అంది .జయదేవ్ తలెత్తా డు.

"తులసి పుట్టినరోజున డాక్టర్ ప్రజెంటేషన్గా మస్కిటో రిపెల్లర్ ఇచ్చాడు" అంది శారద "గోడకి పెట్టేం" అని
గోడవైపు చూసి "అరె ఇక్కడే వుండాలే" అన్నది. గోడకి రిపెల్లర్ లేదు.

"తులసి తీసి దాచిందేమో" అంది శారద. కానీ తులసి దాని విషయం చెప్పేస్థితిలో లేదు. జయదేవ్ ఒక
నిర్ణయానికి వచ్చినవాడిలా మళ్ళీ వెంకట్ దగ్గరికి వెళ్ళాడు.

మూసివున్న గదిలో వెంకట్ అటూ ఇటూ తిరుగుతున్నాడు.

"నాకు తెలిసిపోయింది తులసి పిచ్చికి కారణం" తలుపు తెరుస్తూ అన్నాడు జయదేవ్. వెంకట్ ఆతృతగా
"యేమిటి?"

"మీరిచ్చిన మస్కిటో రిపెల్లర్"

వెంకట్ మొహంలో నిరాశ ఆవరించింది. తిరిగి కూర్చుంటూ "ఇంపాజిబుల్" అన్నాడు. "మస్కిటో రిపెల్లర్
లు మనుషులకి పిచ్చి ఎక్కించటం మొదలు పెడితే అవి తయారుచేసే కంపెనీలన్నీ ఏమవ్వాలి? మనిషి మెదడు
అంత సున్నితమైనదేం కాదు."

వెంకట్ మొహంలో సిన్సియారిటీ కంఠంలో నిజాయితీ జయదేవ్ కి కొట్టొచ్చినట్టు కనబడ్డా యి. తన


అనుమానం తప్పేమో అన్న అభిప్రాయం కలిగింది అతడికి.

* * *
తులసి డీప్ హిప్నాసిస్ లో వుంది.

దాదాపు అరగంట నుంచి ఆమెని నిద్రలోకి పంపటానికి జయదేవ్ చాలా కష్టపడవలసి వచ్చింది.
(లూనటిక్స్ తొందరగా హిప్నటై జ్ అవరు)

దార్కా, వెంకట్ తులసిని అతడు ప్రశ్నలడగటాన్ని చూస్తు న్నారు. తులసి గొడవతో నానా గందరగోళంగా
వుండే ఆ ఇల్లు , ఆ క్షణం, చీమ చటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా వుంది.

"నీ పేరు?"

"కాష్మోరా" సగం మూసిన తులసి కనురెప్పల వెనుకనుంచి తెల్ల గుడ్డు భయంగా వుంది.

"వయసు?"

"పదకొండు సంవత్సరాలు"

"నువ్వెప్పుడు కాష్మోరావి అయ్యావ్?" దార్కా పక్కనుంచి అడిగేడు. వెంకట్ అతడివేపు చిత్రంగా చూసేడు.
ఆ ప్రశ్నకి అర్ధంలేదని పించింది. పదకొండు సంవత్సరాల వయసు అని చెబ్తూనే వుంది కదా? అనుకొన్నాడు.
అయితే జయదేవ్ కి దార్కా ప్రశ్న అర్ధమయి చిరునవ్వుతో "నీ కంఠానికి జవాబు చెప్పదు" అని తనే ఆ ప్రశ్న
అడిగేడు. చాలా ఆశ్చర్యంగా తులసి నోటివెంట "పదిరోజులు........." అని జవాబు చెప్పింది.

అందరూ మొహమొహాలు చూసుకొన్నారు.

రిగ్రెషన్ ద్వారా తులసిని పదిరోజులు వెనక్కి తీసుకెళ్ళాడు జయదేవ్.

"నీ పేరు?"

ఈసారి "తులసి" అంది.

శారద మొహం విప్పారింది. ఆ మాత్రం దానికే ఆ తల్లి సంతోషించింది.

"ట్రై టు గెట్ ది రీజన్ ఫర్ హర్ కాన్పిక్ట్" అని సూచన నిచ్చాడు వెంకట్. జయదేవ్ తల పంకించి
"దేముడున్నాడా- " అని అడిగేడు.
"........లేడు" అంది తులసి, "మతం, దేముడు మనిషిని మత్తు లో వుంచే పదార్ధా లు"

ఆమె కంఠంలో పూర్వపు కమేండ్ వుండటాన్ని అక్కడ అందరూ గమనించేరు.

ఆమెని మరింత గతంలోకి తీసుకెళ్లా డు జయదేవ్.

"సిద్దేశ్వరి దేముడి పేరుతో చేసే మోసాలవల్ల నువ్వు ఆ అభిప్రాయానికి వచ్చావా?"

"తెలివైన వాళ్ళు అందరూ సిద్దేశ్వరులే!"

"ఎలా కనుక్కున్నావ్?"

"సిద్దేశ్వరిని చూసేను -ఆమె చేసే మోసాలు చూసేను"

"అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది?" జయదేవ్ అడిగేడు.

"నా ఉంగరం హుండీలో వేసి ప్రశ్న అడిగేను"

"అప్పుడు ఏం జరిగింది?"

"పుర్రె మాట్లా డింది. పు...........పురెరెర్రె........" తులసి హిప్నాటిక్ ట్రాన్స్ లో కూడా ఆ సంఘటన


తలుచుకొని భయపడింది.

"తరువాత ఏమైంది?"

"నాకు......నాకు స్పృహతప్పింది.....అప్పుడు........అప్పుడు."

"అప్పుడేం జరిగింది.?"

ఆ ప్రశ్నతో తులసి శరీరం వణకసాగింది. ఆమె హిస్టీరియా వచ్చినట్టు పిడికిళ్ళు బిగించింది. ఆమెను తిరిగి
గాఢమైన నిద్రలోకి తీసుకెళ్ళాడు జయదేవ్. అందరూ ప్రేక్షకులై ఆమెని చూస్తు న్నారు.

ఒక హిప్నాటిస్టు , ఒక సైక్రియాటిస్టు , ఒక మహా మాంత్రికుడూ ఆమెని అలా పరీక్షించటం అపూర్వమైన


దృశ్యం.

వెంకట్ జయదేవ్తో, "అది ఏదో కారణం! దాన్ని కనుక్కుంటే ఆమె ద్వంద్వ ప్రవృత్తికి కారణం తెలిసిపోతుంది.
ఆ ఘర్షణ భరించలేక ఆమె స్కిజో ఫెర్నిక్ అయింది. "అన్నాడు.

జయదేవ్ గడ్డం గోక్కున్నాడు. చాలా సున్నితమైన విషయం ఇది. హిప్నాసిస్ పేషెంట్ ని అంత బలంగా
నొక్కిపట్టి వుంచదు. మెదడుకి ఏమాత్రం ఇష్టంలేని విషయాన్ని మాట్లా డినా అది నిద్రలోంచి లేచిపోయే
ప్రమాదం వుంది.

అతడి తటపటాయింపు చూసి దార్కా "ఏమిటి విషయం?" అని అడిగేడు.

జయదేవ్ తచన సమస్య చెప్పేడు.

"నేను ప్రయత్నించనా!" అన్నాడు దార్కా.

హిప్నాటిస్టూ, సైక్రియాటిస్టూ మొహమొహాలు చూసుకున్నారు.

"ఎలా?" అన్నాడు జయదేవ్.

దార్కాకి చాలా చిన్న విద్య ఇది. మంత్రగాళ్ళకి హిప్నాటిజం (ఆ పదం వాళ్ళకి తెలీదు) మొదటి పాఠంగా
నేర్పుతారు గురువులు. మాటల్లో రిధమ్, మాటల్తో ఎదుటి మనిషిని భ్రమలోకి పంపటంతోపాటే మనిషి
నాడులమీద ప్రయోగం చెయ్యటం (ఇంగ్లీషు మందులో పెంటథాల్, ట్రాంక్విలైజర్స్ చేసే పనులు) ద్వారా ఆ
మనిషిని నిద్ర లేవకుండా చేయటం వెన్నతో పెట్టిన విద్య.

దార్కా తులసి మెడ దగ్గర చేయి పెట్టి వేళ్ళతో ఏదో నరాన్ని రాస్తూ చెవిలో మాట్లా డేడు.

అతడినే విస్మయంతో గమనిస్తూన్న జయదేవ్, అతడి పని పూర్తవగానే తిరిగి ప్రశ్నించటం మొదలుపెట్టా డు.

"సిద్దేశ్వరి ఆలయం బద్దలు కొట్టటానికి కొన్ని రోజుల ముందు నువ్వు రెండుసార్లు అక్కడికి వెళ్ళావు కదూ!"

"అవును"

"మొదటి సారి వెళ్ళి ప్రశ్న అడిగేవు - అవునా?"

"అవును"

"తరువాత పుర్రెతో మాట్లా డేవు"

"పుర్రె నాతో మాట్లా డింది" అంది తులసి ఈ సారి ఆమె నిద్రలో మార్పు లేకపోవటంతో జయదేవ్ దార్కా
వైపు అభినందిస్తు న్నట్టు చూసేడు.
"ఆ తరువాత ఏం చేసావు?"

"ఇంటికొచ్చి పండిత్ అంకుల్ తోనూ, జయదేవ్ అంకుల్ తోనూ చెప్పాను"

"వాళ్ళేమన్నారు?"

"అంతా భ్రమ అన్నారు"

"భ్రమ కాదా?"

"కాదు......"

"ఎలా తెలుసు నీకు?"

"నోట్ పుస్తకంలో కాగితాలు లెక్క పెట్టేను. తక్కువున్నాయి"

"అయితే నిజమేనన్నమాట!"

"అవును"

"పుర్రె మాట్లా డటం కూడా."

"అవును"

"తరువాత ఏమైంది?"

"మైకం వచ్చేసింది" అంది తులసి. ఆమెలో మళ్ళీ కదలిక ప్రారంభమైంది. కానీ ఏదో శక్తి నొక్కిపట్టినట్లు
నిద్రలోనే వుంది.

"మెలకువ వచ్చేటప్పటికి నువ్వు వరండాలో అందరితో పాటు కుర్చీలో వున్నావా?"

"లేను. మధ్యలోనే మెలకువ వచ్చేసింది. ఆ గదిలోనే!"

జయదేవ్ కి ఇది కొత్త సమాచారం. అంతకుముందు తులసి చెప్పింది వేరు. అందుకే అదంతా భ్రమ అని
కొట్టిపడేసేడు.

"ఆ గదిలోనే వున్నావా?"


"పుర్రె కూడా పక్కనే వుంది."

"ఇంకేం వుంది?"

"చీకటిగా వుంది"

"ఇంక......."

"చక్రవర్తి దగ్గరకు వచ్చాడు"

ప్రేక్షకులు అప్రయత్నంగా వూపిరి బిగపట్టా రు.

"వచ్చేక............."

..........................

"తరువాత ఏం జరిగింది.........." రెట్టించాడు జయదేవ్.

తులసి శరీరం చిగురుటాకులా కంపించింది. మొహం చెమట పట్టింది. జయదేవ్ ఆమె మెదడుకి సరిపోయే
పాజిటివ్ సపోర్ట్ తో సూచన ఇస్తూ అడిగేడు. "గదంతా చీకటిగా వుంది. మెలకువ వచ్చింది. చక్రవర్తి దగ్గరకి
వచ్చాడు. తరువాత ఏం జరిగింది.?"

"నేను దోచుకోబడ్డా ను"

తులసి నోట ఆ మాట రాగానే అందరూ స్థా ణువులైపోయారు. ఆమె నిద్రలోంచి బయటకొచ్చి, "నేను
దోచుకోబడ్డా ను.... నేను నేను తల్లిని కాబోతున్నాను. నాకు ఇప్పుడు నాలుగో నెల" అంది ఏడుస్తూ.

అప్పుడు వినిపించింది ఓ పెద్ద నవ్వు! అందరూ ఆ నిశ్చేష్టతలోనే ఆ అయోమయంలోనే అఫ్రయత్నంగా


వెనుదిరిగి చూసేరు. చిరిగిన బట్టల్తో బురద కొట్టు కున్న శరీరంతో అక్కడ పిచ్చివాడిలా నిలబడి వున్నాడు
శ్రీధర్.

పిచ్చి నవ్వూ, విషాదం కలిసిన అతడి రోదన అందరి గుండెల్ని పిడేసేటట్టు వుంది.

దబ్ మన్న శబ్దంతో శారద స్పృహతప్పి కిందపడిపోయింది


28
వెంకట్ ఇంట్లో కూర్చొని వున్నారు ముగ్గురూ. చివరి ఆలోచన్లతో వారున్నారు. శ్రీధర్ కి ఇంజక్షనిచ్చి
నిద్రపుచ్చాడు వెంకట్. శ్రీధర్ చాలా కదిలిపోయేడు. రెండ్రోజుల క్రితం ఫకీరు మరణం, ఇంటికొచ్చేసరికి తులసి
తాలూకు దారుణమైన వార్త, అతణ్ని కృంగదీసినయ్.

జయదేవ్ ఆలోచిస్తు న్నది శ్రీధర్ గురించి కాదు, తులసి గురించి. అతడికి అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగిస్తు న్నవి
రెండు విషయాలు. ఒకటి నేనే కాష్మోరానని తులసి చెప్పటం, రెండు తులసి గర్భానికి కారణం సదానంద
చక్రవర్తి అయితే, ఆ విషయం పిళ్ళై (సిద్దేశ్వరికి) తెలియకపోవటం!

లేకపోతే తెలుసేమో!

తులసి తన కడుపులో ప్రాణి గురించి ఆలోచించీ, ఆలోచించీ, ఆ వ్యధతో, ఘర్షణతో స్కిజో ప్రెనిక్
అయిందన్నది నిర్వివాదాంశం.

అది స్కిజో ప్రేనియా అయితే మరి "నా పేరు కాష్మోరా" అని ఎలా చెబుతుంది? అది మళ్ళీ పొసెషన్
(దెయ్యం పట్టటం) లోకి వస్తుందే!

విశాఖపట్టణంలో డిన్నర్ ఇస్తూ డాక్టర్ అవంతి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి "ఆమె ప్రేమలో పడింది.
ప్రియుడు మోసం చేసేడు. ఆమెలో విప్లవ భావాలు బాగా అప్పటికే చోటుచేసుకున్నాయ్. ఆ షాక్ తో ఆమె
హిట్లర్ ని ఆహ్వానించింది. తనే హిట్లర్ లా ప్రవర్తించింది. She has invited HITLER to enter her
shoes....... అదే దయ్యం పట్టటం అంటే ఒక మనిషి, మరో చచ్చిపోయిన మనిషిని తనలోకి ఆహ్వానించి ఆ
మనిషిలాగే మాట్లా డటాన్నీ, ప్రవర్తించటాన్నీ దెయ్యం పట్టటం అంటారు. ఈ బలహీన మనస్తత్వం వున్న
మనుషులు తమని ఆవహించుకోవటం కోసం దేముళ్ళని కూడా ఆశ్రయిస్తూ వుంటారు. అది పూనకం......"

అయితే తులసి కాష్మోరాని ఆహ్వానించిందా.......!దెయ్యాన్ని!

అతడికి అనుమానం పూర్తిగా తీరలేదు.

కాష్మోరా దెయ్యం పట్టేక ఎందుకు తులసి లక్కపిడతలు అడిగింది? ఎందుకు స్కిప్పింగ్ చేసింది? తులసిని
పది, పదకొండు సంవత్సరాల వయస్సులో పట్టిన కాష్మోరాకి ఇప్పుడు ఆమె గౌను వేసుకుంటాను అని
అడగటానికి ఏదయినా సంబంధం వుందా?

ఆ గదిలోనే కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తు న్న దార్కా ఆలోచనలు మరో విధంగా వున్నాయి. అతడికి తెలుసు
, ఇంకో మూడు రోజుల్లో తులసిని చంపబోయే కాష్మోరాకి, ఇప్పుడు తులసిని పట్టిన దెయ్యానికీ ఏ
సంబంధమూ లేదని కాష్మోరాలాటి మహత్తరమైన శక్తి గౌన్లూ లక్క పిడతలూ అడిగించదు. సరీగ్గా ఏడో రోజు
ఉప్పెనలా వచ్చి కబళించి వేస్తుంది. దాన్నెవరూ ఆపలేరు.
అయితే తులసి ఎలానూ మరణిస్తుంది కదా అని అతడు జయదేవ్ చేస్తు న్న పరిశోధనల పట్ల నిరాసక్తంగా
లేడు. ఈ మనుష్యుల బంధాల్ని, ద్వేషాల్ని ఒకర్నొకరు చంపుకొనే పగల్నీ రక్షించుకోవాలనే ప్రయత్నాలనీ చాలా
ఉత్సుకతతో గమనిస్తు ననాడు.

వెంకట్ ఆలోచిస్తు న్నది వేరు. అతడి ఆలోచన్లలో ఎక్కడో ఏదో ఇబ్బందికరమైన కదలిక! ఏమిటో తెలియటం
లేదు....

ముగ్గురూ తమ తమ ఆలోచన్లలో వుండగా.......

అప్పుడు మోగింది ఫోన్.

జయదేవ్ అందుకుని "హలో" అన్నాడు.

"డాక్టర్ వెంకట్?"

జయదేవ్ ఫోన్ వెంకట్ కి ఇవ్వబోతూ ఏదో మెదడులో మెరిసి నట్లయి - "స్పీకింగ్" అన్నాడు. వెంకట్
తెల్లబోయి చూస్తు న్నాడు.

అటువైపునుంచి క్షణం నిశ్శబ్దం.

తర్వాత లయబద్దంగా వినిపించింది శ్రీనివాసపిళ్ళై కంఠం......

"మాండవ్యతీరంనుండే వెలుగుతున్నది కిరణమణి.

కిరణాల గుడిలోన మరపురాని మరు వింతలు........

1966 లో విప్లవం - సంఘర్షణలో వైశిష్ట్యం"

మళ్ళీ కొద్ది నిశ్శబ్దం.

తరువాత కంఠం బొంగురుగా వినిపించింది.........."ఆపరేషన్ సిక్స్ ఆపరేషన్ సిక్స్ భగవద్గీత -నూట


పదకొండో పేజీ -ఓవర్!"

టెలిఫోన్ పెట్టేసిన చప్పుడయింది.

జయదేవ్ నిర్విణ్నుడయ్యాడు. ఏదో అద్బుతమైన విషయాన్ని గమనిస్తు న్నట్టూ అతడి మెదడు


మొద్దు బారిపోయింది. ఇద్దరూ అతణ్నే గమనిస్తు ననారు.

జయదేవ్ తన అస్పష్టమైన ఆలోచన్లకి ఓ రూపం ఇవ్వటానికి ప్రయత్నిస్తు న్నాడు. ఇయాన్ ఓ నీల్ వ్రాసిన
పుస్తకపు చాప్టర్లు అతడి మనసులో రీళ్ళుగా తిరుగుతున్నాయి. ఒక చాప్టరు దగ్గర అతడి ఆలోచన్లు
ఆగిపోయాయి. "మనిషి మెదడు కంట్రోల్ బై ట్యూనింగ్"

'పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్' అన్న విభాగంలో చాప్టరు అది.

"ఒక సారి భగవద్గీత ఇస్తా రా!" అని వెంకట్ ని అడిగేడు.

"భగవద్గీతా -మా ఇంట్లో లేదే!"

వెంకట్ అలా అంటాడని తెలుసు.

"మాండవ్య తీరం........." అంటూ తను విన్న మాటల్ని తిరిగి అన్నాడు జయదేవ్. వెంకట్ వింటూ
కూర్చున్నాడు మార్పులేదు.

వెంకట్ లో మార్పు వుండదని తెలుసు.

తన స్వరం - తన మాటలు వెంకట్ కి ఏ సూచనలు ఇవ్వలేవు. అతడు జాలిగా ఎదుటి కుర్చీలో కూర్చొన్న
వెంకట్ వైపు చూసేడు. ఎవరికీ తెలీదు...... ఎదుట కూర్చున్న ఈ మనిషి మెదడు ఒక ఫ్రీక్వెన్సీలో వస్తూన్న
సౌండ్ వేవ్స్ కి కంట్రోల్ చేయబడిందనీ, పైకి మామూలుగా కనపడినా, ఆ సూచన్లని అనుసరించే వెంకట్
ప్రవర్తిస్తా డనీ.......

(పాఠకులకు మనవి. ఇందులో అభూత కల్పనగానీ పాంటసీగానీ ఏమీ లేవు. ఒక ట్యూన్ కి మెదడును
లోబర్చి, ఒక స్టూడెంటుని అదే ట్యూన్ లో 'నువ్వు కుర్చీలోంచి లేవలేవు' అని సూచనిస్తే, ఆ కుర్రవాడు
లేవటానికి గుంజుకుంటూ ఐదు నిముషాలపాటు విఫలప్రయత్నం చేయటాన్ని స్వయంగా చూసేడు ఈ
రచయిత)

జయదేవ్ కి ఏం చేయాలో తోచలేదు. ఏమిటా ఆపరేషన్ సిక్స్? పిళ్ళై ఇంకా ఎలా బాధపెట్టదల్చుకున్నాడు
తులసిని. నిజానికి ఈ బాధ తులసిది కాదు. తల్లిదండ్రు లది.

ఆలోచిస్తూ అతడు లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు.

మనసంతా శూన్యంగా వుంది.

తమ కళ్ళముందు ఆడుతూ పాడుతూ తిరిగే తులసి తల్లి కాబోతూంది! ఇది ప్రపంచానికి తెలిస్తే....... తను
చెయ్యని తప్పుకి, చీకట్లో.......మైకంలో వుండగా ఎవరో దుర్మార్గుడు చేసిన అత్యాచారానికి ఆ పాప ఇంకా పాపే.
'అంకుల్ అంకుల్' అంటూ తిరిగే పాప - జీవితాంతం దుఃఖం అనుభవిస్తుంది.

వయసు పొంగులో కాలు జారితే వేరు, వలపు మత్తు లో కళ్ళు మూసుకుపోతే ఆ పాపం అనుభవించటం
వేరు. కానీ తులసి అలాంటిది కాదే! స్పోర్ట్సులోనూ, చదువులోనూ చురుగ్గా వుండే అమ్మాయి..... లేడిలా
తృళ్ళుతూ, జలపాతంలా గలగలా పాడుతూ తిరిగే పాప -

పొత్తిళ్ళలో మరో పాపని ఎత్తు కుంటుందా - లేక ఈ పాపాన్ని వదిలించుకోవటానికి తల్లిదండ్రు లు చేసే సహజ
ప్రయత్నంలో గతాన్ని మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తుందా . స్వచ్ఛమైన గాజుతో చేసిన ఓ అందమైన తాజ్
మహల్ మీద రాయి విసరటానికి ఆ దుర్మార్దు డికి ఎలా మనసు వచ్చిందో....... ఈ మరకతో ఈ మచ్చతో
మిగతా జీవితం ఎలా గడుపుతుంది?

గడపదు - గడపలేదు.

మామూలు అమ్మాయిల్లా గా గతపు అనుభవాన్ని వర్తమానపు అనుభూతిగా చేసుకుని, అందరిలాగా


బ్రతికెయ్యలేదు. జీవితంపట్ల ఒక నిర్దు ష్టమైన ధృఢమైన అభిప్రాయం వున్నది తులసికి! అందుకే తనలో తాను
కుమిలిపోయింది. ఎన్ని రాత్రు లు నిద్ర లేకుండా దీని గురించి మధన పడిందో ఎవరితోను చెప్పుకోలేక ఎన్ని
చీకటి రాత్రు లు ఒంటరిగా కన్నీళ్లు కార్చిందో!

ఆ మధన భరించలేక ఆమె స్కిజోప్రెనిక్ అయింది. పూర్తిగా అతడికి అర్ధమయింది. అప్పుడు తులసి పిచ్చికి
కారణం.

తన భాధలో తానుండగా తులసితో శారద దేముడి గురించి వాదించింది. దాంతో. ఆ బలహీనమైన క్షణంలో
ఆమెలో ద్వంద్వ ప్రవృత్తి మొదలైంది. అంతకుముందే ఆమె సిద్దేశ్వరి మీద సాధించిన విజయం!
హేతువాదంవైపు లాగుతూ వుండగా, తన కర్మకి దేముడే కారణం అన్న కర్మ సిద్దాంతం మరోవైపు బలంగా
చోటు చేసుకోసాగింది. ఈ ఘర్షణకి తోడు రోజురోజుకు పెరుగుతున్న కడుపు ఆమెను మరింత
కృంగదీసివుంటుంది.

దేముడున్నాడు అనీ దేముడు లేడు అనీ అందుకే వేర్వేరుగా వాదించింది.

హిప్నాసిస్ లో వుంటూ, ఆమె వేసిన బొమ్మ అతడిస్మృతిపథంలో కదలాడింది. చిన్న పాము - పాప -రెండు
కాళ్లు చక్రవర్తి పోలిక ఎంతో నిగూడంగా ఆమె తన మనసులో భావాల్ని బొమ్మ ద్వారా బైటపెట్టింది. తనే అర్ధం
చేసుకోలేక పోయాడు.

వున్నట్టుండి అతడికో విషయం జ్ఞాపకం వచ్చి ఒళ్ళు జలదరించింది.

'ఆపరేషన్ సిక్స్'
తులసి జీవితాన్ని తన అనుచరుడిచేత నాశనం చేయించి.......ఆమెని పిచ్చిదాన్ని చేసినా, పిళ్ళయ్ కసి
ఇప్పటికి ఇంకా తీరనట్టుంది. ఆమెని చంపటమే అతడి ఆశయం కాబోలు.

ఎలాగైనా అతడిని ఆపుచెయ్యాలి!

జయదేవ్ కిటికీ ఊచలు పట్టు కుని శూన్యంలోకి చూస్తూ చాలా సేపు అలానే ఆలోచిస్తూ వుండిపోవటం
చూసి దార్కా దగ్గరికి వచ్చాడు.

"ఏమైంది ఫోన్లో?"

జయదేవ్, వెంకట్ కి వినబడకుండా తను కనుక్కొన్న విషయం చెప్పాడు. ఫోన్ సంగతి....... ఫోన్ లో
కంఠస్వరానికి వెంకట్ మెదడు కంట్రోల్ చేయబడి వుండటం.........

అంతా విని దార్కా క్షణం మౌనంగా వుండి నెమ్మదిగా అన్నాడు 'ఆ కంఠాన్ని నేను అనుకరించగలను
జయదేవ్ బాబూ'

దార్కా అమాయకత్వాన్ని చూసి జయదేవ్ ఫక్కున నవ్వేడు. అనుకరించటం తేలికే, కొద్దికృషితో ఏ మిమిక్రి
ఆర్టిస్టు అయినా దాన్ని చెయ్యగలడు. కాని వెంకట్ మెదడు పిళ్లయ్ కంఠాన్ని మాత్రమే గ్రహిస్తుంది. ఏ
ఫ్రీక్వెన్సీలో పిళ్లయ్ స్వరం మాటల్ని బహిర్గతం చేస్తుందో అదే ఫ్రీక్వెన్సీతో మాట్లా డాలి."

దార్కా మనసులో అనుకున్నాడు........"మంత్రోచ్ఛరణలో కంఠాన్ని శూన్యంనుంచి ప్రారంభించి


దిగంతాలకు వ్యాపించే ఆరోపణని గురువులు మాకు నేర్పారు. ఈయన మాట్లా డే 'ఇంగ్లీషు' మాట దానికి
సంబంధించి నవే అనుకుంటాను......"

దార్కా వెంకట్ వైపు తిరిగి "నాకు ఒక గాజు గ్లా సుతో నీళ్ళు కావాలి" అన్నాడు. వెంకట్ కొద్దిగా
ఆశ్చర్యపడినా, మరేమీ మాట్లా డకుండా ఆ రెండు తీసుకొచ్చి ఇచ్చాడు. టేబుల్ మీద గ్లా సు పెట్టి, దాన్నే
చూస్తూ ఏదో వల్లించసాగేడు దార్కా.

నిముషాలు గడుస్తు న్నాయ్........ అతడి పెదవులు కదుల్తు న్నాయ్ - ఏదో జరుగుతున్న భావన. మరో రెండు
నిముషాలు గడిచినయ్. టప్ మన్న శబ్దంతో గ్లా సు పగిలిపోయింది.

ప్రేక్షకులిద్దరూ నిర్విణ్నులయ్యారు. నోట మాట రాలేదు.

ఇన్ ఫ్రాసానిక్ సౌండ్స్!!!

మంత్రంతో మనిషినెలా చంపొచ్చో, వశీకరణం అంటే ఏమిటో మానవాతీత శక్తికి మానవ శక్తికి తేడా
రోజురోజుకీ ఎంత బలహీనమవుతుందో....... పరిశోధన ఎలా ముందుకు వెళుతుందో అర్దమవుతూంది
జయదేవ్ కి. ఆశ్చర్యంగా ప్రతిబింబిస్తు న్న కళ్ళతో దార్కాని చూసేడు. దార్కా నెమ్మదిగా - శ్రీనివాసపిళ్ళయ్
కంఠాన్ని నేను అంగీకరించగలననే అనుకుంటున్నాను జయదేవ్ బాబూ మీరు చెప్పిన ఫ్రీక్వెన్సీలో" అన్నాడు
చివరిపదాన్ని నొక్కి పలుకుతూ.

* * *
వెంకట్ ని పక్కగదిలో కూర్చోమని చెప్పి జయదేవ్, దార్కా టెలిఫోన్ పక్కనే కూర్చున్నాడు. ఏ క్షణమైనా
అది మోగవచ్చు. పిళ్ళై మళ్ళీ ఫోన్ చేస్తా డు.

ఆ కంఠం వెంటనే డిస్ కనెక్ట్ అవుతుంది.

అయ్యేలోపులో దాన్ని అనుకరించేటంతగా గ్రహించగలగాలి. అది సామాన్య విషయమేమీ కాదు. దార్కా


ఉద్విగ్నతతో టెలిఫోన్ నే చూడసాగేడు. అతడికి ఏం చేయాలో జయదేవ్ చెప్పాడు.

శ్రీనివాసపిళ్ళై దగ్గర తమ ముగ్గురి పేర్లలో తులసి పేరు చూసినపుడు దార్కా పెద్దగా చలించలేదు. ఎలాగూ
మరణిస్తుంది కదా అని........కాని అతడు ఆమెపై చేసిన అత్యాచారాన్ని చూసి యిప్పుడు - మరణం ముందు
పిళ్ళై ఆమెని మరింత బాధపెట్టటం చూసి అతడు ఆవేశంతో కదిలిపోతున్నాడు.

అతడి ఆలోచన్లని చెదురుస్తూ - "ఫోన్ రాకపోతే మన ప్లా నంతా పాడవుతుంది" అన్నాడు జయదేవ్. దార్కా
తలెత్తి ఆందోళనగా జయదేవ్ వైపు చూశాడు. అవును. ఏ విషయమూ చెప్పకుండా వెంకట్ ని ఆ గదిలో
కూర్చోమనటం బాగోదు. దార్కా ఏదో అనబోతూ వుంటే ఫోన్ మోగింది. ఇద్దరూ అప్రయత్నంగా
ఉలిక్కిపడ్డా రు.

దార్కా వంగి ఫోన్ తీసుకున్నాడు.

"డాక్టర్ వెంకట్" అవతల్నుంచి వినబడింది.

"ఊ"

"డిడ్ యూ కంప్లీట్ ఆపరేషన్ సిక్స్"

"కౌన్ హై ఆప్! యేతో సేట్ రంగాలాల్ పట్వర్ లాల్ ఘర్ హై ! ఎవరు మీరు. ఈ ఇల్లు సేట్ రంగాలాల్ పట్వర్
లాల్ ది." ఫోన్ డిస్ కనెక్టయింది. మళ్ళీ ఫోన్ రాకుండా రిసీవర్ పక్కన పెట్టేశాడు దార్కా. కళ్ళు
మూసుకున్నాడు. గదంతా నిశ్శబ్దం మందముగా వ్యాపించింది.

ఏకాగ్రత.

శ్మశానాల్లో నేర్చుకున్నది.........గురువులు నేర్పినది ఎన్నో అమావాస్య రాత్రు లు నిర్మానుష్యమైన మైదానాల్లో


స్వరకంపనాల్ని రకరకాలుగా మారుస్తూ ఏమాత్రం తప్పు జరిగినా కాల్తు న్న ఎముకతో వాతపెట్టడానికి నిలబడ్డ
గురువుముందు - నగ్నంగా చలికి వణుకుతూ సాధన చేసింది...........

దార్కా కళ్ళు తెరిచాడు. తనవైపే చూస్తు న్న జయదేవ్ ని చూసి ఓ.కే. అన్నట్టు నవ్వేడు. జయదేవ్ తీరిగ్గా
ఊపిరి పీల్చుకున్నాడు. దార్కా వడివడిగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. జయదేవ్, వెంకట్ రూమ్ లోకి వెళ్ళి
"నేనూ వెళ్ళొస్తా ను" అన్నాడు.

"అసలు ఏం జరిగింది? ఏమయినా తెలిసిందా?" అని అడిగాడు వెంకట్.

"లేదు" అనేసి బయటకొచ్చేసేడు జయదేవ్. అయితే వెళ్ళిపోలేదు. ముందు ద్వారంనుంచి బయటకొచ్చి.


పక్కకివెళ్ళి , కిటికి పక్కన నిలబడ్డా డు -నిముషాలు లెక్క బెట్టు కుంటూ.

ఈ లోపులో దార్కా పబ్లిక్ ఫోన్ చేరుకుని నెంబర్ తిప్పేడు.

వెంకట్ ఇంట్లో ఫోన్ మోగుతూవుంటే బయట జయదేవ్ గుండెలు వేగంగా కొట్టు కోసాగేయి. దార్కా
సాధించగలడా దీన్ని అనుకొన్నాడు. సాధించలేకపోతే మొత్తం ప్లా నంతా పాడవుతుంది.

ఈ లోపులో వెంకట్ ఫోన్ ఎత్తు కుని "హలో!" అన్నాడు

"డాక్టర్ వెంకట్!"

"స్పీకింగ్!"

దార్కా కంఠం మంద్రస్వరంలో వినిపించసాగింది. శ్రీనివాసపిళ్ళే స్వరపు ఫ్రీక్వెన్సీలో.........

"మాండవ్య తీరంనుండే వెలుగుతున్నది కిరణమణి.

కిరణాల గుడిలోన మరపురాని మరువింతలు........

ఆపరేషన్ సిక్స్ - భగవద్గీత -నూటపదకొండో పేజీ" అనేసి దార్కా ఫోన్ పెట్టేశాడు.

వెంకట్ వెనుదిరిగేడు ఏదో నిద్రలో వున్నట్టు న్నాడు అతడు. నిద్రలో నడుస్తు న్నట్టూ వంటింటివైపు వెళ్ళాడు.

ఆనందంతో జయదేవ్ విజిల్ వేయబోయాడు.

దార్కా సాధించేడు.

తన స్వరం ద్వారా వెంకట్ మెదడు మీద అదికారం సంపాదించేడు.


వెంకట్తో పాటే అతడికి తెలియకుండా జయదేవ్ అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించేడు.
వంటింట్లో అటకమీద దాచివున్న భగవద్గీత పుస్తకం తీస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది.

జయదేవ్ నిర్విణ్నుడయ్యాడు.

తన తప్పు అర్ధమైంది. ఫోన్ మీద రిసీవర్ తీసెయ్యకుండా వచ్చేడు తను. ఆ ఫోన్ తరంగాలు వెంకట్ ని
అతడి మత్తు లోంచి బయటకు తీసుకురావచ్చు. ఆ ఫోన్ శ్రీనివాసపిళ్ళైది అయివుంటే అతడికి అనుమానం
రావచ్చు.

ఒక్క అంగలో అతడు ముందుగదిలోకి వచ్చి, ఫోన్ ఎత్తి "హల్లో" అన్నాడు. అయితే అతడు అనుకొన్నట్టూ
అది పిళ్ళయ్ నుంచి కాదు, శారదనుంచి అతడు తేలిగ్గా వూపిరి పీల్చుకుని "హల్లో - నేను జయదేవ్ ని"
అన్నాడు.

అవతల్నుంచి శారద కంఠం కంగారుగా వునిపించింది. "మీ గురించే చేస్తు న్నాం, అర్జెంటుగా రండి ఆస్పత్రికి
వెళ్ళాలి."

అతడు ఆందోళన నిండిన స్వరంతో "దేనికి?" అని అడిగాడు.

"ఇప్పుడే కబురొచ్చింది బ్రాహ్మిణ్ భార్య పోయేరట."

29
శవం ముందు........

తన ఓటమిని మౌనంగా వప్పుకొంటూ క్షణంపాటు నిలబడ్డా డు పార్దసారధి.

బ్రతుక్కీ మరణానికీ తేడా ఎంత చిన్నది!

చావంటే ఏమిటి?

ఆనందాన్నీ.........భయాన్నీ.....సంతోషాన్నీ ఆస్వాధించే మెదడు. నిర్వీర్యమవటమా? ....సంవత్సరాల


తరబడి మెదడు పనిచేయక స్పృహ పోయినా కోమాలో బ్రతుకుతున్న వాళ్ళున్నారే!

లబ్ డబ్ మని కొట్టు కుంటూ రక్తా న్ని శరీరమంతటికీ పంపే గుండె - ఆగిపోవటమా? యోగసిద్దితో గుండెని
ఆపుచేసే వాళ్ళున్నారే.

మరేమిటి చచ్చిపోవటం అంటే..............

మన మధ్య నవ్వుతూ తిరిగే మనిషి.........అకస్మాత్తు గా మాయమై -మరుసటిరోజు శ్మశానంలో


బూడిదవటమా......

"సర్టిఫికెట్ సర్"
అతడి ఆలోచన్లు చెదిరాయి.

డెత్ సర్టిఫికెట్! రోగి చనిపోయినట్టు ధృవీకరించే పత్రం.

అతడు దాన్ని చదివి, ఇచ్చెయ్యమన్నట్టూ తలూపేడు. ఆ తరువాత భారంగా అడుగులు వేసుకుంటూ


బయటకొచ్చాడు. నోటికి చెయ్యి అడ్డు పెట్టు కుని ఏడుస్తు న్నాడు అబ్రకదబ్ర. చాలా చిన్న స్వరంతో అస్పష్టంగా
"ఐ యామ్ సారీ......" అన్నాడు అతడు. రెండక్షరాల ఉపశమనంతో తగ్గే బాధ కాదది అది అతడికీ తెలుసు.

శవం టాక్సీలోకి చేర్చబడింది.

* * *
ముందు గదిలో శవాన్ని పడుకోబెట్టా రు. నుదుట రూపాయి కాసంత కుంకుమ.........చుట్టూ పూలు.......

బయట నలుగురు పాడె కడ్తు న్నారు.

బిగపట్టు కున్న దుఃఖం ఇంటికొచ్చేక కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. ఆమె తల్లినయితే ఎవరూ పట్టలేరు.
శవం పక్కనుంచి లేవనే లేదు. తండ్రే అన్ని పనులూ చూస్తు న్నాడు.

"లే నాయనా -ఇలా కూర్చుంటే పనులుకావు!" అన్నాడాయన.

అబ్రకదబ్ర తలెత్తా డు. ఎదురుగా మామగారున్నారు.

నిండా నలభయ్యేళ్ళు నిండకుండా కూతురు తమని వదిలిపోవటం వల్ల కలిగే బాధని పళ్ళమధ్య నొక్కిపట్టి,
ఆయన అన్నారు.

"శవాన్ని పాతిపెట్టా లని చెప్పాను. మనిషి వెళ్ళాడు."

"పాతిపెట్టటం మన ఇంటావంటా లేదు. ఇదెక్కడి ఆచారం" అని నోరు నొక్కుకోబోయి, ఆయన తీక్షణంగా
చూడటంతో లోపలికి తప్పుకుంది ఒక బామ్మగారు.

"శవాన్ని కాల్చటం వల్ల నాకు అభ్యంతరం వుంది నా మాట వల్ల మీకెవరికయినా అభ్యంతరం వుందా?"
ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలో గంభీరతకి ఎక్కడి వాళ్ళక్కడ ఏదో పని వున్నట్టు తప్పుకున్నారు. అబ్రకదబ్ర
ఒకసారి తలెత్తి, మళ్లీ మోకాళ్ళమధ్య మొహం దాచుకున్నాడు.

కలిసిపోవటం తప్పనప్పుడు మట్టిలోనైతేనేం? బూడిదగా అయితేనేం -

ఇరవై రోజుల బాధనుంచి విముక్తయి నిర్మలంగా వున్న కూతురి మొహంలోకి తదేకంగా చూసేడు ఆయన.
తరువాత వంగి నుదుటిమీద చెయ్యివేసేడు. పనిచెయ్యని మెదడు, ఆగిన గుండె, చలనంలేని శరీరం. అడుగు
లోతులో ఎక్కడో ఏదో అస్పష్టమైన అవగాహన.
ఆయన లేచివచ్చి బయట అరుగుమీద నిలబడ్డా డు.

ఏదో తెలియని భావంతో ఆయన మొహం రక్తం వర్ణంలోకి మారింది. బాలభాస్కరుని అరుణిమని ఆ దీప్తి
పరిహసించింది. ఆ వెలుగుని చూసి ప్రకృతే భయపడేటట్టుంది.

ధృడంగా, నిశ్చలంగా , నిర్వికారంగా స్థిరంగా అలా నిలబడి వున్నది ఆచార్యులవారు!

* * *
ఫోన్ లో శారద, బ్రాహ్మిణ్ భార్య మరణం విషయం చెప్పగానే జయదేవ్ కొంచెం సేపు అచేతనమయి
నిలబడ్డా డు. ఆమెని అతడు ఒకటి రెండుసార్లకన్నా ఎక్కువసార్లు చూడలేదు. కానీ ఆమె నిండయిన విగ్రహం,
ఆ ఇంట్లో ప్రతిబింబించే సదాచారాలూ అతనికి బాగా గుర్తు న్నాయ్.

అతడు ఆ షాక్ నుంచి తేరుకుని మళ్ళీ వంటింటివైపు వెళ్ళేసరికి. అప్పటికే ఆలస్యమైంది. వెంకట్ అటకమీద
దాచిన భగవద్గీత పుస్తకం తీసి చదవటం, ఆ కాగితం స్టౌ మీద కాల్చేయటం జరిగింది.

"ఏమిటిది?" జయదేవ్ కంగారుగా అడిగేడు.

"ఏమిటి - ఏమిటది?" అన్నాడు వెంకట్ చాలా మామూలుగా.

"ఆ కాగితంలో వున్నది...... "ఉద్వేగం భరించలేక అరిచేడు జయదేవ్.

"ఏ కాగితం?" తాపీగా అన్నాడు వెంకట్

"భగవద్గీత"

"ఏ భగవద్గీత"

జయదేవ్ ని ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది. అయిపోయింది ఇంత కష్టపడి వేసిన ప్లా ను


పాడయిపోయింది. ఆపరేషన్ సిక్స్ తాలూకు సూచన వెంకట్ మెదడులో నిక్షిప్తమైపోయింది. ఇక అది తెలీదు.
ఆ సూచన ప్రకారం ప్రవర్తిస్తా డతడు. అంతే. పైకి మామూలు గానే వుంటాడు.

జయదేవ్ బల్ల ఎక్కి అటకమీద భగవద్గీత తీసేడు. అరె ఆ పుస్తకం అక్కడెందుకుంది అని అడుగుతున్న
వెంకట్ మాటల్ని పట్టించుకోకుండా తొందర తొందరగా పేజీలు తిప్పేడు. మొదటి తొమ్మిది పేజీలూ వున్నాయి.

పదో పేజీ లేదు.


తరువాత మళ్ళీ ఇరవయ్యో పేజీ లేదు.

ముప్పై - నలభై -యాభయ్ - అరవై పేజీలు లేవు.

అంటే.........డెబ్బయ్యవ పేజీలో ఆపరేషన్ సెవన్ వుంటుందన్న మాట. అది తెలిసినా చాలు........ తొందర
తొందరగా పేజీలు తిప్పుతూ వుంటే అతడి చేతులు వణకసాగేయి. డెబ్బయ్యవ పేజీ తీసి ఆత్రంగా చూసేడు.

అతడి మొహం వాడిపోయింది. ఆ పేజీ చింపబడలేదు........అంటే ఆ రోజు ఆఖరి ఆపరేషన్ అన్నమాట.


దాంతోనే తులసి జీవితం పరిసమాప్తమౌతుంది. ఆ రోజు ఏమిటో ఇద్దరికే తెలుసు. వ్రాసిన పిళ్ళయ్ కి చదివిన
వెంకట్ కి. ఒకరు చెప్పరు - ఇంకొకరు చెప్పలేరు........ఎలా?

తన తప్పుకి తనని తనే తిట్టు కుంటూ అతడు తెరిచి వున్న పేజీలవంక నిస్సహాయంగా చూసేడు.

యదా యదాహి ధర్మస్య - గ్లా నిర్భవతి భారత........

ఎక్కడయితే సాధువులు బాధింపబడ్దు రో, ఎప్పుడయితే అధర్మం ప్రబలిపోతుందో అక్కడ , అప్పుడు నేను
జన్మిస్తా ను.....సంభవామి యుగే యుగే...... ద్వంద్వాత్మకమైన భావజగత్తు లో ప్రతి క్షణం నేను
ఉదయిస్తా ను........

* * *
. "ఏమైంది" అని అడిగాడు దార్కా పబ్లిక్ ఫోన్ నుంచి తిరిగొచ్చి ఫ్లా న్ ఫెయిల్ అవటంతో సహా జరిగిందంతా
చెప్పాడు జయదేవ్, దార్కా కూడా నిరాశ చెందాడు.

"అతడు చదవకముందే ఆ పుస్తకం తీసుకోకపోయారా?"

"తీసుకోవటానికి వెళుతుంటే మళ్ళీ ఫోన్ వచ్చింది"

"ఎందుకు?"

"బ్రాహ్మిణ్ భార్య చనిపోయారని చెప్పటానికి"

తిరగబోతూన్న దార్కా ఆగిపోయాడు. నెమ్మదిగా తలెత్తా డు. అయితే అతడు జయదేవ్ ని చూడలేదు తన
ఆలోచనలో తనున్నాడు.

సమయం ఆసన్నమయింది.
గురువుకిచ్చిన మాట నెరవేరే సమయం దగ్గిరపడింది. మిగతా పనులు తొందర తొందరగా చేయాలి.

"వెళ్ళొస్తా ను" అన్నాడు.

ఉన్నట్టుండీ అతడు అలా అనేసరికి జయదేవ్ కి అర్ధంకాలేదు. దార్కా ఒక్కసారిగా ఈ విషయంపట్ల


చూపిస్తు న్న నిరాసక్తతని జయదేవ్ ఇంకోలా అర్ధం చేసుకున్నాడు. అవును........దార్కా వుండి చేసేదేముంది?

వెంకట్ ని జాగ్రత్తగా గమనిస్తే తప్ప లేకపోతే ఆ ఆపరేషన్ సిక్స్ ఏమిటో తెలీదు. వెంకట్ ని బంధించినా
లాభంలేదు. పిళ్ళై మరో పంథా అవలంభించవచ్చు కూడా.

ఇన్నీ ఆలోచించే దార్కా వెళ్ళిపోతున్నట్టు అతడు భావించేడు. అతడు కూడా గుమ్మం దగ్గరికి వచ్చేడు.
వెళ్ళబోతూ వుంటే నెమ్మదిగా "దార్కా" అన్నాడు. దార్కా ఆగేడు. జయదేవ్ నెమ్మదిగా అన్నాడు -

"నీ గురించి నేను చాలా విన్నాను దార్కా. నేనేమీ నమ్మలేదు. కానీ ఈ క్షణం నీ నోటివెంట మంత్రాలు
వింటుంటే అనిపిస్తూంది. నువ్వు మానవాతీత మైన వ్యక్తివని! చెప్పు నువ్వెవరు?"

"ఆ ప్రశ్నకి అంత ప్రాముఖ్యత ఇప్పుడు లేదు బాబుగారు. కానీ ఒక్క విషయం. తులసి పరిస్థితికి - నాకూ -
కాష్మోరాకి -ఏ సంబంధమూ లేదు. ఈ విషయం నమ్మండి"

"నమ్ముతాను" అన్నాడు జయదేవ్ పూర్తిగా.

దార్కా మెట్లు దిగేడు. రెండు నిమిషాలు తరువాత వీధిమలుపులో అదృశ్యమయ్యాడు.

30
రాత్రి పదకొండు కావొస్తూ వుండగా దార్కా శ్మశానం చేరుకున్నాడు. శ్మశానం చీకటిగా వుంది.

దార్కా కొన్ని గంటల క్రితం కప్పబడిన మట్టిని రెండుచేతుల్తోనూ తవ్వి పక్కకి పోసేడు. అరగంట గడిచేసరికి
శవం బయటపడింది. గుడ్డలో చుట్టబడి వుంది. కాళ్ళ కిందకి మెడ కిందకి చేతులు జొనిపి పైకి లాగేడు. అలాగే
తీసుకువెళ్ళి చెట్టు కింద పడుకోబెట్టా డు. నీటితో మొహాన్ని శుభ్రం చేసేడు.

తరువాత దాని ముందు కూర్చొని మంత్రోచ్చారణ ప్రారంభించేడు.

ఒక గుడ్లగూబ చెట్టు కొమ్మల మధ్యనుంచి అతడినే చూస్తూంది. నిద్ర మెలకువ వచ్చిన కాకిపిల్ల గూడు
బయటకు తలపెట్టి ఉత్సుకతతో గమనిస్తూంది అతడిని. ఒక తీతువు వికృతంగా అరుచుకుంటూ ఉత్తర
దిక్కుకేసి సాగిపోయింది.
అతడు మాత్రం నిశ్చలంగా కూర్చొని మంత్రం చదువుతున్నాడు.

అయిదు, పది నిమిషాలు గడిచేక శవం కదిలింది. ఆ కదలిక ముందు నాలికతో జరిగింది. తరువాత
గొంతునుంచి అస్పష్టమయిన శబ్దం వచ్చింది. ఆ తరువాత కదలిక వెంట్రు కలది. అవి కదిలి నిటారుగా అడవి
పంది ముళ్ళులా నిలబడ్డా యి. ఆ తరువాత కదలిక ముక్కు పుటాలలో కలిగింది. ఎగపీల్చటం ప్రారంభమైంది.
అప్పుడు గుడ్లగూబ శబ్దం వచ్చింది. చర్మంమీద రోమాలు వెనక్కి వెళ్లా యి. కుడికన్ను మూసుకుని వుండగా
ఎడమకన్ను తెరుచుకుంది. అది ఎర్రగా వుంది.

అది అంతా పాతళకుట్టి లక్షణం. సరిగ్గా అలానే జరిగింది. శాస్త్రంలో గురువు బోధించినట్టే....... సంతృప్తు డై
దార్కా వాగ్వివాదం మొదలు పెట్టా డు. మాటల్లో శవాన్ని మభ్యపెట్టి కాలు పట్టు కోవాలి.

అతడు మాట్లా డబోయేంతలో ఒక చిత్రం జరిగింది.

శవం ఎవరో తోసినట్టు దభిల్లు న వెనక్కి పడిపోయింది.

అతను నిశ్చేష్టు డయ్యాడు.

ఊహించని విషయం అది. లేచిన శవం పడిపోవటం

తిరిగి మంత్రం చదివేడు.

కొద్దిగా ఊగిసలాడి అచేతనంగా వుండిపోయింది. శవంలో కదలిక లేదు. మరోసారి మంత్రం పఠించినా
కదలిక లేదు. అతడు చుట్టూ చూసేడు. చెట్టు - పొదలూ - చీకటి -సమాధులూ - చితిమంటా - నిశ్శబ్దం -
అన్నీ అలానే వున్నాయి.

అతడు ఈసారి నిటారుగా కూర్చున్నాడు.

ద్విరుక్తితో పఠించేడు మంత్రాన్ని.

శవంలో కదలిక లేదు.

త్రిమయాన్ని అనుసరిస్తూ వల్లించేడు. అయినా ఫలితంలేదు.

దార్కా మొహం రోషంతో ఎర్రబడింది. కసితో -అవమానంతో అతడు పెదవులు కొరుక్కున్నాడు. ఏ శక్తో
ఆపుతోంది శవాన్ని కదలనీయకుండా . ఆ వూహ వచ్చేసరికి ఆవేశంతో కంపించిపోయాడు. ప్రపంఛంలోకెల్లా
గొప్ప మాంత్రికుడయిన విషాచి శిష్యుడు 'కుట్టి'లాటి చిన్న ప్రయోగం చేస్తే ఏదో శక్తి ఆపుచేయగల్గటమా.
ఈసారి అతడు మంత్రానికి మయాన్ని జతచేసి, రురుడి సాయంతో త్రిస్వరంలో పఠించేడు.

వెనుకవైపు కొట్టింది.

తొడ, వెన్నెముక మధ్య........

అతడు ముందుకు తూలబోయి నిలదొక్కుకున్నాడు.

బ్రహ్మరధం మీద రెండు పోట్లు పడ్డా యి. తల పగలకుండా శవుమ్ని జపించాడు. సమ్మెట దెబ్బలు
ఆగిపోయాయి. మళ్లీ ఇంకోసారి వెనుక వైపు కొట్టింది. బలవంతంగా నిలబడగలిగేడు.

అతడికి అర్ధమైంది.

ఎవరో తిరగబడి చేస్తు న్నారు.

అతడి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. తనమీద తిరుగుబడి ........విషయం అర్దమయ్యాక అతడు
ఆలస్యం చేయదల్చుకోలేదు. అడ్డు కట్ట వేసేడు. కట్టు వేస్తే గాలి కూడా స్తంభించాలి. స్తంభించింది.

"లే" అన్నాడు శవంతో.

శవం లేవలేదు.

అతడికి ఆశ్చర్యం వేసింది. మొదటిసారి అనుమానం కలిగింది ప్రత్యర్ధి బలంమీద.

ఎక్కువ సమయంలేదు అర్ధరాత్రి దాటుతూంది. రాత్రి దాటితే మంత్రం సాగదు.

పిచ్చుకమీద బ్రహ్మాస్త్రమని తెలుసు. అయినా వదిలేడు మంత్రపు ఏడో అక్షరం పదమూడో అక్షరం వదిలేసి
అశువుగా చదివేడు. ఆ తరువాత క్షిత్ ని ఆహ్వానించాడు. నిముషం గడిచేసరికి గాలి కదిలింది. స్వరం సంస్వరం
చేసి గళం తదరం చేసి ఆరో యతిలో అత్యంత భయంకరమైన నాదాన్ని చేసేడు. ఆ నాదం ఫెళ ఫళ
నినాదఘనమై ఝంఝామారుదిజ్జిత చిలమంద్ర స్వరమైనది. ఆ స్వర ప్రకంపనాల గుడి పూర్తిగా ఆగనేలేదు.

దబ్ మని ఏదో దూరంగా పడిపోయిన చప్పుడు.

దార్కా మొహంమీద విషపూరితమైన నవ్వు వెలసింది.

తన బాణానికి గురి అయిన అమాయక జీవిని చూడటానికి వెళ్ళే వేటగాడిలా వున్నాడు.


చిన్న తుప్ప పక్కన బోర్లా పడి వున్నాడు ప్రత్యర్ధి. నేరేడు వనంలో కారిన రక్తం నోటిపక్కన చారకట్టి నేలమీద
మడుగైంది.

దార్కా ఎడమకాలితో ఆ శరీరాన్ని పక్కకు తిప్పేడు.

వెల్లకిలా పడిన శరీరంతోపాటు నెమ్మదిగా తిరిగి ముఖాన్ని మసక వెలుతురులో అస్పష్టంగా గమనించి,
అస్పష్టత స్పష్టమై..........కాలం విరిగి, ఆగిపోయిన క్షణంలో విశ్వం పెటేలున పేలిపోయి, కడలి తల్లడిల్లి,
గర్భపు బడబాగ్ని చెలియలికట్ట దాటితే, ఆ ప్రభంజనంలో గడ్డి పోచలా అతడు వూగిపోయాడు కాలిపోయాడు.

"మీరా స్వామీ!"

కొన ప్రాణంతో వున్నారు ఆచార్యులవారు.

మోకాళ్ళమీద మోకరిల్లి దుఃఖం కంఠంతో రుద్దమవగా "స్వామీ" అన్నాడు. మూత పడుతున్న కనురెప్పల్ని
బలహీనంగా పైకెత్తి శుష్కంగా నవ్వి "ఓడిపోయాను దార్కా" అన్నారు. అప్రతిభుడైన దార్కాకి నోటమాట లేదు.
సర్వశక్తు లూ కూడగట్టు కొని. కంపిస్తు న్న స్వరంతో "మీరు ఓడిపోవటమా? మీ నోటివెంబడి వచ్చే 'ఓం' అన్న
అక్షరం ఒక్కటి చాలు...... బ్రహ్మాస్త్రమై మాలాటి క్షుద్రు ల్ని దహించటానికి"

"నిన్ను దహించటమా? ఏ గురువుకయినా శిష్యుడు కొడుకులాటి వాడు దార్కా! నాకోర్కెల్లా నా


అమాయకపు కూతుర్ని ఈ చదరంగం నుండి తప్పించటం"

భూమి కంపించినట్టయింది....... "ఈమె....... ఈమె......మీ కూతురా" అన్నాడు తడి ఆరిన గొంతుతో.

"నా కూతుర్ని రక్షించుకోటం కోసం నాకున్న శక్తికొద్దీ ఉపయోగించేను. 'నీ కపకారం' జరక్కుండా అది ఎలా
చెయ్యాలో నాకు తెలియలేదు. పోనీ నిన్నే అర్దిద్దా మా అంటే నీ ఆశయానికి అడ్డు తగలనని నీకు మాట
ఇస్తినాయె" ఆయన నోటినుంచి మరింత రక్తం కారింది!

"నువ్వు నాకిచ్చిన మాట ఎందుకు తప్పేవు దార్కా!"

"నేనా? మాట తప్పేనా?"

"ఆ ముగ్గుర్నీ తప్ప నాలుగో ప్రాణానికి అపకారం చెయ్యనన్న వాడివి....."

ఆ అభియోగానికి నిశ్చేష్టు డైన దార్కా, సంజాయిషీ చెబుతున్న వాడిలా......." అతడిని మానసికంగా


చంపటానికి......." అని మరి ఆ వాక్యం పూర్తి చేయలేదు. అప్పటి ఆవేశపు ప్రతిజ్ఞ వివరాలు ఇప్పుడు ఆవేదనలో
థర్కించటం అనవసరం. అబ్రకదబ్ర మానసిక హింసలో ఇవన్నీ వుంటాయనే ఆ క్షణం ప్రతిజ్ఞ చేసేడు. ఆ వివరణ
కిదికాదు సమయం.
"నా కూతురి అనారోగ్యం నాకు అనుమానాన్ని తెప్పించలేదు. కానీ మాటల సందర్భంలో నా అల్లు డు బిస్తా
వెళ్ళిన వారిలో ఒకడని తెలిసింది. అతడి మరణం మీ చేతిలో తధ్యమని అర్ధమయింది. కానీ నేను నీకు
మాటిచ్చాను. అందుకే కొండంత దుఃఖంలో -నా కూతురి వైద్యం కోసం రోజులు లెక్కపెట్టసాగేను. చాలా
దారుణమైన దుఃఖమే దార్కా అది. ఎంత వివరించినా అర్ధంకాదు. ఈ ఆప్యాయతలూ.......ప్రేమలూ......
బంధుత్వాలూ!" ఇంకోసారి తెరలా రక్తం బయటకొచ్చింది. క్షణ క్షణానికి ఆయన శక్తి సన్నగిల్లు తూంది. శ్వాస
భారమౌతూంది. హీనస్వరంతో చెప్పసాగేడు... ".....నా కూతురి అనారోగ్యానికి కారణం నువ్వేనని తెలిసి
విస్తు పోయేను. ఎలా నమ్మను? కానీ నమ్మక తప్పలేదు! బ్రతికించుకోవాలా....... నా కూతుర్ని
బ్రతికించుకోవాలా? నువ్వెక్కడ దొరుకుతావు నాకు........నాకిచ్చిన మాట తప్పినవాడివి......నా మాట
వింటావన్న నమ్మకం ఏముంది?"

దార్కా కదలిపోయి, "అంతమాట అనకండి స్వామీ.........?" అన్నాడు.

అతడి మాట గొంతులోనే కొట్టు కొని ఆగిపోయింది. ఆయన చెయ్యి బలహీనంగా సాగి, దార్కా చేతిని
స్పృశించింది.

".......మనిషిలో మంచే దేముడు, చెడే దెయ్యం, అనుకుంటే - మంచిని నమ్మిన మనిషి జీవితానికి చాలా
విలువుంది దార్కా. జ్ఞానం పునాది. జ్ఞానం ధ్యానానికి ఆధారం. ధ్యానంతో కర్మఫల త్యాగం సిద్దిస్తుంది.
శ్రద్దా భక్తు లు ఉచ్ఛ్వాస నిశ్వాసలై భగవద్వచనామృతం సంజీవిని అయి, పరమాత్మ సందర్శనం ఏకైక ధ్యేయమై.
ఎవరైతే ద్వి (రెండు) అనే బావం నుంచి బయటపడతాడో........ అతడే నిజమైన యోగి ప్రతీ మంత్రగాడూ
యోగే ప్రతీ ఆత్మయోగీ - కోర్కెలనే క్షుద్రశక్తు ల్ని ఆత్మ అనే మంత్రంతో అదుపులో పెట్టే మంత్రగాడే........"

ఆయన శక్తి నశించింది. శ్వాస క్షీణమైంది, కళ్ళు మూతలుపడ్డా యి. ఒక దివ్యజ్యోతి ఆయన మొహంమీద
ప్రతిబింబించింది. ఆఖరి శ్వాస ఆయన గుండెల్లోంచి స్వరప్రకంపనాల్ని వెలిబుచ్చింది - "అది మధ్యాంతం -
అంతా ఆ దైవమే? విశ్వమే! విష్ణుస్వరూపం. జ్యోతిర్మయి గోళం, వాయువుల్లో కిరణ సమీరం....... సమత్వ,
సంగీత, సామరస్య సారాలైన సామవేదం...... మనుష్యుల్లో .............మహర్షుల్లో, దేవతల్లో, గంధర్వుల్లో,
పశుపక్ష్యాదుల్లో, వృక్షాల్లో, అస్త్రా ల్లో శాస్త్రా ల్లో అంతా ఆ ఓంకార స్వరూపమే. జాతస్యహిద్రు వో మృత్యుః, ధృవం
జన్మ మృతస్యచ........ తస్మాద పరిహార్యార్ధే......... సత్వం........ శోచితు....... మర్హ....సి....." ఆయన పెదవులు
ఆగిపోయేయి.

మోకాళ్ళ మీద కూర్చొని వున్న దార్కా చప్పున ముందుకు వంగేడు ఆయన తలని వళ్ళోకి తీసుకున్నాడు.
దుఃఖంతో కంఠం పూడుకుపోగా, "నేను......నేనేం చేయాలి?" అని అడిగేడు. మూతపడ్డ ఆచార్యుల
కనురెప్పల వెనక ఆఖరి నవ్వు" నా మరణం నీకు కర్తవ్యాన్ని బోధించటం లేదా?" అన్నట్టు కదలాడింది. ఆయన
తల వెనక్కి వాలిపోయింది.

అతడు స్తబ్దు డైపోయాడు. ఇప్పుడిక విచారం లేదు, దుఃఖం లేదు. అంతాస్తబ్దతే - ఒక గొప్ప పరిణామానికి
అది సూచన. మనసనే పాలకడలిని పరిశీలన అనే కవ్వంతో మధించుకుంటే బయటపడే అమృత
కలశం.........నిర్ణయం!!!

చప్పున ఏదో అర్ధమయింది అతడికి.

అర్ధమవగానే అంత విషాదంలోనూ ఆనందం వేసింది. ఒక్క సారిగా పొరగా తొలిగిపోయినట్టు ..... కర్తవ్యం
బోధపడినట్టూ.... అతడి మొహం తేటబారింది.

అతడి వూహని ప్రత్యేకతే గ్రహించినట్టుంది. ఓ గాలి తెమ్మెర ప్రోమతో స్పృశించింది. ఓ చెట్టు పూలు రాల్చింది.
ఓ పక్షి మంగళ సూచకంగా గొంతు శృతి చేసింది. శ్మశానమే గుడి అయింది.

అతడు లేచి నిలబడ్డా డు. తూర్పునుంచి పైకి వస్తూన్న వెలుగు రేఖ అతని మీద ప్రతిబింబించింది.
అతడిప్పుడు మాంత్రికుడిలా లేడు. బుద్దు డిలా వున్నాడు. గితాసారాన్ని గ్రహించిన జ్ఞానిలా వున్నాడు.

ఆచార్యులవారి పాదాలకు వంగి నమస్కారం చేసేడు.

31
తులసి తల్లి కాబోతూందన్న దారుణమైన వార్త తెలిసి అప్పటికి రెండు మూడు రోజులు కావస్తూంది.

జయదేవ్ ఆలోచిస్తు న్నాడు.........మానవాతీత శక్తు లు గురించి.

ఏమిటి పిళ్ళై ప్లా ను? ఎలా తులసిని చంపాలనుకుంటున్నాడు! ఎలక్ట్రా నిక్ పరికరాల వల్లగానీ, ధ్వనితరంగాల
వల్ల గానీ, కాంతి వల్ల గానీ, ఫిజిక్స్ చెప్పే మరే విధమైన మార్గాల్లోగానీ, అతడు తులసిని బాధపెట్టటం లేదనేది
నిర్వివాదాంశం.

తులసి పిచ్చిలో చిన్న మెలిక అతడిని బాధపెడుతుంది.

పూనకం వచ్చినప్పుడు గానీ, దెయ్యం పట్టినప్పుడు గానీ, ఆడవాళ్ళు 'నేనే సుబ్రహ్మణ్యస్వామిని, నేనే
పోలేరమ్మని' అని అరవటం తెలుసు. దానికి సైన్సు కారణం చెబుతుందీ కూడా. కానీ కాష్మోరాని తనని
ఆవహించటానికి ఆహ్వానించిన తులసి, దెయ్యంలా ప్రవర్తించకుండా స్కిప్పింగ్ ఎందుకు చేస్తుంది? లక్క
పిడతల్లో అన్నం ఎందుకు వండుతుంది?

కనుక్కోవాలి! వెంటనే కనుక్కోవాలి . మనసు చెబుతూంది టై మ్ లేదని......

అతడు ఫోన్ చేసేడు. శ్రీధర్ అందుకున్నాడు.

తటపటాయిస్తూ "నేను మీ ఇంటికి ఒకసారి రావాలనుకుంటున్నాను ఇప్పుడు......" అన్నాడు.


"తప్పకుండా"

"ఈ అర్ధరాత్రి -" అని అనబోయేడు జయదేవ్. అతడి మాటల్ని శ్రీధర్ మధ్యలోనే ఆపుచేసి, "చాలా
వంటరితనంతో బాధపడుతున్నాం ప్రొఫెసర్. మీ రాక నిజంగా సంతోషం కలిగిస్తుంది" అన్నాడు ఇంగ్లీషులో.

"థాంక్స్ వస్తు న్నాను" ఫోన్ పెట్టేసేడు. ఒక చిన్న పెట్టెలాటిది పైన బల్పువున్నది చేతిలో పట్టు కున్నాడు. ఆ
పరికరం పేరు మెట్రోనోమ్. మనకెంత కావాలంటే అంతలో.......అంటే అయిదు సెకన్లకొక సారి, నాల్గు సెకన్ల
కొకసారి ఆ బల్బు వెలుగుతుంది. దాన్నే చూస్తు న్న పేషంటు నెమ్మదిగా మైకంలోకి జారుకుంటాడు. నిజానికి
మంచి హిప్నాటిస్టు అయితే ఈ పరికరాలూ చీకటి గదులూ అవసరం లేదు. కానీ ప్రస్తు తం తులసి మానసిక
పరిస్థితి బాగోలేదు. ఆమెని మాటలద్వారా కంట్రోల్ చేయటం కష్టం. అందుకే అతడు మెట్రోనోమ్ సహాయం
తీసుకోదల్చేడు.

అతడు శ్రీధర్ ఇంటికి చేరుకొనేసరికి పదకొండు కావొస్తుంది. ఊరంతా నిద్రపోయింది. శ్రీధర్, శారద
వరండాలోనే అతడి కోసం వేచి వున్నారు.

"ఏమిటి విషయం?" అన్నాడు శ్రీధర్ అతడిని లోపలికి తీసుకు వెళుతూ కంగారుగా.

"తులసితో కొంచెం మాట్లా డాలి"

"......కాఫీ" అంది శారద

"వద్దు " మెట్రోనోమ్ ప్లగ్ ని కరెంట్ కి అమర్చి, స్విచ్ ని మూడు సెకన్లకోసారి వెలిగేలా అమర్చేడు. దాన్ని
తీసుకుని తులసి గదికి వెళ్ళాడు.

"ఎలా వున్నావ్ తులసీ?"

తులసి మాట్లా డలేదు. బోనులో బంధించి బాగా బాధపెడితే కోపంతో రెచ్చిపోయిన కోతిలా గుర్రు గా
చూసింది. గదిలో లైటు ఆర్పేసేడు జయదేవ్. మెట్రోనోమ్ ఆన్ చేసేడు. మూడు సెకన్ల కొకసారి ఎర్రటి కాంతి ఆ
గదిలో కొద్దిసేపు వెలిగి ఆరుతూ, ఆగదిలో వున్న వాళ్ళనందర్నీ అదోరకమైన మత్తు లోకి తీసుకెళుతుంది. తులసి
అప్రయత్నంగా దానివైపు చూసి, వెంటనే ఆకర్షితురాలయింది. అది గమనించగానే జయదేవ్ తన మాటల్ని
ప్రారంభించేడు. అయితే అనుకున్నంత సులభంగా ఆమె అతడికి ససెప్టబుల్ అవలేదు. అతి కష్టంమీద ఆమె
మెదడుని లోబర్చుకున్నాడు.

మొదటి ప్రశ్న మామూలే ".........నీ పేరు?"

"కాష్మోరా"
కాష్మోరాని అతడు కొంచెం వేధించదల్చుకున్నాడు.

"నువ్వు దెయ్యానివా? భూతానివా?"

"దెయ్యాన్ని"

"దెయ్యానికీ, భూతానికీ తేడా ఏమిటి?"

జవాబులేదు.

"నీ వయసెంత?"

"పదకొండు సంవత్సరాలు"

"నువ్వు తులసిని వదిలి పోవాలంటే ఏం చెయ్యాలి?"

.....................

"నీకేమిటి ఇష్టం?"

"ఆడుకోవటం"

"చదువుకోవటం ఇష్టంలేదా?"

శారదకి ఈ ప్రశ్న ఆశ్చర్యంగా కనిపించింది. వింతగా కూతురి వైపు చూసింది. అయితే అంతకన్నా
ఆశ్చర్యంగా తులసిలో దెయ్యం జవాబు ఇచ్చింది "......ఇష్టమే"

శ్రీధర్, జయదేవ్ మొహామొహాలు చూసుకున్నారు.

"ఏం చదువుకున్నావ్ నువ్వు?"

జవాబు లేదు.

జయదేవ్ ఒక కాగితం, కలం ఇచ్చేడు. "నీ పేరు వ్రాయి"

తులసి చేతులు ముందు కదల్లేదు. అతడు మరోసారి ఆమెని మాటలద్వారా మరింత మత్తు లోకి
తీసుకువెళ్ళవలసి వచ్చింది. ఈసారి ఆమె వేళ్ళు వ్రాయటం ప్రారంభించినయ్. ఆమె నిద్రకి భంగం
కలిగించకుండా వంగి చూసేడు. ఎందుకో అతడి భృకుటి ముడిపడింది. చాలాసేపు మౌనంగా వున్నాడు ఆ
తరువాత అడిగేడు "బిస్తా తెలుసా నీకు?"

జవాబు లేదు.

"దార్కా తెలుసా?"

దానికీ మౌనమే.

"నీ తండ్రి పేరు?"

వ్రాసింది. ఆ గదిలో నిశ్శబ్దం సూదిపడినా వినిపించేలా వుంది. ముగ్గురు ప్రేక్షకులూ మొహమొహాలు


చూసుకున్నారు.

"ఏ స్కూల్లో చదువుతున్నావ్ నువ్వు?"

జవాబు చెప్పింది.

దాంతో అతడో నిర్ణయానికి వచ్చినట్టూ, చివరి ప్రశ్న అడిగేడు -

"నీ తాతగారి పేరు ఏమిటి?"

తులసి చేతివేళ్ళు వణుకుతూ కదలటాన్ని చాలా ఉత్సుకతతో ఊపిరి బిగపట్టి చూడసాగేరు ముగ్గురూ.
కాగితం మీద అక్షరాలు పాముల్లా పాకుతుననాయి .పెన్ను కూడా వణుకుతుంది. వంకరటింకరగా అక్షరాలు
రూపుదిద్దు కోసాగాయి. ఆమె వ్రాయటం పూర్తిచేసి వెనక్కి వాలిపోయింది. శారద ఊపిరి బిగపట్టింది. జయదేవ్
ఆ కాగితం ముక్కవేపే తదేకంగా కొన్ని క్షణాలు చూసేడు. తరువాత నెమ్మదిగా వంగి తీసుకున్నాడు. 'మైగాడ్'
అన్న పదాలు అప్రయత్నంగా అతడి నోటివెంట వచ్చినయ్. వంకర అక్షరాల్తో ఆ కాగితం మీద పేరు వ్రాసివుంది.

వి ద్యా ప తి
వి ద్యా ప తి
వి ద్యా ప తి
వి ద్యా ప తి

ఆ పేరు కాశ్మీరు తాతయ్యది. లాయర్ విద్యాపతి.

* * *
ఆ రాత్రి జయదేవ్ ఇంటికొచ్చేసరికి పన్నెండు దాటింది. తులసి ప్రవర్తన తాలూకు అంతరార్ధం బోధపడింది.
వివాహం కాకుండానే తల్లి కాబోతున్నానన్న విషయం తెలిసి. ఆమె మానసిక ఘర్షణలో వుండగా, ఆమె
కళ్లముందే కాశ్మీర మరణించింది. తాను కాశ్మీరలా చిన్నపిల్ల అయివుంటే ఈ పిరియడ్స్ ఆగిపోవటములాంటి
బాధ వుండదు కదా అన్న భావం ఆమెలో ఎంతగా పేరుకు పోయిందంటే - కాశ్మీరని ఆహ్వానించి, తన శరీరాన్ని
అర్పించింది. తనే కాశ్మీరనని నమ్మింది. కాశ్మీర ప్రవర్తనకి ఆధారాలైన స్కిప్పింగ్ లక్కపిడతల్ని తను ఆడటం
మొదలు పెట్టింది.

ఇంకొక్క మాటలో, చౌకబారుగా చెప్పాలంటే.........

కాశ్మీర దెయ్యం తులసిని పట్టింది.

దెయ్యం పట్టటానికి సైంటిఫిక్ రీజన్ గురించి కాదు, జయదేవ్ ఆలోచిస్తు న్నది మానసికంగా
బలహీనమైనవాళ్ళు వత్తిడులను తట్టు కోలేక - చనిపోయిన వాళ్ళని, దేముళ్ళను , క్షుద్రదేవతల్నీ
ఆశ్రయింపచేసుకుంటారన్న విషయాన్ని సైన్సు వప్పుకుంటుంది. అయితే తులసి అంత బలహీనమైన
మనస్కురాలు కాదే...........

ఇక్కడే శ్రీనివాసపిళ్ళై ఏదో చేసి వుంటాడు.

ఆపరేషన్ ఒకటి నుంచి........అయిదు వరకూ.

ఏమిటవి?

ఆలోచనలతో అతడు నిద్రలోకి జారుకుంటూ వుండగా గడియారం రెండు గంటలు కొట్టింది.

మూడున్నర అవుతూ వుండగా శారదకి మెలకువ వచ్చింది. ఎక్కడో, ఏధో చప్పుడై ప్రక్కనచూస్తే శ్రీధర్
నిద్రలో వున్నాడు. అతడికి నిద్రాభంగం కలిగించకుండా లేచి ముందుగదిలోకి వచ్చింది. అక్కడెవరూ లేరు.
గాలికి కిటికీ తలుపు కొట్టు కుంటూంది. అంతే ఆమెదాన్ని వేసేస్తూ వుండగా మళ్ళీ చప్పుడయింది తులసి
గదిలోంచి.

ఆమె శబ్దం చెయ్యకుండా అటువైపు నడిచింది. తలుపు లోపలి వైపు వేసివుంది. ఆమె ఆశ్చర్యపోయింది. ఏం
చేయాలో తోచలేదు. వెళ్ళి శ్రీధర్ ని లేపుదామా అనుకొంది. మళ్ళీ అంతలోనే కిటికీ సంగతి గుర్తు వచ్చింది
అదృష్టవశాత్తూ ఒక రెక్క తెరిచి వుంది. బయట చీకటిగా వుండబట్టి అక్కడివాళ్ళు కనబడరు. ఆమె కిటికీ రెక్క
కొద్దిగా తెరిచి, లోపలికి చూసి స్థా ణువైపోయింది.

* * *
దార్కా అర్ధరాత్రి దాటేవరకూ శ్మశానంలో వున్నాడు. తనకి కావల్సిన పరికరాలు సమకూర్చుకుంటూ.
దాదాపు అర్ధరాత్రి గడిచి రెండు మూడు గంటల తర్వాత శ్మశానంలో అతడి పని పూర్తయింది.
తెల్లవారకముందే చేయవలసిన పన్లు ఇంకా చాలా వున్నాయి. ఎందుకంటే.....అదే తులసికి ఆఖరిరాత్రి కాబట్టి
మంత్రానికి సంబంధించిన పనులు రాత్రే జరుగుతాయి కాబట్టి!!! అతడు చాలా హడావుడిగా తులసి
ఇంటివద్దకు చేరుకున్నాడు. అయితే యింటి లోకి ప్రవేశించటం అంత సులభం కాలేదు. దాదాపు అరగంట
కష్టపడవలసి వచ్చింది.

పక్కమీద తులసి పడుకొని వుంది. ఆమె మొహంలో నిర్మలత కొట్టొచ్చినట్టు కనబడుతూంది.

(తులసిదళం చదివిన పాఠకులకి ఈ విషయం తెలిసే వుంటుంది. గడువుకి ఒకరోజు ముందు పేషంటు
మామూలుగా అయిపోతుంది. ఇరవైనాల్గు గంటలపాటు వుండే ఆ చావుకళ ని చూసి దగ్గరవాళ్ళు అంతా
తగ్గిపోయింది కదా అనుకొని సంతృప్తి పడతారు.)

గదిలోకి ప్రవేశించిన వెంటనే దార్కా తన పనిలో మునిగిపోయాడు. నిద్రనుంచి లేచిన తులసి ఆ చీకట్లో తనని
చూసి భయంతో తొందరపడి, అరవకుండా, ఆమె మెడ వెనుక నరాన్ని వేళ్ళతో రెండుసార్లు రాసేడు. దూపం
వేసేడు. తరువాత బల్ల దగ్గిర వెతికేడు. సరి అయిన పరికరం ఏదీ దొరకలేదు సమయం వృధాపర్చటం
ఇష్టంలేదు. ఆమ చేతిని తీసుకొని, పళ్ళతోనే గోళ్ళు తీసేసేడు. అలాగే కాలిగోళ్ళు ఆ తరువాత ఆమె జుట్టు తన
చేతిలోకి తీసుకున్నాడు. అతడి వడిలోంచి ఆమె పొడవాటి జుట్టు పాయ నేలమీదికి పర్వతాగ్రం నుంచి జారిన
నదీ పాయలా జారింది. వేళ్ళని దువ్వెన చేసి వెంట్రు కల్ని దువ్వేడు. నాలుగయిదు వెంట్రు కలు రాలిపోయినయ్.
చాలాసేపు అలాచేసి, అతను మరిక వలిత్పూరకేశాలు లేవని సంతృప్తిపడి, జుట్టు ని సంజామృతం చేసి
బింగించేడు. ఒక డాక్టరు క్లిష్టమైన ఆపరేషన్ ని ఎంత ఏకాగ్రతతో చేసుకుంటూ పోతాడో అతడు తన పనిని
అలా చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇంతకాలం ప్రయోగించటమే తెలుసు ఎదుర్కోవటం తెలీదు.
అందులోనూ సర్వశక్తి సంపన్నమైన కాష్మోరాని!

తులసి తలని దిండుమీద తిరిగి జాగ్రత్తగా అమర్చి, అతడు లేచి నిలబడ్డా డు. తనతోపాటూ తెచ్చిన
మంత్రజలాన్ని ఆమె మంచం చుట్టూ గది నిండా జల్లేడు. ఆమె కాళ్ల దగ్గర శ్రీచక్రం వేసేడు. కిటికీ దగ్గర
కర్పూరాన్నీ, నలుమూలలా నిమ్మకాయలని మంత్రించి పడేశాడు. ఇదంతా చేస్తు న్నప్పుడు అతని పెదవులు
కదుల్తూనే వున్నాయి.

అతడిపని పూర్తయ్యేసరికి దాదాపు గంటపట్టింది. ఆ గది మొత్తం చక్రబంధంలో బంధింపబడింది. రురుడు,


భైరవుడు, కపాలుడు, కుండలుడు అతడి ఆజ్ఞ ననుసరించి దిక్కుల్ని కాస్తు న్నారు. మంత్రపు కంపనాల్తో ఆ
గదిలో గాలికూడా అస్తిత్వాన్ని ఆపాదించుకొంది.

తన పనిపట్ల అతడు సంతృప్తు డయ్యాడు. తూర్పు తెల్లవారే సమయం ఇంకెంతోసేపు లేదు. వెళ్లిపోవాలి.
చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది. అతడు బయటకు అడుగు వేయబోతూ గుమ్మం దగ్గర ఆగి తులసి
వైపరు చూసేడు ఆఖరిసారి.

తాను కాష్మోరాని ఎదుర్కోగలిగితే ఆమె బ్రతుకుతుంది. లేకపోతే మరణిస్తుంది. ఏది ఏమయినా అదే
ఆఖరిసారి ఆమెని చూడటం అని అతడికి తెలుసు అతడి మనసంతా అదోలాటి భావనతో నిండిపోయింది.
అందులో దుఃఖం -ఆవేదనా -వీడ్కోలూ -అలాంటివేమీ లేవు. అతడి నిరాసక్తమైన జీవితంలో ప్రేమ అనే పదానికి
కూడా అర్ధం తెలీదు. ఒకమ్మాయి - పెద్ద పెద్ద కళ్ళున్నది జలపాతంలా హుషారైనది, తన చేయి పట్టు కుని
'పరుగెత్తు - క్విక్' అంటూ బాణంలా సాగిపోవటం మాత్రం గుర్తు న్నది. ప్రేమ ఉద్భవించటానికి పాతిక
సంఘటనలు అక్కర్లేదు. మనసనే బీడు మీద వర్షపు చుక్కలాటి ఓ చిరునవ్వు....ఓ కనుచూపు చాలు. అది
పెల్లు బికి , కట్టలు తెంచుకొని ప్రవహించటానికి. బహిర్గతమవ్వటానికి మాత్రము ఓ సంఘటన కావాలంతే,
అతడికి భాషరాదు. చెప్పే చాకచక్యం లేదు. అయినా విశ్వజననీయమైన ప్రేమని చెప్పటానికి భాషే
కావాలనుకుంటే వెదురుబొంగులను పిల్లన గ్రోవిని చేసి, పచ్చిక బయళ్ళలో గొర్రెల్ని కాచుకుంటూ పాడుకొనే
కాపరికి ఏ భాష తెలుసు?

అతడి కంటిచివర ఏ నీటిచుక్కనిల్చింది. అయితే అది ఆనందం వల్ల వచ్చినది. సంతృప్తివల్ల వచ్చినది.
అతడు ఆత్మావలోకనం చేసుకున్నాడు. నిజంగా ఆచార్యులవారి వల్ల నేనా తనీ నిర్ణయానికి వచ్చినది..
కాదేమో........ తన మనసు మారుమూలల్లో ఎక్కడో. ఏ మూలో ఈమె బ్రతికితే బావుణ్ను.....అనే భావన -
చూసిన మొదటి క్షణంనుంచి లేదూ? తను ప్రతిజ్ఞ గెలవటంకన్నా ఓడిపోవటంలో ఆనందం ఎక్కువన్న ఆలోచన
తనకు కలగలేదూ? లేదనుకోవటం ఆత్మవంచన. అదే ప్రేమయితే.....

అతడి పెదవులమీద అప్రయత్నంగా ఒక చిరునవ్వు వెలసింది. హిమాలయ పర్వతంతర్ భాగపు గుహల్లో -


చలికి వణుకుతూ, శరీరాన్ని కఠోర నియమాలకు గురిచేస్తూ మనిషి జీవితానికి ఆత్మసంతృప్తికి కారణం
కనుక్కునవే దీక్షతో అహోరాత్రాలూ తపస్సు చేసే ఋషికి - అప్రయత్నంగా జీవితం సారస్వం ఒక్కసారి
బోధపడినప్పుడు కలిగే సంతృప్తిలాటి నవ్వు అది.

అతడు అప్రయత్నంగా రెండడుగులు ముందుకు వేశాడు.

పక్కమీద తులసి నిశ్చలంగా పడుకుని వుంది. కిటికీలోంచి వస్తూన్న చిరుగాలికి ఆమె నుదుటిమీద ఓ
ముందురులపాయ కదలాడుతూంది. ఆమె తెల్లటి శరీరం బంగారంలా మెరుస్తూంది. కొనదేరిన ముక్కూ,
చిన్న నోరూ, గెడ్డంవంపూ శిల్పాన్ని గుర్తు తెస్తు న్నాయి. మూసుకున్న కనురెప్పలు సముద్రపు అలల తాకిడికి
నునుపుదేలిన ఆల్చిప్పల్లా వుననాయి. వయసు అమాయకత్వాన్ని, చదువు విజ్ఞానాన్ని కలబోసి ఆమె మొహాన్ని
తీర్చిదిద్దినయ్.

అతడు చేయిసాచి ఆమెను స్పృశించబోయి ఆగిపోయాడు. తనకేం హక్కున్నది ఆమెను తాకటానికి?


ఎక్కడో శ్మశానాల్లో పుట్టి - కపాలాల మధ్య పెరిగి - పగతో బ్రతికిన తనకి -ఈ పవిత్రమైన స్త్రీని ముట్టు కునే
హక్కు ఎక్కడున్నది? పవిత్రత తాకితేనే పోతుందా.......ఏమో....... తర్కాలకిది సమయం కాదు. తన భావాలు
తనతోనే సమాది కాబడాలి!

ప్రేమతో -ఆర్తితో ఆమెను ఆఖరిసారి తాకాలన్న కోర్కెని మనసులోనే అణచుకుని అతడు వెనుదిరిగేడు.

తలుపు తీసి బయటకు రెండడుగులు వేసి, పక్కన ఏదో అలికిడి అయితే తలతిప్పి చూసేడు.
కిటికీ రెక్కకి అనుకొని నిలబడి వుంది శారద. ఎంతో సేపట్నుంచీ అలా వున్నట్టూ ఆమె బంగిమ
చెబుతూంది.

ముందు కదిలింది దార్కా - "నేను......నేను....." అన్నాడు తడబడుతూ...." నేను తులసికి ఏ అపకారమూ


చేయటానికి రాలేదు"

"నాకు తెలుసు" అందామె మెల్లగా. "అంతా చూసేను నేను "అని కొంచెం ఆగి "మిగతాది జయదేవ్
చెప్పారు"

"చిన్న అభ్యర్ధన" అన్నాడు. ఏమిటన్నట్టూ చూసింది ఆమె.

"రేపు రాత్రి- అర్ధరాత్రి గడిచేవరకూ తులసిని ఈ గదిలో నుంచి బయటకు రానివ్వకండి. నీరు
చూడనివ్వకండి. రేపురాత్రి ముఖ్యంగా - గుమ్మం దాటనివ్వకండి" అతడు ఆగి, నెమ్మదిగా అన్నాడు..... "రేపు
రాత్రి భయంకరమైన రాత్రి కాబోతుంది. చాలా బలమైన క్షుద్రశక్తి కాష్మోరా. శ్మశానంలో దాన్ని పాతాలి. అర్ధరాత్రి
వరకూ ఆపగలిగితే చాలు తులసిని మాత్రం బంధంలోంచి బయటకు రానివ్వకండి"

ఆమె అప్రయత్నంగా తల వూపింది. అతడు చీకట్లో కలిసిపోయాడు. అతడి మనసు ఒక అస్పష్టమైన


సంతృప్తితో నిండిపోయింది. ఈ ప్రపంచంలో కనీసం ఇద్దరు వ్యక్తు లు తనని అర్ధం చేసుకున్నారన్న
సంతృప్తితో.......

పదకొండు సంవత్సరాల క్రితం ఆ ఇద్దరు వ్యక్తు లే ఈ మాయామంత్రాలకి ఎదురు నిల్చినవారు. ఇప్పుడూ


వారు తమ భావాల మీద స్థిరమయిన అభిప్రాయాలు కలిగే వున్నారు. అయితే హేతువాదంతో జరుగుతూన్న
విషయాన్ని అన్వయించుకొంటే వారికి ఇదంతా అసంబద్దంగా కన్పించటంలేదు. ఈ రోజు నిరూపించలేని
సైన్సు రేపు నిరూపిస్తుంది. జరిగే ప్రతిదానికి హేతువుండి తీరాలి ! తప్పదు!

32
ప్రపంచానికి మరో ఉదయాన్ని ప్రసాదించటానికి సూర్యుడు తూర్పున ఆయత్తమవుతున్నాడు.

జయదేవ్ బద్దకంగా కళ్ళు తెరిచాడు. రాత్రంతా నిద్రలేకపోవటం వల్ల కళ్ళు మండుతున్నాయి. అంతలో
కింద కలకలం వినిపించింది. కిటికీలోంచి తొంగిచూసేడు. ఉబ్బసం ఇంటి ఓనరు మనవరాళ్ళు ఊరినుంచి
వచ్చినట్టు న్నారు. పెద్ద గొంతుతో మాట్లా డుకుంటున్నారు.

అతడు తిరిగి నిద్రపోవటానికి ప్రయత్నించాడు. కానీ నిద్ర పట్టలేదు. లేచిపోయాడు.

ఎనిమిదిన్నర అవుతూ వుండగా వారు బిలబిలమంటూ అతడి గదిలోకి ప్రవేశిచారు. మొత్తం నలుగురూ
అమ్మాయిలు. పైనలియర్ నుంచీ ఇంటర్మీడియట్ వరకూ.
"మీరు హిప్నటై జ్ చేస్తా రటగా......అమ్మమ్మ చెప్పింది" అంది హిందీలో ఒకమ్మాయి.

"మాకు నేర్పరూ. పదిహేను రోజులు వుంటాం ఇక్కడ" అంది అందరిలోకి చిన్న అమ్మాయి పైజామా కుర్తా
వేసుకున్నది.

"శలవలా?" అడిగేడు.

"కాదు టోర్నమెంట్స్" అంది పెద్దమ్మాయి.

"మా కాలేజీ జూనియర్స్ లో రన్నింగ్ చాంపియన్ ను నేను. ఫాతిమా షీలాకోకో......పెద్దక్క బాడ్మింటన్"


అందరిలోకి చిన్న పిల్లలా వున్న అమ్మాయి గడగడా చెప్పేసింది.

"నీ పేరు?" పెద్దమ్మాయిని అడిగేడు.

"రజియా!"

ప్రక్కనే వున్న పుస్తకాల్ని కెలుకుతూన్న ఫాతిమా "మాకు హిప్నాటిజం నేర్పరూ!" అంది.

"నేర్పక్కర్లేదు మీ కళ్ళలోనే వుందా శక్తి" అన్నాడు జయదేవ్ నవ్వుతూ. నలుగురూ సిగ్గుపడ్డా రు. ఇంతలో
ఉబ్బసం ఇంటి ఓనరు కంఠం కిందనుంచి వినబడింది. "క్యా సతా రహేహై సుబే సుబే అంకుల్ కో -నీచే
ఆజావ్!" (ఏం గొడవ చేస్తు న్నారు పొద్దు న్నే అంకుల్ దగ్గర - క్రిందికి రండి)

నలుగురూ వచ్చినంత వేగంగా కిందికి పరుగెత్తా రు. ఆకరి పిల్ల మాత్రం మెట్లు దిగుతూ., ఆగి వెనక్కి తిరిగి
నాలుక బయట పెట్టి వెక్కిరించి పరుగెత్తింది.

జయదేవ్ నవ్వుకుంటూ రేడియో ఆన్ చేసి స్నానానికి వెళ్ళాడు.

పది గంటల ప్రాంతంలో పెద్దమ్మాయి రజియా వచ్చిం ది పైకి .... "మీరు డాక్టర్ కూడానా?"

"ఏం కావాలి?"

"ఇంజక్షన్ ఒకటి చెయ్యాలి, చేస్తా రా?"

"ఎవరికి?"

"నాకే"
"తీసుకురా చేస్తా ను"

ఆమె కిందికి వెళ్ళి తీసుకొచ్చింది. ఈ లోపులో సిరెంజి కడిగి నీడిల్ సిద్దంచేసేడు. ఎంత ఇంజెక్ట్ చెయ్యాలో
ఆమె చెప్పింది. మందు సిరెంజిలోకి ఎక్కిస్తూ "నువ్వు ఆరోగ్యంగానే వున్నావ్ గా ఎందుకు ఇంజెక్షన్?"
అన్నాడు.

ఆమె కొద్దిగా సిగ్గుపడి - "టోర్నమెంట్ వారం రోజులూ........." అని కొద్దిగా ఆగి"....ఇబ్ంది పెట్టకుండా"

ఆమెకి ఇంజెక్షన్ ఇస్తూ "ఏమిటి దీని పేరు?" అన్నాడు.

"ప్రొగైనాన్.........."

ఇంజెక్షన్ ఇవ్వటం పూర్తిచేస్తు న్న జయదేవ్ మధ్యలో ఆగిపోయి ప్రొగైనాన్...... ప్రొగైనాన్...ఎక్కడ విన్నాడా
మాటని! అతడి మెదడులో హోరు మొదలయింది. జ్ఞాపకం రావాలి! అతి ముఖ్యమైనదని మనసు
చెబుతూంది. ప్రొ.....ప్రొ......ఎవరు వాడేరు ఆ పదాన్ని వెంకట్ కదూ......." తులసికి ఇంజెక్షన్ ఇస్తూ. అతడి
ఆలోచనలు గతం లోకి వెళ్ళినయ్!

"మీరు చేస్తు న్న ఇంజక్షన్ ఏమిటో చూసుకున్నారా"అని తులసి అన్నమాటలు..... జయదేవ్ కి కొద్ది కొద్దిగా
జ్ఞాపకం వచ్చాయి - అతడు బైట గదిలోంచి విన్న సంభాషణ -

"ప్రొగైనాన్ గురించి నీకెలా తెలుసు?" వెంకట్ అడిగేడు.

"క్రికెట్ మాచ్ గురించి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొంతమంది తీసుకొనేవాళ్ళం" తులసి అన్నది.

ఆ మాటతో వెంకట్ సారీ చెప్పి, వేరే ఇంజెక్షన్ ఇస్తూ అన్న మాటలు..... "సారీ.....రెండూ 'ప్రొ' తో
మొదలవటంతో పొరపాటు పడ్డా ను" అని.....

జయదేవ్ రజియాని అడిగేడు - "ఇలా పిరియడ్ ని ఆలస్యం చేసే ఇంజెక్షన్ లు ఇంకా ఉన్నాయా?"

"ఉంది ప్రొల్యూటర్ అని ఇంకోటి అది...." ఆమె మాటలు పూర్తికాలేదు - జయదేవ్ చేతిలోంచి సిరెంజి
జారిపోయింది. ప్రొల్యూటన్........ప్రొగైనాన్ రెండూ "ప్రో"తో మొదలైనవే - కానీ రెండూ ఒకే దానికోసం
ఉపయోగించబడేవి!!! అంటే వెంకట్ పొరపాటు పడలేదన్న మాట ప్రొగైనాన్ గురించి తులసికి తెలుసు అని
అతడు గ్రహించగానే జాగ్రత్తగా తప్పు దిగ్గుకుని, ప్రొల్యూటన్ ఇచ్చేడు.

ఎందుకిచ్చాడు?

అతడు మరిక ఆలస్యం చేయలేదు -ఉన్నట్టుండి పరుగెత్తిన జయదేవ్ ని రజియా ఆశ్చర్యంగా చూస్తూ
వుండిపోయింది. మరో క్షణంలో కారు స్టా ర్టయిన శబ్దం వినిపించింది.

* * *
జయదేవ్ వెళ్ళేసరికి వెంకట్ ఇంటిదగ్గర పండిత్ వున్నాడు. జయదేవ్, పండిత్ వంతుల ప్రకారం వెంకట్
చర్యల్ని గమనిస్తు న్నారు. ఆపరేషన్ సిక్స్ ఏమిటో తెలిసేవరకూ అలా చెయ్యాల్సిందే అని నిశ్చయించుకున్నారు.
జయదేవ్ పండిత్ తో తులసి గర్భం విషయం చెప్పలేదు.

"రాత్రి విశేషాలు ఏమైనా వున్నాయా?" జయదేవ్ అడిగేడు లేదన్నాడు పండిత్.

"మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను చూస్తా ను" అని అతడిని పంపించి, వెంకట్ ఇంట్లోకి వెళ్ళాడు.

"గుడ్ మార్నింగ్"

"గుడ్ మార్నింగ్" అన్నాడు వెంకట్

"డాక్టర్ మీరెప్పుడయినా ప్రొల్యూటన్ అనే మందు పేరు విన్నారా?"

"ప్రొల్యూటనా - లేదే"

"పోనీ ప్రొగైనాన్......"

"ఉహూ"

జయదేవ్ కుర్చీలోంచి లేచి, "మీరు వాడిన దూదీ ఖాళీ సీసాలూ ఎక్కడ పడేస్తా రు?" అని అడిగేడు.

"ఈ కాంపౌండ్ లోనే..... పెరట్లో.........ఆ మూల" చూపించేడు.

క్రితం రోజు వర్షానికి అక్కడ అంతా చిత్తడిగా వుంది. మోకాళ్ళ మీద కూర్చొని కుప్పని వెతకసాగేడు.

వెంకట్ కూడా సాయం చేయసాగేడు. దాదాపు అరగంట అయింది. మేఘాలు దట్టంగా పట్టటం వల్ల
ఎండగా లేదు.

"ఇదిగో ఏమిటిది?" వెంకట్ సబ్బు పెట్టె ఆకారంలో వున్న పెట్టెను చూపిస్తూ అడిగేడు. చూడగానే దాన్ని
గుర్తించాడు జయదేవ్.

మస్కిటో రిపెల్లర్!
వెంకట్ కి తెలియకుండా ఇది అక్కడికి వచ్చిందంటే..... దాంట్లో కూడా శ్రీనివాసపిళ్ళై పాత్ర వుండి తీరాలి.
అతడు దాన్ని పక్కన పెట్టి తిరిగి వెతకటం మొదలు పెట్టా డు.

ఇంకో అరగంట తరువాత దొరికింది, ప్రొల్యూటన్ బాటిలు.

అతడు అప్పుడే ఒక నిర్ణయానికి రాదల్చుకోలేదు.

ఇద్దరూ లోపలికి వచ్చారు. రిపెల్లర్ కి కరెంట్ ప్లగ్ పెట్టి స్విచ్ వేసేడు. దాని తాలూకు పరిణామం (ఏదైనా
వుంటే) కనబడటానికి ఓ గంట పడ్తుంది.

"తినటానికేదైనా వుందా?" పొద్దు ట్నుంచీ ఏమీ తినలేదని జ్ఞాపకం వచ్చి అడిగేడు. వెంకట్ లోపలికి వెళ్ళి
బ్రెడ్, జామ్ తీసుకొచ్చాడు. ఈ లోపులో ఏం చెయ్యాలో తోచక జయదేవ్, వెంకట్ తాలూకు రిఫరెన్స్ పుస్తకాలు
తీసి చూడటం మొదలుపెట్టా డు. అతడికి మొదట కనబడింది - రామానంద ఫోటో - చైనీస్ ఆక్యుపంచర్
తాలూకు వివరణ. అతడిని అది ఆకర్షించకపోవును గానీ, దానిమీద "ఇదంతా బోగస్ నేను నమ్మను" అన్న
పెన్సిల్ తో వ్రాసిన అక్షరాలు చూసి అతడు దానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ చేతివ్రాత తులసిది. అంటే తులసికి
మానవాతీత శక్తి ఏదో వుంది అన్న భావం మనసులో ఇమిడేలా చర్చ జరిగిందన్నమాట. అందుకే స్కిజో
ప్రెనియాలో ఆమె దేముడు ఉన్నాడూలేడూ అన్న వివరణ పట్ల పరస్పర విరుద్దమైన భావాల్తో
కొట్టు మిట్టు లాడింది.

జయదేవ్ ఆలోచనల్లో వుండగా వెంకట్ బ్రెడ్ తెచ్చాడు.

"ప్రెమర్ ధెరపీ అంటే ఏమిటి? జయదేవ్ అడిగేడు.

"దాని సంగతి యిప్పుడెందుకు?"

"చాలా రోజుల క్రితం మీరు తులసికి అలా ట్రీట్ చేస్తూ వుండగా నేనొచ్చి "ఏమిటిది" అని అడిగాను. మీరు
చెప్పారు"

"రోగిని ఒక విధంగా బలహీనపర్చి, అతని "వాదన" ద్వారా నిస్సహాయుణ్ని చేస్తే మనసులోని అంతర్లీనమైన
భావాలు బైటపడ్తా యి. దానినే ప్రైమర్ ధెరపీ అంటారు"

"తులసి నిలా ప్రశ్నించినప్పుడు ఏమయినా బావాలు ఆమె వెలిబుచ్చిందా?"

వెంకట్ ఆశ్చర్యపోయి, "తులసికి ప్రైమర్ దెరపీ ఇవ్వలేదే నేను" అన్నాడు జయదేవ్ ఈ మాటలకి
విస్తు బోయాడు. వెంకట్ మెదడు రెండుగా విడిపోయి వుందన్నమాట. ఒకటి పిళ్ళై కంట్రోల్ లో వుంది.

తులసికి సంబంధించిన ట్రీట్ మెంట్ అంతా ఆ భాగమే చేసింది. వెంకట్ కి ఏదీ జ్ఞాపకం లేదు.
జయదేవ్ ముందుకు వంగేడు - "డాక్టర్, ఆలోచించండి, ఎలాగైనా గుర్తు తెచ్చుకోండి. ఒక అమ్మాయి
జీవితం మీ మీద ఆదారపడి వుంది" అన్నాడు బ్రతిమాల్తు న్నట్టు . వెంకట్ నుదురు పట్టు కున్నాడు. కళ్ళు
మూసుకుని కొంచెం సేపు ఆలోచించి - తల విదిలిస్తూ "లేదు. ఏమీ జ్ఞాపకం రావటంలేదు" అన్నాడు.
జయదేవ్ అతడివేపు దిగులుగా చూసేడు. వెంకట్ నిజాయితీగా "తులసి అంటే నాకు ఇష్టమే.
కానీ........కానీ....." అని ఆపేడు. క్షణం.,........ఆగి, నిస్పృహతో "లేదు......గుర్తు రావడంలేదు" అన్నాడు.
ఇంతలో ద్వారం దగ్గర చప్పుడు అవటంతో జయదేవ్ తలతిప్పి చూసేడు.

దార్కా లోపలికి వస్తు న్నాడు.

* * *
"ఇంకో ఎనిమిది గంటలు" అనుకున్నాడు శ్రీధర్. సాయంత్రం నాలుగయింది. ఇంకా ఎనిమిది గంటల్లో
కాష్మోరా తన కూతుర్ని తీసుకెళ్ళిపోతుంది.......తనేం చెయ్యలేడు. స్నేహితులకు చెబితే పిచ్చివాడి కింద జమ
కడతారు. కూతురి మరణాన్ని ప్రేక్షకుడిలా చూస్తూ వూరుకోవలసిందేనా? ఏం చెయ్యడానికి లేదా?

అతడో నిర్ణయానికి వచ్చాడు.

తనే చెయ్యాలి -ఏం చేసినా!

మరోసారి తులసి గదిలోకి ప్రవేశించి కిటికి తలుపలూ అవీ భద్రంగా వేసి వున్నాయో లేదో పరీక్షించేడు. తనకే
నవ్వొచ్చింది. కాష్మోరా అంటూ వుంటే దానికి. ఈ తలుపులు అడ్డొస్తా యా?

అతడు ఫకీరు ఇచ్చిన విగ్రహాన్ని తులసి తల దిండుకింద పెట్టా డు ఆ తరువాత తన గదిలోకి వెళ్ళాడు.

జె అండ్ జె కనెస్ట్రక్షన్ కంపెనీ అడవుల్లో పనిచేసేటప్పుడు రక్షణ కోసం ఇచ్చిన రివాల్వర్, పెట్టె అడుగునుంచి
తీసేడు. సైలెన్సర్ వున్న రివాల్వర్ అది. శుభ్రం చేయ్యటం ప్రారంభించాడు.

* * *
దార్కా చాలా తొందర్లో వున్నాడన్న విషయం అతడి మొహం చూస్తూనే తెలుస్తూంది. అతడికి చెక్క మేకులు
దొరకలేదు. క్షుద్రశక్తు లు ఆవహించి వుండే వస్తు వుల్లో ఇనుము ఒకటని శాస్త్రం చెబుతూంది. అవి దొరికేక
వాటిని శుభ్రపరిచి పూజించాలి. అదంతా అయ్యేపనేనా అని అతడు దిగులుగా వున్నాడు. అతడా దిగుల్తోనే
ఉత్తరం వ్రాసి కవర్లో పెట్టా డు.

"ఏమిటిది" జయదేవ్ అడిగేడు.


"ఈ చిన్న సాయం చేయండి బాబూ దాన్ని తులసి కివ్వండి" వెనుదిరుగుతూ అన్నాడు దార్కా. అతడు
వెళ్ళిపోతూంటే జయదేవ్ కి ప్లా ష్ లా తట్టింది ఆలోచన. "దార్కా" అని పిల్చేడు. "నీతో ఒక పది నిముషాలు
పని వుంది కాదనకు ప్లీజ్"

నిజానికి దార్కా చాలా తొందర్లో వున్నాడు. అయినా జయదేవ్ మాట కాదనలేకపోయాడు. దార్కా
వప్పుకోగానే టేప్ రికార్డర్ ఒకటి తెప్పించాడు. పది నిముషాలపాటు దార్కా మాటలు రికార్డు చేయబడ్డా యి. ఆ
తరువాత దార్కా వెళ్ళిపోయాడు.

రాత్రి తొమ్మిది కావొస్తుంది. ఈదురుగాలి రివ్వున వీస్తూంది. అప్పటికే ఆకాశంనిండా దట్టంగా మేఘాలు
క్రమ్మినయ్.

తులసి తన గదిలో గాడమైన మత్తు లో వుంది. దాదాపు పది గంటల్నుంచీ కదపటానికి గానీ శారద
వప్పుకోలేదు. శ్రీధర్ కూడా ఆమెతోనే ఏకీభవించేడు. అయితే దార్కా క్రితంరోజు తెల్లవారుజామున వేసిన
బంధాల గురించి శ్రీధర్ తో శారద చెప్పలేదు.

తొమ్మిదిన్నర కావొస్తూ వుండగా అబ్రకదబ్ర శ్రీధర్ యింటికి వచ్చేడు వారిద్దరూ ఎక్కువసేపు


మాట్లా డుకోలేదు. టెన్షన్ తో ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చొన్నారు. శ్రీధర్ పక్కన ఆష్ ట్రేలో సిగరెట్ పీకెలు
నిండివున్నాయి. దాని పక్కనే........ రివాల్వర్ మెరుస్తూంది.

* * *
దార్కా వెళ్ళిపోయాక వెంకట్ని కుర్చీలో కూర్చోబెట్టా డు జయదేవ్. టేప్ ప్రారంభించేడు శ్రీనివాసపిళ్ళై
ఫ్రీక్వెన్సీలో దార్కా కంఠం వినిపించింది. "మాండవ్యతీరం నుండే వెలుగుతున్నది కిరణమణి........" అని
పాటలా సాగింది.

"ఏమైనా జ్ఞాపకం వచ్చిందా?"

"నేను పనిచేసే ఆస్పత్రిలో గోడమీద ఎవరో వ్రాసేరిది. ప్రతి రోజూ చూస్తూ వుండేవాణ్ని.ఎందుకో వాటిమీద
రోజు రోజుకు యింటరెస్టు పెరగసాగిది. వాటిని కంఠతా పట్టేను."

జయదేవ్ నిస్పృహతో తలని విదిలించేడు. ఆ వాక్యాల చరిత్ర కాదు కావల్సింది. ఆ మాటలు వెంకట్ స్ప్లిట్
పెర్సనాలిటీలో రెండో మనిషి ఆలోచనలనీ, చర్యల్నీ బహిర్గతం చెయ్యాలి.

ఈ లోపులో టేప్ కొంచెం ముందుకు జరిగింది. మళ్లీ 'మాండవ్య తీరంలో.......... ' అని వినిపించింది.
'ఆపరేషన్ వన్' అని వినిపించింది. జయదేవ్ ఆశగా చూసేడు. వెంకట్ కళ్లు మూసుకునే వున్నాడు. చలనం
లేదు. మళ్ళీ కొంచెం సేపు నిశ్శబ్దం.
తరువాత 'ఆపరేషన్ టూ'

ఆపరేషన్ త్రీ -

ఆపరేషన్ ఫోర్......

వెంకట్ పెదవులు అస్పష్టంగా కదలటం చూసి చప్పున టేప్ రికార్డర్ వెనక్కి తిప్పేడు. దార్కా కంఠం పిళ్ళయ్
ఫ్రీక్వెన్సీలో వినిపించింది. 'మాండవ్యతీరంలో....... ఆపరేషన్ ఫోర్......'

జయదేవ్ చెవి వెంకట్ నోటి దగ్గరగా ఆన్చి విన్నాడు. 'పెంటథాల్...... పెంటథాల్' అని వినిపించింది.
జయదేవ్ కి శారద మాటలు గుర్తొచ్చాయి. "తులసికి పెంటథాల్ ఇచ్చినప్పుడు సదానంద చక్రవర్తి కలలోకి
వచ్చేడని చెప్పింది. అతడు ఆకాశంలో వున్నాడట! అది చెప్పాక డాక్టర్ నన్ను 'కొంచెం బయట కూర్చుంటారా?'
అని అడిగాడు. ఆ తరువాత తులసికి, ఆయనకీ మధ్య సంభాషణ నేను సరిగ్గా వినలేదు. 'నీ ఆరోగ్యం
బాగోలేదా?' అనటం మాత్రం వినిపించింది."

జయదేవ్ వెంకట్ చెవి దగ్గర నెమ్మదిగా అడిగేడు. "పెంటథాల్ ఇచ్చినప్పుడు తులసి ఏం చెప్పింది?"

"పిరియడ్ ఆలస్యం అయిందని"

జయదేవ్ ని తిరిగి నిస్పృహ ఆవరించింది 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్నట్టు వుంది పరిస్థితి. సదానంద
చక్రవర్తి రేప్ వల్ల తులసికి గర్భం వచ్చింది కాబట్టి పిరియడ్ ఆలస్యం అవటంలో ఆశ్చర్యం లేదు. అతడు
నిశ్శబ్దంగా ఆలోచిస్తూ వుంటే టేప్ ముందుకు కదిలింది. 'ఆపరేషన్ వన్ ఫైవ్' అని వినిపించింది దార్కా కంఠం.
వెంకట్ మత్తు లోనే 'మెస్కలిన్' అన్నాడు.

జయదేవ్ ఉలిక్కిపడ్డా డు.

అతి భయంకరమైన మందు మెస్కలిన్! దాని ప్రసక్తి యిప్పుడెందుకు వచ్చింది!

మెస్కలిన్!

మెస్కలిన్!!

మెస్కలిన్ ఇస్తే మనిషి ఖంగుతిన్నవాడిలా గంజాయి తాగినవాడిలా ప్రవర్తిస్తా డు. ప్రతీది విపరీతమౌతుంది.
భ్రాంతి పెరుగుతుంది.

"తులసికి మెస్కలిన్ ఇచ్చావా?"


"అవును?" వెంకట్ మత్తు లో అన్నాడు.

"ఇచ్చి..........."

"చందమామ చూపించేను."

"పగటిపూట చందమామ ఎక్కడ కనబడింది" విసుగ్గా అడిగాడు.

"చందమామ పుస్తకం"

"ఎక్కడుంది అది?"

"టేబిల్ డ్రాయర్ లో........."

జయదేవ్ టేబిల్ డ్రాయర్ తెరిచి పాత చందమామ పుస్తకం తీసేడు. డ్రాయర్ తలుపు తెరిచిన చప్పుడులో
బయట కారు ఆగిన శబ్దం వినబడలేదు. కారులోంచి ఒక వ్యక్తి నిశ్శబ్దంగా దిగేడు. లోపల జయదేవ్
చందమామ పేజీలు తిప్పేడు.

ఒక గుర్రం వికృతంగా వుంది. ఇంకో పేజీ రాజకుమారి - మరో పేజీ. గుర్రం రాజకుమారి వస్తూంది. గుర్రం
మనిషిగా మారింది. రాజకుమారి తల తిప్పింది. జయదేవ్ నోటివెంట 'మైగాడ్' అన్న శబ్దం వచ్చింది....... అది
తులసి..... గుర్రం మనిషి మరింత మీదకు వచ్చాడు. సదానంద చక్రవర్తి మమ్మీ - దార్కా పిళ్ళై ఇంట్లో చూసిన
బొమ్మ...... తులసి చీరె గాలిలో లేచిపోతుంది. గుర్రం ముందుకాళ్ళ మీద లేచింది.

జయదేవ్ కడుపులో తిప్పింది. అయితే అది తరువాత బొమ్మలు చూడటం వల్ల కాదు. అతడు వెంకట్ వైపు
చూసి, అతడూ అదే పరిస్థితిలో వున్నట్టు గమనించాడు. తులసి బెడ్ రూమ్ లో వుండే రిపెల్లర్.......

........అతడి దృష్టి మస్కిటో రిపెల్లర్ మీద పడింది. నిశ్శబ్దంగా పని చేస్తూంది అది. నిశ్శబ్దంగా
బహిర్గతమయ్యే అల్ట్రా సానిక్ తరంగాలు - తరంగాల ఫ్రీక్వెన్సీ మారిస్తే మనిషి శరీరం మీద అది చూపించే
పరిణామం!

వాష్ బేసిన్ దగ్గిర వెంకట్ వాంతి చేసుకుంటున్నాడు.

జయదేవ్ మెదడులో ఏదో మెరిసినట్టయింది.

వేవిళ్ళు!!!

అతడు రిపెల్లర్ ఆపుచేసేడు. ఒక్కొక్క సంఘటనా పేర్చుకుంటూ వస్తే - సిద్దేశ్వరి ఆలయంలో మైకం
కమ్మినప్పుడు తన మీద అత్యాచారం జరిగిందేమోనన్న అనుమానం తులసికి వెంకట్ కలిగించాడు. తల్లి
ఆమెకు దేముడి ఉనికి గురించి బోధించటంతో ఆమెలో ఘర్షణ ఎక్కువయింది. అందుకే పుట్టినరోజున నిర్మల
ప్రసక్తి వచ్చినప్పుడు ఆమె హిస్టీరిక్ గా ప్రవర్తించింది. ఆ తరువాత వెంకట్ దగ్గరికి ట్రీట్ మెంట్ కి వచ్చింది.
వెంకట్ ఆమెకి ప్రొల్యూటన్ ఇంజెక్షన్ చేయటంతో ఆమె పిరియడ్ మరింత ఆలస్యం అయింది. ఆమెని
మరింత భ్రాంతిలోకి పంపి, బొమ్మల పుస్తకం చూపించి ఆమెకు తను 'రేప్' చెయ్యబడ్డా ను అన్న నమ్మకాన్ని
మరింత కల్గించేడు వెంకట్. వీటన్నిటికీ తోడు వాంతులు. ఒకదానికొకటి అలా తోడవటంతో ఆ అమాయక పిల్ల
బెదిరిపోయింది. ఎవరికీ తన బాధ చెప్పుకోలేనంత స్కిజోఫ్రెనిక్ అయింది. తాము సరిగ్గా ఆలోచించలేదు. కానీ
తులసి సిద్దేశ్వరి ఆలయానికి వెళ్ళి అప్పటికి ఎంతో కాలం కాలేదు కదా! తులసి వైజాగ్ నుంచి తప్పించుకు
వచ్చేస్తూ వ్రాసిన వాక్యం - "అనంతానంతమైన బ్రహ్మాండం - బ్రద్దలవడానికి ఆర్నెల్లు అడ్డం" ఇంకా మూణ్ణెల్లు
కాలేదు కదా -అంటే......తులసి అనుమానం తప్పు! తులసి భ్రాంతి తప్పు!! తులసి లెక్క తప్పు!!!

తులసి గర్భవతి కాదు.

అతడు కుర్చీలోంచి ఒక్క గెంతులో దూకి "యురేకా" అని అరిచేడు.

ఆ ఆనందం అందరికన్నా ముందుగా పంచుకోవాల్సిన వ్యక్తి శారద. వెళ్ళి చెప్పేటంత సమయం కూడా
వృధాపర్చదల్చుకోలేదు. ఫోన్ వద్దకు చేరుకుని ఎదురింటికి ఫోన్ చేసేడు. శారద ఎత్తింది ఫోన్.

"శారద గారూ -- మీకు లైఫ్ టై మ్ గుడ్ న్యూస్ చెపుతాను, ఏం ఇస్తా రు?" అని దాదాపు అరిచేడు కట్టలు
తెంచుకున్న ఉత్సాహంతో.

"ఏం కావాలి?" మొగగొంతు గుమ్మం దగ్గిర్నుంచి వినపడటంతో ఉలిక్కిపడి ఫోన్ వదిలేసేడు. గుమ్మానికి
తాపీగా ఆనుకొని నిలబడి వున్నాడు శ్రీనివాసపిళ్ళై.

* * *
"ఏమైంది" అడిగాడు శ్రీధర్ శారదని. శారద ఫోన్ పెట్టేస్తూ "జయదేవ్ ఫోన్ మధ్యలో కట్ అయింది. ఏదో
గుడ్ న్యూస్ అంటూండగా."

శ్రీధర్ దానికంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇంక రెండు గంటలే టై మ్ వుంది పన్నెండవటానికి 'మళ్ళీ
చేస్తా డులే' అని వూరుకున్నాడు. శారద కూడా అలాగే అనుకుంది.

తమ ఎదురింటి నుంచే జయదేవ్ ఫోన్ చేసేడనీ -అతడు ప్రస్తు తము చాలా నిస్సహాయ పరిస్థితిలో వున్నాడనీ
ఆమెకు కొద్దిగా కూడా అనుమానం రాలేదు.

* * *
"కంగ్రాచ్యులేషన్స్ జయదేవ్. చాలా తెలివిగా నా ప్లా న్ కనుక్కున్నావు."
"చరిత్రలో ఎవరూ ఎక్కడా ఊహించనటువంటి ప్లా న్ వేశావ్. నీకూ నా అభినందనలు" జయదేవ్ అన్నాడు.

"గుడ్ చనిపోయేముందు ఆమాత్రం ఆత్మీయతా భావంతో చనిపోవటం మంచిది" నవ్వేడు. "ఇంక రెండు
గంటల్లో నువ్వూ, దార్కా , తులసి ముగ్గురు మరణించబోతున్నారు."

"తులసి మరణించదు" పళ్ళబిగువున అన్నాడు జయదేవ్.

పిళ్ళై మళ్ళీ నవ్వాడు. "........ఆపరేషన్ సిక్స్ సంగతి మర్చిపోయావ్ జయదేవ్. అది ఇంకా వుంది కదా."

"నా ఇంట్లో ఏమిటిదంతా? పోలీసుల్ని పిలుస్తా ను"వెంకట్ పిళ్ళైని చూస్తూ అన్నాడు. పిళ్ళై అదే నవ్వుతో
వెంకట్ వైపు తిరిగి అతడిని కంట్రోల్ చేసే వాక్యాలు అన్నాడు. వెంకట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. పూర్వకాలం
బందీలయిన అమెరికన్ సైనికుల్ని జర్మన్ అధికారులు ఈ విధంగానే ఒక కోడ్ వర్డ్ కి ట్యూన్ చేసి, అరాచకాలు
సృష్టించే వారట. ఇప్పుడది ప్రత్యక్షంగా చూస్తు న్నాడు జయదేవ్.

"అతడిని బంధించి" అన్నాడు పిళ్ళై. వెంకట్ జయదేవ్ చేతులు వెనక్కి కట్టేడు. ఎదురు తిరగటం అవివేకం
అని తెలుసు. హిప్నాటిక్ ట్రాన్స్ లో మనిషికి దాదాపు ఆరురెట్లు ఎక్కువ బలం వుంటుంది!

పిళ్ళై వెంకట్ తో "ఆపరేషన్ సిక్స్........ నువ్వు నిద్రలోంచి బైటకొచ్చి మామూలుగా అయిపోయేక


గడియారం పదకొండు గంటలు కొట్టగానే ఆపరేషన్ సిక్స్ అమలు చేస్తా వు. ఇప్పుడు తులసి దగ్గరికి వెళతావు
నెమ్మదిగా నిద్రలోంచి లేస్తు న్నావ్" అన్నాడు.

వెంకట్ కళ్ళు తెరవటాన్నీ - మామూలుగా మారి, ఎదురింటివైపు నడవటాన్నీ నిస్సహాయంగా చూస్తూ


వుండిపోయాడు జయదేవ్. వెంకట్ విషయం శ్రీధర్ కిగానీ, శారదకిగానీ ముందే చెప్పివుంటే యెంత
బావుండేది.

గడియారం పదిన్నర కొట్టింది.

ఇంకో అరగంటే........వెంకట్ ని ఆపుచెయ్యటానికి...ఇంకో అర గంట టై మ్ వుంది.

పిళ్ళై నవ్వుతూ జయదేవ్ వైపు చూసి బయట కెళ్ళి కుండతో వచ్చేడు. కుండనిండా నీళ్ళున్నాయి. "ఇరవై
నాలుగురీతుల్లో నిన్ను చంపుతానన్నానుకదా. ఇదే ఇరవయ్ నాలుగో విధానం. పదకొండు సంవత్సరాలక్రితం
టప్ టప్ మనే నీటి చుక్కల్తో నన్ను పిచ్చెక్కించావు జయదేవ్ ఇప్పుడు అంతకన్నా అద్బుతంగా నిన్ను
చంపుతాను చూడు, ఈ నీటితోనే....." ఫాన్ కి కుండని కడుతూ అన్నాడు. జయదేవ్ కి అతడు
అనుసరించబోయే పద్దతి అర్ధంకాలేదు. ఈ లోపులో పిళ్ళై కార్లోంచి ఒక నాపరాయిలాంటి రాతిని
తీసుకొచ్చేడు. ఇంటి గచ్చుకి వేసుకొనే పలకల రాయిలా వుంది అది. నీటి కుండకీ, జయదేవ్ తలకీ మధయ్
గొడుగులా తాళ్ళతో ఆ రాతిని అమర్చేడు.
తాపీగా వెళ్ళి ఎదుటి కుర్చీలో కూర్చొని సిగార్ వెలిగించేడు.

పైనుంచి నీటిచుక్క రాతిమీద పడి పక్కకి జారిపోయింది. టప్ మన్న చప్పుడు కూడా లేదు. గది అంతా
నిశ్శబ్దంగా వుంది. ఏం జరగబోతోందో జయదేవ్ కి అర్ధం కావటంలేదు. మరో చుక్క రాతిమీద పడింది.

తన తలమీద ఏం జరుగుతూంది?

* * *
"గుడ్ ఈవెనింగ్, రండి" శ్రీధర్ ఆహ్వానించేడు వెంకట్ ని. ఆ సమయంలో సైక్రియాటిస్ట్ కూడా దగ్గిర వుండటం
మంచిదనిపించింది. వెంకట్ కూడా విష్ చేసి కూర్చొంటూ, "ఏమిటి అందరూ మెలకువగా వున్నారు" అని
అడిగేడు. శారద మాట మారుస్తూ "కొంచెం టీ ఇమ్మంటారా?" అంది.

"తప్పకుండా"

శారద లోపలికి వెళ్ళింది.

తులసిని కాటు వేయబోయే త్రాచుపాము తమ ప్రక్కలోకే వచ్చిందని శ్రీధర్ కి అబ్రకదబ్రకి తెలీదు.

పదకొండు అవటానికి సరీగ్గా ఒక నిముషం వుంది.

"ఏమిటిది? రివాల్వర్ పక్కన పెట్టు కుని కూర్చొన్నారు?" అంటూ వెంకట్ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

శ్రీధర్ నవ్వి "ఏం లేదు -వూరికినే" అన్నాడు.

* * *
ఆ రాత్రి ప్రపంచానికి ఆకరు రాత్రా అన్నట్టు శ్మశానం భయంకరంగా వుంది. తిమింగలం తోకతో కొట్టినట్టు
గాలికి చెట్లు వూగుతున్నాయి. ఆకాశంలో ఎక్కడా చిన్నసందు లేకుండా మేఘాలు దట్టంగా పట్టేయి. ఇంకా
వర్షం మొదలవలేదు. కానీ తొందర్లో మొదలవబోయే కుంభవృష్టి తన ప్రతాపాన్ని ముందే చూపిస్తుంది!

శ్మశానంలోకి ప్రవేశించబోతూ దార్కా ఒక క్షణం చూసేడు. ఎదుటి సైన్యాన్ని పరిశీలించి, అంనావేసుకునే


రాజులా వున్నాడు అతడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించబోయే అభిమన్యుడిలా వున్నాడు.

ముందు అతడు ప్రధమ గురువైన విషాచిని ప్రార్ధించాడు. తమ మితృవులైన క్షుద్రశక్తు లకు ఎదురు
తిరిగినందుకు తనమీద పగ తీర్చుకోవద్దన్న ప్రార్ధన అది. ప్రతిజ్ఞ నెరవేర్చనందుకు తనను క్షమించమని వేడికోలు
అది.

ఆ తరువాత అతడు తనని మనిషిగా మార్చిన ఆచార్యుల వారిని ప్రార్ధించాడు. "ఓ నా గురువా! నీ ఆజ్ఞ
ననుసరించి నేను ఈ శక్తిని ఎదుర్కొంటున్నాను. మానవత్వం , మంచితనం అనే నువ్విచ్చిన ఆయుధాలు తప్ప
నా వద్ద ఇంకేం లేవు. ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన కాష్మోరాని ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించు.
ఇంతకాలం ఈ శక్తు లు నాకు సాయంచేస్తూ వచ్చేయి. ఈ రోజు ఒక మంచి కార్యం కోసం వాటితో
పోరాడబోతున్నాను. నాకు నీ ఆశీర్వాదం ఆత్మస్థయిర్యాన్ని కలిగించు......"

అతడిని ఆశీర్వదిస్తు న్నట్టూ వినీలాకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ మహత్కార్యానికి ఆహ్వానిస్తు న్నట్టూ


చెట్లు చేతులు సాచేయి.

అతడు శ్మశానంలో అడుగుపెట్టా డు.

ఉరుములకి భయపడి ఎక్కణ్నుంచో ఒక తీతువు వికృతంగా అరుస్తూంది.

* * *
"ఇలా ఎంతసేపు కూర్చోవాలి?" జయదేవ్ అసహనంగా అడిగాడు..... అతడి చేతులు వెనక్కి కట్టబడి
వుండటంవల్ల తిమ్మిర్లెక్కినయ్.

"పన్నెండింటి వరకూ" నవ్వేడు పిళ్ళై "....ఇంకో రకంగా చెప్పాలంటే నీ మరణం వరకూ"

జయదేవ్ కి అర్ధంకాలేదు. ఇంకో అరగంటలో తన మరణం ఈ నీటి చుక్కల్తో ఎలా సంభవిస్తుంది? అసలు
పైన అవి పడ్తు న్నాయోలేదో కూడా తెలియటం లేదు.

అతడు తలపైకెత్తి చూడలేదు. చూసి వుంటే రాతిమీద పడిన నీటి చుక్కలు క్రిందికి జారటం లేదనీ, ఆ
రాయిమీదే అదృశ్యమవుతున్నాయనీ తెలిసి వుండేది. అంతేకాదు. ఆ రాయి నెమ్మదిగా వంగటం కూడా
గమనించి వుండేవాడు.

పిళ్ళై ఆరిపోయిన సిగార్ వెలిగించుకుంటూ వుండగా బయట గేటు తీస్తు న్న చప్పుడు అయింది. పిళ్ళై
ఉలిక్కిపడుతూ కిటికీలోంచి చూసేడు. పండిత్ లోపలికి వస్తు న్నాడు. జయదేవ్ నుంచి ఏ కబురూ రాకపోవటం
చూసి, అతడే బయల్దేరాడు.

పిళ్ళై చివుక్కున లేచి గుమ్మం పక్కన నిలబడ్డా డు. జయదేవ్ మనసులోనే అనుకుంటున్నాడు. "రాకు
పండిత్, రాకు అలాగే వెళ్ళిపో - లోపలికి రాకు........"

గట్టిగా అరుద్దా మంటే పిళ్ళై చేతిలో ఆయుధం వుంది. వస్తూన్న పండిత్ కి లోపలి సంగతులేమీ తెలియవు.
ఏదో ఆలోచిస్తూ లోపలికి వస్తు న్నాడు.

* * *
"ఎంతయింది టై మ్?" వెంకట్ అడిగేడు.

"పదకొండూ అయిదు" అన్నాడు శ్రీధర్ రిస్టు వాచి చూస్తూ. గోడ గడియారం మాత్రం పదకొండుకి ఒక్క
నిముషం వున్నట్టు చూపిస్తూంది.

అంతా నిశ్శబ్దంగా వుంది. బయట మెరుపు మెరిసినప్పుడల్లా బయటి వరండా అంతా వెలుగుతో
నిండిపోతూంది. దూరంగా ఉరిమిన శబ్దం ఆ రాత్రి కాళరాత్రిగా మారబోతున్నట్టూంది.

"మీ మామగారి విషయం ఏమైనా తెలిసిందా?" నిశ్శబ్దా న్ని బంగపరుస్తూ అడిగేడు శ్రీధర్. లేదు అన్నాడు
అబ్రకదబ్ర. "సంతోషించాలో, విచారించాలో తెలియని పరిస్థితి........"

మళ్ళీ గదిలో నిశ్శబ్దం పేరుకుంది. ముగ్గురూ మౌనంగా గది బయట చీకటిని చూస్తూ కూర్చున్నారు.
మృత్యువు ఒక్కో అడుగే ముందు కేస్తు న్నట్టు వుంది. కాలం గడుస్తు న్న కొద్దీ............ అసహనంతో శ్రీధర్
కదిలేడు. ఈ నిశ్శబ్దా న్ని అతడు భరించలేకపోతున్నాడు. ఏం జరగదేం అనుకుంటున్నాడు.

శారద తులసి పక్కనే కూర్చొని వుంది. దీర్ఘమైన మూర్చలో వున్నట్టూ తులసి పడుకొని వుంది. ఆమె
మొహం తేటగా వుంది. వేల సంవత్సరాల నుంచీ లోపనసాయంతో భద్రపరచబడిన మమ్మీ శరీరపు
నునుపుదనం, మొహంలో నిర్మలత్వం ఆమెలో కనబడుతున్నాయ్.

బయట శ్రీధర్ ఏమీ తోచక రీడింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. రాక్ ముందు నిల్చుని పుస్తకాన్ని పరీక్షగా చూసేడు.
నవలలు ఫిక్షను వేదాంతానికి సంబంధించినవి....... ఇంజనీరింగ్ పుస్తకాలు....... అతడు చేతికి అందిన
పుస్తకాన్నొకదాన్ని తీసుకొని ముందు గదిలోకి వచ్చాడు. అబ్రకదబ్ర పక్కనే వున్న కుర్చీలో కూర్చొని పుస్తకం
తీసేడు. స్ట్రక్చురల్ ఇంజనీరింగ్ మీద పుస్తకం అది. విసుగుతో మూసేస్టూంటే పుస్తకంలోంచి జారింది కవరు -
పైన "శ్రీధర్" అని వ్రాసి వుంది. ఉత్సుకతతో దాన్ని చింపేడు. చదువుతూంటే ఆవేశంతో అతని మొహం
ఎర్రబడింది.

"డియర్ శ్రీధర్ -

మీ హితాభిలాషుల్లో నేనొకణ్ని. బిస్తా నుంచి దార్కా అనే మంత్రగాడు....... తులసి మీద కాష్మోరా
ప్రయోగించటానికి..... వచ్చాడు. శ్మశానానికి వెళితే....... అక్కడ క్షుద్రదేవతల్ని ఆవాహనచేస్తూ ఆ మంత్రగాడు
కనబడ్తా డు..........

......సి.శ్రీ.రి."
ముక్కుపుటాలు అదురుతూ వుంటే "శారదా" అని కేక పెట్టా డు శ్రీధర్. ఆ అరుపుకి భవంతే
కదిలిపోయింది. శారద ఉలిక్కిపడి గదిలోంచి బయటకొచ్చింది.

"ఈ ఉత్తరం ఎప్పుడొచ్చింది?"

ఆమె తడబడి - "చాలా కాలమయింది. మీరు ఎలాగూ వచ్చేస్తు న్నారు కదా అని పంపలేదు. తరువాత........
తరువాత...... మర్చిపోయేను" అంది. అతి కష్టంమీద అతడు తన ఆవేశాన్ని అణుచుకున్నాడు. ఆచూపుకి
శారద వణికిపోయింది. అతడు మరి ఆలశ్యం చేయ్యలేదు. బ్రాహ్మిణ్ వైపు తిరిగి .".......పద" అన్నాడు.

"ఎక్కడికి?"

అతడికి ఉత్తరం ఇస్తూ "-శ్మశానానికి-" అన్నాడు.

శారద ఆందోళనతో "ఏమిటండీ ఇదంతా?" అంది. అతడు ఆమెని పట్టించుకోలేదు. ఈ లోపులో అబ్రకదబ్ర
ఉత్తరం చదివేడు. పదకొండు సంవత్సరాల క్రితం తమ ప్రయాణం జ్ఞాపకం వచ్చింది. కాద్రా జ్ఞాపకం
వచ్చేడు......దార్కా జ్ఞాపకం వచ్చేడు.... అతడు తనని కొట్టటం.... అతడి ఒంటికున్న - పగ- అన్నీ జ్ఞాపకం
వచ్చాయి.

శ్రీధర్ ఇంటి లోపలికి, పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ చీకటిగా వుంది. విరిగిపోయిన సామాన్లూ........పాత
కుర్చీలు, అన్నిటినీ అటూ ఇటూ పడేస్తూ తొందర తొందరగా వెదకసాగేడు. పెద్ద చప్పుడుతో బీరువా పక్కకి
పడిపోయింది. అతడు దాన్ని పట్టించుకోలేదు. అతడో పాతపెట్టె కోసం వెతుకుతున్నాడు. ఫకీరు
మంత్రోబద్దంగా మూతవేసి భద్రపరచిన పెట్టె అది. శ్రీధర్ కు ఇప్పుడు అర్ధమయింది. ఫకీరు దాన్ని పదకొండు
సంవత్సరాలపాటూ ఎందుకు దాచి వుంచమన్నాడో! గదిలో ఒక మూల, చెక్క సామాన్ల కింద దొరికింది అది.
అతడి నుదురంతా చెమటపట్టింది. వణుకుతున్న చేతుల్తో మూత తెరిచేడు. పెట్టెమధ్యలో అడ్డంగా
పడుకోబెట్టబడి వుంది -ఓ కర్ర........బీజాక్షరాలు వ్రాసింది..... పదకొండు సంవత్సరాల క్రితం కాద్రాని చంపింది.
అతడు దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

- అబ్రకదబ్ర ఉత్తరం మడిచి బల్లమీద పెట్టా డు. పెడ్తుంటే పక్కన కనబడింది రివాల్వర్. సైలెన్సరున్నది.
ఎవరూ గమనించకుండా దాన్ని తీసి లోపల పెట్టు కున్నాడు. తనే.........తనే........చంపాలి దార్కాని! ఇంకొకరికి
అవకాశం ఇవ్వకూడదు..... అతడు నిశ్శబ్దంగా బయటకొచ్చేడు.

శ్రీధర్ కారు ఎక్కుతున్నాడు. పక్కడోర్ తీసి, అతడూ కూర్చున్నాడు. శ్రీధర్ పక్కనే రాతి గదలాంటి కర్ర
వున్నది.

కారు కదులుతూంటే శారద పరుగెత్తు కొచ్చింది.


"ఏవండీ...... ఎక్కడికి వెళుతున్నారండీ.......ఈ అర్ధరాత్రి పూట అమ్మాయినిలా వదిలేసి......." శారద
మాటలు కారు శబ్దంలో కలిసిపోయినయ్! ఆమె స్థా ణువై నిలబడిపోయింది.

ఇంత గొడవ జరుగుతున్నా పట్టించుకోకుండా కూర్చొని వున్నాడు వెంకట్. అతడు చాలా నిశ్శబ్దంగా,
మౌనంగా, ప్రేక్షకుడిలా జరిగేదంతా చూస్తు న్నాడు.

సమయం పదకొండూ పది అయింది. గోడ గడియారం మాత్రం ఇంకా పదకొండు గంటలు కొట్టలేదు.
నిముషం తక్కువ పదకొండే చూపిస్తూంది అది.

* * *
"గడియారం పదకొండు గంటలు కొట్టగానే వెంకట్ మెదడు నా సూచనలు అమలు చెయ్యటం
ప్రారంభిస్తుంది. అదే ఆపరేషన్ సిక్స్.........." అంటూ నవ్వాడు పిళ్ళయ్.

పండిత్, జయదేవ్ మొహమొహాలు చూసుకున్నారు. ఇద్దరూ చెరో కుర్చీలోనూ బంధించబడి వున్నారు.

"ఏమిటి ఆపరేషన్ సిక్స్?" జయదేవ్ అడిగేడు.

"అది తెలుసుకోవటమే నీ జీవితపు ఆఖరి కోరికా? అయితే విను ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు - మీ
భాషలో చెప్పాలంటే కాష్మోరా నిద్రలేచే సమయానికి - తులసి శ్మశానం ప్రవేశిస్తుంది. శ్మశానంలో పాడుపడిన
బావిలో దూకుతుంది... అలా దూకటంవల్ల తనకి అబార్షన్ అయిపోతుందనీ- తను మామూలు మనిషి
అయిపోతాననీ - ఆమెకు బలమైన అభిప్రాయం కలుగచేస్తా డు వెంకట్. గడియారం పదకొండు కొట్టగానే
వెంకట్ తన పని ప్రారంభిస్తా డు. అయితే దురదృష్టవశాత్తూ ఆ బావి చాలా లోతైనది. దూకిన వెంటనే తులసి
ప్రాణం పోతుంది. ప్రపంచం మాత్రం అది కాష్మోరా పనే అనుకుంటుంది"

శ్రోతలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.

శ్రీనివాసపిళ్ళయ్ కాష్మోరా కన్నా ఏ విధంగా తక్కువ భయంకరమైనవాడు......? అనుకున్నాడు జయదేవ్.

ఆపరేషన్ సిక్స్ గురించి తల్చుకుంటేనే అతడి వళ్లు జలదరించింది. ఎలా దాన్ని ఆపుచెయ్యటం -? ఇంతలో
"మైగాడ్!" అన్నశబ్దం విని - అతడు పండిత్ వైపుచూసి, పండిత్ మొహం వివర్ణమయి వుండటం గమనించి .
తనూ తల పైకెత్తి చూశాడు. వెన్నులోంచి ఒక్కసారిగా చలి పుట్టింది.

తలమీద రాయి, కట్టినప్పుడు కంటే దాదాపు రెట్టింపు అయింది. అంతేకాదు -నీరు పడినకొద్దీ
వ్యాకోచిస్తూంది. నిప్పులో కరిగిన రబ్బరు వ్యాకోచించినట్టూ అది సాగి నెమ్మదిగా కిందికి దిగుతూంది -తలకి
అంగుళం దూరంలోకి వచ్చేసింది.
జయదేవ్ శరీరం భయంతో వణకటం చూసి, పిళ్ళయ్ నవ్వాడు "ఇరవయ్ నాలుగో విధానం ఇది జయదేవ్.
దీన్నించి తప్పించుకోలేవు!" అని లేచేడు. అతడి పెదవులమీద నవ్వు అలాగే వుంది. ఫోన్ దగ్గరికి వెళ్ళి డయల్
చేయటం ప్రారంభించాడు.

* * *
రాత్రి పన్నెండింటికి తన ఫోన్ మోగటం చూసి లాయర్ విద్యాపతి విసుక్కుంటూ ఫోన్ అందుకున్నాడు.
కానీ ఫోన్ లో సంభాషమ మొదలయిన రెండు నిముషాలకల్లా అతడి మొహంలో భావాలు మారిపోయాయి.

"......నిజమా" అన్నాడు కంపిస్తు న్న కంఠంతో.

"అవును లాయర్. మీరు అన్ని వైపులనుంచీ ఆలోచించండి. ఏరోప్లెన్ ని కాల్చేసింది అతడి దృష్టే. మీ
మనవరాల్ని చంపిందీ అతడిచూపే. అతడేగానీ కొంచెం ఎక్కువసేపు చూసివుంటే మీ మనవరాలు భస్మం
అయిపోయి వుండేది. అలా అయితే అందరికీ అనుమానం వస్తుందని అతడు క్షణంకన్నా ఎక్కువ చూడలేదు.
లేసర్ మీ పాప గుండెల్లోంచి దూసుకుపోయింది."

"ఎక్కడున్నాడు అతడిప్పుడు?"

"కోటపక్క శ్మశానంలో.......తన తోటి మంత్రగాడు కాద్రాని చంపిన మీ ముగ్గురిమీద పగ


తీర్చుకునేటందుకు ఆవాహన చేస్తూ......"

విద్యాపతి ఫోన్ పెట్టేసేడు. ఒక్కక్షణం నిశ్శబ్దంగా నిలబడ్డా డు. ఇంట్లో అంతా నిద్రపోతున్నారు. అతడు
ఇనుపపెట్టె తెరిచి చిన్నబాక్స్ బయటకు తీశాడు. విదేశాల్నుంచి వస్తూ ఎవరో స్నేహితుడు తెచ్చిందది పైకి
మామూలు బాక్స్ లాగే కనబడుతుంది అది. కానీ, బాగా డబ్బున్న వాళ్ళూ........పేరు ప్రఖ్యాతలు
సంపాదించినవాళ్ళూ శతృవుల బారినుంచి తప్పించుకోవటానికి సాయపడే మారణాయుధం. 500 వోల్ట్స్
కరెంట్ ఎమినేటింగ్ డివైస్! రివాల్వర్ కన్నా చాలా సులభంగా ఉపయోగించదగింది.

* * *
"నాకు భయంగా వుంది వీళ్ళెక్కడికి వెళ్ళారు?" వణికే కంఠంతో అంది శారద. భయట మొదలయిన ప్రకృతి
విలయతాండవాన్ని చూసి.

"ఏమీ భయంలేదమ్మా, నేనున్నానుగా!" శారద ముఖం భయంతో పాలిపోయింది. ఏం జరగబోతూంది


అరగంటలో? కాష్మోరా ఎంత భయంకరంగా తన కూతుర్ని పీక్కు తినబోతుంది? తను ప్రత్యేకసాక్షిగా
మిగిలిపోతుందా? ఆ దృశ్యాన్ని చూసి బ్రతగ్గలదా?

ఎదురింటిలోనుంచి ఇటువైపే చూస్తు న్న పిళ్ళై అయోమయంలో పడ్డా డు. ఎంతసేపటికీ తులసి ఇంట్లోనుంచి
బయటకు రావటంలేదు. వెంకట్ జాడేలేదు.

జయదేవ్, పండిత్ లకి కూడా అక్కడ శ్రీధర్ ఇంట్లో ఏం జరుగుతుందో అర్ధం కావడంలేదు. శ్రీధర్ కారు
కాంపౌండులోంచి బయటకు దూసుకురావటం వారు చూసేరు. కూతుర్ని అలా ప్రాణాపాయస్థితిలో వెంక్ కి
వదిలేసి, అతడు 'ఎక్కడికో' వెళ్లిపోవటం చూసి జయదేవ్ మనసులో విసుక్కున్నాడు కూడా.

గడియారం పదకొండున్నర అయినట్లు "టంగ్"మని గంట కొట్టింది.

అప్పుడొచ్చింది పిళ్ళైకి అనుమానం!

ఇంకా ఇంట్లోంచి తులసి బయటకు రాకపోవటం చూసి అతడి ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపించింది.
అతడి ముఖంలో అలజడిని ఇద్దరూ గ్రహించారు.

జయదేవ్ ఈ సంఘటనని ఉపయోగించదల్చుకున్నాడు. ".......నీ ప్లా ను ఎక్కడో పాడయిపోయింది.


పిళ్ళై" అన్నాడు. పిళ్ళై కోపంగా, కసిగా, అతడివైపు చూసేడు. జయదేవ్ నవ్వి "నేనూ దార్కా కలిసి వెంకట్
మెదడును సరిచేసేం" అని చీకట్లో ఒక బాణం విసిరి చూసేడు. పిళ్ళై నిలబడి "అసంభవం" అన్నాడు.
జయదేవ్ నవ్వి వూరుకున్నాడు. నిముషం గడిచేసరికి పిళ్ళైలో అనుమానం పెరిగింది. ఒక నిర్ణయానికి
వచ్చినట్టు లేచి నిలబడి 'గుడ్ బై' అన్నాడు.

"........ఇక్కడ వుండి నేను చేసేది ఏమీలేదు. వెళ్ళి తులసి మరణాన్ని చూస్తా ను" అంటూ వెళ్ళబోయి ఆగి,
"అరవటానికి ప్రయత్నం చెయ్యకండి. ఈ అర్ధరాత్రి మీకు సాయం ఎవరూ రారు. బయటికి వినిపించదు కూడా
-" అని ముందు గదిలోకి వచ్చి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేడు. పండిత్ గానీ డేక్కుంటూ కుర్చీతో సహా వెళ్ళి,
ఫ్యాన్ స్విచ్ వేస్తే దానికి కట్టిన నీటికుండ క్రింద పడిపోకుండా అతి తెలివితో చేసిన పని అది. అదే అతడు తన
జీవితంలో చేసిన ఆఖరితప్పు.

పిళ్ళై వెళ్ళిపోగానే ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. జయదేవ్ తలమీద వ్యాకోచిస్తు న్న రాయి నుదుటి
మీదుగా క్రిందకు దిగుతూంది. అతడికి బరువు తెలుస్తూంది. అయితే మరణం బరువువల్ల సంభవించదు.
ఇంకో అయిదు నిమిషాల్లో అది ముక్కుమీదుగా కిందకి దిగుతుంది. నీటిచుక్కలు పడడం ఆగగానే అది గట్టి
పడుతుంది. శిల అయిపోతుంది. పోతపోసిన శిలా విగ్రహం అయిపోతాడు అతడు. పిళ్ళై చెప్పి నట్టు చాలా
దారుణమైన మరణం అది - రాయి మధ్యలో శరీరం కుదించుకుపోవటం.....

"ఏమిటీ రాయి" అని అడిగేడు పండిత్ ని.

"మౌంట్ మోరీలైట్ అనే క్లే ఖనిజం అది. నీరు పడేకొద్దీ దానికి వ్యాకోచించే గుణం వుంది. దాన్నే ప్లేక్సోటాపిక్
స్వభావం అంటారు. ఆ మాత్రం రాయి, నీరు పడుతున్నకొద్దీ వ్యాకోచించి వ్యాకోచించి ఈ గదిలో సగభాగాన్ని
ఆక్రమించుకొన్నా ఆశ్చర్యపడక్కర్లేదు -"

జయదేవ్ మాట్లా డలేదు. కళ్ళు మూసుకొని, మరణానికి ఆయత్తమవుతూ ఆఖరిసారి అనుకొన్నాడు.


"సైన్సు..... డామిట్ సైన్సు."

దూరంగా మాటలు వినిపించటంతో పండితో తలతిప్పి కిటికీలోంచి ఎదురింటివైపు చూసేడు. పిళ్ళై గోడ
పక్కగా నిలబడి వున్నాడు. అతడి చేతిలో పెద్ద పళ్ళెం వుంది. కర్రతో దాన్ని కొట్టి గంటల శబ్దం చేస్తు న్నాడు
అతడు.

హాస్యాస్పదమూ, అసంబద్దమూ అయిన ఆ చర్య పండిత్ కి నవ్వు పట్టించలేదు. "పళ్ళై- నేను జీవితంలో
చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు, నీ మెదడుని కంప్యూటరైజ్ చేయటం" అనుకొన్నాడు.

పళ్ళెంమీద కొట్టిన పదకొండు గంటల శబ్దం వినిపించగానే, వెంకట్ అసంకల్పితంగా కళ్ళు మూసుకున్నాడు.
అతడి మెదడులో ఎక్కడో, ఏదో కదుల్తు న్నట్టుంది. అరనిముషం తర్వాత కళ్ళు తెరచి, శారద తో, "కొంచెం
మంచి నీళ్ళిప్పిస్తా రా" అన్నాడు.

శారద అమాయకంగా డైనింగ్ రూమ్ లోకి వెళ్ళింది. ఆమె అలా లోపలికి వెళ్ళగానే అతడు చప్పున బయట
తలుపు గొళ్ళెం పెట్టా డు. ఆ శబ్దా నికి వెనుదిరిగిన శారద నిర్విణ్నురాలైంది. తను అంతవరకూ నమ్మిన వెంకట్
అలా చేస్తా డని ఆమె కలలోకూడా వూహించలేదు.

"ఏ మాత్రం గొడవ చేసినా తులసి మీకు దక్కదు" అన్నాడు వెంకట్. కిటికీలోంచి అతడిని చూసిన శారద
ఉలిక్కిపడింది. అతడి మొహం పాలిపోయి వుంది. కళ్ళు సగం మూతపడి వున్నాయి. నిద్రలో వున్నవాడిలా
తూలుకుంటూ తులసి గదిలోకి ప్రవేశించాడు.

తులసి పక్కనే మోకాళ్ళమీద కూర్చొని ఆమెకి సూచన లివ్వటం ప్రారంభించేడు...... ఆపరేషన్ సిక్స్!

- పన్నెండు అవటానికి పదినిమిషాలుంది. అయిదు నిమిషాల్లో వెంకట్ సూచన పూర్తయింది. తులసి


నిద్రలోనే ఎవరో పిలుస్తు న్నట్టు లేచింది. వెంకట్ తో పాటు బయటికి నడిచింది. లోపల వంటింట్లో
నిస్సహాయంగా, శారద తలని తలుపుకేసి టపటపా కొట్టు కుంటూంది.

* * *
"గుడ్ బై పండిత్........ "అన్నాడు జయదేవ్. అతడికి వూపిరి సరిగ్గా ఆడటంలేదు. రాయి మరింత క్రిందికి
దిగింది. పండిత్ అతని వైపు నిస్సహాయంగా చూసేడు. ఎలా........ఎలా......అతడిని రక్షించటం? ప్రపంచం ఒక
మంచి హిప్నోధెరపిస్ట్ ని కోల్పోతూంది. చాలా దారుణమైన మరణం సంభవించబోతూంది. పండిత్ కి దుఃఖం
వచ్చింది. జయదేవ్ తో అతడికి ఎక్కువ పరిచయం లేదు. కానీ అతడి మంచితనం వ్యక్తిత్వం ఎవర్నయినా
అతడికి దగ్గిర చేస్తా యి.

అతడితో పరిచయం అతడి దగ్గిరకి తను ఇంపోటెంట్ నని వంక పెట్టు కుని వెళ్ళటం..... తనను జయదేవ్
హిప్నటై జ్ చేసి.......
........చటుక్కున అతడి మెదడులో ఏదో మెదిలినట్టయింది.

హిప్నటై జ్!

"జయదేవ్!" అన్నాడు. జయదేవ్ కళ్ళు తెరిచాడు. కానీ కళ్ళు ముందు ఆ పాటికే రాయి దిగిపోయింది.
పాముపుట్టలా కనబడ్తూంది అది. పండిత్ మళ్ళీ ఇంకోసారి పిలిచాడు.

"ఊఁ?"

"మీరు నన్ను హిప్నోసిస్ లోకి తీసుకెళ్ళండి" దాదాపుగా అరిచేడు పండిత్!" అంత భయంకరమైన
స్థితిలోనూ నవ్వొచ్చింది జయదేవ్ కి.

"ఎందుకు" అన్నాడు.

"ఈ తాళ్ళు తెంచుకోవటానికి......కావల్సిన బలం రావటం కోసం....."

జయదేవ్ కి ఒక క్షణం పండిత్ ఏమంటున్నాడో అర్ధంకాలేదు. అర్ధమయ్యేక 'ఇది సంభవమేనా' అని


విస్తు బోయేడు. ఎందుకు సంభవం కాదు? అనిపించింది. హిప్నోసిస్ లో మనిషి శరీరం ఉక్కులా మారుతుంది.
సెన్సెస్ కాన్ సంట్రేట్ కాబడ్తా యి. ప్రొఫెసర్ బోరెల్లీ దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వ్రాసిన ఫిజిక్సు
అద్యాయం గుర్తు వచ్చింది. ఒక మనిషి పది కిలోగ్రాముల బరువు ఎత్తగలడనుకుంటే, చేతికీలు తులాదండంలా
పనిచేయాలి. కాబట్టి దాని పైనున్న కండరం, (దీనిని ద్విశిరస్కకండరం అంటారు) దాదాపు ఎనిమిదిరెట్లు
ఎక్కువ బలంతో పనిచేస్తుంది. అంటే ప్రతి మనిషీ "తనకుందీ" అనుకున్న బలంకన్నా దాదాపు ఎనిమిది రెట్లు
ఎక్కువ బలం వున్న కండరాన్ని తనకి తెలియకుండానే తన శరీరంలో కలిగివున్నాడు. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు
మూడు శతాబ్దా ల క్రిందే కనుక్కున్నారు.

"టై మ్ లేదు" అన్నాడు హీనమైన కంఠంతో జయదేవ్. రాయి అతడి నోటి మీదకు జారుకుంది.

"ఫర్లేదు ప్రొఫెసర్ నా మెదడు కంఠానికి ససెప్టబుల్"

జయదేవ్ తల బాగా వెనక్కి వాల్చేడు. రాయికి నోటికీ మధ్య ఖాళీ సందు ఏర్పడింది. కానీ అది ఎంతోసేపు
వుండదని తెలుసు. అతడు సూచనలు ఇవ్వడం ప్రారంభించేడు.

"........నువ్వు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నావు. (రిపీట్) నీ చేతులు గట్టిగా, ఉక్కులా


మారుతాయి..... నీ చేతులకున్న తాళ్ళని తెంచటానికి ప్రయత్నించేకొద్దీ నువ్వు మరింత నిద్రలోకి వెళతావు. నీ
చెయ్యి తిమ్మిరెక్కుతుంది. నీకు మరింత హాయిగా వుంటుంది. చేతి తాడు తెగిపోగానే........."
రాయి నోటికి దగ్గిరగా వచ్చేసింది. ఆఖరి సూచన పూర్తిచెయ్యక పోతే కొంప మునిగిపోతుంది. గొంతు పగిలేలా
అరిచేడు. అది బైటికి మామూలుగా, ఎక్కడో దూరంనుంచి వస్తూన్న కంఠధ్వనిలా వినబడింది. "చేతి తాడు
తెగిపోగానే నువ్వు నిద్రలోంచి మేల్కొంటావ్...... స్లీప్........స్లీ.....ప్......." అంటూండగానే రాయి అతడిని
పూర్తిగా కమ్మేసింది.

పండిత్ తల నెమ్మదిగా వెనక్కి వాలిపోయింది. నిముషం తర్వాత అతడిలో కదలిక మొదలైంది. చేతులు
ఇంజన్ పిస్టన్ కదిలినట్టు కదలసాగేయి. కొంచెం సేపటికి వాటి వేగం ఉధృతమైంది . ఛర్మ చిట్లి రక్తం
కారసాగింది. అయినా అతడికి ఆ బాధ తెలియటంలేదు. నిద్రలోనే చేతుల్ని బలంగా కదిలిస్తు న్నాడు. జయదేవ్
కి ఏమీ కనబడటంలేదు. చప్పుడు కూడా వినబడటంలేదు. అప్పటికే రాయి పూర్తిగా అతడిని ఆక్రమించుకొని
క్రిందకు జారిపోతూంది. మరణానికి నిముషాలు లెక్క పెట్టు కుంటున్నాడు అతడు. పండిత్ చేతుల్నించి రక్తం
ధారాపాతంగా కారుతుంది. మామూలు స్థితిలో అయితే ఈ పాటికి ఆ బాధ వోర్చుకోలేకా, ఆ రక్తం చూసీ
అతడు స్పృహ తప్పేవాడే కానీ ట్రాన్స్ లో ఏదీ తెలియటంలేదు అతడికి. విపరీతమయిన బలంతో చేతుల్ని
రాస్తు న్నాడు. పొరలు పొరలుగా తాడు తెగిపోతూంది. సమయం పన్నెండు అవుతూంది. "టప్" మన్న
చప్పుడు తాడు తెగిపోయింది. అది తెగిపోగానే నిద్రలోంచి చప్పున మేల్కొన్నాడు పండిత్. చేతులవేపు
చూసుకొని, వళ్ళు జలదరించి చప్పున కళ్ళు మూసుకున్నాడు. ఎర్రటి మాంసం భయంకరంగా
కనబడుతూంది. అరనిమిషంలో అతడు మామూలు మనిషి అయ్యాడు. మిగతా కట్లు విప్పుకొని, తొందరగా
జయదేవ్ దగ్గరికి పరుగెత్తా డు. అతడికి ఇప్పుడిప్పుడే బాధ తెలుస్తూంది. చేతులు తిమ్మిరి తగ్గి మామూలుగా
అవుతున్నాయి.

జయదేవ్ స్పృహతప్పి వున్నాడు. పండిత్ రాతిని చేతుల్తో చిన్నాబిన్నం చేసేడు. అప్పుడప్పుడే అది
గట్టిపడుతూంది. జయదేవ్ తలని చేతుల్తో అటూ - ఇటూ వేగంగా కదిపేడు. బలహీనంగా కళ్ళు తెరిచేడు
జయదేవ్.......

"క్విక్......... టై మ్ లేదు" అంటూ పండిత్ బయటకు పరుగెత్తా డు వెనకే జయదేవ్........

పన్నెండవడానికి మూడు నిముషాలుంది.

రోడ్డు కి అడ్డంగా పరుగెత్తి ఎదురింట్లో ప్రవేశించారు యిద్దరూ. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. ఇద్దరూ
మొహమొహాలు చూసుకున్నారు. అంతలో వంటింట్లోంచి శారద అలికిడి వినిపించింది. తలుపు తీయగానే
శారద జరిగినదంతా చెప్పింది. అతనికి బల్లమీద ఉత్తరం కనబడింది.

ఉత్తరం చదువుతూంటే జయదేవ్ నుదుటిమీద చెమటపట్టింది. వాచీ చూసుకున్నాడు పన్నెండవటానికి


ఇంకా ఒక నిముషం వుంది. గాలికన్నా వేగంగా పరుగెత్తి కారువద్దకు చేరుకున్నాడు.

ఆపరేషన్ సిక్స్ పూర్తికాకూడదు. అదొక్కటే ధ్యేయం. కారు కదలబోతుంటే పండిత్ కూడా అదే వేగంతో
వచ్చి డోర్ తెరిచి కూర్చున్నాడు. కారు దూసుకుపోయింది.
పన్నెండవటానికి మూడు సెకన్లుంది.

33
ఆకాశమంతా తారు పులిమినట్టుంది. ఏ క్షణమైనా వర్షం మొదలయ్యేలా వుంది. పూర్తవబోయే క్రతువులో
తమ భాగం కోసం క్షుద్ర దేవతలు ఎదురు చూస్తు న్నట్లు - ప్రళయం ముందు ప్రశాంతత అక్కడ అలుముకొని
వుంది.

శ్రీధర్ నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఆగింది. ఇరువైపులా డోర్లు తెరుచుకున్నాయి. ఇద్దరూ ఆకలిగొన్న
సింహాల్లా దిగేరు. ముందే నిశ్చయించుకొన్నట్టూ యిద్దరూ చెరోవైపుకి వెళ్ళారు. చాలా
చురుగ్గా.......వేగంగా......

దూరంగా కోట తాలూకు నల్లటి ఆకారం చీకట్లో అస్పష్టంగా కనిపిస్తూంది.

శ్మశానం దాదాపు మైలు విస్తీర్ణం వుంది. ఆ తరువాత తుప్పలు, చెట్లు ........ఒకవైపు ఏరు .........క్రితం
నాలుగురోజులుగా పడుతున్న వర్షానికి అది నిండుగా ప్రవహిస్తుంది. ఎవరో ఓ శవాన్ని సగం కాల్చి, దాన్ని ఒడ్డు న
అలానే వదిలేసి వెళ్ళిపోయారు. చచ్చిన కుక్క ఒకటి ఏరు నుంచి ఒడ్డు కు కొట్టు కువచ్చి పడింది. దాని వాసన
అసహ్యంగా అక్కడంతా వ్యాపించి వుంది.

శ్రీధర్, అబ్రకదబ్ర చెరోవైపుకి పది అడుగులు వేసేరు. అంతలో శ్మశానానికి మరోవైపు నుంచి ఇంకో కారు వచ్చి
ఆగింది. అందులోంచి విద్యపతి దిగేడు. కొంచెం వృద్దు డవటం వల్ల అతడు ఆ చలికి తట్టు కోలేకపోతున్నాడు.
ఓవర్ కోటు మరింత గట్టిగా బిగించుకొని ముందుకు అడుగు వేసేడు.

ముగ్గురూ మూడు వైపుల్నుంచీ నిశ్శబ్దంగా శ్మశానం లోపలికి ప్రవేశిస్తు న్నారు. వారి చేతుల్లో ఆయుధాలు
శతృవు ప్రాణాలు తీయటం కోసం ఉవ్విళ్ళూరుతున్నాయా అన్నట్టు మెరుస్తు న్నాయి. అయితే వారు శతృవు
అనుకొంటున్నవాడు ఒక మహత్కార్యం కోసం ఈ శ్మశానపు నడిబొడ్డు లో నిలబడి వున్నాడు. అతడి
దోసిలినిండా నీరు వున్నది మంత్రజలం అది. క్రిందనున్న కుప్పపై పోసేడు దాన్ని.

సరీగ్గా అదే సమయానికి ఒక కారువచ్చి ఆగింది. ఆ కారు డ్రైవ్ చేస్తు న్న వ్యక్తి. కారులో కూర్చున్న
వ్యక్తీ.....ఇద్దరూ ఒక రకమయిన ట్రాన్స్ లో వున్నట్టు న్నారు. అయితే వెంకట్ పైకి మామూలుగా
కనబడుతున్నాడు. కారు ఆగగానే దిగి, కారు వెనగ్గా వచ్చి, పక్క తలుపు తీసేడు. అందులోంచి తులసి
దిగింది.........నిద్రలో నడుస్తు న్నట్టు .........

"ముందుకెళ్ళు - ఎడమవైపు బావి కనబడుతుంది. పైనుంచి దూకాలి సుమా" అన్నాడు. తులసి విన్నది.
అయితే ఆమె మొహంలో ఏ భావమూ లేదు. అతడి మాటలు పూర్తవగానే అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా
శ్మశానంలోకి నడిచింది. ఆమె మెస్కలిన్ ఇంజక్షన్ భ్రాంతిలో వున్నది.
దార్కా పూజ చేస్తు న్న ప్రదేశానికి ఎడమవైపు రెండొందల గజాల దూరంలో వుంది. ఆ దిగుడుబావి మెట్లు
విరిగి శిధిలమయింది. అయితే అక్కడ ఎంత చీకటిగా వుందంటే.... పది అడుగుల దూరంలో వున్న మనిషి
కూడా కనిపించటంలేదు దార్కా కళ్ళు మూసుకుని, పూజలో వున్నాడు.

అప్పుడు పడింది మొదటి వర్షపుచుక్క. క్షణాల్లో అది ఏనుగు తొండాల్తో పోసినట్టు ధారాపాతమైంది.
సమాధులమీద పడుతున్న నీటి శబ్దం ఎందరో ఆటవికులు నృత్యం చేస్తూ కొడుతున్న వాయిద్యాల శబ్దంలా
వుంది. అప్పటివరకూ వున్న నిశ్శబ్దంలోంచి అంత శబ్దం రావటం ఎవరికయినా వళ్ళు గగుర్పొడిచేలా వుంది.
అయితే శ్మశానంలో ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. తమ తమ పనుల్లో వున్నారు. కళ్లు చిన్నవి చేసి, ఆ వర్షపు
ధారల్లో శత్రు వుని పసిగట్టడం కోసం ముగ్గురూ నడుస్తు న్నారు. పది అడుగుల దూరంనుంచి తన కూతురు
బావివైపు నడిచి వెళ్ళటాన్ని శ్రీధర్ గమనించలేదు.

కారులో తాపీగా కూర్చొని శ్మశానపు చీకటిలోకి చూస్తు న్న వెంకట్ వెనుకే ఒక కారు వచ్చి ఆగటాన్ని
గమనించి, ఉలిక్కిపడి వెనక్కి చూసేడు. ఆ కారులోంచి దిగుతూన్న జయదేవ్ ని, పండిత్ నీ గమనించి, తనూ
చప్పున కారులోంచి బయటకు రాబోయేడు, కానీ అప్పటికే జయదేవ్ అక్కడికి చేరుకున్నాడు.

సాధారణంగా జయదేవ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తొణకడు. అటువంటిది ఆ క్షణం వెంకట్ ని అక్కడ


చూడగానే కోపంతో - కసితో కదిలిపోయేడు. ఇతడే.......ఇతడే దీనికంతకీ కారణం. తులసి గర్భానికి తులసి
మరణానికి........ ఇతడే ఇతడే! ధారగా కారుతున్న వర్షపు నీటికి భయపడి, బయటకు రాకుండా కారులోంచి
తల బయటకు పెట్టి చూసిన వెంకట్ ముఖం మీద పిడికిలితో ఎంత బలంగా కొట్టేడంటే ......ఆ దెబ్బకు
వెంకట్ వెనక్కు తూలేడు. తలకి గేర్ రాడ్ కొట్టు కొని స్పృహతప్పాడు. అతనిని పట్టించుకోకుండా పండిత్,
జయదేవ్ శ్మశానంలోకి పరుగెత్తా రు.

వెంకట్ తల - గేర్ రాడ్ కి కొట్టు కోగానే కారు న్యూట్రల్ కివచ్చింది. ఆ తరువాత అది కొద్దిగా కదిలింది. ఆ
కదలిక నెమ్మదిగా ఎక్కువైంది. ముందు పల్లంగా వుంది. ఇంజన్ వదిలేసిన రైలు పెట్టెలా అది ముందుకు
సాగింది. మలుపు తిరిగిన రోడ్డు పక్కగా, రోడ్డు కు రెండు అడుగుల క్రిందుగా ప్రవహిస్తోంది. ఏరు కదిలిన కారు
కొద్దిగా వేగం పుంజుకుని ముందుకు వెళ్ళింది. అయితే రోడ్డు తోపాటు అది మలుపు తిరగలేదు. ఫలితంగా అది
రోడ్డు మీదనుంచి ఏరులోకి దిగుతూ తిరగబడింది. వెంకట్ తల పైకప్పుకి మరోసారి కొట్టు కుంది. ఉధృతంగా
ప్రవహించే నీరు, కారు దొర్లి పడటంతో ఒక్కసారిగా చెదిరి, తరువాత కిటికీల గుండా లోపలికి ప్రవహించింది.

తమ తమ పనుల తొందర్లో వున్న అక్కడి వారెవరూ ఈ దృశ్యాన్ని చూడలేదు.

దార్కా అప్పటికే ఆరు దిక్కులూ బంధించాడు. చెక్క మేకులు దొరక్క అతడు, ఆ సాయంత్రమే
శుద్దికాబడిన తన వేళ్ళను మేకులుగా ఉపయోగించేడు. కాలి నరమైన బచనికని కోయటానికి వాడే రంపాన్ని
దానికి సాధనంగా వాడుకున్నాడు.

ఒక పెద్ద చెట్టు వేళ్ళతోసహా కూలింది. అది ఆకరిరాత్రి అన్నట్టు గాలి వీస్తుంది. అయినా దార్కా స్థిరంగా
నిలబడ్డా డు. గుండెల్నిండా గాలి పీల్చుకొని ఈశాన్య దిక్కుగా నడిచేడు. గాలి అతడిని వూపేస్తుంది. గమ్యం
చేరుకోవటం కష్టమౌతుంది.
కాష్మోరా వుండవచ్చు......లేకపోవచ్చు.......గాలి వీచటం యాదృచ్చికం కావొచ్చు. కానీ అతడిలో పట్టు దల
వున్నది. ఒక మహత్కార్యాన్ని సాధించాలనే తపన వున్నది. వర్షం అలల్లా వచ్చి అతడి మొహాన్ని బాణాల్తో
కొడుతున్నట్టుంది. అయినా ఈశాన్య దిక్కుకి అతి కష్టం మీద చేరుకున్నాడు. కుడిచేతి చూపుడువేలు
పోయింది. వర్షపు నీరు ఎర్రగా మారుతూంది.

ఇక ఆకరి దిక్కు మిగిలింది. ఉత్తరదిక్కు అతడు అటువైపు నడుస్తూ వుండగా కొద్దిలో అతడి ప్రక్కనుండి
శ్రీధర్ వెళ్ళిపోయాడు. ఆ చీకటిలో ఒకరినొకరు చూసుకోలేదు. దార్కా ఉత్తర దిక్కుకి చేరేడు. అదే ఆఖరి
పోరాటం అన్నట్టు గా అతడిని గాలి పడగొట్టటానికి ప్రయత్నిస్తూంది. తన ఓటమికి ఆయత్తమవుతూ
ఓడిపోకుండా వుండటానికి ప్రయత్నిస్తూ క్షుద్ర దేవతలు అతడితో పోరాటం జరుపుతున్నారా అన్నట్టు శబ్దా లు -
నోటివీ - గాలివీ - ప్రకృతివీ!

ఉత్తర దిక్కున అతడి వంగేడు. కత్తి ఎత్తేడు. ఘన ఘనా ఘన సంమాతమయిన కారుచీకటిని మిన్ను
మిన్ను మీది మెరుపుతీగె క్షణంపాటు ఛిన్నాభిన్నం చేసింది. మధ్యవేలు మెరుపై అవనిలోకి దిగింది.

అతడిలో నిస్సత్తు వ ఎక్కువయింది. అతడి వంటిమీద పడిన వర్షపు నీరు భూమ్మీద ఎర్రగా జారుతూంది.
అతడు శ్మశానం మధ్యకి చేరుకున్నాడు. అక్కడ స్థా పితం చెయ్యాలి. అదే అన్నిటికన్నా కష్టమైన విద్య .అతడు
మోకాళ్ళమీద కూర్చొన్నాడు. గురువుని స్మరించాడు. మొండి చేతుల్తో మట్టిని తవ్వుతుంటే విరిగిన ఎముకల్లోకి
చేరిన బురద ప్రాణాల్ని తోడేస్తుంది. బాధని పల్ల బిగువున అదిమిపెట్టి ప్రార్ధన చేస్తూ పని నిర్వర్తిస్తు న్నాడు. గుంట
తవ్వి, నడుము దగ్గరనుంచి గుడ్డబొమ్మ తీసేడు. దాన్ని ఆవహించటాన్కి కాష్మోరాని ఆహ్వానిస్తూ మంత్రం
చదివేడు.

కాలిన కపాలాలమీద చినుకు చిటపట రవమై భీకరమై పెళ పెళ నినాద ఘనమై ఝంఝామరుదజ్జిత
చిలమంద్రస్వరమైనది.

ఆచార్యులవారు చెప్పిన ఆఖరు మంత్రాన్ని అతడు పఠించేడు. "......త్ యాదచోప్ర.........ణ్యుంరేర్వతు


ఎత్సతన!" గాయత్రీ మంత్రాన్ని తిరగబెట్టి చదువుతే ఎంతటి శక్తి అయినా తలవంచ వలసిందే. ఆకాశం లోకి తల
పైకెత్తి చూసాడు. అతడు చదివిన ఆ మంత్రంతో , ఒక్కసారి ప్రకృతి కదిలిపోయింది.

వర్షం ఉన్నట్టుండి ఆగింది, చెట్లు , పక్షులు, ఆకాశం, భూమీ, అన్నీ అతడినే విస్మయంతో చూస్తు న్నట్టు
అచలనమయ్యేయి.

ఏమయింది?

అతడికో క్షణం అర్ధంకాలేదు.

.అంతలో ఆకాశం మెరిసింది. ఆ వెలుగులో అతడు తులసిని చూసేడు.


తులసి బ్రతికింది?

తను కాష్మోరాని జయించేడు?

తను తులసిని బ్రతికించుకొన్నాడు!!!

అప్పుడు ఆనందంతో అతడు పెట్టిన కేక దిగంతాలకి వ్యాపించి మరింత విస్తృతమై గొంతులోనే ఆగిపోయింది.
హృదయం నిండా ఆనందం నిండింది. గర్వం నిండింది. చేతులు సాచి 'తులసీ' అన్నాడు.

తన తులసి ముందుకొస్తూంది. ఆ ఆనందంలో, మరోసారి మెరిసిన ఆ మెరుపు వెలుగులో తనని


చుట్టు ముడుతూన్న ముగ్గుర్నీ అతడు చూడలేదు. ఆ ముగ్గురూ కూడా ఒకర్నొకరు గమనించుకోలేదు. వారి
దృష్టి దార్కామీదే వుంది. మూడువైపుల్నుంచీ అతడిని చుట్టు ముడుతున్నారు. అయితే అందర్నీ గమనించింది
జయదేవ్. చెయ్యి యెత్తి "ఆగండి...... అతడిని చంపకండి!" అని అరిచేడు. ఒక ఉరుము అతడి స్వరాన్ని
మింగేసింది. అతడి అరుపు వృధా అయింది.

ముందు గాలితో 'సర్'మన్న ధ్వని. మొదటి క్షణం దార్కాకి ఏమీ అర్ధంకాలేదు. తరువాత ఒక్కసారిగా బాధ
అతడి శరీరం అంతా వ్యాపించింది. మోకాళ్ళమీద ముందుకి కూలిపోయాడు.

జయదేవ్ అతడివైపు పరుగెత్తబోయాడు. అంతలో తులసి బావి వైపు వెళ్లటం కంటపడింది. అది ముఖ్యం
అటు వెళ్ళేడు. దూకబోతున్న ఆమెని పొదివి పట్టు కున్నాడు. ఆమె భ్రాంతిలో కోర్కె పూర్తయింది. రెండు
మూడు ఇంజక్షన్లతో ఆమె బాగుపడింది. ఇక ఆమెకి ఫర్లేదు. ఆ నమ్మకం కలిగేక స్పృహ తప్పి వున్న ఆమెని
పండిత్ కి అప్పగించి అతడు దార్కా వద్దకు పరుగెత్తు కు వచ్చేడు.

తడిసిన నేలమీద దార్కా వెల్లకిలా పడివున్నాడు. అతడి కళ్లు ఆకాశంలోకి, శూన్యంలోకి చూస్తు న్నాయి.
చిన్న స్పర్శ తలను కదిల్చిన భావన........... అతడు కళ్ళు కదిల్చాడు. తలని తన వొళ్ళోకి తీసుకుంటున్న
జయదేవ్ కనిపించాడు.

జయదేవ్ కంటినిండా నీళ్ళు, ఎవరికి తెలుస్తుంది ఈ దార్కా చేసిన త్యాగం సంగతి? క్షుద్రశక్తు ల ఉనికి
ప్రశ్నకాదు, ఇక్కడ త్యాగం వున్నది, విశ్వజననీయమైన ప్రేమ వున్నది. ".......దార్కా..........దార్కా......" అని
తనలో తానే గొణుక్కున్నాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. మాట రాలేదు. ఒక క్షణం
ముందువచ్చి వుంటే ఎంత బావుణ్ను. అన్న భావన అతడి హృదయాన్ని కదిలించి వేస్తూంది.

అంతా నిశ్శబ్దంగా వుంది.

జయదేవ్ చెయ్యి ఆప్యాయంగా దార్కా తలని స్పృశించింది. మూతపడుతున్న కళ్ళని పైకెత్తి దార్కా
జయదేవ్ వైపు చూసేడు. అతడి పెదవులు నెమ్మదిగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చుట్టూ చూసేడు. తన
వైపే చూస్తు న్న ముగ్గురు.
అతడు కళ్ళు మూసుకున్నాడు.

ఎక్కడ పుట్టినవాడు తను ? ఎవరికి పుట్టినవాడు?? అతడికి తన బాల్యం జ్ఞాపకం వచ్చింది. గురువయిన
విషాచి జ్ఞాపకం వచ్చేడు! కఠోర మైన నియమాలూ -శ్మశానం -అర్ధరాత్రి - చలి -వర్షం -మంత్రాలూ.

ఆచార్యులవారూ -ప్రార్ధనా -మానవత్వం

చివరిగా తులసి -

అతడి మొహంలో నవ్వు అలాగే వుంది. మనుష్యుల క్రూ రత్వాన్నీ, స్వార్ధా న్నీ, ప్రశ్నిస్తూన్నట్లు వుంది అది.
అంతలో అతడి కళ్ళముందు ఓ దృశ్యం కనబడింది. ఒక చక్రం ఇరవై నాలుగు మూలలున్నది. గిర్రు న
తిరుగుతూంది. దాని మధ్యలో ఒక ఏనుగు - ఆరు తొండాలున్నది. ఏనుగు తలపైగా ఒక కమలం నెమ్మదిగా
విచ్చుకున్నది.

బ్రహ్మ సాక్షాత్రాకమైనది. ఒక రక్తపుచుక్క చివరగా నోటి నుండి పక్కకి జారిపోయింది. దానితోపాటు అతడి
ప్రాణం కూడా పోయింది.

ఒక గాలి తెమ్మెర విషాదంగా అతడిని స్పృశిస్తూ వెళ్ళిపోయింది.

34
తులసి -

నీకు ఈ లేఖ అందేసరికి నేనీ లోకంలో వుండలేను. కాష్మోరాకి బలి అవటమో దాన్ని జయించి,
గురువుకిచ్చిన మాట తప్పినందుకు ఆత్మహత్య చేసుకోవటమో జరుగుతుంది.

తులసీ! ఇలా అంతం కాబోతున్న నా జీవితాన్ని నేను ఒక ప్రేక్షకుడిలా చూసుకుంటే, నాకు నవ్వూ బాధా
రెండూ కలుగుతున్నవి. ఎక్కడో ఒక కుగ్రామంలో అనామికంగా వున్న నేను విషాచి దృష్టిలో పడటం ఎంత
విచిత్రమో ఆ రోజునుంచీ ఒకే ఒక పగ సాధించటం కోసం అహోరాత్రు లూ కష్టపడటం. చివరికి ఆ పగ
తీరకుండానే నేను మరణించటం అంతే విచిత్రం.

ఈ నాగరిక ప్రపంచంలో అడుగు పెడుతూనే నాకు శతృవయింది ఒక రైలు టిక్కెట్టు కలెక్టరు. పదవివల్ల
వచ్చిన అహంకారముతో తన కన్నా చిన్నవాణ్ని చులకనచేసి బాధించే అతడు క్షుద్రదేవత కన్నా ఏ విధంగా
తక్కువ అపాయకరమైనవాడు?

తులసీ! నిన్ను వెతికి పట్టు కోవటానికి కాలేజీల్లో పనివారికి డబ్బుపంచవలసి వచ్చింది. సత్రంలో గదికోసం
డబ్బు చాటుగా ఇవ్వవలసి వచ్చింది. ఇదంతా లంచం అంటారట. మేం దేవతలకిచ్చే జంతుబలులకన్నా ఇవి ఏ
రకంగా తక్కువ హేయమైనవి?

ఏమి ప్రపంచం ఇది? ఏమి మనుష్యులు వీళ్ళు? మోసమే ప్రతివాడి ధ్యేయం. సాటి మనిషి బలహీనత మీద
ఆడుకోవటమే ప్రతివాడి లక్ష్యం. నాకు మోసం చేసే వాళ్ళని చూసి కోపం రావటంలేదు మోసపోయేవాళ్ళని
చూసి దుఃఖం వస్తు న్నది.

ఎంత మూర్ఖులు ఈ జనం! ఇది నేను కోపంతో అనటం లేదు. హేళనగా అనటం లేదు - వినమ్రతతో ఈ
జనం ముందు నిలబడి ఆవేదనతో అంటున్నాను. ఈ ప్రపంచాన్ని నా అనుభవంతో పరిశీలించి, ఆ ఆవేశంతో
అంటున్నాను.

తులసీ! నేను భగవంతుడిని నమ్మను. విధిని నమ్మేవాణ్ని కాను. అయినా నాకు ఆచార్యుల వారితో అయిన
పరిచయం కేవలం విధి నిర్ధేశించినదే. మంచితనం గురించి నాకు బోధపరిచింది ఆయనే! దేముడు వేదాంతం
మొదలయిన విషయాలు ఆయనే నాకు తెలిపారు. ఆయన ఇంత తెలుసుకున్నాక ఇప్పుడు నా ఆవేదన అంతా
సాటిమనిషి గురించే!

ఈ లోకంలో నుంచి నిష్క్రమించబోయే ముందు ఒక పనిని నీకు అప్పగించి వెళుతున్నాను. ఈ ప్రపంచంలో


నాకున్న ఏకైక స్నేహితురాలివి నువ్వే! ఈ పనిని నువ్వే చేయగలవు. అమాయక ప్రజల మూర్ఖత్వాన్ని తమ
స్వార్ధా నికి వాడుకునే వాళ్ళనుంచి ఈ

ధైర్యంగా నిలబడి ఆ మోసాన్ని బయటపెట్టిన దృశ్యం ఇంకా నా కళ్ళముందు ఆడుతూనే వుంది.

నా కోర్కె ఒక్కటే! ఈ ప్రజల్ని మూర్ఖత్వం నుంచి రక్షించు. క్షుద్రశక్తు ల పేరిట జనాన్ని మోసం చేసే శక్తు ల
నుంచి ఈ ప్రజల్ని తప్పించు. అదే నా అంతిమ కోర్కె. దాన్ని తీర్చగలదానివి నువ్వే!

నిజం తులసీ!

నేను చాలా గర్వంగా చెప్పుకోగలను! విషాచి శిష్యుడయిన నా కన్నా ఈ ప్రపంచంలో గొప్ప మంత్రగాడు
ఇంకెవరూ లేరు. విషాచి నాకు చెప్పిన విద్యలు నేను ఇంకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. బాణామతి,
చిల్లంగి, పాతాళకుట్టి, కుట్టిసైతాన్ - ఇవన్నీ నాతోనే అంతరించి పోవాలి.

ఇవన్నీ వున్నాయా? లేవా? అని నేను ఇక్కడ తర్కించ బోవటంలేదు. వీటిని ప్రయోగించగలవాడు ఎవరూ
లేరని నిన్ను సవాలు చేయమని కోరుతున్నానంతే! వారికి గోళ్ళు కావాలంటే , నీగోళ్ళు ఇవ్వు వారికి! నీ కాలి
క్రింద మట్టి కావలంటే దాన్ని యివ్వు. వారు నిన్నేమీ చేయలేరు! నేను చెబుతున్నాను కదా -ఈ ప్రపంచంలో
ఎవరికి చేతబడి ప్రయోగం చేయటం తెలీదు.

నువ్వు అడగొచ్చు అసలు చేతబడి అనేదే లేదా? అని. సమాధానం కూడా నీ దగ్గరే వున్నది. మనిషిని
దూరంనుంచి చంపటమే చేతబడి అయితే, అటువంటి విధానాలు ఇరవైనాలుగు పిళ్ళై చూపించాడు కదా.
చేతబడి కన్నా అవి ఏ విధంగా తక్కువ అపాయకరమైనవి?

తులసి! నా నిష్క్రమణకి ముందు నేను నీకు ఆ పని అప్పగిస్తు న్నాను. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక
స్నేహితురాలివి నువ్వే!నాకు చిన్నతనం నుంచీ ప్రేమంటే ఏమిటో తెలీదు. చిన్నతంలో నిష్ట, పెద్దయ్యాక పగ!
అంతే. ప్రేమ అనేది కొన్ని సంఘటనల పరంపరలో ఉద్భవిస్తుందని నేననుకోను.

లేదు సమయం ఎక్కువలేదు. అయనా తిరుగుబాటులో సున్నితమైన భావాలకి చోటులేదు. తిరగబడు


తులసీ! నీ వుద్దేశ్యాలని ప్రజలు వప్పుకోకపోయినా, నీ ప్రయత్నం మానకు, దానికి సూక్ష్మేరూపుడయిన నా
సహకారం ఎప్పుడూ వుంటుంది.

ఉంటాను తులసీ........మళ్లీ ఎప్పుడో ఏ జన్మలోనో......

- దార్కా

భారంగా విశ్వసిస్తూ ఉత్తరం చదవటం పూర్తిచేసేడు జయదేవ్. ఆ తరువాత కదలకుండా అలాగే వేళ్ళమధ్య
దాన్ని తిప్పుతూ ఆలోచించ సాగేడు. అతడి మెదడులో పరస్పర విరుద్దమైన భావాలు కదలాడసాగేయి. ఈ
వుత్తరాన్ని తులసికిస్తే ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే షాక్ నుంచి కోలుకుంటూన్న తులసి, ఈ ఉత్తరం వల్ల
రియాక్ట్ అవుతుంది.

జనం మీద విరుచుకుపడ్తుంది. దానికితోడు ఈ ఉత్తరం కూడా దొరికింది. ఇక ఎవరు చెప్పినా వినదు.

అయితే జనం నమ్ముతారా ? క్రీస్తు .........గాందీలాటి మహనీయులు జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి
కనుక్కున్న మహత్తర విషయాన్ని జనానికి చెప్పబోతే, వాళ్లు దాన్ని ఎలా స్వీకరించారు? ప్రాణాలు తీసే వరకూ
వదిలిపెట్టలేదు కదా! అటువంటిది తులసిలాటి ఒక మామూలు అమ్మాయి చేతబడి. మానవాతీత శక్తు లులాటి
విషయాల్ని - ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిన వాటిని- ఎదుర్కోగలదా?

కానీ ఈ ఉత్తరం!

ఈ ఉత్తరం మాత్రం ఏం చేస్తుంది? మానవలోకపు మానవాతీత మాంత్రికుడు స్వహస్తల్తో వ్రాసిన ఈ ఉత్తరం


- చేతబడి చేయగలిగినవాళ్ళు భూమ్మీద ఇక లేరని వ్రాసిన ఉత్తరం - ప్రజల మధ్యకి వెళితే........ వాళ్ళు ఏం
చేస్తా రు? తరతరాలుగా తమ రక్తంలో జీర్ణించుకుపోయిన ఈ భావాల్ని వదులుకోవటానికి ఇష్టపడ్తా రా?

పడతారేమో!

కానీ తెలివైన వాళ్ళు, స్వార్ధపరులు పడనివ్వరు. ఎవడో ఒకడు అంటాడు. ఈ ఉత్తరం తులసి పాపులారిటీ
కోసం సృష్టింపబడిందని! దాంతో సగం జనం అటు తిరుగుతారు.
తులసిని బజారుకి లాగుతారు. రక రకాలుగా వ్యాఖ్యానిస్తా రు. పెద్ద పెద్ద అక్షరాల్తో పేపర్లో వ్రాస్తా రు. చివరికి
అందరూ కలిసి ఆమె పిచ్చిదని తేలుస్తా రు. అలా తేల్చి ఆమెని ఈసారి నిజంగా పిచ్చిదాన్ని చేసినా ఫర్లేదు.

కానీ........

దార్కా పేరుని పేరుతో జత చేస్తా రు.

ఈ ఆలోచన వచ్చేసరికి జయదేవ్ వణికిపోయాడు నిజమే, తమ బిజినెస్ పోతుందని తెలిస్తే వాళ్ళు


ఎంతకయినా తెగిస్తా రు. అలా జరగటానికి వీల్లేదు. ఇరవయ్యేళ్ళ

వయసులో చక్కగా పెళ్ళి చేసుకొని సంసారం చేసుకోవలసిన తులసి కోరి కోరి ఈ కష్టా లని
కొనితెచ్చుకోవటము తను సహించలేడు.

అతడు తన చేతిలోని ఉత్తరాన్ని దీర్ఘంగా చాలాసేపు చూసి, నెమ్మదిగా మడిచేడు. ముందు


రెండు.......తరువాత నాలుగు..... ఆ తరువాత ఎనిమిది....... కాగితం అతడి చేతివేళ్ళ మధ్య చిన్న చిన్న
ముక్కలయింది. ఆ తరువాత ఆ ముక్కలు గాలిలోకి ఎగిరి చెల్లా చెదురు అయిపోయినయ్.

తను చేస్తు న్నది ఘోరమైన తప్పనీ దాన్ని దేముడు కూడా క్షమించడనీ అతడికి తెలుసు. కానీ తప్పదు.
తులసి జీవితంలో దార్కా ప్రసక్తి మరోసారి రావటానికి వీల్లేదు. వీలైనంత త్వరగా అదో కలలా అందరూ
మర్చిపోవాలి. దార్కా గురించి ఇంట్లో మరెప్పుడూ మాట్లా డవద్దని శ్రీధర్ వాళ్ళకి చెప్పాలి. దార్కా ఎక్కణ్నుంచి
వచ్చాడో తెలీదు...... అలాగే ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. తులసికి సంబంధించినంత వరకూ అలాగే
జరిగింది. దార్కా సమాధి ఎక్కడో తమిద్దరికే - తనకీ శారదకీ -ఇద్దరికే తెలుసు. ఇంకొకరికి తెలిసే అవసరం
లేదుకూడా. కాష్మోరా అనేది వుండి వుంటే, తన ప్రాణాల్ని దార్కా రక్షించేడన్న విషయం కూడా తులసికి
తెలియక్కరలేదు.

ఎందుకో తెలీదు కానీ, జయదేవ్ కి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. అతడి కళ్ళముందు అమాయకంగా
, నిర్మలంగా వుండే దార్కా మొహం కదలాడింది. చిన్నపిల్లా డి పట్టు దల, ఎవరో 'అంకుల్' అని
పిలిచినట్టు ........... అతడు ఉలిక్కిపడ్డా డు. అంతా భ్రమ..... ఈ దుఃఖం అనేది చాలా చిత్రమైనది. పూర్తిగా
వచ్చేసినా బావుంటుంది. అసలు రాకపోయినా బావుంటుంది. కానీ - లావాలా గుండె లోతుల్లో కదులుతూంటే
ఆ బాధ అనిర్వచనీయం.

ఫోన్ బెల్ రింగ్ అవుతూంటే అతడు ఈ లోకంలోకి వచ్చి రిసీవర్ ఎత్తు కున్నాడు. అవతలివేపు పండిత్
గొంతు వినిపించింది కంగారుగా "జయదేవ్ మీ రొకసారి అర్జంటుగా రండి - వెంకట్ ఇంటికి"

ఆ గొంతులో కనబడిన ఆదుర్దా చూసి మరి ప్రశ్నించకుండా జయదేవ్ ఫోన్ పెట్టేసి బయలుదేరాడు. డ్రయివ్
చేస్తు న్నంతసేపూ ఆలోచన్లు . వెంకట్ చనిపోయేడా? ఇన్ని రోజులు అతడు కనిపించకుండా వుండటానికి
కారణం అదేనా?
వెంకట్ ఇంటి కాంపౌండ్ లోకి అతడి కారు ప్రవేశించేసరికి గుప్పున వాసన కొట్టింది. పండిత్ గొంతు
వినిపించింది, "ఇటు రండి" అని కర్చీఫ్ అడ్డు పెట్టు కొని అతడు "తలుపులు నేనే తీసేను దాంతో ఒక్కసారి
లోపలిగాలి బయటికి వ్యాపించింది."

లోపలి గదిలోకి అడుగు పెడుతూనే జయదేవ్ నిశ్చేష్టు డయ్యేడు. పక్కమీద శవం వికృతంగా వుంది.
అయితే అది వెంకట్ ది కాదు.

శ్రీనివాసపిళ్ళై ది!

చాలా సేపు కొట్టు కున్నట్టూ పక్కంతా చిందర వందరగా వుంది. మెడ పక్కనుంచి వైర్లు ప్లగ్ లో పెట్టబడి
వుంది. ఒక చెయ్యి పక్కమీద నుంచి క్రిందికి వేలాడుతూ వుంది. జయదేవ్ వంగి వాచీ చూసేడు. గోడకు
కొట్టు కుని అద్దం విరిగిపోయి, ఆగిపోయింది అది - పన్నెండున్నర దగ్గిర -

తేదీ చూసి అతడు ఉలిక్కిపడ్డా డు. ఆ రాత్రి...........

* * *
తులసి శ్మశానంలోకి వెళ్ళిన రాత్రి.......

దార్కా మరణించిన రాత్రి........

తను ఆడుతున్న చదరంగంలో పావులు అన్నీ ఒకేచోట చేరి జరపబోయే మారణహోమాన్ని కార్లో కూర్చుని
నవ్వుతూ చూడసాగేడు పిళ్ళై. తులసి వచ్చింది. శ్రీధర్ దార్కాని చంపబోతున్నాడు. అన్నీ అనుకున్నవి
అనుకున్నట్టే జరుగుతున్నాయి. అతడు గర్వంగా సిగార్ వెలిగించుకోబోతున్నాడు. అన్నీ అనుకున్నవి
అనుకున్నట్టే జరుగుతున్నాయి. అతడు గర్వంగా సిగార్ వెలిగించుకోబోతూంటే జరిగిందది........మెదడు
నరాల్లో కదలిక, సన్నటి నొప్పి.

అతడు మరి ఆలస్యం చేయలేదు. కారు రివర్సు చేసి వెంటనే స్పీడ్ గా వెంకట్ ఇంటికి పోనిచ్చాడు. తన
ఇంటికి వెళ్ళేటంత టై మ్ లేదు అర్జెంటుగా కనెక్షన్ కావాలి.

అతడు వెంకట్ ఇంటికి చేరుకొనేసరికి బాగా నీరసించిపోయాడు. మెదడు శరీరానికి సూచన్లు యివ్వటం
మానేసింది. తూలుతూ లోపలికి ప్రవేశించి, పక్కమీద వాలిపోయేడు. వణుకుతున్న చేతుల్తో ప్లగ్ లో వైర్లు
పెట్టా డు. కళ్లు మూసుకున్నాడు.

ఒకటి.......రెండు..........మూడు.........నిమిషాలు గడిచేయి.

ఏమీ కాలేదు. నరాలు మెలికలు తిరిగిపోతున్నాయి. తలలో మెదడు వంకర్లు తిరిగిపోతున్న బాధ.
పళ్ళమధ్య నాలుక తెగింది. మంచాన్ని గట్టిగా పట్టు కొని శరీరం కదలకుండా ఉండటానికి చేస్తు న్న ప్రయత్నాలు
ఫలించటం లేదు.

అతడు నిస్సహాయంగా కళ్ళు తెరిచేడు పైకప్పుకి ఫాన్ కనబడింది.

అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతడికి. మెయిన్ తనే వెళుతూ వెళుతూ ఆపుచేసిన విషయం. ఒక్కసారి
భయంతో వణికిపోయాడు. లేవటానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు. అప్పటికే బలహీనమయ్యేడు.

ఆ తరువాత రెండు నిముషాలపాటు అతడు అనుభవించిన బాధ పగవాళ్ళకి కూడా వద్దు . పదకొండు
సంవత్సరాల క్రితం తులసిని బాధ పెట్టిన దానికి -ఇప్పుడు మానసికంగా ఆ కుటుంబాన్ని పెట్టిన క్షోభకి సరిపడా
రెండు నిమిషాల బాధ చాలు. అతడి కనుగుడ్లు వెనక్కి వెళ్ళిపోయాయి. మెడ వంకర్లు తిరిగింది.

* * *
అప్పటి బాధ ఆ శవం మొహంలో అన్నిరోజులు తరువాత కూడా కనబడుతూంది.

పండిత్ మొకాళ్ళమీద వంగేడు. భుజం ప్రక్కగా సిగరెట్ పాకెట్ సైజులోవున్న పెట్టె తీసుకుని జేబులో
పెట్టు కున్నాడు. సన్యాల్ అమర్చిన పాకెట్ అది.

తరువాత రాబోయే పోలీసులు, తెలియక పొరపాటున దాన్ని విప్పితే, ఆ రేడియో ఆక్టివ్ రేస్ తాకి, అందులో
సగంమంది చచ్చిపోయి ఉండేవారు.

"పోదామా!" అన్నాడు జయదేవ్. పండిత్ తలూపేడు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఆ ఇంట్లోంచి బయటకొచ్చారు.

ఉపసంహారం
"మానవాతీత శక్తు లు అంటే ఏమిటి?" శ్రీధర్ అడిగేడు. మరుసటి రోజు తిరిగి రావటం కోసం సూర్యుడు
పశ్చిమానికి దిగిపోతున్నాడు. కొన్ని లక్షల సంవత్సరాల్నుంచీ ఒకే కక్ష్యలో తిరుగుతూన్న భూమి తాలూకు
రహస్యాన్ని శోధించటానికి సైన్సు చేసే ప్రయత్నం ఆకాశంలో దారితప్పిన కొంగల గుంపు- అస్తవ్యస్తంగా చల్లటి
గాలి. భూమి -సముద్రం, ఒకేసారి చల్లబడితే సృష్టినుంచే మాయమయ్యే పిల్ల తెమ్మెర.......

"మానమాతీత శక్తు లంటే మానవుడికి అతీతమైన శక్తు లు" అన్నాడు జయదేవ్

"అవి ఉన్నాయా?"

"మానవుడికి అతీతమైన శక్తు లు సృష్టిలో చాలా వున్నాయి.


పండిత్ కల్పించుకొని "మానవాతీత శక్తు లు అంటే అదికాదు, సైన్సుకి అందని శక్తు లు" అన్నాడు.

"సైన్స్కి అందని శక్తు లు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి సర్కస్ లో మోటార్ సైకిల్ ని నూతిలో
తిప్పేవాడు. మానవాతీత శక్తి ఉన్నవాడే కదా" అన్నాడు జయదేవ్. అమాయకంగా. అక్కడ వున్న వాళ్ళందరూ
నవ్వేరు. సైన్సులో దిట్ట అయిన పండిత్ దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత తనమీద వున్నట్టూ గ్రహించి -
"భూమి ఆకర్షణశక్తి కన్నా వేగంగా కేంద్రంవైపు సైకిల్ వెళితే అతడు క్రిందపడడు" అన్నాడు.

ఈసారి జయదేవ్ నవ్వి "1902 లో ఆ విషయాన్ని జాన్సన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. అప్పటివరకూ అది
మానవాతీత శక్తేకదా" అన్నాడు. "ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే, ప్రతిదానికీ హేతువు (రీజనింగ్)
వుంటుంది. దాన్ని సైన్సు ఇప్పుడు కనుక్కోలేక పోవచ్చు. భవిష్యత్తు లో కనుక్కుంటుంది. తప్పదు. ఇప్పటి
మానవాతీత శక్తి అప్పటికి మానవుడికి అలవడిన శక్తిగా మారుతుంది"

"అంటే చేతబడికి కూడా సైన్స్ రీజనింగ్ చెబుతుందా?"

"బొమ్మకి వెంట్రు కలూ, గోళ్ళూ కట్టి శ్మశానంలో పాతిపెడితే అది చేతబడి కాదు. దానికి హేతువాదం
సమాధానం చెప్పదు. ఇంత కన్నా ఎక్కువగా మంత్రగాళ్ళు ఏదో చేస్తు న్నారు......... స్లో పాయిజనింగ్ లాటిది."

"అంటే మంత్రగాడు రోగితోపాటే వుండి కొద్ది కొద్దిగా విషం ఇస్తా డా?"

"అఖ్కర్లేదు. కొన్ని మైళ్ళ దూరంలో ఉంటూ ఎదుటి వ్యక్తిని చంపటానికి ఇరవై నాలుగు మార్గాలు పిళ్ళై
చూపించేడుగా."

".....మరి తిరుగుబడి?"

"అది మనసుకు సంబంధించినది. తనకెవరో చేతబడి చేసేడని కృంగిపోయేవాడు, తనకి ఇంకో మంత్రగాడు
సాయపడుతున్నాడని తెలియగానే మానసికంగా సగం బాగుపడతాడు. అంతే తప్ప చేతబడి తీసెయ్యటం
లాటిది ఏమీలేదు"

"- కాష్మోరా వున్నదా?"

"ఒక అదృశ్య శక్తి. మెరుపు కన్నా చురుకైనది"

"కాష్మోరా అంటే?" పండిత్ అడిగేడు.

"మనిషి శరీరాన్ని బ్లీజ్ చేసి, మిధైల్ శాలిసిలేట్ లో నానబెట్టి అతడు జీవించే వుండేటట్టు చేయగల్గితే అతడు
అదృశ్యరూపుడవుతాడని 1911 లో శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. ఇక మెరుపు సంగతి - మెరుపు డిశ్చార్జియొక్క
పొటెన్షియల్ 50 0 కోట్ల కిలోవాల్టు లు. ప్రస్తు తం శాస్త్ర వేత్తలు 50 లక్షల వోల్టు ల పీడనం కృత్రిమంగా
సాధించగలరు. ఈ లెక్కన ఇంకో పది సంవత్సరాలలో కాష్మోరా సృష్టించబడుతుంది."

అక్కడున్న వారందరూ ఇంత వాస్తవాన్ని ఒక్కసారిగా నమ్మలేనట్టు మౌనం వహించారు.

"నాకింకా అర్ధంకానిది ఒకటున్నది. చనిపోయిందనుకున్నామె శ్మశానం నుంచి ఎలా తిరిగి వచ్చింది?"

"చావుని డాక్టర్లు ఎలా నిర్ణయిస్తా రు? కనుగుడ్లు - హృదయ చలనం వీటిని బట్టేగా.

వెంకట్ ఒకసారి వివరించేడు - థర్డ్ డైమెన్షన్ లో ఇంకో శక్తి ప్రవహిస్తుందనీ దాన్ని 'కీ' అంటారనీ ,
ఆక్యుపంక్చర్ అలాగే చేస్తా రనీ...... ఆ 'కీ' శక్తి శరీరంనుంచి ఎప్పుడు పోతుందో అదే అసలయిన మరణం అని
నా అభిప్రాయం" అన్నది శారద శ్రీధర్ ఆశ్చర్యపోయాడు శారద ఇలా మాట్లా డటం మొదటిసారి విని.
అతనన్నాడు.... "ఇదేమిటి నువ్వు కూడా మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తూ మాట్లా డుతున్నావు"

"నమ్మకానికి హేతువు చెబుతున్నానంతే నేను" అంది శారద నవ్వి.

"ప్రజల్లో ఈ మూఢనమ్మకాలు ఒక్కసారిగా పోవు. నెమ్మది నెమ్మదిగా వాటిని మార్చాలి. అన్నిటికన్నా


ముందు అవగాహన కల్పించాలి. అంటే మంచి చెడూ - ఈ క్షుద్రశక్తు లు - వాటి ఆరిజన్ -అన్నీ చర్చించాలి. ఒక
శక్తిలేదని చెప్పలేం కానీ ఆ శక్తిని సైంటిఫిక్ గా సంపాదించటానికి మనిషి ఎంత కష్టపడాలో చెప్పగలం. గొంతులో
ఇన్ ప్రాసానిక్ తరంగాలూ, కంట్లో లేసరు బీమ్స్ అసాధ్యం కాబట్టి అలాంటి మంత్రగాళ్ళు లేరని ప్రజలకు
నమ్మకం కుదిరేలా చెయ్యాలి"

"అలా డొంకతిరుగుడుగా కాకుండా అసలు లేవనే వ్రాయొచ్చుగా "పండిత్ అడిగేడు.

"ఎలా? పెద్ద అక్షరాల్తో 'తులసి ' అని టై టిల్ పెట్టి కింద ఒకే ఒక వాక్యం 'క్షుద్రశక్తు లు లేవు' అనా?" అన్నాడు.
అందరూ నవ్వేరు.

"అలా కాదు" అన్నాడు పండిత్. "వున్నాయేమో అన్న భ్రమ చివరకు కలిగించి, చివర్లో లేవని చెప్పకుండా,
మొదట్నుంచీ వాటిని ఖండిస్తూ వ్రాయాలి అని నా ఉద్దేశ్యం."

అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా అంతా అర్ధమయినట్టు అనిపించింది. అంతవరకూ దొరకని లింకు


దొరికినట్టుంది.

జయదేవ్ తనలో తను అనుకున్నాడు - "చరిత్రలో ఏ రచయిత ప్రజల్ని కన్విన్స్ చేయటానికి వ్రాయలేదు.
తాను నమ్మినదాన్ని వ్రాసేడంతే.......తెలియనిది ఏదో వుంది. ఉన్న ప్రతిదాని వెనుకా హేతువాదం వుంది. మనిషి
దాన్ని సాధిస్తా డు. అంతవరకూ ఆ పేరు చెప్పి తెలివైనవాడు ఈ మూఢనమ్మకాల్ని కాష్ చేసుకుంటాడు. దాన్ని
తప్పించటమే రచయిత ఆశయం అయి వుండాలి. అతడు చెప్పదల్చుకున్నది అది అర్ధం చేసుకోకపోతే
అది......."
"వెళదామా" అన్న పండిత్ మాటలకి తేరుకుని జయదేవ్ తలూపేడు. వారితోపాటు శ్రీధర్ కూడ
ాగేటువరకూ వచ్చేడు. జయదేవ్ గేటు వరకూ వచ్చి ఆగి, "ఒకే ఒక ప్రశ్న- చివరిది"అన్నాడు.

"ఏమిటి?" శ్రీధర్ అడిగేడు.

"దార్కాని చంపినదెవరు?"

నిశ్చలమైన నీటిలో రాయి పడ్డట్టూ అలజడి, అతడి ముఖంలో నవ్వు మాయమైంది., వదనం మ్లానమైంది.
"చంపాలన్న భావం ముగ్గురికీ కలిగింది. చంపినదెవరైతేనేం? క్రియకన్నా భావం ముఖ్యంకదా"

"అయినా ఎవరు చంపారో?"

"ఆ ఒక్కప్రశ్న మర్చిపోలేరా జయదేవ్ బాబూ!"

గాఢమైన నిశ్శబ్దం -నిర్లిప్తత నుంచి ఉద్భవించిన జవాబు - పరస్పర భావాల సంఘర్షణ మెదడులో నాచు
మొక్కల కదలికలాంటి ఆలోచన్లు పెరుగుతూన్న మసక చీకట్ల నీడలు - నీడల చిక్కదనంలో అతడు
కలిసిపోయాడు. అప్పటివరకూ కిటికీ దగ్గర నిలబడి అందరి సంభాషణా వింటూన్న ఓ అమ్మాయి
విషాదకరమైన నవ్వుతో నెమ్మదిగా అక్కణ్నుంచి తప్పుకుంది.

* * *
సరీగ్గా ఆరవుతూండగా అలారం మోగింది. జయదేవ్ చప్పున లేచి కూర్చున్నాడు. క్రితంరోజు పార్టీ ఆలస్యం
అవటంవల్ల కళ్ళు మండుతున్నాయి. అయినా ఆ రోజు పని చాలా ముఖ్యమైనది.

అరగంటలో తయారై అతడు బయల్దేరాడు. అతడి కారు శ్మశానంవైపు సాగిపోయింది. ముందు సీట్లో అతడి
పక్కనే పూలు వున్నాయి.

దార్కా మరణించి ఆ రోజుకు సరీగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు అతడి సమాధిని దర్శించటం తన
కనీస కర్తవ్యంగా భావించేడు అతడు. కాష్మోరా వుండవచ్చు - లేకపోవచ్చు . కానీ తులసిని రక్షించే ప్రయత్నంలో
దార్కా మరణించేడన్నది నిర్వివాదాంశం. అతనిని లోకం మర్చిపోయింది. అందరూ మర్చిపోయారు. కానీ ఇది
తన ధర్మం ఐలైక్ హిమ్..... ఐ లైక్ హిమ్.... అని పదే పదే అనుకున్నాడు.

తూర్పునుంచి పడుతున్న ఎర్రటి కిరణం ఏటి నీటిమీద నుంచి పరావర్తనం చెందుతూంది. క్రితం రోజు
పాపాల్ని తనలో కలుపుకున్న శ్మశానం ఈ రోజు పనికోసం బద్దకంగా వళ్లు విరుచుకుంటుంది. శ్మశానానికి ఒక
మూలగా చిన్న సమాధి లాటి ప్రదేశం ముందు నిలబడ్డా డు జయదేవ్. కళ్ళు మూసుకొని, తనలో తానే
అనుకున్నాడు. 'దార్కా -నీ వాళ్ళెవరయినా వున్నారో లేదో తెలీదు. వాళ్ళు నీ కోసం ఎంతలా ఎదురు
చూస్తు న్నారో తెలీదు. నేను చెయగలిగేది ఏమీ లేదు. నీ ఆత్మకు శాంతి కలుగుగాక! నీ గురించి తల్చుకునేది
నేనొక్కణ్నే........'

దూరంగా ఎక్కడో కారు శబ్దం వినబడటంతో అతడు ఉలిక్కిపడి వెనుదిరిగేడు. నల్లటి కారు దుమ్ము
రేపుకుంటూ వస్తూంది. అతడు వడివడిగా ఒక చెట్టు చాటుకు చేరుకున్నాడు.
కారులోంచి తులసి దిగింది!

అతడు నిశ్చేష్టు డయ్యాడు. ఆ సమయంలో ఆమెను అక్కడ ఊహించలేదు. రకరకాల భావాలు అతడిలో
ఒక్కసారిగా చోటు చేసుకున్నాయి.

అతడి కారుని తులసి గమనించలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దార్కా సమాధి వద్దకు
వచ్చింది. వంగి చేతిలో పూలను సమాధి మీద వుంచింది. మౌనంగా కళ్ళు మూసుకుని చేతులు కట్టు కుని
నిలబడింది. ప్రకృతి కూడా ఆ అమ్మాయి మనసులో భావాన్ని అర్ధం చేసుకోవటానికా అన్నట్టు స్థబ్దమై
చూస్తూంది.

ఎవరు చెప్పారీమెకి దార్కా మరణం గురించి? ఈ రోజు ఇక్కడికి ఇలా వచ్చిందంటే - కాష్మోరా గురించీ......
దార్కా ప్రాణత్యాగం గురించీ వివరంగా అంతా ఈమెకి తెలిసి వుండాలి. ఎవరు చెప్పారు....... ఈ విషయం
పూర్తిగా తెలిసినవాళ్ళు తనూ......

అతడికి అర్ధమైంది.

శారద!

అతడి వళ్ళు జలదరించింది. గతం తులసికి తెలియటం అంత మంచిది కాదని తాము బావించారు. అది
ఆమె మనసుమీద ఎలాటి ప్రభావాన్ని చూపిస్తుందో అని భయపడ్డా రు. అందుకే దాన్ని రహస్యంగా
వుంచదల్చుకున్నారు. అయినా శారద తులసికి దీన్నంతా చెప్పిందంటే.........

తన కూతురి ఆరోగ్యంకన్నా......దార్కా చేసిన పనికి తులసి గుర్తింపు కావాలన్న భావం శారదలో ఎక్కువగా
పనిచేసిందన్నమాట. అతడి కళ్ళు చెమర్చాయి. కాష్మోరాని సైన్సు కొంతకాలానికి పట్టు కోవచ్చు. కానీ స్త్రీ మనసు
ఔన్నత్యాన్ని ఏ పరికరమూ పట్టు కోలేదు.

ఇంతలో తులసి కదిలిన అలికిడి వినిపించి అతడు చాటుకి తప్పుకున్నాడు. తులసి కారు దగ్గరికి
వెళ్ళిపోతుంది. ఆమెకి కనిపించదల్చుకోలేదు అతడు.

కొన్ని అందమైన అనుభూతులు ఎవరు మనసుల్లో వారు వుంచుకోవటమే మంచిది.

******* శుభం ********

You might also like