You are on page 1of 25

శ్ర

ీ మతే రామానుజాయ నమః


శ్ర
ీ మద్వరవరమునయే నమః

గోదోపమాష్టకమ్, కృష్ణాష్టకమ్ - సవ్యాఖ్యానమ్

వ్యాఖ్యాత:

'పండిత రతన' ఉ.వే.శ్రీమాన్ ఈయుణ్ణి అழగ శంగరాచార్యాలు

సంపాదకుడు: ఈయుణ్ణి అనంత రంగ రామన్

లప్ వ నామ సంవత్సరం, దీపావళి - 04-11-2021


గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

గోదోపమాష్టకమ్ - సవ్యాఖ్యానమ్

శ్రియః పతి అయిన శ్రీమన్ననరాయణునకు ఐదు దశలు ఉన్ననయని సంసకృతవేదం,


ద్రవిడవేదం తెలుపుతుననవి. ఆ దశలలో "పిన్ననన్నర్ వణంగుమ్ శోది" (అవతారాలకు
వెనుకబడినవ్యర్య కొలిచే జ్యాతి) అని తిర్యమంగై ఆழ்వ్యరల చేత కీర్తంపబడిన అరాావతారమే
గొపపది. "అదిలే తంగిన మడుకకళ్ పోలే అరాావతారమ్" (అందులో తట పడిన మడుగులవంటివి
అరాావతారాలు) అని శ్రీ పిళ్ళైలోకాచార్యాలవ్యర్య కూడా భగవదవతారాలను కొనియాడార్య.
భగవంతుడు ఎపుపడు అవతర్ంచిన్న లక్ష్మీసహితుడుగానే అవతర్స్తతడు. భగవంతుడు
అవతర్ంచేటపుడు లక్ష్మీదేవితో పాటు అవతర్ంచకపోయి ఉంటే ఆ అవతారమే భోగాంగా ఉండి
ఉండదు ౼ అని అంటార్య, శ్రీ పరాశర భటటర్. ఈ భావ్యనిన వ్యర్య శ్రీ గుణరతనకోశం అనే
స్తతతిలోని "యది మనుజతిరశ్ాం లీలయా తులావృతతః అనుజనురస్తరూపా దేవి! న్నవ్యతర్ష్ాః,
అసరసమభవిష్ాత్" అనే శోలకంలో వాకతం జేశ్ర్య. "రాఘవతే౽భవత్ సీతా ర్యక్మిణీ కృష్ిజనిని"
(శ్రీరామావతారంలో సీతగా, శ్రీకృష్ణివతారంలో ర్యక్మిణ్ణగా లక్ష్మీదేవి అవతర్ంచింది) అని
పరాశర మహర్ి విష్ణిపురాణంలో తెలిపార్య. వరాహావతారంలో భూదేవి, శ్రీరామావతారంలో
సీతాదేవి ,శ్రీ కృష్ణివతారంలో ర్యక్మిణ్ణ, నీళాదేవి ప్రధాన దేవేర్యలు. ఆవిధంగానే
అరాావతారంలో గోదాదేవి ప్రధాన మహిషి.

గోదాదేవి వైభవ్యనిన వర్ించే కృతులు అనేకం ఉన్ననయి. గోదాపర్ణయచంపువు,


గోదాగుణ రతనకోశం, గోదా అష్టటతతర శతన్నమస్తతత్రం, గోదాచతుఃశోలక్మ, గోదోపమాష్టకం,
గోదాచూర్ిక మొదలైనవి వ్యటిలో కొనిన. ఇవి అనీన సంసకృతంలో రచింపబడాాయి.

2
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

శ్రీవిలిలపుత్తతర్ క్షేత్రంలో మారగழி మాసం చివరలో శ్రీ గోదాదేవిక్మ నీరాట్టటతసవం చాలా


వైభవంగా ఈన్నటికీ జర్యగుతుంది. తిర్యమూకుకళమ్ అనే కోనేటి తీరంలో ఈ ఉతసవ జర్గే
మండపం ఈన్నటికీ మనకు దరశనమిస్తతంది. విశేష్మైన ఉపచారాలతో గోదాదేవిక్మ

శ్రీకృష్ిస్తేమితో పాటు ఎణ్ణియ్ కాకపుప (వంటిక్మ తైలనిన పూయుట) సమర్పంపబడుతుంది.


తర్యవ్యత కోనేటిలో నీరాట్టటతసవం జర్యగుతుంది. ఆ సమయంలో గోదోపమాష్టకం ఒకొకకకన్నడు
ఒకొకకక శోలకానిన వ్యాఖ్యానంతో పాటు వేదపిపరాన్ భటటర్ అనేవ్యర్య తిర్యమంజన సమయంలో
విననపిస్తతర్య. ఈ స్తతత్రానిన రచించిన కవి ఎవరో తెలియదు. పెర్యాళాేర్ వంశ్నిక్మ
సంబంధంచినవ్యర్యగా చెపపబడే, వేదపిపరాన్ భటటర్ అనే పేర్యతో వెలిగే కేశవకవిరాజుచే బహుశః
ఇది రచింపబడి ఉండవచ్చా.

1) హంసతో సామ్యం:

సన్నినపాబజప్రవణం స్తరాస్తరవివేక్మనీమ్,
సదగతిం శుదధరూపాం తాం గోదే! హంసీం ప్రచక్షత.

3
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

గోదాదేవీ! నీవు ఒక హంసగా చెపపబడుతున్ననవు. హంస శుదధమైన తామరపూవులో


నివసిస్తతంది. హంస పాలను, నీటిని వేర్య చేసే అస్తరమైన నీటిని తొలగించి, స్తరమైన పాలను
గ్రహిస్తతంది. హంస నడకలు చాలా అందంగా ఉంటాయి. అంతకాక, పవిత్రమైన తెలలని రంగును
కలిగి ఉంటుంది.

నీవు కూడా సతుపర్యష్ణల మనస్తలో సదా నివసిస్తతవు. స్తధువులు నినున ఎలలపుపడూ


మనస్తలో నిలుపుకొని స్తతతిస్తతర్య. వేదశ్సేేతిహాస పురాణలలో ఆస్తరం, అలప స్తరం, స్తరం,
స్తరతరం, స్తరతమం అని పలు రీతులలో విష్యాలు ఉంటాయి. నీవు వ్యటిలో స్తరతరమైన
విష్యాలను మాత్రమే గ్రహించి, మిగిలిన వ్యటిని వేర్య చేసి, స్తరతమప్రబంధాలను
అనుగ్రహించావు. నీవు హంసలకు కూడా అందమైన నడకలను నేర్యపతున్ననవు. చకకని నడకలను
తెలిసినదానవు కదా నీవు. ఇంతకాక నీవు శుదధసతేగుణనిన కలిగినదానవు. అందువలలనే విజుులు
నినున హంసగా పలుకుతున్ననర్య.

2) మ్ణితో సామ్యం:

తజ్యమయసేరూపతతాేత్ శ్రీమతసవితవైభవ్యత్,
చింతామణ్ణసమా గోదే దేశకః తేమిహోచాత.

గోదాదేవీ! ఆచారావర్యాలచే నీవు చింతామణ్ణగా కీర్తంపబడుతున్ననవు. మణ్ణ


కాంతిమయమైన సేరూపానిన కలిగి ఉంటుంది. భగవంతునిచే వక్షఃసథలంలో ధర్ంపబడే
గొపపతన్ననిన కలిగి ఉంటుంది. కోర్నవ్యర్క్మ కోర్నవ్యనిని అనినటిని ఇవేగలిగి ఉంటుంది.

నీవు కూడా "దూరాేదలప్రతిమయా తవ దేహకాంతాా" అని దేశకులు స్తతతించినటుల


గర్కపోచ రంగు వంటి రంగును కలిగినదానవు. భగవంతునకు కూడా శోభను కలిగించేదానవై,
తజ్యమయురాలవై వెలుగుతున్ననవు. భగవంతునకు కుడివైపున మహాలక్ష్మి ఉననటేల, ఎడమ పకకన
నీవు వేంచేసి ఉండి, ఆ స్తేమిక్మ ఆనందానిన కలిగించే గొపపతన్ననిన కలిగి ఉన్ననవు. "నీంగాద

4
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

శెలేమ్ నిఱందు" అని, “ఎంగుమ్ తిర్యవర్యళ్ పెற்று మక్మழ்వర్" అనే నీ సూకుతలు మూలంగా
కోర్నవ్యర్క్మ కోర్నవ్యటిని అనినటిని ఇస్తతన్ననవు. ఇటువంటి నినున ఆచార్యాలు చింతామణ్ణగా
పలకడం చాలా తగినది.

3) కల్పవృక్షంతో సామ్యం:

అనేకశ్ఖోజజవలితసేరూపాత్ అనంతభోగిప్రియవరధకతాేత్,
స్తరేశభూష్ణస్తమనః ప్రదాన్నత్ స్తరద్రుమేన్నసి సమాదా గోదే.

అమాి! గోదాదేవీ! దేవలోకంలో ఉండే కలపవృక్షంతో సమానంగా నీవు వెలుగున్ననవు.


కలపవృక్షం అనేది పలు పలు శ్ఖలను కలిగి ఉననది. గొపప కాంతిని కలిగినది. అనేక విధాలైన
స్తఖ్యలను వ్యటిని అనుభవించాలని ఆశ పడేవ్యర్క్మ ఆయా స్తఖ్యలను కలిగించి, ఇంకా ఇంకా
ఆనందానిన కలిగిస్తతంది. దేవేంద్రుడు, శచీదేవి మిక్మకలి ఆశపడిన పుష్ణపలను ఇస్తతంది.
నీవు కూడా, ఆ విధంగానే, కలపవృక్షంవలె పలు పలు శ్ఖలను కలిగిన వేదంలోని
స్తరంగా ప్రకాశంచే తిర్యపాపవై, న్నచిాయార్ తిర్యమొழி అనే ప్రబంధాలను అనుగ్రహించి
లోకంలో అంతటా కీర్తతో వెలుగుతున్ననవు. ఆదిశేష్ణడు అనే పడకపై పర్యండి ఉండే
భగవంతునకు ప్రియానిన ఇంకా ఇంకా వృదిధ చేసేదానవై ఉన్ననవు. నితాసూర్యలకు న్నధుడైన
భగవంతుడు కూడా ఆశపడి అలంకర్ంచ్చకునే రీతిలో అలంకర్ంచ్చకున్ననవు. అందుచేత నీవు
కలపవృక్షంతో సమానమైనదానవు.

4) సూర్యయనితో సామ్యం:

సదోగవిలాసేన తమోహరతాేచ్ సమసతసదేందితమండలతాేత్,


పదాిననౌజజవలాకరప్రభావ్యత్ భాసీహ గోదే! రవితులాశీలా.

5
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

గోదాదేవీ! నీవు సూర్యానితో సమానంగా మిక్మకలి కాంతిని కలిగినదానవై వెలుగున్ననవు.


సూర్యాడు "కదిరాయిరమిరవి" (వేయి క్మరణలను కల సూర్యాడు) అని కీర్తంపబడేవ్యడై, వేయి
క్మరణలను కలవ్యడై వెలుగుతున్ననడు. లోకంలో ఉండే బాహాాంధకారానిన అంతటినీ
పొగుడుతున్ననడు. లోకంలో ఉండే సజజనులు అందర్చే సంధాా సమయాలలో నమసకర్ంపబడే
మండలానిన కలవ్యడై ఉన్ననడు. తామర పువుేలను అనినటిని తన క్మరణలతో వికసింపజేస్తతన్ననడు.

అయిత, సూర్యాడు బయటి చీకటిని మాత్రమే ఉన్ననడు పోగొటటగలుగుతున్ననడు. నీవు


వేదానికంతటికీ వితతనం వంటి తిర్యపాపవై ప్రబంధానిన, న్నచిాయార్ తిర్యమొழி ప్రబంధానిన
అనుగ్రహించి, లోకంలో ఉండే అజ్ఞునమనే చీకటిని కూడా పూర్తగా అంతర్ంపజేస్తతన్ననవు.
లోకంలో ఉండే సజజనులు అందరూ సదా నమసకర్ంచే తజ్యమండలానిన కలిగినదానవై ఉన్ననవు.
అంత కాక, నీవు అవతర్ంచిన పాండామండలం పేర్య వినగానే సజజనులు అందరూ చేతులెతిత
నమసకర్స్తతర్య. తామర పువుేవంటి ముఖం కలిగిన భగవంతునకు గొపప ఆనందానిన కలిగించి,
దానివలల "అప్రమేయం హి తతతజః" అని చెపేపవిధంగా ఆ భగవంతుని ముఖమనే తామర పువుేను
వికసించేటటుల చేస్తతన్ననవు. ఈ విధంగా నీవు అనిన విధాలా సూర్యానితో పోలి ఉన్ననవు.

5) చంద్ర
ు నితో సామ్యం:

కళాతికతాేత్ కమలాతికతాేత్ భవ్యర్తతాపక్షపణసేశైతాాత్,


సదా మహావిష్ణిపదానుష్ంగాత్ హిమాంశుతులాా తేమిహాసి గోదే.

గోదాదేవీ! నీవు చంద్రునితో సమానంగా వెలుగుతున్ననవు. చంద్రుడు పదహార్య కళలు అనే


సంపదను కలిగినవ్యడై వెలుగుతున్ననడు. ("సలిలం కమలం జలమ్" అనే విధంగా కమలం అంటే
జలం అని కూడా అరథం). జలమయమైన సముద్రానిన చిలిక్మనపుపడు పుటిటనవ్యడు చంద్రుడు.
అందువలలనే అతడు జలంవలె తెలలని సేభావం కలిగినవ్యడు. అతడు భూమిలో పుటిటన మానవుల

6
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

శరీరంలోని తాపానిన, మనస్తలోని తాపానిన తన క్మరణలతో పోగొడతాడు. అనిన కాలాలలోనూ


ఆకాశ్నిన తనకు నివ్యసంగా కలిగి ఉంటాడు.

గోదాదేవీ! నీవు అరవై న్నలుగు కళలను తెలిసినదానవు. "దేవి! తాేం సహ నీళయా సహ


మహీ దేవా ససహస్రం తథా యాభిసతవం సతనబాహుదృషిటభిర్వ" (శ్రీగుణరతనకోశమ్౼26) అని
పరాశర భటటర్ పలిక్మనటులగా కమల అనబడే శ్రీమహాలక్ష్మిక్మ అవయవభూతగా ఉన్ననవు. నీ కర్యణ
నిండిన చలలని కటాక్షాలతో సంస్తరతాపంతో బాధపడే జీవులకు ఆ బాధను అంతటినీ
పోగొడుతున్ననవు. ఎలలపుపడూ మహావిష్ణివు యొకక పాదారవిందాలను ఆశ్రయించి ఉన్ననవు.
అందువలల, గోదాదేవీ! నీవు చంద్రునితో పోలి ఉన్ననవు.

6) చిలుకతో సామ్యం:

శ్ామాం దిేజ్ఞధపస్తతాం శ్రవణభిరామాం మంజుసేన్నం మదనమీశేరజం భజంతీమ్,


గోదే! గురో స్త్రిజగతాం గుణశ్లినీం తాేం లీలాశుకీం కృతధయః సముదాహరంతి.

గోదాదేవీ! గొపప జ్ఞున్ననిన కలిగిన మహనీయులు నినున లీలాశుకంగా పలుకుతున్ననర్య.


చిలుక పస్తపు పచాని రంగును కలిగి ఉంటుంది. పక్షిక్మ దిేజమని పేర్య. ఇటువంటి పక్షులకు
ప్రభువు గర్యడుడు. చిలుక కూడా పక్షి జ్ఞతిక్మ చెందిన అయినందున గర్యడునకు కూతుర్యగా
చెపపబడుతుననది. చిలుక చెవులకు మధురంగా ఉండే , అందమైన సేరానిన కలిగినది.
శ్రీమన్ననరాయణుని కుమార్యడైన మనిథుని ఆశ్రయించి అతనిక్మ వ్యహనంగా చిలుక
వెలుగుతుననది.

గోదాదేవి, చిలుకవలెనే, పచాని వరాినిన కలిగినది. బ్రాహిణులకు అధపతి అయిన


విష్ణిచితుతలకు కుమార్తత. చెవులకు ఇంపైన తిర్యపాపవై ప్రబంధానిన పాడినది. లక్ష్మీపతి పురుడైడైన
మనిథుని "తైయొర్య తింగళుమ్" అనే దశకంలో మనిధుని ఆశ్రయించింది.
మనిథునకే మనిథుడు అయిన శ్రీకృష్ణిని స్తతతించింది. భగవద్గగతను పలిక్మ ములోలకాలలో

7
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

జగదుగర్య అని వ్యస్తదేవుని కూడా తిర్యపాపవై ఆనందింపజేసే గుణలను నిండుగా కలిగిన చిలుక
గోదాదేవి. శ్రీకృష్ణిని గుణలనే పాడిన శుకమహర్ితోకూడా ఈమె స్తటి వస్తతంది.

7) కామ్ధేనువుతో సామ్యం:

వృష్ప్రియాం విశేజన్నఖిలారథం విశ్రాణనోతాకం విధవ్యసవేడాామ్,


శ్రుతిప్రసన్ననం స్తరభిం విశంకే సేస్తథం మఖ్యరాహం భవతీం తు గోదే!.

తలీల! గోదాదేవీ! నినున నేను కామధేనువుగా తలుస్తతన్ననను. "వృష్౼సేచనే" అనే ధాతువు


ప్రకారం, వృష్ శబాానిక్మ తడిపేది అనేది అరథం. "వరితీతి వృష్ః" అని, లోకానిన అంతటినీ వరిం
కుర్పించి చలలబర్చేవ్యడు, ఇంద్రుడు. ఈ ఇంద్రుని విష్యంలో ప్రీతిని కలిగినది స్తరభి అనే
కామధేనువు. విశ్రాణనమ్ అని అంటే గొపప దాన గుణం. కోర్నవ్యర్క్మ కోర్న విష్యానిన
ఎకుకవగా ఇచేా గుణం. ఉతాక అంటే ఆ గుణంలో చాలా ఆశ కలిగి ఉండడం. అందువలల,
కేమధేనువు పక్షంలో "విశ్రాణనోతాక" అనేది ౼ కామధేనువు చాలా ఔదారాానిన కలిగినది అనే
అరాథనిన ఇస్తతంది. అందువలల కామధేనువు గొపప దానగుణనిన కలిగినదై, అడిగినవ్యర్క్మ అడిగిన
కోర్కను అంతటినీ ఇవేడంలో ఆశ కలిగినది అనే అరథం ఇకకడ వస్తతంది. ఐహికఫలాలను
ఇవేడం దాేరా కామాశ్రుతిలో జనులకు విశ్ేస్తనిన కలిగించి, ఆ శ్రుతిని ప్రకాశంప చేస్తతననది,
కామదేనువు. "శ్రుతిం ప్రసననయతీతి శ్రుతిప్రసన్నన" అనే అరాథనిన ఇకకడ శ్రుతిప్రసననశబాానిక్మ
చెపుపకోవ్యలి. సేః అంటే సేరగం. సేః తిష్ఠతీతి సేస్తథ - సేరగంలో ఉండేది అని అరథం. కామధేనువు
సేరగంలో ఉంటుంది కదా. "మఖ్యరాహమ్" అంటే ౼ యాగానిక్మ కావలసిన పాలు, నెయిా మొదలైన
ద్రవ్యాలను ఇస్తతననందున యాగం చేసేవ్యర్చే ఆదర్ంపబడేది, కామధేనువు అని అరథం. ఇది
కామదేనువు విష్యంలోని వివరణ.

గోదాదేవి విష్యంలో వివరణ ఏ విధంగా అంటే౼వృష్భంవంటి గంభీరమైన నడకను


కలిగిన కృష్ణిని విష్యంలో గోదాదేవి ప్రీతిని కలిగినది. ఆమె వృష్ణప్రియ. "వృష్ప్రియం యస్తాః

8
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

స్త వృష్ప్రియా" అనే వుాతపతితని ఇకకడ చెపుపకోవ్యలి. భూలోకంలో నివసించే చేతనులకందర్క్మ


వ్యర్య వ్యర్య కోరే పుర్యష్ణరాథలను అనినటినీ ఇవ్యేలి అనే కోర్క కలిగినది, గోదాదేవి. ఆమె భూదేవి
అవతారమే కనుక, బ్రహి, ఇంద్రుడు మొదలైన దేవతలచే స్తతతింపబడుతుననది. వేదానిక్మ
అంతటికీ వితుతవంటి "కోదై తమిழ்" అని పొగడబడే తన ప్రబంధాల దాేరా
సపష్టంగా తెలిపినందున, వేదానిన ఆమె ప్రకాశంపజేసింది. తనకు సేరగంగా ఉండేది భరత సనినధలో
ఆమె ఉంటుంది. "పతీి యజుసంయోగే" అనే విధంగా ఈమె విష్ణిపతిన కనుక, యాగాలలో
పూజంచదగినది. అందుచేత గోదాదేవి కామదేనువుతో స్తమాానిన కలిగి ఉననది.

8) నీరాట్ట
ో త్సవప్
ర యోజనం:

గోదే! స్తనతాసి మాతః!తేమిహ నిగమశ్స్తేకతమంత్రక్రియాభాాం


ఏతనైవ్యతిపాపా వయమిహ సకలా ముకతపాపా భవ్యమః,
లోకే దృష్టశా కరేిదృశమిహ సకలైః సేప్రజ్ఞరోగశ్ంతెళా
మాతా పీతాే కష్ణయం తనయమథ నిజసతనాదానేన పాతి.

ఈ భూమిక్మ అంతటికీ తలిల అయిన గోదాదేవీ! వేదాలలో చెపపబడిన మంత్రాలు, క్రియలు


అనే వీటిని అనుసర్ంచి నీ తిర్యమంజనోతసవం జర్యగుతుననది. నీవు ఈ విధంగా స్తననమాడడం
వలల చాలా పాపాలను చేసిన మేమంతా కూడా అనిన విధాలైన పాపాల నుండి విముకుతలము
అవుతున్ననము. స్తననం చేస్తతననది నీవు, పాపాలు తొలగిపోతుననది మాకు! ఇది ఏ విధంగా
పొసగుతుంది? అని అంటే, లోకంలో ఈ ప్రక్రియను సపష్టంగా చూస్తతన్ననము. బిడాకు ఏదైన్న
రోగం వసేత, ఆ వ్యాధ తీరడం కోసం, ఆ బిడా తలిల తాను ముందుగా కష్ణయం మొదలైన
మందులను తాగుతుంది. తర్యవ్యత తన సతన్నానిన ఆ బిడాకు ఇచిా తదాావరా ఆ బిడాకు కలిగిన
రోగానిన తీర్ా కాపాడుతుంది. ఆ విధంగానే లోకమాత అయిన నీవు కూడా తన ప్రబంధాలనే
సతన్నానిన ఇచిా, మా సంస్తరమనే రోగానిన లేకుండా చేస్తతన్ననవు. ఇది వింతలోల వింత కదా.
అటువంటి గోదాదేవీ! నీవు, శ్రీరంగన్నథుడు మముిలను రక్షించాలి.

9
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్



కృష్ణాష్టకవ్యాఖ్యానమ్ - సవ్యాఖ్యానమ్

మన పూరాేచార్యాలు నితాానుసంధేయాలుగా విధంచిన స్తతత్రాలలో ఈ కృష్ణిష్టకం


ఒకటి. ఇది శ్రీకృష్ిభగవ్యనుని వైభవ్యనిన అందంగా తెలియజేస్తతననది. కేవలం ద్గని శబామాత్రో-

చాారణ వలల పవిత్రత, తృపిత సిదిధంచిన్న, ఇందులోని అరథవిశేష్ణలను గ్రహిసేత మనస్తకు ఆనందం
కలుగుతుంది కదా. అందువలల సంగ్రహంగా ఈ స్తతత్రంలోని విశేష్ణలు విననపింపడుతున్ననయి.
ఇందులో శ్రీకృష్ిభగవ్యనుని సేరూప రూప గుణ విభూతి దివ్యావతార దివాలీలల కీరతనం

10
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

చేయబడడం గమనించవచ్చా. "దేవకీపరమానందమ్" అని ఆనందప్రదతేం చెపపబడింది.


"వస్తదేవస్తతమ్" అని అనననందున "అజ్ఞయమానో బహుధా విజ్ఞయత" అని శ్రుతిలో
కీర్తంపబడిన భగవదవతారకీరతనం చేయబడింది. "కంసచాణూరమరానమ్" అని అనననందున
దుష్టనిగ్రహరూపమైన లీలాప్రస్తతవన చేయబడింది. "అతసీపుష్పసంకాశమ్" ఇతాాదిగా దివా-
మంగళవిగ్రహవరినం చేయబడింది. "చతుర్యుజమ్" అననందున చతుర్ేధపుర్యష్ణరథప్రదతేం
సూచింపబడింది. "శ్రీనికేతనమ్" అని అనననందున లక్ష్మీవిశష్టతేం చెపపబడింది. "ఉతుులలపది-
పత్రాక్షమ్" అని అననందున దయావ్యతసలాాది గుణవిశష్టతేం సూచింపబడింది. ఈ విధంగా ఈ
స్తతతి విశష్ణటద్ళేత సిదాధంతంలోని పలు అంశ్లను ప్రతిపాదిస్తతననది.



1) వస్తదేవస్తతం దేవం కంసచాణూరమరానమ్,


దేవకీపరమానందం కృష్ిం వందే జగదుగర్యమ్.

వస్తదేవుని కుమార్యడు, తలిల అయిన దేవకీదేవిక్మ ఆనందానిన కలిగించేవ్యడు, కంస్తడు,


చాణూర్యడు మొదలైనవ్యర్ని సంహర్ంచినవ్యడు, జగదుగర్యవైన శ్రీకృష్ణిని నమసకర్స్తతన్ననను.

(వస్తదేవస్తతమ్): వస్త౼గొపప నిధ. వస్తదేవుడు ౼ నిధని పొందినవ్యడు, నిధని


కలవ్యడు. వస్తదేవుడు, దేవక్మ పొందిన స్తటి లేని నిధ కదా శ్రీకృష్ణిడు. పుటిటన వెంటనే ఆ నిధని
కోలోపయి, చాలా కాలం తర్యవ్యత తిర్గి ఆ నిధని పొందినటుల వ్యర్ చర్త్ర తెలుపుతుననది.
దేవదేవసేరూపానిన దర్శంపజేసూత జనిించిన శ్రీకృష్ణిని చూచి, అతని తలిలదండ్రులైన
దేవకీవస్తదేవులు పొందిన ఆనందానిన పరమానందం అని అనడం చాలా యుకతం.

11
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

(వస్తదేవస్తతం దేవమ్): “దివు౼ద్గప్తత" ధాతువునుండి పుటిటన దేవశబాానిక్మ, ‘ప్రకాశంచే-


వ్యడు’ అని అరథం కనుక, వస్తదేవస్తతుడై పుటిటనందున ప్రకాశంచేవ్యడు అనే అరాథనిన ఈ ర్తండు
విశేష్ణలు, ఈ కలయిక దాేరా స్తుర్స్తతననది. ఇకకడ "స ఉ శ్రేయాన్ భవతి జ్ఞయమానః" అని
అంటూ వేదం, భగవంతుడు అవతారాలను ఎతితనపుడే అతనిక్మ అంతకు ముందు లేని శోభ
కలుగుతుందని చెపిపన అరథం స్తుర్ంపజేయబడుతుననది.

(దేవమ్): “శ్దు శనతెళత నలియుమ్ కంజనై చాాదిపపదఱ్కక ఆదియమ్ శోదియుర్యవై


అంగువైతుత ఇంగు పిపఱంద" (సతుపర్యష్ణలను బాధంచేవ్యడైన కంస్తని సంహర్ంచడంకోసం తన
అప్రాకృత మైన రూపానిన పరమపదంనుండి గ్రహించి, ఈ లోకంలో అవతర్ంచిన దేవదేవుడు)
- (తిర్యవ్యయ్ మొழி౼3౼5౼5), "విఱ్పపర్య విழవుమ్ కంజనుమ్ మలులమ్ వేళముమ్ పాకనుమ్
వీళచెళాற்றవన్" (ధనురాాగం, కంస్తడు, మలులలు, కువలయాపీడం అనే ఏనుగు, మావటివ్యడు
అనే వీరందర్ని నశంపజేసినవ్యడు) (తిర్యమొழி౼ 2౼3౼1) అని ఆழ்వ్యర్యల కూడా కంస్తని,
చాణూరముషిటకులనే మలలయుదధ వీర్యలను సంహర్ంచిన వృతాతంతానిన అనుసంధంచార్య.

(దేవం కంసచాణూరమరానమ్): "దివు ౼క్రీడాయామ్" అనే ధాతువు నుండి పుటిటన


దేవశబాానిక్మ ఇకకడ "అవతర్ంచి లీలలను చేసేవ్యడు" అని అరథం గ్రహించవచ్చా. అపుడు
శ్రీకృష్ిభగవ్యనుడు ఎందువలల దేవశబా వ్యచ్చాడు అవుతున్ననడు అనే ప్రశనకు "కంసచాణూర
మరానమ్" అనే విశేష్ణం సమాధానం పలుకుతుననది. దుష్ణటడైన కంస్తని,
చాణూరముషిటకులనే మలలయుదధవీర్యలను సంహర్ంచడం అనే లీలను ప్రదర్శంచినవ్యడు కనుక,
దేవుడు అయిన్నడు అనే భావం ఇకకడ ఈ ర్తండు పదాల యోజనదాేరా స్తుర్స్తతననది.

(కంసచాణూరమరానం దేవకీపరమానందమ్): శ్రీకృష్ి భగవ్యనుడు భగవద్గగత తన


అవతార ప్రయోజన్నలను గుర్ంచి తెలియజేసూత, "పర్త్రాణయ స్తధూన్నం విన్నశ్య చ
దుష్కృతామ్" అని అంటూ సజజనులను రక్షించడం, దుష్ణటలను శక్షించడం అనేవి తన అవతార
ప్రయోజన్నలు అని అన్ననడు. ఇకకడ "కంసచాణూరమరానమ్" అని అనడంచేత దుష్టశక్షణ ,

12
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

"దేవకీపరమానందమ్" అని అనడందాేరా శష్టరక్షణ తెలియజేయబడాాయి. అందుచేత, ఈ ర్తండు


విశేష్ణపదాలు దేవశబాంచేత చెపపబడిన అవతారంలోని ప్రయోజన్నలను సూచిస్తతన్ననయి.

(దేవకీపరమానందం కృష్ిమ్): శ్రీకృష్ిభగవ్యనుని అవతారం కేవలం దేవకీదేవి


ఆనందంకోసమేన్న? అని అంటే, అంతమాత్రమే కాదు, జగతుతను అంతటినీ
ఆనందింపజేయడంకోసం భగవంతుడు కృష్ణిడై అవతర్ంచాడు అనే అరథవిశేష్ం కృష్ిశబా
ప్రయోగందాేరా స్తుర్స్తతంది. "కృషిః భూవ్యచకః శబాః ణస్తత నిరేృతివ్యచకః, కృష్ిః
తదాువయోగాచా" అనే కృష్ిశబానిర్యక్మతని ఇకకడ అనుసంధంచాలి.

(వస్తదేవస్తతం దేవం కంసచాణూర మరానం దేవకీపరమానందమ్): మధురానగరంలో


కారాగార గృహంలో వ్యస్తదేవునకు కుమార్యడై జనిించిన వృతాతంతం "వస్తదేవస్తతమ్" అనే
పదం దాేరా, ఆ తర్యవ్యత రేపలెలకు చేర్, అకకడ అతాదుుతమైన, అతిమానుష్మైన లీలలను
ప్రదర్శంచిన వృతాతంతం "దేవమ్" అనే పదందాేరా, తర్యవ్యత మధురకు వచిా, కంస్తడు,
చాణూరముషిటకులు, కువలయాపీడం, మావటివ్యడు మొదలైనవ్యర్ని సంహర్ంచిన వృతాతంతం
"కంసచాణూర్యమరధనమ్" అనే పదం దాేరా, ఆ తరాేత దేవకీ వస్తదేవులను చేర్, తన
దివామంగళ రూపానిన వ్యర్క్మ దర్శంప చేసి, వ్యర్ని ఆనందింపజేసిన వృతాతంతం "దేవకీ
పరమానందమ్" అనే పదం దాేరా, ఆ తరాేత నరకాస్తర్యడు, బాణస్తర్యడు, శశుపాలుడు
మొదలైన దుష్ణటలను సంహర్ంచి, కుర్యక్షేత్ర సంగ్రామానిన నిరేహించి, దురాిర్యగలను
నశంపజేయడం దాేరా భూభారానిన తొలగించి, లోకానిక్మ ఆనందానిన కలిగించిన వృతాతంతం
"కృష్ిమ్" అనే పదం దాేరా, కుర్యక్షేత్ర యుదధంలో ఆరంభంలో అర్యజనుని నిమితతంగా చేసికొని,
సకల ఉపనిష్తుతల స్తరమైన భగవద్గగతను ఉపదేశంచిన వృతాతంతం "జగదుగర్యమ్" అనే పదం
దాేరా వాకతమవుతుననందున ఈ శోలకం శ్రీకృష్ణివతారవైభవ్యనిన సంగ్రహంగా తెలుపుతుననదని
చెపపవచ్చా.

(కృష్ిమ్): నలలనివ్యడు. నలలని రంగును కలవ్యడు. దేవక్మక్మ కుమార్యడై అవతర్ంచినపుపడు


పెటిటన పేర్య ఇది అనే విష్యం ప్రసిదధం. కృష్ణిడు అనేది భగవంతుని అనేక న్నమాలలో

13
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

ముఖామైనది. ఆనందానిక్మ స్తథనమైనవ్యడు, సృషిట మొదలైన లీలలతో ఆనందించేవ్యడు,


కృష్ణివతారంలో పదహార్య వేలమంది కనాలతో కలసి ఆనందించినవ్యడు ౼ అనే అరాథలను
చెపపవచ్చా. భూమిని ఆనందింపజేసినవ్యడు ౼ అనే అరాథనిన కూడా ఈ న్నమానిక్మ తెలుపుతార్య.
"మణ్ణిన పారమ్ నీంగుదఱ్కక వడమదురై పిపఱందాన్" (తిర్యవ్యయ్ మొழி౼9౼1౼ 10)
(భూభారానిన తీరాడంకోసమే ఉతతరమధురలో జనిించాడు) అని ఆழ்వ్యర్యల అరాధనిన తెలిపార్య.
భూమిక్మ భారంగా ఉండేవ్యర్య ఎవరంటే ౼ కంస్తడు, శశుపాలుడు, దురోాధనుడు మొదలైన చెడా
బుదిధ కలవ్యర్య. "నిలమంగై తుయర్ తీర్ తుతయా పాపరతతుతళ్ ఇవర్తతరశర్ తడుమాఱ ఇర్యళ్ న్నళ్
పిఱంద అమాిన్" (తిర్యమొழி౼8౼8౼9) (భూదేవి దుఃఖం తీరడంకోసం భారతయుదధంలోని
ప్రభువులందరూ కలత చెందేటటుల చీకటివేళలో పుటిటన స్తేమి) అని తిర్యమంగై ఆழ்వ్యర్యల
అన్ననర్య. భూమిక్మ రక్షకుడు అని ద్గనివలల తెలుస్తతననది. గోవిందన్నమ శబాారథం కూడా ఇదే.

(జగదుగర్యమ్): గుర్యవు అంటే అజ్ఞున్ననమనే అంధకారానిన పోగొటేట ఆచార్యాడు అని


అరథం. ఈ ప్రయోగానిక్మ ఇంకా అనేక అరాథలు ఉన్ననయి. ఆదిగుర్యవై మొదట అవతర్ంచివ్యడు
అని కూడా అరథం. "యో బ్రహాిణం విదధాతి పూరేం యో వై వేదాంశా ప్రహిణోతి తస్ళి" (ఎవడు
బ్రహిను సృషిట ఆరంభంలో పుటిటంచి, అతనిక్మ వేదాలను ఉపదేశం చేశ్డో) అని వేదం కూడా
భగవంతుడైన శ్రీ కృష్ణిని జగదుగర్యవుగా పలిక్మంది. కృష్ణిని బాలాలీలలలో మొదటి లీల
పూతన్నవధ. ఆమె తన సతన్నానిక్మ పూసికొనన విష్ణనిన "విడపాపలముదా అముదు శెయ్ దిటట
మాయన్" (తిర్యవ్యయ్ మొழி౼1౼5౼10) (పూతన ఇచిాన విష్ంతో కూడిన పాలను
అమృతంగా ఆస్తేదించిన, ఆశారాకరమైన లీలలను కలవ్యడు) ఇతడే. "సతనాం తత్ విష్సం-
మిశ్రం రసామాసీత్ జగదుగరోః" (జగదుగర్య అయిన ఆ బాలకృష్ణినకు విష్ంతో కలిసిన సతనాం
మధురమైనది) అని హర్వంశంలో వ్యాసభగవ్యనుడు కూడా పూతన్న సంహారసందరుంలో
జగదుగర్యశబాానిన ప్రయోగించార్య. అందువలల ఈ విశేష్ణం పూతన్నవధను సూచిస్తతననది అని
చెపపవచ్చా. "విడనంజ ములై శువైతత మికు ఞాన చిాఱ్కకుழవి" (విష్ంతో కూడిన సతన్నానిన
ఆస్తేదించిన, గొపప జ్ఞున్ననిన కలిగిన చినన బాలుడు) అని నమాిழ்వ్యర్యల కూడా పూతన్న

14
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

సంహారసందరుంలో గుర్యశబాారాథనిన అనుసంధంచార్య. "అకల్ ఞాలతతవర్ అఱియ నెఱి


యెలాలమెడుతుతఱతత నిఱ ఞానతొతర్య మూర్త" (తిర్యవ్యయ్ మొழி౼4౼8౼6) (విశ్లమైన ఈ
ప్రపంచంలోని వ్యరందరర్య తెలిసేటటులగా శ్స్త్రంలోని స్తరానిన అంతటినీ ఉపదేశంచిన
సంపూరిజ్ఞునసేరూపుడు) అని శ్రీకృష్ణిని సకలవేదస్తరమైన గీతాశ్స్తేనిన ఉపదేశంచిన
జ్ఞునమూర్త అయిన జగదుగర్యవుగా కీర్తంచార్య. అర్యజనుని వ్యాజంగా చేసికొని, సకలోపనిష్త్
స్తరమైన భగవద్గగతను విశ్లమైన ఈ ప్రపంచంలో ఉండేవ్యరంతా గ్రహించేటటుల ఉపదేశంచిన
జగదుగర్యవు శ్రీకృష్ణిడే. ఈ గీతాశ్స్త్రంలోని స్తరం "మామేకం శరణం వ్రజ" అనే సూక్మత. "నీవు
వర్ంచిన ఆచార్యాడనై, శ్స్తేనిన అంతటిని ఉపదేశంచిన ననున శరణు పొందు" అని అన్ననడు,
శ్రీకృష్ణిడు. అందువలల జగదుగర్యవు శ్రీకృష్ణిడే.

(వందే): "వది౼ అభివ్యదన స్తతతోాః" అనే ధాతువునుండి పుటిటన ఈ క్రియారూపంవలల


కాయికమైన, వ్యచికమైన ప్రపతిత తెలుపబడిన్న, అవి మానసిక ప్రపతితక్మ కూడా ఉపలక్షణం.
త్రికరణతికంగా ఆశ్రయిస్తతన్ననను ౼ అని అరథం. ద్గనివలల జగదాచారాసమాశ్రయణం తెలుప-
బడింది. శ్రీమన్ననరాయణుడే కదా పరమగుర్యవు.

2) అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్,
రతనకంకణకేయూరం కృష్ిం వందే జగదుగర్యమ్.

అగిస్పువుేతో పోలిన నలలని తిర్యమేనిని కలవ్యడు, తిర్యమేనిలో తగిన చోటల హారాలు,


నూపురాలు, మణులు పొదిగిన కేయూరాలు, కంకణలు మొదలైన అందమైన ఆభరణలతో
వెలిగేవ్యడు, జగదుగర్యవైన శ్రీకృష్ణిని నమసకర్స్తతన్ననను.

(అతసీపుష్పసంకాశమ్): అగిస్ పువుే రంగుతో పోలిన వరింతో శ్రీకృష్ణిడు శోభిలేల


విష్యానిన దివాసూర్యలు దివాప్రబంధాలలో పలు చోటల కీర్తంచార్య. "కాయామలర్ వణిన్"
(2౼5౼2) అని పెర్యాళాేర్యల, "కాయావణిన్" (1౼8) అని గోదాదేవి, "మా కాయామ్

15
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

పూంగొళ్ మేని" (తిర్యవ్యయ్ మొழி౼8౼10౼10) అని నమాిழ்వ్యర్యల కీర్తంచడం గమనించ-


వచ్చా.

కేవలం కొదిా క్షణలలో తన శోభను కోలోపయే లౌక్మకమైన ఒక పువుేను భగవంతుని


దివాదేహానిక్మ ఉపమానంగా పలుకడం తగున్న? ఉపమానం అనేది అధకగుణనిన కలిగినదై
ఉండాలని ఆలంకార్క సంప్రదాయం కదా! - అని అంటే, ఇకకడ చెపిపన ఉదాహరణ
శ్రీరామాయణంలో వ్యలీిక్మ మహర్ి శ్రీరామచంద్రుని గుణలను వర్ిసూత "గుణః దశరథోపమః,
సముద్ర ఇవ గాంభీరేా, ధైరేాణ హేమవ్యనివ" ఇతాాదిగా లౌక్మకమైన ఉదాహరణలను పలిక్మనటేల,
ఇది కూడా అని భావించాలి. ఆ విధంగానే ఈ స్తతత్రంలో తర్యవ్యత కనిపించే పలు
ఉదాహరణలను సమనేయం చేస్తకోవ్యలి. "ఓదువ్యర్ ఓతెతలామ్
ల ఎవుేలకతుత ఎవేవైయుమ్
శ్దువ్యయ్ నిన్ పుకళిన్ తకయలాలల్ పిఱిదిలెళ"ల (లోకంలో నినున గుర్ంచి చేసే స్తతతులనీన నీ
సంబంధంచేత అవి స్తరథకతను పొందుతున్ననయి తపప, అవి నీ వైభవ్యనిన పూర్తగా వర్ించ
గలిగినవి కాదు) అనే నమాిళాేర్యల సూక్మత సిరణీయం.

పాదాలలో నూపురాలు, కడియాలు మొదలైవి, వక్షఃసథలంలో వనమాల, ముతాాల


మాలలు, రతానల హారాలు మొదలైనవి చేతులలో రతానలు పొదిగిన బాహువలయాలు, చేతి
వలయాలు మొదలైన ఆభరణలు ఇకకడ తెలుపబడాాయి.

(శోభితమ్): ఆభరణలవలల ఇతడు శోభిస్తతన్ననడా?, లేక, స్తేమి తిర్యమేనిలో ఉననందున


అవి శోభిస్తతన్ననయా? అని అంటే, ఇకకడ ఆభరణలకు స్తేమియే శోభను కలిగిస్తతన్ననడు అని
చెపాపలి. స్తేమి "ఆభరణస్తాభరణం ప్రస్తధనవిధేః ప్రస్తధనవిశేష్ః” అననటుల అలంకారాలకే
గొపప అలంకారంకదా. భగవంతుడు అలంకర్ంచ్చకునే ఆభరణల వైచిత్రిని, బహుతాేనిన
భగవద్రామానుజులు శరణగతి గదాలో "క్మరీటమకుటచూడ వతంస మకరకుండల
గ్రైవేయకహారకేయూరకటక శ్రీవతసకౌస్తతభ ముకాతదామోదరబంధన పీతాంబర కాంచీగుణ-
నూపురాది అపర్మితదివాభూష్ణ” - అని చాలా వివరంగా పలుకడం గమనించవచ్చా. "నిరతి-

16
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

శయస్తగంధ నిరతిశయస్తఖ సపరశ నిరతిశౌజజజవలా" అని ఈ ఆభరణలు అనీన విశేషించి


చెపపబడాాయి. గొపప పర్మళానిన కలిగినవి, తిర్యమేనిని ఒరస్తకోకుండా మృదువుగా, ప్రకాశ్నిన
కలిగించేవిగా ఉన్ననయి ఈ ఆభరణలు.

"అతసీపుష్పసంకాశమ్" అనే విశేష్ణం దాేరా దివామంగళవిగ్రహశోభ, ఆ దివామంగళ


విగ్రహానిక్మ ఉండే మారావం, లావణాం, సందరాం, సౌగంధాం మొదలైన గుణలు తెలుపబడాాయి.
అందుచేత ఈ విశేష్ణం శ్రీకృష్ిభగవ్యనుని దివారూపానిన వర్ిస్తతననది. "హారనూపురశోభితం,
రతనకంకణకేయూరమ్" అని అనడంవలల అనేక విధాలైన దివ్యాభరణలు చెపపబడాాయి.

3) కుటిలాలకసంయుకతం పూరిచంద్రనిభాననమ్,
విలసతుకండలధరం కృష్ిం వందే జగదుగర్యమ్.

గుండ్రని ఆకారానిన కలిగిన, అందమైన ముంగుర్యలను కలవ్యడు, పూరిచంద్రుని పోలిన


ముఖమండలానిన కలవ్యడు, చెవులలో గొపపగా వెలిగే మకర కుండలాలను అలంకర్ంచ్చ-
కొననవ్యడు, జగదుగర్యవు అయిన కృష్ణిని ఆశ్రయిస్తతన్ననను.

(కుటిలాలకసంయుకతమ్) "వండినమ్ పోల్ శుర్యండు ఇర్యండ కుழల్"(పెర్యాழ்వ్యర్


తిర్యమొழி౼3౼6౼9) (తుమెిదల గుంపువలె గుండ్రంగా, నలలగా ఉండే కేశపాశం) అని
పెర్యాழ்వ్యర్యల శ్రీకృష్ణిని ముంగుర్యల అందానిన వర్ించార్య.

(పూరిచంద్రనిభాననమ్) "శందిరన్ పోల్ ముకతాతన్" అను గోదాదేవి తన


ప్రబంధంలో శ్రీకృష్ణిని ముఖం చంద్రునితో పోలినది అని అనగా, పెర్యాழ்వ్యర్యల "ఎతతనై
శెయిాలుమ్ ఎన్ ముకమ్ నేరొవ్యేయ్...అంబులీ!" (చంద్రా! ఎంత నినున సంసకర్ంచిన్న నీవు న్న
కుమార్యని ముఖంతో స్తటి రావు) అని యశోదాభావనతో శ్రీకృష్ణిని ముఖ్యనిక్మ చంద్రాధకాానిన
పలికార్య.

17
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

(విలసతుకండలధరమ్) "మినున మణ్ణమకరకుండలంగళ్ విల్ వీశ" (తిర్యవ్యశర్యమ్)


(ప్రకాశంచే, మణులు పొదిగిన మకరకుండలాలు కాంతిని వెలువర్ంచగా) అని నమాిழ்వ్యర్యల,
"తాళ్ నిాలంగు మకరమ్ శేర్ కుழழ" (తిర్యనెడుందాండకమ్) (చెవులకు వేలాడుత్త ప్రకాశంచే
మకరకుండలాలు అని తిర్యమంగై ఆழ்వ్యర్యల భగవంతుని కుండలాల కాంతిని వర్ించార్య.

4) మందారగంధసంయుకతం చార్యహాసం చతుర్యుజమ్,


బర్హపింఛావచూడాంగం కృష్ిం వందే జగదుగర్యమ్.

తన తిర్యమేనిలో మందార పూల పర్మళానిన కలవ్యడు, అందమైన మందహాస్తనిన


చేసేవ్యడు, న్నలుగు చేతులను కలవ్యడు, క్మరీటంలో నెమలిపించానిన ఆభరణంగా ధర్ంచినవ్యడు,
జగదుగర్యవైన శ్రీకృష్ణిని నమసకర్స్తతన్ననను.

(మందారగంధసంయుకతమ్) దేవతర్యవు అయిన మందారవృక్షానిక్మ పూచిన పూవు


దివామైన పర్మళానిన కలిగి ఉంటుంది. తన ఇచాతో సీేకర్ంచిన, అప్రాకృతమైన రూపం కనుక
శ్రీకృష్ి భగవ్యనుని రూపం దివాపర్మళానిన కలిగి ఉంటుంది. దానిక్మ తోడు దివామందార పూల
పర్మళం కూడా కలిసేత ఇక చెపపవలసినది ఏముననది?

(చార్యహాసమ్) "నిన్ ముకవొళి తికళ ముఱ్కవల్ శెయ్ దు" (తిర్యవ్యయ్ ౼6౼2౼9) (నీ
ముఖకాంతి ప్రకాశంచేటటుల చిర్యనవుే నవిే) అని నమాిழ்వ్యర్యల పలిక్మన విధంగా కనాలను తన
వశం చేసికొనే ఉపాయం ఈ చిర్యనవుే. కనెనలనే కాదు, అందర్ని మైమరపించే స్తటి లేని మేటి
ఆయుధం ఇది. "తాస్తమావిరభూత్ శౌర్ః సియమానముఖ్యంబుజః...స్తక్షాత్ మనిథమనిథః"
(ఆ గోపికల ముందు శ్రీకృష్ణిడు చిర్యనవుేతో కూడిన, తామర పువేంటి ముఖ్యనిన కలిగినవ్యడై,
అందువలలనే స్తక్షాతుత మనిథుని మనస్తను కూడా మథంచేవ్యడై ఆవిరువించాడు) అని కదా
ఋషివ్యకుక.

(చతుర్యుజమ్) భగవంతునకు రామకృష్ణిది మనుష్ణావతారాలలో న్నలుగు భుజ్ఞలు


ఉన్ననయా? అని అంటే, ఉన్ననయి అనేదే వ్యసతవం. శ్రీకృష్ి భగవ్యనునకు జనిించినపుపడు ఉనన

18
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

రూపం కదా ఇది. "ఉపసంహర సరాేతిన్ రూపమేతత్ చతుర్యుజమ్" అని కననవ్యర్య


ప్రార్థంచినందున ఆ రూపానిన మర్యగుపర్చాడు, అంత. శ్రీకృష్ణిడు తన తోటి బాలకులతో ఆటలు
ఆడేటపుపడు, తన చేతులతో శంఖచక్రాలను ధర్ంచిన చతుర్యుజ రూపానిన వ్యర్క్మ చూపించి,
వ్యర్ని భయపెటిటన వృతాతంతానిన పెర్యాழ்వ్యర్యల "అమినే అపూపచిా కాటుటక్మన్నాన్" అనే
సూక్మతదాేరా వాకతం చేశ్రని మన పూరాేచార్యాలలో ఒకరైన గోవిందభటటర్ తెలిపార్య.
అర్యజనునుడు విశేరూప దరశనసందరుంలో "క్మరీటనం గదినం చక్రహసత మిచాామి తాేం
విశేరూపం తథైవ, తనైవ రూపేణ చతుర్యుజేన సహస్రబాహో! భవ విశేమూరేత" అని చతుర్యు-
జ్ఞలతో కూడిన రూపానిన దర్శంచడానికే ఇష్టపడాాడు. నమాిழ்వ్యర్యల కూడా "న్ననుగ తోళన్ కుని
శ్ర్ ఙ్గన్ ఒణ్ శంగదైవ్యళాழிయాన్ " (తిర్యవ్యయ్౼8౼8౼1) అని చతుర్యుజ్ఞలలో శంఖ-
చక్రాలను కలిగిన భగవంతుని రూపం తమ హృదయంలో వేంచేసి ఉననదని అన్ననర్య.

(బర్హపింఛావచూడాంగమ్) "మయిల్ తళై పీపలి శూழி" (పెర్యమాళ్ తిర్యమొழி౼6౼9)


అని కులశేఖరాழ்వ్యర్యల, "పీలి తతళైయై పిణతుత"(పెర్యాழ்వ్యర్ తిర్యమొழி౼3౼6౼1) అని
పెర్యాழ்వ్యర్యల శ్రీకృష్ణిడు తన క్మరీటంలో నెమలి పింఛానిన అలంకర్ంచ్చకునన అందానిన
స్తతతించార్య.

5) ఉతుులలపదిపత్రాక్షం నీలజీమూతసనినభమ్,
యాదవ్యన్నం శరోరతనం కృష్ిం వందే జగదుగర్యమ్.

అపుపడే వికసించిన తామరపువుే రేకుతో పోలిన , విశ్లమైన నేత్రాలను కలవ్యడు, వీటిని


నిండుగా తాగిన మేఘంవలె అందమైన రూపానిన కలవ్యడు, యాదవకులానిక్మ
శరోమణ్ణవంటివ్యడు, జగదుగర్యవైన శ్రీకృష్ణిని నమసకర్స్తతన్ననను.

పుండరీకాక్షతేం భగవంతుని లక్షణలలో ఒకటి. ద్గనిని ఛాందోగోాపనిష్తుత "తసా


యథాకపాాసం పుండరీకమేవ మక్షిణీ" అని తెలిపింది. ఈ సూక్మతని భగవద్రామానుజులు
వేదారథసంగ్రహంలో "గంభీరాంభః సముదూుత స్తమృష్ట న్నళ రవికరవికసిత

19
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

పుండరీదళామలాయతక్షణః" (లోతైన నీటిలో పుటిటనది, చాలా బలమైన కాడను కలిగినది,


సూర్యాని క్మరణల వలల వికసించినది అయిన తామరపువుే యొకక రేకువలె విశ్లమైన నేత్రాలను
కలవ్యడు) అని వివర్ంచార్య. "జతం త పుండరీకాక్ష" అని వేద పుర్యష్ణని, "గోవింద పుండరీకాక్ష"
అని భకుతరాలైన ద్రౌపదిని, "క్మమరథం పుండరీకాక్ష" అని విరోధంచిన దురోాధనుని ౼ ఈ విధంగా
అందర్ని లోబరచ్చకునన గొపపదనం పుండరీకాక్షతాేనిక్మ ఉననదికదా.

(నీలజీమూత సనినభమ్) నీటిని నిండుగా తాగిన మేఘం నలలగా ఉంటుంది. శ్రీ కృష్ణిడు
నలలనివ్యడు కనుక అటువంటి మేఘం ఇకకడ ఉపమానంగా చెపపబడింది. ఈ ర్తండింటి మధా
ఉండే స్తమాానిన గోదాదేవి తిర్యపాపవై ప్రబంధంలో "ఆழிమழழకకణి!" అనే పాశురంలో
కీర్తంచార్య. తిర్యపాపణ్ అழ்వ్యర్యల "కొండల్ వణినై" అని అన్ననర్య ఇటువంటి దివాసూర్సూకుతలు
చాలా ఉన్ననయి.

(యాదవ్యన్నం శరోరతనమ్) "ఆయర్ కులతితనిల్ తోనుామ్ అణ్ణవిళక్ళక" (గోపాలకులంలో


అవతర్ంచిన మణ్ణద్గపం) అని గోదాదేవి శ్రీకృష్ణిని ఒక మణ్ణద్గపంగా వర్ించింది.
కులశేఖరాழ்వ్యర్యల ముకుందమాలలో "భకాతపాయ భుజంగ గార్యడమణ్ణః" అనే శోలకంలో
శ్రీకృష్ణిని "గోపాలచూడామణ్ణః" అని అన్ననర్య. నమాిழ்వ్యర్యల కూడా తిర్యవ్యయ్ మొழி
ప్రబంధంలో "ఆయర్ కులతెళత వీడుయా తోతనియ
ా కర్యమాణ్ణకకచ్చాడర్" (6౼2౼10)
(గోపాలకులం తర్ంచేటటుల అవతర్ంచిన, నీలమణ్ణకాంతివంటి కాంతిని కలవ్యడు) అని
మణ్ణస్తమాానిన అనుసంధంచార్య.

6) ర్యక్మిణీకేళిసంయుకతం పీతాంబరంస్తశోభితమ్,
అవ్యపతతులసీగంధం కృష్ిం వందే జగదుగర్యమ్.

20
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

నడుములో ధర్ంచిన పస్తపు పచాని పటుటవస్త్రంతో ప్రకాశంచేవ్యడు, తన ప్రియమహిషి


అయిన ర్యకిణీదేవితో విహర్ంచేవ్యడు, తులసీమాల స్తగంధం వీచే తిర్యమేనిని కలవ్యడు,
జగదుగర్యవు అయిన శ్రీకృష్ణిని నమసకర్సతన్ననను.

(ర్యక్మిణీకేళిసంయుకతమ్) "రాఘవతే౽భవత్ సీతా ర్యక్మిణీ కృష్ిజనిని" అని


శ్రీవిష్ణిపురాణం శ్రీకృష్ణివతారంలో లక్ష్మీదేవి ర్యక్మిణ్ణదేవిగా అవతర్ంచిందని తెలిపింది.
శ్రీకృష్ణిడు ర్యక్మిణ్ణని పర్ణయమాడిన వృతాతంతం హర్వంశం, శ్రీవిష్ణిపురాణం, భాగవతం
మొదలైన పురాణలలో ప్రసిదధం. "ఉర్యపిపణ్ణ నంగై అణ్ణనెడుంతోళ్ పుణర్ న్నాన్" (తిర్యవ్యయ్
మొழி౼7౼10 ౼6) (ర్యక్మిణీదేవి అందమైన, పొడుగైన బాహువులను సంశేలషించాడు) అని
నమాిళాేర్యల, ఇంకా పలువుర్య ఆழ்వ్యర్యల ర్యక్మిణీదేవితో శ్రీకృష్ణిడు ఆనందించిన లీలను
ప్రస్తతవించార్య.

(పీతాంబరస్తశోభితమ్) "తసా మహారజనం వ్యసః" అని వేదం కూడా పీతాంబరం


ధర్ంచడం పరమాతి లక్షణంగా పేరొకంది. "అరై చిావంద ఆడైయిన్ మేల్ శెనాదామ్ ఎన్
శందైనైయే" (శ్రీరంగన్నథుని నడుములో ఉండే ఎర్రని పీతాంబరంపై న్న మనస్త వెళిైంది) అని
పీతాంబరశోభను తిర్యపాపణ్ అழ்వ్యర్యల “అమలన్నది పిరాన్” ప్రబంధంలో స్తతతించార్య.
"పెర్యమానరైయిల్ పీతకవ్యడై కొండు ఎనెళన వ్యటటమ్ తణీయ వీశేరే"
(న్నచిాయార్ తిర్యమొழி౼13౼1) (శ్రీకృష్ిస్తేమి నడుములో ధర్ంచిన పీతాంబరంతో విసర్,
న్నకు కలిగిన ఈ ఆర్తని తీరాండి) అని గోదాదేవి, "పీతకవ్యడై పిరాన్నర్ పిరమ గుర్యవ్యక్మ వందు"
(పెర్యాళాేర్ తిర్యమొழி౼5౼2౼8 ) (పీతాంబరానిన ధర్ంచిన స్తేమి పరమాచార్యాడై వచిా)
అని పెర్యాழ்వ్యర్యల ఈ విధంగా పలువుర్య ఆழ்వ్యర్యల స్తేమి పీతాంబరానిన
ధర్ంచినపుడు ప్రకాశంచే వైలక్షణానిన పలు విధాలుగా అనుభవించి కీర్తంచార్య.

"పీతాంబరస్తశోభితమ్" అనే ఈ విశేష్ణందాేరా నీలవరింలో మెర్సే కటిభాగంలో


బంగార్య వనెనను కల పీతాంబరానిన అలంకర్ంచడం చేత, కటి భాగంలోని నీలవరిం,

21
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

పీతాంబరంలోని ఎర్రని వరిం ౼ అనే ఈ ర్తండు వరాిల కలయికచేత ఏరపడిన పరభాగశోభ


సూచింపబడింది. "పీతాంబరధరః స్రగీే స్తక్షానినిథమనిథః" అని పరాశర మహర్ి శ్రీ
విష్ణిపురాణంలో పీతాంబరశోభతో శ్రీకృష్ి భగవ్యనుడు మనిథుని మనస్తను కూడా
మథస్తతన్ననడని అన్ననర్య. శ్రీపరాశర భటటర్ కూడా శ్రీ రంగరాజసతవంలో "అంచితకటీసంవ్యది-
కౌశేయకమ్" అని కటిభాగ పీతాంబరాల కలయికలోని శోభను వర్ించార్య. ఇది అంతా
"స్తశోభితమ్" అనే పదందాేరా ధేనిస్తతననది.

(అవ్యపతతులసీగంధమ్) భగవంతుడు ఎనిన ఆభరణలను ధర్ంచిన్న అవి తులసీమాలకు


స్తటి రావు. తులసిని ధర్ంచడం పరమాతికు అస్తధారణ లక్షణంగా చెపపబడుతుననది. అనిన
సమయాలలోను పరమాతి ద్గనిని విడువకుండా ధర్స్తతడు. చివరకు ప్రళయకాలంలో మర్రి
ఆకుపై శయనించి ఉండే ఈ సనినవేశంలో కూడా స్తేమి తులసిని ధర్ంచి ఉన్ననడు. ఈ
విష్యానిన నమాిழ்వ్యర్యల తిర్యవ్యయ్ మొழி ప్రబంధంలో "పాలన్నయ్ ఏழுలగుండు .. ఆలిలై
అననవశమ్ శెయుామణిలార్ తాళిణ మేలణ్ణ తణింతుழாయ్" ( చినన బాలుడై ఏడు లోకాలను
భుజంచి... మర్రి ఆకుపై స్తేమి శ్రీ చరణలపై అలంకర్ంచ్చకొనన చలలని, అందమైన తులసి) అని
అంటూ వర్ించార్య. తులసి చేసే సరేదేశ సరేకాల సరాేవసథలలోని కంకరాానిన కూడా
నమాిழ்వ్యర్యల "తోళిణ మేలుమ్ నన్ మార్ిల్ మేలుమ్ తాళిణ మేలుమ్ తణిమ్ తుழாయ్ ముడి
అమాిన్" (1౼9౼7) (ర్తండు బాహువులలో, అందమైన వక్షస్తసలో, ర్తండు పాదాలలో,
శరస్తసలో తులసిని కలిగిన స్తేమి) అని కీర్తంచార్య. ఈ విధంగా ఎలలపుపడు తులసిని
కలిగినవ్యడు స్తేమి.

7) గోపికాన్నం కుచదేందేకుంకుమాంక్మతవక్షసమ్,
శ్రీనికేతం మహేష్ణేసం కృష్ిం వందే జగదుగర్యమ్.

గోపికల వక్షఃసథలంలోని కుంకుమతో ముద్రంపబడిన వక్షస్తసను కలవ్యడు, లక్ష్మీదేవిక్మ


నివ్యసమైనవ్యడు, విలుకాండ్రలో గొపపవ్యడు అయిన శ్రీకృష్ణిని నమసకర్స్తతన్ననను.

22
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

(గోపికాన్నం కుచదేందేకుంకుమాంక్మతవక్షసమ్) రేపలెలలోని గొలలకనాలను సదా


సంశేలషించి ఆనందించేవ్యడు కనుక, శ్రీకృష్ి భగవ్యనుని వక్షఃసథలం ఆ కనాలు తమ
హృదయాలలో అలంకర్ంచ్చకునన కుంకుమతో ముద్రంపబడుతుంది. ఈ విధంగా
కుంకుమముద్రలతో ఆ స్తేమి వక్షసథలం ప్రకాశస్తతననది. "కొతతలర్ పూంకుழల్ నపిపనెళన కొంగైమేల్
వైతుత క్మకడంద మలర్ మారాి" (గుతుతలు గుతుతలుగా వికసించే పూలను తన కేశ్లలో కలిగిన
నీలాదేవి వక్షఃసథలంపై శయించినందున ఆనందంతో విసతర్ంచిన వక్షఃసథలానిన కలవ్యడా!) అని
తిర్యపాపవైలో గోదాదేవి శ్రీకృష్ణిడు నీలాదేవి వక్షస్తసను ఆలింగనం చేసికొనన ఈ విష్యానిన
కీర్తంచడం మిగిలిన గోపికల విష్యంలోకూడా అనేయిస్తతంది. అందువలల, మిగిలిన గోపికల
హృదయాలలో అలంకారంగా అలంకర్ంచ్చకొనన కుంకుమ స్తేమి వక్షస్తసపై ముద్రంప-
బడడంలో ఆశారాం లేదు. ఇది అంతా భకుతల విష్యంలో భగవంతునకు ఉండే ఆదరానిక్మ గుర్యత.
పరమభకుతరాండ్రు అయిన గోపికల గాఢమైన ప్రణయభావంతో రంజంపజేయబడిన చితాతనిన
కలవ్యడు, శ్రీకృష్ణిడు ౼ అనే అరథం ఇకకడ ధేనిస్తతననది. గోపికలు తమ హృదయాలలో
కుంకుమను అలంకర్ంచ్చకోవడం అంటే శ్రీకృష్ిభగవ్యనుని విష్యంలో భక్మతని కలిగి
ఉండడమేకదా.

(శ్రీనికేతనమ్) "విష్టిః శ్రీరనపాయినీ" (లక్ష్మీదేవి విష్ణివును విడవకుండా సదా వెననంటి


ఉంటుంది) అని విష్ణిపురాణం చెపిపన రీతిలో, "అకలక్మలేలన ఇఱయుమెనుా అలర్ మేల్ మంగై ఉఱ
మారాి!" (ఒకక క్షణం కూడా విడిచి ఉండి ఉండలేను - అని అంటూ సదా లక్ష్మీదేవి నివసించే
వక్షఃసథలానిన కలవ్యడా!) అని నమాిழ்వ్యర్యల పలిక్మన రీతిలో భగవంతుడు లక్ష్మీదేవిక్మ నితానివ్యసం
కదా. అందువలల శ్రీకృష్ణిడు శ్రీనికేతనుడు.

(మహేష్ణేసమ్) "విఱ్పపర్యవిழవుమ్ కంజనుమ్ మలులమ్ వీழ" (తిర్యమొழி౼2౼3౼1)


(గొపప ధనస్తసను, కంస్తని, మలలయుదధవీర్యలను సంహర్ంచినవ్యడు) అని తిర్యమంగై ఆழ்వ్యర్యల
శ్రీకృష్ణిడు కంస్తని గొపప విలులను సంహర్ంచినవ్యడు ౼ అని అన్ననర్య కదా.

23
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

8) శ్రీవతాసంకం మహోరసకం వనమాలావిరాజతమ్,


శంఖచక్రధరం దేవం కృష్ిం వందే జగదుగర్యమ్.

తన విశ్లమైన వక్షఃసథలంలో శ్రీవతసమనే పుటుటమచాను గుర్యతగా కలవ్యడు, వనమాల


అనే ఆభరణంతో గొపపగా ప్రకాశంచేవ్యడు, శ్రీస్తదరశన శ్రీపాంచజన్నాలనే శంఖచక్రా-
లను ధర్ంచిన దేవుడు, జగదుగర్యవైన శ్రీకృష్ణిని నమసకర్స్తతన్ననను.

(శ్రీవతాసంకమ్) శ్రీకృష్ణిని విశ్లమైన వక్షసథలం శ్రీవతసమనే పుటుటమచాతో అందంగా


ప్రకాశస్తతంది. భగవంతుని వక్షస్తసలో ఉండే శ్రీవతసమనే పుటుటమచా యొకక అందానిన తిర్యపాపణ్
ఆழ்వ్యర్యల “అమలన్నది పిరాన్” ప్రబంధంలో "తిర్యవ్యరమార్యి అదనోా అడియేనై ఆట్కండదే"
(శ్రీవతసమనే పుటుటమచాతో అలంకర్ంపబడిన శ్రీరంగన్నథుని వక్షస్తస ననున వశీకర్ంచ్చకొననది)
అని కీర్తంచార్య.

(మహోరసకమ్) ఇటువంటి శ్రీవతసంతో, వనమాలతో, లక్ష్మీదేవితో విరాజలేల వక్షఃసథలం


కలవ్యడు కనుక స్తేమి మహోరస్తకడు. అనేక ఆభరణలకు నిలయం అయినందున
స్తేమివక్షస్తస గొపపగా ప్రకాశస్తతననది. "కకழలా నేమియాన్" (చేతిలో స్తదరశన్ననిన కలవ్యడు),
"కకழలా ఒణ్ శంగతాతన్" (చేతిలో ప్రకాశంచే అందమైన పాంచజన్నానిన కలవ్యడు) అనే విధంగా
తన చేతులలో నితాం ధర్ంచే దివ్యాయుధాల కాంతి ప్రసర్ంచడంవలల కూడా స్తేమివక్షస్తస
గొపపగా వెలుగుతుననది.

(వనమాలావిరాజతమ్) "వనమాలై మినుంగునినుా విళైయాడ" (న్నచిాయార్ తిర్యమొழி


౼14౼2) (వనమాల ప్రకాశసూత ఊగగా) అని గోదాదేవి, "మంగల నల్ వనమాలై
మార్ిలలంగ" (పెర్యమాళ్ తిర్యమొழி౼2౼1) (మంగళకరమైన గొపప వనమాల వక్షస్తసలో
వెలుగుగా) అని కులశేఖరాழ்వ్యర్యల వనమాల వలన కలిగిన శోభను కొనియాడార్య.

24
గోదోపమాష్టకమ్, కృష్ణిష్క
ట మ్ - సవ్యాఖ్యానమ్

(శంఖచక్రధరమ్) శ్రీకృష్ణిడు శంఖచక్రాలు ధర్ంచిన అందానిన పలువుర్య ఆழ்వ్యర్యల


అనుభవించార్య. ఉదాహరణకు పెర్యాழ்వ్యర్యల "నేమియుమ్ శంగుమ్ నిలావియ కతతలంగళ్"
(1౼2౼12) (చక్రానిన, శంఖ్యనిన ధర్ంచిన కరతలాలు) అని కీర్తంచార్య.

(శంఖచక్రధరం దేవమ్) "దివు౼ద్గప్తత" అనే ధాతువు నుండి పుటిటన దేవశబాానిక్మ


ప్రకాశంచేవ్యడని అరథం. శంఖచక్రాల కాంతితో శ్రీకృష్ిభగవ్యనుడు ప్రకాశంచే సనినవేశ్నిన ఇకకడి
దేవశబాం సూచిస్తతంది.

(శ్రీవతాసంకం...దేవమ్) శ్రీవతసంతో, వనమాలతో, శంఖచక్రాలతో ప్రకాశంచే


సనినవేశ్నిన దేవ శబాం తెలుపుతుననదని కూడా చెపపవచ్చా.

9) కృష్ణిష్క
ట మిదం పుణాం ప్రాతర్యతాథయ యః పఠేత్,
కోటిజనికృతం పాపం సిరణేన వినశాతి.

తనను స్తతతించేవ్యర్క్మ వ్యర్య కోర్న ప్రయోజన్నలను కలిగించేది, కృష్ణిష్టకం అనే ఈ


గొపప స్తతత్రం. ద్గనిని ఉదయకాలంలో లేచి నితాం అనుసంధంచేవ్యర్క్మ లెకకలేననిన జనిలలో
చేసిన పాపాలనీన వెంటనే నశస్తతయి.



25

You might also like