You are on page 1of 2

2019 లో ఐక్యరాజ్యసమితి ఆ ఏడాదిని అంతర్జా తీయ మూలవాసుల భాషల ఏడాదిగా ప్రకటిస్తూ, 2022 నుంచి 2032 వరకూ ఉన్న

దశకాన్ని అంతర్జా తీయ మూలవాసుల భాషల దశాబ్దంగా ప్రకటించి పలు కార్యక్రమాలు చేసేందుకు సన్నద్ధమైంది. మూలవాసుల భాషలను
పరిశీలించి, భద్రపరిచి, కాపాడుకోవడం దిశగా ఈ కార్యక్రమాలుంటాయని ప్రకటించింది. ఈ ప్రకటన చేసి నాలుగేళ్ళ కాలమైంది, దశాబ్ది
మొదలై అప్పుడే ఒక ఏడాది గడిచింది.
మరి ఈ ఏడాదిలో ఐక్యరాజ్యసమితి చేసిన పనులేమిటి?
ముందుగా అంతర్జా తీయ మూలవాసుల భాషల దశాబ్ద కార్యక్రమాలను నిక్షిప్తం చేసుకునేందుకు, జనాలకు తమ కార్యాచరణ
తెలిపేందుకు, జనం నుంచి అభిప్రాయం సేకరించేందుకు ఐక్యరాజ్యసమితి ఒక వలగూడును ఏర్పాటు చేసుకుంది. idil2022-
2032.org అనే చిరునామాలో ఈ వలగూడుంది.
స్థూలంగా వారు ఈ ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల గణాంకాలు అక్కడ ఇచ్చారు. 17 దేశాల్లో, 27 భాషలకు 76 కార్యక్రమాలు
చేపట్టినట్టు చెప్పారు. 44 దేశాల్లో, 83 భాషలకు 541 సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. 1520 సంస్థల ద్వారా 2015 వ్యక్తు ల
సహకారంతో 3535 స్వచ్ఛంద సముదాయాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అవగాహనకు, తర్ఫీదుకు, సమాచారానికి అవసరమైన
117 దస్త్రా లు, 79 వీడియోలు, 364 ఇతర వనరులు సిద్ధం చేసుకున్నట్టు చెప్పారు.
అయితే ఈ కార్యక్రమాల్లో కానీ, వనరుల్లో కానీ తెలుగు ప్రస్తా వన కాదు కదా, భారతదేశంలోనే ఎలాంటి కార్యక్రమం జరగలేదు,
సమావేశాలు జరుగలేదు, సముదాయాలు ఏర్పడలేదు, వనరుల తయారీ అవ్వలేదు.
ప్రపంచ స్థా యిలో ఒక ధ్యేయంతో, లక్ష్యంతో చేస్తు న్న పనుల్లో భాషలకు, సంస్కృతికి పెద్దపీట వేస్తా మని చెప్పుకునే భారతీయులు ఈ ఒక్క
విషయమై చురుకుగా ఎందుకు లేరు?
భాషల పట్ల ఏలినవారికి పెద్దగా ఆసక్తి లేదు. రాజకీయంగా, పదవుల పరంగా ఏం చేస్తే వారికి లాభం చేకూరుతుందో ఆ వైపుగానే పని
చేస్తు న్నారు.
మనకనిపిస్తుంది కదా హిందీ భాష కోసం కేంద్ర ప్రభుత్వం, తమిళం కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, కన్నడ కోసం కర్నాటక రాష్ట్ర
ప్రభుత్వం ఏమేమో చేసేస్తు న్నాయని, తెలుగు కోసం రెండు తెలుగు రాష్ట్రా ల రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో చేయడం లేదని.
కానీ అన్ని ప్రభుత్వాలు కొంచెం అటూ ఇటుగా భాషల పట్ల నిరాసక్తతోనే ఉన్నాయి.
అసలు ప్రభుత్వాల తరఫున, వ్యక్తిగతంగా, సంస్థా పరంగా, ప్రపంచ స్థా యిలో ఐక్యరాజ్య సమితి తరఫున ఏమేం చర్యలు తీసుకోవాలో
విస్తా రంగా తమ లక్ష్యాల ద్వారా, వెంటనే చేయాల్సిన చర్యల్లో, కొద్ది కాలంలో చేయాల్సిన పనుల్లో, దీర్ఘ కాలంలో చేయాల్సిన పనుల్లో
ఐక్యరాజ్యసమితి ఇప్పటికే పేర్కొంది.
ఈ అంశలను గతంలో మనం పత్రికలో ప్రచురించి చదువుకున్నాం.
కానీ ప్రభుత్వ పరంగా, సంస్థా పరంగా, వ్యక్తిగత స్థా యిలో ఇప్పటి వరకూ ఒక్కరు కూడా ఒక కార్యక్రమం కూడా ఈ దిశగా
భారతదేశంలో చేపట్టకపోవటం గమనార్హం.
దయవేసి అంతర్జా తీయ మూలవాసుల దశాబ్దిలో భాగం కావాలనుకునే వ్యక్తు లు, సంస్థలు, అమ్మనుడి పత్రిక, తెలుగు జాతి ట్రస్ట్,
తెలుగు భాషోద్యమ సమాఖ్యలతో కలిసి రండి. మన మాతృభాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వాలు
చేయాల్సిన పనులు అవి చేసినా, చేయకపోయినా, మన భాషలకు మన కనీస బాధ్యతగా ఎంతో కొంత సహకరిద్దా ము.
వ్యక్తిగత స్థా యిలో మీరు చేయదగిన పనులు:
1. మీ మాతృభాషలో విరివిగా మాట్లా డండి. అత్యవసరం అనిపిస్తే తప్ప మీ మాతృభాషలోనే అన్ని పనులూ చేస్కోండి. బ్యాంక్ ఏటీఎం
అంతరవర్తిని(ఇంటర్ఫేస్) మాతృభాషలో వాడటం, మీ ఫోన్ ను మాతృభాషలోకి మార్చడం, ఇంట్లో వాళ్ళతో మాట్లా డేటప్పుడు
మాతృభాషలోనే మాట్లా డటం, మీ స్నేహితులతో, బంధువులతో వాట్సాప్ లో పాఠ్య సందేశాలన్నీ మాతృభాషలోనే పంపించడం. ఇలా.
2. మీ మాతృభాషలో విడుదలయ్యే పుస్తకాలను కొని చదవండి. మాతృభాషలో సినిమాలు చూడండి. స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్
లాంటి సంగీత/పాటల ఆప్‌లలో మాతృభాషలోని పాటలే వినండి.
3. ఇంట్లో మీ మాతృభాషలో మాట్లా డలేని పిల్లలుంటే, విధిగా వారికి మీ మాతృభాషలో మాట్లా డడం, విని అర్ధం చేసుకోవడం నేర్పండి.
కుదిరితే రాయడం, చదవడం నేర్పండి.
4. భాషా పరమైన చర్చలు చేసుకునే సముదాయాల్లో భాగస్వాములవ్వండి. మీకు అందుబాటులో అలాంటి సంస్థలు లేకపోతే, మీరే
అలాంటి ఒక సంస్థను ప్రారంభించి మాతృభాషా పరమైన చర్చలు చేస్తూ, మాతృభాషను కాపాడటానికి, భద్రపరచడానికి, కావాల్సిన
వనరులను ఏర్పాటు చేయండి.
5. మీ మాతృభాషలో కథలు, కవితలు, వ్యాసాలు రాయండి. ఏమీ రాయలేకపోతే మీ రోజువారీ చర్యల్లో ఒక విషయం గురించి మీ
స్నేహితుడికి ఎలా చెబుతారో అలానే రాసి సోషల్ మీడియాలో పోస్టు చేయండి. కుదిరితే మీ రచనను, వీలైతే వేరే సార్వజనీన
రచనలను(వార్తలు, పాత పుస్తకాలు లాంటివి), మీ గొంతులో చదివి వినిపించిన ఆడియో, వీడియో సామాజిక మాధ్యమాల్లో
పంచుకోండి.
6. మన మాతృభాషలను నేర్చుకునేందుకు పరభాషల వాళ్ళు చాలా మంది వస్తు న్నారు. తెలుగు నేర్చుకునేందుకు బాహుబలి, RRR
సినిమాల తరువాత జాపాన్ నుంచి కెనడా వరకు, అస్సాం నుంచి గుజరాత్ వరకు చాలా మంది వేరే భాషల వాళ్ళు వస్తు న్నారు. సోషల్
మీడియాలో తెలుగు వారిని అడిగి తెలుగు నేర్చుకుంటున్నారు. వీరికి తెలుగు నేర్పడంలో సహాయపడండి.

స్వచ్ఛంద సంస్థ స్థా యిలో చేయదగిన చర్యలు:


1. మాతృభాషా పరిరక్షణకు కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి. ఉదాహరణకు: వలగూడులో నేడు దాదాపు 65 నుంచి
70 శాతం సమాచారం ఆంగ్లంలోనే ఉంది. మన మాతృభాషల్లో సమాచారం చాలా తక్కువ. పాత పుస్తకాల/పత్రికల డిజిటీకరణ ద్వారా
గానీ, ఉన్న ఆంగ్ల సమాచారాన్ని మన మాతృభాషల్లోకి అనువదించి గానీ, మన మాతృభాషలకే ప్రత్యేకమైన విశేషాల గురించి పాఠ్యంలో,
ఆడియోల్లో, వీడియోల్లో సమాచారం తయారు చేసి వలలో చేర్చడం ద్వారా మన మాతృభాషలో కొంచెమైనా ఎక్కువ సమాచారం
చేర్చగలుగుతాం.
2. మాతృభాష నేర్చుకునేందుకు - మాట్లా డేందుకు, రాసేందుకు, విని అర్ధం చేసుకునేందుకు, చదివేందుకు - తర్ఫీదునిచ్చే
తరగతులు, కార్యశాలలు నిర్వహించాలి.
3. మాతృభాషను నేర్చుకునే వనరులను వివిధ స్థా యిలననుసరించి తయారు చేయాలి. వాటిని అందరికీ అందుబాటులో ఉండేలా
పంపిణీ చేయాలి.
4. బడులు, పాథశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు - చదువుకు సంబంధించిన అన్ని సంస్థల్లో మాతృభాషలో విధిగా చదువులు
గానీ, సాహిత్య-సాంస్కృతిక-అవగాహనా-పరిరక్షణ కార్యక్రమాలు గానీ చేసేలా భాగస్వామ్యం చేసుకోవాలి.
5. మాతృభాష అవగాహన లక్ష్యంగా సాంస్కృతిక సమావేశాలు, పోటీలు నిర్వహించాలి.
6. మాతృభాషా అధ్యయనానికి, పాఠ్యీకరణకు పరిశోధనా స్థా యిలో పనులు జరిగేందుకు దోహద పడుతూ, అందుకు కావాల్సిన
వనరులు సిద్ధం చేయాలి.
7. మీడియాలో, సాంకేతికాలలో పని చేసే సంస్థల చేత మన మాతృభాషలో కూడా పని చేయించేలా చొరవ, ఒత్తిడి తేవాలి.
8. మాతృభాషా పరిరక్షణకు నడుం కట్టిన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్ని పొరపొచ్చలు మాని కలిసి పని చేయాలి.

ప్రభుత్వ స్థా యిలో చేయదగిన చర్యలు:


1. అన్ని మాతృభాషలను ప్రభుత్వం గుర్తించాలి. మన దేశంలో రాజ్యాంగం ప్రకారం 22 భాషలు మాత్రమే షెడ్యూల్ లో ఉన్నాయి.
కార్యకలాపాల అధికార భాషలుగా ఆంగ్లా న్ని, హిందీని గుర్తించారు. అలా కాకుండా కోటి దాటిన జనాభా మాట్లా డే అన్ని భాషలను
షెడ్యూల్ లో చేర్చి, పది కోట్ల జనాభా దాటిన భాషలను అధికార భాషలుగా గుర్తించాలి. ఒక్కరు మాట్లా డే భాష ఉన్నా, దానిని
అల్పసంఖ్యాక భాషగా రాజ్యాంగం ద్వారా గుర్తించి ఆయా భాషల పరిరక్షణకు ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ
స్థా యిలో రాష్ట్ర ప్రభుత్వం బడిలో మాతృభాషా మాధ్యమం అమలు చేయాలి. పది లక్షల పైన జనాభా ఉన్న భాషలను రాష్ట్ర అధికార
భాషలుగా గుర్తించి, రాష్ట్ర స్థా యి రాజపత్రాలన్నీ ఆ అధికార భాషల్లో ప్రజలకు అందించాలి. అల్పసంఖ్యాక భాషల పరిరక్షణకు, పెద్ద భాషల
పరిరక్షణకు విధిగా నిధులు సమకూర్చి, సాహిత్య పరంగా, సాంస్కృతిక పరంగా, సాంకేతిక పరంగా భాషల అభివృద్ధికి పని చేసే ప్రాధికార
సంస్థలను నెలకొల్పి, వాటి పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ మెరుగు పరచాలి.
2. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ మాతృభాషల్లో అందించాలి.
3. విశ్వవిద్యాలయ స్థా యిలో మాతృభాషల పరిరక్షణ, అధ్యయన, పరిశోధనలకు నిధులు ఏర్పాటు చేయాలి.
4. భాషల పునరుజ్జీవానికి కార్యాచరణ రూపొందించి, ప్రత్యేక భాష పరిరక్షణలో ఉన్న లోటులను పూరించాలి.
5. ప్రతి మాతృభాషలో టీవీ,రేడియో ప్రసారాలు ప్రభుత్వం తరఫున చేపట్టా లి. కనీసం కొంత నిడివి ప్రతి మాతృభాషలో కార్యక్రమాలను
నడిపేలా ప్రయివేట్ వాహికలకు కట్టు బడి చేయాలి.
6. ప్రతి పభుత్వ కార్యక్రమంలో మాతృభాషలకు పెద్దపీట వేయాలి.
7. మాతృభాషా పరిరక్షణకు సంస్థలను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే స్వచ్ఛందంగా పని చేస్తు న్న సంస్థలకు నిధులు సమకూర్చి
మాతృభాషా పరిరక్షణకు సహకరించాలి.
8. రాజకీయ, న్యాయపరమైన కార్యకలాపాల్లో ప్రతి ఒక్కరు తమ మాతృభాషను ఉపయోగించే వెసులుబాటును తేవాలి.
9. ప్రతి మాతృభాషా పరిరక్షణలో ఆ మాతృభాషలను మాట్లా డే మూలవాసులను భాగస్వామ్యం చేసుకోవాలి.

పైన చెప్పిన చర్యలు మనందరికీ 2032 వరకూ ఆచరణీయాలు. మీరు వ్యక్తి స్థా యిలో చేయదలుచుకున్న పనులు చేస్తూనే స్వచ్ఛంద
సాంస్థల ద్వారా చేయించాల్సిన పనుల పైన, ప్రభుత్వం ద్వారా చేయించాల్సిన పనుల మీద ఒత్తిడి తేవాలి.
మీరు సంస్థా పరంగా పని చేస్తుంటే, మీ సంస్థ మాతృభాషా పరిరక్షణకు చేస్తు న్న పనులతో పాటు మీ సంస్థలోని ప్రతి వ్యక్తి పైన చెప్పుకున్న
వ్యక్తిగత స్థా యి పనులు చేసేలా చూడాలి. ప్రభుత్వపరమైన పనులు జరిగేలా ఒత్తిడి తేవాలి.
ముఖ్యంగా మీరు చేస్తు న్న అన్ని కార్యకలాపాలను యునెస్కో వారి పైన చెప్పబడిన వలగూడులో రాయండి. మీరు చేస్తు న్న పనుల నుండి
స్ఫూర్తి పొంది మరికొందరు మరింత మెరుగైన పనులు చేస్తా రేమో. అన్నింటా, అంతటా మన మాతృభాషలు కనపడేలా, వినపడేలా
మనం పోరాటం చేయాలి.

You might also like