You are on page 1of 3

సరికొత్త ప్రా ంతీయ తత్వం

భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం...ఏకత్వంలో భిన్నత్వం.

అనేక భాషలు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు.. అయినా ఒక భారతీయ ఆత్మ దేశాన్ని కలిపి ఉంచుతున్నదని

మనం గొప్పగా చెప్పుకొంటున్నాము.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత.. భాషా ప్రయుక్త రాష్ట్రా ల ఏర్పాటు జరిగింది.

పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని రాష్ట్రా ల విభజన జరిగింది.

స్వతంత్రం వచ్చిన ఐదున్నర దశాబ్దా ల తరువాత అప్పటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రా ల పరస్పర సమ్మతి తో ఓ మూడు

రాష్ట్రా లను ఆరు రాష్ట్రా లను చేసింది.

ఇక ఉమ్మడి రాష్ట ం్ర లో మాకు అన్యాయం జరుగుతోందని, ఆంధ్రో ళ్ళు మా నీళ్ళు, నిధులు, నియామకాలు (ఉద్యోగాలు)

దో చేసుకొంటున్నారని, మా ప్రా ంతానికి స్వయం పరిపాలన కావాలని పట్టు బట్టి తెలంగాణ ను విడదీయించి ప్రత్యేక

రాష్ట ం్ర గా ఏర్పాటు చేసుకొన్నారు తెలంగాణ నాయకులు.

“విభజించి” రెండు చోట్లా “పాలిద్దా మని” కలలుగన్న కాంగ్రెస్ పార్టీ ని ..

“ప్రత్యేక మత్తు ”లో ఉన్న తెలంగాణ ప్రజలు, “పనికిరాని వారిగా పరిగణింప బడ్డా మన్న భావనలో” ఆంధ్ర ప్రజలు

కాలదన్నారు.

తెలంగాణ ప్రజల ప్రా ంతీయ అభిమానమే పునాదిగా, ప్రజల భావోద్వేగాలే పెట్టు బడిగా పెట్టు కొని తెలంగాణ రాష్ట ్ర సమితి

(తెరాస) తెలంగాణ ను అప్రతిహతంగా పాలిస్తో ంది.

ఇక ఆ ప్రా ంతీయ తత్త్వాన్ని సజీవం గా ఉంచడం లోనే తమ క్షేమం, సౌఖ్యం ఉన్నాయని ఆ పార్టీ, నాయకులు

భావిస్తు న్నారు.

అందుకే ఇప్పుడు తెరాస నాయకులు సరికొత్త ప్రా ంతీయ తత్వాన్ని తెరమీదకు తెస్తు న్నారు.

“దేశానికి తెలంగాణ దేశానికి పన్నులక్రింద ఎంత చెల్లి స్తో ంది.. బదులుగా కేంద్రం నుంచి ఎంత పొ ందుతోంది” అనే కొత్త

వాదన తరచూ తెరమీదకు తెస్తు న్నారు.

ఒక ప్రతిపాదిక ప్రకారం ఒకరి తరువాత ఒకరు తెలంగాణ నాయకులు కేంద్రా నికి తెలంగాణ లక్షల కోట్లు పన్నులు

కడుతుంటే, కేవలం నామ మాత్రం నిధులు తెలంగాణకు ఇస్తో ందని, ఇది తెలంగాణకు అన్యాయం చేయడమేనని

ప్రచారం మొదలు పెట్టా రు.

కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపం లో సేకరించిన నిధులను దేశ రక్షణ కు, వెనుక బడిన రాష్ట్రా ల అభివృద్ధికి ఇంకా

రాజ్యాంగం ప్రకారం కేంద్రం నిర్వహించ వలసిన అనేక విధుల నిర్వహణకు ఉపయోగిస్తు ంది.
రాష్ట్రా లకు కేంద్ర పన్నులలో ఎంత భాగం పంచాలి, ఆ పంచే భాగంలో ఏ రాష్ట ప
్ర ు వాటా ఎంతో రాజ్యాంగ బద్ధ ంగా

నియమించిన ఫైనాన్స్ కమిటీ నిర్ణయిస్తు ంది.

ఇక మిగిలిన నిధులలో కేంద్రం తన ఖర్చులన్నీ పెట్టు కొని, సరిపో క పో తే ఏడా, పెడా అప్పులు చేస్తూ ఉంటుంది.

అయితే “బంతిలో చివరన కూర్చున్నా మనవాడే వడ్డిస్తు ంటే ఢో కా లేదన్నట్లు ” అప్పుడప్పుడు కేంద్ర నిధులలో కేంద్రం

లో అధికారంలో ఉన్న నాయకుల అస్మదీయ రాష్ట్రా లకు అధిక నిధులు వెళ్తా యనేది సత్యమే అయినప్పటికి ఇది కేంద్ర

పన్నులలో వాటా గా కాక, వివిధ కేంద్ర ప్రా యోజిత కార్యక్రమాల లలో వాటా గానో, లేదా కేంద్రం గ్రా ంట్ గా ఇచ్చే నిధుల

విషయం లోనో ఉంటుంది.

అయితే కేంద్రం తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఇతర రాష్ట్రా ల అభివృద్ధికి ఉపయోగిస్తు న్నదని, ఇది

తెలంగాణ కు అన్యాయం చేయడమేనని తెరాస నాయకుల ఆరోపణ.

అయితే ఈ తరహా ఆరోపణలు పదేపదే చేయడం వల్ల ప్రజలు కూడా, నిజమే కేంద్రం ఇతర రాష్ట్రా ల అభివృద్ధి కోసం

మనకు అన్యాయం చేస్తు ందనే భావన బలపడుతుంది.

మన కష్ట పడుతుంటే ఇతరులు సుఖపడుతున్నారనే భావనకు బలం చేకూర్స్తుంది.

ఇది క్రమంగా ఇతర రాష్ట్రా ల ప్రజలపై ద్వేషం గా మారుతుంది.

ఇక ఈ దేశం లో ఉంటే మనకు ఎలానే అన్యాయం జరుగుతుందని పిస్తు ంది.

ప్రత్యేక దేశం గా విడిపో తే బాగుండు అనిపిస్తు ంది.

ఆ మధ్య ఎప్పుడో కల్వకుంట్ల తారకరామ రావు గారు ఇలానే పన్నుల విషయం లో తెలంగాణ కు అన్యాయం

జరుగుతున్నదని డైరక్ట్
ె నిర్మలా సీతారామన్ గారికి ట్వీట్ చేసి, విమర్శలు ఎక్కువ అవడం తో “I am not demanding

that states be devolved every penny we pay to government of India” అంటూ నాలుక కరుచుకొన్నారు.

అయితే అడపాదడపా ఆయన అనుచరులు ఈ తరహా ప్రకటనలు చేస్తూ నే ఉన్నారు.

తాజాగా 25 సెప్టెంబర్ 21 నాటి ఎడిట్ పేజ్ వ్యాసంలో “నమస్తే తెలంగాణ వారు” చేవెళ్ళ లోక్ సభ సభ్యులు డా.

రంజిత్ రెడ్డి గారు రాసిన “ఇచ్చేది చారెడు – దో చేది దో సెడు” వ్యాసం లో తెలంగాణకు జరిగన
ి అన్యాయాన్ని ఏకరువు

పెడుతూ, తెలంగాణ దేశానికి ఏమి ఇస్తు న్నదో , బదులుగా ఏమి పొ ందుతుందో సవివరంగా, పిట్టకధల సహాయం తో

మరీ చెప్పారు.

కానీ వీరు చెప్పిన పిట్టకధలు, కధనాలు, వాస్త వాలు, లెక్కలు.. ఒక్కసారి భారతదేశానికి బదులు “తెలంగాణ” అని,

తెలంగాణ బదులు హైదారాబాద్ అని, మిగతా ముప్పై రెండు జిల్లా ల బదులు గా ఇరవై ఎనిమిది రాష్ట్రా లను పెట్టి ఈ

లెక్కలు ఒక్కసారి లెక్కగట్టి, ఇప్పుడు తెలంగాణ నాయకులు ప్రశ్నించి నట్లే, రేపు హైదారాబాద్ ప్రజలు మా
ఆదాయాన్ని మిగతా ముప్పై రెండు రాష్ట్రా ల అభివృద్ధికి ఎందుకు వినియోగించాలి అని అడిగత
ి ే ఏమి సమాధానం

చెపుతారో?

డా. రంజిత్ రెడ్డి గారే చెప్పినట్లు తెలంగాణ రాష్ట ్ర స్థూ ల ఉత్పత్తి లో దాదాపు 60% వాటా సర్వీస్ రంగం నుంచి, అంటే

హైదారాబాద్ నుంచే వస్తో ంది కదా.

మరి రేపు హైదారాబాద్ ప్రజలు మేము తెలంగాణ కు ఇస్తు న్నది ఏమిటి, మరి తెలంగాణ మాకు ఇస్తు న్నది ఏమిటి అని

ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెపుతారో?

స్వంత లాభమే పరమావధిగా ఈ నాయకులు చేసే ఈ తరహా ప్రకటనలు దేశాన్ని ఏమి చేస్తా యో?

స్వంత లాభం కొంత మానుకో

పొ రుగు వాడికి తోడ్పడ వోయి

దేశమంటే మట్టికాదో య్

దేశమంటే మనుషులోయ్

గుజరాత్ లో పుట్టినా మోడీ మన గురజాడ మాటలు నేర్చుకొని మరీ ఈమధ్య ప్రజలకు చెప్పారు.

మరి తెలుగు రాష్ట ం్ర లోనే పుట్టిన మన ఈ నాయకులు దీన్ని అర్ధచేసుకొని ఎప్పటికీ ఆచరణలో పెడతారో.

.. శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

You might also like