You are on page 1of 4

Birth of Navagrahas : గ్రహో త్పత్తి – నవగ్రహాల పుట్టు క

రవి చంద్ర జననము

విష్ణు వాది అంతములేని ప్రభువు. ఆయనయే దేవకార్య నిమిత్త ము పండ్రెండు రూపులయి కశ్యపుని
వలన అదితియందు తనను తానే పుట్టించుకొనెను. (స్వయంభువు అయ్యెనన్నమాట) ఆ
పండ్రెండుగురలో సవిత (ఆదిత్యుడు) దేవత యొకడు. అదేరీతిగ అత్రికి పది దిక్కుల నుండి విష్ణు వే
యుదయించెను. ఆయనయే మృగలాంఛనుడు (శశాంకుడు) చంద్రు డు. వసువులలో నొకడైన ధర్ముని
భార్య దాక్షాయణి వసువులనడుమ ధర్మజ్ఞు డయిన నిశాంకరుని గన్నది. అతడే యమృత మథనము వేళ
సో ముడై లక్ష్మీదేవితో గూడ యుదయించినాడు.

కుజ జననము

హిరణ్యాక్షుడను దైత్యుడు మహాపరాక్రముడు. వాని కూతురు వికేశి (జుట్టు లేనిది). ఆమె తపస్సు చేసి
జుట్టు సంపా దించుకొనెను. ఆమెను స్థా ణువు (శివుడు) కామించెను. ఆమెతో పినాకిరత్యాసక్తు డై
యున్నపుడు, నిప్పు పుట్టు నని భయపడి దానికగ్ని విఘ్నముకావించెను. అతడి నగ్ని యేకాంత
గృహమం దుండగా హరుడు కని కుపితుడైనంత నాతని మోమున బొ డమిన చెమటచుక్క దేవి
మోమునంబడెను. దాని నామెక్రా వెను. దాన గౌరి గర్భవతియయ్యె, ఆగర్భతేజస్సు మోయలేక
ప్రజ్వలించునగ్ని ప్రభవలెనున్న యాగర్భము నామె జారవిడిచెను. దేవీస్వరూపిణి యైన ధరణి యాగర్భ
ముంధరించెను. ఆ శిశువునకు కశ్యపుడు స్వయముగా జాతకర్మాది సంస్కారములు చేసెను. బొ గ్గు ల
సమీపమున నుండుటచే నాబాలుని కంగారకుడను పేరు పెట్టబడెను. కుజుని యొక్క జన్మవృత్తాంతమిది.

బుధ జననము

కశ్యపునికి దనువను పత్ని, ఆమె త్రిలోక ప్రసిద్ధు రాలు. ఆమె రజుడను కుమారుం గనెను. అతడు వరుణుని

కూతురగు వారుని మించెను. ఆమె త్రిలోకసుందరి. ఆమెకు తన తపస్సును తేజస్సును బలమును వీర్యమును

శుల్కముగానిచ్చెను. ఆ రమణి వానింగొని యుదకములందు లీనమయ్యెను. ఉగ్రతపస్సుచే దను కుమారుడైన

రజుడల నీట లీనమైనట్ల మెనెరింగి తాను నా నీటిలో ప్రవేశించెను. ఆమెను దాకెను. తాకిన మాత్రా న నతడు

ద్రవించెను (కరిగి పో యెను). ద్రవత్వమంది నట్ల మె గ్రహించి చంద్రు డా యుద్ధకమును పుత్రా ర్దియై మధించెను.

సో ముడట్లు మధించుచున్నతరి లోక నమస్కృతుండగు విష్ణు వా తేజస్సునందు ప్రవేశించెను. అంతట బుధుడు

పుట్టెను. గ్రహముల యందొకడుగా దెలియు బుధుడాతడే. ఆ తేజస్సును బృహస్పతి భార్య తార తాను ధరించెను.

ధరింపలేక దక్ష కన్య యగునామె (చంద్రు ని భార్య) యామయు నాబాలుని గర్భచ్యుతుం గావించెను.
గురజననము

మరీచి ప్రజాపతి కూతురు సురూప, రూప యౌవనశాలిని. ఆమె నతడంగిరసునకిచ్చెను. ఆయన యామెయందు

బృహస్పతిని దేవ గురుంగనెను. ఆయన మంచివక్త. మహాబుద్ధి శాలి, వేద వేదాంగ పారంగతుడు.

శుక్ర జననము

హిరణ్యకశిపుని కూతురు ఉష, ఆ విశాలాక్షి త్రిలోకసుందరి. భృగుమహర్షి భార్య. ఆమెజౌశనసుని


(ఉశనుడను భృగుమహర్షి కుమారుని) శుక్రు నింగనెను. ఆయన ధర్మజ్ఞు డు. యోగశక్తిచే నతడు కుబేరుని
ధనమును హరించెను. విత్త ముగోల్పడి కుబేరుడు హరుని శరణందెను. దాన శివుడు కోపముగాని
భార్గవుని జంపను ద్యమించెను. భార్గవుడు యోగశక్తిచేత హరుని లోనే ప్రవేశించెను. ఆదేవదేవు
నుదరమందుండి స్తు తించెను. పార్వతీ దేవి గూడ కొనియాడెను. శంకరుడంతట వానిని శిశ్నము
ద్వారమున విడిచెను. జగద్గు రువు శంభు లీతనికి శుక్రు డను పేరు పెట్టెను. ధనేశునితో బాటీతనికి గూడ
ధనాధిపత్యము మెసంగెను. విడిచెను..మరియు కుబేరునితో నితనికి మైత్రిని గూడ గూర్చెను.

శని జననము

బ్రహ్మ మానస పుత్రు డు త్వష్ట ప్రజాపతి. త్రిలోక సుందరి యగు సంజ్ఞయను కూతురుంగని సూర్యుని
కిచ్చెను. సూర్యుడామెయందు వైవస్వతమనువుంగనెను. యముని యము నను గూడ గనెను.
యమునానది త్రైలోక్యపావని. సంతానము గల్గిన తర్వాత నా సుందరి సంజ్ఞా దేవి సుకుమారి
భర్తతేజమును సైపలేక ఛాయం బిలిచి కల్యాణి నా రూపుగొని యెట్టి వికృతి దోపనీక యిట
సూర్యభగవానుని దగ్గర నుండుము. నా కొడుకులను నా కూతురును గాపాడుచుండుము అని పలికి యా
సంజ్ఞా దేవి తండ్రి దరికేగెను. అతడు నీ మగని దగ్గరకుబో పొ మ్మన నుత్త రకురుభూముల కేగి
బడబారూపమున నచ్చట పచ్చికబయళ్లతోడి యచటి వనంబునందు దిఱుగుచుండెను. సూర్యుడును
ఛాయయం దీమే సంజ్ఞయేయని భావించుచు నిద్దరు కొడుకులంగనెను. వారు సావర్ణు డు, శనైశ్చరుడు.

రాహుకేతువుల జననము

కశ్యపప్రజాపతి భార్య సింహిక. ఆమె దక్షుని కూతురు. తపస్సున నున్న భర్తనుజేరి భగవంతుడా! నేను
బుత్రు నిగావలెనని కోరికతో నున్నా ననుగ్రహింపు మనియె. ఆ సమయమందడుగుటకు కోపించి యా
ప్రజాపతి దైత్య దానవులు పో లిన వానిని గుమారుని నీవు గనెద వనెను. ఆ మహాత్ముని వరదానమున
నామె రాహువుం గనెను.
కేతువు జన్మకథ

బ్రహ్మ ప్రజలూరక పెరిగిపో వుట చూచి యాబుద్ధి శాలి ప్రజలు క్షయించుటకనువైన యాలోచన చేసెను. ఆ ఆలోచన

మృత్యువనుకన్య యాయనకు గల్గె ను. ఆమెను జూచి “ఓ కల్యాణి! నీవు ప్రజాసంహారము చేయు” మని విధి

పల్కెను. అదివిని యామె ఏడ్చెను. ఆ కన్నీళ్ళ నుండి వ్యాధులు వేలకొలది పుట్టెను. ఆమె వారింగని కన్నీళ్ళు

ఆపుకొని (తుడిచికొని) ఉష్కరారణ్యముంజొచ్చి దుశ్చర తపము సేసెను. అక్కడనే కాదు * పెక్కుచోట్ల పెక్కు

సంవత్సరములు తపస్సు చేసెను. బ్రహ్మ మరల యామెంగని ప్రజాసంహారము సేయుము. మున్నునేజెప్పితిని

గదా! అది యట్లే కావలయును. మఱకలాగున కాదు అనెను. అదివిని యా సుందరి వేడి నిట్టూ ర్పు పుచ్చెను. ఆ

యూర్పు నుండి కేతువు పుట్టెను. అగ్నివలె జ్వలించు శిఖ (జుట్టు ) కాలాగ్ని వంటి కాంతియు కల్గి పొ గలు

గ్రమ్ముచు కేతురూపుడై (జెండా వలె నుండి) యున్నవానిని దేవదేవుడు బ్రహ్మ ధూమకేతువను పేరందెదవు.

లోకములకు శుభాశుభములం జూపింతువనెను. దినమున నంతరిక్షమున భూమియం దీకేతువొక్కడే ధూమ

కేతువయి బహువిధముల రూపములతో గనిపించును. మనుష్యు లకు శుభాశుభ ఫలమును జూపుచుండును.

నవగ్రహాల తల్లిదండ్రు లు మరియు వారి భార్యలు పేర్లు


| Names of Navagraha's parents and
their wives
1. రవి (సూర్యుని) - తల్లిదండ్రు లు అతిది - కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ.
2. చంద్రు ని - తల్లిదండ్రు లు అనసూయ - అత్రి మహర్షి భార్య రోహిణి.
3. కుజుని - తల్లిదండ్రు లు - భూమి, భరద్వాజుడు, భార్య - శక్తి దేవి.
4. బుధుని - తల్లిదండ్రు లు - తార, చంద్రు డు, భార్య - జ్ఞా న శక్తి దేవి.
5. గురుని - తల్లిదండ్రు లు - తార, అంగీరసుడు, భార్య - తారాదేవి.
6. శుక్రు ని - తల్లిదండ్రు లు - ఉష, భ్రు గు, భార్య - సుకీర్తి దేవి.
7. శని - తల్లిదండ్రు లు - ఛాయ, భార్య - జ్యేష్ట దేవి.
8. రాహువు - తల్లిదండ్రు లు - సింహిక, కశ్యపుడు, భార్య - కరాళి దేవి.
9. కేతువు - తల్లిదండ్రు లు - సింహిక, కశ్యపుడు, భార్య - చిత్రా దేవి.

You might also like