You are on page 1of 1

దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత.

నిజాం ప్రభువును
ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ
ప్రేరణనందిస్తు న్న కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో
సాహిత్యరంగంలో కృషిచేసినవారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రా మంలో జన్మించాడు. ప్రస్తు తం ఈ గ్రా మం మహబూబాబాద్ జిల్లా లో ఉంది.
బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూ లో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్ల టంలో ప్రా వీణ్యం
సంపాదించాడు. ప్రా రంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు

వచ్చి హైదరాబాదు సంస్థా నంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు
సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు.
సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలుకవితలు రాసాడు.

నా పేరు ప్రజాకోటి

నా ఊరు ప్రజావాటి…. అంటు తెలంగాణ ప్రజల హృదయతంత్రు లను మీటి ,వారిని జాగృతం చేసిన ప్రళయకవితామూర్తి .
భారతదేశ స్వాతంత్ర్య పో రాటం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే,తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది.1947 లో భారతావనికి
స్వాతంత్ర్యం సిద్దించింది.కాని తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి లభించలేదు.నిజాం పాలనలో ప్రజలు దుర్భర జీవితాలను
గడిపే వారు.

నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఎలంటి స్వేచ్ఛఉండేది కాదు.ప్రజలు తమ మనసులోని కోర్కేలను తెలుపుకొనుటకు గాని,సభలు ఏర్పాటుచేసి
తమ కష్టా లను,బాధలను చేప్పుకోవడానికి వీలుండెది కాదు.ప్రజలపై అధికపన్నులు విధించడం,వారి భూములను లాక్కోవడం, వారిని నానా రకాలుగా
బాధించే వారు. రజాకార్లు ప్రజల పాలిట నరభక్షకుల్ల తయారయ్యారు. వీరు ఇండ్ల పై పడి ప్రజల్ని ఊచకోతకోసేవారు. ఆడవారిని ఎత్తు కెల్లి మానభంగం
చేసెవారు. ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు.
పళ్ళు తోముకోవడానికిచ్చే బొ గ్గు తో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు.
భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు.
ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు.
1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థా పించి అధ్యక్షుడుగా జిల్లా ల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు.
ఆంధ్రప్రదేశ్ ఆస్థా నకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు.
రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు.
అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.
తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తే జాన్ని కలిగిస్తు న్నాయి.

You might also like